forgiveness
-
క్షమయే దైవము
క్షమా శస్త్రం కరే యస్య దుర్జనః కిం కరిష్యతి? అతృణో పతితో వహ్నిః స్వయమేవోపశమ్యతి! గడ్డి పరక లేని నేలమీద పడిన మంట తనంత తానే ఆరి పోతుంది. ఎవరి దగ్గరైతే క్షమ అనే శస్త్రం ఉంటుందో వారిని దుర్జనులు కూడా ఏమీ చేయలేరని శ్లోకం భావం. మంట తనని కాలుస్తున్నా తిరిగి ప్రతీకారం తీర్చుకోకుండా నేలతల్లి సహనం వహించడం వల్ల మంటలో ఉన్న కాలే గుణం తగ్గి పోతుందట. రావణుడితో మొదటిసారి యుద్ధంలో తలపడినప్పుడు ‘సీతను అప్పగించి శరణు కోరితే క్షమించి వదిలేస్తాను’ అని పలికాడు రాముడు. ఎంతటి శత్రువునైనా క్షమించగల దయా గుణ సంపన్నుడు రాముడు. తన భార్యని అపహరించిన శత్రువుని కూడా క్షమాగుణంతోనే పలకరించాడు. రావణుడు చనిపోయాక శ్రాద్ధ కర్మల అవసరం లేదని విభీషుణుడు చెప్పగా ‘ఎంతటి శత్రువైనా మరణంతో పగలన్నీ మరచిపోవాలి. అతడు మీకెలా సోదరుడో నాకూ అంతే. అతడికి సద్గతులు కలగాలంటే శ్రాద్ధ కర్మలు జరిపించాలని’ పలికాడు. అంతటి క్షమాగుణం సీతాపతిది. కార్త వీర్యార్జునుడిని, పదిహేడు అక్షౌహిణుల సైన్యాన్ని హతమార్చిన పరశురాముడితో తండ్రి జమదగ్ని ‘క్షమయే మన ధర్మం. ధర్మతత్వానికి క్షమయే మూలం. క్షమ కలిగి ఉండడం చేతనే సర్వేశ్వరుడు బ్రహ్మ పదాన్నీ, సకల జీవరాశినీ పరి పాలిస్తున్నాడు. క్షమ కలిగి ఉంటే సిరి కలుగుతుంది. విద్య అబ్బుతుంది. సౌఖ్యాలు కలుగుతాయి. శ్రీహరి మెప్పు పొందగలరని’ హితబోధ చేశాడు. ఫలితంగా ఏడాది పాటు తీర్ధయాత్రలు చేశాడు పరశురాముడు. ఈ కాలం వారికి వింతగా కనబడవచ్చు కానీ క్షమా గుణానికి ఉన్న బలం అంచనా కట్టలేనిది. ఎవరైనా ఒక్క మాటంటే భరించలేకపోవడం, దూషిస్తూ తిరిగి ఎదురు దాడి చేయడం నేటి కాలంలో చూస్తుంటాం. ఒక్క క్షణం ఓపికతో అవతలి వారి కోణంలో ఆలోచిస్తే వారి మీద కోపం రావడం బదులు సానుభూతి కలుగుతుంది. క్షమాగుణాన్ని చూప డమంటే చేతకానితనం కాదు. ఆత్మబల మున్న బలవంతులకే అది సాధ్యం. – అమ్మాజీ ఉమామహేశ్వర్ -
క్షమాగుణం సఫల జీవితానికి చుక్కాని
తప్పొప్పులనేవి జరుగుతూనే ఉంటాయి. అది సహజం. ఎవరైనా చేయొచ్చు.ఎవరి వలన తప్పు జరిగినా రెండవవారు పెద్ద మనసుతో క్షమించగలిన గుణం కలిగి వుండాలి. క్షమించటం అనేది విజయమే కానీ ఓటమి కాదు. క్షమించటం వల్ల పాడైపోయిన సంబంధాల పునరుద్ధరణ జరగడంతోబాటు మనలో వున్న కోపం, కసి అనేవి మాయమైపోతాయి. అంటే మనలో వున్న మానసిక ఒత్తిడిని దూరం చేసుకున్నామన్న మాట. మనిషి అనగానే కొన్ని బంధాలకు అనుబంధాలకు లోబడి వుంటాడన్నది నిజం. అందులో తన కుటుంబీకులే గాకుండా బంధువులు, స్నేహితులు, సన్నిహితులు కూడా వుంటారు. అయితే ఈ అనుబంధాలు ఎల్లవేళలా ఒకేలా వుండవు. ఏదో ఒక సమయంలో ఏదో ఒక చిన్న తేడా రావొచ్చు. దాంతో మన మనసుకు కొంచెం ఇబ్బంది కలగవచ్చు. ప్రస్తుత కాలంలో ఆ సంబంధాలు చెడిపోయినా, ఒకప్పుడు అవి ఆనందాన్ని, ప్రేమను, తృప్తిని ఇచ్చినవే. అసలు ఈ సంబంధాలు ఎలా ఏర్పడినాయని ఆలోచిస్తే, కొన్ని మేధోపరమైనవి, కొన్ని ఆర్థికపరమైనవి కాగా, కొన్ని వారి ఆలోచనలు, భావాలు కలిస్తే వచ్చినవి అయి ఉంటాయి. ఇష్టాయిష్టాలు ఒకటి కావటంతో కూడా కొన్ని బంధాలు ఎంతోకాలం నిలిచే వీలుంది. భౌతిక రూపానికి కూడా కొందరు ఇష్టపడతారు. అలా దగ్గరవుతారు. ఎంతో గొప్పగా సాగుతాయి ఈ సంబంధాలు. కానీ ఎక్కడో చిన్న తేడా వస్తుంది. అక్కడే వచ్చిన చిక్కల్లా. కొందరు వెంటనే సరిదిద్దుకోగలుగుతారు. మరికొందరికి అది కుదరకపోవచ్చు. ఆ చిన్న తేడా వలన గతంలో వున్న అనుబంధంలో తేడా వస్తుంది. అది ఒకోసారి పలకరింపులు కూడా లేని స్థితికి తీసుకువెళుతుంది. అసలు బంధమే చెడిపోయే స్థితికి పడిపోవచ్చు లేదా అసలు బంధమే తెగిపోయి, ఎడముఖం పెడముఖంగా మారిపోవచ్చు. కానీ తర్వాతి కాలంలో ఎప్పుడో మనకు అనిపించవొచ్చు... అయ్యో ఇదేమిటీ ఇలా చేసుకున్నాము అని. అటువంటి పరిస్థితి రాకుండా వుంటే బాగుండేది అనిపించవొచ్చు. ఇలాంటి భావన తర్వాతి కాలంలో కలుగవొచ్చు. కొన్ని సందర్భాలలో సంబంధాలను మెరుగుపరచుకోవాలన్నా కుదరని మానసిక స్థితి వెంటాడుతుంది కూడా. ఇలా చెడిపోవడానికి కారణం అవతలి వారిది అయినా కూడా తప్పు అర్ధం అయినా , తిరిగి సంబంధాలు తిరిగి కావాలని అనుకుంటే క్షమాగుణం కలిగి ఉండాలి. క్షమా గుణాన్ని ప్రదర్శించటం అంటే కొందరు తమ వ్యక్తిత్వం దెబ్బతింటుందేమో అని అనుకుంటారు. కానీ అది వ్యక్తిత్వాన్ని పెంచేదేకాని తగ్గించేది మాత్రం కాదు. ప్రతి ఇద్దరి మధ్య ఎన్నో మంచి చెడులు వారికి మాత్రమే తెలిసినవి ఉండొచ్చు. అవతలివారు చాలాసార్లు మనకు ఎన్నో మంచి చేసిన సందర్భాలు వుండి వుండొచ్చు. ఆ మంచిని మర్చిపోయి, మధ్యలో చేసిన తప్పును పట్టుకుని సంబంధాలను చెడకొట్టుకోవడం మంచిది కాదు. అది సరి అయిన పద్ధతి కాదు. తప్పొప్పులనేవి జరుగుతూనే ఉంటాయి. అది సహజం. ఎవరైనా చేయొచ్చు. ఎవరివలన తప్పు జరిగినా రెండవవారు పెద్ద మనసుతో క్షమించగలిన గుణం కలిగి వుండాలి. క్షమించటం అనేది విజయమే కానీ ఓటమి కాదు. క్షమించటం వల్ల పాడైపోయిన సంబంధాలను పున రుద్ధరించుకోవటం, మనలో వున్న కోపం, కసి అనేవి మాయమైపోతాయి. అంటే మనలో వున్న మానసిక ఒత్తిడి దూరం అవుతుంది. మనసులోని బరువు ఒక్కసారిగా దిగిపోయినట్లవుతుంది. ఇది ఒక కొత్త అనుభూతిని కలుగ చేస్తుంది. మనుష్యులకు దగ్గర అయ్యే కొత్త ప్రయత్నం మొదలవుతున్నట్లే కదా. ఇక్కడ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. అర్థం లేని ఆలోచనలన్నింటినీ పక్కన పెట్టాలి. అసలు ఆ బంధం తెగకుండా వుంటే బాగుండేదన్న ఆలోచన రాగానే, తిరిగి మనలను గతంలోకి తీసుకువెళుతుంది. కొందరు ఇదంతా కర్మ ఫలం అంటారు. అయితే ఇక్కడ ఆ కోణంలో కూడా ఆలోచిస్తే, ఇతరుల వలన మనం పడిన కష్టాల ఆలోచన వదిలి, మనం ఇతరులకు చేసిన, కలిగించిన ఇబ్బందుల గురించిన ఆలోచన మొదలవుతుంది. గతంలో మన వలన చెడిపోయిన సంబంధాల ఆలోచన చేస్తే మన తప్పు ఉందన్న విషయం అర్ధమవుతుంది. సొంత తప్పులను ఒప్పుకోవటం అంటే ఒక మెట్టు దిగడం కాదు. వాస్తవాన్ని అంగీకరించడం. ఆ తప్పు ఒప్పుకుంటే అది మనలోని అహాన్ని హరిస్తుంది. ఆ తర్వాత ఇక ఇతరుల తప్పులను క్షమించడం అంత కష్టం కాదు. సులభంగా క్షమించ గలుగుతారు. మనుషులన్న తర్వాత, ఈ నవనాగరిక లోకంలో, ఈ యాంత్రిక ప్రపంచంలో తప్పులు చేయకుండా వుండరు. అసలు మనకు ఎవరైనా ఎందుకు ఈ విధంగా చేశారు అనే ఆలోచన వస్తే పలురకాల సమాధానాలు కనిపిస్తాయి. వాటిని వదిలించుకునే ప్రయత్నం చేయాలి. నిజానికి మానసిక ప్రశాంతత అనేది ఎవరికి వారు సంపాదించుకోవాల్సిందే. ఇక మనం తృప్తి, అశాంతి, ఈ రెండింటిలో ఏది కావాలో ఎంచుకోవాలి. కసి, కోపం, ద్వేషంతో అశాంతిని మూటకట్టుకోవాలా లేక క్షమించి కొత్త జీవితం ప్రారంభించాలా? ఈ నిర్ణయం మన చేతుల్లోనే వుంది. క్షమాగుణానికి సుఖ శాంతులను చేకూర్చే మహత్తరమైన గుణం ఇమిడి వుంది. అది తెలుసుకుంటే జీవితమే మారిపోయి ఆనందంగా వుండే అవకాశం ఉంటుంది. క్షమ సఫల జీవితానికి చుక్కాని. క్షమ ఒక ఆయుధం, దాన్ని ధరించితే దుర్జనుడేమీ చేయలేడు. ప్రతీకారేచ్ఛ లేకపోవడమే సహనం. ఓరిమిని కూర్చిన సద్గుణం మరొకటిలేదు. ఇక క్షమించడం మనందరం నేర్చుకుందాము. హాయిగా జీవిద్దాం. – డా. పులివర్తి కృష్ణమూర్తి -
నిర్భయ తల్లి ఆశాదేవి ఆ నిర్ణయం తీసుకుంటారా?
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ నిర్భయ తల్లి ఆశాదేవికి ఆసక్తికరమైన విన్నపాన్ని చేశారు. ఏడేళ్ల క్రితం తన కుమార్తె (నిర్భయ)పై సామూహిక హత్య చారం చేసిన వారిని క్షమించాలని ఆమె కోరారు. ఈ విషయంలో ఆమె పెద్దమనసు చేసుకోవాలని ఇందిరా విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగాఈ విషయంలో కాంగ్రెస్ అధినేత్రి, రాజీవ్ గాంధీ భార్య సోనియా గాంధీని ఉదాహరణగా తీసుకోవాలని కోరారు. 1991లో తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులో అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీని మానవబాంబు ద్వారా హత్య చేసిన కేసులోనళినిని సోనియా క్షమించినట్టుగానే, నలుగురు దోషులకు కూడా ఆశాదేవి క్షమాభిక్ష పెట్టాలని కోరుతున్నామని జైసింగ్ ట్వీట్ చేశారు. తన కుమార్తె మరణాన్ని రాజకీయం చేస్తున్నారన్న ఆశాదేవి ఆవేదనకు పూర్తి మద్దతు తెలిపిన ఇందిరా మరణశిక్ష వద్దు.. ఉరి శిక్షలకు తాము వ్యతిరేకమని పేర్కొన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా రాజకీయాల్లోకి ప్రవేశించనున్నరాన్నవార్తలపై ఆశాదేవి తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా కోర్టులు, ప్రభుత్వంపై ఆమె ధ్వజమెత్తారు. అలాగే 2012లో నిర్భయ హత్యాకాండకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసి, మహిళల భద్రత కోసం నినాదాలు చేసిన వ్యక్తులే, రాజకీయ ప్రయోజనం కోసం తన కుమార్తె మరణాన్ని వాడు కుంటున్నారని విమర్శించారు. తమ స్వార్థ రాజకీయ లాభాల కోసమే ఉరిశిక్ష అమలును అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అయితే గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా మహిళలపై హింసకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించేలా చూడాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి విజ్ఞప్తి చేశారు. అంతేకాదు దోషులను ఉరితీసే వరకు తనకు మనశ్శాంతి లేదంటూ కంట తడిపెట్టారు. ఈ నేపథ్యంలో ఇందిరాజైసింగ్ అభ్యర్థనను, ఆశాదేవి అంగీకరిస్తారా అనేది ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏం నేరమూ చేయని తన కుమార్తెను అతికిరాతంగా హత్య చేసిన వారికి మరణ శిక్షే న్యాయమంటూ.. ఏడేళ్లుగా అలుపెరుగని పోరాటం చేసిన ఆమె ఇపుడు హంతకులను క్షమిస్తారా? పుట్టెడు దుఃఖాన్ని దిగమింగి, క్షమించడమనే ఉదాత్తమైన నిర్ణయం తీసుకుంటారా... లేదంటే..దేశవ్యాప్తంగా ఎందరో ఆడబిడ్డల కన్నతల్లులకు తీరని కడుపుశోకాన్ని మిగిల్చుతున్న వారికి ఇదే న్యాయమంటారా? వేచి చూడాలి కాగా 2012 డిసెంబర్ 16 రాత్రి దేశ రాజధానిలో కదిలే బస్సులో 23 ఏళ్ల నిర్భయపై సామూహిత్య హత్యాచారానికి పాల్పడిన కేసులో వినయ్, అక్షయ్, పవన్, ముకేశ్ అనే నలుగురు దోషులుగా (ఒక దోషి జైల్లో ఆత్మహత్య చేసుకోగా, మరో దోషి మైనర్ కావడంతో శిక్షనుంచి మ తప్పించుకున్నాడు) నిర్దారించారు. సుదీర్ఘ విచారణ, న్యాయపరంగా అన్ని అడ్డంకులను అధిమించిన అనంతరం ఫిబ్రవరి 1 న ఉదయం 6 గంటలకు వారిని ఉరి తీయనున్న సంగతి తెలిసిందే. చదవండి : ఫిబ్రవరి 1న ఉరిశిక్ష అమలు నిర్భయ దోషుల ఉరి : కొత్త ట్విస్టు చావును వాడుకోకండి.. నిర్భయ తల్లి కన్నీటి పర్యంతం While I fully identify with the pain of Asha Devi I urge her to follow the example of Sonia Gandhi who forgave Nalini and said she didn’t not want the death penalty for her . We are with you but against death penalty. https://t.co/VkWNIbiaJp — Indira Jaising (@IJaising) January 17, 2020 -
సారీ చెప్పిన సుప్రీంకోర్టు జడ్జి
న్యూఢిల్లీ: కేసులో వాదనలు వినిపిస్తున్న ఓ న్యాయవాదిపై కోర్టు ధిక్కరణ నేరం మోపుతానంటూ బెదిరించిన సంఘటనలో సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ అరుణ్ మిశ్రా గురువారం క్షమాపణ చెప్పారు. తమతో వ్యవహరించే విషయంలో ఓపికగా ఉండాలన్న సీనియర్ న్యాయవాదుల సూచనకు అంగీకరించిన జస్టిస్ అరుణ్ మిశ్రా... తన వైఖరి కారణంగా ఎవరైనా బాధపడి ఉంటే క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు. భూ సేకరణకు సంబంధించిన కేసులను చూస్తున్న ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి జస్టిస్ మిశ్రా నేతృత్వం వహిస్తుండగా మంగళవారం ఒక కేసుకు సంబంధించి వాదనలు వినిపిస్తున్న లాయర్ గోపాల్ శంకర నారాయణన్‌ను కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేస్తానని బెదిరించారు. ఈ విషయంపై కపిల్ సిబల్, ముకుల్ రోహత్గీ, అభిషేక్ సింఘ్వీ, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాకేశ్ ఖన్నా తదితరులు గురువారం జడ్జిని కలిసి జరిగిన సంఘటనను ప్రస్తావించారు. ‘ఏ సమయంలోనైనా ఎవరైనా ఏదైనా అనుకునిఉంటే చేతులు జోడించి క్షమాపణలు కోరుతున్నా’ అని జడ్జి వ్యాఖ్యానించారు. -
మన్నించు మిత్రమా
ఒక జర్మన్ యాత్రికుడు చాలా దూరం ప్రయాణించి ఒక ఆధ్యాత్మిక గురువును దర్శించుకునేందుకు వచ్చాడు. ప్రయాణ బడలికలో చికాకుగా ఉన్న అతను విసుగ్గా బూట్లను విప్పి ఒక మూలకు విసిరేసి ఎదురుగా మూసి ఉన్న తలుపును కాలితో బలంగా తన్ని తెరిచి లోపలికి ప్రవేశించి గురువుకు నమస్కరించాడు. గురువు అతనితో ‘‘నీ నమస్కారాలు నాకు అక్కర్లేదు. ముందు వెళ్లి ఆ తలుపునకు, నీ బూట్లకు క్షమాపణ చెప్పిరా’’ అన్నాడు. దానికతను ‘‘తలుపు నకు, బూట్లకు క్షమాపణ చెప్పమంటారేమిటి? వాటికి జీవముందా?’’ అని అడిగాడు. ‘‘తలుపును తన్నినప్పుడు, బూట్లను విసిరేసినప్పుడు వాటికి జీవం లేదు అన్న విషయం నీకు గుర్తుకు రాలేదు. కానీ, నేను వాటికి క్షమాపణ చెప్పమన్నప్పుడు మాత్రం ఆ సంగతి నీకు గుర్తొచ్చిందా? ముందు వెళ్లి వాటికి క్షమాపణ చెప్పిరా. అంతవరకు నేను నీతో మాట్లాడను’’ అన్నాడు. ఒక గొప్ప వ్యక్తిని కలవడానికి ఎంతో దూరం నుంచి వచ్చిన తాను ఇంత చిన్న విషయానికి ఆయనతో మాట్లాడకుండా వెళ్లిపోవడం సమంజసం కాదని గురువు చెప్పినట్లుగా తలుపు దగ్గరకు వెళ్లి నమస్కారం పెట్టి, ‘‘కోపంలో నిన్ను అనవసరంగా తన్ని బాధపెట్టాను. నన్ను మన్నించు’’ అని వేడుకున్నాడు. అలాగే బూట్ల దగ్గరకు వెళ్లి చేతులు జోడించి, ‘‘మిత్రులారా! మిమ్మల్ని ఒక మూలకు విసిరేసి అవమాన పరిచాను. నా తప్పును మన్నించండి’’ అని వేడుకున్నాడు. ఇలా చేసిన వెంటనే అతని మనసులోని అలజడి మాయమై అనిర్వచనీయమైన ప్రశాంతత చోటు చేసుకుంది. క్షమాపణ తంతు ముగించి గురువు వద్దకు వెళ్లి కూర్చున్నాడు. గురువు అతనిని చూసి నవ్వుతూ, ‘‘ఇప్పుడు నాకు బాగుంది. ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు అర్థం చేసుకుంటావు. ఇప్పుడు మనం హాయిగా మాట్లాడుకుందాం’’ అన్నాడు. కేవలం మనుషులను మాత్రమే ప్రేమిస్తే సరిపోదు. నిరంతరం ప్రేమలోనే ఉంటూ జీవులను, మనల్ని జీవులుగా ఉంచేవాటినీ ప్రేమించాలి. ప్రేమించగలగాలి. – డి.వి.ఆర్. -
ఒకేసారి క్రిమినల్, శాఖాపరమైన చర్యలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ విభాగాలు, సంస్థల్లో అవినీతి అధికారులపై ఏకకాలంలో క్రిమినల్ కేసులతో పాటు శాఖాపరమైన క్షమశిక్షణ చర్యలు చేపట్టవచ్చని కేంద్ర విజిలెన్స్ కమిషన్(సీవీసీ) స్పష్టం చేసింది. కొన్ని అవినీతి కేసుల్లో తీసుకున్న క్రమశిక్షణ చర్యలపై అధ్యయనం తర్వాత అలాంటి కేసుల్లో కోర్టు విచారణ జరుగుతుందన్న సాకుతో శాఖపరమైన చర్యల్లో జాప్యం చేస్తున్నారని సీవీసీ గుర్తించింది. కేసు విచారణలో ఉందన్న సాకుతో కొన్ని విభాగాలు, సంస్థలు అలాంటి వైఖరి అనుసరించడం సరైన విధానం కాదని బ్యాంకులు, బీమా సంస్థలు, ఇతర ప్రభుత్వ సంస్థలకు స్పష్టం చేసింది. -
ఖల్లివెల్లి కార్మికులకు క్షమాభిక్ష
గల్ఫ్ డెస్క్ : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) పరిధిలో వీసా, వర్క్ పర్మిట్ లేకుండా అక్రమం గా ఉంటున్న విదేశీ కార్మికుల నుంచి ఎలాంటి జరిమానా వసూలు చేయకుండా, జైలు శిక్ష విధించకుండా వారిని స్వదేశాలకు పంపిం చేందుకు అక్కడి ప్రభుత్వం క్షమాభిక్ష ప్రకటించింది. 2013లో క్షమాభిక్షను రెండు నెలల పాటు అమలు చేసిన యూఏఈ ప్రభుత్వం ఐదేళ్ల తరువాత మరోసారి క్షమాభిక్ష అమలు చేస్తుంది. ‘ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ వయా రెక్టిఫై యువర్ స్టేటస్’ అనే కార్యక్రమం పేరుతో ఈ సంవత్సరానికి గాను క్షమాభిక్షను ప్రసాదించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్ షిప్(ఎఫ్ఏఐసీ) చైర్మన్ అలీ మహ్మమద్ బిన్ అహమ్మద్ అల్ షంసీ రెండు రోజుల క్రితం వెల్లడించిన వివరాల ప్రకారం.. క్షమాభిక్ష ఆగస్టు ఒకటో తేది నుంచి మూడు నెలల పాటు అమలు లోకి రానుంది. 2013లో క్షమాభిక్ష సమయంలో 62వేల మంది విదేశీ కార్మికులు ఎలాంటి జరిమా నాలూ చెల్లించకుండా, జైలు శిక్ష అనుభవించ కుండా సొంతూళ్లకు వెళ్లిపోయారు. ఈ సంవ త్సరం జనవరిలో కువైట్ ప్రభుత్వం క్షమాభిక్ష అమలు చేయగా 1.32 లక్షల మంది వినియో గించుకున్నారు. యూఏఈ పరిధిలో దుబాయ్, అబుదాబి, షార్జా, అజ్మన్, పుజీరా, రసల్ ఖైమా, ఉమ్మ ల్ ఖ్వాయిస్న్ రాష్ట్రాలు ఉన్నాయి. షార్జా, దుబా య్, అబుదాబీలలో తెలంగాణ జిల్లాలకు చెందిన ఎంతో మంది కార్మికులు వివిధ పనులు చేస్తున్నారు. కొందరు కంపెనీ వీసాలపై వెళ్లగా మరి కొందరు విజిట్ వీసాలపై వెళ్లారు. కంపెనీ వీసాలపై వెళ్లిన వారు తమకు పని సరిగా లేకపోవడంతో కంపెనీ నుంచి బయటకు వచ్చి దొరికిన పనిచేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు. అలాగే విజిట్ వీసాలపై వెళ్లిన వారు గడువులోగా ఇంటికి రాకుండా అక్కడే ఏదో ఒక పనిలో ఉండి పోయారు. కంపెనీల నుంచి బయటకు వచ్చిన వారు మరో కంపెనీలో పనిచేయాలంటే వర్క్ పర్మిట్ మార్చుకోవాల్సి ఉంటుంది. వీసా, వర్క్ పర్మిట్ లేకుండా పనిచేయడం యూఏఈ నిబంధనలకు విరుద్ధం. చట్టవిరుద్ధం గా ఉంటున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగి పోతుందని గుర్తించిన యూఏఈ ప్రభుత్వం క్షమాభిక్షను అమలులోకి తీసుకురావాలని నిర్ణ యించింది. క్షమాభిక్ష అమలైతే వీసాల పునరుద్ధ రణ జరిగే అవకాశం ఉంది. అలాగే జరిమానా, జైలు శిక్షలు లేకుండా స్వగ్రామానికి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. సొంతూరికి రావాలనుకునే వారు విమాన చార్జీలు వారే భరించుకోవాల్సి ఉంటుంది. యూఏఈ పరిధిలో చట్ట విరుద్ధంగా ఉంటున్న తెలంగాణ వాసుల సంఖ్య దాదాపు 20వేల వరకు ఉంటుందని అంచనా. మనవారు ఇంటికి వస్తారా లేక విసా పునరుద్ధరణ చేసుకుంటారా అనే ఆంశంపై క్షమాభిక్ష అమలులోకి వచ్చిన తరువాతనే స్పష్టత రానుంది. -
ఈసారీ మౌనమే
క్షణికావేశంలో నేరం చేసి.. కఠినకారాగార శిక్ష అనుభవిస్తూ కుటుంబ సభ్యులకు దూరమైన వారు క్షమాభిక్ష కోసం ఎదురుచూస్తున్నారు. అయితే వీరికి క్షమాభిక్ష ప్రసాదించేందుకు ప్రభుత్వం మాత్రం మొగ్గు చూపడం లేదు. గణతంత్ర దినోత్సవం రోజున విడుదల చేయాల్సిన జీవిత ఖైదీల విషయంలో ఇప్పటి వరకూ జీఓ ఊసే లేదు. దీంతో జీవిత ఖైదీలకు ఈసారి కూడా నిరాశే ఎదురవుతోంది. అనంతపురం, బుక్కరాయసముద్రం: జిల్లాలోని రెడ్డిపల్లి ఓపెన్ ఎయిర్ జైలు (ఆరుబయలు కారాగారం)లో మొత్తం 62 మంది ఖైదీలున్నారు. వీరిలో ఏడు సంవత్సరాల శిక్షతో పాటు మూడు సంవత్సరాలు రెమ్యూనేషన్ కలిపి మొత్తం 10 సంవత్సరాలు శిక్ష అనుభవించిన వారు 40 మంది వరకు ఉన్నారు. క్షమాభిక్ష జీఓ విడుదల చేస్తే బయటకు వెళ్లేందుకు వీరంతా అర్హులే. విడుదల కోసం నిరీక్షణ సాధారణంగా గణతంత్రదినోత్సవం (జనవరి 26), స్వాతంత్య్ర దినోత్సవం (ఆగస్ట్ 15), గాంధీ జయంతి (అక్టోబర్ 2) రోజున అర్హులైన జీవిత ఖైదీలకు ‘క్షమాభిక్ష’ ద్వారా విడుదల చేయాల్సి ఉంది. క్షమాభిక్ష జీఓ కోసం జీవితఖైదీలు నిరీక్షిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెలువడే శుభవార్త కోసం కళ్లలో ఒత్తులేసుకుని ఎదురుచూస్తున్నారు. జీఓపై ఊసెత్తని ప్రభుత్వం జీవిత ఖైదీల క్షమాభిక్షపై రాష్ట్ర సర్కార్ ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శలు వెలువెత్తుతున్నాయి. గత కాంగ్రెస్ హయాంలో అప్పటి ముఖ్య మంత్రి వైయస్ రాజశేఖర్‌రెడ్డి ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించడంతో ఓపెన్ ఎయిర్ జైలు నుంచి 150 మంది విడుదలయ్యారు. ప్రస్తుత ప్రభు త్వం జీఓ మార్గదర్శకాల కనీసం పరిశీలించి న దాఖలాలు లేవని తెలుస్తోంది. ప్రభు త్వం స్పందించి పదేళ్ల శిక్ష పూర్తి చేసుకొన్న అర్హులైన ఖైదీలందరికీ క్షమాభిక్ష ప్రసాదించాలని పలువురు ఖైదీలు కోరుతున్నారు. అర్హుల జాబితాలో సిద్ధం ఓపెన్ ఎయిర్ జైలులో జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న ఖైదీల క్షమా భిక్షకు అర్హులైన జాబితా సిద్ధం చే సుకు ని ఉంచాము. జీఓ విడుదల ప్రభు త్వం చేతుల్లో ఉంది. ఇప్పటి వరకు క్షమాభిక్ష జీఓ విడుదల కాపీ లు అం దలేదు. ప్రభుత్వం ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించినట్లయితే నెల రోజుల ముందు ఓపెన్ ఎయిర్ జైలుకు సమాచారం వస్తుంది. ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారమూ రాలేదు. – నాగేశ్వరరావు, ఓపెన్ ఎయిర్ జైలు ఇన్చార్జి సూపరింటెండెంట్, రెడ్డిపల్లి -
చూపున్న అంధుడు!
ఒక పల్లెలో ఒక అంధుడు ఉండేవాడు. రాత్రిపూట చేతిలో లాంతరు లేకుండా బయటికి వచ్చేవాడు కాదు! లాంతరు వెలుగుతూ ఉండేది. చూసేవాళ్లకు అది వింతగా ఉండేది. వెలుగు ఉన్నా, లేకున్నా అంధుడు చూడలేడు కదా! మరి చేతిలో ఆ లాంతరు ఎందుకు ఉన్నట్లు? ఓ రాత్రి ఆ అంధుడు ఎప్పటì లాగే చేత్తో వెలుగుతున్న లాంతరు పట్టుకుని నడుచుకుంటూ వెళుతున్నాడు. అది చూసి, దారినపోయేవారు కొందరు నవ్వుకున్నారు. ‘‘ఏం పెద్దాయనా! లాంతరు నీకు దారి చూపిస్తోందా? నువ్వు లాంతరుకు దారి చూపిస్తున్నావా?’’ అని అడిగాడు. ఆ మాటకు అంధుడు బాధ పడలేదు. ‘‘ఈ లాంతరు నా కోసం కాదు’’ అన్నాడు నవ్వుతూ. ‘‘మరి ఎవరి కోసం’’ అన్నారు వాళ్లు. ‘‘మీలాంటి వాళ్ల కోసం’’ అన్నాడు అంధుడు. వాళ్లకు కోపం వచ్చింది. ‘‘నీలా మాకు కళ్లు లేవనుకున్నావా? మాకెందుకు లాంతరు?’’ అని అడిగారు. అంధుడు వాళ్లవైపు చూశాడు. ‘‘లాంతరు లేకపోతే చీకట్లో మీరు.. నేను అంధుడినన్న విషయం తెలుసుకోలేరు. నన్ను తోసుకుంటూ, తొక్కుకుంటూ వెళ్తారు’’ అని అన్నాడు. వాళ్లంతా ఒక్కక్షణం మౌనంగా ఉండిపోయారు. అంధుడికి క్షమాపణ చెప్పి ముందుకు కదిలారు. కంటికి కనిపించిన దాన్ని బట్టే మనం మాట్లాడతాం. రెండోవైపు నుంచి ఆలోచించం. దైవాన్ని కూడా మనం బయటి నుంచే చూసే ప్రయత్నం చేస్తాం. అలా కాదు. అంతర్యానం చేయాలి. అంధుడినైనా, భగవంతుడినైనా అంతర్వీక్షణ చేయాలి. అప్పుడు మాత్రమే నిజం సాక్షాత్కరిస్తుంది. -
అయ్యయ్యో... నోరు జారె!
‘పెదవి దాటని మాటకు ప్రభువు నీవు. పెదవి దాటిన మాటకు బానిసవు నీవు’ అనే సామెత తెలిసే ఉంటుంది. ప్రస్తుతం ప్రియాంకా చోప్రా ఎదుర్కొంటోన్న విమర్శలకు ఈ సామెత అక్షరాలా సరిపోతుంది. పెదవి నుంచి వచ్చే ప్రతి మాటా బ్యాలెన్డ్స్‌గా ఉండాలి. నోరు జారామా? అంతే సంగతులు. ప్రియాంకా చోప్రా ఈ తప్పే చేశారు. ఆ విషయంలోకి వస్తే... సిక్కిం నుంచి వలస వెళుతున్న క్రమంలో ఇద్దరు చిన్నారుల మనోభావాల నేపథ్యంలో ఆమె ‘పహూనా’ అనే సినిమా తీశారు. ఈ చిత్రాన్ని టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. ఉద్వేగపూరితంగా సాగే ఈ సినిమాకి ప్రశంసలు దక్కాయి. మంచి సినిమా నిర్మించారని ప్రియాంకను అక్కడివాళ్లు అభినందించారు. ఆ తర్వాత ఈ బ్యూటీ ప్రెస్మీట్లో పాల్గొన్నారు. ‘‘సిక్కిం రాష్ట్రంలో అల్లర్లు ఎక్కువ. అల్లకల్లోలంగా ఉంటుంది. మేం ఎంతో కష్టపడి ఈ సినిమా తీశాం. సిక్కింలో సినిమాలు నిర్మించే వసతి లేదు. అసలిక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీయే లేదు. ఈ ప్రాంతం నుంచి వచ్చిన తొలి సినిమా మాదే కావడం హ్యాపీగా ఉంది’’ అని ఆ మీడియా సమావేశంలో అన్నారు ప్రియాంక. అంతే... దుమారం రేగింది. ప్రశాంతతకు కేరాఫ్ అడ్రస్‌లాంటి సిక్కిం అల్లకల్లోలంగా ఉంటుందా? అని అక్కడివాళ్లు సోషల్ మీడియా సాక్షిగా ఆమెపై మాటల తూటాలు విసిరారు. సిక్కింలో ఫిల్మ్ ఇండస్ట్రీ లేదని ఎవరన్నారు? ఇప్పటికే మంచి సినిమాలు బోలెడన్ని వచ్చాయి. మీది ఫస్ట్ మూవీయా? అంటూ మరో వివాదం. నిజమే. అక్కడ కథ, ఆచార్య వంటి మంచి చిత్రాలు రూపొందాయి. ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో ‘ధోక్బు’ పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది. మరి.. ఇండియా టు హాలీవుడ్ దాకా ఎదిగిన ప్రియాంక ఈ విషయం ఎందుకు తెలుసుకోలేకపోయారో? ఏదేమైనా సిక్కిం ప్రజల మనోభావాలను ఆమె కించపరిచారు. ప్రియాంక మాటలకు సిక్కిం ప్రభుత్వం కూడా నొచ్చుకుంది. టూరిజమ్ మీద ఆధారపడే సిక్కింలాంటి రాష్ట్రం గురించి ప్రియాంక చేసిన వ్యాఖ్యలు సరికావని టూరిజమ్ మినిస్టర్ ఉగెన్ పేర్కొన్నారు. ఆమె క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రియాంకా చోప్రా తల్లి మధు చోప్రా ఫోన్ ద్వారా క్షమాపణలు తెలియజేశారని సమాచారం. ఇ–మెయిల్ ద్వారా ప్రియాంక స్పందించారని భోగట్టా. -
ఇప్పుడు ట్రంప్‘క్షమా’ గోల!
కిందటి నవంబర్ఎన్నికల్లో రష్యా జోక్యంపై స్పెషల్కౌన్సల్రాబర్ట్మలర్తన దర్యాప్తును డొనాల్డ్ట్రంప్ఆర్థిక లావాదేవీల వరకూ విస్తరించడం అమెరికా అధ్యక్షుడిని కొత్త ఆలోచనకు పురికొల్పింది. రష్యన్ల పాత్రపై పూర్వపు ఎఫ్‌బీఐ డైరెక్టర్జేమ్స్కోమీ దర్యాప్తు నచ్చని ట్రంప్ఆయనను తొలగించారు. దీంతో ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు మలర్‌ను డెప్యూటీ అటార్నీ జనరల్రాడ్రాసెన్స్టెయిన్లిఖిత పూర్వక ఉత్తర్వు ద్వారా నియమించారు. దర్యాప్తు కాలంలో తెలిసిన అంశాలపై కూడా కూపీ లాగవచ్చని ఈ ఉత్తర్వులో పేర్కొనడంతో మలర్తన పరిధిని విస్తరించారు. ట్రంప్సహాయకులు, అల్లుడు జారెడ్కష్నర్, పెద్ద కొడుకు జూనియర్ట్రంప్సహా ఆయన కుటుంబసభ్యుల వ్యవహారాల నుంచి ట్రంప్2008 నాటి ఆర్థిక లావాదేవీల వరకూ పలు అంశాలపై మలర్‌దర్యాప్తు చేస్తున్నారని తెలియడంతో ట్రంప్కొత్త వ్యూహానికి తెరతీశారు. ప్రజలను ప్రభుత్వం నుంచి కాపాడడానికి (చేసిన తప్పులు మన్నించడానికి) అమెరికా రాజ్యాంగం అధ్యక్షుడికి ఇచ్చిన క్షమాభిక్ష అధికారాన్ని ఈ వ్యవహారంలో వాడుకోవడానికి ఎంత వరకు వీలుందో పరిశీలించాలని ట్రంప్తన సలహాదారులను కోరారు. తనను తాను అధ్యక్షుడు క్షమించుకోవచ్చా? రష్యా జోక్యం వ్యవహారంలో పాత్ర ఉన్న కుటుంబసభ్యులు సహా తనవారందరితోపాటు ట్రంప్తనను తాను క్షమించుకోవడానికి కూడా ఆస్కారముందేమో చూడాలని సలహాదారులను అడిగారని తెలుస్తోంది. అమెరికా చరిత్రలో ఇంతవరకూ ఏ అధ్యక్షుడూ తనకు తాను క్షమాభిక్ష ప్రకటించుకున్న సందర్భాలు లేవు. ఈ క్షమాభిక్ష అధికారం కింద ఇంకా అభియోగాలు నమోదుకాని, శిక్షపడనివారిని కూడా అధ్యక్షుడు క్షమించడానికి రాజ్యాంగం వీలు కల్పిస్తోంది. అందుకే ఈ విషయంపై ట్రంప్లాయర్లు విస్తృతంగా తమలో తాము చర్చించుకుంటున్నారని చెబుతున్నారు. తమకు మరీ ఇబ్బంది కలించేలా మలర్‌దర్యాప్తు సాగుతుంటే, ఆయనను ఏఏ కారణాలపై ఆ పదవి నుంచి తప్పించడానికి ఎన్ని అవకాశాలున్నాయనే విషయాన్ని కూడా ట్రంప్లాయర్లు పరిశీలిస్తున్నారు. తొలగించడం సాధ్యంకాకపోతే మలర్‌దర్యాప్తు పరిధిని ఎలా కుదించాలి? అనే అంశంపై కూడా వారు తర్జనభర్జనలు పడుతున్నారు.ఽ ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా ఉండగా ఉత్తర వర్జీనియాలోని ట్రంప్నేషనల్గోల్ఫ్క్లబ్నుంచి మలర్వైదొలిగినపుడు సభ్యత్వ రుసుం వివాదం ఆయనకూ, క్లబ్‌కూ మధ్య వచ్చిందని, దీన్ని కారణంగా చూపించి మలర్‌ను ఈ దర్యాప్తు బాధ్యత నుంచి తొలగించవచ్చిని కొందరు ట్రంప్‌కు సలహా ఇచ్చారు. అయితే, మలర్క్లబ్సభ్యత్వం రద్దుచేసుకున్నప్పుడు మెంబర్షిప్ఫీ వివాదమేదీ లేదని ఆయన ప్రతినిధి ఒకరు చెప్పారు. ఎందుకొచ్చిందీ ఆలోచన? ఫ్లారిడా పామ్‌బీచ్‌లోని ట్రంప్భవనాన్ని 2008లో రష్యా కుబేరుడొకరు కొనుగోలు చేయడం సహా అధ్యక్షుడి పాత లావాదేవీలను కూడా మలర్క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారనే వార్త తెలియడంతో ట్రంప్‌కు క్షమాభిక్ష ఆలోచన వచ్చిందంటున్నారు. అలాగే, ట్రంప్సమర్పించిన అనేక సంవత్సరాల ట్యాక్స్రిటర్న్స్పత్రాలను మలర్అధికారికంగా తెప్పించుకుని పరిశీలించే అవకాశముందనే సమాచారం కూడా ట్రంప్‌ను కంగారుపెడుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన ‘స్వయం క్షమాభిక్ష’కు అవకాశాలపై అధ్యయనం చేయిస్తున్నారు. అధ్యక్షుడు తనను తాను క్షమించుకోవచ్చా? అనే అంటే ‘లేదు’ అని న్యాయకోవిదులెవరూ చెప్పలేదు. కాని, ఇంత వరకు ఏ అధ్యక్షుడూ ఈ పనిచేయలేదు. ఒకవేళ ఏ అధ్యక్షుడైనా స్వయం క్షమాభిక్ష ప్రకటించుకుని ఉంటే ఆ నిర్ణయంపై కోర్టు తీర్పు వచ్చి ఉండేది. ఈ పరిస్థితి గతంలో తలెత్తకపోవడంతో ట్రంప్‌కు ఆ అధికారముందా? అనే ప్రశ్న తలెత్తుతోంది. వాటర్గేట్కుంభకోణంలో ఇరుక్కుని చివరికి రాజీనామా చేసే ముందు మాజీ అధ్యక్షుడు రిచర్డ్నిక్సన్ఈ స్వయం క్షమాభిక్ష గురించి ఆలోచించారు. ఈ అధికారం అధ్యక్షుడికి ఉందని ఆయన లాయర్చెప్పినా, దాన్ని వాడుకోకూడదనే నిక్సన్నిర్ణయించుకున్నారు. 1974 ఆగస్ట్‌లో పదవి రాజీనామా చేశాక నిక్సన్‌కు తర్వాత అధ్యక్ష పదవికి చేపట్టిన (ఉపాధ్యక్షుడు) జెరాల్డ్ఫోర్డ్క్షమాభిక్ష ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని తప్పుపట్టిన ప్రజలు 1976 నవంబర్అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్పారీ్ట అభ్యర్థి జిమీ కార్టర్‌పై పోటీచేసిన ఫోర్డ్‌ను ఓడించారు. (సాక్షి నాలెడ్జ్సెంటర్) -
మీలో క్షమాగుణం ఉందా?
సెల్ఫ్ చెక్ క్షమాగుణం చాలా గొప్పది. పగ, కసి, ద్వేషం, ప్రేమరాహిత్యం వంటివి క్షమ ద్వారా దూరం అవుతాయి. క్షమించే గుణం ఉంటే మన చుట్టూ ఉన్న వాతావరణం సానుకూలంగా కనిపిస్తుంది. దీర్ఘకాలంగా ఆత్మీయులతో దూరంగా ఉన్నప్పుడు వారిని క్షమించగలిగితే తిరిగి పూర్వపు అనుబంధాలను సొంతం చేసుకోవటం కష్టమేమీ కాదు. మీలో క్షమాగుణం ఎంతమేర ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. 1. మీకు హాని చేసిన వ్యక్తి మీ ముందుకు వచ్చి క్షమించమంటే సహనంతో ఉండగలరు. ఎ. అవును బి. కాదు 2. గతాన్ని ఒకసారి పరికించుకొని వారిని క్షమించే ప్రయత్నం చేస్తారు. ఎ. అవును బి. కాదు 3. మీరు క్షమించాలనుకొనే వ్యక్తి భవిష్యత్తులో మళ్లీ మీకు ఇబ్బంది కలిగించకుండా ఉండగలరా? అని తర్కించుకుంటారు. ఎ. అవును బి. కాదు 4. పాజిటివ్‌గా ఆలోచించటానికే ప్రయత్నిస్తారు. ఈ విధమైన ఆలోచనల ద్వారా క్షమాగుణాన్ని పెంపొందించుకుంటారు. ఎ. అవును బి. కాదు 5. క్షమించాలనుకున్నప్పుడు వారితో ముఖాముఖి లేదా ఫోన్లో మాట్లాతారు. ఎ. అవును బి. కాదు 6. అప్పుడప్పుడు కలుసుకోవటం ద్వారా వారితో పూర్వపు సంబంధాలు కొనసాగించే ప్రయత్నం చేస్తారు. ఎ. అవును బి. కాదు 7. మీ సమస్యను తీర్చగలరనుకున్న వారికి ఈ సంగతి చెప్పి సలహాలు పొందుతారు. ఎ. అవును బి. కాదు 8. క్షమాగుణం వల్ల కలిగే అనుభూతి గొప్పదనుకుంటారు. ప్రేమించటం ద్వారా మనసు తేలిక పడుతుందని మీకు తెలుసు. ఎ. అవును బి. కాదు 9. మిమ్మల్ని ఇబ్బందికి గురిచేసిన వారు అప్పుడు అలా ఎందుకు ప్రవర్తించారు? దానిలో మీ పాత్ర ఎంత? వంటివి గుర్తుచేసుకొని కారణాన్ని కనుగొనే ప్రయత్నం చేస్తారు. ఎ. అవును బి. కాదు 10. మీకు– వారికి మధ్య ఉన్న అనుబంధం ఎంత దృఢమైన దో గుర్తిస్తారు. తిరిగి వారితో రిలేషన్ కొనసాగించటం మీకు ఆనందమే. ఎ. అవును బి. కాదు ‘ఎ’ సమాధానాలు ఏడు వస్తే మీలో క్షమించే గుణం ఉంటుంది. మిమ్మల్ని అవమానించిన/బాధ పెట్టిన వారిని క్షమించేస్తారు. ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. ‘బి’ లు ‘ఎ’ ల కన్నా ఎక్కువ వస్తే క్షమించే తత్వం తక్కువే. మీకు ఇబ్బంది కలిగించిన వారిని ఎట్టి పరిస్థితుల్లో క్షమించలేరు. దీనివల్ల ప్రశాంతంగా ఉండటం మీ వల్ల కాదు. కానీ... ఫర్గివ్నెస్ ఎలా ఉంటుందో ప్రయత్నించి చూడండి. -
ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌కు క్షమాపణ చెప్పాలి
ఉద్యమనేతపై నిందలు వేస్తే తరిమికొడతాం పురుషోత్తమ్‌రెడ్డి పై టీఆర్ఎస్వీ ఫైర్ హన్మకొండ చౌరస్తా : నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అహర్నిశలు కృషి చేస్తున్న ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ పై అర్ధరహిత నిందారోపణలు చేసిన చైతన్య విద్యా సంస్థల చైర్మ¯ŒS సీ.పురుషోత్తమ్‌రెడ్డి తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని టీఆర్ఎస్వీ రాష్ట్ర సెక్రటరీ జనరల్ వాసుదేవరెడ్డి హెచ్చరిం చారు. హన్మకొండ నయింనగర్‌లోని టీఆర్ఎస్ అర్బ¯ŒS పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలపై తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే పురుషోత్తమ్‌రెడ్డిని ఎప్పుడు డబ్బులు అడిగాడో ఆధారాలుంటే బయట పెట్టాలన్నారు. అక్రమంగా నాలాలపై నిర్మాణాలు చేయడమే కాకుండా నిరాధారమైన నిందలు వేస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు. మరోసారి ఇలాం టివి వేస్తే నగరంలో ఉండకుండా తరిమికొడతామన్నారు. నాడు తెలం గాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో సైతం పురుషోత్తమ్‌రెడ్డి కలిసి రాకుండా సీఎం కేసీఆర్ పై వ్యంగస్త్రాలు వేశాడని మండిపడ్డారు. ఉద్యమానికి మద్దతుగా కళాశాల బంద్ పాటించాలని కోరినందుకు విద్యార్థి నేతలపై అక్రమ కేసులు పెట్టించారని మండిపడ్డారు. ఆయన నిర్మాణాలు సక్రమమైతే ప్రజలు, అధికారుల ముందు ఆధారాలు ఉంచాలని సూచించారు. హైదరాబాద్ మాదిరిగానే వరంగల్‌లో సైతం నాలాల ఆక్రమణతో సంభవించిన నష్టం రూ.50 కోట్ల పైనే ఉంటుందన్నారు. సమావేశంలో టీఆర్ఎస్వీ నేతలు వీరేందర్, రాజగోపాల్, ప్రశాంత్, రంజిత్, దామోదర్, విష్ణు, చంద్రకిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
క్షమించమని వీడియో పెట్టిన స్టార్ క్రికెటర్
దుబాయ్: టీ20 ప్రపంచకప్ లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు వైఫ్యలంపై కోచ్ వకార్ యూనిస్ బహిరంగ క్షమాపణ చెప్పిన నేపథ్యంలో కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది కూడా అదే బాటలో నడిచాడు. తనను మన్నించాలని పాకిస్థాన్ ప్రజలను వేడుకున్నాడు. అంచనాలకు తగ్గట్టు ఆడలేకపోయామని వాపోయామంటూ తన ట్విటర్ పేజీలో వీడియో సందేశం పోస్టు చేశాడు. 'నా గురించి ఇతరులు ఏమనుకున్నా నేను లెక్క చేయను. కానీ మీకు(పాకిస్థాన్ ప్రజలకు) జవాబుదారీగా ఉండాలనుకుంటున్నా. ఈ రోజు నన్ను క్షమించమని కోరుతున్నా. టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ టీమ్, నేను అంచనాలకు తగినట్టు ఆడలేకపోయాం' అంటూ బ్రీఫ్ వీడియో ద్వారా వేడుకున్నాడు. తానెప్పుడూ దేశం కోసమే ఆడానని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆడలేదని అన్నాడు. 20 ఏళ్ల నుంచి స్టార్ హోదా మోస్తున్నానని పేర్కొన్నాడు. ప్రస్తుతం దుబాయ్ లో ఉన్న అతడు స్వదేశానికి రాగానే కెప్టెన్సీ నుంచి తప్పించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) భావిస్తోంది. 36 ఏళ్ల ఆఫ్రిది టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో భారత్ లో పలు వివాదాలు ఎదుర్కొన్నాడు. -
గవర్నర్‌ను ఇక క్షమాభిక్ష కోరను
ముంబై: క్షమాభిక్ష కోసం మహారాష్ట్ర గవర్నర్ ముందు భవిష్యత్తులో పిటిషన్ దాఖలు చేయనని, తన తరఫున ఎవరూ ఆ ప్రయత్నం చేయొద్దని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ శుక్రవారం స్పష్టం చేశారు. క్షమాభిక్ష కోరుతూ సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూ దాఖలు చేసిన దరఖాస్తును ఆ రాష్ట్ర గవర్నర్ తిరస్కరించడం తెలిసిందే. ఇంకెప్పుడూ కట్జూగాని, దత్ కుటుంబసభ్యులుగాని దత్ తరఫున గవర్నర్ ముందు క్షమాభిక్ష పిటిషన్లు దాఖలు చేయవద్దని ఆయన న్యాయవాదులు తెలిపారు. త్వరలో దత్ జైలు శిక్షాకాలం పూర్తి అవుతుందన్నారు. 1993 బాంబు పేలుళ్లకు సంబంధించి సంజయ్ దత్ పుణేలోని ఎరవాడ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. -
సాయికిరణ్ హత్యపై క్షమాపణ
* స్పందించిన అమెరికా అధికారులు * రేపు రాత్రికి చేరనున్న మృతదేహం సాక్షి, హైదరాబాద్: అమెరికాలోని ఫ్లోరిడాలో హైదరాబాద్ విద్యార్థి సాయికిరణ్ దారుణ హత్యపై అక్కడి ప్రభుత్వం స్పందించింది. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నామని అమెరికా అధికారులు శుక్రవారం సాయికిరణ్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి క్షమాపణలు తెలిపారు. 5 వేల డాలర్లు తక్షణ పరిహారంగా కుటుంబీకులకు అందించనున్నట్లు ప్రకటించారు. ఘటనపై విచారణాధికారిని నియమించినట్లు చెప్పారు. దర్యాప్తు వివరాలను సైతం తెలియపరుస్తామని తెలిపారు. సాయికిరణ్ మృతదేహాన్ని శుక్రవారం రాత్రి పంపిస్తున్నట్లుగా తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం అందించారు. శనివారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకుంటుందన్నారు. -
ప్రేమ.. క్షమ.. దాతృత్వం
►పవిత్ర ఖురాన్లో మహమ్మద్ ప్రవక్త పేర్కొన్నది ఇవే.. ►నేటి నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభం మతం ఏదైనా చెప్పే నీతి ఒక్కటే. మనిషిగా పుట్టినవారు సన్మార్గంలో నడవాలని. ముస్లింల పవిత్ర ఖురాన్లో మహ్మద్ ప్రవక్త దీన్నే ప్రస్తావించారు. రుజు మార్గాలను చూపే సత్యాసత్యాలను వేరుపరిచే స్పష్టమైన ఉపదేశాలు ఖురాన్లో ఉన్నాయి. రంజాన్ మాసంలోనే పవిత్ర ఖురాన్ అవతరించింది. ముస్లింలకు అత్యంత ముఖ్యమైన మాసం రంజాన్. ఈ నెలలో ముస్లింలు ధార్మిక చింతన, ప్రేమ, సౌభ్రాతృత్వం, దానగుణం, క్రమశిక్షణ, పరోపకారంతో ఉంటారు.శుక్రవారం నుంచి రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో ముస్లింలు ఉపవాసాలకు సిద్ధమవుతున్నారు. - కనిగిరి రోజా(ఉపవాస దీక్ష) సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఎటువంటి ఆహార పానీయాలు ముట్టకుండా(కఠోర దీక్ష) ఉపవాసాన్ని పాటిస్తారు. లాలాజలంకూడా మింగరు. అత్యంత నిష్టతో ఉపవాసాన్ని(రోజా) ఆచరిస్తారు. సూర్యోదయానికి ముందు సహార్ అని, సూర్యాస్తమయం తర్వత ఇఫ్తార్ అని పిలుస్తారు. రోజా ఉండేవారు సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత మాత్రమే ఏదైనా ఫలాహారం తీసుకుంటారు. రోజుకు కనీసం 13 గంటలపాటు ఉమ్మి కూడా మింగకుండా కఠోర దీక్ష చేస్తారు. రోజా పాటించేవారు మనసును భగవంతునిపై లగ్నంచేసి చెడు ఆలోచనలకు దూరంగా ఉంటారు. సాధ్యమైనంత ఎక్కువ సమయాన్ని మసీదుల్లో, దైవ ధ్యానంలో గడుపుతారు. తద్వారా భగవంతునిపై భక్తి, విశ్వాసం, భగవంతుని దృష్టిలో అందరూ సమానం అనే భావన పెంపొందుతుంది. పేద, ధనిక, స్త్రీ, పురుష అనే తారతమ్యం లేకుండా ముస్లింలంతా రోజాను ఆచరిస్తారు. అంతేగాక రంజాన్ నెలలో మరికొన్ని ముఖ్య నియమాలను కూడా ముస్లింలు నిబద్ధతతో పాటిస్తారు. జకాత్ ముస్లింలలో మరీ ముఖ్యమైన సంప్రదాయం జకాత్. ప్రతి వ్యక్తి తన లాభార్జనలో కొంత మేర నిరుపేదలకు దాన, ధర్మాలు చేయడాన్ని జకాత్‌గా పిలుస్తారు. ప్రతి మనిషి తనలాగే ఉన్నతుడు కావాలని కోరుకోవడం ఈ జకాత్ ప్రధాన ఉద్దేశం. జకాత్ నిధితో నిరుపేదలకు వస్తువుల రూపంలో గానీ, నగదు రూపంలో గానీ దానం చేస్తారు. అయితే దానస్వీకర్తల పేర్లను గోప్యంగా ఉంచడమే దీని ప్రధాన నియమం. రంజాన్ నెలలోనే జకాత్ ఇస్తారు. ఫిత్ర్ రంజాన్ మాసం చివరి రోజున జరుపుకునే పర్వదినం ఈద్-ఉల్-ఫిత్.్ర దేవుని అనుగ్రహం కోసం, కృతజ్ఞతగా నిరుపేదలకు ఫిత్(్రదానం) ఇస్తారు. ప్రతిఒక్కరూ కనీసం రెండు కిలోల గోదుమలు లేదా దానికి సమాన మైన ఇతర ఆహార ధాన్యాలు లేదా నగదు దానం చేస్తారు. రంజాన్‌ను ప్రతి ముస్లిం లోటు లేకుండా సంతోషంగా జరుపుకునేందుకు చేయాల్సిన దాన, ధర్మాలను ఇస్లాం మతం ఉద్బోధిస్తుంది. ఎహ్ తే కాఫ్ ముస్లిం సోదరులు రోజూ ఐదుసార్లు నమాజ్(ఉదయం ఫజర్, మధ్యాహ్నం జోహర్, సాయంత్రం 5 గంటలకు అసర్, రాత్రి 6.30 గంటలకు మగ్రీబ్, రాత్రి 8 గంటలకు ఇషా నమాజ్) చేస్తారు. అయితే రంజాన్ నెలలో ఇషా నమాజ్ తర్వాత, ప్రత్యేకంగా ఎంతో నిష్టతో మరో 20 రకాత్లు తరావీహ్ నమాజ్ చేస్తారు. ఈ నెలలో 21వ రోజు నుంచి నెల చివరి వరకు ఎ్హ తే కాఫ్(తపోనిష్ట) పాటిస్తారు. మసీద్‌లోనే పూర్తి సమయాన్ని గడపుతూ.. ప్రార్థనల్లో దివ్య ఖురాన్(దైవ గ్రంథాలు) చదువుతూ ఉపవాస దీక్షలో నిమగ్నమవుతారు. తప్పనిసరి పరిస్థితిల్లో మాత్రమే మసీద్ నుంచి బయటకు అడుగుపెడతారు. షబ్ ఎ ఖద్ రంజాన్ మాసంలో అత్యంత ముఖ్యమైన రోజు షబ్ ఎ ఖద్.్ర ఈ నెలలో 27వ రోజున దివ్వ ఖురాన్ ఆవిర్భవించిందని ప్రతీతి. ఆ రోజును షబ్ ఎ ఖదర్‌గా పిలుస్తారు. షబ్ ఎ ఖద్ ్రరాత్రంతా నమాజ్‌తో జాగారం చేస్తారు. ఈ ఒక్కరాత్రి కఠోర దీక్షతో చేసిన ప్రార్థన వల్ల లభించే ఫలితం మనిషి జీవితంలో 83 ఏళ్లపాటు చేసిన ఉపవాస దీక్షతో సమానమని, షబ్ ఎ ఖద్ ్రరోజున దైవ ద్యానంలో గడిపితే జీవితంలో తెలియక చేసిన తప్పులను భగవంతుడు క్షమిస్తాడనేది ముస్లింల నమ్మకం. ఇఫ్తార్ ప్రత్యేకత రంజాన్ మాసంలో ముస్లీంసోదరులు ఉపవాసదీక్షను విరమింప చేసే కార్యక్రమాన్నే ఇఫ్తార్ అంటారు. ఈ ఇఫ్తార్ సమయంలో తీసుకునే ఆహారాన్ని దీక్ష వాసులకు అందించడం కూడా పుణ్యకార్యంగా భావిస్తారు. ఇఫ్తార్ విందును.. ముస్లింలే కాకుండా ఇతరులు కూడా రోజా ఆచరించిన వారికి ఇస్తుంటారు. -
అందంగా కనపడితే.. క్షమించేస్తారు!
తప్పులు చేయడం మానవ సహజం. అయితే.. కాస్త అందంగా, ఆకర్షణీయంగా ఉండేవాళ్లు తప్పు చేస్తే మాత్రం వాళ్లను మహిళలు ఈజీగా క్షమించేస్తారట! ఈ విషయం కొత్త పరిశోధనలో తేలింది. అమెరికాలోని ఈస్ట్రన్ కెంటకీ యూనివర్సిటీకి చెందిన జెరెమీ గిబ్సన్, జొనాథన్ గోర్ అనే పరిశోధకులు ఈ అంశంపై విస్తృతంగా శోధించారు. ఎవరైనా ఒక వ్యక్తి తప్పు చేస్తే అతడిని క్షమించాలా.. వద్దా అనే విషయం వాళ్లు ఎంత అందంగా ఉన్నారనేదానిపై ఆధారపడుతుందట. అంత అందంగా లేనివాళ్లను కొంత సేపటి వరకు క్షమిస్తారని, అసభ్యంగా ప్రవర్తిస్తే మాత్రం చెంపదెబ్బలు తప్పవని గిబ్సన్ అంటున్నారు. దీనికోసం మొత్తం 170 కాలేజీలకు చెందిన అమ్మాయిలు, అబ్బాయిల మీద పరిశోధన చేశారు. బాగా ఆకర్షణీయంగా ఉండేవాళ్లు, అసలు ఉండని వాళ్ల ముఖాలు చూపించి.. సందర్భాలు కూడా సృష్టించి ఇచ్చారు. అలాంటి సమయాల్లో అమ్మాయిల రియాక్షన్లు ఎలా ఉన్నాయో గమనించి.. తమ పరిశోధన నివేదికను సమర్పించారు. వీరి పరిశోధన స్ప్రింగర్స్ జర్నల్‌లో ప్రచురితమైంది. -
ఆ రేపిస్టులను క్షమించండి: నన్
కోలకతా: తనపై లైంగికదాడి చేసిన వారిని క్షమించాలని కోల్‌కతాలో అత్యాచారానికి గురైన నన్ కోరింది. తనకు వారిపై ఎలాంటి ద్వేషం లేదని పేర్కొంది. రాణాఘాట్లోని ఓ కాన్వెంట్ స్కూల్లో పనిచేస్తున్న ఆమెపై కొందరు వ్యక్తులు సామూహిక లైంగిక దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ ఘటన బెంగాల్లో సంచలనం కూడా సృష్టించింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె గుండెల్లో పెద్ద బాధ ఉన్నప్పటికీ .. దానిని పక్కన పెట్టేసి పెద్ద మనసుతో వారిని క్షమించాలని కోరింది. 'నా హృదయం పగిలిపోయింది. నా రక్షణకంటే నా పాఠశాల, అందులో చదువుతున్న పిల్లల భద్రతపైనే నాకు తీవ్ర ఆందోళనగా ఉంది' అని ఆమె పేర్కొన్నారు. ఇంత పెద్ద సంఘటనలో కూడా మౌనంగా, నిర్మలమైన మనస్సుతో కనిపించడం ఆమె మనోధైర్యానికి నిదర్శనం అని ఆమెకు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లు చెప్తున్నారు. -
‘మంత్రి ఆంజనేయ క్షమాపణ చెప్పాలి’
దావణగెరె : గోమాతను పూజించేవారు పూజించవచ్చని, తినేవారు తినవచ్చని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి హెచ్.ఆంజనేయ వెంటనే హిందువులకు క్షమాపణ చెప్పాలని అఖిల భారత హిందూ మహాసభకు చెందిన ప్రణవానంద స్వామీజీ డిమాండ్ చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మంత్రి కేవలం ఒక వర్గాన్ని బుజ్జగించేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబుగా లేదని అన్నారు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న మంత్రి భారతీయ పరంపరలో గోమాతకు ఉన్న ప్రాధాన్యత గురించి తెలుసుకుని మాట్లాడాలన్నారు. గోమాత గురించి అవహేళనకరంగా మాట్లాడిన ఆంజనేయను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో మహాసభ పదాధికారులు ప్రశాంత్, కొట్రేష్, రంగస్వామి, కల్లింగప్ప తదితరులు పాల్గొన్నారు. -
క్షమాపణకు త్వరపడండి
ఇస్లాం వెలుగు పశ్చాత్తాపం చెందే విషయంలో, క్షమాపణ వేడుకునే విషయంలో ఎంతమాత్రం ఆలస్యం చేయకూడదు. ఎందుకంటే ఎప్పుడు ఏమి జరుగుతుందో, ఆచరణకు అవకాశాలు ఎప్పుడు మూసుకుపోతాయో ఎవరికీ తెలియదు. మనిషన్న తర్వాత ఏదో ఒక తప్పు జరుగుతూనే ఉంటుంది. పొరపాటునో, గ్రహపాటునో ఏదో ఒక తప్పిదం దొర్లి పోవడం మానవ సహజం. మానవమాతృలెవరూ దీనికి అతీతులు కాదు. కావాలని కాక, కాకతాళీయంగా జరిగిన చిన్న చిన్న తప్పుల్ని దైవం క్షమిస్తాడు. కానీ తెలిసి, కావాలని మాటిమాటికీ బుద్ధిపూర్వకంగా తప్పులు చే సేవారిని మాత్రం క్షమించడు. కొంతమంది తమ తప్పును తెలుసుకుని పశ్చాత్తాపపడి, దానిని సరిదిద్దుకుంటే, మరి కొంతమంది తప్పును అస్సలు అంగీకరించనే అంగీకరించరు. ఒక తప్పును సమర్థించుకోడానికి మళ్లీ మళ్లీ తప్పులు చేస్తారు. ఎవరైనా తప్పును తమ దృష్టికి తీసుకువస్తే దాన్ని కప్పిపుచ్చుకోడానికి వితండవాదం చేస్తారు తప్ప ఎట్టి పరిస్థితిలోనూ తమను తాము సంస్కరించుకోడానికి ప్రయత్నించరు. కొద్దిమంది మాత్రమే విమర్శను స్వీకరించి సరిదిద్దుకుంటారు. సద్విమర్శను స్వీకరించడం వల్ల తప్పు తెలుసుకునే అవకాశం దొరుకుతుంది. ఈ విధంగా తప్పును ఒప్పుకుని, పశ్చాత్తాపపడినవారే నిజమైన విశ్వాసులు. విశ్వాసుల గురించి పవిత్ర ఖురాన్ ఇలా అంటుంది. ‘వారి వల్ల ఏదైనా నీతిమాలిన పని గానీ, పాపకార్యం గానీ జరిగిపోతే, వెంటనే వారు అల్లాహ్‌ను స్మరించి, క్షమాపణ వేడుకుంటారు. అంతేగానీ తాము చేసినదానిపై వారు మంకుపట్టు పట్టరు.’’ (3-135). మరొక చోట ఇలా ఉంది. ‘‘దైవభీతిపరుల మదిలో ఎప్పుడైనా సైతాన్ ప్రేరణ వల్ల ఏదైనా దురాలోచన జనిస్తే, వెంటనే వారు అప్రమత్తులై పోతారు. ఆ తరువాత అనుసరించాల్సిన విధానం ఏమిటో వారికి స్పష్టంగా తెలిసిపోతుంది.’’ (7-201). ‘‘మీరు అల్లాహ్‌ను క్షమాపణ కోరుకుని ఆయన వైపునకు మరలండి. నిస్సందేహంగా మీ ప్రభువు అమిత దయామయుడు. ఆయనకు తన దాసుల పట్ల అపారమైన ప్రేమానురాగాలున్నాయి. (11-90). మరొకచోట ఇలా ఉంది. ‘‘ఆత్మలకు అన్యాయం చేసుకున్న నా దాసులారా! దైవ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. దైవం తప్పకుండా మీ పాపాలన్నిటినీ క్షమిస్తాడు. ఆయన గొప్ప క్షమాశీలి. అమిత దయాళువు. కనుక మీపై (దైవ) శిక్ష వచ్చి, మీకు ఎలాంటి సహాయం లభించని పరిస్థితి రాక ముందే పశ్చాత్తాపంతో మీ ప్రభువు వైపు మరలండి. ఆయనకు పూర్తిగా విధేయులైపొండి.’’ (39-54). ఈ పవిత్ర ఖురాన్ వాక్యాల ద్వారా తెలిసేదేమిటంటే, సాధ్యమైనంత మేర ఏ తప్పూ జరక్కుండా ఉండడానికి శక్తి వంచన లేని ప్రయత్నం చేయాలి. ఒక వేళ తెలిసో తెలియకో తప్పు దొర్లిపోతే వెంటనే సరిదిద్దుకోవాలి. పశ్చాత్తాపం చెందే విషయంలో, క్షమాపణ వేడుకునే విషయంలో ఎంతమాత్రం ఆలస్యం చేయకూడదు. ఎందుకంటే ఎప్పుడు ఏమి జరుగుతుందో, ఆచరణకు అవకాశాలు ఎప్పుడు మూసుకుపోతాయో ఎవరికీ తెలియదు. రానున్న క్షణం మనుగడకు హామీ ఇస్తుందో, మృత్యువునే తెస్తుందో తెలియదు. కనుక శ్వాస ఉండగానే ఆశతో సాగిలపడి దైవాన్ని క్షమాపణ వేడుకోవాలి. జరిగిపోయిన తప్పుల పట్ల మనస్ఫూర్తిగా పశ్చాత్తాప పడాలి. సిగ్గుపడాలి. ఇకముందు అలాంటి తప్పులు జరగని విధంగా గాఢమైన నిర్ణయం తీసుకుని, దానిపైనే స్థిరంగా ఉండాలి. భావి జీవితాన్ని సంస్కరించుకుంటూ అడుగడుగునా సింహావలోకనం చేసుకుంటూ, సాధ్యమైనంత వరకు సత్కార్యాల్లో లీనమవ్వాలి. దానధర్మాలు చేస్తూ ఉండాలి. ఈ విధంగా మనసా, వాచా, కర్మణా చిత్తశుద్ధితో దైవక్షమాపణ వేడుకుని, ఆశావహదృక్పథంతో, ధర్మబద్ధమైన జీవితం గడిపితే ఇహలోకంలోను, పరలోకంలోనూ దైవ ప్రసన్నతను పొంది, శాశ్వతమైన సుఖాలకు పాత్రులమయ్యే అవకాశం ఉంది. - మహమ్మద్ ఉస్మాన్‌ఖాన్ -
నా కళ్లు నన్ను పట్టిస్తాయి!
సంక్షిప్తం మీ గురించి ఎక్కువమందికి తెలియని రెండు విషయాలు? 1.ఆరవతరగతిలో క్లాస్ ఫస్ట్ వచ్చాను. 2.ఒకానొక సమయంలో నా బరువు 70 కిలోలు! క్షమాపణ చెప్పవలసి వస్తే.... మా అమ్మకు చెబుతాను. కొన్ని వందల పొరపాట్లు చేసి ఉంటాను. అబద్ధాలు ఆడడంలో ప్రావీణ్యం ఉందా? ఎంతమాత్రం లేదు. నేను అబద్ధం ఆడినప్పుడల్లా నా కళ్లు నిజం చెప్పేసి నన్ను పట్టిస్తాయి. మీకు నచ్చిన ప్రదేశం? మనసు ప్రశాంతంగా ఉండే ప్రదేశం. బాగా నచ్చిన ప్రణయగీతం... ‘ఆంధీ’ చిత్రంలోని తేరే బినా జిందగీ సే కోయి... పాట. ఒకే ఒక ఉత్తరం రాయాల్సి వస్తే ఎవరికి రాస్తారు? ఏమని రాస్తారు? నా భర్తకు రాస్తాను. నాకోసం అతను చేసిన ప్రతి పనిని గుర్తు తెచ్చుకొని కృతజ్ఞత చెప్పుకుంటాను. - ట్వింకిల్ ఖన్నా