potti sriramulu
-
త్వరలో పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ
సాక్షి, అమరావతి : పొట్టి శ్రీరాములు పేరుతో రాష్ట్రంలో తెలుగు యూనివర్సిటీని త్వరలో ఏర్పాటుచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా విజయవాడలో జరిగిన సభలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, పలువురు మంత్రులు పాల్గొని అమరజీవితో పాటు సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటాలకు నివాళులు అర్పించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. చాలాకొద్ది మందే జాతికోసం ఆలోచిస్తారని, పొట్టి శ్రీరాములు 58 రోజులపాటు నిరాహార దీక్షచేసి తెలుగుజాతి కోసం ప్రాణాలర్పించగా.. దేశాన్ని ఐకమత్యంగా ఉంచేందుకు పోరాడిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కొనియాడారు. వీరిద్దరి వర్థంతులు ఒకేరోజు నిర్వహించుకోవడం గొప్ప అంశమన్నారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగువారు అనేక ఇబ్బందులు పడ్డారని, ప్రత్యేక ఆంధ్ర కోసం అనేక ఉద్యమాలు జరిగాయని తెలిపారు. మనకు తమిళ మంత్రులు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చేలోపే బ్రిటిష్ వారు స్వాతంత్య్రం ఇస్తారని 1913లో బాపట్లలో జరిగిన ఆంధ్ర మహాసభలో భోగరాజు పట్టాభి సీతారామయ్య చెప్పారని.. అదే నిజమైందని, 1956 నవంబరు 1న ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందని చంద్రబాబు గుర్తుచేశారు. అమరజీవి పేరుతో హైదరాబాద్‌లో తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేస్తే తాను నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు జిల్లాగా నామకరణం చేశానన్నారు. వచ్చే మార్చి 16 నుంచి అమరజీవి 125వ జయంత్యుత్సవాలు నిర్వహిస్తామని చంద్రబాబు చెప్పారు. ఆయన ఆంధ్ర జాతికి నాయకుడు : డిప్యూటీ సీఎం కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ మాట్లాడుతూ.. అమరజీవి పొట్టి శ్రీరాములు భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడని, ఆయన ఒక కులానికి నాయకుడు కాదని, ఆంధ్ర జాతి మొత్తానికి నాయకుడన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి సాధించి 2.2 ట్రిలియన్ డాలర్ల ఆరి్థక వ్యవస్థగా పురోగతి సాధించడమే మనం ఆయనకిచ్చే నిజమైన నివాళి అన్నారు. కేవలం సమాజం కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం బతికిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని.. రాష్ట్ర విభజన తరువాత తనకు ఆయన గొప్పతనం అర్థమైందన్నారు. మన ఉనికి కోసం మద్రాసులో ఆమరణదీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు పాడె మోయడానికి కూడా ఆనాడు కష్టపడాల్సి వచ్చిoదని తెలిసి తన గుండె కదిలిపోయిందని పవన్ చెప్పారు. ఘంటసాల, మరో నలుగురు కలిసి పాడె మోశారని, ఈరోజు మనం ఆంధ్రులమని గర్వంగా చెప్పుకుంటున్నామంటే అది ఆ మహనీయుడు బలిదానంతో పెట్టిన భిక్షేనన్నారు. మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటలను అమ్ముకోలేని స్థితి గత ప్రభుత్వ పాలనలో ఉందన్నారు. కార్యక్రమంలో మంత్రులు పొంగూరు నారాయణ, అచ్చెన్నాయుడు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
పొట్టి శ్రీరాములుకు ఘోర అవమానం
పాలకొల్లు సెంట్రల్: పాలకొల్లులో ఆదివారం అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఘోర అవమానం జరిగింది. స్థానికంగా నిర్వహించిన సేవ్ ద గర్ల్ చైల్డ్ కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి వంగలపూడి అనిత, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సొంత ప్రచారంలో పడి అమరజీవి 72వ వర్ధంతి కార్యక్రమాన్ని మరచిపోయారు. సేవ్ ద గర్ల్ చైల్డ్ కార్యక్రమం ఏర్పాటుచేసిన గాంధీబొమ్మల సెంటర్లోనే పలువురు దేశ నాయకులు విగ్రహాలు ఉన్నాయి. స్టేజీ కూడా ఈ విగ్రహాల పక్కనే ఏర్పాటు చేశారు. కార్యక్రమం అనంతరం 2కే రన్ ప్రారంభించిన మంత్రులు తిరిగి వెళిపోతున్న సమయంలో ఎవరో గుర్తుచేయగా.. హడావుడిగా అమరజీవికి నివాళులర్పించారు. బాధాకరమైన విషయమేంటంటే.. ‘దండలు తీసుకురండి..’ అని చెప్పగా అక్కడున్న వ్యక్తులు స్టేజీపై పడి ఉన్న దండలను ఏరుకుని మంత్రులకు ఇవ్వడం.. వాటినే మంత్రులు పొట్టి శ్రీరాములు విగ్రహానికి వేయడం. అలాగే గాంధీబొమ్మల సెంటర్లో 13 విగ్రహాలు ఉండగా గాంధీజీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు మాత్రమే దండలు వేసి అంబేడ్కర్, జ్యోతిరావు పూలే, బాబూ జగ్జీవన్‌రామ్, ప్రకాశం పంతులు వంటి మిగిలిన మహానేతల విగ్రహాలకు దండలు వేయకుండా వెళ్లిపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మహిళల కోసమా.. మంత్రి ప్రచారం కోసమా..సేవ్ ద గర్ల్ చైల్డ్ 2కే రన్ కార్యక్రమంలో భాగంగా స్టేజీపై ఏర్పాటుచేసిన బ్యానర్లో ఎక్కడా ఒక్క అమ్మాయి ఫొటో గాని, మహిళ ఫొటో గాని లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. బ్యానర్‌పై మంత్రి నిమ్మల ఫొటో మాత్రమే వేయడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీంతో ఈ కార్యక్రమాన్ని మహిళల కోసం ఏర్పాటు చేశారా లేక మంత్రి ప్ర చారం కోసం ఏర్పాటు చేశారా అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా వైఎస్ జగన్ నివాళులు
-
