అంబేడ్కర్ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న హైకోర్టు సీజే జస్టిస్ సతీష్ చంద్ర
సాక్షి, హైదరాబాద్: మనదేశం అత్యుత్తమ ప్రజాస్వామ్య వ్యవస్థగా రూపుదిద్దుకోవడంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ది అత్యంత కీలక పాత్ర అని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ అన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యు న్నతి కోసం, వారి హక్కుల కోసం అంబేద్కర్ అహర్నిశలు శ్రమించారన్నారు. రాష్ట్ర బార్ కౌన్సిల్, హైకోర్టు న్యాయవాదుల సంఘం సంయుక్తంగా గురువారం నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
దళిత కుటుంబం నుంచి వచ్చి అత్యున్నత శిఖరాలకు చేరారని, ఆయన జీవి తం పౌరులందరికీ ఆదర్శప్రాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ నందా, రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసా ద్, బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ.నర్సింహారెడ్డి, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్య క్షుడు పొన్నం అశోక్ గౌడ్ ప్రసంగించారు.
Comments
Please login to add a commentAdd a comment