Nun
-
రోహిత్ శర్మతో ప్రేమాయణం.. చివరకు సన్యాసినిగా మారిన హీరోయిన్!
సినిమా అనేది రంగుల ప్రపంచం. ఇక్కడ ఎవరి జీవితం ఎప్పుడు, ఎలా మారుతుందో చెప్పలేం. ఒక్క సినిమాతోనే స్టార్డమ్ పొందిన వాళ్లు కొంతమంది అయితే.. ఆ ఒక్క సినిమా చాన్స్ కూడా రాక ఇండస్ట్రీకే దూరమైనవాళ్లు మరికొంతమంది. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఇది బాగా జరుగుతుంది. ఒకటి,రెండు సినిమాలు హిట్ అయితే చాలు.. దర్శకనిర్మాతలు ఆమె దగ్గర క్యూ కడతారు. కొన్నాళ్ల పాటు బాగానే ఉంటుంది. ఫ్లాప్ వస్తే మాత్రం చాలు.. పలకరించడానికి కూడా రారు. అందుకే చాలా మంది హీరోయిన్లు ఒకటి, రెండు సినిమాల్లో నటించి..ఆ తర్వాత వెండితెరకు కనుమరుగైపోతున్నారు. మరికొంత మంది అయితే కెరీర్ పీక్స్‌లో ఉండగానే పెళ్లి చేసుకొని.. ఆ తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చి మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నారు. కానీ ఓ హీరోయిన్ మాత్రం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్నప్పటికీ... గ్లామర్ ప్రపంచాన్ని వదిలేసి సన్యాసినిగా మారింది. ఆమే బాలీవుడ్ బ్యూటీ సోఫియా హయత్. 20వ దశకంలో స్పెషల్ సాంగ్స్‌తో బాలీవుడ్లో ఓ ఊపు ఊపింది ఈ నటి. 2008లో క్యాష్అండ్ కర్రీ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సిక్స్ ఎక్స్, అక్సర్ 2 వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. హిందీ బిగ్‌బాస్ షో(2013) పాల్గొని మరింత ఫేమస్ అయింది. 2012లో ఇండియన్ క్రికెటర్ రోహిత్ శర్మతో ప్రేమలో పడి..కొన్నాళ్ల పాటు డేటింగ్ కూడా చేసినట్లు రూమర్స్ వచ్చాయి. అయితే 2015లో వీరిద్దరు విడిపోయారు. ఆ తర్వాత రోమేనియన్ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొని..ఏడాదిలోపే విడాకులు తీసుకుంది. కొన్నాళ్లుగా పాటు ఒంటరిగా ఉన్న సోఫియా.. 2016లో ఇండస్ట్రీని వదిలి ఆధ్యాత్మిక బాట పట్టింది. భౌతిక ఆనందాల కంటే ఆధ్యాత్మికత మార్గమే ఉత్తమని, అందుకే ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నట్లు తెలిపింది. -
దేవత లాంటి యువతి దెయ్యంగా ఎలా మారింది?.. రిలీజ్ ఎప్పుడంటే?
హాలీవుడ్ హర్రర్ చిత్రాలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రేక్షకులను భయపెట్టాలన్నా.. థ్రిల్లింగ్‌కు గురిచేయాలన్నా హాలీవుడ్ చిత్రాలకే సాధ్యం. ప్రపంచవ్యాప్తంగా భారీగా వసూళ్లను కొల్లగొట్టేవి ఇలాంటి చిత్రాలే. ది కంజూరింగ్ అనే చిత్రాన్నే తీసుకుంటే ప్రపంచంలోనే అత్యధికంగా వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అదే విధంగా హాలీవుడ్లో ది నన్ చిత్రం సంచలన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: పవన్ కల్యాణ్ ఓజీపై ఆర్జీవీ ఆసక్తికర ట్వీట్..! ) తాజాగా దానికి సీక్వెల్‌గా వస్తోన్న చిత్రం నన్ -2. ఇది ది కంజూరింగ్ ఫ్రాంచైజీలో రూపొందిన 9వ చిత్రం కావడం మరో విశేషం. మైఖేల్ ఛావ్స్ దర్శకత్వం వహించిన ఈ అమెరికన్ చిత్రంలో బోలి ఆరోన్న్స్, తెలుసా ఫార్మికా, స్టీమ్ రెయిడ్, ప్రధాన పాత్రలు పోషించారు. న్యూలైన్ సినిమా ఆటోమిక్ మాన్స్టర్, ది సఫ్రాన్ కంపెనీ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం హర్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందించారు. ఒక దేవత లాంటి యువతి దెయ్యంగా ఎలా మారింది? అన్న ఇతివృత్తంతో నన్–2 తెరకెక్కించారు. ఈ చిత్రం కథ, కథనం, స్పెషల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తాయని వార్నర్ బ్రదర్స్ సంస్థ నిర్వాహకులు వెల్లడించారు. ఈ చిత్రం భారతదేశంలో తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా ఈనెల 7న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. (ఇది చదవండి: గోపీచంద్‌ని తిట్టడం తప్పే.. ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన డైరెక్టర్) On September 8th, the greatest evil in the conjuring universe returns #TheNun2. pic.twitter.com/zYdo2dzwVR — Warner Bros. Pictures (@wbpictures) July 6, 2023 -
ఆమె చనిపోయి నాలుగేళ్లైంది..ఐనా మృతదేహం కించెత్తు పాడవ్వకుండా..
ఎవ్వరైన చనిపోతే వారివారి మత ఆచారాలను బట్టి అంత్యక్రియలు జరుగుతుంటాయి. ఖననం చేస్తే కొన్ని నెలల్లోనే కుళ్లిపోయి కేవలం అస్థిపంజరాలు మాత్రమే ఉంటాయి. అది అందరికీ తెలిసిందే. ఐతే ఇక్కడోక ఆఫ్రికన్ మహిళ చనిపోయి నాలుగేళ్లైంది. కొన్ని కారణాల రీత్యా ఆమె శవపేటికను వెలికి తీయగా..ఆ మహిళ మృతదేహాన్ని చూసి ఒక్కసారిగా కంగుతిన్నారు కుటుంబసభ్యులు, బంధువులు. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే...సదరు మహిళ సిస్టర్ విల్హెల్మినా లాంకాస్టర్ ఆఫ్రికన్ అమెరికన్. ఆమె అమెరికాలో బెన్డిక్ట్ ఇన్ సిస్టర్స్ ఆఫ్ మేరి(నన్స్ ఆశ్రమం) వ్యవస్థాపకురాలు. అక్కడ ఆమె నన్‌గా ఎంతో సామాజిక సేవ చేసింది. అయితే ఆమె 2019లో చనిపోయింది. అక్కడే ఆ ఆశ్రమం సమీపంలో ఖననం చేశారు. ఐతే ఆ ఆశ్రమంలోని కొందరూ ఆమె సమాధి పాడవ్వడంతో ఆమె అవశేషాలను వేరోచేటికి తరలించి సమాధి కట్టించాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ఆమె శవపేటికను వేలికి తీశారు. అందులో ఆమె మృతదేహం చూసి ఒక్కసారిగా అవాక్యయ్యారు అక్కడున్నవారంతా. కనీసం ఎలాంటి దుర్వాసన గానీ రాకుండా తాజా మృతదేహంలా అలా చెక్కు చెదరకుండా ఉంది. వాస్తవానికి తాము ఎముకలు మాత్రమే ఉంటాయని భావించామని చెబుతున్నారు ఆమె సంబంధికులు, స్నేహితులు. కనీసం ఆమె మృతదేహం పాడవ్వకుండా ఎలాంటి లేపనాలు పూయకుండా సాధారణ మనిషి మాదిరే ఖననం చేశామని చెబుతున్నారు. పగిలిన శవపేటికలో ఓ తేలికిపాటి మెత్తని పొరలాంటి గుడ్డలో చుట్టబడి, పాడవ్వకుండా ఉన్నా ఆమె మృతదేహాన్ని చూసి ఆశ్చర్యపోయారు. దీంతో సదరు ప్రాంతంలోని ప్రజలు ఆమె మృతదేహాన్ని చూసేందుకు ఆ బెనెడిక్టైన్ ఆశ్రమానికి తండోపతండోలుగా తరలి వచ్చారు. ఆమె నెక్కు ధరించే బెల్ట్ మాదిరి క్లాత్, తలకు ధరించిన క్లాత్ మాత్రమే పాడైయినట్లు ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు. నెలల తరబడి ఆమె శరీరీం పాక్షికంగా పాడైన చెక్క శవ పేటికలో ఉండి.. సూర్యరశ్మీ, వర్షాలకు ఎక్స్పోజ్ అయినా ఏ మాత్రం కుళ్లకుండా అలా ఉండటం అత్యంత విచిత్రం అంటున్నారు బంధువులు. ప్రస్తుతం ఆమె మృతదేహాన్ని మరోక చోటికి తరలించి సమాధి చేయనున్నట్లు తెలిపారు ఆమె తల్లి సిసిలియా. ఇది దేవుడి పట్ల ఆమెకి ఉన్న భక్తి విశ్వాసం, నిస్వార్థపూరిత సేవకు భగవంతుడిచ్చిన వరం కాబోలు అని ఆ నన్తో గడిపిన క్షణాలను గుర్తు తెచ్చుకున్నారు మృతురాలి తల్లి, బంధువులు. (చదవండి: US: మితిమీరిన స్వేచ్ఛ+ పతనమైన కుటుంబ వ్యవస్థ = మానసిక ఉన్మాదులు) -
Russia-Ukraine War: ఇండియన్ నన్స్‌కు ఇక్కట్లు
ఐజ్వాల్: రష్యా దాడితో రణరంగంగా మారిన ఉక్రెయిన్‌లో భారత్‌కు చెందిన మిషనరీస్ ఆఫ్ చారిటీస్ సంస్థ మిజోరాం విభాగానికి చెందిన నన్స్ సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు. యుద్ధం తీవ్రం కావడంతో రాజధానిలో సేవలనందిస్తున్న ఈ నన్స్ నిత్యావసరాలు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. తాత్కాలిక శిబిరంలో తాము సేవలనందిస్తున్న నిరాశ్రయులతో కలిసి క్షేమంగా ఉన్నామని, అయితే కనీసావసరాల కోసం బయటకు వెళ్లలేని పరిస్థితి ఉందని వివరించారు. ఎన్ని బాధలైనా పడతామని, సేవా కార్యక్రమం విరమించి వెనక్కురామని సిస్టర్ రోసెలా నూతంగి, సిస్టర్ ఆన్ ఫ్రిదా స్పష్టం చేశారు. వీరితో పాటు వేరే దేశాలకు చెందిన మరో ముగ్గురు నన్స్ కలిసి 37 మంది నిరాశ్రయులను, ఒక కేరళ విద్యార్థిని సంరక్షిస్తున్నారు. వీరంతా క్షేమమేనని, కానీ ఆహారం కొరతతో బాధపడుతున్నారని రోసెలా బంధువు సిల్వీన్ చెప్పారు. కీవ్‌లో తాము బాగానే ఉన్నామని రోసెలా చెప్పారని సిల్వీన్ తెలిపారు. సంస్థలో రోసెలా 1981లో చేరారు. 1991లో ఒక మిషన్ కోసం సోవియట్‌కు వెళ్లారు. అక్కడ ఆమె 10 ఏళ్లు పనిచేశారు. 2013లో ఆమె ఉక్రెయిన్ చేరారని, రష్యన్ భాషలో ఆమెకు పట్టు ఉందని సిల్వీన్ తెలిపారు. గతంలో రెండుమార్లు మాత్రమే ఆమె ఇండియాకు వచ్చారన్నారు. మరో నన్ ఫ్రిడా 1995లో సంస్థలో చేరారు. అనంతరం అనేక దేశాల్లో సేవలనందించి 2019లో ఉక్రెయిన్ చేరారు. తమ సంస్థకు చెందిన ఐదుగురు నన్స్ ఉక్రెయిన్‌లో సేవలనందిస్తున్నారరని సంస్థ సుపీరియర్ జనరల్ సిస్టర్ మేరీ జోసెఫ్ చెప్పారు. వీరిని వెనక్కురమ్మని తాము కోరామని, కానీ సేవను విరమించి వచ్చేందుకు వీరు అంగీకరించలేదని తెలిపారు. స్థానికులకు సాయం అందిస్తూ వీరు కీవ్‌లో తలదాచుకుంటున్నారన్నారు. వీరి భద్రతపై రష్యా, ఉక్రెయిన్, భారత ప్రభుత్వాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. -
కదిలించే ఫోటో: ‘వారికి బదులు నన్ను చంపండి’
యాంగాన్: మయన్మార్‌లో అధికారం సైన్యం చేతిల్లోకి వెళ్లింది. అధ్యక్షురాలు అంగ్ సాన్ సూకిని సైన్యం నిర్భంధించి.. అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మిలటరీకి వ్యతిరేకంగా దేశంలో ఆందోళనలు అంతకంతకూ ఎక్కువైపోతున్నాయి. ప్రజల నిరసనని అణచివేయడానికి భద్రతా దళాలు ప్రయత్నిస్తూ ఉండడంతో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా సైన్యం అరాచకాలను కళ్లకు కట్టే ఫోటో ఒకటి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైరలవుతోంది. కచిన్ రాష్ట్రంలో మైత్‌క్వీనా నగరంలో సోమవారం నాడు తీసిన ఫోటో ఇది. ఆ వివరాలు... కచిన్ రాష్ట్రంలో సోమవారం కొందరు బయటకు వచ్చి దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని నినాదాలు చేస్తున్నారు. ఇంతలో అక్కడికి పోలీసులు చేరుకున్నారు. ఆందోళనకారులను అరెస్ట్ చేయడం.. మాట వినకపోతే తూటాకు పనిచెప్పడమే వారి లక్ష్యం. పోలీసులను చూసి అక్కడి యువకులు పరుగులు పెడుతున్నారు. అప్పటికే అధికారులు తుపాకులకు పని చెప్పడంతో ఓ యువకుడు మరణించాడు. మరి కొందరి ప్రాణాలు తీసేందుకు సిద్ధంగా ఉన్నారు అధికారులు. ఈ విపత్కర పరిస్థితిని గ్రహించిన ఓ మహిళ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అధికారులకు అడ్డు నిలబడింది. తెల్లటి దుస్తులు ధరించి శాంతికి మారుపేరుగా ఉన్న ఆ నన్ పోలీసులకు ఎదురెళ్లింది. నిగ్రహం పాటించండి అంటూ వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. కానీ పోలీసులు ఆమె మాట వినలేదు. దాంతో ఆమె వెంటనే మోకాళ్లపై కూర్చొని ‘ఆందోళనకారులను ఏమీ చేయొద్దు.. కావాలంటే నా ప్రాణం తీసుకోండి’ అంటూ వేడుకుంది. ఆమెలోని తెగువ, మానవత్వానికి చలించిన అధికారులు ఆమెకు ప్రతి నమస్కారం చేశారు. మయన్మార్‌లో ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతున్న ఈ ఫోటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. మైత్‌క్వీనాలో సోమవారం నిరసన తెలుపుతున్న ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అదే సమయంలో పోలీసులకు నచ్చజెప్పేందుకు సిస్టర్ అన్న్ రోజ్ ను తవాంగ్ ప్రయత్నించారు. వారిని అరెస్ట్ చేసేందుకు వెళ్తున్న పోలీసులను అడ్డుగా నిలిచారు. వారినేమీ చేయొద్దంటూ మోకాలిపై నిలబడి వేడుకున్నారు. ఆ సమయంలో తీసిన ఫొటోనే ఇది. ఇద్దరు పోలీసులు సైతం ఆమెకు చేతులు జోడించి నమస్కరించడం కనిపించింది. ఫిబ్రవరి 28న సైతం నిరసనకారులపై ప్రతాపం చూపేందుకు వచ్చిన పోలీసులను ఇలానే అడ్డుకున్నారు సిస్టర్ తవాంగ్. ఈ ఘటనపై సిస్టర్ తవాంగ్ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం మయన్మార్ దుఃఖంలో ఉంది. నా కళ్ల ముందు ప్రజలకు ఏమైనా జరిగితే తట్టుకోలేను. చూస్తూ ఊరుకోలేను. ప్రజల కోసమే నా జీవితాన్ని అంకితం చేశాను. వారి కోసం చావడానికి నేను భయపడను’’ అన్నారు. చదవండి: ప్రజలు ఎన్నుకున్నా పవర్లో లేరెందుకు! బయటికొస్తే అరెస్ట్ చేస్తాం... -
నన్ మిస్సింగ్.. కొన్ని గంటల తర్వాత..
కొచ్చి : అనుమానాస్పద స్థితిలో ఓ నన్ మృతి చెందిన ఘటన కేరళలోని కొచ్చిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. 44 ఏళ్ల జసీనా థామస్ అనే నన్ కొచ్చి, వలక్కలకు చెందిన సేయింట్ థామస్ కాన్వెంట్లో ఉంటోంది. ఆమెతో పాటు మరో 12 మంది కూడా ఉంటున్నారు. వీరంతా కొచ్చిలోని వివిధ ప్రదేశాలలో సేవలు చేస్తుంటారు. అయితే ఆదివారం మధ్యాహ్నం సమయం నుంచి జసీనా కనిపించకుండా పోయింది. దీంతో మిగిలిన వారంతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ( మొబైల్ చోరీ.. 3 కి.మీ వెంటాడి సాధించాడు ) ఈ నేపథ్యంలో కొన్ని గంటల తర్వాత కాన్వెంట్కు దగ్గరలో ఉన్న ఓ నీటి కుంటలో ఆమె శవం కనిపించింది. మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 2018లో కాన్వెంట్లో చేరిన సదరు నన్ మానసిక పరిస్థితి బాగోలేదని పోలీసుల విచారణలో తేలింది. అయితే ఆమె మానసిక పరిస్థితికి, మృతికి సంబంధం ఉందా లేదా అన్నది తేలాల్సి ఉంది. -
ఈ ‘నన్’.. బస్సు నడుపున్
కొచ్చి: నన్‌లు సైతం ఏ పనైనా చేయగలరని నిరూపిస్తున్నారు కేరళకు చెందిన సిస్టర్ ఫించిత(53). ఇరవయ్యేళ్ల క్రితమే (2000లో) ఫించిత భారీ వాహనాలు నడిపే హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ (హెచ్‌డిఎల్) పొందారు. ఫ్రాన్సిసన్ క్లారిస్టు క్రైస్తవ సమాజంలో ఆ ఘనత సాధించిన మొట్టమొదటి నన్‌గా నిలిచారు. కలాడీ పట్టణం, మణికమంగళంలోని సెయింట్ క్లేర్ ఓరల్ స్కూల్ అనే బధిరుల (వినికిడి లోపమున్నవారి) పాఠశాలలో 1994 నుంచి ప్రధానోపాధ్యాయురాలిగా కొనసాగుతున్నారు. స్కూల్‌బస్ డ్రైవర్ డుమ్మా కొట్టినప్పుడల్లా తానే డ్రైవింగ్ సీట్లో కూర్చుంటానని ఆవిడ ఉత్సాహంగా తెలిపారు. విద్యార్థుల్ని విహారయాత్రలకు తీసుకువెళ్లినప్పుడు డ్రైవర్, తానూ షిఫ్టులు వేసుకుని బస్సుని నడిపేవారమని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం కరోనా వల్ల స్కూలు మూసి ఉన్నా బస్సును కండిషన్లో ఉంచేందుకు స్కూల్ గ్రౌండులో రోజూ కాసేపు నడుపుతున్నారు. 1999లో ఒకసారి పిల్లల్ని విహారయాత్రకు తీసుకెళ్లాలనుకున్నప్పుడు డ్రైవర్ అందుబాటులో లేకపోవడంతో బస్సుని నడుపుతావా అని తనని మదర్ సుపీరియర్ అడిగారన్నారు. అందుకు తాను ప్రయత్నించి చూస్తాను, కానీ హెచ్‌డిఎల్ లేదని చెప్పగా దానికోసం ప్రయత్నించమని ఆవిడ సూంచించారన్నారు. ఏడాదికల్లా అన్ని టెస్టులు పాసై మొదటి ప్రయత్నంలోనే లైసెన్సు సాధించానని గుర్తు చేసుకున్నారు. అప్పటినుంచి డ్రైవింగ్ తన జీవితంలో భాగమైందన్నారు. హెచ్‌డీఎల్ రాకముందు కారుతో చిన్న ఆక్సిడెంట్ చేశానని తెలిపిన ఫించిత అదృష్టవశాత్తూ ఎవరికీ ఏ హాని కలగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నాని, తాను చేసిన చివరి ఆక్సిడెంట్ అదేనని వివరించారు. ఇటీవల తన లైసెన్సు గడువు తీరిపోయందన్నారు. దాన్ని పునరుద్ధరించుకోవడానికి మళ్లీ కొన్ని పరీక్షలు పాసవాలని, అందుకే ప్రాక్టీసు కోసం స్కూలు పరిసరాల్లో బస్సుతో రోజూ కొంతసేపు చక్కర్లు కొడుతున్నానని పేర్కొన్నారు. చదవండి: రాత్రి చితక్కొట్టి: పొద్దున అల్లుడ్ని చేసుకున్నారు -
అత్యాచార కేసు: బిషప్కు కరోనా
తిరువంతపురం: కేరళ నన్ అత్యాచార కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న బిషప్ ఫ్రాంకో ములక్కల్‌కు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. సోమవారం నాటి రిపోర్టుల్లో అతనికి వైరస్ సోకినట్లు జలంధర్ నోడల్ ఆఫీసర్ టీపీ సింగ్ దృవీకరించారు. ఆయన లాయర్‌కు కరోనా సోకడంతో బిషప్ సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇంతలో ఫ్రాంకోకు కూడా వైరస్ సోకినట్లు వెల్లడైంది. కాగా కొట్టాయమ్‌లోని స్థానిక కోర్టు ఆయన సరిగా కేసు విచారణకు హాజరు కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో గతంలో జారీ చేసిన బెయిల్‌ను రద్దు చేయడంతోపాటు నాన్ బెయిలబుల్ వారంట్‌ను జారీ చేసింది. ఆ తర్వాత కొన్ని గంటలకే బిషప్కు వైరస్ సోకినట్లు తెలిసింది. (ముద్దిస్తా కానీ కొరకకూడదు: పోప్) మరోవైపు జూలై 1న జరిపిన కోర్టు విచారణకు సైతం ఆయన హాజరవలేదు. పంజాబ్‌లోని జలంధర్ ప్రాంతం కంటైన్మెంట్ జోన్లో ఉన్నందువల్లే కోర్టుకు రాలేకపోయానని తెలిపారు. కానీ ఆ ప్రాంతం కంటైన్మెంట్ జోన్లోనే లేదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగా విచారణను ఆలస్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలతో ఏకీభవించిన న్యాయస్థానం బిషప్ బెయిల్‌ను రద్దు చేయడమే కాక నాన్ బెయిలబుల్ వారంట్‌ను జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 13కు వాయిదా వేసింది. (‘ఏ కూతురు ఇలాంటి ఆరోపణలు చేయదు’) -
నన్ను కొరకనంటేనే ముద్దిస్తాను: పోప్
వాటికన్ సిటీ: పోప్ ఫ్రాన్సిస్.. నూతన సంవత్సర వేడుకల్లో ఓ మహిళ తన చేయి పట్టుకుని వెనక్కు లాగినందుకు ఆమె చేతిని రెండుసార్లు కొట్టి వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత దానికి క్షమాపణలు కూడా చెప్పారునుకోండి. అది వేరే విషయం. తాజాగా పోప్ ఫ్రాన్సిస్ మరోసారి వార్తల్లో నిలిచారు. వేలాదిమంది జనం గుమిగూడి ఉన్న హాల్ మధ్యలో పోప్ ఫ్రాన్సిస్ నడుచుకుంటూ వెళ్తున్నారు. అరుపులు, రొదలతో హాలంతా సందడిగా ఉంది. అంతమంది అరుపుల మధ్యలో ఓ నన్ గొంతు గట్టిగా ప్రతిధ్వనించింది. ‘ఒక్క ముద్దు ఇవ్వండి పోప్..’ అంటూ గట్టిగా కేకేసింది. అది విన్న పోప్ ఓ క్షణమాగి తనను కొరకనంటేనే ఇస్తానన్నారు. పోప్ జవాబుతో అక్కడి జనమంతా ఘొల్లున నవ్వారు. ‘ముందు నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండు. నేను నీకు ముద్దిస్తాను కానీ ఎట్టి పరిస్థితుల్లో నన్ను కొరకకూడదు’ అని చమత్కారంగా బదులిచ్చారు. దానికి నన్ సరేనంటూ మాటిచ్చింది. వెంటనే పోప్ ఆమె కుడి చెంపపై సుతారంగా ముద్దు పెట్టారు. దీంతో పట్టలేని సంతోషంతో ఆ మహిళ ‘థాంక్ యూ పోప్’ అంటూ గంతులు వేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా పోప్ ఫ్రాన్సిస్ జనాలు అతని చేతిని తాకడానికి అనుమతిస్తారు. కానీ ప్రజలు తన చేతిని ముద్దాడటాన్ని మాత్రం అస్సలు సహించరు. దీనివల్ల సూక్ష్మక్రిములు త్వరగా వ్యాప్తి చెందుతాయని ఆయన బలంగా నమ్ముతారు. చదవండి: మహిళకు క్షమాపణ చెప్పిన పోప్ ప్రాన్సిస్ ఈ ఏడాది పోప్ ఫ్రాన్సిస్ సందేశం -
సిస్టర్ థ్రెషియాకు సెయింట్‌హుడ్
వాటికన్ సిటీ: భారత్‌కు చెందిన సిస్టర్ మరియం థ్రెషియాకు ఆదివారం వాటికన్ సిటీలో ఘనంగా జరిగిన ఒక కార్యక్రమంలో ‘సెయింట్‌హుడ్’ను పోప్ ఫ్రాన్సిస్ ప్రకటించారు. మరియంతో పాటు ఇంగ్లండ్‌కు చెందిన కార్డినల్ జాన్‌హెన్రీ న్యూమన్, స్విట్జర్లాండ్‌కు చెందిన నన్ మార్గెరెట్ బేయస్, బ్రెజిల్‌కు చెందిన సిస్టర్ డల్స్ లోపెస్, ఇటలీ నన్ గ్యూసెప్పిన వానినిలను కూడా దైవ దూతలుగా పోప్ ప్రకటించారు. ‘ఈ రోజు ఈ ఐదుగురు దైవదూతల కోసం ఆ ప్రభువుకు కృతజ్ఞతలు తెల్పుకుందాం’ అని పోప్ ఫ్రాన్సిస్ అక్కడికి భారీగా హాజరైన జనసందోహాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సెయింట్ పీటర్స్ స్క్వేర్ వద్ద ఈ ఐదుగురి భారీ చిత్రపటాలకు వేలాడదీశారు. ఈ కార్యక్రమానికి ప్రిన్స్ చార్లెస్ హాజరయ్యారు. భారత ప్రతినిధి బృందానికి విదేశాంగ శాఖ సహాయమంత్రి వీ మురళీధరన్ నేతృత్వం వహించారు. తాజాగా సెయింట్‌హుడ్ పొందిన ఐదుగురిలో ముగ్గురు మహిళలున్నారన్న పోప్ ఫ్రాన్సిస్.. ‘వారు ఈ లౌకిక ప్రపంచానికి పవిత్రమైన ప్రేమపూరిత జీవన మార్గాన్ని చూపారు’ అని ప్రశంసించారు. ‘సెయింట్ మార్గరెట్ బేయస్ కుట్టుపని చేసే స్త్రీ అయినా చిన్న ప్రార్థన, సహనపూరిత జీవితంలోని శక్తిని మనకు చూపారు’ అని పోప్ పేర్కొన్నారు. న్యూమన్ రాసిన ఒక ప్రార్థన గీతాన్ని కూడా ఆయన ఉటంకించారు. 1801లో జన్మించిన న్యూమన్ గొప్ప కవి. బోధకుడు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న మేధావి. బ్రెజిల్లో అతిపెద్ద సేవా సంస్థను సిస్టర్ డల్స్ లోపెస్ ప్రారంభించారు. రెండు సార్లు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. బ్రెజిల్‌కు చెందిన తొలి మహిళా సెయింట్ లోపెస్‌నే కావడం విశేషం. ఆ చర్చ్ నుంచి నాలుగో సెయింట్ సెయింట్ మరియం థ్రెషియాతో కలిపి కేరళలోని శతాబ్దాల చరిత్ర కలిగిన సైరో మలబార్ కేథలిక్ చర్చ్ లేదా చర్చ్ ఆఫ్ మలబార్ సిరియన్ కేథలిక్స్ నుంచి ఇప్పుడు నలుగురు సెయింట్స్ ఉన్నారు. ఈ చర్చ్ నుంచి 2008లో సిస్టర్ అల్ఫోన్సా సెయింట్‌హుడ్ పొందారు. ఆ తరువాత 2014లో ఫాదర్ కురియాకోస్ ఎలియాస్ చావర, సిస్టర్ యూఫ్రేసియా(యూఫ్రేసియమ్మగా చిరపరిచితం)లకు కూడా ఈ హోదా లభించింది. జీసస్ తరఫున మరియం థ్రెషియా పేదలకు ఎంతో సాయమందించారని, రోగులకు స్వాంత్వన చేకూర్చారని చర్చ్ పేర్కొంది. జీసస్ క్రైస్ట్‌కు శిలువ వేసినప్పుడు ఆయన శరీరంపై పడిన గుర్తు వంటిది మరియం థ్రెషియా శరీరంపై కూడా ఉండేదని, అయితే, ఆమె ఆ విషయాన్ని గోప్యంగా ఉంచారని వెల్లడించింది. ఆమె చుట్టూ ఒక కాంతిపుంజం ఉండేదని, వ్యాధులను నయం చేయగలగడం వంటి ప్రత్యేక శక్తులు ఆమెకు ఉన్నాయని పేర్కొంది. కేరళలోని త్రిచూర్ దగ్గరలోని పుతెంచిరలో తోమ, తాండ దంపతులకు 1876, ఏప్రిల్ 26న సిస్టర్ థ్రెషియా జన్మించారు. 1902లో జోసెఫ్ విద్యాతిల్‌ను తన గురువుగా స్వీకరించారు. 1904లో తన పేరుకు మరియంను చేర్చుకున్నారు. 1914 మే నెలలో ‘కాంగ్రెగెషన్ ఆఫ్ ద సిస్టర్స్ ఆఫ్ ద హోలీ ఫ్యామిలీ’ని ప్రారంభించారు. 1926 జూన్ 8న, తన 50 ఏళ్ల వయసులో మరణించారు. సిస్టర్ థ్రెషియా చేసిన ఒక అద్భుతాన్ని నిర్ధారించిన పోప్ ఫ్రాన్సిస్ ఈ ఫిబ్రవరి 12న ఆమెను సెయింట్‌హుడ్‌కు అర్హురాలిగా ప్రకటించారు. అక్టోబర్ 13న కెనొనైజేషన్ ఉంటుందన్నారు. 2000లో బీటిఫికేషన్ పొందిన సిస్టర్ థ్రెషియాకు 2019లో సెయింట్‌హుడ్ అందింది. బీటిఫికేషన్ తరువాత అత్యంత తొందరగా, 19 ఏళ్లలోనే, సెయింట్‌హుడ్ పొందిన వ్యక్తి సిస్టర్ థ్రెషియానే కావడం విశేషం. సిస్టర్ థ్రెషియా సెయింట్ హోదా పొందనుండడం భారతీయులందరికీ గర్వకారణమని ఇటీవల ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’ ప్రసంగంలో ప్రస్తావించారు. పోప్‌తో మురళీధరన్ భేటీ: విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీ మురళీధరన్ ఆదివారం పోప్ ఫ్రాన్సిస్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ‘భగవద్గీత అకార్డింగ్ టు గాంధీ’ అనే పుస్తకాన్ని, కేరళ దేవాలయల్లో జరిగే ఉత్సవాల్లో పాల్గొనే ఏనుగు ప్రతిమను పోప్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి తన శుభాకాంక్షలు తెలపాలని పోప్ కోరారు. నా వైకల్యం దూరమైంది సిస్టర్ థ్రెషియాకు సెయింట్ హుడ్ ప్రకటించడంపై త్రిచూర్ దగ్గర్లోని ఆమడంకి చెందిన మేథ్యూ పెలిస్రీ(69) చాలా సంతోషంగా ఉన్నారు. సిస్టర్ థ్రెషియా కారణంగానే తన వైకల్యం దూరమైందని ఆయన చెప్పారు. ‘వాటికన్ సిటీలో జరిగే సెయింట్‌హుడ్ ప్రదాన కార్యక్రమానికి వెళ్లాలనుకున్నాను కానీ వృద్ధాప్య సమస్యల వల్ల వీలు కాలేదు. 2000 సంవత్సరంలో జరిగిన బీటిఫికేషన్ కార్యక్రమానికి వెళ్లాను’ అని వివరించారు. పుట్టినప్పటినుంచే మేథ్యూ రెండు కాళ్లలోనూ వైకల్యం ఉండేది. పట్టుదలతో 33 రోజుల పాటు నిరాహారంగా ఉంటూ, నిరంతరం సిస్టర్ థ్రెషియాకు ప్రార్థన చేశారు. ఒక రాత్రి సిస్టర్ థ్రెషియా ఆయనకు స్వప్నంలో కనిపించారు. ఆ మర్నాడు లేచి చూస్తే ఆయన వైకల్యం మాయమైంది. తన కుమారుడికి సిస్టర్ థ్రెషియా సాంత్వన చేకూర్చినట్లు ఆయన తల్లికి సైతం కల వచ్చింది. సిస్టర్ మరి యం థ్రెషియాకు సెయింట్ హుడ్ను ప్రకటించడంపై కేరళలోని కేథలిక్కులు ఆనందోత్సాహాలతో పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. సెయింట్ పీటర్స్ స్క్వేర్ వద్ద పోప్ ఫ్రాన్సిస్ -
నన్ వేషంలో డ్రగ్స్ సరఫరా.. పట్టేసిన పోలీస్ డాగ్
అరిజోనా : చేతిలో బైబిల్ పట్టుకుని, నన్ వేషధారణలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ మహిళను పోలీస్ డాగ్ పట్టేసింది. అరిజోనాలోని యుమాకు చెందిన ఈస్తెర్ గొమేజ్ డీ అగులార్(53) తన భర్తతో కలిసి ఎవరికీ అనుమానం రాకుండా నన్ వేషంలో డ్రగ్స్ సరఫరా చేయాలనుకుంది. 90 వేల డాలర్ల(దాదాపు రూ.63 లక్షలు) విలువైన సింథటిక్ ఓమియాడ్ డ్రగ్ ఫెంటానిల్‌ను అక్రమంగా సరఫరా చేయడానికి అగులార్ నన్ వేషాన్ని ఎంచుకుంది. అయితే పినాల్ కౌంటీలో ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించినందుకు ఓ పోలీసు అధికారి వారి కారును అడ్డుకుని కిందకు దింపి మాట్లాడారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న పోలీస్ డాగ్ డ్రగ్స్ వాసన పసిగట్టి అగులార్పైకి అరవసాగింది. దీంతో అమెను చెక్ చేయగా హ్యాండ్‌బ్యాగ్‌లో, వస్త్రాల్లో డ్రగ్స్‌ను గుర్తించి అరెస్ట్ చేశారు. వీరిద్దరూ 8.5 పౌండ్ల డ్రగ్స్‌ను తీసుకెళుతున్నట్టు పోలీసులు గుర్తించారు. -
నన్‌పై రేప్ కేసులో మలుపు
హోషియార్పూర్/కొట్టాయం: నన్‌పై రేప్ కేసులో కీలక సాక్షిగా ఉన్న ఫాదర్ కురియకోస్ కట్టుత్తరా(62) అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఈ ఘటన నేపథ్యంలో తమకు రక్షణ కల్పించాలంటూ బాధితురాలి మద్దతు దారులు ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం జలంధర్ బిషప్‌గా ఉన్న కేరళకు చెందిన ఫ్రాంకో ములక్కల్ తనపై పలుమార్లు అత్యాచారం చేసినట్లు నన్ ఒకరు చేసిన ఆరోపణలు తీవ్ర సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో కీలక సాక్షిగా ఉన్న ఫాదర్ కురియకోస్ కట్టుత్తరా(62) హోషియార్పూర్ సమీపంలోని దసుయ చర్చి ఆవరణలోని తన గదిలో సోమవారం అపస్మారక స్థితిలో పడి ఉండగా అక్కడి సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆయన అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారని పోలీసులు తెలిపారు. ‘గదిలో వాంతులు చేసుకున్న ఆనవాళ్లున్నాయి. వాటిని ల్యాబ్‌కు పంపాం. ఫాదర్ కట్టుత్తరా శరీరంపై ఎటువంటి గాయాలు లేవు’అని డీఎస్పీ ఏఆర్ శర్మ తెలి పారు. ఫాదర్ కట్టుత్తరా పదిహేను రోజుల క్రితమే భోగ్‌పూ ర్ చర్చి నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చినట్లు చర్చి సిబ్బంది తెలిపారు. బిషప్కు వ్యతిరేకంగా సాక్ష్యమిచ్చిన ఫాదర్ కట్టుత్తరా తన ప్రాణాలకు ముప్పు ఉందని చెబుతుండేవారని ఆయన బంధువులు తెలిపారని డీఎస్పీ వెల్లడించారు. కొట్టాయంలోని కురవిలంగడ్ కాన్వెం ట్లో బాధిత నన్‌తోపాటు ఉంటున్న మరో ఐదుగురు నన్‌లు తమ ప్రాణాలకు రక్షణ లేదని ఆందోళన వ్యక్తం చేశారు. బిషప్ ములక్కల్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన ఫాదర్ కట్టుత్తరా మృతి వెనుక మిస్టరీ ఉందన్నారు. ముల క్కల్‌ను అరెస్టు చేయాలంటూ ఆందోళన చేసిన వారికీ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. -
‘ఆమె సన్యాసిని కాదు.. వేశ్య’
తిరువనంతపురం : జలంధర్ కు చెందిన బిషప్ ఫ్రాంకో ములక్కల్ 2014- 2016 మధ్య కాలంలో క్రైస్తవ మహిళా సన్యాసిని (46) మీద 13 సార్లు అత్యాచారం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా, తాజాగా కేరళ స్వతంత్ర ఎమ్మెల్యే పీసీ జార్జ్ ముక్కల్‌కు మద్దతు పలుకుతూ.. సన్యాసినిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కొట్టాయంలో ఎమ్మెల్యే జార్జ్ శనివారం మీడియాతో మాట్లాడుతూ... ఆ సన్యాసిని వేశ్యగా అభివర్ణించాడు. ఆమె ఒక వ్యక్తితో రెండేండ్లుగా లైంగిక సంబంధాలు నడిపిందని, పవిత్రమైన సన్యాసినిగా ఉన్న ఆమెను వేశ్యనికాక, ఇంకేమని పిలవాలని ప్రశ్నించారు. బిషప్ తనపై 13 సార్లు అత్యాచారం చేశాడని ఆరోపిన్నారు. మరి 12 సార్లు శృంగారంలో పాల్గొని ఆనందించిన ఆమెకు 13 వ సారి మాత్రమే ఎందుకు అత్యాచారంగా అనిపించింది.. మొదటి సారి ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. సన్యాసిని అంటే ఆమె కన్యగా ఉండాలి. ఆమెను సన్యాసినిగా పరిగణించలేమంటూ అసభ్యకరమైన పదజాలంతో దూషించారు. సమాజంలో ప్రముఖుల పరువు తీయడానికే కొందరు మహిళలు చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారని, వారిలో ఆమె కూడా ఒకరని జార్జ్ ఆరోపించారు.కాగా జార్జ్ వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ రేఖా శర్మ తీవ్రంగా ఖండించారు. ఓ ప్రజా ప్రతినిధి అలా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. మరోవైపు బిషప్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలని కోరుతూ క్రైస్తవ సన్యాసినిలు కోచిలో ఆందోళనలు నిర్వహించారు. సిస్టర్ అల్ఫై ఎంజే, సిస్టర్ అన్నే జైసీ, సిస్టర్ నీనా రోజ్ ఎంజే, సిస్టర్ జోసెఫ్ ఎంజే, సిస్టర్ నీనా జోస్‌లు నిరసన చేపట్టిన ఫ్రాంకో ములక్కల్‌ను అరెస్ట్ చేయాలని కోరారు. ఆధారాలతో సహా బాధితురాలు ఫిర్యాదు చేసి 74 రోజులైనా ఇంత వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆరోపించారు. -
ఇంకెన్నాళ్లు ఎదురుచూడాలి?
కొచ్చి : అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న జలంధర్ బిషప్ ఫ్రాంకో ములక్కల్‌పై చర్యలు తీసుకోవడం లేదంటూ సన్యాసినులు కొచ్చిలో నిరసనకు దిగారు. ఉత్తర భారతదేశానికి చెందిన డియోసెస్ కేథలిక్ మత గురువు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ కేరళకు చెందిన సన్యాసిని రెండు నెలల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2014 నుంచి 2016 వరకు తనను 13 సార్లు వేధించాడంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయమై మత పెద్దలకు ఫిర్యాదు చేసిన తనకు న్యాయం జరగలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాగా తాను కేసు వాపసు తీసుకుంటే భూమి, బంగళా సహా అన్నీ సదుపాయాలు సమకూరుస్తానని బిషప్ తనను ఫోన్లో సంప్రదిస్తున్నాడని ఆమె ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆడియో టేపును కూడా బహిర్గతం చేశారు. ఇదంతా జరిగి 70 రోజులు పూర్తి కావస్తున్నా సదరు సన్యాసినికి న్యాయం జరగకపోవడంతో తోటి సన్యాసినులంతా ఆమెకు మద్దతుగా నిలిచారు. ఫ్రాంకోపై చర్యలు తీసుకోవాలంటూ శనివారం రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. ప్లకార్డులు, బ్యానర్లు చేతబట్టుకుని హైకోర్టు జంక్షన్లో ధర్నాకు దిగారు. పలువురు సామాజిక కార్యకర్తలు వీరికి మద్దతుగా నిలిచారు. ఫిర్యాదులోని లొసుగులు అడ్డుపెట్టుకుని.. గత కొన్ని సంవత్సరాలుగా తమ తోటి సన్యాసిని మానసిక వేదన అనుభవిస్తున్నారని సన్యాసినులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదులోని లొసుగులు అడ్డుపెట్టుకుని బిషప్ తప్పించుకోవడానికి చూస్తున్నాడని, అందుకు పోలీసులు కూడా సహకరిస్తున్నారన్నారు. కొట్టాయంలో ఆదివారం పత్రికా సమావేశం నిర్వహించి తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని పేర్కొన్నారు. సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని తెలిపారు. -
కేసు వాపస్ తీసుకుంటే అన్నీ సమకూరుస్తా..
తిరువనంతపురం : తనపై లైంగిక దాడి ఫిర్యాదును వాపస్ తీసుకుంటే భూమి, బంగళా సహా అన్నీ సమకూరుస్తానని బిషప్ తమను ఫోన్లో సంప్రదిస్తున్నాడని కేరళకు చెందిన నన్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. నన్‌కు బిషప్ చేసిన ఫోన్‌కాల్ ఆడియోను బాధితులు బహిర్గతం చేయగా దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. 46 సంవత్సరాల బాధితురాలు జలంధర్ బిషప్ ఫ్రాంకో ముల్లకల్ తనను 2014 నుంచి 2016 మధ్య 13 సార్లు లైంగికంగా వేధించాడని ఆరోపించారు. అయితే ఆమెపై మరో ఐదుగురిపై తనను బెదిరించి, బ్లాక్మెయిల్ చేస్తున్నారని బిషప్ ఫిర్యాదు చేసిన అనంతరం బాధితురాలు పోలీసులను సంప్రదించారు. కేరళ పోలీసులు ఆయనపై లైంగిక దాడి కేసును నమోదు చేయగా బిషప్ వాదన మరోలా ఉంది. క్రమశిక్షణా చర్యలు తీసుకున్నందుకే తనపై వారు లైంగిక దాడి ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో నన్‌కు బిషప్ ప్రతినిధి ఫోన్ చేసి కేసును వాపసు తీసుకుంటే వారికి కొంత భూమి కొనుగోలు చేసి ఇల్లు నిర్మించడంతో పాటు అన్ని సౌకర్యాలు సమకూరుస్తామని, కేసు ఉపసంహరించుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారు. -
మంత్రి కాన్వాయ్‌కు ఎదురెళ్లి మరి
-
మంత్రి కాన్వాయ్‌కు ఎదురెళ్లి మరి
తిరువనంతపురం: నాయకులు, ప్రభుత్వ అధికారులు ఉన్నది ప్రజలకు సేవా చేయడం కోసమే. కానీ అప్పుడప్పుడు వారు ఈ విషయాన్ని మర్చిపోతుంటారు. ప్రజలే వారికి గుర్తు చేయాల్సి ఉంటుంది. అయినా వింటారని నమ్మకం లేదు. కేరళకు చెందిన ఓ మహిళకు ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది. అధికారుల తీరుతో విసిగి వేసారిన ఓ నన్(క్రైస్తవ సన్యాసని) ఏకంగా రోడ్డు మీదే మంత్రి కాన్వాయ్‌ను ఆపి మరి తన సమస్యను పరిష్కరించమని డిమాండ్ చేసారు. వివరాల ప్రకారం రిన్సీ అనే నన్ పాలక్కడ్‌లోని, అట్టపాడి అనే గ్రామంలో ఉన్న ఓ కాన్వెంట్లో పనిచేస్తున్నారు. కొన్ని రోజులుగా ఏనుగులు తన కాన్వెంట్లోకి చొరబడి బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ విషయం గురించి స్థానిక అటవీ అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన వారు పట్టించుకోలేదు. ఈ సమయంలో కేరళలోని పాలక్కడ్ జిల్లాలో జరిగే ఓ కార్యక్రమానికి రాష్ట్ర అటవీశాఖ మంత్రి కె.రాజు హాజరవుతున్నారని తెలిసింది. దాంతో ఈ విషయం గురించి సరాసరి మంత్రికే ఫిర్యాదు చేయాలని భావించింది. అందుకే మంత్రి వెళ్లే మార్గంలో ఎదురుచూస్తూ ఉండి, కాన్వాయ్ రాగానే వెళ్లి దానికి అడ్డుగా నిల్చుంది. తన సమస్యను తెలియజేసి, పరిష్కారం చెప్పేవరకూ మంత్రిని అక్కడనుంచి కదలనిచ్చేది లేదని భీష్మించుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో రిన్సీ తన కాన్వెంట్ క్యాంపస్‌లోకి ఏనుగులు చొరబడి బీభత్సం సృష్టిస్తున్నాయని, దీని వల్ల పిల్లలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పరిష్కారం చూపించాల్సిందిగా వేడుకుంది. కారు దిగి కాన్వెంట్లో ఏనుగులు చేసిన బీభత్సం చూడాల్సిందిగా రిన్సీ మంత్రిని కోరింది. మంత్రి కారును ఆపడం గమనించిన పోలీసులు వెంటనే అక్కడికి వచ్చి రిన్సీని పక్కకు వెళ్లాల్సిందిగా సూచించారు. రిన్సీ ఫిర్యాదు చేస్తుంటే మంత్రి కారులో నుంచి దిగలేదు సరికదా కనీసం కారు అద్దాన్ని కూడా పూర్తిగా దించలేదు. అంతేకాక చాలా నిర్లక్ష్యంగా గ్రీవెన్స్‌కు వచ్చి ఫిర్యాదు చేస్తే పరిశీలిస్తానని చెప్పారు. ఈ మొత్తం తతంగాన్నంతా అక్కడే ఉన్న స్థానికులు వీడియో తీసి ఫేస్బుక్లో పోస్టు చేశారు. పోస్టు చేసిన కొన్ని గంటల్లోనే ఈ వీడియోను దాదాపు 9లక్షల మందికి పైగా వీక్షించారు. -
సన్యాసినిపై మత గురువు పలుమార్లు అత్యాచారం!
సాక్షి, తిరువనంతపురం: కేరళలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ సన్యాసినిపై మత గురువు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన బాధితురాలు శుక్రవారం కొట్టాయం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదులో ఉత్తర భారతదేశానికి చెందిన ఓ డియోసెస్ కేథలిక్ మత గురువు ఇప్పటివరకు 13సార్లు అత్యాచారం చేశాడని పేర్కొన్నారు. తాను మొదటిసారి 2014లో కురవిలాంద్ ప్రాంతంలోని అనాథ శరణాలయం వద్ద అతిథి గృహంలో ఉన్నపుడు అత్యాచారానికి గురయ్యానని తెలిపారు. దీనిపై చర్చి అధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. ఇదిలా ఉండగా తనని బదిలీ చేశాననే కోపంతో నాఫై ఫిర్యాదు చేసిందని మత గురువు కౌంటర్ ఫిటిషన్ వేశారు. దీనిపై దర్యాప్తు జరిపేందుకు ఎస్పీ ఓ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేరళాకు చెందిన ఆయన 2013 నుంచి డియోసెస్ కేథలిక్ మత గురువుగా వ్యవహరిస్తున్నారు. -
సిస్టర్ మరియాను ‘బ్లెస్డ్’గా ప్రకటించిన వాటికన్
భోపాల్/ఇండోర్ : కేరళకు చెందిన క్రైస్తవ సన్యాసిని రాణి మరియా వట్టాలిని వాటికన్లో రోమన్ కేథలిక్ చర్చి దీవెన పొందిన(బ్లెస్డ్) వ్యక్తిగా ప్రకటించింది. ఇండోర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పోప్ ఫ్రాన్సిస్ నుంచి వచ్చిన ప్రకటనను కార్డినల్ ఏంజెలో అమాటో చదివి వినిపించారు. పునీత(సెయింట్‌హుడ్)కు ముందు హోదానే బ్లెస్డ్.. ఈ కార్యక్రమంలో మరియాను కత్తితో పొడిచి చంపిన హంతకుడు కూడా పాల్గొనడం గమనార్హం. సిస్టర్ రాణిగా పేరుపడ్డ మరియా 1995లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో హత్యకు గురయ్యారు. దేవాస్ జిల్లాలో బస్సులో ప్రయాణిస్తుండగా హంతకుడు ఆమెను 50 సార్లు పొడిచి హత్య చేశాడు. -
నవ్వుతూ... మరణించింది!
అర్జెంటీనా: ‘నవ్వుతూ బతకాలిరా.. తమ్ముడూ నవ్వుతూ చావాలిరా’ అనే పాట గుర్తుంది కదూ! ఈ పాటను నిజం చేస్తూ అర్జెంటీనా దేశంలోని శాంతా ఫే నగరానికి చెందిన సిస్టర్ సిసీలియా(42) నిజంగానే నవ్వుతూ మరణించింది. కొంతకాలం నుంచి కేన్సర్‌తో బాధపడుతున్న ఆమె ఇటీవల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇలా నవ్వుతూ తుదిశ్వాస విడిచింది. తన మరణానంతరం అంత్యక్రియలు ఎలా జరగాలనే విషయంపై ఆలోచించానంటూ తన చివరి కోరికను ఓ కాగితంపై ఆమె రాసుకున్నారు. తాను మరణించాక మొదట ప్రార్థన చేసి, ఆ తరువాత ఓ పెద్ద వేడుకలా నిర్వహించాలని థెరీసా అండ్ జోసెఫ్ మాంటిస్సోరీ చర్చి నిర్వాహకులను కోరింది. సిసీలియా అభ్యర్థన మేరకు చర్చి నిర్వాహకులు ఆమె చివరి కోరికను తీర్చారు. సిసీలియా నవ్వుతూ మరణించిన ఫొటోలను ఇంటర్నెట్లో చాలామంది చూస్తున్నారు. ఓసారి మీరూ చూడండి. -
మేకప్ తో కనిపిస్తే నన్ను క్షమించండీ..!
బిగ్ బాస్ 7 సిరీస్ అనగానే మొదట గుర్తుకొచ్చే పేరు సోఫియా హయత్. ఎందుకంటే వైల్డ్ కాల్డ్ ఎంట్రీ ద్వారా ఎంటరైన అప్పటి టాప్ మోడల్.. అర్మాన్ కోహ్లీతో గొడవ వల్ల ఆమెను సిరీస్ మధ్యలోనే ఇంటికి పంపివేసిన విషయం తెలిసిందే. సింగర్, మోడల్ అయిన సోఫియా ఇటీవల నన్(సన్యాసిని) గా మారినట్లు ప్రకటించింది. అయితే కొన్ని వారాలుగా ఆమె మేకప్ వాడుతోందని, అందానికే ఇంకా ప్రాధాన్యం ఇస్తున్నదంటూ విమర్శులు వెల్లువెత్తాయి. 'మేం మేకప్ లేకున్నా చాలా అందంగా ఉంటాం. హెయిర్ కలర్, ఫ్యాషన్ ఫాలోయింగ్ లేకున్నా సరే' అందంగానే కనిపిస్తామంటోంది. నన్ గా మారిన తర్వాత ఎవరైనా తనను మేకప్ లో చూసినట్లుగా భావిస్తే ఉంటే దయచేసి నన్ను క్షమించండి అంటూ బహిరంగంగా ప్రకటించింది. అప్పటి జీవితం వేరు.. ఇప్పటి లైఫ్ వేరని, గతంలో తాను చేయించుకున్న సర్జరీల వల్లే ఇంకా అందంగా కనిపిస్తున్నానంటూ చెప్పుకొచ్చింది. ఇక తనకు పెళ్లి చేసుకోవాలని, శృంగారంలో పాల్గొనాలనే ఆలోచనలు రావని అంటోంది. ఇకనుంచీ తాను తన పిల్లల కోసం బతుకుతానని, ప్రపంచం అంతటికీ తల్లినవుతానని చెప్పింది. ప్రేమించడం తప్పుకాదని, ప్రతి ఒక్కరూ ప్రేమ పొందగలగాలని ఆమె అభిప్రాయపడింది. గతంలో క్రికెటర్, మాజీ బాయ్ ఫ్రెండ్ రోహిత్ శర్మ 264 పరుగులు చేసినప్పుడు అతడికి బహుమతిగా తన నగ్న సెల్ఫీని ట్విట్టర్లో పోస్ట్ చేసి సంచలనం సృష్టించిన ఆమె ఇప్పుడు పూర్తిగా మారిపోయానని గతంలో చేసిన తప్పులు మళ్లీ చేసేందుకు సిద్ధంగా లేనని సోఫియా వివరించింది. -
నన్‌పై గ్యాంగ్ రేప్ : ప్రధాన నిందితుడి అరెస్ట్
కోల్కత్తా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కత్తా నన్‌పై సామూహిక అత్యాచారం చేసిన కేసులో ప్రధాన నిందితుడు మిలాన్ సర్కార్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు శనివారం వెల్లడించారు. సెల్దా రైల్వే స్టేషన్లో మిలాన్ శంకర్‌తో పాటు అతడి ముఖ్య అనుచరుడు అహిదుల్ ఇస్లాం అలియాస్ బాబును కూడా అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. అనంతరం వారిని విచారణ నిమిత్తం పోలీసు స్టేషన్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. మిలాన్, బాబు ఇద్దరు బంగ్లాదేశ్‌లోని జీస్సోర్ నుంచి వచ్చారని చెప్పారు. పశ్చిమ బెంగాల్ నాడియా జిల్లా గంగ్నాపూర్ రాణాఘాట్ కాన్వెంట్లోకి ఈ ఏడాది మార్చి 13 తేదీ ఆర్థరాత్రి 12 మంది యువకులు చోరబడ్డారు. అనంతరం కాన్వెంట్‌లోని 72 ఏళ్ల నన్‌పై సామూహిక అత్యాచారం చేశారు. ఆ తర్వాత లాకర్లోని రూ. 12 లక్షలు దోచుకుని పరారయ్యారు. ఈ విషయం తెలుసుకున్న స్కూలు సిబ్బంది ఆమెను స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. ఈ వార్త తెలిసిన వెంటనే ఆగ్రహించిన విద్యార్థులు ఆందోళనకు దిగారు. స్థానికంగా రోడ్డు, రైలు మార్గాలను దిగ్బంధనం చేశారు. దీంతో మమతాబెనర్జీ స్పందించి... సీబీసీఐడీ దర్యాప్తునకు ఆదేశించారు. ఈ కేసులో సీఐడీ అధికారులు ఎనిమిది మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
ఆ రేపిస్టులను క్షమించండి: నన్
కోలకతా: తనపై లైంగికదాడి చేసిన వారిని క్షమించాలని కోల్‌కతాలో అత్యాచారానికి గురైన నన్ కోరింది. తనకు వారిపై ఎలాంటి ద్వేషం లేదని పేర్కొంది. రాణాఘాట్లోని ఓ కాన్వెంట్ స్కూల్లో పనిచేస్తున్న ఆమెపై కొందరు వ్యక్తులు సామూహిక లైంగిక దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ ఘటన బెంగాల్లో సంచలనం కూడా సృష్టించింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె గుండెల్లో పెద్ద బాధ ఉన్నప్పటికీ .. దానిని పక్కన పెట్టేసి పెద్ద మనసుతో వారిని క్షమించాలని కోరింది. 'నా హృదయం పగిలిపోయింది. నా రక్షణకంటే నా పాఠశాల, అందులో చదువుతున్న పిల్లల భద్రతపైనే నాకు తీవ్ర ఆందోళనగా ఉంది' అని ఆమె పేర్కొన్నారు. ఇంత పెద్ద సంఘటనలో కూడా మౌనంగా, నిర్మలమైన మనస్సుతో కనిపించడం ఆమె మనోధైర్యానికి నిదర్శనం అని ఆమెకు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లు చెప్తున్నారు. -
సన్యాసిని రేప్ కేసులోనిందితులు గుర్తింపు
కోల్ కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో కలకలం రేకెత్తించిన 72 ఏళ్ల క్రైస్తవ సన్యాసినిని గ్యాంగ్ రేప్ చేసిన ఘటనకు సంబంధించి ఐదుగురు నిందితులను పోలీసులు గుర్తించారు.స్కూలు వీడియో ఫుటేజ్ ఆధారంగా నిందితులను కనుగొన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....నిందితులు తెల్లవారు జామున 4 గంటల సమయంలో సెక్యూరిటీ గార్డును కొట్టి జీసస్ అండ్ మేరీ కాన్వెంట్లోకి ప్రవేశించారని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా పోలీసులు వారివద్ద నుంచి రూ. 8 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. కేసును అన్వేషించేందుకు పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. గతవారం స్కూలు ప్రిన్సిపల్, విద్యార్థినికి ఒక బెదిరింపు ఫోన్ కాల్ వచ్చినట్లు కోల్ కతా ఆర్చిబిషప్ థామస్ డిసోజా తెలిపారు. ఒకవేళ విద్యార్థిని స్కూలు ఆవరణనుంచి బయటకు వచ్చినట్లైతే చంపేస్తామని బెదిరించారని తెలిపారు. ఆ ఫోన్ కాల్ ను పూర్వ విద్యార్థి చేసిందిగా గుర్తించారు. కొంతకాలంగా ఆ విద్యార్థి ఆమెను ఇదేవిధంగా బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఇదిలాఉండగా ఈ కేసులో కఠినంగా వ్యవహరిస్తామని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ పేర్కొన్నారు. ఇదిలాఉండగా ఘర్ వాపసీ పేరుతో మతహింస పెరిగిందని మమతాబెనర్జీ విమర్శించారు. -
'నన్ రేప్' కేసులో ఎనిమిదిమంది అరెస్టు
రణఘాట్(పశ్చిమబెంగాల్): కోల్ కత్తాలో 72 ఏళ్ల సన్యాసిని(నన్)పై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో ఎనిమిదిమంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఘటన జరిగిన ప్రాంతంలో సీసీటీవీ పుటేజ్‌ను సొంతం చేసుకున్న సీఐడీ పోలీసులు నలుగురు నిందితులను గుర్తించారు. ఆ దిశగా గాలింపు చర్యలు ప్రారంభించగా ఎనిమదిమంది పట్టుబడ్డారు. మరికొందరని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని, ఈలోపు నిందితులను అరెస్టు చేసేందుకు అవసరమైన వివరాలు చెప్పినవారికి రూ.లక్ష అందిస్తామని అంతకుముందు పోలీసులు ప్రకటించారు. కోల్‌కత్తాలోని నాడియా జిల్లా లోని గంగ్నాపూర్ లో 72 సం.రాల నన్ పై సామూహిక అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. అర్థరాత్రి తరువాత ఓ స్కూల్లోకి చొరబడ్డ సుమారు పన్నెండుమంది దొంగల్లో నలుగురు ఆమెపై సామూహిక అత్యాచారం చేసి, లాకర్ లోని 12 లక్షల రూపాయలను దోచుకెళ్లారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది.