మేకప్ తో కనిపిస్తే నన్ను క్షమించండీ..! | I apologise to anybody who found me beautiful with makeup, says Sofia Hayat | Sakshi
Sakshi News home page

మేకప్ తో కనిపిస్తే నన్ను క్షమించండీ..!

Published Fri, Jun 3 2016 8:33 PM | Last Updated on Thu, Jul 18 2019 1:41 PM

మేకప్ తో కనిపిస్తే నన్ను క్షమించండీ..! - Sakshi

మేకప్ తో కనిపిస్తే నన్ను క్షమించండీ..!

బిగ్ బాస్ 7 సిరీస్ అనగానే మొదట గుర్తుకొచ్చే పేరు సోఫియా హయత్. ఎందుకంటే వైల్డ్ కాల్డ్ ఎంట్రీ ద్వారా ఎంటరైన అప్పటి టాప్ మోడల్.. అర్మాన్ కోహ్లీతో గొడవ వల్ల ఆమెను సిరీస్ మధ్యలోనే ఇంటికి పంపివేసిన విషయం తెలిసిందే. సింగర్, మోడల్ అయిన సోఫియా ఇటీవల  నన్(సన్యాసిని) గా మారినట్లు ప్రకటించింది. అయితే కొన్ని వారాలుగా ఆమె మేకప్ వాడుతోందని, అందానికే ఇంకా ప్రాధాన్యం ఇస్తున్నదంటూ విమర్శులు వెల్లువెత్తాయి. 'మేం మేకప్ లేకున్నా చాలా అందంగా ఉంటాం. హెయిర్ కలర్, ఫ్యాషన్ ఫాలోయింగ్ లేకున్నా సరే' అందంగానే కనిపిస్తామంటోంది.

నన్ గా మారిన తర్వాత ఎవరైనా తనను మేకప్ లో చూసినట్లుగా భావిస్తే ఉంటే దయచేసి నన్ను క్షమించండి అంటూ బహిరంగంగా ప్రకటించింది. అప్పటి జీవితం వేరు.. ఇప్పటి లైఫ్ వేరని, గతంలో తాను చేయించుకున్న సర్జరీల వల్లే ఇంకా అందంగా కనిపిస్తున్నానంటూ చెప్పుకొచ్చింది. ఇక తనకు పెళ్లి చేసుకోవాలని, శృంగారంలో పాల్గొనాలనే ఆలోచనలు రావని అంటోంది. ఇకనుంచీ తాను తన పిల్లల కోసం బతుకుతానని, ప్రపంచం అంతటికీ తల్లినవుతానని చెప్పింది.

ప్రేమించడం తప్పుకాదని, ప్రతి ఒక్కరూ ప్రేమ పొందగలగాలని ఆమె అభిప్రాయపడింది. గతంలో క్రికెటర్, మాజీ బాయ్ ఫ్రెండ్ రోహిత్ శర్మ 264 పరుగులు చేసినప్పుడు అతడికి బహుమతిగా తన నగ్న సెల్ఫీని ట్విట్టర్‌లో పోస్ట్ చేసి సంచలనం సృష్టించిన ఆమె ఇప్పుడు పూర్తిగా మారిపోయానని గతంలో చేసిన తప్పులు మళ్లీ చేసేందుకు సిద్ధంగా లేనని సోఫియా వివరించింది.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement