Tributes
-
గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ కి ప్రియా సిస్టర్స్ ఘన నివాళి..
-
మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కు వైఎస్సార్సీపీ నేతల నివాళి
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీసీ కేంద్ర కార్యాలయంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా ఆజాద్ ఆలోచనలు, సిద్దాంతాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్తామని వైఎస్సార్సీపీ నేతలు తెలిపారు. భారత విద్యా వ్యవస్ధను ఉన్నతంగా తీర్చిదిద్దిన మహనీయుడు ఆజాద్ అని కొనియాడారు.ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖా మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతి సందర్భంగా ఆ మహానీయుడికి వైఎస్సార్సీపీ ఘనంగా నివాళులర్పించింది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆజాద్ చిత్రపటానికి వైఎస్సార్సీపీ సీనియర్ నేతలు పూలమాలలు వేసి ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు.ఈ సందర్భంగా పార్టీ నేతలు మాట్లాడుతూ..‘విద్యాశాఖా మంత్రిగా విద్యా వ్యవస్ధను ఉన్నతంగా తీర్చిదిద్దిన గొప్పవాడిగా ఆయన నిలిచారని, ఆయన బాటలోనే పయనిస్తూ, ఆయన అడుగుజాడల్లో అందరూ ముందుకు వెళ్ళాలని కొనియాడారు. ఆజాద్ ఆలోచనలు, నిర్ణయాలు విద్యారంగాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దాయి, విద్యారంగంలో దేశంలో ఎక్కడా లేని విధంగా సంస్కరణలు తీసుకురావడానికి గల కారణం కూడా ఆజాద్. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆలోచనలు, వైఎస్సార్సీపీ సిద్దాంతాలు ఆజాద్ స్పూర్తితోనే కొనసాగుతున్నాయని గర్వంగా చెప్పగలం. రాబోయే రోజుల్లో కూడా ఇదే స్పూర్తిని కొనసాగిస్తామని హామీ ఇస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు టీజేఆర్ సుధాకర్ బాబు, దూలం నాగేశ్వరరావు, వైఎస్సార్సీపీ నాయకులు షేక్ ఆసిఫ్, డాక్టర్ మెహబూబ్ షేక్, మనోహర్ రెడ్డి, దొడ్డా అంజిరెడ్డి, మస్తాన్, గౌస్, రవిచంద్ర, కొమ్మూరి కనకారావు, పురుషోత్తం, పలువురు నాయకులు పాల్గొన్నారు. -
‘పుల్వామా’ అమరులకు ప్రధాని మోదీ ఘన నివాళులు
న్యూఢిల్లీ/హల్దా్వనీ: జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో 2019 ఫిబ్రవరి 14వ తేదీన జరిగిన ఉగ్రదాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్లకు ప్రధాని మోదీ శుక్రవారం నివాళులర్పించారు. దేశం పట్ల వారు అచంచలమైన విశ్వాసాన్ని కనబరిచారని కొనియాడారు. వారి త్యాగాలను భవిష్యత్తు తరాలు గుర్తుంచుకుంటాయని ప్రధాని మోదీ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఉగ్రవాదులను ఏరిపారేసేందుకు మోదీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. పుల్వామా ఉగ్ర ఘటనలో అసువులు బాసిన జవాన్లకు ఆయన ఘనంగా నివాళులర్పించారు. వీరి త్యాగాల వల్లే మన దేశ సరిహద్దులు భద్రంగా ఉన్నాయన్నారు. మానవీయతకే అతిపెద్ద శత్రువైన ఉగ్రవాదంపై పోరుకు నేడు ప్రపంచమే ఏకమైందని శుక్రవారం హోం మంత్రి అమిత్ షా ‘ఎక్స్’లో తెలిపారు. పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌ని ఆత్మాహుతి దళ బాంబర్ వాహనంతో ఢీకొట్టడంతో 40 మంది జవాన్లు అసువులు బాసిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు ప్రతీకారంగా వైమానికదళం యుద్ధ విమానాలు పీవోకేలోని బాలాకోట్ ఉగ్ర స్థావరాన్ని నేలమట్టం చేశాయి. -
నేతాజీని స్ఫూర్తిగా తీసుకోండి
న్యూఢిల్లీ: భావిభారత పౌరులైన విద్యార్థులు నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. నేతాజీ జయంతిని పురస్కరించుకుని పరాక్రమ్ దివస్ కార్యక్రమంలో భాగంగా పాత పార్లమెంట్ భవంతిలో నేతాజీ చిత్రపటం వద్ద మోదీ నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి హాజరైన విద్యార్థులనుద్దేశించి తర్వాత మోదీ ప్రసంగించారు. ‘ నాడు స్వరాజ్యం కోసం ప్రజలు ఐక్యంగా మెలిగారు. నేడు ప్రజల మధ్య అదే ఐక్యత సాధిస్తే అది వికసిత భారత్‌కు బాటలు వేస్తుంది. దేశాన్ని బలహీనపరిచే, దేశ ఐక్యతను నీరుగార్చే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. నేతాజీ నుంచి స్ఫూర్తి పొందాలి. అభివృద్ధి చెందిన భారత్‌ను సాధించాలన్న లక్ష్యంగా ముందుకుసాగే మనందరికీ నేతాజీ సదా స్ఫూర్తినందిస్తూనే ఉంటారు. కంఫర్ట్ జోన్‌ను వీడదాంతర్వాత మోదీ కటక్‌లో జరిగిన పరాక్రమ్ దివస్ కార్యక్రమంలోనూ వర్చువల్‌గా మాట్లాడారు. ‘‘ నేతాజీ ఎప్పుడూ తాను సౌకర్యవంతమైన జీవితం(కంఫర్ట్జోన్లో) గడపాలనుకోలేదు. దేశ స్వాతంత్య్ర కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ సాకారం కావాలంటే మనందరం కంఫర్ట్ జోన్‌ను వీడి కష్టించి పనిచేయాలి. ప్రపంచస్థాయి అత్యుత్తమ పనితీరు కనబరచాలి. మెరుగైన పనితీరు మీద దృష్టిపెట్టాలి. అభివృద్ధి చెందిన భారత్‌నే సుభాష్ చంద్రబోస్ కలలుగన్నారు. వికసిత్ భారత్‌ను సాక్ష్యాత్కారింపజేసుకుని నేతాజీకి నిజమైన నివాళులు అర్పిద్దాం’’ అని అన్నారు. నిజమైన నేతచర్చలో పాల్గొన్న విద్యార్థులతో మోదీ మాట్లాడారు. నేతాజీ బోధనల్లో నీకేం ఇష్టం? అని ఒక అమ్మాయిని అడగ్గా.. ‘‘నాకు మీ రక్తం ఇవ్వండి. నేను మీకు స్వా తంత్య్రాన్ని ఇస్తా.. అనే మాటలు ఎంతో స్ఫూర్తివంతంగా ఉంటాయి. అన్నింటికన్నా ఆయనకు దేశమే ముఖ్యం. దేశంలో కర్భన ఉద్గారాల వెల్లడిని తగ్గించాలి. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించాలి. ఇందుకోసం ఎలక్ట్రిక్ వాహనాలు, బస్సులు వాడాలి’’ అని అమ్మాయి చెప్పింది. దీంతో మోదీ కల్పించుకుని.. ‘‘ మా ప్రభుత్వం అదే బాటలో పయనిస్తోందికదా. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం 1,200 విద్యుత్ బస్సులను సమకూర్చింది. మరిన్ని అందుబాటులోకి తేనుంది. పీఎం సురక్షా యోజన సైతం తెచ్చాం. ఇంటి పైకప్పుపై సౌరఫలకాల వ్యవస్థ ఏర్పాటుచేసుకుంటే నెలనెలా విద్యుత్ బిల్లుల బాధ ఉండదు’’ అని మోదీ అన్నారు. -
కార్టర్‌కు కన్నీటి వీడ్కోలు
వాషింగ్టన్: దిగ్గజ అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌కు అమెరికా ప్రభుత్వం ఘన నివాళులర్పించింది. దేశ రాజధాని వాషింగ్టన్లో జరిగిన అధికారిక నివాళుల కార్యక్రమంలో దేశాధ్యక్షుడు జో బైడెన్ సెల్యూట్ చేసి తమ ప్రియతమ నేతకు తుది వీడ్కోలు పలికారు. గురువారం వాషింగ్టన్ సిటీలోని జాతీయ చర్చికు కార్టర్ పార్థివదేహాన్ని తీసుకొచ్చి ప్రభుత్వ లాంఛనాలతో అధికారిక సంతాప కార్యక్రమాలు పూర్తిచేశారు. ఈ నివాళుల కార్యక్రమంలో అధ్యక్షుడు బైడెన్‌తోపాటు అగ్రరాజ్య మాజీ అధ్యక్షులు జార్జి బుష్, బిల్ క్లింటన్, బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షులుగా సేవలందించిన ఐదుగురు అగ్రనేతలు ఇలా ఒకే వేదికపై కనిపించడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. చివరిసారిగా 2018 డిసెంబర్లో మాజీ దేశాధ్యక్షుడు జార్జ్ హెచ్ డబ్ల్యూ బుష్ సంతాప కార్యక్రమానికి ఇలా ఒకే చోట ఐదుగురు అధ్యక్షులు హాజరయ్యారు. కార్టర్‌కు ఘనంగా అంజలి ఘటిస్తూ బైడెన్ తన సంతాప సందేశం చదివి వినిపించారు. ‘‘ అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన వారు తదనంతర కాలంలో ఎలాంటి నిరాడంబర జీవించాలో, హుందాగా ఉండాలో కార్టర్ ఆచరించి చూపారు. అంతర్జాతీయ సమాజానికి సేవ చేయాలన్న ఆయన సంకల్పానికి రాజకీయాలు ఏనాడూ ఆయనకు అడ్డురాలేదు’’ అని బైడెన్ అన్నారు. నివాళుల కార్యక్రమంలో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ దంపతులు సైతం పాల్గొన్నారు. మాజీ అధ్యక్షునిగా నివాళిగా సైనికులు తుపాకులతో ‘21 గన్ సెల్యూట్’ సమర్పించారు. 39వ అధ్యక్షుడిగా సేవలందించిన కార్టర్ 100 ఏళ్లు జీవించి డిసెంబర్ 29వ తేదీన తుదిశ్వాస విడిచిన విషయం విదితమే. కార్టర్ భౌతిక కాయాన్ని మూడు రోజులపాటు అమెరికా పార్లమెంట్ భవనంలో మూడు రోజుల పాటు ప్రజల సందర్శనార్థం ఉంచారు. గురువారం ఉదయం నేషనల్ క్యాథడ్రల్‌కు తీసుకొచ్చి ఈ అధికారిక నివాళుల కార్యక్రమం చేపట్టారు. దీంతో ప్రభుత్వ అధికారిక వీడ్కోలు కార్యక్రమం గురువారంతో ముగిసింది. తర్వాత కార్టర్ భౌతికకాయాన్ని గురువారం జార్జియాలోని స్వస్థలం పెయిన్స్ గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడ భార్య రొజలిన్ కార్టర్ సమాధి పక్కనే కార్టర్‌ను ఖననం చేస్తారు. రోజలిన్ 77 ఏళ్ల వయస్సులో 2023 నవంబర్‌లో కన్నుమూశారు. -
మన్మోహన్‌కు అంతర్జాతీయ మీడియా నివాళులు
మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ మరణానికి అంతర్జాతీయ మీడియా సంతాపం తెలిపింది. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి బాటన నడిపిన నాయకుడని ప్రపంచ మీడియా ప్రశంసించింది. ఆర్థిక సంస్కరణల రూపశిల్పి: బీబీసీ 1991లో ఆర్థిక మంత్రిగా, 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా భారత ఆర్థిక వ్యవస్థను ఆధునీకరించడంలో మన్మోహన్సింగ్ కీలక పాత్ర పోషించారు. ఆయన కీలక సరళీకృత ఆర్థిక సంస్కరణల రూపశిల్పి. భారత అత్యున్నత పదవిని నిర్వహించిన మొదటి సిక్కుగా చారిత్రక ప్రాముఖ్యత కలిగిన నేత. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లకు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పారు. పదవులు నచ్చని రాజు: రాయిటర్స్ మన్మోహన్ సింగ్.. పదవులు నచ్చని రాజు. భారత్‌లో అత్యంత విజయవంతమైన నాయకులలో ఒకరు. ఆయన పాలనలో జరిగిన ఆర్థిక వృద్ధి లక్షలాదిమందిని పేదరికం నుండి బయటకు తీసుకొచ్చింది. గొప్ప ప్రధానిగా ప్రపంచవ్యాప్తంగా గౌరవం పొందినా.. సోనియాగాంధీ చేతిలోనే ప్రభుత్వం ఉందనే విమర్శలను ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. దూరదృష్టిగల నేత: న్యూయార్క్ టైమ్స్ మన్మోహన్సింగ్ భారతదేశాన్ని ప్రపంచ ఆర్థిక వేదికపైకి నడిపించిన దూరదృష్టి గల నేత, మృదుభాíÙ. పాకిస్తాన్‌తో సయోధ్య కోసం ఆయన అనేక ప్రయత్నాలు చేశారు. సమగ్రతకు చిహ్నం: వాషింగ్టన్ పోస్ట్ మన్మోహన్సింగ్ టెక్నోక్రాట్ నుంచి ప్రధాని స్థాయికి నాటకీయంగా ఎదిగారు. భారత్–అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్రను పోషించారు. ఆయన హయాంలో జరిగిన ఇండో–యూఎస్ పౌర అణు ఒప్పందం ఒక మైలురాయి. సమగ్ర నాయకుడైన ఆయన శక్తిహీనులని ప్రత్యర్థుల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన వ్యక్తి: బ్లూమ్‌బర్గ్ మన్మోహన్సింగ్ గొప్ప సంస్కర్త. 1990లలో భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో కీలక పాత్ర పోషించారు. అవినీతి కుంభకోణాలతో రెండో పర్యాయంలో ఆయన సవాళ్లు ఎదుర్కొన్నారు. ఇది పెట్టుబడిదారులను నిరాశపరిచింది. ఆయన ప్రతిష్ఠను దెబ్బతీసింది. ఎల్లలెరుగని స్నేహితుడు: ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడంలో మన్మోహన్సింగ్ పాత్ర అమోఘం. వేగవంతమైన ఆర్థిక వృద్ధికి ఆయన చేసిన కృషి, సంస్కరణలు ఆయన పదవీకాలంలో మైలురాళ్లు. సామాజిక విధానం, దౌత్యంలో ఆయన నాయకత్వం గొప్పది. 2జీ స్పెక్ట్రమ్ కేసు, బొగ్గు కుంభకోణం వంటి వివాదాలు ఆయన తర్వాతి కాలాన్ని దెబ్బతీశాయి. సౌమ్యుడైన నాయకుడు: అల్ జజీరా మన్మోహన్ సింగ్ సౌమ్య ప్రవర్తన కలిగిన టెక్నోక్రాట్. గొప్ప వ్యక్తిగత సమగ్రత కలిగిన నాయకుడు. దూర దృష్టితో సామాజిక, ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. -
అసాధారణ వ్యక్తి
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన జ్ఞాపకాలు ‘ఎ ప్రామిస్డ్ ల్యాండ్’పుస్తకంలో మన్మోహన్ సింగ్ (Manmohan Singh) అసాధారణ నాయకత్వానికి నివాళులు అర్పించారు. ‘‘అసాధారణ జ్ఞానం ఉన్న వ్యక్తి. ఆర్థిక సంస్కరణల పట్ల. భారత ప్రజల శ్రేయస్సు పట్ల ఆయనకు నిబద్ధత, అంకితభావం, అచంచలమైన చిత్తశుద్ధి ఉంది. ఆయన లక్షలాది మందిని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చారు. తెలివైన వ్యక్తి. ఆలోచనాపరుడు. నిజాయితీపరుడు. భారత ఆర్థిక వ్యవస్థపై (Indian Economy) మన్మోహన్ సింగ్ ప్రభావం మరిచిపోలేనిది. వృద్ధిని ప్రోత్సహించే, పేదరికాన్ని తగ్గించే, విద్య, ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యతనిచ్చే విధానాలను అమలు చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (నరేగా), సమాచార హక్కు చట్టం వంటి తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు దేశంపై శాశ్వత ప్రభావాన్ని చూపాయి. తన పదవీకాలంలో విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ, ఆయన భవిష్యత్ పట్ల ఆశాజనకంగా ఉన్నారు’’. – అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆయన అంకితభావాన్ని గుర్తుంచుకుంటాం : అమెరికా మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల భారత ప్రజలకు అమెరికా ప్రగాఢ సంతాపం తెలిపింది. ‘‘అమెరికా–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి దారులేసిన గొప్ప ఛాంపియన్లలో మన్మోహన్ సింగ్ ఒకరు. గత రెండు దశాబ్దాల్లో మన దేశాలు కలిసి సాధించిన అనేక అంశాలకు ఆయన కృషి పునాది వేసింది. అమెరికా–భారత్ పౌర అణు సహకార ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లారు. భారత వేగవంతమైన ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చిన ఆర్థిక సంస్కరణలకు స్వదేశంలో మన్మోహన్ సింగ్ గుర్తుండిపోతారు. డాక్టర్ సింగ్ మృతికి సంతాపం తెలుపుతున్నాం. అమెరికా, భారత్‌లను మరింత దగ్గర చేయడానికి ఆయన చూపిన అంకితభావాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాం’’అని అమెరికా ప్రకటించింది. ఆయన పర్యటన మైలురాయి ‘‘మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణానికి మాల్దీవుల ప్రజల తరపున సంతాపం తెలుపుతున్నా. 2011 నవంబరులో మాల్దీవుల్లో ఆయన చేసిన చారిత్రాత్మక పర్యటన మన ఆర్థిక, సామాజిక అభివృద్ధిలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. అభివృద్ధి పట్ల డాక్టర్ మన్మోహన్‌సింగ్‌కు ఉన్న నిబద్ధత, ‘లుక్ ఈస్ట్ పాలసీ’ని బలోపేతం చేయడంలో ఆయన నాయకత్వం దక్షిణాసియా ప్రాంత అభివృద్ధికి, సహకారం పెంపొందించడంలో కీలక పాత్ర పోషించాయి. ఈ విపత్కర సమయంలో ఆయన కుటుంబానికి, భారత ప్రజలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా’’ – డాక్టర్ మొహమ్మద్ ముయిజు, మాల్దీవుల అధ్యక్షుడు మన్మోహన్సింగ్ నాకు గురువు ‘‘డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను నేను గురువుగా భావిస్తా. జర్మనీ మాజీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ కూడా ఆర్థిక అంశాలపై డాక్టర్ సింగ్ సలహాలు తీసుకున్నారు. 2013లో యూరోజోన్ క్రైసిస్ మీటింగ్ నిర్వహించినప్పుడు ఆమె డాక్టర్ సింగ్ సహాయం కోరారు’’ – జపాన్ మాజీ ప్రధాని షింజో అబే -
ఆర్థిక సంస్కర్తకు అశ్రు నివాళి
సాక్షి, న్యూఢిల్లీ: దివికేగిన ఆర్థిక సంస్కర్త మన్మో హన్ సింగ్‌కి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధా నమంత్రి నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ తదితర ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. త్రివర్ణ పతాకం చుట్టిన మన్మోహన్ పార్థివదేహాన్ని ఢిల్లీలోని ఆయన నివాసమైన 3, మోతిలాల్ నెహ్రూ రోడ్డుకు తరలించారు. నివాళులర్పించడానికి శుక్రవారం పార్టీలకు అతీతంగా పెద్ద సంఖ్యలో నాయకులు, కేంద్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, పలువురు ప్రముఖులు తరలివచ్చారు. ఈ సందర్భంగా దేశాభివృద్ధికి మన్మోహన్ అందించిన సేవలను స్మరించుకున్నారు. మన్మోహన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన భార్య గురుశరణ్ కౌర్‌ను ఓదార్చారు. ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జె.పి.నడ్డాతోపాటు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాందీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ తదితరులు మన్మోహన్ భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్, హిమాచల్‌ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖూ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఢిల్లీ సీఎం అతిశీ, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్, ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే కూడా నివాళులర్పించారు. నేడు నిగమ్‌బోధ్ ఘాట్‌లో అంత్యక్రియలు దివంగత మాజీ ప్రధాని అంత్యక్రియలు శనివారం ఉదయం జరుగుతాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ చెప్పారు. మన్మోహన్ పారి్థవదేహాన్ని ఉదయం 8 గంటలకు ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తరలిస్తామని, ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు ప్రజలు సందర్శించవచ్చని తెలిపారు. 9.30 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమవుతుందని అన్నారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయని వెల్లడించారు. శనివారం ఉదయం 11.45 గంటలకు ఢిల్లీలోని నిగమ్‌బోధ్ ఘాట్ శ్మశాన వాటికలో మన్మోహన్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కేంద్ర హోంశాఖ తెలియజేసింది. పూర్తి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని రక్షణ శాఖకు సూచించినట్లు పేర్కొంది. కేంద్ర మంత్రివర్గం సంతాపం మన్మోహన్ మృతి పట్ల కేంద్ర మంత్రివర్గం సంతాపం ప్రకటించింది. ప్రధాని మోదీ నేతృత్వంలో కేబినెట్ శుక్రవారం సమావేశమైంది. మన్మోహన్ ఆత్మశాంతి కోసం తొలుత రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. ప్రభుత్వంతోపాటు యావత్తు దేశం తరఫున సంతాపం తెలియజేశారు. అనంతరం సంతాప తీర్మానం ఆమోదించారు. మహోన్నత రాజనీతిజు్ఞడు, ఆర్థికవేత్త, గొప్ప నాయకుడిని దేశం కోల్పోయిందని తీర్మానంలో పేర్కొన్నారు. ప్రధానమంత్రిగా ఆయన మనందరిపై బలమైన ముద్ర వేశారని కొనియాడారు. మన్మోహన్ గౌరవార్థం ప్రభుత్వం ఏడు రోజులపాటు సంతాప దినాలుగా ప్రకటించింది. సీడబ్ల్యూసీలో సంతాప తీర్మానం ఆమోదం మన్మోహన్ సింగ్‌కు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) నివాళులర్పించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షతన సీడబ్ల్యూసీ శుక్రవారం ఏఐసీసీ ప్రధాన కార్యా లయంలో భేటీ అయ్యింది. సోనియా గాం«దీ, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ హాజరయ్యారు. మన్మోహన్‌కు సంతాపం ప్రకటిస్తూ ఒక తీర్మా నం ఆమోదించారు. భారత రాజకీయాల్లో, ఆర్థిక వ్యవస్థలో అగ్రగణ్యుడు మన్మోహన్ అని కొనియాడారు. ఆయన కృషితో ప్రపంచస్థాయిలో మన దేశానికి ప్రత్యేక గుర్తింపు, గౌరవం లభించాయని పేర్కొన్నారు. దేశంలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టిన మన్మోహన్ చిరస్మరణీయులని ఉద్ఘాటించారు. ప్రజల తలరాతలు మార్చేలా ఎన్నో విప్లవాత్మక పథకాలు, కార్యక్రమాలు తీసుకొచ్చిన ఘనత ఆయనదేనని ప్రశంసించారు. ఢిల్లీలో స్మారక చిహ్నం మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు దేశ రాజధాని ఢిల్లీలో స్మారక చిహ్నం నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమాచారాన్ని కాంగ్రెస్‌కు కూడా అందించినట్లు శుక్రవారం ప్రభుత్వ వర్గాలు వివరించాయి. ఇందుకు అనువైన స్థలాన్ని ఎంపిక చేసేందుకు కొంత సమయం పడుతుందని తెలిపాయి. అయినప్పటికీ ఈ అంశంపై కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని విమర్శించాయి.అదే సంప్రదాయం పాటించాలి: ఖర్గే ఢిల్లీలో మన్మోహన్ సింగ్‌కు స్మారకం నిర్మించడానికి వీలైన చోటేఆయన అంత్యక్రియలు నిర్వహించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోరారు. ఈ మేరకు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీకి రెండు పేజీల లేఖ రాశారు. మన మాజీ ప్రధానమంత్రులకు, రాజనీతిజు్ఞలకు అంత్యక్రియలు జరిగిన చోటే స్మారకం నిర్మించారని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా అదే సంప్రదాయం పాటించాలని విజ్ఞప్తి చేశారు. దేశానికి మన్మోహన్ అందించిన విశిష్టమైన సేవలను ఖర్గే తన లేఖలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. అంతకముందు ఆయన ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడారు. మన్మోహన్ స్మారక నిర్మాణంపై చర్చించారు. మన్మోహన్ శాశ్వత విశ్రాంతి తీసుకొనే ప్రదేశాన్ని గొప్పగా తీర్చిదిద్దాలని, అదొక పవిత్రమైన స్థలంగా ఉండాలని పేర్కొన్నారు. -
దేశం మరువలేని దార్శనికుడు
చరిత్ర సృష్టించటం, దాన్ని తిరగరాయటం, వినూత్న ఒరవడికి శ్రీకారం చుట్టడం అందరివల్లా కాదు. ప్రపంచాన కోట్లమందిలో ఒక్కరికి కూడా ఆ అవకాశం అంత సులభంగా దక్కదు. కొన్ని తరాలకు ఒకరైనా అలాంటివారు ఉద్భవిస్తారంటే నమ్మలేం. అలాంటి అరుదైన విశిష్ట వ్యక్తుల్లో గురువారం రాత్రి కన్నుమూసిన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఒకరు. పేదింట పదిమంది సంతానంలో ఒకరిగా, కిరోసిన్ లాంతరు దగ్గర చదువుకున్న మన్మోహన్ జీవితంలో అధిరోహించిన శిఖరాలు ఉన్నతమైనవి. 1991లో నాటి ప్రధాని పీవీ నరసింహారావు ఆయనను ఆర్థికమంత్రిగా ప్రకటించినప్పుడు అందరూ విస్తుపోయారు. ఆయనే నమ్మలేదు. అప్పటికే ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనా మిక్స్‌లో అధ్యాపకుడిగా పనిచేశారు. జెనీవా కేంద్రంగా పనిచేసే స్వతంత్ర ఆర్థిక మేధావుల బృందం సౌత్ కమిషన్‌కు సెక్రటరీ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా, రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్‌గా ఉన్నారు. యూజీసీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. రాజకీయాల్లో మనుగడ సాగించటానికి అవసరమైన వాగ్ధాటి, సులభంగా చొచ్చుకుపోయే తత్వంలేని ఒక విద్యావేత్త, ఆర్థిక నిపుణుడు దేశానికి ఆర్థికమంత్రేమిటని ఆశ్చర్యపోయారు. కానీ అందరూ అనుకున్నట్టు ఆయన సాధారణ వ్యక్తి కాదని త్వరలోనే అర్థమైంది. దేశాన్ని ప్రగతి పట్టాలెక్కించి శరవేగంతో పరుగులెత్తించగల నూతన ఆర్థిక విధానాలను సృజించటంలో అసాధారణ ప్రజ్ఞాపాటవాలు గలవాడని సర్వులూ గ్రహించారు. కేంద్ర ఆర్థికమంత్రిగా 1991లో ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ స్వతంత్ర భారతంలో ఎన్నడూ ఎరుగనిది. ఫేబియన్ సోషలిజం భావనల ఆధారంగా నెహ్రూ విరచించిన సామ్యవాద ఆర్థిక విధానాల నుంచి లేశమాత్రం వైదొలగినా దేశం అధోగతి పాలవుతుందని అప్పట్లో కాంగ్రెస్ విశ్వసించేది. మరోపక్క రకరకాల నియంత్రణలతో ‘లైసెన్స్ రాజ్’గా అపకీర్తి పాలైంది మన వ్యవస్థ. ఎన్నో ఆర్థిక క్లేశాలతో, మరెన్నో ఒడుదొడుకులతో ఉన్న ఆ వ్యవస్థకు తన వినూత్న బడ్జెట్‌తో సంపూర్ణ జవసత్వాలిచ్చినవారు మన్మోహన్. అన్యుల కీర్తిని అపహరించటానికి ససేమిరా ఇష్టపడని పీవీ... ఆర్థిక సంస్కరణల కర్త, కర్మ, క్రియ కూడా ఆయనేనని చాటారు. అందువల్లే సారథిగా పీవీయే ఉన్నా సంస్కరణల ఆద్యుడిగా మన్మోహన్‌నే గుర్తిస్తారు. ఆయన విధానాల పర్యవసానంగా అంతవరకూ నిలువెల్లా ఆవరించిన నిర్ణయ రాహిత్యత కనుమరుగైంది. ఒక్కుమ్మడిగా ప్రైవేటు పెట్టుబడి రెక్కలు విప్పుకుంది. లాభార్జన మాత్రమే ధ్యేయంగా భావించే విదేశీ పెట్టుబడులు వెల్లు వెత్తాయి. పబ్లిక్ రంగ సంస్థలు సైతం పోటీలో దీటుగా నిలిస్తే తప్ప మనుగడ లేదని గ్రహించాయి.‘చరిత్ర అయినా నన్ను దయతో గుర్తుపెట్టుకుంటుందని ఆశిస్తాను’ అని ఒక సందర్భంలో అన్నారాయన. తనపై వచ్చిపడుతున్న విమర్శల జడికి ఆ హృదయం ఎంతగా తల్లడిల్లిందో చెప్పే మాట అది. నిజం... ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టినప్పుడైనా, పార్టీలోనూ వెలుపలా వచ్చిన అవాంతరాలను అధిగమించి దృఢంగా అమలు చేసినప్పుడైనా ఆయనకు శాపనార్థాలు ఎదుర య్యాయి. సొంత పార్టీలోనే వ్యతిరేకులు తయారయ్యారు. తొలినాళ్లలోనే ఏదోరకంగా పక్కకు తప్పించాలన్న ప్రయత్నాలూ జరిగాయి. మన రహస్యాలను ఐఎంఎఫ్‌కు చేరేస్తున్నారనీ, ఆ సంస్థ కనుసన్నల్లో విధానాలు రూపొందిస్తున్నారనీ ఎలాంటి ఆధారాలూ లేకుండానే కొందరు వండి వార్చారు. పార్లమెంటులో అలజడి ఖాయమనుకున్నారు. కానీ అప్పటికే మన్మోహన్ నిజాయితీ, నైతిక నిష్ఠ, నిష్కాపట్యత, సచ్ఛీలత అందరికీ అర్థమయ్యాయి గనుక అవన్నీ దూదిపింజñ ల్లా తేలిపోయాయి. వాటిని విపక్షం సభలో ప్రస్తావించినా పెద్దగా పట్టుబట్టలేదు. ఆ తర్వాత పీవీ సహచర మంత్రుల్లో కనీసం 20 మందిపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చినా మన్మోహన్‌ను వేలెత్తిచూపే సాహసం ఎవరూ చేయలేదు. ఆ సుగుణాలే మన్మోహన్‌ను అనంతర కాలంలో ప్రధానిగా ఎంచుకునేందుకు దోహదపడ్డాయి. దేన్నయినా సాధించటంలో ఆయన పట్టుదల ఎంత టిదో చెప్పటానికి అమెరికాతో కుదిరిన అణు ఒప్పందమే ఉదాహరణ. మద్దతునిస్తున్న వామ పక్షాలూ, ఇతర పార్టీలూ ససేమిరా కాదన్నా ఆ ప్రతిపాదనను పార్లమెంటు ముందుంచి ఆమోదింపజేసుకున్న సాహసి ఆయన.మన్మోహన్ అత్యున్నత స్థాయి ఆర్థిక నిపుణుడు కావొచ్చు... ఆ రంగంలో ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారం విప్పిచెప్పిన అనేకానేక విశ్లేషణాత్మక గ్రంథాల రచయిత కావొచ్చు. కానీసిద్ధాంత రాద్ధాంతాల్లో కూరుకుపోకుండా కళ్లెదుటి వాస్తవాలను ఆచరణీయ దృక్పథంతో పరిశీలించి సరిగా స్పందించగల విశాల దృక్పథం ఉన్న నాయకుడు. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో ఉచిత విద్యుత్ ప్రతిపాదన చేసినప్పుడు మొదట్లో దాన్ని ఇష్టపడకున్నా సాగు సంక్షోభాన్ని అధిగమించటానికి అది తోడ్పడిన తీరు గుర్తించాక మన్మోహన్ దాన్ని స్వాగతించిన తీరు మరువలేనిది. ప్రజాజీవన రంగంలో పారదర్శకత కోసం సమాచార హక్కు చట్టం, విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించే విద్యాహక్కు చట్టం, రెక్కాడితేగానీ డొక్కాడని బడుగుజీవులకు కరువురోజుల్లో పని కల్పన కోసం ఉపాధి హామీ చట్టం వంటివి తీసుకొచ్చి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టినా ఏనాడూ ఆయన కీర్తిప్రతిష్ఠలను ఆశించలేదు. తన విధానాలతో దేశాన్ని వైభవోజ్జ్వల శకానికి తీసుకెళ్లినా చివరివరకూ నిగర్విగా, వినమ్రుడిగా జీవించిన దార్శనికుడు మన్మోహన్‌ను ఈ దేశం ఎన్నటికీ మరిచిపోదు. ఆ అసాధారణ, అపురూప విజ్ఞాన ఖనికి ‘సాక్షి’ నివాళులర్పిస్తోంది. -
మాజీ ప్రధానికి క్రీడాలోకం శ్రద్ధాంజలి
న్యూఢిల్లీ: అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు క్రీడాలోకం నివాళులు అర్పించింది. పలువురు దిగ్గజాలు, మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వగ్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, రెజ్లర్ వినేశ్ ఫొగాట్, షట్లర్ సింధు, గోల్ఫర్ జీవ్ మిల్కాసింగ్లు ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మాజీ ప్రధాని మన్మోహన్ మృతి దేశానికి తీరని లోటు. ఆయన సేవల్ని జాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. –సచిన్ టెండూల్కర్రెస్ట్ ఇన్ పీస్ మన్మోహన్జీ. మీ జీవితం మా అందరికీ స్ఫూర్తిదాయకం. 2013లో మీతో ముచ్చటించిన క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేను. మీ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. –షట్లర్ పీవీ సింధు మన్మోహన్ సింగ్ మరణవార్త నన్ను తీవ్రంగా బాధించింది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచాక ఆయనతో నేను భేటీ అయ్యాను. ఆయన నాయకత్వం, ప్రధానిగా ఎంచుకున్న దీర్ఘకాలిక లక్ష్యాలవల్లే భారత్ వృద్ధి సాధించింది. ఆయన సేవలు జాతి ఎన్నటికీ మరువదు. –షూటర్ అభినవ్ బింద్రా నా జీవితంలో నేను కలిసి అతిగొప్ప వ్యక్తుల్లో మన్మోహన్ ఒకరు. దార్శనికతలో ఆయన్ని మించినవారు లేరు. ప్రపంచం గొప్ప జ్ఞానిని కోల్పోయింది. –గోల్ఫర్ జీవ్ మిల్కాసింగ్ మన్మోహన్ ప్రధాని మాత్రమే కాదు. దేశ ప్రగతి కోసం నిరంతరం పాటుపడిన ఆర్తికవేత్త. ఆయన దూరదృష్టి, ప్రవేశపెట్టిన సంస్కరణలు దేశాన్ని ముందుకు నడిపించాయి. –మాజీ రెజ్లర్, ఎమ్మెల్యే వినేశ్ ఫొగాట్ మాజీ ప్రధాని మన్మోహన్ గొప్ప రాజనీతిజ్ఞుడు. భారత్‌ను ప్రగతిపథంలో నిలిపేందుకు అలుపెరగని కృషి చేశారు. బరువెక్కిన హృదయంతో ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. –యువరాజ్ సింగ్ -
NRI: జాకీర్ హుస్సేన్ మృతిపై ఐఎఎఫ్ సంతాపం
డాలస్, టెక్సస్: తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ మృతి పట్ల ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ (ఐఎఎఫ్సి) ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కార్యవర్గ సమావేశంలో తీవ్ర సంతాపం ప్రకటించింది. ఐఎఎఫ్సి అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ "సంగీతరంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత పురస్కారంగా భావించే గ్రామీ పురస్కారన్ని నాల్గు పర్యాయాలు అందుకున్నవారు, ప్రపంచ ప్రఖ్యాత తబలా వాయిద్య విద్వాంసుడు, పద్మవిభూషణ్ జాకీర్ మృతి ప్రపంచంలోని సంగీత ప్రియులందరికీ తీరని లోటని అన్నారు. పసి ప్రాయంలో ఏడు సంవత్సరాల వయస్సునుండే ఎంతో దీక్షతో తన తండ్రి, సంగీత విద్వాంసుడు అయిన అల్లా రఖా వద్ద తబలా వాయించడంలో మెళుకువలు నేర్చుకుని, విశ్వ వ్యాప్తంగా మేటి సంగీత విద్వాంసులైన రవిశంకర్, ఆలీ అఖ్బర్ ఖాన్, శివశంకర శర్మ, జాన్ మేక్లెగ్లిన్, ఎల్. శంకర్ లాంటి వారెందరితోనో 6 దశాబ్దలాగా పలు మార్లు, ఎన్నో విశ్వ వేదికలమీద సంగీతకచేరీలు చేసి అందరి అభిమానాన్ని చూరగొన్న జాకీర్ మృతిపట్ల వారి కుటుంబ సభ్యులుకు తీవ్ర సంతాపం తెలియజేస్తూ, జాకీర్ తో తనకున్న ప్రత్యక్ష పరిచయాన్ని, తాను జరిపిన ముఖా-ముఖీ కార్యక్రమ లంకెను పంచుకున్నారు. ఈ సమావేశంలో ఐఎఎఫ్సి ఉపాధ్యక్షులు తాయబ్ కుండా వాలా, రావు కల్వ ల, కార్యదర్శి మురళి వెన్నం, కోశాధికారి రన్నా జానీ, బోర్డ్ సభ్యులు రాంకీ చేబ్రోలు హాజరయ్యారు. -
వల్లభాయ్ పటేల్ వర్ధంతి.. వైఎస్ జగన్ నివాళులు
సాక్షి, తాడేపల్లి: నేడు సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. పటేల్‌కు నివాళులు అర్పించారు. భారతదేశ అభివృద్దికి ఆయన ఆలోచనలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని కొనియాడారు.నేడు సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్థంతి సందర్భంగా వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘భారతదేశ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నాను. భారతదేశానికి ఏకత్వం, సామాజిక సంస్కరణలను అందించిన విజన్ ఉన్న నాయకుడు వల్లభాయ్ పటేల్. దేశాన్ని ఆయన ఉన్నతంగా తీర్చిదిద్దారు. భారతదేశ అభివృద్దికి ఆయన ఆలోచనలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి’ అంటూ కామెంట్స్ చేశారు. Remembering Sardar Vallabhbhai Patel Ji, the Iron Man of India, on his death anniversary. A visionary leader whose contributions to the unification of India and social reforms shaped the nation we are today. His legacy continues to inspire the spirit of unity and progress.— YS Jagan Mohan Reddy (@ysjagan) December 15, 2024 -
పొట్టి శ్రీరాములు వర్ధంతి.. వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: నేడు పొట్టి శ్రీరాములు వర్ధంతి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. పొట్టి శ్రీరాములుకు నివాళులు అర్పించారు. తెలుగు వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని అన్నారు.పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు. తెలుగు వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన అమరజీవి శ్రీ పొట్టిరాములుగారి వర్ధంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించి తెలుగు వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన అమరజీవి శ్రీ పొట్టిశ్రీరాములుగారి వర్ధంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులు. pic.twitter.com/hiEfSCdvln— YS Jagan Mohan Reddy (@ysjagan) December 15, 2024 -
పార్లమెంట్‌పై ఉగ్రదాడి ఘటన..
న్యూఢిల్లీ: 2001 డిసెంబర్ 13వ తేదీన పార్లమెంట్‌పై జరిగిన ఉగ్రదాడిని ఎదుర్కొని ప్రాణ త్యాగం చేసిన భద్రతా సిబ్బందికి లోక్‌సభ శుక్రవారం ఘనంగా నివాళులర్పించింది. సభ ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగానే అమరుల గౌరవార్థం సభ్యులంతా లేచి నిలబడి కొద్దిసేపు మౌనం పాటించారు. అనంతరం పాత పార్లమెంట్ సంవిధాన్ సదన్ వెలుపల జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అమరులకు పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్, ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ, పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు. సీఐఎస్ఎఫ్ జవాన్లు అమరులకు సెల్యూట్ చేశారు. అనంతరం మౌనం పాటించారు. బాధిత కుటుంబాల సభ్యులతో నేతలు మాట్లాడారు. కాగా, అప్పటి ఘటనలో పార్లమెంట్ భద్రతా విభాగం, ఢిల్లీ పోలీసులు, సీఆర్పీఎఫ్లకు చెందిన 8 మంది సిబ్బందితోపాటు సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ శాఖకు చెందిన ఓ ఉద్యోగి నేలకొరిగారు. పార్లమెంట్‌లోకి ప్రవేశించి మారణ హోమం సృష్టించేందుకు తెగబడిన పాకిస్తాన్‌కు చెందిన మొత్తం ఐదుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు.సర్వదా రుణపడి ఉంటాం: రాష్ట్రపతి ముర్ము 2001లో ఉగ్ర మూకల దాడి నుంచి పార్లమెంట్‌ను రక్షించే క్రమంలో ప్రాణత్యాగం చేసిన వారికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఘనంగా నివాళులర్పించారు. అమరులకు సర్వదా రుణపడి ఉంటామని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. ఉగ్రమూకలను జాతి యావత్తూ కలిసి కట్టుగా ఎదుర్కొందని, ఉగ్రవాదంపై పోరుకు దేశం కట్టుబడి ఉంటుందని ఆమె ‘ఎక్స్’లో తెలిపారు. -
వీర జవాను సుబ్బయ్యకు వైఎస్ జగన్ నివాళులు
సాక్షి,తాడేపల్లి: వీర జవాను సుబ్బయ్యకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ నివాళులర్పించారు. ఈ మేరకు వైఎస్ జగన్ ఎక్స్(ట్విటర్)లో బుధవారం(డిసెంబర్11) ఒక పోస్టు చేశారు.‘రియల్ హీరో సుబ్బయ్యకు సెల్యూట్. జమ్మూలో విధి నిర్వహణలో సుబ్బయ్య వీరమరణం చెందారు.ల్యాండ్‌మైన్ నుంచి 30 మంది జవాన్లను కాపాడి తాను మాత్రం ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. సుబ్బయ్య కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ప్రసాదించాలి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నివాళులర్పిస్తున్నా’అని వైఎస్ జగన్ ట్వీట్లో పేర్కొన్నారు.— YS Jagan Mohan Reddy (@ysjagan) December 11, 2024 -
అంబేద్కర్‌కు వైఎస్ జగన్ నివాళులు
సాక్షి,తాడేపల్లి:రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ నివాళులర్పించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం(డిసెంబర్6) జరిగిన కార్యక్రమంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వైఎస్ జగన్.ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ అంబేద్కర్ స్ఫూర్తి ఎల్లవేళలా సమాజానికి మార్గదర్శకంగా నిలిచేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఆయన జీవితం అందరికీ ఆదర్శనీయమని కొనియాడారు. విజయవాడలోని స్వరాజ్ మైదానంలో ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ గారి సామాజిక న్యాయ మహాశిల్పాన్ని తమ హయాంలో ఏర్పాటు చేసిన విషయాన్ని వైఎస్ జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కమార్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్,మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, నెడ్ క్యాప్ మాజీ ఛైర్మన్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
జ్యోతిరావు పూలే వర్ధంతి.. వైఎస్ జగన్ నివాళులు
సాక్షి, తాడేపల్లి: బడుగు బలహీన వర్గాల ప్రజల హక్కుల కోసం పోరాడిన మహానీయుడు సామాజిక ఉద్యమ కారుడు మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. గురువారం తాడేపల్లిలోని ఆయన నివాసంలో పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. స్త్రీలకు విద్య ఎందుకు అంటున్న రోజుల్లో స్త్రీల కోసం పాఠశాలను ప్రారంభించి వారికి విద్యాబుద్ధులు నేర్పించిన గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే అని ప్రశంసించారు. విద్యలో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఆ మహనీయుడి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయ ఇంఛార్జ్, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ ఆర్. రమేష్ యాదవ్, మాజీ మంత్రులు జోగి రమేష్, విడదల రజిని, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి అంకంరెడ్డి నారాయణమూర్తి పాల్గొన్నారు.మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా శ్రీ వైయస్ జగన్ నివాసంలో ఆయన చిత్రపటానికి పుప్పాంజలి ఘటించి నివాళులర్పించిన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షులు శ్రీ @ysjagan ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయ ఇంఛార్జ్, ఎమ్మెల్సీ లేళ్ళ… pic.twitter.com/2pE6xHV50l— YSR Congress Party (@YSRCParty) November 28, 2024 -
#NimratKaur 30 ఏళ్ల కల నెరవేరింది : నటి నిమ్రత్ కౌర్ (ఫొటోలు)
-
కడసారి వీడ్కోలు.. రతన్ టాటా అంతిమ యాత్ర (ఫోటోలు)
-
లాల్ సలాం.. లాల్ సలాం
సాక్షి, న్యూఢిల్లీ: అశ్రునయనాల మధ్య, కడసారి చూపు కోసం తరలివచ్చిన వేలాదిమంది అభిమానులు, కార్యకర్తల మధ్య కామ్రేడ్ సీతారాం ఏచూరి నివాళులు పూర్తి అయ్యాయి. దేశవ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన ప్రముఖులు, నేతలు ఏచూరికి తుది వీడ్కోలు పలికారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాం«దీ, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, సీపీఎం పోలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్ కారత్, బృందా కారత్, వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, తదితర ప్రముఖులు ఏచూరి పారి్థవ దేహానికి ఘన నివాళులు అర్పించారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, సచిన్ పైలట్, డీఎంకే పార్టీ మంత్రి ఉదయనిధి స్టాలిన్, ఎంపీ కనిమొళి, టీఆర్ బాలు, దయానిధి మారన్, ఆప్ నేత మనీశ్ సిసోడియా, కాంగ్రెస్ నేతలు చిదంబరం, జైరాం రమేష్, అజయ్ మాకెన్, రాజీవ్ శుక్లా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, ఎమ్మార్పిఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ, బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేశ్ రెడ్డి తదితరులు నివాళులు అర్పించారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, చైనా, వియత్నాం రాయబారులు నివాళులర్పించారు. అనంతరం ఏచూరి భార్య సీమాచిస్తీ, కుమార్తె అఖిల, కుమారుడు డాని‹Ùలను పరామర్శించి మనోధైర్యం కల్పించారు. ఏచూరిని కడసారి చూసేందుకు దేశవ్యాప్తంగా ఉన్న ఎస్ఎఫ్ఐ బృందం, ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థి సంఘాలు, వివిధ రాష్ట్రాలకు చెందిన పార్టీ కార్యకర్తలు, విదేశాలకు చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఢిల్లీ గోల్మార్కెట్లోని సీపీఎం కేంద్ర కార్యాలయం నుంచి ఎయిమ్స్ వరకు అంతిమ యాత్ర నిర్వహించారు. జోరు వానను లెక్కచేయకుండా ‘ఇక సెలవు కామ్రేడ్, రెడ్ సెల్యూట్ ఏచూరి’అంటూ నినాదాలు చేశారు. సాయంత్రం 6 గంటలకు వైద్య విద్యార్థుల పరిశోధనల నిమిత్తం ఏచూరి పార్థివ దేహాన్ని కుటుంబీకులు, పార్టీ నేతలు ఎయిమ్స్‌కు అప్పగించారు. -
AP: వైఎస్ఆర్కు రాష్ట్రవ్యాప్తంగా నేతల ఘన నివాళులు
సాక్షి,విశాఖపట్నం: దివంగత నేత వైఎస్‌రాజశేఖరరెడ్డి ఒక వ్యక్తి కాదని ఒక వ్యవస్థ శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ అన్నారు. సోమవారం(సెప్టెంబర్2) వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా విశాఖపట్నం బీచ్‌రోడ్డులో ఉన్న ఆయన విగ్రహానికి వైఎస్ఆర్సీపీ నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. వైఎస్ఆర్కు ఉన్న ప్రజాదరణ దేశంలో మరే సీఎంకు లేదు: బొత్సవైఎస్ పేరు చెప్పగానే అనేక సంక్షేమ పథకాలు గుర్తొస్తాయి.ఆరోగ్యశ్రీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌లాంటి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు.అన్ని వర్గాల ప్రజలకు వైఎస్ హయాంలో మేలు జరిగింది.పార్టీలకతీతంగా వైఎస్‌ను ప్రజలు ఆరాధిస్తారు.వైఎస్ అడుగుజాడల్లోనే వైఎస్జగన్ పయనిస్తున్నారు. ఆయన ఆశయాల కోసం పనిచేస్తున్నారు.వైఎస్ ఆశయాలను మేమంతా కలిసి ముందుకు తీసుకువెళ్తామని ప్రమాణం చేస్తున్నాంప్రజల గుండెల్లో దేవుడిగా వైఎస్.. రాజ్యసభ సభ్యులు గొల్లబాబురావుపేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారు.వైఎస్ ఆశయాలను వైఎస్ జగన్ కొనసాగిస్తున్నారు.మళ్లీ వైఎస్ జగన్ ను మనమంతా కలిసి ముఖ్యమంత్రిగా చేసుకోవాలివైఎస్ఆర్ జిల్లాలో.. వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ జిల్లాలోని పొద్దుటూరు పట్టణంలో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి,మునిసిపల్ ఛైర్మన్ లక్ష్మీదేవి, మాజీ ఆప్కోబ్ చైర్మన్ మల్లెల జాన్సీ,కౌన్సిలర్లు, నాయకులు వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన -
ఇబ్రహీం రైసీకి ఇరాన్ వీడ్కోలు
టెహ్రాన్: హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలుకోల్పోయిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీకి దేశ రాజధాని టెహ్రాన్ ప్రజలు ఘన తుది వీడ్కోలు పలికారు. ఇరాన్ సుప్రీంలీడర్ అయాతొల్లాహ్ అలీ ఖమేనీ సైతం నివాళులరి్పంచారు. బుధవారం సంతాప ర్యాలీలో టెహ్రాన్ సిటీ వీధుల గుండా భారీ వాహనం మీద రైసీ పారి్థవదేహాన్ని తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో ఇరానీయన్లు పాల్గొని తమ నేతకు తుది వీడ్కోలు పలికారు. భారత్ తరఫున ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ బుధవారం టెహ్రాన్ వెళ్లి రైసీకి నివాళులర్పించారు. మహిళా, మానవ హక్కుల హననానికి పాల్పడి ‘టెహ్రాన్ కసాయి’గా పేరుబడినందుకే రైసీ సంతాప ర్యాలీలో తక్కువ మంది పాల్గొన్నారని అంతర్జాతీయ మీడియా వ్యాఖ్యానించింది. సంతాప ర్యాలీలో ఖమేనీ పక్కనే తాత్కాలిక దేశాధ్యక్షుడు మహమ్మద్ మొఖ్బర్ ఏడుస్తూ కనిపించారు. బుధవారం ఖమేనీ మినహా మాజీ దేశాధ్యక్షులెవరూ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొనకపోవడం గమనార్హం. రైసీ మృతికి సంతాపంగా భారత్‌లోనూ ఒక రోజు సంతాపదినం పాటించారు. -
సేవా తత్పరుడు జేఎస్ రెడ్డి
శివాజీనగర: జేఎస్ రెడ్డిగా అందరికీ సుపరిచితులైన జక్కా శ్రీనివాసులురెడ్డి గొప్ప సేవా తత్పరుడని ప్రముఖులు అన్నారు. ఈ నెల 1వ తేదీన బెంగళూరులో తుదిశ్వాస విడిచిన జేఎస్ రెడ్డి దశదిన కర్మ కార్యక్రమాన్ని బుధవారం బెంగళూరులోని ఇందిరా నగర్ క్లబ్లో నిర్వహించారు. మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడుతో పాటు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్ర«భాకర్‌రెడ్డి, నెల్లూరు మాజీ ఎమ్మెల్యే జే.కే.రెడ్డి, బెంగళూరు తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షుడు డాక్టర్ ఏ.రాధాకృష్ణరాజు, వైఎస్సార్సీపీ నాయకుడు భక్తవత్సలరెడ్డి, భాస్కర్‌రెడ్డి, వెంకట్, నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు రాజకీయ నాయకులు, బెంగళూరుకు చెందిన వివిధ రంగాల ప్రముఖులు పాల్గొని జేఎస్ రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించారు. సమాజానికి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. సినీ నిర్మాత, దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి మాట్లాడుతూ జేఎస్ రెడ్డి తన పుట్టినగడ్డకు విశేష సేవలు అందించారన్నారు. జేఎస్ రెడ్డి ఉత్తమ వ్యక్తిత్వం కలిగి స్వశక్తితో ఎదిగారన్నారు. కాంట్రాక్టర్‌గా ఆయన ప్రతిభ అపారమన్నారు. గుజరాత్లో నర్మదా నది కాలువల నిర్మాణంలో ఆయన ప్రతిభను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మెచ్చుకొని జేఎస్ రెడ్డిని ప్రభుత్వం తరఫున సన్మానించారన్నారు. కాంట్రాక్టర్లకు అలాంటి గౌరవం దక్కడం అరుదైన విషయమన్నారు. కర్ణాటక రీజియన్‌లో అత్యధిక ఆదాయపు పన్ను చెల్లించిన వ్యాపారవేత్తగా ఆయనకు బిరుదు లభించిందన్నారు. రెడ్‌క్రాస్ ఆస్పత్రి భవన నిర్మాణానికి సొంత డబ్బు వెచ్చించడమే కాకుండా ఆస్పత్రి నిర్వహణను చూశారన్నారు. క్యాన్సర్ ఆస్పత్రిలో తన సొంత డబ్బుతో వేలాది మంది పేద రోగులకు వైద్యం అందించేందుకు కృషి చేశారని గుర్తు చేశారు. కోట్ల రూపాయలతో చిల్డ్రన్స్ పార్కు నిర్మించారన్నారు. రైతుల సంక్షేమానికి దాదాపు రూ.15 కోట్లు వ్యయం చేశారన్నారు. ఎన్నో అభివృద్ధి పనులకు సహకరించారన్నారు. దాన ధర్మాలు సమాజ బాధ్యతగా భావించారన్నారు. ఆయన మృతి నెల్లూరు జిల్లాకు తీరని లోటని స్మరించుకున్నారు. జేఎస్ రెడ్డి మృతి సమాజానికి తీరని లోటు: ఎం.వెంకయ్య నాయుడు జేఎస్ రెడ్డి తనకు మంచి మిత్రుడని, గొప్ప సేవాతత్పరుడని, ఆయన మృతి వారి కుటుంబానికి, సమాజానికి పెద్ద లోటని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. జేఎస్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులరి ్పంచి మాట్లాడారు. జేఎస్ రెడ్డి భౌతికంగా లేకపోయినా అందరి హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారన్నారు. పెద్దల మాటలను గౌరవిస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారన్నారు. జేఎస్ రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని ప్రారి్థస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు. కార్యక్రమంలో జేఎస్ రెడ్డి కుమారుడు భక్తవత్సలరెడ్డి, కుమార్తె ఇందిర తదితరులు పాల్గొన్నారు. -
సోషల్ జస్టిస్‌కు నిలువెత్తు సాక్ష్యం..
సాక్షి, అమరావతి: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నిలువెత్తు స్ఫూర్తి సామాజిక న్యాయ మహా శిల్పం రూపంలో సగర్వంగా నిలిచింది. విజయవాడ నగరం నడిబొడ్డున స్వరాజ్ మైదానం 18.81 ఎకరాల్లో రూ.404.35 కోట్లతో విగ్రహ నిర్మాణాన్ని పూర్తిచేయడం విశేషం. అలాగే 81 అడుగుల ఎత్తులో కాంక్రీట్ పీఠం(ఫెడస్టల్)పై 125 అడుగుల ఎత్తుగల ఈ అంబేడ్కర్ కాంస్య విగ్రహం కొలువై ఉంది. స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్(సామాజిక న్యాయ మహా శిల్పం)ను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారు. గత టీడీపీ ప్రభుత్వం ఎక్కడో మారుమూల ప్రాంతంలో అంబేడ్కర్ స్మృతివనాన్ని నిర్మిస్తామని స్థలం ఎంపిక చేసి కనీస కార్యాచరణ లేకుండా గాలికొదిలేసింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం చెప్పింది చేసి చూపించేలా సామాజిక న్యాయ మహాశిల్పాన్ని ఆవిష్కరించి చరిత్ర సృష్టించారు. దేశీయంగా తయారైన ఈ కాంస్య విగ్రహం ప్రపంచంలోనే ఎత్తయినది, దేశంలోని మతాతీత విగ్రహాల్లో ఇదే అతి పెద్దది కావడం మరో విశేషం. అంతటి స్ఫూర్తివంతమైన సామాజిక న్యాయ మహాశిల్పం ప్రాంగణంలో అంబేడ్కర్ 133వ జయంతి కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు శనివారం సమీక్షించారు. ఈ కార్యక్రమాన్ని ఎన్నికల కోడ్‌కు లోబడి నిర్వహించేలా చర్యలు చేపట్టారు. ప్రజలు, సామాజికవేత్తలు, అంబేడ్కర్ వాదులు విగ్రహాన్ని సందర్శించి నివాళులర్పించేలా ఏర్పాట్లు చేశారు. దర్శనీయక్షేత్రంగా.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్ఫూర్తిని రాష్ట్ర ప్రజలకు అందించేలా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఇది ప్రముఖ దర్శనీయ క్షేత్రంగా అందరికీ అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో విజయవాడ నగర నడిబొడ్డున చరిత్రాత్మక స్వరాజ్ మైదానాన్ని ప్రభుత్వం ఎంచుకుంది. సాధారణ ప్రజలు ఉదయం, సాయంత్రం నడక కోసం ఈ ప్రాంతాన్ని అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేశారు. పచ్చని ప్రకృతి ప్రతిబింబించేలా సౌందర్యవంతంగా దీనిని తీర్చిదిద్దారు. సామాజిక న్యాయ మహాశిల్పం ప్రాంతంలో మరెన్నో ప్రత్యేకతలను ఏర్పాటు చేశారు. అంబేడ్కర్ ఎక్స్పీరియన్స్ సెంటర్, రెండు వేల మంది కూర్చునేలా కన్వెన్షన్ సెంటర్, ఫుడ్ కోర్ట్, చి్రల్డన్స్ ప్లే ఏరియా, వాటర్ బాడీస్, మ్యూజికల్ ఫౌంటెన్, లాంగ్ వాక్ వేస్తో సహా మొత్తం ప్రాంతాన్ని తీర్చిదిద్దడం విశేషం. -
కేశినేని భవన్లో ఎన్టీఆర్‌కు నివాళుల్పరించిన కేశినేని నాని
-
President Droupadi Murmu: వారి త్యాగాలకు దేశం రుణపడింది
న్యూఢిల్లీ: ఇరవై రెండేళ్ల క్రితం పార్లమెంట్‌పై దాడి ఘటనలో అమరులైన భద్రతాబలగాలకు దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యాఖ్యానించారు. బుధవారం పార్లమెంట్ దాడి మృతులకు ఆమె నివాళులర్పించారు. ‘‘ ప్రజాస్వామ్య దేవాలయంపైనే దాడికి తెగబడి అత్యున్నత స్థాయి రాజకీయనేతలను అంతంచేయాలని ఉగ్రవాదులు హేయమైన కుట్రపన్నారు. ఆ కుట్రను భారత భద్రతాబలగాలు వమ్ముచేసి ఆ క్రమంలో ప్రాణత్యాగంచేశాయి. ఆ ధైర్యశాలులకు నా నివాళులు. మాతృభూమి కోసం మీరు చేసిన ప్రాణత్యాగానికి దేశం సదా రుణపడి ఉంటుంది. ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు సిద్ధమని అందరం ప్రతినబూనుదాం’’ అని సామాజిక మాధ్యమ ఖాతా ‘ఎక్స్’లో ట్వీట్‌చేశారు. మానవాళికి ముప్పుగా పరిణమించిన ఉగ్రవాదం ఏ దేశంలో ఏ రూపంలో ఉన్నాసరే దానిని సమూలంగా తుదముట్టించాలని వ్యాఖ్యానించారు. ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ నేత సోనియా గాంధీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, ప్రహ్లాద్ జోషి, పియూశ్ గోయల్, జితేంద్ర సింగ్, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, బుధవారం పార్లమెంట్ ప్రాంగణంలో అమరులకు నివాళులర్పించారు. అమరుల త్యాగాన్ని భారత్ సదా స్మరించుకుంటుందని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ అన్నారు. త్యాగాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి: ప్రధాని పార్లమెంట్లో అమరులకు బుధవారం ప్రధాని మోదీ సైతం నివాళులర్పించారు. ‘‘ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వీరోచిత భద్రతా సిబ్బందికి నా హృదయపూర్వక నివాళులు. ఆపత్కాలంలో తెగువ చూపిన వారి త్యాగాలను యావత్ దేశం చిరస్థాయిగా గుర్తుంచుకుంటుంది’’ అని మోదీ వ్యాఖ్యానించారు. అమరులకు లోక్‌సభ నివాళులర్పించింది. లోక్‌సభ కార్యకలా పాలు బుధవారం మొదలవగానే స్పీకర్ బిర్లా మాట్లాడారు. ‘ ఉగ్రవాదులతో పోరాటంతో ప్రాణాలు కోల్పోయిన భద్రతా బలగాల కుటుంబాలకు భారత ప్రభుత్వం అండగా ఉంటుంది. ఉగ్రవాదంపై భారత పోరు కొనసాగుతుంది’’ అని అన్నారు. ఈ సందర్భంగా సభ్యులంతా లేచి నిల్చుని కొద్దిసేపు మౌనం పాటించారు. -
నేడు అంబేడ్కర్ వర్ధంతి.. సీఎం జగన్ నివాళులు
సాక్షి, తాడేపల్లి: నేడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. నివాళులు అర్పించారు. బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి అంబేడ్కర్ చేసిన సేవలు నిరుపమానమని సీఎం జగన్ అన్నారు. కాగా, సీఎం జగన్ ట్విట్టర్ వేదికగా..‘భారత రాజ్యాంగ ప్రదాత, దేశ పాలనా మార్గదర్శకాల విధాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి నేడు. బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు నిరుపమానం. ఆ మహనీయుని అడుగుజాడల్లో నడుస్తూ మన ప్రభుత్వం బడుగు బలహీనవర్గాల సంక్షేమానికి అహర్నిశలూ కృషి చేస్తోంది. బాబా సాహెబ్ గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగ ప్రదాత, దేశ పాలనా మార్గదర్శకాల విధాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి నేడు. బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు నిరుపమానం. ఆ మహనీయుని అడుగుజాడల్లో నడుస్తూ మన ప్రభుత్వం బడుగు బలహీనవర్గాల సంక్షేమానికి అహర్నిశలూ కృషి చేస్తోంది. బాబా సాహెబ్ గారి… pic.twitter.com/P3v4M1kxqT — YS Jagan Mohan Reddy (@ysjagan) December 6, 2023 మరోవైపు.. తాడేపల్లిలోని క్యాంపు కార్యాయలంలో సీఎం జగన్.. అంబేడ్కర్‌కు నివాళులు అర్పించారు. అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన సీఎం జగన్. ఈ కార్యక్రమానికి మంత్రులు తానేటి వనిత, మేరుగ నాగార్జున, ఎంపీ నందిగం సురేష్, ప్రభుత్వ సలహాదారు జూపూడి ప్రభాకర్ తదితరులు హాజరయ్యారు. -
‘26/11’ మృతులకు రాష్ట్రపతి నివాళులు
న్యూఢిల్లీ: 2008 నవంబర్ 26న ముంబైలో ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా దాడిలో మృతిచెందిన భద్రతా సిబ్బందికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం ఘనంగా నివాళులరి్పంచారు. మాతృభూమి సంరక్షణ కోసం వారు ప్రాణాలరి్పంచారని కొనియాడారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానికి వ్యతిరేకంగా పోరాడుతామంటూ ప్రతిజ్ఞ చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు రాష్ట్రపతి ‘ఎక్స్’లో పోస్టు చేశారు. -
గాంధీ జయంతి సందర్బంగా సీఎం జగన్ నివాళులు
-
Father of Green Revolution: ఎం.ఎస్. స్వామినాథన్ కన్నుమూత
సాక్షి, చెన్నై: భారత హరిత విప్లవ పితామహుడు, ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త, పద్మవిభూషణ్ డాక్టర్ ఎం.ఎస్.స్వామినాథన్(98) అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. దేశంలో ఆకలితో అలమటించే అభాగ్యులు ఉండకూడదన్న లక్ష్యంతో జీవితాంతం పోరాటం సాగించిన మహా మనిషి తమిళనాడు రాజధాని చెన్నైలోని తన స్వగృహంలో గురువారం ఉదయం 11.15 గంటలకు శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. ఆయన కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు డాక్టర్ సౌమ్యా స్వామినాథన్, మధుర స్వామినాథన్, నిత్యా రాయ్ ఉన్నారు. భార్య మీనా స్వామినాథన్ గతంలోనే మృతిచెందారు. భారత్‌లో 1960వ దశకం నుంచి హరిత విప్లవానికి బాటలు వేసి, ఆహారం, పౌష్టికాహార భద్రత కోసం అలుపెరుగని కృషి చేసిన స్వామినాథన్‌ను ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్, రామన్ మెగసెసే, మొట్టమొదటి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ సహా ఎన్నెన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు వరించాయి. స్వామినాథన్ పారీ్థవదేహాన్ని చెన్నై తేనాంపేట రత్నానగర్‌లో ఉన్న నివాసం నుంచి గురువారం రాత్రి తరమణిలోని ఎం.ఎస్.స్వామినాథన్ ఫౌండేషన్‌కు తరలించారు. శుక్రవారం అప్తులు, ప్రముఖుల సందర్శనార్థం పారీ్థవ దేహాన్ని ఇక్కడే ఉంచుతారు. విదేశాల్లో ఉన్న కుమార్తె చెన్నైకి రావాల్సి ఉండడంతో శనివారం స్వామినాథన్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సన్నిహితులు చెప్పారు. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి ఎం.ఎస్.స్వామినాథన్ మృతిపట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. దేశానికి ఆయన అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. మానవాళి కోసం భద్రమైన, ఆకలికి తావులేని భవిష్యత్తును అందించే దిశగా ప్రపంచాన్ని నడిపించడానికి మార్గదర్శిగా పనిచేశారని స్వామినాథన్‌పై రాష్ట్రపతి ముర్ము ప్రశంసల వర్షం కురిపించారు. ఘనమైన వారసత్వాన్ని మనకు వదిలి వెళ్లారని చెప్పారు. స్వామినాథన్ మరణం తనకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని ప్రధాని మోదీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. మన దేశం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన హరిత విప్లవానికి నాంది పలికారని, కోట్లాది మంది ఆకలి తీర్చారని, దేశంలో ఆహార భద్రతకు పునాది వేశారని కొనియాడారు. వ్యవసాయ రంగంలో స్వామినాథన్ కృషితో కోట్లాది మంది జీవితాలు మారాయని మోదీ గుర్తుచేశారు. మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు గురువారం స్వామినాథన్ పారీ్థవదేహానికి అంజలి ఘటించారు. ఆయన మరణం దేశానికి, రైతు ప్రపంచానికి తీరని లోటు అని పేర్కొన్నారు. స్వామినాథన్ మరణం పట్ల తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి, ముఖ్యమంత్రి స్టాలిన్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మాజీ ప్రధానమంత్రి హెచ్.డి.దేవెగౌడ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాం«దీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్, భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ తికాయత్ తదితరులు సంతాపం ప్రకటించారు. -
గల్ఫ్ దేశాల్లో వైఎస్సార్‌కు ఘన నివాళి
సాక్షి,అమరావతి/కడప కార్పొరేషన్: గల్ఫ్ దేశాలైన కువైట్, దుబాయ్, ఖతార్‌లలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ కువైట్ కన్వినర్ ఎం.బాలిరెడ్డి ఆధ్వర్యంలో కువైట్‌లో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దుబాయ్ కన్వీనర్ సయ్యద్ అక్రమ్, ఖతార్ కన్వీనర్ దొండపాటి శశికిరణ్ ఆధ్వర్యంలో వైఎస్సార్ చిత్రపటాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రజలకు సువర్ణ పాలన అందించారని గుర్తుచేశారు. తండ్రి ఆశయ సాధన కోసం వైఎస్సార్సీపీని స్థాపించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయన కంటే మరో రెండు అడుగులు ముందుకేసి సంక్షేమ పథకాలను ఇంటింటికీ చేరవేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమాల్లో గల్ఫ్ కో కన్వినర్ గోవిందు నాగరాజు, యూఏఈ అడ్వైజరీ కమిటీ సభ్యులు సోమిరెడ్డి, ఏపీఎన్ఆర్టీఎస్ రీజనల్ కో ఆర్డినేటర్ ఎన్.మహేశ్‌రెడ్డి, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు ఎం.చంద్రశేఖర్‌రెడ్డి, ఖతార్ కో కన్వినర్ జాఫర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. న్యూజిలాండ్‌లో రక్తదానం, అన్నదానం ‘నా అనుకున్న వాళ్ల కోసం ఎందాకైనా వెళ్లే గొప్ప వ్యక్తిత్వం, ఎంతైనా సాయం చేసే గుణం డాక్టర్ వైఎస్సార్‌ది అని ఏపీ ఎన్ఆర్టీ సోసైటీ అధ్యక్షుడు వెంకట్ ఎస్ మేడపాటి కొనియాడారు. న్యూజిల్యాండ్ దేశం ఆక్లాండ్ నగరంలోని వెస్లీ కమ్యూనిటీ సెంటర్లో వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగం న్యూజిలాండ్ ఆధ్వర్యంలో ఆదివారం వైఎస్సార్ వర్ధంతి నిర్వహించారు. జూమ్ మీటింగ్‌లో పాల్గొన్న వెంకట్ మేడపాటి ప్రసంగిస్తూ విదేశాల్లో ఉన్న ఎంతో మందికి ఎన్నో రకాలుగా వైఎస్సార్ సాయం చేశారని గుర్తుచేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో నిరుపేదలకు సరస్వతీ కటాక్షం కల్పించి.. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఉద్యోగాలు చేసుకుని స్థిరపడేలా చేసిన మహా మనిషి వైఎస్సార్ అని కొనియాడారు. అనంతరం రక్తదానం, అన్నదానం చేశారు. వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగం న్యూజిలాండ్ కన్వినర్ బుజ్జె బాబు, ప్రాంతీయ కోఆర్డినేటర్ ఆనంద్ యెద్దుల, పార్టీ ప్రతినిధులు సుస్మిత చిన్నమల్రెడ్డి, సుమంత్ డేగపూడి, ప్రభాకర్ వాసివల్లి, ప్రణవ్ అన్నమరాజు, ఆరోన్ శామ్యూల్ పాల్గొన్నారు. -
మనసుతో పాలించిన మహానేత వైఎస్సార్
సాక్షి, అమరావతి/సాక్షి, నెట్వర్క్: రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, అభిమానులు, వైఎస్సార్సీపీ శ్రేణులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ ఆ మహానేతకు ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు.. అందించిన మానవీయ, సుపరిపాలనను స్మరించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల అభిమానులు, కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రక్తదానం, అన్నదానం, వస్త్రాల పంపిణీ తదితర కార్యక్రమాలు చేపట్టారు. పేదల అభివృద్ధి, సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేశారంటూ వైఎస్సార్‌ను గుర్తుచేసుకున్నారు. అభిమాన నేతను తలచుకొంటూ.. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల వ్యాప్తంగా వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. మహానేత విగ్రహాలు, చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. వాడవాడలా ప్రజలు తమ అభిమాన నేత విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. అమలాపురంలో మంత్రి పినిపే విశ్వరూప్, రామచంద్రపురంలో మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, అల్లవరం మండలం కోడూరుపాడులో అమలాపురం ఎంపీ చింతా అనురాధ, కాకినాడలో ఎంపీ వంగా గీత, కొవ్వూరులో హోం మంత్రి తానేటి వనిత, రాజమహేంద్రవరంలో ఎంపీ మార్గాని భరత్‌రామ్ వైఎస్ వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వాడవాడలా సేవా కార్యక్రమాలు ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వాడవాడలా దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. పలుచోట్ల రక్తదాన శిబిరాలు, అన్నదానం, వస్త్రదానం కార్యక్రమాలు నిర్వహించారు. నూజివీడు నియోజకవర్గంలో ఎంపీ కోటగిరి శ్రీధర్, తాడేపల్లిగూడెంలో ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పోరంకిలో జరిగిన కార్యక్రమాల్లో ఎంపీ వల్లభనేని బాలÔౌరి పాల్గొన్నారు. ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. వైఎస్సార్‌తో పాటు హెలికాప్టర్ ప్రమాదంలో అశువులు బాసిన ఆయన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ జాన్ వెస్లీ విగ్రహానికి కూడా ప్రజలు పూల మాలలు వేశారు. పల్నాడులో మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేమూరులో మంత్రి మేరుగు నాగార్జున, రేపల్లెలో ఎంపీ మోపిదేవి వైఎస్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. నెల్లూరులోని మాగుంట లేఅవుట్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. మహానేతకు ఘన నివాళి ఉమ్మడి చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వైఎస్సార్ వర్థంతి కార్యక్రమాలను పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేశారు. రక్తదాన కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. కడపలో డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, తన నివాసంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి క్యాంప్ కార్యాలయంలో ఎంపీ గురుమూర్తి, కుప్పం బస్టాండు వద్ద ఎంపీ రెడ్డప్ప, నంద్యాలలో ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, దేవనకొండలో మంత్రి గుమ్మనూరు జయరాం, బ్రహ్మసముద్రంలో మంత్రి ఉషశ్రీ చరణ్, అనంతపురంలో ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్ వైఎస్సార్‌కు నివాళులర్పించారు. ఆత్మకూరు వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి వైఎస్సార్ స్మృతి వనం వరకు భారీ బైక్‌ర్యాలీ నిర్వహించారు. విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం కార్యాలయంలో మహానేత వైఎస్సార్‌కు నివాళులర్పించారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో.. సంక్షేమ పాలనతో రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దిన మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి కొనియాడారు. తన తండ్రి బాటలోనే రాష్ట్రంలో పేదరిక నిర్మూలన, సంక్షేమ పాలనలో సీఎం వైఎస్ జగన్ కూడా తనదైన ముద్ర వేశారని ప్రశంసించారు. మనసున్న వ్యక్తి పాలకుడైతే ప్రజలు సంతోషంగా ఉంటారనేదానికి వైఎస్సార్ పాలనా కాలమే నిదర్శనమన్నారు. శనివారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సజ్జలతోపాటు మంత్రులు, పలువురు పార్టీ నేతలు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. అన్నదానం, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ బాటలోనే సీఎం జగన్ కూడా మడమ తిప్పకుండా పరిపాలిస్తున్నారని గుర్తు చేశారు. వైఎస్సార్ ఇప్పటికీ ప్రజల మనసుల్లో జీవించి ఉన్నారని కొనియాడారు. మంత్రులు మేరుగు నాగార్జున, జోగి రమేశ్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జూపూడి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
YSR : ఇడుపులపాయలో వైఎస్సార్‌కు సీఎం జగన్ నివాళి
సాక్షి, అమరావతి/ వైఎస్సార్: దివంగత మహానేత, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. సతీసమేతంగా ఇడుపులపాయ వెళ్లిన సీఎం జగన్.. తల్లి వైఎస్ విజయమ్మ, మరికొందరు కుటుంబ సభ్యులు, మంత్రులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకు ముందు ఆయన తన ట్విటర్ ఖాతాలో తండ్రి వైఎస్సార్‌ను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు నాన్నా… మీరు లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిది. భౌతికంగా మా మధ్య లేకపోయినా ప్రజల గుండెల్లో చిరకాలం జీవించే లీడర్ మీరు. మీ పట్ల ప్రజలకున్న ప్రేమాభిమానాలు నాకు కొండంత అండగా నిలిచాయి. మీ ఆశయాలే సంక్షేమం, సమగ్రాభివృద్ధి లక్ష్యాల సాధనలో నన్ను చేయిపట్టి నడిపిస్తున్నాయి. వర్ధంతి… pic.twitter.com/Fq1Ngg4f5Q — YS Jagan Mohan Reddy (@ysjagan) September 2, 2023 ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, మేడా మల్లికార్జున రెడ్డి, రఘురామిరెడ్డి, పీజేఆర్ సుధాకర్ బాబు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్ మల్లికార్జున రెడ్డి, మేయర్ సురేష్ బాబు హాజరయ్యారు. చదవండి: Johar ysr: అజేయుడు -
ట్యాంక్ బండ్‌పై గద్దర్ విగ్రహం పెట్టాలి
సాక్షి, హైదరాబాద్: ప్రజా గాయకుడు గద్దర్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై పెట్టాలని వైఎస్సా ర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం అల్వాల్ భూదేవి నగర్‌లోని గద్దర్ నివాసానికి వెళ్లిన ఆమె ఆయన చిత్రపటానికి పూలమాల వేసి, సమాధి వద్ద నివాళులర్పించారు. గద్దర్ కుటుంబ సభ్యులకు తన సానుభూతి తెల్పిన షర్మిల... ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా ముద్రించాల్సిన అవసరం ఉందని, గద్దర్ సొంత ఊరు తూప్రాన్‌లో ఆయన పేరిట స్మారక భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు. గద్దర్ చేత కంటతడి పెట్టించిన కేసీఆర్, ఆయ న కుటుంబ సభ్యులకు క్షమాపణ చెప్పాలన్నా రు. 9 ఏళ్లలో ఒక్కసారి కూడా గద్దర్‌కి కేసీఅర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదని.. ఆయన విష యంలో కేసీఆర్ ఒక నియంతలా వ్యవహరించారన్నారు. ప్రగతి భవన్ దగ్గర రోజంతా ఎదురు చూసినా లోపలకు పిలవకపోవడంతో.. ఇందుకేనా తెలంగాణ తెచ్చుకున్నది అని గద్దర్ కన్నీళ్లు పెట్టుకున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వైఎస్సార్ అంటే గద్దర్‌కి చాలా ప్రేమ అని, నాతో చాలాసార్లు వైఎస్సార్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారన్నారు. -
ప్రజా యుద్ధ నౌక ఆగిపోయింది..
ప్రజా యుద్ధ నౌక ఆగిపోయింది నిత్యం ప్రజల కోసం, పీడిత - తాడిత వర్గాల కోసం పాటుపడిన గుమ్మడి విఠల్ రావు ఉరఫ్ గద్దర్ గారు ఈరోజు శివైక్యం చెందారు. తాను నమ్మిన సిద్ధాంతం వేలాది మందిని, ఉద్యమాల వైపు నడిపించినా, చివర్లో తాను నమ్మిన సిద్ధాంతం బుల్లెట్ కంటే, బ్యాలెట్ మాత్రమే ప్రజల తలరాతలను మార్చుతుందని... నమ్మిన అతి అరుదైన ఉద్యమ నాయకుడు. తన కమ్యూనిస్ట్ సిద్ధాంతాలకు తీవ్ర వ్యతిరేకమైన…దేవతారాధనను, తన జీవిత చరమాంకంలో... నమ్మిన, కనపడని ఆధ్యాత్మికవాది శ్రీ గద్దర్ గారు. గడిచిన 15 సంవత్సరాల పరిచయంలో ప్రతి నిత్యం నా శ్రేయస్సును కాంక్షించారు. తన కుమారుడు సూర్యం ద్వారా, నేను ఆ కుటుంబానికి దగ్గరయ్యాను. అనేక సందర్భాల్లో శ్రీ గద్దర్ గారిని కలుస్తూ, అనేక విషయాలపై చర్చిస్తూ.. “అరే నాన్న” అని పిలిచే వారు. తన జీవితంలో అత్యంత కీలకమైన దశలో కుమారుడిని రాజకీయ రంగ ప్రవేశం చేయించాలనుకున్నప్పుడు... తనను నమ్ముకున్న, తనతో ఉద్యమ సహచర్యం చేసిన అనేక మంది వ్యక్తులను ఇంటికి పిలిచి వారితో ప్రజాస్వామ్యం మీద, పార్టీ రాజకీయాలపైనా, తన కుమారుడి భవిష్యత్తు పై నాతో గంటల పాటు చర్చించి, చివరకు తన కుమారుడిని రాజకీయరంగ ప్రవేశం చేయించిన వ్యక్తి శ్రీ గద్దర్. చివరిసారిగా కాంగ్రెస్ శాసనసభాపక్షనాయకుడు మల్లు భట్టివిక్రమార్కతో కలిసి సంగీత దర్శకుడు మణిశర్మ గారి ఆఫీసులో వారిని కలిశాను. అప్పుడు కూడా ఆయన సామాజిక, రాజకీయ అంశాలు ఎన్నో చర్చించారు. వెన్నులో బుల్లెట్ తనను నిత్యం ఇబ్బందిపెడుతున్నా, హైదరాబాద్ నగరం దాటి రాలేని పరిస్థితుల్లో నా తమ్ముడి వివాహం కోసం ఒకరోజు ముందుగానే “మే నెల” ఎండల్లో హైదరాబాద్ నుంచి గుంటూరు వచ్చి రెండ్రోజులుపాటు మా ఆతిధ్యం స్వీకరించి, మా ఇంట్లో శుభకార్యానికి హాజరైన వ్యక్తి ఈ రోజు లేకపోవడం నన్నెంతో వేదనకు గురిచేస్తోంది. కానీ పుట్టిన వారికి మరణం తప్పదు… శ్రీ గద్దర్ గారు, ఏ లోకంలో ఉన్న వారి ఆత్మ శాంతించాలని … తిరిగి పీడిత, తాడిత జనుల కోసం, ఇదే గడ్డపై జన్మించాలని మనసారా కోరుకుంటా... -మీ ఆరా మస్తాన్, సెఫాలజిస్ట్ -
అల్లూరి సీతారామరాజు వర్ధంతి.. సీఎం జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు సీఎం జగన్. స్వాతంత్య్రం కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అలుపెరుగని పోరాటం చేసిన వీరుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. ఆయన త్యాగాన్ని ఎల్లప్పుడూ స్మరించుకునేలా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆయన పేరు మీద జిల్లాను ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. నేడు ఆ మహనీయుడి వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు’’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. స్వాతంత్య్రం కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అలుపెరుగని పోరాటం చేసిన వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు. ఆయన త్యాగాన్ని ఎల్లప్పుడూ స్మరించుకునేలా మన ప్రభుత్వంలో ఆయన పేరు మీద జిల్లాను ఏర్పాటు చేశాము. నేడు ఆ మహనీయుడి వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి. — YS Jagan Mohan Reddy (@ysjagan) May 7, 2023 చదవండి: ‘మార్గదర్శి’ అక్రమాలు, నిజానిజాలు.. రామోజీ గురించి ఏం చెప్పారంటే? -
భగీరథ మహర్షి జయంతి సందర్భంగా సీఎం జగన్ నివాళులు
-
భగీరథ మహర్షి జయంతి.. సీఎం జగన్ నివాళులు
సాక్షి, తాడేపల్లి: భగీరథ మహర్షి జయంతి సందర్బంగా క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా భగీరథ మహర్షి చిత్రపటానికి సీఎం జగన్ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ, సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్ధానం ఛైర్మన్ కర్నాటి రాంబాబు, ఏపీ సగర, ఉప్పర వెల్ఫేర్, డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్పర్సన్ జి.రమణమ్మ, గిద్దలూరు వైఎస్ఆర్సీపీ పరిశీలకుడు బంగారు శీనయ్య హాజరయ్యారు. ఇది కూడా చదవండి: శింగనమల నియోజకవర్గానికి వరాల జల్లు -
బాదల్‌కు నేతల ఘన నివాళి
చండీగఢ్: పంజాబ్ రాజకీయ కురు వృద్ధుడు, ఐదుసార్లు పంజాబ్ సీఎంగా సేవలందించిన ప్రకాశ్ సింగ్ బాదల్‌ను కడసారి చూసేందుకు పార్టీలు, ప్రాంతాలకతీతంగా వందలాది మంది నేతలు, స్థానికులు చండీగఢ్‌కు తరలివచ్చారు. ఆయన పార్థివదేహం వద్ద ఘన నివాళులర్పించారు. తీవ్ర అనారోగ్యంతో బుధవారం తుదిశ్వాస విడిచిన తమ అభిమాననేతను చివరిసారి చూసేందుకు చండీగఢ్‌లోని శిరోమణి అకాలీదళ్ పార్టీ ప్రధాన కార్యాలయానికి ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. గురువారం మధ్యాహ్నం బాదల్ గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
వీరేశలింగం పంతులు జయంతి.. సీఎం జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: సంఘ సంస్కర్త వీరేశలింగం పంతులు జయంతి సందర్భంగా ఆయనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. ‘‘మూఢ నమ్మకాలపై.. వితంతువుల పునర్వివాహం కోసం.. స్త్రీల విద్య కోసం పోరాటం చేసిన మహనీయులు కందుకూరి వీరేశలింగం పంతులు’’ అని సీఎం ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘‘సాహితీవేత్తగా, సంఘ సంస్కర్తగా ఆయన సేవలు చిరస్మరణీయం. నేడు వీరేశలింగం పంతులు గారి జయంతి సందర్భంగా నివాళులు’’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. చదవండి: రామోజీ ఓ విషసర్పం.. తోడల్లుడు డాల్ఫిన్ అప్పారావు సంచలన వ్యాఖ్యలు మూఢ నమ్మకాలపై.. వితంతువుల పునర్వివాహం కోసం.. స్త్రీల విద్య కోసం పోరాటం చేసిన మహనీయులు కందుకూరి వీరేశలింగం పంతులు గారు. సాహితీవేత్తగా, సంఘ సంస్కర్తగా ఆయన సేవలు చిరస్మరణీయం. నేడు వీరేశలింగం పంతులు గారి జయంతి సందర్భంగా నివాళులు. — YS Jagan Mohan Reddy (@ysjagan) April 16, 2023 -
అణగారిన వర్గాల ఆశాజ్యోతి
న్యూఢిల్లీ: రాజ్యాంగ నిర్మాత, సామాజిక సంస్కర్త డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఘనంగా నివాళులర్పించారు. సమాజంలో నిరుపేద, అణగారిన వర్గాల అభ్యన్నతికోసం అంబేడ్కర్ తన జీవితాన్ని అంకితం చేశారని మోదీ కొనియాడారు. పార్లమెంట్ ప్రాంగణంలో అంబేడ్కర్ జయంతి వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ నేత సోనియా గాంధీ తదితరులు పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద నేలంతా ఘనంగా నివాళులర్పించారు. ప్రమాదకర ధోరణి: ఖర్గే ప్రత్యర్థులపై జాతి వ్యతిరేక ముద్ర వేయడం, బలవంతంగా నోరు మూయించడం వంటి ప్రమాదకర ధోరణులు పాలకుల్లో నానాటికీ పెరిగిపోతున్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆందోళన వెలిబుచ్చారు. ఇది అంతిమంగా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని నాశనం చేస్తుందన్నారు. పార్లమెంటు చర్చా వేదికను కూడా అధికార బీజేపీ పోరాటస్థలిగా మార్చిందని దుయ్యబట్టారు. ఖర్గే, కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ తదితరులు అంబేడ్కర్‌కు నివాళులర్పించారు. ఖర్గే, కాంగ్రెస్ నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ వద్రా తదితరులు అంబేడ్కర్‌కు నివాళులర్పించారు. రాజ్యాంగ విలువలపై వ్యవస్థీకృత దాడి జరుగుతోందంటూ ప్రియాంక ట్వీట్ చేశారు. -
నందమూరి తారకరత్న మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం
నందమూరి తారకరత్న మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఆయన అకాల మరణం తనను బాధించిందని విచారం వ్యక్తం చేశారు. తారకరత్న సినీ ప్రపంచంలో తనకుంటూ ఓ ముద్ర వేసుకున్నారని కొనియాడారు. ఇలాంటి బాధాకర సమయంలో తారకరత్న కుటుంబసభ్యులకు, శ్రేయోభిలాషులకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నట్లు మోదీ పేర్కొన్నారు. ఈమేరకు ప్రధాని కార్యాలయం పీఎంఓ ట్వీట్ చేసింది. Pained by the untimely demise of Shri Nandamuri Taraka Ratna Garu. He made a mark for himself in the world of films and entertainment. My thoughts are with his family and admirers in this sad hour. Om Shanti: PM @narendramodi — PMO India (@PMOIndia) February 19, 2023 రేవంత్ రెడ్డి సంతాపం.. తారకరత్న మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణవార్త తనను బాధించిందన్నారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబసభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు. Deeply saddened by the untimely demise of shri #Tarakaratna garu… My deepest condolences to the friends and family.I pray God to give them strength in this hour of grief. pic.twitter.com/SmPINq1PZb — Revanth Reddy (@revanth_anumula) February 19, 2023 గుండెపోటుతో 23 రోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన తారకరత్న శనివారం బెంగళూరులోని హృదయాలయలో కన్నుమూశారు. ఆయన భౌతికకాయాన్ని ఆదివారం ఉదయం హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. అంత్యక్రియలు సోమవారం నిర్వహించనున్నారు. బండి సంజయ్ ట్వీట్.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా తారకరత్న మృతికి సంతాపం తెలిపారు. తెలుగు సినిమా నటుడు నందమూరి తారకరత్న గారి అకాల మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. తన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతున్ని ప్రార్ధిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి 🙏 pic.twitter.com/BXEIVTXwIM — Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) February 18, 2023 హరీశ్‌రావు.. తారకరత్న మరణవార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు ట్వీట్ చేశారు. ఆయన కుటుంసభ్యులు, స్నేహితులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. Deeply saddened to know the demise of actor Nandamuri Taraka Ratna. Heartfelt condolences to his family and friends at this time of grief. May his Soul Rest in Peace. Om Shanti🙏🏾 pic.twitter.com/XRn28J6afq — Harish Rao Thanneeru (@BRSHarish) February 18, 2023 డీకే అరుణ బీజేపీ నేత డీకే అరుణ కూడా తారకరత్న మృతికి ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపారు. Extremely saddened to learn about the passing of #Telugu actor Shri Nandamuri #TarakaRatna Ji. His sudden demise has left the entire Telugu film industry in a state of shock and mourning. My deepest condolences to his family. Om Shanti 🙏🏻 pic.twitter.com/6q9bD2ZelS — D K Aruna (@aruna_dk) February 19, 2023 చంద్రబాబు సంతాపం.. తారకరత్న తమ కుటుంబానికి తీవ్ర విషాదం మిగిల్చి వెళ్లిపోయాడని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. 23 రోజుల పాటు మృత్యువు తో పోరాడిన తారకరత్న... చివరికి మాకు దూరం అయ్యి మా కుటుంబానికి విషాదం మిగిల్చాడు. తారకరత్న ఆత్మకు శాంతిని చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.(2/2) — N Chandrababu Naidu (@ncbn) February 18, 2023 నారా లోకేష్.. తారకరత్న మృతి తమ కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అని నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఆయన మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. బావ అంటూ ఆప్యాయంగా పిలిచే ఆ గొంతు ఇక నాకు వినిపించదు. నేనున్నానంటూ నా వెంట నడిచిన ఆ అడుగుల చప్పుడు ఆగిపోయింది. నందమూరి తారకరత్న మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది. తెలుగుదేశం యువతేజం తారకరత్న మృతి మా కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి తీరని లోటు.(1/2) pic.twitter.com/MLLlp3p60G — Lokesh Nara (@naralokesh) February 18, 2023 -
దేశం గర్వించదగ్గ ఆధ్యాత్మికవేత్త సంత్ సేవాలాల్
సాక్షి, హైదరాబాద్: బంజారాలు, లంబాడాల ఆరాధ్యదైవం, సంత్ సేవాలాల్ మహారాజ్ గొప్ప సంఘ సేవకులు, దేశం గర్వించదగ్గ ఆధ్యాత్మికవేత్తని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ 284 వ జయంతి సందర్భంగా కేసీఆర్ ఘనంగా నివాళులర్పించారు. లంబాడా, బంజారా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 3 శతాబ్దాల కింద సేవాలాల్ మహారాజ్ నడయా డిన బంజారాహిల్స్ నేలమీద సంత్ మహారాజ్ పేరుతో నిర్మించిన భవన్లో రాష్ట్ర ప్రభు త్వం అధికారికంగా జయంతి ఉత్సవాలను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. -
పుల్వామా అమర వీరులకు ప్రధాని మోదీ నివాళులు..
న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. ఈ ఘటన జరిగి నాలుగేళ్లయిన సందర్భంగా వారిని స్మరించుకున్నారు. పుల్వామా అమరుల త్యాగాన్ని దేశం ఎన్నిటికీ మరువదని, దేశాభివృద్ధికి వీర సైనికుల శౌర్యమే స్ఫూర్తిదాయకమన్నారు. ఈమేరకు ఆయన మంగళవారం ఉదయం ట్వీట్ చేశారు. Remembering our valorous heroes who we lost on this day in Pulwama. We will never forget their supreme sacrifice. Their courage motivates us to build a strong and developed India. — Narendra Modi (@narendramodi) February 14, 2023 2019 ఫిబ్రవరి 14న జమ్ముకశ్మీర్ పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 40 మంది భారత జవాన్లు అమరులయ్యారు. ఇందుకు ప్రతీకారంగా పాకిస్తాన్ బాలాకోట్‌లోకి ప్రవేశించి భారత సైన్యం మెరుపుదాడులు చేసింది. ఉగ్ర శిబిరాలను పేల్చి వేసింది. ఈ ఘటనలో దాదాపు 250 మంది తీవ్రవాదాలు హతమైనట్లు అమిత్ షా ఓ ఎన్నికల ర్యాలీలో తెలిపారు. చదవండి: ‘అదానీ’పై అదే దుమారం -
మూగబోయిన వాణి
‘తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ’.. ఎంత కమ్మని గొంతు. ఉషోదయం వేళ మనసుని ఉల్లాసంగా తట్టిలేపే మృదు మధురమైన కంఠస్వరం వాణీ జయరామ్ సొంతం.. అలాంటి ఆ కంఠస్వరం మూగబోయింది. ప్రముఖ గాయని వాణీ జయరామ్ (78) కన్నుమూశారు. చెన్నైలోని నుంగంబాక్కమ్లో ఉన్న తన సృగృహంలో అనుమానాస్పద స్థితిలో మరణించారామె. వాణి నుదురు, భుజంపై రక్తపు గాయాలు ఉండడంతో ఆమె మృతిపై అనుమానాలు నెలకొన్నాయి. పోలీసులు ఐపీసీ 174 సెక్షన్ కింద అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఆమె ఇంటిలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. అలాగే ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. వాణి మృతదేహానికి ఓమందూరార్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన అనంతరం కేసు విచారణ ముమ్మరం అయ్యే సూచనలున్నాయి. తమిళనాడులోని వెల్లూరులో దురైస్వామి, పద్మావతిలకు 1945 నవంబరు 30న జన్మించారు వాణీ జయరామ్. ఆమె అసలు పేరు కలైవాణి. పదకొండు మంది పిల్లల్లో వాణి ఎనిమిదో సంతానం. ఆమె తల్లి పద్మావతి కర్నూలులో జన్మించడంతో వాణికి తెలుగులో పాడటం అలవాటైంది. రంగరామానుజ అయ్యంగార్ వారి వద్ద పద్మావతి సంగీత శిక్షణ పొందారు. తన కుమార్తె వాణిని కూడా ఆయన వద్దే కర్ణాటక సంగీత శిక్షణ కోసం చేర్పించారామె. వెల్లూరులో వాణి నాలుగో తరగతి పూర్తయ్యాక, ఆమెకు మరింత మంచి సంగీత శిక్షణ ఇప్పించేందుకు వారి కుటుంబం చెన్నైకి తరలి వెళ్లింది. ప్రఖ్యాత సంగీత విద్వాంసులు జీఎన్ బాలసుబ్రహ్మణ్యం శిష్యుడైన టీఆర్ బాలసుబ్రహ్మణ్యం వద్ద సంగీతం నేర్చుకున్నారు వాణి. తన ఎనిమిదవ ఏటనే మద్రాసులో ఆకాశవాణిలో పాడారు. పదేళ్ల నుంచే పూర్తి స్థాయి కర్ణాటక శాస్త్రీయ సంగీత కచేరీలు చేశారామె. స్కూలులో 22 వేర్వేరు కళలతో బహుముఖ ప్రజ్ఞ కలిగిన స్టూడెంట్‌గా అవార్డును పొందారు వాణి. బీఏ ఎకనామిక్స్ చదువుతున్న సమయంలో కళాశాలల స్థాయిలో డిబేట్ కార్యక్రమాల్లో బహుమతులు పొందారామె. చదువు పూర్తయ్యాక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెన్నై బ్రాంచిలో ఉద్యోగంలో చేరారు వాణి. 1967లో ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. ఆ తర్వాత 1969లో జయరామ్‌ని వివాహం చేసుకుని, ముంబయ్‌కి వెళ్లారు వాణి. భర్త జయరామ్ ప్రోత్సాహంతో ఉస్తాద్ అబ్దుల్ రెహ్మాన్ ఖాన్ వద్ద హిందుస్తానీ శాస్త్రీయ సంగీత శిక్షణను పొందారామె. ఆ సమయంలోనే బ్యాంకు ఉద్యోగానికి స్వస్తి చెప్పి పూర్తి స్థాయి సంగీత సాధనకు సమయాన్ని వెచ్చించారామె. కర్ణాటిక్, హిందుస్థానీ సంగీతాలను నేర్చుకున్న ఆమె 1969లో ముంబయ్‌లో తొలి కచేరి ఇచ్చారు. సంగీత దర్శకుడు వసంత్ దేశాయ్‌కి ఆమె గొంతు నచ్చడంతో 1971లో హృషికేశ్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన ‘గుడ్డి’ చిత్రంలో తొలిసారి పాట పాడే అవకాశమిచ్చారు. ఆ చిత్రం కోసం వాణీ జయరామ్ పాడిన ‘బోలె రే పపీ హరా..’ పాటకు మంచి స్పందన వచ్చింది. వాణికి ‘తాన్సేన్ సమ్మాన్, బెస్ట్ ప్రామిసింగ్ సింగర్, ఆలిండియా సినీగోయర్స్’ వంటి అవార్డులు దక్కాయి. ఇక ‘అభిమానవంతుడు’ (1973) చిత్రంలో ‘ఎప్పటివలె కాదురా స్వామి’ అనే పాటను వాణీ జయరామ్‌తో పాడించారు దర్శకుడు ఎస్.పి. కోదండపాణి. తెలుగులో ఆమెకు ఇదే తొలి చిత్రం. 1974లో ముంబయ్ నుండి చెన్నైకి వచ్చి స్థిరపడిన ఆమె తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, భోజ్‌పురి, మరాఠీ, ఒరియా.. ఇలా 14 భాషల్లో పదివేలకుపైగా పాటలు పాడారు. కేవీ మహదేవన్, ఎం.ఎస్. విశ్వనాథన్ , ఇళయరాజా, పెండాల్య, చక్రవర్తి, సాలూరి రాజేశ్వరరావు వంటి సంగీత దర్శకుల సినిమాల్లో ఎక్కువ పాటలు పాడారామె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ‘అపూర్వ రాగంగళ్’ చిత్రానికి తొలిసారి జాతీయ పురస్కారం అందుకున్నారామె. ఆ తర్వాత ‘శంకరాభరణం’ చిత్రంలోని ‘మానస సంచరరే..’ గీతానికి ఆమెకు రెండోసారి జాతీయ పురస్కారం దక్కింది. ‘స్వాతికిరణం’లోని ‘ఆనతి నీయరా హరా..’ పాటకు ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డు అందుకున్నారు వాణి. జాతీయ స్థాయిలోనే తెలుగు, గుజరాతీ, ఒడియా, తమిళ భాషల్లో ప్రాంతీయ స్థాయి ఉత్తమ గాయని అవార్డులు పొందారామె. ‘కలైమామణి, సంగీత పీఠ్ సమ్మాన్, ఎంకే త్యాగరాజ భాగవతార్ జీవన సాఫల్య పురస్కారం, ఫిలింఫేర్ జీవన సాఫల్య పురస్కారం, కాముకర అవార్డు, సుబ్రహ్మణ్య భారతి అవార్డు, ఘంటసాల జాతీయ పురస్కారం, దక్షిణ భారత మీరా అవార్డు’ వంటి ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు వాణీ జయరామ్. సినిమా పాటలే కాదు.. ఎన్నో భక్తి గీతాలను, లలిత గీతాలను ఆలపించారు వాణి. ‘మొరటోడు’ చిత్రంలోని ‘హే కృష్ణా మళ్లీ నీవే జన్మిస్తే’ పాటతో పాటు ‘ప్రేమలేఖలు’లోని ‘ఈరోజు మంచిరోజు’ అంటూ సుశీలతో కలసి పాడిన పాట తనకెంతో ఇష్టం అని వాణి గతంలో పేర్కొన్నారు. తమకు పిల్లలు లేకున్నా ఆ లోటును సంగీతమే తీర్చిందని చెప్పేవారామె. వాణి భర్త జయరామ్ 2018లో మృతి చెందారు. కాగా సంగీత రంగానికి ఆమె చేసిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2022కిగాను ఇటీవల ‘పద్మ భూషణ్’ అవార్డు ప్రకటించింది. అయితే ఆ పురస్కారాన్ని స్వీకరించకుండానే వాణి ఈ లోకాన్ని వదిలి వెళ్లడం బాధాకరం. ఆమె మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. నేడు ఆమె భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. భర్త ప్రోత్సాహంతో... ప్రతి మగాడి విజయం వెనక మహిళ ఉంటుందంటారు. కానీ వాణీ జయరామ్ విజయం వెనక ఆమె భర్త జయరామ్ ఉన్నారు. పెళ్లి తర్వాత కూడా సంగీతంలో ఆమెను ఎంతగానో ప్రోత్సహించారు. ముంబయ్‌లోని ఇండో–బెల్జియం చాంబర్ ఆఫ్ కామర్స్‌లో ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా చేసిన జయరామ్ సంగీతప్రియులు. పండిట్ రవిశంకర్ దగ్గర ఆరేళ్లు ఆయన సితార్ నేర్చుకున్నారు. వాణీతో వివాహం తర్వాత తన భార్యలోని సంగీత ప్రావీణ్యతను గుర్తించారు జయరామ్. ఆల్రెడీ కర్ణాటిక్, శాస్త్రియ సంగీతాలను ఔపోసన పట్టిన ఆమెను హిందుస్థానీ సంగీతాన్ని కూడా నేర్చుకోవాలని కోరారు జయరామ్.కేవలం నేర్చుకోమని చెప్పడమే కాకుండా.. ఉస్తాద్ అబ్దుల్ రహమాన్ దగ్గర సంగీత పాఠాలు నేర్పించారు. ఉస్తాద్ అబ్దుల్ రహమాన్ శిష్యరికంలో ఆరు నెలల కఠోర శిక్షణ తర్వాత హిందుస్థానీ సంగీతంలో కూడా వాణి ప్రతిభ చూపారు. 18 గంటల పాటు ఏకధాటిగా శిక్షణ తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఇక బ్రహ్మాండంగా కచేరీలు చేసుకోవచ్చని వాణీకి భరోసా ఇచ్చారు రహమాన్. ఆత్మవిశ్వాసం, గురువు రహమాన్ ఇచ్చిన భరోసాతో చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగానికి స్వస్తి పలికారు వాణి. 1969లో తొలిసారిగా ముంబయ్‌లో కచేరి ఇచ్చారామె. ఆ తర్వాత సినీ గాయనిగా ఎంతో బిజీ అయ్యారు. సంగీతమే సంతానం... వాణీ జయరామ్ దంపతులకు సంతానం లేరు. సంగీతాన్నే సంతానంలా భావించారు. ‘‘సంగీతంతో సంతానం లేని లోటు తీరిపోయిందనుకుంటాం’’ అని పలు సందర్భాల్లో వాణి పేర్కొన్నారు. కొత్త నాయికలకు ఆ వాణీయే... ఓ కొత్త హీరోయిన్ వెండితెరకు పరిచయం అవుతుందంటే వెంటనే వాణీ జయరామ్‌కు కబురు వెళ్లేది. అలా పలువురు హీరోయిన్లు నటించిన తొలి సినిమాకు పాటలు పాడారు వాణీ జయరామ్. శ్రీదేవి హీరోయిన్గా పరిచయమైన తొలి తమిళ (‘మూండ్రు ముడుచ్చు – ‘ఆడి వెళ్లి’), హిందీ (సోల్వా సావన్ – గోరియా హో గోరియా) చిత్రాల్లో పాటలు పాడారు వాణీ జయరామ్. అలాగే షబానా ఆజ్మీ, జూహీ చావ్లా, పర్విన్ బాబీ, జయబాధురీ హీరోయిన్లుగా పరిచయం అయిన తొలి చిత్రాలకు వాణీ జయరామ్ పాటలు పాడారు. వాణి తెలుగు హిట్ సాంగ్స్ కొన్ని... ► అభిమానవంతులు – ‘ఎప్పటివలె కాదురా నా సామి...’ ► ‘స్వాతి కిరణం’ – తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ, ఆనతినీయరా హరా.., శివానీ భవానీ.. ► ‘శంకరాభరణం’ – దొరకునా ఇటువంటి సేవ.., ఏ తీరుగ నను.., ► పలుకే బంగారమాయెనా.. ► ‘పూజ’ – పూజలు చేయ పూలు తెచ్చాను... ► ‘సీతామాలక్ష్మి’ – ఏ పాట నే పాడను... ► శ్రుతిలయలు – ఆలోకయే శ్రీ బాలకృష్ణమ్... ► ‘తిరుపతి’ – తప్పెట్లోయి తాళాలోయి ► ‘సీతాకోక చిలుక’ – సాగర సంగమమే..., అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి ► ‘స్వర్ణకమలం’ – అందెల రవమిది పదములదా... ► ‘మంగమ్మగారి మనవడు’ – శ్రీ సూర్యనారాయణ మేలుకో... ► ‘గుప్పెడు మనసు’ – నేనా పాడనా పాట.. మీరా అన్నదీ మాట.. ► ‘ఘర్షణ’– ఒక బృందావనం సోయగం... అది దైవ సంకల్పం 1970 నుంచి 1990 వరకూ బిజీ గాయనిగా సాగిన వాణీ జయరామ్ ఆ తర్వాత కాస్త స్లో అయ్యారు. కాగా పలు భాషల సినిమాలకు పాడుతూనే మరోవైపు ఎన్నో భజన పాటలు కూడా పాడారు వాణి. ‘అది పూర్తిగా దైవ సంకల్పం. ఆ దేవుడికి ధన్యవాదాలు. భజనలు పాడినప్పుడు నా మనసెంతో ఆనందంగా ఉంటుంది’ అని పలు సందర్భాల్లో ఆమె పేర్కొన్నారు. హిందీలో తొలి చిత్రం ‘గుడ్డి’కి తొలుత ఆమె పాడినది భజన పాటే. అయితే సినిమా విడుదల తర్వాత చూస్తే సిల్వర్ స్క్రీన్‌పై ఆ పాట వినబడలేదు. అలా ఎందుకు జరిగిందో ఎప్పటికీ అర్థం కాలేదని ఓ సందర్భంలో వాణి పేర్కొన్నారు. ఈ ఒక్క పాటే కాదు.. వాణి పాడిన పాటల్లో తెరపై వినిపించనవి ఎన్నో ఉన్నాయి. ‘ఇలాంటివాటి గురించి తలచుకుంటే బాధ రెట్టింపు అవుతుందే కానీ, తగ్గదు. అందుకే వాటి గురించి ఆలోచించను’ అని ఓ సందర్భంలో వాణి పేర్కొన్నారు. వాణీ జయరామ్ అంత పాజిటివ్ పర్సన్. ప్రముఖుల నివాళి తన మధురమైన గాత్రంతో సినీ సంగీతానికి విశేష సేవలందించి ఎంతోమంది హృదయాలను గెలిచారు వాణీ జయరామ్‌గారు. పాన్ ఇండియా స్థాయిలో బలమైన శాస్త్రీయ పునాదిని నిర్మించారామె. వాణీగారి మృతి భారత సినీ పరిశ్రమకు, సంగీత ప్రపంచానికి తీరని లోటు. ఆమె ఆత్మకు శాంతి కలగాలి.. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. – వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వాణీ జయరామ్‌గారి మృతి బాధాకరం. 14 భాషల్లో 10 వేలకుపైగా పాటలు పాడిన ఆమె సినీ రంగానికి అందించిన సేవలు మరువలేనివి. ఆమె మృతి భారత సినీ పరిశ్రమకు, సంగీత ప్రపంచానికి తీరని లోటు.. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. – కేసీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి ప్రఖ్యాత భారతీయ సినీ సంగీత గాయనీమణిగా ఖ్యాతి సంపాదించుకున్న ‘కలైమామణి’ వాణీ జయరామ్ మరణ వార్త చాలా బాధించింది. ఆమె లేని లోటును భారతీయ సినిమాలో ఎవరూ భర్తీ చేయలేరు. వాణీ జయరామ్ కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. – ఎంకే స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి పదాలకు పదోన్నతి చేకూరేలా ఒక వినూత్నమైన బాణీతో ప్రపంచానికి ఎన్నో పాటలను బహుమతిగా ఇచ్చిన కోకిలలా జీవించిన వాణీ జయరామ్‌గారు ఇప్పుడు ప్రశాంతించారు. ఆవిడ పాటలు మనతోనే ఉంటాయి. – కమల్‌హాసన్ మీరు (వాణీని) నాకు పాడిన తొలి పాటనే మీకు నివాళిగా అర్పిస్తున్నాను. ‘మేఘమే మేఘమే.. పాల్ నిలా తేయందదే. దేగమే తేయినుమ్ తేనొళీ వీసుదే.. ఎనక్కొరు మలర్ మాలై నీ వాంగ వేండుమ్’ (తమిళ చిత్రం ‘పాలవన్న చోలై’లోని పాట.. ఈ చిత్రం తెలుగులో ‘మంచు పల్లకి’గా రీమేక్ అయింది. తెలుగులో ‘మేఘమా..’ పాటని ఎస్. జానకి పాడారు). పాటలో ‘ఎనక్కొరు మలర్ మాలై నీ వాంగ వేండుమ్’ అంటే నాకోసం నువ్వొక పూలదండ కొనాలని అర్థం. ఈ సాహిత్యాన్ని ‘ఉనక్కొరు మలర్ మాలై నాన్ వాంగ వేండుమ్’.. (నీకోసం నేనో పూలదండ కొనాలని అర్థం) అని మార్చి... ‘ఆ పూలదండ దీనికోసమేనా?’ (వాణి మరణాన్ని ఉద్దేశించి) అంటూ ముగించారు. తమిళ ప్రముఖ రచయిత వైరముత్తు. చాలా షాక్‌కి గురి చేసే వార్త ఇది. నమ్మశక్యంగా లేదు. జస్ట్ రెండు రోజుల క్రితమే వాణీ అమ్మతో మాట్లాడాను. నిజమైన లెజెండ్. బలమైన శాస్త్రీయ పునాదితో బహుముఖ ప్రతిభ గల బహు భాషా గాయనిని కోల్పోయాం. – చిత్ర నిన్న (శుక్రవారం) రాత్రే కె. విశ్వనాథ్ సార్ సినిమాల్లో వాణీగారి పాటలు వింటూ, ‘ఎంత అద్భుతంగా పాడారో వినండీ.. అని మా ఆయన (నటుడు శరత్‌కుమార్)తో అన్నాను. ఆ మర్నాడే ఆమె మరణ వార్త విని షాకయ్యాను. – రాధికా శరత్‌కుమార్ ఎంత గొప్ప గాత్రం. చివరిసారిగా ఆమెను కలిసినప్పుడూ ఆ గాత్రంలో అదే స్పష్టత. ‘ఏళు స్వరంగళ్, మల్లిగై, నానే నానా వంటి పాటలతో పాటు నాకు పాడిన ‘మేఘమే మేఘమే’... ఇలా ఆమె పాడిన ఎన్నో పాటలు హృదయాల్లో నిలిచిపోతాయి. – సుహాసినీ మణిరత్నం ► భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ప్రసంశలు పొందారు వాణీ జయరామ్. ఓ కచేరీలో ఇందిరా గాంధీ తన ప్రతిభను ఎంతగానో మెచ్చుకున్నట్లు పలు సందర్భాల్లో వాణి స్వయంగా చెప్పారు. ► హేమమాలిని, వినోద్ ఖన్నా ప్రధాన తారాగణంగా గుల్జార్ దర్శకత్వంలో 1979లో హిందీలో ‘మీరా’ అనే చిత్రం వచ్చింది. ఈ సినిమాలో ఉన్న 13 పాటల్లో 12 పాటలను వాణీ జయరామ్ పాడటం విశేషం. ► గంగామహోత్సవ్, స్వామి హరిదాస్ ఫెస్టివల్, ఛండీఘడ్‌లోని పంచకుల, ఛిత్తోడ్ఘడ్లో మీరా ఫెస్టివల్స్.. ఇలా పలు పండగలకు ఆమె కచేరిలు చేశారు. బద్రినాథ్‌లో రెండుసార్లు పాడారు. -
కళాతపస్వికి కన్నీటి వీడ్కోలు
ప్రముఖ దర్శకుడు కాశీనాథుని విశ్వనాథ్‌కు అశేష అభిమానగణం కన్నీటి వీడ్కోలు పలికింది. ఆయన అంత్యక్రియలు శుక్రవారం మధ్యాహ్నం పంజగుట్ట హిందూ శ్మశానవాటికలో జరిగాయి. శుక్రవారం ఆయన నివాసం నుంచి పంజగుట్ట శ్మశానవాటిక వరకు అంతిమయాత్ర సాగింది. అంతకుముందు ఆయనకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. కళాతపస్విని కడసారి చూసేందుకు అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చి అంతిమయాత్రలో పాల్గొన్నారు. బంజారాహిల్స్/సాక్షి, హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు కాశీనాథుని విశ్వనాథ్ (92)కు అశేష అభిమానగణం కన్నీటి వీడ్కోలు పలికింది. ఆయన అంత్యక్రియలు శుక్రవారం మధ్యాహ్నం పంజగుట్ట హిందూ శ్మశాన వాటికలో సంప్రదాయబద్ధంగా జరిగాయి. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి అపోలో ఆస్పత్రిలో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. విశ్వనాథ్ పార్థివ దేహాన్ని ఆస్పత్రి నుంచి గురువారం రాత్రి ఒంటి గంటకు ఫిలింనగర్‌లోని స్వగృహానికి తరలించారు. రాత్రి నుంచే విశ్వనాథ్ భౌతికకాయాన్ని సందర్శించేందుకు సినీ, రాజకీయ ప్రముఖులతోపాటు అభిమానులు భారీగా విచ్చేయడంతో పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. శుక్రవారం ఆయన నివాసం నుంచి పంజగుట్ట శ్మశాన వాటిక వరకు అంతిమయాత్ర సాగింది. కళాతపస్విని కడసారి చూసేందుకు అభిమానులు పెద్దసంఖ్యలో అంతిమయాత్రలో పాల్గొన్నారు. అనంతరం శ్మశాన వాటికలో ఆయన పార్థివదేహాన్ని ఖననం చేశారు. కన్నీరుమున్నీరైన చంద్రమోహన్ విశ్వనాథ్ భౌతికకాయాన్ని శుక్రవారం మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఎంపీ సంతోష్ కుమార్, సినీ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, పవన్ కల్యాణ్, శరత్‌కుమార్, రాధిక, రాజశేఖర్, జీవిత, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, కె.రాఘవేంద్రరావు, త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళి, అల్లు అరవింద్, బోయపాటి శ్రీను, శేఖర్ కమ్ముల, ఆది శేషగిరిరావు, దగ్గుబాటి సురేష్‌బాబు తదితరులు సందర్శించి నివాళులర్పించారు. విశ్వనాథ్ కుటుంబసభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. విశ్వనాథ్ దర్శకత్వంలో సిరిసిరిమువ్వ సినిమాలో హీరోగా నటించిన చంద్రమోహన్ కన్నీరుమున్నీరయ్యారు. విశ్వనాథ్ భౌతికకాయాన్ని చూడటంతోనే ఆయన విలపిస్తూ అక్కడే కుప్పకూలిపోయారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. విశ్వనాథ్ మృతి బాధాకరం: మంత్రి తలసాని కళాతపస్వి విశ్వనాథ్ మృతి బాధాకరమని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. తలసాని ఆయన నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మన సంస్కృతి సంప్రదాయాలు, కళల విశిష్టతను చాటేలా అనేక చిత్రాలు నిర్మించిన గొప్ప దర్శకులంటూ కొనియాడారు. ఏపీ ప్రభుత్వం తరపున.. విశ్వనాథ్ అంత్యక్రియల్లో ఏపీ ప్రభుత్వం తరపున బీసీ సంక్షేమ, సమాచార, సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పాల్గొన్నారు. ఆయన విశ్వనాథ్ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను, సంగీత సాహిత్యాలను సృజనాత్మక శైలిలో ప్రేక్షకులకు అందించిన కళాతపస్వి మరణించడం సినీ పరిశ్రమకు తీరని లోటని చెప్పారు. బహుముఖ ప్రజ్ఞాశాలి విశ్వనాథ్: ప్రధాని మోదీ సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ‘సినీ ప్రపంచంలో కె.విశ్వనాథ్ ఒక దిగ్గజం. సృజనాత్మక దర్శకుడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా సినీలోకంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. వివిధ ఇతివృత్తాలతో తీసిన అతని సినిమాలు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరించాయి’.. అని శుక్రవారం ట్విట్టర్లో పేర్కొన్నారు. అసమాన ప్రతిభావంతుడు: గవర్నర్ తమిళిసై కె.విశ్వనాథ్ మృతిపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక దిగ్గజ దర్శకుడు, నటుడిని తెలుగు సినీ పరిశ్రమ కోల్పోయిందని తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఆయన తన అసమాన ప్రతిభతో సినీ పరిశ్రమపై చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. అరుదైన దర్శక దిగ్గజం: కేసీఆర్ ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ మృతికి సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం తెలిపారు. అతి సా మాన్యమైన కథను ఎంచుకొని.. తన అద్భుతమైన ప్రతిభతో.. వెండి తెర దృశ్య కావ్యంగా మలిచిన అరుదైన దర్శ కుడు కె.విశ్వనాథ్ అని కొనియాడారు. గతంలో విశ్వనాథ్ ఆరోగ్యం బాగా లేనప్పుడు ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించిన సమయంలో.. సినిమాలు, సంగీతం, సాహిత్యంపై తమ మధ్య జరిగిన చర్చను సీఎం గుర్తు చేసుకున్నారు. తెలుగువారి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతారు: జగన్ సాక్షి, అమరావతి: సినీ దర్శక దిగ్గజం కె. విశ్వనాథ్ తెలుగు వారి గుండెల్లో కళాతపస్విగా శాశ్వతంగా నిలిచిపోతారని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కొనియాడారు. ఈ మేరకు శుక్రవారం ఆయన తన ట్విట్టర్ ఖాతాల్లో ట్వీట్ చేశా రు. ‘విశ్వనాథ్ గారి మరణం తీవ్ర విచారానికి గురిచేసింది. తెలుగు సంస్కృతికి, బారతీయ కళలకు నిలువుటద్దం విశ్వనాథ్ గారు. ఆయన దర్శకత్వం రూపుదిద్దుకున్న చిత్రాలు తెలుగు సినీ రంగానికి అసమాన గౌరవాన్ని తెచ్చాయి’ అని పేర్కొన్నారు. స్పీకర్, మంత్రుల సంతాపం కె.విశ్వనాథ్ మరణంపై స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, శ్రీనివాస్‌గౌడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. సినిమా తీయాలనుకున్నా విశ్వనాథ్‌తో సినిమా తీయాలన్న తన ఆశ కలగానే మిగిలిపోయిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. కె.విశ్వనాథ్ మృతికి టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ వేర్వేరు ప్రకటనల్లో తీవ్ర సంతాపం తెలిపారు. -
కూతుర్ని హీరోయిన్గా చూడాలనుకున్న జమున, కానీ..
తెలుగువారి సత్యభామగా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన జమున (86) ఇకలేరు. వయోభారం, అనారోగ్య కారణాలతో హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని తన స్వగృహంలో శుక్రవారం ఉదయం 7.30 ని‘‘లకు తుదిశ్వాస విడిచారామె. అమెరికాలో ఉంటున్న కుమారుడు వంశీకృష్ణ హైదరాబాద్ చేరడానికి ఆలస్యం కావడంతో కుమార్తె స్రవంతి తల్లికి అంత్యక్రియలు నిర్వహించారు. నిప్పాణి శ్రీనివాసరావు, కౌసల్యాదేవి దంపతులకు 1936 ఆగస్ట్ 30న హంపిలో జన్మించారు జమున. తండ్రికి గుంటూరులో పొగాకు, పసుపు వ్యాపారాలుండేవి. శ్రీనివాసరావు వ్యాపార రీత్యా జమున బాల్యమంతా గుంటూరు జిల్లాలోని దుగ్గిరాలలో గడిచింది. చక్కని సంగీత విద్వాంసురాలు అయిన కౌసల్యాదేవి జమునకి శాస్త్రీయ సంగీతం, హార్మోనియంలలో శిక్షణ ఇప్పించారు. దుగ్గిరాల గ్రామస్తులు వేసిన ‘ఛలో ఢిల్లీ’ నాటకంలో తొలిసారి వసుంధర అనే పాత్ర వేశారు జమున. ఆ తర్వాత ‘మా భూమి, ఖిల్జీ రాజ్యపతనం..’ ఇలా పలు నాటకాలు వేశారు జమున. దుగ్గిరాలకు చెందిన శ్రీమన్నారాయణమూర్తి అనే నటుడు జమున గురించి నిర్మాత బీవీ రామానందంకు (‘వరూధిని’ సినిమా తీశారు) చెప్పారు. దీంతో ఆయన నిర్మిస్తున్న తర్వాతి చిత్రం ‘జై వీర భేతాళ’(1952 మార్చిలో స్టార్ట్ అయింది) అనే సినిమాలో హీరోయిన్గా జమునకు అవకాశం ఇచ్చారు. ఈ చిత్రంలో గుమ్మడి హీరోగా ఎంపికయ్యారు. అయితే ఆ సినిమా ఎందుకో ఆగిపోయింది. ఆ తర్వాత గరికపాటి రాజారావు దర్శకత్వం వహించిన ‘పుట్టిల్లు’ (1953) సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయమయ్యారు జమున. ఆ తర్వాత ఎన్టీఆర్, ఏఎన్ఆర్, జగ్గయ్య వంటి అగ్రహీరోల సరసన కథానాయికగా నటించారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంతో పాటు పలు హిందీ సినిమాల్లో నటించి భేష్ అనిపించుకున్నారామె. దాదాపు 200 సినిమాల్లో ఎన్నో పాత్రల్లో జమున నటించినా బాగా పేరు తెచ్చినవాటిలో సత్యభామ పాత్రని ప్రముఖంగా చెప్పుకోవాలి. ఆ పాత్రలో ఆమెను తప్ప ఎవర్నీ ఊహించుకోలేం అన్నట్టుగా జీవించారు జమున. ‘సంతోషం, మిస్సమ్మ, చిరంజీవులు, తెనాలి రామకృష్ణుడు, దొంగరాముడు, బంగారు పాప, వద్దంటే డబ్బు, చింతామణి, భూకైలాస్, భాగ్యరేఖ, గుండమ్మకథ’ వంటి పలు హిట్ చిత్రాల్లో నటించారు జమున. ‘తెలుగు ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ అనే సంస్థ నెలకొల్పి 25 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారామె. లెక్చరర్‌తో పెళ్లి... హీరోయిన్లు సినిమా ఇండస్ట్రీలోని వారిని కాకుండా ఇతర రంగంలోని వారిని వివాహం చేసుకోవడం నటి పద్మినీతో ఆరంభమైంది. అలా వివాహం చేసుకున్న రెండో హీరోయిన్ జమున. దూరపు బంధువైన రమణారావుతో 1965లో జమున వివాహం తిరుపతిలో జరిగింది. రమణారావు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయంలో పీహెచ్డీ చేస్తూ, జువాలజీ లెక్చరర్‌గా చేసేవారు. డాక్టరేట్ అందుకున్న తర్వాత ఉస్మానియా విశ్వ విద్యాలయానికి బదిలీ అయ్యారాయన.. దీంతో కాపురాన్ని హైదరాబాద్‌కి మార్చారు. జమున కూడా మద్రాసు (చెన్నై) నుంచి హైదరాబాద్‌కి వచ్చేశారు. 1976లో బంజారాహిల్స్‌లో సొంత ఇల్లు కట్టుకుని స్థిరపడ్డారామె. రమణారావు–జమునలకు వంశీకృష్ణ, స్రవంతి సంతానం. తొలి సంతానం వంశీకృష్ణ పుట్టిన తర్వాత కూడా పదేళ్లపాటు హీరోయిన్గా బిజీగానే కొనసాగారు జమున. వంశీకృష్ణ శాన్ఫ్రాన్సిస్కో విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పని చేస్తూ అక్కడే స్థిరపడ్డారు. బర్కిలీలోని స్టెయిన్డ్ గ్లాస్ గార్డెన్లో గ్లాస్ పెయింటింగ్‌లో శిక్షణ పొంది, అదే రంగంలో స్రవంతి స్థిరపడ్డారు. స్రవంతిని హీరోయిన్ చేయాలనుకున్నారు జమున. అయితే ఇండస్ట్రీలో వచ్చిన మార్పులతో ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారామె. కాగా ఓ నవల ఆధారంగా సినిమా తీయాలని, దానికి తనే దర్శకత్వం వహించాలని సంకల్పించారు జమున. నాలుగు పాటలు రికార్డు చేసిన తర్వాత ఈ సినిమా ఆగిపోయింది. అయితే దర్శకత్వంపై తనకున్న మమకారంతో ‘డాక్టర్ మమత’ అనే సీరియల్‌ని తెరకెక్కించారామె. దూరదర్శన్‌లో 15 ఎపిసోడ్స్‌గా ఆ సీరియల్ ప్రసారం అయింది కూడా! రాజకీయ రంగంలో... 1980లలో నాటి ప్రధాని రాజీవ్ గాంధీ ప్రోత్సాహంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు జమున. పార్టీ కార్యవర్గ సభ్యురాలిగా ఎన్నికై 1983లో ఆ పార్టీ తరఫున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రచారం చేశారామె. తర్వాత రాజీవ్ గాంధీ సపోర్ట్‌తో 1989లో రాజమండ్రి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు జమున. ఆ తర్వాత వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొన్నాళ్లు చేసిన ఆమె ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి బయటికొచ్చేశారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి వ్యవహార శైలి నచ్చి భారతీయ జనతా పార్టీలో చేరారు.. 1990వ దశకంలో ఆ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం చేశారు. ఆ తర్వాత ‘రంగస్థల వృత్తి కళాకారుల సమాఖ్య’ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టి రాష్ట్రంలో పర్యటించి, పదివేల మంది కళాకారుల వివరాలు సేకరించారామె. అంతేకాదు.. ‘రంగస్థల వృత్తి కళాకారుల సమాఖ్య’కు 26 శాఖలు ఏర్పాటు చేశారు. నిరుపేద కళాకారులకు ఇళ్ల స్థలాలు, గృహ రుణాలు, పెన్షన్లు మంజూరు చేయించి పెద్ద మనసు చాటుకున్నారు జమున. అవార్డులు... 1964లో విడుదలైన ‘మూగమనసులు’ (తెలుగు), 1968లో రిలీజైన ‘మిలన్’ (హిందీ) చిత్రాలకు ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, 2008లో ‘ఎన్టీఆర్ జాతీయ పురస్కారం’ అందుకున్నారామె. అలాగే 2021 సంవత్సరానికిగాను ‘సాక్షి’ మీడియా గ్రూప్ ఎక్స్‌లెన్స్ అవార్డుల్లో భాగంగా ‘జీవిత సాఫల్య పురస్కారం’ అందుకున్నారు జమున. దాదాపు ఏడు దశాబ్దాల కెరీర్లో అద్వితీయమైన పాత్రలు చేసిన జమునకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే‘పద్మ’ పురస్కారం వరించలేదు. అయినా అవార్డులకు అతీతంగా ‘సత్యభామ’గా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రవేసిన ఈ అద్భుత నటి చరిత్ర ఎప్పటికీ నిలిచిపోతుంది. కూతురే కుమారుడై... 2014 నవంబరు 10న జమున భర్త రమణారావు గుండెపోటుతో మృతి చెందారు. అప్పటినుంచి కుమార్తె స్రవంతి దగ్గరే ఉంటున్నారు జమున. తల్లికి అన్నీ తానయ్యారు స్రవంతి. శుక్రవారం ఉదయం జమున మరణించగా, మధ్యాహ్నం ఆమె పార్థివ∙దేహాన్ని ఫిలిం చాంబర్లో అభిమానుల సందర్శనార్థం ఉంచారు. ఆ సాయంత్రం 4.30 గంటలకు ఫిలిం చాంబర్ నుంచి జమున అంతిమ యాత్ర మహాప్రస్థానానికి చేరింది. అమెరికాలో ఉంటున్న కుమారుడు వంశీకృష్ణ నేడు (శనివారం) హైదరాబాద్ చేరుకుంటారు. దాంతో అన్నీ తానై అశ్రునయనాల మధ్య తల్లికి స్రవంతి అంత్యక్రియలు నిర్వహించారు. సినీ ప్రముఖులు, కుటుంబసభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి ఆర్కే రోజాతోపాటు పలువురు పాల్గొని అశ్రునివాళులు అర్పించారు. గాయం చేసిన లేత మనసులు... ‘లేత మనసులు’ సినిమా తమిళ వెర్షన్ చేస్తుండగా జరిగిన ఓ ప్రమాదం వల్ల జమున మెడ బాగా దెబ్బతింది. ‘అందాల ఓ చిలుకా..’ పాట తమిళంలో తీస్తున్నారు. హీరో గడ్డిమేట మీద నుంచి జారుకుంటూ వచ్చి జమున పక్కన చేరాలి. అయితే కొత్తవాడైన ఆ చిత్ర హీరో జయశంకర్.. సీనియర్ హీరోయిన్ జమునతో చేస్తున్నాననే కంగారుతో అడ్డదిడ్డంగా వచ్చి జమున తలపై పడ్డారు.. దీంతో ఆమె మెడ విరిగినంత పనయింది. షూటింగ్ నిలిచిపోయింది. సున్నితమైన మెడ నరాలు దెబ్బతినడంతో కొన్నాళ్లు చికిత్స తర్వాత మళ్లీ షూటింగ్లో పాల్గొన్నారు జమున. అయితే కొన్నేళ్ల తర్వాత ఆ సమస్య మళ్లీ మొదటికొచ్చింది.. దీంతో ఆమె మెడ ఎక్కువగా ఊగిపోయేది. ‘రాజపుత్ర రహస్యం’ సినిమాలో ఈ ఇబ్బంది ఆమెలో బాగా కనిపించేది. ఎన్ని చికిత్సలు తీసుకున్నా తల ఊగడం తగ్గలేదు. 1978లో విడుదలైన ‘శ్రీరామ పట్టాభిషేకం’ తర్వాత సినిమాల నుంచి గౌరవంగా తప్పుకున్నారు జమున. ఆ తర్వాత ‘బంగారు కొడుకు’(1982), ‘జల్సా రాయుడు’(1983), ‘రాజకీయ చదరంగం’(1989) వంచి చిత్రాల్లో ముఖ్యమైన పాత్రలు చేశారు. కాగా ఆమె నటించిన చివరి చిత్రం ‘అన్నపూర్ణమ్మగారి మనవడు’ 2021 జనవరి 29న విడుదలైంది. నటి జమునతో తన అనుబంధాన్ని ‘సాక్షి’తో నటి కాంచన ప్రత్యేకంగా పంచుకున్నారు. నన్ను ఏడిపించేశావ్ కాంచీ అన్నారు – కాంచన ► వారానికి మూడు నాలుగు సార్లు జమున అక్క, నేను మాట్లాడుకునేవాళ్లం. అయితే ఈ నెల నాకు తీరిక లేకపోవడం, అక్క కూడా ఫోన్ చేయకపోవడంతో మాట్లాడుకోలేదు. మామూలుగా ఫోన్ చేసి, అప్పటి సినిమాల గురించి మాట్లాడుకుంటుంటాం. ‘భోజనం చేశావా.. వంట ఏంటి?’.. ఇవన్నీ కూడా చెప్పుకునేవాళ్లం. ► జమున అక్క నా సీనియర్. నేను కాలేజీ డేస్ నుంచే సీనియర్లతో జూనియర్లు మాట్లాడకూడదా అనుకునేదాన్ని. ఆ ఫీలింగ్‌తో సీనియర్లతో కూడా బాగా మాట్లాడేదాన్ని. సినిమాల్లోకి వచ్చాక కూడా అంతే. పైగా మేం చిన్నవాళ్లం అనే ఫీలింగ్ ఏమీ పెట్టుకోకుండా జమునక్క, సావిత్రక్క బాగా మాట్లాడేవారు. ► ఇక దసరా వచ్చిందంటే చాలు... బొమ్మల కొలువు సందడి ఉండేది. ఒకరింటికి ఒకరు వెళ్లడం.. సుండల్ (శెనగలు) తినడం... అంతా బాగుండేది. పైగా జమున అక్క భలే డ్రెస్ చేసుకునేవారు. ఆవిడకు బాగా రెడీ అవ్వడం అంటే ఇష్టం. నా డ్రెస్సింగ్ డిఫరెంట్‌గా ఉండేది. సింపుల్‌గా రెడీ అయ్యేదాన్ని. బాగున్నావని మెచ్చుకునేవారు. ► అట్లతద్దిని అయితే ఎప్పటికీ మరచిపోలేను. అప్పట్లో అందరం మదరాసు (చెన్నై)లో ఉండేవాళ్లం కదా. అట్లతద్ది నాడు ఒకళ్లు అట్లు వేసేవాళ్లం. ఇంకొకరు చట్నీ చేసేవాళ్లం. ఇంకొకరు పులుసు.. జమున అక్క, నేను అందరం మెరీనా బీచ్‌కి వెళ్లిపోయేవాళ్లం. అక్కడ ఉయ్యాల కుదరదు కదా. పరుగు పందేలు పెట్టుకుని, చాలా హ్యాపీగా గడిపేవాళ్లం. ► ఆ మధ్య ఒకసారి జమున అక్క ఫోన్ చేసి, ‘నన్ను ఇవాళ బాగా ఏడిపించేశావ్..’ అంటే, నాకేం అర్థం కాలేదు. ‘నేనేం ఏడిపించాను అక్కా...’ అంటే... నువ్వు యాక్ట్ చేసిన ‘కల్యాణ మంటపం’ సినిమా చూశాను. ‘ఎంత బ్రహ్మాండంగా యాక్ట్ చేశావ్. ఎమోషనల్ సీన్స్‌లో ఏడిపించావ్’ అంటే నాకు పట్టరానంత ఆనందం కలిగింది. ► జమునక్క యాక్ట్ చేసినవాటిలో నాకు ‘మూగ మనసులు’ చాలా ఇష్టం. ఇక ‘మిస్సమ్మ’లో ‘బృందావనమది అందరిదీ..’ పాటకి ఎంతో నాజూకుగా డ్యాన్స్ చేసింది. మనకు ఏమీ తెలియనప్పుడు టీచర్ చెప్పింది చెప్పినట్లు చేస్తాం... ఆ సినిమాలో డ్యాన్స్ నేర్చుకునే స్టూడెంట్‌గా టీచర్ చెప్పింది చెప్పినట్లు చేసే క్యారెక్టర్ని అక్క అద్భుతంగా చేసింది. ► మేం కలిసి నాటకాలు కూడా వేసేవాళ్లం. ముఖ్యంగా ‘శ్రీకృష్ణ తులాభారం’ నాటకం చాలాసార్లు వేశాం. అందరూ ఆడవాళ్లే నటించాలన్నది అక్క ఆశ. అలానే ఆడవాళ్లందరం కలిసి నటించాం. సినిమాలో కృష్ణుడిగా ఎన్టీఆర్ నటించారు. నాటకంలో ఆ పాత్ర నాది. సత్యభామగా జమున అక్క నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాంటిది కృష్ణుడిగా నా నటనను మెచ్చుకునేది. ► మేమంతా సత్య సాయిబాబా భక్తులం. జీవితం అనేది పోరాటం. ఈ పోరాటంలో గెలిచి నిలబడటం చాలా కష్టమైన విషయం. జమున అక్క నిలబడింది. ఈ గెలుపు కన్నా కూడా బతికున్నంతవరకూ పోరాటం చేసే మనిషి పోయేటప్పుడు ప్రశాంతంగా పోవడమనేది ముఖ్యం. ఆ ప్రశాంతత అక్కకు దక్కింది. ‘దేవుడా.. ఆస్పత్రిపాలు కాకుండా ప్రశాంతంగా తీసుకెళ్లు’ అని కోరుకుంటాం. ఆ సత్య సాయిబాబా ఆశీస్సులతో అక్క ఎలాంటి ఇబ్బంది పడకుండా వెళ్లిపోయింది. ఆ జీవుడు చివరి నిమిషంలో ఎలాంటి బాధ పడకుండా నిష్క్రమించింది. ప్రశాంతమైన మనిషికి ప్రశాంతమైన నిష్క్రమణ దక్కింది. ఇది కదా కావాల్సింది (గద్గద కంఠంతో..) పేరు మారిందిలా... జమున పేరు వెనక ఓ విశేషం ఉంది. ఆమె తల్లిదండ్రులు తీర్థయాత్రలు చేస్తూ, పండరీపురంలోని పాండురంగని దర్శనం చేసుకున్న తర్వాతే కౌసల్య కడుపులో పడ్డారట జమున. ఈ కారణం చేత ‘జనాబాయి’ అని పేరు పెట్టుకోవాలనుకున్నారు జమున తల్లిదండ్రులు. కానీ జన్మరాశి ప్రకారం ఏదైనా నది పేరు రావాలని పెద్దలు చెప్పడంతో ‘జ’కి ‘న’కు మధ్యలో ‘ము’ అక్షరాన్ని చేర్చి ‘జనాబాయి’ పేరును ‘జమున’గా మార్చారు. ఉత్తరాదిలో ‘యుమున’ నదిని ‘జమున’ అంటారు. ‘ఇంత నాజుకైన పేరు పెట్టి సినిమారంగం కోసం మళ్లీ పేరు మార్చుకునే అవసరం లేకుండా చేసిన మా అమ్మను నిజంగా అభినందించాల్సిందే’ అని పలు సందర్భాల్లో జమున గుర్తుచేసుకుని హ్యాపీ ఫీలయ్యేవారు. సావిత్రితో ప్రత్యేక అనుబంధం ‘మిస్సమ్మ’, ‘దొంగరాముడు’, ‘అప్పుచేసి పప్పుకూడు’, ‘గుండమ్మకథ’ వంటి చిత్రాల్లో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న సావిత్రి, జమునల మధ్య మంచి అనుబంధం ఉంది. అక్కాచెల్లెళ్లుగా అన్ని విషయాలను అరమరికలు లేకుండా చర్చించుకునేవారు. అయితే కొందరు వ్యక్తులు కావాలని వీరిద్దరి మధ్యలో తగువులు పెట్టడంతో ఏడాది పాటు సావిత్రి, జమున మాట్లాడుకోలేదు. ఆ తర్వాత అసలు విషయం గ్రహించి మునుపటిలానే ఉండసాగారు. ఈ విషయాన్ని జమున ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అంతేకాదు.. తన కొడుకు బారసాల వేడుకకు సావిత్రి వచ్చారని, ఆ సమయంలో ఆమె (సావిత్రి) జీవితం సజావుగా సాగనందుకు చాలా బాధపడి ఏడ్చారని, అప్పుడు తానే సావిత్రిని ఓదార్చినట్లుగా కూడా జమున ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. అలాగే ఒకానొక స్థితిలో సావిత్రి పరిస్థితిని చూసి తనకు చాలా బాధకలిగిందని కూడా జమున పేర్కొన్నారు. నటన–డైరెక్షన్–మ్యూజిక్: జమున! చిన్నతనం నుంచే జమునకు కళల పట్ల మక్కువ ఎక్కువ. అందుకే తొమ్మిదేళ్లు వచ్చేలోపే నాటకాల్లో నటించారు. ప్రజా నాట్యమండలి ఆధ్వర్యంలో తిరునగరి రామాంజనేయులు, బుర్రకథ పితామహుడు నాజర్ తదితరుల నాయకత్వంలో ‘మా భూమి’, ‘ముందడుగు’ ‘దిల్లీ’, ‘ఛలో’, ‘విందు’ వంటి నాటకాల్లో నటించారు జమున. ముఖ్యంగా ‘మా భూమి’ నాటికలోని జమున నటనకు మంచి మార్కులు పడ్డాయి. మరో విశేషం ఏంటంటే... ‘విందు’ అనే నాటికలో యశోదగా నటించడమే కాదు.. ఆ నాటికకు దర్శకత్వం వహించడంతో పాటు, మ్యూజిక్‌ను కూడా కంపోజ్ చేశారట జమున. ఇలా నటనలో ఎదగడానికి సరిపడా ఓనమాలు నేర్చుకున్నది నాటక రంగం నుంచేనని చెబుతారు జమున. ఆ తర్వాత ‘ఖిల్జీ రాజ్యపతనం’ నాటకంతో జమున పేరు మరింత ప్రాచుర్యంలోకి వచ్చి, తొలి సినిమా ‘పుట్టిల్లు’లో అవకాశం వచ్చేలా చేసింది. ఎస్వీరంగారావు సలహా సినిమా ఇండస్ట్రీలో బాగా రాణిస్తున్న సమయంలో ఓ హీరోను పెళ్లి చేసుకోవాలనుకున్నారట జమున. కానీ ఓ సందర్భంలో అప్పటి సీనియర్ నటులు ఎస్వీ రంగారావు జీవితం గురించి కొన్ని విషయాలు చెప్పి, అన్నీ ఆలోచించుకుని ముందడుగు వేయాలన్నట్లుగా హితబోధ చేశారట. దీంతో అప్పటి ఆ హీరోతో వివాహాన్ని వద్దనుకున్నారట జమున. ఆ తర్వాత రమణారావును పెళ్లి చేసుకున్నారు జమున. తల్లి స్ఫూర్తితో... ఇండస్ట్రీలో జమున చాలా ధైర్యంగా, ఆత్మాభిమానంతో ఉండేవారు. ఈ లక్షణాలతో పాటుగా ఆత్మవిశ్వాసం, వ్యక్తితాన్ని నిలబెట్టుకోవడం వంటి వాటిని తన తల్లి కౌసల్యాదేవి నుంచే అలవరచుకున్నారట జమున. విశేషం ఏంటంటే.. జమున తల్లి స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని రెండు రోజులు జైల్లోనే ఉన్నారట. ప్రముఖుల నివాళి జమున మృతికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ విచారం వ్యక్తం చేశారు. 70ఏళ్ల నట జీవితంలో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించిన ఆమె చిరస్మరణీయంగా నిలిచిపోతారన్నారు. జమున కుటుంబ సభ్యులకు గవర్నర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారని రాజ్‌భవన్ వర్గాలు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపాయి. తెలుగు చలన చిత్ర పరిశ్రమ మొదటి తరం నటీమణుల్లో అగ్రనాయికగా వెలుగొందిన సీనియర్ నటి జమున తెలుగు వారి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొనియాడారు. ఆమె మృతి తెలుగు చలన చిత్ర పరిశ్రమకు తీరని లోటని పేర్కొన్నారు. ఆమె కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్టుగా ట్విట్టర్ ద్వారా సీఎం వైఎస్ జగన్ తన సంతాపాన్ని తెలియజేశారు. నటి జమున మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ , ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు వేర్వేరు ప్రకటనల్లో సంతాపం వ్యక్తం చేశారు. జమున మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని సీఎం కేసీఆర్ అన్నారు. తొలి తరం నటిగా వందలాది చిత్రాల్లో నటించి, తెలుగువారి అభిమాన తారగా వెలుగొందిన జమున జ్జాపకాలను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. తెలుగు, తమిళం, కన్నడంలోనే కాకుండా హిందీ సినిమాల్లోనూ నటించి ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన జమున, నటిగా కళా సేవనే కాకుండా పార్లమెంటు సభ్యురాలిగా ప్రజాసేవ చేయడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా జమున కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సీనియర్ హీరోయిన్ జమునగారు స్వర్గస్తులయ్యారనే వార్త విచారకరం. ఆవిడ బహుభాషా నటి. మాతృభాష కన్నడం అయినా ఎన్నో విజయవంతమైన చిత్రాలతో తెలుగువారి మనసుల్లో చెరగని ముద్రవేశారు. మహానటి సావిత్రిగారితో జమునగారి అనుబంధం ఎంతో గొప్పది. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. – చిరంజీవి అల్లరి పిల్లగా, ఉక్రోషంతో ఊగిపోయే మరదలిగా, ఉత్తమ ఇల్లాలిగా, అన్నిటికీ మించి తెలుగువారి సత్యభామగా మనల్ని ఎంతో మెప్పించారు జమునగారు. చిన్ననాటి నుంచే నాటకాల అనుభవం ఉండటంతో నటనకే ఆభరణంగా మారారామె. కేవలం దక్షిణాది సినిమాలకే పరిమితం కాకుండా ఆ రోజుల్లోనే హిందీ సినిమాల్లోనూ నటించి ఔరా అనిపించి అందరి ప్రశంసలు పొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి జమునగారు. – బాలకృష్ణ జమునగారు మహానటి. ఆవిడతో కలిసి నేను ఆర్టిస్ట్‌గా పని చేశాను. ఆ మహానటి మరణం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. నాకు సన్నిహితురాలు. మేం కలిసినప్పుడు ఎంతో ఆప్యాయంగా, ప్రేమగా మాట్లాడేవారు. ఆవిడ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. – మంచు మోహన్‌బాబు భారతీయ సినీ పరిశ్రమకు జమునగారి మరణం తీరని లోటు. సినిమా ఇండస్ట్రీలో ఆమె ఒక మహానటి. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్, శివాజీగణేశన్.. వంటి ఎంతోమంది మహానటులతో నటించి మెప్పించారామె. అన్ని భాషల్లో ఆమె ఒక సూపర్ స్టార్. కళాకారులకు పెన్షన్ ఇవ్వాలని పోరాడారు. జమునగారికి కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డు ప్రకటించాలని కోరుతున్నాను. – ఆర్. నారాయణమూర్తి జమునగారు దివంగతులు కావడం బాధాకరం. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అలనాటి తరానికి ప్రతినిధిగా ఉన్నారామె. వెండితెరపై విభిన్న పాత్రలు పోషించిన జమునగారు తెలుగు ప్రేక్షకులకు సత్యభామగానే గుర్తుండిపోయారు. ఆ పౌరాణిక పాత్రకు జీవం పోశారామె. ఠీవి, గడుసు పాత్రల్లోనే కాకుండా అమాయకత్వం ఉట్టిపడే పాత్రల్లోనూ ప్రేక్షకుల మెప్పు పొందారు. ప్రజా జీవితంలో లోక్‌సభ సభ్యురాలిగా సేవలందించారు. – పవన్ కల్యాణ్ జమునగారి మరణవార్త విని తీవ్రంగా కలత చెందాను. సినీ పరిశ్రమకు ఆమె చేసిన సేవలు, పోషించిన వైవిధ్యమైన పాత్రలతో ఎప్పటికీ గుర్తుండిపోతారు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. – మహేశ్‌బాబు దాదాపు 30 సంవత్సరాలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మహారాణిగా కొనసాగారు జమునగారు. ‘గుండమ్మకథ’, ‘మిస్సమ్మ’లాంటి ఎన్నో మరపురాని చిత్రాలు, మరెన్నో వైవిధ్యమైన పాత్రలతో మా మనసుల్లో చెరపలేని ముద్ర వేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి. – ఎన్టీఆర్ జమునగారి మరణవార్త విని నా హృదయం ముక్కలైంది. క్లాసికల్ తెలుగు సినిమాకు ఆమె సేవలు మరువలేనివి. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నాను. – అల్లు అర్జున్ జమునగారు లేరనే విషయాన్ని నమ్మలేకపోతున్నాను. కొంతకాలంగా ఆమె క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ‘మూగమనసులు’ సినిమాలో ఆమె నటన అద్భుతం. సినిమాలతోపాటుగా రాజకీయాల్లోనూ ముందున్నారామె. జమునగారి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిగి ఉంటే బాగుండేది. – అలీ -
Veteran actor Jamuna: నివాళి: అలిగితివా సత్యభామ
తెలుగు అలక నీవే.. తెలుగు మొలక నీవే వాల్జడను విసిరి వలపు చూపును దూసేది నీవే అతిశయము నీవే.. స్వాతిశయము నీవే కనుచూపులో ధిక్కరింపు దుడుకువు నీవే నీవు సత్యభామవు.. నీవే సతీ అనసూయవు నీవే రాణి మాలినీదేవివి.. నీవే కలెక్టర్ జానకివి. పాతికేళ్లపాటు తెలుగు తెరను ఏలావు. నీ మార్గము నీదయ్యి నీ దుర్గము నీకు నిలిచింది. ప్రజల అభిమానమే నీకు పద్మభూషణ్. ప్రేక్షకుల ఆరాధనే రఘుపతి వెంకయ్య. నీకు అలంకారమైన అలకతో మా నుంచి వీడ్కోలు తీసుకున్నావని సర్ది చెప్పుకుంటున్నాము. మరోసారి దుగ్గిరాల నుంచి పద్యమై పలుకు. మరోసారి అపర సత్యభామవై మువ్వల సడి చెయ్యి. అలక తీరాక తిరిగి వస్తావు కదూ! సత్రాజిత్తు కుమార్తె సత్యభామ. తప్పు. నిప్పాణి శ్రీనివాసరావు కుమార్తె సత్యభామ. ఒప్పు. తెలుగువారికి సంబంధించినంత వరకు సత్యభామది దుగ్గిరాల. ‘అమ్మా... కాఫీ’... బంగారు బుగ్గలతో, మెరిసే కళ్లతో, గారాబంగా పెరిగి, పెంకిగా మారి, కాలు నేలన పెట్టకుండా, నిద్ర కళ్లతో లేచి కాఫీ అడిగే గారాల పట్టి ఎవరు? ఇంకెవరు జమున. ‘గుండమ్మ కథ’లో ఆ పాత్రను జమునే చేయాలి. కానీ... ‘గుండమ్మ కథ’ సినిమా తీయబోయే ముందు. నిర్మాత చక్రపాణి ఇంట్లో పంచాయితీ. ఒక గదిలో ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్. మరో గదిలో జమున, ఆమె తండ్రి నిప్పాణి శ్రీనివాసరావు. ‘క్షమాపణ పత్రం రాసివ్వమనండి సరిపోతుంది... జమునతో కలిసి పని చేస్తాం’ అని ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్ల గది నుంచి ప్రతిపాదన వచ్చింది. ‘క్షమాపణ రాసేది లేదు. నా తప్పేమిటో చెప్పమనండి’ జమున నుంచి జవాబు. ఈ తగాదా తీర్చకపోతే గుండమ్మ కథ పట్టాలెక్కదు. చక్రపాణి రెండు గదుల వైపు మార్చి మార్చి చూశాడు. ‘భూకైలాస్’ క్లయిమాక్స్ సీన్. మద్రాసు సముద్ర ఒడ్డున తీస్తున్నారు. ఆత్మలింగం చేజార్చుకున్న రావణుడు అంతకంతకూ పెరిగి పెద్దదవుతున్న ఆ లింగాన్ని మోయలేక, తనతో తీసుకెళ్లలేక, దానికి తల కొట్టుకుని ఆత్మత్యాగం చేయబోతున్న దృశ్యం అది. ఎన్.టి.ఆర్ మీద తీస్తున్నారు. ఆ సమయంలో నారదుడైన అక్కినేని పరిగెత్తుకొని రావాలి. మండోదరి పాత్ర పోషిస్తున్న జమున కూడా పరిగెత్తుకుని రావాలి. ఎండ మండిపోతోంది. అప్పటికే జమున షూటింగ్‌కి ఆలస్యంగా వస్తున్నదని అక్కినేనికి అభ్యంతరం ఉంది. కాలు మీద కాలు వేసుకుని కూచుంటున్నదని ఎన్.టి.ఆర్కు అసౌకర్యం ఉంది. జమునకు ఇవన్నీ తెలియవు. ఆ ఎండలో ఇంకా రాని జమున కోసం ఎదురు చూస్తూ అక్కినేని, ఎన్.టి.ఆర్ ఒక నిర్ణయం తీసుకున్నారు. మరునాడు ఇండస్ట్రీ అంతా ఆ నిర్ణయం విని హాహాకారాలు చేసింది. అచ్చొచ్చోలు విడిచింది. ఇక మీదట ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్లు జమునతో నటించబోవడం లేదు. బాయ్‌కాట్ ట్రెండ్ ఇటీవల మొదలైంది. కాని తెలుగులో బాయ్‌కాట్ చూసిన తొలి హీరోయిన్ జమున. ఊ... అంటావా మావా ఉహూ అంటావా మావా. కొత్త పాట. విశేషం ఏముంది? ఊ అను ఉఊ అను ఔనను ఔనవునను... జమున పాట. ఏనాడో జమున ఉఊ అంది. ఔనవునని అనలేకపోయింది. పెద్ద హీరోలు బాయ్‌కాట్ చేస్తే ఏంటి? తానొక నటి. తనకు సామర్థ్యం ఉంది. తను పని చేయగలదు. ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్లు లేకపోతే ఇక హీరోలే లేరా? అయినా తెర మీద జమున ఉంటే ఇక ఆవిడే ఒక హీరో లెక్క. 1959, 60, 61... దాదాపు మూడేళ్ల పాటు అక్కినేని, ఎన్.టి.ఆర్ జమునతో పని చేయలేదు. జమున ఆగిందా... ఆగలేదు. హిందీకి వెళ్లింది. జూబ్లీ హీరో రాజేంద్ర కుమార్‌తో ‘హమ్రాహీ’ చేసి హిట్ కొట్టింది. అందులో ‘ముజ్ కో అప్ నే గలే లగాలో’ పాటకు ముబారక్ బేగం, ‘మన్రే తూహీ బతా క్యా గావూ’ పాటకు లతా మంగేష్కర్ జమునకు ప్లేబ్యాక్ ఇచ్చారు. ‘మూగ మనసులు’ హిందీ రీమేక్ మిలన్లో అదే గౌరి పాత్రను వేసి ఫిల్మ్‌ఫేర్ అవార్డు సాధించింది. ‘బేటి బేటె’ సినిమాలో సునీల్ దత్‌కు హీరోయిన్గా చేసింది. తెలుగులో జగ్గయ్య, జె.వి.రమణమూర్తి, కృష్ణ, శ్రీధర్, హరనాథ్ వీరితో పని చేసింది. ఈలోపు జమున లాంటి గ్లామర్ స్టార్ లేక కొన్ని సినిమాలు ఏ.ఎన్.ఆర్, ఎన్.టి.ఆర్లవి వెలవెలబోయాయి. ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్లు లేక జమున పెద్ద సినిమాలు చేయలేకపోయింది. ఇరు పక్షాలా నష్టం. ఈ నష్టాన్ని నివారించి అందరినీ కలిపి ‘గుండమ్మ కథ’ తీయాలని చక్రపాణి నిశ్చయం. ‘సార్. క్షమాపణలు వద్దు ఏమొద్దు. వాళ్లనూ కూచోబెట్టండి. నన్నూ కూచోబెట్టండి. కావాలంటే నన్ను నాలుగు చివాట్లు పెట్టండి. ఏదో తెలియని రోజుల్లో తెలియని ప్రవర్తన. ఇక మీదట జాగ్రత్తగా ఉంటాను’ అంది జమున, చక్రపాణితో. ‘ఏమయ్యా రామారావు, నాగేశ్వరరావూ. ఈ బాయ్‌కాట్ వల్ల భవిష్యత్తు తరాలకు మీరో తప్పు మార్గం చూపిస్తున్నారు. ఇలా వద్దు. అంతా కలిసి పని చేయండి. నా గుండమ్మ ఇప్పటికే ఆలస్యమై ఏడుస్తోంది’ అన్నాడు చక్రపాణి. సమస్య సద్దుమణిగింది. జమున గెలవకపోయి ఉండవచ్చు. కాని ఓడలేదు. గుంటూరు జిల్లాలో పక్కపక్క ఊళ్ల నుంచి ఇద్దరు హీరోయిన్లు వచ్చారు. సావిత్రి, జమున. కృష్ణా జిల్లాలో పక్క పక్క ఊళ్ల నుంచి ఇద్దరు హీరోలు వచ్చారు. అక్కినేని, ఎన్.టి.ఆర్. ఈ నలుగురు తెలుగు సినిమాలకు ‘స్వర్ణచతుష్టయం’. ఆ స్వర్ణ చతుష్టయం నటించి సూపర్‌హిట్ కొట్టిన సినిమా గుండమ్మ కథ. జమున తండ్రి నిప్పాణి శ్రీనివాసరావు మధ్వ బ్రాహ్మణులు. కన్నడిగులు. జమున తల్లి కౌసల్యాదేవి వైశ్యులు. తెలుగు. వ్యాపారం నిమిత్తం శ్రీనివాసరావు హంపిలో ఉండగా పెద్ద కూతురుగా జమున పుట్టింది. ఆమెకు ఆరేడేళ్లు ఉండగా శ్రీనివాసరావు పసుపు, పొగాకు వ్యాపారానికి వీలుగా ఉంటుందని కాపురాన్ని ‘దుగ్గిరాల’కు మార్చాడు. అలా దుగ్గిరాల జమునకు రెండో జన్మస్థలం అయ్యింది. జమున తల్లికి హరికథలు చెప్పడం వచ్చు. ఆమె కచ్చేరీల్లో మధ్య మధ్య చిన్నారి జమునను స్టేజీ ఎక్కించి పాట పాడించేది. దుగ్గిరాలలో చదువుతూ స్కూల్లో కూడా జమున ఆడేది, పాడేది. నాటకాల వాళ్లు విని బాలనటిగా బతిమిలాడి తీసుకెళ్లేవారు. ‘ఢిల్లీ చలో’, ‘మా భూమి’, ‘ఖిల్జీ రాజ్య పతనం’... వీటిలో జమున బాలనటి. మండూరులో ‘ఖిల్జీ రాజ్యపతనం’ నాటకం వేయాలని ఒక తెలుగు మాస్టారు వచ్చి జమునను తీసుకెళ్లాడు. రైలు దిగి పొలాల మీద నడుస్తూ మండూరు చేరుకోవాల్సి ఉంటే జమున నడవలేక మారాము చేసింది. పాపం... ఆ తెలుగు మాస్టారు జమునను ఎత్తుకొని అంతదూరమూ నడిచి వెళ్లాడు. ఇది జరిగిన కొన్నాళ్లకు ఒక సినిమాలో జమున– అనురాగము విరిసేనా ఓ రేరాజా అనుతాపము తీరేనా... అనే పాటకు అభినయించింది. ఆ రోజు ఆమెను భుజాల మీద ఎత్తుకుని నడిచిన తెలుగు మాస్టారు ఆ పాటలో పడక్కుర్చీలో కూచుని ఆస్వాదిస్తుంటాడు. అతని పేరు జగ్గయ్య. గరికపాటి రాజారావు నటించి, నిర్మించి, దర్శకత్వం వహించిన ‘పుట్టిల్లు’ జమున మొదటి సినిమా. షాపుకారు జానకి, కృష్ణకుమారి, జమున... వీరు మాత్రమే స్ట్రయిట్‌గా హీరోయిన్ వేషాలతో చిత్ర ప్రవేశం చేశారు. మిగిలిన వారు చిన్న పాత్రలు వేసి, ఎదిగి, హీరోయిన్లు అయ్యారు. 16 ఏళ్ల వయసులో జమున ‘పుట్టిల్లు’ లో చాలా మెచ్యూరిటీ ప్రదర్శించాల్సిన పాత్రను పోషించింది. కాని గరికపాటి, జమునల జంటను ప్రేక్షకులు మెచ్చలేదు. ‘పతియే ప్రత్యక్షదైవమే’ థీమ్‌తో సినిమాలు వస్తున్న ఆ రోజుల్లో ‘పుట్టిల్లు’ సినిమా వ్యసనపరుడైన భర్తను నిరాకరించి తనకు తాను నిలబడే భార్య పాత్రను చూపించేసరికి జనం హడలెత్తి తెరను చింపేస్తామన్నారు. మూడ్రోజుల్లో బాక్సులు తిరిగొచ్చేసరికి క్లయిమాక్స్ మార్చి తీసి మళ్లీ అతికించినా ఫలితం రాలేదు. ఆ తర్వాత జమున నటించిన రెండు మూడు సినిమాలు ఆడలేదు. వెనక్కు వెళ్లిపోదామనుకుంటూ ఉండగా ‘మిస్సమ్మ’ సినిమాలో మెరిసి నిలబడింది. ఆ సినిమా నాటికే స్టార్లుగా మారిన అక్కినేని, ఎన్.టి.ఆర్, సావిత్రిల సరసకు అతి త్వరగా చేరింది. అయితే ప్రతి నటికి ఒక సిగ్నేచర్ కేరెక్టర్ దొరకాలి. అలాంటి కేరెక్టర్ జమునకు దొరికింది. ఆ పాత్రే సత్యభామ. సత్యభామ పాత్రంటే తెలుగు నాటకాల్లో పాపులర్. స్థానం నరసింహారావు ఆ పాత్రను పోషిస్తూ పాత్ర ఆంగిక, అభినయ, ఆహార్యాలను స్థిరపరిచేశాడు. ప్రేక్షకులు ఎవరైనా ఆయనతో పోల్చి వెండితెర సత్యభామను అంచనా కడతారు. జమున సత్యభామ పాత్రను మొదట తెలిసీ తెలియని వయసులో ‘వినాయక చవితి’ చిత్రంలో పోషించింది. అసలైన సత్యభామగా ఎన్.టి.ఆర్తో ‘శ్రీ కృష్ణ తులాభారం’లో నటించింది. స్థానం నాటకాల్లో పాపులర్ చేసిన ‘మీరజాల గలడా నా యానతి’ పాటను అంతకు దీటుగా అభినయించింది. పెంకితనం, మొండితనం, స్వాతిశయం వీటితో పాటు తెలియని అమాయకత్వాన్ని సత్యభామకు జోడించడంతో జమున సత్యభామ అయ్యింది. సత్యభామ జమున అయ్యింది. కృష్ణుడి వేషంలో ఉన్నా ఎన్.టి.ఆర్ అంతటి వాడి కిరీటాన్ని కాలితో తన్నాలి. జమున ధైర్యంగా తన్నగలిగింది. అలాంటి షాట్ చేశాక సీనియర్ ఆర్టిస్ట్‌కు ‘సారీ’ చెప్పాలన్న పరిణితి అప్పటికే ఆమెకు వచ్చేసింది. ‘సారీ సార్’ అని ఎన్.టి.ఆర్తో అంటే ‘ఇట్స్ ఆల్రైట్... యాక్టింగే కదా’ అని ఆయన ఈజీగా తీసుకున్నారు. తెలుగువారికి కృష్ణుడు ఎన్.టి.ఆర్. సత్యభామ జమునే. తెలుగువారి తొలి గ్లామర్ స్టార్ కాంచన మాల. తర్వాతి గ్లామర్ స్టార్ జమున. భానుమతి, సావిత్రి, అంజలి... వీరంతా పెర్ఫార్మర్లు. వీరి పక్కన అందరూ సరిపోరు. కాని ఎవరి పక్కనైనా అందంగా సరిపోయే స్టార్‌గా జమున తెలుగు సినిమా పరిశ్రమలో దాదాపు 25 ఏళ్లు ఏలింది. హరనాథ్‌తో ‘లేత మనసులు’ పెద్ద హిట్ సాధించింది. అందులోని ‘హలో మేడమ్ సత్యభామా’, ‘అందాల ఓ చిలుకా అందుకో నా లేఖ’ పాటల్లో జమున జాంపండులా ఉందని ప్రేక్షకులు మురిసిపోయారు. ఒక సీనియర్ హీరోయిన్ అయి ఉండి, పెద్ద స్టార్ అయి ఉండి చలంతో ‘మట్టిలో మాణిక్యాలు’ హిట్ కొట్టింది జమున. అందులో ‘నా మాటే నీ మాటై చదవాలి’ పాట అతి మధురం. ముచ్చటం. ఫీల్డ్‌కు వచ్చిన కొత్తల్లో జమునను ‘హంపీ సుందరి’ అని, ‘ఆంధ్రా నర్గిస్’ అని పిలిచేవారు. చిత్రంగా నర్గిస్‌కు చిరఖ్యాతి తెచ్చి పెట్టిన ‘మదర్ ఇండియా’ను జమునే తెలుగులో చేసింది. ఆ సినిమా పేరు ‘బంగారు తల్లి’. సినిమా వాళ్లు సినిమా వాళ్లనే చేసుకుంటున్న రోజుల్లో ఆ ఆనవాయితీని తప్పించి లెక్చరర్‌ను వివాహం చేసుకుంది జమున. కొడుకు పుడితే అక్కినేని భార్య అన్నపూర్ణ వచ్చి ‘సిజేరియన్ అటగదా. ఇన్నాళ్లూ నువ్వొక్కదానివే సన్నగా ఉన్నావనుకున్నాను. ఇకపై లావెక్కిపోతావు’ అని నిట్టూర్చి వెళ్లింది. కాని జమున మారలేదు. కొడుకు పుట్టిన తర్వాత కూడా పదేళ్ల పాటు హీరోయిన్గా కొనసాగింది. సగటు ప్రేక్షకుడి డ్రీమ్ గర్ల్గానే ఉంది. ఒక ఔత్సాహికుడికి జీవితంలో ఒకసారైనా జమున పక్కన నటించి ఆమెతో ఒక డ్యూయెట్ పాడాలని కోరిక. అందుకోసం ఆ ఔత్సాహికుడు భారీ డబ్బు ఖర్చు పెట్టి, పెద్ద తారాగణంతో సినిమా తీశాడు. జమునకు వారితో వీరితో రికమండేషన్ చేయించి తన పక్కన నటించేలా ఒప్పించాడు. ఆమె ఆకర్షణ అలా ఉండేది. అన్నట్టు ఆ సినిమా పేరు ‘బొబ్బిలి యుద్ధం’. ఆ ఔత్సాహికుడు సీతారామ్. మురిపించే అందాలే అవి నన్నే చెందాలే... ‘మిస్సమ్మ’, ‘చిరంజీవులు’, ‘సతీ అనసూయ’, ‘గులే బకావళి కథ’, ‘మంగమ్మ శపథం’, ‘రాముడు భీముడు’, ‘మూగనోము’.... జమున హిట్లు ఎన్నో ఉన్నాయి. ‘మూగ మనసులు’ స్క్రిప్ట్ మొత్తం తయారయ్యాక సావిత్రి విని ఇందులో గౌరి పాత్ర నేను వేస్తాను... రాధ పాత్రను జమునకు ఇవ్వండి. గౌరి పాత్ర చాలా బాగుంది’ అన్నదట. ‘గౌరిగా నువ్వు బాగోవు. అది జమునకే కరెక్ట్’ అని అక్కినేని సర్దిచెప్పారట. ‘మూగ మనసులు’ సినిమాలో జమున విశ్వరూపం చూపింది. గోదారి గట్టు మీద తన పాద ముద్రలను శాశ్వతంగా విడిచింది. రాయీ రప్పా కాని మామూలు మనుషులను కదిలించింది. కొత్త తరం వచ్చాక తన ప్రాభవాన్ని కాపాడుకుంటూ పక్కకు తప్పుకుంది జమున. చిల్లర మల్లర క్యారెక్టర్లు వేయలేదు. ఆమె వేసే క్యారెక్టర్ ‘పండంటి కాపురం’లో రాణి మాలినీ దేవిలా ఉండాలి. అంత పవర్‌ఫుల్‌గా ఉండాలి. ఉంది. పండంటి కాపురం సూపర్ హిట్ కావడంలో జమున పాత్ర ఒక ముఖ్య కారణం. జమున తాను రిటైరై పోయినా ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ ప్రేక్షకులకు దగ్గరగానే ఉంది. చివరి నిమిషం వరకూ గ్లామర్‌తోనే కనిపించింది. తెల్లజుట్టు జమునను ఎవరూ చూడలేదు. ఉత్సాహం లేని జమునను ఎవరూ చూడలేదు. స్వాతిశయం తప్పిన జమునను ఎవరూ చూడలేదు. సినిమా రంగంలో ఎన్నో ప్రతికూలతలు దాటి, ఎదురు నిలిచి, తన స్థానాన్ని పొందింది జమున. ఆమె రాకతో ఒక వెన్నెల వచ్చింది. ఆమె వీడ్కోలుతో ఆ వెన్నెల జ్ఞాపకాల్లోనే మిగిలింది. పగలే వెన్నెల... జగమే ఊయల కదలే ఊహలకే కన్నులుంటే... జమున హిట్ సాంగ్స్‌లో కొన్ని.. 1. గౌరమ్మా నీ మొగుడెవరమ్మా... (మూగ మనసులు) 2. నీ మది చల్లగా స్వామీ నిదురపో... (ధనమా దైవమా) 3. ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి... (దొరికితే దొంగలు) 4. అంతగా నను చూడకు.. ఇంతగా గురి చూడకు... (మంచి మనిషి) 5. ఈ వేళ నాలో ఎందుకో ఆశలు... (మూగనోము) 6. తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజ నీ గుట్టు తెలిసిందిలే... (రాముడు భీముడు) 7. మళ్లీ మళ్లీ పాడాలి ఈ పాట... (మట్టిలో మాణిక్యం) 8. వసంత గాలికి వలపులు రేగ... (శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు కథ) 9. నన్ను దోచుకొందువటే... (గులేబకావళి కథ) 10. బులి బులి ఎర్రని బుగ్గల దానా... (శ్రీమంతుడు) 11. మనసా కవ్వించకే నన్నిలా... (పండంటి కాపురం) 12. రివ్వున సాగే రెపరెపలాడే... (మంగమ్మ శపథం) 13. పచ్చని చెట్టు ఒకటి వెచ్చని చిలుకలు రెండు .. (రాము) 14. బృందావనమది అందరిదీ గోవిందుడు అందరివాడేలే... (మిస్సమ్మ) 15. ప్రేమ యాత్రలకు బృందావనమూ నందనవనమూ ఏలనో.. (గుండమ్మ కథ) 16. నువ్వూ నేనూ నడిచేది ఒకే బాట... ఒకే మాట (డబ్బుకు లోకం దాసోహం) ఖదీర్ -
చౌమహల్లా ప్యాలెస్‌లో సీఎం కేసీఆర్.. నిజాం రాజు ముకరం జాకు నివాళులు..
-
Mukarram Jha: నిజాం రాజు ముకరం జాకు సీఎం కేసీఆర్ నివాళులు..
శంషాబాద్/చార్మినార్: టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఈ నెల 14న తుదిశ్వాస విడిచిన ఎనిమిదో నిజాం ముకరంజా బహదూర్ పార్థివదేహం మంగళవారం సాయంత్రం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ఇస్తాంబుల్ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన పార్థివ దేహాన్ని హైదరాబాద్‌కు తెచ్చారు. భారీ బందోబస్తు నడుమ చౌమహల్లా ప్యాలెస్‌కు తీసుకెళ్లారు. రాత్రి 7 గంటలకు ముకరంజా భౌతికకాయాన్ని సందర్శించి సీఎం కేసీఆర్ నివాళులర్పించి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అలాగే మంత్రులు మహ్మద్ మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డితోపాటు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తదితరులు ముకరంజా భౌతికకాయానికి నివాళులర్పించారు. బుధవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్యాలెస్ లో ముకరంజా భౌతిక కాయాన్ని సందర్శించేందుకు ప్రజలను అనుమతించనున్నారు. మధ్యాహ్నం ప్యాలెస్ నుంచి మక్కా మసీదు వరకు నిజాం అంతిమ యాత్ర నిర్వహించనున్నారు. మక్కా మసీదులో తన పూర్వీకులైన నిజాం సమాధుల పక్కన ముకరంజా పార్థివదేహాన్ని ఖననం చేయనున్నారు. అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. 1967లో ఎనిమిదో నిజాంగా.. భారత యూనియన్‌లో హైదరాబాద్ చేరిన తర్వాత, ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ జనవరి 26, 1950 నుంచి అక్టోబర్ 31, 1956 వరకు రాష్ట్ర రాజ్ ప్రముఖ్‌గా పనిచేశారు. ఫిబ్రవరి 1967లో ఆయన మరణానంతరం ఏప్రిల్ 6, 1967లో ఎనిమిదవ అసఫ్ జాహీగా ముకరం జాకు పట్టాభిషేకం చేశారు. నిజాం చారిటబుల్ ట్రస్ట్, ముకరంజా ట్రస్ట్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్‌కు ముకరంజా చైర్మన్‌గా వ్యవహరించారు. ఏడో నిజాం వారసుడిగా 1967 భారీ సంపదను ముకరంజా వారసత్వంగా పొందారు. -
చివరి చూపు కోసం...
సావోపాలో: బ్రెజిల్ ఆరాధ్య ఫుట్‌బాలర్ పీలేను కడసారి చూసేందుకు అభిమానులు సోమవారం ఉదయం నుంచే ఆయన పార్థివదేహం ఉంచిన విలా బెల్మిరా స్టేడియం ముందు క్యూ కట్టారు. 82 ఏళ్ల సాకర్ సూపర్‌స్టార్ గురువారం క్యాన్సర్‌తో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే! సావోపాలో శివారులో ఉన్న స్టేడియం సామర్థ్యం 16000 మాత్రమే! కానీ పెద్ద సంఖ్యలో అభిమానులు, సాంటోస్ క్లబ్ ఆటగాళ్లు, బ్రెజిల్ జాతీయ ఆటగాళ్లు తమ దిగ్గజానికి తుది నివాళులు అర్పించారు. ‘ఫిఫా’ అధ్యక్షుడు ఇన్ఫాంటినో, అధికారులు శ్రద్ధాంజలి ఘటించారు. మంగళవారం సాంటోస్ వీధుల గుండా అంతిమయాత్ర ముగించాక మెమోరియల్ నెక్రొపొలె ఎక్యుమెనికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. దీనికి బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో హాజరవుతారు. -
సంకుచిత భావనలొదిలేస్తే సమున్నతంగా ఎదుగుతాం
న్యూఢిల్లీ: గత కాలపు సంకుచిత భావనలను చెరిపేస్తేనే చరిత్రను తిరగరాసే స్థాయికి భారత్ అద్భుత విజయాలను ఒడిసిపట్టుకోగలదని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. సోమవారం ఢిల్లీలో జరిగిన తొలి ‘వీర్ బాల్ దివస్’ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. గురు గోవింద్ సింగ్ తనయులు జోరావార్ సింగ్, ఫతే సింగ్‌లకు ఈ సందర్భంగా మోదీ ఘన నివాళులర్పించి ప్రసంగించారు. ‘ సంకుచిత భావన బంధనాలను తెంచుకుని భారత్ అద్భుత ప్రగతి పథంలో దూసుకుపోవాల్సిన తరుణం వచ్చేసింది. ‘గురు గోవింద్ సింగ్ చిన్నారులను మతం మార్చాలని లేదంటే ఖడ్గానికి పనిజెప్తానని ఆనాటి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు హూంకరించడంతో విధిలేక తన ఇద్దరు కుమారులను గురు గోవింద్ బలివ్వక తప్పలేదు. గురు గోవింద్ సింగ్ నమ్మిన సిద్ధాంతం కోసం మేరునగంలా నిలిచారు. ఆ చిన్నారుల సాహసం, త్యాగనిరతిని కీర్తించేటపుడు వయసును లెక్కలోకి తీసుకోవద్దు. భక్త ప్రహ్లాదుడు, ధ్రువుడు, బలరాముడు, లవకుశ, చిన్నికృష్ణుడు అందరూ చిన్నతనంలోనే తమ పరాక్రమాన్ని ప్రదర్శించినవారే’ అని అన్నారు. అభివృద్ధిలో అత్యున్నత శిఖరాలపై నిలపాలి ‘వీర్ బాల్ దివస్‌ను స్ఫురణకు తెచ్చుకుంటే గత భారతదేశ ఘన చరిత మనకు తెలుస్తుంది. ఇది యువతకు స్ఫూర్తిగా ఉంటూ భవిష్యత్‌కు దిశా నిర్దేశకంగా నిలుస్తోంది. ‘ ఘన చరిత గల దేశం ఎప్పుడూ ఆత్మస్థైర్యం, ఆత్మగౌరవంతో ముందడుగు వేయాలి. కానీ కొందరు మన పూర్వ చరిత్రలో పెద్దస్థాయిలోనే ఆత్మన్యూనత భావాలను నింపేశారు. అమృతకాలంలో ఈ బానిసత్వపు ఆలోచనలకు స్వస్తిపలికి దేశాన్ని అభివృద్ధిలో సమున్నత శిఖరాలపై నిలిపేందుకు కృషిచేయాలి’ అని ప్రజలకు మోదీ హితవు పలికారు. ‘ఒంటరిగా పోరాడారే తప్ప మొఘల్స్‌కు తలవంచలేదు. ఈ అసమాన ధీరత్వమే దేశానికి శతాబ్దాలుగా స్ఫూర్తిగా నిలుస్తోంది’ అని వ్యాఖ్యానించారు. -
విలువల రాజకీయానికి మారుపేరు వాజ్‌పేయి
సాక్షి, హైదరాబాద్: భారత రత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 98వ జయంతి సందర్భంగా బీజేపీ నేతలు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఆదివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగి న కార్యక్రమంలో వాజ్‌పేయి చిత్రపటానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ పార్లమెంట రీ బోర్డు సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్, జాతీయ కార్య వర్గ సభ్యులు నల్లు ఇంద్రసేనారెడ్డి, డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామి ఇతర నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కె.లక్ష్మణ్ మాట్లాడుతూ, తెలంగాణలో రాబోయేది బీజేపీ సర్కారేనని ధీమా వ్యక్తంచేశారు. దేశంలో రెండుసార్లు బీజేపీ అధికారంలోకి రావడానికి వాజపేయి సిద్ధాంతాలే కారణమన్నారు. ఒక్క ఓటుతో అధికారం కోల్పోతామని తెలిసి కూడా వాజపేయి వెనకడుగు వేయలేదని గుర్తుచేశారు. విలువలతో కూడిన రాజకీయాలకు వాజపేయి పెట్టింది పేరని పేర్కొన్నారు. ప్రధానిగా వాజ్‌పేయి ఎన్నో సాహాసోపేత నిర్ణయాలు తీసుకున్నారని, ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆయన స్ఫూర్తితోనే పనిచేస్తున్నారని బండి సంజయ్ కొనియాడారు. వాజపేయి జయంతి సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు చింతల రామచంద్రారెడ్డి, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, బంగారు శ్రుతి, కాసం వెంకటేశ్వర్లు, బండా కార్తీకరెడ్డి, కె.రాములు, భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం 2023 క్యాలెండర్‌ని బండి సంజయ్ విడుదల చేశారు. -
పార్లమెంట్ సమావేశాల్లోనే పీవీకి భారతరత్న ప్రకటించాలి
సనత్‌నగర్: ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే మాజీ ప్రధానమంత్రి దివంగత పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించాలని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ డిమాండ్ చేశారు. పీవీ నరసింహారావు 18వ వర్ధంతి సందర్భంగా పీవీ మార్గ్‌లోని పీవీ జ్ఞానభూమిలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ వాణీదేవి రచించిన ‘నిజాం రాష్ట్రంలో మహాత్ముని పర్యటనలు’, ‘హైదరాబాద్ నగరంలో రాజకీయ సభలు’, ‘భాగ్యనగర్ రేడియో’అనే పుస్తకాలను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం తలసాని మాట్లాడుతూ ప్రధానిగా పీవీ సంస్కరణలను తీసుకువచ్చి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారన్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా అంచెలంచెలుగా ఎదుగుతూ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసి సమర్ధవంతమైన పాలనను అందించారని గుర్తుచేసుకున్నారు. దేశానికి, రాష్ట్రానికి ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఏడాదిపాటు పీవీ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన విషయాన్ని గుర్తుచేశారు. 26 అడుగుల కాంస్య విగ్రహాన్ని హుస్సేన్‌సాగర్ తీరాన ఏర్పాటు చేయడంతోపాటు నెక్లెస్ రోడ్డుకు పీవీ మార్గ్‌గా నామకరణం చేసినట్లు చెప్పారు. నివాళులు అర్పించినవారిలో ఎమ్మెల్సీ వాణీదేవి, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, మాజీ కార్పొరేటర్లు అరుణగౌడ్, శేషుకుమారి తదితరులు ఉన్నారు. పీవీకి నివాళులు అర్పించిన గవర్నర్ పీవీ జ్ఞానభూమిలో జరిగిన వర్ధంతి కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై హాజరై నివాళులు అర్పించారు. కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ సీనియర్ నేతలు దిగ్విజయ్‌సింగ్, కేవీపీ, పొన్నం ప్రభాకర్, మల్లు రవి, శ్రీధర్‌బాబు, అంజన్‌కుమార్‌యాదవ్, బీజేపీ నుంచి మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ తదితర ప్రముఖులు పీవీకి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. -
వల్లభాయ్ పటేల్, పొట్టి శ్రీరాములుకు సీఎం జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: భారతరత్న సర్ధార్ వల్లభాయ్ పటేల్, అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం ఇరువురి చిత్రపటాలకు పూలు సమర్పించి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఐ కమిషనర్ రేపాల శ్రీనివాసరావు, ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ పాల్గొన్నారు. చదవండి: (రాష్ట్రానికి విశాఖే భవిష్యత్.. త్వరలోనే వైజాగ్ నుంచి పరిపాలన) -
మీ త్యాగాన్ని జాతి మరువదు
న్యూఢిల్లీ: 2001లో పార్లమెంట్‌పై ఉగ్ర దాడి ఘటనలో నేలకొరిగిన వారికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా జాతి యావత్తూ మంగళవారం నివాళులర్పించింది. పార్లమెంట్ భవనం వెలుపల జరిగిన కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, అన్ని పార్టీల ఎంపీలు ఘనంగా నివాళులర్పించారు. 2001 పార్లమెంట్ దాడి ఘటనలో వీరమరణం పొందిన వారికి జాతి ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని రాష్ట్రపతి ముర్ము అనంతరం ట్వీట్ చేశారు. దేశం కోసం ప్రాణాలను ఫణంగా పెట్టిన వారి త్యాగాన్ని, ధైర్యసాహసాలను ఎన్నడూ మరువబోమని ప్రధాని మోదీ ట్విట్టర్లో తెలిపారు. ఘనంగా నివాళులర్పించిన రాజ్యసభ అంతకుముందు, పార్లమెంట్‌పై దాడి ఘటనలో ప్రాణాలర్పించిన వారికి రాజ్యసభ నివాళులర్పించింది. సభ్యులు తమ స్థానాల నుంచి లేచి నిలబడి మౌనం పాటించారు. సభా కార్యకలాపాలు ప్రారంభం కాగానే డిప్యూటీ చైర్మన్ హరివంశ్ రాయ్ మాట్లాడారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో డిసెంబర్ 13వ తేదీ ఎప్పటికీ విషాదకరమైన రోజుగానే గుర్తుండిపోతుందన్నారు. 2001 డిసెంబర్ 13వ తేదీన లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ ఉగ్ర సంస్థలకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులు పార్లమెంట్ వద్ద కాల్పులకు తెగబడ్డారు. పార్లమెంట్ భవనంలోకి చొచ్చుకుపోయేందుకు వారు చేసిన యత్నాన్ని బలగాలు తిప్పికొట్టాయి. ఈ ఘటనలో ఐదుగురు ఢిల్లీ పోలీసులు, సీఆర్పీఎఫ్ మహిళా జవాను ఒకరు, పార్లమెంట్ సిబ్బంది ఇద్దరు, జర్నలిస్ట్ ఒకరు ప్రాణాలు కోల్పోగా భద్రతా బలగాల కాల్పుల్లో ఉగ్రవాదులందరూ హతమయ్యారు. -
మళ్లీ వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమే
నాగోలు (హైదరాబాద్): అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై ప్రత్యేకంగా దృష్టి సారించి వివిధ కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తున్నందున వచ్చే ఎన్నికల్లోనూ ప్రజలు టీఆర్ఎస్నే గెలిపిస్తారని రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. రాష్ట్రంలో గత ఎనిమిదేళ్లుగా అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల మాదిరిగా సాగుతున్నాయన్నాయని తెలిపారు. మంగళవారం ఎల్బీనగర్ నియోజకవర్గంలో సుమారు రూ.55 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఫతుల్లగూడలో జరిగిన సభలో మాట్లాడారు. పేదల్ని ఆదుకుంటున్న పథకాలు పేదల ముఖాల్లో చిరునవ్వు చూడాలని, సంతోషంగా ఉండాలనే లక్ష్యంతో సంతృప్తికర స్థాయిలో ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలకు రూపకల్పన చేశామని కేటీఆర్ చెప్పారు. కల్యాణలక్ష్మి, ఆసరా పథకం, కేసీఆర్ కిట్ వంటి వంద రకాల సంక్షేమ పథకాలు రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది పేదలను ఆదుకుంటున్నాయని తెలిపారు. మెట్రో రైలు మొదటి దశలో నాగోలు వరకు నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగిందని, నాగోలు నుంచి ఎల్బీ నగర్ వరకు మిగిలిపోయిన 5 కిలోమీటర్ల మెట్రోను రెండో దశలో చేపడతామని తెలిపారు. వచ్చే ఎన్నికల తర్వాత ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు మెట్రోను విస్తరిస్తామన్నారు. పెరిగిన తలసరి ఆదాయం.. తెలంగాణ వచ్చిన సమయంలో రాష్ట్ర తలసరి ఆదాయం 1.24 లక్షలని, తెలంగాణ వచ్చిన ఏడేళ్లలో 2.78 లక్షల తలసరి ఆదాయంతో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచిందని కేటీఆర్ తెలిపారు. జీఎస్డీపీ తెలంగాణ వచ్చిన సమయంలో 5.6 లక్షల కోట్లని, అదే ఈ రోజు 11.55 లక్షల కోట్లుగా ఉందన్నారు. దేశంలో అత్యుత్తమ 20 గ్రామ పంచాయతీలు ఎక్కడ ఉన్నాయని సర్వే చేస్తే..19 గ్రామాలు తెలంగాణలో ఉన్నాయని స్వయంగా కేంద్రమే చెబుతోందని అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2022లో రాష్ట్రానికి అత్యధికంగా 26 అవార్డులు కేంద్రం ప్రభుత్వం ఇచ్చిందని గుర్తు చేశారు. 31.7 శాతానికి పెరిగిన గ్రీన్ కవర్.. రాజకీయ నాయకులు ఎన్నడూ చెట్లు, మొక్కలు, పర్యావరణం గురించి మాట్లాడరని కేటీఆర్ అన్నారు. చెట్లకు ఓట్లు ఉండవని, వాటితో ఎక్కువ లాభం ఉండదు కాబట్టే మాట్లాడరన్నారు. కానీ కేసీఆర్ నాయకత్వంలో 240 కోట్ల మొక్కలు నాటి సంరక్షిస్తుండడంతో గతంలో 24 శాతం ఉన్న గ్రీన్ కవర్ ఇవాళ 31.7 శాతానికి చేరిందని, ఇది రాష్ట్రానికే గర్వకారణమని పేర్కొన్నారు. గతంలో ఫతుల్లగూడ ఏరియా అడుగుపెట్ట వీల్లేకుండా దుర్వాసనతో అటవీ ప్రాంతంలా ఉండేదని, ప్రస్తుతం డంప్‌యార్డ్‌ను అపురూపమైన పార్క్‌గా తీర్చిదిద్దామని, దేశంలోని ఎక్కడా లేని విధంగా ముక్తిఘాట్‌ను ఏర్పాటు చేసి రూ.16 కోట్లతో అన్ని కులాలకు, మతాలకు చెందిన వారు ఒకే చోట దహన సంస్కారాలను చేసుకునేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. మంత్రి మల్లారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
చావనైనా చస్తాం... కేసీఆర్‌ను వదిలివెళ్లం...
సాక్షి, హైదరాబాద్: చావనైనా చస్తాం, కానీ సీఎం కేసీఆర్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలి వెళ్లబోమని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పార్టీ మారే శాసనసభ్యుల నియోజకవర్గాలు అంటూ బాన్సువాడ పేరు మీడియాలో వచ్చిందని, కానీ బాన్సువాడ శాసనసభ్యుడిగానే తన వైఖరిని స్పష్టం చేస్తున్నానని అన్నారు. మంగళవారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 66వ వర్థంతి సందర్భంగా అసెంబ్లీ ఆవరణలోని అంబేడ్కర్ విగ్రహానికి స్పీకర్ పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ‘తెలంగాణ శాసనసభ్యులు ఎవరు కూడా డబ్బులకు అమ్మడుపోయేవారు కాదు. అది ఊహాజనితం మాత్రమే, ఎవరైనా ఆశపడితే చేతులు కాల్చుకుని భంగపడతారు’ అని వ్యాఖ్యానించారు. ‘ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బలపరచడంతోపాటు సీఎంగా ఆయన తీసుకునే నిర్ణయాలను అమలు చేస్తాం. ప్రభుత్వాలను కూల్చడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు చేయాలి’అని అన్నారు. అంబేడ్కర్ ఆశయాలను నూరు శాతం అమలు చేయడంలో కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ముందున్నదని స్పీకర్ పేర్కొన్నారు. ఆరోపణలు చేసేవారు కాకుండా ఆలోచించేవారే పారిపాలన చేయగలరని పేర్కొన్నారు. పాదయాత్రల పేరిట విమర్శలు, అసత్యాలు ప్రచారం చేయకుండా ప్రజలకు ఏం చేస్తారో నాయకులు చెప్పాలన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమల్లో దేశానికే తెలంగాణ ఆదర్శంగా ఉందన్నారు. కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు ఎంఎస్ ప్రభాకర్‌రావు, దండె విఠల్, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి.నరసింహాచార్యులు పాల్గొన్నారు. -
ఘంటసాల శతజయంతి ఉత్సవాలు: సింగపూర్‌లో ఘన నివాళి
శ్రీ సాంస్కృతిక కళాసారథి - సింగపూర్, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, వంశీ ఇంటర్నేషనల్- ఇండియా, ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్, శుభోదయం గ్రూప్ సంయుక్త ఆధ్వర్యంలో, అమర గాయకులు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు శతజయంతి ఉత్సవాలు సింగపూర్‌లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. వంశీ అధ్యక్షులు డాక్టర్ వంశీ రామరాజు, శుభోదయం గ్రూప్ చైర్మన్ డాక్టర్ శ్రీలక్ష్మీ ప్రసాద్ కలపటపు, ప్రముఖ సంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్, హాంకాంగ్ తెలుగు సమాఖ్య వ్యవస్థాపకురాలు జయ పీసపాటి, "శ్రీ సాంస్కృతిక కళాసారథి" వ్యవస్థాపకులు కవుటూరు రత్నకుమార్, కార్యక్రమం ప్రధాన సమన్వయకర్త రాధిక మంగిపూడి, నిర్వాహకబృంద సభ్యులు శ్రీధర్ భరద్వాజ్, చామిరాజు రామాంజనేయులు పాతూరు రాంబాబు జ్యోతి ప్రకాశనం గావించి ఘంటసాల మాస్టారు చిత్రపటానికి పూవులతో నివాళులు అర్పించారు. "గత సంవత్సరం డిసెంబర్ 4వ తేదీన ప్రారంభించి, 366 రోజుల పాటు నిర్విరామంగా అంతర్జాల మాధ్యమంలో నిర్వహిస్తూవస్తున్న 'ఘంటసాల స్వరరాగ మహాయాగం' కార్యక్రమం సమాపనోత్సవంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. భారతదేశం నుండి అతిథులు గాయనీగాయకులు, వాద్య బృందం సింగపూర్‌కు విచ్చేయడం చాలా ఆనందంగా ఉందని, ఈ కార్యక్రమం తమ సంస్థ ద్వారా జరగడం అదృష్టంగా భావిస్తున్నామని" రత్నకుమార్ కవుటూరు తెలియజేశారు. కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి సందేశాన్ని పంపిన వామరాజు సత్యమూర్తికి కృతజ్ఞతలు తెలిపారు. కిషన్ రెడ్డి తమ అభినందన వీడియో సందేశంలో "ఈ కార్యక్రమం సింగపూర్ లో నిర్వహించడం అభినందనీయమని తమ హర్షాన్ని వ్యక్తం చేస్తూ, సింగపూర్ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. భారత కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రధాని నరేంద్ర మోడీ గారి తరఫున, కార్యక్రమానికి ప్రత్యేక అభినందనలు కూడా అందించారు." ఘంటసాల సతీమణి సావిత్రమ్మ, కుమార్తె సుగుణ ఈ కార్యక్రమానికి అభినందన సందేశాలు పంపుతూ "పైనుండి ఘంటసాల వారు ఈ కార్యక్రమాన్ని చూసి సంతోషిస్తారన్నారు." శుభోదయం సమర్పణలో, మాధవపెద్ది సురేష్ సారధ్యంలో జరిగిన ప్రత్యేక సంగీత విభావరిలో, ప్రముఖ నేపథ్య గాయనీగాయకులు చంద్రతేజ, సురేఖ మూర్తి, చింతలపాటి సురేష్ అద్భుతమైన పాటలను ఆలపించగా, ప్రముఖ వాద్య కళాకారులు సాయి కుమార్ పవన్ కుమార్ సోదరులు, యుగంధర్, చక్రపాణి సోమేశ్వరరావు చక్కటి వాద్య సహకారాన్ని అందించారు.దుబాయ్ నుండి విచ్చేసిన నాట్య కళాకారిణి కుమారి తెన్నేటి శ్రావణి శాస్త్రీయ నృత్య ప్రదర్శన అందరిని ఆకర్షించింది. ఈ వేదికపై శుభోదయం వారి "షడ్రుచి" శాఖ ప్రకటనను సింగపూర్ లో విడుదల చేశారు. వారు నిర్మించిన 'ఘంటసాల ది గ్రేట్' బయోపిక్ దర్శకులు రామారావు నిర్మాత జి వి భాస్కర్ లను శ్రీ సాంస్కృతిక కళాసారథి వారు ప్రత్యేకంగా సత్కరించారు. వంగూరి ఫౌండేషన్ వారి ప్రచురణగా పీఎస్ గోపాలకృష్ణ రచించిన 'మన ఘంటసాల' అనే పుస్తకాన్ని ఈ వేదికపై అతిధులు అందరూ కలిసి ఆవిష్కరించారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వ్యవస్థాపకులు వంగూరి చిట్టెన్ రాజు ఈ సందర్భంగా కార్యక్రమానికి అభినందనలు తెలియజేస్తూ సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సింగపూర్ పర్యటనకు ఏర్పాట్లన్నీ గావించిన శుభోదయం బాలసుబ్రమణ్యానికి నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సింగపూర్ గాయనీ గాయకులు అలనాటి అందమైన పాటలను పాడి ఘంటసాలవారికి జోహార్లు అర్పించగా, ఈ కార్యక్రమానికి ప్రధాన సమన్వయకర్త అయిన రాధిక మంగిపూడి సభా నిర్వహణ గావించారు. సింగపూర్‌లో పంగోల్ లోని జిఐఐయస్ ప్రాంగణంలో సుమారు 5 గంటలపాటు జరిగిన ఈ కార్యక్రమానికి సింగపూర్ లో వివిధ తెలుగు సంస్థల ప్రతినిధులు హాజరవగా, గణేశ్న రాధాకృష్ణ, కాత్యాయని, శిష్ట్లా వంశీ సాంకేతిక నిర్వహణా బాధ్యతలు వహించి ప్రత్యక్ష ప్రసారాన్ని అందించారు. -
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన మర్రి చెన్నారెడ్డి
కవాడిగూడ: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన వ్యక్తి మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి అని పలువురు వక్తలు కొనియాడారు. ప్రస్తుతం కొంతమంది తామే ఉద్యమాలు చేశామని గొప్పలు చెప్పుకుంటూ వారికి వారే తెలంగాణ జాతిపితగా చెలామణి అవుతున్నారని అన్నారు. కానీ తెలంగాణ సమాజానికి మర్రి చెన్నారెడ్డి చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి 26వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం ఇందిరాపార్కులోని రాక్‌గార్డెన్‌లో ఆయన సమాధికి విగ్రహానికి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్‌రావు, మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె అరుణ, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్, మాజీ మంత్రి కృష్ణయాదవ్, మాజీ ఎమ్మెల్యే చెన్నారెడ్డి తనయుడు మర్రి శశిధర్‌రెడ్డి, మర్రిచెన్నారెడ్డి మనుమలు ఆదిత్యరెడ్డి, పురూరవరెడ్డి, కృష్ణారెడ్డితో పాటు ఆయన కుటుంబసభ్యులు, అభిమానులు పెద్దఎత్తున హాజరై నివాళులర్పించారు. -
Constitution Day: ప్రాథమిక విధులే ప్రాథమ్యం
న్యూఢిల్లీ: ప్రాథమిక విధుల నిర్వహణే పౌరుల ప్రథమ ప్రాథమ్యంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. అప్పుడే దేశం ఉన్నత శిఖరాలకు చేరుతుందన్నారు. వాటిని పూర్తి అంకితభావంతో, చిత్తశుద్ధితో పాటించాలని పిలుపునిచ్చారు. నాడు గాంధీ మహాత్ముడు కూడా ఈ మేరకు పిలుపునిచ్చారని గుర్తు చేశారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా శనివారం సుప్రీంకోర్టులో జరిగిన వేడుకల్లో ఆయన మాట్లాడారు. అన్ని రంగాల్లోనూ వృద్ధి పథంలో శరవేగంగా దూసుకుపోతున్న భారత్‌వైపే ప్రపంచమంతా చూస్తోందన్నారు. వచ్చే ఏడాది జీ 20 శిఖరాగ్ర సదస్సుకు భారత్ అధ్యక్షత వహించనుండటాన్ని ప్రపంచ శ్రేయస్సులో మన పాత్రను అందరి ముందుంచేందుకు అతి గొప్ప అవకాశంగా అభివర్ణించారు. ‘‘ప్రపంచం దృష్టిలో దేశ ప్రతిష్టను మరింత ఇనుమడింపజేసేందుకు మనమంతా కలసికట్టుగా కృషి చేయాలి. ఇది మనందరి బాధ్యత. కేంద్రం అనుసరిస్తున్న ప్రజానుకూల విధానాలు పేదలను, మహిళలను సాధికారత దిశగా నడుపుతున్నాయి. రాజ్యాంగ స్ఫూర్తిని, ప్రాచీనకాలం నుంచి వస్తున్న విలువలను కొనసాగిస్తూ ప్రజాస్వామ్యానికి మాతృకగా భారత్ అలరారుతోంది. ఈ గుర్తింపును మరింత బలోపేతం చేయాలి’’ అని పిలుపునిచ్చారు. స్వాతంత్య్రానంతరపు కాలంలో జాతి సాంస్కృతిక, నైతిక భావోద్వేగాలన్నింటినీ మన రాజ్యాంగం అద్భుతంగా అందిపుచ్చుకుందని కొనియాడారు. స్వతంత్ర దేశంగా భారత్ ఎలా మనుగడ సాగిస్తుందోనన్న తొలినాటి అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ భిన్నత్వమే అతి గొప్ప సంపదగా అద్భుత ప్రగతి సాధిస్తూ సాగుతోందన్నారు. ‘‘వందేళ్ల స్వతంత్ర ప్రస్థానం దిశగా భారత్ వడివడిగా సాగుతోంది. ఇప్పటిదాకా నడిచింది అమృత కాలమైతే రాబోయే పాతికేళ్లను కర్తవ్య కాలంగా నిర్దేశించుకుందాం. ప్రాథమిక విధులను పరిపూర్ణంగా పాటిద్దాం. రాజ్యాంగంతో పాటు అన్ని వ్యవస్థల భవిష్యత్తూ దేశ యువతపైనే ఆధారపడి ఉంది. రాజ్యాంగంపై వారిలో మరింత అవగాహన పెంచాల్సిన అవసరముంది. అప్పుడే సమానత్వం, సాధికారత వంటి ఉన్నత లక్ష్యాలను వారు మరింతగా అర్థం చేసుకుని ఆచరిస్తారు’’ అని చెప్పారు. రాజ్యాంగ పరిషత్తులో మహిళా సభ్యుల పాత్రకు తగిన గుర్తింపు దక్కలేదని ఆవేదన వెలిబుచ్చారు. ‘‘అందులో 15 మంది మహిళలుండేవారు. వారిలో ఒకరైన దాక్షాయణీ వేలాయుధన్ అణగారిన వర్గాల నుంచి వచ్చిన మహిళామణి’’ అని గుర్తు చేశారు. దళితులు, కార్మికులకు సంబంధించి పలు ముఖ్యమైన అంశాలు రాజ్యాంగంలో చోటుచేసుకునేలా ఆమె కృషి చేశారన్నారు. 26/11 మృతులకు నివాళి 2008 నవంబర్ 26న ముంబైపై ఉగ్ర దాడికి 14 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వాటిలో అసువులు బాసిన వారిని మోదీ గుర్తు చేసుకున్నారు. వారికి ఘనంగా నివాళులర్పించారు. ఇ–కోర్టు ప్రాజెక్టులో భాగంగా తీసుకొచ్చిన వర్చువల్ జస్టిస్ క్లాక్, జస్ట్‌ఈజ్ మొబైల్ యాప్ 2.0, డిజిటల్ కోర్ట్, ఎస్3వాస్ వంటి సైట్లు తదితరాలను ప్రారంభించారు. వీటిద్వారా కక్షిదారులు, లాయర్లు, న్యాయవ్యవస్థతో సంబంధమున్న వారికి టెక్నాలజీ ఆధారిత సేవలందించేందుకు వీలు కలగనుంది. వేడుకల్లో కేంద్ర న్యాయ మంత్రి కిరణ్ రిజిజు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
Suzlon Energy: ‘సుజ్లాన్’ తులసి తంతి తుది శ్వాస
న్యూఢిల్లీ: పవన విద్యుత్ రంగ దిగ్గజం సుజ్లాన్ ఎనర్జీ వ్యవస్థాపకుడు, విండ్ మ్యాన్‌గా పేరొందిన తులసి తంతి (64) కన్నుమూశారు. ఆయన శనివారం గుండెపోటుతో మరణించినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు కంపెనీ తెలిపింది. తులసి తంతికి భార్య (గీత), ఇద్దరు సంతానం (కుమారుడు ప్రణవ్, కుమార్తె నిధి) ఉన్నారు. ఆయన మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ సంతాపం వ్యక్తం చేశారు. ‘దేశ ఆర్థిక పురోగతికి తోడ్పడిన దిగ్గజాల్లో తులసి తంతి ఒకరు. ఆయన అకాల మరణంపై కుటుంబసభ్యులకు నా సంతాపం తెలియజేస్తున్నాను’ అని మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో ప్రధాని ట్వీట్ చేశారు. విలేకరుల సమావేశంలో పాల్గొని అహ్మదాబాద్ నుంచి పుణెకు వస్తుండగా ఛాతీలో నొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లాలంటూ కారు డ్రైవరుకు తులసి తంతి సూచించారు. అయితే, ఆస్పత్రిలో చికిత్స పొందేలోగానే ఆయన కన్నుమూశారు. పవన విద్యుత్‌లో దిగ్గజం.. తులసి తంతి 1958లో రాజ్‌కోట్‌లో జన్మించారు. గుజరాత్ యూనివర్సిటీలో బీకామ్ చదివారు. 1995లో సుజ్లాన్ ఎనర్జీ ఏర్పాటుతో పవన విద్యుత్ రంగంలోకి ప్రవేశించారు. ఈ రంగంలో ప్రవేశించడానికి ముందు ఆయనకు టెక్స్టైల్ వ్యాపారం ఉండేది. దాన్ని 2001లో విక్రయించారు. అటు పైన 2003లో అమెరికన్ సంస్థ డాన్మర్ అండ్ అసోసియేట్స్ నుంచి 24 టర్బైన్లకు సుజ్లాన్‌కు భారీ ఆర్డరు దక్కింది. ఆ తర్వాత కంపెనీ వేగంగా విస్తరించడంలో తులసి తంతి కీలక పాత్ర పోషించారు. 2006 నుంచి బెల్జియంకు చెందిన టర్బైన్ విడిభాగాల తయారీ సంస్థ జెడ్ఎఫ్ విండ్ పవర్ యాంట్‌వెర్పెన్‌కు చైర్మన్‌గా వ్యవహరించారు. అలాగే ఇండియన్ విండ్ టర్బైన్ తయారీదారుల సమాఖ్యకు ప్రెసిడెంట్‌గా కూడా ఉన్నారు. కష్టకాలంలో కంపెనీ.. సుజ్లాన్ ఎనర్జీ ఆర్థిక సమస్యల్లో ఉన్న తరుణంలో తంతి అకాల మరణం ప్రాధాన్యం సంతరించుకుంది. 2005లో స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్ట్ అయిన తర్వాత శరవేగంగా కార్యకలాపాలు విస్తరించిన సుజ్లాన్ ఎనర్జీ ఒక దశలో రూ. 65,474 కోట్ల మార్కెట్ వేల్యుయేషన్ దక్కించుకుంది. కంపెనీలో మెజారిటీ వాటాలున్న తంతి సంపద విలువ దాదాపు రూ. 43,537 కోట్లకు పెరిగింది. అయితే, ఆ తర్వాత అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం తలెత్తడం, ఆ తర్వాత పరిణామాలతో పవన విద్యుత్ రంగం కుదేలైంది. దీనికి టర్బైన్లలో లోపాల ఫిర్యాదులు మొదలైనవి కూడా తోడు కావడంతో సుజ్లాన్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. కంపెనీ విలువ రూ. 8,536 కోట్లకు పడిపోయింది. భారీగా రుణాలు పేరుకుపోయాయి. వాటిని తీర్చేందుకు వర్కింగ్ క్యాపిటల్, ఇతరత్రా అవసరాల కోసం నిధులను సమకూర్చుకునేందుకు సుజ్లాన్ అక్టోబర్ 11న రూ. 1,200 కోట్ల రైట్స్ ఇష్యూకు రానుంది. ఈ తరుణంలో తంతి హఠాన్మరణంతో తలెత్తబోయే పరిణామాలపై ఆసక్తి నెలకొంది. అయితే, అనుభవజ్ఞులైన బోర్డు డైరెక్టర్లు, సీనియర్ మేనేజ్మెంట్ సారథ్యంలో తంతి ఆకాంక్షలను నెరవేరుస్తామని సుజ్లాన్ ఎనర్జీ పేర్కొంది. -
గాంధీజీ, శాస్త్రిలకు ప్రముఖుల నివాళి
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిలకు ప్రధాని మోదీ నివాళులర్పించారు. ఇద్దరు నేతల జయంతిని పురస్కరించుకుని ప్రధాని ఆదివారం వారి సమాధులున్న రాజ్‌ఘాట్, విజయ్‌ఘాట్‌లను సందర్శించి పుష్పాంజలి ఘటించారు. ప్రతి ఒక్కరూ ఖాదీ, హస్తకళల ఉత్పత్తులను కొనుగోలు చేసి గాంధీజీకి నివాళులర్పించాలని ప్రధాని ప్రజలను కోరారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేళ గాంధీ జయంతి మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. బాపు సిద్ధాంతాలను అన్ని వేళలా ఆచరించాలి’అని ట్వీట్ చేశారు. లాల్ బహదూర్ శాస్త్రి నిరాడంబరత, స్థిరమైన నిర్ణయాలు తీసుకోగల శక్తి దేశ ప్రజలకు ప్రేరణగా నిలుస్తాయన్నారు. ‘కీలకమైన సమయంలో శాస్త్రి నాయకత్వ పటిమ దేశ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తున్నాను’ అని మరో ట్వీట్లో పేర్కొన్నారు. శాస్త్రి జీవన ప్రయాణం, సాధించిన విజయాలపై ‘ప్రధానమంత్రి సంగ్రహాలయ’లో ఉంచిన కొన్ని చిత్రాలను ప్రధాని షేర్ చేశారు. గాంధీజీకి కాంగ్రెస్ నేత రాహుల్ ట్విట్టర్ ద్వారా నివాళులర్పించారు. ‘అన్యాయానికి వ్యతిరేకంగా దేశాన్ని ఏకం చేసిన గాంధీజీ మాదిరిగా దేశాన్ని ఐక్యంగా ఉంచుతామంటూ ప్రతిన బూనుదాం. సత్యం, అహింసా మార్గంలో నడవాలని ఆయన మనకు నేర్పించారు. ప్రేమ, కరుణ, సామరస్యం, మానవత్వం అర్థాన్ని బాపు వివరించారు’ అని ట్వీట్ చేశారు. -
గాంధీ చిత్రపటానికి నివాళులు అర్పించిన సీఎం వైఎస్ జగన్
-
Gandhi Jayanti 2022: మహాత్ముడికి సీఎం కేసీఆర్ నివాళి
సాక్షి, హైదరాబాద్: మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. స్వాతంత్య్ర సంగ్రామంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అహింస, సత్యాగ్రహమనే సిద్ధాంతాలను ఆచరించి విజయం సాధించి చూపటం ద్వారా ప్రపంచానికి సరికొత్త పోరుబాటను మహాత్మా గాంధీ పరిచయం చేశారని సీఎం పేర్కొన్నారు. గాంధీ ఆచరించిన బాటలో పయనించిన ఎన్నో దేశాలు బానిసత్వం నుంచి విముక్తి పొందాయని తెలిపారు. భారతదేశాన్ని గాంధీ పుట్టిన దేశంగా చెప్పుకునే స్థాయి కలిగిన మహా పురుషుడు అని కీర్తించారు. గాంధీజీ స్ఫూర్తితో శాంతియుత మార్గంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న విషయాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. -
‘హుందాతనంతో కృష్ణంరాజు ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు’
సాక్షి, హైదరాబాద్: రెబల్ స్టార్ కృష్ణం రాజు అకాల మరణం అందరనీ దిగ్భ్రాంతికి గురిచేసింది. అనారోగ్యం కారణంగా తుదిశ్వాస విడిచిన కృష్ణం రాజుకు ప్రమువురు ప్రముఖులు నివాళులు అర్పించి.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. కాగా, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. సోమవారం ఉదయం కృష్ణం రాజు భౌతికకాయానికి నివాళులు అర్పించారు. రెబల్ స్టార్ కుటుంబ సభ్యులకు వెంకయ్య నాయుడు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. కృష్ణం రాజు మరణవార్త విని చాలా బాధపడ్డాను. చలన చిత్ర పరిశ్రమలోనే కాదు పాలిటిక్స్‌లో కూడా కృష్ణంరాజు తనదైన ముద్ర వేశారు. హుందాతనం కూడిన నటనతో ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. విలక్షణ నటుడుగా మన్ననలను పొందారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు వెల్లడించారు. మరోవైపు, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. కృష్ణం రాజు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం, సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణం రాజు మరణం బీజేపీకి, సినీ రంగానికి, రాజకీయ రంగానికి తీరని లోటు. రెబల్ స్టార్ రాజకీయాల్లో చురకుగా పాల్గొన్నారు. దివంగత ప్రధాన మంత్రి వాజ్‌పేయి ప్రభుత్వంలో మంత్రిగా సేవలందించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. -
కృష్ణం రాజు పార్థివ దేహనికి అల్లు అర్జున్ నివాళులు
సీనియర్ నటుడు కృష్ణంరాజు(83) పార్ధివ దేహనికి అల్లు అర్జున్ నివాళులర్పించారు. ఆయన మరణ వార్త తెలియగానే బెంగళూరి నుంచి హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్న బన్ని.. నేరుగా కృష్ణంరాజు నివాసానికి వెళ్లి ఆయన పార్థివ దేహనికి నివాళులర్పించారు. అనంతరం ప్రభాస్ దగ్గరకెళ్లి ఓదార్చాడు. తదనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణంరాజు గారి మరణ వార్త తెలియగానే ఎంతో డిస్టర్బ్ అయ్యాను, ఆయన మరణం తెలుగు ఇండస్ట్రీకి తీరని లోటు. 50 సంవత్సరాలకు పైగా ఆయన ఇండస్ట్రీకి ఎన్నో సేవలు అందించారు. సినీ రంగం పై ఆయన తనదైన ముద్ర వేశారు. అలాంటి అద్భుతమైన ఒక లెజెండ్ ను కోల్పోవడం టాలీవుడ్ కు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను ’ అన్నారు -
కృష్ణంరాజు వివాద రహిత వ్యక్తి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: అనారోగ్యం కారణంగా రెబల్‌స్టార్ కృష్ణంరాజు(83) ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కాగా, ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు కృష్టంరాజు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా కృష్ణంరాజు భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కృష్టంరాజు గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. తన విలక్షణ నటనతో ప్రజల గుండెల్లో నిలిచారు. కృష్ణంరాజు వివాద రహిత వ్యక్తి. ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో జరిపిస్తాము అని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే కృష్టంరాజు కుటుంబ సభ్యులకు కేటీఆర్.. ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం
కవాడిగూడ: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏడాది పాటు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో అధికారికంగా నిర్వహించనున్నామని కేంద్ర పర్యాటక సాంస్కృతిక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖమంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 17న పరేడ్ గ్రౌండ్లో త్రివిధ దళాల పరేడ్ ఉంటుందని ఆయన వెల్లడించారు. నిజాం రజాకర్ల దమన కాండకు వ్యతిరేకంగా పోరాటం చేసిన చాకలి ఐలమ్మతో పాటు ఎంతో మంది వీరులు ప్రాణ త్యాగం చేశారని వారందరినీ ఏడాది పాటు స్మరించుకుంటూ వారి ఆశయాల స్ఫూర్తితో నేటి సమాజం ముందుకు సాగాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. చాకలి ఐలమ్మ వర్ధంతిని తెలంగాణ రజకాభివృద్ధి (ధోబీ) సంస్థ ఆధ్వర్యంలో శనివారం లోయర్ ట్యాంక్‌బండ్‌లోని ఆమె విగ్రహం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ విగ్రహానికి కిషన్‌రెడ్డి, కవాడిగూడ కార్పొరేటర్ జి.రచనశ్రీ, రాంనగర్ కార్పొరేటర్ రవిచారి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ రజక అభివృద్ధి సంస్థ అధ్యక్షుడు బొమ్మరాజు కృష్ణమూర్తి, రాష్ట్ర వర్కింగ్ కమిటీ చైర్మన్ మందలపు గాంధీ, గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ ఎం.నర్సింహ్మ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపల్లి రాజశేఖర్, వైస్ చైర్మన్ నర్సింహ్మ, బీజేపీ రాష్ట్ర నాయకులు పరిమళ్‌కుమార్, రంగరాజ్‌గౌడ్, శ్యాంసుందర్‌గౌడ్, రమేష్‌రాం తదితరులు పాల్గొన్నారు. ఐలమ్మ ఆశయ సాధనకు ప్రభుత్వం కృషి తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. లోయర్ ట్యాంక్‌బండ్‌లోని ఆమె విగ్రహానికి ఎమ్మెల్యే ముఠా గోపాల్, రాంనగర్ మాజీ కార్పొరేటర్ వి.శ్రీనివాస్‌రెడ్డిలు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ముఠా గోపాల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విలీనం వేడుకలను ఏడాది పాటు నిర్వహిస్తుందన్నారు. టీఆర్ఎస్ నాయకులు ముఠా జైసింహ, డివిజన్ అధ్యక్షుడు శ్యామ్యాదవ్, నాయకులు ఆర్.రాంచందర్, రాజేష్, హరి తదితరులు పాల్గొన్నారు. – ఎమ్మెల్యే ముఠా గోపాల్ -
ఆదర్శపాలన అందించిన మహనీయుడు వైఎస్సార్
సాక్షి, హైదరాబాద్/పంజ గుట్ట: దేశానికి ఆదర్శవంత మైన పాలన అందించిన మహనీయుడు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి (వైఎస్సార్) అని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి కొనియాడారు. వైఎస్సార్ దీర్ఘ కాలం ప్రజాజీవితంలో ఉన్న నాయకుడని, ఆయన మర ణం ఒక్క కాంగ్రెస్‌పార్టీకే కాక, తెలుగు ప్రజలందరికీ తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ స్ఫూర్తితో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తామన్నారు. జీవితాంతం కాంగ్రెస్ సిద్ధాంతాన్ని త్రికరణశుద్ధిగా పాటించి ప్రజల అభీష్టమే లక్ష్యంగా పరిపాలన అందించిన వైఎస్సార్ ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతారని పేర్కొన్నారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా శుక్రవారం ఇక్కడ గాంధీభవన్‌లో ఆయన చిత్రపటా నికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అదే విధంగా పంజాగుట్టలోని వైఎస్ విగ్రహం వద్ద సహచర నేతలు, కార్య కర్తలతో కలిసి నివాళులర్పించారు. రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ తర్వాత పేదలకు అంతటిస్థాయిలో సంక్షేమపథకాలు అందించిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుందని రేవంత్ అన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, జలయజ్ఞం, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలు పేదలకు ఎంతో ఉపయోగ పడ్డాయని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీతో పేదలందరికీ కార్పొరేట్ వైద్యాన్ని అందించారని, మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించారని కొనియాడారు. నాడు వైఎస్ చేపట్టిన జలయజ్ఞం వల్లే వ్యవసాయం లాభసాటిగా మారిందని స్పష్టం చేశారు. మళ్లీ అలాంటి పాలన రావాలంటే దేశంలో యూపీఏ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు మహేశ్‌కుమార్ గౌడ్, అంజన్‌కుమార్ యాదవ్, మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య, పార్టీ నేతలు కుమార్‌రావు, కోదండరెడ్డి, ఈ.అనిల్, అనిల్ కుమార్ యాదవ్, సంగిశెట్టి జగదీశ్, మల్రెడ్డి రాంరెడ్డి, రోహిణ్‌రెడ్డి, మెట్టు సాయి కుమార్,కల్వ సుజాత, పద్మ వరలక్ష్మి, కత్తి కార్తీక, బొల్లు కిషన్, నగేశ్ ముదిరాజ్, కార్పొరేటర్ పి.విజయారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సర్వాయి పాపన్న తెలంగాణకు గర్వకారణం
గన్‌ఫౌండ్రీ (హైదరాబాద్): బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తోందని రాష్ట్రమంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. సర్వాయి పాపన్న యావత్ తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమన్నారు. రవీంద్ర భారతిలో గురువారం బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 372వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ...తెలంగాణ వాడి వేడిని నాడే చాటిచెప్పిన శౌర్యుడు పాపన్నని కొనియాడారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత గీత కార్మికుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు తీసుకొచ్చామని తెలిపారు. ట్యాంక్‌బండ్‌పై నీరా కేంద్రం, గౌడ ఆత్మగౌరవ భవనాలను వచ్చే నెలలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ బహుజన ఆత్మగౌరవ భవనాల నిర్మాణాలకు నగరంలో విలువైన భూములను ఇవ్వడంతోపాటు రూ.95 కోట్లను విడుదల చేశారని వెల్లడించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ పేదల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుంటే వాటి మీద కనీసం అవగాహన లేని వ్యక్తులే విమర్శలు చేస్తున్నారని దుయ్య బట్టారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంక టేశం, ఎక్సైజ్ శాఖ కమి షనర్ సర్పరాజ్ అహ్మద్, ఎస్.హరిశంకర్ గౌడ్, పల్లె లక్ష్మణ్ రావుగౌడ్, వివిధ సంఘాలకు చెందిన బీసీ నాయకులు పాల్గొన్నారు. -
భారతీయతే మన ఐక్యత
కంటోన్మెంట్ (హైదరాబాద్): భిన్నత్వంలో ఏకత్వమే మన దేశాన్ని మిగతా ప్రపంచానికి ఆదర్శంగా నిలబడేలా చేస్తోందని ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇంత విభిన్నత ఉన్నా భారతీయతే మన ఐక్యత అని చెప్పారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఆర్మీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో కేటీఆర్ పాల్గొన్నారు. కాలికి తగిలిన గాయం వల్ల మూడు వారాలుగా ఇంటికే పరిమితమైన తాను.. బయటికి వచ్చాక మొదట ఆర్మీ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషకరమన్నారు. ‘‘నేను ఐటీ, పరిశ్రమల మంత్రిగా వివిధ దేశాలు తిరిగినప్పుడు చాలా మంది మన దేశాన్ని చైనాతో పోల్చి మాట్లాడారు. అధిక జనాభా, వనరులున్న చైనా, భారత్ అన్నింటా పోటీపడటం సహజమే. అయితే విభిన్న మతాలు, కులాలు, ప్రాంతాలు, సంస్కృతులు కలిగిన మన దేశంలో ప్రతి 100 కిలోమీటర్లకు అన్నీ మారిపోతూ ఉంటాయి. భాష, యాస, కట్టుబొట్టు, ఆహార అలవాట్లు అన్నింటా వ్యత్యాసం ఉంటుంది. కానీ అందరినీ ఒక్క తాటిపై నిలిపేది మాత్రం భారతీయతే. 75 ఏళ్లలో మనం సాధించిన విజయాలకు తోడు.. మన ఐక్యత, ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. దీన్ని భవిష్యత్‌లోనూ కొనసాగించాలి..’’అని కేటీఆర్ పిలుపునిచ్చారు. పరేడ్ గ్రౌండ్లో సైనికులు, కళాకారులు, విద్యార్థుల విన్యాసాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయని.. ఇంత మంచి కార్యక్రమానికి తనను ఆహ్వానించిన ఆర్మీ దక్షిణ భారత్ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్, లెఫ్టినెంట్ జనరల్ అరుణ్ కుమార్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. ఆకట్టుకున్న లెఫ్టినెంట్ జనరల్ ప్రసంగం పరేడ్ గ్రౌండ్లో ఆర్మీ కార్యక్రమాల ముగింపు సందర్భంగా లెఫ్టినెంట్ జనరల్ అరుణ్‌కుమార్ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. తెలుగు వ్యక్తి అయిన ఆయన మన భాషతోపాటు హిందీ, ఇంగ్లిష్‌లోనూ మాట్లాడుతూ ఉత్తేజపరిచారు. ప్రసంగం మధ్యలో ఆర్మీ జవాన్లు త్రివర్ణ పతాకంతో గగనంలో ఎగురుతూ చేసిన విన్యాసాన్ని తిలకించాల్సిందిగా ఆహుతులను కోరారు. అమర జవానులకు నివాళి పరేడ్ గ్రౌండ్స్‌లో కార్యక్రమాల సందర్భంగా తెలంగాణ–ఏపీ ఆంధ్రా సబ్ ఏరియా ప్రాంతానికి చెందిన అమర జవాన్ల కుటుంబాలకు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రత్యేక పురస్కారాలు అందజేశారు. కల్నల్ సంతోష్‌బాబు సతీమణి సంతోషి, మేజర్ పద్మపాణి ఆచార్య సతీ మణి చారులత, కంటోన్మెంట్‌కు చెందిన లాన్స్‌నాయక్ రాంచందర్ సతీమణి ఎంఆర్ దివ్యతోపాటు అమరవీరుల కుటుంబ సభ్యులు విమలారావు, లక్ష్మీదేవి, నస్రీన్ ఖాన్, గీత మాధవ్, సుభాషిణీ, నీలం దేష్కర్, సర్వాహ్జా, శివలీల, కిరణ్ గుప్తా, సుహాసినీ మహేశ్వర్, నసీమ్ సుల్తానా తదితరులకు మంత్రి పురస్కారాలు అందజేశారు. ఇక ఇటీవల జరిగిన మిలటరీ ఆపరేషన్లలో ఉత్తమ ప్రతిభ కనబర్చి, సేవా పురస్కారాలు పొందిన టీఎన్ సాయికుమార్, కల్నల్ సురేంద్ర పోలా, కల్నల్ రాహుల్ సింగ్ తదితరులకు సైతం మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రశంసా పురస్కారాలు అందజేశారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు పరేడ్ గ్రౌండ్స్‌లో ఆర్మీ ఏర్పాటు చేసిన యుద్ధ ట్యాంకులు, ఆయుధ ప్రదర్శన ఆకట్టుకుంది. పెద్ద సంఖ్యలో ప్రజలు వాటిని సందర్శించి, ఆర్మీ విన్యాసాలను తిలకించారు. కలరిపయట్టు, పేరిణి నృత్యాలు, ఆర్మీ బ్యాండ్ ప్రదర్శనలు, బొల్లారం ఆర్మీ స్కూల్ విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. -
ఫైరింగ్‌పై కక్కుర్తి రాజకీయాలు
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్)/గన్‌ఫౌండ్రీ: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో చోటుచేసుకున్న ఘటనపై కొందరు కక్కుర్తి రాజకీయాలు చేస్తున్నారని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. బీసీలు రాజకీయంగా ఎదిగితే ఓర్వలేని కొన్ని రాజకీయ పార్టీలు అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆదివారం రవీంద్రభారతిలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తొలి బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ మహారాజ్ 372వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంత్రి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాలతో పాటు విలువైన స్థలాలను కేటాయించినట్లు తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు. కాగా, ఆదివారం మహబూబ్‌నగర్‌లోని టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీకి చెందిన పలువురు కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా జరిగిన ఫ్రీడం రన్‌ను ప్రారంభించేందుకు చేసిన ఫైరింగ్‌ను అనవసర వివాదం చేస్తున్నారని ఆరోపించారు. అనంతరం వివిధ పార్టీల నేతలు టీఆర్ఎస్లో చేరారు. కర్వెన, ఉదండాపూర్ రిజర్వాయర్లు సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని ఆయన తెలిపారు. -
అసెంబ్లీ హాల్లో జయశంకర్ జయంతి వేడుకలు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ హాల్లో శనివారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి శాసన మండలి చైర్మన్ గుత్తాసుఖేందర్ పులమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో శాసన మండలి విప్ ఎంఎస్ ప్రభాకర్, శాసనసభ చీఫ్ విప్, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, శేరి సుభాష్‌రెడ్డి, కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, భానుప్రసాద్, తాతా మధు, దండే విఠల్, తెలంగాణ లెజిస్లేచర్ సెక్రెటరీ నరసింహా చార్యులు, టీఆర్ఎస్ఎల్పీ కార్యదర్శ రమేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఉమామహేశ్వరికి ప్రముఖుల నివాళి
బంజారాహిల్స్ (హైదరాబాద్): దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి భౌతికకాయానికి మంగళవారం జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 9లోని ఆమె నివాసంలో బంధుమిత్రులు, పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు ఉమామహేశ్వరి సోదరీమణులు గారపాటి లోకేశ్వరి, నారా భువనేశ్వరి, దగ్గుబాటి పురందేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, నందమూరి బాలకృష్ణ ఆయన సతీమణి వసుంధర, రామకృష్ణ, నందమూరి కల్యాణ్ రామ్ తదితరులు నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఎన్టీ రామారావు గారి కుటుంబంతో తనకు మొదటి నుంచి సన్నిహిత సంబంధాలున్నాయని చెప్పారు. ఉమామహేశ్వరి మృతిపై సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. అమెరికా నుంచి పెద్ద కుమార్తె విశాల అర్ధరాత్రి ఇక్కడికి చేరుకున్నారు. బుధవారం ఉదయం ఉమామహేశ్వరి భౌతిక కాయానికి అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. గతంలో రెండుసార్లు ఆత్మహత్యాయత్నం ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి కొంతకాలంగా అనారోగ్యం, తీవ్ర మానసిక ఒత్తిడి, ఒంటరితనంతో బాధపడుతున్నారు. మానసిక ఒత్తిడికి సంబంధించి వైద్యం కూడా చేయించుకుంటున్నారు. అయితే ఒంటరితనం ఆమెను తీవ్రంగా బాధిస్తున్నట్లు గతంలో జరిగిన రెండు సంఘటనలు వెల్లడిస్తున్నాయి. మూడు నెలల కాలంలో ఆమె రెండుసార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు సమాచారం. ఒకసారి 40 నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా సకాలంలో కుటుంబ సభ్యులు గుర్తించి ఆస్పత్రికి చేర్చగా ప్రాణాలతో బయటపడ్డారు. తర్వాత కొద్ది రోజులకే మరోసారి నిద్రమాత్రలు మింగారు. ఆ సమయంలో కూడా కుటుంబ సభ్యులు గుర్తించడంతో చికిత్స అనంతరం ఆమె బయటపడ్డారు. చిన్న కూతురు దీక్షిత పెళ్లి జరిగిన అనంతరం ఉమామహేశ్వరి మరింత ఒంటరితనానికి గురైనట్లు కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. -
న్యూజెర్సీలో వైఎస్సార్ జయంతి వేడుకలు: మహానేతకు ఘన నివాళి
న్యూ జెర్సీ: డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో న్యూ జెర్సీలో మన్రోలో థాంప్సన్ పార్కులో వైస్సార్ జయంతిని ఘనంగా నిర్వహించారు. జులై పదిన జరిగిన కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఆళ్ళ రామిరెడ్డి, డాక్టర్ రాఘవ రెడ్డి , హరి వెళ్కూర్, అన్నారెడ్డి, రఘురామి రెడ్డి, ప్రభాకర్ చీనేపల్లి, రామమోహన్ రెడ్డి ఎల్లంపల్లి, సత్య పాతపాటి, ద్వారక వారణాసి, సహదేవ్ రెడ్డి, భానోజీ రెడ్డి, నగేష్ ముక్కమల్లతో పాటు పలువురు వై ఎస్సార్ అభిమానులు పాల్గొన్నారు. డా. వై.ఎస్.రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాలలో వైఎస్సార్ జయంతి జరుపుకోవడం ఆయనకిచ్చే ఘన నివాళి అని ఆళ్ళ రామిరెడ్డి అన్నారు. వైఎస్సార్‌ను స్మరించుకుంటూ ఫౌండేషన్ తరపున వాటర్ ప్లాంట్స్, హెల్త్ క్యాంప్స్, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, మెడికల్ కిట్స్, కూరగాయల సరఫరా లాంటి ఎన్నో కార్యక్రమాల నిమిత్తం వైస్సార్ అభిమానులు ఈ రెండేళ్లలో రెండు కోట్లకు పైగా సహాయం చేశారన్నారు. నాటా ప్రెసిడెంట్ డాక్టర్ రాఘవ రెడ్డి గోసల మాట్లాడుతూ వైఎస్సార్ పధకాలు ఎంతో మంది పేదలకు ఉపయోగపడితే ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పథకాలతో పాటుగా ‘నాడు నేడు’, ఇంగ్లీష్ మీడియం మరింత సమర్ధ వంతంగా అమలుచేయడం గర్వకారణమన్నారు. వైఎస్సార్ అభిమానులు ఉభయ తెలుగు రాష్ట్రాలలో వున్నారని అందుకు ఉదాహరణే ఇక్కడకు వచ్చిన అభిమానులని ప్రభాకర్ చీనేపల్లి పేర్కొన్నారు. డా.మూలే రామమునిరెడ్డి రాసిన కవితను కృష్ణమోహన్ రెడ్డి చదివి వినిపించారు. ఇంకా ఈ కార్యక్రమంలో మనోహర్ కడివెటి, అనిల్ రెడ్డి, బాలకృష్ణ బోడిరెడ్డి, ఆళ్ళ బసివి రెడ్డి, బ్రహ్మానంద రెడ్డి పాల్వాయి, చంద్ర రెడ్డి, ఇందిరా శ్రీరామ్ రెడ్డి, కోటి రెడ్డి, కృష్ణ కళ్ళం, లక్ష్మారెడ్డి, నాగరాజా రెడ్డి, నాగేంద్ర ముక్కమల్ల, నాగిరెడ్డి భీమవరపు, నాగిరెడ్డి ఉయ్యురు, నరేష్ అన్నం, పద్మనాభ రెడ్డి, రామ్ వేమిరెడ్డి, సంజీవ రెడ్డి బెక్కం, శ్రీధర్ గుడేటి, శ్రీనివాస్ గుండేటి, సూరి తాడి, తాతా రెడ్డి, తిమ్మా రెడ్డి, విజయ్ గోలి, వీర ప్రతాప్ రెడ్డి, వెంకటరెడ్డి కాగితాల, వెంకట శివ మద్దిగపు, ఆళ్ళ వికాస్ రెడ్డి, వినయ్ వాసిలి, వినోద్ ఎరువతో పాటు 300కి పైగా అభిమానులు పాల్గొని మహానేతకు ఘన నివాళులర్పించారు. -
పీవీ గౌరవాన్ని పెంచేలా కార్యక్రమాలు: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్/రాంగోపాల్‌పేట్: దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 101వ జయంతిని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు మంగళవారం నెక్లెస్‌రోడ్‌లోని పీవీ ఘాట్‌లో ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహమూద్ అలీ, మల్లారెడ్డి, సత్యవతి రాథోడ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్సీ వాణీదేవి, పీవీ కుటుంబసభ్యులు తదితరులు ఆయన సేవలను స్మరించుకున్నారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ దివంగత మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు గౌరవాన్ని పెంచే కార్యక్రమాల్లో భాగంగా ఆజాదీకా అమృతోత్సవ్ సందర్భంగా పీవీ పేరుపై త్వరలోనే తపాలా బిళ్లను విడుదల చేస్తామని ప్రకటించారు. రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ పరిపాలన దక్షతతో దేశ గౌరవాన్ని ఇనుమడింపజేసిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. తన ఆర్థిక, సరళీకృత విధానాలతో దేశానికి దశ, దిశ చూపిన మాజీ ప్రధాని పీవీ.. భారత జాతిరత్నమని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కొనియాడారు. పీవీ స్వగ్రామమైన వంగరలో ఆయన స్మారకంగా చేపట్టిన అభివృద్ధి పనులు అసంపూర్తిగా మిగిలాయని, వాటిని పూర్తి చేయాలని కోరారు. పీవీ నరసింహారావులాంటి గొప్ప వ్యక్తిని స్మరించుకుని, గౌరవించే తీరిక ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. అంతకుముందు పీవీ ఘాట్‌లో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. కాగా, గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ పీవీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శాసనసభ ప్రాంగణంలో .,. దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 101వ జయంతి వేడుకలను శాసనసభ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లాబీహాల్లో ఏర్పాటు చేసిన పీవీ చిత్రపటానికి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మండలి విప్ ఎంఎస్ ప్రభాకర్‌రావు, లెజిస్లేచర్ సెక్రటరీ నరసింహాచార్యులు పాల్గొన్నారు. ప్రపంచం లోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి పరిపాలనాదక్షుడు పీవీ అని, ఈరోజు దేశం ఆర్థిక సమస్యలను తట్టుకుని నిలబడుతుందంటే ఆయన ప్రారంభించిన సంస్కరణలే కారణమని గుత్తా కొనియాడారు. -
రాజీవ్ మార్గంలో వెళ్లడమే ఆయనకు ఘన నివాళి
సాక్షి, హైదరాబాద్: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చూపిన మార్గంలో వెళ్లడమే ఆయనకు అర్పించే ఘనమైన నివాళి అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రాజీవ్‌గాంధీ 31వ వర్ధంతి సందర్భంగా శనివారం గాంధీభవన్‌లో ఆయన చిత్రపటానికి మాజీ ఎంపీ వి.హనుమంతరావు, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌లతో కలసి భట్టి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అవినీతి మరక లేకుండా దేశంలో శాస్త్ర, సాంకేతిక రంగాలను పరుగులు పెట్టించిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందన్నారు. ప్రపంచంలోని గొప్ప సంస్థలకు దేశానికి చెందిన వారు సీఈవోలుగా ఉన్నారంటే అందుకు రాజీవ్ అమల్లోకి తెచ్చిన విధానాలే కారణమన్నారు. 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించి, ఇంటింటికి తాగునీటి సౌకర్యం కల్పించారని, ఆయన హయాంలోనే దేశంలో సెల్ఫోన్లు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. జాతి సమైక్యత కోసం నాడు దేశవ్యాప్తంగా సద్భావన యాత్ర చేసిన ఘనత రాజీవ్ గాంధీదేనని, ఆయన బాటలోనే ఇప్పుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపడుతున్నారని అన్నారు. కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై స్పందిస్తూ రాష్ట్రాల పర్యటన సీఎం వ్యక్తిగతమని, ఆయన ఎక్కడ పర్యటించినా రాష్ట్రంలోని రైతాంగం పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. నకిలీ విత్తనాలు, రుణమాఫీతో పాటు ఇతర రైతాంగ సమస్యలకు పరిష్కారం చూపి ఆయన దేశంలో పర్యటిస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు. కేంద్రం నేరుగా గ్రామపంచాయతీలకు నిధులివ్వడంలో తప్పులేదని భట్టి అభిప్రాయపడ్డారు. -
ప్రజాస్వామ్య రూపశిల్పి అంబేడ్కర్
సాక్షి, హైదరాబాద్: మనదేశం అత్యుత్తమ ప్రజాస్వామ్య వ్యవస్థగా రూపుదిద్దుకోవడంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ది అత్యంత కీలక పాత్ర అని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ అన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యు న్నతి కోసం, వారి హక్కుల కోసం అంబేద్కర్ అహర్నిశలు శ్రమించారన్నారు. రాష్ట్ర బార్ కౌన్సిల్, హైకోర్టు న్యాయవాదుల సంఘం సంయుక్తంగా గురువారం నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దళిత కుటుంబం నుంచి వచ్చి అత్యున్నత శిఖరాలకు చేరారని, ఆయన జీవి తం పౌరులందరికీ ఆదర్శప్రాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ నందా, రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసా ద్, బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ.నర్సింహారెడ్డి, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్య క్షుడు పొన్నం అశోక్ గౌడ్ ప్రసంగించారు. -
Ambedkar Jayanti 2022: అంబేడ్కర్‌కు ఘన నివాళి
సాక్షి, హైదరాబాద్: పరిశ్రమలు, వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో బుధవారం అమీర్‌పేట గ్రీన్‌పార్క్ మ్యారీగోల్ట్ హోటల్లో నిర్వహించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలకు మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంబేడ్కర్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఉత్తమ పారిశ్రామికవేత్తలకు కేటీఆర్ అవార్డులను ప్రదానం చేశారు. అంబేడ్కర్ దేశానికే గర్వకారణం: గవర్నర్ దేశం పూర్వవైభవం సాధించేందుకు రాజ్యాంగ ఆదర్శాలు, ఆదేశాలను అనుసరిస్తూ భారత రాజ్యాంగానికి లోబడి ఏర్పడిన చట్టబద్ధ కార్యాలయాలు, సంస్థలను గౌరవించాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. గురువారం భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా గవర్నర్ ఆయనకు నివాళులర్పించారు. భారత రాజ్యాంగానికి రూపకల్పన చేసిన అంబేడ్కర్ దేశానికే గర్వకారణమని, చురుకైన సంఘ సంస్కర్తగా, ప్రముఖ న్యాయవాదిగా చిరస్మరణీయుడని గవర్నర్ కొనియాడారు. అణచివేతపై మానవత్వం సాధించిన విజయానికి అంబేడ్కర్ అసలైన ఉదాహరణ అని, సమాజంలో అట్టడుగు వర్గాలు, పేదలతో పాటు ప్రతీఒక్కరికీ రాజ్యాంగ హక్కులు దక్కేలా అంబేడ్కర్ ఎనలేని కృషి చేశారని గవర్నర్ కీర్తించారు. అంబేడ్కర్‌కు సీఎం నివాళి డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 131వ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నివాళులర్పించారు. అంబేడ్కర్ స్ఫూర్తితోనే తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలు, వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా వేల కోట్ల రూపాయలతో ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తోందని సీఎం పేర్కొన్నారు. దళిత బంధు పథకం ద్వారా అర్హులైన దళిత కుటుంబానికి రూ.10 లక్షల మొత్తాన్ని నూటికి నూరు శాతం రాయితీ కింద అందిస్తోందని తెలిపారు. -
‘బడుగుల కోసం పోరాడిన మహానుభావుడు పూలే’
గన్‌ఫౌండ్రీ: విద్యను ఆయుధంగా మార్చుకోవాలని సూచించిన గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిబా పూలే అని పలువురు ప్రముఖులు కొనియాడారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పూలే 196వ జయంతి వేడుకలను సోమవారం రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల జీవితాల్లో సమూల మార్పుల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు జ్యోతిబా పూలే అని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పూలే సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తున్నారని తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ పార్లమెంట్లో బీసీ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బీసీ జనగణనను నిర్వహించాలని డిమాండ్ చేశారు. పలు పోటీపరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం ఈనెల 16న ఆన్లైన్ వేదికగా పరీక్షను నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడించారు. కార్యక్రమంలో బీసీ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి భట్టు మల్లయ్య, బీసీ కమిషన్ సభ్యుడు ఉపేంద్రచారి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, పూలే జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్లు ఆనంద్‌కుమార్ గౌడ్, నీల వెంకటేశ్, రాజేందర్, బడేసాబ్ పాల్గొన్నారు. -
మల్లు స్వరాజ్యానికి ఆత్మీయ నివాళి
రాయదుర్గం(హైదరాబాద్): భూస్వామ్య కుటుంబంలో పుట్టి పేదల కోసం ఆయుధం చేతపట్టి రజాకార్లను గడగడలాడించిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యానికి పార్టీలకతీతంగా నేతలు ఘనమైన నివాళులు అర్పించారు. రాయదుర్గంలోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ‘అమ్మకు వందనం’పేరిట ఆత్మీయ సమ్మేళనాన్ని స్వరాజ్యం కుమార్తె పాదూరి కరుణ, రాంసుందర్‌రెడ్డి, ఇతర కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వివిధ పార్టీల నాయకులు మల్లు స్వరాజ్యంతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. పేదల పక్షాన ఆమె జీవితాంతం చేసిన పోరాటాలను గుర్తుచేసుకున్నారు. మల్లు స్వరాజ్యం చిత్రపటానికి ఎదురుగా ఉంచిన పుస్తకంలో ఆమె గురించిన జ్ఞాపకాలను నాయకులు, ప్రజాప్రతినిధులు నమోదు చేశారు. కార్యక్రమంలో హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీమంత్రి కె.జానారెడ్డి, రాష్ట్ర ప్రణాళికా మండలి వైస్ చైర్మన్ బి.వినోద్‌కుమార్, ఎంపీ ధర్మపురి అరవింద్, మాజీ ఎంపీలు వివేక్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఏపీ జితేందర్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ప్రజాగాయకుడు గద్దర్, ఆయా పార్టీల నాయకులు డాక్టర్ కె.నారాయణ, ఎన్.ఇంద్రసేనారెడ్డి, దాసోజు శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వార్న్‌కు ఘన నివాళి
మెల్బోర్న్: శుక్రవారం ఆకస్మికంగా మృతి చెందిన స్పిన్ దిగ్గజం షేన్‌వార్న్‌కు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులంతా నివాళులు అర్పించారు. ఎంసీజీ బయట ఉన్న అతని విగ్రహం వద్ద పూలు ఉంచి ఆస్ట్రేలియా ఫ్యాన్స్ స్పిన్ దిగ్గజం జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. మరోవైపు వార్న్ కుటుంబ సభ్యులు అనుమతిస్తే అధికారిక లాంఛనాలతో అతనికి అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆస్ట్రేలియా దేశ ప్రధాని స్కాట్ మోరిసన్ ప్రకటించారు. ‘మా దేశానికి చెందిన గొప్ప వ్యక్తుల్లో ఒకడిగా వార్న్ నిలిచిపోతాడు. అతని బౌలింగ్‌లో ప్రత్యేక ఆకర్షణ ఉంది. ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన వార్న్ తన జీవితాన్ని కూడా అద్భుతంగా జీవించాడు’ అని ఆయన సంతాపం ప్రకటించారు. ఎంసీజీలోని గ్రేట్ సదరన్ స్టాండ్‌కు షేన్ వార్న్ పేరు పెడుతున్నట్లు కూడా ఆసీస్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. వార్న్ సుదీర్ఘ కాలం ప్రాతినిధ్యం వహించిన ఇంగ్లీష్ కౌంటీ ‘హాంప్‌షైర్’ ప్రధాన కేంద్రమైన సౌతాంప్టన్‌లో కూడా అతనికి సంతాపం ప్రకటిస్తూ పలు కార్యక్రమాలు జరిగాయి. రోజ్ బౌల్ మైదానంలో ఇంగ్లండ్ అభిమానులు వార్న్‌కు నివాళులు అర్పించారు. -
Shane Warne: మద్యం, మాంసం, సిగరెట్లతో స్పిన్ మాంత్రికుడికి నివాళి
స్పిన్ మాంత్రికుడు, ఆసీస్ దిగ్గజ బౌలర్ షేన్ వార్న్(51) శుక్రవారం థాయ్‌లాండ్‌లోని తన విల్లాలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మరణించిన విషయం తెలిసిందే. ఈ వార్త తెలియగానే మెల్బోర్న్ క్రికెట్ మైదానం ముందు ఏర్పాటు చేసిన అతని కాంస్య విగ్రహం వద్దకు బారులు తీరిన అభిమానులు స్పిన్ మాంత్రికుడికి ప్రత్యేకంగా నివాళులర్పిస్తున్నారు. రకరకాల పూలతో పాటు తమ ఆరాధ్య క్రికెటర్‌కు ఎంతో ప్రీతిపాత్రమైన మద్యం (బీర్), మాంసం, సిగరెట్లను విగ్రహం ముందు ఉంచి అతని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నారు. సాధారణంగా ఎవరైనా చనిపోతే వారికి ఇష్టమైన వాటిని సమాధి ముందుంచడం ఆనవాయితీ. ఈ క్రమంలో వార్న్‌కు ఇష్టమైన బీర్‌ను, మాంసాన్ని, సిగరెట్లను అభిమానులు అతని విగ్రహం ముందుంచుతున్నారు. కాగా, క్రికెటింగ్ కెరీర్లో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన వార్నీ.. వ్యసనాలకు బానిసై వివాదాలకు కేంద్ర బింధువుగా నిలిచిన విషయం తెలిసిందే. మద్యం, సిగరెట్లతో పాటు స్త్రీ వ్యామోహం కూడా అధికంగా కలిగిన అతను.. చాలా సందర్బాల్లో వీటిని సేవిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చాడు. 1992లో టీమిండియాతో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన వార్న్.. 145 టెస్టుల్లో 708 వికెట్లు, 194 వన్డేల్లో 293 వికెట్లు పడగొట్టాడు. సమకాలీన క్రికెట్లో లంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ (1347) తర్వాత వెయ్యి వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. చదవండి: Shane Warne: దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ హఠాన్మరణం -
ప్రపంచ క్రికెట్లో విషాదం.. షేన్‌వార్న్ మృతి, సంతాపాల వెల్లువ..
ప్రపంచ క్రికెట్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్‌వార్న్ శుక్రవారం హఠాన్మరణం చెందారు. థాయ్‌లాండ్‌లోని ఓ విల్లాలో విగతజీవిగా కనిపించారు. ఆయన మృతిని కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. గుండెపోటుతోనే ఆయన ప్రాణాలు కోల్పోయినట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఇక వార్న్ మృతిపట్ల యావత్ క్రీడాలోకం దిగ్భ్రాంతికి గురైంది. తమ అభిమాన సహచరుడు లేడనే వార్త విని క్రికెట్ ప్రముఖులు విషాదంలో మునిగారు. వార్న్ కుటుంబానికి ఈ కష్ట కాలంలో ధైర్యాన్ని ప్రసాదించాలని దేవున్ని ప్రార్థించారు. ఈమేరకు సోషల్ మీడియా వేదికగా పలువురు స్పందించారు. ‘షేన్ వార్న్ మృతి విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యా. మాటలు రావడం లేదు. క్రికెట్ ప్రపంచంలో లెజెండ్. ఆటలో ఎంతో ఎత్తుకు ఎదిగిన వ్యక్తి. ఇంత త్వరగా కాలం చేయడం విషాదకరం. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి’ అని వీవీఎస్ లక్ష్మణ్ సంతాపం తెలిపారు. This is absolutely unbelievable. Shocked beyond words. A legend and one of the greatest players ever to grace the game.. Gone too soon... Condolences to his family and friends. https://t.co/UBjIayR5cW — VVS Laxman (@VVSLaxman281) March 4, 2022 ‘అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు. కూల్ స్పిన్‌కు వార్న్ పెట్టింది పేరు.. సూపర్ స్టార్ షేన్‌వార్న్ ఇకలేరనే విషయం బాధాకరం. మనిషి జీవితంలో ఎప్పుడేమవుతుందో చెప్పలేం. జీవితాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. వార్న్ కుటుంబ సభ్యులకు, ఆయన అభిమానులకు ప్రగాఢ సానుభూతి’ అని వీరేంద్ర సెహ్వాగ్ ట్విటర్లో సంతాపం తెలిపారు. Cannot believe it. One of the greatest spinners, the man who made spin cool, superstar Shane Warne is no more. Life is very fragile, but this is very difficult to fathom. My heartfelt condolences to his family, friends and fans all around the world. pic.twitter.com/f7FUzZBaYX — Virender Sehwag (@virendersehwag) March 4, 2022 ‘క్రికెట్ దిగ్గజం షేన్‌వార్న్ మృతి చెందారనే విధ్వంసకర వార్త విన్నా. నోట మాట రావడం లేదు. షాకింగ్‌గా ఉంది. గొప్ప ఆటగాడు, మంచి మనిషి’ అని పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ట్వీట్ చేశారు. Just heard the devastating news about legendary Shane Warne passing away. No words to describe how shocked & sad i am. What a legend. What a man. What a cricketer. pic.twitter.com/4C8veEBFWS — Shoaib Akhtar (@shoaib100mph) March 4, 2022 హృదయం ముక్కలైందని ఆవేదన వ్యక్తం చేసిన షమీ.. షేన్ వార్న్‌కు నివాళి అర్పించాడు. RIP 💔💔💔💔 pic.twitter.com/MIcsBEjfL6 — Mohammad Shami (@MdShami11) March 4, 2022 ‘షేన్‌వార్న్ ఇక లేరనే వార్త నమ్మలేకపోతున్నా.. ఇది అబద్ధమని చెప్పండి’ అని దినేష్ కార్తీక్ విస్మయం వ్యక్తం చేశాడు. Shane Warne ... Really !!!!! ☹️ Tell me it's not true please — DK (@DineshKarthik) March 4, 2022 ఒకే రోజు ఇద్దరు దిగ్గజాలు కన్నుమూయడం విషాదకరం. మార్ష్, వార్న్ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి అని డేవిడ్ వార్నర్ ట్వీట్ చేశాడు. Two legends of our game have left us too soon. I’m lost for words, and this is extremely sad. My thoughts and prayers go out to the Marsh and Warne family. I just can not believe it. #rip, you will both be missed https://t.co/gduLY9bIwg — David Warner (@davidwarner31) March 4, 2022 -
మేకపాటి మృతి పట్ల వరల్డ్ ఎకనామిక్ ఫోరం దిగ్భ్రాంతి
సాక్షి, అమరావతి: పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాలమరణం పట్ల వరల్డ్ ఎకనామిక్ ఫోరంతో పా టు పలు విదేశీ సంస్థలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ఈ మధ్యనే ఢిల్లీలో మేకపాటితో కలిసి చర్చలు జరిపామని, ఇంతలోనే ఇటువంటి వార్త దిగ్భాంత్రికి గురిచేసిందంటూ వరల్డ్ ఎకనామిక్ ఫోరం తన సంతాప సందేశంలో పేర్కొంది. వారం రోజుల క్రితమే రాష్ట్రంలో పెట్టుబడుల గురించి ఆయన సమక్షంలో ఒప్పందం చేసుకున్నామని, ఆయన మరణించినా రాష్ట్రంలో పెట్టుబడుల సంబంధాన్ని కొనసాగించడం ద్వారా ఆయ న ఆత్మకు శాంతిని చేకూరుస్తామని రీజెన్సీ గ్రూపు చైర్మన్ ఎస్బీ హాము హజీ పేర్కొన్నారు. చదవండి: (ఏపీ కేబినెట్ భేటీ మార్చి 7కి వాయిదా) దుబాయ్ పర్యటనలో మంత్రిగా మేకపాటి నిబద్ధత, నిరాడంబరత మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుందని, వారం రోజు ల్లోనే ఇలాంటి వార్త హృదయాలను కలచివేసిందని షరాఫ్ గ్రూపు వైస్ చైర్మన్ షరాబుద్ధీన్ షరాఫ్ పేర్కొన్నారు. జీ42 గ్రూపు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా దుబాయ్ చాప్టర్ మేకపాటి కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియజేశాయి. -
లతా మంగేష్కర్ మృతిపట్ల సంతాపం తెలిపిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ మృతిపట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలియజేశారు. 'లతా మంగేష్కర్ జీ ఇక మన మధ్య లేరని తెలిసి చాలా బాధపడ్డాను. ఆమె మధురమైన స్వరం నిత్యం ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి' అని సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. Deeply anguished to know that Lata Mangeshkar ji is no more with us. Her melodious voice will continue to echo for eternity. May her soul rest in peace. — YS Jagan Mohan Reddy (@ysjagan) February 6, 2022 గవర్నర్ సంతాపం ప్రముఖ గాయని లతా మంగేష్కర్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ సంతాపం తెలియజేశారు. 'తన గాత్రంతో కోట్లాదిమందిని అలరించిన ఇండియన్ నైటింగేల్, భారతరత్న లతా మంగేష్కర్ మృతి సంగీత లోకానికి తీరని లోటు. లతా మంగేష్కర్ విజయాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని వేడుకుంటున్నా' అని గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ పేర్కొన్నారు. చదవండి: (గాన కోకిల లతా మంగేష్కర్ కన్నుమూత) -
బాపూజీకి జాతి నివాళి
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా రాజ్‌ఘాట్‌లో జాతిపితకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాతిపిత ఆలోచనలను ప్రాచుర్యంలోకి తీసుకురావడం మన బాధ్యత అని ప్రధాని ట్వీట్ చేశారు. అమరజవాన్ల దినోత్సవం సందర్భంగా దేశం రక్షణ కోసం వీరోచితంగా పోరాడిన అమర సైనికులకు శ్రద్ధాంజలి ఘటించారు. వారి సేవ, ధైర్యసాహసాలు మరువలేనివని ప్రధాని కొనియాడారు. అహ్మదాబాద్: మహాత్మాగాంధీ ‘స్వదేశీ’ ఉద్యమానికి అసలైన నిర్వచనం.. తమ ప్రభుత్వం కార్యక్రమాలైన మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ అని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. స్వాతంత్య్రం తరువాత భారత్‌ను పునర్నిర్మించాలన్న ఆయన ఆలోచన ఏళ్లపాటు పక్కన పెట్టారని, తాము అధికారంలోకి వచ్చాక దాన్ని అమల్లోకి తెచ్చామని అన్నారు. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా అహ్మదాబాద్‌లోని సబర్మతి నదీతీరాన ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కేవీఐసీ) ఏర్పాటు చేసిన కుడ్య చిత్రాన్ని ఆయన ఆదివారం ఆవిష్కరించారు. ఈ కుడ్యచిత్రం బాపూజీకి నిజమైన నివాళి అని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ రాణే, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తెలిపారు. నిజం బతికున్నంత కాలం గాంధీ సజీవం మహాత్మాగాంధీ లేరని హిందుత్వ వాదులు భావిస్తున్నారని, కానీ సత్యం బతికున్నంత కాలం జాతిపిత సజీవంగా ఉంటారని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ అన్నారు. బాపూజీ 74వ వర్ధంతి సందర్భంగా ట్విట్టర్లో ‘ఫరెవర్ గాంధీ’ హ్యాష్‌ట్యాగ్‌తో నివాళులర్పించారు. రాజ్‌ఘాట్ దగ్గరా రాహుల్ ఆదివారం జాతిపితకు అంజలి ఘటించారు. హిందుత్వవాదీ అయిన గాడ్సే మహాత్ముడిని కాల్చి చంపాడని ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘‘నేను నిరాశకు గురైనప్పుడు... సత్యం, ప్రేమ మాత్రమే గెలుస్తుందన్న చరిత్రను గుర్తు చేసుకుంటాను. కొంతకాలం పాటు అది కనిపించకుండా ఉండొచ్చు... హంతకులు, నిరంకుశులు మాత్రమే ఉండొచ్చు. కానీ చివరికి వాళ్లు ఓడిపోతారు. అది నిత్యం మనసులో ఉంచుకోండి’’ అన్న మహాత్ముడి కోట్ని రాహుల్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కూడా మహాత్మాగాంధీకి ట్విట్టర్లో నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ తన అధికార ట్విట్టర్ ఖాతాలో మహాత్ముడికి ఘన నివాళులర్పించింది. కాళీచరణ్‌కు ‘గాడ్సే భారత రత్న’ రాయ్‌పూర్‌లో జరిగిన ధర్మసంసద్‌లో మహాత్ముడిని కించపరిచే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణతో గత డిసెంబర్లో అరెస్టయి, గ్వాలియర్ జైల్లో ఉన్న మత నాయకుడు కాళీచరణ్ మహారాజ్‌కు, మరో నలుగురు హిందూ మహాసభ నేతలకు ‘గాడ్సే–ఆప్టే భారతరత్న’ అవార్డును ప్రదానం చేసింది. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా హిందూమహాసభ జాతిపితను హత్య చేసిన నాథురామ్ గాడ్సేకి నివాళులర్పించింది. గాంధీ హత్యకేసులో గాడ్సే సహనిందితుడు అయిన నారాయణ ఆప్టేకు నివాళిగా మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఆదివారం ‘గాడ్సే–ఆప్టే స్మృతి దివస్’ను నిర్వహించింది. 1948 జనవరి 30న గాడ్సే, ఆప్టేల అరెస్టుకు వ్యతిరేకంగా ‘గాడ్సే–ఆప్టే స్మృతి దివస్’ నిర్వహిస్తున్నామని హిందూ మహాసభ జాతీయ ఉపాధ్యక్షుడు జైవీర్ భరద్వాజ్ తెలిపారు. మహాత్మాగాంధీకి జాతిపిత ఇవ్వడమేంటని మీరట్‌లోని హిందూ మహాసభ నేతలు ప్రశ్నించారు. -
నేతాజీ జయంతి.. నివాళులు అర్పించిన రాష్ట్రపతి, ప్రధాని
స్వాతంత్ర్య సమర యోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం (జనవరి 23, 2022) ఆయనను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి.. "నేతాజీసుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా భారతదేశం ఆయనకు కృతజ్ఞతాపూర్వకంగా నివాళులు అర్పిస్తోంది. స్వేచ్ఛా భారతదేశం, ఆజాద్ హింద్ ఆలోచనకు, తన తీవ్రమైన నిబద్ధతను నెరవేర్చడానికి నేతీజీ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు -- ఆయనను జాతీయ చిహ్నంగా మార్చాయి. ఆయన ఆదర్శాలు, త్యాగం ప్రతి భారతీయుడికి ఎప్పటికీ స్ఫూర్తినిస్తుంది' అని ఆయన ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. "దేశప్రజలందరికీ పరాక్రమ్ దివస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ఆయనకు నా గౌరవప్రదమైన నివాళులు. ఆయన జయంతి సందర్భంగా నేను నేతాజీకి నమస్కరిస్తున్నాను. మన దేశానికి ఆయన చేసిన స్మారక సహకారానికి ప్రతి భారతీయుడు గర్విస్తాడు" అని ట్వీట్లో పేర్కొన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని పురస్కరించుకుని 73వ గణతంత్ర దినోత్సవాలను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగే ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ నేతాజీకి పుష్పాంజలి ఘటించనున్నారు. అనంతరం ఇండియా గేట్ వద్ద నేతాజీ హోలోగ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. మరోపక్క, గణతంత్ర దినోత్సవం పరేడ్‌కు అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది జరగబోయే పరేడ్‌లో 16 మార్చ్ఫాస్ట్ బృందాలు, 17 మిలటరీ బ్యాండ్ బృందాలు, 25 శకటాలు పాల్గొంటున్నాయి. ఆర్మీ తరఫున 14 రకాల ఆయుధాలను పరేడ్‌లో ప్రదర్శించనున్నారు. सभी देशवासियों को पराक्रम दिवस की ढेरों शुभकामनाएं। नेताजी सुभाष चंद्र बोस की 125वीं जयंती पर उन्हें मेरी आदरपूर्ण श्रद्धांजलि। I bow to Netaji Subhas Chandra Bose on his Jayanti. Every Indian is proud of his monumental contribution to our nation. pic.twitter.com/Ska0u301Nv— Narendra Modi (@narendramodi) January 23, 2022 India gratefully pays homage to Netaji Subhas Chandra Bose on his 125th birth anniversary. The daring steps that he took to fulfil his fierce commitment to the idea of a free India — Azad Hind — make him a national icon. His ideals and sacrifice will forever inspire every Indian.— President of India (@rashtrapatibhvn) January 23, 2022 -
బౌద్ధ గురు థిక్ నాక్ హాన్ మృతి
హనోయ్: ప్రముఖ బౌద్ధ గురువు, జెన్ సన్యాసి థిక్ నాక్ హాన్ 95 సంవత్సరాల వయసులో శనివారం మరణించారు. పశ్చిమ దేశాల్లో జెన్, బౌద్ధిజంను వ్యాపింపజేయడంలో ఆయన కృషి గణనీయం. థిక్ నాక్ హాన్ మృతికి ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. వియత్నాంలోని టు హైయు పగోడాలో ఆయన చివరి శ్వాస విడిచారు. 1926లో జన్మించిన థిక్ నాక్ హాన్ 16ఏళ్ల వయసులో సన్యాసం స్వీకరించారు. 1961లో ఆయన అమెరికా పర్యటనకు వెళ్లారు. 1966లో మార్జిన్ లూథర్ కింగ్ (జూ)తో పలు విషయాలపై చర్చలు జరిపారు. వియత్నాం అంతర్యుద్ధం నివారణకు ఆయన చేసిన కృషిని గుర్తించిన మార్టిన్, థిక్‌నాక్ పేరును నోబెల్ శాంతి బహుమతికి సిఫార్సు చేశారు. ఆ సమయంలో ఆయన తిరిగి వియత్నాం రాకుండా నిషేధం కూడా విధించారు. దీంతో ఫ్రాన్స్‌లో నిర్మించిన ప్లమ్ విలేజ్‌లో ఆయన ఎక్కువకాలం గడిపారు. జెన్ బుద్ధిజం ముఖ్యాంశాలను ఆయన విరివిగా ప్రచారం చేశారు. 2014లో ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. 2018లో ఆయన వియత్నాంకు వచ్చి చివరి వరకు అక్కడే కాలం గడిపారు. కరేజ్ ఆఫ్ కన్సైస్ (1991), పసెమ్ ఇన్ టెర్రిస్ పీస్ అండ్ ఫ్రీడం(2015) అవార్డులు ఆయన్ను వరించాయి. 2017లో ఎడ్యుకేషన్ యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ ఆయనకు గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. ఆయన చరిత్ర ఆధారంగా ద సీక్రెట్ ఆఫ్ 5 పవర్స్ అనే నవల కూడా వచ్చింది. స్వయంగా ఆయన కొన్ని చిత్రాల్లో, డాక్యుమెంటరీల్లో కనిపించారు. ఆయన మరణం తనను బాధిస్తోందని బౌద్ధ గురు దలైలామా విచారం వ్యక్తం చేశారు. -
ఫరీదుద్దీన్‌కు కన్నీటి వీడ్కోలు
జహీరాబాద్ టౌన్/ఝరాసంగం (జహీరాబాద్): అజాత శత్రువుగా పేరుగాంచిన మాజీ మంత్రి, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ ఫరీదుద్దీన్‌కు జనం కన్నీటి వీడ్కోలు పలికారు. సంగారెడ్డి జిల్లాలోని ఆయన స్వగ్రామమైన హోతి(బి) శ్మశానవాటిలో గురువారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. బుధవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గుండెపోటుతో కన్నుమూసిన ఫరీదుద్దీన్ పార్థివ దేహాన్ని రాత్రి ఆయన స్వగ్రామం హోతి (బి)కి తీసుకొచ్చారు. గ్రామస్తు ల సందర్శనార్థం గురువారం ఉదయం 10 గంట ల వరకు ఇంటివద్దనే ఉంచారు. తర్వాత ఆయన పార్థివ దేహాన్ని జహీరాబాద్ పట్టణంలోని బాగారెడ్డి స్టేడియానికి తీసుకువచ్చారు. కడసారి చూపుకోసం పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చా రు. అనంతరం ప్రత్యేక వాహనంలో ఆయన పార్థి వ దేహాన్ని ఉంచి ఊరేగింపుగా ఈద్గా మైదానం వద్దకు తీసుకెళ్లారు. పార్థనల తర్వాత హోతి(బి)లో సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలను పూర్తి చేశారు. పోలీసులు గౌరవ వందనం చేసి గాలిలో కాల్పులు జరిపారు. మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, ఎంపీ బీబీపాటిల్ పలువురు ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల నేతలు పొల్గొన్నారు. పార్టీకి తీరని లోటు: మంత్రి కేటీఆర్ మంచి మనిషి ఫరీదుద్దీన్ అకాల మరణం టీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఫరీదుద్దీన్ పార్థివ దేహానికి నివాళులు అర్పించిన తర్వాత మంత్రి మాట్లాడుతూ ఆయన మరణ వార్త వినగానే సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారన్నారు. ముఖ్యమంత్రికి స్వల్ప అనారోగ్యం వల్ల జహీరాబాద్‌కు రాలేకపోయారన్నారు. -
బిపిన్ రావత్‌కి వినూత్న నివాళి!... ఆకు పై ప్రతి రూపం చెక్కి!!
తమిళనాడులో హెలికాప్టర్ ప్రమాదంలో వీరమరణం పొందిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికకు పూర్తి సైనిక అధికార లాంఛనాలతో యావత్ భారత దేశం తుది వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అయితే ఈ తరుణంలో చాలా మంది ప్రముఖులు, సెలబ్రెటీలు, పౌరులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. (చదవండి: డొమినో ఎఫెక్ట్ గురించి ఆందోళన చెందడం లేదు!!) అందరికంటే భిన్నంగా ఇక్కడొక వ్యకి తన కళా నైపుణ్యంతో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్‌కి నివాళులర్పించాడు. ఈ మేరకు కళాకారుడు శశి అడ్కర్ అనే వ్యక్తి రావి ఆకుపై పై బిపిన్ రావత్ ముఖచిత్రాన్ని రూపొందించి నివాళులర్పించాడు. అంతేకాదు ఆ కళాకారుడు ఆకు కళను చేతితో భూమి నుంచి ఆకాశంలోకి చూపిస్తున్నట్లుగా పైకి లేపి వెనుక నుంచి 'తేరి మిట్టి' పాట బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అయ్యేలా ఒక వీడియోను తీసి మరీ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అయితే నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, ఐపిఎస్ అధికారి హెచ్‌జిఎస్ ధాలివాల్, నటుడు అనుపమ్ ఖేర్ వంటి ప్రముఖుల దృష్టిని ఆకర్షించింది. దీంతో కేంద్ర మంత్రి 'నీ కళాకృతికి సెల్యూట్" అని ఆ కళాకారుడిని ప్రశసిస్తూ ట్వీట్ చేశారు.ఈ క్రమంలో నెటిజన్లు కూడా స్పందిస్తూ... 'సీడీఎస్ జనరల్ శ్రీ బిపిన్ సింగ్ రావత్‌కు సెల్యూట్ ' అని ఒకరు, 'అల్విదా జనరల్ మీరు మా హృదయాలలో ఎల్లప్పుడూ సజీవంగా ఉంటారు' అని మరొకరు ఇలా రకరకాలుగా ట్వీట్ చేశారు. ఈ మేరకు సీడిఎస్ జనరల్ బిపిన్ రావత్‌కు నివాళులర్పించేందుకు ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తూ భారత సైన్యం ఇక వెబ్ లింక్‌ని కూడా జారీ చేసింది. (చదవండి: "సాయం" అనే పదానికి అంతరాలు ఉండవంటే ఇదేనేమో...!!) Salute! pic.twitter.com/BVb8grqpgX — Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) December 9, 2021 -
బిపిన్‌రావత్ తదితరులకు గవర్నర్ నివాళి
సాక్షి, హైదరాబాద్: హెలికాప్టర్ దుర్ఘటనలో మరణించిన జనరల్ బిపిన్‌రావత్, ఆయన భార్య, మరో 11 మంది సైనికుల పార్థివదేహాలకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గురువారం సూలూరు ఎయిర్‌బేస్‌లో ఘన నివాళి అర్పించారు. వెల్లింగ్టన్ మిలటరీ ఆస్పత్రిని సందర్శించిన ఆమె అక్కడ చికిత్స పొందుతున్న కెప్టన్ వరుణ్‌సింగ్ ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. -
హెలికాప్టర్ ప్రమాదం: అమర జవాన్లకు ప్రధాని మోదీ నివాళులు
-
ఫిల్మ్‌ఛాంబర్‌లో ‘సిరివెన్నెల’కు ప్రముఖుల నివాళి (ఫోటోలు)
-
Sirivennela: మహాప్రస్థానంలో ముగిసిన సిరివెన్నెల అంత్యక్రియలు
Live Updates: Sirivennela Sitaramasastry: మహాప్రస్థానంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు ఈ రోజు(బుధవారం) మధ్యాహ్నం 2:26 గంటలకు ముగిసాయి. హిందూ సాంప్రదాయాల ప్రకారం వేద పండితులు అంతక్రియల పక్రియ జరిపారు. ఫిల్మ్ ఛాంబర్ నుంచి మహా ప్రస్థానం వరకు అంతిమయాత్ర కొనసాగింది. అంతిమ యాత్రలో పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు సహా అభిమానులు పాల్గొన్నారు. ఫిల్మ్‌ఛాంబర్‌లో ఉన్న సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని భావోద్వేగానికి లోనయ్యారు. ఎలా వ్యక్తం చేయాలో తెలియడం లేదు: ఎన్టీఆర్ సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి జూనియర్ ఎన్టీఆర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొన్నిసార్లు మన మాటల్ని ఎలా వ్యక్తపరచాలో తెలియదు, ఆయన ఎన్నో పాటలు రాశారు. రాబోయే తరానికి ఈ పాటలు ఆదర్శవంతంగా ఉంటాయి. రాబోయే తరానికి ఆయన పాటలు బంగారు బాటలు. తెలుగుజాతి బతికున్నంత కాలం.. ఆయన సాహిత్యం బతికే ఉంటుంది అని ఎన్టీఆర్ పేర్కొన్నారు. ►సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి పవన్ కల్యాణ్ నివాళులర్పించారు.ఆయన మరణం చాలా బాధ కలిగించిందని, గొప్ప సాహిత్య సినీ గేయ రచయిత కనుమరుగు అయ్యారని పవన్ కల్యాణ్ అన్నారు. ఇలా కలుస్తాననుకోలేదు: దేవీశ్రీ ప్రసాద్ చాలారోజుల నుంచి కలవాలి అని అనుకుంటున్నాను. కానీ ఈ విధంగా కలుస్తాననుకోలేదు. మా నాన్నగారి తర్వాత నన్ను కొట్టేవారు, తిట్టేవారు ఆయన ఒక్కరే. అందరి గురించి ఆలోచించే వ్యక్తి ఆయన. నేను ఏమైనా పాట రాస్తే అది వివరించి చెప్పేవారు.కరోనా మా మధ్య దూరం పెంచింది. ►సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి సినీ నటుడు శ్రీకాంత్ నివాళులర్పించారు. ►రాజశేఖర్ సినిమాలకి ఆయన ఎన్నో పాటలు రాశారు. నేను ఆయనను చాలా మిస్ అవుతున్నాను అని జీవిత రాజశేఖర్ భావోద్వేగానికి లోనయ్యారు. ►సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు అని రాజశేఖర్ అన్నారు. సామాన్యులకి కూడా అర్థం అవుతాయి: తలసాని సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాళులర్పించారు.సిరివెన్నెల మరణం తెలుగు చిత్ర పరిశ్రమకే కాదు..అందరికీ బాధాకరం అని తలసాని అన్నారు. 'మూడు వేలకు పైగా పాటలు రాసిన గొప్ప వ్యక్తి. సిరివెన్నెల పాటలు అంటే పండుగ లాంటి పాటలు. పద్మశ్రీ, 11 నంది అవార్డులు రావడం ఎంతో గొప్ప వరం. సామన్యులకి కూడా అర్థం అయ్యేలా ఆయన పాటలు ఉంటాయి. ఈరోజు తెలుగు వారంతా బాధలో ఉన్నారు. సిరివెన్నెల కుటుంబసభ్యులు ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు ఉన్న రైటర్స్‌కి సిరివెన్నెల స్పూర్తి. తెలంగాణ ప్రభుత్వం తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం 'అని తలసాని అన్నారు. మంచి వ్యక్తిత్వం..ఆ పాట గుర్తొస్తుంది: నాగార్జున సిరివెన్నెలతో నాకు ఎప్పటి నుంచో స్నేహం ఉంది. తెలుసా మనసా అనే పాట నాకు గుర్తు వస్తుంది. ఆయన రాసే పాటలు, చెప్పే మాటలే కాదు ఆయన మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. స్వర్గానికి వెళ్లి దేవుళ్లకు కూడా ఇదే మాటలు వినిపిస్తూ ఉంటారు అది ఊహించడమే కష్టం: మహేశ్ బాబు సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి నివాళులర్పించిన సూపర్‌స్టార్ మహేశ్ బాబు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు లేకుండా తెలుగు పాటలు ఎలా ఉండబోతున్నాయనేది ఊహించడానికే కష్టంగా ఉంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా అని మహేశ్ అన్నారు. అందుకే విష్ణు రాలేదు: నరేశ్ 'తెలుగు సినీ పరిశ్రమకి బాలు, సిరివెన్నెల లాంటి వారు రెండు రధ చక్రాలను కోల్పోయాం. పెద్ద దిగ్గజాన్ని కోల్పోయాం. సమురు లేని దీపం కుండలా సినీ పరిశ్రమ మిగిలిపోయింది. బాబాయ్ కర్మకి విష్ణు వెళ్లారు. అందుకే రాలేదు' అని నరేశ్ అన్నారు. ప్రతిరోజూ ఆయన పాటలు వింటాం: సింగర్ కౌసల్య సిరివెన్నెలను కోల్పోవడం చాలా బాధాకరం.సమాజాన్ని ప్రభావితం చేసే పాటలు రాశారు.ఆయన పాటలు తెలియని ప్రజానీకం లేరు. ఆయనతో నేను చాలా పాటలు పాడాను. సిరివెన్నెల గారు రాసిన పాటలు ప్రతిరోజూ వింటూ ఉంటాం. ►సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి సినీ నటుడు జగపతిబాబు, సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ నివాళులు అర్పించారు. ►సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికిసింగర్ గీతామాధురి, నటుడు శివబాలాజీ నివాళులు అర్పించారు. ► ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి ఏపీ సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని నివాళర్పించారు. ఆయన కుటుంబసభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. జీర్ణించుకోలేకపోతున్నాను: సింగర్ సునీత 'సిరివెన్నెల సీతారామశాస్త్రి మొదటిసారి నిద్ర పోవడం చూస్తున్నాను. వరుస కథలు, ఆలోచనలతో బిజీగా ఉంటారు. ఆయన మృతిని జీర్ణించుకోలేకపోతున్నాను. చిన్న చిన్న పదాలతో ఎన్నో అర్థాలు చెప్పడం ఆయన సొంతం. మహానుభావుడు చరిత్ర సృష్టించి నిద్రలోకి జారుకున్నారు. సిరివెన్నెల చీకటి మిగిల్చి వెళ్లిపోయారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడ్ని కోరుకుంటున్నాను' అని సునీత పేర్కొన్నారు. శకం ముగిసింది: అల్లు అరవింద్ 'సరస్వతి పుత్రడు సిరివెన్నెల. మెన్నటి వరకు కూడా ఆయన ఎన్నో పాటలు రాశారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాకి కూడా పాటలు రాశారు. వేటూరి తర్వాత శకం ముగిస్తే...సిరివెన్నెల తర్వాత మరో శకం ముగిసింది. బన్నీ అంటే ఆయనకి విపరీతమైన ఇష్టం. ఎందుకో తెలియదు కానీ బన్నీతో గంటల తరబడి గడిపేవారు' అంటూ అల్లు అరవింద్ ఆయనతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అల్లు అర్జున్ నివాళులు సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహాన్ని సందర్శించిన అల్లు అర్జున్ ఆయనకు నివాళులు అర్పించారు కంటతడి పెట్టుకున్న బాలకృష్ణ 'ఒక నమ్మలేని నిజం. ఏం మాట్లాడాలో తెలియడం లేదు. తెలుగు భాషకి, సాహిత్యానికి ఒక భూషణుడు సిరివెన్నెల. తాను పుట్టిన నేలకి వన్నె తెచ్చిన వ్యక్తి ఆయన., సిరివెన్నెల లేరంటే చిత్ర పరిశ్రమ శోక సముద్రంలో ఉన్నట్లు ఉంది. సాకు సాహిత్యం అంటే ఇష్టం. మేం ఇద్దరం ఎన్నో విషయాలు మాట్లాడుకునేవాళ్లం. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. పుట్టినవారు గిట్టక తప్పదు.. కానీ 66 ఏళ్ళకి వెళ్ళారు' అంటూ బాలకృష్ణ కంటతడి పెట్టుకున్నారు. మంచి స్నేహితుడిని కోల్పోయా : మణిశర్మ 'జగమంత కుటుంబాన్ని వదిలేసి సిరివెన్నెల వెళ్లిపోయారు. మంచి సాహిత్యవేత్తతో పాటు మంచి వ్యక్తిని కోల్పోయాం. మంచి స్నేహితుడిని కోల్పోయాను' అని సంగీత దర్శకుడు మణిశర్మ భావోద్వేగానికి లోనయ్యారు. ఒక వటవృక్షం కూలిపోయింది: తనికెళ్ల భరణి 'సిరివెన్నెల భౌతికకాయాన్ని చూసి నటుడు తనికెళ్ల భరణి కన్నీటి పర్యంతమయ్యారు. ఎన్నోరోజులు కలిసి పనిచేశాం. ఒక వటవృక్షం కూలిపోయింది. ఇక అంతా శూన్యమే. దీన్ని భర్తీ చేయలేము. ప్రతిరోజూ నవ్వుతూ ఉండేవారు. ఆయన ప్రతీ పాట ప్రకాశిస్తుంది. సిరివెన్నెల లేని లోటు తీర్చలేం' అంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి రామజోగయ్య శాస్త్రి నివాళులర్పించారు. గుండె తరుక్కుపోతుంది: పరుచూరి 'పాటే శ్వాసగా జీవించిన వ్యక్తి సిరివెన్నెల. అన్నగారూ అంటూ ఆత్మీయంగా పలకరించేవారు. ఆయన లేడు అంటే గుండె తరుక్కుపోతుంది. ఆ మహానుభావుడు లేడంటే బాధగా ఉంది. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. వేటూరి తర్వాత స్థానం సిరివెన్నెలదే. సిరివెన్నెల ప్రతి పాట ఆణిముత్యం: సాయికుమార్ సిరివెన్నెల పార్థివదేహానికి సినీ నటుడు సాయికుమార్ నివాళులర్పించారు. 'ప్రతి అడుగులో నన్ను ఆశీర్వదిస్తూ వచ్చారు. ఆయన రాసే ప్రతి పాట ఆణిముత్యం. తెలుగు సాహిత్యానికి పట్టాభిషేకం చేసిన వ్యక్తి సిరివెన్నెల. ఎవడు సినిమాలో సిరివెన్నెల కుమారుడు నటించాడు. నేను విలన్ పాత్ర పోషించాను' అంటూ సాయికుమార్.. సిరివెన్నెలతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. పోలీసుల మీద పాట రాశారు: సజ్జనార్ సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. 'ఒక మంచి గేయ రచయితని కోల్పోయాం. రెండేళ్ల నుంచి సిరివెన్నెలతో నాకు పరిచయం. పోలీసుల మీద మంచి పాటలు రాశారు. పోలీసుల తరపున, టీఎస్ఆర్టీసీ తరపున ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం' అని సజ్జనార్ అన్నారు. సిరివెన్నెల లేరంటే సాహిత్యం చచ్చిపోయినట్లే: సి. కల్యాణ్ 'ఆరోజుల్లో సినిమా సాహిత్యం వేరు..ఇప్పుడు వేరు. సిరివెన్నెల సీతారామశాస్త్రి లేరంటే సాహిత్యం చచ్చిపోయినట్లే. ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేరు' అని నిర్మాత సి. కల్యాణ్ పేర్కొన్నారు. నారప్ప వరకు కలిసి పనిచేశాను: హీరో వెంకటేశ్ 'సిరివెన్నెల మరణవార్త ఎంతో బాధాకరం. ఎంతో మంచి వ్యక్తి. సర్ణకమలం నుంచి మొన్న వచ్చిన నారప్ప సిరివెన్నెలతో కలిసి పనిచేశాను. ఎంతో సన్నిహితంగా ఉండేవారు. సాహిత్యరంగంలో మనం ఓ లెజెండ్‌ను కోల్పోయాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను' అని వెంకటేశ్ అన్నారు. ఇంటి పెద్దను కోల్పోయినట్లు అనిపిస్తుంది: డైరెక్టర్ మారుతి 'ఇలా అవుతుందని అస్సలు ఊహించలేదు. గత ఐదారేళ్ల నుంచి ఆయన ఇంట్లో కుటుంబసభ్యుడిలా ఉంటున్నా. మా ఇంటి పెద్దను కోల్పోయినట్లు అనిపిస్తుంది. సిరివెన్నెల ఇంకా మనతోనే ఉన్నారు అనిపిస్తుంది. ఆయన పాటలు ప్రతిరోజూ వింటాం' అని మారుతి తెలిపారు. ఈ లోటు తీరేది కాదు: ఎస్వీ కృష్ణారెడ్డి 'సిరివెన్నెల లాంటి గొప్ప వ్యక్తి మనకు దొరకటం మన అదృష్టం. ఎన్నో సినిమాలకు ఆయన పాటలు రాశారు. ఆయన లోటు తీరేది కాదు' అని ఎస్వీ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
జయలలితకు నెచ్చెలి నివాళి
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సమాధి వద్ద ఆమె నెచ్చెలి శశికళ శశివారం నివాళులర్పించారు. ఇది సర్వసాధారణ విషయమైనా.. పార్టీని కైవసం చేసుకోబోతున్నట్లు శశికళ నుంచి సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో తమిళనాడులో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల శిక్ష అనుభవించి ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలయ్యారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజకీయ సన్యాసం పుచ్చుకుంటున్నట్లు ప్రకటించి ఇంటికే పరిమితమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓటమి చెందడంతో రాజకీయాలపై మరలా దృష్టి సారించడం ప్రారంభించారు. ఈనెల 17న అన్నాడీఎంకే శ్రేణులంతా స్వర్ణోత్సవాలకు సిద్ధమైన తరుణంలో శనివారం ఉదయం 10.30 గంటలకు అమ్మ సమాధి వద్దకు వెళ్లి శ్రద్ధాంజలి ఘటించారు. పదినిమిషాలు మౌనం పాటించి కన్నీళ్లు పెట్టుకున్నారు. కొన్నేళ్లుగా మోస్తున్న గుండెలోని భారాన్ని ఈరోజు దించుకున్నానని మీడియా వద్ద వ్యాఖ్యానించి ఇంటికి వెళ్లిపోయారు. అన్నాడీఎంకే కార్యాలయం వద్ద హై టెన్షన్ అమ్మ సమాధి వద్ద శశికళ నివాళులర్పించిన తరువాత నేరుగా అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయానికి వస్తారనే సమాచారంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో ఉదయం 10 గంటలకే పార్టీ నేతలు ప్రధాన గేటు వద్ద అడ్డుగా కూర్చున్నారు. అమ్మ సమాధి నుంచి శశికళ ఇంటికి చేరుకున్నారని నిర్ధారించుకున్న తరువాతే వారంతా వెళ్లిపోయారు. తమిళనాడు వ్యాప్తంగా అన్నాడీఎంకే స్వర్ణోత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహిస్తున్నారు. జైలు నుంచి జయలలిత దత్తపుత్రుడు విడుదల బనశంకరి: జయలలిత దత్తపుత్రుడు వీఎన్ సుధాకరన్ శనివారం బెంగళూరులోని పరప్పన జైలు నుంచి విడుదలయ్యారు. అక్రమాస్తుల కేసులో శశికళ కంటే ముందుగానే విడుదల కావలసిన సుధాకరన్ రూ.10 కోట్లు జరిమానా చెల్లించకపోవడంతో ఏడాది అదనంగా జైల్లో ఉన్నారు. ఆయన సుమారు 4 ఏళ్ల 9 నెలలు జైలులో ఉన్నారు. గత ఏడాది శశికళ, ఆమె బంధువు ఇళవరసి అదనపు జరిమానాను చెల్లించి విడుదలయ్యారు. శశికళ విడుదలై ఇంటికి వెళ్లాక ఒక్కసారి కూడా సుధాకరన్ను కలవకపోగా కనీసం ఫోన్ కూడా చేయలేదని సమాచారం. -
కొండా లక్ష్మణ్ బాపూజీకి సీఎం కేసీఆర్ నివాళి
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆయనకు ఘన నివాళి అర్పించారు. సోమవారం జరగనున్న బాపూజీ 106వ జయంతి సందర్భంగా ఆయన చేసిన స్ఫూర్తిదాయక నిస్వార్థ సేవలను సీఎం స్మరించుకున్నారు. సాయుధ పోరాట కాలంలో చాకలి ఐలమ్మతో సహా పలువురికి న్యాయవాదిగా సేవలందించి వారి తరఫున న్యాయపోరాటం చేసిన ప్రజాస్వామిక వాది బాపూజీ అని కొనియాడారు. దేశ స్వాతంత్రోద్యమంలో పాల్గొని, ప్రత్యేక తెలంగాణ కోసం సాగిన అన్ని పోరాటాల్లో అదే స్ఫూర్తిని కొనసాగించిన కొండా లక్ష్మణ్ బాపూజీ, దేశం గర్వించదగ్గ గొప్ప నేత అని ఆదివారం ఒక ప్రకటనలో కొనియాడారు. అణగారిన వర్గాల హక్కుల సాధనకు, సహకార రంగాల పటిష్టతకు తన జీవితకాలం కృషి చేశారన్నారు. బహుజన నేతగా.. దేశవ్యాప్తం గా పద్మశాలీలను సంఘటితం చేసిన ఘనత కొండా లక్ష్మణ్ బాపూజీకే దక్కిందన్నారు. బా పూజీ జయంతి, వర్ధంతులను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదన్నారు. -
నాన్న ఫేవరెట్ పంచె, వాచ్ : నాగ్ భావోద్వేగ పోస్ట్
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ సినీ వినీలాకాశంలో ధృవతారలా వెలిగిన నటుడు అక్కినేని నాగేశ్వరరావు. యావత్ప్రపంచం గర్వపడేలా అగ్రకథానాయకుడిగా విరాజిల్లిన కళామతల్లి ముద్దుబిడ్డ ఏఎన్ఆర్. దేవదాసు అయినా, కాళిదాసు అయినా, అమర ప్రేమికుడైనా ఆయనొక లెజెండ్. అందుకే అనేక అవార్డులు ఆయనకు సలాం చేశాయి. 75 వసంతాలకు పైగా వెండి తెరను సుపంపన్నం చేసిన ఎఎన్ఆర్ జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ఆయన నటవారడు టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున తన తండ్రికి ట్విటర్ ద్వారానివాళులర్పించారు. ఆయనే తన హీరో, స్పూర్తి అంటూ ఒక వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. ఆయనకు పంచె అంటే ఎంతో ఇష్టమని, ముఖ్యంగా పొందూరు ఖద్దరుఅంటే ఎంతో ఇష్టమని పేర్కొన్నారు. ఆయన పంచె కట్టు అందాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకే అంటూ తన అప్‌కమింగ్ మూవీ బంగార్రాజు లుక్‌ను జోడించారు. కాగా నాగార్జున 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాకు సీక్వల్గా 'బంగార్రాజు' సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్టైనర్గా రానున్న ఈ సినిమాలో నాగార్జునతో పాటు యంగ్ హీరో నాగ చైతన్య కూడా అలరించనున్నారు. నాగ్‌కు జోడీగా రమ్యకృష్ణ, నాగ చైతన్య సరసన ఉప్పెన ఫేం బ్యూటీ కృతి శెట్టి నటిస్తోంది Remembering dear Nana! My hero!! My inspiration!! #ANRLivesOn pic.twitter.com/CgHKCLwObY — Nagarjuna Akkineni (@iamnagarjuna) September 20, 2021 -
రియల్ తలైవికి.. రీల్ తలైవి నివాళి
చెన్నై: రియల్ తలైవికి రీల్ తలైవి నివాళుల ర్పించారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్రతో రూపొందుతున్న తలైవిలో టైటిల్ రోల్‌ను పోషించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఈనెల 10న విడుదలకు సిద్ధమైంది. చిత్ర ప్రమోషన్లో భాగంగా శనివారం చెన్నైకు చేరుకున్న నటి కంగనా రనౌత్ స్థానిక మెరీనా తీరంలోని జయలలిత సమాధి వద్దకు చేరుకుని నివాళి అర్పించారు. అనంతరం ఎంజీఆర్, కరుణానిధి సమాధులను దర్శించుకున్నారు. -
యూపీ మాజీ సీఎం కల్యాణ్‌సింగ్‌కు ప్రధాని మోదీ నివాళి
లక్నో: యూపీ మాజీ సీఎం కల్యాణ్ సింగ్ పార్థివదేహానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. ఆదివారం ఉదయం ఉత్తరప్రదేశ్‌కు చేరుకున్న ప్రధాని మోదీ.. కల్యాణ్ సింగ్ నివాసానికి వెళ్లి ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పించారు. అంతకుముందు లక్నో చేరుకున్న ప్రధానికి మోదీకి.. గవర్నర్ ఆనందిబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వాగతం పలికారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ తొలితరం నాయకుడైన కల్యాణ్ సింగ్ శనివారం రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. 89 ఏళ్ల కల్యాణ్ సింగ్ జూలై 4 నుంచి సంజయ్‌గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎస్జీపీజీఐ)లో చికిత్స పొందుతున్నారు. చేరినప్పటినుంచి ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. కానీ పలు అవయవాలు పనిచేయకుండా పోవడం, సెప్సిస్ (రోగనిరోధక వ్యవస్థ సొంత కణజాలంపై దాడి చేయడం)తో ఆయన మరణించారని ఎస్జీపీజీఐ తెలిపింది. -
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు
సాక్షి, సిద్దిపేట: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా సిద్ధిపేటలోని జయశంకర్ విగ్రహానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పూల మాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జయశంకర్ తన జీవింతాంతం పాటుపడ్డారని గుర్తు చేశారు. రాష్ట్ర ఏర్పాటే ఏకైక ఎజెండాగా తెలంగాణ భావజాల వ్యాప్తికి నిరంతరం కృషి చేశారని కొనియాడారు. జయశంకర్ ఆశయాల సాధనకు చిత్తశుద్ధితో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఆయన చేసిన సూచనలు, సలహాలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకాలని పేర్కొన్నారు. యావజ్జీవితాన్ని తెలంగాణ ఉద్యమానికే ధారపోశారని చెప్పారు. జయశంకర్ జీవితం యువతకు ఆదర్శం, స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు. నివాళులు అర్పించిన పలువురు ప్రముఖులు ► ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి మంత్రి జగదీష్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. ► ఢిల్లీ తెలంగాణ భవన్లో ఆచార్య జయశంకర్ సార్ 87వ జయంతి వేడుకలకు ఎంపీలు బండ ప్రకాష్, బీబీ పాటిల్, కవిత, వెంకటేష్ నేత, బడుగుల లింగయ్య యాదవ్, పసునూరి దయాకర్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి హాజరయ్యారు. ► హోంమంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ విప్ బాల్కసుమన్, ఎమ్మెల్యే కోరుకుంటి చందర్, సింగరేణి కార్మికసంఘం నేతలు ప్రొ. జయశరంకర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న మంత్రి హరీష్ రావు ► అడిషనల్ డీజీ పర్సనల్ శివధర్ రెడ్డి, వెల్ఫేర్ ఉమేష్ ష్రాఫ్, ఆర్గనైసేషన్ రాజీవ్ రతన్, ఏ.ఐ.జి. రాజేంద్ర ప్రసాద్. ఇతర అధికారులు, సిబ్బంది జయశంకర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ► ఆచార్య కొత్తపల్లిలో జయశంకర్ చిత్ర పటానికి డీజీపీ కార్యాలయంలో పోలీసులు ఉన్నతాధికారులు నివాళులు అర్పించారు. -
'చిన్నారి పెళ్లికూతురు' బామ్మ చేసిన మొదటి ఉద్యోగం ఇదే..
ఆమె నానమ్మగా వేసిన ‘బాలికా వధు’ 2248 ఎపిసోడ్స్‌తో దేశంలోనే సుదీర్ఘంగా సాగిన టీవీ సీరియల్‌గా రికార్డు స్థాపించింది. మొన్నటి ‘బధాయి హో’ సినిమాలో 50 ఏళ్ల కోడలు గర్భం దాలిస్తే ఆ కోడలిని అత్తగారి పాత్రలో ఆమె అక్కున చేర్చుకున్న తీరు అద్భుతం. సురేఖ సిక్రి (75) అంటే నాటక, టీవీ, సినిమా రంగంలో ఒక విశిష్టమైన పేరు. ఒక పరంపరకు ప్రతినిధి. సిక్రి శుక్రవారం కన్ను మూసింది. ఆమెకు నివాళి. దూరదర్శన్‌లో విఖ్యాతమైన ‘తమస్’ సీరియల్లో ఒక దృశ్యం. ఒక వృద్ధ సిక్కు జంట నిలువ నీడ లేక ఒక ఇంటి తలుపు తడుతుంది. ఆ సిక్కు జంటకు ఇల్లు లేదు. దారి లేదు. గమ్యం లేదు. దేశంలో దారుణమైన అల్లర్లు జరుగుతున్నాయి. ఎవరు ఎవరిని హత మారుస్తున్నారో తెలియదు. పోనీ ఎందుకు హతమారుస్తున్నారో తెలియదు. మనిషి కళ్లేలు ఉన్నంత వరకే మనిషి. వదిలితే మృగం. ఆ వృద్ధజంటను గడప దగ్గర చూసిన ‘రాజో’ అనే ముస్లిం మహిళ పాత్రలో ఉన్న సురేఖ సిక్రి ‘మా ఇంట్లో చోటు లేదు వెళ్లండి’ అంటుంది. వాళ్లు నిరాశతో తిరిగి వెళ్లిపోతుంటే తమాయించుకోలేక ‘ఆశపడి వచ్చారు ఆ పై గదిలో దాక్కోండి’ అని చోటు ఇస్తుంది. అన్నం పెడుతుంది. ‘నా మొగుడికి దేవుడంటే భయం ఉంది. మిమ్మల్ని ఏమి అనడు. కాని నా కొడుకు సంగతి చెప్పలేను’ అని తాపత్రయ పడుతుంది. కొడుకు వస్తాడు. ఈ సిక్కు జంటను చూసి మండిపడతాడు. వాళ్లను వెళ్లగొట్టడానికి ప్రయత్నిస్తాడు. కాని ఒక హృదయమున్న స్త్రీ, సిక్రి, ఊరుకుంటుందా? బెబ్బులిలా తిరగబడుతుంది. ఆ ముసలి జంట పక్షాన నిలుస్తుంది. ఆ సన్నివేశంలో సురేఖా సిక్రి నటన చూడాలి. అలాంటి ఇలాంటి నటన కాదు. 2018లో వచ్చిన సూపర్‌హిట్ సినిమా ‘బధాయి హో’లో సురేఖ సిక్రి చివరి రోజులలో ఉన్న వృద్ధురాలు. ఇంటి పెద్ద. కొడుకు, కోడలు, వయసొచ్చిన మనవలు... అలాంటి టైమ్‌లో, 50 ఏళ్ల వయసులో కోడలు గర్భం దాల్చిందన్న వార్త ఆమెకు తెలుస్తుంది. ఇదేమి చోద్యం? ఈ వయసు లో. కొడుకును తిట్టిపోస్తుంది. కోడల్ని గదిలో వేసి తాళం పెడుతుంది. అయ్యో.. ఏమి ఖర్మరా అని బాధ పడుతుంది. కాని తల్లి గర్భం దాల్చిందని నామోషీ ఫీలైన పెద్ద కొడుకు ఆమెకు దూరంగా ఉంటున్నాడన్న విషయం తెలుసుకుని, ఒక సహజమైన సహజాతమైన విషయానికి కోడలు మాటలు పడుతోందని సాటి స్త్రీగా అర్థం చేసుకొని తానే మొదట ఆ గర్భాన్ని అంగీకరించి ఆహ్వానిస్తుంది. మన ఇళ్లల్లో కనిపించే వృద్ధుల మనస్తత్వాన్ని, రూపాన్ని, స్వభావాన్ని అద్భుతంగా ప్రదర్శిస్తుంది సురేఖ సిక్రి ఆ పాత్రలో. ఏళ్ల తరబడి ‘కలర్స్ టీవీ’లో ఆ తర్వాత డబ్బింగ్ ద్వారా ప్రాంతీయ భాషలలో ప్రసారమైన ‘బాలికా వధు’లో ఆమె నానమ్మ పాత్రలో నటించింది. ఆమె ఆ కథలో ఎంత సేపటికి తన మనవడి పక్షం. అందుకని ఆ మనవణ్ణి చేసుకున్న చిన్నారిని అదలిస్తుంది. బెదిరిస్తుంది. దారికి తేవడానికి చూస్తుంది. కాని కథ గడిచే కొద్దీ మనవడు సరైన వాడు కాదని గ్రహించి చిన్నారి పెళ్లి కూతురుకు పెద్ద సపోర్ట్‌గా మారుతుంది. అంతేకాదు ఆ పెళ్లి కూతురు తన మనవణ్ణి వదిలి మరో కుర్రాణ్ణి పెళ్లి చేసుకోవడానికి కూడా సహకరిస్తుంది. సురేఖ సిక్రి పాత్రలు ఇలాంటి పాత్రల వల్ల ప్రేక్షకులకు గుర్తుండిపోయాయి. సురేఖ సిక్రీ ఒక కాలంలో వచ్చిన ఉత్తమ నటులు నసీరుద్దిన్ షా, ఓం పురి, రఘువీర్ యాదవ్... వీళ్ల సమకాలికురాలు. అలిగర్లో తల్లి టీచర్‌గా పని చేయడం వల్ల అలిగర్ యూనివర్సిటీలో చదువుకుంది. అక్కడే ఉర్దూ కవిత్వం అంటే ఆమెకు ప్రేమ ఏర్పడింది. ఆ తర్వాత ఢిల్లీ ‘నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా’లో మూడేళ్ల నటనలో కోర్సు చేసి అక్కడి రెపట్రీలో నాటకాలు వేస్తూ వేయిస్తూ 15 సంవత్సరాలు గడిపింది. ఆ తర్వాత ముంబై వచ్చి సినిమాల్లో పని చేసింది. ‘సలీమ్ లంగ్డే పే మత్ రో’, ‘మమ్నో’, ‘నసీమ్’, ‘సర్దారీ బేగమ్’, ‘మిస్టర్ అండ్ మిసెస్’ అయ్యర్ వంటి సినిమాల్లో ఆమె మంచి పాత్రలు పోషించింది. మూడు సార్లు జాతీయ ఉత్తమ నటి అవార్డు పొందింది. ‘ఆమె నాటకాలు వేస్తుంటే తొంగి తొంగి చూసి ఆమెలా నటించాలని ఎన్.ఎస్.డిలో నేను అనుకునేదాన్ని’ అని నటి నీనా గుప్తా అంది. వీరిద్దరూ కలిసి ‘బధాయీ హో’లో నటించారు. తెలుగులో ‘ఉయ్యాల జంపాల’ సినిమా హీరోయిన్గా నటించిన అవికా గోర్ ‘బాలికా వధు’లో చిన్నారి పెళ్లికూతురిగా నటించింది. ‘నా నట జీవితం అటువంటి శిఖరంతో మొదలుకావడం నా అదృష్టం’ అని అవికా గోర్ అంది. సురేఖ సిక్రికి నటుడు నసీరుద్దిన్ షాకు బంధుత్వం ఉంది. సిక్రి సవతి చెల్లెలు పర్వీన్ మురాద్‌ను నసీరుద్దిన్ మొదటి వివాహం చేసుకున్నాడు. వీళ్లిద్దరికి షీబా షా అనే కుమార్తె ఉంది. షీబా షా సురేఖ సిక్రితో కలిసి నటించింది. ‘ఒక మంచి నటికి రెండులైన్ల డైలాగ్ ఉన్న పాత్ర దొరికినా ఆ రెండులైన్లను ఎంత బాగా చెప్పొచ్చు.. ఆ లైన్ల వెనుక కథ ఏమిటి... ఆ లైన్లకు ఎలా న్యాయం చేయాలి... ఇవి ఆలోచించి నటించినట్టయితే తప్పక ఆత్మతృప్తి పొందవచ్చు’ అంటుంది సురేఖ సిక్రి. కవిత్వం మీద తన అభిమానాన్ని ఉర్దూ స్టూడియో, హిందీ స్టూడియోలలో గొప్ప గొప్ప కవుల కవిత్వాన్ని చదివి రికార్డు చేసి ఆమె మనకు కానుకగా ఇచ్చింది. భారతీయ నటనా రంగం చూసిన ఒక ఉత్తమ కవిత సురేఖ సిక్రి. ‘బధాయీ హో’లో... ‘తమస్’ సీరియల్లో... ‘బాలికా వధు’ సీరియల్లో... -
తెలుగుజాతి తెగువకు నిలువెత్తు నిదర్శనం అల్లూరి : సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తెలుగుజాతి తెగువకు నిలువెత్తు నిదర్శనమైన మన్యం వీరుడు అల్లూరి జీవితం తరతరాలకు స్ఫూర్తిదాయకమని సీఎం వైఎస్ జగన్ కొనియాడారు. ఈ మేరకు ‘ప్రజల హక్కుల కోసం, స్వాతంత్య్ర పోరాటం కోసం బ్రిటీష్ సామ్రాజ్యమనే మహాశక్తిని ఢీకొన్న విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు. తెలుగుజాతి తెగువకు నిలువెత్తు నిదర్శనమైన మన్యం వీరుడు అల్లూరి జీవితం తరతరాలకు స్ఫూర్తిదాయకం. అల్లూరి జయంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నా’ అని ట్విటర్లో పేర్కొన్నారు. pic.twitter.com/9F27TMUqMT — YS Jagan Mohan Reddy (@ysjagan) July 4, 2021 -
మిల్కాసింగ్ అస్తమయం: బావురుమన్న అభిమానులు
సాక్షి, న్యూఢిల్లీ : పరుగుల వీరుడు, లెజండరీ అథ్లెట్ మిల్కాసింగ్ (91) అస్తమయం అటు క్రీడాభిమానులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. అటు "ఫ్లయింగ్ సిక్’’ మిల్కా సింగ్ మరణంపై రాజకీయ, వ్యాపార, సినిమా రంగ ప్రముఖులను విస్మయానికి గురిచేసింది. దాదాపు నెల రోజులపాలు కరోనా మహమ్మారితో పోరాడిన ఆయన కోలుకున్న అనంతరం కరోనా సంబంధిత సమస్యలతో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై మరణంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇతర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. గత ఐదు దశాబ్దాలుగా ఎందరికో స్పూర్తిగా నిలిచిన మిల్కా సింగ్ నిష్క్రమణతో ప్రపంచ వ్యాపప్తంగా ఆయన అభిమానులో శోకసంద్రంలో ముగినిపోయారు. ఇంకా రాజకీయ, క్రీడా వ్యాపార ప్రపంచానికి చెందిన అనేక మంది ప్రముఖులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. క్రీడా దిగ్గజాలు ట్విటర్ వేదికగా నివాళులర్పించారు. ‘మీ మరణం ప్రతి భారతీయుడి హృదయంలో తీవ్ర శూన్యతను మిగిల్చింది, కాని మీరు రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలుస్తారు" అని ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ నివాళులర్పించారు. ‘ మీ మరణం విచారకరం. దిగులు మేఘాలు ఆవరించాయి’ అంటూ పరుగుల రాణి పీటీ ఉష సంతాపం తెలిపారు. ఇంకా సునీల్ చేత్రి, సురేష్ రైనా, అనిల్‌కుంబ్లే, జస్ప్రీత్ బుమ్రా, వెంకటేశ్ ప్రసాద్ తదితరులు ట్విటర్ ద్వారా తమ విచారాన్ని వ్యక్తం చేశారు. (ప్రపంచ అథ్లెటిక్స్‌లో మిల్కాసింగ్‌ది చెరగని ముద్ర: సీఎం జగన్) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Dark clouds of sadness prevail with the demise of my idol and inspiration Milkha Singhji. His story of sheer determination and hard work inspired millions and will continue to do so. As a tribute to him, students of Usha School paid homage to the legend. Rest in Peace 🙏 pic.twitter.com/mLBQQ2ge3v — P.T. USHA (@PTUshaOfficial) June 19, 2021 A hero, an inspiration, a legend. His legacy will live on for generations to come. Rest in Peace, Milkha Singh sir. — Jasprit Bumrah (@Jaspritbumrah93) June 18, 2021 ఇంకా ప్రముఖ వ్యాపార వేత్త మహీంద్రా గ్రూప్ డైరెక్టర్ ఆనంద్ మహీంద్ర కూడా ట్విటర్ ద్వారా మిల్కాసింగ్ మరణంపై విచారం వ్యక్తం చేశారు. ‘మిల్కా సింగ్ గొప్పదనాన్ని మా తరం ఎలా వివరించగలదు? ఆయన అథ్లెట్ మాత్రమే కాదు. వలసవాదం నుండి బయటపడిన తరువాత కూడా అసురక్షితంగా ఉన్న సమాజానికి ప్రతీక…మనం ప్రపంచంలోనే అత్యుత్తముడు ఆయన. తమకెంతో విశ్వాసాన్నిచ్చిన ఆయనకు ధన్యవాదాలు. ఓం శాంతి’ అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. (దిగ్గజ అథ్లెట్ మిల్కాసింగ్ కన్నుమూత) How can my generation explain what Milkha Singh meant to us? He wasn’t just an athlete. To a society still suffering the insecurities of post-colonialism he was a sign that we could be the best in the world. Thank you, Milkha Singhji, for giving us that confidence. Om Shanti 🙏🏽 — anand mahindra (@anandmahindra) June 18, 2021 స్ప్రింటర్ మిల్కా సింగ్ మరణంపై బాలీవుడ్, టాలీవుడ్, ఇతర సినీరం ప్రముఖులు కూడా నివాళులు అర్పించారుబాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఆయన మరణం తీవ్రవిచారం వ్యక్తం చేశారు. నటి ప్రియాంక చోప్రా దేశానికి ఆయన చేసిన సేవలను మరవలేనివంటూ సింగ్‌తో తనతొలి సమావేశాన్ని గుర్తు చేసుకున్నారు. ప్లయింగ్ సిక్ భౌతికంగా దూరమైనా ఆయన ఉనికి సజీవమే. తనతోపాటు లక్షలాది మంది ప్రేరణ రెస్ట్ ఇన్ పీస్ మిల్కా సింగ్ సార్ అని పేర్కొన్నారు. తాప్సీ ‘ఫ్లయింగ్ సిఖ్ మనకు దూరమై పోయారంటూ ట్వీట్ చేశారు. Incredibly sad to hear about the demise of #MilkhaSingh ji. The one character I forever regret not playing on-screen! May you have a golden run in heaven, Flying Sikh. Om shanti, Sir 🙏🏻 — Akshay Kumar (@akshaykumar) June 19, 2021 Warm and welcoming, you made our first meeting so so special. I have been inspired by your excellence, touched by your humility, influenced by your contribution to our country. Om Shanti #Milkha ji. Sending love and prayers to the family. #MilkhaSingh — PRIYANKA (@priyankachopra) June 18, 2021 Deeply saddened by the passing away of sports legend #MilkhaSingh. A monumental loss for our nation.. His incredible legacy will continue to inspire athletes all the over the world. Rest in peace sir. 🙏 — Mahesh Babu (@urstrulyMahesh) June 19, 2021 కాగా దేశంలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం రేపింది. అనేక కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. మిల్కా సింగ్ భార్య, ఇండియన్ ఉమెన్ నేషనల్ వాలీబాల్ జట్టు మాజీ కెప్టెన్ నిర్మల్ మిల్కా సింగ్ (85) ఈ నెల13న కోవిడ్ కారణంగానే కన్నుమూయడం విషాదం. మిల్కా సింగ్‌కు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అతని కుమారుడు జీవ్ మిల్కా సింగ్ కూడా ప్రఖ్యాత గోల్ఫ్ క్రీడాకారుడు. -
హాస్యం ఒక ఇమ్యూనిటీ బూస్టర్
ఏ ప్రత్యేకతా లేకపోవడమే మధ్యతరగతి ప్రత్యేకత. ఏదైనా ప్రత్యేకత కోసం ప్రయత్నించడం కూడా మధ్యతరగతి ప్రత్యేకతే. కవిత్వం చదవడమో కొత్త వంట నేర్చుకోవడమో సంగీతం సాధన చేయడమో ‘క’ భాషో, కలం స్నేహమో ఏవైనా హాస్యాలు తెచ్చేవే. మందహాసాలు పూయించేవే. కోవిడ్ మన పెదాల మీద నవ్వులు దోచుకుపోయింది. నవ్వు చాలా పెద్ద ఇమ్యూనిటీ బూస్టర్. జంధ్యాల వర్థంతి సందర్భంగా ఆయన నవ్వులు తలుచుకుని ఆ కామిక్ టానిక్ తాగుదామా? ఔత్సాహికులతో కొంచెం గడబిడే. వీళ్లు తమకు ఫలానాది వచ్చు అని గట్టిగా నమ్ముతారు. ఫలానాది నిజంగా తెలిసినవాళ్లు గతుక్కుమంటారు. ‘చారు ఎలా చేయాలో ఒక పాత్ర చేత చెప్పించి కథ అంటావా’ అంటాడు పొట్టి ప్రసాద్ ‘చంటబ్బాయ్’లో శ్రీలక్ష్మితో. ఏమో. అది కథెందుకు కాదు. ‘నెత్తికి రీటా కాలికి బాటా నాకిష్టం సపోటా’ ఇది కూడా కవిత్వమే అని అనుకుంటుంది శ్రీలక్ష్మి. కాని పొట్టి ప్రసాద్ మాత్రం ‘నీకూ నాకూ టాటా... నన్నొదిలెయ్ ఈ పూట’ అని పారిపోవడానికి చూస్తాడు. ‘మనిషికి కాసింత కళాపోషణ ఉండాలి’ అని పూర్వం ముళ్లపూడి మునివర్యుడు అన్నాడు నిజమే. ఆ పోషణ ఎదుటివారి ప్రాణాలకై సాగే అన్వేషణ కారాదు కదా. పెళ్లిచూపులకు వచ్చిన సుత్తి వీరభద్రరావు నోరు మూసుకుని పిల్లను చూసి ఊరుకోకుండా ‘నాకు పాటలు పాడేవారం టే ఇష్టం’ అని అంటాడు పెళ్లికూతురైన శ్రీలక్ష్మి తో. అది శ్రీలక్ష్మి మనసులో పడిపోతుంది. నాకు పాట రాకపోయినా ఇతను పెళ్లి చేసుకున్నాడు.. ఇతన్ని ఏనాటికైనా నా పాటతో మెప్పిస్తాను అని హార్మోనియం పెట్టె ముందేస్కోని సా.. కీ.. కే...ఙ అనే రాగం తీస్తూ ఉంటుంది. భరించువాడు భర్తే అయితే సుత్తి వీరభద్రరావు నిజంగా భర్తే. అయితే ఈ కళలలో రాణించాలనే పిచ్చి స్త్రీలకే ఉండదు. పురుషులకు కూడా ఉంటుంది. ‘నడుస్తోంది నడుస్తోంది నడుస్తోంది జీవితం’ అని కవిత్వానికి తగులుకుంటాడు సుత్తి వీరభద్రరావు తాను కవి అని నమ్మి ‘పుత్తడిబొమ్మ’ సినిమాలో. ఊళ్లో ఎవరైనా పెళ్లి చేసుకుంటే అతడు పంచ రత్నాలు చదివిస్తాడు. ‘రంగ పెళ్లికొడుకు... గంగ పెళ్లికూతురు.. కిష్టిగాడు గంగ తండ్రి... వీరమ్మ రంగ తల్లి... ఇక మున్ముందు కిష్టిగాడు రంగమామ.. వీరమ్మ గంగ అత్త.. గంగను సింగారించి రంగకు జత కలిపారు... ’ ఇలా సాగుతుంది సుత్తి కవిత్వం. జనం ఇలా కాదని అతన్ని శిక్షించడానికి ఏకంగా ఏనుగునే బహూకరిస్తారు. ఏంటో.. బతుకులిలా ఏడుస్తున్నాయి అని అంటారుగాని అవి ఏడుస్తున్నాయా? వెతికితే ఎంత నవ్వు. ‘లేడీస్ స్పెషల్’లో శ్రీలక్ష్మి ఇంటికి ఎవరొచ్చినా తంటే. ఉదాహరణకు పోస్ట్‌మేన్ వచ్చి లెటర్ ఇస్తే అతణ్ణి పరీక్షగా చూసి ‘మీరు కనకమేడల సుందర్రావు కదూ’ అంటుంది. అతను ఆశ్చర్యపోతాడు. ‘మీకెలా తెలుసు’ అంటాడు. ‘నేను కుక్కమూతుల కుటుంబరావు గారి అమ్మాయిని. మీరు నన్ను పెళ్లిచూపులు చూసెళ్లిన పద్నాలుగో పెళ్లికొడుకు. ఆ రోజు మా అమ్మగారు మీకు తొక్కుడులడ్లు కారప్పూసా పెట్టారు. నేను సామజ వర గమనా పాడుతుంటే మీరు పారిపోయారు’ అని గుర్తు చేస్తూ ఉంటుంది. ఆమె పాటను గుర్తు చేసుకుని అతడు హడలిపోతూ ‘అది చెవిలో విషప్రయోగమండీ’ అంటాడు. సినిమా పిచ్చోళ్లు కూడా ఉంటారు ఇళ్లల్లో. భర్తకు సినిమా చూసే తీరిక ఉండదు. భార్యకు సినిమా కథ చెప్పక మనసు ఆగదు. ‘శ్రీవారి ప్రేమలేఖ’లో భర్త నూతన్ ప్రసాద్‌కు భార్య శ్రీలక్ష్మి తాను చూసొచ్చిన సినిమా కథలు చెబుతుంటుంది. కాని ఎలా? టైటిల్స్ నుంచి. ‘ఏబిసిడిఇఎఫ్ ప్రొడక్షన్స్ వారి ‘చిత్రవధ’.. కథానువాదం, దర్శకత్వం– శకుని, తారాగణం– జబ్బర్, ఉన్ని.. ’ ఆమె చెప్పే కథలకు సూపర్ ఫ్లాప్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్ల కంటే ఎక్కువ బాధ నూతన్ ప్రసాద్‌కు. సగటు జీవితాల్లో తిప్పలను చూసి ఏడ్వలేక నవ్వాడు దర్శకుడు జంధ్యాల. వాటిని చూపించి, ఎగ్జాగరేట్ చేసి నవ్వించే ప్రయత్నం చేశాడు. చెప్పిందే చెప్పే పెద్దవాళ్లను ‘సుత్తి’ చేశాడు. ఆ దెబ్బలకు నలిగిపోయే వాళ్లకు కూడా ఒక చాన్స్ ఇచ్చి ‘రివర్స్ హామరింగ్’ వేసే చాన్స్ ఇచ్చాడు. కోడిని వేళ్లాడగట్టి అదే చికెన్ కర్రీ అని తినేసేవాళ్లను, మొగుని వొంటి మీద బట్టలు తప్ప తక్కినవన్నీ స్టీలు సామాన్ల వాడికేసి స్పూన్లు గరిటెలు తీసుకునే సాధ్వీమణులను, చనిపోయిన సంతానాన్ని తలుచుకుంటూ ప్రతివాడిని ‘బాబూ చిట్టీ’ అని కావలించుకునే వెర్రిబాగుల పాత్రలను చూపి కాసేపు హాయిగా నవ్వించాడు. నవ్వడం ఒక భోగం అన్నాడు జంధ్యాల. మార్కెట్లో ఇప్పుడు రకరకాల ఇమ్యూనిటీ బూస్టర్లు అమ్ముతున్నారు. కాని హాస్యం అనే గొప్ప ఇమ్యూనిటీ బూస్టర్లను రెగ్యులర్‌గా ఇస్తూ తెలుగు వారి ఆరోగ్యాన్ని సుసంపన్నం చేసిన వాడు జంధ్యాల. ఎన్ని కష్టాలు ఉన్నా నవ్వడం మర్చిపోకూడదు. నవ్వే మనిషినే ఇష్టపడతాడు మనిషి. నవ్వే మనిషిని చూసి ధైర్యం తెచ్చుకుంటాడు. తోడు నవ్వుదామని చూస్తాడు. నవ్వుతూ ఉందాం. ఇటీవలి బాధల్ని వేదనల్ని భయాలను పూర్తిగా మర్చిపోయేంత వరకూ మంచి హాస్యాన్ని మూడు పూటలా తీసుకుంటూనే ఉందాం. – సాక్షి ఫ్యామిలీ -
ఘంటసాల రత్నకుమార్‌కు ఘన నివాళి
కొరుక్కుపేట(తమిళనాడు): అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు కుమారుడు ఘంటసాల రత్నకుమార్‌కు పలువురు తెలుగు ప్రముఖులు ఘన నివాళులు అర్పించారు.నవసాహితీ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి వర్చువల్ విధానం ద్వారా ఘంటసాల రత్నకుమార్ సంస్మరణ సభను నిర్వహించారు. తనకంటూ ప్రత్యేకత స్థానాన్ని సంపాదించుకున్న రత్నకుమార్ దూరం కావడం తెలుగువారికి, సినీ పరిశ్రమకు తీరనిలోటని వ్యాఖ్యానించారు. ఘంటసాల జయంతి, వర్ధంతిని అధికారికంగా రెండు తెలుగు రాష్ట ప్రభుత్వాలు, పొట్టి శ్రీరాములు మెమోరియల్ కమిటీ జరపాలని కోరారు. అలాగే తెలుగువారికి చారిత్రాత్మక చిరునామాగా నిలిచిన ఆంధ్రాక్లబ్ ఆవరణంలో ఘంటసాల విగ్రహం స్థాపించాలన్నారు. వచ్చే డిసెంబర్లో ప్రారంభమయ్యే ఘంటసాల శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆ మహనీయునికి మనం అర్పించగల నివాళి ఇదే అని నవ సాహితీ ఇంటర్నేషనల్ తీర్మాణం చేసింది. వర్చువల్ విధానంలో జరిగిన ఈ కార్యక్రమంలో నవ సాహితీ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు సూర్యప్రకాష్‌రావు, ఝాన్సీ లక్ష్మి, శ్రీలక్ష్మి, ఏపీ చాప్టర్ అధ్యక్షులు పద్మశ్రీ డాక్టర్ కూటి కుప్పల సూర్యారావు, చెన్నైలోని తెలుగు ప్రముఖులు జేకే రెడ్డి, సీఎంకే రెడ్డి, మాధవపెద్ది సురేష్, శ్రీదేవి రమేష్ లేళ్లపల్లి, మాధురి, డాక్టర్ లక్ష్మీప్రసాద్, గుడిమెట్ల చెన్నయ్య, కందనూరు మధు, మాధవపెద్ది మూర్తి, భువనచంద్ర, డాక్టర్ మన్నవ గంగాధరప్రసాద్ పాల్గొన్నారు. -
సమాజం లెక్క తేల్చిన కథల మేష్టారు
ఆయన వృత్తిరీత్యా లెక్కల మాష్టారు. కాని సమాజంలో ప్రతిదానికీ ఒక లెక్క ఉంటుందని, ఒక లెక్కను పెద్దవాళ్లు కలిసి నిర్ణయిస్తారని, ఆ పెద్దవాళ్లకు రెండు రెళ్లు ఆరనీ, కింద వాళ్లకు శేషం సున్నా అనీ ఆయన స్కూల్లో పిల్లలకు కాకుండా కథల్లో పాఠకులకు చెప్పారు. మనుషులు ఈసురోమని ఉంటే అందుకు కారణం ఆ సదరు మనుషులు కారని వెనుక ఎక్కడో ఉండే మనుషులని ఆయన చెప్తారు. తెలుగు కథను ఉన్నతీకరించిన కాళీపట్నం రామారావు 97వ ఏట జీవించి అస్తమించారు. ఆయన రచనలు, ఆయన రచనా పరిశ్రమ ప్రతి తెలుగు ‘ఫ్యామిలీ’కి తెలిసి ఉండాలి. పోస్ట్‌మేన్ ఇంటికి ఉత్తరాలు తెచ్చి ఇస్తాడు. పోలీసు ఇంటికి రక్షణ కల్పిస్తాడు. ఇంజినీరు ఇల్లు కడతాడు. ప్రభుత్వ అధికారి ఇల్లు నడవడానికి అవసరమైన సంఘపరమైన కార్యకలాపాలు నిర్వహిస్తాడు. వీరంతా సమాజంతో ఉంటూ సమాజం కోసం పని చేస్తూ సమాజంలో భాగంగా ఉంటారు. కాని ఈ సమాజం ఎలా ఉందో ఎవరు చెప్తారు? కథకుడే చెప్తాడు. సమాజాన్ని చూసి సమాజానికి దానిని తిరిగి చూపిస్తాడు కథకుడు. సమాజం ఎలా ఉందో రాసేవాణ్ణి రచయిత అనొచ్చు. అలా ఎందుకు ఉందో రాసేవాణ్ణి మంచి రచయిత అనొచ్చు. అలా ఉండకుండా ఏమి చేయవచ్చో రాసి పాఠకులను ఆలోచనాశీలురుగా, కర్తవ్యోన్ముఖులుగా చేసే రచయితను గొప్ప రచయిత అనొచ్చు. కాళీపట్నం రామారావు అలాంటి గొప్ప రచయిత. మనం ఏం చేయాలో ముందు నిర్ణయించుకోవడం అందుకు తగ్గట్టుగా జీవితాన్ని నిర్మించుకోవడం అందరూ చేయరు. కాళీపట్నం రామారావు తన వివాహం అయ్యాక, 1947 నాటి కాలంలోనే 80 రూపాయల జీతం వచ్చే స్పోర్ట్స్ డిపోలోని ఉద్యోగానికి రాజీనామా చేశారు. కారణం అది కథలు రాసుకోవడానికి అవసరమైన టైమ్ ఇవ్వదని. 30 రూపాయల జీతం వచ్చే ప్రభుత్వ ఉపాధ్యాయుడి జీతం ఎంచుకున్నాడాయన. తెలుగు కథ తనకు అవసరమై ఆయన జీవితాన్ని రూపుదిద్దుకుందా అనిపిస్తుంది. 1979లో ఆయన రిటైరయ్యారు. అది కూడా కథ చేసుకున్న ఒక ఏర్పాటే. ఎందుకంటే ఆ తర్వాతి సమయమంతా ఆయన తెలుగు కథకే ఇచ్చారు. దాదాపు 30–35 ఏళ్లు తెలుగు కథ ప్రచారానికి, సేకరణకి, భద్రపరచడానికి వెచ్చించారు. దేని నుంచి పొందామో దానికే తిరిగి ఇవ్వడం చేసిన అరుదైన రచయిత కాళీపట్నం రామారావు. శ్రీకాకుళం చైతన్యధార ప్రపంచంలో గొప్ప రచయితలందరూ జీవితంలో రకరకాల పనులు చేసినవారే. శ్రీకాకుళం జిల్లా మురపాక ప్రాంతానికి చెందిన కాళీపట్నం ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా కుదురుకునేంత వరకూ రకరకాల పనులు చేశారు. టైపిస్ట్‌గా, డిస్ట్రిక్ట్ కోర్టులో చిరుద్యోగిగా, రేషనింగ్ ఆఫీసులో ఎంక్వయిరీ ఆఫీసరుగా ఇలా రకరకాల పనులు చేశారు. పత్రికల్లో పని చేయాలని ఆయనకు గట్టిగా ఉండేది. మద్రాసు (చెన్నై) వెళ్లి ప్రయత్నించినా జరగలేదు. సాహిత్యం పట్ల ఏర్పడిన ఆసక్తి ఆయనను కథకుడిగా ఉండమని కోరింది. 1943లో ఆయన మొదటి కథ ‘ప్లాట్‌ఫారమో?’ అచ్చయ్యింది. ఆ తర్వాత ఆయన కొన్ని కథలు రాసినా ఇవి కాదు కదా రాయాల్సింది అని అనిపించింది. ఆలోచన కలిగించనిది కథ ఎలా అవుతుంది అని ఆయన అనుకున్నారు. పాఠకులకు ఆలోచన కలిగించాలంటే రచయితకు చదువు, అవగాహన, జ్ఞానం, హేతువు, సైద్ధాంతిక భూమిక, ప్రాపంచిక దృక్పథం ఇవన్నీ ఉండాలి కదా అని అధ్యయనంలో పడ్డారు. 1955 నుంచి దాదాపు ఎనిమిదేళ్లు కథలు రాయకుండా పూర్తిగా అధ్యయనంలో ఉండిపోయారు. 1964లో ‘తీర్పు’ కథతో అసలైన కాళీపట్నం రామారావు తెలుగు పాఠకలోకానికి తెలిశారు. 1966లో ఆయన రాసిన ‘యజ్ఞం’ కథ తెలుగు సాహిత్యానికి చూపు, ఊపు ఇచ్చింది. ‘కథ ఎందుకు?’, ‘కథ ప్రయోజనం ఏమి?’, ‘కథ నడిచే మార్గం ఎలా ఉండాలి’ ఈ ప్రశ్నలన్నింటికి ఆ కథ ఒక మార్గదర్శిగా నిలిచింది. సామాజిక సమస్యలు, అంతర్గత ఆరాటాలు శరీరం మీద పీడన మనసు మీద పడుతుంది. మనసు పడే వొత్తిడి శరీరానికి హాని కలిగిస్తుంది. వ్యవస్థ గతి వ్యవస్థది మాత్రమే కాదు. ఆ గతిలో సమాజంలోని ప్రతి పౌరుడు భాగం. ఆ గతి మతి తప్పితే ఆ పౌరుడు బాధితుడవుతాడు. ఆ పౌరుడే ఇంటికొస్తే వ్యక్తిగా మారి అంటే తండ్రిగా, భర్తగా, కుమారుడిగా వొత్తిడి ఎదుర్కొంటాడు. ఈ రెంటినీ కాళీపట్నం రామారావు కథగా చేసి తెలుగు పాఠకులకు చూపారు. గుప్పిట విప్పేసినట్టుగా రాయడం ఆయన పద్ధతి కాదు. సూచించినట్టుగా పొరల చాటున దాచినట్టుగా ఆయన పరమసత్యాన్ని నిగూఢపరిచి దానిని తానే కనుగొన్న సంతృప్తిని పాఠకునికి ఇస్తారు. పౌరహితం కోరుతున్నట్టు కనిపించే ఈ సామాజిక వ్యవస్థ నిజానికి మేడిపండు. ఇది పైకి మంచిగా కనిపిస్తూ లోపల పీడితుల రక్తాన్ని తాగుతూ ఉంటుందని ఆయన రాసిన ‘యజ్ఞం’ కథ నాటి సామాజిక, ఆర్థిక మూలాల కఠినత్వాన్ని చూపింది. ఈ కథ ముగింపులో నిస్సహాయుని ఆగ్రహ ప్రకటనగా బాధితుడు తన ఇంటి పిల్లాడి తల నరకడాన్ని రచయిత చూపిస్తాడు. నేటికీ అదే జరుగుతోంది.. బలవంతుడైన పీడకునితో పోరాటానికి దిగితే మనకు ఆపద ఎదురవుతుంది. అప్పుడు మనవాళ్లే వచ్చి మన చెంప మీద ఒక దెబ్బ కొట్టి ఆ పోరాటం నుంచి విరమింప చేస్తారు. అయితే పోరాటం వొద్దనా? కాదు ఒకరూ ఒకరూ ఒకరూ కాక అందరు కలిసినప్పుడు బలవంతుడు తోక ముడుస్తాడన్న సూచన ఉంది అందులో. ఆ భాష, ఆ సొగసు కాళీపట్నం రామారావు కేవలం ప్రగతిశీల కథ రాసి ఉంటే ఇంత ఖ్యాతి వచ్చి ఉండేది కాదు. ఆయన తాను పుట్టి పెరిగిన శ్రీకాకుళం మీద తన కథలను నిలబెట్టి ఆ స్థానికతే విశ్వజనీయత అనే భావనతో కథలు చెప్పారు. శ్రీకాకుళపు భాషను ఆయన సొగసుగా సంభాషణల్లో దించారు. ముఖ్యం శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రికి మల్లే ఆయన కూడా స్త్రీల పాత్రలకు ఎంతో సజీవమైన సంభాషణలను సమకూర్చారు. ‘నో రూమ్’, ‘ఆర్తి’, ‘చావు’, ‘జీవధార’, ‘భయం’... ఈ కథలన్నీ ఇందుకు ఉదాహరణ. ‘జీవధార’ కథలో పైకి నీటి సమస్య వస్తువుగా కనపడుతుంది. మురికివాడ వాసులకు తాగునీళ్లు ఉండవు. దాపులో ఒక శ్రీమంతుల ఇంటిలో కావల్సినన్ని నీళ్లు. మురికివాడ ఆడవాళ్లు రోజు ఆ శ్రీమంతుల గేటు దగ్గరకు వచ్చి నీళ్లు అడుగుతూ ఉంటారు. ఆ శ్రీమంతులు చీదరించుకుంటూ ఉంటారు. చీదరించుకుంటూ ఉంటే ఆ ఆడవాళ్లు కొన్నాళ్లు పడతారు... మరి కొన్నాళ్లు సహిస్తారు... దప్పికతో ప్రాణం పోతుంటే ఏం చేస్తారు? తిరగబడతారు. అంతమంది తిరగబడితే ఆ శ్రీమంతులు నీళ్లేం ఖర్మ ఏమైనా ఇచ్చి తోక ముడవరూ? బాధితులందరూ కలిసి తిరగబడాలి... పీడితులందరూ కలిసి తిరగబడాలి... మైనార్టీ సమూహాలు అన్నీ కలిసి తిరగబడాలి... అని రచయిత సూచన. ఏదీ ఊరికే రాదు. ‘సాధించుకోవాలి’ ఈ వ్యవస్థ నుంచి. సాధించుకోవడం మెత్తగా సాధ్యం కాదు ఎప్పటికీ. దీపధారి కాళీపట్నం రామారావు ‘విరసం’ (విప్లవ రచయితల సంఘం) ఏర్పడినప్పటి నుంచి దాదాపు 15 ఏళ్లు అందులో క్రియాశీల సభ్యులుగా ఉన్నారు. రావిశాస్త్రి, వరవరరావు, కె.వి.రమణారెడ్డి వంటి ఉద్దండులతో ఆయన కలిసి పని చేశారు. తెలుగునాట విప్లవ కథ విస్తృతం కావడంలో అల్లం రాజయ్య, తుమ్మేటి రఘోత్తమరెడ్డి వంటి రచయితలు సిద్ధం కావడానికి మరోవైపు మధ్యతరగతి కథను ముందుకు తీసుకెళ్లడంలో వివిన మూర్తి, కవనశర్మ తదితరులు ముందంజ వేయడానికి కాళీపట్నం రామారావు స్ఫూర్తిగా నిలిచారు. ఆయనకు ‘సాహిత్య అకాడెమీ’ వచ్చినా తిరస్కరించారు. కొత్త కథకులను సిద్ధం చేసేందుకు ఊరూరు తిరిగి వర్క్‌షాపులు పెట్టారు. కథామెళకువలు చెప్పే వ్యాసాలు రాసి పుస్తకాలు వెలువరించారు. ఈ సమయంలోనే ఆయన ‘కథల మేష్టారు’గా గౌరవం పొందసాగారు. కథానిలయం 1996 ప్రాంతంలో నిజానికి ఎవరైనా సరే విశ్రాంత జీవనం కోరుకునే వయసులో ఆయన ‘కథానిలయం’ అనే బృహత్కార్యానికి శ్రీకారం చుట్టారు. ఆయన ఈ ఆలోచన చెప్పినప్పుడు ముందు హేళన, ఆ తర్వాత సంశయం, ఆ తర్వాత అంగీకారం పొందారు. తెలుగులో వచ్చిన కథలన్నీ ఒక్కచోట చేరాలి అని ఆయన చేసిన ఆలోచన ఇవాళ తెలుగువారికి ఒక విలువైన భాండాగారాన్ని సిద్ధం చేసింది. శ్రీకాకుళంలో ఆయన రెండస్తుల ‘కథా నిలయం’ కట్టడానికి కథాభిమానులు తలా ఒక ఇటుక ఇచ్చారు. ఇందుకోసమై హైదరాబాద్ రవీంద్రభారతిలో పెద్ద కార్యక్రమం చేసి కాళీపట్నంకు ‘లక్ష రూపాయల’ పర్స్ అందజేశారు. తెలుగులో వచ్చిన వీక్లీలు, మంత్లీలు, కథాసంకలనాలు, వాటితో పాటు రచయితల డేటా, వారు రాసిన కథల పట్టిక ఇవన్నీ చాలా పెద్ద పని. కాళీపట్నం తన భుజాల మీద వేసుకు చేశారు. ఆ తర్వాత ఆ ఆలోచన ఆ మొత్తం కథలను డిజిటలైజ్ చేయడం వైపు మళ్లింది. ఇవాళ ‘కథానిలయం’ వెబ్సైట్లో వేలాది కథలు డిజిటలైజ్ అయి ఉన్నాయి. విద్యార్థులకు, అధ్యయనం చేయాలనుకునేవారికి ఆ సైట్ ఒక అతి పెద్దసోర్స్. ఏనాటి కథలో, కథకులో తెలుసుకోవాలంటే ఆ సైట్‌కు వెళ్లక తప్పదు. మరో భాషకు ఇలాంటి సైట్ ఏమాత్రం లేదు. ఇది తెలుగువారి ఘనత. ఇందుకు కారకులు కాళీపట్నం. నిరంతర అధ్యయన శీలి కాళీపట్నం రామారావు నిరంతర అధ్యయనంలోనే ఉన్నారు. 96 ఏళ్లు వచ్చినా కన్ను కనిపించినంత సేపు చదవడానికే ఇష్టపడ్డారు. శ్రీకాకుళంలో కాళీపట్నం రామారావు తమ కథను చదివి మెచ్చుకుంటే అదే పెద్ద అవార్డుగా యువ కథకులు భావిస్తారు. ఆయన నిరంతరం కొత్త కథకులను ప్రోత్సహిస్తూనే వచ్చారు. 2006లో రాసిన ‘అన్నెమ్మ నాయురాలు’ ఆయన చివరి కథ. తెలుగు కథ పయనంలో కాళీపట్నం అస్తమయం వల్ల ఒక శకం ముగిసింది. అలాంటి రచయిత, కథా కార్యకర్త మరొకరు సిద్ధం కావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. తెలుగు కథ ఉన్నంత వరకూ తప్పక కాళీపట్నం ప్రస్తావన, శ్రీకాకుళం ఉనికి ఉంటూనే ఉంటుంది. ఆ మహా కథకునికి నివాళి. కమిటెడ్ రైటర్ కాళీపట్నం రామారావును నిబద్ధ రచయితగా చెబుతారు. నిబద్ధతకు ఒక ఉదాహరణగా చూపుతారు. తన చేతిలో ఉన్న కథను, అక్షరాన్ని దేనికి నిబద్ధం చేయాలో ఎంత మేరకు చేయాలో ఆయన్ను చూసి నేర్చుకోవాలని అంటారు. కనపడిందంతా, తోచిందంతా రాయడం కాళీపట్నం ఏనాడూ చేయలేదు. పొద్దుపోక రాయడం చేయలేదు. కాలక్షేపం కోసం రాయడాన్ని అసలు చేయలేదు. ఒక సత్యాన్ని కనుగొని ఆ సత్యానికి అవసరమైన కథను, పాత్రలను ఎంచుకుని, ఒక ప్రయోజనాన్ని ప్రతిపాదించి, ఒక చూపును ఇవ్వగలిగే కథ రాయగలిగినప్పుడే రాశారు. అందుకే ఆయన ముఖ్యమైన కథలు ఒక డజనుకు మించవు. అయినా సరే అవి వంద కథలకు సమానమైన ఖ్యాతి పొందాయి. – సాక్షి ఫ్యామిలీ -
కారా మాస్టారు కన్నుమూత: సీఎం జగన్ సంతాపం
సాక్షి, శ్రీకాకుళం: కారా మాస్టారుగా ప్రసిద్ధి పొందిన ప్రముఖ రచయిత కాళీపట్నం రామారావు కన్నుమూశారు. కథానిలయం వ్యవస్థాపకులు, కేంద్రసాహిత్య అవార్డు గ్రహీత శ్రీకాకుళంలోని స్వగృహంలో శుక్రవారం తుదిశ్వాస విడిచారు. దీంతో తెలుగు సాహితీలోకం తీవ్ర దిగ్ర్భాంతిలో మునిగిపోయింది. కథా సాహిత్యానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకొంటూ రచయితలు, కవులు, కళాకారులు నివాళులర్పించారు. ఆయన లేని లోటు ఎన్నటికీ పూడ్చలేనిదంటూ పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కథకు చిరునామాగా, 'కథానిలయం' పేరుతో భావి తరాల కోసం సాహితీ సంపదను కాపాడిన సాహితీ మూర్తి కారా మాస్టారు అంటూ కొనియాడారు. 1924లో శ్రీకాకుళం జిల్లా మురపాకలో జన్మించారు కాళీపట్నం రామారావు. తన దైన శైలిలో రచనా వ్యాసంగాన్ని కొనసాగించిన ఆయన వేలాది మంది శిష్యులు, అభిమానులను సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా 1964లో రాసిన యజ్ఞం కథ ఆయన విశేష ఖ్యాతిని తీసుకొచ్చింది. కథా రచయితగా తెలుగు రచనల ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత ఆయనది. ఫ్యూడల్ వ్యవస్థలోని దోపిడికి ‘యజ్ఞం’ అద్దంపడుతుంది. అందుకే ఈ రచన రష్యాలో అనువదింపబడి ప్రపంచ గుర్తింపు పొందింది. భావితరాలను దృష్టిపెట్టుకుని ఫిబ్రవరి 22, 1997లో శ్రీకాకుళంలో కథానిలయం స్థాపించారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ద్వారా సమకూరిన డబ్బు, మరికొందరు సాహితీవేత్తల సహకారంతో 800 కథల పుస్తకాలతో ఆరంభమైన ఈ కథా నిలయం లక్ష పుస్తకాలతో అలరారుతుండటం విశేషం. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన ఆయన సరళమైన రచన శైలితో వేలాది అభిమానులను ఆకట్టుకున్నారు. కుట్ర, రాగమయి, జీవధార, కారా కథలు, రుతుపవనాలు వంటి ఆయన రచనలూ ఆదరణ పొందాయి. సీఎం జగన్ సంతాపం సాహిత్య అకాడమీ గ్రహీత, కారా మాస్టారుగా పేరొందిన కాళీపట్నం రామారావు మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విచారం వ్యక్తంచేశారు. చిన్న కథలతో, తనదైన కథా శైలితో ఆకట్టుకున్న ఉత్తరాంధ్రలోని సాహిత్యకారుల్లో ఆయన ప్రముఖుడని సీఎం గుర్తు చేశారు. కారా మాస్టారు కుటుంబ సభ్యులకు సీఎం వైఎస్ జగన్ తన సంతాపాన్ని తెలియజేశారు. -
శ్యామ్ కుటుంబానికి వైఎస్సార్సీపీ అండ
సాక్షి, కేవీపల్లె : బెంగళూరులో ఈ నెల 12న కరోనాతో మృతి చెందిన వైఎస్సార్ సీపీ నేత, పార్టీ ఐటీ వి భాగం ప్రధాన కార్యదర్శి కలకడ శ్యామ్‌సుందర్‌రెడ్డి అలియాస్ శ్యామ్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి అన్నారు. ఆదివారం శ్యామ్ స్వగ్రామం కేవీపల్లె పంచాయతీ మూల కొత్తపల్లెలో ఆయన కు పెద్దకర్మ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యామ్ సమాధి వద్ద పార్టీ కండువా, పూల మాలలతో నివాళులర్పించారు. అనంతరం శ్యామ్ సతీమణి సుప్రియతోపాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు పని చేసిన శ్యామ్‌ను కరోనా కబలించడం దురదృష్టకరమన్నారు. ఐటీ విభాగంలో చురుగ్గా పనిచేసి పార్టీ విజయానికి విశేష కృషి చేశారని తెలిపారు. శ్యామ్ మృతి పార్టీకి తీరని లోటన్నారు. పార్టీ ప రంగా శ్యామ్ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా నిలుస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ వెంకటరమణారెడ్డి, పార్టీ యువజన విభాగం కన్వీనర్ గజ్జెల శీన్ రెడ్డి, నాయకులు జయరామచంద్రయ్య, రామకొండారెడ్డి, చిన్నయర్రమరెడ్డి, సహదేవరెడ్డి, సై ఫుల్లాఖాన్, వేణుగోపాల్‌రెడ్డి, శ్రీనివాసులు, హ రి, సిరినాయుడు, గౌస్ పాల్గొన్నారు. -
చిత్రసీమ ఆత్మబంధువు బి.ఎ. రాజు ఇకలేరు
ప్రముఖ సినీ జర్నలిస్ట్, పీఆర్ఓ, నిర్మాత బి.ఎ. రాజు (61) ఇకలేరు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని తన నివాసంలో ఉన్న ఆయన అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ శుక్రవారం గుండెపోటుతో కన్నుమూశారని బి.ఎ. రాజు కుమారుడు, దర్శకుడు శివకుమార్ తెలిపారు. విజయవాడలో పుట్టిన బి.ఎ. రాజుకి హీరో కృష్ణ అంటే అభిమానం. కృష్ణ వద్ద పనిచేయాలని చెన్నై వెళ్లారు రాజు. కృష్ణ వద్ద పబ్లిసిటీ వ్యవహారాలు చూసే పీఆర్ఓగా కెరీర్‌ని ప్రారంభించిన ఆయన ఆ తర్వాత కృష్ణ ప్రోత్సాహంతో సినీ జర్నలిస్ట్‌గా మారారు. జ్యోతిచిత్ర, ఆంధ్రజ్యోతి, ఉదయం, శివరంజని వంటి దిన, వార పత్రికల్లో జర్నలిస్ట్‌గా చేశారు. 1994లో తన భార్య, జర్నలిస్ట్ బి. జయతో కలసి ‘సూపర్‌హిట్’ వారపత్రికను ప్రారంభించారు. తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు ఇతర భాషల్లోని ఎందరో హీరోలు, నిర్మాతలు, దర్శకులకు, 1500 సినిమాలకుపైగా పీఆర్ఓగా చేశారు. నాటి తరంలో కృష్ణతో మొదలుపెట్టి ఆ తర్వాతి తరంలో చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, బాలకృష్ణ, ఆ తర్వాతి తరంలో ప్రభాస్, మహేశ్‌బాబు, ఎన్టీఆర్.. ఇలా పలువురు అగ్రకథానాయకుల చిత్రాలకు పీఆర్వోగా చేశారు. ‘కృష్ణగారి సినిమాలకు చేశాను.. వారి అబ్బాయి మహేశ్‌బాబు చిత్రాలకు చేస్తున్నాను.. భవిష్యత్తులో మహేశ్ అబ్బాయి గౌతమ్ హీరో అయినా తన సినిమాలకు కూడా చేస్తాను’ అంటుండేవారు రాజు. నిర్మాతగా మారి, తన భార్య జయ దర్శకత్వంలో ‘చంటిగాడు, గుండమ్మగారి మనవడు, వైశాఖం’ వంటి సినిమాలు నిర్మించారాయన. ‘ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్’ అధ్యక్షునిగానూ చేశారు బి.ఎ. రాజు. కాగా 2018లో రాజు భార్య, దర్శకురాలు జయ గుండెపోటుతో కన్నుమూశారు. ఆయనకు కుమారులు అరుణ్ కుమార్, శివకుమార్ ఉన్నారు. ఇద్దరూ సినీ ఇండస్ట్రీలోనే ఉన్నారు. అరుణ్ కుమార్ వీఎఫ్ఎక్స్ నిపుణుడు. శివ కుమార్ దర్శకుడు. తన దర్శకత్వంలో తెరకెక్కిన ‘22’ సినిమా విడుదల కరోనా లాక్డౌన్ వల్ల వాయిదా పడింది. ఇటు పాత్రికేయులకు అటు చిత్రసీమకు మధ్య వారధిగా ఉన్న రాజు హఠాన్మరణం పాత్రికేయులకు, చిత్రసీమకు ఓ షాక్. బి.ఎ. రాజు అంత్యక్రియలు శనివారం మహాప్రస్థానంలో జరిగాయి. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే రాజు ఇక లేరంటే నమ్మశక్యంగా లేదని, అందరి ఆత్మబంధువులా మెలిగిన ఆయన లేని లోటు తీర్చలేనిదని పాత్రికేయులు, సినీ ప్రముఖలు సంతాపం వ్యక్తం చేశారు. ప్ప్రముఖుల నివాళి మద్రాసులో ఉన్నప్పుడు సినీ పరిశ్రమకు సంబంధించిన ఎన్నో విశేషాల్ని బి.ఎ. రాజు నాతో షేర్ చేసుకునేవారు. సంవత్సరాల క్రితం విడుదలైన క్లాసిక్స్‌కి సంబంధించిన కలెక్షన్స్, ట్రేడ్ రిపోర్టు రికార్డుల గురించి చెప్పగల గొప్ప నాలెడ్జ్ బ్యాంక్ ఆయన. ఎన్‌సైక్లోపిడియాలా సమాచారం అందించేంత ప్యాషన్ ఉన్న పత్రికా జర్నలిస్ట్. రాజుగారిలాంటి వ్యక్తి ఉండటం పరిశ్రమ అదృష్టం. – చిరంజీవి బి.ఎ. రాజుగారితో నాకు ఎప్పటినుంచో మంచి అనుబంధం ఉంది. ఇకపై ఆయన మన మధ్య ఉండరనే వార్త కలచివేసింది. – బాలకృష్ణ 37 సంవత్సరాలుగా నా శ్రేయోభిలాషి, ప్రియ మిత్రుడు బి.ఎ. రాజు లేని లోటు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీరనిది. – నాగార్జున చెన్నైలో ఉన్నప్పటి నుంచే రాజుగారితో నాకు పరిచయం ఉంది. సినిమా అంటే తపన ఉన్న జర్నలిస్ట్ ఆయన. నిర్మాతగానూ నిలబడ్డారు ఆయన. – పవన్ కల్యాణ్ వృత్తిపరమైన అనుబంధం హద్దులు లేని ప్రేమతో వ్యక్తిగత అనుబంధంగా ఎలా మారుతుందో చూపించిన వ్యక్తి రాజుగారు. – సూర్య తెలుగు, తమిళ చిత్రాల మధ్య మంచి వారధి వేసిన బి.ఎ. రాజు గుర్తుండిపోతారు. – విక్రమ్ నేను అన్నయ్యలా భావించే రాజుగారి మరణం నన్నెంతగానో కలచివేసింది. నా కెరీర్ అంతా ఆయన నన్ను ప్రోత్సహిస్తూనే ఉన్నారు. – విశాల్ బి.ఎ. రాజు.. నువ్వు లేని తెలుగు సినిమా మీడియా, పబ్లిసిటీ ఎప్పటికీ లోటే.. నువ్వు తెలుగు సినిమా ఇండస్ట్రీకి అందించిన సేవలు గుర్తుండిపోతాయి. – కె.రాఘవేంద్రరావు ఫిల్మ్ జర్నలిస్టుగా, 1500 సినిమాలకు పీఆర్వోగా చేసిన అనుభవం ఉన్న బి.ఎ. రాజులాంటి సీనియర్ వ్యక్తిని ఇండస్ట్రీ కోల్పోవడం బాధాకరం. – ఎస్.ఎస్. రాజమౌళి సూపర్‌స్టార్ కృష్ణగారి అభిమానుల ఉత్తరాలకు ప్రత్యుత్తరాలు ఇచ్చే వ్యక్తిగా బి.ఎ. రాజుగారు నాకు పరిచయం అయ్యారు. కృష్ణగారి ‘సింహాసనం’ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్న రోజులవి. బి.ఎ. రాజు ‘కొడుకుదిద్దిన కాపురం’ సినిమా పోస్టర్స్ డిజైన్ చేస్తున్న సమయంలో నేను ‘శివ’ సినిమా పోస్టర్స్ డిజైనింగ్‌లో ఉన్నాను. బీఏ రాజుతో పాటు ఆయన చిరునవ్వు ఎప్పటికీ గుర్తుండిపోతుంది – దర్శకుడు తేజ బి.ఎ. రాజుగారు వేడుకల్లోనే కాదు... ఇబ్బందుల్లోనూ మాతో ఉన్నారు. సినిమాలంటే ఉన్న ప్రేమతోనే ఆయన కృష్ణగారికి దగ్గరయ్యారు. అదే ప్రేమను మహేశ్‌పైనా చూపించారు. మా సినిమాలకు సంబంధించిన ఏ చిన్న వేడుకయినా ఆయన పూలతో వచ్చేవారు. అలాంటిది ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్ని ఓ పువ్వును సమర్పించుకో లేనందుకు బాధగా ఉంది. మా హృదయాల్లో నిలిచే ఉంటారు. – నమ్రత నా జీవితంలో సానుకూలమైన ఆలోచనల కాంతిని వెలిగించిన వ్యక్తి బీఏ రాజుగారు. సినిమా హిటై్టనా.. ఫ్లాప్ అయినా ఆయన చెప్పే మాటలు కొత్త ఉత్సాహాన్ని నింపేవి. – సమంత -
మధుర గాయకుడు జి.ఆనంద్‌కు అంతర్జాలంలో ఘననివాళి
టెక్సాస్: ప్రపంచంలోని ఏడు దేశాలనుంచి పలువురు ప్రముఖులు, కరోనాతో పరమపదించిన మధురగాయకులు జి.ఆనంద్ గారికి అంతర్జాలంలో బాధాతప్త హృదయంతో నివాళులర్పించారు. ఐదు దశాబ్ధాలుగా సినీ సంగీత రంగంలో గాయకుడిగా కొనసాగి,"స్వరమాధురి’ సంస్థను స్థాపించి ప్రపంచ వ్యాప్తంగా 6500కుపైగా కచేరీలు నిర్వహించారు. ఎంతో మంది గాయనీ, గాయకులను ఆయన తయారు చేశారు. ఆనంద్ కరోనా సమయంలో సరైన వైద్య సదుపాయం అందక మరణించిన తీరును అందరూ ప్రస్తావిస్తూ కళాకారుల జాతి సంపదని వారిని కాపాడు కోవలసిన అవసరం ప్రతి దేశానికి వున్నదని అన్నారు. కరోనా విపత్కర సమయంలో కళాకారులను ప్రత్యేకంగా ఆదుకునే విధానం ప్రభుత్వాలు పరిశీలించాలని ఆనంద్‌కు నివాళులర్పిస్తూ అన్నారు. ఈ అంతర్జాల కార్యక్రమాన్ని వంశీ గ్లోబల్ అవార్డ్స్ ఇండియా, సంతోషం ఫిలిం న్యూస్ ఇండియా , శారద ఆకునూరి అమెరికా సంయుక్త ఆధ్వర్యంలో అమెరికాలో హ్యూస్టన్ నగరం నుంచి శారద ఆకునూరి నిర్వహణలో ప్రారంభించారు. న్యూ జెర్సీ నుంచి దాము గేదెల అంతర్జాతీయంగా ఆనంద్ పేర ఒక సంగీత పురస్కారాన్ని నెలకొల్పుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటులు మాజీ పార్లమెంటు సభ్యులు మురళీమోహన్ మాగంటి, ఆనంద్ తన ఎన్నో చిత్రాల పాటలకు గాత్రం ఇచ్చారని వారి సుమధుర గీతాలు తన పాత్రలకు న్యాయం చేశాయని అన్నారు. అమెరికాకు చెందిన ఉపేంద్ర చివుకుల అమెరికాలో ఆనంద్ గారి గానాన్ని చాలా సార్లు విన్నానని వెంటిలేటర్ దొరకక ఒక గాయకుడు మరణించడం తమనెంతో కలచి వేసిందని అన్నారు. ఈ అంతర్జాల నివాళి సభలో మండలి బుద్ద ప్రసాద్, ఘంటసాల రత్నకుమార్, భువన చంద్ర , మాధవ పెద్ది సురేష్, ఆర్ పట్నాయక్, సురేష్ కొండేటి, సారిపల్లి కొండలరావు , డా.నగేష్ చెన్నుపాటి, ఉపేంద్ర చివుకుల, ప్రసాద్ తోటకూర, డా.ఆళ్ల శ్రీనివాస్, శారద సింగిరెడ్డి, దాము గేదెల, రవి కొండబోలు,శ్రీదేవి జాగర్లమూడి, శ్రీనివాస్ చిమట, రమణ జువ్వాది, రత్న కుమార్ కవుటూరు, తాతాజీ ఉసిరికల, అనిల్ , హరి వేణుగోపాల్, రామాచారి, మల్లికార్జున్, రాము, ప్రవీణ్ కుమార్ కొప్పుల, వేణు శ్రీరంగం సురేఖ మూర్తి దివాకర్ల, జీ.వీ ప్రభాకర్, విజయలక్ష్మి చంద్రతేజ, మొహమ్మద్ రఫీ తదితరులు ఆనంద్ గారితో తమ అనుబంధాన్ని పంచుకొని శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమాన్ని సంతోషం ట్రినెట్ లైవ్ యూట్యూబ్ చానెల్ , సంతోషం సురేష్ యూట్యూబ్ చానెల్ లైవ్ ప్రసారం చేశాయి. ( చదవండి: కరోనా ఫండ్‌తో జల్సాలు.. విలాసమంటే నీదే రాజా ) -
డైరెక్టర్‌కు నివాళులు అర్పించిన విజయ్ సేతుపతి
ఇటీవల మృతి చెందిన దర్శకుడు ఎస్.పి.జననాథన్ చిత్రపటానికి నటుడు విజయ్ సేతుపతి నివాళులర్పించారు. ఇయర్కై, ఈ, పేరాన్మై, పురంబోకు వంటి వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడు ఎస్.పి.జననాథన్. పురంబోకు చిత్రంలో నటుడు విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం లాభం. ఈ చిత్రంలొనూ విజయ్ సేతుపతినే కథానాయకుడిగా నటిస్తున్నారు. నటి శృతి హాసన్ నాయకిగా నటించిన ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో జననాథన్ ఏప్రిల్ 14న మెదడు సంబంధించిన వ్యాధితో కన్నుమూశారు. ఈయన ఆస్పత్రి ఖర్చులను విజయ్ సేతుపతే భరించారు. అదే విధంగా జననాథన్ అంత్యక్రియల్లోనూ పాల్గొన్నారు. కాగా కార్మికుల దినోత్సవం సందర్భంగా శనివారం విజయ్ సేతుపతి లాభం చిత్ర యూనిట్‌తో కలిసి జననాథన్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. -
సినిమాటోగ్రాఫర్ మృతికి మాధవన్ సంతాపం
బాలీవుడ్‌కు చెందిన సినిమాటోగ్రఫర్ జానీ లాల్ మరణించారు. ఆయన ‘రెహ్నా హై తెరే దిల్ మే’, ‘పార్టనర్, ఓం జై జగదీష్’, ‘ముజే కుచ్ కెహ్నా హై’.. వంటి చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. ఆయన మరణానికి గల కారణం ఇంకా తెలియలేదు. గతంలో జానీ లాల్‌తో కలిసి పనిచేసిన కోలీవుడ్ నటుడు మాధవన్, బాలీవుడ్ నటుడు తుషార్ కపూర్, సతీష్ కౌశిక్ ఆయన మరణానికి సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని తెలిపారు. కాగా గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ’ హే తెరా దిల్ మే’ లో మాధవన్ నటించారు. ఈ చిత్రానికి జానీ లాల్ సినిమాటోగ్రాఫర్ గా పని చేశాడు. ఆయనతో ఆ సినిమాకు కలిసి చేస్తున్న సమయంలో తన వ్యక్తిత్వం తెలిసింది. ఆయన సౌమ్యత, దయ కలిగిన వ్యక్తి అంటూ వారి మధ్య అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. 2001 లో సతీష్ కౌశిక్ దర్శకత్వం వహించిన ‘ముజే కుచ్ కెహ్నా హై’ చిత్రంతో తుషార్ కపూర్ నటనా రంగ ప్రవేశం చేశారు. అప్పటి నుంచి జానీతో తుషార్ కపూర్ కు మంచి సంబంధాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ..‘ ఆర్ఐపీ జానీ లాల్ .. చిత్నం ఈ రోజుకు చూస్తుంటే కొత్త సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతోంది , దీనికి కారణం నీ పనితనమేనంటూ’ ట్వీట్ చేశాడు. ( చదవండి: పట్టాలెక్కని కరణ్-జాన్వీ సినిమా.. ఏమైందంటే.. ) The Saga of tragedies continues & we lost a wonderful man-The DOP of RHTDM. RIP Johny Lal sir.Your gentleness,kindness and brilliance will be so missed. You so beautifully managed to bring out our souls in RHTDM & now yours makes its way to the heavens. Heartbroken and aghast.🙏 pic.twitter.com/301Jj59uMA— Ranganathan Madhavan (@ActorMadhavan) April 22, 2021 -
హాస్య నటుడు వివేక్ మృతి.. ప్రముఖుల నివాళులు
-
ప్రిన్స్ ఫిలిప్ కన్నుమూత
-
ప్రిన్స్ ఫిలిప్ కన్నుమూత
లండన్ : బ్రిటన్ రాణి ఎలిజెబెత్–2 భర్త, ప్రిన్స్ ఫిలిప్ 99 ఏళ్ల వయసులో శుక్రవారం ఉదయం కన్నుమూశారు. నూరవ పుట్టిన రోజు వేడుకని మరో రెండు నెలల్లో చేసుకోవాల్సిన డ్యూక్ ఆఫ్ ఎడిన్బర్గ్ ప్రిన్స్ ఫిలిప్ రాణితో 73 ఏళ్ల సహచర్యాన్ని వీడి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ విషయాన్ని రాణి తరఫున బంకింగ్çహామ్ ప్యాలెస్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ‘‘విండ్సర్ కేజల్‌లో శుక్రవారం ఉదయం డ్యూక్ ఆఫ్ ఎడిన్బర్గ్ ప్రిన్స్ ఫిలిప్ ప్రశాంతంగా కన్ను మూశారు. బాధాతప్తమైన హృదయంతో రాణి తన భర్త మరణవార్తని ప్రపంచానికి వెల్లడించారు’’అని ఆ ప్రకటన పేర్కొంది. జూన్ 10న ఫిలిప్ శతవసంత వేడుకల్ని వైభవంగా నిర్వహించడానికి రాజకుటుంబం ఏర్పాట్లు చేస్తూ ఉన్న సమయంలో ఆయన మరణ వార్త వినడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఇటీవల ఆయన గుండెకు శస్త్రచికిత్స నిర్వహించిన విషయం తెలిసిందే. ఫిలిప్ మరణవార్త తెలుసుకోగానే ప్రపంచం నలుమూలల నుంచి సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. ఎంతో మంది యువత జీవితాల్లో ఆయన స్ఫూర్తిని నింపారని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. యూకేతో పాటు ప్రపంచవ్యాప్తంగా కొన్ని తరాల వారి ప్రేమాభిమానాలను ఆయన చూరగొన్నారని కొనియాడారు. ప్రిన్స్ మరణవార్త విని విండ్సర్ కేజల్‌కి జనం పెద్ద సంఖ్యలో తరలి వచ్చి గేటు బయటే పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పిస్తున్నారు. ఫిలిప్, ఎలిజెబెత్ దంపతులకు ప్రిన్స్ చార్లెస్, ప్రిన్సెస్ అన్నె, ప్రిన్స్ ఆండ్రూ, ప్రిన్స్ ఎడ్వర్డ్ నలుగురు పిల్లలు. ఎనిమిది మంది మనవలు, మనవరాళ్లు, 10 మంది మునిమనవలు ఉన్నారు. మోదీ సంతాపం ప్రిన్స్ ఫిలిప్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. మిలటరీలో అద్భుతమైన కెరీర్‌తో పాటు, సామాజిక సేవలో తనదైన ముద్ర వేశారని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టుగా ట్వీట్ చేశారు. భారత్ పర్యటన వివాదాస్పదం రాణి ఎలిజెబెత్‌తో కలిసి ఫిలిప్ మూడుసార్లు భారత్ పర్యటనకు వచ్చారు. 1961, 1983, 1997లో ఆయన భారత్‌ని సందర్శించారు. 1961లో భారత్ పర్యటనకు వచ్చినప్పుడు ఫిలిప్ పులిని వేటాడడం వివాదాస్పదమైంది. జైపూర్ రాజ దంపతులతో కలిసి రాణి ఎలిజెబెత్, ఫిలిప్ వారి దగ్గర చనిపోయి పడి ఉన్న పులి ఫోటో అప్పట్లో ప్రకంపనలు సృష్టించింది. పర్యావరణ, జంతు ప్రేమికుడిగా అప్పటికే ఆయనకు ఒక గుర్తింపు ఉంది. వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్ యూకే అధ్యక్షుడిగా ఆయన ఆ ఏడాది నియమితులు కావడంతో పులిని కాల్చడం వివాదాన్ని రేపింది. అయితే ఆ తర్వాత ఆయన పర్యావరణ పరిరక్షణకు చేసిన కృషిని ఇప్పటికీ అందరూ గుర్తు చేసుకుంటారు. రాణికి కొండంత అండ గ్రీకు వంశంలో పుట్టిన ఫిలిప్.. యువరాణి ఎలిజెబెత్‌ను పెళ్లాడడానికి తన రాచరిక హోదాలన్నీ వదులకున్నారు. ఆమె బ్రిటన్ సింహాసనం ఎక్కాక నీడలా వెన్నంటే ఉంటూ పాలనలో పూర్తిగా సహకరించారు. బ్రిటన్‌లో రాజ్యాంగబద్ధమైన హోదా ఏమీ లేకపోయినా రాణి పరిపాలనలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎన్నో కార్యక్రమాల్లో రాణి వెనకాలే అడుగులో అడుగులు వేసుకుంటూ నడిచినప్పటికీ బ్రిటన్ రాచకుటుంబంలో ప్రతీ చోటా ఆయన ముద్ర కనిపిస్తూనే ఉంటుంది. రాజకుటుంబంలో ఆయన మాటే శాసనంగా మారింది. అందుకే రాణి ఎలిజెబెత్ తమ 50వ వివాహ వేడుకల్లో ‘‘నా భర్తే నాకు కొండంత బలం’’అంటూ తన ప్రేమని బహిరంగంగానే చాటుకున్నారు. భార్య చాటు భర్తలా మిగిలిపోకూడదని తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకోవడానికి సామాజిక సేవలోనే ఎక్కువ భాగం గడిపారు. ఎన్నో చారిటీలను నడిపారు. యువతరం బాగుంటేనే దేశ భవిష్యత్ బాగుంటుందని నమ్మిన ఫిలిప్ వారిని అన్ని విధాలుగా సంస్కరించాలని చూసేవారు. రాజకుటుంబంలో బూజుపట్టిన సంప్రదాయాల్ని విడనాడి ఆధునీకరణ విధానాలను ప్రవేశపెట్టాలని చూశారు కానీ అవి కుదరలేదు. ప్రిన్స్ ఫిలిప్ గొప్ప సాహసి. బ్రిటన్ నేవీ కమాండర్‌గా రెండో ప్రపంచ యుద్ధం సమయంలో యుద్ధ నౌకలో సేవలందించారు. ఫిలిప్‌ది ముక్కు సూటి మనస్తత్వం. మనసులో అనుకున్నది కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పేస్తారు. ఆ మనస్తత్వమే ఆయనను చాలా సార్లు ఇబ్బందుల్లో పడేసింది. గ్రీకు వీరుడు, ఎలిజెబెత్ రాకుమారుడు ► జూన్ 10,1921: గ్రీకు రాజ కుటుంబంలో జననం ► 1939: బ్రిటిష్ రాయల్ నేవీలో కమాండర్‌గా ఉద్యోగం ► 1942: మొదటి లెఫ్ట్‌నెంట్‌గా అపాయింట్మెంట్ ► 1947: యువరాణి ఎలిజెబెత్‌ను పెళ్లాడడం కోసం గ్రీక్ డానిష్ రాయల్ టైటిల్స్‌ని వదులుకున్నారు ► నవంబర్ 20, 1947: ఎలిజెబెత్‌తో వివాహం ► 1951: నేవీ కెరీర్‌ను వదులుకొని ఎలిజెబెత్‌కు అండదండలు ► 2017: ప్రజా జీవితం నుంచి పదవీ విరమణ ► 2019: కారు ప్రమాదానికి లోనుకావడంతో డ్రైవింగ్‌ను వదిలేశారు, ఇదే ఏడాది ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి ► ఫిబ్రవరి 17 2021: ఆస్పత్రిలో చేరిక ► మార్చి 4 2021 : గుండెకు విజయవంతంగా చికిత్స ► మార్చి 16 2021 : ఆస్పత్రి నుంచి ప్యాలెస్‌కి ► ఏప్రిల్ 9: ప్రశాంతంగా తుది శ్వాస -
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బూర్గుల కన్నుమూత
సాక్షి, హైదరాబాద్/సాక్షి, మేడ్చల్ జిల్లా: స్వాతంత్య్ర సమర యోధుడు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నాయకుడు బూర్గుల నర్సింగరావు (89) సోమవారం తెల్లవారుజామున కేర్ ఆసుపత్రిలో కన్నుమూశారు. గుం డె సంబంధిత సమస్యలతో పాటు కరోనాకు చికిత్సకోసం వారం క్రితం ఆయనను హైదరాబాద్ కేర్ ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచా రు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో సోమవారం మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆయన అలుపెరుగని పోరాటం చేశారు. బూర్గుల నర్సింగరావు విద్యార్థి దశలో ఆల్ హైదరాబాద్ స్టూడెంట్ యూనియన్ మొదటి అధ్యక్షుడిగా పనిచేశారు. సీపీఐ హైదరాబాద్ జిల్లాకమిటీ సభ్యుడిగా కీలకపాత్ర పోషించారు. ముంబైలోని సీపీఐ కార్యాలయంలో కూడా ఆయన పని చేశారు. అలాగే తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు అధ్యక్షుడిగా పని చేశారు. హైదరాబాద్ స్టేట్ తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు సోదరుడు బి.వెంకటేశ్వరరావు కుమారుడే నర్సింగరావు. 1932 మార్చి14న ఉమ్మడి మహబూబ్‌నగర్‌జిల్లా షాద్‌నగర్ సమీపంలోని బూర్గుల గ్రామంలో స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబంలో ఆయన జన్మించారు. రజాకార్ల వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నందుకు అరెస్టయి చంచల్‌గూడ జైలుకు వెళ్లారు. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. 1952లో జరిగిన ముల్కీ ఉద్యమంలో ముందుండి పోరాడారు. 1955లో అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) మొదటి జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికై 1959 వరకు బాధ్యతలు నిర్వహించారు. సొంతూరు బూర్గులలో రైల్వేస్టేషన్ ఏర్పాటులో కీలకపాత్ర పోషిం చారు. ఊర్లో స్కూల్ స్థాపనకు భూమిని విరాళంగా ఇచ్చారు. ఆయనకు భార్య డాక్టర్ మంజూత, కుమార్తె మాళవిక, కుమారులు అజయ్, విజయ్‌లున్నారు. సీఎం సంతాపం తెలంగాణ పోరాట యోధుడు బూర్గుల నర్సింగరావు మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంతో పాటు, తొలి.. మలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాల్లో నర్సింగరావు పాత్ర మరువలేనిదని ముఖ్యమంత్రి అన్నారు. ఆయన మరణం తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటని పేర్కొన్నారు. బూర్గుల కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మంత్రులు, ప్రముఖుల సంతాపం బూర్గుల మృతి పట్ల మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు సంతాపం ప్రకటించారు. అలాగే సీపీఐ నేతలు సురవరం సుధాకర్‌రెడ్డి, కె.నారాయణ, చాడ వెంకట్‌రెడ్డి, అజీజ్ పాషా, పల్లా వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావు, తెలంగాణ అమరవీరుల ట్రస్టు కార్యదర్శి కందిమల్ల ప్రతాపరెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం సంతాపం తెలిపారు. ఈ నెల 21న మఖ్దూంభవన్‌లో సంతాప సభ నిర్వహించనున్నట్లు సీపీఐ రాష్ట్ర సమితి ప్రకటించింది. బూర్గుల భౌతికకాయం వద్ద నివాళులర్పిస్తున్న సీపీఐ నేత నారాయణ, (ఇన్సెట్) -
వైఎస్సార్సీపీ కార్యాలయంలో అంబేద్కర్‌కు నివాళి
సాక్షి, అమరావతి: అంబేద్కర్ వర్థంతి సందర్భంగా తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంటకరమణ, ఎంపీ నందిగాం సురేష్ అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పార్టీ ఎస్సీ సెల్ కన్వీనర్ మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కనకారావు, వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ దేవళ్ల రేవతి, అధికార ప్రతినిధి ఈదా రాజశేఖర్ రెడ్డి పాల్గొని అంబేద్కర్‌కి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. అట్టడుగు వర్గాల వారి అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తి అంబేద్కర్ అని గుర్తు చేశారు. ఆయన మన దేశానికి అందించిన రాంజ్యాంగం ప్రపంచ దేశాల్లో అత్యున్నతంగా నిలిచిందని తెలిపారు. ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఆయన చూపిన రాజ్యాంగ స్పూర్తితో పని చేస్తోందన్నారు. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ.. అంబేద్కర్ విలువల్ని ప్రపంచం అంతా స్మరించుకుంటున్నారని తెలిపారు. మన దేశానికి భరతమాత ముద్దు బిడ్డ అంబేద్కర్అని తెలిపారు. ఎవరు ఆడిగారని నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్‌కి లేఖ రాశారని సూటిగా ప్రశ్నించారు. ఆయన పరిధి ఏమిటో తెలుసుకోవాలన్నారు. సుప్రీంకోర్టు లాయర్ల సలహా తీసుకోమని ఆయన గవర్నర్‌కి చెప్పటం ఏమిటని మండిపడ్డారు. గవర్నర్ ఎవరి సలహాలు తీసుకోవాలి, ఎలాచేయాలనే దానిపై విచక్షణాధికారం ఉంటుందని తెలిపారు. రమేష్ కుమార్‌ను సలహా ఇవ్వమని గవర్నర్ ఆడిగారా అని ప్రశ్నించారు. చట్ట సభల్లో తీసుకున్న నిర్ణయాలకు నీకేమి సంబంధం ఉందని దుయ్యబట్టారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఒక ప్రతిపక్ష నేతలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అయనపై ఎలా విశ్వాసం ఉంటుందని, ప్రతిపక్షం మౌత్ పీస్‌లా మారిపోయారని విమర్శించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన పరిధి ఏమిటో తెలుసుకుని పని చేయాలని హితవు పలికారు. -
అంబేద్కర్‌కు బండి సంజయ్ నివాళి
సాక్షి, హైదరాబాద్: దేశానికి దిశా నిర్దేశం చేసిన గొప్ప మనిషి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కొనియాడారు. పేద బడుగు బలహీన వర్గాలకు వెలుగు నింపిన వ్యక్తి అన్నారు. ఆదివారం అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ట్యాంక్‌బండ్ దగ్గర ఆయన విగ్రహానికి బండి సంజయ్ పూలమాల వేసి నివాళలు అర్పించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ..రాబోయే తరాలకు న్యాయం జరగాలి చాటి చెప్పిన వ్యక్తి అంబేద్కర్ అని గుర్తుచేశారు. ఆయన జయంతి, వర్ధంతి చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. అంబేద్కర్ చరిత్ర భావి తరాలకు చెప్పాలిసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 2023లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాజ్యాంగ నిర్మాత అయితే అంబేద్కర్ జయంతి, వర్ధంతి రోజున బయటికి రాలేని వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని దుయ్యబట్టారు. మొన్ననే ఎన్నికల్లో కేసీఆర్‌కు ప్రజలు బుద్ధి చెప్పారని, అంబేద్కర్‌ను స్మరించుకుంటే కనీసం జ్ఞానమైన వస్తుందని తెలిపారు. తమ ప్రభుత్వం రాగానే సర్దార్ పటేల్ విగ్రహం మాదిరిగానే బాబా సాహెబ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని బండి సంజయ్ పేర్కొన్నారు. -
అహ్మద్ పటేల్ కన్నుమూత
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్‌నేత, వ్యూహకర్త అహ్మద్‌పటేల్(71) గుర్గావ్లో కన్నుమూశారు. నెలరోజులుగా ఆయన కరోనా సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఆయన్ను ఈ నెల 15న ఆస్పత్రిలో చేర్చారు. అయితే చికిత్సకు అవయవాలు స్పందించని కారణంగా బుధవారం తెల్లవారుజామున 3.30 గంటలకు మరణించినట్లు ఆయన కుమారుడు ఫైజల్ తెలిపారు. çపటేల్ మృతిపట్ల రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత సోనియా, రాహుల్‌తో పాటు పలువురు నాయకులు సంతాపం తెలిపారు. ప్రస్తుతం పటేల్ గుజరాత్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. మూడు పర్యాయాలు లోక్‌సభకు ఎన్నికైన ఆయన ఐదు దఫాలుగా రాజ్యసభకు ఎన్నికవుతూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి మూడు దఫాలుగా పటేల్ కోశాధికారిగా వ్యవహరిస్తున్నారు. ఆయన స్వగ్రామం పిరమన్‌లో పటేల్ అంత్యక్రియలు జరుగనున్నాయి. ‘కాంగ్రెస్‌పార్టీకి జీవితాన్ని అంకింతం చేసిన ఒక కీలక నేతను కోల్పోయాము. భర్తీ చేయలేని ఒక సహచరుడు, నమ్మకస్తుడు, స్నేహితుడిని కోల్పోయాను’ అని కాంగ్రెస్ నేత సోనియా గాంధీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆపదలు దాటించే అహ్మద్ భాయ్ స్నేహితులు ‘ఏపీ’ లేదా ‘బాబూ భాయ్’అని పిలుచుకునే అహ్మద్ పటేల్ సోనియాకు 2001 నుంచి రాజకీయ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. పార్టీకి ఆపద వస్తే అహ్మద్వైపే అధినేత్రి చూసేవారు. కీలకాంశాల్లో పార్టీలో ఏకాభిప్రాయం సాధించే చతురుడుగా పటేల్ పేరుగాంచారు. ఏపీకి అన్ని పార్టీల్లో దోస్తులు, అభిమానులు ఉన్నారు. మూడు నెలల క్రితమే పార్టీలో తలెత్తబోయిన ఒక తిరుగుబాటును సైతం ఆయన చాకచక్యంగా సద్దుమణిగేలా చేశారు. పటేల్ ప్రస్థానం 1949 ఆగస్టులో జన్మించిన పటేల్ రాజకీయ ప్రస్థానం గుజరాత్‌లోని భరూచా జిల్లాల స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడంతో మొదలైంది. 1977లో 28ఏళ్ల వయసులో ఆయన లోక్‌సభకు ఎన్నికయ్యారు. అనంతరం 1993 లో రాజ్యసభకు తొలిసారి ఎన్నికయ్యారు. రాజీవ్‌గాంధీకి ఆయన సన్నిహితుడు. అప్పట్లో ప్రధానికి పార్లమెంట్ సెక్రటరీగా పనిచేశారు. 1985, 1992ల్లో ఆయన ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా వ్యవహరించారు. 1992నుంచి మంత్రిగా ఆయన ఎప్పుడూ పదవీ బాధ్యతలు నిర్వహించలేదు. కానీ కాంగ్రెస్ తరఫున కీలక నిర్ణయాలు తీసుకునే అతికొద్దిమందిలో ఆయన ఒకరు. పటేల్‌కు ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. -
కేంద్రమంత్రి పాశ్వాన్ కన్నుమూత
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి, లోక్‌జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ దళిత నేత రామ్ విలాస్ పాశ్వాన్(74) గురువారం కన్నుమూశారు. గత కొన్ని వారాలుగా పాశ్వాన్ ఢిల్లీలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవలే ఆయనకు గుండె శస్త్ర చికిత్స జరిగింది. పాశ్వాన్ మరణవార్తను ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ ట్వీట్ చేశారు. ‘నాన్నా.. ఈ ప్రపంచంలో మీరు లేరు. కానీ మీరెప్పుడూ నాతోనే ఉంటారని నాకు తెలుసు. మిస్ యూ నాన్నా’ అని చిరాగ్ భావోద్వేగ ట్వీట్ చేశారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న పాశ్వాన్.. కేంద్ర మంత్రివర్గంలో వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖల బాధ్యతలు చూస్తున్నారు. పాశ్వాన్ మృతిపై రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ‘యవ్వనంలో పాశ్వాన్ ఒక ఫైర్‌బ్రాండ్ సోషలిస్ట్. ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో జయప్రకాశ్ నారాయణ్ వంటి నేతల సాంగత్యంలో నాయకుడిగా ఎదిగారు’ అని కోవింద్ ట్వీట్‌చేశారు. పాశ్వాన్ మరణం తనను మాటలకందని బాధకు గురి చేసిందని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ‘కృషి, పట్టుదలతో పాశ్వాన్ రాజకీయాల్లో ఎదిగారు. యువకుడిగా ఎమర్జెన్సీ దురాగతాలను ఎదుర్కొన్నారు. ఆయన అద్భుతమైన మంత్రి, పార్లమెంటేరియన్. చాలా విధాన విషయాల్లో తనదైన ముద్ర వేశారు. ఆయనతో కలిసి పనిచేయడం గొప్ప అనుభవం. కేబినెట్ సమావేశాల్లో ఆయన లోతైన సూచనలు ఇచ్చేవారు. రాజకీయ జ్ఞానం, దార్శనికత, పాలనాదక్షతల్లో ఆయనకు సాటిలేరు’ అని మోదీ పేర్కొన్నారు. కేంద్రమంత్రి పాశ్వాన్ మృతికి సంతాప సూచకంగా నేడు దేశ రాజధాని ఢిల్లీలో, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల రాజధానుల్లో జాతీయ పతాకాన్ని సగం వరకు అవనతం చేయనున్నారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహిస్తారు. ఏపీ గవర్నర్, సీఎం జగన్ సంతాపం సాక్షి, అమరావతి: పాశ్వాస్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. పాశ్వాన్ తన ఐదు దశాబ్దాల రాజకీయ జీవితంలో అణగారిన వర్గాల వాణిని ఎలుగెత్తి చాటారని వైఎస్ జగన్ నివాళులర్పించారు. పాశ్వాన్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పాశ్వాన్ మృతి పట్ల వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వేణుంబాక విజయసాయిరెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తెలంగాణ గవర్నర్, సీఎం కేసీఆర్ సంతాపం సాక్షి, హైదరాబాద్: పాశ్వాన్ మృతిపట్ల తెలంగాణ గవర్నర్ తమిళిసై, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రామ్ విలాస్ పాశ్వాన్ అండగా నిలిచారని కేసీఆర్ గుర్తు చేశారు. 1969లోనే ఎమ్మెల్యే 1946 జులై 5న బిహార్‌లోని ఖగారియాలో పాశ్వాన్ జన్మించారు. పీజీ, న్యాయవిద్య అభ్యసించారు. విద్యాభ్యాసం అనంతరం డీఎస్పీగా పోలీసు ఉద్యోగం వచ్చినా రాజకీయాలపై ఆసక్తితో ఆ ఉద్యోగంలో చేరలేదు. 1969లో సంయుక్త సోషలిస్ట్ పార్టీ టికెట్‌పై తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. బిహార్‌లోని హాజీపూర్ లోక్‌సభ స్థానం నుంచి రికార్డు స్థాయిలో 8 సార్లు గెల్చారు. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ రికార్డు చాలా రోజుల పాటు ఆయన పేరు పైనే ఉన్నది. పాశ్వాన్ 1975 నాటి ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో జైలుకెళ్లారు. 2000 సంవత్సరంలో ఆయన మరికొందరు నాయకులతో కలిసి లోక్‌జనశక్తి పార్టీ(ఎల్జేపీ)ని స్థాపించారు. పేదలు, అణగారిన వర్గాల సమస్యలపై అవకాశం లభించిన ప్రతీసారి గళమెత్తే నేతగా పాశ్వాన్ పేరు గాంచారు. మండల్ కమిషన్ నివేదిక అమలుకు ఆయన గట్టిగా ప్రయత్నించారు. పార్టీలకు అతీతంగా అందరు నాయకులతో ఆయన సత్సంబంధాలు కలిగి ఉండేవారు. సైద్ధాంతిక వైరుధ్యాలున్న పార్టీల నేతృత్వంలో సాగిన కేంద్ర ప్రభుత్వాల్లో ఆయన భాగస్వామిగా, మంత్రిగా విజయవంతంగా కొనసాగడం విశేషం. కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వంలోనూ, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారులోనూ కీలకంగా వ్యవహరించడం ఆయనకే చెల్లింది. దాదాపు ఐదు దశాబ్దాలకు పైబడిన రాజకీయ జీవితంలో దళితులు, అణగారిన వర్గాల కోసం పోరాడే నేతగా ఆయన దేశవ్యాప్తంగా పేరుగాంచారు. ఉత్తర భారత దేశంలో దళితులను ఏకం చేయడంలో పాశ్వాన్ కీలక పాత్ర పోషించారని ఆయన దీర్ఘకాల సహచరుడు, జేడీయూ నేత కేసీ త్యాగి గుర్తు చేసుకున్నారు. 1989లో వీపీ సింగ్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన పాశ్వాన్.. మండల్ కమిషన్ సిఫారసుల అమలుకు కృషి చేశారన్నారు. బీజేపీతో విబేధాల కారణంగా వాజ్‌పేయి ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన సమయంలో నాటి గుజరాత్ సీఎం నరేంద్ర మోదీని తీవ్రంగా విమర్శించిన పాశ్వాన్.. అదే మోదీ నాయకత్వంలోని ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగారు. సిద్ధాంతాలకు అతీతంగా అధికారంలో ఉన్న పార్టీలకు దగ్గరయ్యే ఆయన తీరును ప్రత్యర్థులు ‘వాతావరణ నిపుణుడు’ అంటూ విమర్శిస్తారు. -
జశ్వంత్ సింగ్ కన్నుమూత
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన జశ్వంత్ సింగ్(82) ఆదివారం గుండెపోటుతో కన్నుమూశారు. చాన్నాళ్లుగా ఆయన పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మాజీ ఆర్మీ అధికారి అయిన జశ్వంత్ సింగ్ మాజీ ప్రధాని అటల్ బిçహారీ వాజ్‌పేయికి సన్నిహితుల్లో ఒకరు. జశ్వంత్ సింగ్ మృతిపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, పార్టీలకతీతంగా పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు. కేంద్రంలో ఆయన ఆర్థిక, రక్షణ, విదేశాంగ తదితర కీలక శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు. 2014లో తన ఇంట్లో ఆయన కింద పడి, తీవ్రంగా గాయపడడంతో ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ వైద్యశాలలో చేర్చి చికిత్స చేశారు. ఆ తరువాత కూడా పలు అస్వస్థతలతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. ఈ జూన్‌లో మరోసారి ఆస్పత్రిలో చేరారు. ‘కేంద్ర మాజీ మంత్రి, మేజర్(రిటైర్డ్) జశ్వంత్ సింగ్ సెప్టెంబర్ 27 ఉదయం 6.55 గంటలకు మరణించారు. 25 జూన్, 2020లో ఆయన ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి సెప్సిస్, మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్ సిండ్రోమ్, గతంలో తలకు తగిలిన దెబ్బకు చికిత్స అందిస్తున్నాం. ఆదివారం ఉదయం తీవ్రస్థాయిలో గుండెపోటు వచ్చింది. ఆయనను కాపాడేందుకు వైద్యులు చేసిన కృషి ఫలించలేదు’ అని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆసుపత్రి ఒక ప్రకటనలో వివరించింది. రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌లో ఉన్న తన వ్యవసాయ క్షేత్రంలో ఆదివారం సాయంత్రం ఆయన అంత్యక్రియలు ముగిశాయి. జశ్వంత్ సింగ్ కుమారుడు మానవేంద్ర సింగ్ అంత్యక్రియలు నిర్వహించారు. మాజీ సైనికుడు, సమర్థుడైన పార్లమెంటేరియన్, అద్భుతమైన నాయకుడు, మేధావి అయిన జశ్వంత్ సింగ్ మృతి తననెంతో కలచివేసిందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు. దేశానికి జశ్వంత్ సింగ్ ఎన్నో సేవలందించారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మానవేంద్ర సింగ్‌కు ప్రధాని ఫోన్ చేసి సంతాపం తెలిపారు. జశ్వంత్ తనకు అత్యంత సన్నిహితుడైన సహచరుడని బీజేపీ సీనియర్ నేత అడ్వాణీ పేర్కొన్నారు. రెండు సార్లు బీజేపీ నుంచి బహిష్కరణ 1938 జనవరి 3న రాజస్తాన్‌లోని బార్మర్ జిల్లా, జాసోల్ గ్రామంలో జశ్వంత్ సింగ్ జన్మించారు. విద్యాభ్యాసం అనంతరం ఆర్మీలో చేరారు. అనంతరం రాజీనామా చేసి రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ప్రారంభం నుంచీ బీజేపీలో ఉన్నారు. ఎంపీగా పలు పర్యాయాలు పనిచేశారు. సభలో పదునైన గళంతో స్పష్టంగా తన అభిప్రాయాలను వెల్లడించేవారు. జశ్వంత్ సింగ్ రెండుసార్లు పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. ‘జిన్నా– ఇండియా, పార్టిషన్, ఇండిపెండెన్స్’ పుస్తకంలో జిన్నాను ప్రశంసించడంతో తొలిసారి 2009లో ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు. 2010లో మళ్లీ ఆయన బీజేపీలో చేరారు. ఆ తరువాత, పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా లోక్‌సభకు పోటీ చేయడంతో 2014లో మరోసారి ఆయనను పార్టీ నుంచి తొలగించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ సంతాపం సాక్షి, అమరావతి: కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విచారం వ్యక్తం చేశారు. సైనికుడి నుంచి పార్లమెంటేరియన్‌గా మారి దేశానికి ఎంతో సేవ చేసి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి అని కొనియాడారు. జశ్వంత్ సింగ్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. -
మూగబోయిన బాలు గళం: ఒక శకం ముగిసింది!
సుప్రసిద్ధ నేపథ్య గాయకుడు, గాన గంధర్వుడు ఇకలేరంటే నమ్మశక్యం కావడంలేదు. దశాబ్దాల తరబడి తన అమృత గానంతో మైమరపించిన ఆ స్వరధార ఆగిపోయిందంటే జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంది. కానీ నమ్మక తప్పని కఠోర వాస్తవం. శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం (74) కరోనా మహమ్మారిపై సుదీర్ఘ పోరాటం తరువాత ఇక సెలవంటూ తనువు చాలించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. సంపూర్ణ ఆరోగ్యంగా తిరిగి వస్తారని వేయి దేవుళ్లకు మొక్కుకున్న అభిమానులంతా శోక సంద్రంలో మునిగిపోయారు. ఎంతో మంది యువకళాకారులు, గాయకులకు స్ఫూర్తినివ్వడమే గాదు, వారికి ఒక గౌరవప్రదమైన జీవితాన్ని ప్రసాదించిన బాలు లేని లోటు తీరదు గాక తీరదు. ఆయనకు ఆయనే సాటి. బంగారానికి తావి అబ్బిన చందంగా తన అపూర్వ ప్రతిభతో ఇంతింతై వటుడింతై అన్నట్టు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి భాషల్లో వేనవేల పాటలతో అలరించారు. అలరిస్తూనే ఉన్నారు. కానీ ఇంతలోనే మాయదారి మహమ్మారి ఆయనను మింగేసింది. సంగీత ప్రపంచానికి అంతులేని అగాధాన్ని మిగిల్చింది. బహుముఖ ప్రజ్ఞాశాలి గొంతునుంచి జాలు వారిన సుస్వరాలే మనకిక శరణ్యం. వి మిస్ యూ బాలూ సార్...ఫర్ ఎవర్ అండ్ ఎవర్ సోషల్ మీడియా ఇదే సందేశాలతో మారు మోగుతోంది. పలువురు ఆయనకు ఘన నివాళులర్పిస్తున్నారు. ఒక శకం ముగిసింది అంటూ ప్రఖ్యాత గాయని చిన్మయ శ్రీపాద ట్వీట్ చేశారు. సంగీత ప్రపంచంలో చిరస్థాయిగా మిగిలిపోతారన్నారు. బాలు గాయకుడు మాత్రమే కాదు. డబ్బింగ్ కళాకారుడిగా, నటుడిగా,సంగీత దర్శకుడిగా తన దైన ప్రతిభను చాటుకున్నారు. కమల్ హాసన్ , రజనీకాంత్, సల్మాన్ ఖాన్, భాగ్యరాజ్, మోహన్, విష్ణువర్ధన్, జెమిని గణేశన్, గిరీష్ కర్నాడ్, అర్జున్, కార్తీక్, నగేష్, రఘువరన్ లాంటి వారికి పలు భాషల్లో గాత్రదానం చేశారు. ముఖ్యంగా కమల్ హాసన్ కథానాయకుడిగా ఇంద్రుడు, చంద్రుడు సినిమాలోనూ, అలాగే 2010లో వచ్చిన దశావతారం చిత్రంలో కమల్ పోషించిన పది పాత్రల్లో 7 పాత్రలకు బాలునే డబ్బింగ్ చెప్పడం విశేషం. ఇందులో కమల్ పోషించిన ముసలావిడ పాత్ర కూడా ఉంది. అన్నమయ్య చిత్రంలో సుమన్ పోషించిన వేంకటేశ్వర స్వామి పాత్రకు, సాయి మహిమ చిత్రంలో బాలు డబ్బింగ్ చెప్పారు. జన్మకే లాలీ...అంటూ తరలిపోయారు 1969 లో మొదటిసారిగా నటుడిగా కనిపించిన బాలు తర్వాత తమిళ, తెలుగు చిత్రాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్నారు. 2012లో తనికెళ్ళ భరణి దర్శకత్వంలోఆయన హీరోగా తెరకెక్కిన మిథునం ఈ సినిమాకు నంది ప్రత్యేక పురస్కారం లభించింది. అంతేనా కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, విష్ణువర్ధన్, జెమిని గణేశన్, గిరీష్ కర్నాడ్, అర్జున్, నగేష్, రఘువరన్ లాంటి వారికి అమరిన ఆయన గొంతును మర్చిపోగలమా. ఆయా హీరోల, నటులు హావభావాలకు, గొంతుకు అనుగుణంగా తన గాత్రాన్ని మలుచుకోవడం ఆయన శైలి. అదే ఆయనకు ఎంతో వన్నె. అల్లు రామలింగయ్య, రాజబాబు లాంటి ఎందరో హాస్యనటులకు ఆయన పాడిన పాటలు ఆదరణకు నోచుకున్నాయి. అలనాటి అగ్రహీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్ మొదలు శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ నాగార్జున, మహేష్ బాబు, ఎన్టీఆర్ జూనియర్, ప్రభాస్ లాంటి ఇనాటి యంగ్ హీరోల దాకా ఆయన పాడని హీరో లేరు. 40 ఏళ్ళ సినీ ప్రస్తానంలో 11 భాషలలో, 40వేల పాటలు, 40 సినిమాలకి సంగీత దర్శకత్వంతో ఉర్రూత లూగించిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన. అందుకే అవార్డులు, జాతీయ పురస్కారాలు వచ్చి వరించాయి. (జీవితాన్నే మార్చేసిన ‘శంకరాభరణం’) Oru Sahabdham samaptam. Thank you for the memories. Thank you for showing that a singer can be a fantastic singer, act, voice act, produce, compose & more. You lived and how! Your art will live for aeons and I’ll always celebrate you. #SPB — Chinmayi Sripaada (@Chinmayi) September 25, 2020 బాలు తల్లిదండ్రులు : శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి (తండ్రి) , శకుంతలమ్మ (తల్లి) జీవిత భాగస్వామి : సావిత్రి సంతానం: చరణ్ , పల్లవి సోదరీమణులు : శైలజ, వసంత (కుమారుడు చరణ్, శైలజ, వసంత సినీ నేపథ్య గాయకులుగా ఉన్నారు) -
రైల్వే సహాయమంత్రి సురేశ్ కన్నుమూత
న్యూఢిల్లీ: కర్ణాటక బీజేపీ ఎంపీ, రైల్వే శాఖ సహాయ మంత్రి సురేశ్ అంగడి (65) బుధవారం రాత్రి కన్నుమూశారు. ఆయనకు కొద్దిరోజుల క్రితం కరోనా సోకింది. మూడు రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలోని ట్రామా సెంటర్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కరోనా వల్ల చనిపోయిన తొలి కేంద్ర మంత్రి ఈయనే. సురేశ్ కర్ణాటకలోని బెళగావి లోక్‌సభ స్థానం నుంచి నాలుగు సార్లు ఎంపీగా గెలుపొందారు. తిరుగులేని నేత: 1955 జూన్ 1న చెన్న బసప్ప, సోమవ్వ దంపతులకు కర్ణాటకలోని బెళగావి తాలూకా కేకే కొప్ప గ్రామంలో జన్మించారు. బెళగావిలోని ఎస్ఎస్ఎస్ కాలేజీలో కామర్స్‌లో పట్టా పొందారు. అనంతరం న్యాయ విద్య అభ్యసించారు. సురేశ్ అంగడి 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా లోక్‌సభకు ఎన్నికవుతూ వచ్చారు. సురేశ్ మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. ఏపీ గవర్నర్ సంతాపం: సాక్షి, అమరావతి: కేంద్ర మంత్రి సురేశ్ అంగడి మృతిపట్ల ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ విచారం వ్యక్తం చేశారు. సురేశ్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఏపీ సీఎం జగన్ సంతాపం: రైల్వే శాఖ సహాయ మంత్రి సురేశ్ అంగడి ఆకస్మిక మృతిపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఇటీవల అనంతపురం నుంచి కిసాన్ రైలును జెండా ఊపి ప్రారంభించిన సందర్భంగా జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో సురేశ్‌తోపాటు పాల్గొన్న సందర్భాన్ని సీఎం ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. -
రఘువంశ్ ప్రసాద్ కన్నుమూత
పట్నా/న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, రఘువంశ్ ప్రసాద్ సింగ్(74) కన్నుమూశారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో ఆదివారం ఉదయం 11 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారని సన్నిహితులు తెలిపారు. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న రఘువంశ్ మృతికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ తదితర ప్రముఖులు సంతాపం ప్రకటించారు. రఘువంశ్‌కు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. భార్య కొంతకాలం క్రితమే మరణించారు. గత శుక్రవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ను ఎయిమ్స్ ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచారు. జూన్‌లో రఘువంశ్‌కు కోవిడ్–19 నిర్ధారణ కావడంతో పట్నా ఎయిమ్స్‌లో చికిత్స పొందారు. ఇటీవల మళ్లీ కోవిడ్ లక్షణాలు బయటప డటంతో ఢిల్లీ ఎయిమ్స్‌కు తీసుకువచ్చారు. ఆయన మృతదేహాన్ని ఆదివారం రాత్రి పట్నాకు తరలించారు. వైశాలి జిల్లాలోని స్వగ్రామం షాపూర్ గ్రామంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయి. సోషలిస్టు నేత అయిన రఘువంశ్ ప్రసాద్ బిహార్‌లోని వైశాలి లోక్‌సభ స్థానం నుంచి ఐదు పర్యాయాలు ఎన్నికయ్యారు. యూపీఏ హయాంలో కేంద్రగ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్‌కు విశ్వాసపాత్రునిగా ఉంటూ రాష్ట్ర, జాతీయ స్థాయి రాజకీయాల్లో తనదైన పాత్ర పోషించారు. 4 రోజుల క్రితం ఆస్పత్రిలో ఉండగానే ఆర్జేడీ నుంచి వైదొలుగుతున్నట్లు ఆ పార్టీ చీఫ్ లాలూప్రసాద్కు లేఖ రాశారు. కానీ, ఆయన రాజీనామాను రాంచీ జైలులో ఉన్న లాలూ అంగీకరించలేదు. ఆరోగ్యం కుదుటపడ్డాక మాట్లాడుకుందామంటూ జవాబిచ్చారు. -
స్వామి అగ్నివేశ్ కన్నుమూత
న్యూఢిల్లీ: సంఘ సేవకుడు స్వామి అగ్నివేశ్(80) శుక్రవారం కన్నుమూశారు. కొంతకాలంగా లివర్ సిర్రోసిస్ వ్యాధితో ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన మంగళవారం నుంచి వెంటిలేటర్‌పైనే ఉన్నారని ఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్ తెలిపింది. సాయంత్రం ఆరుగంటల సమయంలో గుండెపోటు వచ్చిందని 6.30 గంటలకు తుదిశ్వాస విడిచారని పేర్కొంది. తెలుగువారే.. అగ్నివేశ్ మన తెలుగువ్యక్తే. అసలు పేరు వేప శ్యామ్ రావు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం సమీపంలోని ఓ కుగ్రామంలో 1939 సెప్టెంబర్ 21న జన్మించారు. నాలుగేళ్ల వయసులోనే తండ్రి మరణించడంతో ఛత్తీస్‌గఢ్‌లో తాత వద్ద పెరిగారు. కోల్‌కతాలో సెయింట్ గ్జేవియర్ కాలేజీ నుంచి డిగ్రీ చేశారు. సామాజిక కార్యకర్తగా, ఆధ్యాత్మిక వేత్తగా పేరొందారు. బాలల వెట్టిచాకిరీ నిర్మూలన కోసం బంధ ముక్తి మోర్చా పేరుతో సంస్థను స్థాపించి ఎనలేని కృషి చేశారు. ఆర్యసమాజ్ సిద్ధాంతాలకు ఆకర్షితులైన అగ్నివేశ్ 1970లో ఆర్యసభ అనే రాజకీయ పార్టీని స్థాపించారు. 1977లో హరియాణా అసెంబ్లీకి ఎన్నికై విద్యా శాఖ మంత్రిగా సేవలు అందించారు. వెట్టిచాకిరీని నిరసిస్తున్న వారిపై పోలీసులు కాల్పులు జరపడం, ఆనాటి హరియాణా ప్రభుత్వం దానిపై నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంతో అగ్నివేశ్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. 2010లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మావోయిస్టు నాయకులతో చర్చలు జరిపే బాధ్యతని స్వామి అగ్నివేశ్‌కే అప్పగించింది. ఆర్యసమాజ్ ప్రపంచ మండలికి 2014 వరకు అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ సంతాపం సాక్షి, అమరావతి: అగ్నివేశ్ మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విచారం వ్యక్తం చేశారు. వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా పోరాడిన స్వామీ చిరస్మరణీయులన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్ మరణం పట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమానికి స్వామి మొదట్నుంచీ మద్దతుగా నిలిచారన్నారురు. అగ్నివేశ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సిక్కోలు నివాళి శ్రీకాకుళం, సోంపేట: శ్రీకాకుళం జిల్లాలో జన్మించిన అగ్నివేశ్ తన ప్రస్థానాన్ని జాతీయ స్థాయి వరకు తీసుకెళ్లగలిగారు. ఆయన కన్నుమూతతో సిక్కోలు నివాళి అర్పించింది. బాల్యమంతా ఛత్తీస్‌గఢ్‌లోనే గడిపినా అప్పుడప్పుడూ శ్రీకాకుళం వస్తుండేవారు. ప్రధానంగా సోంపేట థర్మల్ ఉద్యమానికి ఆయన మద్దతు తెలిపారు. ఆయన మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటని పర్యావరణ పరిరక్షణ సంఘం, మత్స్యకార ఐక్యవేదిక నాయకులు పేర్కొన్నారు. సోంపేట థర్మల్ ఉద్యమం తీవ్రంగా జరుగుతున్న రోజుల్లో అగ్నివేశ్ సోంపేట, బీల ప్రాంత పరిసర గ్రామాల ప్రజలతో మాట్లాడారు. -
కేశవానంద భారతి కన్నుమూత
కాసరగఢ్ (కేరళ): రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే హక్కు పార్లమెంటుకు లేదంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పునివ్వడానికి కారణమైన స్వామి కేశవానంద భారతి (79) పరమపదించారు. దాదాపు గత ఐదు దశాబ్దాలుగా కేరళలోని ప్రఖ్యాత ఎదనీరు మఠాధిపతిగా కేశవానంద భారతి శ్రీపాద గల్వరు ఉన్నారు. వృద్ధాప్య సమస్యలతో ఆదివారం తెల్లవారు జాము 3.30 గంటల సమయంలో ఆయన కన్నుముశారు. కేశవానంద భారతి మృతి పట్ల ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. కేశవానంద భారతి మృతి సమాచారం తెలుసుకుని భారీగా తరలివచ్చిన భక్తులు, అభిమానులు ఎదనీరు మఠంలో ఆయన మృతదేహానికి కన్నీటి నివాళులర్పించారు. ‘ఎదనీరు మఠాధిపతి కేశవానంద భారతి తత్వవేత్త. శాస్త్రీయ సంగీతకారుడు. యక్షగాన ప్రక్రియను పునరుత్తేజపరచడంలో విశేష కృషి చేశారు’అని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాప సందేశం వెలువరించారు. ‘సమాజ సేవలో పూజ్య కేశవానంద భారతి చేసిన సేవలు స్మరణీయం. పేదలు అణగారిన వర్గాలకు సాధికారత కల్పించేందుకు ఆయన గొప్ప కృషి చేశారు’అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. మైలురాయి... ఆ తీర్పు కేరళ భూ సంస్కరణల చట్టాలకు వ్యతిరేకంగా కేశవానంద భారతి వేసిన పిటిషన్‌ను విచారించి... పార్లమెంటుపై రాజ్యాంగ సాధికారతను స్పష్టం చేస్తూ సుమారు 4 దశాబ్దాల క్రితం సుప్రీంకోర్టు మైలురాయి వంటి తీర్పును ప్రకటించింది. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చడం కుదరదని స్పష్టం చేస్తూ.. ఆ సంచలన తీర్పును 13 సభ్యుల ధర్మాసనం వెలువరించింది. ఇప్పటివరకు అత్యధిక సంఖ్యలో న్యాయమూర్తులు సభ్యులుగా ఉన్న ధర్మాసనం ప్రకటించిన తీర్పు అదే కావడం విశేషం. ఆ తీర్పుతో రాజ్యాంగ మౌలిక స్వరూప పరిరక్షణ బాధ్యత సుప్రీంకోర్టుకు దఖలు పడింది. రాజ్యాంగానికి సవరణలు చేసేందుకు పార్లమెంటుకున్న అపరిమిత అధికారానికి కత్తెర వేసిన తీర్పుగా, పార్లమెంటు చేసిన అన్ని సవరణలను సమీక్షించే అధికారాన్ని సుప్రీంకోర్టుకు కట్టబెడుతూ ఇచ్చిన తీర్పుగా అది ప్రసిద్ధి గాంచింది. ‘రాజ్యాంగాన్ని సవరించవచ్చు. కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని సవరించడం కుదరదు అని కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు విస్పష్ట తీర్పునిచ్చింది. అందుకే ఈ కేసుకు అంత ప్రాముఖ్యత నెలకొంది’అని మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కే చంద్రు పేర్కొన్నారు. భూ సంస్కరణల చట్టాల ఆధారంగా కేరళ ప్రభుత్వం.. ఎదనీరు మఠానికి చెందిన కొంత భూమిని స్వాధీనం చేసుకోవడాన్ని సవాలు చేస్తూ కేశవానంద భారతి మొదట కేరళ హైకోర్టులో పిటిషన్ వేసి, పాక్షికంగా విజయం సాధించారు. అయితే, 29వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంటు కేరళ భూ సంస్కరణల చట్టానికి రక్షణ కల్పించడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పార్లమెంటు చేసిన 29వ రాజ్యాంగ సవరణను సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్డ్‌లో (కోర్టుల న్యాయసమీక్షకు వీలు లేకుండా) చేర్చిన కేరళ తీసుకువచ్చిన రెండు భూ సంస్కరణల చట్టాలకు రాజ్యాంగంలోని 31బీ అధికరణ కింద రక్షణ లభించడాన్ని సమర్థించింది. అయితే, అదే సమయంలో, ‘368 అధికరణ ప్రకారం రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకున్నప్పటికీ.. రాజ్యాంగ మౌలిక స్వరూపంలో మార్పులు చేసే అధికారం మాత్రం పార్లమెంటుకు లేదు’అని స్పష్టం చేసింది. రాజ్యాంగ మౌలిక స్వరూపంలో లౌకికత, ప్రజాస్వామ్యం భాగమేనని తేల్చి చెప్పింది. ఈ తీర్పు తదనంతర కాలంలో పలు రాజ్యాంగ సవరణలను కొట్టివేయడానికి ప్రాతిపదికగా నిలిచింది. తాజాగా, ఉన్నత న్యాయస్థానాల్లో న్యా యమూర్తుల నియామకానికి సంబంధించిన ఎన్‌జేఏసీ చట్టాన్ని, సంబంధిత రాజ్యాంగ సవరణను కొట్టివేయడానికి కూడా ఈ తీర్పే ప్రాతిపదిక. -
ప్రణబ్‌కు ప్రముఖుల నివాళి
‘‘ప్రణబ్ ముఖర్జీ ఒక దిగ్గజం. మాతృదేశానికి యోగిలాగా సేవ చేశారు. భరతమాత ప్రియతమ పుత్రుడి మరణానికి దేశమంతా దుఃఖిస్తోంది. ఆధునికతను, సాంప్రదాయంతో మేళవించిన మనీషి భారత రత్న ప్రణబ్. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.’’ – రాష్ట్రపతి రామ్నా«థ్ కోవింద్ ‘‘దేశం ఒక పెద్దమనిషిని కోల్పోయింది. కష్టించే గుణం, క్రమశిక్షణ, అంకితభావంతో ఆయన కిందిస్థాయి నుంచి దేశంలో రాజ్యాంగబద్ధమైన అత్యున్నత స్ధాయికి ఎదిగారు. సుదీర్ఘ ప్రజాసేవలో ఆయన నిర్వహించిన ప్రతిపనికీ గౌరవం తెచ్చారు. ఓం శాంతి.’’ – ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ‘‘2014లో ఢిల్లీకి నేను వచ్చినప్పటినుంచి ప్రణబ్ దార్శనికత, ఆయన ఆశీస్సులు నాకు మద్దతుగా నిలిచాయి. ఆయనతో అనుబంధం ఎప్పటికీ గుర్తుంటుంది. రాష్ట్రపతి భవన్‌ను వైజ్ఞానిక, శాస్త్రీయ, సాంస్కృతిక కేంద్రంగా ఆయన మార్చారు. కీలక విధాన నిర్ణయాల్లో ఆయన సలహాలను ఎన్నటికీ మరువలేను. దేశ అభివృద్ధి పథంలో ఆయన ముద్ర స్పష్టంగా ఉంటుంది. ఒక పరిణతి చెందిన రాజకీయ నాయకుడిగా ఆయన్ని అన్ని రాజకీయ పక్షాలు గౌరవించేవి. సమాజంలో అన్ని వర్గాల అభిమానం చూరగొన్న వ్యక్తి భారతరత్న ప్రణబ్’’ – ప్రధాని నరేంద్ర మోదీ ‘‘ప్రణబ్ చేపట్టిన అన్ని పదవులకు వన్నె తెచ్చారు. అన్ని రాజకీయ పక్షాలనేతలతో సుహృద్భావనతో మెలిగేవారు. అంకితభావంతో దేశానికి సేవ చేశారు. ఐదుదశాబ్దాలుగా అటు దేశం, ఇటు కాంగ్రెస్ పార్టీ పయనంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. ఆయన లేని లోటు తీర్చలేదని, ఆయనతో కలిసి పనిచేసిన జ్ఞాపకాలు ఎంతో అమూల్యమైనవి.’’ – కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ ‘‘ప్రణబ్ లేరన్న వార్త తీవ్ర విచారం కలిగించింది. ఆయన మరణంతో స్వతంత్ర భారతావనికి చెందిన ఒక గొప్పనాయకుడిని దేశం కోల్పోయింది. ఆయనతో కలిసి ప్రభుత్వంలో పనిచేయడం జరిగింది. ఆ సమయంలో ఆయన మేధస్సు, విజ్ఞానం, వివిధ ప్రజా విషయాలపై ఆయన అనుభవం నుంచి ఎంతో నేర్చుకున్నాను.’’ – మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ‘‘ప్రణబ్ ముఖర్జీ మృతి తీవ్ర వేదన కలిగిస్తోంది. అంకిత భావంతో దేశానికి సేవ చేసిన అనుభవజ్ఞుడు. ఆయన సుదీర్ఘ ప్రజా జీవిత ప్రయాణం దేశానికే గర్వకారణం. దేశ రాజకీయ యవనికపై ఆయన లేని లోటు పూడ్చలేనిది. ఓం శాంతి.’’ – హోం మంత్రి అమిత్‌షా ‘‘ భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం బాధాకరం. దేశానికి ఆయన అనేక రూపాల్లో అంకితభావంతో సేవలనందించారు. అన్నిపార్టీలు ఆయన మేధస్సును గౌరవించేవి.’’ – బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ‘‘ ప్రణబ్ ముఖర్జీ లేరన్న వార్తతో దేశం తీవ్రవేదన చెందింది. దేశప్రజలతో పాటు ఆయనకు నా నివాళి. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.’’ – కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ‘‘ దేశప్రయోజనాలకే ప్రణబ్ పెద్దపీట వేసేవారు. రాజకీయ అస్పృశ్యతను ఆయన దరిచేరనీయలేదు. ఆర్ఎస్ఎస్కు ఆయన ఒక మార్గదర్శి. సంఘ్‌కు ఆయన లేని లోటు పూడ్చలేనిది.’’ – ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ‘‘ ప్రణబ్ ముఖర్జీ ఒక పరిపూర్ణ పెద్దమనిషి. ఆయనతో ఎంతో అనుబంధం ఉండేది. ఆయన మృతికి నా నివాళి.’’ – లతా మంగేష్కర్ ‘‘ భారత్ ఒక దిగ్గజ రాజకీయవేత్తను, గౌరవనీయుడైన నాయకుడిని కోల్పోయింది.’’ – అజయ్‌దేవగన్ ‘‘దశాబ్దాలుగా ప్రణబ్ దేశానికి సేవలనందించారు.ఆయన మృతి తీవ్ర విచారకరం.’’ – సచిన్ టెండూల్కర్ ‘‘ దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయింది. ఆయన కుటుంబానికి నా సానుభూతి.’’ – విరాట్‌కోహ్లీ -
సదానంద నడచిన బాట
‘నేను ఆశించే మంచి రచయితలలో కలువకొలను సదానంద నిస్సందేహంగా ఒకరు’ అంటారు కొడవటిగంటి కుటుంబ రావు ‘గందరగోళం’ నవలకు రాసిన ముందుమాటలో. కొకు దగ్గర అంత గొప్ప కితాబు పొందగలిగిన అతికొద్దిమంది రచయితలలో సదానంద ఒకరు కావడం ఆశ్చ ర్యమేమీగాదు. ఆరు దశాబ్దాలపాటు నిర్వి రామంగా రాసిన కథలూ, నవలలూ, పిల్లల సాహిత్యమూ ఆయన అరుదైన సాహిత్య విశిష్టతకు నిలువెత్తు ఉదాహరణలుగా నిలిచి ఉంటాయి. 1962లో జరిగిన భారత్–చైనా యుద్ధం భూమికగా ఆయన 1965 ప్రాంతంలో రాసిన ‘బంగారు నడచిన బాట’ అనే పుస్తకాన్ని పరవశంగా పదేళ్ల ప్రాయంలో పదే పదే చదవడమ న్నది నా బాల్య స్మృతుల్లో ఇంకా పదిలంగా ఉంది. పంచ తంత్రపు కథల్లాంటి ‘అలెగొరీ’ పద్ధతిలో జంతువుల్నీ, పక్షుల్నీ, కోతినీ పాత్రల్ని చేసి ‘బంగారు’ అనే మనిషిని కథానాయకుడిగా చేసి ఆయన రాసిన ఆ నవల ‘గలీవర్స్ ట్రావెల్స్’లా అన్ని వయస్సుల వారినీ అలరించే గొప్ప రచన. నవల ముగింపులో బంగారు అడవిలో మృగాల్ని తినేస్తున్న సింహంతో సంధి చేసు కుని ‘శాంతి’ అన్నింటికంటే గొప్పదని ప్రకటిస్తాడు. అయితే సింహాన్ని నమ్మకుండా తుపాకీని కూడా సమకూర్చుకుంటాడు. ఆ నవలకు అప్పట్లోనే రాష్ట్రపతి పురస్కారం వచ్చింది. చిత్తూరు జిల్లాలోని పెద్ద రైల్వే జంక్షనయిన ‘పాకాల’ అనే బస్తీలో 22 ఫిబ్రవరి 1939లో పుట్టిన కలువకొలను సదానంద, ఆ ఊర్లోనే చదివి, ఆ వూర్లోనే బడిపంతులుగా ఉద్యోగం చేసి, అక్కడే పదవీ విరమణ చేసి, ఆ వూర్లోనే చివరివరకూ జీవించాడు. సాహితీ సమావేశాలకుగానీ, యాత్రలు, పర్యటనలకుగానీ పెద్దగా వేరే ఊర్లకు వెళ్లిన వారు కాదు. పాకాల అనే బస్తీ ఆయనకు మిగిలిన దేశాని కంతా చిన్న ప్రతీకలా తయారయ్యింది. దాదాపుగా ఆయన రచనలకన్నింటికీ ఆ వూరే నేపథ్యంగా ఉంది. సదానంద రాసిన ‘తాత దిగిపోయిన బంతి’, ‘ఇస్ ఝండేకే నీచే’, ‘రామదాసు చెర’, ‘రుద్ర భూమి’, ‘రంగురంగుల చీకటి’ వంటి కథల్ని చదివిన ప్పుడు పాకాల అనే బస్తీ అంతే స్పష్టంగా ఆవిష్కృతమవుతుంది. ఒకానొక స్వాతంత్య్ర దినోత్సవం రోజున బడిపిల్లలనంతా ఊరి మధ్యలో ఉండే పోలీసు గ్రౌండులో సమావేశపరుస్తారు. పిల్లలా ఎండలో ఎలా అవస్థ పడుతున్నారో పట్టించుకోకుండా ఊరి ప్రెసి డెంటు, ఆయన వంది మాగధులూ కొలువుచేస్తారు. ఎండలో నిలువుకాళ్ల ఉద్యోగం చేసే బడిపంతుళ్లను పట్టించుకోరు. చివరకు పిల్లలకిచ్చే మిఠా యిల్లో కూడా పెద్ద శాతం వాళ్లకు చేరదు. సమా వేశానంతరం పెద్ద బండిలో గాంధీపటం పెట్టి ఊరేగిస్తారు. మరు నాటి ఉదయాన చూసినప్పుడు అదే బండిలో మున్సిపాలిటీ వాళ్లు చెత్త పోగేస్తుంటారు. అంటే ఆ ఊరేగింపు కోసమని ఆ బండిని స్వాతంత్య్ర దినోత్సవంనాడు మాత్రం శుభ్రం చేసి వాడుకున్నా రన్నమాట. అది చూసి నివ్వెరపోతున్న పంతులుతో మరో పంతులు ‘ఆశ్చర్యపోతున్నావా సదానందం! అది ఇప్పుడు తాత దిగిపోయిన బండి’ అంటాడు. ఈ కథలన్నింటికీ నేపథ్యమైన ‘పాకాల’ను మొత్తం భారత దేశానికంతా ప్రతీకగా సదానందగారు మలుస్తారు. ఆయన రాసిన ‘రక్త యజ్ఞం’, ‘గందరగోళం’, ‘గాడిద బ్రతుకులు’ నవలల్లోనూ ఇటువంటి హాస్యమూ, వ్యంగ్యమూ పాఠకుడ్ని సవాలు చేస్తాయి. ‘ఓండ్రింతలు’ అనే పేరుతో ఆయన పాతికేళ్ల క్రితం రాసిన వ్యంగ్య కథలు ఇప్పటి రాజకీయ పరిస్థితులకు కూడా వ్యాఖ్యానాలుగా ఉంటాయి. గొప్ప బాలసాహిత్యాన్ని సృజించిన అతికొద్ది మంది కథకుల్లో సదానందం ఒకరు. ‘విందు భోజనం’, ‘పైరగాలి’ లాంటి కథా సంపుటులూ.. ‘బంగారు నడిచిన బాట’, ‘అడవితల్లి’, ‘వట్టి చేతులు’ వంటి నవలలూ ఆయన పిల్లల కోసమే రాసినా అవి పెద్ద లనూ అలరిస్తాయి. ‘సాంబయ్య గుర్రం’, ‘కోతి బుద్ధి’ వంటి కథల్ని తల్చుకుని ఇప్పటికీ నవ్వుకునే పాఠకులున్నారు. పిల్లల కోసం ఆయన పాటల్ని కూడా చాలా రాశారు. ‘‘కలవారి అబ్బాయి కోటేశుగాడు / కొలిచి జానెడు ఇల్లు గట్టాడు అద్దెకీబడునంచు అట్టగట్టాడు / దిష్టిబొమ్మకు దీటు తాను నిలిచాడు..’’ అంటూ సాగిపోయే ఆయన పిల్లలపాట హాస్యంగానే ఉంటూ వ్యంగ్యంగానూ ఊపి పారేస్తుంది. కేంద్రసాహిత్య అకాడమీ వాళ్లిచ్చే పిల్లల సాహిత్య అవార్డు ముందుగా ఆయన రాసిన ‘అడవితల్లి’ నవలకే వచ్చింది. సదానంద చిత్రకారుడు కూడా. చిత్తూరు జిల్లాలో ప్రచురించిన అనేక పుస్తకాలకు ఆయన ముఖ చిత్రాలంకరణ చేశారు. ఎన్నో కార్టూన్లు కూడా గీశారు. దాదాపుగా రెండువందల కథలు, పదినవలలూ, పిల్లల కోసం మరో వందకు పైగా కథలూ, ఎన్నో పాటలూ రాసినవాడాయన. ఆరేడేళ్ల క్రితం కంటి చూపుకోసం ఆపరేషన్ చేసినప్పుడు దురదృష్టవశాత్తూ ఆయన చూపు పోయింది. అందువల్ల తన చివరిరోజుల్లో రాయవలసింది రాయలేక ఆయన చాలా బాధ పడ్డారు. 1950 నుంచి 2000 వరకు సాగిన తెలుగు కథానికా స్వర్ణయుగానికి చెందిన చివరి కథకుడు కలువకొలను సదానంద గారు. 82 ఏళ్ల వయస్సులో ఆయన ఈ ఆగస్టు 25వ తేదీ మధ్యాహ్నం ఈ ప్రపంచాన్ని విడిచిపోవడంతో చిత్తూరు జిల్లాకు చెందిన ఒక గొప్ప సాహిత్య దిగ్గజం వెళ్లిపోయిందని అనడం కంటే తెలుగు సాహిత్యపు ఆధునిక సాహితీ కెరటమొక్కటి విశ్రాంతి తీసుకుందని అనడమే సబబుగా ఉంటుంది. వ్యాసకర్త ప్రముఖ కథా రచయిత మధురాంతకం నరేంద్ర మొబైల్ : 98662 43659 -
వాజ్‌పేయితో ఉన్న వీడియోను షేర్ చేసిన మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి రెండో వర్ధంతి(ఆగస్టు 16) సందర్భంగా ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా నివాళులర్పించారు. ‘ఈ పుణ్యతిథిన అటల్జీకి ఇవే నా ఘనమైన నివాళులు. ఆ మహనీయుడి సేవల్ని భారత ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు’ అని ఓ ట్వీట్ చేస్తూ వాజ్ పేయికి సంబంధించిన ఫొటోలతో కూడిన సుమారు రెండు నిముషాల వీడియోను మోదీ విడుదల చేశారు. ప్రధానిగా దేశాభివృద్ధికి అటల్ బిహారీ వాజ్‌పేయి చేసిన సేవలు ఎనలేనివని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆయన హయాంలోనే భారత్ అణు శక్తిగా ఎదిగిందని గుర్తు చేసుకున్నారు. రాజకీయ నాయకుడిగా, ఎంపీగా, ప్రధానిగా అటల్ ఈ దేశానికి అమూల్యమైన సేవలను అందించారని అన్నారు. (చదవండి : ఎల్ఓసీ నుంచి ఎల్ఏసీ వరకు గట్టిగా బుద్ధి చెప్పాం) 1924 డిసెంబర్ 25న మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో వాజ్‌పేయి జన్మించారు. బీజేపీ నుంచి ప్రధాని అయిన మొదటి నాయకుడు ఆయనే. మూడు పర్యాయాలు ఆయన ప్రధానిగా దేశానికి సేవలందించారు. 1996లో, 1998 నుంచి 1999వరకు ఆ తరువాత 1999 -2004 మధ్య పూర్తి ఐదేళ్లు ప్రధానిగా వాజ్‌పేయి కొనసాగారు. ఆయన హయాంలోనే 1998 మే 11 -13 మధ్య భారత్ పోఖ్రాన్ పరీక్షలు నిర్వహించింది. 2018 ఆగస్టు 16 న వాజ్ పేయి దివంగతులయ్యారు. Tributes to beloved Atal Ji on his Punya Tithi. India will always remember his outstanding service and efforts towards our nation’s progress. pic.twitter.com/ZF0H3vEPVd — Narendra Modi (@narendramodi) August 16, 2020 -
హాలీవుడ్ దర్శకుడు అలెన్ పార్కర్ మృతి
ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు అలెన్ పార్కర్ (76) మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారాయన. ‘బగ్స్ మాలోనే, మిడ్ నైట్ ఎక్స్ ప్రెస్, ఎవిత, ఫేమ్, ద కమిట్మెంట్స్’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు అలెన్. ఆయన 14 సినిమాలు తెరకెక్కించారు. వాటిలో సుమారు 19 బాఫ్తా అవార్డులు, పది గోల్డెన్ గ్లోబ్ అవార్డులు, 6 అకాడమీ అవార్డులు గెలుచుకున్న చిత్రాలు ఉన్నాయి. అలెన్ మృతి పట్ల పలువురు హాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. -
అమర్‌సింగ్ కన్నుమూత
న్యూఢిల్లీ: రాజ్యసభ సభ్యుడు, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) మాజీ నేత అమర్‌సింగ్(64) కన్నుమూశారు. సింగపూర్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. 2011లో ఆయనకు కిడ్నీ మార్పిడి జరిగింది. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మరో కిడ్నీ మార్పిడి కోసం 8 నెలల క్రితం సింగపూర్‌లోని ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమించి శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య పంకజకుమారి, కుమార్తెలు దృష్టి, దిశ ఉన్నారు. అమర్‌సింగ్ మృతికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ సహా పార్టీలకతీతంగా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ‘అమర్‌సింగ్ మరణం ఎంతో విచారం కలిగించింది. ఆయన సమర్థుడైన పార్లమెంటేరియన్. బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులకు ప్రగాఢ సానుభూతి’అని రాష్ట్రపతి కోవింద్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రముఖుల సంతాపం అమర్‌సింగ్ కుటుంబసభ్యులకు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేశంలో సంభవించిన కీలక రాజకీయ పరిణామాలకు ప్రత్యక్ష సాక్షి అయిన అమర్‌సింగ్ గొప్ప ప్రజానాయకుడని ప్రధాని మోదీ కొనియాడారు. అందరితో కలివిడిగా మెలిగే అమర్‌సింగ్ మంచి రాజకీయ నేత, వ్యూహకర్త అని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ట్విట్టర్లో తన తండ్రి, పార్టీ వ్యవస్థాపకుడు ములాయంతో అమర్‌సింగ్ ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశారు. ఆయన కుటుంబసభ్యులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అమర్‌సింగ్ మృతికి కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ సంతాపం ప్రకటించారు. రాజకీయ నేపథ్యం లేకుండానే... 1956 జనవరి 27న∙ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్‌లో జన్మించిన అమర్‌సింగ్‌కు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. ఎస్పీ అధినేత ములాయం సింగ్‌కు అత్యంత సన్నిహితుడిగా పలుకుబడిగల నేతల్లో ఒకరిగా ఎదిగారు. 2008లో అప్పటి యూపీఏ ప్రభుత్వం అమెరికాతో కుదుర్చుకున్న అణు ఒప్పందానికి వ్యతిరేకంగా వామపక్షాలు యూపీఏ నుంచి వైదొలగడంతో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రమాదంలో పడింది. ఆ సమయంలో ఎస్పీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అమర్.. ఎస్పీ మద్దతుతో యూపీఏ ప్రభుత్వాన్ని కాపాడటంలో కీలకపాత్ర పోషించారు. యూపీ నుంచి రాజ్యసభకు తొలిసారిగా 1996లో ఎన్నికయ్యారు. 2003, 2016లో రాజ్యసభ సభ్యుడయ్యారు. 1996 నుంచి 2010లో బహిష్కరణకు గురయ్యే వరకు ఆయన ఎస్పీలో కీలక నేతగా కొనసాగారు. అనిల్ అంబానీ, అమితాబ్ బచ్చన్, ‘సహారా’ సుబ్రతా రాయ్ తదితరులతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. సినీనటి జయప్రద ఎస్పీలో చేరడం వెనుక అమర్ హస్తం ఉందని అంటుంటారు. అమితాబ్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయి. 2016లో ఆయన అమితాబ్ భార్య జయా బచ్చన్‌పై సంచలన వ్యాఖ్యలు చేయడంతో అంతరం పెరిగింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై ఆయన్ను సమాజ్‌వాదీ పార్టీ 2010లో బహిష్కరించింది. ఓటుకు నోటు కుంభకోణంలో 2011లో అరెస్టయ్యారు. అయినప్పటికీ, 2016లో ఎస్పీ మద్దతుతోనే స్వతంత్ర అభ్యర్ధిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2016లో తిరిగి పార్టీలో చేర్చుకున్న ములాయం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. అయితే, ఆ తర్వాత ఎస్పీ పగ్గాలు చేపట్టిన అఖిలేశ్ యాదవ్ 2017లో ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించారు. ఎస్పీ నుంచి దూరమైన అమర్‌సింగ్ ప్రధాని మోదీకి, బీజేపీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్కు దగ్గరయ్యారు. ఆజంగఢ్‌లో ఉన్న తమ పూర్వీ కుల ఆస్తులను ఆర్ఎస్ఎస్కు విరాళంగా అందజేస్తానని ప్రకటించారు. -
సైనిక ఆస్పత్రికి రాష్ట్రపతి 20 లక్షల విరాళం
న్యూఢిల్లీ: కార్గిల్ యుద్ధంలో పోరాడి విజయం సాధించి అమరులైన సైనికులకు నివాళిగా ఢిల్లీలోని సైనిక ఆస్పత్రికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రూ.20 లక్షలు విరాళమిచ్చారు. కరోనాను ఎదుర్కోవడానికి అవసరమైన శ్వాసకోçశ సంబంధిత యంత్రాలను కొనుగోలు చేస్తారని అధికారులు వెల్లడించారు. రూ. 20 లక్షలను చెక్కు ద్వారా అందించారని పేర్కొన్నారు. రాష్ట్రపతి తన ఖర్చులను తగ్గించుకుని ఈ డబ్బును విరాళం ఇచ్చినట్లు చెప్పారు. -
‘దాశరథి ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తాం’
సాక్షి, హైదరాబాద్: దాశరథి కృష్ణమాచార్యులు తెలంగాణ సాహితీ యోధుడని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. దాశరథి కృష్ణమాచార్యుల 96వ జయంతిని పురస్కరించుకొని మంగళవారం కేసీఆర్ ఆయనకు నివాళులు అర్పించారు. దాశరథి రగిలించిన చైతన్య స్ఫూర్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమించేందుకు కావాల్సిన సంకల్ప బలాన్ని ఇచ్చిందని కొనియాడారు. సాహిత్యరంగానికి ఆయన అందించిన సేవలకు గుర్తుగా తెలంగాణ ప్రభుత్వం ప్రతీ ఏటా అధికారికంగా ఆయన జన్మదిన వేడుకలను నిర్వహిస్తూ, అవార్డులను ప్రదానం చేస్తోందని కేసీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం దాశరథి అందించిన ఉద్యమ చైతన్య స్ఫూర్తిని కొనసాగిస్తుందని చెప్పారు. -
దర్శక–నిర్మాత హరీశ్ షా కన్నుమూత
బాలీవుడ్ దర్శక–నిర్మాత హరీశ్ షా (76) ముంబైలో కన్నుమూశారు. పదేళ్లుగా హరీశ్ గొంతు క్యాన్సర్‌తో పోరాడుతున్నారని ఆయన సోదరుడు వినోద్ షా తెలిపారు. రాజేశ్ ఖన్నా హీరోగా ‘మేరే జీవన్ సాథీ’, ‘రామ్ తేరీ కిత్నే నామ్’ తదితర చిత్రాలను నిర్మించారు హరీశ్. నిర్మాతగా ఆయన చివరి చిత్రం ‘జాల్: ది ట్రాప్’ 2003లో విడుదలైంది. ఆ చిత్రంలో సన్నీ డియోల్, టబు, రీమాసేన్ నటించారు. అలాగే ధర్మేంద్ర, శత్రుఘ్న సిన్హా హీరోలుగా ‘జల్జల’, రిషీ కపూర్, నీతూ సింగ్ జంటగా ‘ధన్ దౌలత్’తో పాటు పలు చిత్రాలకు దర్శకత్వం వహించారాయన. హరీశ్ షా మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. -
భావోద్వేగానికి లోనైన మంత్రి పేర్ని నాని
సాక్షి, కృష్ణా : మచిలీపట్నంలో దారుణ హత్యకు గురైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మోకా భాస్కర్‌రావు మృతదేహానికి రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని నివాళులర్పించారు. భాస్కర్‌రావు మృతదేహాన్ని చూసిన మంత్రి పేర్ని నాని భావోద్వేగానికి లోనయ్యారు. ఆయనకు నివాళులర్పిస్తున్న సమయంలో మంత్రి కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం హత్యకు గురైన భాస్కర్‌రావు కుటుంబాన్ని మంత్రి ఓదార్చారు. కాగా, మున్సిపల్ చేపల మార్కెట్లో ఉన్న భాస్కర్‌రావును దుండగులు కత్తితో పొడిచి పరారయ్యారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన్ను మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. దుండగులు పక్కా ప్లాన్‌తో సైనేడ్ పూసిన కత్తితో భాస్కర్ రావును హత్య చేసినట్టుగా తెలుస్తోంది. ఈ హత్యలో ఇద్దరు యువకులు పాల్గొన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆ ఇద్దరూ టీడీపీ మాజీ కౌన్సిలర్ అనుచరులుగా అనుమానం వ్యక్తం అవుతోంది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.(చదవండి : వైఎస్సార్ సీపీ నేత దారుణ హత్య) మచిలీపట్నం ఆస్పత్రి వద్ద హైటెన్షన్.. భాస్కర్‌రావు హత్యకు గరయ్యాడనే విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. భాస్కర్‌రావును హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు ఆస్పత్రి వద్ద భారీగా బలగాలను మోహరించారు. దీంతో ఆస్పత్రి వద్ద హైటెన్షన్ నెలకొంది. మరోవైపు ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు కూడా ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. -
రష్యా, భారత్, చైనా త్రైపాక్షిక భేటీ
మాస్కో/న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలన్నీ అన్ని రకాల మార్గాల్లోనూ అత్యున్నతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ అన్నారు. రెండో ప్రపంచ యుద్ధం జరిగి 75 ఏళ్ల వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని రష్యా, భారత్, చైనా విదేశాంగ మంత్రులు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమై చర్చలు జరిపారు. భారత్, చైనా మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్న వేళలోనే ఈ సమావేశం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశానికి హాజరైన జైశంకర్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ సమక్షంలోనే ఆ దేశంపై పరోక్షంగా విమర్శలు చేశారు. అంతర్జాతీయ చట్టాలను గౌరవిస్తూ, భాగస్వామ్య పక్షాలకు చట్టబద్ధంగా కలిగే ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తూ, అన్ని దేశాలకు మంచి జరిగేలా, పటిష్టమైన కొత్త ప్రపంచం ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతర్జాతీయ సంబంధాల్లో నైతికత ఉండాలని చెప్పారు. భారత్, చైనా మధ్య ఉద్రిక్తతల్ని చల్లార్చడానికి తాము ఎలాంటి మధ్యవర్తిత్వం వహించబోమని రష్యా విదేశాంగ మంత్రి సెర్జే లారోవ్ స్పష్టం చేశారు. అందరి ప్రయోజనాలు కాపాడాలి : వాంగ్ యీ రష్మా, భారత్, చైనా కలసికట్టుగా సమస్యాత్మక అంశాలను ఎదుర్కోవాలని చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యీ అన్నారు. 3 దేశాల సంబంధాల పరిరక్షణ కోసం అన్నిదేశాల ప్రయోజనాలు కాపాడేలా వ్యహరించాలన్నారు. మహాత్ముడికి రాజ్‌నాథ్ నివాళులు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం మాస్కోలో భారత రాయబార కార్యాలయ ఆవరణలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్‌నాథ్.. చైనా రక్షణమంత్రి వీ ఫెంగ్‌తో సమావేశం కావడం లేదని విదేశాంగ శాఖ తెలిపింది. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై సోవియెట్ సేనల విజయానికి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని జరిగే 11 దేశాల సైనిక బలగాల పెరేడ్లో పాల్గొనేందుకు రాజ్‌నాథ్ రష్యా వెళ్లిన విషయం తెలిసిందే. -
వీరులకు అశ్రునివాళి
న్యూఢిల్లీ: చైనా సైనికులతో ఘర్షణలో అమరులైన 20 మంది భారత సైనికులను స్మరిస్తూ బుధవారం లద్దాఖ్ రాజధాని లేహ్‌లో నివాళి కార్యక్రమం జరిగింది. జూన్ 15న సున్నా కంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న లోయలో చైనా భారత్ సైనికులు ముఖాముఖి తలపడటం తెల్సిందే. అమరులైన వారిలో తెలుగుతేజం కల్నల్ సంతోష్‌బాబు ఉన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్పందిస్తూ.. ఈ వీర జవాన్ల త్యాగాలు వృథాకావని వ్యాఖ్యానిం చారు. దేశ ఐక్యత, సార్వభౌమత్యం తమకు ప్రాధాన్యమని తేల్చి చెప్పారు. భారత్ శాంతిని కోరుకుంటోందని, అదే సమయంలో తగిన జవాబు కూడా ఇవ్వగలదని చెప్పారు. మరోవైపు ఈ దాడిలో పాల్గొన్న నలుగురు సైనికుల పరిస్థితి విషమంగా ఉందని ఆర్మీ అధికారిక వర్గాలు తెలిపాయి. చైనా వైపు కూడా దాదాపు 45 మంది సైనికులు మరణించి ఉండవచ్చని అధికారులు తెలిపారు. ఈ దాడి ఆయుధాలతోగాక పిడిగుద్దులు, రాళ్లు విసురుకోవడంతో జరిగిందని అన్నారు. అయితే చైనా సైనికులు మాత్రం రాడ్లు, మేకులు కలిగిన ఆయుధాలు ఉపయోగించినట్లు తెలుస్తోంది. వాస్తవాధీన రేఖకు లోపలే భారత్ తమ కార్యకలాపాలను సాగిస్తోందని, చైనా నుంచి దీన్నే ఆశిస్తున్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాక్ శ్రీవాస్తవ చెప్పారు. అమరులైన భారత సైనికులు భికుమల్ల సంతోష్ బాబు(సూర్యాపేట), నుదరమ్ సోరెన్(మయూర్భంజ్), మన్దీప్ సింగ్ (పటియాలా), సత్నామ్ సింగ్(గుర్దాస్పూర్), కె. పలాని(మధురై), సునిల్ కుమార్(పట్నా), బిపుల్ రాయ్(మీరట్ సిటీ), దీపక్ కుమార్(రెవా), రాజేష్ ఒరాంగ్(బిర్గుమ్), కుందన్ కుమార్ ఓజా(సహిబ్గంజ్),గణేష్ రామ్(కాంకెర్), చంద్రకాంత ప్రధాన్(కందమాల్), అంకుష్(హమిర్పుర్), గుర్బిందర్(సంగ్రుర్), గుర్తెజ్ సింగ్(మన్సా), చందన్ కుమార్(భోజ్‌పూర్), కుందన్ కుమార్(సహర్సా), అమన్ కుమార్(సమస్తిపూర్), జై కిషోర్ సింగ్ (వైశాలి), గణేశ్ హన్సా్ద(ఈస్ట్ సింగ్బుమ్) -
బలిదానం వృథా కాదు!
సాక్షి, న్యూఢిల్లీ: సైనికుల బలిదానాలు వృ«థా కాబోవని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. భారత్ శాంతికాముక దేశమే కానీ, రెచ్చగొడితే సరైన రీతిలో సమాధానమివ్వగలదని స్పష్టం చేశారు. తూర్పు లద్దాఖ్‌లోని గాల్వన్ లోయలో చైనా సైనికుల పాశవిక దాడిలో అమరులైన భారతీయ జవాన్లకు ప్రధాని ఘనంగా నివాళులర్పించారు. ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా వారితో పాటు బుధవారం రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అంతకుముందు చైనా ఘాతుకంపై స్పందిస్తూ.. దేశ సమగ్రత, సార్వభౌమత్వం విషయంలో భారత్ ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడబోదని తేల్చి చెప్పారు. ‘భారత్ ప్రాథమికంగా శాంతిని కోరుకునే దేశం. పొరుగుదేశాలతో స్నేహ, సహకార సంబంధాల దిశగానే కృషి చేశాం. పొరుగు దేశాల అభివృద్ధిని, సంక్షేమాన్ని కాంక్షించాం. మనమెవరినీ రెచ్చగొట్టం. అదే సమయంలో, ఎవరైనా రెచ్చగొడితే, సరైన రీతిలో సమాధానమిస్తాం. మన దేశ చరిత్రలో త్యాగంతో పాటు శౌర్యం, వీరత్వం కూడా సమపాళ్లలో కనిపిస్తాయి. దేశ సమగ్రత, సార్వభౌమత్వాల విషయంలో రాజీ లేని ధోరణి భారత్‌ది. దేశ సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడుకునే క్రమంలో అవసరమైన ప్రతీసారి భారత్ తన శక్తి సామర్థ్యాలను నిరూపించుకుంటూనే ఉంది’ అని మోదీ పేర్కొన్నారు. రక్షణ మంత్రి, హోం మంత్రి నివాళులు చైనా సరిహద్దుల్లో వీర మరణం చెందిన భారతీయ సైనికులకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా ఘనంగా నివాళులర్పించారు. జవాన్లు అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించారని రాజ్‌నాథ్ కొనియాడారు. దేశం వారి త్యాగాన్ని మరచిపోదన్నారు. సైనికుల ప్రాణ త్యాగంపై బాధను వ్యక్తపరిచేందుకు తన వద్ద మాటలు లేవని అమిత్ షా ట్వీట్ చేశారు. వారికి దేశం రుణపడి ఉంటుందన్నారు. అంగుళం కూడా వదలం చైనా సైనికుల దాడిలో మరణించిన సైనికుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ప్రధాని.. దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్లు వారని, పోరాటంలో శత్రువును అంతమొందిస్తూ వారు ప్రాణాలొదిలారని కొనియాడారు. ‘మన అమర జవాన్ల త్యాగాలు వృథా కావు. ఎలాంటి పరిస్థితుల్లోనయినా, దేశ ఆత్మగౌరవాన్ని నిలబెడతాం. ఒక అంగుళం భూభాగాన్ని కూడా వదలబోం’ అన్నారు. ‘సార్వభౌమత్వం మనకు సర్వోన్నతం. దాన్ని కాపాడుకోవడంలో మనల్నెవరూ ఆపలేరనే విషయంలో అణుమాత్రం కూడా సందేహం అవసరం లేదు’ అని స్పష్టం చేశారు. -
వారి త్యాగానికి దేశం గర్విస్తోంది: మోదీ
న్యూఢిల్లీ : భారత్-చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్లకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. బుధవారం పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో పాల్గొన్న మోదీ.. లేచి నిలబడి రెండు నిమిషాల మౌనం పాటించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న హోం మంత్రి అమిత్ షా, సీఎంలు కూడా అమర జవాన్లకు నివాళులు అర్పించారు. అమర జవాన్ల త్యాగాన్ని చూసి దేశం గర్విస్తోందని మోదీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ‘మన జవాన్ల త్యాగం వృథా కాదని దేశానికి హామీ ఇస్తున్నాను. భారత్ సార్వభౌమాధికారంపై రాజీ పడే ప్రసక్తే లేదు. భారత్ శాంతిని కోరుకుటుందని.. కానీ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే అందుకు తగ్గ సమాధానం ఇవ్వగలదు’ అని మోదీ తెలిపారు. మరోవైపు తూర్పు లద్ధాఖ్‌లో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు మోదీ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించనున్నట్టుగా సమాచారం. కాగా, తూర్పు లద్దాఖ్‌లోని గాల్వన్ లోయ ప్రాంతంలో సోమవారం రాత్రి భారత్-చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది జవానులు వీర మరణం పొందిన విషయం తెలిసిందే. (చదవండి : సలామ్ కల్నల్ సంతోష్..) -
సుశాంత్‌సింగ్ ఆత్మహత్య
ముంబై: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ కన్నుమూశారు. ఆయన ముంబైలోని బాంద్రాలో తన నివాసంలో ఆదివారం ఉరి వేసుకున్నారు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. యువ నటుడి బలవన్మరణానికి గల కారణాలు తెలియరాలేదని, దర్యాప్తు సాగిస్తున్నామని వెల్లడించారు. మెడికల్ రిపోర్టు కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. సుశాంత్‌సింగ్ కేవలం 34 ఏళ్ల వయసులోనే తనువు చాలించడం పట్ల బాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బిహార్ రాజధాని పాట్నాకు చెందిన ఆయన తొలుత టీవీ సీరియళ్లలో నటించారు. అనంతరం హిందీ సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టారు. సుశాంత్‌కు తండ్రి, నలుగురు అక్కలు ఉన్నారు. తల్లి 2002లో మరణించారు. ఆయన మాజీ మేనేజర్ దిశా సలియాన్(28) జూన్ 9న ఓ బహుళ అంతస్తుల భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇంజనీరింగ్ మధ్యలోనే ఆపేసి... ఢిల్లీ టెక్నోలాజికల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ విద్యార్థి అయిన సుశాంత్‌సింగ్ మధ్యలోనే చదువు ఆపేశారు. కొరియోగ్రాఫర్ షియామక్ దేవర్ వద్ద నృత్యంలో శిక్షణ పొందారు. 2006లో విడుదలైన ధూమ్ 2 సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్‌గా కొంతసేపు కనిపించారు. 2009లో ప్రసారమైన పవిత్ర రిస్తా సీరియల్లో నటించారు. 2011లో కై పో చే చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. శుద్ధ్ దేశీ రోమాన్స్, రాబ్తా, కేదార్నాథ్, ఎంఎస్ ధోనీ: ద అన్‌టోల్డ్ స్టోరీ, చిచోరీ తదితర చిత్రాల్లో నటించారు. క్రికెటర్ ధోనీ బయోపిక్ అయిన ఎంఎస్ ధోనీ: ద అన్‌టోల్డ్ స్టోరీ చిత్రం సుశాంత్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో ఆయన అందరి దృష్టిని ఆకర్షించారు. చివరిసారిగా 2019లో చిచోరే చిత్రంలో వెండితెరపై కనిపించారు. సుశాంత్ అంత్యక్రియలు సోమవారం ముంబైలో జరగనున్నట్లు సమాచారం. బంధువులు పట్నా నుంచి ముంబైకి చేరుకుంటున్నారు. సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మరణం పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, ప్రకాశ్ జవదేకర్, సినీ నటులు షారుక్ ఖాన్, అనిల్‌కపూర్, కరణ్ జోహార్, క్రికెటర్ విరాట్ కోహ్లీ తదితరులు సంతాపం ప్రకటించారు. ప్రతిభావంతుడైన నటుడు దూరం కావడం దురదృష్టకరమని వారు పేర్కొన్నారు. -
తొందరగా వెళ్లిపోయావ్ మిత్రమా!
న్యూఢిల్లీ: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బాలీవుడ్ నటుడే కానీ క్రికెట్ చూసే ప్రతీ ఒక్కరికీ అతనో ‘బాలీవుడ్ ఎంఎస్ ధోని’. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జీవిత కథ ఆధారంగా నిర్మించిన ‘ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ’ సినిమాలో మహి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి అతను క్రికెట్ వర్గాలకు సుపరిచితుడయ్యాడు. డిప్రెషన్ కారణంగా 34 ఏళ్ల సుశాంత్ ముంబైలోని తన ఇంట్లో ఆదివారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడటంతో క్రికెట్ వర్గాలు విస్తుపోయాయి. పలువురు క్రికెటర్లు సుశాంత్ విషాదాంతంపై విస్మయానికి లోనయ్యారు. చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయావు మిత్రమా అంటూనే... ఈ వార్త అబద్ధమైతే బావుండంటూ సామాజిక మాధ్యమాల ద్వారా తమ ఆవేదన వ్యక్తం చేశారు. సుశాంత్ మరణం కలిచి వేస్తోంది. అతనో ప్రతిభావంతుడైన యువ నటుడు. వారి కుటుంబానికి, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి. నీ ఆత్మకు శాంతి చేకూరాలి. –సచిన్ టెండూల్కర్ ఈ వార్త విని షాకయ్యా. ఇది జీర్ణించుకోవడం కష్టం. దేవుడు వారి కుటుంబానికి ధైర్యాన్నివ్వాలి. – కోహ్లి దీన్ని నమ్మాలనిపించట్లేదు. చాలా బాధగా ఉంది. నీ ఆత్మకు శాంతి కలగాలి బ్రదర్. –రోహిత్ శర్మ షాకింగ్, నమ్మడానికి చాలా కష్టంగా ఉంది. సుశాంత్ కుటుంబం కోసం ప్రార్థిస్తా. –శిఖర్ ధావన్ జీవితం సున్నితమైనది. ఎవరి జీవితంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. అందరితో దయతో మెలగండి. ఓం శాంతి. –వీరేంద్ర సెహ్వాగ్ నిజంగా దీన్ని నమ్మలేను. ఓ ప్రతిభావంతుడైన యువకుడి జీవితం ఇలా ముగుస్తుందనుకోలేదు. లోపలి సంఘర్షణను ఎవరూ తెలుసుకోలేరు. –యువరాజ్ సింగ్ మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించాల్సిన సందర్భమిది. సుశాంత్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. –వీవీఎస్ లక్ష్మణ్ నీకు ఇంకా చాలా అందమైన జీవితం ఉంది. చాలా తొందరగా వెళ్లిపోయావు సుశాంత్. –షోయబ్ మలిక్ (పాక్ క్రికెటర్) షాకింగ్. చాలా తొందరగా వెళ్లిపోయావు. ఆన్‌స్క్రీన్ ధోనిని కోల్పోయాం. –సైనా నెహ్వాల్ (స్టార్ షట్లర్) సుశాంత్ మనం ఇద్దరం కలిసి టెన్నిస్ ఆడదామని చెప్పావ్. నువ్వున్న చోటల్లా సంతోషం, నవ్వులు పంచావ్. చివరకు ఇంత బాధపెడతావ్ అనుకోలేదు. హృదయం బద్ధలవుతోంది. –సానియా మీర్జా (టెన్నిస్ స్టార్) ఆ అందమైన నవ్వు వెనక ఎంత సంఘర్షణ దాగుందో తెలుసుకోలేకపోయాం. చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నావు. మేం నిన్ను కోల్పోయాం. –మిథాలీ రాజ్ ఎవరైనా ఇది అబద్ధమని చెప్పండి. సుశాంత్ లేడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. –హర్భజన్ ఈ విషాదాంతం షాకింగ్‌గా ఉంది. కుటుంబానికి, అభిమానులకు నా సంతాపం. –రవిశాస్త్రి మనం ఒక అందమైన పిల్లాడిని, విద్యావంతుణ్ని, కష్టపడి విజయాన్ని సాధించిన వ్యక్తిని కోల్పోయాం. ధోని సినిమా కోసం 9 నెలలు ప్రొఫెషనల్ క్రికెటర్లా ప్రాక్టీస్ చేశాడు. హెలికాప్టర్ షాట్లో పరిపూర్ణత సాధించాడు. ఎన్ని గాయాలు తగిలినా వికెట్‌కీపింగ్ కోసం సిద్ధంగా ఉండేవాడు. అద్భుతమైన తన ప్రయాణాన్ని అర్ధాంతరంగా ముగించాడు. నమ్మలేకపోతున్నా. –కిరణ్ మోరే (ధోని బయోపిక్ కోసం భారత మాజీ వికెట్ కీపర్ మోరే వద్ద సుశాంత్ శిక్షణ తీసుకున్నాడు) -
ఈ ఘటన దురదృష్టకరం
వాషింగ్టన్: అమెరికా రాజధానిలోని భారతీయ దౌత్యకార్యాలయం ఎదుట ఉన్న గాంధీ విగ్రహాన్ని ఆగంతకులు ధ్వంసం చేయడాన్ని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తోపాటు పలువురు రాజకీయ నేతలు తీవ్రంగా ఖండించారు. ఇలాంటి సంఘటనలు ప్రజలను ఏకం చేయవని వారు స్పష్టం చేశారు. ఈ ఘటన దురదృష్టకరమైందని అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. వాషింగ్టన్‌లోని భారత దౌత్యకార్యాలయం సమీపంలో ఉన్న ఈ విగ్రహాన్ని కొందరు దుండగులు బుధవారం ధ్వంసం చేసి, రంగులు పూసిన విషయం తెలిసిందే. ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మరణం నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతున్న తరుణంలో ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. అయితే, ఈ ఘటనకు ఆందోళనలతో సంబంధం లేదని మార్కో రూబియో అనే సెనెటర్ గురువారం తెలిపారు. నార్త్ కరొలినా సెనేటర్ టామ్ టిల్లిస్ కూడా ఇది అమర్యాదకరమైందని అభివర్ణించారు. శాంతికి మారుపేరుగా చెప్పుకునే గాంధీ ప్రతిరూపాన్ని ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ట్రంప్ సలహాదారు కింబర్లీ గుయిఫోలే చెప్పారు. మా గొంతులపై మీ మోకాళ్లు తీయండి.. ‘‘మా గొంతులపై మీ మోకాళ్లు తొలగించం డి’’అన్న నినాదాల మధ్య మినియాపోలిస్‌లో గురువారం జార్జ్ ఫ్లాయిడ్ సంస్మరణ సభలు జరిగాయి. శవపేటిక చుట్టూ గుమికూడిన పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నేతలు ఫ్లాయిడ్ మృతికి సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఒకవైపు ఈ సభ జరుగుతూండగా కొంత దూరంలోనే ఉన్న న్యాయస్థానంలో ఫ్లాయిడ్ హత్యకు కారణమైన ముగ్గురు పోలీసు అధికారులకు న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేస్తూ.. పూచీకత్తుగా సుమారు రూ.5 కోట్ల చొప్పున చెల్లించాలని ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. ఇదిలా ఉండగా.. ఫ్లాయిడ్ ఘటనకు నిరసనగా ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి. ప్యారిస్, లండన్, సిడ్నీ, రియో డిజెనిరోల్లో నిరసనలు జరిగాయి. అదే సమయంలో ఆమెరికాలోని కాలిఫోర్నియాలో ఇప్పటివరకూ ఉన్న కర్ఫ్యూను సడలించారు. కొన్ని చెదురుమ దురు సంఘటనలు మినహా అమెరికా నగరాల్లో ప్రశాంతత నెలకొంది. కొన్నిచోట్ల శాంతియుత ప్రదర్శనలు జరిగాయి. ట్రంప్ ట్వీట్‌కు కత్తెర... సామాజిక మాధ్యమ సంస్థ ట్విట్టర్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు మధ్య జరుగుత్ను పరోక్ష యుద్ధంలో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఫ్లాయిడ్‌కు నివాళులర్పిస్తూ ట్రంప్ విడుదల చేసిన ఓ ప్రచార వీడియోను ట్విట్టర్ బ్లాక్ చేసింది. ఈ వీడియోపై ట్విట్టర్ ఒక లేబుల్‌ను పెడుతూ వీడియో తమదని ఇతరులు ఫిర్యాదు చేసిన కారణంగా దాన్ని బ్లాక్ చేస్తున్నట్లు పేర్కొంది. జోధ్‌పూర్‌లో ‘ఫ్లాయిడ్’ ఘటన! జో«ద్‌పూర్: జార్జ్ ఫ్లాయిడ్ తరహా ఘటనే భారత్‌లోనూ చోటు చేసుకుంది. రాజస్తాన్‌లోని జోధ్‌పూర్ నగరంలో ఓ పోలీస్ అధికారి ఒక వ్యక్తిని కిందకు పడదోసి మోకాళ్లతో అదిమి పట్టుకున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. మాస్కు లేకుండా బయట తిరుగుతున్న ముఖేష్ ప్రజాపతి అనే వ్యక్తిని పోలీసులు ప్రశ్నించగా అతడు తీవ్రంగా ప్రతిఘటించాడు. ఈ మేరకు ప్రతాప్‌నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. -
ఉద్యమ నినాదం.. 8.46
మినియాపోలిస్/వాషింగ్టన్: అమెరికాలో పోలీసుల దౌర్జన్యానికి, వివక్షకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి ‘8.46’అన్న అంకె నినాదంగా మారుతోంది. ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్‌ను మే 25న మినియాపోలీస్ పోలీసు అధికారి డెరెక్ చెవెన్ నేలకు అదిమిపెట్టి ఉంచిన సమయం 8 నిమిషాల 46 సెకన్లు అని విచారణ సందర్భంగా తెలియడంతో ఉద్యమకారులు ఆ అంకెను నినాదంగా మార్చారు. ఈ సమయాన్ని ఇంత కచ్చితంగా ఎలా నిర్ధారించారన్న అంశంపై స్పష్టత లేకపోయినప్పటికీ ఆందోళనకారుల్లో మాత్రం బాగా ప్రాచుర్యం పొందింది. బోస్టన్, టాకోమా, వాషింగ్టన్లలో జరిగిన ప్రధర్శనలు 8.46 నిమిషాలపాటు జరగడం.. హ్యూస్టన్‌లో చర్చిల్లో ప్రార్థనలు నిర్వహించే వాళ్లు చేతుల్లో మైనపు వత్తులు పెట్టుకుని అంతే సమయం మోకాళ్లపై పాకుతూ నిరసన వ్యక్తం చేయడం ఈ అంకెకు ఏర్పడిన ప్రాధాన్యానికి సూచికలు. టెలివిజన్ చానళ్లు వయాకామ్‌సీబీఎస్ గతవారం ఫ్లాయిడ్‌కు నివాళులు అర్పిస్తూ 8.46 నిమిషాలపాటు ప్రసారాలు నిలిపివేసింది. గూగుల్ సీఈఓ నివాళి 8 నిమిషాల 46 సెకన్లపాటు మౌనం వహించడం ద్వారా ఫ్లాయిడ్‌కు నివాళులు అర్పించాలని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఉద్యోగులకు రాసిన లేఖలో కోరారు. జాతివివక్షపై జరిగే పోరుకు గూగుల్ సుమారు రూ.210 కోట్లు విరాళంగా ఇవ్వనుందన్నారు. జాతి అసమానతల నివారణ కోసం పనిచేస్తున్న సంస్థలకు కోటీ ఇరవై లక్షల డాలర్ల నగదు సాయం అందిస్తామని, సంస్థలు జాతి వివక్షపై పోరాడేందుకు, కీలకమైన సమాచారం అందించేందుకు 2.5 కోట్ల డాలర్ల విలువైన ప్రకటనలను గ్రాంట్ రూపంలో ఇస్తామని పిచాయ్ వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా సెంటర్ ఫర్ పోలీసింగ్ ఈక్విటీ అండ్ ఈక్వల్ జస్టిస్ ఇనిషియేటివ్‌కు పది లక్షల డాలర్ల విరాళం ఇవ్వనున్నట్లు తెలిపారు. జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతం తరువాత అమెరికా వ్యాప్తంగా అల్లర్లు చెలరేగుతున్న నేపథ్యంలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా రాజకీయంగా చురుకుగా మారారు. నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఒబామా మరోసారి ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నం చేస్తూండటం గమనార్హం. ‘సమాజంలోని సమస్యలను ఎత్తి చూపడం ద్వారా అధికారంలో ఉన్న వారిపై ఒత్తిడి పెంచాలి. అదే సమయంలో ఆచరణ సాధ్యమైన చట్టాలు, పరిష్కార మార్గాలు సూచించాలి’’అని అన్నారు. గాంధీ విగ్రహం ధ్వంసం అమెరికాలో జరుగుతున్న ఆందోళనల్లో భారతీయ దౌత్య కార్యాలయం వద్ద ఉన్న గాంధీజీ విగ్రహం ధ్వంసమైంది. జూన్ 2వ తేదీ రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చునని దౌత్యకార్యాలయ సిబ్బంది భావిస్తున్నారు. ఈ అంశంపై అమెరికా విదేశీ వ్యవహారాల శాఖకు సమాచారం అందించామని, స్థానిక పోలీసు అధికారులు సంఘటనపై విచారణ ప్రారంభించారని అధికారులు తెలిపారు. శాంతి, అహింసలకు మారుపేరుగా భావించే గాంధీ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయడంపై భారత్‌లో అమెరికా రాయబారి కెన్ జుస్టర్ క్షమాపణలు కోరారు. ఫ్లాయిడ్‌కు కరోనా? ఫ్లాయిడ్ రెండు నెలల క్రితం కోవిడ్ బారిన పడినట్లు తెలిసింది. హెన్నిపిన్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్ చేసిన శవపరీక్ష నివేదికలో ఈ విషయాన్ని పేర్కొన్నట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించింది. మినసోటా ఆరోగ్య శాఖ అధికారులు ఫ్లాయిడ్ నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు జరిపారని కరోనా సోకినట్లు ఏప్రిల్ 3న నిర్ధారించారని ఆండ్రూ బేకర్ అనే ప్రఖ్యాత మెడికల్ ఎగ్జామినర్ తెలిపినట్లు కథనం తెలిపింది. అయితే అతడి మరణానికి కరోనాకు సంబంధం లేదని స్పష్టం చేసింది. ఫ్లాయిడ్‌కు కరోనా సోకినట్లు తనకు సమాచారం లేదని కుటుంబసభ్యుల కోరిక మేరకు శవపరీక్ష నిర్వహించిన మైకెల్ బాడెన్ తెలిపారు. అంత్యక్రియల నిర్వాహకులకు ఈ విషయం చెప్పలేదని దీంతో చాలామంది ఇప్పుడు కోవిడ్ పరీక్షలు చేయించుకుంటున్నారని అన్నారు. -
హ్యాండ్సప్.. డోంట్ షూట్!
హ్యూస్టన్: జార్జ్ ఫ్లాయిడ్‌కు సంఘీభావంగా హ్యూస్టన్‌లో జరిగిన ర్యాలీలో సుమారు అరవై వేల మంది పాల్గొన్నారు. పోలీసుల దాష్టీకానికి బలైన ఫ్లాయిడ్‌కు నివాళులు అర్పించేందుకు ఉద్దేశించిన ఈ ర్యాలీలో ఫ్లాయిడ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నగర మేయర్ సిల్వస్టర్ టర్నర్, ఎంపీ షీలా జాక్సన్, లిజ్జీ ఫ్లెచర్, సిల్వియా గార్సియా అల్ గ్రీన్‌లతోపాటు కొంతమంది ర్యాప్ గాయకులు ర్యాలీలో పాల్గొని తమ నివాళులు అర్పించారు. ‘హ్యాండ్స్ అప్.. డోంట్ షూట్’, ‘నో జస్టిస్, నో పీస్’అని నినదిస్తూ ర్యాలీ హ్యూస్టన్ నగరం గుండా సాగింది. డిస్కవరీ గ్రీన్ పార్క్ నుంచి సిటీహాల్ వరకూ ఉన్న మైలు దూరం ఈ ర్యాలీ నడిచింది. అయితే సూర్యాస్తమయం తరువాత ఈ ర్యాలీ కాస్తా ఆందోళనలకు దారితీసిందని, ఖాళీ నీటిబాటిళ్లతో విసరడంతో పోలీసులు కొంతమందిని అరెస్ట్ చేశారని వార్తలు వచ్చాయి. ర్యాలీ ప్రారంభానికి ముందు అందరూ మోకాళ్లపై నిలబడి కాసేపు ప్రార్థనలు చేయగా హ్యూస్టన్ పోలీస్ అధికారులు ఇదే తరహాలో వ్యవహరించడం విశేషం. పోలీస్ అధికారి ఆర్ట్ ఎసివిడో ఆందోళనకారులను ఉద్దేశించి మాట్లాడుతూ పోలీసు వ్యవస్థలో సంస్కరణలు తెస్తామని హామీ ఇచ్చారు. జార్జ్ ఫ్లాయిడ్ భార్య రాక్సీ వాషింగ్టన్ మాట్లాడుతూ ఆరేళ్ల తన కుమార్తె గియానా మంచి తండ్రిని కోల్పోయిందన్న విషయాన్ని ప్రపంచం గుర్తించాలని వాపోయింది. వీధుల్లో ప్రశాంతత.. వారం రోజులపాటు అల్లర్లు, ఆందోళనలు, హింసాత్మక ఘటనలతో అట్టుడికిన అమెరికన్ నగర వీధుల్లో ఎట్టకేలకు కొంత ప్రశాంతత నెలకొంది. మంగళవారం ప్రదర్శనలు జరిగినా చాలావరకూ అవి శాంతియుతంగా సాగాయి. ఆందోళనలకు సంబంధించి బుధవారంనాటికి మొత్తం 9,000 మందిని పోలీసులు అరెస్ట్‌చేశారు. పౌరహక్కుల విచారణ.. జార్జ్ ఫ్లాయిడ్ మృతికి సంబంధించి మినసోటా రాష్ట్రం మినియాపోలిస్ పలీస్ విభాగంపై పౌర హక్కుల విచారణ చేపట్టింది. మినసోటా మానవహక్కుల విభాగం కమిషనర్ రెబెకా లూసిరో, గవర్నర్ టిమ్ వాల్ట్జ్ ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. ఈ విచారణ ద్వారా పోలీసుల వివక్షాపూరిత చర్యలను గుర్తించి తాత్కాలికంగానైనా పరిష్కార చర్యలను అమల్లోకి తేవచ్చునని భావిస్తున్నట్లు తెలిపారు. అందరికీ న్యాయం అందించాలన్న అమెరికా సిద్ధాంతం ఎక్కడ? ఎందుకు విఫలమైందో పరిశీలించాల్సిన సమయం వచ్చిందని, జార్జ్ ఫ్లాయిడ్ మరణోదంతం ఇందుకు కారణమని అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు. ‘లారా (బుష్ భార్య)తోపాటు నేను ఫ్లాయిడ్ ఉదంతంపై ఎంతో బాధపడ్డాం. అన్యాయమైన వ్యవహారాలు దేశం ఊపిరి తీసేస్తున్నాయి. అయినాసరే.. ఇప్పటివరకూ మాట్లాడకూడదనే నిర్ణయించాం. ఎందుకంటే ఇది లెక్చర్ ఇచ్చే సమయం కాదు. వినాల్సిన సమయం’అని బుష్ తన ప్రకటనలో పేర్కొన్నారు. అమెరికా తన వైఫల్యాలను పరిశీలించాల్సిన సమయం ఇదేనని ఆయన అన్నారు. శాంతియుతంగా ఉండాలి: మెలానియా ఫ్లాయిడ్ మృతికి నిరసనగా జరుగుతున్న ఆందోళనలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా స్పందించారు. ప్రజలు శాంతియుతంగా వ్యవహరించాలని, కర్ఫ్యూ నిబంధనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. అన్ని వర్గాలవారు, పౌరులందరూ సురక్షితంగా ఉండాలంటే శాంతి ఒక్కటే మార్గమని ఈ దిశగా ప్రయత్నాలు జరగాలని మెలానియా ట్వీట్ చేశారు. ఒక రోజు ముందు మెలానియా ఇంకో ట్వీట్ చేస్తూ.. ఫ్లాయిడ్ మృతికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటించారు. ట్రంప్ మతం ముసుగులో తనకు మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా అమెరికా పత్రికల్లో వార్తలు ప్రచురితమయ్యాయి. సాధారణ పరిస్థితుల్లో ట్రంప్ మతవిశ్వాసాలు కలిగిన వ్యక్తి ఏమీ కాదని, ప్రస్తుతం పదేపదే చర్చిలకు వెళ్లడం, బైబిల్ పట్టుకుని పోజులు ఇవ్వడం మత విశ్వాసాలు ఉన్న వారిని తమవైపు ఆకర్షించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలుగా మీడియా విమర్శిస్తోంది. -
ఎంతో ప్రగతి సాధించాం : సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఏ సమస్యలు తీరుతాయని ఆశించామో ఆ సమస్యలు పరిష్కారం అవుతున్నాయని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఏర్పడే నాటికి రైతుల పరిస్థితి, వ్యవసాయం దారుణంగా ఉండేవని, నేడు తెలంగాణ వ్యవసాయం దేశంలోనే అగ్రగామిగా ఉందన్నారు. ఎండాకాలం వస్తే ప్రజలు మంచినీళ్ల కోసం గోస పడేవారని, నేడు మిషన్ భగీరథతో ఆ సమస్య పరిష్కారమైందన్నారు. విద్యుత్, సాగునీరు, విద్య, వైద్యం, పారిశ్రామిక, ఐటీ తదితర రంగాల్లో ఎంతో ప్రగతి సాధించామని సీఎం కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా మంగళవారం ఆయన ప్రగతి భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించి రాష్ట్ర ప్రజలకు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రగతిభవన్‌లో జెండా ఎగురవేస్తున్న సీఎం ప్రజాసంక్షేమానికి పునరంకితమవుతాం... తెలంగాణ రాష్ట్ర ప్రయాణం అనుకున్న రీతిలో ఎంతో ఆశావహంగా ప్రారంభమైందని సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి పాటుపడేందుకు ప్రభుత్వం పునరంకితం అవుతుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. అంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్ గన్‌పార్కులోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, జె.సంతోష్ కుమార్, కె.ఆర్.సురేశ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు రాజీవ్‌శర్మ, అనురాగ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఏసీబీ డీజీ పూర్ణచందర్రావు, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, నాగేందర్, ఆత్రం సక్కు, రైతుబంధు అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, కార్పొరేషన్ల చైర్మన్లు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాసరెడ్డి, సీఎంఓ అధికారులు పాల్గొన్నారు. జెండావిష్కరణ అనంతరం సెల్యూట్ చేస్తున్న సీఎం కేసీఆర్, సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి ట్విట్టర్లో రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు... కృతజ్ఞతలు తెలిపిన సీఎం తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా ట్విట్టర్ వేదికగా రాష్ట్ర ప్రజలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సినీనటుడు చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేశారు. కోవింద్, మోదీ, అమిత్ షా, చిరంజీవి తెలుగులో శుభాకాంక్షల ట్వీట్లు చేయగా వెంకయ్య నాయుడు ఉర్దూలో ట్వీట్ చేశారు. వారందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ‘తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర ప్రగతిని ఆకాంక్షించినందుకు రాష్ట్ర ప్రజల తరఫున, వ్యక్తిగతంగా నా తరఫున హృదయ పూర్వక కృతజ్ఞతలు’అని సీఎం పేర్కొన్నారు. రాష్ట్ర అవతరణపై ప్రముఖుల శుభాకాంక్షల ట్వీట్లు.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. యావత్ భారతదేశం గర్వించే సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యం తెలుగు వారి సొంతం. కష్టపడి పనిచేసే తెలంగాణ ప్రజలు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. తెలంగాణ రాష్ట్రం సుసంపన్న భవిష్యత్ దిశగా, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. – రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తెలంగాణ ప్రజలకు రాష్ట్రావతరణ శుభాకాంక్షలు. ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నో క్షేత్రాల్లో తమ ప్రతిభ చాటుతున్నారు. దేశ ప్రగ తిలో ఈ రాష్ట్రం ఓ ముఖ్య భూమిక పోషిస్తోంది. తెలంగాణ ప్రజల అభ్యున్నతి మరియు శ్రేయస్సుకై నేను ప్రార్థిస్తున్నాను. – ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు. పుష్కలంగా సహజ వనరులు, గర్వించదగిన చరిత్ర కలిగిన విభిన్న భాషలు, సంస్కృతుల సమ్మేళనం. భారతీయ గంగా–జము నా తెహజిబ్కి తెలంగాణ ప్రతీక. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రార్థిస్తున్నా. – ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. రానున్న రోజుల్లో రాష్ట్రం అభివృద్ధిలో కొత్త శిఖరాలను అధిరోహించాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను. – కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎందరో అమరవీరుల త్యాగాల స్ఫూర్తిగా, దశాబ్దాల కల సాకారం చేసిన జన హృదయ నేత కేసీఆర్‌కు, యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బంగారు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. – సినీనటుడు చిరంజీవి -
తెలంగాణ అమరవీరులకు కేసీఆర్ నివాళి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని అమరవీరులకు సీఎం కేసీఆర్ ఘనంగా నివాళులు అర్పించారు. మంగళవారం ప్రగతిభవన్ నుంచి గన్‌పార్క్‌కు చేరుకున్న ఆయన అమరవీరుల స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించారు. కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ఉన్నతాధికారులు అమరవీరులకు నివాళులు అర్పించారు. కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు.. తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం ప్రగతిభవన్‌లో కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. (కేసీఆరే స్టార్) అంతకుముందు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అసెంబ్లీలో ఘనంగా నిర్వహించారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, తదితరులు అసెంబ్లీ ఆవరణలోని మహాత్మాగాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు నివాళులు అర్పించారు. అనంతరం శాసనసభ వద్ద పోచారం, శాసనమండలి వద్ద గుత్తా జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. ఇక అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ముందుగా అమరవీరులకు నివాళి అర్పించి, అనంతరం పతాకావిష్కరణ చేశారు. (ఉద్యమ లక్ష్యం నెరవేరుతోంది) -
‘మాతృభూమి’ వీరేంద్రకుమార్ మృతి
కోజికోడ్/వయనాడ్: రాజ్యసభ సభ్యుడు, మలయాళ దిన పత్రిక ‘మాతృభూమి’మేనేజింగ్ డైరెక్టర్ ఎం.పి. వీరేంద్ర కుమార్(83) గురువారం రాత్రి కన్నుమూశారు. ఆయన మృతికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తదితర ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయనకు భార్య ఉష, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వయనాడ్ జిల్లా కల్పెట్టలో శుక్రవారం సాయంత్రం ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా(పీటీఐ)కు మూడు పర్యాయాలు చైర్మన్‌గా పనిచేసిన వీరేంద్రకుమార్ ప్రస్తుతం పీటీఐ బోర్డు డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. 2003–2004 కాలంలో ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీకి ప్రెసిడెంట్‌గా కూడా ఆయన వ్యవహరించారు. కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డుకు ఎంపికైన ‘హైమవతభువిల్’వంటి 15కు పైగా పుస్తకాలను వీరేంద్ర రచించారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేసిన ఆయన 1987లో ఈకే నయనార్ మంత్రి వర్గంలో విద్యుత్ మంత్రిగా ఉన్నారు. రాష్ట్రంలోని అడవుల్లో చెట్ల నరికివేతపై నిషేధం విధిస్తూ తొలి ఉత్తర్వులు జారీ చేశారు. అవి వివాదమవడంతో రాజీనామా చేశారు. కోజికోడ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎన్నికై ఐకే గుజ్రాల్, హెచ్డీ దేవెగౌడ కేబినెట్లలో బాధ్యతలు నిర్వహించారు. -
అజిత్ జోగి కన్నుమూత
రాయ్‌పూర్/న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి, మాజీ ఎంపీ అజిత్ జోగి(74) రాయ్‌పూర్‌లోని శ్రీనారాయణ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. చాలారోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన 20 రోజుల క్రితం ఆసుపత్రిలో చేరారు. అప్పటినుంచి కోమాలోనే ఉన్నారు. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మరణించారు. అజిత్ జోగి భార్య రేణు ప్రస్తుతం కోట నియోజకవర్గ ఎమ్మెల్యే. అజిత్ జోగి మరణం నేపథ్యంలో రాష్ట్రంలో మూడు రోజులు సంతాప దినాలు పాటించనున్నట్లు ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ ప్రకటించారు. జోగి అంత్యక్రియలను ఆయన స్వస్థలం మర్వాహీ జిల్లాలోని గౌరెలాలో ఆదివారం నిర్వహించనున్నట్లు తెలిపారు. విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ అజిత్ జోగి మృతి చెందడం పట్ల ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. పేద ప్రజలకు ఆయన ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. ప్రధానంగా గిరిజనుల జీవితాలను మార్చేందుకు ఎంతగానో కృషి చేశారన్నారు. పేదల ‘కలెక్టర్ సాబ్’ ఛత్తీస్‌గఢ్ ప్రజలు ‘కలెక్టర్ సాహెబ్’అని ముద్దుగా పిలుచుకునే అజిత్ జోగి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి తొట్టతొలి ముఖ్యమంత్రి. 2000 నవంబర్ నుంచి డిసెంబర్ 2003 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. విద్యావంతుడు, రచయిత, రాజకీయవేత్త అయిన అజిత్ జోగి పూర్తి పేరు అజిత్ ప్రమోద్ కుమార్ జోగి. ఆదివాసీ సమాజంలో పుట్టి ఉన్నత చదువులు చదివి స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగిన నేత. 1946 ఏప్రిల్ 29వ తేదీన అప్పటి మధ్యప్రదేశ్ రాష్ట్రం భిలాస్పూర్ జిల్లాలోని జోగిసర్‌లో జన్మించారు. ఆయన తండ్రి కాశీ ప్రసాద్ జోగి, తల్లి కాంతిమణి. విద్యార్థి నాయకుడి నుంచి.. అత్యధికంగా పన్నెండేళ్లపాటు నాలుగు జిల్లాలకు కలెక్టరుగా వ్యవహరించిన జాతీయ రికార్డు అజిత్ జోగి సొంతం. విద్యార్థి జీవితం నుంచే నాయకత్వ లక్షణాలు అలవర్చుకున్నారు. భోపాల్‌లోని మౌలానా ఆజాద్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీకి 1967లో విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఢిల్లీ యూనివర్సిటీలో లా చదివారు. 1967లో రాయ్‌పూర్‌లోని గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్‌గా కూడా పనిచేశారు. రాజకీయ రంగ ప్రవేశం చేసి, అంచెలంచెలుగా జాతీయస్థాయి నేతగా ఎదిగారు. అజిత్ శాసనసభతోపాటు లోక్‌సభ, రాజ్యసభలకు ఎన్నికయ్యారు. 2016లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో కాంగ్రెస్ అజిత్ జోగిని పార్టీ నుంచి బహిష్కరించింది. అదే ఏడాది అజిత్ జోగి ఛత్తీస్‌గఢ్ జనతా కాంగ్రెస్ పేరుతో పార్టీని ప్రారంభించారు. అజిత్ జోగి రాజకీయవేత్త మాత్రమే కాదు రచయితగా కూడా సుపరిచితులు. ‘‘ద రోల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్’’, ‘‘అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ పెరిఫెరల్ ఏరియాస్’’అనే పుస్తకాలు రాశారు. 2004లో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అజిత్ జోగి వీల్‌ఛైర్‌కు పరిమితమయ్యారు. అయినప్పటికీ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర నిర్వహించారు. జోగి భార్య రేణు, కొడుకు అమిత్ రాజకీయాల్లో ఉన్నారు. ప్రభుత్వ అధికారిగా... 1968లో సివిల్ సర్వీసెస్ ద్వారా ఐఏఎస్‌కి ఎంపికయ్యారు. కలెక్టర్‌గా పనిచేసిన నాలుగు జిల్లాల్లోనూ అధికార దర్పాన్ని పక్కనపెట్టి పేద ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేవారు. ఆయన ఇంట్లోకి సైతం ప్రజలకు నేరుగా ప్రవేశించే స్వేచ్ఛనిచ్చిన అరుదైన కలెక్టర్ సాహెబ్ అజిత్ జోగి. కలెక్టర్ పదవికి రాజీనామా చేసిన అనంతరం జాతీయ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు.