భారత జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటన బీహార్ రాజధాని పాట్నాలో చోటుచేసుకుంది.
పాట్నా: భారత జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటన బీహార్ రాజధాని పాట్నాలో చోటుచేసుకుంది. ఈ ఘటనపట్ల పలువురు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని దోషులను కఠినంగా శిక్షించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'పాట్నాలోని తెల్లని పాలరాతితో నిర్మించిన గాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వసం చేశారు. దీని వెనుక సామాజిక వ్యతిరేక శక్తులు కుట్ ఉందని మేం భావిస్తున్నాం. ఈ ఘటనపట్ల పోలీసులు సీరియస్గా స్పందిస్తున్నారు. ఇప్పటికే నిందితుల కోసం తీవ్రంగా గాలింపులు చేపట్టాయి' అని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.