ప్రతీకాత్మక చిత్రం
అరబ్: కొత్తగా పెళ్లైన దంపతులు ఎంజాయ్ చేద్దామని షార్జాలోని అల్‌మాంజర్ బీచ్‌కు వెళ్లారు. బీచ్‌లో దిగి బయటకు వచ్చాక మేకప్ పోవడంతో భర్త తన భార్యను గుర్తు పట్టలేకపోయాడు. మేకప్‌తో తనను మోసం చేసిందని, ఇప్పుడు ఆమె అందంగా లేదంటూ విడాకులు కోరాడు. ఈ వింత సంఘటన యూఏఈలో వెలుగు చూసింది. 28 సంవత్సరాల వయసున్న ఆ మహిళ డాక్టర్. అబ్దుల్ అజీజ్ అసఫ్ అనే సైకాలజిస్టును కలిసి ఈ విషయం గురించి ప్రస్తావించారు.
మహిళ వివరాలను గోప్యంగా ఉంచుతూ ఈ విషయాన్ని గురించిన సమాచారాన్ని గల్ఫ్‌న్యూస్‌కు వెల్లడించారు. పెళ్లికి ముందు జరిగిన పలు సర్జరీలతో పాటు, కంటి చుట్టూ వేసుకున్న మేకప్ విషయాన్ని కూడా అతడి వద్ద దాచిందని ఆ సైకాలజిస్ట్ వెల్లడించారు. దీంతో పెళ్లికొడుకు విడాకులు కోరాడని, చివరకు ఆ మహిళ ముందుకు వచ్చి నిజం చెబుతానని ప్రయత్నించినా అతడిని ఒప్పించలేకపోయామని అన్నారు. వారికి పెళ్లయి ఆరు నెలలు కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment