
వర్షాల కారణంగా మాచవరంలో దెబ్బతిన్న ట్రాక్
మరమ్మతుల తర్వాత కదిలిన రైలు
బాపట్ల టౌన్: వర్షాల కారణంగా ట్రాక్ దెబ్బతినడంతో బాపట్ల ప్రాంతంలో వందేభారత్ రైలు సుమారు గంటన్నరకుపైగా నిలిచిపోయింది. చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తున్న వందేభారత్ రైలు సోమవారం సాయంత్రం 6.12 గంటలకు ఒంగోలు నుంచి బయలుదేరింది. 7.45 గంటలకు గుంటూరు చేరుకోవాల్సి ఉంది.
7 గంటలకు పొన్నూరు మండలం మాచవరం రైల్వేస్టేషన్ ప్రాంతానికి చేరుకునే సమయానికి మాచవరం సమీపంలో ట్రాక్ దెబ్బతిన్న సమాచారం అందుకున్న లోకో పైలట్ రైలు నిలిపేశాడు. ట్రాక్ ఏ ప్రాంతంలో దెబ్బతిందో.. ఎంతమేర దెబ్బతిందనే విషయంపై స్పష్టమైన సమాచారం లేకపోవడంతో రైలును మాచవరం నుంచి అప్పికట్ల రైల్వేస్టేషన్ వరకు వెనక్కి తీసుకొచ్చారు. రాత్రి 8.30 గంటల సమయంలో ట్రాక్ మరమ్మతు చేయడంతో రైలు యధావిధిగా గుంటూరు వైపు ప్రయాణించింది.
Comments
Please login to add a commentAdd a comment