
వచ్చే జయంతి నాటికి విగ్రహ నిర్మాణం పూర్తి
మ్యూజియంగా పొట్టి శ్రీరాములు ఇల్లు
ముఖ్యమంత్రి చంద్రబాబు
సాక్షి, అమరావతి: ఆంధ్రరాష్ట్ర ఏర్పాటు కోసం 58 రోజుల పాటు కఠోర దీక్ష చేసి ఆత్మ బలిదానం చేసిన శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని 58 అడుగుల ఎత్తుతో రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. వచ్చే జయంతి నాటికి ఈ విగ్రహ నిర్మాణాన్ని పూర్తిచేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. అమరావతిలోనే మెమోరియల్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు.
అమరజీవి స్వగ్రామం పడమటిపల్లిలోని ఆయన నివాసాన్ని మ్యూజియంగా తీర్చిదిద్దుతామని, గ్రామంలో ఆధునిక వసతులతో ఆరోగ్య కేంద్రం, హైసూ్కల్ భవనాన్ని నిర్మిస్తామన్నారు. గ్రామస్తుల విన్నపం మేరకు బకింగ్ హామ్ కెనాల్‌పై బ్రిడ్జి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఉండవల్లి నివాసంలో నిర్వహించిన పొట్టి శ్రీరాములు జయంతి వేడుకల్లో సీఎం పాల్గొని ఆయన విగ్రహానికి నివాళులర్పించారు.
పొట్టి శ్రీరాములు త్యాగంతో ఏర్పడిన రాష్ట్రాన్ని 2047 నాటికి నంబర్‌వన్‌గా మార్చాలని పనిచేస్తున్నట్టు సీఎం తెలిపారు. నేటితో పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకల్లోకి అడుగుపెట్టడంతో వచ్చే ఏడాది మార్చి 16 వరకు ప్రతి నెలా ఒకటి చొప్పున 12 రకాల కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. రానున్న ఐదేళ్లలో పేదరిక నిర్మూలనకు, ప్రతివ్యక్తి జీవన ప్రమాణాలను పెంచేందుకు ఉగాది నుంచి పీ4 విధానాన్ని అమలు చేస్తున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment