సాక్షి,తాడేపల్లి:రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ నివాళులర్పించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం(డిసెంబర్6) జరిగిన కార్యక్రమంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వైఎస్ జగన్.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ అంబేద్కర్ స్ఫూర్తి ఎల్లవేళలా సమాజానికి మార్గదర్శకంగా నిలిచేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఆయన జీవితం అందరికీ ఆదర్శనీయమని కొనియాడారు. విజయవాడలోని స్వరాజ్ మైదానంలో ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ గారి సామాజిక న్యాయ మహాశిల్పాన్ని తమ హయాంలో ఏర్పాటు చేసిన విషయాన్ని వైఎస్ జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కమార్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్,మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, నెడ్ క్యాప్ మాజీ ఛైర్మన్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment