రోహిత్‌ శర్మతో ప్రేమాయణం.. చివరకు సన్యాసినిగా మారిన హీరోయిన్‌! | Bollywood Actress Sofia Hayat Turns As A Nun | Sakshi
Sakshi News home page

పెళ్లయిన ఏడాదికే విడాకులు.. సన్యాసినిగా మారిన హీరోయిన్‌!

Published Sat, Jul 13 2024 5:37 PM | Last Updated on Sat, Jul 13 2024 5:47 PM

Bollywood Actress Sofia Hayat Turns As A Nun

సినిమా అనేది రంగుల ప్రపంచం. ఇక్కడ ఎవరి జీవితం ఎప్పుడు, ఎలా మారుతుందో చెప్పలేం. ఒక్క సినిమాతోనే స్టార్‌డమ్‌ పొందిన వాళ్లు కొంతమంది అయితే.. ఆ ఒక్క సినిమా చాన్స్‌ కూడా రాక ఇండస్ట్రీకే దూరమైనవాళ్లు మరికొంతమంది. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఇది బాగా జరుగుతుంది. ఒకటి,రెండు సినిమాలు హిట్‌ అయితే చాలు.. దర్శకనిర్మాతలు ఆమె దగ్గర క్యూ కడతారు. కొన్నాళ్ల పాటు బాగానే ఉంటుంది. ఫ్లాప్‌ వస్తే మాత్రం చాలు.. పలకరించడానికి కూడా రారు. అందుకే చాలా మంది హీరోయిన్లు ఒకటి, రెండు సినిమాల్లో నటించి..ఆ తర్వాత వెండితెరకు కనుమరుగైపోతున్నారు. మరికొంత మంది అయితే కెరీర్‌ పీక్స్‌లో ఉండగానే పెళ్లి చేసుకొని.. ఆ తర్వాత కాస్త గ్యాప్‌ ఇచ్చి మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నారు. 

కానీ ఓ హీరోయిన్‌ మాత్రం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇండస్ట్రీలో మంచి క్రేజ్‌ ఉన్నప్పటికీ... గ్లామర్‌ ప్రపంచాన్ని వదిలేసి సన్యాసినిగా మారింది. ఆమే బాలీవుడ్‌ బ్యూటీ సోఫియా హయత్‌. 20వ దశకంలో స్పెషల్‌ సాంగ్స్‌తో బాలీవుడ్‌లో ఓ ఊపు ఊపింది ఈ నటి. 2008లో క్యాష్‌అండ్‌ కర్రీ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సిక్స్‌ ఎక్స్‌, అక్సర్‌ 2 వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

హిందీ బిగ్‌బాస్‌ షో(2013) పాల్గొని మరింత ఫేమస్‌ అయింది. 2012లో ఇండియన్‌ క్రికెటర్‌ రోహిత్‌ శర్మతో ప్రేమలో పడి..కొన్నాళ్ల పాటు డేటింగ్‌ కూడా చేసినట్లు రూమర్స్‌ వచ్చాయి. అయితే 2015లో వీరిద్దరు విడిపోయారు.  ఆ తర్వాత రోమేనియన్‌ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొని..ఏడాదిలోపే విడాకులు తీసుకుంది. కొన్నాళ్లుగా పాటు ఒంటరిగా ఉన్న సోఫియా.. 2016లో ఇండస్ట్రీని వదిలి ఆధ్యాత్మిక బాట పట్టింది.  భౌతిక ఆనందాల కంటే ఆధ్యాత్మికత మార్గమే ఉత్తమని, అందుకే ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నట్లు తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement