ఆ రేపిస్టులను క్షమించండి: నన్ | Bengal nun prays for forgiveness of her rapists | Sakshi
Sakshi News home page

ఆ రేపిస్టులను క్షమించండి: నన్

Published Mon, Mar 16 2015 4:07 PM | Last Updated on Sat, Jul 28 2018 8:51 PM

Bengal nun prays for forgiveness of her rapists

కోలకతా: తనపై లైంగికదాడి చేసిన వారిని క్షమించాలని కోల్కతాలో అత్యాచారానికి గురైన నన్ కోరింది. తనకు వారిపై ఎలాంటి ద్వేషం లేదని పేర్కొంది. రాణాఘాట్లోని ఓ కాన్వెంట్ స్కూల్లో పనిచేస్తున్న ఆమెపై కొందరు వ్యక్తులు సామూహిక లైంగిక దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ ఘటన బెంగాల్లో సంచలనం కూడా సృష్టించింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె గుండెల్లో పెద్ద బాధ ఉన్నప్పటికీ .. దానిని పక్కన పెట్టేసి పెద్ద మనసుతో వారిని క్షమించాలని కోరింది.

'నా హృదయం పగిలిపోయింది. నా రక్షణకంటే నా పాఠశాల, అందులో చదువుతున్న పిల్లల భద్రతపైనే నాకు తీవ్ర ఆందోళనగా ఉంది' అని ఆమె పేర్కొన్నారు. ఇంత పెద్ద సంఘటనలో కూడా మౌనంగా, నిర్మలమైన మనస్సుతో కనిపించడం ఆమె మనోధైర్యానికి నిదర్శనం అని ఆమెకు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లు చెప్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement