
సాక్షి, హైదరాబాద్: అమరజీవి శ్రీపొట్టి శ్రీరాములు జయంతి, వర్ధంతులను అధికారంగా నిర్వహించే విషయంలో వైఖరి ఏమిటో తెలియచేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాంస్కృతికశాఖ ముఖ్య కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని స్పష్టం చేసింది.
ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పొట్టి శ్రీరాములు జయంతి, వర్థంతులను అధికారికంగా నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు పవిత్ర స్మృతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు వేణుగోపాల్ ఇటీవల హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment