damage
-
పదేళ్లు.. ప్రకృతి నష్టం
సాక్షి, హైదరాబాద్: గత పదేళ్లలో ప్రకృతి వైపరీత్యం రాష్ట్రానికి పెద్ద నష్టమే చేసిందని గణాంకాలు చెబుతున్నాయి. వడగళ్లు, కరువు, భారీ వర్షాలు, క్లౌడ్ బరస్ట్, అకాల వర్షాలు, వరదలు, అధిక వేడి, పిడుగుల్లాంటి ఘటనల కారణంగా భారీ స్థాయిలో ఆస్తి, ప్రాణ నష్టాలు జరిగాయని ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 16వ ఆర్థిక సంఘానికి నివేదించిన లెక్కల ప్రకారం గత పదేళ్ల కాలంలో (2015–2024) ప్రకృతి వైపరీత్యాల కారణంగా వేల కోట్ల రూపాయల విలువైన నష్టం జరిగింది. ఒక్కో ఏడాది ఒక్కో రకమైన వైపరీత్యం కారణంగా ఇప్పటివరకు 371 మంది చనిపోయినట్టు ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక, మూగజీవాలు అయితే లక్షకు పైగా మృత్యువాత పడ్డాయి. మొత్తం 80 వేల ఇళ్లు పాక్షికంగా, పూర్తిగా ధ్వంసమయ్యాయి. దాదాపు 40 లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగింది. వీటన్నింటి విలువ రూ.1,500 కోట్ల వరకు ఉందని ప్రభుత్వ నివేదికలో పేర్కొన్న గణాంకాలు వెల్లడిస్తున్నాయి. -
నిలిచిన వందేభారత్
బాపట్ల టౌన్: వర్షాల కారణంగా ట్రాక్ దెబ్బతినడంతో బాపట్ల ప్రాంతంలో వందేభారత్ రైలు సుమారు గంటన్నరకుపైగా నిలిచిపోయింది. చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తున్న వందేభారత్ రైలు సోమవారం సాయంత్రం 6.12 గంటలకు ఒంగోలు నుంచి బయలుదేరింది. 7.45 గంటలకు గుంటూరు చేరుకోవాల్సి ఉంది.7 గంటలకు పొన్నూరు మండలం మాచవరం రైల్వేస్టేషన్ ప్రాంతానికి చేరుకునే సమయానికి మాచవరం సమీపంలో ట్రాక్ దెబ్బతిన్న సమాచారం అందుకున్న లోకో పైలట్ రైలు నిలిపేశాడు. ట్రాక్ ఏ ప్రాంతంలో దెబ్బతిందో.. ఎంతమేర దెబ్బతిందనే విషయంపై స్పష్టమైన సమాచారం లేకపోవడంతో రైలును మాచవరం నుంచి అప్పికట్ల రైల్వేస్టేషన్ వరకు వెనక్కి తీసుకొచ్చారు. రాత్రి 8.30 గంటల సమయంలో ట్రాక్ మరమ్మతు చేయడంతో రైలు యధావిధిగా గుంటూరు వైపు ప్రయాణించింది. -
వాయుగుండాలు.. పెనుగాలులు.. క్లౌడ్ బరస్ట్!
సాక్షి, హైదరాబాద్: ములుగు జిల్లా ఏటూరునాగారం–తాడ్వాయి అటవీ ప్రాంతంలోని 332 హెక్టార్ల పరిధిలో ఆగస్టు 31న సుమారు 50 వేల చెట్లు నేలకూలడానికి గల శాస్త్రీయ కారణాలపై శాస్త్రవేత్తలు, నిపుణులు అటవీశాఖ అధికారులతో చర్చించారు. మంగళవారం హైదరాబాద్‌లోని అరణ్య భవన్లో పీసీసీఎఫ్ డోబ్రియాల్ ఆధ్వర్యంలో ఈ అంశంపై వర్క్‌షాప్ జరిగింది. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ ఉన్నతాధికారులు, రిటైర్డ్ అధికారులు, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ), జాతీ య వాతావరణ పరిశోధన ప్రయోగశాల (ఎన్ఏఆర్ఎల్), ఎ¯న్జీఆర్ఐ, ఐఎండీ శాస్త్రవేత్తలు, ఎ¯న్ఐటీ వరంగల్, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఏకకాలంలో ఏర్పడిన వాయుగుండాల వల్ల పెను గాలులు వీయడంతోపాటు కుంభవృష్టి (క్లౌడ్ బరస్ట్ ) వర్షాలు కురవడం వల్లే ఈ ఘటన చోటుచేసుకొని ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఏటూరునాగారం అటవీ ప్రాంతంలోని సారవంతమైన నేల కూడా భారీ స్థాయిలో చెట్లు కుప్పకూలేందుకు దారితీసిందని భావిస్తున్నట్లు చెప్పారు. అక్కడి నేలలో చెట్లు త్వరగా ఎదగడం వల్ల వాటి వేర్లు భూమి లోపలకు బదులు అడ్డంగా విస్తరించడం వల్ల చెట్లు 130– 140 కి.మీ. వేగంతో వీచిన పెను గాలులను తట్టుకోలేక పడిపోయి ఉండొచ్చన్నారు. వాతావరణంలో వస్తున్న అనూహ్య మార్పులతో మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం అయ్యే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు. అయితే చెట్లు కూలిన ప్రదేశంలో సారవంతమైన భూమి ఉన్నందున చెట్ల పునరుజ్జీవనానికి తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. త్వరలో కేంద్ర, రాష్ట్రాలకు నివేదిక.. పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియాల్ మాట్లాడుతూ చెట్లు నేలకొరిగిన ప్రాంతంలో కలుపు మొక్కల నివారణకు చర్యలు తీసుకోవాలని తద్వారా చెట్లు త్వర గా పెరిగే అవకాశం ఉంటుందని అటవీ సిబ్బందిని ఆదేశించారు. అంతకుముందు ములుగు డీఎఫ్‌వో రాహుల్ కిషన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అటవీ నష్టాన్ని శాస్త్రవేత్తలకు వివరించారు. వర్క్‌షాపులో వెల్లడైన అభిప్రాయాలు, సూచనలతో త్వరలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక సమరి్పంచాలని అటవీ శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. -
సహాయక చర్యలపై ప్రజలు సంతృప్తి
సాక్షి, అమరావతి: వరద నష్టం ఎన్యూమరేషన్ పక్కాగా జరగాలని, నష్టపోయిన ప్రతి బాధితునికి ప్రభుత్వ సాయం అందేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వరద నష్టం ఎన్యూమరేషన్, బాధితులకు పరిహారంపై సీఎం చంద్రబాబు శుక్రవారం సచివాలయంలో మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరదల కారణంగా 2,13,456 ఇళ్లు నీట మునిగాయని, ఇప్పటి వరకు 84,505 ఇళ్లలో నష్టం అంచనా లెక్కలు పూర్తయ్యాయని అధికారులు వివరించారు. వేలాది ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు పాడైపోయాయని, 2,14,698 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని, ఎన్యూమరేషన్లో రీ వెరిఫికేషన్ చేసి ప్రతి బాధితుడికి జరిగిన నష్టాన్ని సేకరిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ సహాయక చర్యలపై ప్రజలు సంతృప్తితో ఉన్నారని, పరిహారం విషయంలో కూడా శాస్త్రీయంగా ఆలోచన చేసి జాబితా రూపొందించాలని సూచించారు. నష్టం అంచనాలు పూర్తి చేస్తే ఈ నెల 17వ తేదీన బాధితులకు సాయం అందజేద్దామని పేర్కొన్నారు. రుణాలు రీషెడ్యూల్ చేయండి: సీఎం వరద బాధితులకు వివిధ ఏజెన్సీలు అందించే సర్వీసులపై శుక్రవారం సాయంత్రం విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎంఎస్ఎంఈలు నడుపుతున్న వ్యాపారులు తీవ్రంగా దెబ్బతిన్నారని, వారి బ్యాంక్ రుణాలు రీ షెడ్యూల్ చేయాలని, ఈఎంఐల చెల్లింపునకు గడువు ఇవ్వాలని బ్యాంకర్లకు సూచించారు. ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు సీఎం చంద్రబాబు శుక్రవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లారు. విజయవాడలోని కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష అనంతరం ఆయన బయలుదేరి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లారు. -
కేంద్ర ప్రభుత్వాన్ని రూ.6,880 కోట్లు అడిగాం
సాక్షి, అమరావతి: వరద నష్టాలను ప్రాథమికంగా అంచనా వేసి కేంద్రానికి నివేదిక పంపినట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. వరద వల్ల రాష్ట్రానికి రూ.6,880 కోట్ల నష్టం కలిగినట్టు ప్రాథమికంగా అంచనా వేశామని, ఈ మేరకు తక్షణ సాయం అందించాల్సిందిగా కేంద్రాన్ని కోరినట్టు తెలిపారు. ఆదివారం విజయవాడ కలెక్టరేట్లో మీడియాతో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ వినాయక చవితి రోజు బుడమేరు మూడో గండిని ఆర్మీ సాయంతో విజయవంతంగా పూడ్చినట్టు చెప్పారు. వరద వచ్చి వారం రోజులైనా తగ్గకపోవడంతో ప్రజలు ఆవేశంగా ఉన్నారని, శనివారం కూడా రాజరాజేశ్వరిపేటలో 4 అడుగుల నీరు ఉందని వ్యాఖ్యానించారు. రెండు రోజుల వర్షాలపై అప్రమత్తం చేశాంరానున్న రెండు రోజుల్లో శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించినట్టు సీఎం చెప్పారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనుండటంతో ఏలేరు రిజర్వాయర్ నిండి దిగువ ప్రాంతమైన పిఠాపురం పరిసర ప్రాంతాలకు వరద ప్రమాదం ఉందని హెచ్చరించారు.ఏలేరు నదికి సోమ, మంగళ వారాల్లో 10 వేల నుంచి 20 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే ఏలేరు రిజర్వ్యర్లో 21 టీఎంసీల నీరు ఉండటంతో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. బుడమేరు నుంచి వరద కొల్లేరుకు చేరుతుండటంతో నందివాడ మండలం ముంపునకు గురయ్యే అవకాశం ఉందన్నారు. విజయవాడ ముంపు ప్రాంతాల్లో వరద నీరు క్రమేపీ తగ్గుతోందని, వర్షాలు లేకపోతే సోమవారం సాయంత్రానికి మొత్తం నీరు లాగేస్తుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. రానున్న 36 గంటల్లో ఎంత వర్షం నీరు వస్తుందన్న అంచనాలు వేసుకుని దానికి అనుగుణంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్టు తెలిపారు.ఆపరేషన్ బుడమేరుభవిష్యత్లో విజయవాడకు వరద భయం లేకుండా ఆపరేషన్ బుడమేరు చేపడుతున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. బుడమేరు చుట్టుపక్కల ఆక్రమణలు తొలగించి నీరు వేగంగా వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. బుడమేరు సామర్థ్యాన్ని 10–15 వేల క్యూసెక్కులకు పెంచే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. -
8 శాఖలు.. రూ.339.46 కోట్లు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలతో ఎనిమిది శాఖల పరిధిలో ప్రధానంగా నష్టం ఎదురైందని అ«ధికార యంత్రాంగం గుర్తించింది. ఆయా శాఖల పరిధిలో రూ. 339.46 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేసింది. మొత్తంగా 15,201 ఇళ్లు దెబ్బతినగా అందులో పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ. 6,500, పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు రూ. 8 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని లెక్కగట్టింది. రెవెన్యూ, పశుసంవర్థక శాఖ, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, విద్య, వైద్యం, విద్యుత్, వ్యవసాయ, మత్స్య శాఖల పరిధిలో నష్టంపై ప్రభుత్వానికి యంత్రాంగం నివేదిక పంపింది. ముఖ్యంగా 53,528 మంది రైతులకు సంబంధించి 79,914 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారు. దీనివల్ల రూ. 111.87 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. జిల్లావ్యాప్తంగా వరదలతో 76 కి.మీ. మేర రోడ్లు దెబ్బతిన్నాయని ప్రభుత్వానికి నివేదించారు. అలాగే 45 చెరువులకు గండ్లు పడ్డాయని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం ప్రకటించిన నష్ట పరిహారంపై బాధితులు మండిపడుతున్నారు. వరద ఉధృతికి ఇళ్లు కొట్టుకుపోయిన తమకు ప్రభుత్వం అరకొర సాయం చేస్తే ఎలా సరిపోతుందని ప్రశి్నస్తున్నారు. -
కేంద్రం ఆదుకోవాలి... తక్షణ సాయం అందించాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వరద బీభత్సంతో అపారనష్టం వాటిల్లిందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు వివరించారు. రాష్ట్రంలో వరద నష్టం దాదాపు రూ.5,438 కోట్లు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేసినట్టు తెలిపారు. సమగ్రంగా అంచనాలు వేసిన తర్వాత ఈ నష్టం మరింత పెరిగే అవకాశముందన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు రాష్ట్రానికి వచి్చన కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్‌చౌహాన్, బండి సంజయ్‌తో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం సాయంత్రం సచివాలయంలో సమావేశమయ్యారు.ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రితో పాటు వివిధ విభాగాల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఖమ్మం, మహబూబ్‌నగర్, సూర్యాపేటతోపాటు పలు జిల్లాల్లో ఒకే రోజు అత్యధికంగా 40 సెంటీమీటర్ల వరకు వర్షం కురిసిందని, రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించటంతో భారీ ప్రాణనష్టం తప్పిందని, కానీ వరద నష్టం భారీగా జరిగిందని సీఎం వివరించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని దృశ్యాలను సమావేశంలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌తోపాటు ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా కేంద్ర మంత్రులకు చూపించారు.మహబూబాబాద్ జిల్లాలో వరదలో కట్ట కొట్టుకుపోవటంతో వేలాడుతున్న రైల్వే ట్రాక్ పరిస్థితిని, రైళ్ల రాకపోకలు నిలిచిపోయిన వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రదర్శించారు. తెగిన చెరువులు, కుంటలు, దెబ్బతిన్న రోడ్లు, వంతెనల తాత్కాలిక మరమ్మతులకు కేంద్ర ప్రభుత్వం తక్షణసాయం అందించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. వీటిని శాశ్వతంగా పునరుద్ధరించే పనులకు తగినన్ని నిధులు కేటాయించాలని కోరారు. ఆయిల్ పామ్ రైతులకు సరైన ధర కలి్పంచండి: తుమ్మల విన్నపం ఆయిల్ పామ్ రైతులకు సరైన ధర వచ్చే విధంగా చూడాలని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్సింగ్చౌహాన్కు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విన్నవించారు. తెలంగాణలో కొబ్బరి తోటలకు సంబంధించి ఒక రీజినల్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ట్రైబల్ వెల్ఫేర్ ఆర్గానిక్ ఫారి్మంగ్‌ను అశ్వారావుపేట (ట్రైబల్, నాన్ ట్రైబల్ శిక్షణ)లో ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన చౌహాన్ త్వరలోనే తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.నిబంధనలను సడలించాలి విపత్తు నిధులను రాష్ట్రాలకు విడుదల చేసే విషయంలో ఇప్పుడు అమల్లో ఉన్న నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సడలించాలని సీఎం రేవంత్‌రెడ్డి కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వరద బాధిత ప్రాంతాల్లో తక్షణ మరమ్మతులకు, శాశ్వత పునరుద్ధరణ పనులకు అంశాల వారీగా నిర్దేశించిన యూనిట్ రేట్లు కూడా పెంచాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో వరదలతో దెబ్బతిన్న చెరువులు, కుంటల తక్షణ మరమ్మతులకు కనీసం రూ.60 కోట్లు అవసరమవుతాయని, ఇప్పుడున్న నిర్ణీత రేట్ల ప్రకారం రూ.4 కోట్లు కూడా విడుదల చేసే పరిస్థితి లేదని అధికారులు వివరించారు. ఏపీకి ఎలా సాయం అందిస్తారో అదే తీరుగా తెలంగాణకూ కేంద్ర ప్రభుత్వం సాయం అందించాలని ముఖ్యమంత్రి కోరారు. విపత్తులు సంభవించినప్పుడు ఆపదలో ఉన్న ప్రజలకు సాయం చేసే విషయంలో పారీ్టలు, రాజకీయాలకు తావులేదని కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. -
ఎస్డీఆర్ఎఫ్ కింద రూ.3,448 కోట్లు
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన రెండు తెలుగు రాష్ట్రాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ నిధి (ఎస్డీఆర్ఎఫ్) కింద రూ.3,448 కోట్లు వెంటనే విడుదల చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని వరద ప్రాంతాల్లో పర్యటించడంతో పాటు అక్కడి రైతులను, ప్రజలను కలిసి పరిస్థితులను అంచనా వేసిన అనంతరం.. రెండు రాష్ట్రాల సీఎంలు రేవంత్‌రెడ్డి, చంద్రబాబులతో చర్చించిన తర్వాత ఈ మేరకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.రెండు రాష్ట్రాలకు పూర్తిస్థాయిలో సాయం అందించడానికి కట్టుబడి ఉన్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. తెలంగాణలో పంటలు దెబ్బతిన్న మీనవాలు, పెద్దగోపవరం, మన్నూరు, కట్టలేరు పరిశీలించడంతో పాటు ఖమ్మంలో మున్నేరు వరదను ఏరియల్ సర్వే చేసినట్లు వెల్లడించారు. ఎవరూ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని, ప్రధాని నరేంద్ర మోదీ అందర్నీ ఆదుకుంటారని భరోసా ఇచ్చారు. నష్టం అంచనా వేసిన తర్వాత పరిహారంపై నిర్ణయం వరదల వల్ల జరిగిన పంటనష్టాన్ని అంచనా వేసిన తర్వాత ఏ మేరకు నష్టపరిహారం ఇవ్వాలన్నది నిర్ణయిస్తామని చౌహాన్ చెప్పారు. వరదల్లో అరటి, పసుపు, కూరగాయ ల పంటలు పూర్తిగా దెబ్బతిన్నట్లు తెలిపారు. ఇది ఊహించని విపత్తు అని మంత్రి వ్యాఖ్యానించారు. రైతులను ఆదుకోవడం, పంటల బీమా పథకం అమలు, రైతులు పొలాల్లో పనిచేసుకునే పరిస్థితులు కలి్పంచడం, తదుపరి పంటలు వేసుకునేలా సహకరించడం.. కేంద్ర ప్రభుత్వ నాలుగు ప్రాథమ్యాలని పేర్కొన్నారు. ఎరువులు, విత్తనాలకు ఎలాంటి లోటు లేకుండా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు. -
రాజకీయాలకు కాదు..రైతుల కోసం వచ్చాం
కూసుమంచి: ‘భారీగా వరదలు వచ్చాయి.. రైతులు ఎంతో నష్ట పోయారు. ఈ నష్టాన్ని కళ్లారా చూశాను. రైతులను ఆదుకునేందుకే నేనూ, హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ మీ వద్దకు వచ్చామే తప్ప రాజకీయాల కోసం కాదు’ అని కేంద్ర వ్యవసా యశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలనకు శుక్రవారం కేంద్రమంత్రులు శివరాజ్‌సింగ్ చౌహాన్, బండి సంజయ్ ఖమ్మం జిల్లాకు వచ్చారు. ముందుగా ఖమ్మం నగరంలోని ముంపు ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించాక.. కూసుమంచి మండలానికి చేరుకున్నారు.అక్కడ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డితో కలిసి జాతీయరహదారి గుండా వెళుతూ పాలేరువాగు వద్ద దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. పాలేరు వద్ద ఎడమకాల్వకు పడిన గండి, నర్సింహులగూడెం వద్ద దెబ్బతిన్న వరిని పరిశీలించి నష్టంపై ఆరా తీశారు. ఆ తర్వాత నవోదయ విద్యాలయంలో ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో వరద నష్టంపై ఆయా జిల్లాల అధికారులు ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు.నేనూ రైతునే..వరదలకు వరి, మిర్చి, పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నట్టు ఏరియల్ సర్వే ద్వారా గమనించానని కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ తెలిపారు. తాను రైతునేనని, రైతుల కష్టా లు తెలుసునని చెప్పారు. వందేళ్లలో ఇవే భారీ వర దలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పగా.. వాస్తవాన్ని చూసి చలించిపోయానన్నారు. ఒక్క పంటలే కాకుండా ఇళ్లు, వస్తువులు దెబ్బతినగా జంతు వులు మృత్యువాత పడ్డాయని, రైతులు ఈ వరదల్లో పంటలనే కాదు, వారి జీవనాన్ని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన నష్టంపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి రైతులకు ఎలా మేలు చేయా లో నిర్ణయం తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వం ఫసల్ బీమా అమలు చేయకుండా నిర్లక్ష్యం చేసిందని, అందుకే ఇప్పుడు రైతులు తీవ్రంగా నష్టపో వాల్సి వచ్చిందని మంత్రి చౌహాన్ తెలిపారు.రైతు కన్నీరు.. ఓదార్చిన కేంద్ర మంత్రినవోదయ విద్యాలయంలో రైతులతో ముఖాముఖి ఏర్పాటు చేయగా కూసుమంచి మండలం కోక్యాతండాకు చెందిన రైతు హలావత్ వెంకన్న హిందీలో మాట్లాడారు. వరదలతో తాము సర్వస్వం కోల్పోయామని, ఆశలన్నీ గల్లంతయ్యాయని కన్నీరు పెడుతూ కేంద్రమంత్రి చౌహాన్ కాళ్లపై పడబోగా ఆయన రైతును పైకి లేపి ఓదార్చారు. ‘మీ బాధలు కళ్లారా చూశాను.. కంటనీరు రానివ్వం’ అని భరోసా కల్పించారు. పర్యటన అనంతరం నాయ కన్‌గూడెం టోల్‌ప్లాజా నుంచి కేంద్ర మంత్రులతోపాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు పొంగులేటి, తుమ్మల ఒకే హెలికాప్టర్లో హైదరాబాద్ బయలుదేరారు. -
నష్టం అంచనాకు ప్రత్యేక యాప్
సాక్షి, అమరావతి: వరద ముంపు ప్రాంతంలో దెబ్బతిన్న వ్యాపారులు, నష్టపోయిన ఇంటి వస్తువులను అంచనా వేయడానికి ప్రత్యేక యాప్ ద్వారా సర్వే చేయనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. తాము తిరిగి నిలదొక్కుకోగలము అన్న ధీమా కల్పించేలా బాధితులకు ప్యాకేజీని రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఆయన గురువారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఇంట్లో చెడిపోయిన వస్తువులను బాగు చేయడానికి వర్కర్లను ఏర్పాటు చేస్తామని, అవసరమైతే ఉబరైజేషన్ (ఆన్లైన్ ద్వారా వినియోగదారులకు సేవలందించే సంస్థలు) సేవలను కూడా వినియోగించుకుంటామని తెలిపారు.వరద ప్రాంతాల్లో ఈ నెల విద్యుత్ బిల్లులను వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. తక్షణం కుళాయిల ద్వారా మంచి నీటిని సరఫరా చేస్తున్నా, వాటిని రెండు రోజుల పాటు వంటకు, తాగడానికి వినియోగించవద్దని సూచించారు. రెండు రోజుల్లోగా రేషన్, శానిటేషన్, టెలీకమ్యూనికేషన్, విద్యుత్ సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తామన్నారు. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు రోజుకు 80,000 మందికి చొప్పున నూడుల్స్ ప్యాకెట్లు, ఆరు యాపిల్స్, ఆరు బిస్కట్లు, పాలు, వాటర్ బాటిళ్లు అందిస్తామని, చౌకగా కూరగాయలు కూడా అందించే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. బుడమేరులో వరద తిరిగి కొద్దిగా పెరుగుతోందని, 6,000 క్యూసెక్కుల వరకు వస్తే నగరంలోకి తిరిగి కొద్దిగా నీళ్లు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. మూడో గండి కూడా పూడిస్తే నగరంలోకి నీళ్లు వచ్చే ప్రమాదం తప్పిపోతుందన్నారు. ఈ గండిని పూడ్చడానికి ఆర్మీ రంగంలోకి దిగినట్లు తెలిపారు. -
అంటగట్టారు!
నల్లగొండ రూరల్/గుర్రంపోడు/ తిప్పర్తి/నిడమనూరు: రంగాపూర్ వెరైటీ బత్తాయి మొక్కలతో రైతులు నిండా మునిగారు. పూత, కాత బాగానే ఉన్నా, కాయ సైజు పెరగలేదు. పైగా నిమ్మకాయల సైజులో ఉండగానే పసుపు రంగులోకి మారి రాలిపోయాయి. తిరుపతిలోని ఉద్యాన యూనివర్సిటీ నుంచి బత్తాయిలో రంగాపూర్ రకం మొక్కలు తీసుకొచ్చి సాగు చేసిన సుమారు 200 మంది రైతులు రూ.60 కోట్ల మేర నష్టపోయారు. దీంతో కొందరు రైతులు ఓ సంఘంగా ఏర్పడి ఉద్యాన కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. విచారణ చేసిన అధికారులు నివేదికను ఆశాఖకు పంపించారు.శాస్త్రవేత్తల ప్రచారంతో..ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2014 కంటే ముందు సాగుచేసిన జంబేరి మొక్కలు అతివృష్టి, అనావృష్టి, వాతావరణ పరిస్థితుల కారణంగా క్షీణిన్నాయి. అప్పట్లో జిల్లాలో పర్యటించిన ఉద్యాన శాస్త్రవేత్తలు పరిశో«ధనా కేంద్రాల్లో లభించే రంగాపూర్ వేరు మూలంపై అంటుగట్టిన సాత్‌గుడి రకం బత్తాయి మొక్కలు నాటుకోవాలని ప్రచారం చేశారు. దీంతో ఉమ్మడి రాష్ట్రంలో తిరుపతి, మహానంది, పెట్లూరు, రైల్వే కోడూరు, మల్లేపల్లి పరిశోధన కేంద్రాల్లోని అంటు మొక్కలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.2014 నుంచి..తిరుపతిలోని ఉద్యాన యూనివర్సిటీ నుంచి నల్లగొండ జిల్లాకు చెందిన రైతులు రంగాపూర్ వెరైటీ బత్తాయి మొక్కలు తీసుకురావడం 2014లో మొదలైంది. సాధారణంగా ఐదునుంచి ఆరు సంవత్సరాలలోపు కాతకు వచ్చి దిగుబడి ఇస్తాయి. కానీ రంగాపూర్ వెరైటీ బత్తాయి మాత్రం కాపు వచ్చినా, కాయలు, రంగుమారి, రాలిపోవడంతో దిగుబడిపై ప్రభావం చూపింది. తాము నష్టపోవడానికి మొక్కల నాణ్యత లోపాలే కారణమని గుర్రంపోడు, నల్లగొండ, తిప్పర్తి, నిడమనూరు, కనగల్ మండలాల్లో సుమారు 400 ఎకరాల్లో ఈ రకం సాగు చేసిన సుమారు 70 మంది రైతులు నిర్ధారణకు వచ్చి ఈనెల 11న రాష్ట్ర ఉద్యాన కమిషనర్‌కు ఫిర్యాదు కూడా చేశారు.నాసిరకం మొక్కల విషయమై నాగాపూర్ శాస్త్రవేత్తలతో శాస్త్రీయ పరిశోధన చేయించాలని ఫిర్యాదు చేశారు. ఇదే విషయమై నల్లగొండ కలెక్టర్ ఉద్యాన అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ70 మంది రైతులు రూ.21కోట్ల మేర నష్టపోయారు. దీనిపై విచారణ చేసిన అధికారులు ఉద్యానశాఖకు నివేదిక సమర్పించారు. చాలామంది రైతులు ఇప్పటికే తోటలు తొలగించగా, బిల్లులు లేని కారణంగా ఫిర్యాదు చేయని వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఎకరానికి రూ.6లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు.ఈ ఫొటోలో ఉన్న రైతు పేరు గుర్రం శ్రీనివాస్‌రెడ్డి. ఈయనది నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలంలోని తిప్పలమ్మగూడెం. 2019లో తిరుపతి ఉద్యాన యూనివర్సిటీ నుంచి 700 రంగాపూర్ వెరైటీ బత్తాయి మొక్కలను తీసుకొచ్చి ఐదు ఎకరాల్లో నాటాడు. మొక్కలకు రూ.49వేలు, గుంతలు తీసి నాటినందుకు రూ.50వేలు ఖర్చు చేశాడు.మొక్కలు నాటినప్పటి నుంచి ఎకరానికి ఏడాదికి రూ.80వేల చొప్పున నిర్వహణ ఖర్చులయ్యాయి. అన్ని యాజమాన్య పద్ధతులు పాటించడంతోపాటు ఉద్యాన వన అధికారుల సలహాలు, సూచనలు తీసుకున్నాడు. దిగుబడి ఎకరానికి 8 నుంచి 10 టన్నుల వరకు దిగుబడి రావాల్సి ఉంది. కానీ రెండు నుంచి రెండున్నర టన్నుల వరకు దిగుబడి వస్తోంది. గతనెల 27న తిçరుపతి వర్సిటీ నుంచి వచ్చిన ఈ బత్తాయి తోటను పరిశీలించారు. అనంతరం శాంపిల్స్ సేకరించారు. కానీ ఇప్పటి వరకు ఆ రైతు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.ఇతడు నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం జొన్నలగడ్డగూడెం గ్రామానికి చెందిన రైతు చిర్ర భూపాల్‌రెడ్డి. రంగాపూర్ బత్తాయి వెరైటీ అధిక దిగుబడులు, చీడపీడలనుంచి తట్టుకుంటుందని ఎనిమిది ఎకరాల్లో సాగుచేశాడు. ఆరున్నర సంవత్సరాలు గడిచినా నేటికి దిగుబడి రావడం లేదు. దీంతో మూడు ఎకరాల తోటను తొలగించాడు. ఇప్పటి వరకు రూ.30లక్షల వరకు పెట్టుబడి పెట్టాడు. కాయలు కాస్తున్నా, సైజురాక పసుపురంగులోకి మారి రాలిపోతున్నాయి.మంచి సైజుకు రాకముందే రాలుతున్నాయితిరుపతి పరిశోధన కేంద్రం నుంచి 450 మొక్కలు తెచ్చి 2016లో నాలుగున్నర ఎకరాల్లో నాటాను. ఎనిమిదేళ్లయినా సరైన పూత, కాత రావడం లేదు. 45 నుంచి 50టన్నుల దిగుబడి రావాల్సి ఉండగా 20 టన్నులే వస్తోంది. కాయ సైజు లేకపోగా పక్వానికి రాకముందే రాలిపోతున్నాయి. – కేసాని అనంతరెడ్డి, పిట్టలగూడెం రైతుదిగుబడి బాగా వస్తుందని చెప్పిదిగుబడి బాగా వస్తుందని చెప్పి మొక్కలు అంటగట్టారు. నాకున్న మూడున్నర ఎకరాల్లో 380 మొక్కల వరకు నాటాను. మొక్కకు రూ.75 నుంచి రూ.100 వరకు వ్యయం చేసి ఏపీ నుంచి మొక్కలు తెచ్చాను. ఇప్పుడు నాలుగో కాత తెంపాల్సి ఉంది. మొక్కలకు కాయలు అంతంత మాత్రంగానే ఉండడం, కాయ బలంగా రాకపోవడం వల్ల దిగుబడి తగ్గి అనుకున్న విధంగా పెట్టుబడులు రాలేదు. – చిత్రం ప్రసాద్, మారుపాక రైతు -
సర్పంచ్ కుమారుడి కారు ధ్వంసం
రామవరప్పాడు: విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు సర్పంచ్, వైఎస్సార్సీపీ నేత వరి శ్రీదేవి కుమారుడి కారును గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం స్థానికంగా కలకలం రేపింది. ఈనెల 5వ తేదీరాత్రి ప్రసాదంపాడుకు చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు కొమ్మా కోట్లు కారు ధ్వంసం చేసిన ఘటన మరువక ముందే మళ్లీ అలాంటి ఘటన చోటు చేసుకోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ నాయకులను టార్గెట్ చేస్తూ టీడీపీ నాయకులు ఇటువంటి దాడులకు తెగబడుతున్నారని ఆరోపిస్తున్నారు. సేకరించిన వివరాల ప్రకారం.. వైఎస్సార్ సీపీకి చెందిన రామవరప్పాడు గ్రామ సర్పంచ్ వరి శ్రీదేవి కుమారుడు గణేష్ ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. ఇటీవల రామవరప్పాడుకు తన కుటుంబంతో కలిసి కారులో వచ్చారు. తన కారును రైవస్ కాలువ వంతెన సమీపంలోని కృష్ణుడి బాల ఆలయం (కోర్టులో వేయడంతో నిర్మాణం ఆగింది) వద్ద పార్కింగ్ చేశాడు. గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు కారు అద్దాలు ధ్వంసం చేశారు. ఇంతటితో ఆగకుండా కృష్ణుడి బాల ఆలయంలోని రాధాకృష్ణుల విగ్రహాలను దొంగిలించారు. తెల్లారిన తర్వాత కారుపై దాడి విషయాన్ని గమనించి పటమట పోలీసులకు సమాచారం అందించారు. ఘటనలు బయటకు రాకుండా పోలీసులు గోప్యంగా ఉంచడానికి గల కారణాలు ఏమిటని ప్రశి్నస్తున్నారు. పటమట సీఐ మోహన్‌రెడ్డిని వివరణ కోరేందుకు ప్రయతి్నంచగా ఫోన్‌కు అందుబాటులోకి రాకపోవడం గమనార్హం. -
Medigadda Barrage: గత సర్కారే కారణం!
సాక్షి,హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ 2019 వరదల సమయంలోనే ప్రమాద సంకేతాలిచ్చింది. బ్యారేజీ దిగువన దెబ్బతిన్న భాగానికి మరమ్మతులు నిర్వహించాలని సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పలుమార్లు నిర్మాణ సంస్థను కోరారు. స్పందించిన నిర్మాణ సంస్థ మరమ్మతులు నిర్వహణ కోసం బ్యారేజీని ఖాళీ చేయాలని కోరింది. ఖాళీ చేయడానికి (గత)రాష్ట్ర ప్రభుత్వం అనుమతించకపోవడంతోనే బ్యారేజీ పరిస్థితి నానాటికి క్షీణిస్తూ వచ్చింది.’ అని రాష్ట్ర నీటిపారుదల శాఖ స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజీలు 2019 వర్షాకాలంలో ప్రమాద సంకేతాలిచ్చినా, నిర్లక్ష్యం చేయడంతోనే వాటి పరిస్థితి రోజురోజుకు క్షీణించడంతో పాటు బ్యారేజీల్లోని స్ట్రక్చర్లకు నష్టం పెరిగిందా? అని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ అడిగిన ఓ కీలక ప్రశ్నకు నీటిపారుదల శాఖ ఈ మేరకు సమాధానమిచ్చింది.2019లో మేడిగడ్డ బ్యారేజీ ప్రమాద సంకేతాలిచ్చినా, ప్రాజెక్టు యంత్రాంగం సకాలంలో మరమ్మతులు, నిర్వహణ, పర్యవేక్షణ(ఓ అండ్ ఎం) చేపట్టకపోవడంతోనే బ్యారేజీ పియర్లు, ర్యాఫ్ట్ కుంగిపోయాయని మరో ప్రశ్నకు సమాధానమిచ్చింది. సుందిళ్ల బ్యారేజీ 2019లో ప్రమాద సంకేతాలిచ్చినా, మరమ్మతులు నిర్వహించడంతో ఆ తర్వాతికాలంలో పరిస్థితి క్షీణించలేదని వెల్లడించింది. బ్యారేజీలోని 46, 52, 50, 33 గేట్ల వద్ద సీపేజీ ఏర్పడగా, పీయూ గ్రౌంటింగ్ ద్వారా పూడ్చివేశారని, బ్యారేజీ దిగువన చెల్లాచెదురైన సీసీ బ్లాకులను మళ్లీ పూర్వ స్థితికి తెచ్చినట్టు నిపుణుల కమిటీకి తెలియజేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల్లోని లోపాలపై అధ్యయనం జరిపి, పరిష్కారాలను సూచించడానికి చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో నిపుణుల కమిటీని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గత మార్చిలో రాష్ట్రంలో రెండోసారి పర్యటించిన కమిటీ .. నీటిపారుదల శాఖ ఈఎన్సీ(జనరల్) జి.అనీల్కుమార్కి 25 ప్రశ్నలను అందించగా, ఆయన ఈ మేరకు రాతపూర్వకంగా బదులిచ్చారు.బ్యారేజీలు తాత్కాలిక నిల్వకే ! వరదల సమయంలో తాత్కాలికంగా నీళ్లను నిల్వ చేసి మళ్లించడం కోసమే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను నిర్మించినట్టు అయ్యర్ కమిటీకి రాష్ట్ర నీటిపారుదల శాఖ తెలిపింది. గోదావరి నుంచి మళ్లించి త్కాలికంగా నిల్వ చేసిన నీళ్లను..మేడిగడ్డ బ్యారేజీ నుంచి అన్నారం బ్యారేజీకి...అక్కడి నుంచి సుందిళ్ల బ్యారేజీ.. అక్కడి నుంచి ఎల్లంపల్లి బ్యారెజీకి.. అక్కడ నుంచి మిడ్‌మానేరు జలాశయానికి తరలించి కాళేశ్వరం ప్రాజెక్టు కింద ప్రతిపాదించిన ఆయకట్టుకు సరఫరా చేయడమే బ్యారేజీల ముఖ్య ఉద్దేశమని వెల్లడించింది.కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణానికి ముఖ్య ఉద్దేశాలను తెలపాలని కమిటీ కోరగా, ఈ మేరకు బదులిచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలను నిర్మాణం పూర్తైన నాటి నుంచి గతేడాది అక్టోబర్‌లో మేడిగడ్డ బ్యారేజీ కుంగే వరకు.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను నిరంతరం పూర్తిగా నీటితో నింపిపెట్టారు. దీనికి విరుద్ధంగా కేవలం వరదల సమయంలో తాత్కాలికంగా నీళ్లను నిల్వ చేయడానికే బ్యారేజీలను నిర్మించినట్టు ఇప్పుడు నీటిపారుదల నిపుణుల కమిటీకి బదులివ్వడం ఆశ్చర్యకరంగా మారింది.గత ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజీ లోని నిలువలను ఖాళీ చేసేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో సకాలంలో మరమ్మతులు నిర్వహించక పోయామని, బ్యారేజీ పరిస్థితి నానాటికి క్షీణించడానికి ఇదే కారణమని చంద్రశేఖర్ అయ్యర్ కమిటీకి రాష్ట్ర నీటిపారుదల శాఖ తెలిపిన అంశాన్ని లేఖలో చూడవచ్చు -
Telangana Rains Photos: తెలంగాణలో అకాల వర్షం కారణంగా ఆవేదనలో అన్నదాత (ఫొటోలు)
-
నిజాంసాగర్ కెనాల్‌కు గండి.. ఇళ్లలోకి నీరు
నిజామాబాద్ జిల్లా: ఆర్మూర్‌లో నిజాంసాగర్ కెనాల్‌కు గండి పడింది. ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని జర్నలిస్ట్ కాలనీకి ఆనుకొని ఉన్న నిజాంసాగర్ కెనాల్ కట్టకు ఓ చోట గండి పడింది. దీంతో కాలనీలోని ఇండ్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. సొమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకోవడంతో గ్రామస్తులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఇండ్లు పూర్తిగా వరద నీటితో మునిగిపోవటంతో..చాలా మంది నిరాశ్రయులయ్యారు. ఇరిగేషన్ కెనాల్ అధికారుల నిర్లక్ష్యమే కారణంగానే ఈ ఘటన జరిగింది అంటూ స్థానికుల ఆరోపణ చేస్తున్నారు. త్వరగా సహాయక చర్యలు మొదలు పెట్టాలని కాలనీవాసుల డిమాండ్ చేస్తున్నారు. -
ప్రమాద సంకేతాల విస్మరణతోనే నష్టమా?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు 2019 వానాకాలం తర్వాత ప్రమాద సంకేతాలు ఇచ్చినా.. నివారణ చర్యలు తీసుకోకపోవడంతోనే నష్టాన్ని పెంచిందా? అని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ నీటి పారుదల శాఖను ప్రశ్నించింది. మూడు బ్యారేజీలను ప్రారంభించిన కొద్దిరోజులకే వాటి దిగువన రక్షణ కోసం ఏర్పాటు చేసిన ప్లింత్ శ్లాబు, సీసీ బ్లాకులు, టోయ్ వాల్, లాంచింగ్ అప్రాన్ వంటివి ఎందుకు కొట్టుకుపోయాయని నిలదీసింది. ఇటీవల మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించిన అయ్యర్ కమిటీ.. నీటి పారుదలశాఖలోని అన్ని విభాగాలతో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించింది. తిరిగి వెళ్లేప్పుడు ఒక ప్రశ్నావళిని అందించి, సీల్డ్ కవర్లో సమాధానాలు అందజేయాలని కోరింది. ప్రమాదం పొంచి ఉంటే ఏం చేశారు? బ్యారేజీలకు ప్రమాదాలు పొంచి ఉన్నట్టు/నష్టాలు జరిగినట్టు గుర్తించిన సమాచారాన్ని వరుస క్రమంలో తెలుపుతూ సమగ్ర నివేదిక సమర్పించాలని అయ్యర్ కమిటీ కోరింది. ‘‘ప్రమాదాలు పొంచి ఉన్నట్టు గుర్తించినప్పుడు తీసుకున్న చర్యలేమిటి? నిర్మాణ సంస్థలకు జారీచేసిన ఆదేశాలేమిటి? తక్షణమే నిర్మాణ సంస్థలు మరమ్మతులు నిర్వహించాయా? వంటి వివరాలు నివేదికలో ఉండాలి. ముందు జాగ్రత్త చర్యలేమైనా తీసుకుని ఉంటే తెలపాలి. తీసుకోకపోతే కారణాలు వెల్లడించాలి. బ్యారేజీలలో ఏదైనా అసాధారణ మార్పును గుర్తించిన సందర్భాల్లో పరికరాల డేటా నమోదు, విశ్లేషణ, అన్వయింపు(డేటా ఇంటర్‌ప్రిటేషన్), వాటి ఆధారంగా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసే విభాగం ఏదీ? దీనికోసం ఎలాంటి ప్రొటోకాల్స్‌ను అనుసరిస్తున్నారు?’’ అని ప్రశ్నించింది. జరిగిన తప్పులేమిటి? చేసింది ఎవరు? నీటి పారుదల శాఖలోని వివిధ విభాగాల పనితీరు, సమన్వయా న్ని అర్థం చేసుకోవడానికి శాఖ మౌలిక స్వరూపం వివరాలును అయ్యర్ కమిటీ కోరింది. బ్యారేజీల నిర్మాణంలో జరిగిన లోటుపాట్లకు బాధ్యులను తేల్చడానికి ఈ సమాచారం కీలకమని పే ర్కొంది. శాఖలోని అన్ని విభాగాల ఈఎన్సీల నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి వరకు ఉన్న అధికారుల క్రమాన్ని తెలిపేలా శాఖ ఆర్గనైజేషన్ చార్ట్‌ను సమరి్పంచాలని కమిటీ కోరింది. ‘‘ఈఎన్సీ (జనరల్), హైడ్రాలజీ అండ్ ఇన్వెస్టిగేషన్, సీడీఓ, ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్, క్వాలిటీ కంట్రోల్ అండ్ ఇన్స్పెక్షన్, ఓ అండ్ ఎం, ఇతర విభాగాల బాధ్యతలు, విధులు వివరించండి. బ్యారేజీల నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీఓ) చీఫ్ ఇంజనీర్, రామగుండం చీఫ్ ఇంజనీర్, క్వాలిటీ కంట్రోల్ అండ్ ఇన్స్పెక్షన్ విభాగం చీఫ్ ఇంజనీర్, ఈఎన్సీ (ఓఅండ్ఎం)లు తమపై అధికారిగా ఎవరికి రిపోర్ట్ చేస్తారు?’’ అని ప్రశ్నించింది. సీడీఓ, క్వాలిటీ సలహాలను పాటించారా? ‘‘సీడీఓ, క్వాలిటీ కంట్రోల్ అండ్ ఇన్స్పెక్షన్ విభాగాలు ఇచ్చే సలహాలు/ఆదేశాలకు ప్రాజెక్టుల కన్స్ట్రక్షన్ విభాగం కట్టుబడి ఉంటుందా? బ్యారేజీల గేట్లను ఎత్తే సమయం (ఆపరేషన్ షెడ్యూలింగ్)ను నిర్ణయించడంలో బాధ్యులు ఎవరు? ఈ విషయంలో సీడీఓ/ తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబ్(టీఎస్ఈఆర్ఎల్)ల సలహాను ఏమైనా ఉల్లంఘించారా?’’ అని కమిటీ ప్రశ్నించింది. ప్రాజెక్టు డీపీఆర్‌ను కేంద్ర జల సంఘాని (సీడబ్ల్యూసీ)కి సమరి్పంచడానికి ముందు దాని రూపకల్పన సీడబ్ల్యూసీ మార్గదర్శకాలకు అనుగుణంగా జరిగేలా పర్యవేక్షణ చేసే విభాగం ఏది? దానికోసం నీటిపారుదల శాఖలో ఎలాంటి ప్రొటోకాల్స్ ఉన్నాయో తెలపాలని కోరింది. బ్యారేజీలు నీటి మళ్లింపు కోసమా? నిల్వ కోసమా? మూడు బ్యారేజీలను నీటి నిల్వ అవసరాలను దృష్టిలో పెట్టుకుని డిజైన్, నిర్మాణం చేశారా? లేక నీటి మళ్లింపు అవసరాలను దృష్టిలో పెట్టుకుని జరిపారా? అని అయ్యర్ కమిటీ ప్రశ్నించింది. బ్యారేజీలను ప్రారంభించిన నాటి నుంచి నిల్వ స్థాయిలను నెలవారీగా తెలియజేసే నివేదికను సమరి్పంచాలని కోరింది. బ్యారేజీలకు తనిఖీలు, మరమ్మతులు, నిర్వహణ పనుల కోసం ఎప్పుడైనా నిల్వలను తగ్గించారా? చేస్తే వివరాలు అందించాలని సూచించింది. బ్యారేజీల నిర్మాణ ప్రారంభం, ముగింపు తేదీలను అందించాలని.. డీపీఆర్‌ల ప్రకారం బ్యారేజీల విశిష్టతల(సేలియంట్ ఫీచర్స్)ను తెలిపాలని పేర్కొంది. నిర్మాణంలో ఈ విశిష్టతలను పాటించారా? అని ప్రశ్నించింది. బ్యారేజీల నిర్మాణానికి అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సమరి్పంచాలని కోరింది. సీడబ్ల్యూసీ అభ్యంతరాలను పరిష్కరించారా? డీపీఆర్ మదింపు సందర్భంగా సీడబ్ల్యూసీలోని వివిధ డైరెక్టరేట్లు వ్యక్తం చేసిన అభ్యంతరాలు ఏమిటి? సీఎస్ఎంఆర్ఎస్, జీఎస్ఐ, సీజీడబ్ల్యూబీ వంటి ఇతర సంస్థల కామెంట్లు/ అబ్జర్వేషన్లు ఏమిటి? వాటిని తగిన రీతిలో పరిష్కరించారా? అని అయ్యర్ కమిటీ కోరింది. నిర్మాణ దశ డిజైన్లు ఎవరివి? నిర్మాణ దశలో మూడు బ్యారేజీల డిజైన్లు, బ్యారేజీల వివిధ విభాగాల డ్రాయింగ్స్‌ను రూపొందించింది ఎవరని కమిటీ ప్రశ్నించింది. బ్యారేజీల నిర్మాణానికి ప్రత్యామ్నాయ ప్రాంతాల ఎంపిక కోసం జరిపిన అధ్యయనాలు, ప్రస్తుత ప్రాంతాల ఎంపికను సమర్థించే కారణాలు, బ్యా రేజీల కింద భూగర్భంలో నీటి ప్ర వాహంపై చేసిన అంచనాల వివరాలను ఇవ్వాలని కోరింది. లోపాలు బహిర్గతమైన తర్వాత బ్యారేజీలకు ని ర్వహించిన సబ్‌సర్ఫేస్ జియోలాజికల్ పరీక్షల నివేదికలు సమరి్పంచాలని సూచించింది. లోపాలు, పునరుద్ధరణ పనులపై మీ అభిప్రాయమేంటి? ‘‘మేడిగడ్డ బ్యారేజీ ర్యాఫ్ట్, పియర్లు కుంగిపోవడానికి కారణాలేమిటి? బ్యారేజీల పునాదుల కింద ఇసుక కొట్టుకుపోయి సీపేజీ జరగడానికి కారణాలేమిటి? వచ్చే వర్షాకాలంలో బ్యారేజీలకు మరింత నష్టం జరగకుండా రక్షించడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏమిటో వివరించండి’’ అని నీటి పారుదల శాఖను అయ్యర్ కమిటీ కోరింది. ఈ ప్రశ్నావళి మేరకు తగిన సమాధానాలను సిద్ధం చేస్తున్నట్టు నీటిపారుదల శాఖ వర్గాలు వెల్లడించాయి. -
ఇడ్లీ లవర్స్‌కు షాకింగ్ న్యూస్, జీవవైవిధ్యానికి అత్యంత ప్రమాదకారిగా
మనకెంతో ఇష్టమైన వంటకాల వల్ల జీవవైవిధ్యం దెబ్బతింటుందంటే నమ్ముతారా? లేటెస్ట్ స్టడీ ఈ భయాల్నే రేకెత్తిస్తోంది. భారతీయులు తినే పలు ఆహార పదార్థాలు జీవ వైవిధ్యానికి ముప్పు కలిగిస్తున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 151 వంటకాలపై జరిపిన పరిశోధనల్లో కొన్ని భారతీయ వంటకాల వల్ల జీవ వైవిధ్యానికి ఎక్కువ ముప్పు ఉన్నట్టు తేలిందట. ముఖ్యంగా ఇడ్లీ, వడ, చనా మసాలా, రాజ్మా, చపాతి సహా పలు ఆహార పదార్థాలుంటం గమనార్హం. అలాగే శాకాహారం , శాకాహార వంటకాలతో పోలిస్తే మాంసాహార వంటకాలు జీవవైవిధ్యంపై ఎక్కువ ప్రభావం చూపుతాయని అధ్యయనం చెబుతోంది. శుభవార్త ఏమిటంటే, బియ్యం , పప్పుధాన్యాల వంటకాలు అధిక స్కోర్లు ఉన్నప్పటికీ, భారత జనాభాలో ఎక్కువ భాగం శాకాహారుల కారణంగా, జీవవైవిధ్య ముప్పుకు పెద్ద ప్రమాదం లేదని పరిశోధకులు వివరించారు. బ్రెజిల్లో వాడే గొడ్డు మాంసం ,స్పెయిన్‌కు చెందిన రోస్ట్ లాంబ్ డిష్ , బ్రెజిల్ నుండి లెచాజో,జీవవైవిధ్యానికి అత్యధిక నష్టం కలిగించిన ఆహార పదార్థాలుగా నిలిచాయి. ఈ జాబితాలో ఇడ్లీ ఆరో స్థానంలో ఉంది. అంతేకాదు అధ్యయనం ప్రకారం ఫ్రెంచ్ ఫ్రైస్ ప్రభావం చాలా తక్కువ. ఈ లిస్ట్‌లో ఆలూ పరాటా 96వ స్థానంలో, దోస 103వ స్థానంలో, బోండా 109వ స్థానంలో ఉన్నాయి. భారతదేశంలో జీవవైవిధ్యంపై అపారమైన ఒత్తిడిని ఈ అధ్యయనం నొక్కి చెబుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 151 ప్రసిద్ధ వంటకాలపై నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ పరిశోధన నిర్వహించారు. పర్యావరణంపై ప్రభావం చూపించే దాదాపు 25 ప్రమాదకర ఆహారాల పదార్థాలను గుర్తించారు .యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్‌లోని బయోలాజికల్ సైన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ లూయిస్ రోమన్ కరాస్కో మాట్లాడుతూ, ప్రతి వంటకం దాని పదార్థాల ఆధారంగా జాతులు, అడవి క్షీరదాలు, పక్షులు ఉభయచరాలపై ప్రభావం చూపుతుందని చెప్పారు. -
మేడిగడ్డ ప్రాజెక్టుపై సంచలన రిపోర్ట్..
-
మేడిగడ్డ డొల్ల తనాన్ని కేంద్ర కమిటీ బయటపెట్టింది
-
గర్భిణీ స్త్రీలు ప్లాస్టిక్ పాత్రల్లో తింటున్నారా?దీనిలోని బిస్ఫినాల్ వల్ల..
నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ప్లాస్టిక్ కాలుష్యం ఒకటి.గత కొన్నేళ్లుగా ప్లాస్టిక్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఓవైపు ప్లాస్టిక్‌ను నిర్మూలించాలని చెబుతున్నా మరింత ఎక్కువగా వాడుతున్నాం. ఇప్పటికే ప్లాస్టిక్ ఉత్పత్తి సంవత్సరానికి 40 కోట్ల టన్నులకు చేరుకుందని అంచనా. పరిస్థితి ఇలాగే ఉంటే రానున్న రోజుల్లో సమస్య సంక్షోభంగా మారే అవకాశం తొందర్లోనే ఉంది. ప్లాస్టిక్ కవర్ల వల్ల కలిగే నష్టాలివే పర్యావరణ_కాలుష్యం: ►సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు పర్యావరణ కాలుష్యానికి ప్రధాన మూలం. ఎందుకంటే అవి భూమిలో ఇంకిపోవడానికి చాలా సమయం పడుతుంది.ప్లాస్టిక్ కవర్లు వన్యప్రాణులకు హాని కలిగిస్తాయి. జంతువులు వాటిని ఆహరంగా భావించి తినేస్తున్నాయి. ఇది ఎక్కువైతే, మరణానికి కూడా దారితీయొచ్చు. ► ప్లాస్టిక్ కవర్లు అనేక రసాయనాలు కలిగి ఉంటుంది. వీటిని నీటిలో వదలడం వల్ల అవి కూడా కలుషితం అయ్యి ప్రమాదాన్ని కలిగిస్తాయి. ► కొన్ని ప్లాస్టిక్ కవర్లలో మానవ ఆరోగ్యానికి హాని కలిగించే బిస్ఫినాల్ A (BPA), థాలేట్స్ ,ఫ్లేమ్ రిటార్డెంట్స్ వంటి రసాయనాలు ఉండవచ్చు. ఈ రసాయనాలు ప్లాస్టిక్ నుండి బయటకు వెళ్లి ఆహారం లేదా పానీయాలలోకి వెళ్లి, హార్మోన్ల అసమతుల్యత, పునరుత్పత్తి సమస్యలు మరియు క్యాన్సర్ వంటి ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. ► ప్లాస్టిక్ కవర్ల ఉత్పత్తి, పారవేయడం గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలకు దోహదం చేస్తుంది. ఇది వాతావరణ మార్పు, ఇతర పర్యావరణ సమస్యలకు దోహదం చేస్తుంది. ప్లాస్టిక్ పాత్రల్లో ఆహారం తింటున్నారా? మీరు రోజూ ప్లాస్టిక్ డబ్బాల్లో ఆహారం తీసుకుంటున్నారా? అయితే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్లే. వేడి పదార్థాలను ప్లాస్టిక్ లేదా డిస్పోజబుల్ ప్లేట్లలో ఉంచడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని పరాశోధకులు ప్లాస్టిక్ (Plastic) తయారు చేసేందుకు బిఎస్ ఫినాల్ను ఉపయోగిస్తారు. ప్రధానంగా పాలికార్బోనేట్ లేదా రీసైకిల్ కోడ్7గా పిలువబడే ఇది ప్లాస్టిక్‌లో కలుస్తుంది. ఇది విషపూరితమైనది. దీని వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ పొంచివుండే ప్రమాదం ఉంది. బీపీఏ అనేది మానవ శరీరంలోని ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్లను అసమతుల్యత చేసే రసాయనమని నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగా అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. దీని వల్ల మానసిక ఒత్తిడి మొదలైన వాటికి దారి తీస్తుంది. అలాగే అలెర్జీలు, గుండెకు సంబంధించిన వ్యాధులు, క్యాన్సర్ తీవ్రతను పెంచే అవకాశం ఉందని చెబుతున్నారు. పిల్లల్లో రోగనిరోధక శక్తి తగ్గుతుంది ఎక్కువగా ప్లాస్టిక్ పాత్రల్లో తినడం వల్ల పిల్లల్లో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. అలాగే గర్భిణీ స్త్రీలు ప్లాస్టిక్ పాత్రలలో ఆహారం తినడం వల్ల పుట్టబోయే పిల్లలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. మైక్రోవేవ్‌లో ప్లాస్టిక్ పాత్రలలో ఆహారాన్ని వేడి చేయడం కూడా హానికరమంటున్నారు. మీరు మైక్రోవేవ్ ఉపయోగించాల్సి వస్తే ప్లాస్టిక్‌కు బదులుగా మీరు పేపర్ టవల్, గ్లాస్ ప్లేట్ లేదా సిరామిక్ వస్తువులను ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు. ఓవైపు ప్లాస్టిక్‌ను నిషేధించాలని పదేపదే చెబుతున్నా, ఇంకా ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగిపోతుంది. ప్లాస్టిక్ కవర్స్‌ని నిషేధించే విధంగా చర్యలు చేపట్టినా, ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్లాస్టిక్ భూమిలో కరగడానికి కొన్ని వందల ఏళ్లు సమయం పట్టడం, అందులో ప్లాస్టిక్ తయారీలో కలిసే పదార్థం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఎంతో మంది నిపుణులు చెబుతున్నా.. ఇంకా ప్లాస్టిక్ రూపుమాపడం లేదు. ప్లాస్టిక్ కవర్ల హానికరమైన ప్రభావాలను తగ్గించడానికి, సింగిల్-యూజ్ ప్లాస్టిక్‌ల వినియోగాన్ని తగ్గించడం, కంటైనర్లు, పత్తి లేదా బీస్వాక్స్ వంటి సహజ పదార్థాలతో తయారు చేయబడిన ర్యాప్ల వంటి మరింత స్థిరమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం చాలా ముఖ్యం. ప్లాస్టిక్ కవర్లను రీసైక్లింగ్ చేయడం సరైన పరిష్కారం కాదు. దానికంటే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడమే సమస్యను పరిష్కరించడానికి ఉత్తతమైన మార్గం. -నవీన్ నడిమింటి ప్రముఖ ఆయుర్వేద వైద్యనిపుణులు -
వందే భారత్‌కు తప్పని రాళ్ల దెబ్బలు
ఇది సికింద్రాబాద్–తిరుపతి వందేభారత్ రైలు పరిస్థితి. ఏకంగా ఆరు కోచ్‌ల అద్దాలను ఆకతాయిలు పగలకొట్టేశారు. ఇటీవల ప్రారంభమై ప్రయాణికుల ఆదరణ చూరగొంటూ దాదాపు 115 శాతం ఆక్యుపెన్సీ రేషియోతో నడుస్తున్న ఈ రైలును ఆకతాయిలు టార్గెట్‌గా చేసుకుంటున్నారు.– సాక్షి, హైదరాబాద్ వందేభారత్ రైళ్లపైనే కసిగా.. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో రైళ్లపై రాళ్ల దాడులు జరగటం ముందు నుంచీ ఉంది. కానీ వందేభారత్ రైళ్లు పట్టాలెక్కిన తర్వాత అది మరింతగా పెరిగింది. గత ఏడు నెలల్లో రాష్ట్రంలో దాదాపు 300 పర్యాయాలు రైళ్లపై దాడులు జరిగితే, అందులో వందేభారతపై జరిగినవే 50కి పైగా ఉండటం గమనార్హం. వెడల్పాటి అద్దాలుండటంతో వందేభారత్ రైళ్లకు ఈ రాళ్లదాడి తీవ్ర నష్టం చేస్తోంది. సాధారణంగా రైలు అద్దాలు పగిలితే, మెయింటెనెన్స్ సమయంలో వాటిని మార్చేస్తారు. కానీ, వందేభారత్ రైళ్ల అద్దాలు తరచూ పగిలిపోతుండటంతో వాటిని మార్చటం ఇబ్బందిగా మారింది. ప్రస్తుతం దక్షిణ మధ్య పరిధిలో సికింద్రాబాద్–విశాఖపట్నం, సికింద్రాబాద్–తిరుపతి వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఇందులో విశాఖపట్నం రైలు విశాఖలో మెయింటెయిన్ అవుతుండగా,తిరుపతి రైలు సికింద్రాబాద్‌లో అవుతోంది. వారానికి ఒక రోజు వీటికి సెలవు ఉండటంతో ఆ రోజు పూర్తిస్థాయిలో నిర్వహణ పనులు చేపడుతూ పగిలిన అద్దాలను మారుస్తున్నారు. బాగా పగిలితే మాత్రం వెంటనే మార్చేస్తున్నారు. ఇందుకోసం పెద్ద మొత్తంలో అద్దాలను స్థానికంగా నిల్వ చేసుకుంటున్నారు. సికింద్రాబాద్ డివిజన్‌లోనే ఎక్కువగా.. తాజాగా తిరుపతి రైలులో ఆరు కోచ్‌ల అద్దాలు పగలగా, విశాఖ రైలుకు మూడు కోచ్‌ల అద్దాలు పగిలాయి. ఈ ఏడాది రైళ్లపై జరిగిన 300 రాళ్ల దాడుల్లో ఎక్కువ సికింద్రాబాద్ డివిజన్‌లోనే చోటు చేసుకున్నట్టు రైల్వే అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి రైళ్లపై దాడుల విషయంలో నిందితులపై తీవ్రచర్యలుంటాయి. రైళ్లపై దాడి చేయటాన్ని జాతి ఆస్తి విధ్వంసంగా పరిగణిస్తూ కఠిన సెక్షన్లు దాఖలు చేస్తారు. అలాంటి వారికి ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం పోతుంది. దాడి చేసి అలాంటి కేసులుకొని తెచ్చుకోవద్దని ఎంతగా ప్రచారం చేసినా ఆకతాయిలు వినటం లేదు. దీంతో ఆ సెక్షన్ల కింద గరిష్ట జైలు శిక్షలు విధించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక నుంచి పట్టుబడిన వారికి వీలైనంత ఎక్కువ కాలం జైలు శిక్ష పడే ప్రమాదం ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. -
పోలవరం నిధులపై అభ్యంతరం చెప్పలేదు
పోలవరం ప్రాజెక్ట్‌లో 41.15 మీటర్ల వరకూ నీటిని నింపడానికి రూ.10,911.15 కోట్లు వరద నష్టం రూ.2 వేల కోట్లు నిధులకు ఆర్థిక శాఖ అభ్యంతరం చెప్పలేదని జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు పేర్కొన్నారు. ఎంపీ బాలశౌరి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. జనవిశ్వాస్ బిల్లుకు మద్దతు లోక్‌సభలో కేంద్రం గురువారం ప్రవేశపెట్టిన జన విశ్వాస్ సవరణ బిల్లు, 2022కు వైఎస్సార్సీపీ మద్దతు తెలిపింది. బిల్లుపై చర్చలో వైఎస్సార్సీపీ ఎంపీ బీవీ సత్యవతి మాట్లాడుతూ.. దేశంలో జీవన సౌలభ్యానికి బిల్లు ఎంతో తోడ్ప డుతుందన్నారు. బిల్లులో కొన్ని మార్పులను ఎంపీ సత్యవతి సూచించారు. తిట్టలేదు.. అవాస్తవాల ప్రచారంపై ప్రశ్నించానంతే: ఎంపీ ఎంవీవీ తనతో పాటు తన కుటుంబ సభ్యుల గౌరవానికి భంగం కలిగేలా మీడియాతో మాట్లాడిన వ్యవహారంలో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును కేవలం ప్రశ్నించాను తప్ప అసభ్య పదజాలంతో తిట్టలేదని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ స్పష్టం చేశారు. తనపై చేసిన అసత్య ప్రచారంపై రఘురామను నిలదీశానని, వాస్తవాలు తెలియకుండా ఇష్టానురీతిన ఎలా మాట్లాడుతారని ప్రశ్నించినట్టు తెలిపారు. ఈ నెల 20న పార్లమెంట్ సమావేశాల సందర్భంగా లోక్‌సభ వాయిదా పడిన అనంతరం సెంట్రల్ హాల్లో తనను అసభ్య పదజాలంతో తిడుతూ.. చంపేస్తాననే ధోరణిలో బెదిరింపులకు పాల్పడ్డారంటూ స్పీకర్ ఓంప్రకాశ్ బిర్లాకు ఎంపీ రఘురామరాజు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై ఎంవీవీ సత్యనారాయణ స్పందిస్తూ.. ఆయన ఆరోపణలు పూర్తిగా అవాస్తమని కొట్టిపారేశారు. తన కుటుంబ సభ్యుల కిడ్నాప్ ఉదంతంపై రఘురామ తలాతోక లేని ఆరోపణలు చేశారని విమర్శించారు. -
పొగలుకక్కే ఫుడ్ పెట్టినందుకు..మెక్‌డొనాల్డ్స్ రూ. 6 కోట్లు
మనం రెస్టారెంట్‌కి లేదా హోటల్‌కి వెళ్లితే..నిర్వాహకులు మంచి వేడి..వేడిగానే ఆహారం తీసుకొస్తారు. ఒకవేళ తొందరపడి తింటే..కాలినా.. అక్కడ ఉన్న సర్వర్‌పై అరవలేం. పైగా కేసు పెట్టను కూడా పెట్టం. కానీ ఓ కుటుంబం వేడిగా ఉందని మాకు చెప్పలేదు, అందువల్లే మా పాపకు కాలిపోయిందని కోర్టు మెట్లు ఎక్కింది. పైగా మెక్‌డొనాల్డ్స్ కంపెనీని ముక్కుపిండి మరీ డబ్బులు వసూలు చేసింది ఓ కుటుంబం. ఈ ఘటన యూఎస్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..ఫ్లోరిడాలోని ఫిలానా హోమ్స్, ఆమె భర్త, తన నాలుగేళ్ల పాప ఒలివియా కారబల్లోతో కలిసి మెక్‌డొనాల్డ్స్‌కి వెళ్లారు. అప్పుడు వారు తమ చిన్నారి కోసం హాట్ చికెన్ మెక్ నగెట్ని ఆర్డర్ చేశారు. అది కాస్త తినే తొందరలో చిన్నారి తొడపై పడటంతో.. తీవ్ర గాయమైంది. దీంతో ఆ జంట ఆహరం వేడిగా ఉందని ఎందుకు చెప్పలేదంటూ గొడవ చేసింది. తమకు న్యాయం కావలంటూ..కోర్టు మెట్లు ఎక్కింది. చికెన్‌లోని సాల్మొనెల్లా విషాన్ని నివారించడానికి 160 డిగ్రీల హీట్ కంటే ఎక్కువ వేడి చేయకూడదు. కానీ మెక్‌డొనాల్డ్స్ 200 డిగ్రీ వేడితో ఉన్న చికెన్ నగ్గెట్ని ఇచ్చిందని వాదించింది. తన కూతురు ఒలివియాకు అయిన గాయాన్ని, దానివల్ల ఆమె అనుభవించిన బాధను ఆధారంగా చూపించింది. అంతేగాదు ఇప్పటికీ తన కూతురు చికెన్ నగెట్ని తింటోంది. కానీ ఇలా జరగలేదు కదా అని గట్టిగా తన వాదన వినిపించింది. దీంతో కోర్టు.. అక్కడ చిన్నారుల హక్కుల ప్రకారం ఆమెకి జరిగిన గాయానికి గానూ పరిహారంగా సదరు మెక్‌డొనాల్డ్స్ ఏకంగా ఆరు కోట్లు నష్టపరిహారం చెల్లించాలని గత బుధవారమే ఆదేశించింది. అంతేగాదు ముందుగా గత నాలుగేళ్లకు పరిహారంగా రూ. 3.27 కోట్లు చెల్లించాలని ఆ తర్వాత మిగతా డబ్బును నిర్ణిత గడువులోపల చెల్లించాలని పేర్కొంది. పాపం మెక్ డొనాల్డ్‌కి ఓ రేంజ్లో దిమ్మతిరిగే షాక్ ఇచ్చిందిగా సదరు కుటుంబం. (చదవండి: 'గోల్డెన్ వాటర్ స్పౌట్'..ప్రకృతి అద్భుతం) -
జలప్రళయం.. హిమాచల్ కకావికలం
సిమ్లా: ఎడతెరిపిలేని వర్షాలు హిమాచల్ ప్రదేశ్‌ని అతలాకుతలం చేస్తున్నాయి. వర్షాలకు కొండచరియలు విరిగిపడుతున్నాయి. రాష్ట్రమంతటా రోడ్లు కొట్టుకుపోయిన కారణంగా రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. విద్యుత్ వ్యవస్థ నిలిచిపోయింది. వరద నీటితో నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. గత నాలుగు రోజుల్లో వర్షాల ధాటికి 80 మంది మృతి చెందారు. రూ.4000 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగిందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో వర్షాల ధాటికి కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో 1300 రోడ్లు బ్లాక్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఛండీగఢ్-మనాలీ, సిమ్లా-కాల్కా జాతీయ రహదారులను మూసివేసినట్లు వెల్లడించారు. మనాలీలో చిక్కిన 1000 మంది పర్యటకుల వాహనాలను తరలించడానికి అర్ధరాత్రి పూట వన్‌వే ట్రాఫిక్‌ను తెరిచినట్లు తెలిపారు. పలు ప్రాంతాల్లో పర్యటకులు చిక్కుకుపోయినట్లు పేర్కొన్నారు. More Scary visuals from Thunag area of Mandi, Himachal#Thunag #Mandi #HimachalPradesh #Manali #Kullu pic.twitter.com/qtyyo3OHcD — Anil Thakur (@Ani_iTV) July 9, 2023 ఇప్పటివరకు రాష్ట్రంలో 40 వంతెనలు దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. జులై 5 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 20,000లకు పైనే ప్రజలను పునరావాస ప్రదేశాలకు తరలించినట్లు వెల్లడించారు. కొండ చరియలు విరిగిపడి, వరదలతో భారీ నష్టం జరిగిన కులూ ప్రాంతాల్లో రాష్ట్ర సీఎం సుఖ్విందర్ సింగ్ సుకూ పర్యటించారు. పరిస్థితిని ప్రస్తుతానికి అదుపులోకి తీసుకువచ్చామని తెలిపారు. నష్టాన్ని పూరించడానికి చేయాల్సిన పని చాలా ఉందని అన్నారు. This is Temple in Sirmaur Himachal Pradesh under flood pic.twitter.com/PI3IIibmzp — Go Himachal (@GoHimachal_) July 11, 2023 గత నాలుగు రోజులుగా ఉత్తర భారతం భారీ వర్షాలతో వణికిపోతోంది. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా పలు రాష్ట్రాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. వర్షాల ధాటికి వరద నీటితో నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ సహా పలు రాష్ట్రాల్లో వర్షాలు సంభవిస్తుండగా.. హిమాచల్ ప్రదేశ్‌లో భారీ నష్టం వాటిల్లింది. 80 Killed, ₹ 3,000 Crore Damage: Himachal Rain Devastation In Numbers https://t.co/7xnflWjHa5 pic.twitter.com/FFgvfMddRA — NDTV (@ndtv) July 12, 2023 కాగా.. రానున్న 24 గంటల్లో భారీ స్థాయిలో వర్షాలు రానున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దేశంలో 23 రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురువనున్నాయని అధికారులు తెలిపారు. పశ్చిమ బెంగాల్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయాల్లో ముప్పు పొంచి ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే ఉత్తరాఖండ్‌లో రెడ్ అలర్ట్ చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఇదీ చదవండి: Yamuna Rivar: డేంజర్ మార్క్ దాటి మహోగ్రంగా ప్రవహిస్తున్న యమునా.. ఢిల్లీ హై అలర్ట్.. -
Adipurush: థియేటర్ అద్దాలు పగలగొట్టిన ప్రభాస్ ఫ్యాన్స్
ప్రభాస్ రాముడిగా దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం'ఆదిపురుష్' ప్రపంచవ్యాప్తంగా నేడు (జూన్ 16) విడుదలైంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని థియేటర్ల వద్ద జై శ్రీరామ్ నామంతో ప్రభాస్ ఫ్యాన్స్ హోరెత్తిస్తున్నారు. సినిమా ఇప్పటికే హిట్ టాక్ అందుకుంది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. సినిమాకు మంచి బజ్ రావడంతో థియేటర్లలో బొమ్మ పడటం ఒక నిమిషం ఆలస్యం అయినా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. (ఇదీ చదవండి: ఎవరైనా అలాంటి వేషాలు వేస్తే.. తాట తీస్తాం: ప్రభాస్ ఫ్యాన్స్) తాజాగా సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పరిధిలోని జ్యోతి థియేటర్లో ఆదిపురుష్ సినిమా ఆలస్యంగా ప్రదర్శించడం వల్ల యాజమాన్యంతో ఫ్యాన్స్ గొడవకు దిగారు. థియేటర్ సిబ్బంది సర్దిచెప్పడంతో సమస్య సద్దుమనిగింది. కానీ వారు థియేటర్లోకి వెళ్లిన తర్వాత అసలు సమస్య మొదలైంది. సినిమా ప్రారంభం అయ్యాక సౌండ్ సిస్టం సరిగా లేకపోవడంతో వారికి డైలాగ్‌లు అర్థం అవ్వడం లేదని మళ్లీ గొడవకు దిగడమే కాకుండా థియేటర్ అద్దాలను పగలగొట్టారు. దీంతో చేసేదేమి లేక థియేటర్ యాజమాన్యం సినిమా ప్రదర్శనను నిలిపేశారు. (ఇదీ చదవండి: Adipurush: ఎవరీ ఓం రౌత్.. ప్రభాస్‌కు ఎలా పరిచయం?)