మీలో క్షమాగుణం ఉందా?
సెల్ఫ్ చెక్
క్షమాగుణం చాలా గొప్పది. పగ, కసి, ద్వేషం, ప్రేమరాహిత్యం వంటివి క్షమ ద్వారా దూరం అవుతాయి. క్షమించే గుణం ఉంటే మన చుట్టూ ఉన్న వాతావరణం సానుకూలంగా కనిపిస్తుంది. దీర్ఘకాలంగా ఆత్మీయులతో దూరంగా ఉన్నప్పుడు వారిని క్షమించగలిగితే తిరిగి పూర్వపు అనుబంధాలను సొంతం చేసుకోవటం కష్టమేమీ కాదు. మీలో క్షమాగుణం ఎంతమేర ఉందో ఒకసారి చెక్ చేసుకోండి.
1. మీకు హాని చేసిన వ్యక్తి మీ ముందుకు వచ్చి క్షమించమంటే సహనంతో ఉండగలరు.
ఎ. అవును బి. కాదు
2. గతాన్ని ఒకసారి పరికించుకొని వారిని క్షమించే ప్రయత్నం చేస్తారు.
ఎ. అవును బి. కాదు
3. మీరు క్షమించాలనుకొనే వ్యక్తి భవిష్యత్తులో మళ్లీ మీకు ఇబ్బంది కలిగించకుండా ఉండగలరా? అని తర్కించుకుంటారు.
ఎ. అవును బి. కాదు
4. పాజిటివ్‌గా ఆలోచించటానికే ప్రయత్నిస్తారు. ఈ విధమైన ఆలోచనల ద్వారా క్షమాగుణాన్ని పెంపొందించుకుంటారు.
ఎ. అవును బి. కాదు
5. క్షమించాలనుకున్నప్పుడు వారితో ముఖాముఖి లేదా ఫోన్‌లో మాట్లాతారు.
ఎ. అవును బి. కాదు
6. అప్పుడప్పుడు కలుసుకోవటం ద్వారా వారితో పూర్వపు సంబంధాలు కొనసాగించే ప్రయత్నం చేస్తారు.
ఎ. అవును బి. కాదు
7. మీ సమస్యను తీర్చగలరనుకున్న వారికి ఈ సంగతి చెప్పి సలహాలు పొందుతారు.
ఎ. అవును బి. కాదు
8. క్షమాగుణం వల్ల కలిగే అనుభూతి గొప్పదనుకుంటారు. ప్రేమించటం ద్వారా మనసు తేలిక పడుతుందని మీకు తెలుసు.
ఎ. అవును బి. కాదు
9. మిమ్మల్ని ఇబ్బందికి గురిచేసిన వారు అప్పుడు అలా ఎందుకు ప్రవర్తించారు? దానిలో మీ పాత్ర ఎంత? వంటివి గుర్తుచేసుకొని కారణాన్ని కనుగొనే ప్రయత్నం చేస్తారు.
ఎ. అవును బి. కాదు
10. మీకు– వారికి మధ్య ఉన్న అనుబంధం ఎంత దృఢమైన దో గుర్తిస్తారు. తిరిగి వారితో రిలేషన్ కొనసాగించటం మీకు ఆనందమే.
ఎ. అవును బి. కాదు
‘ఎ’ సమాధానాలు ఏడు వస్తే మీలో క్షమించే గుణం ఉంటుంది. మిమ్మల్ని అవమానించిన/బాధ పెట్టిన వారిని క్షమించేస్తారు. ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. ‘బి’ లు ‘ఎ’ ల కన్నా ఎక్కువ వస్తే క్షమించే తత్వం తక్కువే. మీకు ఇబ్బంది కలిగించిన వారిని ఎట్టి పరిస్థితుల్లో క్షమించలేరు. దీనివల్ల ప్రశాంతంగా ఉండటం మీ వల్ల కాదు. కానీ... ఫర్‌గివ్‌నెస్ ఎలా ఉంటుందో ప్రయత్నించి చూడండి.