షార్జా: పాకిస్థాన్‌తో జరుగుతున్న మూడో టెస్టులో శ్రీలంక భారీ స్కోరు సాధించింది. మాథ్యూస్ (256 బంతుల్లో 91; 5 ఫోర్లు, 1 సిక్సర్), దిల్రువానా పెరీరా (247 బంతుల్లో 95; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) బాధ్యతాయుతంగా ఆడటంతో శుక్రవారం రెండో రోజు లంక తొలి ఇన్నింగ్స్‌ను 172 ఓవర్లలో 9 వికెట్లకు 428 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.
తర్వాత బ్యాటింగ్ చేసిన పాక్ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 6 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. మన్‌జూర్ (14 బ్యాటింగ్), షెహజాద్ (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. మిస్బాసేన ఇంకా 409 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు 220/5 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన లంక రెండు సెషన్లపాటు అద్భుతంగా ఆడింది. మాథ్యూస్, పెరీరా ఏడో వికెట్‌కు 112 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
శ్రీలంక 428/9 డిక్లేర్డ్
Published Sat, Jan 18 2014 1:18 AM | Last Updated on Fri, Nov 9 2018 6:43 PM
Advertisement
Advertisement