
సాక్షి, తాడేపల్లి: నేడు పొట్టి శ్రీరాములు వర్ధంతి. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.. పొట్టి శ్రీరాములుకు నివాళులు అర్పించారు. తెలుగు వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని అన్నారు.
పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు. తెలుగు వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన అమరజీవి శ్రీ పొట్టిరాములుగారి వర్ధంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులు’ అంటూ వ్యాఖ్యలు చేశారు.

ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించి తెలుగు వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన అమరజీవి శ్రీ పొట్టిశ్రీరాములుగారి వర్ధంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులు. pic.twitter.com/hiEfSCdvln
— YS Jagan Mohan Reddy (@ysjagan) December 15, 2024