makeup
-
ఈ మేకప్ బాక్స్ ఉపయోగించడం చాలా ఈజీ..!
మేకప్ ఉత్పత్తులను దాచిపెట్టుకోవడం, అవసరానికి వాటిని వెతుక్కోవడం పెద్ద సమస్య. ఇక మేకప్ సామగ్రికి బ్యాక్టీరియా, ఫంగస్ వంటివి చేరకుండా జాగ్రత్తపడటం మరో సమస్య. ఆ సమస్యను ఈ మేకప్ బాక్స్ ఇట్టే దూరం చేయగలదు. పైగా మిర్రర్, ఫ్యాన్, లైట్ వంటి వాటితో రూపొందిన ఈ మేకప్ బాక్స్ వాడుకోవడానికి చాలా అనువుగా ఉంటుంది.క్రీమ్స్, సీరమ్స్, లోషన్స్, ఫౌండేషన్స లిప్స్టిక్స్, ఐ లైనర్స్, పౌడర్స్ ఇలా రోజువారీ వినియోగించే మేకప్ సామాన్లను ఈ బాక్స్‌లో చక్కగా సర్దిపెట్టుకోవచ్చు. ఈ కాస్మెటిక్ స్టోరేజ్ బాక్స్‌కి ఒకవైపు అద్దం ఉంటుంది. మరోవైపు స్టోరేజ్ కంటైనర్ ఉంటుంది. దీనికున్న అద్దాన్ని 360 డిగ్రీల్లో ఎలా అయినా తిప్పుకోవచ్చు. కూర్చునే కాదు, నిలబడి కూడా మేకప్ వేసుకోవచ్చు. వేసుకున్న మేకప్ త్వరగా ఆరడానికి దీనిలో ఫ్యాన్ కూడా ఉంటుంది. ఇక దీనిలో పర్ఫ్యూమ్స్, నెయిల్ పాలిష్‌లు, నెయిల్ రిమూవర్స్ వంటివన్నీ దాచుకోవచ్చు. అద్దం వెనుక భాగంలో కూడా కొన్ని మేకప్ వస్తువులను పెట్టుకోవచ్చు. ఈ కాస్మెటిక్ స్టోరేజ్ బాక్స్‌లో మరో నాలుగు చిన్నచిన్న సొరుగులు ఉంటాయి. దీనికి ఎల్ఈడీ లైట్ అమర్చి ఉండటంతో, కరెంట్ లేనప్పుడు కూడా మేకప్ వేసుకోవడానికి వీలవుతుంది. ఈ లైట్ మూడు వేర్వేరు కాంతుల్లో వెలిగేందుకు ఆప్షన్స్ ఉంటాయి. వాటిని మార్చుకుంటూ మేకప్ ముఖానికి సరైన విధంగా ఉందో లేదో చూసుకోవచ్చు. మనకు కావాల్సిన అన్ని రకాల మేకప్ ఉత్పత్తులను ఇందులో భద్రపరచుకోవచ్చు. ఎక్కడికైనా సులభంగా తీసుకుని వెళ్లొచ్చు. దీన్ని బాత్ రూమ్‌లో, బెడ్ రూమ్‌లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇలాంటి మేకప్బాక్సులు చాలానే, రకరకాల మోడల్స్‌లో అందుబాటులోకి వచ్చాయి. ఇవి రకరకాల రంగుల్లో లభిస్తున్నాయి. దీని ధర సుమారుగా మూడు లేదా నాలుగు వేలు ఉంటుంది. మోడల్ని బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. వీటిలో కొన్నింటిని ముందే చార్జింగ్ పెట్టుకుని వాడుకోవచ్చు. కొన్నింటిని బ్యాటరీలతో వినియోగించుకోవచ్చు.ముఖ కాంతికి చికిత్స..:ముఖ సౌందర్యాన్ని మెరుగుపరచుకోవడానికి రకరకాల చిట్కాలు ఉన్నాయి. రకరకాల సౌందర్య లేపనాలు, అధునాతన పరికరాలు ఉన్నాయి. ఇవేవీ ఫలించనప్పుడు నిపుణులు చేసే చికిత్స పద్ధతులు ఉన్నాయి. ముఖ సౌందర్యాన్ని త్వరగా మెరుగుపరచడానికి ఇటీవలి కాలంలో ‘లో లెవల్ లేజర్ లైట్ థెరపీ’ అందుబాటులోకి వచ్చింది. ఈ పద్ధతిలో తక్కువ స్థాయిలో లేజర్ లైట్‌ను వెదజల్లే పరికరాన్ని ఉపయోగిస్తారు. టార్చ్లైట్లా ఉండే ఈ పరికరం ద్వారా ముఖచర్మంపై లేజర్ కాంతిని ప్రసరింపజేస్తారు. దీనివల్ల ముఖ కండరాల్లో కొలాజెన్ ఉత్పత్తి పెరిగి, సడలిపోయిన ముఖం తిరిగి బిగుతుదేరుతుంది. ముఖంపై ఏర్పడిన ముడతలు, మచ్చలు, మొటిమలు కూడా క్రమంగా నయమవుతాయి. పలు దేశాల్లో చర్మవైద్య నిపుణులు ఈ పద్ధతిలో చికిత్సను అందిస్తున్నారు. (చదవండి: ఇంధన స్పృహ కలిగిన ఇల్లులా ఆరోగ్యకరంగా మార్చేద్దాం..!) -
పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్లి.. మూడు నెలలకు ట్విస్ట్!
నాకు పెళ్ళయి 3 నెలలు అవుతోంది. నా భార్య బాగా చదువుకుంది. ఉద్యోగం చేస్తుంది. పెళ్ళి చేసుకుంటే సంతోషంగా ఉండొచ్చు అని ఇద్దరం ఇష్టపడి పెద్దలను ఒప్పించి పెళ్ళి చేసుకున్నాం. పెళ్ళి సమయంలో మా అత్త, మామ వాళ్ళు ఇష్టపూర్వకంగానే నాకు కొంత కట్నం కూడా ఇచ్చారు. పెళ్ళైన ఒక నెల వరకూ చాలా బాగుంది. కానీ అంతలోనే బాగా మారిపోయింది. ప్రతిదానికి అలక, ఏ విషయాన్నైనా సాగదీయడం, నా జీతం నీకు ఇవ్వను, నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటాననడం, మా అమ్మానాన్నకు డబ్బులు ఇవ్వొద్దు అనడం, వాళ్ళు మన ఇంట్లో ఉండకూడదు అని తరచూ గొడవలు చేయడం, గొడవ అయిన ప్రతిసారి తన కట్నం డబ్బులు తనకు ఇచ్చేయమని రచ్చ చేస్తుంది. గంటలు గంటలు మేకప్ వేసుకోవడం, తయారయి ఫోటోలు దిగడం, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, తెలియని వాళ్ళతో కూడా గంటలు గంటలు చాటింగ్ చేయడం... వద్దంటే ఏడుస్తోంది. తల గోడకేసి కొట్టుకుంటుంది. మమ్మల్ని బెదిరించడం కోసం తనకు తానే చిన్న చిన్న గాయాలు చేసుకుంటుంది. నేను తనతో ఎంతోమంచి జీవితాన్ని ఊహించుకున్నాను. నా కలల ప్రపంచం ఒక్కసారిగా కూలిపోయింది. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. నన్ను ఈ సమస్య నుంచి బయటకు తీసుకువచ్చే సలహా ఇవ్వగలరు.– ఆదినారాయణ, హైదరాబాద్ముందుగా మీరు ఒక విషయం గ్రహించాలి. ప్రపంచంలో ఏ ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఆలోచించరు. అలాగే కలహాలు లేని కాపురాలు కూడా ఉండవు. తల్లిదండ్రుల నుండి వచ్చే వారసత్వ లక్షణాలు, పెరిగిన వాతావరణం ఒక మనిషి వ్యక్తిత్వాన్ని, ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. అతిగా అలగడం, మొండితనం, ఓర్వలేనితనం, తరచు మానసిక సంయమనం కోల్పోవడం, విపరీతమైన కోపం, తమని తాము గాయపరచుకోవడం అనేవి సాధారణంగా ‘బార్డర్‌లైన్ పర్సనాలిటీ’ అనే ఒక ప్రత్యేకమైన మనస్తత్వం ఉన్న వాళ్ళలో చూస్తాం. ఈ సమస్యతో బాధపడే వాళ్ళు ఇతరులతో అంత సులభంగా సర్దుకుపోలేరు. తమ చుట్టూ ఉన్న వాళ్ళని ఏదో ఒకరకంగా కంట్రోల్ చేయాలని అనుకుంటారు. మీ అత్తమామల సహాయం తీసుకుని మీ భార్యాభర్తలిద్దరూ, మంచి సైకియాట్రిస్ట్ లేదా క్లినికల్ సైకాలజిస్ట్‌ని సంప్రదించండి. మీ ఇద్దరితో వివరంగా మాట్లాడి అవసరమైన సలహాలు, సూచనలు మానసిక వైద్యులు అందిస్తారు. ఆమె మనస్తత్వాన్ని ముందు మీరు అర్థం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. తన పరిస్థితి గురించి మీకు అవగాహన వస్తే, తనతో ఎలా మసులుకోవాలో తెలిసే అవకాశం కూడా ఉంటుంది. అలాగే మీరూ మానసికంగా చాలా ఒత్తిడిలో ఉన్నారు కాబట్టి మీరు కూడా కౌన్సెలింగ్ తీసుకుంటే మంచిది. మీరు తొందరపడి ఎలాంటి తీవ్ర నిర్ణయమూ తీసుకోకండి. మీ బంధాన్ని తెంచుకోవటం సులభం కావచ్చు. దాన్ని జాగ్రత్తగా పదికాలాల పాటు నిలబెట్టుకోవాలంటే ఇరువైపుల నుండి కొంత సర్దుబాటు, సహనం, నిరీక్షణ, త్యాగం అవసరం. మీరు విడాకులు తీసుకున్నా ఇంతకంటే మంచి జీవిత భాగస్వామి దొరుకుతుందన్న గ్యారెంటీ కూడా ఉండకపోవచ్చు. ఆల్ ది బెస్ట్!డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
ఇలాంటి మేకప్ నైపుణ్యం ఉంటే ఏ వధువైనా అదుర్స్..!
మేకప్ అనగానే వేసుకున్నప్పుడూ అతిలోక సుందరిలా..తీసేశాక ఆమెనా అన్నంత సందేహం వస్తుంది. ముఖ్యంగా కలర్ తక్కువగా ఉండే వాళ్ల గురించి ఇక చెప్పాల్సిన పని లేదు. అందుకే చామనఛాయా ఉన్న చాలమంది వధువులు, కాస్త రంగు తక్కువగా ఉన్నవారు మేకప్ వేసుకునేందుకు సుముఖత చూపించరు. ఎందుకంటే మేకప్ తర్వాత వాళ్ల లుక్ మారిపోతుంది. దీంతో ఇబ్బందిగా ఫీలవుతుంటారు. అదే తమ రంగుకి అనుగుణమైన మేకప్‌తో అందంగా కనిపించేలా చేస్తే ఆత్మవిశ్వాసంగా, నిండుగా ఉంటుంది. అలాంటి మేకప్ నైపుణ్యంతో ఇక్కడొక కళాకారిణి అందరి హృదయాలను దోచుకుంటోంది. ఎవ్వరైనా ఆమె మేకప్ నైపుణ్యతకు ఫిదా అయిపోతారు. ఇంతకీ ఎవరంటే ఆమె..!చెన్నై(Chennai)కి చెందిన మేకప్ ఆర్టిస్ట్(makeup artist) నిర్మలా మోహన్ స్కిన్ టోన్‌కు సరిపోయే మేకప్‌లతో ఆకట్టుకుట్టోంది. రంగు తక్కువగా ఉన్నా కూడా ఇనుమడింప చేసే మేకప్‌తో అందంగా కనిపించేలా చేస్తోంది. అందానికి అసలైన నిర్వచనం చెప్పేలా మేకప్ నైపుణ్యంతో ఫిదా చేస్తోంది. చర్మం కలర్(skin colour) నలుపుగా ఉన్నవాళ్లని తెల్లగా కనిపించేలా మేకప్ వేస్తారు చాలామంది. ఆ తర్వాత అసలు రంగు ఇదా అని ముఖం మీదే అనడంతో కలర్ తక్కువగా ఉండే అమ్మాయిలు మేకప్ వేసుకునేందుకు భయపడుతున్నారు. అలా కాకుండా వారి రంగుకి సరిపోయే మేకప్‌తో వాళ్ల చర్మం రంగులోనే మరింత అందంగా కనిపించేలా తీర్చిదిద్దితుంది నిర్మల. ఇదే ఆమె బ్యూటీ ట్రిక్కు. అందుకు సంబంధించిన వీడియోలను ఇన్‌స్టాలో షేర్ చేయడంతో అందరూ ఆమె కళా నైపుణ్యాన్ని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Nirmala Mohan 💃🏻 (@nirmala_makeupartistry) ఇలా రంగు తక్కువగా ముదురు గోధుమ రంగులో ఉండే వాళ్ల స్కిన్ టోన్‌కి అనుగుణమైన రంగులోనే కాంతిమంతంగా కనిపించేలా చేస్తే.. వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపినవాళ్లం అవుతాం. వారి ముఖాలు కూడా కాంతిగా వెలుగుతాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ ఇలాంటి వాళ్లకు వైట్ వాష్ చేయకూడదు. మేకప్ వేస్తేనే అందం లేదంటే చూడలేం అన్నట్లు ఉండకూడదు. సహజ సౌందర్యం ఉట్టిపడేలా తీర్చిదిద్దే మేకపే అమ్మాయిలకు గౌరవంగా ఉంటుందని అంటోంది నిర్మల. దీంతో వాళ్లు మునుపటి రూపాన్ని చూపించేందుకు వెనడుగు వేయరని నమ్మకంగా చెబుతోంది. View this post on Instagram A post shared by Nirmala Mohan 💃🏻 (@nirmala_makeupartistry) (చదవండి: తల్లే కూతురు పెళ్లిని ఆపేసింది..! ట్విస్ట్ ఏంటంటే..) -
రిలయన్స్ రిటైల్ భాగస్వామ్యంతో కొరియన్ స్కిన్‌కేర్ & మేకప్ బ్రాండ్ ఎంట్రీ
సౌందర్య ప్రియులు,బ్యూటీ ఇండస్ట్రీ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రముఖ కొరియన్ చర్మ సంరక్షణ మేకప్ సంచలనం టిర్టిర్( TIRTIR) ఇండియాలో లాంచ్ అయింది. రిలయన్స్ రిటైల్‌కు చెందిన టిరాతో కలిసి ఇది ఆఫ్‌లైన్ రిటైల్ మార్కెట్లో అరంగేట్రం చేసింది. భారతీయ బ్యూటి ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుందని రిలయన్స్ ప్రకటించింది. Tira స్టోర్లు, Tira యాప్ ద్వారా ఇది అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ సందర్బంగా కొనుగోలుదారులకు ఆఫర్లను కూడా అందిస్తోంది.ముఖ్యంగా మాస్క్ ఫిట్ రెడ్ కుషన్ ఫౌండేషన్,ఆకట్టుకునే 30 షేడ్స్‌తో తీసుకొచ్చింది. మిల్క్ స్కిన్ టోనర్, సిరామిక్ మిల్క్ ఆంపౌల్, మాస్క్ ఫిట్ మేకప్ ఫిక్సర్ లాంటి అద్భుతమైన ఉత్పత్తులను లాంచ్ చేసినట్టు కంపెనీ తెలిపింది.చర్మ సంరక్షణ-జాగ్రత్తలుఏ సీజన్లో అయినా చర్మ ఆరోగ్య సంరక్షణ చాలా అవసరం. చర్మాన్ని తేమగా ఉంచుకునేందుకు జాగ్రత్తలు పాటించాలి. తాజా పండ్లు, కూరగాయలతోపాటు సరిపడా నీళ్లు తాగాలి. చర్మ సంరక్షణకు హైడ్రేటింగా ఉండటం, రిఫ్రెషింగ్ చాలా కీలకం. చర్మం కాంతివంతంగా ప్రకాశించేలా ఉండాలంటే ఎండలో ఉన్నా, నీడలో ఉన్నా సన్ స్క్రీన్ లోషన్ వాడాలి.దుమ్ముధూళికి దూరంగా ఉండాలి. కెమికల్స్ వాడని సహజమైన సౌందర్య ఉత్పత్తులను వినియోగించాలి. నాణ్యమైన బ్రాండ్లను ఎంచుకోవాలి.ఒత్తిడికి, ఆందోళనకు దూరంగా ఉండాలి. మ్యాకప్ విషయంలో జాగ్రత్తలు పాటించకపోతే మరిన్ని సమస్యలొచ్చే ప్రమాదం ఉంది. బ్యూటీ నిపుణులు, స్కిన కేర్ వైద్య నిపుణుల సలహాల మేరకు ఉత్పత్తులను వాడాలి.ఎప్పటికపుడు మేకప్‌ను రిమూవ్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యం -
బెడ్డుమీద బామ్మేసుకుంటున్న మేకపు
-
చలికాలంలో మేకప్, ఈ జాగ్రత్తలు తప్పదు.. లేదంటే!
చలికాలం ఉక్కపోత ఉండదు, మేకప్ చెదిరిపోదు, బాగుంటుంది అనుకుంటారు. అయితే, ప్రతి సీజన్‌కి బ్యూటీ చాలెంజెస్ ఉంటాయి. చలికాలంలో చేయించుకోదగిన ఫేషియల్స్, మేకప్, ఫుడ్ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వివాహ వేడుకలకు మేకప్ చేయించుకునేవారు ఈ జాగ్రత్తలు పాటిస్తే, సరైన ప్రయోజనాలను పొందుతారు. పొడిగా ఉన్నా, జిడ్డుగా ఉన్నా చలి కాలం మేకప్ చేసేముందు హైడ్రేటెడ్ మాయిశ్చరైజర్ ఉపయోగించాలి. లేదంటే, మేకప్ కూడా డ్రైగా కనిపిస్తుంది. అవసరాన్ని బట్టి ప్రైమరీ లోషన్ వాడుకోవచ్చు.మెరిసే చర్మానికి..చర్మం మెరుస్తున్నట్టుగా ఆరోగ్యంగా కనిపించాలంటే నూనె శాతం ఎక్కువ ఉండే మాయిశ్చరైజర్ ఉపయోగించాలి. హైలురానిక్ యాసిడ్స్ ఉన్న సీరమ్‌ని ముందు ఉపయోగిస్తే మాయిశ్చరైజర్‌ని స్కిన్ మీద పట్టి ఉంచుతుంది. దీని వల్ల మేకప్ డ్రైగా కనిపించదు. బడ్జెట్‌ని బట్టి సీరమ్స్ మార్కెట్లో లభిస్తున్నాయి. వాటిలో చర్మానికి అవసరమయ్యే గుణాలు ఏవి ఉన్నాయో అవి చెక్ చేసుకోవాలి. సాధారణంగా చర్మం సహజ ఆయిల్స్‌ను ఉత్పత్తి చేస్తుంది. కానీ, వయసు పెరుగుతున్నకొద్దీ సహజ నూనెల ఉత్పత్తి ఆగి΄ోతుంది. దాంతో చర్మం ΄÷డిబారుతుంది. చలికాలం పెళ్లిళ్లు ఉన్న బ్రైడల్స్ అయితే కనీసం నెల ముందు నుంచి స్కిన్ కేర్ తీసుకోవాలి.హెల్తీ స్కిన్‌కి పోషకాహారంస్కిన్ కేర్ తీసుకోకుండా పెళ్లిరోజు మేకప్ చేయించుకుంటే హెల్తీగా కనిపించదు. నెల రోజుల ముందు నుంచి హైలురానిక్ యాసిడ్స్ ఉన్న సీరమ్స్ ఉపయోగించాలి. ΄ోషకాహారం, ΄ానీయాల మీద దృష్టి పెట్టాలి. జంక్ ఫుడ్, మాంసాహారం కాకుండా పండ్లు, కూరగాయలు, జ్యూసులను ఆహారంలో ఎక్కువ చేర్చుకోవాలి. దీని వల్ల చర్మం ఆరోగ్యంగా కనిపిస్తుంది.మేకప్‌కి ముందుమేకప్కి ముందు ఎంజైమ్ స్క్రబ్ ఉపయోగిస్తారు. తర్వాత సీరమ్స్, అవసరమైతే షీట్ మాస్క్‌లు, అండర్ ఐ ప్యాచెస్ వాడుతారు. దీని వల్ల మేకప్ ప్యాచ్‌లుగా కనిపించదు.మేకప్ తీయడానికి తప్పనిసరిరిమూవర్స్ ఉపయోగించుకోవచ్చు. లేదంటే కొబ్బరినూనె, బాదం నూనె, బేబీ ఆయిల్ ను ఉపయోగించి మేకప్‌ను పూర్తిగా తీసేయాలి. తర్వాత ఫేస్‌వాష్‌తో శుభ్రపరుచుకొని, మాయిశ్చరైజర్ రాసుకోవాలి. అలసి΄ోయామనో, మరుసటి రోజు చూడచ్చులే అనో మేకప్ తీసేయకుండా అలాగే పడుకుంటే స్కిన్ బాగా దెబ్బతింటుంది. చర్మం ఇంకా పొడిబారడం, యాక్నె వంటి సమస్యలు ఉత్పన్నం కావచ్చు. మేలైన ఫేషియల్స్చలికాలంలో రొటీన్ ఫేషియల్స్ కాకుండా హైడ్రా ఫేషియల్ చేయించుకోవడం మంచిది. దీని వల్ల చర్మం నిగారింపు కోల్పోదు. వీటితో పాటు కొన్ని కెమికల్ పీల్స్ ఉంటాయి. అయితే, వీటిని పెళ్లికి పది రోజుల ముందు చేయించుకోవాలి. కెమికల్ పీల్ని బ్యూటీపార్లర్‌లో కాకుండా చర్మనిపుణుల సమక్షంలో చేయించుకోవడం మంచిది. – విమలారెడ్డి పొన్నాల, సెలబ్రిటీ అండ్ బ్రైడల్ మేకప్ ఆర్టిస్ట్ -
అలియా లాంటి మెరిసే చర్మం కోసం..!
బాలీవుడ్ నటి అలియా భట్ ఎంత గ్లామరస్‌గా కనిపిస్తుందో చెప్పాల్సిన పనిలేదు. మచ్చలేని చందమామలా ఉండే అలియా సౌందర్యాన్ని ఇష్టపడని వారుండదరు. అలాంటి మెరిసే చర్మం కోసం ఈ టిప్స్ ఫాలో అయితే చాలంటున్నారు నిపుణులు. ప్రస్తుతం అలియా కాశ్మీర్లో ఉంది. త్వరలో ప్రేక్షకుల మందుకు రానున్న అల్ఫా మూవీ చిత్రీకరణలతో బిజీగా ఉంది. అక్కడ నో మేకప్ లుక్‌లో దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది. సూర్యుడే దిగి వచ్చి ముద్దాడేలా క్యూట్‌గా ఉన్న ఆమె ముఖ కాంతికి ఫిదా కాకుండా ఉండలేం. View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) అంతటి చలిలో కూడా చక్కగా గ్లామర్ మెయింటైన్ చేస్తూ..అలియాలా అందంగా కనిపించాలంటే నిపుణులు ఈ చిన్నపాటి చిట్కాలను ఫాలోకండి అని చెబతున్నారు. శీతాకాలంలో సైతం చర్మం పాడవ్వకుండా అందంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఐదు బ్యూటీ టెక్నిక్స్ ఫాలో అవ్వాలని తెలిపారు బ్రైన్ మావర్ డెర్మటాలజిస్ట్, డాక్టర్ హుసింజాద్తరుచుగా మాయిశ్చరైజర్ చేయడం..సెరామైడ్లు, హైలురోనిక్ యాసిడ్, పెట్రోలియం జెల్లీ కలిగిన మాయిశ్చరైజర్లు చర్మంలోని తేమని నిలుపుకోవడంలో సహాయపడతాయి. తేలికపాటి లోషన్ల కంటే చిక్కటి క్రీములు ఎంచుకోండి. శీతాకాలంలో ఇలాంటి మాయిశ్చరైజర్లు అత్యంత ప్రభావవంతంగా ఉంటాయి.హైడ్రేటింగ్ క్లెన్సర్లకు మారండిచలికాలంలో, ముఖంపై కఠినమైన క్లెన్సర్లను నివారించండి. అంటే బాగా గాఢత గల ఫేస్‌వాష్‌లను నివారించండి. ముఖం తేమతో ఉండేలా చేసి, శుభ్రపరిచే మంచి ఫేస్‌వాష్‌ని ఉపయోగించండి.వేడి నీళ్లు ఎక్కువగా ఉపయోగించొద్దు..శీతాకాలం సాధారణంగా వేడినీళ్లు ముఖంపై జల్లుకునేందుకు ఇష్టపడతాం. కానీ నిపుణులు అభిప్రాయం ప్రకారం..ఇలా అస్సలు వద్దని చెబుతున్నారు. గోరువెచ్చని నీటిని ఉపయోగించమని సూచిస్తున్నారు. బాగా వేడి నీళ్లు ఉపయోగిస్తే చర్మం పొడిగా మారిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులుకఠినమైన స్క్రబ్‌లు,సువాసనగల ఉత్పత్తులను నివారించండికఠినమైన స్క్రబ్‌లు,సువాసనగల ఉత్పత్తులు పొడి చర్మంపై చికాకుని తెప్పిస్తాయి. మంటకు దారితీసే ప్రమాదం లేకపోలేదు. ఆరోగ్యకరమైన చర్మం కోసం శీతాకాలంలో వీటిని నివారించండి. పొడిచర్మం కలవాళ్లు గాఢమైన సువాసనలేని సబ్బులు, బాడీ వాష్‌లు ఉపయోగించండి.హైడ్రేట్‌గా ఉండేలా చూసుకోవాలి..శరీరంలో నీటి శాతాన్ని పెంచడానికి శీతాకాలంలో హైడ్రేషన్ అవసరం. చలికాలంలో పానీయాలు , ఆల్కహాల్ వినియోగం శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే శీతాకాలంలో సైతం ఆరోగ్యకరమైన మెరిసే చర్మం మన సొంతం అని చెబుతున్నారు నిపుణులు. (చదవండి: మానసిక ఆరోగ్యం కోసం 'టిబెటన్ సింగింగ్ బౌల్స్'! ఎలా ఉపయోగపడతాయంటే..) -
నగలు ధరించాక పెర్ఫ్యూమ్లు వేసుకుంటున్నారా? అయితే ఈ టిప్స్ మీకోసమే!
అందమైన ఆభరణాలను ఎక్కవ డబ్బు పెట్టి కొనుక్కుంటాం. వాటిని ధరించి ఆనందిస్తాం. కానీ ఆభరణాలను కలకాలం అందంగా ఉంచుకోవడం కూడా తెలుసుకోవాలి. తగిన జాగ్రత్తలు తీసుకోక΄ోతే ఆభరణాలు కాంతిహీనమవుతాయి. ఫంక్షన్లకు వెళ్లేటప్పుడు ఆభరణాలు ధరించిన తర్వాత ఒంటికి లోషన్లు– సన్స్క్రీన్లు రాయడం, పెర్ఫ్యూమ్ స్ప్రే చేసుకోవడం మంచిది కాదు. ఇలా చేస్తే కాస్మటిక్స్లోని రసాయనాలు ఆభరణాల లోహాల మధ్య రసాయన చర్యకు కారణమవుతుంది. ఆభరణాలు మెరుపు తగ్గడం, రంగుమారడం వంటి పరిణామాలు సంభవిస్తాయి. కాబట్టి ఒంటికి క్రీములు, పెర్ఫ్యూమ్లు వేసుకోవడం పూర్తయిన తర్వాత మాత్రమే ఆభరణాలను ధరించాలి. ఆభరణాలను ధరించిన తర్వాత తీసి బీరువాలో దాచేటప్పుడు నేరుగా డబ్బాలో పెట్టడం మంచిది కాదు. ఒంటి మీద నుంచి తీసిన తరవాత కొంతసేపు గాలికి ఆరనివ్వాలి. ఆ తర్వాత నూలువస్త్రంతో తుడవాలి. శుభ్రమైన మెత్తని నూలు వస్త్రంలో చుట్టి డబ్బాలో పెట్టాలి.ఆభరణాలను శుభ్రం చేయడానికి రసాయనాలను వాడరాదు. ఇలా చేస్తే బంగారు ఆభరణాల మెరుపు పోవడంతోపాటు ఆభరణం రంగుమారుతుంది. ఆభరణం రంగు మారిన వెంటనే ఇది కచ్చితమైన బంగారేనా అనే అనుమానం వస్తుంది. ఆభరణం తయారీలో బంగారంలో కొన్ని ఇతర లోహాలను కలుపుతారు. అవి రసాయనాల కారణంగా రంగుమారుతాయి. ఆభరణాలను మెత్తని వస్త్రంతో మృదువుగా తుడవాలి.నిద్రపోయేటప్పుడు ఆభరణాలను ధరించరాదు. బంగారు మెత్తని లోహం. సున్నితమైన పనితనంతో లోహంలో రాళ్లు, వజ్రాలను పొదుగుతారు. నిద్రలో ఒత్తిడికి గురై రాళ్లు ఊడి΄ోయే ప్రమాదం ఉంది. రాలి పడిన రాళ్లను తిరిగిపొందగడం కష్టం. తిరిగి అమర్చినప్పటికీ అతుకు తెలిసి΄ోతుంది. ఆభరణానికి స్వతహాగా ఉండే అందం పోతుంది.రెండు వేర్వేరు లోహాలను ఒకచోట ఉంచరాదు. అంటే బంగారు, వెండి ఆభరణాలను ఒకే డబ్బాలో పెట్టకూడదు. విడిగా భద్రపరచాలి. అలాగే రెండు ఆభరణాలను కూడా ఒకే పెట్టెలో పెట్టరాదు. ఒకదానికొకటి రాసుకుని గీతలు పడతాయి, మెరుపు కూడా తగ్గుతుంది. – రీటా షాకన్సల్టెంట్ అండ్ జ్యూయలరీ డిజైనర్, హైదరాబాద్ -
ఈ మేకప్ ఆర్టిస్ట్ చాలా కాస్టీ..! రోజుకు ఎంత ఛార్జ్ చేస్తాడో తెలుసా..?
-
ఘనంగా తమన్నా మేకప్ స్టూడియో స్నాతకోత్సవం (ఫొటోలు)
-
ఫ్యాషన్ With కాషన్
స్టైల్‌గా కనపడడం కోసం సిటిజన్లు దేనికైనా సై అంటున్నారు. కేశాలకు దట్టించే కలర్స్ నుంచి కాళ్లకు వేసుకునే ఫుట్‌వేర్ వరకూ తమదైన స్టైల్‌ని ప్రదర్శించాలని, అందుకోసం దేనికైనా రెడీ అంటున్నారు..ఈ ట్రెండ్ అనేక రకాల ఆరోగ్య సమస్యల్ని కొనితెస్తోంది. ఫ్యాషన్ ప్రియుల్ని సిటీలో స్కిన్ స్పెషలిస్టులు, ఫిజియో థెరపిస్ట్‌లు... తదితర వైద్యులు, నిపుణుల చుట్టూ ప్రదక్షిణ చేయిస్తోంది. ఏం చేస్తావో నాకు తెలీదు...నా లుక్ చూసి మా కంపెనీలో కొలీగ్స్‌కి మెంటలెక్కాలి....తన హెయిర్ స్టయిలిస్ట్ దగ్గర ఓ ఉద్యోగి ఆర్డర్ లాంటి అభ్యర్థన... వెళ్లేది పేజ్ త్రీ పారీ్టకి.. అక్కడ ఫ్యాషన్ షోని మించిన అవుట్‌ఫిట్స్‌తో వస్తారు.. అలాంటి చోట సమ్‌థింగ్ స్పెషల్‌గా కనపడాలి. దానికి నువ్వేం చెప్పినా నేను రెడీ...పర్సనల్ మేకప్ ఆరి్టస్ట్తో ఓ పేజ్ త్రీ సోషలైట్ అగ్రిమెంట్ లాంటి కమిట్ మెంట్... తలపై మండుతున్న సెన్సేషన్, కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న షీలా అనే గృహిణిని పరీక్షించిన వైద్యులు ఆమె గతంలో చేయించుకున్న హెయిర్ స్ట్రెయిట్నింగ్ ప్రక్రియే దీనికి కారణమని నిర్ధారించారు. ఆ ప్రక్రియలో భాగంగా ఉపయోగించిన క్రీమ్‌లో గ్లైక్సిలిక్ యాసిడ్ ఆమె చర్మంలో చేరుకుని అక్కడ నుంచి మూత్రాశయాన్ని సైతం దెబ్బతీసిందని తేల్చారు. అధికంగా హెయిర్ డై వాడితే అందులో ఉండే హైడ్రోజన్ పెరాక్సైడ్, పీపీడీ తదితర హానికారకాల వల్ల జుట్టు ఊడిపోవడంతో మొదలుపెట్టి అస్తమా, బ్రెస్ట్ కేన్సర్ వంటిప్రాణాంతక వ్యాధులు సైతం రావచ్చని డెర్మటాలజిస్ట్ డా.గీతా ఒబెరాయ్ చెబుతున్నారు. బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం వల్ల మహిళల్లో పునరుత్పత్తి అవయవాలపైనా, పురుషుల్లో వీర్యోత్పత్తిపైనా దుష్ప్రభావం పడవచ్చని, అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుంచి బ్రీతింగ్ సమస్యల వరకూ ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు.ఈ తరహా వస్త్రధారణ వల్ల మెరాల్జియా పెరాస్తటికా అనే నరాల వ్యాధి వస్తుందని కెనడియన్ మెడికల్ ఆసోసియేషన్ జర్నల్ నిర్ధారించింది. అదే విధంగా జర్నల్ ఆఫ్ న్యూరాలజీ, న్యూరోసర్జరీ అండ్ సైకియాట్రీలో ప్రచురితమైన అధ్యయనంలో టైట్ జీన్స్ వల్ల కంపార్ట్మెంట్ సిండ్రోమ్ అనే సరిస్థితి, దీనితో శరీర కదలికల సమస్యలు రావచ్చని స్పష్టం చేసింది.లిప్‌స్టిక్ వినియోగంలో జాగ్రత్తలు పాటించకపోతే డీహైడ్రేషన్ సహా అనేక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. లిప్‌స్టిక్‌లో వినియోగించే సర్వసాధారణ రసాయనం ట్రైక్లోజన్ వల్ల హృద్రోగ సమస్యలు రావచ్చని కాలిఫోరి్నయా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల అధ్యయనం నిర్ధారించింది.హైహీల్స్ షూస్ వినియోగం.. మహిళల్లో బోన్ హెల్త్‌పై దుష్ప్రభావం చూపుతోందని, శాశ్వత బ్యాక్‌పెయిన్‌కి, ఆస్టియోపొరోసిస్కి కారణమవుతోంది. ముఖ్యంగా 20–45ఏళ్ల మధ్య వయస్కులపై నిర్వహించిన మ్యాక్స్ హెల్త్ కేర్ అధ్యయనం తేలి్చంది.యువి నెయిల్ పాలిష్ డ్రయ్యర్స్ వినియోగం వల్ల కేన్సర్ల ప్రమాదం పొంచి ఉందని నేచర్ కమ్యూనికేషన్స్‌లో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది. నెయిల్ పాలిషితో పాటు షాంపూల్లోని కొన్ని రసాయనాలు 63 శాతం మహిళల్లో టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతాయని ఎండోక్రైన్ సొసైటీ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం నిర్ధారించింది. హెయిర్ స్ప్రే, ఆఫ్టర్ షేవ్ లోషన్స్‌లో ఉండే హానికారకాలు చర్మం ద్వారా ప్రయాణించి కాలేయాన్ని, కిడ్నీ, ఊపిరితిత్తులు, ఇతర అవయవాలకు చెడు చేస్తాయని స్పష్టం చేసింది.రంగుల టాటూ... రోగాల కాటు.. తప్పనిసరిగా స్పెషలిస్ట్ దగ్గరకు మాత్రమే టాటూస్ కోసం వెళ్లాలి. సరైన ఆరి్టస్ట్ కాకపోతే అతను రిపీటెడ్ నాన్స్టెరిలైజ్డ్ నీడిల్స్ వాడితే... హెపటైటిస్ నుంచి ఎయిడ్స్ వరకూ అన్నిరకాల వ్యాధులు అంటుకునే ప్రమాదం ఉంది. టాటూ వేయించుకునే ముందు మన చర్మ ఆరోగ్యం గురించి డాక్టర్ సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. టాటూస్ వేసుకున్నాక కనీసం రెండు వారాల పాటు పర్యవేక్షణ అవసరం.రంగు పడుద్దా? లేదా? హెయిర్ డై/కలర్స్, షాంపూలు, కండిషనర్లు... వంటివి ఇష్టారాజ్యంగా వినియోగిస్తున్నారు. వీటిలో దాదాపు అన్నీ కెమికల్స్ మేళవించినవే. వీటి విచ్చలవిడి వినియోగం వల్ల తల ఉపరితల భాగంపై చర్మంతో పాటు విభిన్న రకాల కేన్సర్లకూ ఆస్కారం ఉందని డాక్టర్లు అంటున్నారు. ఈ కలర్స్‌లో అత్యధిక శాతం హానికారకాలేనని స్పష్టం చేస్తున్నారు. వీటిని వినియోగించే సమయంలో వైద్యుల సూచనలు తీసుకోవాలి... అలాగే లక్షల్లో ఖర్చుపెట్టి చేయించుకుంటున్న హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్... వంటివి విజయవంతం కావాలంటే తప్పనిసరిగా పూర్తి స్థాయి నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే జరగాలి. లేదంటే కొత్త సమస్యలు తప్పవు. బ్యాండ్ బాజా... మెమొరీ లేజా... ఇప్పుడు హెడ్ బ్యాండ్స్ వాడకం భారీగానే పెరిగింది. తల వెంట్రుకలను బాగా టైట్‌గా కట్టేయడం హెయిర్‌ఫాల్‌కి దారి తీస్తుంది. అంతేకాదు మెమొరీ ప్రాబ్లెమ్స్ కూడా రావచ్చని పలువురు నిపుణులు చెబుతున్న మాట. బొట్టు.. జాగ్రత్తగా పెట్టు... నుదుటన బొట్టు.. స్టిక్కర్లలోకి మారిపోయి చాలా కాలమైంది. అయితే వీటిని జాగ్రత్తగా ఎంచుకోవాలి. కొన్ని రకాల స్టిక్కర్స్‌తో పాటు సింధూర్స్ కూడా అలర్జీలను కలిగిస్తాయి. వీలైనంత వరకూ న్యాచురల్, ఆర్గానిక్‌వి వాడడం మంచిది.పియర్సింగ్.. సమ్‌థింగ్ రాంగ్...కాదేదీ కుట్టుకోవడానికి అనర్హం అన్నట్టు ఇటీవలో శరీరంలోని అనేక చోట్ల బాడీ పియర్సింగ్‌ను ఇష్టపడుతున్నారు. చెవిపోగుల నుంచి మొదలై ఇప్పుడు వంటి మీద ఎక్కడ పడితే అక్కడ రకరకాల పరికరాలను అతికించుకుంటున్నారు. ఆఖరికి నాలుక మీద కూడా రింగుల్ని గుచ్చుకుంటున్నారు. అయితే ఈ పిచ్చి ప్రమాదకరం అంటున్నారు వైద్యులు. ఒకటికి మించి చెవి చుట్టూ కుట్టించుకోవడం. ముఖ్యంగా నాలుక, పెదవి, నాభి వంటి ప్రాంతాల్లోనూ పియర్సింగ్ చేయించుకోవడం, అవేమో ఇమిటేషన్ జ్యుయలరీ కావడం వల్ల స్కిన్ అలెర్జీ సమస్యలు తలెత్తుతున్నాయి. శరీరంలోని సున్నితమైన భాగాలపై జ్యుయలరీ యాడ్ చేయడం వల్ల వాటి పనితీరు దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ఇలాంటి తీవ్రమైన ఫ్యాషన్స్ అనుసరించడం అంటే ఒక సైకలాజికల్ సమస్యగా గుర్తించాలని చెబుతున్నారు. దీన్ని అదుపు చేయకపోతే ఇది ట్రాక్షన్ అలోపేసియాకి దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు. మితిమీరితే అనర్ధాలే... దాదాపు అన్ని హెయిర్ డైలలో ఉండే పీపీడీ చాలా హానికరం.. దీర్ఘకాలం పాటు వినియోగిస్తే జుట్టు రాలడంతో మొదలై కేన్సర్ల వంటి తీవ్ర సమస్యలకు దారితీస్తుంది. కొంత మందికి దీని రియాక్షన్ వెంటనే తెలుస్తుంది. మరికొంత మందికి చాలా కాలం తర్వాతే బయటపడతాయి. దీనికి బదులు గోరింటాకు, హెన్నా వంటివాటితో ప్యూర్ బ్లాక్ కాకపోయినా, బ్రౌన్ కలర్ వచ్చేలా చేయవచ్చు. హెయిర్ స్ట్రయిటనింగ్ ఇప్పుడు బాగా చేయించుకుంటున్నారు. సాఫ్ట్‌నెస్ కోసం నప్పని రసాయనాలు ఉపయోగిస్తారు. కొన్ని క్రీమ్స్... వల్ల తెల్లగా అయ్యాం అనుకుంటారు గానీ... అవి చర్మం తాలూకు పొరల్ని దెబ్బతీస్తాయి. హానికారక బాక్టీరియాను నిరోధించే సామర్థ్యాన్ని కోల్పోయేలా చేస్తాయి. మేకప్ వల్ల చర్మం పొడిబారిపోయే చాన్స్ ఉంది. క్లెన్సర్‌తో శుభ్రపరచకపోతే ఆయిల్ బయటకు పోక కురుపులు తయారవుతాయి. పియర్సింగ్ సున్నితమైన అవయవాలపైన చేయించుకోకూడదు. అలాగే టాటూ ఆరి్టస్ట్స్తో చేయించుకుంటే ఇన్ఫెక్షన్లకు అవకాశాలు ఉంటాయి. –డా.డబ్లు్య.జాన్, డెర్మటాలజిస్ట్మేకప్... ఆరోగ్యానికి పేకప్...నిమిషాల్లో వర్ఛస్సును మెరిపించేస్తామని ప్రకటించే మేకప్ ఉత్పత్తుల్లో పరిమితికి మించిన రసాయనాలు వాడుతున్నారంటూ ఇటీవల కొన్ని ప్రముఖ బ్రాండ్స్ ఉత్పత్తులను సీజ్ చేయడం దీనికి ఓ ఉదాహరణ.ఫ్యాబ్రిక్... నప్పకపోతే..తిప్పలే...రకరకాల ఫ్యాబ్రిక్స్‌తో రూపొందిన డ్రెస్‌లు మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. ఫ్యాషన్‌లో ముందుండాలని పోటీపడుతున్న యువత అదీ.. ఇదీ.. అని తేడా లేకుండా ఏది కొత్తగా వస్తే దాన్ని వాడేస్తోంది.లిప్స్కి లాస్..ఒకప్పుడు సినిమా వాళ్లకు మాత్రమే పరిమితమైన మేకప్ ఇప్పుడు దాదాపు ప్రతి ఒక్కరికీ ప్రీతిపాత్రమైంది. లిప్‌స్టిక్ పేరుతో అధరాలను మెరిపించేందుకు ప్రయతి్నంచే అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. కెమికల్స్ లేకుండా ఏ లిప్‌స్టిక్ తయారయ్యే ప్రసక్తే లేదు కాబట్టి వీటిని తప్పనిసరైతే తప్ప వాడకూడదంటున్నారు. దీని బదులు కొత్తిమీర ఆకులతో, బీట్రూట్ వంటివి ఉపయోగించి పెదాల్ని ఎర్రగా మార్చుకోవడం మంచిదని సూచిస్తున్నారు.డ్రెస్ టూ డ్రగ్స్.. మానసిక ఒత్తిడి తప్పదు...ప్రత్యేక గుర్తింపు కోరుకోవడం అది కూడా ఫ్యాషన్‌ను ఫాలో అవడం ద్వారా అనేది తొలి దశలో బాగానే ఉన్నా రానురానూ తీవ్రమైన మానసిక ఒత్తిడికి దారి తీస్తుంది. ఇతరులతో పోల్చుకోవడం వల్ల ఆత్మన్యూనతా భావం పెరిగిపోతుంది. అలాగే అప్ టు డేట్‌గా కనపడాలనే ఆతృత చదువు, వృత్తి, ఉద్యోగాలు వంటి ఇతర ముఖ్యమైన విషయాల మీద దృష్టి కేంద్రీకరించనివ్వదు. అలాగే ఆరోగ్యకరమైన ఫ్యాషన్లను దాటిపోయి అనారోగ్యకరమైన అలవాట్లకు ఇది దారి తీస్తుంది. ఆర్థిక పరమైన సమస్యలు కూడా తోడవుతాయి.. కాబట్టి ఫ్యాషన్ ప్రియత్వం అనేది నియంత్రణలో ఉండేలా చూసుకోవడం అత్యవసరం. లేకపోతే ఇది డ్రెస్సులతో మొదలై డ్రగ్స్ దాకా చేర్చినా ఆశ్చర్యం లేదు. ఈ ఫ్యాషన్ల పిచ్చిలో ఉన్న యువతను ఇతర ఆరోగ్యకరమైన వ్యాపకాలకు అంటే ఆటల వంటి అభిరుచుల వైపు మళ్లించడం మంచిది. – డా.జె మయూర్‌నాథ్‌రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్, సైక్రియాట్రిస్ట్ -
నీలి వెన్నెల జాబిలీ నిన్ను చూసి మురిసి...
‘బ్లూ మేకప్’ అనేది ఇప్పుడు వైరల్ బ్యూటీ ట్రెండ్. అమెరికన్ సింగర్–సాంగ్ రైటర్ బిల్లీ ఎలీష్ పాట ‘బ్లూ’ నుంచి ఈ మేకప్ ట్రెండ్ మొదలైంది. 2016లో ‘ఓషన్ ఐస్’ ఆల్బమ్ విడుదల అయిన తరువాత ‘బ్లూ’ పాట రాసింది ఎలీష్. లేటెస్ట్గా ఆ పాటను మరింత కొత్తదనంతో రీక్రియేట్ చేస్తే సంగీత ప్రియులను తెగ ఆకట్టుకుంది. ఆ పాటకు వచ్చిన పాపులారిటీ ‘బ్లూ బ్యూటీ ట్రెండ్’కు నాంది పలికింది.ఈ ట్రెండ్‌లో భాగంగా ఫ్యాషన్ అండ్ బ్యూటీ ఇన్ఫ్లూయెన్సర్లు, సెలబ్రిటీలు రకరకాల వీడియోలు చేస్తున్నారు. ఈ ట్రెండ్‌లో భాగంగా కంటెంట్ క్రియేటర్, డాన్సర్ ఆనమ్ దర్బార్ స్విమ్మింగ్‌పూల్ వీడియో చేసింది. బ్యూటీ ఇన్ఫ్లూయెన్సర్ మృణాల్ పాంచాల్ ‘వాటర్’ ఎలిమెంట్‌తో వీడియో చేసింది. ఈ వీడియోలో మృణాల్ నీలిరంగు సీతాకోకచిలకలా కనిపిస్తుంది. మొత్తానికైతే ‘బ్లూ మేకప్ ట్రెండ్’ మన దేశంలోనూ సందడి చేస్తోంది. -
క్షణాల్లో ముఖాన్నీ క్లీన్ చేసి మెరిసేలా చేసే డివైజ్!
ఫౌండేషన్స్, గ్లాసీ లోషన్స్‌తో ముఖాన్ని తాత్కాలికంగా మెరిపించడం ఈజీయే! కష్టమల్లా తర్వాత ఫేస్‌ని క్లీన్ చేసుకోవడమే! అందుకే ఈ బ్రష్‌ని మీ మేకప్ కిట్‌లో పెట్టేసుకోండి. మేకప్‌ను తొలగించడంతో పాటు బ్లాక్ హెడ్స్, డెడ్ స్కిన్ వంటి సమస్యల నుంచి బయటపడేందుకూ ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ఈ 3–ఇన్–1 ఎలక్ట్రిక్ మసాజ్ టూల్.. చర్మాన్ని శుభ్రపరచడమే కాక మృదువుగానూ మారుస్తుంది. ముఖం, మెడ, వీపు ఇలా ప్రతిభాగాన్నీ క్లీన్ చేస్తుంది. స్కిన్ మసాజర్‌లా పనిచేసి స్కిన్ టోన్‌ను మెరుగుపరుస్తుంది. మృతకణాలను తొలగిస్తుంది. ముడతలను మాయం చేస్తుంది. ఒత్తిడిని.. అలసటను దూరం చేస్తుంది. ఈ డివైస్.. అన్ని వయసుల వారికీ అనువైనది. అలాగే స్త్రీ, పురుషులనే భేదం లేకుండా దీన్ని అందరూ వాడుకోవచ్చు. నచ్చినవారికి బహుమతిగా కూడా ఇవ్వొచ్చు. మసాజర్‌ను అవసరమైన విధంగా స్లో లేదా ఫాస్ట్ మోడ్‌లో ఉపయోగించుకోవచ్చు. యూజ్ చేసిన ప్రతిసారీ నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఎలక్ట్రిక్ గాడ్జెటే అయినా .. వాటర్ ప్రూఫ్ కావడంతో స్నానంచేసేటప్పుడూ వాడుకోవచ్చు. ఇందులో మూడు వేరువేరు బ్రష్‌లు ఉంటాయి. ఒకటి సెన్సిటివ్ ఫేస్ బ్రష్.. ఇది సున్నితమైన చర్మం కోసం మృదువుగా, సౌకర్యవంతంగా పని చేస్తుంది. రెండవది డీప్ క్లెన్సింగ్ బ్రష్.. ఇది రంధ్రాలను శుభ్రపరచి.. చర్మాన్ని నీట్‌గా మారుస్తుంది. మూడవది సిలికాన్ బ్రష్.. ఇది అన్ని చర్మతత్వాలకూ ఉపయోగపడుతుంది. ఈ బ్రష్‌లను స్కిన్ టైప్ని బట్టి మార్చుకుంటూ ఉండాలి. ఈ మెషిన్‌కి చార్జింగ్ పెట్టుకుని.. వైర్ లెస్‌గానూ వాడుకోవచ్చు. ఇందులో పింక్, బ్లూ కలర్స్ అందుబాటులో ఉన్నాయి. (చదవండి: సంగీతం వస్తేనే సింగర్ అయిపోరు అని ప్రూవ్ చేసింది!) -
ఘనంగా తమన్నా మేకప్ అకాడమీ కాన్వకేషన్ (ఫొటోలు)
-
సొంతంగా మేకప్ చేసుకుంటున్న హీరోయిన్
-
హీరోయిన్ల ముఖం అంతలా వెలిగిపోవడానికి కారణం ఇదేనా?
హీరోయిన్ భూమి ఫడ్నేకర్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు కానీ బాలీవుడ్లో మాత్రం ఈ బ్యూటీకి బాగానే ఫాలోయింగ్ ఉంది. 2015లో విడుదలైన ‘దమ్ లగాగే హైసా’ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన భూమి తొలి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత ఆమె నటించిన టాయిలెట్ : ఏక్ ప్రేమ్ కథ, శుభ్ మంగళ్ సావధాన్,పతీ ఔర్ పత్నీ వంటి సినిమాలతో బీటౌన్‌లో క్రేజీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తరచూ ఫ్యాషన్, బ్యూటీకి సంబంధించిన పలు విషయాలను నెటిజన్లతో పంచుకుంటుంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా వైరల్ అవుతున్న ఐ మేకప్ హ్యాక్‌ను ట్రై చేసింది. స్మోకీ స్మడ్జ్ క్యాట్ ఐలైనర్‌ను సులభంగా ఎలా వేసుకోవాలో చూపించింది. అంతేకాకుండా ఈ హ్యాక్ తనకు బాగా నచ్చిందని, తన రెగ్యులర్ మేకప్‌లో దీన్ని తప్పకుండా వాడతానంటూ ఇన్‌స్టాలో వీడియోను షేర్ చేసింది. View this post on Instagram A post shared by Bhumi Pednekar (@bhumipednekar) ఇక మరో వీడియోలో కేవలం ఐదు నిమిషాల్లో మేకప్ ఎలా వేసుకోవాలో చూపించి ఆశ్చర్యపరిచింది. సాధారణంగా హీరోయిన్స్ తమ బ్యూటీ సీక్రెట్స్‌ను, మేకప్ రొటీన్‌ను ఎక్కువగా షేర్ చేసుకోరు. కానీ ఈ బ్యూటీ మాత్రం తాను మేకప్ కోసం ఎలాంటి ప్రోడక్ట్స్ వాడుతుందో కూడా రివీల్ చేసింది. మరి మీకు నచ్చితే ఓసారి ట్రై చేసేయండి. -
కరీనాకపూర్ మేకప్ నేచురల్‌గా ఉండటానికి సీక్రేట్ ఇదే..!
చాలామంది సెలబ్రెటీలు వేసుకునే మేకప్ చాలా నేచరల్‌గా ఉంటుంది. ఎంతలా అంటే చూస్తే చాలా సహజసిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది. వాళ్ల చర్మం అంత కాంతివంతంగా ఉంటుందేమో అన్నట్లుగా ఆకట్టుకుంటుంది. అదే మనం ట్రై చేస్తే..కచ్చితంగా మేకప్ వేసుకున్నట్లు క్లియర్‌గా అర్థమైపోతుంది. ఎంత డబ్బు వెచ్చించినా అంతలా నేచురల్‌గా అనిపించదు. అయితే దాని వెనుక ఉన్న సీక్రెట్‌ని బాలీవుడ్ భామ కరీనా కపూర్ బయపెట్టింది. అందేంటంటే..? కరీనా కపూర్ మేకప్ వేసుకుంటే ముఖంపై చిన్న మచ్చ కూడా లేనట్లు ప్రకాశంతంగా ఉంటుంది. నిజంగా ఆమె మేకప్ వేసుకుందా..! లేదా? అన్నట్లు ఆశ్చర్యంగా ఉంటుంది. అంతలా ముగ్ధమనోహరంగా ఉంటుంది ఆమె రూపు. అంతలా ఆకట్టుకునే కనపించడానికి వెనుక దాగున్న రహస్యం ఏంటంటే..మేకప్ లుక్ మంచిగా కనిపించేలా ముందు..ముఖంపైన చర్మం హైడ్రైట్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ముందుగా మంచి మాస్క్ వేసుకుని ఉంటారు. ఆ తర్వాత మాయిశ్చరైజేషన్ ముఖానికి ఇంకిపోయాలా అప్లే చేస్తారు. ఆ తర్వాత మేకప్ వేయడం స్టార్ట్ అవుతుంది. ఆమె తదుపరి చిత్రం 'ది క్రూ' షూటింగ్లో భాగంగా ఫేస్ మేకప్‌కి ముందు జరిగే తతంగాన్ని మొత్తం ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది. అందులో ఐలైనర్ దగ్గర నుంచి పెదవులకు వేసుకునే లిప్‌స్టిక్ వరకు ఎలా మేకప్ మ్యాన్లు వేస్తారో సవివరంగా ఉంది. ఇంకేందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) (చదవండి: భారతీయ వంటకాలకు జపాన్ అంబాసిడర్ ఫిదా!) -
ఈ కిట్ మీవద్ద ఉంటే..పార్లర్‌కి వెళ్లాల్సిన పని ఉండదు!
ఎల్లవేళలా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే అందం.. కలకాలం నిలచి ఉండాలంటే చర్మానికి ప్రత్యేకమైన ట్రీట్మెంట్స్ అవసరం. అందుకోసమే ఈ కిట్! ప్రతి ఒక్కరికీ యూజ్ అవుతుంది. సహజమైన సౌందర్యాన్ని పొందాలనుకునే వాళ్లు ఇలాంటి మైక్రోడెర్మాబ్రేషన్ సిస్టమ్‌ను వెంట ఉంచుకోవాల్సిందే. ఈ మెషిన్ శరీరంపైనున్న మృతకణాలను సున్నితంగా తొలగిస్తుంది. మేకప్‌తో పాడైన చర్మాన్ని నిమిషాల్లో సరిచేస్తుంది. వయసుతో వచ్చే ముడతల్ని ఇట్టే పోగొడుతుంది. చర్మాన్ని బిగుతుగా, కాంతిమంతంగా మార్చి.. సరికొత్త అందాన్ని ఇస్తుంది. ఇంట్లో ఈ డివైస్ ఉంటే.. ప్రత్యేక మెరుగుల కోసం పార్లర్‌కి వెళ్లాల్సిన పనిలేదు. ఈ టూల్.. చర్మానికి ఎక్స్ఫోలియేటర్ స్క్రబ్‌ను అందిస్తుంది. సెన్సిటివ్, ఆటో, మాన్యువల్ అనే పలు మోడ్స్ ఇందులో ఉంటాయి. సిస్టమ్‌కి అటాచ్ అయి ఉన్న పొడవాటి ప్లాస్టిక్ ట్యూబ్‌తోనే ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రొఫెషనల్ పోర్ ఎక్స్ట్రాక్షన్ టిప్, గ్రేడ్ డైమండ్ టిప్, మాగ్నెటిక్ ఇన్ఫ్యూజర్ టిప్ ఇలా ఆ ట్యూబ్‌కి అటాచ్ చేసుకోవాల్సిన వేరువేరు పార్ట్స్.. మెషిన్‌తో పాటు లభిస్తాయి. పోర్ ఎక్స్ట్రాక్షన్ సాయంతో చర్మంపైనున్న చిన్న చిన్న గుంతలు, రంధ్రాలను తగ్గించుకోవచ్చు. డైమండ్ టిప్ సాయంతో ముడతలు, గీతలను పోగొట్టుకోవచ్చు. మాగ్నెటిక్ ఇన్ఫ్యూజర్ సాయంతో చర్మం లోతుల్లో పేరుకున్న వ్యర్థాలు తొలగించుకోవచ్చు. ప్లాస్టిక్ ట్యూబ్‌ని సులభంగా పెన్ పట్టుకున్నట్లుగా పట్టుకుని, చర్మం మీద పెట్టి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఈ మెషిన్ చూడటానికి మినీ టాయిలెట్ బాక్స్లా కనిపిస్తుంది. ఈ సిస్టమ్‌కి ఒకవైపునున్న పవర్ బటన్, స్టార్ట్ బటన్, లెవెల్స్.. అన్నిటినీ అడ్జస్ట్ చేసుకుని సులభంగా వినియోగించుకోవచ్చు. (చదవండి: నత్తల విసర్జకాలు, తేనెటీగల విషంతో బ్యూటీ ప్రొడక్ట్స్! కొరియన్ల బ్యూటీ రహస్యం ఇదేనా!) -
అందాల సుందరి ముఖాన్ని కట్‌చేసి, 90 డిగ్రీల్లో తిప్పితే..
మేకప్ అనేది ఎంతటి మహత్తరమైన కళ అంటే అది చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది. మేకప్ కళను ఇష్టపడేవారు అనేకులు ఉన్నారు. మేకప్ అంటే ఇష్టం లేదని చెప్పేవారు చాలా తక్కువమంది ఉంటారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక మేకప్ వీడియోను చూసినవారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. అలాగే భయంతో కాసేపు కదలకుండా ఉండిపోతున్నారు. చాలా మంది కళాకారులు తమ కళా ప్రతిభను వీడియోల రూపంలో ప్రదర్శించి, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. ఈ కళాకారులలో కొందరు వారి అద్భుతమైన కళ కారణంగా ప్రజలలో ఎంతో ఆదరణ దక్కించుకుంటారు. తాజాగా మేకప్ ఆర్టిస్ట్ మిమీ చోయ్‌కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో మిమి కళా ప్రతిభను చూసినవారంతా నోరెళ్లబెడుతున్నారు. వీడియోలో మిమీ చోయ్ ఆ మహిళ ముఖం ఏ వైపు ఉందో అర్థం కాని విధంగా ముఖానికి మేకప్ చేసింది. మిమీ మేకప్ తర్వాత ఆ మహిళ ముఖాన్ని మధ్య నుండి ఎవరో కత్తిరించినట్లు, ఆ తర్వాత దానిని 90 డిగ్రీలు తిప్పినట్లు అనిపిస్తుంది. ఇలాంటి కళను మనం చాలా అరుదుగా చూస్తుంటాం. ఈ వీడియో @HOW_THINGS-WORK పేరుతో ఉన్న పేజీ నుండి మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ X లో షేర్ చేశారు. వీడియోకు ఇప్పటివరకూ 272.3కే వీక్షణలు దక్కాయి. ఈ అద్భుతమైన మేకప్ కళను చూసిన నెటిజన్లు వారి అభిప్రాయాలను కామెంట్ విభాగంలో తెలియజేస్తున్నారు. ఒక యూజర్ ఇలా రాశాడు ‘నిజంగా నా తల తిరుగుతోంది’ మరొక యూజర్ ‘ఆమె మేకప్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకువెళ్లారు’ అని రాశారు. ఇది కూడా చదవండి: పిజ్జా యాప్ సాయంతో ప్రియుడి అరెస్ట్.. ఇలా కూడా చేయచ్చా? అంటున్న యూజర్లు! The makeup skills from artist Mimi Choi is just incredible 😮 pic.twitter.com/6RiWXLOe3l — H0W_THlNGS_W0RK (@HowThingsWork_) August 25, 2023 -
Amala Paul Without Makeup: మేకప్ లేకుండా, టాటూ చూపిస్తూ అమలాపాల్ ఫోజులు (ఫోటోలు)
-
ఆ మేకప్ ఓ పెద్ద సవాల్
‘‘షూటింగ్ చేసిన ప్రతి రోజూ కాస్ట్యూమ్స్ ధరించడానికి, మేకప్ వేసుకోవడానికి నాలుగైదు గంటలు పట్టే క్యారెక్టర్ చేయడం చిన్న విషయం కాదు. మేకప్ పూర్తయ్యేంతవరకూ కదలకుండా కూర్చోవడం అనేది పెద్ద చాలెంజ్’’ అన్నారు మాళవికా మోహనన్. విక్రమ్ హీరోగా పా. రంజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న తమిళ చిత్రం ‘తంగలాన్’లో మాళవికా మోహనన్ ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్ నేపథ్యంలో పీరియాడికల్ ఫిల్మ్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో విక్రమ్ ఓ గిరిజన తెగ నాయకుడి పాత్రలో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. మాళవికా మోహనన్ కూడా అదే తెగకు చెందిన యువతిగా నటిస్తున్నారని సమాచారం. ఈ పాత్రకు సంబంధించిన మేకప్‌కి నాలుగైదు గంటలు పడుతోంది. ‘‘ఇలాంటి పాత్రలు చేసే అవకాశం అరుదుగా వస్తుంది కాబట్టి ఇష్టంగా చేస్తున్నాను’’ అన్నారు మాళవికా మోహనన్. -
వింత తెగ: పళ్లను చూసి పెళ్లాడేస్తారు...
గిరిజన తెగలలో జరిగే వివిధ వేడుకలు చాలా విచిత్రంగా ఉంటాయి. ముఖ్యంగా పెళ్లిపేరుతో జరిగే తంతు ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఇదేకోవలో నైజీరియాలోని ఒక గిరిజన తెగలో జరిగే ఒక వింత వేడుక అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. నైజీరియాలోని వోడబె గిరిజనులలో ప్రతీయేటా ఒక పోటీ జరుగుతుంటుంది. దీనిలో పురుషులు విచిత్రమైన మేకప్‌తో పాల్గొంటారు. అయితే వీరిని మేకప్ చేసే పని స్త్రీల చేతుల్లో ఉంటుంది. ఈ విధంగా ఎందుకు మేకప్ చేస్తారో, దీని వెనుకనున్న కారణమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నైజీరియాలో ఉండే వోడబె గిరిజనులు ప్రతీయేటా గుయెరోవెల్ అనే పోటీని నిర్వహిస్తారు. ఇది పురుషుల సౌందర్యాన్ని ప్రతిబింబించే ఉత్సవం. దీనిలో ఈ గిరిజన జాతికి చెందిన స్త్రీలు, పురుషులు ఉత్సాహంగా పాల్గొంటారు. ఈ పోటీలో భాగంగా పురుషుల ముఖంపై సంప్రదాయ రీతిలో మేకప్ చేస్తారు. Vodabe tribe, where men spend hours doing hair and makeup to impress women https://t.co/4w8Kukzj8r pic.twitter.com/2mSeG4n7GJ— Life's Prism (@LifesPrism) April 25, 2020 భాగస్వామి ఎంపిక కోసం.. మేకప్ చేసుకున్న పురుషులు సంప్రదాయ దుస్తులు ధరించడంతోపాటు వివిధ ఆభరణాలు కూడా ధరిస్తారు. ఈ మేకప్ కార్యక్రమం పూర్తయిన తరువాత పెళ్లికాని యువతులు వారిముందు నిలుచుంటారు. వారు పురుష సౌందర్యాన్ని గుర్తిస్తారు. మేకప్ చేసిన పురుషుల కళ్లను, దంతాలను పరిశీలిస్తారు. ఎవరి కళ్లు, దంతాలు మిలమిలా మెరుస్తాయో వారిని అత్యంత ఆకర్షణీయమైన పురుషునిగా గుర్తిస్తారు. ఈ పోటీలో పాల్గొన్న పురుషులు తమ ఎదురుగా ఉన్న పెళ్లికాని యువతులను ఆకర్షించేందుకు వివిధ హావభావాలను పలికిస్తారు. యువతులు ఈ పురుషులలో తమకు నచ్చిన ఒకరిని తమ భాగస్వామిగా స్వీకరిస్తారు. Vodabe (Wodaabe) plemeOvo pleme naseljava prostor saharskih predela države Niger. Karakteristično za ovo pleme jeste pojam lepote, koji se naviše odnosi na muškarce. Na ovim prostorima zastupljen je princip kontrasta - muškarci se sređuju da bi udovoljili ženama, a ne obrnuto. https://t.co/UJIwsplOPT pic.twitter.com/vnHRinNcXE— mårinå (مارينا) 🌵 (@rapunzel_arsic) December 15, 2020 ఇది కూడా చదవండి: హెల్మెట్లు చాలావరకూ నలుపు రంగులోనే ఎందుకుంటాయంటే.. -
వీరి వీరి గుమ్మడిపండు వీరి పేరేమి?
దాగుడు మూతలాట ఆడుకోని వాళ్లుండరు... కళ్లకు గంతలు కట్టి పేర్లు అడిగితే చెప్పాలి. ఇది రియల్ ఆట. రీల్ గేమ్ విషయానికి వస్తే.. గంతలు కట్టకుండా.. ఆర్టిస్ట్‌ని ఎదురుగా నిలబెట్టి, ‘వీరి పేరేమి’ అని అడిగితే.. ఆ ఆర్టిస్ట్నిగుర్తుపట్టడానికి కాస్త టైమ్ పడుతుంది. అసలు గుర్తు పట్టకపోవచ్చు కూడా. అంతలా కొందరు స్టార్స్ క్యారెక్టర్లలో ఒదిగిపోయారు. ఫిజికల్ మేకోవర్‌తో, మేకప్‌తో గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఆ హీరోల గురించి తెలుసుకుందాం. ♦ పాత్రల కోసం రూపా న్ని మార్చుకోవడానికి ఏమాత్రం వెనకడుగు వేయరు విక్రమ్. ‘శివపుత్రుడు, అపరిచితుడు, ఐ’ వంటి చిత్రాలు అందుకు నిదర్శనం. తాజాగా ‘తంగలాన్’లో కొత్త అవతారంలో కనిపించనున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్ (కేజీఎఫ్) నేపథ్యంలో వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో మాస్ లుక్‌లో కనిపించనున్నారు విక్రమ్. గనుల తవ్వకాల పనులు చేసే వ్యక్తుల జీవితాల నేపథ్యంలో దర్శకుడు పా . రంజిత్ పా న్ ఇండియా మూవీగా ‘తంగలాన్’ని తెరకెక్కిస్తున్నారు. ♦ క్యారెక్టర్ ఎలా డిమాండ్ చేస్తే అలా మారిపోవాలనుకుంటారు అల్లు అర్జున్. గతంలో ‘దేశ ముదురు’ సినిమా కోసం సిక్స్ ΄్యాక్ చేశారు. తాజాగా ‘పుష్ప’ కోసం ఫిజికల్ మేకోవర్‌తో పా టు మేకప్ పరంగానూ వ్యత్యాసం చూపించారు. స్మగ్లర్ పుష్పరాజ్‌గా తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’లో రెచ్చి పోయారు అల్లు అర్జున్. మలి భాగం ‘పుష్ప:ది రూల్’ చిత్రీకరణ జరుగుతోంది. కాగా.. పుష్పరాజ్‌గా గుర్తు పట్టలేనంతగా అల్లు అర్జున్ మారలేదు. కానీ రెండో భాగంలో జాతర బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే ఒక ఫైట్‌లో గుర్తు పట్టలేని విధంగా మారిపోయారు. పండగ చివరి రోజు స్త్రీ వేషధారణలో పురుషులు చెడును నాశనం చేసే గంగమ్మ తల్లిగా మారతారని, ఈ ఫైట్‌లో అల్లు అర్జున్ గెటప్ అదే అని తెలిసింది. సుకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ♦ దుర్గ, పరశురామ్, డీజే.. ఈ మూడు పా త్రల్లో సుధీర్‌బాబు కనిపించనున్న చిత్రం ‘మామా మశ్చింద్ర’.. వీటిలో దుర్గ పా త్ర డిఫరెంట్. ఏజ్డ్ గ్యాంగ్‌స్టర్ అన్నమాట. మామూలుగా సు«దీర్‌బాబు చాలా స్లిమ్‌గా, ఫిట్‌గా ఉంటారు. అయితే ఈ పా త్రలో అందుకు భిన్నంగా బొద్దుగా కనబడతారు. హర్షవర్ధన్ దర్శకత్వంలో తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది, ♦ అటు మలయాళంకి వెళితే సీనియర్ హీరో మోహన్‌లాల్, యంగ్ హీరో పృథ్వీ రాజ్కుమారన్లు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించనున్నారు. మోహన్‌లాల్ టైటిల్ రోల్లో రూపొందుతున్న చిత్రం ‘బర్రోజ్’. వాస్కో డి గామా నిధిని రక్షించడానికి నియమించబడిన 400 ఏళ్ల నాటి ఆత్మ బర్రోజ్. ఆ నిధిని వాస్కో అసలు వారసునికి అప్పగించడానికి ఆ ఆత్మ వేచి ఉంటుంది. కాల్పనిక కథతో త్రీడీ చిత్రంగా ‘బర్రోజ్’ రూపొందుతోంది. కాగా ఈ చిత్రంలో టైటిల్ రోల్ చేయడంతో పా టు మోహన్ లాల్ దర్శకత్వం కూడా వహిస్తున్నారు. ♦ మరో మలయాళ హీరో–దర్శకుడు పృథ్వీ రాజ్కుమారన్ గొర్రెల కాపరిగా కనిపించనున్న చిత్రం ‘ఆడు జీవితం’. 2008లో ఇదే పేరుతో వచ్చిన నవల నేపథ్యంలో బ్లెస్సీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నజీబ్ అనే మలయాళీ వలస కార్మికుడి పా త్రలో పృథ్వి రాజ్ కనిపిస్తారు. సౌదీ అరేబియాకి వలస వెళ్లిన నజీబ్‌ను గొర్రెల కాపరిని చేసి, బలవంతంగా బానిసత్వంలోకి నెట్టివేస్తారు. నిజజీవిత ఘటనల ఆధారంగా ఈ చిత్రం సాగుతుంది. సవాళ్లను ఇష్టపడని స్టార్స్ ఉండరు. అయితే సవాళ్లు అరుదుగా వస్తుంటాయి. అందుకే చాలెంజింగ్ రోల్స్ వచ్చి నప్పుడు ‘సై’ అంటూ ఎంత కష్టపడటానికైనా సిద్ధపడిపోతారు. ఈ సవాళ్లు స్టార్స్‌కి కిక్కే.. అభిమానులకూ కిక్కే. సినిమా సరిగ్గా క్లిక్ అయితే బాక్సాఫీస్కీ కిక్కే. -
అందుకే నేను మేకప్ వేసుకోను.. సీక్రెట్ బయటపెట్టిన సాయిపల్లవి
హీరోయిన్ సాయిపల్లవి చేసింది తక్కువ సినిమాలే అయినా సూపర్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఫిదా సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ తొలి సినిమాతోనే ప్రేక్షకుల మనసు దోచుకుంది. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంది. గతేడాది గార్గి సినిమాతో ముందుకు వచ్చిన సాయిపల్లవి చాలారోజులుగా మీడియాకు కూడా దూరంగా ఉంటుంది. అయితే తాజాగా ముంబైలో జరిగిన ఓ ఈవెంట్‌కు హాజరైన ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ.. తాను మేకప్ లేకుండా నటించడానికి గల కారణాలను బయటపెట్టింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'నేను చిన్నప్పటి నుంచి చాలా ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అయ్యేదాన్ని. నా వాయిస్ బాగోదు, మొహంపై మొటిమలు ఇలా చాలా విషయాలు నన్ను భయపెట్టేవి. మొదట్నుంచి నేను పెద్దగా మేకప్ వాడలేదు. నా మొదటి సినిమా ప్రేమమ్‌లో కూడా నేను మేకప్ లేకుండా నాచురల్‌గా కనిపించా. నిజానికి ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని చాలా భయపడ్డా. కానీ సినిమా రిలీజ్ తర్వాత నన్ను నన్నుగా ప్రేక్షకులు ఇష్టపడ్డారు. నాకు వచ్చిన ఆదరణ చూసిన తర్వాత మరింత ఆత్మవిశ్వాసం వచ్చింది. అందుకే అప్పట్నుంచి సినిమాల్లో మేకప్ లేకుండానే నటించడానికి ఇష్టపడతాను. డైరెక్టర్స్ కూడా ఆ విషయంలో నన్ను ఎప్పుడూ మేకప్ వేసుకోవాలని బలవంత పెట్టలేదు' అంటూ చెప్పుకొచ్చింది. -
Sankranti 2023: పండగ రోజు ట్రెడిషనల్ లుక్ కోసం ఇలా చేయండి..
పండగ రోజున సంప్రదాయ దుస్తులతో ప్రత్యేకంగా కనిపిస్తూ సందడి చేస్తారు. అదేవిధంగా మేకప్ కూడా ప్రత్యేకంగా ఉంటే లుక్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. రోజంతా మేకప్‌తో ఫ్రెష్ లుక్‌లో కనిపించాలంటే ఎంపిక చేసుకునే సాధనాలలోనూ జాగ్రత్త వహించాలి. బ్లష్ సంప్రదాయ దుస్తులు ధరించినప్పుడు ఎక్కువ మేకప్ వేసుకోవడం కాస్త కష్టమే. అయితే, ట్రెడిషనల్‌గా నేచురల్ లుక్ కావాలంటే బ్లష్ అప్లై చేసుకోవచ్చు. ఫెయిర్‌గా ఉన్నవారు బ్లష్‌తో వారి ముఖారవిందాన్ని మరింతగా మెరిపించుకోవచ్చు. బ్లష్ అప్లై చేసిన తర్వాత రెగ్యులర్ ఫౌండేషన్ తో టచ్ అప్ చేయాలి. హైలైటర్ ధరించిన దుస్తులు ప్రకాశవంతమైన రంగులో ఉంటే, దానితో ప్రత్యేకంగా కనిపించడానికి లైట్ మేకప్ ఉత్తమంగా ఉంటుంది. ఇది న్యూడ్ ఐషాడో, లిప్‌స్టిక్‌తో పాటు చాలా తేలికపాటి బేస్ ఉంటుంది. దీనికోసం లైట్ హైలైటర్‌ని ఉపయోగించవచ్చు. మెరిసే కనుబొమ్మ గ్లిట్టర్ ఐషాడో ఎంపిక పండుగ రోజున ఉత్తమ ఎంపిక. సంప్రదాయ రూ΄ాన్ని అధునాతనంగా మార్చడానికి దీన్ని ప్రయత్నించవచ్చు. జరీ అంచు దుస్తులు ధరిస్తారు కాబట్టి బంగారు లేదా వెండి షిమ్మర్ ఐషాడో వేసుకుంటే ముఖ కాంతి మరింతగా పెరుగుతుంది. మాట్ లుక్ చాలా మంది సినీ తారలు మాట్ లుక్ మేకప్‌ని అనుసరిస్తారు. దీంతో చీర లేదా మరేదైనా సంప్రదాయ వేషధారణలో వారు మరింత అందంగా కనిపిస్తారు. మ్యాట్ లుక్ చర్మాన్ని ప్రకాశవంతంగా, సహజంగా కనిపించేలా చేస్తుంది. అయితే ఈ మేకప్ వేసుకునే ముందు చర్మ తత్వం గురించి తెలుసుకోవాలి. డార్క్ లిప్ స్టిక్ డార్క్ లిప్‌స్టిక్ మీ మేకప్‌ను మరింత అందంగా మారుస్తుంది. పండగరోజుల్లో సాధారణంగా బ్రైట్‌గా ఉండే దుస్తులను ధరిస్తారు కాబట్టి అప్పుడు ముదురు రంగు లిప్‌స్టిక్ ఎంపిక ధరించిన దుస్తులకు తగిన విధంగా ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో మాట్ లిప్‌స్టిక్ షేడ్స్ కూడా బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. -
ఆ హీరోయిన్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నయనతార
సౌత్ సూపర్ స్టార్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది నయనతార. తాజాగా ఆమె కనెక్ట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలాకాలం తర్వాత మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న నయనతార గతంలో ఓ హీరోయిన్ తనపై చేసిన కామెంట్స్‌కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ మాళవిక నయనతారను ఉద్దేశిస్తూ.. 'సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్న ఓ హీరోయిన్ ఓ హాస్పిటల్ సీన్ నటించడానికి మేకప్, లిప్‌స్టిక్, హెయిర్‌స్టైల్ ఇలా చక్కగా అలంకరించుకుంది. చావు బతుకుల్లో ఉన్నప్పుడు అలా అందంగా రెడీ అయి ఎవరైనా సీన్ చేస్తారా?ఎంత కమర్షియల్ సినిమా అయితే మాత్రం కాస్త రియాలిటీకి దగ్గరగా ఉండలి కదా' అంటూ విమర్శించింది. తాజాగా నయన్ మాళవిక చేసిన కామెంట్స్‌పై స్పందించింది.. ''ఆమె పేరు ప్రస్తావించడం నాకు ఇష్టం లేదు. ఆసుపత్రి సీన్లో నేను మేకప్, హెయిర్‌స్టైల్‌లో కనిపించడం ఆమెకు తప్పుగా అనిపించింది. సినిమాల విషయంలో రియలిస్టిక్, కమర్షియల్ అనే తేడా ఉంటుంది. రియలిస్టిక్‌గా కనిపిస్తూనే లుక్స్‌పరంగా జాగ్రత్తలు పాటించాలి. కమర్షియల్ చిత్రాల్లో దర్శకుడి సూచనల ప్రకారం నటించాల్సి ఉంటుంది. అంతెందుకు యాడ్స్‌లోనూ హీరోయిన్స్‌ను ఇలాగే స్టైలిష్‌గా చూపిస్తారు'' అంటూ మాళవికకు చురకలింటించింది. -
హీరోలకి బ్లాక్ కలర్ పులుముతున్న డైరెక్టర్స్!
క్యారెక్టర్ కోసం బరువు తగ్గడం, పెరగడం చేస్తుంటారు హీరోలు. ఇప్పుడు కొందరు హీరోలు ‘నల్ల’గా మారిపోయారు. క్యారెక్టర్‌కి తగ్గట్టు బ్లాక్ మేకప్‌తో కనిపించడానికి రెడీ అయ్యారు. ఫస్ట్ లుక్ అంటూ విడుదలైన ఆ పోస్టర్లను చూసి, అభిమానులు ‘బ్లాక్.. కిర్రాక్’ అంటున్నారు. డిఫరెంట్ మేకప్‌తో కొందరు హీరోలు చేస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. ► ప్రభాస్ కటౌట్‌కి ‘కేజీఎఫ్’ ఫేమ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ బ్లాక్ కలర్ పులిమారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న ‘సలార్’ సినిమా కోసమే ప్రభాస్ బ్లాక్ మేకప్ వేసుకున్నారు. రెండు భాగాలుగా విడుదల కానుందని ప్రచారం జరుగుతున్న ఈ సినిమాలో ఇప్పటివరకు ప్రభాస్ రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించారు. రెండు పోస్టర్స్‌లో బ్లాక్ కలర్ నిండుగా ఉంది. తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల్లో ‘సలార్’ సినిమా షూటింగ్ జరిగింది. సో.. ప్రభాస్ బ్లాక్ లుక్స్‌కు కథే కారణమని ఊహించ వచ్చు. వచ్చే ఏడాది సెప్టెంబరు 28న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ► ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ సినిమా షూటింగ్ ఆరంభం కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లో నల్లని మేకప్‌లో ఎన్టీఆర్ ఫెరోషియస్‌గా కనిపించారు. ఇక హీరోగా ఎన్టీఆర్ నెక్ట్స్ చిత్రం కొరటాల శివ డైరెక్షన్లో ఉంటుంది. ఆ తర్వాతే ప్రశాంత్ నీల్‌తో చేసే సినిమా ఆరంభమవుతుంది. ► హీరో నాని నటిస్తున్న తాజా సినిమా ‘దసరా’. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌లో నాని ఫుల్ బ్లాక్ లుక్‌లో కనిపించారు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా, సింగరేణి బొగ్గు గనుల ప్రాంతంలోని ఓ గ్రామం బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథ ఉంటుంది. సో.. ‘దసరా’ ఫస్ట్ లుక్ అలా ఉండటంలో పెద్ద ఆశ్చర్యం లేదు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 30న విడుదల కానుంది. ► కామెడీ హీరోగా, వీలైనప్పుడు ఎమోషనల్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకుల్లో మంచి పేరు సంపాదించుకున్నారు ‘అల్లరి’ నరేశ్. కాగా 2021లో ‘అల్లరి’ నరేశ్ హీరోగా వచ్చిన ‘నాంది’ సినిమాను ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఈ సినిమాకు విజయ్ కనకమేడల దర్శకుడు. ఇప్పుడు ‘అల్లరి’ నరేశ్, విజయ్ కనకమేడల మరో ప్రాజెక్ట్‌కి రెడీ అయ్యారు. ‘ఉగ్రం’ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌లో ఫుల్‌గా మసి పూసుకుని ఉన్నారు నరేశ్. -
మేకప్ లేకుండా.. మిస్ ఇంగ్లాండ్ అందాల పోటీలోకి.. చరిత్రలో తొలిసారి
మామూలుగానే ఆడవాళ్లు అలంకారాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు.. ఇక అందాల పోటీలో పాల్గొనే అతివలైతే మేకప్‌పై మరింత దృష్టి పెడుతుంటారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగే ఏ బ్యూటీ కాంటెస్ట్‌లో అయినా అందానికి మెరుగులు దిద్దుకున్న భామలే కనిపిస్తుంటారు. కానీ లండన్‌కు చెందిన 20 ఏళ్ల మెలీసా రవూఫ్ దశాబ్దాలుగా సాగుతున్న ఈ తంతుకు బ్రేక్ వేసింది. మిస్ ఇంగ్లాండ్ అందాల పోటీలో ఎటువంటి మేకప్ లేకుండా పాల్గొన్న తొలి మహిళగా నిలవడం ద్వారా 94 ఏళ్ల ఈ పోటీ చరిత్రను తిరగరాసింది. తాజాగా ఈ పోటీల ఫైనల్స్ వరకు దూసుకెళ్లింది. వాస్తవానికి 2019లో జరిగిన మిస్ ఇంగ్లాండ్ పోటీలో మేకప్ లేకుండా కంటెస్టెంట్లు పాల్గొనే ఒక రౌండ్‌ను నిర్వాహకులు ఏర్పాటు చేసినప్పటికీ పోటీ ఆసాంతం ఓ యువతి ఇలా మేకప్ లేకుండా పాల్గొనడం ఇదే తొలిసారి. అతివలు అంతఃసౌందర్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని చాటిచెప్పేందుకు.. అడ్వర్టైజర్లు చెప్పే అందం నిర్వచనాలు, కొలమానాలు, ప్రమాణాలను సవాల్ చేసేందుకే మేకప్ లేకుండా ఈ పోటీలో పాల్గొంటున్నట్లు మెలీసా తెలిపింది. ఈ చర్యకుగాను మెలీసాను ప్రపంచవ్యాప్తంగా ప్రశంసిస్తోంది. మిస్ ఇంగ్లాండ్ కిరీటం కోసం అక్టోబర్ 17న జరిగే ఫైనల్స్‌లో మరో 40 మందితో మెలీసా పోటీపడనుంది. -
సూర్య ‘రోలెక్స్ సర్’ అంత బాగా ఎలా పేలాడు?
తెరపై కనిపించింది జస్ట్ కొన్ని నిమిషాలు.. అయినా థియేటర్లు దద్దరిల్లిపోయేలా చేశాడు నటుడు సూర్య. కమల్ హాసన్ ‘విక్రమ్’ సినిమాలో క్లైమాక్స్‌లో వచ్చే రోలెక్స్ క్యారెక్టర్ ఎంత బ్రహ్మాండంగా పేలిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రెడిట్ లోకీ అలియాస్ దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌కే దక్కుతుంది. కమల్ హాసన్ విక్రమ్ సినిమాలో సూర్య రోల్ ఎవరూ ఊహించనిది. చాలా స్పెషల్‌గా.. అంతే క్రూరంగా డిజైన్ చేశాడు ఆ క్యారెక్టర్‌ను. ముందస్తు ప్రకటన లేకుండా సైలెంట్‌గా షూటింగ్ పూర్తి చేశాడు డైరెక్టర్ లోకేశ్. ఫొటోలు లీక్ కాకుంటే.. ఆ విషయం కూడా బయటకు పొక్కేది కాదు. అయితేనేం సినిమా అంతా ఒక ఎత్తు అయితే.. క్లైమాక్స్‌లో వచ్చే సూర్య పోర్షన్ సినిమాకే హైలెట్‌గా నిలిచింది. రగ్గ్డ్ లుక్, రక్తపాతంతో టెర్రిఫిక్ విలనిజం పండించాడు సూర్య. చేసింది కామియో అయినా మంచి ఇంపాక్ట్ చూపించింది ఆ క్యారెక్టర్. అంతేకాదు.. సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ప్రతీరోజూ ట్విటర్లో ‘రోలెక్స్’ ‘రోలెక్స్ సర్’ హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. అయితే ఆ లుక్ వెనుకాల ఉంది ఎవరో సోషల్ మీడియాలో రివీల్ చేశాడాయన. చెక్క చివంత వానం, కాట్రూ వెలియిదై, ఇరుది సూట్రూ చిత్రాలకు పని చేసిన మేకప్ ఆర్టిస్ట్ సెరినా టిక్సియెరా.. సూర్య మేకోవర్‌కు కారణం. అందుకే ఆమెతో ఉన్న ఫొటోను షేర్ చేసి కృతజ్ఞతలు తెలియజేశాడు. సూర్య గతంలో 24 సినిమాలో నెగెటివ్ రోల్ చేసినా.. విక్రమ్ రోలెక్స్ మాత్రం టాప్ నాచ్ అనే చెప్పొచ్చు. అందుకే ఆయన అభిమానులు కూడా రోలెక్స్‌ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఖైదీ-2లో అన్నదమ్ములు కార్తీ-సూర్యల మధ్య పోరు కోసం ఎదురు చూస్తున్నారు. View this post on Instagram A post shared by Suriya Sivakumar (@actorsuriya) చదవండి: రోలెక్స్‌కు రోలెక్స్ తొడిగిన లోకనాయకుడు -
అమ్మో! ఈ రోజు నా పెళ్లి.. ఏడవాలి, మేకప్‌కు ఏం కాదు కదా!
అమ్మాయిలకు తయారవ్వడానికి మించిన పెద్ద పని మరొకటి ఉండదు. అందరిలోనూ అందంగా కనిపించేందుకు తెగ ఆరాటపడుతుంటారు. అందరికంటే ముందు రెడీ అవ్వడం మొదలు పెట్టినా.. చివరి వరకు కూడా మెరుగులు దిద్దుతూనే ఉంటారు.. జనరల్‌గానే అమ్మాయిలకురెడీ అవ్వడమంటే పిచ్చి.. ఇక పెళ్లిళ్లు, ఫంక్షన్లకు ఎంతలా తయారవుతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే పెళ్లి కోసం రెడీ అవుతున్న ఓ పెళ్లి కూతురు తన మేకప్ ఆర్టిస్ట్‌తో చెప్పిన మాటలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. చదవండి: రిసెప్షన్‌కు వింతైన ఆహ్వానం.. రూ. 7 వేలు తీసుకుని రావాలంటూ ఏకంగా.. అస్మిత అనే యువతి తన పెళ్లి రోజు కావడంతో అందంగా ముస్తాబవుతోంది. ఆమెను మేకప్ ఆర్టిస్ట్ సుందరంగా తీర్చిదిద్దుతున్న సమయంలో పెళ్లికూతురికి ఓ సందేహం వచ్చింది. ‘నేను వేసుకుంది వాటర్ ప్రూఫ్ మస్కరానేనా. ఏడిస్తే మేకప్ చెదిరిపోదు కదా’ అని ప్రశ్నించింది. దీనికి ఆమె అవును అని సమాధానం ఇస్తూ అస్మిత ఏడవాలి కాబట్టి అలా అడుగుతున్నావా అని ప్రశ్నించింది. దీంతో ‘అవును నేను చాలా ఏడ్వాలి’ అని పెళ్లికూతురు క్యూట్‌గా బదులిచ్చింది. అంతేగాక తను చాలా ఏడవాలని, లేకపోతే తన తల్లి కొడుతుందని చెబుతోంది. వరల్డ్ ఆఫ్ బ్రైడ్స్ అనే ఇన్‌స్టా పేజీ ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఈ ఫన్నీ వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్‌గా మారింది. చదవండి: ఫోన్ నాది.. కాదు నాది ఇచ్చేయ్: వైరలవుతోన్న క్యూట్ వీడియో View this post on Instagram A post shared by World of Brides 🧿 (@world_of_brides_) -
'సిల్క్ స్మిత'ను చూసి శ్రీదేవి కూడా ఫాలో అయ్యేది : బాలకృష్ణ
Balakrishna About Silk Smitha : సిల్మ్ స్మిత..ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శృంగార తారగా స్టార్ డం తెచ్చుకున్న సిల్మ్ స్మిత రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలందరితో నటించారు. గ్లామర్ పాత్రలతో అలరించిన ఆమె తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ సహా పలు భాషల్లో 450కి పైగా సినిమాల్లో నటించారు. అప్పటివరకు కేవలం గ్లామరస్ డాల్‌గానే గుర్తింపు పొందిన ఆమె ఆదిత్య 369 సినిమాలో కీలకపాత్ర పోషించి నటిగా గుర్తింపు పొందారు. ఇటీవలె ఈ సినిమా విడుదలై 30 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ చిత్ర విశేషాలపై బాలకృష్ణ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. సిల్క్ స్మిత గురించి మాట్లాడుతూ..'ఆమెకు తెలుగు రాకపోవడంతో ఇంగ్లీషులో డైలాగ్ పూర్తిచేసింది. షాట్ అయ్యాక ఓకేనా సార్ అని డైరెక్టర్ని అడిగే సరికి అందరూ బిత్తరపోయారు. నువ్ మాట్లాడింది ఇంగ్లీష్ తల్లీ.. అని ఆ డైరెక్టర్ చెప్పడంతో సెట్లో అంత నవ్వుకున్నాం. ఇక మేకప్, కాస్ట్యూమ్స్ విషయంలో సిల్క్ స్మితను కొట్టిన ఆడదే లేదు. ఎందుకంటే శ్రీదేవి వంటి స్టార్ హీరోయిన్లు సైతం సిల్మ్ స్మిత కాస్ట్యూమ్స్, మేకప్‌ని ఇమిటేట్ చేసేది. ఒక డ్యాన్సర్‌ని స్టార్ హీరోయిన్లు సైతం ఫాలో కావడం అంటే అది మామూలు విషయం కాదు' అంటూ బాలకృష్ణ సిల్క్ స్మితపై ప్రశంసలు కురిపించారు. -
పుష్ప కోసం నల్లబడటానికి రెండు గంటలు
బాగా ఎండల్లో తిరిగినప్పుడు చర్మం రంగు మారిపోతుంది. స్కిన్ ట్యాన్ అయిపోతుంది. నల్లగా మారుతుంది. ఇప్పుడు అల్లు అర్జున్ చర్మం అలానే మారింది. అయితే ఇది మేకప్ మాయ. ‘పుష్ప’ సినిమాలో లారీ క్లీనర్ పాత్ర చేస్తున్నారు అల్లు అర్జున్. అసలు సిసలైన క్లీనర్‌గా కనబడటానికి ప్రత్యేకంగా మేకప్ చేయాల్సి వస్తోంది. షూటింగ్ ఉన్న ప్రతిరోజూ రెండు గంటలు మేకప్‌కి పడుతోంది. తీయడానికి గంటన్నర పడుతోంది. కనుబొమ్మలు, జుట్టు, మీసాలు, చర్మం రంగు.. ఇలా పత్రిదానికీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మేకప్ చేస్తున్నారు. అలాగే సినిమాలో చాలావరకూ అల్లు అర్జున్ లుంగీ, షార్ట్స్‌లోనే కనబడతారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ తమిళనాడులోని తెన్‌కాశీలో జరుగుతోంది. యాక్షన్ సీక్వెన్స్, పాట చిత్రీకరిస్తున్నారు చిత్రదర్శకుడు సుకుమార్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 13న విడుదల కానుంది. చదవండి: దృశ్యం 2: అజయ్ కూడా తప్పించుకుంటాడు ‘అలా నటించడం ఆనందంగా ఉంది’ -
సోనాలీ బింద్రే ఆసక్తికర పోస్ట్
ముంబై: ఇంద్ర మూవీ ఫేమ్ సోనాలీ బింద్రే లాక్ డౌన్లో ఇంటికే పరిమితమైంది. అయితే సినిమాల పట్ల సోనాలీకి మాత్రం ఏ మాత్రం ఆసక్తి తగ్గలేదు. ఇటీవలే క్యాన్సర్‌ను జయించి, సమాజానికి ప్రేరణగా సోనాలీ నిలిచారు. ప్రస్తుతం సోనాలి బింద్రే షూటింగ్లో పాల్గొంటున్నారు. కరోనా నేపథ్యంలో సినిమా లొకేషన్లోకి వెళ్లే ముందు శానిటైజ్ చేసుకొని, శరీర ఉష్ణోగ్రతలను చెక్ చేసుకొని, పీపీఈ కిట్లను ధరించి మేకప్ వేయించుకుంది. కాగా సోనాలీ షూట్‌కు వెళ్లిన దృశ్యాల వీడియోను సోనాలీ షేర్ చేసింది. బ్యాక్ టు వర్క్ షూట్ డే(షూటింగ్లో పాల్గొంటు పనిలో నిమగ్నమయ్యాను) అంటూ సోనాలీ షేర్ చేసిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చదవండి: లాక్డౌన్ నాకు కొత్త కాదు! -
ధోనికి జీవా మేకప్
న్యూఢిల్లీ: ధనాధన్ ఆటతో క్రికెట్‌కు దూరమైన ధోని అభిమానులకు ఓ పాత వీడియో కొంత ఊరటనిస్తోంది. అతని గారాల తనయ జీవాతో తను తీర్చుకునే అచ్చట, ముచ్చట సామాజిక మాధ్య మాల్లో ధోని పంచుకుంటాడు. అయితే ధోనికి జీవా మేకప్ వేసే ఈ వీడియో మాత్రం అతను షేర్ చేయ లేదు. అతని మేకప్ ఆర్టిస్ట్ సప్న భవ్నానీ ఈ పాత వీడియోను పోస్ట్ చేసింది. జీవా తన చిట్టిపొట్టి చేతులతో తండ్రికి మెరుగులు దిద్దింది. ‘అందరికీ ముద్దొచ్చే మేకప్ ఇది. దీంతో నా ఉద్యోగానికి (మేకప్ ఆర్టిస్ట్) త్వరలోనే ఎసరొచ్చేలా ఉంది! మహి... మిస్ యూ దోస్త్’ అని ట్వీట్ చేసింది. ఇదిలావుండగా మాయదారి మహమ్మారి ప్రాణాల్ని తోడేస్తోంది. అలాగే ఎందరో ఆశల్ని చిదిమేస్తోంది. ఇప్పుడు ధోని అభిమానుల పట్ల అదే పని చేసింది. గత ప్రపంచకప్ సెమీస్ తర్వాత మాజీ కెప్టెన్ మహి మళ్లీ బరిలోకి దిగలేదు. కనీసం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అయినా ఆడలేకపోతాడా అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూశారు. కానీ కరోనా వైరస్ లీగ్‌ను జరగనివ్వడం లేదు. -
బ్యూటీరియా
మేకప్ చేసుకుంటున్నారు బాగానే ఉంది. వాటి ఎక్స్పైరీ డేట్లు చూస్తున్నారా? పోనీ.. వాడిన బ్రష్‌లను, స్పాంజ్‌లను ఎన్నడైనా శుభ్రం చేశారా? లేదంటున్నారా! అయితే మీరు చిక్కుల్లో పడినట్లే. ఎందుకంటే.. ఇలాటి వాటిల్లో హానికారక బ్యాక్టీరియాలు బోలెడు ఉండిపోతాయి అంటోంది ఓ తాజా అధ్యయనం! మేకప్‌కు ఉపయోగించే వాటిల్లో కనీసం 90 శాతం వాటిల్లో స్టాఫైలోకాకస్ ఔరియస్, ఈ–కోలీ, సిట్రో బ్యాక్టర్ ఫ్రెండీ వంటి హానికారక బ్యాక్టీరియా ఉంటుందని యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ఆస్టన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు అధ్యయన పూర్వకంగా తెలుసుకున్నారు. ఇవన్నీ ఒకసారి వాడిన మేకప్ సామగ్రిలో మాత్రమే ఉండేవే అయినప్పటికీ, అలా ఉన్నట్లు తెలియకపోవడం వల్ల సమస్యలు వచ్చే అవకాశముందని ఈ అధ్యయనాన్ని నిర్వహించిన శాస్త్రవేత్త అమ్రీన్ బషీర్ తెలిపారు. అధ్యయనం కోసం తాము లిప్‌స్టిక్, లిప్‌గ్లాస్, ఐ లైనర్, మస్కారాలను ఎంచుకున్నామని, వీటిల్లో నీటి మోతాదు ఎంత ఎక్కువ ఉంటే బ్యాక్టీరియా సంతతి అంత ఎక్కువగా ఉన్నట్లు తెలిసిదని చెప్పారు. ఫౌండేషన్, కాంటూరింగ్ల కోసం వాడే బ్లెండర్ స్పాంజిల్లో పరిస్థితి మరీ దారుణమని అన్నారు. మొత్తమ్మీద తాము 467 ఉత్పత్తులను పరిశీలించామని వీటిల్లో 96 లిప్‌స్టిక్‌లు కాగా, 92 ఐ లైనర్లు, 93 మస్కారా ప్యాకెట్లతోపాటు 107 లిప్ గ్లాస్లు, 79 బ్లెండర్ స్పాంజిలు ఉన్నాయని వివరించారు. మేకప్ ఉత్పత్తుల్లో సూక్ష్మజీవులు అస్సలు ఉండరాదని నిబంధనలు చెబుతున్నాయని గుర్తు చేశారు. ఒక ప్రశ్నపత్రం ద్వారా తాము మేకప్ సామాగ్రిలో బ్యాక్టీరియా ఎలా చేరుతోందో తెలుసుకునే ప్రయత్నం చేశామని, అందుకు వాడకందారులదే ఎక్కువ బాధ్యతని తేలిందని అన్నారు. ప్రతి మేకప్ సామగ్రికీ ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుందని, వినియోగదారులు పట్టించుకోకపోవడం వల్ల ఆ సమయం తరువాత బ్యాక్టీరియా పెరగడం ప్రారంభమవుతుందని అమ్రీన్ వివరించారు. మీరు ఉండే ప్రాంతా న్ని బట్టి ఈ విషయాన్ని తయారీదారులు తెలియజేసే పద్ధతి ఉంటుంది. అమెరికాలోనైతే ప్యాకేజింగ్‌పైనే ఈ సమాచారం ప్రింట్ చేస్తారు. 2013లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం చాలామంది ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తరువాత కూడా మేకప్ సామగ్రిని చెత్తబుట్టలోకి పడేయడం లేదని వెల్లడైంది. బ్లెండర్ స్పాంజిల విషయంలో తేలిందేమిటంటే.. 93 శాతం మంది వీటిని ఎప్పుడూ శుభ్రం చేసుకోరూ అని! నేలపై పడిన తరువాత కూడా వాటిని అలాగే వాడేస్తామని 65 శాతం మంది ఒప్పుకున్నారు. వీలైనంత వరకూ ఈ బ్లెండర్ స్పాంజిలను గోరువెచ్చటి నీటిలో, సబ్బులతో శుభ్రం చేసుకోవడం మేలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పరిశోధన వివరాలు అప్లయిడ్ మైక్రోబయాలజీ తాజాసంచికలో ప్రచురితమయ్యాయి. -
పెళ్లికి మేకప్!
పెళ్లి కూతురు మేకప్, అలంకరణ మిగతావారికన్నా భిన్నంగా ఉంటుంది. నిద్రలేమి, ఒత్తిడి కారణంగా కళ్ల కింద చర్మం ఉబ్బు ఉంటే తగ్గడానికి గోరువెచ్చని టీ బ్యాగ్‌తో కొద్దిసేపు కాపడం పెట్టాలి. మేకప్ చేసుకునేముందు ఫేస్ వాష్‌తో ముఖాన్ని ఒకసారి శుభ్రం చేసుకోవాలి. ►ఏ తరహా స్కిన్ షేడ్ నప్పుతుందో మేనిచాయను బట్టి ఎంపిక చేసుకోవాలి. అలాగే సరైన ఫౌండేషన్, ప్రైమర్, కన్సీలర్ను ఎంచుకోవాలి. ►ముఖానికి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ►బేస్‌గా ప్రైమర్‌ని ముఖమంతా రాయాలి. దీంతో మొటిమల వల్ల అయిన మచ్చలు, ఫైన్ లైన్స్, ముడతలు కనిపించవు. ఎక్కువ సమయమైనా మేకప్ పాడవకుండా ఉంటుంది. అలాగే ఫౌండేషన్ ప్యాచులుగా చర్మానికి పట్టే సమస్య కూడా ఉత్పన్నం అవదు. ►ప్రైమర్ రాసిన తర్వాత ఫౌండేషన్‌ని అప్లై చేయాలి. అలాగే కంటికి ఐ షాడోస్ ఉపయోగించాలి. ►చామన చాయ గలవారు బుగ్గలకు బ్రోంజర్ని అప్లై చేయాలి. ►ఈ కాలం త్వరగా పెదాలు పొడిబారే అవకాశం ఉంటుంది కాబట్టి పెదాలకు లిప్‌స్టిక్ వాడిన తర్వాత లిప్‌గ్లాస్‌ను ఉపయోగించాలి. పెదాలు సన్నగా ఒంపుతిరిగి కనిపించాలంటే లిప్ పెన్సిల్‌తో ఔట్లైనర్ గీసి ఆ తర్వాత లిప్‌స్టిక్ వేయాలి. ►డార్క్ ఐ లైనర్‌తో కళ్లను తీర్చిదిద్దాలి. అలాగే కనుబొమలను కూడా! ►మెరుపుల కోసం ఏ ఇతర గ్లిటర్స్ని ఉపయోగించకపోవడమే మంచిది. ►ముఖంలో కనిపించేవి ముందు పెదాలు, కళ్లు మాత్రమే. అందుకే లిప్‌స్టిక్, ఐ షాడో, మస్కారాలను చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. ►షేడ్స్, గ్లిటర్స్ అంటూ అతిగా మేకప్ అయితే మిగతా అలంకరణ కూడా అంతగా నప్పదు. -
పాత్రకు మౌల్డ్ అవుతున్నారు
ఒకప్పుడు మేకప్ మీద శ్రద్ధ దక్షిణాదిలో కమలహాసన్‌కే ఉండేది.సాగర సంగమంలో సహజమైన ముసలిరూపం చూపడానికి ఆయన మేకప్ శ్రద్ధే కారణం.భామనే సత్యభామనే, భారతీయుడు సినిమాలతో ఆయనే ప్రోస్థెటిక్ మేకప్‌ను ప్రవేశపెట్టాడు.ఇప్పుడు పాత్రను మౌల్డ్ చేయడానికి ప్రతి ఆర్టిస్ట్ మేకప్నుఆశ్రయిస్తున్నాడు. జనానికి నచ్చుతున్నాడు. సినిమా అంటేనే ట్రిక్కు. ప్రేక్షకుడిని మాయ చేయడానికి ట్రిక్కీగా రకరకాల కథలు అల్లుతారు. రకరకాల పాత్రలు సృష్టిస్తారు. విచిత్రమైనవి. వీరోచితమైనవి. అందమైనవి. అందవిహీనమైనవి. ఈ పాత్రల్లోకి ప్రేక్షకుడిని లీనం చేయడానికి నటులు కొన్నిసార్లు సన్నబడతారు. పాత్ర బరువువైనది అయితే బరువు పెరుగుతారు. కుదరని పక్షంలో ‘ప్రోస్థెటిక్ మేకప్’ సాయం తీసుకుంటున్నారు. థియేటర్లో ప్రేక్షకుడిని సీట్లో నుంచి కదలనీయకుండా కూర్చోబెట్టడం కోసం, గంటల కొద్దీ మేకప్ చైర్లో కూర్చుని శ్రమిస్తున్నారు. ఈ ప్రోస్థెట్రిక్కులను ఉపయోగించే ‘భారతీయుడు’ లో కమల్‌హాసన్ వయసుని అమాంతం ఎనభైకి తీసుకెళ్లగలిగారు. ఈ ట్రిక్కే మొన్న ‘2.0’లో అక్షయ్ కుమార్‌ని పక్షిరాజాలా మార్చింది. ప్రస్తుతం ఈ ‘ప్రోస్థెట్రిక్’తో చాలామంది నటీనటులు విభిన్న గెటప్పుల్లో కనిపించనున్నారు. ఆ మేకప్ మాయను తెలుసుకుందాం. జయలా ఎలా? జయలలిత చాలా ప్రఖ్యాత నటి, అంతే గొప్ప ప్రజానేత. కంగనా రనౌత్ సమర్థమైన నటి. అందుకే జయ బయోపిక్‌లో ఆమెకు భారీ పారితోషికం ఇచ్చి తీసుకున్నారు చిత్రనిర్మాత విష్ణు ఇందూరి. అయితే కంగనా ఏ కోశానా జయలా ఉండరు. కొద్దిపాటి ప్రాక్టీస్‌తో కంగన జయలా నటించవచ్చు. కానీ కనిపించడమెలా? కంగారేం లేదు. ఇలాంటి ప్రాబ్లమ్స్‌కే ప్రోస్థెటిక్ ఉంది. జయలలితలా మారడానికి లాస్ ఏంజెల్స్‌లో ప్రోస్థెటిక్కి సంబంధించిన లుక్ టెస్ట్ చేయించుకున్నారు కంగనా. సినిమాలో నాలుగు గెటప్పుల్లో ఆమె కనిపిస్తారని తెలిసింది. ఈ చిత్రానికి ఏఎల్ విజయ్ దర్శకుడు. ‘‘ప్రోస్థెటిక్ మేకప్‌ను పూర్తి స్థాయిలో తొలిసారి ఉపయోగిస్తున్నాను. నా పాత్ర మీద, హావభావాల మీద ఈ మేకప్ ఎంత ప్రభావం చూపుతుందో తెలియదు. కానీ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’ అని లుక్ టెస్ట్ గురించి అన్నారు కంగనా. ముక్కు పిండే ఓనర్ ‘గులాబో సితాబో’ సినిమాలో అమితాబ్ బచ్చన్ లుక్ చూస్తే ‘ముక్కు’న వేలేసుకోకుండా ఉండలేం. సుజిత్ సర్కార్ తెరకెక్కించిన చిత్రం ‘గులాబో సితాబో’. అమితాబ్, ఆయుష్మాన్ ఖురానా నటించారు. ఇంటిగల వాళ్లకి, ఇంట్లో అద్దెకు ఉండేవారికి మధ్య రోజూవారి సమస్యలను ఇతివృత్తంగా తీసుకొని ఈ చిత్రాన్ని రూపొందించారు. ముక్కు పిండి అద్దె వసూళ్లు చేసే ఇంటి యజమాని పాత్రలో అమితాబ్ కనిపిస్తారు. ఈ సినిమాలో బారు ముక్కుతో కనిపిస్తారు అమితాబ్. ఇది ప్రోస్థెట్రిక్కే అని మనకు తెలిసిందే. అమితాబ్ వయసు 76. ఈ వయసులో దాదాపు మూడు గంటలు కదలకుండా మేకప్ చేయించుకోవడం అంటే చిన్న విషయం కాదు. కానీ ‘బిగ్ బి’ కదా.. ఆయనకు చిన్న విషయంగానే అనిపించింది. అన్నట్లు అమితాబ్ ప్రోస్థెటిక్ మేకప్ ఉపయోగించడం ఇది తొలిసారి కాదు. గతంలో పా, థగ్స్ ఆఫ్ హిందూస్తాన్, 102 నాట్ అవుట్ చిత్రాలకు కూడా వాడారు. ‘గులాబో సితాబో’ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్ చేయనున్నారు. ఆత్మస్థైర్యమే అందం బాలీవుడ్ బ్యూటీక్వీన్ దీపికా పదుకోన్. స్టార్ హీరోల్లానే బాక్సాఫీస్ దగ్గర టికెట్లు తెంచగలిగే ఫాలోయింగ్ ఉన్న స్టార్ ఆమె. ఇప్పటివరకూ అందమైన పాత్రలను అద్భుతంగా పోషించిన దీపిక, ఇప్పుడు ఆత్మస్థైర్యాన్ని స్క్రీన్ మీద చూపించడానికి సిద్ధపడ్డారు. ఢిల్లీ యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా రూపొందిన ‘చెప్పాక్’లో ఆమె నటించారు. మేఘన గుల్జార్ దర్శకురాలు. యాసిడ్ శరీరాన్ని కాల్చిందేమో కానీ ఆత్మస్థైర్యాన్ని కాదని ప్రేరణగా నిలిచిన లక్ష్మీగా దీపిక నటించారు. ఈ పాత్ర కోసం ప్రోస్థెటిక్ మేకప్‌ను ఉపయోగించి ఆ లుక్ తీసుకువచ్చారు. మేకప్‌కే దగ్గర దగ్గర నాలుగు గంటలు పట్టేదట. తీయడం కూడా అంత సులువు కాదు. గంటకు పైనే పట్టేదట. ఈ చిత్రం ఫస్ట్ లుక్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. వచ్చే ఏడాది జనవరి 10న ఈ చిత్రం రిలీజ్. సేనాపతి ఈజ్ బ్యాక్ ప్రోస్థెటిక్ను పూర్తి స్థాయిలో పాపులర్ చేసింది ‘భారతీయుడు’ (1996) సినిమా అనడంలో ఎటువంటి సందేహం లేదు. అందులో కమల్‌హాసన్, సుకన్య పాత్రలను వృద్ధులుగా హాలీవుడ్ టెక్నీషియన్లతో నమ్మించారు. ఆ సినిమాలో క్రాఫ్‌ని కుడి చేత్తో వెనక్కి దువ్వే సేనాపతి మనకు గుర్తే. ఇప్పుడు మళ్లీ ఆ పాత్రను తిరిగి తీసుకొస్తున్నారు శంకర్. 23 ఏళ్ల తర్వాత కమల్ – శంకర్ కాంబినేషన్లో ‘భారతీయుడు’ చిత్రానికి సీక్వెల్ రూపొందుతోంది. ఈ సినిమాలోనూ కమల్ వృద్ధుడిగా నటిస్తున్నారు. ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, రకుల్, సిద్ధార్థ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. 2021లో సినిమా రిలీజ్ కానుంది. గురి తప్పరు టాప్ ఫామ్‌లో ఉన్న హీరోయిన్లు ముద్దు ముద్దుగా ఉండే పాత్రలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. కానీ వయసు మళ్లిన పాత్రలు చేయడానికి సాహసించరు. అయితే తాప్సీ, భూమీ పెడ్నేకర్ ఈ రిస్క్ తీసుకున్నారు. ‘సాండ్‌కీ ఆంఖ్’ చిత్రంలో ఎనభై ఏళ్ల వృద్ధురాళ్ల పాత్రలో నటించారు తాప్సీ, భూమి పెడ్నేకర్. అరవై ఏళ్లు పైబడిన తర్వాత గన్ షూటింగ్ ప్రాక్టీస్ ప్రారంభించి షార్ప్ షూటర్స్‌గా పేరు పొందారు ప్రకాషీ తోమర్, చంద్రో తోమర్. వారి జీవితం ఆధారంగా ‘సాండ్‌కీ ఆంఖ్’ చిత్రం రూపొందింది. ఇందులో ప్రకాషీగా తాప్సీ, చంద్రో పాత్రను భూమి చేశారు. అక్టోబర్ 25న థియేటర్స్‌లోకి రావడం వీళ్ల టార్గెట్. బాలా.. జుట్టు గోల విభిన్న స్క్రిప్టులు ఎంచుకోవడం ఆయుష్మాన్ స్టయిల్. రోజూవారీ మనం తరచూ చూసే సమస్యలే ఆయన సినిమాల్లోని కథలు. అవే ఆయన వరుస సక్సెస్‌లకు కారణాలు. తాజాగా బట్టతలకు సంబంధించిన బ్యాక్‌డ్రాప్‌ను తన సినిమాకు ఎంచుకున్నారు ఆయుష్మాన్. చిన్న వయసులోనే జుట్టు ఊడిపోయి బట్టతల సమస్యలను ఎదుర్కొంటున్నారు చాలామంది. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్‌తో ‘బాలా’ సినిమా తెరకెక్కుతోంది. ఆయుష్మాన్ ఖురానా బట్టతల ఉన్న వ్యక్తిగా కనిపిస్తారు. నవంబర్‌లో ఈ సినిమా విడుదల కానుంది. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు. – గౌతమ్ మల్లాది ప్రోస్థెటిక్ మేకప్ విధానం ఏంటి? ప్రోస్థెటిక్ మేకప్‌ని స్పెషల్ మేకప్ ఎఫెక్ట్ అని కూడా అంటారు. దీని కోసం నటుని శరీర కొలతలను ప్రోస్థెటిక్కి వాడే పదార్థాలతో తీసుకుంటారు. ఆ మౌల్డ్ ఆధారంగా కావాల్సిన రూపురేఖలను తయారు చేస్తారు. కావాల్సిన సన్నివేశాల్లో ఈ మాస్క్‌ను ధరించి నటీనటులు నటిస్తారు. ఈ మేకప్ కొలతలు ఇవ్వడానికి కొన్ని గంటల పాటు ఏ పనీ చేయకుండా అలా మేకప్ సీట్లో కూర్చుని ఉండాల్సిందే. షూటింగ్లో ఈ మేకప్ ద్వారా ఎలర్జీలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సినిమాలో ఆ పాత్ర నిడివి బట్టి ప్రతిరోజూ రెండుమూడు గంటలు మేకప్‌కే కేటాయించాలి. మేకప్ వేసుకున్న తర్వాత తినటానికి వీలుండదు. ప్యాకప్ చెప్పాక కూడా మేకప్ తీయడానికి రెండు మూడు గంటలు టైమ్ పడుతుంది. వీళ్లింత కష్టపడి ఆ కుర్చీల్లో గంటల తరబడి కూర్చునేది థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడికి వినోదం అందించడానికే. మేకప్‌తో నటీనటులు మారిపోతారు. వాళ్లను చూసి ప్రేక్షకులు మైమరిచిపోతారు. -
మేకప్‌తో మెరుగులు
వస్త్రధారణకు తగ్గట్టు మేకప్ ఉంటేనే అందంగా కనిపిస్తారు. అయితే, మేకప్ ఎలా ఉండాలంటే... ►సమకాలీన పరిస్థితులను అనుసరిస్తూ ఫ్యాషన్‌లోనూ, మేకప్‌లోనూ ట్రెండ్స్‌ను పరిశీలిస్తూ మేనికి నప్పే సౌందర్య ఉత్పత్తులను మాత్రమే ఎంచుకోవాలి. ►మేకప్‌లో ఫౌండేషన్‌ను ఎక్కువ ఉపయోగిస్తుంటారు. దీని వల్ల జిడ్డు చర్మానికి ఫౌండేషన్ మరింతగా అతుక్కుపోయి, సహజకాంతిని దూరం చేస్తుంది. ►పెదవులకు ముదురు రంగు లిప్‌స్టిక్‌లను వాడితే వయసు పైబడినట్టుగా చూపిస్తాయి. అసహజంగానూ కనిపిస్తాయి. తప్పనిసరై ముదురు రంగు లిప్‌స్టిక్ వాడితే, పైన లిప్‌గ్లాస్ సహజసిద్ధమైనది ఎంచుకోవాలి. ►మేకప్ అంటే పెదవులకు గాఢమైన ముదురు రంగు, కనురెప్పలకు మెరుపులద్దే షిమ్మర్‌ని ఉపయోగించాలనుకోకూడదు. ముఖంలో పెదవులు, కళ్లు, బుగ్గలు.. ఇలా ప్రతి భాగాన్ని అత్యంత జాగ్రత్తగా చిత్రకారుడు బొమ్మను గీసినంత అందంగా తీర్చిదిద్దాలి. ►ఎప్పుడైనా ముఖం సహజమైన మెరుపుతో కనిపించాలి. ఇందుకోసం అత్యంత తక్కువ మేకప్‌ను ఎంచుకోవాలి. -
అలంకరణ
ఈ సమ్మర్లో అమ్మాయిల మేకప్ ట్రెండ్ మారిపోయింది. ఎప్పుడూ కనిపించే బ్లాక్ క్యాట్ ‘ఐ’ లా కాకుండా, నియాన్ ఐ లైనర్ల ఎలక్ట్రిక్ షేడ్‌తో టీనేజ్ అమ్మాయిలు పార్టీలలో, ఫ్యాషన్ వీక్‌లలో ప్రత్యేకంగా కనిపిస్తున్నారు. ప్రముఖ ఫ్యాషన్ పత్రిక ‘ఎల్’ (ఇ.ఎల్.ఎల్.ఇ.) ఇలాంటి ఫ్యాషన్లకు మళ్లీ మళ్లీ ఆదరణ కల్పిస్తూ మోడలింగ్ చేయిస్తుంటుంది. నెట్లోకి వెళ్లి చూస్తే ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న నియాన్ ఐ లైనర్ మీ నగరానికి దగ్గర్లో ఎక్కడ దొరుకుతాయో తెలుస్తుంది. లేదంటే ఆన్లైన్ షాపింగ్ ఉండనే ఉంది. -
మేకప్‌తో మెరుగులు
వస్త్రధారణకు తగ్గట్టు మేకప్ ఉంటేనే అందంగా కనిపిస్తారు. అయితే, మేకప్ ఎలా ఉండాలంటే... ►సమకాలీన పరిస్థితులను అనుసరిస్తూ ఫ్యాషన్‌లోనూ, మేకప్‌లోనూ ట్రెండ్స్‌ను పరిశీలిస్తూ మేనికి నప్పే సౌందర్య ఉత్పత్తులను మాత్రమే ఎంచుకోవాలి. ►మేకప్‌లో ఫౌండేషన్‌ను ఎక్కువ ఉపయోగిస్తుంటారు. దీని వల్ల జిడ్డు చర్మానికి ఫౌండేషన్ మరింతగా అతుక్కుపోయి, సహజకాంతిని దూరం చేస్తుంది. ►పెదవులకు ముదురు రంగు లిప్‌స్టిక్‌లను వాడితే వయసు పైబడినట్టుగా చూపిస్తాయి. అసహజంగానూ కనిపిస్తాయి. తప్పనిసరై ముదురు రంగు లిప్‌స్టిక్ వాడితే, పైన లిప్‌గ్లాస్ సహజసిద్ధమైనది ఎంచుకోవాలి. ►మేకప్ అంటే పెదవులకు గాఢమైన ముదురు రంగు, కనురెప్పలకు మెరుపులద్దే షిమ్మర్‌ని ఉపయోగించాలనుకోకూడదు. ముఖంలో పెదవులు, కళ్లు, బుగ్గలు.. ఇలా ప్రతి భాగాన్ని అత్యంత జాగ్రత్తగా చిత్రకారుడు బొమ్మను గీసినంత అందంగా తీర్చిదిద్దాలి. ►ఎప్పుడైనా ముఖం సహజమైన మెరుపుతో కనిపించాలి. ఇందుకోసం అత్యంత తక్కువ మేకప్‌ను ఎంచుకోవాలి. -
స్వతంత్రత ‘అలంకార’ప్రాయమే!
సాక్షి, సిటీబ్యూరో: మహిళా సాధికారత అన్ని విషయాల్లోనూ ప్రతిబింబించాలి. ఆహార్యం నుంచి మొదలుకుని నిర్ణయాధికారం, స్వతంత్ర ఆలోచన ప్రస్ఫుటంగా కనిపించాలి. నేటి యువతుల్లో ముఖ్యంగా దుస్తులు, అలంకరణ విషయంలో ఎంత వరకు స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారనే అంశంపై నగరంలో ‘సాక్షి’ నిర్వహించిన సర్వేలో వెల్లడైన అంశాలు ఇలా ఉన్నాయి. ♦ 20– 25 ఏళ్ల యువతులతో సర్వే సాగింది. వీరిలో విద్యార్థులు, ఉద్యోగినులు, వివాహితలున్నారు ♦ దుస్తులు, అలంకరణ వస్తువుల కొనుగోలు కోసం 75 శాతం యువతులు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులపైనే ఆధారపడి ఉండగా.. వీటి ఎంపిక విషయంలోనూ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నట్లు 50 శాతం మంది స్పష్టంచేశారు. ♦ 50 శాతం మంది సంప్రదాయ దుస్తులు ఇష్టం అని చెప్పారు. మిగతా వారు పాశ్చ్యాత్య, క్యాజువల్, మోడ్రన్ దుస్తులు ఇష్టమని తెలిపారు. ♦ తమకు నచ్చిన దుస్తులు ధరించడంలో కుటుంబ సభ్యులు ఎలా స్పందిస్తారు అనే ప్రశ్నకు 90 శాతం మంది పాజిటివ్ కామెంట్స్ చేశారు. వీరిలో 20 శాతం మంది తమ భర్త నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతుంటాయని తెలిపారు. 15శాతం మంది తమ సోదరుల నుంచి నెగిటివ్ కామెంట్స్ వస్తాయని, మరో 5 శాతం మంది కుటుంబ సభ్యుల నుంచి ఎటువంటి అభ్యంతరాలు ఉండవని తెలిపారు. ఇందులో కేవలం 4శాతం మంది మాత్రమే తమ వస్త్రధారణ విషయంలో ఎవరి అభిప్రాయాలనూ ఖాతరు చేయమన్నారు. ♦ కుటుంబ సభ్యులతో బయటకు వెళ్లేటప్పుడు ఎలాంటి దుస్తులు ధరిస్తారు.. ఎవరి సలహాలు తీసుకుంటారు..? అనే ప్రశ్నకు 20శాతం మంది తమకు నచ్చినట్లు డ్రెస్ చేసుకుంటామని తెలిపారు. 80శాతం మంది సంప్రదాయ దుస్తులు ధరిస్తామని తెలిపారు. ♦ మిత్రులతో బయటకు వెళ్తున్నప్పుడు 30 శాతం మంది మోడ్రన్‌గా తయారవుతామని, 25 శాతం మంది తమకు నచ్చినట్లు తయారవుతామని చెప్పారు. మిగతా వారు అన్నిరకాల సంప్రదాయ వస్త్రధారణను ఇష్టపడతామని పేర్కొన్నారు. ♦ జుట్టు కత్తిరింపు, జుట్టు స్టైల్ గురించి ఎవరి అనుమతైనా తీసుకుంటారా అనే ప్రశ్నకు 60 శాతం అవుననే చెప్పారు. 10శాతం మంది తమకు జుట్టు కట్ చేసుకోవటం ఇష్టం ఉండదని చెప్పగా, 30 శాతం మంది మాత్రమే ఎవరి అనుమతీ అవసరం లేదన్నారు. ♦ సర్వేలో మొత్తంగా తేలిందేమిటంటే.. వస్త్రధారణ, అలంకరణ విషయాల్లోనగర యువతులు పూర్తి స్వతంత్రంగా లేరని.. కుటుంబ సభ్యులపై ఆధారపడుతున్నారని.. -
బ్యూటిప్స్
మేకప్ వేసుకునేటప్పుడే కాదు తొలగించేటప్పుడూ జాగ్రత్తలు తీసుకోవాలి. సహజమైన పద్ధతిలో మేకప్‌ని తొలగించాలంటే పాలు లేదా పెరుగును ముఖానికి పట్టించి దూదితో తుడిచేయాలి.ఇంట్లోనే ఐ మేకప్ రిమూవర్‌ని తయారు చేసుకోవచ్చు. ఒక పాత్రలో టీ స్పూన్ ఆముదం, టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, టీ స్పూన్ వంటనూనె వేసి మూడూ బాగా కలపాలి. ఈ నూనెను దూదితో అద్దుకుని కంటి చుట్టూ, ఐలైనర్, మస్కారా వాడినచోట సున్నితంగా రుద్దితే ఐ మేకప్ సులభంగా తొలగుతుంది. గోరువెచ్చటి నీటిలో దూది లేదా మెత్తని కాటన్ క్లాత్‌ను ముంచి గట్టిగా పిండాలి. ఆ తడి క్లాత్‌తో మరోసారి ముఖాన్ని తుడవాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి.మేకప్ వేసుకునే అలవాటు ఉన్నవారు బయటకు వెళ్లేటప్పుడు వెంట లిప్‌స్టిక్, బ్లషర్, పౌడర్, దువ్వెన, టిష్యూపేపర్, సేఫ్టీపిన్స్... ఇలాంటివన్నీ ఉండే చిన్న ‘టచ్–అప్’ కిట్‌ని వెంట తీసుకెళ్లాలి. మేకప్ చెదిరినా, తీసివేయాలన్నా తడుముకోవాల్సిన అవసరం ఉండదు. -
‘కరీనా మేకప్ వేసుకుంటే వాడికి నచ్చదు’
కరీనా మేకప్ వేసుకుంటే ఆమె ముద్దుల కుమారుడు తైమూర్ అలీ ఖాన్‌కు నచ్చదట. కానీ తాను ఎలాంటి గెటప్‌లో ఉన్నా పెద్దగా పటించుకోడు అంటున్నారు సైఫ్ అలీ ఖాన్. ప్రస్తుతం ఆయన నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ‘సేక్రెడ్ గేమ్స్’లో నటిస్తున్నారు. ఇందులో ఆయన సిక్కు పోలీసు అధికారి పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి సైఫ్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం సేక్రెడ్ గేమ్స్‌లో రెండో సీజన్ షూటింగ్ ముంబయిలో జరుగుతుంది. ఓ రోజు ఈ షూటింగ్ సెట్‌కు తైమూర్ వచ్చాడు. అప్పుడు నేను టర్బన్, బ్యాండేజ్‌తో ఉన్నాను. నన్ను అలా చూసి వాడు (తైమూర్) ఏం బాధపడలేదు. మరోసారి నేను నవదీప్ సింగ్ సినిమా ‘హంటర్’లో సాధువు పాత్రలో నటిస్తున్నప్పుడు ఆ సెట్‌కు వచ్చాడు. అప్పుడు నేను గెడ్డం, జుట్టుతో ఉన్నా వాడిలో ఏ మాత్రం స్పందన లేదు’ అన్నారు ‘కానీ వాళ్ల అమ్మ సాధారణంగా కాకుండా కొత్త గెటప్‌లో కనిపిస్తే మాత్రం వాడు ఊరుకోడు. వాళ్లమ్మ మేకప్ వేసుకుంటే వాడికి అస్సలు నచ్చదు’ అంటూ చెప్పుకొచ్చారు సైఫ్. ఇటీవల కరీనా ఓ షోలో మాట్లాడుతూ.. ‘తైమూర్‌ను వదిలి వెళ్లాడానికి సైఫ్ చాలా కష్టపడుతుంటాడు. షూటింగ్‌కు వెళ్లమంటే ‘లేదు ఈ రోజు షూట్ క్యాన్సల్ చేస్తాను. వెళ్లను’ అంటాడు. అప్పుడే నేను ‘నువ్వు వెళ్లాల్సిందే’ అని చెప్పి బలవంతంగా బయటికి నెడతాను. సైఫ్‌కు తైమూర్‌తో కలిసి సమయం గడపడం చాలా ఇష్టం’ అన్నారు కరీనా. -
మేకప్ తీశాక గుర్తుపట్టలేక విడాకులు...
అరబ్: కొత్తగా పెళ్లైన దంపతులు ఎంజాయ్ చేద్దామని షార్జాలోని అల్‌మాంజర్ బీచ్‌కు వెళ్లారు. బీచ్‌లో దిగి బయటకు వచ్చాక మేకప్ పోవడంతో భర్త తన భార్యను గుర్తు పట్టలేకపోయాడు. మేకప్‌తో తనను మోసం చేసిందని, ఇప్పుడు ఆమె అందంగా లేదంటూ విడాకులు కోరాడు. ఈ వింత సంఘటన యూఏఈలో వెలుగు చూసింది. 28 సంవత్సరాల వయసున్న ఆ మహిళ డాక్టర్. అబ్దుల్ అజీజ్ అసఫ్ అనే సైకాలజిస్టును కలిసి ఈ విషయం గురించి ప్రస్తావించారు. మహిళ వివరాలను గోప్యంగా ఉంచుతూ ఈ విషయాన్ని గురించిన సమాచారాన్ని గల్ఫ్‌న్యూస్‌కు వెల్లడించారు. పెళ్లికి ముందు జరిగిన పలు సర్జరీలతో పాటు, కంటి చుట్టూ వేసుకున్న మేకప్ విషయాన్ని కూడా అతడి వద్ద దాచిందని ఆ సైకాలజిస్ట్ వెల్లడించారు. దీంతో పెళ్లికొడుకు విడాకులు కోరాడని, చివరకు ఆ మహిళ ముందుకు వచ్చి నిజం చెబుతానని ప్రయత్నించినా అతడిని ఒప్పించలేకపోయామని అన్నారు. వారికి పెళ్లయి ఆరు నెలలు కావడం గమనార్హం. -
సింపుల్ బ్రైడ్ హెయిర్ స్టైల్
వేసుకున్న డ్రెస్‌కు అల్లుకున్న జడ మరింత అందాన్ని తెచ్చిపెడుతుంది. అందుకే చాలా మంది తమ మేకప్‌లో ఎక్కువ సమయం కేశాలంకరణకే కేటాయిస్తుంటారు. అలాంటి వారికోసమే ఈ హెయిర్ స్టైల్. పైగా ఇది సంప్రదాయ దుస్తులకైనా.. మోడ్రన్ డ్రెస్సులకైనా ఇట్టే నప్పుతుంది. మరింకెందుకు ఆలస్యం? ఇలా ప్రయత్నించండి. 1. ముందుగా జుట్టునంతా చిక్కులు లేకుండా దువ్వుకోవాలి. హెయిర్ స్ప్రే చేసుకొని దువ్వుకుంటే జుట్టు మరింత మృదువుగా మారుతుంది. తర్వాత హెయిర్ స్ట్రయిటెనింగ్ చేసుకుని కుడివైపు చెవి తిన్నగా ఉన్న జుట్టును కొద్దిగా తీసుకుని, రెండు పాయలుగా చేసుకుని (చిత్రంలో కనిపిస్తున్న విధంగా) తల మధ్య భాగం వరకూ మెలిపెట్టుకుని టైట్‌గా పట్టుకోవాలి. 2. ఇప్పుడు మెలిపెట్టుకున్న రెండు పాయలను చిత్రంలో కనిపిస్తున్న విధంగా లూజ్ చేసుకోవాలి. అనంతరం ఎడమవైపు కూడా చెవి తిన్నగా ఉన్న జుట్టును కొద్దిగా తీసుకుని, రెండు పాయలుగా చేసుకుని కుడివైపు మెలిపెట్టుకున్నట్టుగానే తల మధ్య భాగం వరకూ మెలిపెట్టుకుని, ఆ మెలిపెట్టుకున్న జుట్టును లూజ్ చేసుకోవాలి. 3. తర్వాత కుడి, ఎడమ వైపుల నుంచి మెలిపెట్టుకున్న జుట్టును మొత్తంగా కలిపి (చిత్రాన్ని ఫాలో అవుతూ) హెయిర్ బ్యాండ్ పెట్టుకోవాలి. ఇప్పుడు జుట్టు చిక్కులు పడకుండా దువ్వెనతో దువ్వుకోవాలి. 4.ఇప్పుడు కుడివైపు చెవి పక్కనున్న జుట్టు మొత్తాన్ని తీసుకుని.. మూడు పాయలుగా చేసుకుని.. జడ అల్లుకుంటూ... ఇంతకు ముందు మెలిపెట్టుకుని బ్యాండ్ పెట్టుకున్న జుట్టులోంచి కుడి భాగాన్ని కూడా(చిత్రాన్ని గమనిస్తూ) అందులో కలుపుకుని జడ అల్లుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఎడమవైపు కూడా అదే మాదిరిగా ఎడమ చెవి పక్కనున్న జుట్టు మొత్తాన్ని తీసుకుని మూడు పాయలుగా చేసుకుని.. జడ అల్లుకుంటూ.. ఇంతకు ముందు మెలిపెట్టుకుని బ్యాండ్ పెట్టుకున్న జుట్టులోంచి ఎడమ భాగాన్ని కూడా(చిత్రాన్ని అనుసరిస్తూ) అందులో కలుపుకుని జడ అల్లుకోవాలి. (కుడి, ఎడమ జడలు అల్లుకుని.. కొంత జుట్టు ఉండగానే హెయిర్ బ్యాండ్ పెట్టుకోవాలి) 5.తర్వాత ఆ జడలను కూడా లూజ్ చేసుకోవల్సి ఉంటుంది. లూజ్ చేసుకునే సమయంలో జుట్టు తెగిపోకుండా, పాయలు రేగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 6.ఇప్పుడు కుడివైపు జడను ఎడమవైపునకు చిత్రంలో చూపిస్తున్న విధంగా పెట్టుకుని.. ఊడిపోకుండా ఉండేందుకు హెయిర్ పిన్స్ పెట్టుకోవాలి. ఆ సమయంలో జడ చివర భాగాన్ని మడిచి పైకి రాకుండా చూసుకోవాలి. అనంతరం ఎడమవైపు జడను కూడా అదేవిధంగా వ్యతిరేక దిశలో కుడివైపునకు తిప్పుకుని హెయిర్ పిన్స్ పెట్టుకోవాలి. -
పరుగో పరుగు!
సినిమాలు అంతగా లేని, టీవీ సీరియల్స్ అసలే లేని రోజులవి.మా ఊరి పురోహితులు రాత్రి అవగానే ఎవరి అరుగుల మీద వాళ్లు కూర్చొని భారతంలోని పద్యాలను రాగయుక్తంగా పాడుతూ అర్థాలు చెప్పేవాళ్లు. వావిళ్ళ రామస్వామిశాస్త్రులు ప్రచురించే నాటకాల పుస్తకాలను మద్రాస్ నుంచి తెప్పించి మా నాన్నగారు నాటకీయంగా చదివి వినిపించేవారు. ‘శ్రీకృష్ణ తులాభారం’ ‘ద్రౌపదీ వస్త్రాపహరణం’‘కురుక్షేత్రం’ ‘సతీసావిత్రి’ వంటి నాటకాలు ఇందులో ఉండేవి.కంగుంది కుప్పం అనే ఊరికి చెందిన నాటక ట్రూపు మా ప్రాంతమంతా తిరిగి టికెట్‌పై నాటకాలు ఆడేవారు. ఆరోజుల్లో స్త్రీ పాత్ర స్త్రీలే ధరించే నాటక గ్రూపు అది. మంచి మంచి డ్రస్సులు, మేకప్ సామాగ్రి, స్టేజీ అలంకరణతో నాటకాన్ని రక్తి కట్టించేవాళ్లు. టికెట్‌కు రెండణాల చొప్పున అమ్మి నాటకాన్ని ప్రదర్శించేవారు. ‘సతీసావిత్రి నాటకాన్ని ప్రదర్శించబోతున్నారు’ అని సాయంత్రమే తప్పెటతో ఊళ్లో చాటింపు వేశారు. నాటకం చూడ్డానికి ఊళ్లో జనం ఎగబడ్డారు. పెట్రోమాక్స్ లైట్ల వెలుగులో జనం స్టేజీకి ఎదురుగా కంపౌండ్ పరదాకు ఆనుకొని కూర్చున్నారు. స్త్రీలు ఒక పక్క, పురుషులు మరో పక్క కూర్చున్నారు. మధ్యలో దారి విడిచిపెట్టారు. ‘పరబ్రహ్మ, పరమేశ్వర, పురుషోత్తమ సదానంద’ పాట పూర్తయింది. తెర పైకి లేచింది. సావిత్రి, సత్యవంతులు స్టేజీ పైకి వచ్చారు. పాటలు పద్యాలు ఊపందుకున్నాయి. రెండుమూడు సీన్లు అయిన తరువాత యమధర్మరాజు రాబోతున్నాడు. ప్రేక్షకుల ఈలలతో స్టేజీ ముందు గోలగోలగా ఉంది. మా ఊరి వీరాచారి యమధర్మరాజు పాత్ర పోషించడంతో క్రేజ్ పెరిగింది. వీరాచారికి నాటకాల్లో వేసిన అనుభవం ఉంది. ఎప్పుడైనా పురాణపఠనం జరిగేటప్పుడు ఆయన పాటలు, పద్యాలు రాగయుక్తంగా పాడేవాడు.‘పో బాల పొమ్మికన్ నావెంట రా వలదు రా తగదు’ పాటను వీరాచారి బాగా పాడతాడు.తెర పైకి లేసింది.యమధర్మరాజుగారి పటాటోపం తెలియజేసేట్లు హోర్మోనియం, తబలాలు పెద్ద శబ్దంతో మోగాయి. ఒక చేతిలో యమపాశం, మరొక చేతిలో గదతో యమధర్మరాజు వేషంలో ఉన్న వీరాచారి నిజమైన దున్నపోతుపై ఆసీనుడై కనిపించడంతో ఈలలు చప్పట్లు. ఈ శబ్దాలకు తోడు హార్మోనీ, తబలా శబ్దాలతో పాపం దున్నపోతు బెదిరిపోయింది. వీరాచారిని స్టేజీపై పడదోసి పరదాలను చీల్చుకొని పరుగులు తీసింది. వీరాచారి చెయ్యి విరిగింది. అదృష్టం కొద్దీ ప్రేక్షకులలో ఎవరికీ ఏమీ కాలేదు. అందరూ తలా ఒక దిక్కు పరుగులు తీశారు. ‘సహజంగా ఉంటుంది’ అని పక్కింటి వాళ్లను బతిమిలాడి దున్నపోతును తీసుకొచ్చాడట వీరాచారి.సహజత్వం సంగతేమిటోగానీ... దున్నపోతు పుణ్యమా అని వీరాచారి చేయి విరగ్గొట్టుకోవాల్సి వచ్చింది. – సామా కేశవయ్య, తుంబూరు, చిత్తూరు జిల్లా -
ఆరోగ్యకరమైన ఆహారంతోనే మేనికి మేలైన నిగారింపు!
స్కిన్ కౌన్సెలింగ్ నా వయసు 18 ఏళ్లు. నాకెందుకో కాస్మటిక్స్ అంటే ఇష్టం ఉండదు. చర్మానికి శాశ్వతమైన మెరుపు రావాలంటే అది నేచురల్‌గానే మెరుస్తుండాలన్నది నా కోరిక. మంచి డైట్‌తోనే చర్మానికి మంచి నిగారింపు వచ్చేందుకు మార్గాలు చెప్పండి. – సుష్మా, హైదరాబాద్ మీరన్నది వాస్తవమే. కాస్మటిక్ ద్వారా వచ్చే నిగారింపు కాసేపే ఉంటుంది. అదే నేచురల్‌గానే మేనిలో మెరుపు ఉంటే దానికి మేకప్‌తో గానీ, కాస్మటిక్స్తోగాని ప్రమేయం ఉండదు. ఆరోగ్యకరమైన కొన్ని ఆహారాలతో మేనిలో స్వాభావికంగానే మెరుపు వచ్చేలా చేసుకోగలగడం సాధ్యమే. అయితే కొన్ని ఆహారాలు చర్మం మెరుపును తగ్గించేందుకు అవకాశం ఉంది. ఆ రెండు ఆహారాల వివరాలు... మేనికి మేలు చేసే ఆహారాలు ఆహారం: తాజా చేపలు, అవిశెలు, బాదం... వీటిల్లో ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ. ప్రయోజనం: ఇవి చర్మంలోని తేమను బయటకు వెళ్లనివ్వకుండా కాపాడి చర్మం ఎప్పుడూ మెరుస్తూ ఉండేలా చేస్తాయి. కాస్త గరుగ్గా ఉండే చర్మాన్ని నుపుపుగా చేసేందుకు దోహదపడతాయి. ఆహారం: ముడిబియ్యం, పొట్టుతీయని ధాన్యాలు, బార్లీ, పొట్టు తీయని గోధుమలతో చేసిన బ్రెడ్స్ వీటిల్లో పీచు పదార్థాలు ఎక్కువ. ప్రయోజనం: శరీరంలోని విషాలను తొలగించి బయటకు పంపుతాయి. (డీ–టాక్సిఫై చేస్తాయి). ఇందులోని పీచు పదార్థాలు చర్మం బిగుతుదనాన్ని కాపాడతాయి. ఆహారం:వైటమిన్–బి6 ఎక్కువగా ఉండే ఆహారమైన క్యారెట్‌తో పాటు కాలీఫ్లవర్, పొద్దుతిరుగుడు గింజల నూనె, వాల్నట్, అవకాడో ప్రయోజనం: హార్మోన్లలోని అసమతౌల్యత వల్ల వచ్చే మొటిమలను వైటమిన్–బి6 నివారిస్తుంది. హార్మోన్ల సమతౌల్యత సక్రమంగా ఉండేలా సహాయపడుతుంది. ఆహారం: ఆపిల్, అరటి, నారింజ, జామ వంటి అన్ని రకాల తాజా పండ్లలో అన్ని రకాల విటమిన్లతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ప్రయోజనం: చర్మాన్ని ముడతలు పడేలా చేసే ఫ్రీ–రాడికల్స్‌ను తొలగించడానికి యాంటీఆక్సిడెంట్లు ఉపయోగపడతాయి. అందుకే చర్మం చాలాకాలం పాటు యౌవనంగా ఉండాలంటే తాజా పండ్లు తినాలి. చర్మానికి కీడు చేసే పదార్థాలు ఆహారం: కాఫీ, టీ, శీతలపానియాలు, కోలా డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్. కీడు: వీటిల్లో కెఫిన్ పాళ్లు ఎక్కువ. ఇది చర్మంలో నుంచి తేమను సంగ్రహించి చర్మం పొడిబారి కనిపించేలా చేస్తుంది. కెఫిన్ ఒంట్లోని నీటిని తొలగిస్తుంది కాబట్టి విషాలు పేరుకుపోయే అవకాశాలు ఎక్కువ. ఆహారం: చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలైన చాక్లెట్లు, సోడా డ్రింక్స్, భోజనం తర్వాత తినే తీపి పదార్థాలు, స్వీట్స్ ఎక్కువగా ఉండే పానియాలు. కీడు: తీపి పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం ఇన్ఫ్లమేషన్ అవకాశాలను పెంచుతుంది. తీపి ఎక్కువగా ఉండే ఆహారంతో మొటిమలు వస్తాయి. ఆహారం: బేకరీ ఫుడ్స్, బర్గర్స్, నిల్వ ఉంచి తీసుకునే క్యాన్డ్ ఫుడ్. కీడు: ఇందులో అనారోగ్యకరమైన కొవ్వు పదార్థాలు ఎక్కువ. అవి చర్మసౌందర్యాన్ని దెబ్బతీస్తాయి. చర్మం త్వరగా ముడుతలు పడేందుకు దోహదం చేస్తాయి. ఆహారం: నూనె పదార్థాలు, వేపుళ్లు, చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు ఉపయోగించే మార్జరిన్ నూనె ఉపయోగించిన పదార్థాలు. కీడు : ఇందులో ట్రాన్స్–ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ. ఇవి రక్తంలో కొవ్వు పదార్థాలను పెంచి చర్మంపై మొటిమలు పెరిగేందుకు దోహదం చేస్తాయి. -
ఇది కదా మేకప్ అంటే..
అందంగా కన్పించడం కోసం మేకప్ వేసుకోవడం సాధారణమే. మేకప్‌తో అనేకమంది కళాకారులు మాయ చేయడం కూడా చాలాసార్లు చూశాం. కానీ నమ్మశక్యం కానంతగా ముఖాకృతిని మార్చి వేసి, మేకప్ మ్యాజిక్ సృష్టించిందో ఓ యువతి. అద్భుతమైన కళికారిణి పేరు చైనాకు చెందిన హువావా. మేకప్ ట్రిక్స్‌తో గుర్తుపట్టలేనంతగా పూర్తిగా మారిపోయి నెటిజనులను షాక్ చేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో చైనీస్ వీడియో ప్లాట్‌ఫాం యుకులో సెన్సేషన్ అయ్యింది. ఒక్క రోజులోనే 20లక్షల మందికి పైగా వీక్షించగా, వేల కొద్ది లైక్‌లు, షేర్స్‌ను సొంతం చేసుకుంది. ఫౌండేషన్, లెన్సెస్, లిప్‌స్టిక్ వంటివాటితో పాటు ప్రొస్థటిక్ (కృత్రిమ అవయవం) ముక్కును అమర్చుకుని, మేకప్ వేసుకుని పూర్తిగా మారిపోయి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అంతేకాదు మేకప్ వేసుకోవడం, తొలగించడంతోపాటు, నకిలీ ముక్కు అని మనకు రుజువు కావడానికి ఏకంగా కత్తెరను వాడడాన్ని ఈ వీడియో చూపించడం విశేషం. అమ్మాయిల మేకప్ మాయాజాలంపై గతంలో చాలా జోక్స్ పేలినప్పటికీ, ఈ అలంకరణ నైపుణ్యాన్ని మాత్రం అభినందించకుండా ఉండలేం. -
మేకప్‌తో మాయ
-
'మహానటి’.. ఆ నలుగురు
బంజారాహిల్స్ : తెలుగు చలనచిత్ర చరిత్రలోనే అద్భుతావిష్కరణ. ‘మహానటి’కిమహోన్నత ‘రూప’కల్పన. కీర్తి సురేష్‌లో సావిత్రిని పరకాయ ప్రవేశం చేసినట్లు తీర్చిదిద్దిన వైనం. ఆ నలుగురు సాంకేతిక నైపుణ్యానికితార్కాణం. ప్రేక్షకులను రంజింపజేసి.. మహానటి చిత్ర విజయంలో తమదైన పాత్ర పోషించారు వారు. కీర్తి సురేష్‌కు సావిత్రి పోలికలు, లుక్‌ను తీసుకురావడానికి నలుగురు సాంకేతిక నిపుణులు తెర వెనుక చేసిన కృషి అంతా ఇంతా కాదు. సావిత్రి నటించిన సినిమాలను ఒకటికి పదిసార్లు చూశారు. ఆమె హావభావాలు, డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్ ఒంటబట్టించుకున్నారు. కీర్తి సురేష్‌ను తెరపై జీవింపజేశారు. సావిత్రి రూపురేఖలను అచ్చుగుద్దినట్లు తీర్చిదిద్దడానికి కాస్ట్యూమర్ బొడ్డు శివరామకృష్ణ, హెయిర్‌స్టైలిస్ట్ రజబ్ అలీ, కాస్ట్యూమ్ స్పెషలిస్ట్ ఇంద్రాక్షి, మేకప్ మెన్ మూవేంద్రన్ కృషి అపురూపమైనది. వీరంతా ఓ సినిమా షూటింగ్ నిమిత్తం గురువారం హైదరాబాద్‌కు వచ్చారు. మహానటి సినిమాకు ఎలా కష్టపడింది, ఆ సినిమా ఏ మేరకు పేరుతీసుకొచ్చిందనే విషయాలపై ‘సాక్షి’తో ముచ్చటించారు. 190 హెయిర్ స్టైల్స్ మార్చాం నాది ముంబై. ఐదేళ్లుగా హెయిర్ స్టైలిస్ట్‌గా సినిమాల్లో పనిచేస్తున్నాను. అనుకోని వరంలా మహానటి సినిమాకు పనిచేసే అవకాశం లభించింది. ఈ సినిమాలో కీర్తి సురేష్‌ను సావిత్రిలా చూపించడానికి సుమారు 20 సినిమాలు నెల రోజుల పాటు చూడాల్సివచ్చింది. మూగ మనసులు సినిమాను ఆరు రోజులు ఏకధాటిగా చూశా. అందులో సావిత్రి హెయిర్ స్టైల్‌ను అచ్చుగుద్దినట్లు కీర్తి సురేష్‌కు తీసుకొచ్చాను. ఒకే విగ్గును 190 హెయిర్ స్టైల్స్‌గా మార్చాం. సావిత్రి ఒక్కో సినిమాలో ఒక్కో హెయిర్ స్టైల్‌తో ఆకట్టుకునేవారు. ఆమెది పొడవాటి జుట్టు. కీర్తి సురేష్‌ది తక్కువ జుట్టు. దీంతో విగ్గుతోనే సావిత్రిని తెరపై సృష్టించాల్సి వచ్చింది. ఇంకో వైపు సావిత్రి జుట్టు బాగా ఉంటే కీర్తి సురేష్‌ది సిల్కీ హెయిర్. దీంతో సావిత్రి జుట్టు తీసుకురావడానికి హెయిర్‌స్టైల్స్‌ను రకరకాలుగా మార్చాల్సి వచ్చింది. నా కెరీర్లోనే ఇదో అద్భుత అవకాశం. – రజబ్ అలీ, హెయిర్ స్టైలిస్ట్ 120 రోజుల కృషి ఫలితం ఇది.. మహానటి సినిమాకు 120 రోజుల పాటు పనిచేశా. పాత సినిమాలను ఔపోసన పట్టాను. ముఖ్యంగా నర్తనశాల, గుండమ్మకథ సినిమాలను పది రోజుల పాటు రేయింబవళ్లూ చూశాను. సావిత్రి హావభావాలు, ఆమె డ్రెస్సింగ్, ఆమె నడక, ఆమె కళ్లు ఎగరేసే తీరు ఇవన్నీ పరిశీలించాను. ఇంకో వైపు సావిత్రి చీర ఎలా కట్టుకుంటుంది, ఎలా నడుస్తుంది అన్నది ఈ సినిమాకు ఇంపార్టెంట్. ఇంకోవైపు సావిత్రి ఐనెక్ బ్లౌజ్‌లు వేసుకునేది. ఇప్పుడవి లేవు. ఆ తరహా బ్లౌజ్‌లను కుట్టించి సావిత్రి లుక్‌ను తెచ్చేందుకు చాలా కష్టపడ్డాను. ఈ సినిమాలో అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సావిత్రి లాంటి మహానటిని తెరమీద కీర్తి సురేష్‌లో తీర్చదిద్దడానికి కృషి చేయడం సంతోషంగా ఉంది. 40 సంవత్సరాలు వెనక్కి వెళ్లి సావిత్రిని తెరపై చూపించాలంటే ఎంత కష్టమో తెలిసింది. – బొడ్డు శివరామకృష్ణ, కాస్ట్యూమర్ చీరకట్టుతోనే సావిత్రి అందం సావిత్రి అందమంతా చీరకట్టులోనే ఉండేది. సంప్రదాయ తెలుగు యువతిని చూడాలంటే సావిత్రిని చూడాల్సిందే. కీర్తి సురేష్‌ను సావిత్రిలా చూపించాలంటే అప్పటి ఆమె కట్టు, బొట్టు బాగా ఆకళింపు చేసుకున్నా. ఇంకేముంది తగిన కాస్ట్యూమ్‌ను తగిన రీతిలో తీర్చిదిద్దాం. ఇందు కోసం రెండు నెలల పాటు కష్టపడ్డాం. సావిత్రి నడిచే విధానం, ఆమె చీరకట్టు గమనించడానికి చాలా రోజులు పట్టింది. అచ్చుగుద్దినట్లు కీర్తి సురేష్‌ను తెరపై చూపించాలంటే కాస్ట్యూమ్‌కు ఉన్న ప్రాధాన్యం గమనించాను. ఈ సినిమా ఇంత హిట్ కావడం నా జీవితంలోనే మరిచిపోలేనిది. ఇలాంటి సినిమాకు పనిచేయడం గర్వంగా ఉంది. – ఇంద్రాక్షి, స్టైలిస్ట్ ఆమె కళ్లతోనే భావాలు పలికించేవారు మహానటి సావిత్రి సినిమాను కీర్తి సురేష్‌తో తియ్యడం అందులో నేను మేకప్ మెన్‌గా ఉండటం అదృష్టమనే చెప్పాలి. సావిత్రి నటించిన 15 సినిమాలు రేయింబవళ్లూ చూసి ఆమె మేకప్‌ను గమనించాను. కీర్తి సురేష్‌కు ఎలా మేకప్ వేస్తే సావిత్రి లుక్ వస్తుందో అంచనాకు వచ్చాను. బ్లాక్ అండ్ వైట్ సీన్స్, కలర్ సీన్స్‌లో కీర్తి సురేష్ ఎలా ఉంటుంది, ఆ మేరకు మేకప్ ఎలా వేయాలి అన్నదానిపైనే దృష్టి సారించాను. సావిత్రి కళ్లు బాగుంటాయి. అవే కళ్లను కీర్తి సురేష్‌కు తీసుకురావాలంటే 20 రకాల వేరియేషన్స్‌ను తీసుకొచ్చాం. ముఖ్యంగా ఐబ్రోతోనే కీర్తి సురేష్‌కు సావిత్రి లుక్ అక్షరాలా ఒంటబట్టింది. సినిమా ఇంతగా హిట్ అవుతుందని మాకు షూటింగ్ సమయంలోనే తెలిసింది. ఎందుకంటే ఆ సినిమాకు పడుతున్న కష్టం దగ్గరుండి గమనించాను. – మూవేంద్రన్, మేకప్‌మెన్ -
టాక్సీలో మేకప్ వేసుకుంటుండగా.. విషాదం
బ్యాంకాక్ : టాక్సీలో ప్రయాణిస్తున్న ఓ యువతి కంటికి ‘ఐలైనర్ పెన్సిల్’ సహాయంతో మెరుగులు దిద్దుతుండగా.. ఐలైనర్ పెన్సిల్ కాస్తా కంటిలో గుచ్చుకుంది. సగానికి పైగా పెన్సిల్ కంటిలోకి చొరబడటంతో భరించలేని నొప్పితో తీవ్ర ఇబ్బందులకు గురైందా యువతి. ఈ సంఘటన సోమవారం థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్ నగరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బ్యాంకాక్‌కు చెందిన 20 ఏళ్ల యువతి టాక్సీలో ప్రయాణిస్తోంది. ట్రాఫిక్ జామ్ కారణంగా వాహనం నిదానంగా కదులుతోంది. స్నేహితులను కలవాలన్న తొందరలో ఉన్న ఆమె బ్యాగులో ఉన్న ఐలైనర్‌ను తీసి కంటికి మెరుగులు దిద్దుకోవటం ప్రారంభించింది. ఇంతలో ఆమె ప్రయాణిస్తున్న టాక్సీ కాస్తా ముందున్న ట్రక్కును ఢీ కొట్టింది. దీంతో ఆమె తల ముందున్న సీటుకు తగిలి ఐలైనర్ పెన్సిల్ కంటిలోకి చొచ్చుకెళ్లింది. పెన్సిల్ కంట్లో గుచ్చుకోవటంతో భరించలేని నొప్పి కారణంగా ఆమె గట్టిగా అరవటం మొదలుపెట్టింది. ఆమె పరిస్థితి గమనించిన టాక్సీ డ్రైవర్ వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేశాడు. కొద్ది సేపటి తర్వాత అంబులెన్స్‌లో ఆమెను దగ్గరలోని ‘రాజవితి’ హాస్పిటల్‌కు తరలించారు. శస్త్రచికిత్స చేసిన వైద్యులు యువతి కంటి నుంచి పెన్సిల్‌ను తొలగించారు. ‘రాజవతి’ ఆస్పత్రి వైద్యులు మాట్లాడుతూ.. కంటిలోని ముఖ్యమైన భాగాలకు ఎలాంటి నష్టం కలుగకపోవటంతో ఆమె కంటిచూపుకు ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని తెలిపారు. ప్రయాణాల్లో ఉన్నపుడు మేకప్ వేసుకునే వాళ్లకు ఇదొక గుణపాఠమని, కదులుతున్న కారులో ఇలాంటివి చేయకూడదని హెచ్చరించారు. ఇటువంటి సంఘటనలు ఊహించనివని, అన్నింటికి సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. -
వీళ్లకు క్యారెక్టర్ ఉంది
ఒక్కర్నీ గుర్తుపట్టలేం!అందుకేనేమో అంత గుర్తింపు వచ్చింది.మేకప్ మేకోవర్..!ఇదో పెద్ద గేమ్. మనకు మన హీరో కనపడడు. రాసినవాళ్ల క్యారెక్టర్ కనబడుతుంది. మనల్ని మైమరిపించడానికిఈ గోల్డెన్ పాత్రలు సిల్వర్పూతలు పూయించుకుంటాయి. అదేనండీ.. సిల్వర్‌స్క్రీన్ పూతలు.మేకప్మేన్లు, టెక్నీషియన్లు..సైంటిస్టులు.. వీళ్లందరి ‘కళ’పూతమనకు అతుక్కుంటుంది.. మరచిపోలేని క్యారెక్టర్‌తో!! సాఫ్ట్‌గా కనిపించే కుర్రాడు... వైల్డ్‌గా మారిపోయాడు! తెల్లని మేని ఛాయతో తళుకులీనే భామ నీలంలో నిగనిగలాడింది! నెత్తిన కొమ్ములొచ్చిన వ్యక్తి ఒకరైతే... ఒళ్లంతా దద్దుర్లతో ఇంకొకరు.. అంతా మాయ... మేకప్ మాయ... బఫూన్ విలన్ చాక్లెట్ బాయ్ అని కొంతమంది కుర్రాళ్లను అంటుంటారు. అంటే ఏంటి? ఎప్పుడూ చేతిలో చాక్లెట్ ఉంటుందనా? ఊహూ.. ‘చాలా హ్యాండ్సమ్’గా ఉండేవాళ్లను అలా అంటుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హాలీవుడ్ యంగ్ స్టార్స్‌లో ‘బిల్ స్కార్స్‌గార్డ్’ అలాంటివాడే. ఎవరైనా ఇతన్ని హీరోగానే ఊహించుకోవాలే తప్ప ‘బఫూన్’లా ఊహించుకోవడం కష్టం. కానీ ఈ చాక్లెట్ బాయ్ గతేడాది రిలీజైన ‘ఇట్’ సినిమాలో ‘పెన్నీవైస్ ది డ్యాన్సింగ్ క్లౌన్’ క్యారెక్టర్ చేశాడు. బఫూన్లా కనిపించే విలన్ అన్నమాట. ఈ క్యారెక్టర్లోకి మారడం కోసం కేజీల కేజీల ఫౌండేషన్ పూసుకోవాల్సి వచ్చింది. మూడు నాలుగు గంటలు మేకప్‌కి పట్టేది. బుగ్గలకు ఎర్ర చార గీతలు, సాగిపోయిన పెదాలు, రంగు మారిన పళ్లు, నీరు లేక ఎండిపోయిన భూమిలా నుదురు మీద పగుళ్లు... స్కార్స్ భయంకరంగా మారిపోయాడు. సినిమాలో బాగా భయపెట్టాడు. తనకు ఈ మేకప్ ఎక్స్పీరియన్స్ ఓ భయంకరమైన అనుభవం అంటాడు స్కార్స్. కానీ ఈ అనుభవం బాగుందని కూడా అంటాడు. ఒళ్లంతా పెయింట్‌తో... హాలీవుడ్ హాట్ బ్యూటీ జెన్నీఫర్ లారెన్స్ పేషెన్స్ని టెస్ట్ చేసిన సినిమా ‘ఎక్స్–మెన్: ఫస్ట్ క్లాస్’. రాబోయే కాలంలో ఎలాంటి శక్తుల వల్ల మానవులకు ప్రమాదం వాటిల్లుతుందో ముందే గ్రహించి, తొమ్మిది శక్తుల గల వ్యక్తులతో అందుకు తగ్గట్టుగా భవిష్యత్తుని ఎలా రూపకల్పన చేస్తారు? అనే పాయింట్‌తో ఈ సినిమా ఉంటుంది. ఆ తొమ్మిది శక్తుల్లో మిస్టిక్ ఒకటి. అది జెన్నీఫర్ చేశారు. పసుపు రంగు కళ్లు, కొబ్బరి పీచుని తలపించే జుత్తు, నీలం రంగు ఒళ్లు.. మిస్టిక్‌గా మారడానికి జెన్నీఫర్కి 8 గంటలు పట్టింది. ఒళ్లంతా బ్లూ కలర్ పెయింట్ చేయించుకున్నారు. మేకప్ తీసేశాక ఒంటి మీద వచ్చిన ‘ర్యాషెస్’ ఈ సినిమా మిగిల్చిన తీయని గుర్తు అంటారు జెన్నీఫర్. అయితే ఇదే సినిమా సిరీస్‌లో వచ్చిన తదుపరి చిత్రాలు ‘ఎక్స్–మెన్: డేస్ ఆఫ్ ఫ్యూచర్ పాస్ట్’, ‘ఎక్స్–మెన్: అపోకలిప్స్’లకు మాత్రం ఆమె అంతలా కష్టపడలేదు. అప్పటికి బ్లూ కలర్ బాడీ సూట్ రావడంతో పెయింటింగ్ చేయించుకునే బాధ తప్పింది. ‘బతికిపోయాను రా బాబూ’ అని జెన్నీఫర్ అనుకునే ఉంటారు. బ్లూ టు గ్రీన్ గమోరా.. ‘గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ’లో జోయీ సాల్డానా చేసిన పాత్ర ఇది. ఈ పాత్ర కోసం కంప్యూటర్ గ్రాఫిక్స్, పెర్ఫార్మెన్స్ క్యాప్చర్ టెక్నాలజీ వాడదాం అనుకున్న దర్శక–నిర్మాతలతో ‘నో ప్రాబ్లమ్.. మేకప్‌కే వెళ్దాం’ అని అభయమిచ్చారట. ఒంటి నిండా గ్రీన్ కలర్ పూసుకున్నారామె. విశేషం ఏంటంటే గ్రీన్ కలర్ కంటే లోపల మరో రెండు మూడు లేయర్స్ మేకప్ ఉండేదట. శరీరం మొత్తం పచ్చగా మారటానికి సుమారు మూడు గంటలకు పైనే పట్టేదట. బుగ్గలు ఉబ్బెత్తుగా, నుదురు కొంచెం పెద్దదిగా కనిపించడం కోసం సిలికాన్ ప్రోస్థెటిక్స్ వాడారు. అయినా ఇలా రంగుల్లో మునిగిపోవడం జోయీకి కొత్తేం కాదు. ఆల్రెడీ ‘అవతార్’లో నీలంగా నెయిత్రీలా మారిపోయిన విషయం తెలిసిందే. అరగుండు అయినా ఓకే.. నెబూలా పైశాచికత్వానికి కేరాఫ్ అడ్రస్. అసూయ, ద్వేషం, పగ... వీటిని, నెబూలాని వేరు చేసి చూడలేం. అందుకే ‘గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ’ సినిమాలో నెబూలా క్యారెక్టర్ని చాలెంజ్‌గా తీసుకున్నారు కరేన్ గిల్లన్. ఈ పాత్ర కోసం పొడవాటి తన జుట్టుని త్యాగం చేశారు. పోతే పోయింది.. పాత్రకన్నా ఎక్కువా? అనుకున్నారు. ఈ క్యారెక్టర్ కోసం కళ్లకు 22 మిల్లీమీటర్ కాంటాక్ట్ లెన్సులు వాడారు. ‘గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ’ పార్ట్ 2 మాత్రం కరేన్కి కొంచెం రిలీఫ్ ఇచ్చింది. టెక్నాలజీ త్వరగా డెవలప్ అవుతోంది కాబట్టి.. మేకప్‌కి 2 గంటలు కేటాయిస్తే సరిపోయింది. ఫస్ట్ పార్ట్‌కి గుండు చేయించుకున్న కరేన్ సెకండ్ పార్ట్‌కి అర గుండు చేయించుకున్నారు. సూట్ అంత సులువుగా రాదు బ్లాక్ పాంథర్ కామిక్స్ పరిచయం లేని వాళ్లు ఎవరైనా సడెన్‌గా ఎరిక్ కిల్మాంగర్ పాత్రను చూస్తే గగుర్పాటుకు గురి కావొచ్చు. ఒళ్లంతా దద్దుర్లతో కొంచెం జుగుప్సగా కనిపిస్తాడు. తాను చంపిన ఒక్కొక్కరి గుర్తుగా ఆ మార్క్‌ని పెట్టుకున్నారంటే అతనెంత క్రూయలో ఈపాటికి అర్థం అయిపోయుంటుంది. ‘బ్లాక్ పాంథర్’లో మైఖేల్ బి.జోర్డాన్ ఈ పాత్ర చేశారు. దీని కోసం స్పెషల్ సూట్ తయారు చేయించారు. ఆ సూట్ వేసుకోవడం, తీయడం అంత సులువు కాదు. సూట్ ఒంటికి అతుక్కుపోవడానికి వాడిన గమ్ ఓ పట్టాన ఒంటి నుంచి సూట్‌ని వేరు చేయనిచ్చేది కాదట. రిమూవ్ చేసిన తర్వాత ఒంటికి అంటుకుపోయిన జిగురు పోవడానికి కాసేపు ఆవిరి తొట్టెలో కూర్చునేవారట. ఏదైనా జిమ్ క్యారీ చేసేస్తా కారెక్టర్ ఏదైనా, ఆ క్యారెక్టర్‌ది ఎలాంటి బాడీ లాంగ్వేజ్ అయినా సరే ఈజీగా క్యారీ చేస్తా అంటారు జిమ్ క్యారీ. అలాంటి ప్రయోగమే చేశారు ‘హౌ ది గ్రించ్ స్టోల్ క్రిస్మస్’ సినిమా కోసం. అందులో ఆయన పచ్చని రంగులో ఉన్న ఓ వింత జంతువు రూపంలో కనిపిస్తారు. ఈ పాత్రలా మారడానికి సుమారు మూడు గంటలు పట్టేదట. కదలకుండా మూడు గంటలు పాటు ఖాళీగా కూర్చోవాల్సి వచ్చేదట. విశేషం ఏంటంటే సినిమాలో మేకప్ కోసమే జిమ్ కదలకుండా ఖాళీగా కూర్చున్న సమయాన్ని లెక్కేస్తే సుమారు 92 రోజులట. చిత్రాతిచిత్రంగా... ఆ ముఖం ఎరుపు, నలుపు రంగుల డిజైన్‌తో విచిత్రంగా ఉంటుంది. కొమ్ములు తిరిగిన మొనగాడు డార్త్ మౌల్. విచిత్రమైన కాంటాక్స్ లెన్స్‌తో చిత్రాతిచిత్రంగా కనిపిస్తాడు. ‘స్టార్ వార్స్: ఎపిసోడ్ 1 – థి ఫ్యాంథమ్ మెనేస్’ సినిమాలోని ఈ క్యారెక్టర్ రే పార్క్‌కి పెద్ద సవాల్. నటించడానికి కాదు.. మేకప్ ఓ పెద్ద చాలెంజ్. నిజానికి ఈ పాత్ర రూపం ఎలా ఉండాలనే విషయంపై యూనిట్తర్జన భర్జనలు పడిందట. ఫైనల్లీ ఒక పేపర్ మీద ఇంక్ జల్లి ఫోల్డ్ చేసి, తీసి చూసినప్పుడు డిజైన్ అటూ ఇటూ ఒకే రకంగా ఉంటుంది కాబట్టి.. డార్త్ ముఖం అలానే ఉండాలనుకున్నారట. లెఫ్ట్, రైట్.. ఎరుపు, నలుపు డిజైన్‌తో ముఖాన్ని డిజైన్ చేశారు. వైల్డ్ ఏలియన్.. బోలెడన్ని లేయర్లు ఏలియన్స్ ఎలా ఉంటారు? విచిత్రంగా కనిపిస్తారు. ఒక మనిషి ఏలియన్లా మారాలంటే మామూలు విషయం కాదు. మూడు నాలుగు గంటలు ఈజీగా పట్టేస్తుంది. ‘స్టార్ ట్రెక్ బియాండ్’లో చేసిన పవర్ఫుల్ ఏలియన్ వార్ లార్డ్ క్యారెక్టర్ కోసం ఇడ్రిస్ ఎల్బా ఏలియన్‌గా మారారు. ఒక లేయర్.. ఆ పైన ఇంకో లేయర్.. ఇంకోటి... మరోటి.. ఇలా బాడీ మొత్తం మేకప్ లేయర్లే. నిజానికి ఇతగాడికి ‘క్లాస్ట్రోఫోబియా’ ఉంది. అంటే.. నిర్భంధిత పరిస్థితుల్లో ఉండలేకపోవడం. ఇక్కడ లేయర్ల చాటున నిర్భంధ స్థితిలో శరీరం ఉంటే.. అది ఏమాత్రం గుర్తుకు రానివ్వకుండా కెమెరా ముందు నటించడంలో ఇడ్రిస్ సక్సెస్ అయ్యారు. తన ఫోబియాని మరచిపోయేలా చేసిన ఘనత మేకప్‌దే అంటారు ఇడ్రిస్. మేమేం తక్కువ కాదు గుర్తు పట్టలేనంతగా మారిపోవడం హాలీవుడ్ నటులకే కాదు.. ఇండియన్ స్టార్స్‌కి కూడా సాధ్యమే. ‘భీష్మ’లో ఎన్టీఆర్ గురించి చెప్పుకున్నాం. భారతీయ నటుల్లో ముఖ్యంగా చెప్పాల్సింది కమలహాసన్ గురించి. ప్రయోగాలకు చిరునామా ఆయన. ‘ఇంద్రుడు–చంద్రుడు’ లో ఎత్తు పళ్లు, బాన పొట్టతో, ‘కల్యాణ రామన్’లో ఎత్తు పళ్లతో, ‘అపూర్వ సహోదరులు’లో మరుగుజ్జుగా, ‘భామనే సత్యభామనే’లో బామ్మగా, ‘భారతీయుడు’లో వృద్ధ గెటప్‌లో... ఇలా మేకప్‌తో పూర్తిగా మారిపోయిన పాత్రలెన్నో కమల్ చేశారు. ఆయన చేసినన్ని ప్రయోగాలు రజనీకాంత్ చేయకపోయినా ‘రోబో’ సినిమా కోసం ఆయన మేకప్‌కి చాలా గంటలు వెచ్చించాల్సి వచ్చింది. చిట్టి క్యారెక్టర్ కోసం ప్రోస్థెటిక్ మేకప్ చేయించారు. ఈ సినిమా సీక్వెల్ ‘2.0’కి కూడా ఎక్కువగా మేకప్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాతి జనరేషన్లో విక్రమ్‌ని చెప్పుకోవచ్చు. ‘కాశీ’లో అంధుడిగా, ‘శివపుత్రుడు’లో లోకం తెలియని అమాయకుడిగా... ఇవన్నీ ఒక ఎల్తైతే ‘ఐ’లో చేసిన పాత్ర మరో ఎత్తు అవుతుంది. ఆ సినిమాలో హెవీ ప్రోస్థెటిక్ మేకప్‌తో విచిత్రమైన ఆకారంలో కనిపించి, భేష్ అనిపించుకున్నారు విక్రమ్. ‘గజిని’ ఫేమ్ సూర్య అయితే ‘పేరళగన్’ అనే తమిళ సినిమాలో గూని ఉన్న వ్యక్తిగా మౌల్డ్ అయ్యారు. ‘24’లో విలనీ షేడ్ ఉన్న పాత్ర గెటప్ కూడా డిఫరెంట్‌గా ఉన్న విషయం గుర్తుండే ఉంటుంది. ఇక, స్లిమ్‌గా ఉండే ‘అల్లరి’ నరేశ్ బండ బాబులా కనిపించిన చిత్రం ‘లడ్డూ బాబు’. క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ‘మగధీర’లో రావు రమేశ్ చేసిన మాంత్రికుడి పాత్ర కూడా చెప్పుకోదగ్గదే.. ‘బాహుబలి’లో ప్రభాకర్ చేసిన కాలకేయుడు క్యారెక్టర్ మేకప్నీ విస్మరించలేం. రీసెంట్గా రిలీజైన ‘మహానటి’లో కీర్తీ సురేష్ ప్రోస్థెటిక్ మేకప్ చేసుకోవాల్సి వచ్చింది. సావిత్రి బాగా లావైన తర్వాత వచ్చే సీన్స్‌కి కీర్తీ ఈ మేకప్ చేసుకున్నారు. బాలీవుడ్ గురించి చెప్పాలంటే... ‘పా’ మూవీలో ప్రొజేరియా వ్యాధితో బాధపడుతున్న పిల్లవాడిగా అమితాబ్ నటించారు. ఆ సినిమాలో అమితాబ్ 12 ఏళ్ల పిల్లవాడైనా.. చూడ్డానికి ఐదింతలు ఎక్కువ వయసున్న వ్యక్తిలా కనిపిస్తాడు. తక్కువ శారీరక ఎదుగుదల, వృద్ధ లక్షణాలు కనిపించడం కోసం అమితాబ్‌కి ప్రోస్థెటిక్ మేకప్ చేశారు. మరో హిందీ నటుడు అక్షయ్ కుమార్ ‘2.0’లో క్రౌమేన్గా కనిపించడం కోసం తీసుకున్న రిస్క్ తక్కువేం కాదు. ఈ సినిమాలో అతను పక్షి ప్రేమికుడు. అందుకని గెటప్ కూడా పక్షిని పోలినట్లే ఉంటుంది. ఈ గెటప్ కోసం మూడు నాలుగు గంటలు మేకప్‌కి కేటాయించారు. ఇలా ఇండియన్ మూవీస్‌లో ప్రయోగాలు చేస్తున్న తారలు చాలామందే ఉన్నారు. మంచి క్యారెక్టర్ కుదిరితే ‘మేమేం తక్కువ కాదు..’ అంటున్నారు. ఎన్టీఆర్ భీష్మ శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, కర్ణుడు... ఇలా పౌరాణిక పాత్రలతో పాటు సాంఘిక పాత్రలను అలవోకగా చేసిన నటుడు నందమూరి తారక రామారావు. సాంఘిక చిత్రాల్లో వేసిన మారువేషాలు కూడా ప్రేక్షకులను అలరించాయి. అయితే మారువేషంలో ఉన్నది ఎన్టీఆర్ అనీ, పౌరాణిక గెటప్స్‌లో ఉన్నప్పుడు అది ఎన్టీఆరే అని స్పష్టంగా తెలిసిపోయేది. ‘భీష్మ’ సినిమా మాత్రం ఇందుకు మినహాయింపు. ఆ సినిమాలో భీష్మ గెటప్‌లో ఉన్నది ఎన్టీఆర్ అని అప్పట్లో ఎవరూ గుర్తు పట్టలేకపోయారన్నది అక్షర సత్యం.. అది మేకప్ మహత్యం. నిజానికి తెరపై కనిపించే నటుల గురించి చెప్పుకుంటాం కానీ, వారలా కనిపించడానికి తెరవెనక కృషి చేసే మేకప్ నిపుణులను కూడా అభినందించాల్సిందే. – డి.జి. భవాని -
మేకప్ ఉత్పత్తులతో జాగ్రత్త!
అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి మహిళలు మేకప్ ఉత్పత్తులపై ఆధారపడుతుండటం మామూలే. ఈ ఉత్పత్తుల వల్ల అందం మెరుగయ్యే మాట అలా ఉంచితే, హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని లేనిపోని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆస్ట్రేలియన్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందం కోసం అలవాటుగా వాడే మేకప్ ఉత్పత్తులు కొందరిలో హార్మోన్ల తీరుతెన్నులను అస్తవ్యస్తంగా మార్చేస్తాయని మెల్బోర్న్కు చెందిన ఫెర్టిలిటీ–హార్మోన్ నిపుణురాలు నాట్ క్రింగౌడిస్ చెబుతున్నారు. స్కిన్‌కేర్, హెయిర్‌కేర్ ఉత్పత్తులు, ఫేస్‌వాష్‌లు, కృత్రిమ పరిమళాలతో తయారయ్యే స్ప్రేలు, సెంట్లు వంటివి హార్మోన్ సమస్యలతో పాటు కొందరిలో ఊపిరితిత్తుల సమస్యలు కూడా కలిగిస్తాయని ఆమె అంటున్నారు. మేకప్ ఉత్పత్తుల్లోని రసాయనాలు చర్మం ద్వారా శరీరంలోకి చేరి, హార్మోన్లపై ప్రభావం చూపుతాయని వివరిస్తున్నారు. -
బాహుబలి భామ వీడియో వైరల్
సాక్షి, ముంబై : నోరా ఫతేహి మనకు పెద్దగా పరిచయం లేని ఈ బిగ్‌బాస్ భామకు డాన్స్ అంటే విపరీతమైన అభిమానం. చాన్స్ ఇస్తే రోజంతా డాన్స్ చేయమన్నా చేస్తుంది. ఈ విషయం నోరా పాత ఇన్స్టాగ్రామ్ వీడియోలు చూస్తే అర్థమవుతుంది. చేసే ప్రతి పనిలోనూ ఆనందం వెతుక్కోవడం ఎలానే ఈ మొరాకో ముద్దుగుమ్మకు బాగా తెలుసు. ప్రస్తుతం ఈ భామ మేకప్ వేసుకుంటూ చేసిన డాన్స్ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో నోరాతో పాటు ఆమె మేకప్ మాన్ కూడా ఉన్నాడు. నోరా ఈ వీడియో గురించి మాట్లాడుతూ తెర మీద మిమ్మల్ని అలరించడానికి ముందు తెర వెనక మేము ఇలా కష్టపడతాము అని చెప్పింది. డాన్స్ చేస్తూనే నోరా తయారయ్యే విధానం చాలా వినోదాత్మకంగా ఉంది. బిగ్ బాస్ 9లో పాల్గొన్న ఈ భామ తన అందం, సింప్లిసిటి ద్వారా చాలామంది మనసులు గెలుచుకుంది. 2015లో ప్రసారమైన ‘ఝలక్ తిక్లాజా’ రియాలిటి షో ద్వార ఆమెలోని డాన్సర్ ప్రపంచానికి తెలిసింది. నోరాకు కేవలం బెల్లీ డాన్స్‌లోనే కాకుండ ఇతర రకాల డాన్స్‌లలో కూడా ప్రవేశం ఉంది. ఈ మధ్యే ఆమె పోల్ డాన్స్‌ను కూడా నేర్చుకుంది. దానికి సంబంధించిన వీడియోను కూడా పోస్టు చేసింది. నోరా ‘బాహుబలి : ద బిగినింగ్’ చిత్రంలోని ఒక ప్రత్యేక గీతంలో మెరిసింది. రెండు పార్టులుగా వచ్చిన బాహుబలి చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించారు. మొదటిపార్టు ‘బాహుబలి : ద బిగినింగ్’ రెండు జాతీయ స్థాయి అవార్డులను, రెండో పార్టు ‘బాహుబలి2 : ద కన్‌క్లూజన్’ మూడు జాతీయ స్థాయి అవార్డులను అందుకుంది. -
బాహుబలి భామ డ్యాన్స్ వీడియో వైరల్
-
పెళ్లి మేకప్ ఎలా?
వేసవిలో మేకప్‌కి దూరంగా ఉన్నప్పటికి వివాహ వేడుకలకు తప్పనిసరి అవుతుంది. ఇలాంటప్పుడు మేకప్ త్వరగా డల్ అవకుండా, ఎక్కువసేపు ముఖం తాజాగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా ఫేస్‌వాష్‌తో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఐస్ క్యూబ్‌తో ముఖమంతా ఒకసారి మృదువుగా రబ్ చేసి, కాటన్‌తో తుడిచేయాలి. తర్వాత ముడతలు, నల్లని మచ్చలు, కళ్లకింద నల్లని వలయాలు, నోటికిరువైపులా ఏర్పడ్డ లాఫింగ్ లైన్స్ కవర్ చేయడానికి లిఫ్టింగ్ సీరమ్ వాడాలి. ఆ తర్వాత ప్రైమర్ ఉపయోగించి, ముఖమంతా కలిసేలా బ్రష్‌తో బ్లెండ్ చేయాలి. పూర్తయిన తర్వాత వాటర్‌ప్రూఫ్ కన్సీలర్ను వాడాలి. చర్మతత్వం ప్రకారం ఎంపిక చేసుకున్న వాటర్ ప్రూఫ్ ఫౌండేషన్‌ను ఉపయోగించాలి. అంతా కలిసేలా పై నుంచి కిందకు బ్రష్‌తో బ్లెండ్ చేయాలి. తర్వాత పైన కంపాక్ట్ పౌడర్‌ను ఉపయోగించాలి.స్ప్రే బాటిల్లో కొద్దిగా నీళ్లు పోసి, ముఖం మీద స్ప్రే చేయాలి. స్పాంజ్‌తో అక్కడక్కడా రబ్ చేస్తూ కొద్దిగా డార్క్ చేయాలి. దీంతో కన్సీలర్, కాంపాక్ట్, ఫౌండేషన్ కలిపి సెట్ అయిపోతుంది. చెమట పట్టినా, నీళ్లు పడినా మేకప్ చెడిపోదు. ఫౌండేషన్ సెట్ అయ్యాక కంటి భాగాన్ని తీర్చిదిద్దాలి. కంటి చుట్టూ న్యూడ్ కలర్ బేస్ రాసి, వేసుకున్న దుస్తుల రంగును బట్టి కంటి పైభాగంలో 2–3 షేడ్స్ రెప్పలకు వాడచ్చు. కనుబొమల కింది భాగంలో లైట్ షేడ్ వాడి, కనుబొమలను తీర్చిదిద్దాలి. తర్వాత కళ్లకి ఐ లైనర్, మస్కారా, కనుబొమలకు ఐ బ్రో పెన్సిల్‌తో మేకప్ పూర్తి చేయాలి. బుగ్గల మీద బ్లష్ చేసి, పెదవులకు లిప్‌స్టిక్ వేయాలి. ముందు లిప్ పెన్సిల్‌తో ఔట్‌లైన్ గీసి, తర్వాత వాటర్‌ప్రూఫ్ లిప్‌స్టిక్‌లో నచ్చిన రంగు ఎంచు కోవాలి. ముక్కు లావుగా ఉన్నా, డబుల్ చిన్ ఉన్నా డార్క్ షేడ్స్ వాడి ఫేస్ కరెకన్స్ చేసుకోవాలి. కరెక్షన్స్కైతే నిపుణుల సలహా తప్పనిసరి.. ఈ మేకప్ 5–6 గంటల వ్యవధిలో తీసేయడానికి మేకప్ రిమూవర్‌ని మాత్రమే ఉపయోగించాలి. తర్వాత ఫేస్‌వాష్‌తో ముఖాన్ని కడిగి, మాయిశ్చరైజర్ రాసుకోవాలి. -
అంత మంచివేం కాదట
మేకప్‌ను తుడుచుకోవడానికి వాడే మేకప్ వైప్స్ వల్ల చర్మానికి ఎలాంటి మేలూ లేక పోగా, హాని ఎక్కువని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని తరచుగా వాడితే, చర్మంపై సహజంగా ఉండే తేమ మాయమై చర్మం త్వరగా పొడిబారిపోతుందని, ముఖంపై త్వరగా ముడుతలు ఏర్పడతా యని బ్రిటన్‌కు చెందిన ఈస్తటీషియన్ జోవానా వర్గాస్ చెబుతున్నారు. చర్మంపై పేరుకు పోయిన మురికిని, మృతకణాలను ఈ వైప్స్ కొంతవరకు తొలగించగలిగినా, పూర్తిగా శుభ్రం చేయవట. చర్మ ఆరోగ్యానికి ఇబ్బంది లేకుండా మేకప్‌ను తొలగించు కోవాలనుకుంటే మేకప్ వైప్స్‌కు బదులుగా తేలికపాటి సబ్బు, చన్నీటితో శుభ్రం చేసుకోవడమే మేలంటున్నారు. -
అవర్ హీరో
అవర్ హీరో సినిమాల్లో గాల్లోకి దూకి పదిమందిని ఒక్కవేటుతో వందమందిని ఒక్క ఊపుతో వెయ్యిమందిని ఒక్క ఫైటుతో చితక్కొట్టేసే హీరోలను చూశారు. మాకైతే ఈ హీరోయే నచ్చింది. గద్దలు తన్నుకుపోతున్నఇద్దరి బాల్యాన్నిసింగిల్ హ్యాండ్‌తో కాపాడింది!! షీ ఈజ్ అవర్ హీరో. మార్చి 4, 2018. ఆదివారం. ముంబైలోని వర్సోవా. ఎప్పటిలాగే తెల్లవారింది. ఉదయం పది గంటలు. అప్పుడే టీ తాగి బద్దకంగా అలా సోఫాలో కూర్చుండిపోయింది 27 ఏళ్ల ప్రీతి సూద్.. సెలవు తీరికను మనసారా ఆస్వాదించేందుకు. సెల్ ఫోన్ మోగింది. ‘‘అబ్బా.. మొదలైందా’’ అని విసుక్కుంటూ ఫోన్‌ను చేతులోకి తీసుకుంది. క్లోజ్ ఫ్రెండ్ నంబర్ అది. లిఫ్ట్ చేసింది. ‘‘హలో’’ అంది. అవతల నుంచి వినపడ్డ విషయంతో ప్రీతికి బద్దకం వదిలింది. గబగబా తయారై తన ఫ్లాట్‌కు దగ్గర్లో ఉన్న బ్యూటీపార్లర్‌కు పదిహేను నిమిషాల్లో చేరుకుంది. ‘‘మాటలు తిన్నగా రానియ్’’.. ప్రీతిని బెదిరించాడు ఆగంతకుడు. ఆ తీవ్రతకు బ్యూటీపార్లర్లోనిసిబ్బంది అదిరిపడ్డారు. ఆ ఇద్దరు చిన్న పిల్లలు కూడా బిక్కమొహం వేశారు. ఇంకోవైపు ప్రీతి ఫ్రెండ్ విమెన్ ప్రొటెక్షన్ సెల్‌కు పదే పదే ఫోన్ చేస్తోంది. టీమ్‌ను పంపిస్తాం అన్నారు కాని ఆ జాడే లేదు! పార్లర్లో ఇద్దరు బాలికలు! ఓ కస్టమర్లాగే లోపలికి వెళ్లింది. అక్కడ తన ఫ్రెండ్ ఉంది. ఆమె ఎవరో తెలియనట్టే నటిస్తూ ఆ పక్కనే ఉన్న ఇద్దరు అమ్మాయిల పక్కన కూర్చుంది. వాళ్ల వయసు ఏడూ పదకొండేళ్ల మధ్య ఉంటుంది. ‘‘క్యా హోనా మేడం?’’ అడిగింది పార్లర్లో అమ్మాయి. ‘‘క్లీనప్’’ చెప్పింది ప్రీతి. ‘‘థోడా టైమ్ లగేగా’’ ఆ పక్కనే ఉన్న ప్రీతి ఫ్రెండ్‌కు థ్రెడింగ్ చేయడానికి దారాన్ని పంటి కింద పెట్టుకుని సిద్ధమవుతూ చెప్పింది పార్లర్ అమ్మాయి. ‘‘కోయి బాత్ నహీ.. వెయిట్ కరూంగీ’’ అంది ప్రీతి తన ఫ్రెండ్ మొహం చూస్తూ. ఇద్దరూ అపరిచితుల్లా ఉండాలని కళ్లతోనే చెప్పుకున్నారు. ఆదివారం అవడంవల్ల పార్లర్లో వర్కర్స్ తక్కువగా ఉన్నారు. కస్టమర్స్ కూడా పెద్దగా లేరు. ప్రీతి, తన ఫ్రెండ్, ఆ ఇద్దరు అమ్మాయిలు. అంతే.అదే అనుకూలమైన సమయం అనుకొని ఆ పిల్లలిద్దరితో మాట్లాడ్డం మొదలుపెట్టింది ప్రీతి.‘‘పన్నెండేళ్లు కూడా లేవు.. దేనికోసం వచ్చారు మీరు?’’ అడిగింది. ‘‘మేకప్ కోసం’’ చెప్పారు పిల్లలు.‘‘ఏదైనా ఫంక్షనా?’’ అడిగింది. ‘‘పెళ్లి’’.. ‘‘అమెరికా వెళ్తున్నాం’’ ఇద్దరి నుంచి ఒకేసారి.. సంబంధం లేని జవాబులు వచ్చాయి. ఏదో అర్థమైంది ప్రీతికి. ‘‘ఎక్కడుంటారు మీరు?’’ ‘‘మాది గుజరాత్’’ చెప్పింది ఇద్దరిలోకి కాస్త పెద్దపిల్ల. ఇద్దరూ అమాయకంగా, వినయంగా ఉన్నారు. ‘‘మీ వెంట వచ్చినవాళ్లెవరు?’’.. మాటల్లేకుండా తన వెనక విజిటర్స్ లాంజ్‌లో కూర్చున్న వాళ్లవైపు బిగించిన పిడికిలిలోని బొటనవేలును చూపిస్తూ అడిగింది. ఆ పిల్లలిద్దరూ మొహాలు చూసుకుని మౌనంగా ఉండిపోయారు. అయితే తన ఫ్రెండ్ ఫోన్లో వ్యక్తం చేసిన అనుమానం నిజమేనన్నమాట. ప్రొటెక్షన్ టీమ్ కోసం నిరీక్షణ ఇంకేవో వివరాలు అడగడానికి ప్రయత్నించింది ప్రీతి. లాంజ్‌లో ఉన్న మగవాళ్లిద్దరూ అసహనంగా కదలసాగారు. గొంతు పెంచి‘‘ ఔర్ కిత్నా టైమ్ లగేగా? జల్దీ కరో... ఫంక్షన్కా టైమ్ హోరారాహై’’ అరిచాడు ఒకడు పార్లర్ అమ్మాయి మీదకు. ఈలోపు తన ఫ్రెండ్‌కు మెసేజ్ పెట్టింది ప్రీతి. ‘‘నేను వీళ్లను మాటల్లో పెడ్తా.. నువ్వు ఉమెన్ ప్రొటెక్షన్ సెల్‌కు కాల్ చెయ్’’ అని. పిల్లల వైపు తిరిగి ఏదో అడగబోతుంటే ఆ ఇద్దరు మగవాళ్లు విసురుగా దగ్గరకొచ్చారు. ‘‘ఇందాకటి నుంచి చూస్తున్నా.. ఏంటీ ఆరాలు తీస్తున్నారు. మీకెందుకు వివరాలు?’’ అన్నాడు ఒక వ్యక్తి. ‘‘పిల్లలు కదా.. ముచ్చటనిపించి పలకరిస్తున్నా.. మీకెందుకు అంత ఉలుకు?’’అన్నది ప్రీతి. ‘‘మాటలు తిన్నగా రానియ్’’ ప్రీతిని బెదిరించాడు ఇంకో వ్యక్తి. ఆ తీవ్రతకు బ్యూటీపార్లర్‌లోని సిబ్బంది బెదిరారు. ఆ ఇద్దరు చిన్న పిల్లలు కూడా బిక్క మొహం వేశారు. ఇంకోవైపు ప్రీతి ఫ్రెండ్ విమెన్ ప్రొటెక్షన్ సెల్‌కు ఫోన్ చేస్తోంది. టీమ్‌ను పంపిస్తాం అన్నారు కాని ఆ జాడే లేదు. ఈలోపు ఆ ఇద్దరు వ్యక్తులు పిల్లలిద్దర్నీ తీసుకుని పార్లర్ బయటకు వెళ్లబోయారు. ప్రీతి అడ్డుకుంది. ‘‘ఈ పిల్లలు మీకేమవుతారు?’’ అంటూ. ‘‘నీకు చెప్పాల్సిన అవసరం లేదు’’ అని తోసి ముందుకెళ్లబోయారు. తూలిపడబోయిన ప్రీతి తమాయించుకుని, వాళ్లను వెళ్లనివ్వకుండా దారికి అడ్డంగా నిలబడింది. ఈ పిల్లలు మీకు సంబంధించిన వాళ్లే అయితే.. పదండి పోలీస్‌స్టేషన్‌కు వెళ్దాం. నాకెందుకో మీ మీద డౌట్‌గా ఉంది’’ అంది. ‘‘ఏం రుజువులు కావాలి? డీఎన్ఏనా?’’ అంటూ గారపట్టిన పళ్లను బయటపెడుతూ నవ్వాడు ఆ ఇద్దరిలో ఒకడు. ‘‘పోలీసులు అడుగుతారు ఏం వివరాలు కావాలో’’ అంటూ ఇంకోవైపు తన స్నేహితురాలికి సైగ చేసింది.. ఏౖమైంది? అంటూ. నో రెస్పాన్స్ అన్నట్టుగా ఆమె ప్రతిసైగతో ఆన్సర్ ఇచ్చింది, ఆందోళనగా. ట్రాఫికింగ్ నుంచి విముక్తి ‘‘పదండి దగ్గర్లో ఉన్న పోలీస్‌స్టేషన్‌కు’’ అని ఇద్దరు మగవాళ్లతో అంటోంది ప్రీతి, ఇన్‌డైరెక్ట్‌గా తన ఫ్రెండ్‌కు పోలీస్‌కు ఫోన్ చెయ్ అనే హింట్ ఇస్తూ. వాళ్లను వెళ్లనివ్వకుండా కాలయాపన చేయడంలో భాగంగా వాళ్లతో సంభాషణ పొడిగిస్తోంది. ‘‘భయ్యా.. మీ పిల్లలే కావచ్చు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లడంలో తప్పు లేదుగా. ఒకవేళ మీ పిల్లలే అని తేలితే నేను క్షమాపణ కూడా చెప్తా. ఒక్కసారి పదండి’’ అని ప్రీతి బతిమాలుతుంటే బయట నుంచి ఇంకెవరో దారికి అడ్డంగా ఉన్న ప్రీతిని తోసేస్తూ ఆ పిల్లలిద్దరినీ తీసుకుని వెళ్లిపోయాడు. ఆ పరిణామానికి హతాశురాలైంది ప్రీతి. ‘‘పోలీసులకు ఫోన్ చెయ్’’ గట్టిగా అరిచింది తన స్నేహితురాలిని ఉద్దేశించి. మళ్లీ ఒకసారి ఫోన్ కలపబోతుంటే పోలీస్ వ్యాన్ వచ్చింది. అది చూసి పారిపోబోయారు ఆ ఇద్దరు మగవాళ్లు. వాళ్లను పట్టుకొమ్మని పోలీసులను వారించింది ప్రీతి.పట్టుకున్నారు. ప్రీతి స్నేహితురాలు అనుకున్నట్టుగానే ఆ ఇద్దరు చిన్నపిల్లలిద్దరినీ ట్రాఫికింగ్ చేయబోతున్నారు. పిల్లలను తీసుకుని వెళ్లిపోయిన వ్యక్తిని దాదాపు 45 నిమిషాలు చేజ్ చేసి పట్టుకున్నారు పోలీసులు. ఆ పిల్లల్లో పెద్దమ్మాయి వయసు పదకొండేళ్లు. చిన్నమ్మాయి వయసు ఏడేళ్లు. ఇద్దరూ అక్కాచెల్లెళ్లు. వాళ్లు చెప్పినట్టుగానే.. గుజరాత్ నుంచి వచ్చారు. ఆడపిల్లలని వాళ్ల అమ్మానాన్న ఆ పిల్లలను లక్షరూపాయలకు అమ్మేశారు. వీళ్లు ఇంకో లక్షకు ఈ పిల్లలను ఇంకో వ్యక్తికి అమ్మేశారు. ఆ కొన్న అతను ఆ రాత్రి ఈ పిల్లలను అమెరికా తీసుకెళ్లబోతున్నాడు. ప్రీతి అడ్డు పడటంతో వీళ్ల ప్రయత్నాలు ఫలించలేదు. నాకెందుకులే అని ఊరుకోకండి ఇంతగా ధైర్యసాహసాలు కనబర్చిన ప్రీతీ సూద్.. సినిమా, టెలివిజన్ నటి. ఆమె చొరవతో ఆ పిల్లల కథ సుఖాంతం అయింది. ‘‘తర్వాత ఈ విషయం తెలిసి మా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్.. అందరూ తిట్టారు. ముంబైలో ఒంటరిగా ఉంటున్నావ్. ఇలాంటి పనులెందుకు నీకు? అలాంటి వాళ్లకు ముఠా ఉంటుంది. నీ మీద దాడి చేస్తే? అని భయపడ్డారు. ఒక్క క్షణం భయమేసినా.. పర్వాలేదు అనుకున్నా. నేను మాత్రమే బాగుండాలి అని అనుకోవడంలేదు. నా చుట్టూ ఉన్న అందరూ బాగుండాలి అని కోరుకుంటున్నా. ముఖ్యంగా అమ్మాయిల రక్షణ కావాలి. కళ్ల ముందు అన్యాయం జరుగుతుంటే నాకెందుకులే అని ఊరుకోవడం నాకు చేతకాదు. అడ్డుకుంటే వాళ్లు రేప్పొద్దున నన్నేమైనా చేస్తారని భయపడ్డం మరింత అన్యాయం. అందుకే భయపడకుండా కళ్లముందు ఇలాంటి అనుమానాస్పద సంఘటనలు ఏవి ఎదురైనా వెంటనే పోలీసులకు ఇన్ఫామ్ చేయండి. ఆడపిల్లలను రక్షించండి’’ అని అంటోంది ప్రీతి సూద్. – శరాది -
మేకప్ వేసుకోకపోవడానికి కారణం అదే
సాక్షి, సినిమా : నటి సాయిపల్లవి మలయాళ సినిమా ప్రేమమ్‌లో మలర్ టీచర్‌గా నటించి ఒక్క కేరళ ప్రేక్షకులనే కాకుండా తమిళనాడు, ఆంధ్ర ప్రేక్షకులను ఆకట్టుకుని తనవైపు తిప్పుకుంది. ఆ తర్వాత తెలుగులో ‘ఫిదా’తో యువతను ఫిదా చేశారు. ఫిదా, ఎంసీఏ వంటి విజయవంతమైన సినిమాల్లో నటించి అతి తక్కువ సమయంలో మంచి పేరు తెచ్చుకుంది. సాయిపల్లవి దాదాపు మేకప్ లేకుండా నటించేందుకే ఇష్టపడుతుంటారు. ఆ విషయం ఆమె సినిమాలు చూస్తే మనకు స్పష్టంగా తెలుస్తుంది. అందుకు గల కారణాలను ఆమె మీడియాతో పంచుకున్నారు. తన తొలి సినిమా ‘ప్రేమమ్’ దర్శకుడు ఆల్ఫోన్స్ పుతెరిన్ ఆమెను సహజంగా నటించమని ప్రోత్సహించినట్లు తెలిపారు. అలాగే తనతో కలిసి పనిచేసిన అందరు దర్శకులూ తన ఆత్మవిశ్వాసం పెరగడానికి దోహదపడ్డారని పేర్కొన్నారు. అమ్మాయిల్లో ఆత్మస్థైర్యం పెంచడానికి కూడా ఇలా చేస్తున్నట్లు చెప్పారు. విజయ్ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా , సాయిపల్లవి కథానాయికగా నటించిన ‘కణం’, సినిమా మార్చి 9న విడుదల కాబోతోంది. ప్రస్తుతం ధనుష్‌కు జంటగా మారి-2, సూర్యతో సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తోంది. -
మేకప్ లేకుండా నటించడానికి రీజన్ అదే!
చెన్నై : మలయాళంలో 'ప్రేమమ్' సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సాయిపల్లవి. కాలేజీ లెక్చరర్‌గా ఆమె పోషించిన పాత్రతో దేశవ్యాప్తంగా అభిమానులను తన సొంతం చేసుకుంది. మలయాళ కుట్టి అయినప్పటికీ.. ఫిదా సినిమాలో అచ్చ తెలంగాణ అమ్మాయిలా నటించి ఇటు తెలుగు వారి మనసుకు దగ్గరైపోయింది. ప్రస్తుతం కణం సినిమాతో మరోసారి తెలుగు ప్రజలను అలరించబోతుంది. అయితే ఆమె నటించిన తొలి సినిమా దగ్గరి నుంచి సాయిపల్లవి మేకప్ వేసుకోకుండా నటించడం మనం చూస్తూ ఉన్నాం. ఆమె మేకప్‌కు ప్రాధాన్యత ఇవ్వదని ఇట్టే తెలిసిపోతుంది. తాను మేకప్ వేసుకోకుండా నటించడానికి గల కారణాన్ని సాయిపల్లవి టైమ్స్ ఆఫ్ ఇండియాకు రివీల్ చేసింది. ముఖంపై మొటిమలు చూసి భయపడిన టీనేజర్లలో తానూ ఉన్నానని, కొన్నిసార్లు నా ముఖాన్ని చున్నీతో దాచుకునే దాన్ని అని తెలిపింది. అయితే 'ప్రేమమ్' షూటింగ్ సమయంలో తన ఆలోచనలో మార్పు వచ్చిందని, ప్రేమమ్ డైరెక్టర్ ఆల్ఫోన్స్ పుతరెన్, తనను కాస్మోటిక్స్ వాడకుండా సహజంగా నటించడానికి ప్రోత్సహించారని ఆమె చెప్పింది. ఇలా డైరెక్టర్లందరూ తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి, మేకప్ వాడకుండా నటించడానికి ప్రోత్సహించారని పేర్కొంది. తనలాంటి అమ్మాయిలందరికీ ఆత్మస్థైరాన్ని నింపడానికి ఇది ఒక ప్రయత్నమని సాయిపల్లవి తెలిపింది. భవిష్యత్తులో కూడా మేకప్ లేకుండా నటించడానికే ఇష్టపడతానని చెప్పింది. -
ఎర్నాకుళం అమ్మ
ఒక సినిమా నటికి మేకప్‌కు మించిన కవచం ఉండదు. జీవితంలో ఎన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చినా, ఎన్ని కష్టసుఖాలు చూసినా, ఎన్ని ట్విస్ట్‌ల గుండా జర్నీ సాగినా ఫైనల్లీ మళ్లీ కొత్త జీవితం సాగించాలంటే మేకప్‌కు మించిన ఆయుధమూ ఉండదు.లిజీ గుర్తుందా? ఎయిటీస్‌లో స్క్రీన్ మీద ఒక వెలుగు వెలిగిన టాప్ స్టార్. ‘మగాడు’లో రాజశేఖర్ పక్కన, ‘21వ శతాబ్దం’లో సుమన్ పక్కన చాలా హిట్స్ కొట్టింది. తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో ఎన్నో సినిమాలు చేసిన లిజీ దర్శకుడు ప్రియదర్శన్‌ను వివాహం చేసుకుని సినిమాలకు గుడ్‌బై కొట్టింది. 24 ఏళ్ల పాటు కాపురం చేశాక ఇటీవలే విడాకులు తీసుకుంది. కూతురు లావణ్య హీరోయిన్గా అఖిల్ నటిస్తున్న ‘హలో’లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. కొడుకు అమెరికాలో చదువుకుంటున్నాడు. చెన్నైలో స్థిరపడ్డ లిజీ మళ్లీ కొత్త జీవితం కోసం ముఖానికి మేకప్ వేసుకుంది. అదీ మన తెలుగు సినిమా తోనే. పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ నిర్మాత లుగా వ్యవహరిస్తున్న నితిన్ సినిమాలో లిజీ హీరోయిన్‌కు తల్లిగా నటిస్తోంది. ‘న్యూయార్క్‌లో మొదటిసారిగా ఈ షూట్లో పాల్గొన్నాను. చాలా నెర్వస్‌గా అనిపించింది. ఆ తర్వాత మామూలైపోయింది. నాది ఈ సినిమాలో మంచి పాత్ర’ అని లిజీ అంది. అమ్మ పాత్రలు చేసేవాళ్లు రొటీన్ అయినప్పుడల్లా కొత్త అమ్మను ఇండస్ట్రీ పుట్టిస్తుంటుంది. ఈ కొత్త అమ్మతో మరికొన్ని మంచి పాత్రలు మెరుస్తాయని ఆశిద్దాం. -
సవాల్ లాంటి రోల్!
మిల్కీ బ్యూటీ తమన్నా మేకప్ అవసరం లేనంత అందంగా ఉంటారు. కానీ, సినిమా కోసం లైట్‌గా అయినా మేకప్ చేసుకోవాల్సిందే. ఒక్కోసారి ఆ అవసరం కూడా లేని పాత్రలు వస్తుంటాయ్. అప్పుడు మాత్రం నాకు భలే ఆనందంగా ఉంటుందని తమన్నా అంటుంటారు. ఆల్రెడీ తమిళ చిత్రం ‘ధర్మదురై’లో ఈ బ్యూటీ మేకప్ లేకుండా చేశారు. ‘బాహుబలి’లో డీ–గ్లామరైజ్డ్గా కనిపించిన విషయాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ప్రభుదేవా సరసన చేయనున్న సినిమాలోనూ డీ–గ్లామరైజ్డ్గా కనిపించనున్నారని టాక్. ఇందులో తమన్నా మూగ, చెవిటి అమ్మాయిగా నటించనున్నారు. ఇది సవాల్ లాంటి పాత్ర. తమన్నా ఇలాంటి సవాళ్లను సునాయాసంగా జయించేస్తారని చెప్పొచ్చు. కథానాయికగా దాదాపు పదేళ్ల ఎక్స్పీరియన్స్ తమన్నాకి ఉంది. ఆ అనుభవంతో ఈ పాత్రలో జీవించేస్తారని ఊహించవచ్చు. -
కర్నూలు వాసికి ఉత్తమ మేకప్‌మెన్ అవార్డు
కర్నూలు (అగ్రికల్చర్) : కర్నూలు వాసికి ఉత్తమ మేకప్‌మెన్‌గా అవార్డు లభించింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో నంది నాటకోత్సవాలు జరిగాయి. పద్య, నాటక విభాగంలో శ్రీకృష్ణ భీమసేనం నాటకానికి సంబంధించి కర్నూలుకు చెందిన చింత శ్రీనివాసులుకు ఉత్తమ మేకప్‌మెన్‌గా నంది అవార్డు లభించింది. కర్నూలు అభిఆర్ట్స్కు చెందిన చింతా శ్రీనివాసులు ఇదివరకే ఐదు అవార్డులు దక్కించుకున్నారు. తాజాగా మరో అవార్డు దక్కడం విశేషం. కర్నూలు వాసికి అత్యుత్తమమైన అవార్డు దక్కడంపై కళాకారులు అభినందనలు తెలిపారు. -
టీడీపీని వీడితే మైనార్టీలపై కేసులా?
–మంత్రి పల్లెకు మేకప్‌పై ఉన్న శ్రద్ధ ప్రజల సమస్యలపై లేదు –వైఎస్సార్సీపీ పుట్టపర్తి సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి కొత్తచెరువు : టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరిన ముస్లిం మైనార్టీలపై మంత్రి పల్లె రఘునాథరెడ్డి పోలీసుల ద్వారా అక్రమ కేసులు బనాయించడం అన్యాయమని వైఎస్సార్ సీపీ పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి విమర్శించారు. గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో భాగంగా శనివారం మండలంలోని వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి లోచర్ల విజయభాస్కర్‌రెడ్డి నివాసంలో ఆయన విలేకరులతో మాట్లడారు. మంత్రి పల్లెకు మేకప్‌పై ఉన్న శ్రద్ధ నియోజకవర్గ ప్రజలపై లేదని మండిపడ్డారు. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా, రెండున్నర సంవత్సరం మంత్రిగా ఉన్న పల్లె మైనార్టీలకు చేసింది ఏమీలేదని, దీన్ని గుర్తించి దొన్నికోటకు చెందిన ముతవల్లి మహమ్మద్ రసూల్, మరో 50 కుటుంబాలు పార్టీలో చేరితే వారిపై అక్రమ కేసులు, పోలీసులతో వేధింపులు దిగిడం మంత్రి పల్లె నీచ రాజకీయాలకు నిదర్శనమన్నారు. ఇలాంటి వాటికి భయపడేది లేదని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి డీఎస్ కేశవరెడ్డి, సంయుక్త కార్యదర్శి లోచర్ల విజయభాస్కర్‌రెడ్డి, మండల కన్వీనర్ నారేపల్లి జగన్మోహన్రెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, లోచర్ల రాజారెడ్డి, సర్పంచ్ సంజీవరెడ్డి, నాయకులు వలీ, రసూల్, రామసుబ్బరెడ్డి, సోమశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. -
మే‘కప్పు’కుందామిలా..
సాక్షి,వీకెండ్: రెయినీ, వింటర్ సీజన్లలో మేకప్ వేసుకోవడమంటే గగనమనే చెప్పాలి. ఈ కాలాల్లో మామూలు రోజుల్లో కంటే ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. మాన్సూన్లో వేసవి సీజన్లో కంటే రెట్టింపు ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తుంది. సిటీలోని ప్రముఖ మాల్స్‌లో బాడీ నీడ్స్, ఫారెస్ట్ ఎసెన్షియల్స్ లాంటి సీజన్‌కి తగ్గట్టు బాడీ, స్కిన్ టైప్‌కి సంబంధించి వివిధ రకాల క్రీమ్‌లు, జెల్లు, మేకప్ ప్రొడక్ట్స్ రూ.100 నుంచి దొరుకుతున్నాయి. వర్షాకాలంలో మేకప్, హెయిర్ కేర్‌కు ఇవి ఉపకరిస్తాయి. – శిరీష చల్లపల్లి కన్సీలర్, షాడోస్, ఫౌండేషన్.. ఇలా రకరకాల క్రీమ్‌లు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా క్లెన్సర్స్, ఫేస్ క్రీమ్స్, సోప్స్ వంటి వాటిని ముఖానికి వాడుతుంటారు. అయితే ఇవన్నీ ప్రస్తుతానికి పక్కనపెట్టి ఫోమ్ జెల్, ఆయిల్ ఫ్రీ లోషన్స్ ఉపయోగించాలని సిటీలో పేరొందిన మేకప్ నిపుణులు సూచిస్తున్నారు. వీరు చెబుతున్న మరిన్ని సూచనలు.. ► ఫౌండేషన్లకు, లిప్‌స్టిక్‌లకు వీలైనంత దూరంగా ఉంటే మంచిది. అవసరమైతే లిప్ గ్లాస్, బ్రోజింగ్ జెల్ లిప్ షైనర్లను వాడొచ్చు. ఇప్పుడు మార్కెట్లో స్ట్రాబెర్రీ, గో వా, బ్లూబెర్రీ, వెనీలా, గ్రేప్ వంటి రకరకాల ఫ్లేవర్లలో, రంగులతో సై తం లిప్ గ్లాస్లు దొరుకుతున్నాయి. వీటిని ఉపయోగించొచ్చు. ఇవి ఉపయోగిస్తే ఫ్రెష్‌గా కనపడతారు. ► టింటెడ్ మాయిశ్చరైజర్‌తో మేకప్ వేసుకోవాలి. రకరకాల క్రీమ్‌ల జోలికి పోకుండా పౌడర్ పఫ్ కాస్త తడి చేసి పౌడర్ అద్ది దానితో లైట్‌గా టచ్ అప్ చేసుకుంటే చాలు. అయితే ఎక్కువ వాటర్ అద్దకుండా చూసుకోవాలి. లేదంటే ముఖంపై అచ్చులు కనిపిస్తాయి. ► వాటర్ ప్రూఫ్ ఐ లైనర్, ఐ షాడోస్, మస్కారా, అండర్ ఐ కన్సీలర్ వాడటం మంచిది. ఇవి వర్షానికి గానీ, ఎండకు గానీ కరగకుండా ముఖం తేజస్సుగా అందంగా కనిపించటానికి దోహదపడతాయి. ► మంచి హెయిర్ వాషెస్ లేదా లైట్ హెర్బల్ షాంపూలతో తల స్నానం చేయాలి. కండిషనర్‌ని ఎక్కువగా వాడకూడదు. తల అరబెట్టుకోవడానికి డ్రయర్లు వాడితే మంచిది. వానలో తడిసిన తల అరకుండానే జడ వేసుకోకూడదు. మంచి పెర్ఫూ్యమ్ తో కూడిన హెయిర్ స్ప్రేలు సైతం మార్కెట్లో దొరుకుతున్నాయి. వర్షానికి, తలలోని తేమతో వెంట్రుకల కుదుళ్లు పాడవకుండా ఉండాలంటే డీప్ ఫ్రీజ్ సెరమ్లను వాడాలి. వర్షాకాలంలో బయటికి వెళ్లేటప్పుడు చర్మానికి, మేకప్‌కి తగ్గ అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. -
మేకప్ తో కనిపిస్తే నన్ను క్షమించండీ..!
బిగ్ బాస్ 7 సిరీస్ అనగానే మొదట గుర్తుకొచ్చే పేరు సోఫియా హయత్. ఎందుకంటే వైల్డ్ కాల్డ్ ఎంట్రీ ద్వారా ఎంటరైన అప్పటి టాప్ మోడల్.. అర్మాన్ కోహ్లీతో గొడవ వల్ల ఆమెను సిరీస్ మధ్యలోనే ఇంటికి పంపివేసిన విషయం తెలిసిందే. సింగర్, మోడల్ అయిన సోఫియా ఇటీవల నన్(సన్యాసిని) గా మారినట్లు ప్రకటించింది. అయితే కొన్ని వారాలుగా ఆమె మేకప్ వాడుతోందని, అందానికే ఇంకా ప్రాధాన్యం ఇస్తున్నదంటూ విమర్శులు వెల్లువెత్తాయి. 'మేం మేకప్ లేకున్నా చాలా అందంగా ఉంటాం. హెయిర్ కలర్, ఫ్యాషన్ ఫాలోయింగ్ లేకున్నా సరే' అందంగానే కనిపిస్తామంటోంది. నన్ గా మారిన తర్వాత ఎవరైనా తనను మేకప్ లో చూసినట్లుగా భావిస్తే ఉంటే దయచేసి నన్ను క్షమించండి అంటూ బహిరంగంగా ప్రకటించింది. అప్పటి జీవితం వేరు.. ఇప్పటి లైఫ్ వేరని, గతంలో తాను చేయించుకున్న సర్జరీల వల్లే ఇంకా అందంగా కనిపిస్తున్నానంటూ చెప్పుకొచ్చింది. ఇక తనకు పెళ్లి చేసుకోవాలని, శృంగారంలో పాల్గొనాలనే ఆలోచనలు రావని అంటోంది. ఇకనుంచీ తాను తన పిల్లల కోసం బతుకుతానని, ప్రపంచం అంతటికీ తల్లినవుతానని చెప్పింది. ప్రేమించడం తప్పుకాదని, ప్రతి ఒక్కరూ ప్రేమ పొందగలగాలని ఆమె అభిప్రాయపడింది. గతంలో క్రికెటర్, మాజీ బాయ్ ఫ్రెండ్ రోహిత్ శర్మ 264 పరుగులు చేసినప్పుడు అతడికి బహుమతిగా తన నగ్న సెల్ఫీని ట్విట్టర్లో పోస్ట్ చేసి సంచలనం సృష్టించిన ఆమె ఇప్పుడు పూర్తిగా మారిపోయానని గతంలో చేసిన తప్పులు మళ్లీ చేసేందుకు సిద్ధంగా లేనని సోఫియా వివరించింది. -
ఎండా .. వాన.. మేకప్!
బ్యూటిప్స్ వేసవిలో అక్కడక్కడా వర్షాలూ పడుతున్నాయి. ఎండ, ఉక్కపోత, వర్షం.. ఈ కాలం మేకప్ వేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది. చెమట వల్ల అసౌకర్యంగా ఉండటమే కాకుండా ముఖసౌందర్యం కోల్పోతామేమో అనే సమస్య కూడా తలెత్తుతుంది. ఈ కాలం మేకప్ వేసుకోవాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి.... మేకప్ చేసుకునేముందు ఫేస్ వాష్‌తో ముఖాన్ని ఒకసారి శుభ్రం చేస్తే చాలు. ఒకటికి మూడు సార్లు కడిగి, మరీ చర్మం పొడిబారేలా చేయకూడదు.ఈ కాలం చెమట అధికం కనుక వాటర్‌ప్రూఫ్ మేకప్ సామగ్రిని ఎంచుకోవాలి. నప్పుతుందో మీ చర్మం రంగును బట్టి మీకు నప్పే స్కిన్ షేడ్‌ను, ఫౌండేషన్, ప్రైమర్, కన్సీలర్లను ఎంచుకోవాలి.ముందు బేస్‌గా ప్రైమర్‌ని ముఖమంతా రాయాలి. దీని వల్ల పోర్స్ వెడల్పు అవుతాయి. మొటిమల వల్ల అయిన మచ్చలు, ఫైన్ లైన్స్, ముడతల ు కనిపించవు. ఫౌండేషన్‌కి మాయిశ్చరైజర్‌గా ప్రైమర్ పనిచేస్తుంది. మేకప్ ఎక్కువ సమయం పాడవకుండానూ ఉంటుంది. ఫౌండేషన్ ప్యాచులుగా చర్మానికి పట్టే సమస్య కూడా ఉత్పన్నం అవదు. నిద్రలేమి, ఒత్తిడి కారణంగా కళ్లకింద చర్మం ఉబ్బు ఉంటే మేకప్ వేసుకోకూడదు. ఆ వాపు తగ్గడానికి గోరువెచ్చని టీ బ్యాగ్‌తో కొద్దిసేపు కాపడం పెట్టాలి. డార్క్ ఐ లైనర్‌తో కళ్లను తీర్చిదిద్దాలి. లిప్‌స్టిక్ తర్వాత లిప్‌గ్లాస్‌ను కూడా ఉపయోగించాలి.ఈ కాలం మెరుపుల కోసం ఏ ఇతర గ్లిటర్స్ని ఉపయోగించకపోవడమే మంచిది. ముఖంలో కనిపించేవి ముందు పెదాలు, కళ్లు మాత్రమే. అందుకే లిప్‌స్టిక్, ఐ షాడో, మస్కారాలను ఉపయోగించేటప్పుడు శ్రద్ధ తీసుకోవాలి. -
పిడకల వేట
హ్యూమర్ ఫ్లస్ సుబ్బలక్ష్మి, సుబ్బారావు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రేమ తర్వాత సీక్వెల్ యుద్ధమే. గాల్లోకి అనేక వస్తువులు లేవడం వల్ల సుబ్బారావు మూతి పచ్చడై మేకప్ అవసరం లేని హనుమంతుడిలా మారాడు. ఈ విషయం ఎలాగో తెలుసుకున్న టీవీ వాళ్లపరుగులు తీశారు. తొక్కిసలాటలో కొందరు కెమెరావాళ్లు గాయపడ్డారు. ‘మేడమ్.. మీ మధ్య గొడవెలా ప్రారంభమైంది?’ అడిగారు. ‘కొబ్బరి చెట్నీ చేయమని చెప్పాను. కుదరదు పచ్చడైతే చేస్తానన్నాడు’. ‘అంటే వంట మీరు చేయరా?’. ‘అది మా ఇంటావంట లేదు. అందుకే ఆయనకి ఒంట పట్టించా’. ‘చెట్నీ, పచ్చడి రెండూ ఒకటే కదా’. ‘అది ఇంగ్లిష్. ఇది తెలుగు. నాది ఇంగ్లిష్ స్టయిల్’. ‘సుబ్బారావు గారూ.. మీరేమైనా చెబుతారా?’ మూతికి, ముక్కుకి మధ్యనున్న బ్యాండేజ్లోంచి ‘కీ కిక్ కిర్’మని ఆయన ఏదో సౌండ్ చేశాడు. ‘సౌండ్ ఆఫ్ మ్యూజిక్ భాషలో ఆయన ఏదో చెప్పాలనుకుంటున్నారు మేడమ్. మీరు కొంచెం ట్రాన్స్‌లేట్ చేస్తారా?’. ‘రిలేషన్స్‌లో ట్రాన్స్‌లేషన్స్ తప్పవు. చింత చచ్చినా పులుపు చావలేదని సౌండిచ్చాడు’. ‘మీరు ఇంతలా చావబాదారంటే, మీ మధ్య పాతకక్షలేమైనా ఉన్నాయా?’ ‘చావడం వేరు. బాదడం వేరు. రెంటిని సంధి చేయకండి. భార్యా భర్తల మధ్య సంధి ఉండదు. ఒకవేళ ఉన్నా అది దుష్టసంధి. ఒకసారి పెళ్లంటూ జరిగితే పాతకక్షలు ఎలాగూ తప్పవు. జ్యూరీ కంటే ఇంజ్యూరీ పవర్ఫుల్’. టీవీ వాళ్లు వచ్చారని పోలీసులొచ్చారు. ‘ఇంతకాలం హింస వీధుల్లోనే ఉందని అనుకున్నాం ఇప్పుడు ఇళ్లలోకి కూడా వచ్చింది. దీనికి పోలీసుల సమాధానమేంటో విందాం’. ‘శాంతిని భద్రంగా కాపాడడమే మా డ్యూటీ’. ‘శాంతా? ఆవిడెవరు?’ ఈ కేసుని మీరు తప్పుదోవ పట్టిస్తున్నారు’. ఇన్స్పెక్టర్ని చూసి సుబ్బారావు ‘కకాకికీకై’ అని మూలిగాడు. ‘చిన్నప్పుడు నేర్చుకున్న క గుణింతం గుర్తుకు తెచ్చుకున్నాడంటే ఇతను కరుడు గట్టిన వ్యక్తని మా అనుమానం’. ‘పరుషములు సరళములైనా, సరళములు పరుషములైనా లా అండ్ ఆర్డర్‌ని కాపాడ్డమే మా విధి’’ - ఇన్స్పెక్టర్. ‘బాధ్యత గల అధికారిగా ఉండి కూడా విధి రాతని తప్పించలేమని వేదాంతం చెబుతున్నాడంటే ఈ వ్యవస్థ ఎంత అధ్వాన్నంగా ఉందో మనకు తెలుస్తోంది’. ఇంతలో ఆ ఏరియా రాజకీయ నాయకుడొచ్చి.. ‘ఈ ఏరియా నాది, ఇక్కడేం జరిగినా నేను చెప్పినట్టే ప్రజాస్వామ్యయుతంగా జరగాలి. కొట్టుకోవడం భార్యాభర్తల డ్యూటీ, కవరేజీ మీ డ్యూటీ, అందరూ ఎవరి డ్యూటీలు వాళ్లు చేస్తూ ఉంటే ఇక మాకేం డ్యూటీ మిగిలిందో చెప్పండి’ అన్నాడు. మహిళా సంఘాల వాళ్లూ కూడా వచ్చారు. ‘స్త్రీకి పురుషుడు కనపడని హింస. పురుషుడికి స్త్రీ కనపడే హింస. హింసకి హింస సమాధానమంటే ఒప్పుకోం. హింస హింసో రక్షితః అన్నారు. అందువల్ల ఈ సుబ్బారావు తనని తానే గాయపరుచుకుని, బ్యాండేజీతో డామేజీ చేయాలని చూస్తున్నాడు’. సుబ్బారావు ఈసారి ‘కౌ కృ, కొ కో’ అని శబ్దం చేశాడు. ‘గాయపడి కూడా క్రూరమైన శబ్దాలు చేస్తున్నాడంటే ఇతను భార్యద్వేషి అని అర్థమౌతోంది’. ఇదే సమయానికి టీవీ స్టూడియోల్లో వివాహ వ్యవస్థ-ఒక అవస్థ అని చర్చావేదిక ప్రారంభమైంది. వాదం తీవ్రవాదమై నలుగురు వక్తలు, ఇద్దరు యాంకర్లు గాయపడ్డారు. మూడు రోజుల తర్వాత సుబ్బలక్ష్మి, సుబ్బారావు చెట్టాపట్టాలేసుకుని ట్యాంక్‌బండ్ పైన ముక్కు మూసుకుని నడుస్తూ కనిపించారు. ‘యూత్ డామేజ్డ్ బై లవ్ మ్యారేజి ప్రోగ్రాం టీవీల్లో ఇంకా వస్తూనే ఉంది. - జి.ఆర్.మహర్షి -
సోగ్గాడు
అద్దం ముందు అరనిమిషం నుంచుంటే... ఆడవాళ్లలా అంతసేపేమిటో మేకప్ అంటూ ఎద్దేవా... కాసింత బాగా డ్రెసప్ అయితే చాలు అబో!్బ అమ్మాయిల్ని మించిపోయి సోకులు చేస్తున్నావే అంటూ వ్యంగ్యోక్తులు... ఇవన్నీ ఇప్పుడు గతమైపోయాయి. పురుషులు సైతం మహిళలను తలదన్నేలా సౌందర్యాన్ని సంతరించుకునే పనిలో పడ్డారు. చక్కదనాల చుక్కడు... వంపుసొంపుల వయ్యారుడు... అంటూ పొగిడించుకోవాలనే స్థాయిలో ఈ తపన పెరిగిపోతుండడంతో మెన్స్ పార్లర్ సేవలు అంతకంతకూ విస్తరిస్తున్నాయి. ఆడది మాత్రమే కాదు మగవాడైనా సరే అందంగా కనపడకపోతే ఎలా... అనే ఆలోచన విస్తరించి, ఇప్పుడు ఈ విషయంలో ఆడవారిని మించి మగాడు ముందుకొచ్చేస్తున్నాడు. నీల్సన్ ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం... దాదాపు 34 శాతంగా ఉన్న ఇండియన్ మెన్స్ గ్రూమింగ్ మార్కెట్‌కు ఇప్పుడు ఊపు నిస్తోంది మగవాళ్ల సౌందర్యస్పృహే. ఈ మార్కెట్ పెరుగుదల వేగం మహిళల గ్రూమింగ్ మార్కెట్ వేగాన్ని అధిగమించిందట. తారలే స్ఫూర్తిగా... మగవాళ్లలో పెరుగుతున్న సౌందర్యపోషణ నేపథ్యంలో వారివైపు దృష్టి సారించాయి కాస్మెటిక్ బ్రాండ్స్. అందమైన కేశాలివిగో అంటూ గార్నియర్‌కు జాన్ అబ్రహాం, చర్మ సౌందర్యానికి నివియా టాక్ వాడమని అర్జున్ రామ్‌పాల్ వంటి బాలీవుడ్ నటులు ప్రకటనల సాక్షిగా చెప్పే మాటలకి ఆకర్షితులవుతున్న మగవాళ్ల సంఖ్య పెరుగుతోంది. ‘‘చక్కగా కనిపించడం మగవాళ్లకి కూడా అవసరం. ఎండలో ఎక్కువ గడిపే పురుషుల చర్మంపై సూర్యుని యువి రేసెస్ తీవ్ర ప్రభావం చూపుతాయి’’ అంటూ మాజీక్రికెటర్ రాహుల్ ద్రవిడ్ చిన్నితెరపై ప్రకటనలు మగవాళ్లను బ్యూటీ ప్రొడక్ట్స్ కోసం బారులు తీరేలా చేస్తున్నాయి. మరోవైపు చక్కగా పనిచేయడం మాత్రమే కాదు చక్కగా కనపడడం కూడా అంతే ముఖ్యం అంటూన్న కార్పొరేట్ కంపెనీలు సిబ్బంది లుక్కు బాగా ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి. విభిన్న నేపథ్యాల నుంచి ఐటీ రంగంలోకి ప్రవేశించే పురుషుల్లో అందంపై స్పృహ పెంచడానికి ప్రత్యేకంగా గ్రూమింగ్ క్లాసెస్ సైతం నిర్వహిస్తున్నాయి. బెస్ట్ డ్రెస్డ్ ఎంప్లాయీ ఆఫ్ ది వీక్ వంటి అవార్డ్స్‌తో మగవాళ్లలో సెల్ఫ్లుక్ పట్ల ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి. రోజువారీ... సౌందర్యపోషణే మరి వారాంతపు దినాల్లో మాత్రమే కాదు, ప్రతి రోజూ పార్లర్‌కు వెళ్లే మగవాళ్లు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. రోజువారీ మీటింగ్‌లు, పార్టీస్‌కి అటెండవ్వాల్సి రావడం వంటి అవసరాలతో డైలీ గ్రూమింగ్ రొటీన్‌కు పురుషులు అలవాటు పడుతున్నారు. ‘‘ప్రతి రోజూ మా సెలూన్‌కి వచ్చి మినిమం థర్టీ మినిట్స్ నుంచి వన్ అవర్ దాకా స్పెండ్ చేసే మగవాళ్లకి కొదవలేదు’’ అని బంజారాహిల్స్‌లోని మేనియా సెలూన్ నిర్వాహకులు సచిన్ అంటున్నారు. పురుషులకు ఉపకరించే స్కిన్ లెటైనింగ్, హెయిర్ కలర్ ప్రొడక్ట్స్ పార్లర్స్‌లో తప్పనిసరిగా ఉంచాల్సిన ఉత్పత్తులుగా మారాయి. పలు రకాల క్రీమ్స్, లోషన్స్, ఫేస్ స్కర్బ్స్, షవర్ జెల్స్ వంటివి వాడకానికి వీరు సిగ్గుపడడం లేదు. దేశంలో స్కిన్ క్రీమ్ ఉత్పత్తుల మార్కెట్ 27 శాతం కాగా అందులో పురుషులకు సంబంధించినవి 41 శాతం ‘‘మేల్ స్కిన్ కేర్ ఇప్పుడు బ్యూటీ ఇండస్ట్రీలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సెక్టార్స్‌లో ఒకటి. ఎక్సర్సైజ్, మంచి ఫుడ్‌తో పాటు గ్రూమింగ్ రొటీన్ కూడా పురుషుల దినచర్యలో భాగమైంది’’ అని ది బాడీషాప్ ఇండియా సీనియర్ మేనేజర్ సంజాలి గిరి అంటున్నారు. బాగా కనిపించడమే బాగా కొనిపిస్తోంది... బ్యూటీ గ్రూమింగ్ మీద పెరిగిన ఆసక్తి మగవాళ్లలో షాపింగ్ సరదాను ప్రేరేపిస్తోందని అసోసియేషన్ ఆఫ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (అసోచామ్) చేసిన సర్వే ప్రకారం... మగవాళ్లు గ్రూమింగ్ మీద ఆడవాళ్ల కన్నా బాగా ఖర్చు పెడుతున్నారట. సర్వే చెప్పిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... 85 శాతం మంది తమ సౌందర్య పోషణ ఉత్పత్తులను ఇంటి అవసరాలతో, భార్యల కొనుగోళ్లతో సంబంధం లేకుండా విడిగా కొనుగోలు చేస్తున్నారట. షేవింగ్ క్రీమ్స్, మాయిశ్చరైజర్స్, ఫేస్ మాస్క్స్, ఎక్స్ఫొలయేటర్స్, హెయిర్‌కేర్, హెయిర్ స్టైలింగ్ సొల్యూషన్స్... వంటి వి పురుషుల ఎంపికగా మారుతున్నాయి. బాత్, షవర్ జెల్స్, ఫేస్ వాష్, డియోడరెంట్స్... తదితర అవసరమైన బాతింగ్ ఉత్పత్తులు తమకు ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటున్నారని సర్వే వెల్లడించింది. మార్కెట్ విస్తృతికి ఇది దోహదం చేస్తోందని అసోచామ్ ప్రతినిధులు అంటున్నారు. ‘‘మగవాళ్లు తమకు మాత్రమే ప్రత్యేకించిన అప్టుడేట్ ఉత్పత్తుల కోసం తరచుగా వాకబు చేస్తున్నారు’’ అని ఐటిసి లిమిటెడ్ పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ బిజినెస్‌కు చెందిన బిజినెస్ హెడ్ నిరంజన్ ముఖర్జీ అంటున్నారు. వెటైనింగ్- ఫెయిర్‌నెస్ అంశాల్లో ఎదుగుతున్న పట్టణాలకు చెందిన పురుషులు ఆసక్తి చూపుతున్నారని నివియా ఇండియా రక్షిత్ హర్గావె వెల్లడించారు. - ఎస్.సత్యబాబు -
చర్మం పొడిబారకుండా...
బ్యూటిప్స్ చలికాలం చర్మం పొడిబారి దురదగా అనిపిస్తుంటుంది. ఈ సమస్య దరిచేరకుండా ఉండాలంటే... మాయిశ్చరైజింగ్ క్రీములు, మేకప్ ఉత్పత్తులలో ఆల్కహాల్ శాతం ఎక్కువ ఉంటుంది. అందుకని చలికాలం సౌందర్య ఉత్పత్తులను ఎక్కువ వాడకపోవడమే మంచిది.తేనె, రోజ్ వాటర్ సమపాళ్లలో కలిపి ముఖానికి పట్టించాలి. 15 నిమిషాలు అలాగే ఉంచి, తర్వాత శుభ్రపరుచుకోవాలి. పొడి చర్మానికి మేలైన ప్యాక్. చర్మం చక్కగా శుభ్రపడుతుంది. మృదువుగా అవుతుంది.సహజసిద్ధమైన వెన్న, నూనె, గ్లిజరిన్‌లను చలికాలంలో మాయిశ్చరైజర్లుగా ఉపయోగించడం మంచిది. గుడ్డు పచ్చ సొనలో టీ స్పూన్ తేనె, టీ స్పూన్ పాల పొడి కలిపి ముఖానికి చేతులకు పట్టించాలి. మృదువుగా మర్దనా చేసి, 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. కలబంద (అలొవెరా) రసం శరీరానికి పట్టించి, అరగంట తర్వాత స్నానం చేయాలి. సౌందర్య ఉత్పాదనల వల్ల చర్మానికి అప్పటి వరకు ఏదైనా హాని కలిగినా దాని నుంచి కలబందరసం ఉపశమనం కలిగిస్తుంది.విటమిన్-ఎ, ఇ ఉన్న పప్పుధాన్యాలు, ఆకుకూరలు, చేపలను ఆహారంగా తీసుకోవాలి. రోజులో 10 గ్లాసుల నీళ్లు తాగాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే చర్మం మృదుత్వం కోల్పోదు. -
తమన్న సౌందర్య రహస్యం ఇదే!
అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం అన్నారో కవి. అంతటి మధురానందం ఉన్న అందం కోసం అందరూ ఆశ పడతారు.మగువలు మరీనూ. అయితే అందాన్ని కాపాడుకోవడం ఎలా? అన్నది చాలా మందిలో కలిగే ప్రశ్న. అలాంటి వారికి మిల్కీ బ్యూటీ తమన్న సౌందర్య రహస్యం సమాధానం కావచ్చు. అందానికి అందం తమన్న. నవ నవలాడే ఆమె మేను అందాల సీక్రెట్ తమన్న మాటల్లోనే చూద్దాం. నా దినచర్య చాలా నిబద్ధతతో కూడి ఉంటుంది. ఆహార నియమాలు పాటిస్తాను. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా బ్రెడ్ శాండ్విచ్,ఆమ్లేట్‌ను తీసుకుంటాను. మధ్యాహ్నం ఒక్క చపాతి, రైస్,చికెన్ ఫ్రై తింటాను. నేను ముంబైలో పుట్టి పెరిగినా చపాతీ అంటే అంతగా ఇష్టం ఉండదు. అందుకే మధ్యాహ్నం వరి అన్నమే తింటాను. మధ్యలో గంటకోసారి కాయగూరల సూప్ తీసుకుంటాను. ఇక ఆయిల్ ఫుడ్‌ను తక్కువ మోతాదులో తింటుంటాను. రోజుకు మూడు పూటలా ఫుల్‌గా భోజనం లాగించేయకుండా కొంచెం కొంచెం ఆరు సార్లు తింటాను. ఇక సౌందర్య టిప్స్ గురించి చెప్పాలంటే షూటింగ్ సమయంలో లైట్స్ ముందు, ఎండల్లో నిలబడటం వల్ల ముఖం నల్లబడుతుంది. అందువల్ల రోజూ శెనగపిండిలో పెరుగు కలిపి ఆ గుజ్జును ముఖానికి పట్టించి కొంత సేపు తరువాత చల్లని నీళ్లతో కడిగితే ముఖచాయ పెరుగుతుంది. రాత్రి వేళల్లో పడుకునే ముందు తలకు కొబ్బరి నూనె పట్టించి మసాజ్ చేసుకుంటే రక్తప్రసరణ జరిగి జుత్తు రాలకుండా ఉంటుంది.చల్లని నీళ్లతో స్నానం చేయడం మంచిది. అన్నిటికంటే ప్రశాంతమైన నిద్ర చాలా మేలు చేస్తుంది. సమయం దొరికినప్పుడల్లా మంచి కవితలు చదువుతాను. టెన్షన్‌గా ఉంటే మంచి సినిమా పాటలు వింటాను.ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటాను.మంచినీళ్లు, పళ్ల రసాలు అధికంగా తీసుకుంటాను. షూటింగ్ లేకుంటే ముఖానికి మేకప్ వేసుకోను. అదే విధంగా షూటింగ్‌ను రాత్రి ఎంత ఆలస్యంగా ఇంటికి వచ్చినా మేకప్ కడిగే పడుకుంటాను.చదువుకునే రోజుల్లో ఎక్కువగా చుడీదారులే ధరించేదాన్ని. నటిని అయిన తరువాత రకరకాల నా దుస్తులను చూసి స్నేహితురాలు ఆశ్చర్యపోతుంటారు. బయట కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు చీరలు ధరించడానికే ఇష్టపడతాను. ఇంట్లో ఉంటే నా ఫేవరేట్ డ్రస్ టీషర్టు, జీన్స్ పాంటు. శారీరక కసరత్తులు చాలా అవసరం. నేను నిత్యం ఎక్సర్సైజులు చేస్తాను. స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం. చివరిగా యోగా చేస్తాను. ఇవీ నేను పాటించే బ్యూటీ టిప్స్. -
బ్యూటిప్స్
పార్టీలు కానీ పండుగలు కానీ వచ్చాయంటే అమ్మాయిలు వేసుకునే మేకప్‌లో తప్పకుండా లిప్‌స్టిక్ ఉండాల్సిందే. యువత స్మైల్ వెనుక ఉండే కొండంత కాన్ఫిడెన్స్ ఈ లిప్స్టిక్కే అంటున్నారు బ్యూటీషియన్లు. మరి అలాంటి వాటిలో జాగ్రత్తలు, చిట్కాలు పాటించకపోతే ఎలా? అందుకే ఇవి.. -
దయ్యాల్ని భయపెట్టే మేకప్
నెట్‌ఇంట్లో వింతైన విడియోలు, గమ్మత్తై పోస్టులు, కత్తిలాంటి కామెంట్లు, దిమ్మతిరిగించే డిజిటల్ మాయాజాలాల నిలయం నెట్టింట్లోకి మరోసారి లాగిన్ అవుదాం. సోషల్ మీడియా సామ్రాజ్యంలో సెర్చి ఇంజన్ పై నెక్కి సైబర్ సూపర్ హైవేపై పరుగులు తీద్దాం. షార్టు ఫిల్ము, స్మార్ట్ఫోను, బుల్లి బాద్షా, భలే మేక ప్ ఉమన్.... కాదేదీ సోషల్మీడియాకనర్హం. ఈ వారం పోస్టులు ఫస్టు క్లాసుగా, బెస్టు బెస్టుగా వైరల్ ఫీవర్‌ను ప్రపంచానికి అంటిస్తున్నాయి. ఓ లుక్కేయండి మరి! డబుల్ రోటీ బాగుంటుంది. డబుల్ డెక్కర్ బాగుంటుంది. డబుల్ ధమాకా బాగుంటుంది. కానీ డబుల్ కళ్లు, డబుల్ముక్కులు, డబుల్ నోళ్లు ఉన్న మనిషి ఉన్నట్టు మన మధ్య ఊడిపడితే......? బెంబేలెత్తిపోతాం. ‘‘బాబోయ్ భూతం’’ అంటాం. పరుగో పరుగు అంటూ పారిపోతాం. ప్రామిస్ ఫాన్ అనే అమ్మాయి సరిగ్గా ఇలాగే కనిపించింది. ఆమెకి డబుల్ రోటీలా రెండు జతల కళ్లు, డబుల్ డెక్కర్ లాగా ముక్కు మీద ముక్కు. డబుల్ ధమాకా ఏమిటంటే ఆమెకి నోరు కింద నోరు. అందాలన్నీ డబుల్ డోసులో ఉన్న ఈ అమ్మడిని చూసి ఊరు ఊరంతా జడుసుకుంది. అయితే ప్రామిస్ ఫాన్ ఇదంతా అమెరికన్ల దయ్యాల పండుగ హాలోవీన్ కోసం చేసుకున్న మేక ప్. ఆమె ఒక మేకప్ఆర్టిస్ట్. కాస్సేపు కంగారెత్తించిన ఈ అమ్మడిపై అందరూ ‘‘ిసింగిల్ కాదు.... డబుల్బండ పడ!’’ అంటున్నారట. https://www.youtube.com/watch?v=edSb4gYR_Bg ఇట్లు.... మీ ‘అమ్మ’! ఆ అమ్మాయి, అమ్మ అమ్మాయి అమ్మల్లా ఉండరు. మంచి ఫ్రెండ్స్‌లా ఉంటారు. అమ్మాయి అమ్మను బేటీ అంటుంది. అమ్మ అమ్మాయిని ‘మా‘ అంటుంది. సిటీలో పనిచేస్తున్న అమ్మాయి అమ్మకి ఫోన్‌చేస్తుంది. ‘నేనొక అబ్బాయిని వెతికాను. దీపావళికి చూపిస్తాను‘ అంటుంది. తండ్రి లేని పిల్ల తన నిర్ణయాలు తానే తీసుకుంటోందని అమ్మ హడావిడి పడుతుంది. అమ్మాయి వస్తుంది. అమ్మకు ఇష్టమైన ఆకుపచ్చ రంగు గాజులు తెస్తుంది. వేసుకొమ్మంటుంది. ఆకుపచ్చ రంగు దుపట్టా తెస్తుంది. బలవంతంగా అమ్మ చేత వేయిస్తుంది. ‘ఏంటీ హడావిడి? పెళ్లి చూపులు నాకా నీకా?‘ అంటుంది అమ్మ చిరుకోపంతో. ‘నీకే’ అంటుంది అమ్మాయి. తల్లి నిర్ఘాంతపోతుంది. ‘ఎప్పుడో ఒకప్పుడు నేను వెళ్లిపోతాను. నీ గురించి ఆలోచిస్తూంటే నాకు బెంగగా ఉంటుంది‘ అంటుంది ఆ అమ్మాయి. అమ్మాయి అమ్మ అయి అమ్మకు మళ్లీ బతుకునిచ్చేందుకు చేసే ఈ ప్రయత్నం ఆరంటే ఆరు నిమిషాల షార్ట్ ఫిలిం ‘తుమ్హారీ అమ్మా‘. ఆ తరువాత ఏమవుతుంది? ఆ... అంతా చెప్పేస్తారు మరి! ఈ ఆరు నిమిషాల అద్భుతం... నె ట్తెరపై విడుదల.... నేడే చూడండి! https://www.kulzy.com/work/92395/omron/film/tumhaari-amma/#_= నవ్వేరియా వ్యాధి ఆవులింతకి అన్నలుంటారట. తుమ్ముకి తమ్ముళ్లుంటారట. మరి నవ్వుకి..... ? నవ్వుకి నలుగురు... కాదు కాదు... నలభై మంది.... కాదు కాదు నాలుగొందల మంది నేస్తాలుంటారు. కావాలంటే ఈ విడియో చూడండి. రైల్లో ఒకమ్మాయి సెల్‌ఫోన్ మెసేజీ చూసి నవ్వుకుంది. ఆ నవ్వు నెమ్మదిగా ఒకరికి, వారినుంచి ఇంకొకరికి .... ఇలా మొత్తం కంపార్ట్మెంటుకి పాకిపోయింది. కళ్లకి కంజక్టివైటిస్లా, వొంటికి వైరల్‌ఫీవర్ లా పెదవి నుంచి ఇంకో పెదవికి నవ్వు పాకిపోయింది. ఇక రైలంతా అహ్హహ్హ ఇహ్హిహ్హి! 1962 లో టాంజానియాలో ఇలా నవ్వు అంటువ్యాధి ప్రబలి ఏకంగా 14 స్కూళ్లకు సెలవిచ్చేశారట. ఇది అలాంటిదా? లేక ఏదో ఫ్లాష్ మాబ్ చేసిన ‘‘నవ్వు నవ్వించు’’ ట్రిక్కా అన్నది ఇంకా తేలలేదు. కానీ విడియో మాత్రం ఓహ్హోహ్హొఅంటూ నవ్వులు పంచేస్తోంది. నవ్వు నాలుగు విధాల చేటు కాదు. నాలుగు అందాల మేలు అంటోంది. http://whatstrending.com/funny/20304-contagious-laughter-on-subway-flashmob బుల్లి డాక్టర్ - పెద్ద సెలెబ్రిటీ రోబోలో రజనీకాంత్ కానుపు చేశాడు. గొప్పేముంది? రజనీ ఏైదైనా చేయగలడు. త్రీ ఈడియట్స్లో ఆమిర్ ఖాన్ మంత్రసాని తనం చేశాడు. గొప్పేముంది? ఆ సినిమాలో అతను చదవకుండానే ఫస్ట్ వచ్చేస్తాడు. పైగా అతనిది ప్రాక్టికల్ నాలెడ్జి. అయితే పదకొండేళ్ల పిల్లాడు కానుపు చేయడం మాత్రం ఖచ్చితంగా గొప్పే! అందునా తన తల్లికే మంత్రిసానితనం చేయడం, తన తమ్ముడిని తన చేతులతో తానే భూమ్మీదకు రప్పించడం సామాన్యమైన సంగతి కానేకాదు. అమెరికాలోని జార్జియాలో కెన్యార్దా అనే మహిళకు ఉన్నట్టుండి నొప్పులు వచ్చాయి. తోడుగా పదకొండేళ్ల జేమ్స్డ్యూక్ తప్ప మరెవరూ లేరు. అయితే జేమ్స్ ఏ మాత్రం కంగారు పడలేదు. 911 (మన 108 లాంటి సేవ)కి ఫోను చేశాడు. వాళ్లు ఫోన్లో ఏం చేయాలో చెప్పారు. బుడ్డోడు డాక్టర్లా బుద్ధిగా అదే చేశాడు. ‘నా తల్లి బాగుండాలి. నా తమ్ముడు బాగుండాలి‘ అనుకున్నాడు. అనుకున్నట్టుగానే తల్లీ బిడ్డా క్షేమం. మన చిన్న డాక్టర్ డ్యూక్ ఇప్పుడు పెద్ద సెలెబ్రిటీ! http://www.sakshipost.com/index.php/news/international/63885-11-year-old-boy-helps-mom-deliver-baby-brother-at-home.html? psource=Feature లాంగ్‌లివ్ ఫేస్బుక్!! తప్పిపోయిన వారి కోసం ఇదివరలో అంజనం వేసేవారు. సోది చెప్పించుకునేవారు. ఇప్పుడు అవేవీ అక్కర్లేదు. సోషల్ మీడియా ఉంటే చాలు. ఖండాంతరాలు, సముద్రాలకు అటూ ఇటూ ఉన్నా ఫేస్బుక్ వారధిలా కలిపేస్తుంది. ఆమాందా స్కార్పినెట్టి, సూసన్ బెర్జర్ల కలయిక అందుకు నిదర్శనం. 38 ఏళ్ల క్రింద వేపరైజర్ మీద పడి అమాందా ఒళ్లంతా కాలిపోయింది. అప్పుడామెకి మూడు నెలలు. ఒళ్లంతా గాజు గుడ్డల బ్యాండేజీతో నెలలపాటు ఆమె ఆస్పత్రి లో ఉంది. ఆ సమయంలో ఒక నర్సు చల్లని చేయి, చక్కని మనసుతో నవనీతం అద్దినంత ప్రేమగా ఆమెను చూసుకుంది. ఆమె ఒడి స్పర్శ అమాందాకు ఎక్కడ లేని ప్రశాంతినిచ్చింది. ఆ సమయంలోనే అమాందాను ఆ నర్సు ఎత్తుకున్న ఫోటోని ఒక ఫోటోగ్రాఫర్ తీశాడు. ఆ తరువాత ఎవరి దారి వారిది. కానీ అమాందా మనసులో ఎదో తెలియని వెలితి. మళ్లీ ఆ చల్లని మనసున్న మనిషిని కలవాలని తీరని కోరిక. కానీ పేరు తెలియదు. ఊరు తెలియదు. ఆ నర్సు ఎక్కడుందో తెలియదు. ఏమైపోయిందో తెలియదు. ఒళ్లంతా కట్లతో ఉన్న తనను ఎత్తుకున్న నర్సు ఫోటోను పెట్టి ఫేస్బుక్లో ఈపీల్ చేసింది. ఆశ్చర్యం.... సరిగ్గా రెండే రెండు రోజుల్లో ఆ నర్సు పేరు సూసన్ బెర్జర్ అని వెల్లడైంది. 38 ఏళ్ల తరువాత వారి కలయికను టీవీలు లైవ్ లు ఇచ్చాయి, పత్రికలు వార్తలు వ్రాశాయి. అమెరికా ఆనందపడిపోయింది. ప్రపంచం పరవశించిపోయింది. ముఖాలు కూడా తెలియని ఇద్దరిని ముఖపుస్తకం కలిపింది. లాంగ్‌లివ్ ఫేస్బుక్!! <http://abcnews.go.com/Lifestyle/wireStory/woman-burned-baby-tracks-nurse-cared-34123532> హా‘రన్’ రాజా రన్ రోడ్డెక్కితే వాళ్లది రన్. మనది హారన్.... వాళ్లు యమ స్పీడుగా వెళ్తారు. కానీ యాక్సిడెంట్లు మనం చేస్తాం. వాళ్లకి వాహనాలెక్కువ. కానీ ట్రా‘ఫికర్’ మనకే ఎక్కువ. వాళ్ల రోడ్లపై పాదచారే ప్రభువు. మనకి పాదచారి పనికిమాలిన వాడు. వాళ్లు రోడ్రూల్ విషయంలో మాట తప్పరు. మనం యాక్సిలరేటర్ నొక్కితే మడమ తిప్పం. రోడ్‌పై వాళ్లు దారి ఇస్తారు. మనం దారిని రక్తాల గోదారి చేస్తాం. ఇల్లాజిక ల్ ఇండియన్ల ట్రాఫిక్ క్రమశిక్షణా రాహిత్యాన్ని ఎత్తి చూపుతూ లాజిక ల్ ఇండియన్ అనే వ్యక్తి ఫేస్బుక్లో ఒక విడియో పోస్టు చేశాడు. ఇండియాని, అమెరికానీ పోల్చి చూపించాడు. ‘మనోళ్లు ఉత్తి వెధవాయలోయ్‘ అన్నాడు. తమాషా ఏమిటంటే అమెరికాలో టాక్సీ డ్రైవర్లు ఎక్కువ మంది భారతీయులే. వాళ్లు ట్రాఫిక్ క్రమశిక్షణకి మారుపేరు. యాక్సిడెంట్లు చేయరని మరో పేరు. ఇంట ఈగల మోత, బయట పల్లకిమోత అయిన భారతీయ డ్రైవర్లపై లాజిక ల్ ఇండియన్ చెణుకుల్ని చూసి తీరాల్సిందే..... <https://www.facebook.com/logical.indian/videos/709393972523658/?fref=nf> -
లిప్‌స్టిక్...
మెట్రో కథలు షూటింగ్ నుంచి వస్తున్నారా? డోర్ తీస్తుంటే అడిగింది. అబ్బే... లేదండీ... మేకప్ ఉన్నట్టు అనిపిస్తేనూ... నవ్వుతూ డోర్ తీసుకుని లోపలికి వచ్చింది. లోపల రెండు ఫొటోలు అలౌ చేస్తామన్నారు. కొడుకుదీ మనవరాలిదీ వేలాడదీద్దామనుకుంది. కాని మనసొప్పలేదు. ఇద్దరు నటుల ఫొటోలు అమర్చుకుంది. సినిమా వాళ్లు కాదు. నాటకాల వాళ్లు. తనకు అన్నం పెట్టిన గురువులు. ఏ.సి. ఆన్ చేసింది. మళ్లీ మనసు మార్చుకుని ఆఫ్ చేసి కర్టెన్లు తీసి విండో డోర్‌ను స్లైడ్ చేసింది. ఇంకా పూర్తిగా చీకటి పడలేదు. వేడి తగ్గలేదు. కాని గాలి మాత్రం చనువుగా వచ్చి తాకుతూ ఉంది. నుదుటిని... కళ్లను... పెదాలను... పెదాల మీద ఉన్న లిప్స్టిక్నూ. టొమాటో కలర్‌ది. ముందు నుంచి అదే అలవాటు. మూడు నెలలైంది ఏదైనా షూటింగ్ చేసి. ఇంకో నెల దాకా కూడా ఏదీ ఉన్నట్టు కనిపించడం లేదు. ఇద్దరు ముగ్గురు డెరైక్టర్లకు కాల్ చేసింది. అయ్యో.. అమ్మా... మీరు చేయాలా... మీకు యాప్ట్ అయ్యే కేరెక్టర్ ఉంటే మిమ్మల్ని దాటి పోనిస్తామా... అందరూ అదే చెప్పారు. నిజంగానే చెప్పారు. అందరికీ తనంటే ఇష్టమే. టేకులు తినదు. న్యూసెన్స్ చేయదు. ముఖ్యంగా ప్రామ్టింగ్ అవసరం లేకుండా ఒత్తులూ పొల్లులూ ఎగరకొట్టకుండా డైలాగ్ చెప్పగలిగే అచ్చ తెలుగు ఆర్టిస్టు. నిజమే కానీ షూటింగ్ లేకుండా ఉంటే విసుగ్గా ఉంటుంది. మేకప్ వేసుకోకపోయినా విసుగ్గా ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యంగా లిప్‌స్టిక్ పూసుకోకపోతే చాలా విసుగ్గా ఉంటుంది. అందుకే కొద్దిపాటి మేకప్‌తో ఉండటం అలవాటు. పడుకోబోయే ముందు తప్ప కొంచెం లైట్‌గా అయినా లిప్‌స్టిక్ వేసుకొని ఉండటం అలవాటు. మీ అమ్మకు ఇదేం అలవాటండీ అందట కోడలు ఒకరోజు. చెప్పలేక చెప్పలేక చెప్పాడు. నవ్వి ఊరుకుంది. కొడుకు పెళ్లి అయ్యేవరకు చాలా చిన్న ఫ్లాట్‌లో ఉండేది. పేరుకు టూ బెడ్రూమ్ కాని ఎయిట్ హండ్రెడ్ ఎస్ఎఫ్టి కూడా ఉండదు. పెళ్లికి ముందే కొంచెం అవస్థలు పడి పెద్ద ఫ్లాట్ కొంది. మరేం చేయడం? వయసులో ఉన్నప్పుడు పేమెంట్స్ లేవు. పేమెంట్స్ పెరిగినప్పుడు వయసు లేదు. ఇప్పుడైనా గుడ్‌విల్ పని చేయబట్టి ఒకరిద్దరు నిర్మాతలు కాస్త చేయి వేయబట్టి సాధ్యమైంది. మీ అమ్మకు ఆ నిర్మాతలు అంత క్లోజా ఏమిటండీ అందట కోడలు. ఆ మాట మాత్రం చెప్పలేదు. షూటింగ్ ఉంటే ఉదయాన్నే వెహికల్ వస్తుంది. మళ్లీ రాత్రి దింపేసి పోతుంది. మేకప్ బాయ్ వస్తాడు. అటెండెంట్‌గా ఇంకో కుర్రాణ్ణి పెట్టుకుంది. నిజంగా వీళ్లను మోయలేదు. కాని ఇంత హంగామా చేస్తే తప్ప పాత్ర పుట్టదు. వీళ్లుగాక సీనియర్ ఆర్టిస్టనీ నాటకాల బ్యాక్‌గ్రౌండ్ ఉందనీ కొత్త డెరైక్టర్లు వచ్చి పోతుంటారు. కథలు చెప్తుంటారు. కాస్టింగ్ ఏజెంట్లు వస్తుంటారు. కమిషన్లు చెబుతుంటారు. సాటి ఆర్టిస్టులు- ఆడ సరేగాని మగ కూడా వచ్చి కాసేపు కూర్చుని పోతుంటారు. ఇల్లు అన్నపూర్ణా స్టుడియోలాగుందండీ అందట ఒకరోజు. ఆ మాట అయినా ఎలా చెబుతాడు? ఎలా ఉన్నారు అత్తయ్యా... ఏం చేయమంటారు అత్తయ్యా... కోడలు అడిగిన పాపాన పోలేదు. తనూ బలవంతపెట్టలేదు. ఏం బలవంత పెడుతుంది? వేలు ఖర్చు పెట్టినా అంతంత మాత్రమే చదివాడు. అంతంత మాత్రపు ఉద్యోగమే తెచ్చుకున్నాడు. సంబంధం వెతకడం ఒక కష్టం. మనుషులు వచ్చిపోయే ఇంటికి కోడల్ని తీసుకురావడం ఇంకా కష్టం. కాకుంటే ఒకటి. మూడో నెలకంతా నెల తప్పాను అత్తయ్యా అంది. ఆ మాట చాలు ఎన్ని తప్పులు చేసినా క్షమించేయడానికి. మనవరాలు పుడితే ఆర్భాటంగా బారసాల చేసిందిగాని వచ్చినవాళ్లంతా అచ్చు నానమ్మ నోట్లో నుంచి ఊడిపడింది అంటుంటే కాస్త భయపడింది. అవును. అచ్చు తనలాగే ఉంది. పెద్ద పెద్ద కళ్లు. మంచి కనుబొమలు. రంగు. ముఖ్యంగా పెదాలు.... అవన్నీ ఉంటే ఏమవుతుందో తెలుసు. దూరంగా ఫ్రెండ్స్‌తో మాట్లాడుతున్న కొడుకు వైపు చూసింది. చూస్తూ గమనించింది.ఎవరి పోలిక ఉంది వాడిలో? పెళ్లైన మూడేళ్లకు పారిపోయిన భర్త. చచ్చిందా బతికిందా పుట్టిన పిల్లాడు ఉన్నాడా పోయాడా పట్టించుకోని భర్త. అతని పోలిక ఉందా వాడిలో. పద్నాలుగేళ్ల పిల్ల... చదువుకుంటా నాన్నా నాకిష్టం లేదు నాన్నా అంటున్నా స్టేజ్ ఎక్కించిన తండ్రి... రంగు పూయించిన తండ్రి... సారా కోసం లిప్‌స్టిక్ వేయించిన తండ్రి.... ఎవడికో ఒకడికి కట్టబెట్టేస్తే తన పని అయిపోతుందనుకున్న తండ్రి... ఆ తాత పోలిక ఉందా వాడిలో? భయమేసింది.ఎందుకు భయం? తను ఉంది. ఆ పోలికలు అంటకుండా తనే చక్కగా పెంచుకుంటుంది. బాగా చదివించుకుంటుంది. అవసరమైతే ఇంకా ఎక్కువ నటించి ఇంకా ఎక్కువ పాత్రలు చేసి ఆర్థికంగా ఏ ఇబ్బందీ రాకుండా స్థిరపరుస్తుంది. అలా అనుకునే బతికింది. మనవరాలే లోకం. మనవరాలికి నానమ్మ లోకం. ఇదేమిటండీ... కన్నవాళ్లు అంత కాకుండా పోతున్నారేమిటి దానికి అందట ఒకరోజు. నవ్వుతూ నవ్వుతూనే చెప్పాడు. మొన్నా మధ్య గుడికో మరెక్కడికో వెళ్లి వచ్చింది. వస్తూ వస్తూ ఎనిమిదో పుట్టినరోజు రాబోతున్నది కదా అని మనవరాలికి కొత్త డ్రస్సు కొనుక్కుని వచ్చింది. అది తొడిగించి చూసి మెటికలు విరిచి సంబరపడాలనుకుంటూ వచ్చింది. వచ్చే సరికి ఇల్లు ఇల్లులా లేదు. అంత చిందర వందరగా ఉంది. రాద్ధాంతం జరిగినట్టుగా ఉంది. కొడుకూ కోడలూ... ఏడుస్తూ మనవరాలు... నానమ్మా... పరిగెత్తుకుంటూ వచ్చి చుట్టేసుకుంది. ఏమైంది తల్లీ... ఏమైంది... మేకప్ కిట్ తెరిచి లిప్‌స్టిక్ వేసుకోవడానికి చూసిందట. అది గమనించి వాళ్లమ్మ చావ గొట్టిందట. అడ్డుకోబోయిన భర్తను నానామాటలు అందట. ఇంట్లో ఆల్రెడీ ఒక టక్కులాడి ఉంది. ఇంకో టక్కులాడిని తయారు చేయబోతారా? అందట. ఈ మాటలు కాదు. నిజంగా ఏమందో. మార్చి మర్యాదగా చెప్పాడు. ఇవన్నీ ఇక మానెయ్యమ్మా. ఇంట్లో ఉండు. తిరక్కు. ఆ మేకప్ కిట్ తీసి బయట పారెయ్... చూసింది. భర్త పారిపోయినప్పుడు సంవత్సరం పిల్లవాడు. రాత్రి నాటకాలు. మేకప్ వేసుకొని లిప్‌స్టిక్ పూసుకుని సరిగ్గా స్టేజ్ మీదకు వెళ్లేసమయానికి ఏడుపు మొదలుపెడితే ఓపలేక బుగ్గలంతా ముద్దులు పెడితే ఎర్రటి మరకలంతా పడేవి. సినిమా నాటికలు వేసేప్పుడు బ్లౌజ్ లేకుండా పవిట గట్టిగా కట్టి పచ్చగడ్డి కోసేటి పడుచుపిల్లో... డాన్స్ చేస్తుంటే జనం ఆ గుండెల్ని చూడ్డానికి ఏడ్చేవాళ్లు. తను వాటిల్లో ఉన్న పాలు ఇవ్వడానికి ఏడ్చేది. ఇన్నాళ్లు పెంచడానికి చదివించడానికి ఫ్లాట్ కొని ఉంచటానికి అవసరాలను ఆదుకోవడానికి పనికొచ్చిన లిప్‌స్టిక్ ఇప్పుడు అక్కర్లేదంటున్నాడు. నవ్వింది. వస్తున్నారా?.... వెనక్కు తిరిగి చూసింది. ఇందాక పలకరించిన పక్క రూమ్మేట్. డోర్ దగ్గర నిలుచుని ఉంది. డిన్నర్‌కు టైమ్ అయ్యిందిగా... పిలుస్తూ ఉంది. అప్పటికే చీకటి పడిపోయింది. టైమ్ ఏడై ఉంటుంది. ఇక్కడ ఏడుకే డిన్నర్ ముగించేయాలి. ఆ తర్వాత ఏదైనా కాలక్షేపం. చేతులు కడుక్కుని, ముఖం వాష్ చేసుకుని, కొంచెం పౌడర్, లైట్‌గా లిప్‌స్టిక్ టచ్ ఇచ్చి బయలు దేరింది. నాలుగైదు ఎకరాల ఆవరణ అది. ఊరికి కాస్త దూరంగా ప్రశాంతంగా. మీ గురించి విన్నాను... నవ్వింది. ఇప్పుడు మీ అబ్బాయి ఎక్కడున్నాడు? తెలీదు. ఫ్లాట్ అమ్మేశాను. నీ దారి నువ్వు చూస్కో అని చెప్పాను. వచ్చింది బ్యాంక్‌లో డిపాజిట్ చేసి మిగిలింది ఈ హోమ్‌కు కట్టి ఇక్కడకు వచ్చేశాను. మనవరాలు గుర్తుకు రావడం లేదా? వస్తుంది. ఏం చేస్తాం. తప్పదు కదా. పాత్ర ముగిసిందని తెలిశాక స్టేజ్ మీద ఎంత బ్యాడ్ ఆర్టిస్టూ నిలవదు. దిగిపోతుంది... ఒక్కోరూమ్ నుంచి ఒక్కొక్కరుగా బయటకు వస్తూ కనిపిస్తున్నారు. తన వయసు వాళ్లు. తనలాంటివాళ్లు. అన్నట్టు సినిమాల్లో యాక్ట్ చేస్తారా? అమ్మబాబోయ్. నాకు రాదండీ... మీరంటే ఆర్టిస్టు... ఏం లేదండీ. కొంచెం లిప్‌స్టిక్ వేసుకుని నిలబడండి. చాలు. అంతేనా? అంతే... ఇద్దరూ హాయిగా నవ్వుకుంటూ మంచి డిన్నర్ చేయడానికి డైనింగ్ హాల్లోకి నడుచుకుంటూ వెళ్లిపోయారు. - మహమ్మద్ ఖదీర్‌బాబు -
వేసవి మేకప్...
అందమె ఆనందం ఎండ, చెమట వల్ల ఈ కాలం మేకప్ చేసుకున్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ వేడుకలలో అందంగా కనిపించాలంటే మేకప్ తప్పనిసరి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వేసవిలో కూడా సింపుల్ మేకప్‌తో అందంగా మెరిసిపోవచ్చు. ⇒ ముందుగా ముఖాన్ని లిక్విడ్ సోప్‌తో శుభ్రపరుచుకోవాలి. తర్వాత తడి లేకుండా తుడుచుకుని ఐస్‌క్యూబ్‌తో ముఖమంతా 5-6 సార్లు మృదువుగా రబ్ చేయాలి. తర్వాత వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్‌ను ముఖమంతా రాయాలి. ఇలా చేయడం వల్ల మేకప్ ఎక్కువ సేపు ఉండటమే కాకుండా ముఖం తాజాగా కనిపిస్తుంది. ⇒ మేకప్ చేయడానికి ముందు నాణ్యమైన ప్రైమర్ లోషన్‌ని ఎంచుకోవాలి. ఇది మేకప్‌కి బేస్‌గా పనిచే స్తుంది. ప్రైమర్‌ను వాడటం వల్ల మేకప్ మచ్చలుగా కనిపించదు. కంటి పై రెప్పకు కంటి చుట్టూతా కూడా ప్రైమర్‌ను అప్లై చేయాలి. ⇒ లిక్వ్‌డ్ బేస్డ్ ఫౌండేషన్‌ను బ్రష్‌తో ముఖమంతా రాయాలి. ⇒ లిప్‌స్టిక్ ప్యాచ్‌లుగా పెదవులపై కనపడకుండా, చేతులకు అంటుకోకుండా ఉండాలంటే టిష్యూపేపర్పైన కొద్దిగా పౌడర్వేసి, పెదవులపై అద్దాలి. ⇒ ఐ లైనర్‌తో కళ్లను తీర్చిదిద్దాలి. వేసవి కాబట్టి తరచూ నీళ్లు, పండ్లరసాలు తాగుతూ ఉంటే చర్మం త్వరగా పొడిబారకుండా ఉంటంది. ఈ చిన్న చిన్న జాగ్రత్తలను పాటించి మేకప్ చేసుకుంటే వేడుకలో అందంగా మెరిసిపోతారు. - సౌమ్య జాదవ్, బ్యూటీషియన్ -
మేకప్‌తో మాయాజాలం
-
మేకప్ ప్యాచ్‌లు కనిపించకుండా...
వయసు పై బడటం వల్ల చర్మం ముడతలు పడుతుంటుంది. మెడ, గొంతు ప్రాంతంలో చర్మం ముడతలు పడడాన్ని, చారికలు రావడాన్ని గమనించవచ్చు. ఈ సమస్య నివారణకు మెడ వ్యాయామం చాలా అవసరం. ఆకాశాన్ని చూస్తున్నట్టుగా తల పైకి ఉంచి, తిరిగి కిందకు దింపాలి. ఇలా నాలుగైదు సార్లు చేయాలి. ఇలా రోజులో 5-6 సార్లు చేస్తూ ఉంటే మెడ దగ్గర చర్మం బిగుతుగా మారుతుంది. అలాగే మెడ, గొంతు దగ్గర మేకప్ వేసుకోవడానికి ముందు ఇలా చేయడం వల్ల మేకప్ ప్యాచ్‌లుగా కనిపించకుండా జాగ్రత్తపడవచ్చు. -
కళకు మేకప్
చేయి తిరిగిన చిత్రకారులకు.. సప్తవర్ణాల పాలెట్ ఉండాలి. ఆ రంగులను కాన్వాస్‌పై రంగరించడానికి వేళ్ల మధ్య ఒదిగిపోయే కుంచె కావాలి. మనసెరిగిన కళాకారులకు ఇవేవీ ఉండాల్సిన అవసరం లేదు. లిప్‌స్టిక్‌నే కుంచెగా మార్చేయగలరు. మేకప్ కిట్‌తో వేకప్ సీనరీ సృష్టించగలరు. ఫ్రెంచ్ చిత్రకారిణి 62 ఏళ్ల డామినిక్ పాలిన్ ఈ కోవకు చెందినవారే. డాక్టర్‌గా సేవలందిస్తూనే.. తన పేషంట్స్ ముఖాల్లోని బాధను చిత్రాల్లో చూపించారు. మూడు వారాల కిందట ఇండియాకు వచ్చిన డామినిక్ ఇక్కడ తాను చూసిన, తనకు నచ్చిన, అర్థం చేసుకున్న విషయాలను పెయింటింగ్స్‌గా మలిచారు. ఇటీవల నగరంలోని కళాకృతి ఆర్ట్ గ్యాలరీలో వీటిని ప్రదర్శించారు. ఈ సందర్భంగా సిటీప్లస్‌తో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే.. ..:: ఓ మధు కళాకారుల ఇంట్లో పుట్టాను. అమ్మానాన్న, తాత, అంకుల్స్ అందరూ కళాకారులే. అమ్మ వేసిన పెయింటింగ్స్ చూస్తూ పెరగటం వల్లనేమో.. మూడేళ్ల వయసు నుంచే పెయింటింగ్ నా జీవితంలో భాగమైంది. డాక్టర్ అయిన తర్వాత కూడా కుంచె విడిచిపెట్టలేదు. నా ఆసక్తి, అభిరుచి కోసమే బొమ్మలు వేస్తూ వచ్చాను. 2007 వరకూ ప్రదర్శనలు ఇవ్వలేకపోయాను. తర్వాత సే్నిహ తుల ప్రోత్సాహంతో మొదటిసారి పారిస్‌లో నేను గీసిన చిత్రాలతో ప్రదర్శన ఏర్పాటు చేశాను. అప్పట్నుంచి వివిధ దేశాల్లో చిత్ర ప్రదర్శనలిస్తున్నాను. ఎలా ఉంటుందని.. ఇండియాకు రావడం ఇది తొమ్మిదో సారి. మూడు వారాలైంది ఇక్కడ అడుగుపెట్టి. ఎన్నో ప్రాంతాలు చూశాను. రోజుకు 14 నుంచి 16 గంటల పాటు పని చేసి.. పెయింటింగ్స్ వేశాను. వాటినే ఇక్కడ ప్రదర్శనకు ఉంచాను. ఇవన్నీ మేకప్ కోసం వాడే రంగులతో వేసినవే. ఎందుకలా వేశారని చాలామంది అడుగుతున్నారు. నా దగ్గరకు వచ్చిన ఒక పేషెంట్ ఒక పెద్ద మేకప్ బాక్స్ తెచ్చి గిఫ్ట్‌గా ఇచ్చింది. వాటి టెక్స్చర్, కలర్స్‌తో డ్రాయింగ్ వేస్తే ఎలా ఉంటుందని ఆలోచన వచ్చింది. లిప్స్టిక్స్, పౌడర్స్, ఐషాడోస్.. ఇలా మేకప్ కిట్‌లో ఉన్న రంగులతోనే ఈ పెయింటింగ్స్ వేశాను. వాటినే కళాకృతి ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శించాను. హైదరాబాద్‌కు రావడం ఇదే తొలిసారి. ఇక్కడి గోల్కొండ కోట చూస్తే తెగ ముచ్చటేసింది. మంచి మనుషులు.. ముంబై, రుషికేశ్, గోవా, తమిళనాడు ఇలా ఈ మూడు వారాల్లో చాలా ప్రాంతాలు బుల్లెట్ మీద తిరిగాను. ఇక్కడ ప్రదేశాలే కాదు, మనుషులు.. వారి మనసులు కూడా నాకు ఎంతగానో నచ్చాయి. భారత్‌లోని స్వేచ్ఛావాతావరణం నాకు బాగా ఇష్టం. మా దేశంలో పరిస్థితులు ఇందుకు భిన్నం. ఇంత స్వేచ్ఛగా ఉండలేం. అక్కడికి, ఇక్కడికి ఉన్న ముఖ్య తేడా కమ్యూనికేషన్. ఇక్కడ ఏదైనా అడిగితే ఎవరైనా ఎంతో బాధ్యతగా జవాబు చెబుతారు. ఎంతో సహాయం చేస్తారు. అదే ఫ్రాన్స్‌లో ఏదైనా అడ్రస్ అడిగితే వారిచ్చే బదులు చాలా విసురుగా ఉంటుంది. ఫ్రాన్స్‌లో కళాకారులకు, కళాభిమానులకు కొదవలేదు. ఇక్కడి కళాకారులను ఇంకా కలుసుకోలేదు. ఫ్రాన్స్, ఇండియా మధ్య సాంస్కృతిక సంబంధాలు పటిష్టం చేయాలనుకుంటున్నాను. ఫొటోలు: ఎన్.రాజేష్‌రెడ్డి -
ముస్తాబు వస్తాదులకు మేకప్ ఉమన్ కోటింగ్!!
‘చారూ’... కేసు గెలిచారు అప్పుడప్పుడే రెక్కలు విప్పుకుని ఉపాధి కోసం లోకంలోకి వచ్చిన వారికి ఏమంత ప్రోత్సాహకంగా ఆహ్వానం లభించదు. అలా లోకం మీదికి వచ్చిన వాళ్లు మహిళలైతే ఇక చెప్పే పనే లేదు, ‘‘నీకిక్కడేం పని ఫో’’ అని లోకం తరిమికొడుతుంది. 32 ఏళ్ల చారూ ఖురానానే తీసుకోండి. గత పదేళ్లుగా ఈ ఢిల్లీ యువతి తనకు బాగా వచ్చిన పనిని ముంబైలో చేయడం కోసం పోరాడుతున్నారు. కానీ అక్కడి ‘సినీ కాస్ట్యూమ్ మేకప్ ఆర్టిస్ట్స్ అండ్ హెయిర్ డ్రెస్సెర్స్ అసోసియేషన్’ ఆమెకు సభ్యత్వం ఇవ్వడానికి నిరాకరిస్తూ వస్తోంది. అసోసియేషన్ వాదన ఏమిటంటే మహిళలకు మేకప్ పని అంతగా రాదని! నిజానికి చారూ ఖురానా తన పాతికేళ్ల వయసు నుంచీ ఢిల్లీలో ఫ్యాషన్ షోలు, వాణిజ్య ప్రకటనల షూటింగ్లలో మోడళ్లకు మేకప్ వేస్తున్నారు. మంచి పేరు కూడా తెచ్చుకున్నారు. అయితే తన ప్రతిభకు ఢిల్లీలో ఉన్నవి పరిమిత అవకాశాలేనని గ్రహించిన చారూ పదేళ్ల క్రితం బాలీవుడ్ చేరుకున్నారు. చారూ మాదిరిగా ఎవరైనా బాలీవుడ్‌లోని ఏ విభాగంలోనైనా ఉపాధి కోసం ప్రయత్నించదలచుకుంటే ముందుగా ఆ విభాగానికి సంబంధించిన సంఘంలో సభ్యులై ఉండాలి. అందుకే ఆమె 2004లోనే సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ మేకప్ ఆర్టిస్టుల అసోసియేషన్ ఆమె దరఖాస్తును స్వీకరించలేదు. ‘‘ఆడవాళ్లు ఇక్కడ నిషిద్ధం. అయినా ఆర్టిస్టులకు మేకప్ వేయడం మగవాళ్ల వల్ల మాత్రమే అయ్యే పని’’ అని అసోసియేషన్ నాయకులు చారూ అభ్యర్థనను తిరస్కరించారు. నిజానికి వారి భయం ఏమిటంటే చారూ లాంటి ప్రతిభావంతుల రాకతో తమ ఉపాధికి గండి పడుతుందని. అయితే చారూ ఈ విషయాన్ని అంతటితో వదిలిపెట్టలేదు. గత ఆరు దశాబ్దాలుగా మహిళలు తమకు పోటీగా రాకుండా స్వయం ప్రకటిత నిషేధంతో జాగ్రత్తపడుతూ వస్తున్న బాలీవుడ్ మేకప్ ఆర్టిస్టుల అసోషియేషన్ లైంగిక వివక్షపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అనేక వాయిదాలు, వాదోపవాదాల అనంతరం గతవారం సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. బాలీవుడ్ మేకప్ ఆర్టిస్టుల అసోసియేషన్ మహిళలకు సభ్యత్వం ఇవ్వవలసిందేనని స్పష్టం చేసింది. దీనిపై చారూ ఖురానా హర్షం వ్యక్తం చేశారు. అయితే ఆ హర్షం... కేసులో తను గెలిచినందుకు కాదు, బాలీవుడ్లో తనేమిటో నిరూపించుకునే అవకాశానికి పూర్తి అవరోధం తొలగిపోయినందుకు. అలాగే సాటి మహిళా మేకప్ ఆర్టిస్టులకు ఈ తీర్పు ద్వారా పురుషులతో సమానంగా ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని ఆమె ఆశిస్తున్నారు. ఇక అసోసియేషన్ అధ్యక్షుడు శరద్ షెలార్ అయితే తమ సంఘం సుప్రీం కోర్టు ఆదేశాలను శిరసా వహిస్తుందని ఏ మాత్రం ఆలస్యం లేకుండా ప్రకటించారు! చారూ ఖురానా తరఫు న్యాయవాది జ్యోతిక కల్రాకు ఈ విజయంలో కీలక భాగస్వామ్యమే ఉందని చెప్పాలి. ‘‘ఇది స్త్రీల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడం తప్ప మరొకటి కాదు’’ అని వాదించేందుకు ఆమె అనేక ఉదాహరణలను న్యాయమూర్తి ఎదుట ప్రభావవంతంగా ప్రస్తావించగలిగారు. ఐక్యరాజ్యసమితి నేతృత్వంలో ఇటీవల జరిగిన ఒక సర్వే... ప్రపంచ దేశాలలో (ఇండియా సహా) చలనచిత్ర రంగానికి సంబంధించిన 11 అత్యంత లాభదాయకమైన మార్కెట్లలో బలమైన లైంగిక వివక్ష కొనసాగుతోందని తేల్చి చెప్పిన విషయాన్ని కూడా జ్యోతిక .. న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. ఇక్కడ ఇంకో ముఖ్యమైన సంగతి. మేకప్ ఆర్టిస్ట్ చారూ ఖురానా సాధించిన ఈ విజయం నవతరం మహిళా మేకప్ కళాకారులు బాలీవుడ్లో రాణించేందుకు తోడ్పడుతుందని జ్యోతిక వ్యాఖ్యానించారు. స్త్రీకి స్త్రీయే శత్రువు అన్నవారు... ఒక స్త్రీ (జ్యోతిక) తన విజయాన్ని సాటి స్త్రీ (చారూ ఖురానా) విజయంగా చెప్పడంలోని ఔన్నత్యాన్ని గమనించాలి. -
మేకప్!
చేపల్లాంటి కనులు... కేశాలంకరణలో ‘ఫిష్ టెయిల్’ చాలామందికి సుపరిచితమే! ఐ మేకప్‌లోనూ ‘ఫిష్ టెయిల్’ అమితంగా ఆకట్టుకుంటుంది. మన సంప్రదాయం కాస్త.. ఈజిప్షియన్ స్టైల్ ఇంకాస్త జోడించి లైనర్‌తో కంటిని తీర్చిదిద్దితే ‘ఫిష్ టెయిల్’ కనువిందు చేస్తుంది. యువతులను ఆకర్షిస్తున్న ఈ స్టైల్‌ను అనుసరించాలంటే... కంటి ముందు భాగం నుంచి చివరల వరకు రెప్పలకు లైనర్‌తో పొడవైన గీతలా తీర్చాలి. ఆ తర్వాత లైనర్‌తో మరింత చిక్కగా వచ్చేలా కనురెప్ప మధ్య భాగం నుంచి చివర వరకు దిద్దాలి. ఇలాగే పై కనురెప్పను (టియర్ లైన్ నుంచి చివరి వరకు) తీర్చిదిద్దాలి. ఐ షాడోతో పై కనురెప్పను అలంకరించాలి. మేలిమి! క్యాప్సికమ్! ఎరుపురంగు క్యాప్సికమ్ ఉడికించి లేదా పచ్చిగా ఇతర పండ్లు, కూరగాయల సలాడ్స్‌తో కలిపి తింటే ఆరోగ్యానికి, చర్మ కాంతికి మేలైన ప్రయోజనాలు కలుగుతాయి.. క్యాప్సికమ్‌లో శరీరానికి కావ ల్సిన విటమిన్ ‘సి’, పీచుపదార్థాలు, విటమిన్ ‘బి6’ సమృద్దిగా వుంటాయి. దీంట్లో అధిక మొత్తంలో ఉండే కెరొటినాయిడ్స్ రక్తప్రసరణను మెరుగు పరిచి, చర్మంపై ముడతలను నివారిస్తుంది. అందుకని మధ్య వయసు వారు దీనిని తప్పక తీసుకోవాలి. టీనేజ్‌లో ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు రోజూ కొద్ది మోతాదులో దీనిని ఆహారంలో భాగంచేసుకుంటే మొటిమల సమస్య దరిచేరదు. మచ్చలు ఏర్పడవు. దీంట్లో కొవ్వు తక్కు వగా ఉండటం వల్ల అధికబరువుకు దూరంగా ఉండవచ్చు. మెరుగు! చెడువాసన వస్తుంటే... కాలంతో సంబంధం లేకుండా కొందరి శరీరం నుంచి చెడు వాసన వస్తుంటుంది. దీనిని పోగొట్టడానికి పెరఫ్యూమ్లు, పౌడర్ల వాడకం కన్నా దేహాన్ని శుభ్రంగా ఉంచుకోవడం వల్ల 99 శాతం సమస్యను నివారిం చవచ్చు. సాధారణంగా చెడు వాసన అనేది స్వేదరంధ్రాలు మూసుకుపోవడం వల్ల ఉత్పన్నమవుతుంది. చర్మంపై మృతకణాలు పేరుకుపోయి, చెమటతో కలిసి జిడ్డుగా ఏర్పడుతుంది. ఈ జిడ్డును సరిగ్గా వదిలించకపోతే చెడు వాసన ఎక్కువవుతుంది. ఈ సమస్య నివారణకు ... రోజుకు రెండు సార్లు స్నానం చేయాలి. స్నానం చేసే సమయంలో ‘బాడీ బ్రష్’తో చర్మంపై వలయకారంలా మృదువుగా రుద్దాలి. పైకి, కిందకు రుద్దుతూ ఇలా స్నానం చేయడం వల్ల మృతకణాలు సులువుగా తొలగిపోతాయి. వాడిన బ్రష్‌ను ప్రతిసారి పొడిగా ఉంచాలి. 6 నెలలకు ఒకసారి పాత బ్రష్‌ను మారుస్తూ ఉండాలి. ఒకరు వాడిన బాడీ బ్రష్‌ను మరొకరు వాడకూడదు. -
అరచేతి ఆభరణం
ఆధునికం కథానాయికలు ఏం చేసినా అందమే! అలంకరణకు కొత్త భాష్యం చెప్పడానికి వారు రకరకాల పద్ధతులను అవలంబిస్తుంటారు. అవి అందరినీ ఆకర్షిస్తుంటాయి. అనుసరించేలా చేస్తుంటాయి. ఇటీవల హాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కి అటు నుంచి మన తెలుగు చిత్రసీమకు పరిచయం అయిందో ఆభరణం. ‘పామ్ కఫ్’గా పిలిపించుకుం టున్న ఈ అరచేతి ఆభరణానికి ఇటీవల క్రేజ్ వచ్చేసింది. సంప్రదాయ దుస్తులైనా, ఆధునిక వేషధారణ అయినా ఈ అరచేతి ఆభరణాన్ని ధరిస్తే ఫ్యాషనబుల్ అనిపిస్తారు. అందుకేనేమో అమెరికా నుంచి ఆసియా వరకు ప్రపంచ సుందరీమణులు అనదగ్గ వారిందరి కోమలమైన చేతులకు ఇది కొత్త కాంతులిస్తోంది. గాజు మాదిరిగానూ, బ్రేస్లెట్ లాగానూ, అత్యంత సౌకర్యమైన ఆభరణంగానూ పలువురు మెచ్చుకుంటున్న ‘పామ్ కఫ్’ ప్రస్తుతం ఓ ట్రెండ్‌గా నడుస్తోంది. ఇవి బంగారు, వెండి, కాపర్, ఐరన్లలో.. ఎన్నో విభిన్న ఆకృతులతో అతివలను అలరిస్తున్నాయి. -
అందంగా ఉంటే సరిపోదు!
కథానాయికగా చేసినా, ప్రత్యేక పాటకు కాలు కదిపినా.. ఏం చేసినా వంద శాతం బాగుండాలనుకుంటారు శ్రుతీహాసన్. ఎందుకంటే వృత్తిని దైవంగా భావిస్తారామె. ఎవరికైతే తాము చేసే వృత్తిపట్ల భక్తి, ప్రేమ ఉంటాయో వాళ్లు పైకొస్తారని కూడా అంటున్నారు ఈ బ్యూటీ. అది మాత్రమే కాదు... అందంగా ఉంటే సరిపోదు.. తెలివితేటలు కూడా ఉండాలని శ్రుతీహాసన్ చెబుతూ- ‘‘తెలివి తేటలు లేని అందం నా దృష్టిలో వేస్ట్. ఎందుకంటే మన జీవితం సరైన మార్గంలో వెళ్లాలంటే తెలివైన నిర్ణయాలు తీసుకోవాలి. అవే మనల్ని కాపాడతాయి కానీ, అందం కాదు. సినిమాల్లో మమ్మల్ని చూసి, ‘ఎంత అందంగా ఉన్నారో’ అనుకుంటుంటారు. అఫ్కోర్స్ మేం అందంగానే ఉంటాం. కాకపోతే, తెరపై మేం అంత అందంగా కనిపించడానికి కారణం మేకప్. మాకు మేకప్ చేయడానికి ఒకరు, హెయిర్ స్టయిల్ చేయడానికి మరొకరు ఉంటారు. వాళ్లు మా అందానికి మెరుగులు దిద్దుతారు. కానీ, తెలివితేటలకు మెరుగులు దిద్దడానికి ప్రత్యేకంగా ఎవరూ ఉండరు కదా. అందుకని మనం చేసే తప్పొప్పులే మనకు మంచి పాఠాలు. వాటి ద్వారా మనం తెలివితేటలు పెంచుకోవాలి’’ అన్నారు. ఇంత చెబుతోంది కదా.. మరి శ్రుతీహాసన్ తెలివితేటల సంగతేంటి అనుకుంటున్నారా? ‘బ్యూటీ విత్ బ్రెయిన్’ అంటారు కదా.. అందుకు ఓ ఉదాహరణ శ్రుతీహాసన్. -
వ్యాపకం.. వ్యాపారమైతే..
గడప దాటకుండానే గడించడానికి ఆన్లైన్, ఆఫ్‌లైన్ మార్గాలనేకం ఉన్నాయి. వ్యాపకాన్ని వ్యాపారావకాశంగా మార్చుకోవడం కూడా వాటిల్లో ఒకటి. కమ్మని వంటకాలు చేయడం మీ హాబీనా? ఎంచక్కా క్యాటరింగ్ బిజినెస్ మొదలుపెట్టొచ్చు. మేకప్, ఫ్యాషన్, సౌందర్య సాధనాలపై మంచి అభిరుచి ఉంటే దాన్ని కూడా ఆదాయ వనరుగా మార్చుకోవచ్చు. ఇదంతా జరగాలంటే హాబీని వ్యాపారావకాశంగా మల్చుకునేది ఎలా, ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైనవి తెలియాలి. అందులో కొన్ని ఇవి.. 1. సరదా కోసమే కాకుండా మనసుకు కాస్త సంతృప్తి కూడా కలిగించే వాటిని హాబీలుగా ఎంచుకుంటూ ఉంటాం. అలాంటి వాటికి వ్యాపారపరమైన రూపునిస్తున్న పక్షంలో ప్రశ్నించుకోవాల్సిన విషయం ఒకటుంది. మనస్సుకు సాంత్వననిచ్చే హాబీ కాస్తా హోమ్ బిజినెస్‌గా మారిన తర్వాత కూడా దానిపై ఆసక్తి కొనసాగించగలమా, ఆస్వాదించగలమా అన్నది ఆలోచించుకోవాలి. వ్యాపకంలో లాభనష్టాలు, ఆర్థిక కోణాల ప్రసక్తి ఉండదు. అదే వ్యాపారం అంటే.. అనేక లెక్కలు ఉంటాయి. అప్పటిదాకా హాబీగా ఉన్నది కాస్తా ప్రధాన ఆదాయ వనరుగా మారితే లాభనష్టాల గురించి ఆలోచించడం ఎక్కువవుతుంది కనుక.. దాన్ని ఆస్వాదించే అవకాశాలు తగ్గొచ్చు. కనుక ఇలాంటివన్నీ బేరీజు వేసుకుని ముందడుగు వేయాలి. 2. హాబీని బిజినెస్‌గా మార్చుకుందామని నిర్ణయించుకుంటే అసలు దానికి మార్కెట్ అనేది ఉందా అన్నది తెలుసుకోవాలి. మీరు చేసే వంటకాలను, తయారుచేసే ఆభరణాలు మొదలైన వాటిని మీ చుట్టుపక్కాలు, స్నేహితులు మెచ్చుకోవచ్చు. కానీ మార్కెట్లో వాటిని అమ్మితే డబ్బులిచ్చి కొనుక్కునేంత నాణ్యత, ప్రత్యేకత ఉందా అన్నది చూసుకోవాలి. మన ఇంటి దగ్గర అద్భుతంగా ఉందనుకున్నా మార్కెట్లోకి వెళ్లినప్పుడు అట్టర్‌ఫ్లాప్ కావొచ్చు. కనుక, ఇందుకోసం మార్కెట్ రీసెర్చ్ చేయాలి. మిగతా వాటికి ఎంత భిన్నంగా, ఎంత నాణ్యంగా మీరు ప్రొడక్టును అందించగలరన్నదానిపై దృష్టి పెట్టాలి. అప్పుడే కస్టమర్లు మీ వైపు వస్తారన్నది గుర్తుపెట్టుకోవాలి. 3. టెస్ట్ చేయండి. యెకాయెకిన వ్యాపారంలోకి దూకేయకుండా ముందుగా ఒకసారి మీ హాబీని వ్యాపారంగా మార్చుకుంటే వర్కవుట్ అవుతుందో లేదో టెస్ట్ చేసి చూడండి. ఒకవైపు జాబ్ మానకుండా కొనసాగిస్తూనే మరోవైపు పార్ట్‌టైమ్ వ్యాపారంగా హాబీని పరీక్షించండి. కొంతైనా సరే ఆదాయం ఎలా వస్తోంది, విస్తరిస్తే ఎలా వచ్చే అవకాశం ఉంది అన్నది పరిశీలిస్తే రంగంలోకి దిగొచ్చా లేదా అన్నదానిపై అవగాహన వస్తుంది. 4. ప్రణాళిక ఉండాలి.. టెస్ట్ డ్రైవ్‌ని బట్టి ముందుకెళ్లవచ్చు అనుకున్న పక్షంలో బిజినెస్ ప్లాన్‌ని ఒకటి తయారు చేసుకోండి. ఏ స్థాయిలో మొదలుపెడుతున్నారు, ఎప్పటికల్లా ఏ స్థాయికి చేర్చాలనుకుంటున్నారు వంటి లక్ష్యాలను నిర్దేశించుకోండి. ఏముందీ, ఇప్పటిదాకా పార్ట్‌టైమ్‌గా ఉన్నది కాస్తా ఫుల్‌టైమ్ అవుతుంది .. దీనికంటూ పెద్దగా ప్రణాళికలు వగైరా అంటూ హడావుడి అనవసరం అని తేలిగ్గా తీసిపారేయకండి. వ్యాపారం వృద్ధి చెందాలంటే ప్లానింగ్ చేసుకోవడం, సమీక్షించుకోవడం, బిజినెస్ వ్యూహంలో మార్పులు, చేర్పులు చేపట్టడం అనివార్యం. అలాగే, చట్టబద్ధంగా అనుమతులు మొదలైనవి తీసుకోవాల్సి ఉందేమో చూసుకోవాలి. 5. మార్కెటింగ్.. మార్కెటింగ్.. మార్కెటింగ్. హోమ్ బిజినెస్ విజయవంతం కావాలంటే కావాల్సినది నాణ్యమైన ఉత్పత్తి లేదా సర్వీసు అందించడమో మాత్రమే సరిపోదు. సాధ్యమైనంత ఎక్కువమందికి వాటి గురించి తెలియాలి. కనుక రోజువారీ వ్యాపార కార్యకలాపాల్లో మార్కెటింగ్ కచ్చితంగా భాగం కావాలి. ప్రస్తుతం ఫేస్బుక్ వంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్లు ఇందుకు చాలా ఉపయోగపడుతున్నాయి. కేవ లం మీ చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితం కాకుండా ఇలాంటి వాటితో ఎక్కడెక్కడో ఉన్న కస్టమర్లకు కూడా చేరువ కావొచ్చు. వ్యాపారావకాశాలను ఎలా మెరుగుపర్చుకోవచ్చన్న దానిపై ఈ తరహా సైట్స్‌లో ఎక్స్‌పర్ట్‌ల నుంచి సలహాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే, దీని కన్నా ముందుగానే ఎవరు కొనే అవకాశం ఉంది, ఏ విధంగా వారి దృష్టిని ఆకర్షించాలి, ఎలా వారిని చేరాలి మొదలైన వాటి కోసం ఒక ప్రణాళిక అంటూ తయారుచేసుకోవాలి. -
రోజంతా మేకప్ తాజాగా..?
కౌన్సెలింగ్ ఈ మాసంలో పెళ్లిళ్లు, పండగలు ఎక్కువగా ఉన్నాయి. మేకప్ తప్పనిసరి అవుతుంది. కానీ చెమట, ఉక్కపోత వల్ల చికాకుగా ఉంటుంది. మేకప్ ఎక్కువసేపు తాజాగా, చికాకు కలిగించని విధంగా ఉండాలంటే ఏం చేయాలి? - వనజాక్షి, సీతాఫల్మండి సాయంకాలం వేడుకలలో మేకప్ పెద్దగా ఇబ్బంది అనిపించదు. కాని పగలు వేడుకలకు మాత్రం వాటర్ ఫ్రూఫ్ లేదా స్వెట్ ఫ్రూఫ్ మేకప్ వాడాలి. అయితే వీటిలో అంత లుక్ రాదు. కానీ ఎక్కువ సేపు తాజాగా ఉంటుంది. మేకప్ కి ముందు ఐస్‌క్యూబ్‌తో ముఖమంతా మృదువుగా రాయాలి. కళ్లకు ఐ లైనర్, ఐ లాష్, పెదవులకు లిప్‌స్టిక్ వాడితే చాలు. వీటితో పాటు హెయిర్ స్టైల్, డెస్సింగ్ సౌకర్యవంతంగా ఉంటే చికాకు కలగదు. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. పనిలో అలసట, బయట దుమ్ము ధూళి వల్ల ముఖం శుభ్రపరుచుకున్న కాసేపటికే తాజాదనం కోల్పోయినట్టుగా ఉంటోంది. ‘రోజూ పడుకునేముందు క్లెన్సింగ్ మిల్క్ ఉపయోగించి, ఆ త ర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే మంచిదని, ముఖ చర్మం చాలా బాగా శుభ్రపడుతుంద’ని నా స్నేహితురాలు చెబుతోంది. రోజూ క్లెన్సింగ్ మిల్క్ ఉపయోగించవచ్చా? ఏయే సందర్భాలలో ఉపయోగించాలో చెప్పగలరు. - సీమ, ఈమెయిల్ క్లెన్సింగ్ మిల్క్ చర్మంలోని పోర్స్ వరకు వెళ్లి మలినాలను తొలగించి, శుభ్రం చేస్తుంది. దీనిని రోజూ వాడితే చర్మంలోని సహజసిద్ధమైన ఆయిల్స్ పోయి పొడిగా తయారవుతుంది. పొడిగా మారిన చర్మం త్వరగా ముడతలు పడుతుంది. దీంతో త్వరగా వయసు పైబడినట్టుగా కనిపిస్తారు. అందుకని ఎప్పుడు పడితే అప్పుడు క్లెన్సింగ్ మిల్క్‌ను వాడకూడదు. చర్మతత్త్వాన్ని బట్టి పదిహేను, నెలరోజులకు ఒకసారి ఉపయోగించడం మేలు. చర్మకాంతి పెరగాలంటే మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం, సమతుల ఆహారం, సరైన నిద్ర... అవసరం అవుతాయి. ముందు జీవనశైలి మీద దృష్టి పెట్టి, ఆ తర్వాత బ్యూటీ నిపుణుల సలహాలు పాటించండి. ముఖానికి పండ్లగుజ్జుతో మసాజ్ చేసుకోవడం, ఫేస్‌ప్యాక్‌గా వాడటం వల్ల చర్మకాంతి పెరుగుతుందంటారు. నిజమేనా? అయితే ఎలాంటి పండ్లు వాడాలి? - రశ్మి, ఈమెయిల్ మన చర్మతత్త్వం ఎలాంటిదో తెలుసుకోకుండా రకరకాల పండ్లను మసాజ్‌లకు వాడితే చర్మం దెబ్బతినే అవకాశం ఉంది. పైగా ఆ పండ్లలోని రకరకాల ఆమ్లాలకు మన చర్మం ఎలా ప్రభావితం అవుతుందో కూడా తెలియదు. ఆ పండ్లలో ఉండే ఆమ్లాలు చర్మాన్ని దెబ్బతీయవచ్చు. ఉదాహరణకు చాలామంది పసుపు రాసుకుంటారు. కాని కొందరికి ఆ పసుపులోని గుణాలు పడక మొటిమలు రావచ్చు. అంటే ఎవరి చర్మతత్త్వానికి తగ్గట్టుగా వారు ఆ ఉత్పత్తులను వాడితేనే సరైన ఫలితాలు లభిస్తాయి. మసాజ్ విషయానికి వస్తే నిపుణులు చేసే మసాజ్‌లో స్ట్రోక్స్ చర్మానికి తగ్గట్టుగా ఉంటాయి. వాళ్లు వాడే నాణ్యమైన ఉత్పత్తులు మంచి ఫలితాన్ని ఇస్తాయి. తాజా పండ్లు తినడం వల్ల ఆరోగ్యం లభిస్తుంది. ఆరోగ్యం చర్మకాంతిని పెంచుతుంది. అందుకని పండ్లను మసాజ్‌లకు కాకుండా తినడానికి ఉపయోగించడం మంచిది. అంతగా అయితే కొన్ని రకాల పండ్లను మాత్రమే ఆ చర్మతత్వానికి తగ్గట్టు ఫేస్ ప్యాక్ మాత్రమే వేసుకోవచ్చు. మసాజ్‌లు చేసుకోకూడదు. - గీతాంజలి ప్రియ, బ్యూటీషియన్ -
‘ప్లస్’ అయ్యే అలంకరణ
వయసు పైబడడం, ఆరోగ్యం, వంశపారంపర్యం, పని ఒత్తిడి... ఇలా రకరకాల కారణాల వల్ల అధిక బరువు ఓ బెడదలా ఇటీవల చాలామందిని వేధిస్తోంది. పెరిగిన బరువు అందానికి ‘మైనస్’ అనుకోవడం కన్నా.. దానినే ‘ప్లస్’గా మార్చుకుంటే మేలు అని భావించేవారి కోసమే ఈ కథనం... సాధారణంగా అన్ని షాపులలో జీరో (0) నుంచి ఫార్టీ (40) సైజ్ లోపు కొలతలలో రకరకాల దుస్తులు లభిస్తున్నాయి. నలభై కన్నా పై కొలతలలో ఉన్నవారిని ‘ప్లస్ సైజ్’ అంటారు. ఈ సైజ్ వారికి డ్రెస్సులు కావాలంటే మాత్రం ‘సారీ, టైలర్‌తో చెప్పి కుట్టించుకోండి..’ అని సలహా ఇస్తుంటారు. ఫ్యాషనబుల్‌గా కనిపించాలనుకుని సరైన కొలతలలో లేని దుస్తులు తెచ్చుకొని ఇబ్బంది పడటం, టైలర్ సరైన కొలతలలో డ్రెస్ కుట్టకపోవడం, తమ శరీరాకృతికి సరిపడా ఎలాంటి దుస్తులు వేసుకోవాలో, డిజైన్ చేయించుకోవాలో తెలియకపోవడం.. ఇవన్నీ అధికబరువు (ప్లస్ సైజ్) ఉన్నవారి ప్రధాన సమస్యలు. లావుగా ఉన్నా అందంగా, కాలానుగుణంగా వేషధారణ హుందాగా ఉండాలంటే... దుస్తుల ఎంపిక సరిగ్గా ఉండాలి. ఈ విషయాలపై అవగాహన పెంచుకుంటేమీ జీవనశైలి మరింత సులభంగా, మరింత సుందరంగా మారిపోతుంది. మీ శరీరాకృతి లావుగా ఉంటే... బాధాపడాల్సిన అవసరమే లేదు. ఫ్యాషన్ డిజైనర్లు. ప్లస్ సైజ్ ఉమన్ దుస్తుల ఎంపికకు ఇస్తున్న ఈ సూచనలు పాటించండి... బిగుతుగా ఉండే దుస్తులను కొనుగోలు చేయకూడదు/ధరించకూడదు. చిన్న సైజు, బిగుతుగా ఉండే దుస్తులు ధరిస్తే మరింత లావుగా కనిపిస్తారు. మరీ వదులుగా ఉండే దుస్తులను కొనుగోలు చేయకూడదు/ధరించకూడదు. ‘బాగా వదులుగా ఉండే దుస్తులు ధరిస్తే సన్నగా కనపడతాం’ అనుకోవడం అపోహ. వేలాడుతున్నట్టుగా ఉండే దుస్తులను ధరిస్తే మరింత లావుగా కనిపిస్తారు. అధికబరువున్న వారు ఈ విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ప్లస్ సైజ్ ఉమన్‌కు డిజైన్ చేసిన బ్రాండెడ్ దుస్తుల్లోనూ అన్నీ ఒకే తరహావి ఉంటాయి. ఒక్కోసారి ఆ డ్రెస్ కొలతలు మీకు నప్పకపోవచ్చు. అందుకని ఎంపిక చేసుకునేటప్పుడు ఒకసారి కొనుగోలు చేసే దుస్తులను వేసుకొని, అద్దంలో చూసుకొని, నప్పితేనే తీసుకోవాలి. లావుగా కనిపించే శరీర భాగాలలో ముదురు రంగులతో కవర్ చేసే డిజైన్లు గల దుస్తులను ఎంపిక చేసుకోవాలి. కాంతిమంతమైన/లేత రంగులకన్నా ఫ్యాషన్‌లో ముదురు రంగులు ఎప్పుడూ ముందుంటాయి. లావుగా ఉన్నవారు వీటిని నిరభ్యంత ధరించవచ్చు. అంతేకాదు ఈ రంగులు అధికబరువును తక్కువగా చూపిస్తాయి. వంగపండు, గోధుమ, బూడిద... రంగువి కూడా ముదురు రంగులలో ఎంపిక చేసుకోవచ్చు. అయితే టాప్ (నడుము పై భాగంలో) కలర్ ముదురు రంగులో ఎంపిక చేసుకుంటే బాటమ్ (నడుము కింది భాగంలో) లేత రంగులో తీసుకోవాలి. అధికబరువు ఉన్నవారు దుస్తులతో ఇంకాస్త బరువును పెంచుకోకూడదు. దుస్తులకు వచ్చే పెద్ద పెద్ద బటన్స్, పెద్ద పాకెట్స్, వెడల్పాటి కుచ్చులు.. ఎదుటివారి దృష్టి పడేలా చేస్తాయి. అందుకని దుస్తులపై డిజైన్స్ ఇలా అన్నీ పెద్ద పెద్దగా ఉండేవి ఎంచుకోకూడదు. ప్యాంట్స్ అయితే బ్యాక్ పాకెట్స్‌పై, టాప్స్ అయితే చేతులు లేని జాకెట్‌పై ఎంబ్రాయిడరీ లేకుండా జాగ్రత్తపడాలి. మీ వార్డ్రోబ్ నుంచితొలగించాల్సినవి..! చాలా పొట్టిగా ఉండే షార్ట్స్ వదులుగా ఉండే ట్రౌజర్స్ పొట్టి లంగాలు (మినీ స్కర్ట్స్) మామ్ జీన్స్ (నడుము, పిరుదుల భాగం ఎక్కువ వదులు ఉండేవి) రిప్డ్ జీన్స్ (అక్కడక్కడా చిరుగులు ఉన్న జీన్ ప్యాంట్స్), కార్గో ప్యాంట్స్ బ్యాగీ జీన్స్ (పూర్తి వదులుగా ఉండేవి) ఫిట్‌గా లేని బ్లేజర్స్ బ్యాగీ స్వెట్స్ పొడవు లంగాలు మెరిసే రాళ్లు, కుందన్స్, చమ్కీతో చేసిన డిజైన్లు గల దుస్తులు ఎక్కువ కుచ్చులు ఉన్న డ్రెస్సులు పెద్ద పెద్ద ప్రింట్లు ఉన్న దుస్తులు రంగురంగులుగా ఉండే కౌబాయ్ బూట్లు. ‘ప్లాట్’గా పై నుంచి కిందకు ఒకే విధంగా ఉండేలాంటి దుస్తులు తీసుకోకూడదు. మహిళలు సాధారణం గా తమ వేషధారణ ఒకే రంగు (మ్యాచింగ్)లో ఉండాలనుకుంటారు. మ్యాచింగ్ అధికమైతే ఇంకాస్త లావుగా కనిపిస్తారు. ‘కాంట్రాస్ట్’ (ఒకదానితో ఒకటి పోలిక లేనివి) కలర్స్ దుస్తులు వేసుకుంటే మేలు. ఉదా: స్కర్ట్/ప్యాంట్స్ వేసుకునేవారు అదే రంగు టీ షర్ట్ వేసుకోకూడదు. టీ షర్ట్‌పైన వేసుకునే ఓవర్‌కోట్ స్కర్ట్/ప్యాంట్ ఒకే రంగులో ఉండేలా ఎంపిక చేసుకోవాలి. సైజ్ చార్ట్! ఛాతీ పరిమాణం 41-45, నడుము పరిమాణం 33-37 హిప్ (పిరుదుల)పరిమాణం 43-47 ఉన్నవారు XXSసైజ్ దుస్తులను ... ఛాతీ పరిమాణం 77-83, నడుము 71-78 హిప్ (పిరుదుల)పరిమాణం 80-90 ఉన్నవారు XXLసైజ్ దుస్తులను ఎంపిక చేసుకోవాలి. ప్లస్ సైజ్ వారు ఆన్లైన్ చార్ట్‌ను అనుసరించవచ్చు. అలంకరణ అనేది వస్తువుల స్థాయిని పెంచాలి. మీరు లావుగా ఉంటే ధరించే ఆభరణా లు సన్నగా ఉంటే ఏ మాత్రం కనిపించవు. అందుకని మధ్యస్థం- పెద్ద సైజున్నవి ఎంచుకోవాలి. మీ కాళ్లకు తగిన మందపాటి హీల్ ఉన్న చెప్పులు ధరించాలి. అలాగే పెద్ద పర్స్/బ్యాగ్ వెంట తీసుకెళ్లాలి. ఈ తరహా ఇతర అలంకరణ వస్తువులు మిమ్మల్ని సన్నగా చూపిస్తాయి. నోట్: మరీ పెద్ద పెద్దవి కాకుండా... మీరు ఉన్న లావును కొద్దిగా అధిగమించేలా మాత్రమే మీ ఇతర అలంకరణ వస్తువులు ఉండాలనే విషయం మర్చిపోవద్దు. అలంకరణ సమయంలో మీ బరువు, మీ ఎత్తు సైజ్, ఎముక సామర్థ్యం.. ఇవన్నీ దృష్టిలోపెట్టుకోవాలి. మీ వార్డ్రోబ్లోఉండాల్సివి..! వి నెక్ గల తెల్లటి చొక్కా (బటన్ డౌన్ షర్ట్) శరీరాకృతికి సరిగ్గా సరిపడే నలుపు రంగు డ్రెస్. ఫిట్‌గా ఉండే లాంగ్ ప్యాంట్స్ ఫిటెడ్ బ్లేజర్స్ ప్రస్తుత కాలానికి తగ్గ దుస్తులు మీకు మాత్రమే ప్రత్యేకం అనిపించే స్టైల్ దుస్తులు హాఫ్ స్కర్ట్(మోకాళ్ల వరకు ఉండేది) ఎంపిక సరైనది పొట్టను కవర్ చేసే డిజైనర్ దుస్తులు. (వీటి ఎంపికలో డిజైనర్/షాప్/ ఆన్లైన్ సాయం తీసుకోవచ్చు) శరీరాకృతికి సరిగ్గా నప్పేవి, సరైన ఫిట్‌తో ఉన్న లో దుస్తులు బెల్ట్‌లు, ఆభరణాలు, పాదరక్షలు.. వీటితోనూ మీ దుస్తుల్లో కొత్త మార్పులు తీసుకురావచ్చు. దుస్తులు కుట్టించుకోవాలంటే... కుర్తా, టాప్స్ టైలర్‌తో కుట్టించుకునేటప్పుడు ‘సైడ్ ఓపెన్స్’ పిరుదుల పై భాగం వరకు పెట్టించుకోవాలి. దీని వల్ల కూర్చునేటప్పుడు డ్రెస్ ముందు భాగం పొట్టమీదకు రాకుండా ఉంటుంది. వెయిస్ట్ భాగంలో బిగుతుగా ఉండే డ్రెస్ వల్ల మరింత లావుగా కనిపించే అవకాశం ఉంది. జాకెట్టు చేతులు కుచ్చులున్నవి డిజైన్ చేయించుకుంటే చేతులు మరింత లావుగా కనిపిస్తాయి. లావుగా ఉన్నవారికి బ్రాడ్, ఓవర్ నెక్స్ సరిగ్గా నప్పుతాయి. నోట్: లావుగా ఉన్నప్పటికీ పొడవుగా ఉన్నవారు... స్లీవ్స్, ప్యాంట్స్, లెగ్గింగ్స్ సరైన ఫిట్‌తో ఉండేవి తీసుకోవచ్చు. పొట్టిగా ఉంటే నిలువు చారలు ఉన్నవి, విభిన్న రకాల రంగుల్లో ఉన్న డ్రెస్సులను ఎంచుకోవాలి. చీరలు కట్టుకునేవారు కాటన్ చీరలు కట్టుకుంటే మరింత లావుగా కనిపించే అవకాశం ఉంది. 42 - 62 అంగుళాల పరిమాణంలో ఉన్నవారి కోసం సాధారణ దుస్తుల నుంచి పార్టీవేర్ వరకు ప్లస్ సైజ్ స్టోర్లలో అన్ని రకాల బ్రాండ్లలో (టాప్స్, కుర్తీస్, లెగ్గింగ్స్, జీన్స్, టీ షర్ట్స్, పార్టీవేర్, వెస్ట్రన్‌వేర్, ట్రెడిషనల్ వేర్..) నాణ్యమైన దుస్తులు లభిస్తున్నాయి. ఇవన్నీ కాటన్, టెరీకాటన్, సిల్క్, సింథటిక్... మెటీరియల్స్‌లో లభిస్తున్నాయి. - నిర్మలారెడ్డి కర్టెసీ ప్లస్ సైజ్, పంజగుట్ట, హైదరాబాద్ -
ఫౌండేషన్ వాడుతుంటే...!
మేకప్ సీజన్ మారింది...మేకప్‌కి వాడే సౌందర్య ఉత్పాదనలు ఈ కాలంలో వచ్చే మార్పులను తట్టుకుంటూ చర్మసంరక్షణకు ఉపయోగపడే విధంగా ఉండాలి తడి, చలి తట్టుకునేలా లిక్విడ్ ఫౌండేషన్‌ను ఎంచు కోవాలి. మాయిశ్చైరె జర్ ఉన్న ఫేసియల్ క్లెన్సర్స్, నాణ్యమైన మాయిశ్చరైజర్ వాడితే చర్మం పొలుసు లుగా అవదు కాలానుగుణంగా చర్మవైద్య నిపుణులను సంప్రదించి చర్మంలో వచ్చే మార్పులను దానికి తగ్గ ఫౌండేషన్‌ని సూచించమని కోరవచ్చు పౌడర్లు వాడే వారు చర్మం తేమను కోల్పోకుండా చేసే హైడ్రేటింగ్ ఫార్ములా ఫౌండేషన్ లోషన్లను ఎంచుకోవాలి ఫౌండేషన్ ముఖానికే కాకుండా మెడకు కూడా ఉపయోగించాలి. లేదంటే ముఖం తెల్లగా, మెడ నలుపుగా కనిపించే అవకాశాలున్నాయి. -
అందంగా లేనా..?
చూసే కంటిని బట్టే అందం ఉంటుందంటారు. విభిన్న జాతులు, సంస్కృతులు, సంప్రదాయాలు కలిగిన ఈ ప్రపంచంలో ఏది అందమో ఎలా చెప్పగలం? మేకప్, ఫొటోషాప్‌లు అందానికి మరిన్ని మెరుగులు దిద్దే సాధానాలుగానే కాక.. ఆ అందాన్నే సృష్టించే స్థాయికి చేరిన తరుణంలో అందాన్ని కొలిచే కొలబద్ధ లేదా ఓ ప్రమాణం ఏదైనా ఉందా? అంటే సమాధానం చెప్పడం కష్టమే. కానీ ఇవే ప్రశ్నలతో ఎస్తేర్ హోనిగ్ అనే జర్నలిస్టు ‘బిఫోర్ అండ్ ఆఫ్టర్’(ముందు-తర్వాత) అనే ఓ శోధనా ప్రాజెక్టు చేపట్టింది. అందానికి కొలబద్ధలు దేశదేశానికీ ఎలా మారిపోతాయో తెలుసుకోవడానికి.. 25 దేశాల్లోని 40 మంది ఫొటోషాప్ నిపుణులను సంప్రదించింది. ‘నన్ను అందంగా తయారు చేయండి’ అంటూ తన ఫొటో పంపింది. వచ్చిన ఫొటోలు చూసి ఆశ్చర్యపోవడం ఆ అమ్మడి వంతైంది. ప్రతి ఫోటోషాప్ నిపుణుడూ తమ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఆమె ఫొటోకు నగిషీలు చెక్కి అందంగా తయారుచేసి పంపించారు. మరి ఈ ఫొటోల్లో ఎవరు అందగత్తె అంటే ఎలా చెప్పగలం? -
వయసుకు తగినట్టుగానే ఉందా?
అలంకరణ నేడు ఫ్యాషన్ పోకడల మూలంగా వయసు పైబడిన వారు సైతం టీనేజ్ యువతుల్లా తయారవడానికి ఆసక్తి చూపుతున్నారు. దానికి తగ్గట్టు వేషధారణ, మేకప్ చేసుకుంటున్నారు. అతి అలంకరణ వయసు మరింత పైబడినట్టు చూపిస్తుంది. సమకాలీన పరిస్థితులను అనుసరిస్తూ ఫ్యాషన్‌లోనూ, మేకప్‌లోనూ ట్రెండ్స్‌ను పరిశీలిస్తూ మేనికి నప్పే సౌందర్య ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయాలి. మేకప్‌లో ఫౌండేషన్‌ను ఎక్కువ ఉపయోగిస్తుంటారు. దీని వల్ల జిడ్డు చర్మానికి ఫౌండేషన్ మరింతగా అతుక్కుపోయి, సహజకాంతిని దూరం చేస్తుంది. పెదవులకు ముదురు రంగు లిప్‌స్టిక్‌లను వాడితే వయసు పైబడినట్టుగా చూపిస్తాయి. అసహజంగానూ కనిపిస్తాయి. తప్పనిసరై ముదురు రంగు లిప్‌స్టిక్ వాడితే, పైన లిప్‌గ్లాస్ సహజసిద్ధమైనది ఎంచుకోవాలి. మేకప్ అంటే పెదవులకు గాఢమైన ముదురు రంగు, కనురెప్పలకు మెరుపులద్దే షిమ్మర్‌ని ఉపయోగించాలనుకోకూడదు. ముఖంలో పెదవులు, కళ్లు, బుగ్గలు.. ఇలా ప్రతి భాగాన్నీ అత్యంత జాగ్రత్తగా చిత్రకారుడు బొమ్మను గీసినంత అందంగా తీర్చిదిద్దాలి. ఎప్పుడైనా ముఖం సహజమైన మెరుపుతో కనిపించాలి. ఇందుకోసం అత్యంత తక్కువ మేకప్‌ను ఎంచుకోవాలి. -
విగ్గుల నగరి
బంజారాహిల్స్, న్యూస్‌లైన్: కృష్ణానగర్.. సినీప్రేమికుల నగరం. ప్రస్తుతం విగ్గులకు కేంద్రంగా మారింది. సినిమాలతో పాటు.. బుల్లితెరలో సీరియళ్లు.. షోల సంఖ్య పెరగడంతో.. విగ్గులకు గిరాకీ పెరిగింది. దీంతో ఈ ప్రాంతంలో వీధికో విగ్గుల దుకాణం ఏర్పాటవుతోంది. మేకప్ వేసే నైపుణ్యం ఉన్నవారే విగ్గులను తయారు చేయగలరని అయ్యప్ప కాస్మటిక్స్ అండ్ విగ్స్ అధినేత, సినీ మేకప్‌మ్యాన్ ఎం.బాబు తెలిపారు. మేకప్‌మ్యాన్ అయితేనే పాత్రలకు, నటులకు సరిపోయే విధంగా విగ్గును డిజైన్ చేస్తారని చెప్పారు. చెన్నై నుంచి.. తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న చాలా మంది చెన్నై నుంచి వచ్చినవారే. 30 ఏళ్ల క్రితం పరిశ్రమతో పాటే ఫిలింనగర్‌కి వచ్చారు. విగ్గుల తయారీ తేలిక కాదని శ్రీ భువనేశ్వరి విగ్షాప్ యజమాని మల్లికార్జునరావు వెల్లడించారు. ఓపికతో పాటు సృజన అవసరమని వివరించారు. ప్రస్తుతం విగ్గుల తయారీలో చాలామంది నిరుద్యోగ యువత ఉపాధి పొందుతున్నారు. శ్రీకృష్ణానగర్, ఇందిరానగర్, ఫిలింనగర్‌లలో 400 మంది విగ్గుల తయారీలో నిమగ్నమయ్యారు. తమకి పాత్రపేరు చెబితే దాని ప్రకారం విగ్గులను తయారు చేస్తామని పాండు అనే విగ్గుల తయారీదారుడు చెప్పారు. భీముడు, యముడు తదితర పౌరాణిక పాత్రలతో పాటు, జానపద సినిమాల్లో అవసరమైన విగ్గులను రూపొందిస్తామని నందు అనే విగ్గు తయారీదారుడు చెప్పారు. విగ్గుకి ఒక్కరోజుకి రూ. 200 నుంచి 500ల వరకు అద్దె రూపంలో వసూలు చేస్తామని వెల్లడించారు. నిత్యం 30 వరకు.. గ్రామీణ వాతావరణంలో ఉండే హీరో గెటప్‌కు, సిటీలో ఉండే హీరో తరహాకు జుట్టులో, మీసంలో చాలా తేడాలుంటాయని ఆ పాత్రలు ఆకళింపుచేసుకుని దర్శకుడు, నటీనటుల చెప్పినవిధంగా రూపొం దిస్తామని సుబ్బారావు అనే విగ్గు తయారీ దారుడు చెప్పారు. శ్రీకృష్ణానగర్ ప్రాంతం పరిధిలో నిత్యం 30 వరకు విగ్గులను తయారుచేస్తుంటారు. ఒకసారి వాడిన విగ్గును ఇంకోసారి వాడరని దాన్ని పక్కన పెట్టేస్తామని, ఎప్పటికప్పుడు కొత్తవి రూపొం దిస్తామని విగ్గు తయారీదారులు స్పష్టంచేశారు. ఉపాధి లభిస్తోంది.. విగ్గుల తయారీ చాలా కష్టమైంది. నాణ్యమైన వెంట్రుకలను సేకరించి విగ్గులు తయారు చేస్తుంటాం. బ్రౌన్, వైట్, నేచురల్ బ్లాక్, డార్క్బ్లాక్, సింథటిక్ హెయిర్‌తో ఈ విగ్గులు రూపుదిద్దుకుంటాయి. పాత్రలను బట్టి మీసాలు, గడ్డం, తలవెంట్రుకలు తీర్చిదిద్దుతాము. చాలామంది నిరుద్యోగులు ఈ విగ్గుల తయారీతో ఉపాధి పొందుతున్నారు. టీవీ సీరియళ్లకు కూడా విగ్గులు రూపొందిస్తున్నాం. - శ్రీనివాస్, విగ్గుల తయారీదారు, సినీ మేకప్ మ్యాన్, శ్రీకృష్ణానగర్ -
వేడుకలో... వెలుగు
వేడుక ఏదైనా నలుగురిలో ఆకర్షణీయంగా కనిపించాలని కోరుకుంటారు అతివలు.అందుకే డిజైనర్ దుస్తులు, అలంకరణ వస్తువుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు.కొనుగోలులో ఒకటికి పదిసార్లు సరిచూసుకుంటారు. తెలిసినవారిని సలహాలు అడుగుతుంటారు. అన్నీ సరిగ్గా ఉన్నా సరైన మేకప్ లేకపోతే వేడుకలో కళావిహీనంగా కనిపిస్తారు. అయితే ‘వేసవిలో మేకప్ చాలా కష్టం, ఎక్కువసేపు భరించలేం’ అనుకునేవారు చిన్న చిన్న జాగ్రత్తలు పాటించి ముస్తాబైతే ఏ వేడుకలోనైనా వెలిగిపోవచ్చు. మేకప్‌కి ముందుగా: ఒక పాత్రలో మూడు టీ స్పూన్ల పాలు తీసుకొని, వేళ్లతో అద్దుకుంటూ ముఖంపై మృదువుగా మసాజ్ చేయాలి. జిడ్డు చర్మం గలవారు పాలలో సెనగపిండి కలిపి మసాజ్ చేయాలి. ఐదు నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకొని, మెత్తటి వస్త్రంతో తుడుచుకోవాలి. పొడిచర్మం గలవారు క్లెన్సింగ్ మిల్క్‌తో మసాజ్ చేసుకొని, శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై మలినాలు తొలగిపోతాయి. నాణ్యమైన మేకప్ ఉత్పత్తులను ఎంచుకోవాలి. మేకప్ ఇలా... ప్రైమర్: దీంట్లో ఫేస్, ఐ ప్రైమర్ విడివిడిగా ఉంటుంది. వీటిని ముఖానికి, కళ్ల కింద రాసుకోవాలి. ఫౌండేషన్: ఎస్.పి.ఎఫ్ లేని ఫౌండేషన్‌ను బ్రష్‌తో వేసుకోవాలి (వేసవి కదా అని ఎస్.పి.ఎఫ్ మేకప్‌కి ముందుగా వాడితే మేకప్ తెల్లటి ప్యాచ్‌లుగా కనిపిస్తుంది. ఫొటో ఫ్లాష్‌కి ముఖం మరింత తెల్లగా అనిపించడమే కాకుండా, ఫొటోలలో కూడా మేకప్ ప్యాచ్‌లుగా పడే అవకాశం ఉంది). కన్సీలర్: దీనిని కంటి కింది భాగంలో ఐ బ్రష్‌తో వేయాలి. కన్సీలర్కి ముందుగా ఎస్.పి.ఎఫ్ లోషన్ వాడకూడదు. బ్లష్: ఫౌండేషన్ ముఖమంతా సరిగ్గా బ్రష్‌తో వేశాక.. చెంపలు గులాబీల్లా మెరిసిపోవడానికి బ్లష్‌ను ఉపయోగించాలి. అలాగని బ్లష్ మరీ ఎక్కువగా ఉపయోగిస్తే ఎబ్బెట్టుగా కనిపిస్తారు. బ్రోంజర్: ఫొటోలలో మంచి లుక్‌తో ముఖారవిందం కనిపించాలంటే చీక్ బోన్స్ దగ్గర అంటే బుగ్గల పైభాగంలో, చుట్టూ ‘మ్యాట్ బ్రోంజర్’ వాడాలి. దీనివల్ల మేకప్ పగలు కూడా సహజమైన చర్మకాంతిలో కనిపిస్తుంది. ఇల్యుమినేటర్: చీక్ బోన్స్, ముక్కు, కళ్ల కింద, నుదురు, కణతలు... ఇలా ముఖంలో హైలైట్‌గా కనిపించే భాగాలపై లిక్విడ్ ఇల్యుమినేటర్ బ్రష్‌తో చేసుకోవాలి. కనుబొమలు: ఐ బ్రో పెన్సిల్ లేదా జెల్‌తో కనుబొమలను తీరుగా తీర్చిదిద్దుకోవాలి. ఐ షాడో: కనురెప్పల పైన లేత రంగులను షాడో బ్రష్‌తో తీర్చిదిద్దాలి. కనురెప్పలను ఒంపుగా వచ్చేలా ఐ లైనర్, మస్కారాలను ఉపయోగించాలి. పౌడర్: మేకప్ పూర్తయ్యాక టచప్ కోసం పౌడర్ని అద్దాలి. పెదవులు: లిప్ స్టెయిన్, లిప్ లైనర్, లిప్‌స్టిక్‌లతో పెదవులను అలంకరించాలి. చెక్: మేకప్ అంతా సరిగ్గా వచ్చిందా లేదా అని అద్దంలో చూసుకుంటూ, అదనంగా ఉన్న పౌడర్, ఫౌండేషన్‌ని బ్రష్‌తో తీసేయాలి. కళ్లు, పెదవుల మేకప్ తీరుగా ఉన్నదీ లేనిదీ చూసుకోవాలి. ఇలా వేసుకున్న మేకప్ 2 నుంచి 5 గంటల సేపు ఉంటుంది. మేకప్ కొన్ని గంటల పాటు డల్ కాకుండా ముఖం తాజాగా ఉండాలంటే మ్యాక్ స్ప్రే ఉపయోగించాలి.మేకప్ పూర్తయ్యాక ఆభరణాలను, కేశాలను, దుస్తులను నచ్చిన రీతిలో అలంకరించుకోవాలి. ఈ తరహా మేకప్ పెళ్లికూతురితో పాటు పెళ్లికి వెళ్లే అతివలకూ ఉపయోగ కరంగా ఉంటుంది. నోట్: గాడీ మేకప్ వల్ల వేసవి ఉక్కపోతలో చీకాకు కలగవచ్చు. అందుకని లైట్ మేకప్‌కు ప్రాముఖ్యత ఇవ్వాలి. సన్‌స్క్రీన్ లోషన్ వాడేవారు... మేకప్ చేసుకునే ముందు అంటే గంట ముందు సన్ స్క్రీన్ లోషన్ వాడాలి. సన్‌స్క్రీన్ వాడాలనుకునేవారు ఫౌండేషన్ క్రీమ్‌తో కలిపి 3-4 చుక్కలు మాత్రమే లోషన్‌ను ఉపయోగించాలి. జిడ్డు చర్మం గలవారు మేకప్‌కి ముందు రెండు చుక్కల సన్‌స్క్రీన్ లోషన్‌ని రాసుకోవచ్చు. వెంట తప్పనిసరి... మేకప్ చేసుకొని బయటకు వెళ్లేవారు ఫౌండేషన్‌ని కూడా వెంట తీసుకెళ్లడం మంచిది. వెళ్లిన చోట అవసరమైనప్పుడు కొద్దిగా టచప్ చేసుకోవచ్చు. ముఖంపై చమట, జిడ్డు చేరినప్పుడు క్లాత్‌ను ఉపయోగించకుండా టిష్యూ పేపర్‌తో అద్ది, తీసేయాలి. తరచూ మేకప్ వేసుకునేవారు... పెరుగు, సెనగపిండి కలిపి ముఖానికి మసాజ్ చేసుకొని, శుభ్రపరుచుకొని తర్వాత ఫ్రూట్ లేదా ముల్తానీ మిట్టితో ప్యాక్ వేసుకోవాలి. కలబంద (అలోవెరా) రసాన్ని ముఖానికి రాసి, మసాజ్ చేసి, శుభ్రపరుచుకొని, గుడ్డులోని తెల్లసొనతో ప్యాక్ వేసుకోవాలి. మేకప్ వల్ల వచ్చే చర్మ సమస్యలు, మొటిమలు తగ్గుతాయి. పసుపు, పాలు లేదా పసుపు, పెరుగు కలిపి ఏదైనా ఒక ప్యాక్‌ని ముఖానికి వేసుకోవాలి. - నిర్వహణ: నిర్మలారెడ్డి -
లిప్‌స్టిక్ వాడుతున్నారా?
పెదాలకు రంగు వేసుకొని ముచ్చటపడేవారు చాలామందే ఉంటారు. కానీ వారి చర్మరంగు, దుస్తుల మ్యాచింగ్ ఇవేవీ పట్టించుకోకుండా లిప్‌స్టిక్ వాడితే అందంగా ఉండటానికి బదులు ఎబ్బెట్టుగా ఉంటుంది. వేసవిలో లిప్‌స్టిక్ వాడేవారికి కొన్ని సూచనలు... ముదురు రంగులకు దూరం: పెదవులకు ముదురురంగు లిప్‌స్టిక్ వాడితే పెదాలు చిన్నగా కనిపిస్తాయి. పెదవుల రంగులోనే కనిపించాలంటే న్యూడ్ లేదా క్లియర్ షేడ్స్ గల లిప్‌స్టిక్‌ను ఎంచుకోవాలి. అప్పుడే పెదవులు సహజమైన కాంతితో కనిపిస్తాయి. షాడో తప్పనిసరి: ముదురు గోధుమ రంగు, వాటర్‌ఫ్రూఫ్ ఐలైనర్‌తో కిందిపెదవి అంచు వద్ద చిన్న లైన్ గీయాలి. తర్వాత లిప్‌స్టిక్ వేసుకోవాలి. ఈ చిన్న మార్క్ వల్ల పెదవులు పెద్దగా, మరింత వంపుతిరిగినట్టు అందంగా కనిపిస్తాయి. గ్లాసీ లిప్‌స్టిక్: ఎంచుకున్న లిప్‌స్టిక్‌తో పెదవులను తీర్చిదిద్దాక అలాగే వదిలేస్తే జీవం కోల్పోయి కనిపిస్తాయి. పైన కాంతిని ఇచ్చే షైనీ ఫినిష్‌తో టచప్ చేయాలి. పగిలిన పెదవులు: పెదవులపై చర్మం పొడిబారితే మృతకణాలు తేలి, లిప్‌స్టిక్ వేసినా ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. కాబట్టి మెత్తటి టూత్‌బ్రష్‌తో కొద్దిపాటి ఒత్తిడిని కలిగిస్తూ రుద్దాలి. తర్వాత నీటితో కడిగి, లిప్‌బామ్ రాయాలి. -
మేకప్ ఎక్కువసేపు ఉండాలంటే!
పొడి చర్మం: వేసవిలో మేకప్‌కు ముందు మాయిశ్చరైజర్ రాయాల్సిన అవసరం ఉండదు. అయితే చెమట ప్రతాపానికి మేకప్ పోకుండా వాటర్‌ప్రూఫ్ మేకప్ వాడటం మేలు. లిక్విడ్ ఫౌండేషన్‌ని ఉపయోగించిన తర్వాత మస్కారా, లైనర్‌తో కళ్లను తీర్చిదిద్దుకోవాలి. తర్వాత పెదవులకు లిప్ లైనర్, గ్లాస్‌ను ఉపయోగించాలి. బుగ్గలకు బ్లష్‌ను అద్ది, టిష్యూ పేపర్‌తో టచ్ చేస్తూ అదనపు రంగును తీసేయాలి. జిడ్డు చర్మం: వేసవిలో మరింత జిడ్డుగా మారుతుంది. అలాంటప్పుడు ముందుగా ఐస్‌తో ముఖమంతా రబ్ చేసి, తర్వాత ఫౌండేషన్‌ని ఉపయోగించాలి. మేకప్‌కు ముందు బేస్ కోసం ప్రైమర్లోషన్(మార్కెట్లో లభిస్తుంది)ను ఉపయోగించాలి. దాని మీద కాంపాక్ట్ , ఫౌండేషన్ వాడకుండా వాటర్ బేస్డ్ పాన్‌కేక్స్‌ను ఉపయోగించాలి. తర్వాత కళ్లు, పెదవులు, బుగ్గలు తీరుగా తీర్చిదిద్దుకోవాలి. సాధారణ చర్మం: చాలామంది సాధారణ చర్మతత్వం గలవారని అంటుంటారు కానీ, వీరిది కాంబినేషన్ స్కిన్ అనవచ్చు. ముఖంలో నుదురు, గడ్డం జిడ్డు అవుతుంది. అందు కని వీరు కూడా మేకప్‌కు ముందు ఐస్‌తో ముఖమంతా రబ్చేయాలి. నుదురు, గడ్డానికి ప్రైమర్ లోషన్‌ని బేస్‌గా వాడి తర్వాత కళ్లు, పెదవులు, బుగ్గలను తీర్చిదిద్దుకోవాలి. -
చెప్పులకు బ్యాగ్ మ్యాచ్ అయ్యిందా?
చాలామంది దుస్తులమీదే దృష్టి పెడతారు. కొంతమంది దుస్తులతో పాటు మేకప్‌పై కూడా ఆసక్తి చూపిస్తారు. కాని చాలా మంది పట్టించుకోని యాక్ససరీ ఒకటుంది. అదే బ్యాగ్! అలంకరణలో హ్యాండ్‌బ్యాగ్ ప్రధాన భూమిక పోషిస్తుందనే విషయం చాలా మందికి తెలియదు. భుజానికి వేలాడే అతి చిన్న బ్యాగ్ కూడా మీ అలంకరణలో భాగమే. హ్యాండ్‌బ్యాగ్ ఎంపికలో ఫ్యాషన్ డిజైనర్స్ ఏమంటున్నారంటే.. ‘ధరించే దుస్తులకు మ్యాచ్ అయ్యే బ్యాగ్ కాదు, ధరించే చెప్పులకు, చేతపట్టుకునే బ్యాగ్‌కి సమన్వయం ఉండేలా చూసుకోవాలి’ అని చెబుతున్నారు. సాయంకాలం పార్టీకి పువ్వుల ప్రింట్లు ఉన్న డ్రెస్ ధరించాలని అన్ని వయసుల వారూ అనుకుంటారు. దాంట్లో మీరు వైవిధ్యం చూపించేదేమీ ఉండదు. అదే ముదురుపసుపు రంగు సాదా డ్రెస్ ధరించి, పువ్వుల ప్రింట్లు ఉన్న బ్యాగ్ దానికి మ్యాచ్ అయ్యే చెప్పులు వేసుకున్నారనుకోండి. పార్టీలో మీరే మరింత ప్రత్యేకంగా కనిపిస్తారు. యానిమల్ ప్రింట్లు (జంతుచర్మాలపై చారలను పోలినవి) మీకు అత్యంత ఇష్టమైతే సాధారణంగా కనిపించే డెనిమ్ డ్రెస్ ధరించి, ప్రింట్లు ఉన్న ఎత్తుమడమల చెప్పులు వేసుకొని, అదే రంగు క్లచ్బ్యాగ్ చేత పట్టుకోండి. ఎత్తుమడమల చెప్పులు ఇష్టపడని వారు ఫ్లాట్స్ వేసుకోవచ్చు. ఏవైనా ఈ తరహా మ్యాచింగ్ చూసుకున్నప్పుడు అతి ఎక్కువగా అలంకరణలు చేసుకోకుండా ఉండటం మేలు. సంప్రదాయ తరహాలో కనిపించాలనుకునేవారు క్లాసిక్ కలర్స్ అయిన నలుపు, ఎరుపు, ముదురు రంగు దుస్తులను ధరిస్తుంటారు. ఇలాంటప్పుడు బ్యాగ్ ఎంపికలో ఏమాత్రం అలసత్వం చూపవద్దు. చేతికి తగిలించుకునే బ్యాగ్, అందుకు మ్యాచ్ అయ్యే చెప్పులు బాగుండేలా జాగ్రత్తపడాలి. అన్నివేళలా చెప్పులు-బ్యాగ్ మ్యాచ్ అవ్వాలనుకోకూడదు. తెల్లటి బ్యాగ్ వెంట తీసుకెళ్లాలనుకుంటే నీలం, నారింజ, పసుపు రంగు చెప్పులు లేదా షూస్ ప్రయత్నించవచ్చు. అలాగే సాధారణ దుస్తులకు దృఢంగా ఉండే బ్యాగులు నప్పవు. కొద్దిగా వేలాడుతుండే లెదర్ లేదా క్లాత్ బ్యాగ్‌లు వేసుకొని అదే రంగు, మెటీరియల్ గల చెప్పులు ధరించాలి. ప్యాంట్, షర్ట్, చెప్పులతో పాటు బ్యాగ్ కూడా ఒకే రంగులో ఒకే ప్రింట్లలో ఉంటే అలంకరణ మరీ అతిగా కనిపిస్తుంది. ప్యాంట్ లేదా టాప్ ఏదైనా ఒక రంగును పోలి ఉండే బ్యాగ్‌ను ఎంచుకోవచ్చు. మీరు ధరించే దుస్తులు ప్లెయిన్‌గా ఎలాంటి ప్రింట్ లేకుండా ఉన్నాయనుకోండి. అప్పుడు ఎక్కువ ప్యాటర్స్ ఉన్న బ్యాగ్ లేదా షూ ధరించవచ్చు. కాని గుర్తుంచుకోవాల్సిందేంటంటే... షూ, బ్యాగ్ మిమ్మల్ని మరింత అందంగా చూపించాలి. -
కొప్పులో నెలవంక
వాలు జడ, పొట్టి జడ, పాయల జడ, ఫిష్ టెయిల్, ఫ్రెంచ్ ప్లాట్.. ఇలా వందలకొద్దీ హెయిర్ స్టైల్స్ ఉంటే, వాటి అలంకరణలు వేలకొద్ది ఉన్నాయి. అయితే ఒక వయసు దాటాక జడలు అంతగా నప్పవు. అలాగని కొప్పులు వేస్తే మరీ ‘పెద్దవారిలా కనిపిస్తాం’ అని ముఖం ముడుచుకోవాల్సిన అవసరం లేదు ఈ కేశాలంకరణ ఆభరణాలు మీ దగ్గరుంటే! అవి బంగారపువే కానక్కర్లేదు. ఇమిటేషన్ గోల్డ్‌లో విభిన్నరకాలు మార్కెట్లో లభిస్తున్నాయి. వాటిలో రాళ్లు పొదిగినవి, రంగురంగుల పూసలు ఉన్న అందమైన క్లిప్స్ ఉన్నాయి. వెండి డిజైన్లు, ఫ్యాబ్రిక్ డిజైనర్ పువ్వులనూ తలలో తళుక్కుమనిపించవచ్చు. కొప్పుకిందుగా క్లిప్ పెడితే ఒక అందం, నెలవంక మాదిరిగా ఒకవైపు మాత్రమే అలంకరిస్తే మరొక అందం, కొప్పు మధ్యలో సింగారిస్తే ఇంకొక అందం. వేడుకల్లో వెలిగిపోయేలా నేటితరం అమ్మాయిలను సైతం ఆకట్టుకునే కొప్పుల సింగారాలు ఇవి.