పొట్టి శ్రీరాములు వర్ధంతి.. వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: నేడు పొట్టి శ్రీరాములు వర్ధంతి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. పొట్టి శ్రీరాములుకు నివాళులు అర్పించారు. తెలుగు వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని అన్నారు.పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు. తెలుగు వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన అమరజీవి శ్రీ పొట్టిరాములుగారి వర్ధంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించి తెలుగు వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన అమరజీవి శ్రీ పొట్టిశ్రీరాములుగారి వర్ధంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులు. pic.twitter.com/hiEfSCdvln— YS Jagan Mohan Reddy (@ysjagan) December 15, 2024 -
రాష్ట్రావతరణ వేడుకలకు బాబు మంగళం
సాక్షి, అమరావతి: నవంబరు 1.. ఎంతో విశిష్టత కలిగిన రాష్ట్ర అవరతణ దినోత్సవానికి టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం మంగళం పాడింది. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన దినోత్సవాలకు అప్పట్లోనే స్వస్తి పలికింది. రాష్ట్రావతరణ దినోత్సవాన్ని నవంబరు 1నే నిర్వహించాలని, తద్వారా ఏపీ బ్రాండ్ ఇమేజ్ పరిరక్షించినట్లవుతుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పినప్పటికీ గత చంద్రబాబు ప్రభుత్వం దానిని గాలికొదిలేసింది. అయితే.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గత ఐదేళ్లూ నవంబరు 1నే రాష్ట్రావతరణ దినోత్సవాలను ఘనంగా నిర్వహించింది. ఇందులో భాగంగా.. రాజ్‌భవన్ దగ్గర నుంచి గ్రామంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల వరకు అన్నిచోట్ల జాతీయ పతాకాన్ని ఎగరవేసి అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి అవతరణ దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. కానీ, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం రాష్ట్రావతరణ దినోత్సవ కార్యక్రమాలకు దూరంగా ఉంది.టీడీపీ–జనసేన ఇలా.. బీజేపీ అలా..మరోవైపు.. రాష్ట్రావతరణ దినోత్సవంపై కూటమిలోని పార్టీలు పరస్పర విరుద్ధమైన వైఖరిని అవలంబించాయి. తెలుగుదేశం, జనసేన పార్టీలు ఈ వేడుకలకు దూరంగా ఉండడంతోపాటు రాష్ట్రావతరణకు ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములకు సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ కనీసం నివాళులు కూడా అర్పించలేదు. కానీ, బీజేపీ మాత్రం రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు అనేకమంది బీజీపీ నాయకులు రాష్ట్ర ప్రజలకు అవతరణ శుభాకాంక్షలు తెలిపారు. ఇక ప్రతిపక్ష వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ కూడా నవంబరు 1 ప్రాముఖ్యాన్ని గుర్తుచేస్తూ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సర్కారుపై నెటిజన్ల ఫైర్..ఈ నేపథ్యంలో.. రాష్ట్రావతరణ వేడుకలకు చంద్రబాబు సర్కారు మంగళం పాడటంపై సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వ చర్యను నిరసిస్తూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. దేశంలో రాష్ట్రావతరణ దినోత్సవం లేని ఏకైక రాష్ట్రంగా ఏపీని తయారుచేయడంతోపాటు అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగ నిరతిని ఘోరంగా అవమానించారంటూ వారు సర్కారును ఎండగడుతున్నారు.పొట్టి శ్రీరాములును చంద్రబాబు అవమానించారు» వైఎస్సార్సీపీ నేతల ధ్వజం»పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవంసాక్షి, అమరావతి: ఆత్మబలిదానంతో తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన అమరజీవి పొట్టి శ్రీరాములును అవమానించేలా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కూటమి ప్రజా ప్రతినిధులు వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు దుయ్యబట్టారు. శుక్రవారం రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ నవంబరు 1న రాష్ట్రావతరణ దినోత్సవాన్ని 2014–19 మధ్య కూడా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించలేదని తెలిపారు. 2014 జూన్ 2న ప్రత్యేక తెలంగాణ ఏర్పడగా, ఏటా ఆ రోజున చంద్రబాబు ప్రభుత్వం నవ నిర్మాణ దీక్ష పేరుతో నాటకమాడిందని, ఇందుకు రూ.80 కోట్లు ఖర్చు చేసిందని దుయ్యబట్టారు. ఇప్పుడు కూడా రాష్ట్రావతరణ దినోత్సవం నిర్వహించకపోవడం పొట్టి శ్రీరాములుతో పాటు ఆర్యవైశ్య జాతినే అవమానించడమని అన్నారు. ఆర్యవైశ్యులను అవమానించే చింతామణి నాటకాన్ని ఆ జాతి ప్రతినిధుల కోరిక వైఎస్ జగన్ ప్రభుత్వం రద్దు చేస్తే, ఇప్పుడు దాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నారని, అదే జరిగితే ఊరుకొనేది లేదని వెలంపల్లి హెచ్చరించారు. టీటీడీ బోర్డు సభ్యులుగా పనికిమాలిన వారికి స్థానం కల్పించారని చెప్పారు. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంతో రాష్ట్ర విభజనకు కారకుడయ్యాడని, ఇప్పుడు రాష్ట్ర అవతరణ దినోత్సవం జరపకుండా అమరజీవి ఆత్మ త్యాగానికి తూట్లు పొడిచాడని మల్లాది విష్ణు ఆక్షేపించారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
అమరజీవికి అవమానం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: శ్రీకాకుళం టీడీపీ అభ్యర్థి గొండు శంకర్ తండ్రి జగన్నాథం ఇటీవల యాదవులను నోటికొచ్చినట్లు తిట్టారు. వారిని కించపరిచేలా మాట్లాడటమే కాకుండా ఫోన్ సంభాషణలో బెదిరించారు.ఇప్పుడు గొండు శంకర్ మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గుజరాతీపేటలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములను అవమానపరిచేలా మాట్లాడారు. శ్రీకాకుళం పొట్టి శ్రీరాములు మున్సిపల్ మార్కెట్‌కు ఆ పేరు తీసేసి అంధవరపు తవిటయ్య పేరు పెడతామని, ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడికి ప్రపోజల్ పెట్టామని బహిరంగ ప్రకటన చేశారు. తండ్రీకొడుకులిద్దరు చేసిన కామెంట్స్ ఇప్పుడు హా ట్ టాపిక్ అయ్యాయి.ఇప్పటివరకు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా పనిచేసిన నాయకులు నగర అభివృద్ధికి పాటు పడ్డారు. ప్రస్తుత మంత్రి ధర్మాన ప్రసాదరావు అయితే జిల్లా కేంద్రం అభివృద్ధిలో కీలక భూ మిక వహించారు. రిమ్స్ ఆస్పత్రి, ప్రధాన వంతెనలు, రోడ్లు, కలెక్టరేట్, స్టేడియం, పార్కులు, మా ర్కెట్, శాలిహుండం, అరసవల్లి దేవాలయం అభివృద్ధి, శ్రీకూర్మం దేవాలయం అభివృద్ధి, కళింగపట్నం బీచ్ అభివృద్ధి, డంపింగ్ యార్డ్, తాగునీరు సరఫరా... ఇలా ఎన్నో అభివృద్ధి పనులతో శ్రీకాకుళం నగరంతో పాటు నియోజకవర్గ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించారు.జిల్లాలోనైతే వంశధార ప్రాజెక్టు, ఆఫ్‌షోర్ ప్రాజెక్టు, లిఫ్ట్ ఇరిగేషన్, మడ్డువలస రి జర్వాయర్, అంబేడ్కర్ యూనివర్సిటీ, మూలపేట పోర్టు, ఉద్దానం కిడ్నీ ఆస్పపత్రి, ఉద్దానం మంచినీ టి ప్రాజెక్టు తదితర అభివృద్ధి పనుల్లో భాగస్వా మ్యం అయ్యారు. ఆయనే కాదు గుండ అప్పలసూర్యనారాయణ, గుండ లక్ష్మీదేవి, అంతకుముందు పనిచేసిన ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులంతా శ్రీకాకుళం అభివృద్ధికి కృషి చేసి, చరిత్రలో నిలిచిపోయారు. కానీ ఎన్నడూ ఇలా ప్రముఖుల పేర్లు తీసేస్తామని వివాదాస్పదంగా వ్యవహరించలేదు. కానీ ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్న గొండు శంకర్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. తండ్రి ఒక కులాన్ని దూషించగా, గొండు శంకర్ ఏకంగా వైశ్యుల ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టేలా, రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన పొట్టి శ్రీరాములను అవమానపరిచేలా వ్యాఖ్య లు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. నగరంలో కీలక వ్యక్తుల పేరుతో కొత్తగా ఏవైనా ఏర్పాటు చేసి వాటికి పేరు పెట్టడమో, లేదంటే వారిని గౌరవించేందుకు, స్మరించేందుకు విగ్రహాలు ఏర్పాటు చేయడమో చేయాలి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక అలాంటి గౌరవం ఎంతో మంది ప్రముఖులకు లభించింది. బొడ్డేపల్లి రాజగోపాలరావు విగ్రహాలను నగరంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేశారు. అంధవరపు వరం మరణించాక ఆయన విగ్రహాన్ని ప్రధాన జంక్షన్లో ఏర్పాటు చేశారు. వీరితో పాటు మరికొంత ప్రముఖుల విగ్రహాలను నగరంలో ఆవిష్కరించారు. అంతేగానీ అప్పటికే ఉన్న వాటికి ప్రముఖుల పేర్లు తీసేయడం చేయలేదు. గొండు శంకర్ సమాజానికి ఏం సంకేతాలు ఇద్దామనుకుంటున్నారో గానీ రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేసి, ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు పేరుతో ఉన్న శ్రీకాకుళం మున్సిపల్ మార్కెట్‌కు ఆయన పేరు తీసేసి అంధవరపు తవిటయ్య పేరు పెడతామనడం వివాదాస్పదమైంది. ఆయన పేరు ను ఏదైనా కొత్తగా ఏర్పాటు చేసిన దానికి పెడతామ ని చెప్పాలే తప్ప రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాముల పేరును తీసేస్తామనడం, దానికో సం ఎంపీ రామ్మోహన్నాయుడికి ప్రతిపాదన పెట్టా మనడం వైశ్య వర్గాన్నే ఆశ్చర్యపరిచింది. వైశ్యుల ముద్దు బిడ్డగానే కాదు రాష్ట్రమంతా గొప్పగా భావించే పొట్టి శ్రీరాములు పేరు తీయాలన్న ఆలోచన రావడమే దారుణమని, ఇలాంటి వికృత చర్యలతో ఏం చేద్దామనుకుంటున్నారని వైశ్య వర్గాలే కాదు ప్రతి ఒక్కరూ తప్పు పడుతున్నారు. -
హైదరాబాద్ లో తెలుగుతల్లి, పొట్టిశ్రీరాములు విగ్రహాల తొలగింపు
-
అమరజీవి పొట్టిశ్రీరాములు జయంతి సందర్భంగా సీఎం జగన్ నివాళి
-
అమరజీవి పొట్టి శ్రీరాములుకు సీఎం జగన్ నివాళి
సాక్షి, అమరావతి: అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా సచివాలయంలో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, పలువురు నేతలు పాల్గొన్నారు. చదవండి: నా తమ్ముళ్లు, చెల్లెళ్లు గొప్పగా చదవాలి: సీఎం జగన్ వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీ రాములు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా కులం, ప్రాంతం, మతం అనే భేదాలు లేకుండా గౌరవించే వ్యక్తి పొట్టి శ్రీరాములు అని.. ఆయన జీవితం ఎందరికో ఆదర్శమని లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. ప్రజల మేలు కోసం చివరివరకు పోరాడిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. డీజీపీ కార్యాలయంలో.. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా మంగళగిరి పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆయన చిత్రపటానికి డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి, పలువురు ఉన్నధికారులు పూలమాల వేసి నివాళులర్పించారు. -
తెలుగు ప్రజల ధిక్కార స్వప్నం అమరజీవి
తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించుకున్న మహా పురుషుడు పొట్టి శ్రీరాములు. 1901 మార్చి 16న మద్రాసు, జార్జిటౌనులో గురవయ్య, మహా లక్ష్మమ్మ దంపతులకు జన్మిం చారు. విద్యాభ్యాసం మద్రాసులోనే జరిగింది. ఆ తరువాత బొంబాయిలో శానిటరీ ఇంజ నీరింగ్ చదివారు. ‘గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే’లో చేరి ఉద్యోగం చేసాడు. భార్య, కుమారుడు చనిపోవడంతో జీవిత సుఖాలపై విరక్తి కలిగింది. దీంతో తన ఉద్యోగానికి రాజీనామా చేసారు. గాంధీజీ సిద్ధాంతాలకు ఆకర్షితులై సబర్మతి ఆశ్రమంలో చేరి ఆయన అనుయాయిగా ఉన్నారు. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుశిక్షను అనుభవిం చారు. తర్వాత మళ్ళీ 1941–42 సంవత్సరాల్లో క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొనడంవల్ల మూడుసార్లు జైలుకు వెళ్ళారు. శ్రీరాములు వంటి కార్యదీక్షాపరులు పదిమంది ఉంటే ఒక్క సంవత్సరంలోనే స్వతంత్రం సాధించవచ్చునని గాంధీజీ అనేవారు. జీవితం చివరిదశలో నెల్లూరులో ఉంటూ, హరిజనోద్ధరణకు కృషిచేసారు. కాళ్ళకు చెప్పులు, తలకు గొడుగు లేకుండా మండుటెండల్లో తిరుగుతూ ప్రచారం చేసేవారు. ఆయన ఆంధ్రుల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు ప్రాణత్యాగానికి పూనుకుని, అమరజీవి అయ్యాడు. 1952 అక్టోబర్ 10 నుంచి 58 రోజులపాటు చెన్నైలో పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. డిసెంబర్ 15న ఆయన ఆంధ్రరాష్ట్రం కోసం అసువులు బాసి అమరజీవి అయ్యారు. తెలుగు రాష్ట్ర ప్రజలకు చేసిన విశేష కృషికి గాను, ఆ అమరజీవికి నివాళులు. -(నేడు పొట్టిశ్రీరాములు జయంతి) నరేష్ జాటోత్, నల్లగొండ మొబైల్ : 82478 87267 -
‘ఏపీ అవతరణ’ తేదీ ఎప్పుడు?
‘‘తెలుగుజాతి మనది – నిండుగ వెలుగుజాతి మనది తెలంగాణ మనది – రాయలసీమ మనది సర్కారు మనది – నెల్లూరు మనది అన్నీ కలిసిన తెలుగునాడు – మనదే, మనదే మనదేరా’’! అలాంటి ప్రాచీనతా చరిత్ర గల తెలుగుజాతి పరస్పర పరిపాలనా సౌలభ్యం కోసం రెండు రాష్ట్రాలుగా (తెలంగాణ–ఆంధ్రప్రదేశ్) విడిపోయి అయిదేళ్ళు నిండి పోయాయి. కాగా విడిపోయిన సోదర తెలంగాణ రాష్ట్ర పాలకులు ఏటా జూన్ 2వ తేదీని తమ రాష్ట్రావతరణ దినోత్సవంగా ప్రకటించుకుని కడచిన అయిదేళ్లుగా వార్షికోత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నారు. కానీ, ఆగమేఘాల మీద రహస్యంగా ఢిల్లీ వెళ్లి ఆంధ్రప్రదేశ్ విభజనకు అంగీకారం తెల్పుతూ, ముఖ్యమంత్రి పదవి కోసం తహతహలాడుతూ కాంగ్రెస్ అధిష్టానం ఎదుట తెల్లకాగితంపై సంతకం చేసి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. దురదృష్టవశాత్తూ అధికారంలో ఉన్న గత అయిదేళ్లుగా ఏ ఒక్కనాడైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణోత్సవం జరిపిన పాపాన పోలేదు. యావత్ భారతదేశంలో నాటి స్వరాజ్య సమ రంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల అవతరణకు నాందీ ప్రస్తావన చేసిన త్యాగధనులు ఆంధ్రులేనన్నది చారిత్రక సత్యం. ఆ సత్యానికి నూనె పోసి, వత్తులు వెలిగించి, నిలిపి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో అస్వతం త్రులుగా గడుపుతూ, మద్రాసీయులుగా అష్టకష్టాలు సహిస్తూ వచ్చిన ఆంధ్రుల గౌరవ ప్రతిష్టలు కాపాడేందుకు స్వతంత్ర భారత్‌లో తొలి సారిగా ఆమరణ దీక్షకు దిగి, ఆత్మబలిదానం ద్వారా ప్రత్యేకాంధ్ర రాష్ట్రాన్ని సాధించిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు. ఆయన త్యాగనిరతిని కేంద్ర కాంగ్రెస్ నాయకత్వం, నెహ్రూ ప్రభుత్వం గుర్తించకపోగా, తమిళనాడు నుంచి ఆంధ్ర విడిపోవడానికి అంగీకరిం చక తాత్సారం వహించిన ఫలితమే శ్రీరాములు బలవన్మరణం! ఆ అసమాన త్యాగఫలితంగా 1953 అక్టోబర్ 1న మద్రాస్ నగరం లేని ఆంధ్ర రాష్ట్రావతరణకు 20వ శతాబ్దపు గుంటనక్కగా నాటి రాజకీ యాల్లో ప్రసిద్ధిపొందిన చక్రవర్తుల రాజగోపాలాచారి ఎత్తుగడలకు నెహ్రూ సై అనడంతో మార్గం ఏర్పడింది. అమరజీవికి సైదోడుగా యావదాంధ్రలోకం ఒక్క గొంతుతో నినదించినదాని ఫలితమే ఇది. పరాయి పాలకుల కుట్రల ఫలితంగా చెల్లాచెదురైపోయిన ఆంధ్ర– తెలంగాణ ప్రాంతాల ఆంధ్రులను విశాలాంధ్రగా ఒక గొడుకు కిందికి చేర్చాలని ఆశించిన వాడు కూడా శ్రీరాములేనని మరవరాదు. యావత్ దక్షిణాంధ్రప్రజలకు శతాబ్దాలుగా తమ శ్రమజీవన సౌందర్యంతో తెలు గువారు దారిదీపాలై పెంచి మహానగరంగా రూపురేఖలు దిద్దిన మదరాసుతో కూడిన ప్రత్యేక ఆంధ్రరాష్ట్రాన్ని అమరజీవి కోరుకున్నారు. ఎందుకంటే బళ్లారి నుంచి ఉత్తరాంద్ర సరిహద్దుల దాకా పక్కనున్న పొరుగు ఒడిశా ప్రాంతాల దాకా చెట్టుకొకరుగా, పుట్టకొకరుగా చెదిరి పోయిన ప్రాంతాలను, ప్రాంతీయ ఆంధ్రులను ఒక్కతాటిపైకి తేవడం ద్వారానే ఆంధ్రత్వానికి వ్యక్తిత్వమూ, పాలనా సౌలభ్యమూ సన్నిహిత మవుతాయని అమరజీవి ఆశించారు. ఆయన అనుపమానమైన త్యాగ ఫలితంగా (1953 అక్టోబర్ 1) దేశంలోనే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన సుదినం కాబట్టి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అక్టోబర్ ఒకటవ తేదీనే రాష్ట్రావతరణ దినోత్సవంగా జరపడం అన్నివిధాలుగా సబబుగా, శ్రేయస్కరంగా ఉంటుంది. పొట్టి శ్రీరాములు ఆత్మబలిదానా నికి నిండైన, మెండైనా నివాళిగా ఉంటుంది. ఇది ఒక్క మద్రాసు నగరానికి సంబంధించిన తెలుగువారి ఆనాటి గోడు మాత్రమే కాదు, చారిత్రకంగా తమిళనాడుతో ఆంధ్రులకు, ఆంధ్ర పాలకులకు ఉన్న అనుబంధాన్ని సమీక్షించుకుంటే.. తమిళ భూభాగం లోని తంజావూరు, మదుర, చెంచి రాజ్యాల్లో తమిళుల ఆదరాభిమా నాలు పొందుతూ తెలుగు పాలకులుగా ఖ్యాతికెక్కినవారు తెలుగు నాయకరాజులేనని మరవరాదు. వీరు తెలుగులో పరిపాలన నిర్వహించ డమే కాకుండా ప్రధానమతాల (హిందూ, క్రైస్తవ, మహమ్మదీయ) మధ్య సమన్వయాన్ని సమతుల్యంతో కాపాడారు. వీరే గాకుండా మరాఠా రాజులు తంజావూరు ఏలికలైనప్పుడు కూడా తెలుగు కవి త్వాన్ని ఆదరించి, తెలుగు సాహిత్య పోషణకు దోహదం చేశారు, ఆ రోజుల నుంచి పరాయి పాలకుల శకం ముగిసేదాకా తెలుగు ప్రము ఖులలో దక్షిణాంధ్ర దారిదీపాలుగా (నా పాత్రికేయ సహచరులు, ఆకాశ వాణి ప్రయోక్త నాగసూరి వేణుగోపాల్‌కు కృతజ్ఞతతో) ఉన్న మహనీ యులు ఎందరో! అమరజీవి బలిదానానికి, ఆయన పోరాట చరిత్రకు సంబంధించిన ఈతరం వారికి తెలియని పలు అంశాలను తెలియజేస్తూ ‘బలిదానం’ పేరిట వెలువడిన రచన కూడా ఈ తరానికి దారిదీపమే. ఈ సందర్భంగా మదరాసు నగరం పూర్తిగా తమిళులకే గానీ ఆంధ్రులకు ఏమాత్రం చెందదని ఆనాడు వాదించి ఆంధ్రనాయకుల వాదనను కొందరు పూర్వపక్షం చేస్తున్న రోజులలోనే సర్ శంకరన్ నాయర్ అనే తమిళ నాయకుడు మద్రాస్ శాసనమండలిలో (1936) తమిళులకు సంపూర్ణ స్వపరిపాలనా ప్రభుత్వం కావాలని కోరిన సందర్భంలోనే ఒక విస్పష్ట ప్రకటన చేశాడు. ‘ఏర్పర్చబోయే తమిళ ప్రత్యేక రాష్ట్రం పాలనా పరిధి నుంచి మద్రాసు నగరాన్ని వేరు చేయాలి. ఎందుకంటే, మద్రాసు నగరం పూర్తిగా తమిళనాడులో లేదు గనుక, సగం తమిళభాషీయులదైతే, మిగతా సగం మద్రాసు తెలుగు ప్రాంతీ యులదీ‘ అని నిండు పేరోలగంలో ప్రకటించారాయన. (ఆంధ్రోద్యమ నాయకులలో ఒకరైన గుమ్మడిదల వెంకటసుబ్బారావు రచించిన ‘హిస్టరీ ఆఫ్ ఆంధ్రా మూవ్మెంట్‘ వాల్యూం–2, పేజీ 505)! ఈ చరిత్ర పూర్తిగా తెలిసి ఉన్న వాడు కాబట్టే అమరజీవి శ్రీరాములు ఆనాడు ఆ సగ భాగంలో భారీ సంఖ్యలో ఉన్న దక్షిణాంధ్రులకు పూర్తి నిలయంగా ఉన్న మద్రాసు నగరంతో కూడిన ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు తపన పడ్డారు. ఆ మాట కొస్తే తమిళనాడు ఏలికలుగా ఉన్న తెలుగువారు ఒకరా, ఇద్దరా, ఎందరో! 1920–2016 మధ్య కాలంలో తమిళనాడుకు 12 మంది తెలుగు ముఖ్యమంత్రులే ఉన్నారు. తమిళనాడులో ఉన్న ‘తమిళాంధ్ర పార్టీ’ విడుదల చేసిన సాధికార సమాచారం ప్రకారం ‘క్రీస్తు శకం ఒకటో శతాబ్దికి పూర్వం నుండీ తమిళనాడులోని తెలుగువారు దాదాపు అక్కడి స్థానికులే. అక్కడ పుట్టి, అక్కడ పెరిగి, అక్కడి పొలాల్ని దున్ని, వ్యాపారాలు చేసి అక్కడి సంపదను పెంచినవారు, అక్కడి సంస్కృతిని, తమిళాన్ని వికసింపజేసి పలు రకాల కళల్ని అభివృద్ధి పరిచినవారే’’. అంతేగాదు, మరోమాటలో చెప్పాలంటే, తమిళనాడులోని 30 జిల్లాల్లో తెలుగు లేని జిల్లా లేదు, అలాగే మొత్తం 165 తాలూకాల్లో తెలుగు పల్లెలు లేని తాలూకాయే లేదు. చివరికి ‘సంగం’ యుగం గురించి తమిళ సోదరులు ఎంత గొప్పగా చెప్పుకున్నా వారిలో సంగం యుగ కవుల్లో భాగమైన ఆళ్వా రులు వంటి కవుల్లో అత్యధికులు తెలుగువారై ఉండి, తమిళ రచనలూ చేసి ప్రసిద్ధికెక్కినవారే. ఈ సమన్వయ ప్రతిభ గల వారు కాబట్టే జస్టిస్ ఆవుల సాంబశివరావు, జస్టిస్ వీఆర్ కృష్ణయ్యర్ భాషా ప్రయుక్త రాష్ట్రాల వల్ల దేశ సమైక్యతకు ఆటంకం కాలేదనీ, ప్రాంతీయ దురభిమానాలనూ నిస్సారమైన కేంద్రీకరణ (సెంట్రలైజేషన్) వాదాన్నీ కాక, ఆచరణ యోగ్యమైన ఫెడరల్ (సమైక్య) రాజ్యాంగ వ్యవస్థ దృఢమైన పునాదులు నిర్మించుకోవాలనీ, అఖండ భారతజాతి ఏకతా భావానికి అదే రక్షణ అనీ స్పష్టం చేయవలసి వచ్చింది. 1905 నాటి బెంగాల్ విభజనకు ముందే, 1904 నాటి గుంటూరు యువజన మహాసభ, ఆ తర్వాత బయ్యా నరసింహశాస్త్రి అధ్యక్షతన బాపట్ల మహాసభ మొదలు అమరజీవి శ్రీరాములు ప్రాణత్యాగం దాకా, ఆంధ్ర రాష్ట్రావతరణకు, స్వపరిపాలనకు ఆంధ్ర దేశమంతటా మహోద్య మాలు ఉవ్వెత్తున కొనసాగుతూనే వచ్చాయి. వాటి ఫలితమే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం అవతరణ. ఈ మహోద్యమాలలో అంతర్భాగంగానే మద రాసులోని ‘ఆంధ్ర పత్రిక’ స్థాపకులు పండిత కాశీనాథుని నాగేశ్వర్రావు బస చేసిన ‘శ్రీబాగ్’ (నివాసం పేరు)లో ఆనాటి కోస్తా, రాయల సీమాంధ్ర నేతల మధ్య రాయలసీమ వెనుకబాటు తనానికి పరిష్కారం ప్రాతిపదికపైన ప్రత్యేక ఒడంబడిక కుదిరి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. ఈ ఒప్పందంలోని అంశాలు సంపూర్ణమైన పరిష్కారం కోసం ఈ రోజుకీ ఉభయ ప్రాంతాల నాయకుల మధ్య సంప్రతింపుల పర్వం నడుస్తూనే ఉంది. పెక్కుమంది రాష్ట్ర నాయకులు తమ వ్యక్తిగత ప్రాబల్యం కోసం పాకులాటకు ప్రాధాన్యమిచ్చి, ఒప్పం దంలోని ప్రధానాంశాల అమలుపై కేంద్రీకరించి ఆయా ప్రాంతాల కరువు ప్రాంతాల సమస్యల పరిష్కారానికి సమన్వయపూర్వక వైఖరిని ప్రదర్శించక పోవడంవల్లనే ప్రజలు ఆందోళన చెందవలసి వస్తోంది. కనుకనే ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, సీమ ప్రాంత సమస్యలు ఉన్నాయి. రాయలసీమ కరువు ప్రాంతానికి ఆర్థిక రాజధాని అవసరమని, దర్శి, కనిగిరి, పొదిలి, దొనకొండ, మార్కాపురం, కంభం, గిద్దలూరు ప్రాంతాల మధ్య అతి తక్కువ సమయంలోనే ఆర్థిక–వాణిజ్య రాజధాని (ఫైనాన్షియల్ కాపిటల్) అభివృద్ధి కాగలదని పలువురు ప్రజా ప్రతిని ధులు భావిస్తున్నారు. తద్వారా ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే అవకాశమూ దొరుకుతుందన్నది వారి విశ్వాసం. ఇలా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలోనూ రకరకాల సమస్యలను ప్రజలు ఎదు ర్కొంటున్నారు. అన్ని ప్రాంతాలలోనూ పూర్తయిన ప్రాజెక్టులకన్నా, పూర్తి కాని లేదా పదే పదే శంకుస్థాపన దశలు దాటని ప్రాజెక్టుల సంఖ్య పెరిగిపోతోంది. అలాంటి పరిస్థితులలోనే ప్రాంతీయవాదాలూ, ఆందో ళనలూ పెరుగుతుంటాయి. కనుకనే నదీ జల వివాదాలు, పంపిణీ విధానాలూ కొన్ని జల వివాద ట్రిబ్యునళ్ల వివాదాస్పద తీర్పులవల్ల కూడా ప్రాంతీయ తగాదాలు పెచ్చరిల్లుతున్నాయి. వీటన్నిటినీ ఏపీ నూతన మంత్రివర్గం, సీఎంగా జగన్ చైతన్యవంతమైన సారథ్యంలో సామరస్యంగా పరిష్కరించడం సాధ్యమనే విశ్వాసం ప్రజలకు ఉంది. ఈ పురోగమనంలో అంతర్భాగంగానే అమరజీవి పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి కొనసాగింపుగా విశాలాంధ్ర విభజనానంతరం ఏర్పడిన ఏపీకి ఏటా అక్టోబర్ ఒకటవ తేదీని రాష్ట్రా వతరణ దినోత్సవంగా జరుపు కోవడం సకల విధాలా శ్రేయస్కరమని ప్రతిపాదన. పైగా రాయలసీమకు ముఖ ద్వారమైన కడప కేంద్రంగా అనేక ప్రత్యేకాంధ్ర మహాసభలూ జరిగాయని మరవరాదు. ప్రతి పాలకుడూ ’కర్పూర వసంతరాయలు’ కాకపోవచ్చు! కానీ పాలకుడు ప్రజాహితుడైతే మాత్రం కర్పూర ఘుమఘుమలు నలుదిక్కులా వ్యాపించి, సంక్షేమ కార్యాచరణతో నిత్యవసంతాన్నే ప్రజలకు పంచగలుగుతాడు. ఏబీకే ప్రసాద్,సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
‘అమరజీవి’ జయంతి, వర్ధంతులపై మీ వైఖరేంటి?
సాక్షి, హైదరాబాద్: అమరజీవి శ్రీపొట్టి శ్రీరాములు జయంతి, వర్ధంతులను అధికారంగా నిర్వహించే విషయంలో వైఖరి ఏమిటో తెలియచేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాంస్కృతికశాఖ ముఖ్య కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పొట్టి శ్రీరాములు జయంతి, వర్థంతులను అధికారికంగా నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు పవిత్ర స్మృతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు వేణుగోపాల్ ఇటీవల హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
పొట్టి శ్రీరాములుకు ఘన నివాళి
సాక్షి, హైదరాబాద్ : అమరజీవి పొట్టి శ్రీరాములుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనంగా నివాళి అర్పించింది. నేడు పొట్టి శ్రీరాములు వర్థంతి సందర్భంగా శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. తెలుగువాడి గొప్పతనాన్ని చాటి చెప్పిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని, రాష్ట్రంలో అంటరానితనం నిర్మూలన గావించేందుకు ఆయన సల్పిన కృషి ఎన లేనిదని కొనియాడారు. తెలుగువాళ్లందరినీ ఒక్క తాటిపైకి తెచ్చిన ఆయన ప్రతి తెలుగువాడి గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్న అమరుడని కీర్తించారు. -
అమరజీవికి YSRCP ఘనంగా నివాళి
-
అమరజీవికి ఏపీసీసీ ఘనంగా నివాళి
హైదరాబాద్: అమరజీవి పొట్టి శ్రీరాములు పట్టువీడని మహనీయుడని, తెగింపు గలవాడని, ఆయన ఆశయాలు నేటి తరానికి స్పూర్తి దాయకమని ఏపీసీసీ పేర్కొంది. ఆంధ్రరాష్ట్ర సాధన కోసం పోరాడి, ప్రాణత్యాగం చేసిన మహాపురుషుడు అమరజీవి పొట్టి శ్రీరాములు 117 జయంతి జరుపుకోవడం గర్వించదగ్గ విషయం అని ఏపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం అన్నారు. ఇందిరా భవన్లో విలేఖరుల సమావేశంలో గంగాధరం మాట్లాడుతూ... పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16న నెల్లూర్ జిల్లాలోని పెద్దమట్టపల్లి గ్రామంలో జన్మించారు. శ్రీరాములు లాంటి అకుంటిత దీక్ష వ్యక్తులు 10 మంది ఉంటే మన దేశానికి సంవత్సర కాలంలోనే స్వాతంత్ర్యం తీసుకువస్తానని ఆనాడే మహాత్మాగాంధీ చెప్పారని మరొసారి గుర్తు చేశారు. అతని దేశభక్తికి, పట్టుదలకు గాంధీజీ మాటలే నిలువెత్తు సాక్ష్యాలన్నారు. అంతేకాక శ్రీరాములు ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని జైలు శిక్ష అనుభవించారని గంగాధరం శ్రీరాములు దేశభక్తిని గుర్తు చేశారు. ఆనాడు మద్రాస్ రాజధానిగా ఉన్నప్పుడు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 1952 అక్టోబర్ 19న నిరాహార దీక్షను ప్రారంభించారన్నారు. అతని 58 రోజుల దీక్షకు మద్దతుగా ప్రజలు ధర్నాలు, సమ్మెబాట పట్టారని ఆనాటి రోజులు గుర్తు చేశారు. కానీ శ్రీరాములు 1952 డిసెంబర్ 15న మరణించారు. అతని మరణ వార్త విన్నప్రజలు ఆవేశాలతో హింసాత్మక చర్యలకు పాల్పడి చెన్నై నుంచి విశాకపట్నం వరకు ఆందోళనలు చేశారని పేర్కొన్నారు. డిసెంబర్ 19న నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారన్నారు. ఆయన కృషి ఫలితంగా కర్నూల్ రాజధానిగా 1953 అక్టోబర్ 1న ఆంధ్రరాష్ట్రం ఏర్పడిందని చెప్పారు. -
పొట్టిశ్రీరాములును విస్మరించడం బాధాకరం
రాష్ట్ర ప్రజలను మోసగిస్తున్న టీడీపీ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఘనంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ వేడుకలు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన శ్రీకాకుళం అర్బన్: తెలుగు భాష మాట్లాడే వారందరి కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరుతూ పొట్టిశ్రీరాములు ప్రాణత్యాగం చేసి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాధించారని, అటువంటి అమరజీవిని తెలుగుదేశం ప్రభుత్వం విస్మరించడం బాధాకరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాధరావు ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం శ్రీకాకుళంలోని పాత బస్టాండ్ వద్దనున్న పొట్టిశ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అనాలోచితంగా, బాధ్యతా రాహిత్యంగా పాలన సాగిస్తోందని దుయ్యబట్టారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతి, అక్రమాలకు పాల్పడడం దుర్మార్గపు చర్య అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల పొట్టలు కొడుతూ ధనవంతులకు కొమ్ముకాస్తోందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన రోజు జూన్ 2వ తేదీ అని, ఆ రోజు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అవతరన దినోత్సవంగా చెప్పుకోవడం శోచనీయమన్నారు. ఇది ప్రభుత్వ బాధ్యతా రాహిత్యానికి నిదర్శమని ధర్మాన అన్నారు. జూన్ 2వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఎలా అవుతుందో సీఎం చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. నవంబరు ఒకటో తేదీని సప్రదాయంగా కొనసాగించకపోవడం టీడీపీ దుర్మార్గానికి నిదర్శనమన్నారు. ప్రభుత్వ భూముల దోపిడీకే క్యాబినెట్ సమావేశాలు క్యాబినెట్ సమావేశాల్లో కేవలం ప్రభుత్వ భూములు ఎలా అమ్మాలి, ప్రజల ఆస్తులు ఎలా దోచుకోవాలి తదితర ఆలోచనలే తప్ప ప్రజాసమస్యలపై కనీస శ్రద్ధ చూపకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్రంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయని, ఇంత దుర్మార్గంగా ప్రజలను మోసం చేసిన పార్టీ ఏదీ లేదన్నారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పాటుపడుతోందని ధర్మాన చెప్పారు. టీడీపీ ప్రభుత్వ అవినీతి పాలనను ఎండగట్టేందుకు ప్రజలంతా సిద్దమవ్వాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నేతలు ఎం.వి.పద్మావతి, అంధవరపు సూరిబాబు, ఎన్ని ధనుంజయ్, గొండు కృష్ణమూర్తి, డాక్టర్ పైడి మహేశ్వరరావు, చల్లా అలివేలు మంగ, సాధు వైకుంఠరావు, డాక్టర్ శ్రీనివాస్ పట్నాయక్, మండవిల్లి రవి, గుమ్మా నగేష్, టి.కామేశ్వరి, ఎం.ఎ.రఫి, ఎం.వి.స్వరూప్, శిర్ల రామారావు, అంబటి శ్రీనివాసరావు, కె.సీజు, గుడ్ల మల్లేశ్వరరావు, పొన్నాడ రుషి, కోరాడ రమేష్, గుడ్ల దామోదరరావు, పసగడ రామకృష్ణ, రావాడ జోగినాయుడు, ధర్మాన రఘునాధమూర్తి, పీస శ్రీహరి, బైరి మురళి, జె.ఎం.శ్రీనివాస్, తెలుగు సూర్యనారాయణ పాల్గొన్నారు. -
అనుక్షణం ఉత్సాహంతో ఉరకలెత్తేవాడే కార్యసాధకుడు
కష్టాలు అందరికీ వచ్చినట్టుగానే రాముడికీ వచ్చాయి. అవి చూసి మనం విచలితులమయినట్టుగానే రాముడు కూడా ఓ క్షణంపాటు విచలితుడయ్యేవాడు. ఎక్కడెక్కడ రాముడు శోకానికి గురయ్యే సన్నివేశం వస్తుందో అక్కడక్కడ వాల్మీకి మహర్షి అద్భుతమైన శ్లోకాలను మనకు అందించారు. ఒక సన్నివేశంలో భార్య కనపడక రాముడు విపరీతమైన శోకానికి గురయిన సందర్భంలో మహర్షి శత్రువులందరిలోకి పెద్ద శత్రువు శోకమే. ఎప్పుడైనా సరే, నేనిది సాధించలేకపోయానని దుఃఖానికి వశుడైపోయాడా ఇక వాడు వృద్ధిలోకి రాలేడు. శోకం మొట్టమొదట ధైర్యాన్ని పోగొడుతుంది. శోకం అంతకుముందు విన్న మంచి మాటలు మర్చిపోయేటట్లు చేస్తుంది. శోకం వలన మనిషి వృద్ధిలోకి రాకుండా పతనమవుతాడు. ఏ మనిషి సాధించగలడు అంటే... ఎవడు నిరంతరం ఉత్సాహంతో ఉంటాడో వాడు జీవితంలో సాధించనిదంటూ ఉండదు అనిర్వేదోశ్రీయం మూలం, అనిర్వేదపరం సుఖం, అనిర్వేదోహి సతతం, సర్వార్థేషు ప్రవర్తకః ’’ - (నిరాశావాదాన్ని వదలడం సంపదకు తొలిమెట్టు. నిరాశావాదం నుండి విముక్తి పొందడం నిజమైన ఆనందాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం, ఏ పని చేయాలన్నా, దానిలో సఫలతపొందాలన్నా, నిరాశావాదాన్ని ఎవరూ ఆశ్రయించకూడదు.) అందుకే మనసు ఎప్పుడూ నిర్వేదాన్ని పొందకూడదు. ఇద్దరు ఖైదీలు జైలు ఊచల నుంచి బయటికి చూస్తున్నారు. ఒకడు చుక్కలను చూస్తుంటే, మరొకడు కింద ఉన్న బురదను చూస్తున్నాడు. మనిషి ఎంత కష్టంలో కూడా ఆశావాదిగా ఉండాలి. ఎం.ఎస్.సుబ్బలక్ష్మిగారు తొలినాళ్ళలో రికార్డింగ్‌కు వెడితే.. ‘‘నీ గాత్రం పాడడానికి యోగ్యంగా లేదు’’ అని నిరాకరించారు. వారు నిరాశావాదానికి గురయ్యారా? లేదే! గాంధీగారు ముందు నడిచివెడుతుంటే అందరూ వెనక నడిచేవారు. ఒకసారి పొట్టి శ్రీరాములుగారు ముందు నడుస్తుంటే.. వెనకన ఉన్న వాళ్ళు అడ్డొచ్చి ‘‘గాంధీగారికంటే ముందు నడుస్తావేంటి, వెనకకురా’’ అన్నారు. గాంధీగారు కల్పించుకుని ‘‘శ్రీరాములు మిగిలిన వాళ్ళలాకాదు, నియమబద్ధమైన జీవితం గడుపుతున్నవాడు. నా కోసమే బతుకుతున్నవాడు. ముందు నడవనీయండి’’ అన్నారు. గాంధీగారు ఏం చెప్పారో దానికోసమే బతికిన శ్రీరాములు గారు చివరకు శరీరత్యాగానికి కూడా వెనకాడలేదు. అంతటి మహానుభావులు వారు. మహాత్ముల జీవితాలు అలా ఉంటాయి. కంచికామకోటి పీఠానికి ఆధిపత్యం వహించిన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామివారి దగ్గరికి ఒకసారి ఒక శిష్యుడు వెళ్ళి - ‘‘మిమ్మల్ని జగద్గురు అని సంబోధించాలనుకుంటున్నాం, అలా పిలవవచ్చా?’’ అని విన్నవించుకున్నారు. దానికి ఆయన ‘‘నిరభ్యంతరంగా పిలవవచ్చు. నేను జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామినే. జగద్గురు అన్నది బహువ్రీహి సమాసం. జగత్తు అంతా గురువుగా కలిగినవాడు - అని కూడా అర్థం. నేను జగత్తుకు గురువును కాదు, ఈ జగత్తు అంతా నాకు గురువు కాబట్టి నేను జగద్గురువునే ’’ అన్నారు. ఇదీ విద్యా దదాతి వినయం అంటే! నేను ఏవో కొన్ని పుస్తకాలు చదువుకున్నంతమాత్రం చేత విర్రవీగితే నా అంత అహంకారి ఇంకొకడు ఉండడు. ఒక గ్రంథాలయంలోకి వెళ్ళి నిలబడితే నేను సమకూర్చుకున్న జ్ఞానం ఏపాటిదో అర్థమౌతుంది. తనకు అన్నీ వచ్చు అని కాదు, రానివెన్నో అనుకోవడం గొప్ప. ఎన్నో శాస్త్రాలు చదువుకున్నవాళ్ళు కూడా నాకేమి వచ్చు అని ఆగిపోయారు. ఎందువల్ల ? పర్వతాల గురించి అంతా చదువుకున్నవాడు, భూగోళ శాస్త్రమంతా చదివినవాడు ఆఖరున ఏమంటాడంటే... ‘‘నేను పర్వతాల గురించి చదివాను. ఇన్ని రకాల నేలల గురించి చదివాను. ఎన్నో రకాల మైదానాలు, పీఠభూములను గురించి చదివాను. అసలు ఇన్ని పర్వతాలు, ఇన్ని మైదానాలు, ఇన్ని పీఠభూములు, ఇన్ని నదులు సృష్టించిన ఆ పరమాత్మ ఎంత గొప్పవాడో’’ అంటాడు. చదువు సంస్కారంతో కలసి ఉంటుంది. ఎంత చదువుకున్నా సంస్కారంలేని నాడు, ఆ చదువు పదిమందికి పనికొచ్చేది కాదు. తన తండ్రి ఎటువంటి కష్టాల్లోంచి వచ్చాడో తెలుసుకోవడానికి, చెప్పడానికి సిగ్గుపడే కొడుకు కొడుకే కాదు. తాను ఎన్ని కష్టాలుపడ్డాడో చెప్పుకోవడానికి నామోషీ పడే వ్యక్తి శీలవంతుడు కానే కాదు. నీవు ఎక్కడపుట్టావు, ఎక్కడ పెరిగావు... ఇవి కావు. నీవు దేనిగా మారావు, ఏయే గుణాలు సంతరించుకున్నావు. ఉత్థానపతనాలకు ఎలా ఎదురొడ్డి నిలిచావు, ఎవరు నీకు ఆదర్శం వంటి విషయాలు నిస్సంకోచంగా చెప్పుకోగలగాలి. వెయిటింగ్ లిస్ట్‌లో నీకు సీటు ఖరారుకాకపోతే, ఒక రాత్రి జనరల్ కంపార్ట్మెంట్లో ప్రయాణించవలసివస్తే... అయ్యబాబోయ్, నావల్లకాదు అని దిగిపోయినవాడు జీవితంలో మంచి సాధకుడు కాలేడు. అలా దిగిపోకుండా వెళ్ళగలిగినవాడికి అంత ధైర్యం ఎలా వస్తుందంటే... మహాత్ముల జీవితాల నుంచి నేర్చుకున్న పాఠాలతో! -
‘అమరజీవి సేవలు చిరస్మరణీయం’
రాష్ట్రానికి అమరజీవి పొట్టిశ్రీరాములు అందించిన సేవలు చిరస్మరణీయమని వక్తలు కొనియాడారు. అమరజీవి 62వ వర్ధంతిని పురస్కరించుకుని మంగళవారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కోవెలకుంట్లలోని పొట్టిశ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పెండేకంటి సుబ్రమణ్యం మాట్లాడుతూ... తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేసి త్యాగశీలి అయ్యారని పేర్కొన్నారు. ప్రభుత్వం అధికారికంగా ఆయన జయంతి, వర్ధంతి వేడుకలను నిర్వహించకపోవడం విచారకరమన్నారు. -
ప్రత్యేకాంధ్ర కోసం ఆమరణ దీక్ష ఆరంభం
ఆ నేడు నిన్నమొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కలిసి ఉన్నట్టే ఆంధ్ర, తమిళనాడు కలిసి ఉండేవి. దానినే ఉమ్మడి మద్రాసు రాష్ట్రం అనేవారు. అయితే తెలుగు భాష మాట్లాడేవారందరి కోసం ఒక ప్రత్యేక తెలుగు రాష్ట్రం కావాలని కోరుతూ నెల్లూరు జిల్లాకు చెందిన పొట్టి శ్రీరాములు అక్టోబర్ 19న బులుసు సాంబమూర్తి ఇంటిలో ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. అంతకు ముందే ఆయన అనేక పర్యాయాలు అనేక సమస్యల పరిష్కారం కోసం నిరాహార దీక్షలు చేసి, వాటిని సాధించారు. ఆ తర్వాత ఆంధ్రరాష్ట్ర సాధన కోసం ఆయన ఏకంగా ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. దాదాపు రెండు నెలలపాటు అంటే 57 రోజుల పాటు ఆయన మరణించే వరకు దీక్ష ను కొనసాగించారు. ఆయన మరణంతో కేంద్రప్రభుత్వం దిగి వచ్చింది. డిసెంబర్ 19న ప్రత్యేక ఆంధ్రరాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నాటి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ ప్రకటించారు. ఆయన దీక్షకు గుర్తుగా 2008లో నెల్లూరు జిల్లాను శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా పేరు మార్చారు. అంతేకాదు, హైదరాబాద్ నాంపల్లిలో శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరిట యూనివర్శిటీని నెలకొల్పారు. -
తెలుగు వర్సిటీ ప్రవేశ పరీక్షలు వాయిదా
సాక్షి, హైదరాబాద్: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్, వరంగ ల్ ప్రాంగణాల్లో 2015-16 విద్యా సంవత్సరానికి ప్రకటించిన వివిధ కోర్సులకు ఈ నెల 7 నుంచి జరగాల్సిన ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఎంఏ, ఎంపీఏ, ఎంసీజే, పీజీడిప్లొమా, డిప్లొమా, సర్టిఫికెట్ తదితర కోర్సులకు ప్రవేశ పరీక్షలను త్వరలో నిర్వహిస్తామని రిజిస్ట్రార్ ఆచార్య కె.తోమాసయ్య వెల్లడించారు. -
రసామృతం..
-
తిట్టు కాదు వ్యంగ్యమే.. జైపాల్‌రెడ్డి
‘శుంఠ’ వ్యాఖ్యలపై జైపాల్ వివరణ ఆ పదాన్ని ఉపసంహరించుకుంటున్నా సాక్షి, న్యూఢిల్లీ: సీమాంధ్ర నేతలను ‘శుంఠ’లుగా అభివర్ణిస్తూ తాను చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి వివరణ ఇచ్చారు. ‘ప్రకాశం పంతులు అపార దేశభక్తిని, పట్టాభి సీతారామయ్య పాండిత్యాన్నీ శ్లాఘిస్తూ.. పండిత పుత్ర పరమ శుంఠ అనే సామెతను దృష్టిలో పెట్టుకొని వ్యంగ్య ధోరణిలో మాత్రమే నేను శుంఠ అనే పదం వాడాను. నేటి సీమాంధ్ర నాయకులు తెలంగాణ చారిత్రక అనివార్యతను గుర్తించలేకపోతున్నారనేదే నా ఆవేదన. ఆ వ్యంగ్యాన్ని తిట్టుగా చిత్రీకరించారు. ఆ పదాన్ని ఉపసంహరించుకుంటున్నా’ అని పేర్కొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం వంటి మహోన్నత వ్యక్తులు పుట్టిన ప్రాంతంలో ఇప్పుడు శుంఠలు పుట్టారంటూ తెలంగాణ వ్యతిరేకులనుద్దేశించి ఈ నెల 11న హైదరాబాద్‌లో జరిగిన ఓ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో జైపాల్‌రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై సీమాంధ్ర నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఈ మేరకు ఆయన సోమవారమిక్కడ ఓ ప్రకటన విడుదల చేశారు. -
అమరజీవికి విజయమ్మ, జగన్ నివాళులు
తెలుగువారందరికీ ఒకే రాష్ట్రం కావాలని ఆత్మార్పణం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం ఉదయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి తమ క్యాంపు కార్యాలయంలో నివాళులర్పించారు. అమరజీవి చిత్రపటానికి వినమ్రంగా పూలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటిం చారు. పార్టీ ఎమ్మెల్యేలు మేకతోటి సుచరిత, భూమా శోభానాగిరెడ్డి, గొల్ల బాబూరావు, టి.బాలరాజు, ధర్మాన కృష్ణదాస్, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, కె.శ్రీనివాసులు, కాపు రామచంద్రారెడ్డి, చెన్నకేశవరెడ్డి, బి.గురునాథరెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, పినిపె విశ్వరూప్, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీలు సి.నారాయణరెడ్డి, ఆదిరెడ్డి అప్పారావు, మేకా శేషుబాబు, జూపూడి ప్రభాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్ , పేర్ని వెంకట్రామయ్య, జోగి రమేష్, మద్దాలి రాజేష్‌కుమార్, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, పార్టీ నేతలు కొణతాల రామకృష్ణ, ఎంవీ మైసూరారెడ్డి, చిత్తూరు జిల్లా నేత పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమరజీవి ఆత్మబలిదానాన్ని స్మరించుకున్నారు. -
జారిపోతాంది..
అనంతపురం ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ : ‘అడ్డదిడ్డమైన కొలతల కారణంగా విద్యార్థులకు యూనిఫాం సరిపడక ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది నుంచి ప్రతి విద్యార్థి కొలతలు తీసుకునే యూనిఫాం కుట్టించాలి. లేనిపక్షంలో బిల్లులు చేసే ప్రసక్తే ఉండదు’ అని రాజీవ్ విద్యామిషన్ (ఆర్వీఎం) స్టేట్ ప్రాజెక్టు డెరైక్టర్ (ఎస్పీడీ) ఉషారాణి ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో ప్రకటించారు. అయితే ఆచరణలో పరిస్థితి తారుమారైంది. అనంతపురం నగరంలోని పొట్టి శ్రీరాములు నగరపాలక ఉన్నత పాఠశాలలో నాగేష్ నాయక్ ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. ఇతనికి ఈ ఏడాది రెండు జతల యూనిఫాం ఇచ్చారు. అవి చాలా బిగుతుగా ఉన్నాయి. చేసేది లేక రోజూ కలర్ డ్రెస్‌తోనే పాఠశాలకు వస్తున్నాడు. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి విద్యార్థులెందరూ ఇక్కట్లు పడుతున్నారు. విద్యా హక్కు చట్టం అమలులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 1-8 తరగతుల విద్యార్థులకు ఏడాదికి రెండు జతల యూనిఫాంను ఆర్వీఎం ఆధ్వర్యంలో సరఫరా చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న 1-10 తరగతుల విద్యార్థులకు ఏడాదికి నాలుగు జతల యూనిఫాం ఆయా శాఖలు పంపిణీ చేస్తున్నాయి. అయితే, ఇవి పట్టుమని పది రోజులు కూడా వేసుకునే విధంగా ఉండడం లేదు. జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 1-8 తరగతుల విద్యార్థులు 3,07,431 మంది ఉన్నారు. వీరికి 6,14,862 జతలు ఇవ్వాల్సి ఉంది. 125 సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో 9,500 మంది, 91 బీసీ హాస్టళ్లలో 13,200 మంది, 18 గిరిజన సంక్షేమ హాస్టళ్లలో 1753 మంది 1-10 తరగతుల విద్యార్థులు ఉంటున్నారు. పాఠశాలలు, హాస్టళ్లలోని విద్యార్థుల యూనిఫాం కోసం ప్రభుత్వం ఏటా సుమారు రూ.16 కోట్లు ఖర్చు చేస్తోంది. -
ఓట్లకోసం రాష్ట్ర విభజన తగదు: దేవెగౌడ
సాక్షి, తిరుమల : ఓట్లకోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించాలని చూడడం సరికాదని మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ అభిప్రాయపడ్డారు. గురువారం రాత్రి ఆయన తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ దేశంలో భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడ్డాయన్నారు. ఆంధ్రరాష్ట్రం కోసం పొట్టిశ్రీరాములు తన ప్రాణాలను అర్పించారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను ఏ ప్రాతిపదికన విభజిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.