BR Ambedkar
-
నేడు ఇండోర్‌కు సీఎం, డిప్యూటీ సీఎం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కలు సోమవారం మధ్యప్రదేశ్ వెళ్లనున్నారు. ఇండోర్‌కు సమీపంలోని అంబేడ్కర్ స్వగ్రామం మహూ కంటోన్మెంట్లో ఏఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంవిధాన్ బచావో ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్తున్నారు. ర్యాలీలో పాల్గొనేందుకు రాష్ట్రం నుంచి సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, ఇతర మంత్రులు, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తదితరులు వెళ్లనున్నారు. -
ఆ పేరును ఎందుకు స్మరించాలంటే...
డాక్టర్ భీంరావ్ రాంజీ అంబేడ్కర్ భారతీయ (BR Ambedkar) చరిత్రలో మహోన్నత వ్యక్తి. భారత రాజ్యాంగ నిర్మాతగా, దళిత హక్కుల పరిరక్షకుడిగా విస్తృతంగా ప్రశంసలు పొందిన అంబేడ్కర్ అందించిన సేవలు కుల, ప్రాంతీయ పరిమితులను దాటి ఉన్నాయి. ఆయన కేవలం సామాజిక సంస్కర్తగానే కాకుండా దేశ సమగ్రాభివృద్ధి కోసం పారిశ్రామీకరణ, పట్టణీకరణ, ఆధునికీకరణ, నాగరికత (Civilisation) గురించి దశాబ్దాల ముందే చర్చించిన దూరదృష్టి కలిగిన తత్వవేత్త. ఆయన కేవలం దళితులకు మాత్రమే చెందినవారు కాదు. ఆయన విశ్వ మానవతా సిద్ధాంతాలు, సేవలు ప్రతి భారతీయుడి గుండెల్లో నిలిచిపోవాలి. పారిశ్రామికీకరణ ప్రజల సాంఘిక–ఆర్థిక స్థితులను మెరుగుపరచడానికి మార్గమని ఆయన విశ్వసించారు. గ్రామాధారిత ఆర్థిక వ్యవస్థ (Economy) ఒక్కటే భారతదేశ అవసరాలను తీర్చలేదని ఆయన స్పష్టంగా గ్రహించారు. పరిశ్రమల అభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలు పెంచి, పేదరికాన్ని తగ్గించి, ఆర్థిక పురోగతిని సాధించవచ్చనేది ఆయన నమ్మకం.అలాగే, పట్టణీకరణ ద్వారా సామాజిక సమానత్వానికి మార్గం సుగమం అవుతుందని ఆయన పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాలు విద్య, సాంకేతికత, సామాజిక మార్పు కేంద్రాలుగా; కులవాదం నుండి విముక్తి కలిగించే చోట్లుగా ఉండాలి అని ఆయన బలంగా విశ్వసించారు. ఆధునికీకరణ గురించి ఆయన అభిప్రాయాలు శాస్త్రీయ ద్రుఃక్కోణం, సామాజిక సమానత్వం, బుద్ధివాదం ఆధారంగా ఉన్నాయి. ముఖ్యంగా మరుగునపడిన వర్గాల అభివృద్ధిలో విద్య ప్రాముఖ్యాన్ని ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఇది భారతీయుల మనోభావాలను ఆధునికీకరించే క్రమంలో పెద్ద ముందడుగు. ఆయన ప్రధానంగా భారత రాజ్యాంగ రూపకర్తగా ప్రఖ్యాతి పొందారు. కానీ ఇది కేవలం చట్టపరమైన విజయం మాత్రమే కాక ఒక తాత్విక విజయంగా నిలిచింది. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి ఆవశ్యక విలువలను రాజ్యాంగంలో ప్రతిష్ఠించారు.అలాగే కార్మిక సంక్షేమం, మహిళా హక్కులు, అంటరానితనం నివారణ వంటి రంగాల్లో ఆయన రూపకల్పన చేసిన విధానాలు ఈ రోజు కూడా అద్భుతంగా పని చేస్తున్నాయి. ‘హిందూ కోడ్ బిల్లు’ ద్వారా మహిళలకు వారసత్వ ఆస్తిహక్కును కల్పించడం ద్వారా లింగ సమానత్వానికి ఆయన బలమైన పునాది వేశారు. ఆయన రాసిన ‘ది ప్రాబ్లం ఆఫ్ ది రూపీ: ఇట్స్ ఆరిజిన్ అండ్ ఇట్స్ సొల్యూషన్’ అనే గ్రంథం ఆర్థిక స్థిరత్వం, కేంద్ర బ్యాంకింగ్ సంస్కరణల ప్రాముఖ్యాన్ని చూపిస్తుంది. అలాగే ఆయన సైన్సు ఆధారంగా ఆధునిక సమాజాన్ని నిర్మించడమే కాకుండా, సర్వలోక మానవ హక్కులకూ అంకితమయ్యారు. ఆయన తత్త్వం ఐక్యరాజ్యసమితి స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను (ఎస్జీఈఎస్) ముందుగానే ఊహించింది. లింగ సమానత్వం, అసమానతల తగ్గింపు, నాణ్యమైన విద్య వంటి లక్ష్యాలకు ఆయన జీవితమే మార్గదర్శి.చదవండి: బీద పిల్లల నోట్లో మట్టి కొట్టే యత్నంఅంబేడ్కర్ పేరును స్మరించడం అనేది కేవలం ఆరాధన కాదు, ఆయన విలువలను మన జీవితాల్లో అమలు చేయడం. ఆయన పేరు మనం న్యాయ సమానత్వం, ఆర్థిక పురోగతి వంటి గౌరవప్రద విలువల వైపు అడుగులు వేస్తున్నామని గుర్తు చేస్తుంది.– ప్రొఫెసర్ ఎం. జేమ్స్ స్టీఫెన్, చైర్ ప్రొఫెసర్, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ చైర్, ఆంధ్రా యూనివర్సిటీ -
తీవ్ర ప్రమాదంలో రాజ్యాంగం
బెళగావి: మన రాజ్యాంగం మునుపెన్నడూ ఎదుర్కోనంతటి తీవ్ర ముప్పును ఎదుర్కొంటోందని కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది. పార్లమెంట్లో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్‌ను అవమానించడం హోం మంత్రి అమి త్ షా రాజీనామా చేయాల్సిందేనని స్పష్టం చేసింది. దేశ ప్రజలకు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ వర్కింగ్ కమి టీ(సీడబ్ల్యూసీ) సమావేశం డిమాండ్ చేసింది. అమిత్ షా చర్య రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేందుకు ఆర్ఎస్ఎస్–బీజేపీలు దశాబ్దాలుగా సాగిస్తున్న కుట్రలో భాగమేనని మండిపడింది. సీడబ్ల్యూసీ సమావేశం గురువారం కర్ణాటకలోని బెళగావిలో జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ చీఫ్ ఖర్గే మాట్లాడారు. పెరుగుతున్న ధరలు, అవినీతి, రాజ్యాంగంపై దాడి వంటి వాటిపై పాదయాత్రలు వంటి రాజకీయ ప్రచార కార్యక్రమాలను 13 నెలలపాటు చేపడతామన్నారు. జవాబుదారీతనం, సమర్థత ప్రాతిపదికగా పారీ్టలో భారీగా సంస్థాగత ప్రక్షాళన చేపడతామని చెప్పారు. అసత్యాలను వ్యాప్తి చేసే వారిపై పోరాటానికి పారీ్టకి 2025 సంస్థాగత సాధికారిత వత్సరంగా ఉంటుందని ఖర్గే తెలిపారు. ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసేందుకు ప్రాంతీయ, నూతన నాయకత్వానికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ను అమలు చేసి ఏఐసీసీ నుంచి బూత్ స్థాయి వరకు ఎన్నికలు జరుపుతామన్నారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్‌కు గౌరవం కల్పించేందుకు పార్టీ పోరాడుతుందన్నారు. ఖర్గేతోపాటు పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శులు జైరాం రమేశ్, కేసీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్న ‘నవ సత్యాగ్రహ బైఠక్’ఈ మేరకు రెండు రాజకీయ తీర్మానాలను చేసింది. ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’వంటి విధానాలను తీసుకురావడం ద్వారా సమాఖ్య వ్యవస్థను దెబ్బతీసేందుకు ప్రభుత్వం ప్రయతి్నస్తోంది. న్యాయవ్యవస్థ, ఎన్నిక కమిషన్, మీడియాలను తీవ్ర ఒత్తిడులకు గురిచేసి అనుకూలంగా మార్చుకుంటోంది. ఇటీవలి పార్లమెంట్ సమావేశాలకు పాలకపక్షం తీవ్ర అవరోధాలు కలిగించింది. పోలింగ్ పత్రాలను ప్రజలకు అందుబాటులో లేకుండా చేసేలా ఎన్నికల నిబంధనావళిని మార్చుకుంటోంది’అంటూ సీడబ్ల్యూసీ మండిపడింది. హరియాణా, మహారాష్ట్రలలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల సమగ్రత దెబ్బతిందని ఆరోపించింది. మైనారిటీ వర్గం లక్ష్యంగా విద్వేషం, హింసను ప్రభుత్వమే ప్రేరేపించడంపై ఆందోళన వ్యక్తం చేసింది. కుల గణనను సాధ్యమైనంత త్వరగా చేపట్టాలని కేంద్రాన్ని కోరింది. ఆర్థిక పురోగతి మందగించిందని, అత్యవసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని తెలిపింది. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కలి్పంచాలని, ఉపాధి హామీ పథకానికి అవసరమైన నిధులివ్వాలని కోరింది. మహాత్ముని ఆశయాలకు భంగం: సోనియా గాంధీ మహాత్మా గాం«దీయే స్ఫూర్తిగా తమ పార్టీ ఇకపైనా కొనసాగుతుందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ సోనియా గాంధీ స్పష్టం చేశారు. మహాత్ముని ఆశయాలు, సిద్ధాంతాలు, సంస్థలకు కేంద్రంలో అధికారంలో ఉన్న వారి నుంచి ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గాంధీజీ హత్యకు దారి తీసిన విషపూరిత వాతావరణాన్ని సృష్టించిన శక్తులైన మోదీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్లతో పోరాడాలంటూ ఆమె కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం సోనియా ఈ మేరకు సీడబ్ల్యూసీకి పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. -
ఇదేనా అంబేడ్కర్ వారసత్వం!
అనుకున్నట్టే పార్లమెంటు శీతాకాల సమావేశాలు పరస్పర వాగ్యుద్ధాలతో మొదలై ఘర్షణలతో ముగిశాయి. పార్లమెంటు ముఖద్వారం వద్ద అధికార, విపక్ష సభ్యులు ఒకరినొకరు తోసుకోవటం, ఒకరిద్దరు గాయడటం, పోలీసు కేసుల వరకూ పోవటం వంటి పరిణామాలు అందరికీ దిగ్భ్రాంతి కలిగించాయి. తమ ఎంపీలు ప్రతాప్ చంద్ర సారంగి, ముకేశ్ రాజ్‌పుత్‌లు గాయపడ్డారని బీజేపీ అంటున్నది. కాదు... వారే తమను పార్లమెంటులోకి వెళ్లకుండా అడ్డగించారని, ఆ తోపులాటలో కిందపడ్డారని కాంగ్రెస్ చెబుతున్నది. వారు అడ్డగించటం వల్ల తమ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే కూడా గాయపడ్డారని, ముగ్గురు బీజేపీ ఎంపీలు రాహుల్ గాంధీపై భౌతికదాడికి పాల్పడ్డారని వివరి స్తున్నది. రెండు వర్గాలూ అటు స్పీకర్‌కూ, ఇటు పోలీసులకూ ఫిర్యాదులు చేసుకున్నాయి. నాగా లాండ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన బీజేపీ సభ్యురాలు కోన్యాక్ తనతో రాహుల్ గాంధీ అభ్యంతరకరంగా ప్రవర్తించారని ఆరోపించారు. ఈ విషయంలో రాహుల్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదయ్యే అవకాశం ఉన్నదంటున్నారు. అసెంబ్లీ సమావేశాలప్పుడు ఏదో వివాదం రేకెత్తి ఒకరిపైకొకరు లంఘించటం, ఘర్షణపడటం, కుర్చీలు విసురుకోవటం, దుర్భాషలాడుకోవటం రాష్ట్రాల్లో సర్వసాధారణమైంది. కానీ ఇదేమిటి... దేశమంతటికీ ప్రాతినిధ్యం వహించే అత్యున్నత చట్టసభ ఇంత చట్టుబండలు కావటం ముందూ మునుపూ విన్నామా? సమావేశాల ప్రారంభంలోనే అదానీ వ్యవహారంపై విపక్షాలు పెద్ద రగడ సృష్టించాయి. ఆయనపై అమెరికాలో క్రిమినల్ కేసులు నమోదయ్యాయని, అరెస్టు చేస్తారని వచ్చిన వార్తలు నిజం కావని ప్రముఖ న్యాయవాదులు చెప్పాక అది సద్దుమణిగింది. వివాదాలు ఉండొచ్చు... విధానాల విషయంలో విభేదాలుండొచ్చు. కానీ చట్టసభ అనేది అధి కార, విపక్షాలు ప్రజలకు గరిష్టంగా మేలు చేయటానికి గల అవకాశాలను అన్వేషించే వేదిక. తమ నిర్ణయాల పర్యవసానం గుర్తెరగకుండా పాలకపక్షం ప్రవర్తిస్తున్నప్పుడు విపక్షాలు నిరసన గళం వినిపిస్తాయి. అందువల్ల పాలకపక్షం తనను తాను సరిదిద్దుకునే ఆస్కారం కూడా ఉంటుంది. అది లేనప్పుడు కాస్త ఆలస్యం కావొచ్చుగానీ... అధికార పక్షానికి ప్రజలే కళ్లు తెరిపిస్తారు. ఇందిరాగాంధీ ఏలుబడిలో ఎమర్జెన్సీ విధించినప్పుడేమైంది? ఆ తర్వాత వచ్చిన జనతాపార్టీ ప్రభుత్వం ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను ఇష్టారాజ్యంగా రద్దుచేసినప్పుడు భంగపాటు తప్పలేదు. ఏకంగా 400 మంది సభ్యుల బలం ఉన్న రాజీవ్‌గాంధీ ఏకపక్షంగా వ్యవహరించినప్పుడు కూడా ఆయనకు చేదు అను భవాలే ఎదురయ్యాయి. 2020లో వచ్చిన సాగుచట్టాలు కూడా ఎన్డీయే సర్కారు ఉపసంహరించు కోక తప్పలేదు. ఏ విషయంలోనైనా తక్షణమే అమీతుమీ తేల్చుకోవాలనుకునే మనస్తత్వం వల్ల ఉన్న సమస్య కాస్తా మరింత జటిలమవుతున్నది. ఇటీవలి కాలంలో చట్టసభలు బలప్రదర్శన వేదికలవు తున్నాయి. సమస్య ఎదురైనప్పుడు దాని ఆధారంగా అవతలి పక్షం అంతరంగాన్ని బయటపెట్టి ప్రజలు గ్రహించేలా చేయటం అనే మార్గాన్ని వదిలి బాహాబాహీ తలపడటం అనేది దుష్ట సంప్రదాయం. అందువల్ల చట్టసభ అంటే సాధారణ పౌరుల్లో చులకన భావం ఏర్పడటం తప్ప సాధించే దేమీ ఉండదు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను ఎవరు అవమానించారు... ఎవరు నెత్తిన పెట్టుకున్నారన్న విషయమై ఏర్పడిన వివాదం కాస్తా ముదిరి పరస్పరం క్రిమినల్ కేసులు పెట్టుకోవటం వరకూ పోవటం విచారకరం. బీజేపీ ఎంపీలు అప్పటికే బైఠాయించిన ప్రధాన ద్వారంవైపునుంచే పార్లమెంటులోకి ప్రవేశించాలని కాంగ్రెస్ అనుకోవటం వల్ల బాహాబాహీకి దిగే పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి వేరే ద్వారంనుంచి వెళ్లమని భద్రతా సిబ్బంది చేసిన సూచనను రాహుల్ గాంధీ బేఖాతరు చేశారని, పైగా ఇతర సభ్యులను రెచ్చగొట్టారని బీజేపీ ఫిర్యాదు సారాంశం. దేశంలో ఏదో ఒకమూల నిత్యమూ సాగిపోతున్న విషాద ఉదంతాలు గమనిస్తే డాక్టర్ అంబే డ్కర్ నిజమైన వారసులెవరన్న అంశంలో భౌతికంగా తలపడిన రెండు పక్షాలూ సిగ్గుపడాల్సి వస్తుంది. ఒకపక్క పార్లమెంటులో ఈ తమాషా నడుస్తుండగానే తన పెళ్లికి ముచ్చటపడి గుర్రంపై ఊరేగుతున్న ఒక దళిత యువకుడిపై ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో ఆధిపత్య కులాలవారు దాడిచేసి కొట్టారన్న వార్త వెలువడింది. ఇది ఏదో యాదృచ్ఛికంగా కులోన్మాదులు చేసిన చర్య కాదు. దశాబ్దాలుగా ఇలాంటి ఘోరాలు సాగుతూనే ఉన్నాయి. తాము ఉపయోగించే బావిలో లేదా చెరువులో దప్పిక తీర్చుకున్నారన్న ఆగ్రహంతో దళితులపై దాడులు చేసే సంస్కృతి ఇంకా పోలేదు. చాలాచోట్ల రెండు గ్లాసుల విధానం ఇంకా సజీవంగా ఉంది. మన రాజ్యాంగం అమల్లోకొచ్చి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా చర్చిస్తుండగానే... డాక్టర్ అంబేడ్కర్ వారసత్వం గురించి పార్టీలు పోటీపడుతుండగానే వాస్తవ స్థితిగతులు ఇలా ఉన్నాయి.సైద్ధాంతిక విభేదాలను ఆ స్థాయిలో మాట్లాడుకుంటే, ఆరోగ్యకరమైన చర్చల ద్వారా అన్ని విషయాలనూ ప్రజలకు తేటతెల్లం చేస్తే మెరుగైన ఫలితం వస్తుంది. నిజానిజాలేమిటో అందరూ గ్రహిస్తారు. డాక్టర్ అంబేడ్కర్ తన జీవితకాలమంతా రాజీలేని పోరాటం చేశారు. మెజారిటీ ప్రజానీకం ప్రయోజనాలను దెబ్బతీసే భావాలనూ, చర్యలనూ అడుగడుగునా తీవ్రంగా వ్యతిరేకించారు. ఉద్యమాలు నిర్వహించారు. అంతేతప్ప అవతలిపక్షంపై హింసకు దిగలేదు. ఆయన వారసత్వం తమదేనంటున్నవారు వాస్తవానికి తమ చర్యల ద్వారా ఆ మహనీయుడి స్మృతికీ, ముఖ్యంగా ఆయన నాయకత్వంలో రూపొందిన రాజ్యాంగానికీ అపచారం చేస్తున్నామని గుర్తిస్తే మంచిది. -
అంబేద్కర్ వల్లే మోదీ, అమిత్ షాకు పదవులు: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. ఇదే సమయంలో అంబేద్కర్ రాజ్యాంగం వేరు.. భగవంతుడు వేరు అన్న విషయం అమిత్ షా గుర్తించాలి అంటూ కామెంట్స్ చేశారు.తాజాగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘అంబేద్కర్‌ను అమిత్ షా అవమానించిన విధానంపై రాహుల్ గాంధీ గళం విప్పారు. పార్లమెంట్ నిండు సభలో అంబేద్కర్‌ను అవమానించేలా అమిత్ షా చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొనే వరకు రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారు. చట్టాలు, న్యాయాలు అంబేద్కర్ రాజ్యాంగం వల్లే ఉన్నాయి. బీసీలుగా చెప్పుకొనే మోదీ, అమిత్ షా కూడా అంబేద్కర్ రాజ్యాంగం వల్లే పదవులు పొందారు.అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. దేశ ప్రజల భావాలు దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారు. రాహుల్ గాంధీ బాధ్యత.. గాంధీ, నెహ్రూ అడుగుజాడల్లో నడవటం. అంబేద్కర్ రాజ్యాంగం వేరు భగవంతుడు వేరు అనే విషయం అమిత్ షా గుర్తించాలి. అమిత్ షా, రాహుల్ గాంధీకి తేడా.. రాహుల్ గాంధీ దేవుని మొక్కుతాడు కానీ పబ్లిసిటీ చేయరు. బీజేపీ నేతలు కూడా దేవుడ్ని మొక్కతారు కానీ, పబ్లిసిటీ చేసుకుంటారు. దేవుడు అనేది నమ్మకం ధైర్యం.. భగవంతుడు అనేది వ్యక్తిగత విషయం. కాంగ్రెస్ కార్యకర్తలు రాహుల్ గాంధీ పిలుపునకు సిద్ధంగా ఉంటారు’ అని కామెంట్స్ చేశారు. -
పార్లమెంట్లో హోరెత్తిన ‘జై భీమ్’
న్యూఢిల్లీ: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పట్ల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్ ఉభయ సభలు గురువారం దద్దరిల్లాయి. రాజ్యాంగ నిర్మాతను అవమానించినందుకు అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు అలజడి సృష్టించాయి. నిరసనలు, నినాదాలతో ఉభయ సభలు పలుమార్లు వాయిదాపడ్డాయి. లోక్‌సభ ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగానే విపక్ష ఎంపీలు తమ స్థానాల్లో నిల్చొని నినాదాలు ప్రారంభించారు. అమిత్ షా క్షమాపణ చెప్పాలని పట్టుబట్టారు. శాంతించాలని స్పీకర్ ఓం బిర్లా కోరారు. తమిళనాడుకు చెందిన ఎంపీ ఇళంగోవన్ మృతిపట్ల సంతాపం ప్రకటించారు. దివంగత సభ్యుడి ఆత్మశాంతి కోసం ఎంపీలంతా కొంతసేపు మౌనం పాటించారు. అనంతరం విపక్ష సభ్యులు మళ్లీ నినాదాలు చేశారు. దీంతో సభను స్పీకర్ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. ప్రియాంకగాంధీ వాద్రా సహా విపక్ష ఎంపీలు జైభీమ్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. సభలో అంబేడ్కర్ చిత్రపటాలు ప్రదర్శించారు. 2 గంటలకు సభ పున:ప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. అమిత్ షా క్షమాపణ చెప్పేదాకా ఆందోళన కొనసాగిస్తామని ప్రతిపక్ష ఎంపీలు తేలి్చచెప్పారు. నినాదాల హోరుతో సభ మార్మోగిపోయింది. సభకు సహకరించాలంటూ స్పీకర్ స్థానంలో ఉన్న దిలీప్ సైకియా పదేపదే కోరిన విపక్ష ఎంపీలు పట్టించుకోలేదు. దీంతో సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు దిలీప్ సైకియా ప్రకటించారు. స్పీకర్‌స్థానాన్ని చుట్టుముట్టేందుకు కాంగ్రెస్ ఎంపీలు ప్రయతి్నంచగా మార్షల్స్ అడ్డుకున్నారు. సభ వాయిదా పడిన తర్వాత కూడా ప్రతిపక్ష సభ్యులు నినాదాలు కొనసాగించారు. జమిలి ఎన్నికలపై రెండు బిల్లులను జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)కి సిఫార్సు చేయడానికి లోక్‌సభలో గురువారం తీర్మానం ఆమోదించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ, సభలో గందరగోళం కారణంగా తీర్మానంపై చర్చ జరగలేదు. రాహుల్ అనుచితంగా ప్రవర్తించారు అమిత్ షా వ్యాఖ్యలు పార్లమెంట్ ఎగువ సభలోనూ అలజడి రేపాయి. అంబేడ్కర్‌ను అమిత్ షా ఘోరంగా అవమానించారని, ఈ అంశంపై తక్షణమే చర్చించాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. జైభీమ్ అంటూ నినదించారు. పార్లమెంట్ ప్రాంగణంలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న తమపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అనుచితంగా ప్రవర్తించారని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎంపీలు పట్టుబట్టారు. బీజేపీ మహిళా ఎంపీ కోన్యాక్ను రాహుల్ గాంధీ నెట్టివేశారని, మరో ఇద్దరు ఎంపీలపై దాడి చేశారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. బీజేపీ సభ్యుల పట్ల అనుచిత ప్రవర్తనకు కాంగ్రెస్ ఎంపీలంతా సభకు, దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని కేంద్ర మంత్రి జేపీ నడ్డా మండిపడ్డారు. అనంతరం డీఎంకే సభ్యుడు తిరుచ్చి శివ మాట్లాడారు. విపక్ష సభ్యులపై రాహుల్ గాంధీ దాడి చేయలేదని పేర్కొన్నారు. పార్లమెంట్ సభ్యులను గౌరవిస్తామని అన్నారు. మహిళలపై తమకు ఎంతో గౌరవం ఉందని చెప్పారు. ఇరుపక్షాల ఆందోళనలు, నినాదాలతో ఎగువసభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో సభను పలుమార్లు వాయిదా వేయాల్సి వచి్చంది. చివరకు సభ శుక్రవారానికి వాయిదాపడింది. -
పార్లమెంట్ ప్రాంగణంలో తీవ్ర ఘర్షణ
న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రాంగణంలో మునుపెన్నడూ లేనివిధంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ చోటుచేసుకుంది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు చివరకు ఘర్షణకు దారితీయడం గమనార్హం. ఇరుపక్షాల ఎంపీలు ఒకరినొకరు తోసేసుకోవడం, పరస్పరం గొడవ పడడం, ఇద్దరు బీజేపీ ఎంపీలు గాయపడి ఆసుపత్రిలో చేరడం, ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకోవడం, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు కావడం, రాహుల్ తనతో అభ్యంతరకరంగా ప్రవర్తించారని బీజేపీ మహిళా ఎంపీ కోన్యాక్ ఆరోపించడం వంటి పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగించాయి. మొత్తానికి పార్లమెంట్ సాక్షిగా గురువారం దిగ్భ్రాంతికర సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. నినాదాలు, అరుపులు, కేకలతో ఉద్రిక్తత అంబేడ్కర్‌పై అమిత్ షా వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఉదయం ఉభయ సభలు ప్రారంభం కావడానికి కొన్ని నిమిషాల ముందు విపక్ష ‘ఇండియా’ కూటమి ఎంపీలు పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. నీలం రంగు దుస్తులు ధరించి, అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాహుల్ గాం«దీ, ప్రియాంకగాంధీ వాద్రాతోపాటు కాంగ్రెస్, డీఎంకే, ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీ, ఎన్సీపీ, సీపీఐ, సీపీఎం తదితర పారీ్టల సభ్యులు ఈ నిరసనలో పాల్గొన్నారు. తర్వాత వారంతా మకరద్వారం గుండా పార్లమెంట్ లోపలికి ప్రవేశించేందుకు ముందుకు కదిలారు. అప్పటికే అక్కడ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఎంపీలు బైఠాయించారు. అంబేడ్కర్‌ను కాంగ్రెస్ కించపర్చిందని ఆరోపిస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ బిగ్గరగా నినాదాలు ప్రారంభించారు. మకరద్వారం మెట్లపై ఇరువర్గాలు పరస్పరం ఎదురుపడ్డాయి. తాము ముందుకెళ్లడానికి దారి ఇవ్వడం లేదని ఇండియా కూటమి ఎంపీలు మండిపడ్డారు. దాంతో ఎన్డీయే ఎంపీలు మరింత బిగ్గరగా నినాదాలు చేశారు. ఇండియా కూటమి సభ్యులు సైతం స్వరం పెంచారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. తోపులాటలు, అరుపులు కేకలతో ఈ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. అసలేం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. తోపులాటలో కొందరు ఎంపీలు కిందపడ్డారు. మెట్ల మధ్యభాగంలో నిలబడిన తమను రాహుల్ గాంధీ బలంగా తోసివేశారని బీజేపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ముందుకెళ్లడానికి పక్కనే తగినంత దారి ఉన్నప్పటికీ ఆయన తమపై ఉద్దేశపూర్వకంగా దురుసుగా ప్రవర్తించారని అన్నారు. రాహుల్ గాంధీ తోసివేయడంతో తమ ఎంపీలు ప్రతాప్ సారంగి, ముకేశ్ రాజ్‌పుత్ గాయపడ్డారని చెప్పారు. నడవలేని స్థితిలో ఉన్న సారంగిని చక్రాల కురీ్చలో అంబులెన్స్ దాకా తీసుకెళ్లారు. అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. అయితే, బీజేపీ ఎంపీలే దారికి అడ్డంగా నిల్చొని, రాహుల్ గాం«దీని ముందుకు వెళ్లనివ్వలేదని కాంగ్రెస్ సభ్యులు చెప్పారు. తమను రెచ్చగొట్టేలా ప్రవర్తించారని బీజేపీ సభ్యులపై విరుచుకుపడ్డారు. మోదీ పరామర్శ పార్లమెంట్ ప్రాంగణంలో జరిగిన ఘర్షణలో గాయపడిన ప్రతాప్ సారంగితోపాటు ముకేశ్ రాజ్‌పుత్ చికిత్స నిమిత్తం ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చేరారు. సారంగి కణతకు కుట్లు పడ్డాయి. ముకేశ్ రాజ్‌పుత్ తలకు గాయాలయ్యాయి. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ వారిద్దరినీ ఫోన్లో పరామర్శించారు. జరిగిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీయే ఎంపీలు సైతం ఆసుపత్రికి చేరుకొని ప్రతాప్ సారంగి, ముకేశ్ రాజ్‌పుత్‌లను పరామర్శించారు. బీజేపీ ఎంపీలు కర్రలతో బెదిరించారు: రాహుల్ బీజేపీ ఎంపీలు తనపై బల ప్రయోగం చేశారని, దురుసుగా తోసివేశారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. కింద పడిపోయానని, తనకు గాయాలయ్యాయని చెప్పారు. బీజేపీ ఎంపీలే తమపై దౌర్జన్యానికి పాల్పడి, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. పార్లమెంట్ ప్రాంగణంలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న తమపై బీజేపీ ఎంపీలు అనుచితంగా ప్రవర్తించారని ప్రియాంక గాంధీ మండిపడ్డారు. బీజేపీ ఎంపీలే తమపై భౌతిక దాడులు చేశారని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. కర్రలు చేతపట్టుకొని తమను అడ్డుకున్నారని, బెదిరించారని, పార్లమెంట్ లోపలికి వెళ్లనివ్వలేదని చెప్పారు. పార్లమెంట్ రెజ్లింగ్ రింగ్ కాదు: రిజిజు తమ ఎంపీ సారంగిని రాహుల్ గాంధీ నెట్టివేశారని, రౌడీలా ప్రవర్తించారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే దుయ్యబట్టారు. ఒక వృద్ధుడిని నెట్టివేసినందుకు రాహుల్ సిగ్గుపడాలని అన్నారు. తాను నాలుగుసార్లు ఎంపీగా గెలిచానని, తన రాజకీయ జీవితంలో ఇలాంటి దారుణమైన ఘటన ఏనాడూ చూడలేదని స్పష్టంచేశారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. పార్లమెంట్ అనేది బల ప్రదర్శనకు వేదిక కాదని, కుస్తీలు పట్టడానికి రెజ్లింగ్ రింగ్ కాదని సూచించారు. గురువారం నాటి ఘర్షణపై తగిన చర్యలు ఉంటాయని తేల్చిచెప్పారు. అమిత్ షాపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు అంబేడ్కర్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ కేంద్ర మంత్రి అమిత్ షాపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గురువారం రాజ్యసభలో సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. రాజ్యసభ చైర్మన్ ధన్‌ఖడ్‌కు ఈ నోటీసు అందజేశారు. రాజ్యసభ సాక్షిగా రాజ్యాంగ నిర్మాతను అమిత్ షా అవమానించారని ఖర్గే ఆరోపించారు. పార్లమెంట్‌లోకి వెళ్తుంటే ఎగతాళి చేశారుతాము పార్లమెంట్‌లోకి వెళ్తుండగా బీజేపీ ఎంపీలు ఎగతాళి చేశారని, లోపలకి వెళ్లకుండా అడ్డుకున్నారని కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఆరోపించారు. అంబేడ్కర్‌ను అవమానించినందుకు హోంమంత్రి పదవికి అమిత్ షా రాజీనామా చేయాలని, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వారు గురువారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అమిత్ షాను కాపాడేందుకు బీజేపీ ముందస్తుగానే కుట్ర పన్నిందని విమర్శించారు.పరస్పరం ఫిర్యాదులు మొత్తం గొడవకు రాహుల్ గాంధీ కేంద్ర బిందువుగా మారారు. ఆయనపై బీజేపీ నేతలు పార్లమెంట్ హౌస్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హత్యాయత్నం, భౌతిక దాడి, హింసకు ప్రేరేపించడం వంటి ఆరోపణలతో ఫిర్యాదు అందించారు. రాహుల్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాంగ్రెస్ నేతలు సైతం బీజేపీ ఎంపీలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కూడా కలిశారు. రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీలు దారుణంగా ప్రవర్తించారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ఓం బిర్లాకు ఫిర్యాదు అందజేశారు. మల్లికార్జున ఖర్గే సైతం ఓం బిర్లాకు లేఖ రాశారు. బీజేపీ ఎంపీల దాడిలో తన మోకాలికి గాయమైందని పేర్కొన్నారు. ఈ దాడిపై దర్యాప్తు జరపాలని కోరారు. రాజ్యసభ చైర్మన్ ధన్‌ఖడ్‌కు కూడా కాంగ్రెస్ ఎంపీలు ఫిర్యాదు చేశారు. బీజేపీ నేతలు సైతం కాంగ్రెస్ ఎంపీలపై లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. నా ఆత్మగౌరవం దెబ్బతీశారురాహుల్ గాందీపై నాగాలాండ్‌కు చెందిన బీజేపీ మహిళా ఎంపీ ఫాంగ్నన్ కోన్యాక్ ఆరోపణలు చేయడం సంచలనాత్మకంగా మారింది. ఆమె గురువారం రాజ్యసభలో మాట్లాడారు. ‘‘మకరద్వారం వద్ద శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుండగా రాహుల్ గాంధీ నాకు చాలా సమీపంలోకి వచ్చారు. కోపంగా చూస్తూ నాపై గట్టిగా అరిచారు. నాకు చాలా అసౌకర్యంగా అనిపించింది. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ ప్రవర్తన ఇదేనా?’’ అని ప్రశ్నించారు. రాహుల్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాజ్యసభ చైర్మన్ ధన్‌ఖడ్‌కు లేఖ అందజేశారు. ‘‘నేను గిరిజన మహిళను. రాహుల్ నా పట్ల అనుచితంగా ప్రవర్తించారు. నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. నాకు రక్షణ కల్పించాలి’’ అని లేఖలో పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదును పరిశీలిస్తున్నానని ధన్‌ఖడ్ చెప్పారు. హోం మంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలంటూ పార్లమెంట్ ప్రాంగణంలో ఇండియా కూటమి ఎంపీల నిరసన -
‘అమిత్‌షాకు మతి భ్రమించింది’
పాట్నా : ‘కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు మతి భ్రమించింది. వెంటనే ఆయన రాకీయాల నుంచి తప్పుకోవాలని’ అని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ డిమాండ్ చేశారు.అంబేద్కర్ పేరు ప్రస్తావించడం కాంగ్రెస్‌కు ప్యాషనైందంటూ రాజ్యసభలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై లాలూ ప్రసాద్ యాదవ్ స్పందించారు. ‘అమిత్ షాకు మతి భ్రమించింది. బాబాసాహెబ్ అంబేద్కర్‌పై అమిత్‌షా రగిలిపోతున్నారు. ఆయన తీరును ఖండిస్తున్నా. అంబేద్కర్ గొప్పవారు. అమిత్‌షా రాజకీయాలను వదిలేయాలి' అని లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు.पगला गया है अमित शाह !इस्तीफा देकर जल्द दे जल्द भाग जाए केंद्रीय गृह मंत्री !संविधान रक्षक - लालू प्रसाद यादव@laluprasadrjd 🔥🔥#तड़ीपार_माफ़ी_मांग pic.twitter.com/uOaBHFBtSw— सरपंच साहेब (@sarpanchsaheb3) December 19, 2024అంతకుముందు,బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ మాట్లాడారు. అమిత్ షా,బీజేపీ రాజ్యాంగానికి వ్యతిరేకమని ఆరోపించారు. అంబేద్కర్ మా ఫ్యాషన్. మా ప్రేరణ. బాబాసాహెబ్ అంబేద్కర్‌ను ఎవరు అవమానించినా మేం అంగీకరించం. అలాంటి వ్యక్తులు ద్వేషాల్ని రగిల్చే వారు. రాజ్యాంగ వ్యతిరేకులు,పార్లమెంటులో ఉపయోగించిన భాష ఆమోదించదగిన అంశం కాదు. రాజ్యంగ వజ్రోత్సవాలపై రాజ్యసభలో రెండు రోజుల చర్చకు ఆయన బదులిచ్చారు. ఆ సందర్భంగా కాంగ్రెస్‌ను విమర్శిస్తూ అంబేద్కర్ ప్రస్తావన తెచ్చారు. అంబేద్కర్, అంబేద్కర్ అనడం వాళ్లకు ఇప్పుడో ఫ్యాషనైపోయింది. అన్నిసార్లు దైవనామ స్మరణ చేస్తే కనీసం ఏడు జన్మల దాకా స్వర్గమన్నా దక్కేది’ అంటూ ఎద్దేవా చేశారు. అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలను డిమాండ్ చేస్తూ విపక్షాలు పార్లమెంట్ వెలుపల నిరసన చేపట్టాయి. ఆ నిరసన ఉద్రిక్తతకు దారి తీసింది. అధికార, విపక్ష ఎంపీల మధ్య జరిగిన తోపులాటలో ఒడిశా బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగికి గాయాలయ్యాయి. -
మీరేమంటారు?.. చంద్రబాబు, నితీశ్‌కు కేజ్రీవాల్ లేఖ
ఢిల్లీ, సాక్షి: ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, బీహార్ సీఎం నితీశ్ కుమార్‌లకు లేఖ రాశారు. అంబేద్కర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై స్పందనేంటో తెలియజేయాలని లేఖలో కోరారాయన.‘‘బాబా సాహెబ్‌ను అమిత్ షా అవమానించారు. ఈ అవమానానికి మీ మద్ధతు ఉందా?.. మీ నుంచి సమాధానం కోసం యావత్ దేశం ఎదురు చూస్తోంది’’ అని ఎక్స్ ఖాతాలో ప్రశ్నించారాయన. టీడీపీ, జేడీయూలు ఎన్డీయే కూటమిలో ప్రధాన భాగస్వామ్య పార్టీలుగా ఉన్న సంగతి తెలిసిందే.అలాగే.. అంబేద్కర్‌పై అమిత్ షా వ్యాఖ్యలు సమర్థనీయం కాదు. కోట్లాది మంది మనోభావాలు దెబ్బ తిన్నాయి. అమిత్ షా కనీసం క్షమాపణలు కూడా చెప్పలేదు. ప్రధాని మోదీ కూడా అమిత్ షానే సమర్థిస్తున్నారు. బీజేపీ మద్దతుపై పునరాలోచించుకోవాలి అని లేఖలో కేజ్రీవాల్ లేఖలో కోరారు.बीजेपी ने संसद में बाबा साहेब का अपमान किया है। लोगों को लगता है कि बाबा साहेब को चाहने वाले बीजेपी का समर्थन नहीं कर सकते। आप भी इस पर विचार करें।My Letter to Shri N Chandra Babu Naidu ji. pic.twitter.com/87pKYTfdDY— Arvind Kejriwal (@ArvindKejriwal) December 19, 2024 बीजेपी ने संसद में बाबा साहेब का अपमान किया है। लोगों को लगता है कि बाबा साहेब को चाहने वाले बीजेपी का समर्थन नहीं कर सकते। आप भी इस पर विचार करें।श्री नीतीश कुमार जी को मेरा पत्र। pic.twitter.com/YLd7lXrqmn— Arvind Kejriwal (@ArvindKejriwal) December 19, 2024బాబాసాహెబ్ అంబేద్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. పార్లమెంట్ లోపల, వెలుపల నిరసనలతో ఇండియా కూటమి హోరెత్తిస్తోంది. అమిత్ షా రాజీనామా చేయాలని.. లేదంటే ప్రధాని మోదీ ఆయన్ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. మరోవైపు.. రాజ్యసభలో షాపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు తృణమూల్ ఎంపీ డెరెక్ ఓబ్రియన్.ఏమన్నారంటే.. భారత రాజ్యాంగంపై చర్చ సమయంలో.. రాజ్యసభలో సమాధానం ఇచ్చిన కేంద్రమంత్రి అమిత్ షా.. కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. రాజకీయ లబ్ధి కోసమే హస్తం పార్టీ బీఆర్ అంబేద్కర్ పేరును వాడుకుంటోందని విమర్శించారు. అంబేద్కర్ పేరు జపించడం ఆ పార్టీ నేతలకు ఫ్యాషన్‌గా మారిందని.. అన్నిసార్లు దేవుడు పేరు జపిస్తే, ఏడు జన్మలకు సరిపడా పుణ్యం వచ్చి.. స్వర్గానికి వెళ్లేవారని ఆక్షేపించారు. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆప్ నేషనల్ కన్వీనర్ కేజ్రీవాల్, BSP అధినేత్రి మాయావతి, నటుడు.. TVK చీఫ్ విజయ్ సహా పలువురు విపక్ష నేతలు షా వ్యాఖ్యలను ఖండించారు.దీనికి అధికార పక్షం గట్టిగానే కౌంటర్ ఇచ్చింది.లోక్‌సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్, రాజ్యసభలో కేంద్రమంత్రులు జేపీ నడ్డా, కిరణ్ రిజిజు .. కాంగ్రెస్ నేతలపై ధ్వజమెత్తారు. తన వ్యాఖ్యలకు కాంగ్రెస్ కావాలని వక్రీకరిస్తోందని మండిపడ్డారు కేంద్రమంత్రి అమిత్ షా. కాంగ్రెస్ విమర్శలు కొనసాగుతున్న వేళ.. అమిత్ షాకు మద్దతుగా నిలిచారు ప్రధాని నరేంద్ర మోదీ. ఎక్స్ వేదికగా కాంగ్రెస్‌ను కడిగి పారేశారు. అంబేద్కర్‌ను అవమానించిన కాంగ్రెస్ చీకటి చరిత్రను షా బహిర్గతం చేశారని.. దీంతో హస్తం పార్టీ ఉలిక్కిపడి.. డ్రామాలకు తెరతీసిందని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ కొన్నేళ్లపాటు దేశంలో అధికారంలో ఉన్నప్పటికీ ఎస్సీ, ఎస్టీల సాధికారత కోసం ఏమీ చేయలేదన్నారు ప్రధాని మోదీ. అంబేద్కర్‌ను ఎన్నికల్లో కాంగ్రెస్ రెండుసార్లు ఓడిపోయేలా చేసిందని.. ఆయనకు భారతరత్న ఇచ్చేందుకు నిరాకరించడమే కాకుండా.. అంబేద్కర్ చిత్రపటాన్ని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో పెట్టడాన్ని వ్యతిరేకించిందంటూ.. కాంగ్రెస్ పాపల చిట్టాను ఎక్స్‌లో పోస్ట్ చేశారు.If the Congress and its rotten ecosystem think their malicious lies can hide their misdeeds of several years, especially their insult towards Dr. Ambedkar, they are gravely mistaken!The people of India have seen time and again how one Party, led by one dynasty, has indulged in…— Narendra Modi (@narendramodi) December 18, 2024 -
పార్లమెంట్ రేపటికి వాయిదా
Parliament Winter Session Live Updates:సభ్యుల ఆందోళనతో లోక్‌సభ రేపటికి వాయిదా రాజ్యసభ రేపటికి వాయిదా..ఢిల్లీ : పార్లమెంట్లో జరిగిన తోపులాట బీజేపీ ఎంపీలు ప్రతాప్ చంద్ర సారంగి,ముఖేష్ రాజ్‌పుత్‌లు గాయపడిన ఘటనపై ఎన్డీయే కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదుకు ఎన్డీయే నేతలు సిద్ధమయ్యారు.అంతకంటే ముందే పార్లమెంట్లో ఎంపీల మధ్య జరిగిన తోపులాటకు సంబంధించిన వీడియోల్ని పరిశీలించనున్నారు. ఆ తర్వాతే తదుపరి చర్యలకు ఉపక్రమించనున్నట్లు తెలుస్తోంది. స్పీకర్‌కు ఖర్గే లేఖపార్లమెంట్ ముఖ ద్వారం వద్ద జరిగిన తోపులాటలో తనకు గాయమైందని, విచారణ జరపాలని స్పీకర్ ఓంబిర్లాకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్పీకర్‌కు లేఖ రాశారు. My letter to the Hon’ble @loksabhaspeaker urging to order an inquiry into the incident which is an assault not just on me personally, but on the Leader of the Opposition, Rajya Sabha and the Congress President. pic.twitter.com/gmILQdIDYW— Mallikarjun Kharge (@kharge) December 19, 2024 ప్రధానితో కిరణ్ రిజుజు భేటీపార్లమెంట్లో జరిగిన తోపులాట ఘటనకు సంబంధించిన సమాచారం అందించేందుకు ప్రధాని మోదీతో పార్లమెంటరీ కమిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు భేటీ అయ్యారు. ఈ భేటీలో పార్లమెంట్లో జరిగిన నిరసన, అపై జరిగిన పరిణామల గురించి వివరిస్తున్నారు. పార్లమెంట్లో ఎంపీల తోపులాట పార్లమెంట్లో గందర గోళం నెలకొంది. అంబేద్కర్‌ను అవమానించి కాంగ్రేస్సే నంటూ బీజేపీ.. కాదు..కాదు కమలం నేతలు అవమానించారంటూ అధికార, విపక్ష ఎంపీలు పార్లమెంట్ ముందు పోటా పోటీగా నిరసనలు చేపట్టారు. ఎంపీలు చేట్టిన నిరసనలో ఉద్రికత్త చోటు చేసుకుంది. కాంగ్రెస్, బీజేపీ ఎంపీల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఒడిశా బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగికి గాయాలయ్యాయి. దీంతో అప్రమత్తమైన పార్లమెంట్ సిబ్బంది ఎంపీ సారంగిని అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ప్రతాప్ సారంగిని పరామర్శించేందుకు కేంద్ర మంత్రులు ఆస్పత్రికి వెళ్లనున్నారు. #WATCH | Delhi | BJP MP Pratap Chandra Sarangi says, "Rahul Gandhi pushed an MP who fell on me after which I fell down...I was standing near the stairs when Rahul Gandhi came and pushed an MP who then fell on me..." pic.twitter.com/xhn2XOvYt4— ANI (@ANI) December 19, 2024పార్లమెంట్ భయట ఆందోళన చేపట్టిన ప్రతిపక్ష,విపక్ష ఎంపీ నిరసన ఉద్రిక్తతకు దారి తీసింది. నిరసనలో బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి గాయపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేను పార్లమెంట్ మెట్ల దగ్గర నిలబడ్డా.. ఆ సమయంలో రాహుల్ గాంధీ ఓ ఎంపీని నెట్టాడు. ఆ ఎంపీ వచ్చి నాపై పడ్డాడు. దీంతో నాకు గాయాలు అయ్యాయి’ అని చెప్పారు.పార్లమెంట్ లోపలికి వెళ్లే హక్కు మాకుంది : రాహుల్ఈ తోపులాటపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. నేను పార్లమెంట్ మెట్లపై నిల్చున్నాను. నన్ను అడ్డుకునేందుకు బీజేపీ ఎంపీలు ప్రయత్నించారు. కావాలంటే మీరే చూడంటే పార్లమెంట్‌లోని కెమెరాల్లో రికార్డయి ఉంటుంది. నేను పార్లమెంటు గేటు నుంచి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. బీజేపీ ఎంపీలు నన్ను అడ్డుకున్నారు. మల్లికార్జున్ ఖర్గేను నెట్టారు. పార్లమెంట్ లోపలికి వెళ్లే హక్కు మాకుంది. మమ్మల్ని లోపలికి పోనివ్వకుండా బీజేపీ ఎంపీలు అడ్డుకునే ప్రయత్నం చేశారు’ అని ఆయన అన్నారు.#WATCH | Lok Sabha LoP Rahul Gandhi says, "This might be on your camera. I was trying to go inside through the Parliament entrance, BJP MPs were trying to stop me, push me and threaten me. So this happened...Yes, this has happened (Mallikarjun Kharge being pushed). But we do not… https://t.co/q1RSr2BWqu pic.twitter.com/ZKDWbIY6D6— ANI (@ANI) December 19, 2024అంబేద్కర్‌ను అవమానించిన పార్టీ కాంగ్రెస్పార్లమెంట్లో అధికార, విపక్షాల ఆందోళనపై తెలంగాణ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ స్పందించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. అంబేద్కర్‌ను అడుగడుగునా అవమానించిన పార్టీ కాంగ్రెస్. సెంట్రల్ హాల్లో అంబేద్కర్ చిత్రపటం పెట్టడాన్ని వ్యతిరేకించింది. అంబేద్కర్‌కు బీజేపీ సమున్నత గౌరవం ఇచ్చింది. నిజాలు బయటపెడుతుంటే కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతుంది. అమిత్ షా వీడియోని వక్రీకరించి రాద్ధాంతం చేస్తోంది. -
రాజకీయం ‘అదిరింది’.. అమిత్ షాకు విజయ్ కౌంటర్
చెన్నై: బీఆర్ అంబేద్కర్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే అమిత్ షా వ్యాఖ్యలకు ఇండియా కూటమి నేతలు కౌంటర్ ఇవ్వగా తాజాగా తమిళనాడు నేత, నటుడు విజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షాను టార్గెట్ చేసి సంచలన ఆరోపణలు చేశారు.అమిత్ షా వ్యాఖ్యలపై తమిళగ వెట్రి కళగం నేత విజయ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘అంబేడ్కర్ పేరు వింటే కొందరికి అలర్జీ. ఆయన సాటిలేని రాజకీయ మేధావి. స్వేచ్ఛా వాయువులు పీల్చిన భారత ప్రజలందరూ అంబేద్కర్‌ను గౌరవించారు. అంబేద్కర్ అనే పేరు వింటే మనసు, పెదవులకు సంతోషంగా ఉంటుంది. ఆయనను అవమానించడాన్ని సహించబోమంటూ కామెంట్స్ చేశారు. దీంతో, ఆయన బీజేపీనే టార్గెట్ చేసి ఇలా కామెంట్స్ చేశారని పలువురు చెబుతున్నారు.Our TVK President @tvkvijayhq strongly condemned the Union Home Minister Amit Shah for disrespecting Ambedkar, our ideological leader. He said such insults are unacceptable and expressed his disapproval on behalf of the Tamilaga Vettri Kazhagam 🙏🏼🔥 pic.twitter.com/SzKpJ05laV— velpparsuriya (@SuriyaCreation3) December 18, 2024ఇదిలా ఉండగా.. నటుడు విజయ్ తన రాజకీయ పార్టీ టీవీకే పార్టీ మొదటి ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా అంబేద్కర్ తన పార్టీ సైద్దాంతిక గురువు అని చెప్పుకొచ్చారు. మరోవైపు.. విజయ్ వ్యాఖ్యలపై తమిళనాడు బీజేపీ నేతలు మండిపడుతున్నారు. అంతకుముందు పార్లమెంట్ సమావేశాల సందర్బంగా అమిత్ షా క్షమాపణలు చెప్పాలంటూ విపక్షాలు నిరసనలకు దిగాయి. దీంతో, పార్లమెంటు ఉభయ సభలు బుధవారం దద్దరిల్లాయి. సభలోనే కాకుండా బయటా ప్రతిపక్షాలు నిరసనలు వ్యక్తం చేశాయి. అమిత్ షా రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండు చేసింది. అయితే కాంగ్రెస్ పార్టీనే ఇప్పటిదాకా అంబేడ్కర్‌ను అవమానిస్తూ వస్తోందని, తామే ఆయనను సంపూర్ణంగా గౌరవిస్తున్నామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.ఇదే సమయంలో తన వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరించిందని అమిత్ షా వివరణ ఇచ్చారు. పదే పదే అంబేడ్కర్ పేరును జపించే బదులు.. ఏ దేవుడిని స్మరించుకున్నా ఏడు జన్మలదాకా స్వర్గ ప్రాప్తి లభించేదని అమిత్ షా మంగళవారం రాజ్యసభలో వ్యాఖ్యానించినట్లు కాంగ్రెస్ ఆరోపించింది. ఆ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. అయితే తమకు అంబేడ్కరే దేవుడని ఆ పార్టీ స్పష్టం చేస్తూ అమిత్ షా క్షమాపణలు చెప్పడంతోపాటు రాజీనామా చేయాలని లేదంటే ప్రధాని ఆయనను తొలగించాలని డిమాండు చేసింది. కాంగ్రెస్‌కు బుధవారం విపక్షాలు తోడవడంతో పార్లమెంటు దద్దరిల్లింది. మరోవైపు దేశవ్యాప్తంగా అమిత్ షాకు వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళనలు నిర్వహించాయి. -
పార్లమెంటు ఉభయసభలు రేపటికి వాయిదా
Live Updates..ఢిల్లీ:పార్లమెంటు ఉభయసభలు రేపటికి వాయిదాఅంబేద్కర్ అంశంపై విపక్షాల ఆందోళనముందుకు సాగని సభా కార్యక్రమాలు👉విపక్షాల నిరసనల కారణంగా రాజ్యసభ మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా.. 👉పార్లమెంట్ సమావేశాల సందర్బంగా లోక్‌సభలో వాడీవేడి చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ నేతలకు బీజేపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఉభయ సభల్లో కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.#WATCH | On Union HM's speech in RS during Constitution debate, Rajya Sabha LoP and Congress MP Mallikarjun Kharge says "He has insulted Baba Saheb Ambedkar and the Constitution. His ideology of Manusmriti and RSS makes it clear that he does not want to respect Baba Saheb… pic.twitter.com/x9H75vJcZk— ANI (@ANI) December 18, 2024👉కాంగ్రెస్ నేతలు నేడు అంబేద్కర్ చిత్రపటంతో సభలు వచ్చారు. ఈ సందర్బంగా అమిత్ షా రాజీనామా చేయాలని విపక్ష నేత మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతల నిరసనలను బీజేపీ ధీటుగా కౌంటరిచ్చింది.👉మరోవైపు.. అంబేద్కర్‌ను అమిత్ షా కించపరచలేదని కేంద్రమంత్రి మేఘవాల్ చెప్పుకొచ్చారు. 👉రాజ్యసభలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. అమిత్ షా తన ప్రసంగంలో అంబేద్కర్‌పై గౌరవ భావాన్ని స్పష్టంగా చూపించారు. అలాగే అంబేద్కర్ బ్రతికుండగానే ఆయనను కాంగ్రెస్ ఎలా అవమానించిందో అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఆయనకు భారతరత్న అవార్డు ఇవ్వలేదు. ఇన్ని సంవత్సరాలు భారతరత్న ఎందుకు ఇవ్వలేదు. 1952లో కుట్రతో ఎన్నికల్లో ఓడించింది. నేను బౌద్ధుడిని ఈ దేశంలో బాబా సాహెబ్ చూపిన బాటలో నడిచే వ్యక్తిని . బాబా సాహెబ్ 1951లో న్యాయ మంత్రి పదవికి అంబేద్కర్ రాజీనామా చేశారు. అనంతరం, 71 సంవత్సరాల తర్వాత, ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి బౌద్దుడిని న్యాయ మంత్రిని చేశారు.#WATCH | In Rajya Sabha, Union Minister Kiren Rijiju says "Yesterday, Union HM Amit Shah clearly showed our sense of reverence in his speech. He also said how Congress insulted Ambedkar ji when he was alive...The Congress party did not award him with Bharat Ratna for so many… pic.twitter.com/0G6MaEG1AN— ANI (@ANI) December 18, 2024 -
Video: అరుదైన సన్నివేశం.. మోదీ, ఖర్గే ముచ్చట్లు
న్యూఢిల్లీ: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 69వ వర్థంతి సందర్భంగా ఢిల్లీలో శుక్రవారం అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. పార్లమెంట్ ఆవరణలో నిర్వహించిన మహాపరినిర్వాన్ దివస్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ క్రమంలో ఆసక్తికర పరిణామం జరిగింది. ప్రధాని మోదీ, ఖర్గే పరస్పరం పలకరించుకొని కాసేపు నవ్వుతూ మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలను కెమెరామెన్లు క్లిక్‌మనిపించడంతో.. ఇవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఈ కార్యక్రమానికి మోదీ, ఖర్గేతోపాటు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఖర్గే మోదీ వద్దకు వచ్చి షేక్‌హ్యాండ్ ఇచ్చారు. అనంతరం ఇరువురు నేతలు కాసేపు నవ్వుతూ ముచ్చటించారు. రాజకీయాల్లో ఎప్పుడూ పరస్పర విమర్శలు, ఆరోపణలు చేసుకొనే నేతలు ఇలా ఒకేచోట అభివాదం చేస్తూ నవ్వుకుంటున్న దృశ్యాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.. మరోవైపు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అంబేద్కర్‌కు నివాళులర్పించారు.#WATCH | Delhi: Prime Minister Narendra Modi, Vice President Jagdeep Dhankhar, Former President Ram Nath Kovind, Congress President Mallikarjun Kharge and Lok Sabha Speaker Om Birla at the Parliament House Lawns as they pay tribute to Dr BR Ambedkar on the occasion of 69th… pic.twitter.com/TUrefyCY1m— ANI (@ANI) December 6, 2024 -
డా. బీఆర్ అంబేద్కర్ కు వైఎస్ జగన్ నివాళి
-
అంబేద్కర్‌కు వైఎస్ జగన్ నివాళులు
సాక్షి,తాడేపల్లి:రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ నివాళులర్పించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం(డిసెంబర్6) జరిగిన కార్యక్రమంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వైఎస్ జగన్.ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ అంబేద్కర్ స్ఫూర్తి ఎల్లవేళలా సమాజానికి మార్గదర్శకంగా నిలిచేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఆయన జీవితం అందరికీ ఆదర్శనీయమని కొనియాడారు. విజయవాడలోని స్వరాజ్ మైదానంలో ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ గారి సామాజిక న్యాయ మహాశిల్పాన్ని తమ హయాంలో ఏర్పాటు చేసిన విషయాన్ని వైఎస్ జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కమార్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్,మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, నెడ్ క్యాప్ మాజీ ఛైర్మన్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
రఘురామ.. ఫ్లెక్సీ చింపి అంబేద్కర్‌ను అవమానిస్తారా?: తానేటి వనిత
సాక్షి, ఏలూరు: ఏపీలో కూటమి సర్కార్ వచ్చిన నాటి నుంచి అంబేద్కర్‌కు అవమానమే జరుగుతోందన్నారు మాజీ హోంమంత్రి తానేటి వనిత. కూటమి నేతలు అంబేద్కర్‌కు ఏ మాత్రం గౌరవం ఇవ్వడం లేదన్నారు. ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు అంబేద్కర్ ఫ్లెక్సీ చింపేసి అవమానించారని మండిపడ్డారు.మాజీ హోంమంత్రి తానేటి వనిత తాజాగా aమీడియాతో మాట్లాడుతూ.. గోపాలపురం నియోజకవర్గం ద్వారకా తిరుమలలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేయడం బాధాకరం. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిని తప్పకుండా శిక్షించాలి. కూటమి నేతలు అంబేద్కర్‌కు గౌరవం ఇవ్వడం లేదు. ఎమ్మెల్యే రఘురామ అంబేద్కర్ ఫ్లెక్సీ చించేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు కోరితే న్యాయం జరగలేదు. విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని వైఎస్ జగన్ నిర్మిస్తే.. ప్రభుత్వం మారిన తర్వాత ఆయన పేరును తొలగించారు. అంబేద్కర్‌పై రాజకీయాలా?.అంబేద్కర్ విగ్రహం వద్ద లైట్లన్నీ ఆపేసి.. శిలాఫలకాలు పగలగొట్టారు. ఇప్పటి వరకూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్.. విగ్రహం వద్దకు వెళ్లి చూసింది లేదు. శిలాఫలకం ధ్వంసం చేసిన వారిపై కనీసం చర్యలు తీసుకోలేదు. ఇలాంటి అవమానకర ఘటనలు రాష్ట్రంలో ఎక్కడా రిపీట్ కాకూడదని కోరుతున్నాను. విగ్రహం ధ్వంసం చేసిన వారిపై కేసులు పెట్టాలి.. వారికి శిక్ష పడాలని కోరుతున్నాం.సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్న వారి గొంతు నొక్కాలని చూస్తున్నారు. ఎక్కడా లేని విధంగా కొత్త చట్టాలు తీసుకువచ్చి వారిపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. చిన్నపిల్లలు, మహిళలపై అఘాయిత్యాలు, దారుణాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతల కోసం పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకోవాలి. అంతేకానీ.. వైఎస్సార్సీపీ కార్యకర్తలను, సోషల్ మీడియా కార్యకర్తలను ఇబ్బంది పెట్టేందుకే పోలీసులను ఉపయోగిస్తున్నారు. సోషల్ మీడియా కార్యకర్తల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. కూటమి నేతలకు అధికారం ఇచ్చింది.. ప్రజలకు మేలు చేయడానికి.. ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి కాదు. ఢిల్లీలో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచినా వారికి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఇక్కడ కూటమి ప్రభుత్వం ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. -
నల్ల చట్టాలు తేవడంలో కూటమి సర్కార్ ముందుంది: మల్లాది విష్ణు
సాక్షి, విజయవాడ: ఏపీలో సోషల్ మీడియాను నియంత్రించే విధంగా కొత్త చట్టాలు తేవడం దారుణమన్నారు వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. నల్ల చట్టాలు తేవడంలో కూటమి ప్రభుత్వం ముందు వరుసలో ఉందంటూ ఘాటు విమర్శలు చేశారు.మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడలోని సింగ్ నగర్లో పార్టీ కార్యాలయంలో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘రాజ్యాంగం ప్రతీ పౌరుడికి భద్రత, హక్కులు, స్వేచ్ఛ కల్పించింది. కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి కూడా రాజ్యాంగ విరుద్ధంగా ఉంది. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ బయటకు వచ్చినప్పుడు భద్రత కల్పించే విషయంలో కూటమి ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా నడుచుకుంటోంది.కూటమి ప్రభుత్వం చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు చేస్తోంది. సోషల్ మీడియాను నియంత్రించే విధంగా కొత్త చట్టాలు తేవటం దారుణం. నల్ల చట్టాలు తేవడంలో కూటమి ప్రభుత్వం ముందుంది. ఆంధ్ర రాష్ట్రంలో వినూత్నమైన పరిపాలన జరుగుతోంది. ప్రజల హక్కులు హరించబడుతున్నాయి. పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వైఎస్ జగన్‌పై దుష్ప్రచారం చేసి కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచింది. రాజ్యాంగం అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం వద్ద అధికారులు ఎందుకు నివాళులర్పించలేదు?. ప్రభుత్వం, అధికారులు వివక్షత చూపిస్తున్నారు’ అంటూ కామెంట్స్ చేశారు.ఇది కూడా చదవండి: AP: సోషల్ మీడియా కార్యకర్తలపై పెరిగిన వేధింపులు -
రాజ్యాంగ నిర్మాతలకు వందనం
భారతీయ విలువలు, ఆదర్శాలను ప్రతిబింబించేలా పరమ పవిత్రమైన భారత రాజ్యాంగాన్నిరూపొందించుకుని, 1949 నవంబర్ 26 నాడు ఆమోదించుకున్న రోజు దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చింది. ఆ రోజునే మనం ‘సంవిధాన్ దివస్’ (రాజ్యాంగ దినోత్సవం)గా జరుపుకొంటున్నాం. నేడు 75వ రాజ్యాంVýæ దినోత్సవం కావడం విశేషం. అయితే, రాజ్యాంగ నిర్మాణం చిన్న విషయం కాదు. సిద్ధాంత రాద్ధాంతాల సంఘర్షణ నుంచి వచ్చిన ఇది... ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్. భారతదేశ పురోగతి, ప్రజల సంక్షేమాలకు ఇది తోడ్పాటునందిస్తోంది. ఎప్పటికప్పుడు వ్యవస్థను పటిష్ఠపరుస్తూ ‘సజీవ పత్రం’గా నిరంతర మార్గదర్శనం చేస్తోంది.రాజ్యాంగ నిర్మాతల దూరదృష్టిభారతదేశ చరిత్రలో స్వాతంత్య్ర సిద్ధి ఓ ప్రత్యేకమైన సందర్భం. భారతీయుల భవిష్యత్తును నిర్దేశించిన రోజది. రాజకీయంగా స్వాతంత్య్రాన్ని పొందాం. కానీ, భారతీయ విలువలకు అనుగుణంగా స్వపరిపాలన జరగాలన్న బలమైన ఆకాంక్ష భారతీయుల్లో వ్యక్తమైంది. దీనికి ప్రతిరూపంగానే, భారతీయ విలువలు, ఆదర్శా లను ప్రతిబింబించేలా పరమ పవిత్రమైన భారత రాజ్యాంగాన్ని రూపొందించుకుని, 1949 నవంబర్ 26 నాడు ఆమోదించుకున్న రోజు దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చింది.నాటి నుంచి గత 75 ఏళ్లుగా భారతదేశంలో మూలవిలువలు, సామాజికస్పృహలను ‘భారత రాజ్యాంగం’ సంరక్షిస్తోంది. మారుతున్న కాలానికి అను గుణంగా, ఎప్పటికప్పుడు వ్యవస్థను పటిష్ఠపరుస్తూ ‘సజీవ పత్రం’గా నిరంతర మార్గదర్శనం చేస్తోంది. భారతీయ ఆత్మను, అస్తిత్వాన్ని సంరక్షించడం అనే రెండు అంశాల అద్భుత సమ్మేళనంగా మన రాజ్యాంగం ముందుకు నడిపిస్తోంది. రాజ్యాంగ నిర్మాతల ఈ ముందుచూపే రాజ్యాంగ సభ చర్చల్లో ప్రతిబింబించింది.1949 సెప్టెంబర్ 18 నాడు భారత రాజ్యాంగ సభలో చర్చ సందర్భంగా... స్వాతంత్య్ర సమర యోధుడు, భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడు కల్లూరు సుబ్బారావు తన తొలి ప్రసంగంలో, రుగ్వేదంలో భారత్ అనే పదాన్ని వాడిన విషయాన్ని, వాయు పురాణంలో (45వ అధ్యాయం 75వ శ్లోకం) భారతదేశ సరిహద్దుల గురించి ఉన్న వివరణను తెలియజేశారు. ఇదంతు మాధ్యమం చిత్రం శుభాశుభ ఫలోదయం, ఉత్తరం యత్ సముద్రస్య హిమవన దక్షిణం చ యత్’... హిమాలయాల దక్షిణం వైపు, సముద్రానికి ఉత్తరం వైపున్న పవిత్ర భూమే భారతమాత అని అర్థం. భారత్ అనేది కేవలం ఒక పదం కాదు, వేలాది సంవత్సరాల ఘనమైన వార సత్వ విలువలకు సజీవ రూపం అని ఈ మాటలు స్పష్టం చేస్తున్నాయి. ఆనాటి కాంగ్రెస్ సిద్ధాంతంలో, నేటి కాంగ్రెస్ ఆలోచనలో నక్కకూ నాకలోకానికీ ఉన్నంత తేడా ఉంది. వారు తరచుగా భారతదేశపు నాగరిక విలువలను అవమానించేలా, దేశాన్ని ‘నెగోషి యేటెడ్ సెటిల్మెంట్’ అని వ్యాఖ్యానిస్తున్నారు.1948 నవంబర్ 4న రాజ్యాంగ సభ చర్చలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మాట్లాడుతూ... భారతదేశం ఓ అవిభాజ్య భూఖండం అనీ, దేశం పరిపాలనా సౌలభ్యం కొరకు వేర్వేరు రాష్ట్రాలుగా విభజించబడి నప్పటికీ... ఈ దేశ అధికారం ఒకే మూలం నుంచి ఉద్భవిస్తుందని పేర్కొన్నారు. రాజ్యాంగ పీఠికలో ‘సోషలిస్ట్’ అనే పదాన్ని చేర్చాలన్న చర్చను అంబేడ్కర్ వ్యతిరేకించారు. ‘రాజ్యా నికి సంబంధించిన విధానం ఎలా ఉండాలి? సామాజిక, ఆర్థిక కోణంలో సమాజ నిర్వహణ ఎలా జరగాలి? వంటి అంశాలను సమయానుగుణంగా ప్రజలే నిర్ణయించుకోవాలి’ అని స్పష్టం చేశారు. రేపటి రోజు సోషలిజం కంటే మంచి విధానాలు వస్తే, వాటిని రాజ్యాంగంలో చేర్చుకుని, అమలుచేసుకునే అవకాశం రానున్న తరాలకు ఉండాలనేది అంబేడ్కర్ భావన. ఈ సౌలభ్య విధానాన్ని సద్వినియోగం చేసుకుంటూ... 1991లో లైసెన్స్ రాజ్ నుంచి... ఉదారవాద, సరళీకృత ఆర్థిక వ్యవస్థకు బాటలు పడ్డాయి. నాడు రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగ సభ వేదిక ద్వారా చేసిన సమగ్రమైన చర్చలు... నేటికీ వివిధఅంశాలపై లోతైన అవగాహనను కల్పిస్తున్నాయి. రాజ్యాంగ సభలో అంబేడ్కర్ మాట్లాడుతూ... రాజ్యాంగంలో పేర్కొన్నట్లుగా సౌభ్రాతృత్వం, సమానత్వం పదాలు సరిగ్గా అమలై అందరికీ అభివృద్ధి ఫలాలు అందినపుడే, నిజమైన జాతిగా మనం పురోగతి సాధించినట్లుగా భావించాలన్నారు. 2014లో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అంత్యోదయ నినాదంతో, ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ విధానంతో సమగ్ర సాధికారత కోసం పనిచేస్తున్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిలిచే క్రమంలో... సాధికారత అనేది ప్రతి పౌరుడి సహజమైన జీవన విధానంగా, భారతదేశ పురోగతిలో అంతర్లీనంగా ఉన్నటువంటి అంశంగా మారిపోయింది.ముద్ర యోజన, స్టార్టప్ ఇండియా వంటి కార్యక్రమాలు, స్వచ్ఛభారత్, బేటీ బచావో–బేటీ పఢావోవంటి సామాజిక ఉద్యమాలు దేశం నడుస్తున్న దిశను పునర్నిర్వచించాయి. ప్రభుత్వ నియంత్రణలో ఉండే సోషలిజం అనే భావన నుంచి ఏనాడో బయటకు వచ్చి, అందరి సంక్షేమం కోసం సామాజిక న్యాయమనే నినాదంతో ప్రతి ఒక్కరికీ విస్తృతమైన అవకాశాలు కల్పిస్తున్నాం. వందకుపైగా యూనికార్న్స్ (1 బిలి యన్‌కు పైగా పెట్టుబడులున్న కంపెనీలు)తో భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా అవతరించింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ తయారీదారుగా నిలిచింది. వ్యాక్సిన్ సప్లయ్, రక్షణ రంగ ఉత్పత్తిలో గ్లోబల్ లీడర్‌గా మన్ననలు అందుకుంటోంది. దేశంలో సెమీకండక్టర్ల తయారీ ఉద్యమం ఊపందుకుంది. ఫి¯Œ టెక్, హెల్త్ టెక్ సంస్థలు అంతర్జాతీయ వేదికపై భారత గౌరవాన్ని ఇనుమ డింపజేస్తున్నాయి. త్వరలోనే ప్రపంచ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించబోతోంది.దేశం ఇలా అన్ని రంగాల్లో అగ్రదేశాల సరసన నిలుస్తున్న సందర్భంలో, భారతీయుల సామర్థ్యంపై విశ్వాసాన్ని ఉంచకుండా, సమాజాన్ని విభజించేందుకు, సంపదను అందరికీ పంచేవిషయంలో అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నాలు జరగడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వెళ్లడమే అవుతుంది. ప్రతి భారతీ యుడి శక్తి సామర్థ్యాలపై విశ్వాసం ఉంచి, అందరికీ కలుపుకొని ముందుకెళ్తూ, వికసిత భారత లక్ష్యాలను చేరుకోవాలని సంకల్పించుకున్న ‘అమృత కాల’మిది. వ్యక్తులకు సాధికారత కల్పించినపుడే, సుసంపన్నమైన దేశంగా ఎదగడానికి, ప్రపంచానికి మరోసారి విశ్వగురుగా మారడానికి విçస్తృత అవకాశాలుంటాయి. -జి. కిషన్ రెడ్డి, వ్యాసకర్త కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి; బీజేపీ తెలంగాణ అధ్యక్షుడుమన రాజ్యాంగ నిర్మాతలుభారత రాజ్యాంగ నిర్మాణం పూర్తయిన రోజు నవంబర్ 26. కొన్ని అత్యవస రమైన అధికరణాల అమలు వెంటనే మొదలైంది. రెండు నెలల తరువాత పూర్తి రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అదే గణతంత్ర దినోత్సవం. రాజ్యాంగ నిర్మాణం చిన్న విషయం కాదు. సిద్ధాంత రాద్ధాంతాల సంఘర్షణ నుంచి వచ్చిన ఇదొక భగవద్గీత, బైబిల్, ఖురాన్. దీని రచనలో భాగస్వాములైన మహానుభావు లను తలుచుకోవడం మన కర్తవ్యం.బాబాసాహెబ్ బి.ఆర్.అంబేడ్కర్: అధికరణం 32 లేకపోతే రాజ్యాంగమే లేదు. నాయకుల నియంతృత్వం తప్ప స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం వంటి మాటలే ఉండక పోయేవి. కీలకమైన ఆర్టికల్ 32 రాసింది అంబేడ్కర్. ఆయన ఒక న్యాయవేత్త, ఆర్థికవేత్త, రాజనీతిజ్ఞుడు, సంఘ సంస్కర్త. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత మొదటి న్యాయశాఖ మంత్రి. పౌర హక్కులకు కీలకమైన ఆర్టికల్ 32 మొత్తం రాజ్యాంగాన్ని బతికించే శక్తి కలిగినది. ఏ అన్యాయం జరిగినా నేరుగా సుప్రీంకోర్టునే అడిగే హక్కును ఇచ్చిన ఆర్టికల్ ఇది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)కు పునాది ఇదే. ‘‘భారత రాజ్యాంగంలో అత్యంత ముఖ్యమైన ఆర్టికల్ ఏదని అడిగితే, ‘ఆర్టికల్ 32’ అని చెబుతాను. అది లేకుండా ఈ రాజ్యాంగం శూన్యం అవుతుంది... ఇది రాజ్యాంగ ఆత్మ, హృదయంవంటిది’’ అని అంబేడ్కర్ 1948 డిసెంబర్ 9న జరిగిన రాజ్యాంగ సభ చర్చల్లో ప్రకటించారు.అసమానతలను, వివక్షను అంతం చేసేందుకు అంబేడ్కర్ రాజ్యాంగ రూపకల్పనలో తానూ ఉండాలని అనుకున్నారు. మొత్తం భారత రాజ్యాంగ సంవిధానా నికి నిర్మాత అయినారు. 8 పనిగంటలు మొదలుకొని, ప్రసూతి సెలవుల వరకు కారణం ఆయనే. సమాన హక్కులు, సమాన అవకాశాలు అంబేడ్కర్ సిద్ధాంతం. భారతీయ రిజర్వ్ బ్యాంకు స్థాపనలో అంబేడ్కర్ ఆర్థిక సిద్ధాంతాలు కీలకపాత్ర పోషించాయి.దేవీ ప్రసాద్ ఖైతాన్: న్యాయవాది, స్వాతంత్య్ర సమర యోధుడు, రాజకీయవేత్త. కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజీలో విద్యార్థి. ‘ఖైతాన్–కో’ లా ఫర్మ్ వ్యవస్థాప కులు. 1925లో ఏర్పడిన ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సహ వ్యవస్థాపకులు. రచనా కమిటీ సభ్యు డిగా కొద్దికాలం పనిచేశారు. 1948లో మరణించడం వల్ల ఆ స్థానంలో టీటీ కృష్ణమాచారి వచ్చారు.సర్ సయ్యద్ మొహమ్మద్ సాదుల్లా: న్యాయవాది, అస్సాం ముస్లిం లీగ్ నాయకుడు. 1936లో బ్రిటిష్ ఇండియాలో కాంగ్రెసేతర పార్టీలతో కూటమి ఏర్పాటు చేసి అస్సాంకు తొలి ముఖ్యమంత్రి అయ్యారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి రాజ్యాంVýæ ముసాయిదా రూపకల్పన కమిటీకి ఎన్నికైన ఒకే ఒక్క సభ్యుడు. రాజ్యాంగ రచనలో పాలుపంచుకున్న ఒకే ఒక్క ముస్లిం లీగ్ సభ్యుడు కూడా. అస్సాం ఆర్థిక స్థిరత్వం, మైనారిటీ హక్కులను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు.సర్ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్: తమిళ కుటుంబానికి చెందిన అయ్యర్ నెల్లూరులో పుట్టారు. ఈ ప్రాంతం అప్పట్లో మద్రాస్ స్టేట్‌లో ఉండేది. ఆయన అపారమైన జ్ఞానం కలిగిన గొప్పవాడని అంబేడ్కర్ స్వయంగా అంగీకరించారు. రాజ్యాంగంలో చేర్చవలసిన పౌరసత్వ హక్కులు, ప్రాథమిక హక్కుల గురించి బలంగా వాదించారు. ‘మన విధానాలు, నిబద్ధత విషయంలో జాతి, మతం లేదా ఇతర ప్రాతిపదికన వ్యక్తుల మధ్య లేదా వర్గాల మధ్య భేదాలు చూపకూడ’దని లౌకికరాజ్యం ఎందుకు అవసరమో చెప్పారు. సర్ బెనెగల్ నర్సింగ రావ్: మంగళూరు(కర్ణాటక)లో జన్మించిన బీఎన్ రావు బ్రిటిష్ ప్రభుత్వంలోఇండియన్ సివిల్ సర్వెంట్‌గా చేరారు. అనేక కోర్టులలో జడ్జిగా పనిచేశారు. బ్రిటిష్ ప్రభుత్వంలో పలు కమిటీలలో, పలు ముసాయిదాల తయారీలో ప్రముఖమైన వ్యక్తి. అంతర్జాతీయ న్యాయస్థానంలో జడ్జిగా, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశ ప్రతినిధిగా ఉన్నారు. ఇప్పటికీ కొందరు భారత రాజ్యాంగాన్ని రచించింది అంబేడ్కర్ కాదనీ, బి.ఎన్.రావ్ అనీ వాదించే వాళ్లున్నారు. ఆయన బ్రిటిష్ పాలనలో తయారు చేసిన ‘భారత ప్రభుత్వ చట్టం 1935’ రాజ్యాంగానికి మూల రూపమని అనేవారూ ఉంటారు.సర్ బ్రజేంద్రలాల్ మిట్టర్: పశ్చిమ బెంగాల్‌కి చెందిన మిట్టర్ బరోడా దివా¯Œ గా వ్యవహరించారు. భారత్ రాజ్యాంగ రచనలో భాగంగా, దేశంలో సంస్థానాలు విలీనం కావడానికి నియమాలు, దేశ, రాష్ట్ర, జిల్లా పాలనకు సంబంధించిన అంశాలపై పనిచేశారు. (అనారోగ్యం కారణంగా మిట్టర్ రాజీనామా చేయ డంతో ఆ స్థానంలో ఎన్.మాధవరావు వచ్చారు.)కె.ఎమ్. మున్షీ: కన్నయ్యలాల్ మాణిక్‌లాల్ గుజరాత్లో జన్మించారు. న్యాయవాది, జాతీయోద్యమ నాయకుడు. ఘనశ్యామ్ వ్యాస్ కలంపేరుతో అద్భుతమైన రచనలు చేసిన వ్యక్తి. 1938లో గాంధీ సహాయంతో ‘భారతీయ విద్యా భవన్’ స్థాపించారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో చురు కుగా పాల్గొన్నారు. రాజ్యాంగ రచనలో భాగంగా ప్రాథమిక హక్కులు, పౌరసత్వం, మైనారిటీ హక్కుల చర్చల్లో కీలక పాత్ర పోషించారు.సర్ నరసింహ గోపాలస్వామి అయ్యంగార్: ఆయన్ని ఎన్.జి.ఏ. అని పిలిచేవారు. మద్రాస్ నుంచి సివిల్ అధికారిగా పనిచేశారు. 1937లో జమ్మూ కశ్మీర్ ప్రధాన మంత్రిగా వ్యవహరించారు. వాక్ స్వాత్రంత్య్రం, భూములు సేకరిస్తే నష్టపరిహారాలు ఇవ్వడం, శాసనసభతో మరో మండలి ఉండాలని వాదించిన వారు. ఆంగ్లేయ రాజులు ఇచ్చిన గొప్ప పురస్కారాలను తిరస్కరించిన దేశభక్తుడు. కశ్మీర్‌కు సంబంధించి ఆర్టికల్ 370 రచించిన ముఖ్యుడు.ఎన్. మాధవ్ రావ్: మైసూర్ సివిల్ అధికారి. తరువాత ఆ రాజ్యానికి దివాన్ అయ్యారు. ఒరిస్సానుంచి సంస్థాన రాజ్యాల పక్షాన రాజ్యాంగ సభలో ప్రతినిధులైనారు. గ్రామపంచాయతీలు, సమాఖ్యలగురించి అడిగేవారు. ఇంక ఎంతోమంది మహానుభావులు రాజ్యాంగ నిర్మాణంలో పనిచేశారు. అందులో జగ్జీవన్ రామ్, జిరోమ్ డిసౌజా, మృదులా సారాభాయ్ వంటి పెద్దలున్నారు. వారందరికీ వందనాలు!మాడభూషి శ్రీధర్ , వ్యాసకర్త మహేంద్ర యూనివర్సిటీ ‘స్కూల్ ఆఫ్ లా’లో ప్రొఫెసర్ -
ఆ మూలసూత్రాలను అందుకుంటేనే...
భారతదేశం పునర్నిర్మాణంలో ప్రతి సందర్భంలోను డా‘‘ బి.ఆర్.అంబేడ్కర్ సూత్రాలే నిజమైన ప్రత్యామ్నాయాన్ని అందించగలుగుతున్నాయి. అంబేడ్కర్ నిర్మించిన రాజ్యాంగ సౌధాన్ని ఆయన సూత్రాలతోనే పునర్నిర్మించాలి అనే నూతన భావన మన నాయకులకు ఉంటే అంబేడ్కర్ కుల నిర్మూలన భావాన్ని, సామ్యవాద భావాల్ని తప్పక ఆచరించవలసిన చారిత్రక సందర్భం ఇది. నిజానికి దేశాన్ని రక్షించాల్సిన వారు దేశంలో నేడు మత వైరుద్ధ్యాలు పెంచడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అశోకుడు, అక్బరు వంటి మహా చక్రవర్తులే మత సామరస్యం కోసం ప్రయత్నం చేస్తే, ఇప్పటి నాయకులు మతాధిపత్యం కోసం ప్రచారం చేసి మత సామరస్యాన్ని దెబ్బతీస్తున్నారని సామాజిక శాస్త్రవేత్తలు, రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ నెల 13న జరిగిన రెండు తెలుగు రాష్ట్రాల ఎన్నికల్లో మహిళలు పోటెత్తి ఓటెయ్యడం ఒక సామాజిక, సాంస్కృతిక పరిణామం. మహిళకు రాజకీయ అస్తిత్వం పెరిగింది అనడానికి ఇది ఒక నిదర్శనం. మహిళలు ఎక్కడ చైతన్యవంతం అవుతారో అక్కడ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ పరిణామాలు త్వరితం అవుతాయని అంబేడ్కర్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో 81.86 శాతం ఓట్లు పోయ్యాయి. నడి ఎండలో కూడ ప్రజలు నిలబడి తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. మరోప్రక్క కుల, మతం, మద్యం, డబ్బు ప్రభావం కూడా బలంగానే ఎన్నికల మీద ఉంది. ఎన్నికల సంగ్రామంలో ఈసారి సోషల్ మీడియా కీలకపాత్ర పోషించింది. ఒక రకంగా సామాజిక వేదికలపై పెద్ద యుద్ధమే నడిచింది. పార్టీలు, అభ్యర్థుల వారీగా ఏర్పడ్డ గ్రూపుల్లో ఓటింగ్ సందర్భంగా రాతలతో కత్తులు దూశారు. ఫేక్ ఫోటోలు, ఫేక్ ఆడియోలతో పాటు ఫేక్ వార్తలను క్షేత్రస్థాయిలో వైరల్ చేశారు. సోషల్ మీడియాను ఫాలో అయ్యేవారు అయోయయానికి గురయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలుగు రాష్ట్రాల పరిస్థితులు ఇలా వుంటే మొత్తం భారతదేశం వ్యాప్తంగా పెను వృక్షాలు కూలుతున్న చప్పుళ్లు వినబడుతున్నాయి. కొన్ని అధికార పీఠాలు బీటలు వారుతున్నాయి. మే 15న భువనేశ్వర్‌లోని భువనంగిరిలో ఇండియా కూటమి నాయకుడు రాహుల్‌గాంధీ ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో భాజపా నెగ్గితే ప్రభుత్వరంగ సంస్థలన్నీ ప్రైవేటుపరం అవుతాయని, దేశాన్ని 22 మంది బిలియనీర్లు పాలిస్తారని, రాజ్యాంగ పుస్తకాన్ని భాజపా చించి అవతల పారేస్తుందని అన్నారు. బడుగు వర్గాలకు ప్రయోజనాలు లభించటానికి కారణమే రాజ్యాంగం అని తమ చేతిలోని రాజ్యాంగ ప్రతిని చూపిస్తూ చెప్పారు. 22 మంది బిలియనీర్లు తీసుకున్న రూ. 16 లక్షల కోట్ల రుణాలను కేంద్ర సర్కారు మాఫీ చేసిందని, ఉపాధి హామీ పథకం కింద కూలీలకు 24 ఏళ్ల పాటు వేతనాలు చెల్లించేందుకు అయ్యే మొత్తంతో ఇది సమానమని వివరించారు. ‘‘రైతుల, విద్యార్థుల రుణాలను మాఫీ చేయలేదు. చిరు వ్యాపారులకు రుణాలే ఇవ్వలేదు. జీయస్టీ మొత్తమంతా ఇద్దరు ముగ్గురు వ్యక్తులకు వెళ్లిపోతోంది. మేం వచ్చాక కులగణనతో విప్లవాత్మక ప్రజాస్వామ్యాన్ని, ప్రజాపాలనను తీసుకువస్తాం. దేశంలో దేశంలో 50 శాతం మంది ఓబిసీలు, 15 శాతం దళితులు, 8 శాతం గిరిజనులు, 15 శాతం మైనార్టీలు, 5 శాతం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలవారున్నారు. ఈ 90 శాతం మందికిపైగా ప్రజలు మోదీ పాలనలో వంచితులయ్యారు. ఎన్ని రకాల అబద్ధాలను భాజపా చెప్పినా జూన్ 4 తర్వాత ప్రధాని పదవిలో మోదీ ఉండరు’’ అని రాహుల్ ఉద్ఘాటించారు.మోడీ ప్రభుత్వంలో రాజ్యం కంటే కూడా కార్పోరేట్ శక్తులు బలపడ్డాయి. విశ్వవిద్యాలయాలు అన్నింటిలో మతోన్మాద భావాలను ప్రచారం చేస్తూ శాస్త్ర జ్ఞానాన్ని వక్రీకరిస్తున్నాయి. అందుకే శ్రీనగర్‌లో మే 15న మాట్లాడుతూ నేషనల్ కాన్ఫరెన్స్ (ఎస్పీ)అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా ఇలా విమర్శించారు. భవిష్యత్తులో తాను పదవిలో లేకపోయినా దేశం మనుగడ సాగిస్తుందన్న విషయాన్ని ప్రధాని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. దక్షిణ కాశ్మీర్ అనంత్‌నాగ్‌లోని షాంగుస్ ప్రాంతంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘మనం కలిసి జీవించాలి. దేశాన్ని రక్షించాలి. పదవి ఎల్లకాలం ఉండదు. కానీ దేశం శాశ్వతం. ఆయన (మోడీ) ఏ దేశాన్ని తయారు చేయాలని ప్రయత్నిస్తున్నారో అది వినాశకరమైనది’’ అన్నారు.నిజానికి దేశాన్ని రక్షించాల్సిన ప్రధానమంత్రి దేశంలో మత వైరుధ్యాలు పెంచడం ఆశ్చర్యకరం. అశోకుడు, అక్బరు వంటి మహా చక్రవర్తులే మతసామరస్యం కోసం ప్రయత్నం చేస్తే, మోడీ ప్రభుత్వం మతాధిపత్యం కోసం ప్రచారం చేసి మత సామరస్యాన్ని దెబ్బతీసిందని సామాజిక శాస్త్రవేత్తలు, రాజకీయ విశ్లేషకులందరూ భావిస్తున్నారు. మోడీ ఆవేశపూరితమైన ప్రసంగాల్లో 400 సీట్లు వస్తున్నాయని చెప్పుకుంటున్నా 150 నుంచి 200కే పరిమితం అవుతారని కమ్యూనిస్టు నాయకులు చెబుతున్నారు. బీజేపీకి బలమైన ఉత్తరాది రాష్ట్రాల్లోనే ఈ ఎన్నికల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోంది. ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, బిహార్, మధ్యప్రదేశ్, హర్యానా, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లోనే బీజేపీకి ఎదురు గాలి వీస్తున్నది. పైకి డాంబికంగా 370–400 సీట్లు వస్తాయని గొప్పలు చెప్పుకుంటున్నా ఏ సర్వేలోనూ ఆఖరికి బీజేపీని బలపరిచే విశ్లేషకులు సైతం 250కి మించి రావని చెప్పాల్సిన పరిస్థితి. బీజేపీ ప్రభుత్వం ఈ దశాబ్దంలో ఏ సోషల్ మీడియాలోనైతే దళిత బహుజన మైనార్టీ స్త్రీల మీద, రాజ్యాంగం మీద, మానవ హక్కుల మీద, విద్యార్థుల ప్రతిభ మీద, దళితుల జీవన సంస్కృతి మీద, ముస్లింలు జీవించే హక్కు మీద దాడి చేసిందో అదే సామాజిక మాధ్యమాన్ని ఉపయుక్తం చేసుకొని ఈ సామాజిక శ్రేణుల అన్నింటిలో వున్న మే«ధావర్గం ఎదురుదాడి ప్రారంభించింది. నిజానికి మోడీ ద్వంద్వ భావజాల ఘర్షణలో ఇరుక్కుపోయారా అనిపిస్తుంది. ఏ ప్రజలైతే ఏ బడుగువర్గాలైతే అధిక ఓట్ల శక్తిగా ఉన్నాయో, ఆ వర్గాల జీవన వ్యవస్థలను ధ్వంసం చేస్తూ చేస్తూ, కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ ఈ వర్గాలను మతం పేరుతో ఓట్లు అడుగుతున్న సందర్భంగా, తమ కాళ్ల కింద పునాదులు తొలగిపోతున్న స్థితిలో కేవలం మతోన్మాద నినాదం ఫలిస్తుందా? అనేది ఇప్పుడు మోడీ ముందు నిలబడిన పెద్ద ప్రశ్నలా కనిపిస్తోంది.ఉత్తర ప్రదేశ్ కేంద్రంగా మొత్తం భారతదేశం గురించి మనం ఆలోచించినప్పుడు అన్ని మతాల్లో బానిసలుగా బతుకుతున్న వారికి సమాన గౌరవ జీవన వ్యవస్థ లేకపోవటం కనిపిస్తోంది. మతోన్మాద నినాదం గౌరవం ఇవ్వదు. ఆచరణ గౌరవం ఇస్తుంది. భారతదేశంలో కుల గణన చేయిస్తామని కాంగ్రెస్ పేర్కొన్నాక ఓబిసీలు ఆలోచనలో పడినట్లే ఉంది. తమకు రిజర్వేషన్ హక్కు వస్తుందని, రిజర్వేషన్ వల్ల విద్య, ఉద్యోగ హక్కులు విస్తృతం అవుతాయని ఓబిసీలు భావించడం ద్వారా భారతదేశంలో అతి పెద్ద సామాజిక తరగతి ‘ఇండియా’ కూటమి వైపు మొగ్గుతుందనక తప్పదు. ‘ఇండియా’ కూటమికి నూతన దశ వస్తున్న ఈ తరుణంలో అంబేడ్కర్ నిర్మించిన రాజ్యాంగ సౌధాన్ని ఆయన సూత్రాలతోనే పునర్నిర్మించాలి అనే నూతన భావన ఆ కూటమికి ఉంటే అంబేడ్కర్ కుల నిర్మూలన భావాన్ని, సామ్యవాద భావాల్ని తప్పక ఆచరించవలసిన చారిత్రక సందర్భం ఇది. ఆ పరిణతి మాత్రం ‘ఇండియా’ కూటమికి వచ్చినట్టు లేదు. అంబేడ్కర్ పరిశ్రమలను జాతీయం చేయండి, భూములను జాతీయం చేయండి అనే ప్రధాన సూత్రాన్ని ముందుకు తెచ్చారు. ఆయా రాష్ట్రాల ఆధిపత్య కులాల పార్టీ నుంచి వస్తున్న ‘ఇండియా’ కూటమి ఇంకా సామాజిక, సామ్యవాద భావాలను పరిపుష్టం చేయవలసిన అవసరం ఉంది. విశ్వవిద్యాలయాల్లో చారిత్రక, సాంస్కృతిక శాస్త్ర జ్ఞాన పునరుజ్జీవనానికి కూడా వీరు హామీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మండల కమిషన్ రిపోర్ట్స్‌ను, సచార్ కమిటీ రిపోర్ట్స్‌ను, రిపబ్లికన్ పార్టీలోని మూల సూత్రాలను ‘ఇండియా’ కూటమి తీసుకోగలిగితే నిజమైన ప్రత్యామ్నాయంగా నిలబడుతుంది. భారతదేశం పునర్నిర్మాణంలో ప్రతి సందర్భంలోను డా‘‘ బి.ఆర్.అంబేడ్కర్ సూత్రాలే నిజమైన ప్రత్యామ్నాయాన్ని అందించగలుగుతున్నాయి. ఈసారైనా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని కూటమి ఒక దళిత ప్రధానమంత్రిని ప్రకటించగలిగిన విశాలతను సంతరించుకోవలసిన అవసరం ఉంది. అంతేకాకుండా భారతదేశంలోని రాజకీయ నాయకుల వ్యక్తిత్వ నిర్మాణంలో నైతికత, అవినీతి రహిత, రుజువర్తన జీవన విధానం, మానవతా స్పృహ, సామాజిక విప్లవ భావన, ఆర్థిక స్వావలంబనా దృష్టి అనుసరణీయం అవ్వవలసి ఉంది. రాజకీయ నీతిశాస్త్ర అధ్యయనం ఈనాటి చారిత్రక కర్తవ్యం. అంబేడ్కర్ రాజకీయ జీవన మార్గమే దేశానికి దిక్సూచి.డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు -
మహామహులకూ తప్పని... ఓటమి
రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ప్రజలు ఎప్పుడు ఎలాంటి తీర్పు ఇస్తారో, ఏ అనామకున్ని అందలమెక్కిస్తారో, ఏ దిగ్గజాన్ని తిరస్కరిస్తారో అనూహ్యం. తిరుగులేదనుకున్న మహామహ నేతలు ఓటమిపాలైన ఉదంతాలు మన దేశ ఎన్నికల చరిత్రలో ఎన్నో! అలాంటి పది మంది దిగ్గజ నేతల అనూహ్య ఓటమి చరిత్రను ఓసారి చూద్దాం... – సాక్షి, నేషనల్ డెస్క్బాబా సాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగ నిర్మాతగా యావద్దేశానికీ ప్రాతఃస్మరణీయుడు. అంతటి మహా నాయకుడు కూడా ఎన్నికల్లో ఓడతారని ఊహించగలమా?! కానీ 1951–52లో జరిగిన దేశ తొలి సార్వత్రిక ఎన్నికల్లో అంబేడ్కర్ ఓటమి చవిచూడాల్సి వచి్చంది! నార్త్ బాంబే లోక్‌సభ నుంచి పోటీచేసి ఓడిపోవడమే కాదు, ఏకంగా నాలుగో స్థానంలో నిలిచారాయన! ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విఠల్ బాలకృష్ణ గాంధీ గెలుపొందారు. ఇందిరాగాంధీ దేశ రాజకీయాల్లో అజేయ శక్తిగా వెలిగిపోయిన నాయకురాలు. తొలి, ఏకైక మహిళా ప్రధాని. దశాబ్దానికి పైగా తిరుగులేని అధికారం చలాయించిన ఇందిర 1977 లోక్‌సభ ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకతలో కొట్టుకుపోయారు. ఎమర్జెన్సీ నిర్ణయం ఆమె ఏకైక ఎన్నికల ఓటమికి బాటలు వేసింది. రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానంలో సోషలిస్టు పార్టీ ప్రముఖుడు, రాం మనోహర్ లోహియా సన్నిహితుడు రాజ్ నారాయణ్ చేతిలో ఇందిర ఓటమి చవిచూశారు. ఆయన 1971 లోక్‌సభ ఎన్నికల్లో కూడా సంయుక్త సోషలిస్ట్ పార్టీ అభ్యర్థిగా ఇందిరపై పోటీ చేసి ఓడిపోయారు.కానీ ఇందిర అవినీతికి పాల్పడ్డారని, ఆమె ఎన్నిక చెల్లదని కోర్టుకెక్కారు. ఇది అంతిమంగా ఎమర్జెన్సీ విధింపుకు దారి తీయడం విశేషం! రాజ్‌నారాయణ్ వాదనతో అలహాబాద్ హైకోర్టు ఏకీభవించింది. రాయ్‌బరేలీ నుంచి ఇందిర ఎన్నిక చెల్లదని ప్రకటించింది. అంతేగాక ఆరేళ్ల పాటు లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధం విధించింది. దాంతో చిర్రెత్తుకొచి్చన ఇందిర 1975లో దేశమంతటా ఎమర్జెన్సీ విధించారు. 1977లో ఎమర్జెన్సీ ఎత్తేసి లోక్‌సభ ఎన్నికలకు వెళ్లి రాజ్‌నారాయణ్ చేతిలో 50 వేల పైగా ఓట్ల తేడాతో ఓడారు. ఇది భారత ఎన్నికల చరిత్రలోనే సంచలనాత్మక ఫలితంగా నిలిచిపోయింది.మినూ మసాని మినోచర్ రుస్తోమ్ మసాని. స్వాతంత్య్ర సమరయోధుడు. స్వతంత్ర పార్టీ అగ్ర నేత. మూడుసార్లు పార్లమెంటు సభ్యుడు, ఇండియన్ లిబరల్ గ్రూప్ థింక్ ట్యాంక్ వ్యవస్థాపకుల్లో ఒకరు. సంపాదకుడు, సామాజిక కార్యకర్త. ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలి. అసమానతలకు వ్యతిరేకంగా బలమైన గొంతుక వినిపించిన మసాని 1971 లోక్‌సభ ఎన్నికల్లో రాజ్‌కోట్ నుంచి ఓటమి చవిచూడాల్సి వచి్చంది. కాంగ్రెస్ నాయకుడు ఘన్‌శ్యామ్ బాయ్ ఓజా చేతిలో 60,000 ఓట్లకు పైగా తేడాతో ఓడిపోయారు.అటల్ బిహారీ వాజ్‌పేయ్ రాజకీయ దురంధరుడు. భారత రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన నాయకుడు. అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్న ఆయనకూ ఎన్నికల ఓటమి తప్పలేదు. 1984 లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన కీలక కాంగ్రేసేతర నేతల్లో వాజ్‌పేయి ఒకరు. గ్వాలియర్‌లో కాంగ్రెస్ నేత మాధవరావు సింధియా రెండు లక్షల పై చిలుకు ఓట్ల మెజారిటీతో ఆయనపై విజయం సాధించారు.సీకే జాఫర్ షరీఫ్ భారత రైల్వేల్లో స్వర్ణ యుగానికి నాంది పలికిన దార్శనికుడు. కాంగ్రెస్ సీనియర్ నేతల్లో ఒకరు. 2004లో తొలిసారి లోక్‌సభ ఎన్నికల ఎన్నికల బరిలో దిగిన హెచ్‌టీ సాంగ్లియానా చేతిలో ఓటమి చవిచూశారు. అప్పటిదాకా డీజీపీగా ఉన్న సాంగ్లియానా బీజేపీ ఆహా్వనం మేరకు పదవీ విరమణ చేసి పారీ్టలో చేరారు. పాత బెంగళూరు ఉత్తర లోక్‌సభ స్థానం నుంచి బరిలో దిగి షరీఫ్‌పై విజయం సాధించారు.దేవెగౌడఅత్యంత అనుభవజు్ఞడైన నాయకుడు. ప్రధానిగా దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారు. అనంతరం కర్నాటక రాజకీయాల్లో కింగ్ మేకర్ అయ్యారు. ఆయనకు కూడా లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. 2004లో కర్నాటకలోని కనకపుర నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నేత తేజస్వినీ గౌడ రమేశ్ చేతిలో లక్ష పై చిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు.బిజోయ్ కృష్ణ హండిక్ గొప్ప విద్యావేత్త. కాంగ్రెస్ నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలుపొందిన తిరుగులేని అస్సామీ నేత. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. జోర్హాట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కేపీ తాసా ఆయనపై లక్ష ఓట్ల పై చిలుకు మెజారిటీతో గెలుపొందారు.సోమనాథ్ ఛటర్జీ సీపీఎం దిగ్గజం. పదిసార్లు లోక్‌సభ సభ్యునిగా గెలిచిన ఎదురులేని నేత. 1971లో తొలిసారి సీపీఎం తరఫున పశి్చమబెంగాల్‌లోని బుర్ద్వాన్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1984లో మాత్రం జాదవ్‌పూర్ లోక్‌సభ స్థానంలో యువ సంచలనం మమతా బెనర్జీ చేతిలో ఓటమి చవిచూశారు. ఆ తర్వాత మాత్రం 1989 నుండి 2004 వరకు సోమనాథ్ విజయ పరంపర సాగింది. సీపీఎం కంచుకోటగా భావించే బోల్పూర్ లోక్‌సభ స్థానం నుంచి 2004లో పదోసారి గెలిచి 14వ లోక్‌సభ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.అరుణ్ జైట్లీపారీ్టలకతీతంగా అందరూ మెచ్చిన నేత. ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడు. కేంద్ర ఆర్థిక మంత్రిగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తొలిసారి మోదీ హవా కొనసాగిన 2014 లోక్‌సభ ఎన్నికల్లో అరుణ్ జైట్లీ మాత్రం ఓటమి చవిచూశారు. అమృత్సర్ లోక్‌సభ స్థానం నుంచి పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెపె్టన్ అమరిందర్ సింగ్ లక్ష ఓట్ల పై చిలుకు మెజారిటీతో జైట్లీపై గెలుపొందారు. పీవీ నరసింహారావుపాములపర్తి వేంకట నరసింహారావు. ప్రధాని పదవిని అధిష్టించిన తొలి దక్షిణాది వ్యక్తి. ఒకే ఒక్క తెలుగువాడు. బహుముఖ ప్రజ్ఞాశాలి. కుదేలైన దేశ ఆరి్ధక వ్యవస్థను విప్లవాత్మక సంస్కరణలతో పట్టాలెక్కించి ఆధునిక బాట పట్టించిన దార్శనికుడు. అంతటి నాయకునికి కూడా ప్రధాని కాకమునుపు ఓటమి తప్పలేదు. 1984 ఎన్నికల్లో బీజేపీ దేశవ్యాప్తంగా గెలిచిన రెండు లోక్‌సభ స్థానాల్లో తెలంగాణలోని హన్మకొండ ఒకటి. బీజేపీ అభ్యర్థి చందుపట్ల జంగారెడ్డి అక్కడ పీవీపై విజయం సాధించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌పై సానుభూతి వెల్లువెత్తినా ఆ పార్టీ తరఫున పోటీ చేసిన పీవీ మాత్రం ఓటమి చవిచూడటం విశేషం. -
119 నియోజకవర్గాల్లో అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్లు
ముదిగొండ: పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పదిహేను రోజుల్లోగా అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. ఈ కేంద్రాల్లో నిపుణులైన అధ్యాపకులతో ఉచితంగా శిక్షణ ఇప్పిస్తామని వెల్లడించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని ముదిగొండ మండలంలో శుక్రవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఉద్యోగ నియామకాల పరీక్షలను లీకేజీలు లేకుండా పారదర్శకంగా చేపడతామని తెలిపారు. డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీలకు బకాయిలు లేకుండా ప్రతినెలా వేతనాలు చెల్లిస్తామని వెల్లడించారు. గత పాలకులు రెసిడెన్షియల్ పాఠశాలలను ఇరుకు భవనాల్లో నడిపించగా, తాము తాజా బడ్జెట్లో సొంత భవనాల నిర్మాణానికి నిధులు కేటాయించామన్నారు. గత ప్రభుత్వం రూ.7లక్షల కోట్ల అప్పులు చేసి, ఖజానా ఖాళీ చేయగా.. తాము ప్రతీపైసా పోగు చేసి ముందుకు సాగుతున్నామని, ఈ క్రమంలో ఇచ్చింన ప్రతీ హామీ నెరవేరుస్తామని భట్టి వెల్లడించారు. గృహజ్యోతి ప్రారంభం ముదిగొండలోని ఓ ఇంట్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యుత్ మీటర్ రీడింగ్ తీసి గృహజ్యోతి పథకం ద్వారా జీరో బిల్లు అందజేశారు. ఈనెల నుంచి 200 యూనిట్లు వరకు విద్యుత్‌ను వినియోగించే వారు బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈకార్యక్రమంలో ఎన్పిడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి, కలెక్టర్ వీ.పీ.గౌతమ్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
అంబేడ్కర్ విగ్రహంపైనా ఏడుపేనా?
నెహ్రూనగర్(గుంటూరు)/తిరుపతి సిటీ/కర్నూలు(సెంట్రల్)/కంచరపాలెం(విశాఖ ఉత్తర)/కడప కార్పొరేషన్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణపైనా ఏడుపేనా... అని ఎల్లో మీడియాపై దళితులు, దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు వల్ల మీకొచ్చిన నష్టమేంటి? అని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో గొప్పగా చేసిన కార్యక్రమంపైనా విషపు రాతలేనా.. అని మండిపడ్డారు. శనివారం రాష్ట్రంలో పలుచోట్ల దళిత నాయకులు ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రతులను దహనం చేసి తమ నిరసన తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని విజయవాడ నడి»ొడ్డున ఏర్పాటు చేయడం ద్వారా సీఎం జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఆత్మగౌరవం పెంచారని నవ్యాంధ్ర ఎమ్మార్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పరిశపోగు శ్రీనివాసరావు మాదిగ అన్నారు. సీఎం జగన్‌కు వస్తున్న ప్రశంసలను జీర్ణించుకోలేని చంద్రబాబు.. ఈనాడు, ఆంధ్రజ్యోతిలో విషపు రాతలు రాయించడం సిగ్గుచేటని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. గుంటూరు లాడ్జి సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలను దహనం చేసి నిరసన తెలిపారు. గతంలో చంద్రబాబు అమరావతిలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి.. ఊరు చివరన శంకుస్థాపన చేసి గాలికొదిలేసిశారని మండిపడ్డారు. అంబేడ్కర్‌ను అంటరాని వ్యక్తిగా చూసింది టీడీపీ ప్రభుత్వం కాదా.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై అనుచిత వ్యాఖ్యలు చేసినా.. విషపు రాతలు రాసినా ఉద్యమిస్తామని హెచ్చరించారు. విశాఖపట్నంలోని కంచరపాలెం ధర్మానగర్‌లో అంబేడ్కర్ విగ్రహానికి దళిత సంఘాల నాయకులు క్షీరాభిõÙకం చేసి, ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలను దహనం చేశారు. వచ్చే ఎన్నికల్లో దళితుల పవరేంటో టీడీపీకి చూపిస్తామన్నారు. నిరసనలో డిప్యూటీ మేయర్ కటుమూరి సతీశ్, దళిత సంఘాల నాయకులు ఐ.రవికుమార్, సుకుమార్, కోరిబిల్లి విజయ్, కంటిపాము గురువోజీ తదితరులు పాల్గొన్నారు. కర్నూలు కలెక్టరేట్ వద్ద ఈనాడు ప్రతులను దళితులు దహనం చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సీహెచ్ మద్దయ్య, వైఎస్సార్సీపీ దళిత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాట ఓబులేసు మాట్లాడుతూ విజయవాడలో అంబేడ్కర్ విగ్రహం పెట్టడమే తప్పన్నట్లుగా వార్తలు ఎందుకు ప్రచురిస్తున్నారని మండిపడ్డారు. అంబేడ్కర్ స్ఫూర్తితో సీఎం జగన్ పాలన చేస్తుంటే ఓర్వలేకపోతున్నారా? అని నిలదీశారు. నిరసనలో దళిత, వైఎస్సార్సీపీ నాయకులు నవీన్, కేదార్నాథ్, డీకే రాజశేఖర్, సూర్యుడు తదితరులు పాల్గొన్నారు. టీడీపీ కోసం ఎల్లో మీడియా పాట్లు తిరుపతి ఎస్వీయూలో అంబేడ్కర్ విగ్రహం వద్ద విద్యార్థులు ఆంధ్రజ్యోతి, ఈనాడు ప్రతులను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్వీయూ వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షు0డు ప్రేమ్‌కుమార్ మాట్లాడుతూ.. దళిత వ్యతిరేకి అయిన చంద్రబాబు, ఎల్లో మీడియా.. అంబేడ్కర్ విగ్రహం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయమంటూ విషం చిమ్మిందని మండిపడ్డారు. దళితులుగా ఎవరైనా పుడుతారా అంటూ గతంలో చంద్రబాబు చేసిన అవహేళనను దళితులు ఇంకా మర్చిపోలేదన్నారు. ఎన్నికల్లో చంద్రబాబుకు దళితులు తగిన బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. నిరసనలో విద్యార్థి సంఘం నాయకులు యుగంధర్, ముని, నరే‹Ù, మనోజ్, శ్రీను, బోస్, అజిత్, సుకుమార్, ముధుసూదన్నాయుడు తదితరులు పాల్గొన్నారు. టీడీపీని అధికారంలోకి తేవడానికి రామోజీ అనేక పాట్లు పడుతున్నారని వైఎస్సార్ జిల్లాలో దళితులు మండిపడ్డారు. కడప అంబేడ్కర్ కూడలిలో వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు సీహెచ్ వినోద్ ఆధ్వర్యంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలను దహనం చేశారు. అవాస్తవాలు ప్రచురిస్తున్న ఎల్లోమీడియాను, వాటిని ప్రోత్సహిస్తున్న టీడీపీని కాలగర్భంలో కలిపేయాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, నాయకులు ఎన్.సుబ్బారెడ్డి, వీరారెడ్డి, నాగమల్లారెడ్డి, షఫీవుల్లా, సింధు, గోపాలక్రిష్ణ, ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
సీఎం జగన్ కు హ్యాట్సాఫ్
-
డ్రోన్ షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సీఎం జగన్ ఫొటో
-
సీఎం జగన్ స్పీచ్.. జై భీమ్
-
సామాజిక న్యాయ మహాశిల్పం ఇది
సాక్షి, అమరావతి: విజయవాడ నడిబొడ్డున సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంబేడ్కర్ మహాశిల్పం సామాన్యమైనది కాదని.. అదొక గొప్ప సామాజిక న్యాయ మహాశిల్పమని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి తెలిపారు. సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ఈ నెల 19న సాయంత్రం 4 గంటలకు ఈ మహాశిల్పం ఆవిష్కరణ జరగనుందని చెప్పారు. ఇక్కడ సమతా మహాసభ జరుగుతుందని, దీనికి దళిత సోదర, సోదరీమణులు, అంబేడ్కర్ ఆశయాలు నచ్చినవారు, పాటించేవారు కులాలు, మతాలకు అతీతంగా విచ్చేస్తారని చెప్పారు. విజయవాడ స్వరాజ్ మైదానంలో ప్రారంభానికి సిద్ధం అవుతున్న అంబేడ్కర్ విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, నేతలతో కలిసి మంగళవారం విజయసాయిరెడ్డి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్‌కు బీఆర్ అంబేడ్కర్‌పై ఉన్న అభిమానంతోనే అతిపెద్ద విగ్రహ నిర్మాణానికి పూనుకున్నారని తెలిపారు. అంబేడ్కర్ సిద్ధాంతాలకు అనుగుణంగా సీఎం జగన్ నవరత్నాలు రూపొందించారని పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఈ మహాశిల్పం ఏర్పాటు సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందన్నారు. 81 అడుగుల వేదికపై 125 అడుగుల మహాశిల్పం ఏర్పాటుకు (మొత్తం 206 అడుగులు ఎత్తు) రూ.400 కోట్లకు పైగా వెచ్చించామన్నారు. తరతరాల వివక్షను రూపుమాపేందుకే అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారని, దేశంలోని వ్యవస్థలన్నీ ఇంత సక్రమంగా పని చేస్తున్నాయంటే అంబేడ్కర్ మహనీయుడి పుణ్యమేనని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి కార్యక్రమం ఇంతవరకు చూడలేదన్నారు. అంబేడ్కర్ ఆశయాలను, లక్ష్యాలను సీఎం జగన్ కొనసాగిస్తున్నారని వివరించారు. అంబేడ్కర్ అందరివాడు బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం సీఎం జగన్ అహర్నిశలు కృషి చేస్తున్నారని.. విగ్రహావిష్కరణ సందర్భంగా సమతాసభ ఏర్పాటు చేశామని విజయసాయిరెడ్డి చెప్పారు. ఈ సభకు అన్ని ప్రాంతాల నుంచి అన్నివర్గాల ప్రజలు తరలిరానున్నారని చెప్పారు. ఇది ప్రభుత్వ కార్యక్రమమా? పార్టీ కార్యక్రమమా? అని ఓ మీడియా ప్రతినిధి అడగ్గా.. అంబేడ్కర్ ప్రజల మనిషి అని, బడుగు, బలహీన వర్గాల కోసం కృషి చేసిన వాడని, ఆయన అందరి వాడని సమాధానమిచ్చారు. ఇది ప్రభుత్వ కార్యక్రమమా, పార్టీ కార్యక్రమమా అనే భేదం లేకుండా అందరూ పాల్గొంటారని చెప్పారు. దార్శినికుడి విగ్రహావిష్కరణకు ప్రత్యేక ఆహా్వనం అవసరం లేదన్నారు. పార్టీలకు అతీతంగా సీఎం జగన్ ఈ ప్రాజెక్ట్ చేపట్టారని.. ఇందులో పార్టీ, ప్రభుత్వం అని తేడా చూపించకూడదన్నారు. 1.20 లక్షల మంది రాక రాష్ట్రం నలుమూలల నుంచి 1.20 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నామని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఆ రోజు సాయంత్రం 6 గంటలకు లేజర్ షో లేదా డ్రోన్ షో ఉంటుందని చెప్పారు. ప్రారంభ కార్యక్రమం తర్వాత ఈ నెల 20వ తేదీ నుంచి సందర్శకులకు అనుమతి ఉంటుందన్నారు. భవిష్యత్‌లో గొప్ప పర్యాటక కేంద్రంగా అంబేడ్కర్ విగ్రహం ప్రాంతం నిలిచిపోతుందని చెప్పారు. లోపల ఆడిటోరియం, వెనుక కన్వెన్షన్ సెంటర్, మ్యూజియం అన్నీ పర్యాటకుల్ని ఆకర్షిస్తాయని తెలిపారు. ఆయన వెంట ఎంపీ కేశినేని నాని, మంత్రి మేరుగ నాగార్జున, ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, మునిసిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై.శ్రీలక్ష్మి, ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, పశ్చిమ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ ఆసిఫ్, తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాశ్, కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు, పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా ఉన్నారు. -
నేడు అంబేడ్కర్ వర్ధంతి.. సీఎం జగన్ నివాళులు
సాక్షి, తాడేపల్లి: నేడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. నివాళులు అర్పించారు. బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి అంబేడ్కర్ చేసిన సేవలు నిరుపమానమని సీఎం జగన్ అన్నారు. కాగా, సీఎం జగన్ ట్విట్టర్ వేదికగా..‘భారత రాజ్యాంగ ప్రదాత, దేశ పాలనా మార్గదర్శకాల విధాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి నేడు. బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు నిరుపమానం. ఆ మహనీయుని అడుగుజాడల్లో నడుస్తూ మన ప్రభుత్వం బడుగు బలహీనవర్గాల సంక్షేమానికి అహర్నిశలూ కృషి చేస్తోంది. బాబా సాహెబ్ గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగ ప్రదాత, దేశ పాలనా మార్గదర్శకాల విధాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి నేడు. బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు నిరుపమానం. ఆ మహనీయుని అడుగుజాడల్లో నడుస్తూ మన ప్రభుత్వం బడుగు బలహీనవర్గాల సంక్షేమానికి అహర్నిశలూ కృషి చేస్తోంది. బాబా సాహెబ్ గారి… pic.twitter.com/P3v4M1kxqT — YS Jagan Mohan Reddy (@ysjagan) December 6, 2023 మరోవైపు.. తాడేపల్లిలోని క్యాంపు కార్యాయలంలో సీఎం జగన్.. అంబేడ్కర్‌కు నివాళులు అర్పించారు. అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన సీఎం జగన్. ఈ కార్యక్రమానికి మంత్రులు తానేటి వనిత, మేరుగ నాగార్జున, ఎంపీ నందిగం సురేష్, ప్రభుత్వ సలహాదారు జూపూడి ప్రభాకర్ తదితరులు హాజరయ్యారు. -
ఓట్ల గురించి జాతిపిత.. రాజ్యాంగ నిర్మాతతో మాట్లాడితే..
సిరిసిల్ల: అది సిరిసిల్ల జిల్లా కేంద్రం. సమయం అర్ధరాత్రి దాటింది. వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. పట్టణ వాసులు నిద్రపోతున్నారు. నేతకార్మికులు సాంచాలు నడుపుతూ బట్ట నేస్తున్నారు. వీధికుక్కలు చలికి ముడుచుకు పడుకున్నాయి. ఒక్కసారిగా చరచరమంటూ గర్జించిన మేఘానికి దిక్కులు దద్ధరిల్లడంతో జాతిపిత మహాత్మాగాంధీ ఉలిక్కిపడి లేచారు. గాంధీచౌక్‌లో నలుదిక్కులూ తేరిపార చూశారు. ఎవరూ కనిపించకపోవడంతో కొంచెం ముందుకెళ్లినా.. బాపూజీ కర్ర పట్టుకుని అంబేడ్కర్ విగ్రహం వైపు కదిలారు. మెడనిండా పూలదండలతో చేతిలో రాజ్యాంగ పుస్తకంతో ఆదమరిచి నిద్రపోతున్న అంబేడ్కర్‌ను పిలిచారు. చిన్నపాటి పిలుపునకే దిగ్గున లేచిన అంబేడ్కర్.. ఇంత రాత్రి వేళ వచ్చిన గాంధీజీతో మాట కలిపారు. వాళ్ల మధ్య సంభాషణ ఇలా సాగింది. ♦ గాంధీజీ : ఏం లేదు నాయనా. పొద్దాంత మైకుల మోత. డప్పుసప్పుళ్లు.. నినాదాలతో నే నుండే గాంధీచౌక్ దద్దరిల్లుతోంది. వాళ్ల లొల్లి వశపడడం లేదు. ఎప్పటిలాగే పడుకున్న కానీ పొద్దాంత జరుగుతున్న లొల్లి గుర్తుకొచ్చి నిద్రపట్టలేదు. ఉరుములతో మెల్కువ వచ్చి.. ఇటు వైపు వచ్చిన. నీకేం ఇబ్బంది లేదు కదా. ♦ అంబేడ్కర్ : అయ్యో అదేం మాట బాపు. నాకేం ఇబ్బంది లేదు. కానీ నా పరిస్థితి కూడా అంతే. మీరు ఇప్పటి దాకా చెప్పిన పాట్లన్నీ నాకూ తప్ప డం లేదు. కామారెడ్డి–కరీంనగర్ వైపు వెళ్లే వాహనాల రద్దీతో మరిన్ని కష్టాలు పడుతున్న. నా కంటే మీరే నయం. ♦ గాంధీజీ : అవునా.. నాయన. శాంతియుత మార్గంలో నేను సాధించి పెట్టిన స్వాతంత్య్రం.. నువ్వు ప్రసాదించిన రాజ్యాంగం చూస్తే.. నా మనసు కలికలి అవుతుంది. నేటితరం నేతలు.. రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టం పరిధిలోనే తెలంగాణ సాధించామని, నీ గురించి ఎవరూ యాది చేయరేం. ఎవరికీ వారే తెలంగాణ తె చ్చింది మేమే అంటే.. మేమే.. అంటూ అందరూ వాళ్ల డబ్బానే కొట్టుకుంటున్నారు. రాజ్యాంగం రాసిన నీ గురించి ఎవరూ మాట్లాడడం లేదు. ♦ అంబేడ్కర్: అవును బాపు.. వాళ్లు యాదిచేస్తే ఎంత చేయకుంటే ఎంత. పరిపాలన సౌలభ్యం కోసం చిన్న రాష్ట్రాలు మేలు అని చెప్పినం. తెలంగాణ రాష్ట్రం రాజ్యాంగాబద్ధంగా వచ్చింది. అయినా గిప్పుడు గా ముచ్చట్లు ఎందుకు బాపు. ఇప్పుడు మాట్లాడుకోవడం వేస్ట్. ♦ గాంధీజీ : అవునవును. మొన్న ఓ నాయకుడు నామినేషన్ వేసేందుకు ఎంత మందితో ఊరేగింపు తీశారో తెలుసా? డబ్బులిచ్చి మరీ జనాన్ని పోగుచేసి నామినేషన్ వేశారు. ప్రజాసేవ ఇప్పుడు ఎంతో ఖరీదైపోయిందో చూశావా.. ప్రజలకు సేవ చేసేందుకు ఇంత ఆరాటమా?! ♦ అంబేడ్కర్ : అంతెందుకు మహాత్మా. ఎన్నికల ప్రచారానికి జనానికి డబ్బులిచ్చి సమీకరించడం, ఊరేగింపులు తీయడ.. పూలదండలతో నిన్ను, నన్ను ముంచెత్తడం నచ్చడం లేదు. చూసే జనానికి నచ్చడం లేదు. నేటి తరం నేతలు నామినేషన్ టైమ్‌లోనే డామినేషన్ చూపించడం.. గెలిచిన తరువాత జనానికి కనిపించకుండా పోవడం పరిపాటే కదా. ♦ గాంధీజీ: అయ్యో అసలు సంగతి నీకు తెలియదు. ఎన్నికల సమయంలో చాటుమాటుగా మద్యం పంపిణీ చేస్తూ కులమతాలను రెచ్చగొడుతూ ఓట్లు పొందుతున్నారు. మహిళా సంఘాలకు నేరుగా డబ్బులివ్వడం, ఓట్లు మాకే వేయమని ప్రలోభాలకు గురిచేయడం మామూలైపోయింది. ♦ అంబేడ్కర్ : అవి కూడా నాకు తెలుసు మహాత్మా. అన్నీ తెలిసి ఈ కుళ్లును చూడలేక.. మీరు కళ్లు మూసుకున్నారు. నేను చూస్తూ కుమిలిపోతున్నాను. మీరు బోధించిన శాంతిమార్గాన్ని ఇప్పుడేలా మర్చారో చూశారా..? ♦ గాంధీజీ : నాయనా.. భీమ్రావు.. ఇవన్నీ నాకు తెలియనివి కావు. మీరు దేశవిదేశాలు తిరిగి భారత రాజ్యాంగాన్ని అద్భుతంగా రూపొందించారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి హారతి పట్టారు. సచ్చీలురకే పట్టం కట్టేలా రాజ్యాంగాన్ని, ఎన్నికల నిబంధనల్ని రూపొందించారు. ఇంత చేస్తే ఏం లాభం. మీ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరే అయ్యింది. రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న ఘటనలు చూస్తే గుండె తరుక్కుపోతుంది. మనం ఎవరిని ఉద్ధరించేందుకు వాటిని రూపొందించామో వారిలో చైతన్యం వచ్చేంత వరకు ఎవరూ ఏమి చేయలేరు. ♦ అంబేడ్కర్: అది కాదు మహాత్మా..! ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తూ పదవిలోకి రాగానే ఆ సొమ్మును వడ్డీతో సహా వందరేట్లు సంపాదించడం.. ఇదంతా ప్రజాసేవ కోసమే అంటే ఎవరైనా నమ్ముతారా..! పార్టీ టిక్కెట్ రాకుంటే వెంటనే మరో పార్టీలోకి దూకడం పరిపాటిగా మారింది. ♦ గాంధీజీ : నాయన నువ్వు, నేను ఎంత బాధపడినా లాభం లేదు. ప్రజల్లోనే మార్పు రావాలి. చైతన్యం రావాలి. ఎవరూ మంచివారు.. ఎవరు స్వార్థపరులో గుర్తించే సోయి రావాలి. డబ్బుల కోసమో.. కులపోడు అనో ఓటు వేస్తే ఐదేళ్లు బానిసలుగా బతకాల్సిందే. ఎవరి మాటలు వినకుండా.. ఓటును అమ్ముకోకుండా.. నిబద్ధతతో మంచివారికి పట్టం కట్టే రోజులు రావాలి. అప్పుడే సుపరిపాలన సాధ్యం. ♦ అంబేడ్కర్ : నిజమే.. మనం ఎన్ని చెబితే ఏమిటి.. ఎన్నికల తీరు చూస్తే సామాన్యులు.. నిస్వార్థపరులు పోటీ చేయగలరా..? పోటీచేసినా తట్టుకోగలరా? నిబంధనల ప్రకారం ఎన్నికల ఖర్చు రూ.40 లక్షలు దాటొద్దు. కానీ డబ్బులు నీళ్లప్రాయంగా ఖర్చు చేస్తున్నారో చూశారా బాపూ! అందరూ ప్రజాసేవ చేస్తామంటూ ఓట్లు అడుగుతున్నారు. డబ్బులు ఇస్తున్నారు. మందు పోస్తున్నారు. వాస్తవాలు ఏమిటో అందరికీ తెలిసినా ఓట్లు అమ్ముకుంటూ.. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు. ఓటర్లు మారితేనే మంచి పాలకులు వస్తారు.. వారి బతుకులు మారుతాయి. సరే కాని ఇగ తెల్లారిపోయింది. అదిగో.. వేములవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే మొదటి బస్సు రానే వచ్చింది. అటు మున్సిపల్ సిబ్బంది చీపుర్లతో వస్తున్నారు... ఇక నేను వెళ్తాను.. అంటూ... గాంధీజీ పెద్ద పెద్ద అడుగులేస్తూ వడివడిగా గాంధీచౌక్‌లోని దిమ్మైపెకి చేరిపోయారు. అంబేడ్కర్ సైతం కళ్లద్దాలను సర్దుకుని ఎప్పటిలాగే రాజ్యాంగాన్ని పట్టుకుని నిలబడ్డారు. ► అంతలోనే తెల్లారిపోయింది. యథావిధిగా సిరిసిల్ల జనసందడిగా మారింది. మైకుల ప్రచార మోత మళ్లీ మొదలైంది. నినాదాల జోరు తగ్గలేదు. ఆర్భాటపు ప్రచారాలు మరింత పెరిగాయి. ఇదంతా చూస్తున్న మహాత్మాగాంధీ, అంబేడ్కర్లు ఎప్పటిలాగే మనసులోని బాధను అర్ధరాత్రి వేళ ఒకరినొకరు కలుసుకుని చెప్పుకుంటూ గుండెల్లో భారాన్ని దించుకుంటున్నారు. -
కరెన్సీ నోట్లపై అంబేడ్కర్ ఫొటో ముద్రించాలి
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఫొటోలు కరెన్సీ నోట్లపై ముద్రించాలని వైఎస్సార్సీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ అంశంపై పార్లమెంట్లో పోరాటానికి కూడా సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. బుధవారం ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద కరెన్సీపై అంబేడ్కర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జేరిపోతుల పరశురామ్ ఆధ్వర్యంలో జరిగిన మహాధర్నాలో కృష్ణయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆర్బీఐ ఏర్పడటానికి పునాది అయిన అంబేడ్కర్ ఫొటోను కరెన్సీ నోట్లపై ముద్రించాలన్నారు. పరశురామ్ మాట్లాడు తూ కరెన్సీ నోట్లపై అంబేడ్కర్ ఫొటో ముద్రించాలని ఐదేళ్ల నుంచి పాదయాత్ర, ప్రజా చైతన్య రథయాత్ర, జ్ఞాన యుద్ధ యాత్ర, ప్రజా చైతన్య యాత్ర, సైకిల్ యాత్ర నిర్వహించి ఢిల్లీలో 13 సార్లు ధర్నా నిర్వహించామని గుర్తుచేశారు. నేడు పార్లమెంట్ వద్ద ప్రదర్శన మహిళా బిల్లులో బీసీల వాటా కేటాయించాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈమేరకు గురువారం పార్లమెంటు వద్ద భారీ ప్రదర్శన చేపట్టనున్నట్లు తెలిపారు. మహిళా బిల్లు నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీల మాదిరిగా బీసీల వాటాను స్పష్టం చేస్తూ బిల్లులో పొందుపర్చాలన్నారు. మహిళా బిల్లులో బీసీల వాటాపైనా అన్ని రాజకీయ పార్టీలు తమ వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు. -
అంబేడ్కర్ స్మృతివనానికి అదనంగా రూ.106 కోట్లు
పటమట (విజయవాడ తూర్పు): విజయవాడ స్వరాజ్య మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మృతివనం నిర్మాణానికి ప్రభుత్వం అదనంగా మరో రూ.106 కోట్లు కేటాయించిందని వీఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ చెప్పారు. నగర పర్యటనలో భాగంగా శుక్రవారం స్మృతివనం పనులను ఆయన పరిశీలించారు. రాష్ట్రంలోనే ప్రముఖ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు సీఎం జగన్ ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టారని, ఆయన నిరంతరం ఇక్కడ జరుగుతోన్న పనులను సమీక్షిస్తూ అధికారులకు సూచనలిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే స్మృతివనం పనులు 95% పూర్తయ్యాయని, నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా స్మృతివనాన్ని, 125 అడుగుల విగ్రహాన్ని సీఎం ఆవిష్కరిస్తారని చెప్పారు. అంబేడ్కర్ జ్ఞాపకాలను గుర్తు చేసుకునేందుకు వీలుగా డిజిటల్ మ్యూజియం, మినీ థియేటర్ నిర్మాణం పనులు పూర్తి కావచ్చాయని, మిగిలిన అన్ని పనులూ శరవేగంగా సాగుతున్నాయని చెప్పారు. -
గజ్వేల్ నియోజకవర్గంలో ‘దళితబంధు’ కోసం రోడ్డెక్కిన దళితులు
జగదేవ్‌పూర్(గజ్వేల్): సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ జిల్లా గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో దళితులు రోడెక్కారు. దళితబంధును అర్హులందరికీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆదివారం దళితులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. దళితబంధు అందరికీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తిగుల్, నిర్మల్‌నగర్, బస్వాపూర్, అలిరాజ్‌పేట గ్రామాల దళితులు ఆందోళన చేశారు. జగదేవ్‌పూర్ –భువనగిరి ప్రధాన రహదారిపై గంటసేపు నిర్మల్ నగర్ దళితులు రాస్తారోకో చేపట్టారు. ధర్నా కారణంగా రహదారిపై కిలోమీటర్ల మేర అటుఇటు వాహనాలు నిలిచిపోయాయి. ఎస్ఐ చంద్రమోహన్ దళితులతో మాట్లాడి సముదాయించి ధర్నాను విరవింపజేశారు. అనంతరం గ్రామపంచాయతీ ఎదుట సర్పంచ్‌కు వ్యతిరేకంగా దళితులు నిరసన చేపట్టారు. తిగుల్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చౌరస్తాలో దళితులు బైఠాయించి సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేసీఆర్ దిష్టిబొమ్మను ఊరేగించి దహనం చేశారు. బస్వాపూర్‌లోనూ దళితులు నిరసన తెలిపారు. అలిరాజ్‌పేటలో దళితులు రోడ్డుపై ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల దళితులు మాట్లాడుతూ దళితబంధును అర్హులందరికీ ఇవ్వాలని, లేదంటే ఎవరికీ ఇవ్వకూడదని అన్నారు. -
గురుకుల పాఠశాల, కళాశాల భవనాలు ప్రారంభం
తాడేపల్లిగూడెం రూరల్: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలనులో రూ.22.17 కోట్లతో నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల భవనాలను రాష్ట్ర సాంఘిక, సంక్షేమ శాఖమంత్రి మేరుగు నాగార్జున, ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆదివారం ప్రారంభించారు. మేరుగు నాగార్జున మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను వాడుకుని వదిలేసిన ఏకైక వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం వైఎస్ జగన్ చొరవతో విజయవాడ నడిబొడ్డున 19 ఎకరాల్లో రూ.400 కోట్ల వ్యయంతో బీఆర్ అంబేడ్కర్ భారీ విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. డిసెంబర్ నాటికి ఈ పనులు పూర్తి చేయనున్నట్టు వెల్లడించారు. రాష్ట్రానికి దిక్సూచిగా అంబేడ్కర్ విగ్రహం నిలవనుందన్నారు. ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి పాల్గొన్నారు. -
అంబేడ్కర్ ఆశయాలను ఏపీలో నిజం చేస్తున్నారు
కంచిలి: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యను ప్రవేశపెట్టి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. బీఆర్ అంబేడ్కర్ ఆశయాలను నిజం చేస్తున్నారని ప్రముఖ సినీనటుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం బూరగాం గ్రామంలో నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఆయన ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నారాయణమూర్తి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేదలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారని అభినందించారు. కేంద్రంలోని బీజేపీ పాలకులు ప్రభుత్వ రంగ సంస్థలైన రోడ్లు, రైల్వేలు, విమాన సర్విసులు, ఎల్ఐసీ, బ్యాంకింగ్ తదితర సెక్టార్లను ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమని దుయ్యబట్టారు. చివరికి ఎన్నో ఉద్యమాలు చేసి సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను కూడా ప్రైవేటీకరణ చేయడానికి ఉపక్రమించడం దారుణమని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ప్రజాకవి, సినీ గేయ రచయిత జయరాజు, విశ్రాంత ఐఏఎస్ పి.ఎస్.ఎన్. మూర్తి పాల్గొన్నారు. -
దళితుల కళ్లలో మట్టికొట్టిన కేసీఆర్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో అంబేడ్కర్ జపం చేయకపోతే పుట్టగతులు ఉండవని గ్రహించడం వల్లే కేసీఆర్ కొత్తగా అంబేడ్కర్ నామ స్మరణ మొదలుపెట్టారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. సచివాలయానికి అంబేడ్కర్ పేరు, విగ్రహం ఏర్పాటు సంతోషమేనని.. కానీ దళితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చి వారికి న్యాయం చేసేది ఎప్పుడని ప్రశ్నించారు. శుక్రవారం అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఢిల్లీలోని తెలంగాణభవన్‌లోని ఈటల, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తదితరులు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అరి్పంచారు. ఈ సందర్భంగా ఈటల మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇళ్లు, రిజర్వేషన్లు ఇలా ఏ ఒక్కహామీ అమలు కాలేదని.. దళితుల కళ్లలో కేసీఆర్ మట్టి కొట్టారని మండిపడ్డారు. దళితుల భూములను లాక్కుంటున్నారు.. కేసీఆర్ పాలనలో దళితులకు అడుగడుగునా అవమానాలే ఎదురవున్నాయని ఈటల వ్యాఖ్యానించారు. దళిత సీఎం హామీ ఇచ్చి మాట తప్పడం తెలంగాణ రాష్ట్రంలో తొలి ఉల్లంఘన అని.. కేబినెట్లో ఉన్న దళిత ఉప ముఖ్యమంత్రిని సాకులు చెప్పి తీసేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని మండిపడ్డారు.గత ప్రభుత్వాలు దళితులకు ఇచి్చన భూములను కేసీఆర్ ప్రభుత్వం లాక్కుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ఆరోపించారు. మహనీయుడి విగ్రహం పెట్టినంత మాత్రాన ఎవరూ కేసీఆర్‌కు జేజేలు కొట్టబోరని వ్యాఖ్యానించారు. -
దేశంలో మార్పు కోసం యుద్ధం చేయాలి.. అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్
సాక్షి, హైదరాబాద్: ప్రజల్లో, వ్యవస్థలో, దేశంలో మార్పు కోసం భారతీయులు యుద్ధం చేయాల్సిన అవసరం ఉందని బీఆర్ అంబేడ్కర్ మనవడు ప్రకా శ్ అంబేడ్కర్ పేర్కొన్నారు. దేశంలో ఆర్థిక ఇబ్బందులపై ఎలా పోరాటం చేయాలో సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం చేస్తున్నారన్నారు. శుక్రవారం హుస్సేన్‌సాగర్ తీరాన 125 అడుగుల భారీ అంబేడ్కర్ విగ్ర హాన్ని ప్రకాశ్ అంబేడ్కర్ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడారు. ‘‘చదువుకోవడం, చదువుకున్న తర్వాత ఏకమై సమాజంలో మా ర్పుకోసం పోరాటం చేయాలని అంబేడ్కర్ ఉద్భో దించారు. దేశంలో ఆర్థిక అంతరాలు, ఆర్థిక దోపిడీ ల గురించి అప్పట్లోనే ‘ప్రాబ్లెమ్ ఆఫ్ రూపీ’ అనే పుస్తకం రాశారు. దళితబంధు పథకం ద్వారా రూ పాయి రూపాన్ని మార్చేందుకు కేసీఆర్ ప్రయతి్నస్తున్నారు. దేశ ఆర్థిక దుర్భలతపై ఎలా పోరాడాలో చెప్పడంతోపాటు దళిత బంధు ద్వారా పేదరిక ని ర్మూలనకు తెలంగాణ ప్రభుత్వం కొత్త దిశను ఇచ్చే ప్రయత్నం చేస్తోంది’’ అని ప్రకాశ్ పేర్కొన్నారు. రాష్ట్రాల నుంచే జాతీయ నాయకత్వం దేశంలో కేవలం మతపరమైన మైనారిటీలే కాకుండా కమ్యూనిటీ మైనారిటీలు కూడా ఉన్నారని అంబేడ్కర్ అప్పట్లోనే స్పష్టం చేశారని ప్రకాశ్ గుర్తు చేశారు. ధర్మం, జాతి పేరిట రాజకీయాలు జరిగే దేశంలో సహజ నాయకులు ఉండరని కూడా చెప్పారని వివరించారు. దేశంలో మాజీ ప్రధాని వాజ్‌పేయి తర్వాత అసలైన జాతీయ నాయకుడెవరూ లేరని వ్యాఖ్యానించారు. రాష్ట్రాల నుంచే జాతీయ నాయకత్వం వస్తుందని తాను నమ్ముతున్నానని చెప్పారు. తెలంగాణ దేశానికి దిక్సూచిగా ఉందని, దేశానికి మోడల్‌గా నిలవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దేశానికి రక్షణపరంగా రెండో రాజధాని అవసరమని, అది హైదరాబాద్ అయితేనే బాగుంటుందని అంబేడ్కర్ చెప్పారని.. ఎప్పటి నుంచో ఈ డిమాండ్ ఉందని ప్రకాశ్ అంబేడ్కర్ చెప్పారు. ఈ డిమాండ్ నెరవేరాలని తాను కోరుకుంటున్నానని, తెలంగాణ ప్రభుత్వం కూడా కోరుకుంటుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. ప్రకాశ్ అంబేడ్కర్‌కు సీఎం ఆతిథ్యం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మహా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి గౌరవ అతిథిగా వచి్చన బాబాసాహెబ్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్‌కు సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో ఆతిథ్యం ఇచ్చారు. ప్రగతి భవన్‌కు చేరుకున్న ప్రకాశ్ అంబేడ్కర్‌ని కేసీఆర్ సాదరంగా ఆహా్వనించారు. శాలువాతో సత్కరించి మర్యాదపూర్వక భేటీ అయ్యారు. అనంతరం కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో ఎంపీలు సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్, పార్టీ నేతలు దాసోజు శ్రవణ్, శంకర్ అన్నా ధోంగే, సిద్దోజీరావు తదితరులున్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో మొక్కలు నాటిన ప్రకాశ్ అంబేడ్కర్ సాక్షి, హైదరాబాద్: తమ తాత, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మనుషుల్లో సమానత్వం–ప్రకృతి సమతుల్యత కోసం పరితపించారని ప్రకాశ్ అంబేడ్కర్ అన్నారు. ఆయన జయంతి రోజున ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో పాల్గొని బేగంపేటలో మొక్కలు నాటారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రిగా అంబేడ్కర్ ఉన్నప్పుడు తనను కలిసేందుకు వచ్చే ప్రతీ ఒక్కరు ఒక మొక్క ను నాటాకే తన వద్దకు రావాలని కోరుకున్నారని ఆయన మనుమడు ప్రకాశ్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. తమ తాత అంబేడ్కర్‌కు మొక్కలు నాటడం పట్ల అమితమైన ఆసక్తి ఉండేదన్నారు. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఆ స్ఫూర్తిని ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో చూస్తున్నామని పేర్కొన్నారు. అంబేడ్కర్ స్ఫూర్తిని కొనసాగిస్తున్న ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’సృష్టికర్త ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ఆశయం గొప్పదన్నారు. ‘గ్రీన్ చాలెంజ్’లిమ్కాబుక్‌లో చేరడం తనకు ఆనందాన్ని కలిగించిందని, సంతోష్ కృషికి మరింత గుర్తింపు రావాలని ఆకాంక్షించారు. మంత్రి గంగుల కమలాకర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, గ్రీన్ చాలెంజ్ ప్రతినిధి సంజీవ రాఘవ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘దళితబంధు’ దేశానికే మార్గదర్శి సాక్షి ప్రతినిధి, కరీంనగర్: దళితబంధు పథకం దేశానికే మార్గదర్శి అని, ఇతర రాష్ట్రాలు కూడా దీనిని అమలు చేయాలని అంబేడ్కర్ మనవడు, వంచిత్ బహుజన్ అఘాడీ పార్టీ అధినేత ప్రకాశ్ యశ్వంత్ అంబేడ్కర్ అన్నారు. జమ్మికుంట, హుజూరాబాద్‌లలో దళితబంధు పథకం యూనిట్లను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఆయన వెంట మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి, విప్ బాల్క సుమన్ ఉన్నారు. ముందుగా హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఆయన హుజూరాబాద్ చేరుకున్న అనంతరం పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నివాళి అర్పించారు. దళితబంధు యూనిట్లను పరిశీలించిన అనంతరం హుజూరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకం బాగుంది. ఇది దేశంలోనే సరికొత్త పథకం. ప్రజలకు విద్యతోపాటు ఆర్థిక సాయం అందించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది. దళిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేయడం అభినందనీయం. మొన్నటిదాకా కూలీలుగా బతికిన వారంతా ఈ పథకం వల్ల ఇప్పుడు ఓనర్లుగా మారారు. లబి్ధదారులతో మాట్లాడాను. ఇంత తక్కువ సమయంలో ఈ పథకం లబ్ధిదారులకు అందేలా శ్రమించిన సీఎం కేసీఆర్, జిల్లా అధికారులకు ధన్యవాదాలు. 70 ఏళ్లుగా దళితుల జీవన ప్రమాణాలు మెరుగుపడకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్న తీరును నేను స్వయంగా చూశాను. ఇతర రాష్ట్రాల్లోనూ ఈ పథకం అమలు కావాలి. ఆర్థిక, సామాజిక ఎదుగుదలకు కారణమైన ఈ పథకం దేశానికే మార్గదర్శిగా నిలిచింది. దేశంలో 30 శాతం వరకు ఉన్న అట్టడుగు వర్గాల వారికి సైతం ఈ పథకం వర్తింపజేయాలి. ఈ విషయాన్ని నేను సీఎం కేసీఆర్ వద్ద ప్రస్తావిస్తాను’అని అన్నారు. -
125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
-
ఏపీలో ఘనంగా అంబేడ్కర్ జయంతి వేడుకలు
-
అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన మంత్రి పెద్దిరెడ్డి
-
అంబేడ్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: డా.బీఆర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రులు విశ్వరూప్, ఆదిమూలపు సురేష్, ఎంపీ నందిగం సురేష్, ప్రభుత్వ సలహాదారు జూపూడి ప్రభాకర్ హాజరయ్యారు. దేశం గర్వించదగ్గ మేధావుల్లో అగ్రగణ్యుడు, మహోన్నతుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. ‘‘బహుముఖ ప్రజ్ఞాశాలి. న్యాయ, సామాజిక, రాజకీయ, ఆర్థిక, ఆధ్యాత్మిక, తదితర రంగాల్లో అపార జ్ఞానశీలి. దేశ రాజకీయ, ప్రజాస్వామ్య, సాంఘిక వ్యవస్థలకు దిక్సూచి. వాటికి గట్టి పునాదులు వేసిన రాజ్యాంగ నిర్మాత. భేదభావాలు మరిచేలా మానవత్వం పరిఢవిల్లేలా ఆయన చేసిన కృషి మరువలేం’’ అని సీఎం పేర్కొన్నారు. ‘‘ఆ మహనీయుడి బాటలో నడుస్తూ పేదరిక నిర్మూలనలో, సామాజిక న్యాయ సాధికారతలో చారిత్రక అడుగులు ముందుకేశాం. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు’’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. చదవండి: ఈ యుగం బాబాసాహెబ్‌దే! దేశం గర్వించదగ్గ మేధావుల్లో అగ్రగణ్యుడు, మహోన్నతుడు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్. బహుముఖ ప్రజ్ఞాశాలి. న్యాయ, సామాజిక, రాజకీయ, ఆర్థిక, ఆధ్యాత్మిక, తదితర రంగాల్లో అపార జ్ఞానశీలి. దేశ రాజకీయ, ప్రజాస్వామ్య, సాంఘిక వ్యవస్థలకు దిక్సూచి. వాటికి గట్టి పునాదులు వేసిన రాజ్యాంగ నిర్మాత. 1/2 pic.twitter.com/Lt1TQ5711D — YS Jagan Mohan Reddy (@ysjagan) April 14, 2023 -
పుచ్చకాయఫై రాజ్యాంగ నిర్మాత ముఖచిత్రం
-
ఏక వ్యక్తి సైన్యంలా పనిచేశారు!
చాలామంది అంబేడ్కర్‌ను మేధావిగా, న్యాయకోవిదుడిగా కొనియాడతారు. కానీ దేశభక్తుడిగా అంగీకరించరు. బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడి తేనే దేశభక్తుడనే భ్రమలో చాలామంది ఉన్నారు. కానీ అందులో ప్రజలు, దేశ సమైక్యత, దేశాభివృద్ధి అనే మాటలు కనపడవు. రాజ్యాంగ సభలో అంబే డ్కర్ వినిపించిన వాణి రాజ్యాంగ రూపకల్పనకే ఒక మార్గాన్ని వేసింది. అనంతరం ఏడుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ రచనా సంఘానికి ఛైర్మన్ అయ్యారు. వివిధ కారణాల వల్ల దాదాపు ఒంటరిగా శ్రమించాల్సి వచ్చింది. ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా ఈ యజ్ఞాన్ని కొనసాగించారు. ఆ నాలుగేళ్లలో రోజుకు 20 గంటలు పనిచేసిన సందర్భాలున్నట్టు ఆయన సహాయకులుగా పని చేసినవాళ్ళు తమ జ్ఞాపకాలలో రాసుకున్నారు. ‘నోటితో పొగిడి, నొసటితో వెక్కిరించడం’ అని ఒక సామెత! బాబాసాహెబ్ అంబేడ్కర్ విషయంలో సరిగ్గా ఇదే జరుగుతోంది. తమ రాజకీయ ప్రయోజనాల కోసం కొన్ని చోట్ల పార్టీలు ఆయన్ని ప్రశంసిస్తున్నాయి. కానీ ఆ పార్టీల నాయకులే నిరాధార ఆరోపణలతో పుస్తకాలు రచిస్తున్నారు. గతంలో జర్నలిస్టు, బీజేపీ నాయకుడు అరుణ్ శౌరి విద్వేషపూరితంగా రాసిన పుస్తక ఉదాహరణ ఉండనే ఉన్నది. ఇటీవల కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ కూడా అంబేడ్కర్‌పై రాసిన పుస్తకంలో కొన్ని అసత్య వ్యాఖ్యలు చేశారు. చాలామంది అంబేడ్కర్‌ను మేధావిగా, విద్యావేత్తగా, న్యాయ కోవిదుడిగా, ఆర్థిక శాస్త్రవేత్తగా కొనియాడతారు. కానీ దేశభక్తుడిగా అంగీకరించరు. ఆనాటి కమ్యూనిస్టులు సైతం ఆయనకు బ్రిటిష్ ఏజెంట్ అన్న ముద్రవేసి దుష్ప్రచారం చేసిన పరిస్థితి ఉంది. కానీ అంబే డ్కర్ అటువంటి మాటలకు ఏనాడూ చలించలేదు. బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా, లేదంటే విదేశీయులకు వ్యతిరేకంగా మాట్లాడి తేనో, పోరాడితేనో దేశభక్తుడనే భ్రమలో చాలామంది ఉన్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు అదే పాట. కానీ అందులో ప్రజలు, దేశ సమై క్యత, దేశాభివృద్ధి, మానవాభివృద్ధి అనే మాటలు కనపడవు. వారం రోజుల్లో మనం బాబాసాహెబ్ జయంతి ఉత్సవాలను జరుపు కోబోతున్నాం. ఈ సందర్భంగా చాలామంది దృష్టికి రాని రెండు విషయాలను మీ ముందుంచాలనుకుంటున్నాను. అందులో మొదటిది, భారత స్వాతంత్య్రానంతరం రాజ్యాంగ రూపకల్పన కోసం ఏర్పడిన రాజ్యాంగ సభలో అంబేడ్కర్ నిర్వహించిన పాత్ర. రాజ్యాంగ సభ సమావేశాలు 1946 డిసెంబర్ 9న ప్రారంభమయ్యాయి. అయితే డిసెంబరు 13వ తేదీన పండిట్ జవహర్ లాల్ నెహ్రూ తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. 14న శనివారం, 15న ఆదివారం అయినందుకు మళ్ళీ సమావేశాలు డిసెంబరు 16న మొదలయ్యాయి. కేవలం ఒకరోజు తర్వాత అంటే డిసెంబరు 17న జరిగిన సమావేశంలో అంబేడ్కర్‌కు అవకాశం వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన అంబేడ్కర్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఇంత తొందరగా తనకు అవకాశం వస్తుందని భావించలేదని కూడా తెలిపారు. రాజ్యాంగ సభలో ప్రవేశ పెట్టిన తీర్మానంపై నిర్మొహమాటంగా తన అభిప్రాయాలను తెలియజేస్తూనే, దేశ భవిష్యత్తు గురించి ఆయన అన్న మాటలు అక్కడ కూర్చున్న వందలాది మంది విజ్ఞులను, మేధా వులను ఆలోచింపజేశాయంటే అతిశయోక్తి కాదు. ‘‘ఈ రాజ్యాంగ సభ ద్వారా మన గొప్పదేశపు సామాజిక, రాజకీయ, ఆర్థిక వ్యవస్థలను తీర్చిదిద్దుకుంటామనడంలో నాకు ఎటువంటి సందేహం లేదు. మనం ఈ రోజు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా విభజింపబడి ఉన్నామనే విషయం నాకు తెలుసు. మనం వివిధ శిబిరాలకు చెందినవాళ్ళం. ఇవి శత్రు శిబిరాలుగా కూడా ఉన్నాయి. నేను కూడా అటువంటి శిబిరానికి చెందిన వాడనని ఒప్పుకొంటున్నాను. ఇన్ని రకాల సమస్యలున్నప్పటికీ ఈ దేశం సమైక్యంగా నిలబడడంలో ప్రపంచంలోని ఏ శక్తులూ మనల్ని అడ్డుకోలేవనే విశ్వాసం నాకు న్నది.’’అంతేకాకుండా, ముస్లిం లీగ్ విషయం, ముస్లింల విషయాన్ని ప్రస్తావిస్తూ...‘‘హిందూ–ముస్లిం సమస్యను సంఘర్షణ లతో, బల ప్రయోగంతో పరిష్కరించుకోలేం. వివేకం ద్వారా, సామరస్య పూర్వ కంగా పరిష్కరించుకోవాలి. బ్రిటిష్ రాజనీతివేత్త బర్క్ చెప్పినట్టుగా, మనం బలవంతంగా ఎవరినీ లొంగదీసుకోలేం, వారిని మనం మనతో కలుపుకోవాలి’’ అంటూ తన ఉపన్యాసాన్ని ముగించారు. ఇటువంటి దార్శనికతను కలిగిన అంబేడ్కర్‌ను రాజ్యాంగ సభకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి ఓడించారు. అప్పటి తూర్పు బెంగాల్ నుంచి ఎన్నికైన షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ నాయ కులు జోగేంద్రనాథ్ మండల్ రాజీనామా చేసి, అంబేడ్కర్‌ను జైసూర్ కుల్నా నియోజకవర్గం నుంచి రాజ్యాంగ సభకు ఎంపిక చేశారు. అయితే కొద్ది కాలంలోనే తూర్పు బెంగాల్ పాకిస్తాన్లోకి వెళ్ళిపోవడంతో అంబేడ్కర్ రాజీనామా చేశారు. రాజ్యాంగ సభలో అంబేడ్కర్ సభ్యుడిగా ఉండాలనే ప్రతిపాద నను రాజ్యాంగ సభ అధ్యక్షుడు బాబూ రాజేంద్ర ప్రసాద్ కాంగ్రెస్ ముందుంచారు. 1947 జూన్ 30న నాటి బొంబాయి ప్రధాన మంత్రి బి.జి. ఖేర్‌కు ఉత్తరం రాస్తూ, ‘‘డాక్టర్ అంబేడ్కర్ విషయంలో ఎవరికి ఎన్ని అభిప్రాయ బేధాలున్నప్పటికీ ఆయనను తిరిగి రాజ్యాంగ సభ లోకి తీసుకోవాలి. గత సమావేశాల్లో డాక్టర్ అంబేడ్కర్ ప్రదర్శించిన వివేకం, మార్గదర్శనం చూసిన తర్వాత ఈ నిర్ణయానికి వస్తున్నాను’’ అంటూ కరాఖండీగా చెప్పారు. ఆ విధంగా మళ్లీ బొంబాయి నుంచి అంబేడ్కర్ రాజ్యాంగ సభలో అడుగుపెట్టారు. 1947 ఆగస్టు 27న రాజ్యాంగ రచనాసభ ఏడుగురు సభ్యులతో రచనాసంఘాన్ని నియమించింది. ఏడుగురిలో అంబేడ్కర్‌ను ఛైర్మ న్గా ఎంపిక చేశారు. రాజ్యాంగాన్ని పూర్తి చేసి సమర్పించిన రోజున కమిటీ సభ్యులలో ఒకరైన కృష్ణమాచారి మాట్లాడుతూ, ‘‘ఈ కమిటీలో ఏడుగురు సభ్యులున్నప్పటికీ, డాక్టర్ అంబేడ్కర్ మాత్రమే పూర్తికాలం పనిచేసిన ఏకైక వ్యక్తి. ఏడుగురిలో ఒకరు రాజీనామా చేశారు. మరొక సభ్యుడు మరణించారు. వారి స్థానాల్లో ఎవరినీ తీసుకోలేదు. మరొక సభ్యుడు ప్రభుత్వ పనులలో తీరిక లేకుండా ఉన్నారు. ఇంకొక ఇద్దరు సభ్యులు అనారోగ్య కారణాల వల్ల ఢిల్లీకి దూరంగా ఉన్నారు’’అంటూ అత్యంత స్పష్టంగా రాజ్యాంగ రచన వెనుక అంబేడ్కర్ కృషినీ, నిబద్ధతనీ వెల్లడించిన విషయాన్ని ఎవరైనా కాదనగలరా? డాక్టర్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, ‘‘డాక్టర్ బీఆర్ అంబేడ్క ర్ను రాజ్యాంగ రచనా సంఘానికి ఛైర్మన్‌గా ఎన్నుకోవడం ఎంత సరై నదో అందరికన్నా నేను ఎక్కువగా గుర్తించగలిగాను. ఆయన తన ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా ఈ రచనా కార్యాన్ని యజ్ఞంలా కొనసాగించాడు’’ అంటూ ప్రశంసించారు. రాజ్యాంగ రచన సాగించిన ఆ నాలుగేళ్ల కాలంలో అంబేడ్కర్ చాలా దెబ్బ తిన్నారు. దాదాపు రోజుకు 20 గంటలు పనిచేసిన సందర్భాలున్నట్టు ఆయన సహా యకులుగా పని చేసినవాళ్ళు తమ జ్ఞాపకాలలో రాసుకున్నారు. అంటే ఒక వ్యక్తి దేశం కోసం తన ఆరోగ్యాన్ని సైతం పణంగా పెడితే, ఆయన సమాజంలోని కులతత్వ వాదులకు దేశద్రోహిగా, అంటరానివాడిగా కనిపించడం మన భావదారిద్య్రానికి నిదర్శనం కాదా? రెండవ విషయం, 1932 తర్వాత అంబేడ్కర్ హిందూ మతంతో తెగతెంపులు చేసుకుంటున్నట్టు ప్రకటించడం. అప్పటి వరకు జరిగిన రాజకీయ, సామాజిక కుట్రలు ఆయనను చలింపజేశాయి. ఎప్పుడైతే, తాను హిందూమతంలో ఇక ఉండలేనని ప్రకంటించారో... ముస్లిం, క్రైస్తవ, సిక్కు మత పెద్దలు ఆయన్ని తమ తమ మతాల వైపు తిప్పు కోవడానికి ప్రయత్నాలు చేశారు. మిత్రుల ద్వారా, ప్రత్యక్షంగా కలిసి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కానీ అంబేడ్కర్ ఆ మూడు మతా లను వివిధ కారణాల వలన తిరస్కరించారు. చివరకు 1950 తర్వాత బౌద్ధం వైపు వెళుతున్నట్టు ప్రకటించి తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఒకవేళ బాబాసాహెబ్ అంబేడ్కర్ బౌద్ధం కాకుండా ఇంకో మతం పుచ్చుకున్నట్లయితే, పరిణామాలు ఇంకోలా ఉండేవి. తాను, తన జాతి ఎన్నో అవమానాలు, వివక్షలు ఎదుర్కొంటున్నప్పటికీ, ప్రజాస్వామ్యయుతంగా, శాంతిగా తన ఉద్యమాలు కొనసాగించిన వారు అంబేడ్కర్! అలాంటి బాబాసాహెబ్‌ను నిరాధార ఆరోపణ లతో, అనవసర విషయాలతో విమర్శల పాలుచేయాలా? మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్: 81063 22077 (ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి) -
పంజగుట్టలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయండి
సాక్షి, హైదరాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహాన్ని పంజగుట్ట సర్కిల్లో ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు కాంగ్రెస్ శాసనసభాపక్షం నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీలు వి.హనుమంతరావు, మల్లురవి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌లు సోమవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారిని కలసి వినతిపత్రం అందజేశారు. అనంతరం భట్టి మీడియాతో మాట్లాడుతూ పంజగుట్టలో దళిత సంఘాల ఆధ్వర్యంలో పెట్టిన విగ్రహాన్ని మున్సిపల్ సిబ్బంది తీసుకెళ్లి పోలీస్‌స్టేషన్‌లో పెడితే తమ నాయకుడు వీహెచ్ కొట్లాడి హైకోర్టు ద్వారా బయటకు తెచ్చారని చెప్పారు. ఈ నేపథ్యంలో విగ్రహాన్ని గతంలో తొలగించిన పంజాగుట్ట సర్కిల్లోనే ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా సీఎస్‌ను కోరామని తెలిపారు. -
ఆధునికతకు అంబేడ్కరిజాన్ని జోడించాలి
యువతరాన్ని అంబేడ్కర్‌తో అనుసంధానం చేయాలి. వాస్తవిక సమాజ పరిస్థితులను దగ్గరగా పరిశీలిస్తూ యుక్తవయసులోనే విప్లవాత్మకమైన ఆలోచనలు చేసిన వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్. అత్యధిక ఆదాయాన్ని సంపాదించిపెట్టే వృత్తిగా నిలచే బారిష్టర్‌ను చదివే అవకాశం ఉన్నా, సమాజానికీ, దేశానికీ ఉపయుక్తంగా నిలచే అర్థశాస్త్రాన్ని కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి పూర్తిచేసిన ఆయన వ్యక్తిత్వం నేటి తరానికి అవగతం కావా ల్సిన అవసరం ఉంది. అంబేడ్కర్‌ని ఒక రివల్యూషనరీ థింకర్‌గా చెప్పవచ్చు. అంబేడ్కర్ ఆలోచనలే పునాదిగా ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ స్థాపన జరిగింది. ప్రపంచవ్యాప్తంగా అగ్ర రాజ్యాల ఆర్థిక వ్యవస్థలు సైతం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా... భారతీయ ఆర్థిక వ్యవస్థ చెక్కుచెదరకుండా తగిన సుస్థిరత్వాన్ని కలిగి ఉందంటే అలా ఉండటానికి అంబేడ్కర్ ఆలోచనలు, ప్రయత్నాలు సఫలీ కృతం అయ్యాయనే అర్థమవుతుంది. ఎకనామిక్స్‌లో చదువు పూర్తయిన తర్వాత మాత్రమే ఆయన బారిష్టర్ చదువు కున్నారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి పీహెచ్‌డీని పూర్తిచేసిన ఆయన ప్రతిభను ప్రస్తుత తరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్‌ను దర్శించిన ఆలోచనలు అంబేడ్కర్ సొంతం. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత చైనా ఎప్పటికైనా భారత్‌కు ముప్పు తెస్తుందని గుర్తించిన వ్యక్తి అంబేడ్కర్, ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం చైనాకు బదులు భారత్‌కు వచ్చే విధంగా కృషిచేయాలని ఆయన చేసిన సూచనలను నాటి నేతలు పక్కన పెట్టడం అందరికీ తెలిసిందే. దీని పర్యవసానాలను చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే చైనా తన వీటో అధికారాన్ని భారత్‌కు వ్యతిరేకంగా 9 పర్యాయాలు వాడుకుంది. వ్యవసాయాన్ని ఒక పరిశ్రమగా గుర్తించడం, పారిశ్రామికీకరణతో కలిగిన మార్పులు, ఎకనామిక్ హోల్డింగ్.. వంటి అంశాలు నేడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. కానీ వీటిని అంబేడ్కర్ 1927–28లోనే ప్రస్తా వించారనే విషయం చాలా మందికి తెలియదు. అంబేడ్కర్‌ను కేవలం రాజ్యాంగ నిర్మాతగా మనం పిలుస్తుంటాం. ఆయన చేసిన పనుల్లో ఒకటిగా మాత్రమే ఇది నిలుస్తుంది. దీనితో పాటు దేశ ఆర్థిక, సామాజిక పరిస్థితులూ, స్థితిగతులపై సమగ్ర అవగాహనా, ఆలోచనా భవిష్యత్ ప్రణాళిక కలిగిన ఏకైక వ్యక్తిగా ఆయన్ని పేర్కొనవచ్చు. దేశాన్ని ఆధునికత, పట్టణీకరణ, పారిశ్రామికీకరణతో కూడిన నాగరికత కలిగి స్వయం సమృద్ది సాధించిన దేశంగా పునర్నిర్మించాలని ఆకాంక్షించిన ఏకైక తత్వవేత్త అంబేడ్కర్. అంబేడ్కర్ ఆలోచనలు, ఆకాంక్షలు, ఆశయాలను నేటి యువతలోనికి చొప్పించి భవిష్యత్ భారతావనిని పునర్నిర్మించే ప్రయత్నం జరగాలి. ఈ ప్రయత్నం చేసే దిశగా ఆంధ్ర విశ్వ విద్యాలయంలో నెలకొల్పిన ‘డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చైర్’ కృషిచేస్తుంది. గ్రంథాలయాలు, బ్యాంక్‌లు, తరగతులు, అభ్యసన విధానాలు, ఆర్థిక వ్యవస్థలు డిజిటల్ రూపంలోకి మారిపోయాయి. వీటినే ఆధారంగా చేసుకుని డిజిటల్ మాధ్యమాలను లాభదాయకంగా చేసుకుంటూ సమకాలీన యువతకు, సమకాలీన విధానాలతో అబేడ్కర్ ఆలోచనలు, తత్వాలను చేరువ చేసే విధంగా ఈ కేంద్రం పనిచేస్తుంది. సోషల్ సైంటిస్ట్‌లతో పాటు సోషల్ ఇంజనీర్స్‌ను సమ న్వయం చేస్తూ, సమ్మిళితంగా పనిచేస్తే సమస్యలకు సాంకేతికంగా పరిష్కారాలను చూపడం సాధ్యపడుతుంది. అంబేడ్కర్‌ను కేవలం సోషల్ సైన్స్ విభాగాలకే పరిమితం చేయకుండా టెక్నాలజీకి అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంది. ఆర్ట్స్, సైన్స్, ఇంజనీరింగ్, ఫార్మసీతో పాటు ప్రొఫెషనల్ కోర్సులను అభ్యసిస్తున్న అన్ని విభాగాల విద్యార్థులను ఐక్యం చేస్తూ డిజిటల్ మాధ్యమాలు వేదికగా అంబేడ్కర్‌ను వైవిధ్యమైన కోణాలలో పరిచయం చేస్తూ ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. (క్లిక్ చేయండి: ‘భీమా కోరేగావ్’ స్ఫూర్తితో పోరాడుదాం!) - ఆచార్య ఎం. జేమ్స్ స్టీఫెన్ ‘డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పీఠం’ ప్రొఫెసర్, ఆంధ్ర విశ్వవిద్యాలయం -
BR Ambedkar: తెలుగు నేలపై చైతన్య యాత్ర
నవభారత నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు తెలుగు నేలతో ఎంతో అనుబంధం ఉంది. పలు సందర్భాల్లో తెలుగు ప్రాంతాల్లో పర్యటించి ఇక్కడి ప్రజ లను చైతన్యపరిచారు. భారతదేశంలో అంబేడ్కర్ ఇష్టపడి, ఎన్నోసార్లు విడిది చేసిన అతికొద్ది నగరాల్లో హైదరాబాద్ ఒకటి. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో కూడా ఆయన పర్యటించారు. దేశానికి స్వాతంత్య్రంతో పాటు బహుజనులకు కూడా స్వాతంత్య్రం కావాలని కాంక్షిస్తూ పలు చైతన్యయాత్రలు ఆంధ్రలో చేశారు. అటువంటి పర్యటనల్లో 1944 సెప్టెంబరు 27వ తేదీ నుంచి అక్టోబరు 4వ తేదీ వరకూ జరిపిన పర్యటన చారి త్రాత్మకమైనది. అది రెండో ప్రపంచ యుద్ధ సమయం. అందుకే యుద్ధమనేది బ్రిటిష్ వారి సొంత వ్యవహారమనీ, యుద్ధం మన లక్ష్యం కాదనీ, సామాజిక స్వాతంత్య్రం మన గమ్యమంటూ తన ప్రసంగాల ద్వారా ఇక్కడి ప్రజలను చైతన్యపరిచారు. విజయవాడ మొదలు కొని విశాఖపట్నం వరకూ పర్యటించారు. తొలుత బెజవాడ రైల్వేస్టేషన్ లోనూ, గుడివాడ మొయిన్ రోడ్‌లోనూ ప్రజలనుద్దేశించి ఉపన్యసించారు. బాలికల వసతి గృహానికి గుడివాడలో శంకు స్థాపన చేశారు. అనంతరం ఏలూరు సందర్శించారు. అక్కడ మున్సిపల్ కార్యాలయంలో అంబేడ్కర్‌ను అభిమానులు, పురపాలక సభ్యులు ఘన సన్మానం చేశారు. కొవ్వూరులో ఎస్సీ కాలనీని సందర్శించి. షెడ్యూలు కాస్ట్ ఫెడరేషన్ ఫ్లాగ్‌ను ఈ కార్యక్రమంలో ఆవిష్కరించారు. అందుకే ‘జెండా పేట’గా ఆ కాలనీకి నామకరణం చేసుకున్నారు ప్రజలు. అనంతరం, తాడేపల్లిగూడెంలో ప్రభుత్వ పాఠశాలను సందర్శించి, పాలకొల్లు, రామచంద్రాపురం వెళ్లారు. రాజమండ్రి వచ్చిన సందర్భంగా అక్కడి టౌన్ హాల్లో ఘనంగా పౌర సన్మానం జరి గింది. కాకినాడ పర్యటన అనంతరం పిఠాపురం వచ్చి ఎస్సీ బాలుర వసతి గృహాన్ని సందర్శిం చారు. అక్కడి రాజా కళాశాల మైదానంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. తుని రైల్వేస్టేషన్ వద్ద ప్రసంగించిన అనం తరం అనకాపల్లి చేరుకోగా భారీ సంఖ్యలో ప్రజలు, అభిమానులు అంబేడ్కర్‌కు అక్కడి రైల్వేస్టేషన్ వద్ద స్వాగతం పలికారు. అక్కడి మున్సిపల్ స్కూల్లో జరిగిన సభలో ప్రసంగించిన అనంతరం, పట్టణ ప్రజలు, వైశ్య సంఘం అంబేడ్కర్‌కు ఘన సత్కారం చేశాయి. ఆనాటి అంబేడ్కర్ పర్యటనకు గుర్తుగా ఈ ప్రాంతం ‘భీముని గుమ్మం’ అని ప్రాచుర్యం పొందింది. అక్కడి ప్రభుత్వ పాఠశాలకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరును పెట్టి ఈ ప్రాంతీయులు నివాళి అర్పించారు. పర్యటన చివరలో విశాఖ సిటీకి వచ్చి పోర్టులో కార్మికులను కలిశారు. తర్వాత కలెక్టరేట్ వద్ద జరిగిన సభలో మాట్లాడారు. అంబేడ్కర్ ఆంధ్రలో పర్యటించినపుడు ఆయన ప్రసంగాలను నందనారు హరి, రావురి ఏకాంబరం, కుసుమ వెంకటరామయ్య, పాము రామమూర్తి, జొన్నల మోహనరావు తదితరులు పలుచోట్ల తెలుగులోకి అనువదించేవారు. మొత్తం మీద అంబేడ్కర్ పర్యటన తెలుగు నేలను చైతన్యపరచింది. (క్లిక్ చేయండి: సామాజిక బందీల విముక్తి ప్రదాత!) - డాక్టర్ జి. లీలావరప్రసాదరావు అసిస్టెంట్ ఫ్రొఫెసర్, బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ, శ్రీకాకుళం -
66 ఏళ్లుగా సర్వసాధారణం.. ఇప్పుడెందుకు వివాదం!
అక్టోబర్ అయిదవ తేదీన బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా, మిషన్ జై భీం సంస్థల ఆధ్వర్యంలో పదివేల మందికి పైగా న్యూఢిల్లీలోని అంబేడ్కర్ భవన్లో బౌద్ధ ధమ్మ దీక్ష స్వీకరించారు. అందులో ధమ్మ దీక్ష సంప్రదాయం ప్రకారం, బాబాసాహెబ్ అంబేడ్కర్ రూపొందించిన 22 ప్రతిజ్ఞలను పఠించారు. గత 66 ఏళ్లుగా ఎక్కడ బౌద్ధ ధమ్మ దీక్షా సమ్మేళనాలు జరిగినా ఇది సర్వసాధారణంగా జరిగే కార్యక్రమం అయ్యింది. ఇప్పుడు దాన్ని బీజేపీ వివాదాస్పదం చేసి రాజకీయ ప్రయోజనాలను పొందాలనుకుంటోంది. 1950 అక్టోబర్ 14 విజయదశమి నాడు అంబేడ్కర్ నాయకత్వంలో ఐదున్నర లక్షల మంది బౌద్ధ ధమ్మాన్ని స్వీకరించినప్పుడు... అంబేడ్కర్ రూపొందించిన 22 ప్రతిజ్ఞలను అనుసరిస్తామని అందరూ శపథం చేశారు. అందులో నైతిక సూత్రాలు, నైతిక జీవన విధానంతో పాటు దేవీ దేవతలను పూజించం అనే అంశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా, బుద్ధుడు ప్రభోదించిన అష్టాంగ మార్గాన్ని అవలంబిస్తామనే విషయం కూడా ఉంది. అక్టోబర్ 5న జరిగిన బౌద్ధ ధమ్మ దీక్షా స్వీకార ఉత్సవానికి ఢిల్లీ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రాజేంద్రపాల్ గౌతమ్ కూడా హాజరయ్యారు. ఈ విషయాన్ని ఢిల్లీ భారతీయ జనతాపార్టీ నాయకులు వివాదాస్పదం చేశారు. అక్కడ హిందూ దేవుళ్ళని కించపరిచారనీ, దూషించారనీ, అందులో రాజేంద్ర గౌతమ్ భాగమయ్యారనీ ఆరోపించారు. రాజేంద్ర గౌతమ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని, హిందూ వ్యతిరేక పార్టీగా చిత్రీకరించడానికి చేసిన ప్రయత్నమే ఇది. అందులో భాగంగానే రాజేంద్ర గౌతమ్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. త్వరలో గుజరాత్లో జరగబోయే ఎన్నికల్లో బీజేపీ ఈ అంశాన్ని ఆప్‌కు వ్యతిరేకంగా వాడుకోవాలని చూస్తున్నదని భావించిన రాజేంద్ర గౌతమ్ తనకు తానుగానే మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే ‘ఈ వివాదాన్ని సృష్టించి, ఆప్‌ను ఇరకాటంలో పెట్టాలని బీజేపీ భావించింది. అంతే కాకుండా బాబాసాహెబ్ అంబేడ్కర్‌ను దోషిగా నిలబెట్టాలనీ చూశారు. పదవి, బాబాసాహెబ్ అంబేడ్కర్ అనేవి రెండు విషయాలు నా ముందున్నప్పుడు అంబేడ్కర్ మహోన్నతా శయం మాత్రమే నాకు కనిపించింది. పదవిని వదులుకున్నాను. భవిష్యత్‌లో మరింత శక్తిమంతంగా అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా గౌతమ బుద్ధుని మార్గంలోనే నడవడానికి నిశ్చ యించుకున్నాను’ అన్నారు. అసలు బాబాసాహెబ్ అంబేడ్కర్ కులాన్ని పెంచి పోషిస్తున్న హిందూ మతాన్ని వీడి, సమత, కరుణ, ప్రేమతో నిండిన బౌద్ధాన్ని స్వీకరించడానికి, ఇప్పటికీ ఈ దేశంలోని దళితులు, ఇతర మానవతావాదులు బౌద్ధాన్ని స్వీకరించడానికీ ఎవరు కారకులు? ఏంటి కారణాలు? అనేది ఆలోచించాలి. అంబేడ్కర్ 1935, అక్టోబర్ 13వ తేదీన పదివేల మంది అణగారిన కులాల పేరుతో పిలవబడే అంటరాని కులాల ప్రజలు పాల్గొన్న సమావేశంలో మాట్లాడుతూ... ‘దురదృష్టవశాత్తూ నేను హిందువుగా జన్మించాను. కానీ హిందువుగా మరణించను. అంతిమ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. హిందూ సమాజంలోని ఆధిపత్యకులాలు పెడుతున్న బాధలు భరించడం ఇంకా అవసరం లేదు. అయితే ఒక మతాన్ని వీడి, మరో మతాన్ని స్వీకరించాలనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. సమానత్వ హోదా, భద్రత, గౌరవప్రదమైన జీవితం లభించగలిగే ధర్మంలోకి వెళ్ళాలి’ అన్నారు. అదే సందర్భంలో అప్పటికే ఐదేళ్లుగా సాగుతున్న నాసిక్‌లోని కాలారామ్ దేవాలయ ప్రవేశ ఉద్యమాన్ని అంబేడ్కర్ ప్రస్తావించారు. ఏ మతంలోని దేవాలయాలలోకి మనకు ప్రవేశం లేదో, ఆ మతంలో ఉండాల్సిన అవసరం ఉందా అని బహిరంగంగా ప్రశ్నించారు. అంతేకాకుండా, 1922 మార్చి 20వ తేదీన మహద్‌లోని చౌదర్ చెరువు నీళ్ళను తాగడానికి సాగించిన సత్యాగ్రహం, ఆ సందర్భంగా మహర్లపై జరిగిన దాడి ఆయన మనస్సులో బలంగా నాటుకుపోయింది. మహద్ చెరువులోని నీళ్లు తాగ డానికి అందరికీ హక్కు ఉన్నదని అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ ఆధిపత్య కులాలు ఆనాటి మహర్లను చాలా క్రూరంగా కొట్టి, గాయపరిచారు. ఈ ఘటనలు కూడా అంబే డ్కర్‌ను పెద్దగా బాధించలేదు. కానీ ఆయన 1919 నుంచి 1932 వరకు దాదాపు 13 ఏళ్లపాటూ పోరాడిన ఫలితంగా ప్రకటించిన ‘కమ్యూనల్ అవార్డు’ వల్ల సాధించిన ప్రత్యేక ఎన్నికల హక్కుని వదులు కోవలసి వచ్చినప్పుడు ఎంతో క్షోభ అనుభవించారు. 1932 ఆగస్టు 16వ తేదీన ఆనాటి బ్రిటిష్ ప్రధానమంత్రి రామ్సె మెక్‌డొనాల్డ్ కమ్యూనల్ అవార్డును ప్రకటిస్తే, పూనాలోని ఎరవాడ జైలులో ఉన్న మహాత్మాగాంధీ దానిని వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్‌తో ఆమరణ దీక్షకు పూనుకున్నారు. ‘ఇది హిందువులను విభజించడమే’ అనే వాదనను గాంధీజీ ముందుకు తీసుకొచ్చారు. అణగారిన వర్గాల ప్రత్యేక ఎన్నికల విధానాన్ని అంగీకరించనని మొండికేశారు. దీనిని అంబేడ్కర్ తీవ్రంగా ప్రతిఘటించారు. చివరకు హిందూ సంస్థలు, సంఘాలు అంబేడ్కర్ మీద ఒత్తిడి తీసుకొచ్చాయి. గాంధీజీ ప్రాణానికి ఏమైనా జరిగితే, అణగారిన కులాల భద్రత ప్రమా దంలో పడగలదని భావించిన అంబేడ్కర్ 1932, సెప్టెంబర్ 24వ తేదీన ‘పూనా ఒడంబడిక’కు ఒప్పుకున్నారు. దానివల్ల దళితులు తమ ప్రతినిధులను తాము మాత్రమే ఎన్నుకునే హక్కును కోల్పోయారు. ఈ రోజు మనం చూస్తున్న రిజర్వుడు సీట్లకు పరిమితం కావాల్సి వచ్చింది. ఈ సంఘటన అంబేడ్కర్‌ను తీవ్రంగా కదిలించింది. ఆలోచింపజేసింది. ఫలితంగా కుల నిర్మూలన ప్రతిపాదన ముందుకు తెచ్చారు. అంటరానివారెవరు, శూద్రులెవరు వంటి అంశాలతో పాటూ ఇంకా హిందూ మతంపైన అనేక రకాలైన అధ్యయనాలూ, బౌద్ధంపైన పరిశోధనలూ చేశారు. 1956 అక్టోబర్ 14వ తేదీన బౌద్ధాన్ని స్వీకరించారు. ఇప్పుడు చెప్పండి... బాబా సాహెబ్ అంబేడ్కర్ హిందూ మతం మీదగానీ, కుల వ్యవస్థ మీదగానీ పోరాటాన్ని తీవ్రంగా పదునెక్కించడానికి ఆనాటి హిందూ పెద్దలు, ప్రత్యేకించి గాంధీ లాంటి వాళ్ళు కారణం కాదా? ఈ నేపథ్యాన్ని అర్థం చేసుకుంటేనే అంబేడ్కరిస్టుల పోకడలు అర్థం అవుతాయి. (క్లిక్: భరత జాతికి ఒక ఆంగ్ల నాడి) రకరకాల కారణాలతో గత 75 సంవత్సరాల్లో 30 వేల మంది దళితులను పొట్టనపెట్టుకున్నారు. 50,000 మందికి పైగా దళిత మహిళలు అత్యాచారాలకు, హత్యలకు గురయ్యారు. ఇప్పటికైనా హిందూ మత పెద్దలు తమ మతాన్ని సంస్కరించుకోకపోతే దళితులకు, కుల అణచివేతకు గురవుతున్న ఇతర బలహీన వర్గాలకు అంబేడ్కర్ 22 ప్రతిజ్ఞలు మాత్రమే మార్గం అవుతాయనడంలో సందేహం లేదు. (క్లిక్: రూపాయి విలువ తగ్గింది, ఎందుకు?) - మల్లెపల్లి లక్ష్మయ్య సామాజిక విశ్లేషకులు -
బీఆర్ .అంబెడ్కర్ కు గౌరవం ఇచ్చిన పార్టీ బీజేపీ : బండి సంజయ్
-
బాబాసాహెబ్ కలల సాకారంలో...
అంబేడ్కర్ తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ ఆర్టికల్ 370 మన రాజ్యాంగంలో భాగమైంది. మోదీ బలమైన సంకల్పం ఫలితంగా ఆర్టికల్ 370 రద్దు సాధ్యమై, ఇవాళ భారతదేశంతో జమ్ము–కశ్మీర్ ఏకీకరణ స్వప్నం సాకారమైంది. మోదీ చేపట్టిన చర్యలు, కార్యక్రమాలు, విధానాలన్నింటి లోనూ అంబేడ్కర్ ప్రభావం సుస్పష్టం. మోదీ అనేకమంది నాయకుల నుంచి స్ఫూర్తి పొందినప్పటికీ, అంబేడ్కర్ ముద్ర ఆయన పాలనా శైలిలో సర్వత్రా కనిపిస్తుంది. ‘భారతీయతే మన నిజమైన గుర్తింపు. బలమైన దేశ నిర్మాణం కోసం మనమంతా కుల, మత, జాతి భేదాలను పక్కకునెట్టి ముందడుగు వేయాలి’ అన్న మన భారతరత్న అంబేడ్కర్‌కు మోదీ నిజమైన వారసుడన్నది నా అభిప్రాయం. భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో మన సమాజ భాగ స్వాములైన బడుగు, బలహీన వర్గాల వారి ఆశలు, ఆకాంక్షలకు రెక్కలు తొడిగిన రాజ్యాంగ పితామహుడు బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేడ్కర్‌ను స్మరించుకోవాల్సిన అవసరం ఎంత యినా ఉంది. స్వాతంత్య్రం తర్వాత దేశ ప్రగతికి వివిధ ప్రభుత్వాలు తమ వంతు కృషి చేసినప్పటీకీ అంబేడ్కర్ కన్న కలల్లో ఏళ్ల తరబడి నెరవేరని ఎన్నో స్వప్నాలను నరేంద్ర మోదీ ప్రభుత్వం సాకారం చేసింది. ఈ రోజు మన ప్రియతమ ప్రధానమంత్రి పుట్టినరోజు. ఆయనతో నాది చాలా సుదీర్ఘ, చిరస్మరణీయ అనుబంధం. సంస్థలో ఒకరిగా, ముఖ్యమంత్రిగా, ఇవాళ ప్రధానమంత్రిగా ఆయన పనిచేయడం నేను చూస్తూ వచ్చాను. దళితులు, ఆదివాసీలు, మహిళల సాధికారతలో ఆయన ప్రదర్శించిన శ్రద్ధాసక్తులు నన్నెంతో ఆకట్టుకున్నాయి. ఆ మేరకు బాబాసాహెబ్‌కు నిజమైన శిష్యుడిగా భారతదేశాన్ని సమసమాజంగా రూపుదిద్దడానికి మోదీ ముమ్మర కృషి చేస్తున్నారు. మోదీ చేపట్టిన చర్యలు, కార్యక్రమాలు, విధానాలు తదితరాలన్నింటిలోనూ అంబే డ్కర్ ప్రభావం సుస్పష్టం. ఒక సంస్థలో సభ్యుడిగా, ముఖ్యమంత్రిగా, నేడు ప్రధానమంత్రిగానూ మోదీ సదా బాబాసాహెబ్ బాటలోనే నడుస్తున్నారు. తదనుగుణంగా దేశానికేగాక ప్రపంచం మొత్తానికీ చిరకాలం గుర్తుండిపోయే బహుమతిని ‘పంచతీర్థం’ రూపంలో మోదీ అందించారు. బాబాసాహెబ్ జయంతిని ‘సమతా దినోత్సవం’గా నిర్వహించాలని నిర్ణయించడమేగాక నవంబర్ 26ను భారత ‘రాజ్యాంగ దినోత్సవం’గానూ మోదీ ప్రకటించారు. ప్రధాని మోదీ చూపిన ఈ చొరవతో ఐక్యరాజ్య సమితి కూడా బాబాసాహెబ్ 125వ జయంతి వేడుకను నిర్వహించింది. అంబేడ్కర్ కృతనిశ్చయంతో ఉన్నప్పటికీ నెరవేరని– ఆర్టికల్ 370 రద్దు, స్వయం సమృద్ధ భారతం స్వప్నాలను మోదీ ప్రభుత్వం పటిష్ఠ చర్యలతో సాకారం చేయగలిగింది. కాగా, ఆనాడు అంబేడ్కర్ తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ ఆర్టికల్ 370 మన రాజ్యాంగంలో భాగమైంది. దీంతో భారతదేశంలో జమ్ము–కశ్మీర్ విలీనానికి అడ్డుకట్ట పడింది. అయితే, మోదీ బలమైన సంకల్పం, దీక్ష ఫలితంగా ఆర్టికల్ 370 రద్దు సాధ్యమై, ఇవాళ భారతదేశంతో జమ్ము–కశ్మీర్ ఏకీకరణ స్వప్నం సాకారమైంది. అదేవిధంగా శక్తిమంతమైన స్వయం సమృద్ధ భారతదేశ నిర్మాణం దిశగా ప్రధానమంత్రి మోదీ ఉద్యమ సంక ల్పంతో శ్రమిస్తున్నారు. ‘స్వయం సమృద్ధం’ కావడం ద్వారానే భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించగలదని అంబేడ్కర్ గట్టిగా విశ్వసించారు. కానీ, భారతదేశాన్ని స్వావలంబన మార్గంలో నడి పించడంలో మునుపటి ప్రభుత్వాలకు సంకల్పం, చిత్తశుద్ధి లోపిం చాయి. కానీ, మోదీ ఈ పరిస్థితిని చక్కదిద్ది, భారత ప్రగతి రథాన్ని పరుగులు పెట్టించడం ద్వారా ప్రపంచానికి మన శక్తిని చాటారు. కాబట్టే మన బలమేమిటో ప్రపంచం ఇవాళ గుర్తించింది. రాష్ట్రపతి హోదాలో నేను పలు సామాజిక సమస్యలు, పాలనా వ్యవహారాలపై ప్రధానితో సంభాషించినప్పుడల్లా వ్యవస్థలో లోతుగా పాతుకుపోయిన అవినీతి గురించి ఎక్కువగా ఆందోళన వ్యక్తం చేసేవారు. ఈ జాడ్యం కారణంగా ఎక్కువగా నష్టపోతున్నది పేదలేనని చెప్పేవారు. ఈ నేపథ్యంలో గడచిన ఎనిమిదేళ్లుగా మోదీ అవినీతిపై అలుపెరుగని నిర్ణయాత్మక పోరాటం చేస్తున్నారు. తదనుగుణంగా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలన్నీ నిరుపేద లందరికీ అందేలా ఆయన చేసిన కృషిని మనమంతా ప్రత్యక్షంగా చూశాం. పర్యవసానంగా ఇవాళ ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు బదిలీ సాఫీగా సాగిపోతోంది. నరేంద్ర మోదీ ప్రభుత్వ పథకాలన్నీ నిరుపేదలపై కరుణను ప్రతిబింబించేవి కావడం గమనార్హం. మన ప్రజాస్వామ్య వ్యవస్థను అనువంశిక రాజకీయాలు నియంత్రించడం మోదీకి తీవ్ర ఆందోళన కలిగించిన మరో అంశం. ఈ అనువంశిక రాజకీయాలు చిత్తశుద్ధితో, శ్రమించి పనిచేసే రాజ కీయ కార్యకర్తల హక్కులను ఏ విధంగా లాగివేసుకుంటాయనే అంశంపై ఆయన సదా గళం విప్పుతూనే వచ్చారు. మోదీ ఎల్లప్పుడూ అర్హత ప్రాతిపదికగానే నాయకులను, కార్యకర్తలను ప్రోత్సహిస్తూ వస్తున్నారు. అనువంశిక రాజకీయాలపై మోదీ చేసిన యుద్ధం ఇప్పటికే తన ప్రభావం చూపుతోంది. ఈ మేరకు మన ప్రజాస్వా మ్యాన్ని పటిష్ఠం, మరింత శక్తిమంతం చేసేది ప్రతిభ ఆధారిత రాజకీయాలే తప్ప అనువంశిక రాజకీయాలు కావన్నది స్పష్టమైంది. మోదీ పాలన శైలికి మరో నిలువెత్తు నిదర్శనం ‘పద్మ’ పురస్కరాలు. ఒకనాడు సంపన్న, పలుకుబడిగల వర్గాలకు ‘విశేష పరి గణన’ ఇచ్చేవిగా భావించబడిన ఈ పురస్కారం నేడు ‘సామా న్యుడి’తో తన అనుబంధాన్ని పునరుద్ధరించుకుంది. ఈ మేరకు ఇవాళ ‘జన సామాన్యం’తో మమేకమైన వారికి అంకితం చేయబడ్డాయి. అత్యంత వెనుకబడిన రంగాలలో అభివృద్ధి, తదనుగుణంగా అట్టడుగు వర్గాల జీవితాల్లో కొత్త అధ్యాయం లిఖించే విధంగా ప్రభుత్వం చేపట్టిన రెండు కీలక చర్యల గురించి ఈ సందర్భంగా నేను ప్రస్తావించదలిచాను. ఇందులో ఒకటి ‘ఆకాంక్షాత్మక జిల్లాల కార్య క్రమం’ కాగా, రెండోది ‘ఆదర్శ గ్రామాల పథకం’. మోదీ విశిష్ట ఆలోచన శైలికి ఇదే నిదర్శనం. వేలెత్తి చూపలేని పటిష్ట ప్రణాళికలు, లోపరహితంగా వాటిని అమలు చేయడం వల్ల నిరుపేదల జీవితాల్లో సుస్పష్టమైన మార్పులు వచ్చాయి. అనేక సాంఘిక సంక్షేమ పథకాలే ఇందుకు తిరుగులేని ఉదాహరణలు. వీటిలో ప్రపంచంలోనే అత్యంత భారీ ఉచిత రేషన్ పథకమైన ‘ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన’ అత్యంత విశిష్టమైనది. భారతీయులు కరోనా మహ మ్మారిపై సాహసోపేత పోరాటం సలుపుతున్న నేపథ్యంలో ప్రవేశ పెట్టిన ఈ పథకం ద్వారా 80 కోట్ల మందికిపైగా ప్రజలు ప్రయోజనం పొందారు. మహమ్మారి వైరస్‌పై భారత్ పోరాటాన్ని ప్రధాని మోదీ ఏ విధంగా ముందుండి నడిపారో నేను ప్రత్యక్షంగా చూశాను. మన శాస్త్రవేత్తలు, వైద్యులు ఒకటికి రెండు ‘దేశీయ’ (మేడ్ ఇన్ ఇండియా) టీకాలను రూపొందించడంలో ఆయనిచ్చిన చేయూత, మద్దతు నిరుపమానం. దీంతో మనందరికీ భద్రత లభించడమేగాక అనేక ఇతర దేశాల ప్రజానీకం సంక్షేమానికీ మనమంతా తోడ్పడినట్ల యింది. మరోవైపు మహమ్మారి గరిష్ఠ స్థాయిలో విజృంభించే నాటికి 100 కోట్ల మంది భారతీయులకు టీకాలు వేసే బృహత్తర కార్యాచర ణను కూడా ప్రధానమంత్రి చేపట్టారు. తద్వారా ప్రపంచంలోనే అత్యంత భారీ, వేగవంతమైన టీకా కార్యక్రమాన్ని ప్రారంభించి, విజయవంతం చేశారు. అనేక అభివృద్ధి చెందిన దేశాలను కోవిడ్ ఊపిరాడకుండా చేసిన సమయంలో ప్రధాని మన ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడమేగాక విస్తరించారు. సమయ స్ఫూర్తితో కూడిన విధానపరమైన కార్యక్రమాల ద్వారా ఆర్థిక వృద్ధి స్తంభించకుండా ఎంతో జాగ్రత్త వహించారు. మోదీ గత ఎనిమిదేళ్ల పాలన అత్యద్భుతం. మోదీ అనేకమంది నాయకుల నుంచి స్ఫూర్తి పొందినప్పటికీ, అంబేడ్కర్ ముద్ర ఆయన పాలన శైలిలో సర్వత్రా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ‘భారతీయతే మన నిజమైన గుర్తింపు. బలమైన దేశ నిర్మాణం కోసం మనమంతా కుల, మత, జాతి భేదాలను పక్కకునెట్టి ముందడుగు వేయాలి’ అన్న మన భారతరత్న అంబేడ్కర్‌కు మోదీ నిజమైన వారసుడన్నది నా అభి ప్రాయం. అంబేడ్కర్ అడుగుజాడల్లో మన ప్రధాని ‘దేశమే ప్రథమం’ అనే నినాదాన్ని తారకమంత్రంగా స్వీకరించారు. మరోవైపు సుపరి పాలన, సామాజిక సమన్వయం, క్రమశిక్షణలనే విశిష్ట లక్షణాలతో ఆయన ప్రభుత్వం దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తోంది. (నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టిన రోజు) రామ్‌నాథ్ కోవింద్ (భారత మాజీ రాష్ట్రపతి) -
సచివాలయానికి అంబేడ్కర్ పేరు.. సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ సచివాలయానికి ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీచేశారు. భారత నూతన పార్లమెంటు భవనానికి సైతం అంబేడ్కర్ పేరు పెట్టాలని ఆయన మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రం ఢిల్లీలో నిర్మిస్తున్న కొత్త పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలని గత మంగళవారం రాష్ట్ర శాసనసభ ఏకగీవ్రంగా తీర్మానం చేసిందని గుర్తుచేశారు. ఏదో ఆశామాషీకి అంబేడ్కర్ పేరు పెట్టాలని కోరడం లేదని స్పష్టంచేశారు. దేశ గౌరవం మరింతగా ఇనుమడించాలంటే, భారత సామాజిక తాత్వికుడు, రాజ్యాంగ నిర్మాతకు మించిన పేరు లేదనే విషయాన్ని ఇటీవలే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించుకున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని కొత్త పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలని కోరుతూ త్వరలో ప్రధాని మోదీకి లేఖ రాస్తానని వెల్లడించారు. ఈ మేరకు సీఎం కార్యాలయం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రజలందరికీ గర్వ కారణం రాష్ట్ర ప్రధాన పరిపాలనా సముదాయ భవనమైన సెక్రటేరియట్‌కు అంబేడ్కర్ పేరు పెట్టడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమని కేసీఆర్ పేర్కొన్నారు. ‘దేశ ప్రజలందరికీ అన్ని రంగాల్లో సమాన గౌరవం దక్కాలనే అంబేడ్కర్ తాత్వికతను రాష్ట్ర ప్రభుత్వం అందిపుచ్చుకుని ముందుకు సాగుతోంది. సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో సబ్బండ వర్గాలను సమున్నత స్థాయిలో నిలుపుతూ స్వయంపాలన కొనసాగించడం వెనక అంబేడ్కర్ ఆశయాలు ఇమిడి ఉన్నాయి. అంబేడ్కర్ దార్శనికతతో రాజ్యాంగంలో ఆర్టికల్ 3 పొందుపరచడం ద్వారా మాత్రమే తెలంగాణ ఏర్పాటైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళా వర్గాలతో పాటు పేదలైన అగ్రకులాల ప్రజలకు కూడా మానవీయ పాలన అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. అంబేడ్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని అమలు చేస్తోంది’ అని సీఎం పేర్కొన్నారు. మమ్మల్ని అంబేడ్కర్ స్ఫూర్తే నడిపిస్తోంది.. ‘అంబేడ్కర్ కలలుగన్న భారతదేశంలో భిన్నత్వంతో కూడిన ప్రత్యేక ప్రజాస్వామిక లక్షణం ఉంది. ఫెడరల్ స్ఫూర్తిని అమలు చేయడం ద్వారా మాత్రమే అన్ని వర్గాలకు సమాన హక్కులు, అవకాశాలు కల్పించబడతాయనే అంబేడ్కర్ స్ఫూర్తి మమ్మల్ని నడిపిస్తోంది. దేశ ప్రజలు కుల, మత, లింగ, ప్రాంతాల వివక్ష లేకుండా అన్ని వర్గాలు సమానంగా గౌరవించబడి, అందరికీ సమాన అవకాశాలు కల్పించబడటమే నిజమైన భారతీయత. అప్పుడే నిజమైన భారతం ఆవిష్కృతమౌతుంది. అందుకోసం మా కృషి కొనసాగుతుంది. అన్ని రంగాల్లో దార్శనికతతో ముందుకుపోతూ, అనతి కాలంలోనే దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రం, అంబేడ్కర్ పేరును సెక్రటేరియట్‌కు పెట్టడం ద్వారా మరోసారి దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. జై భీం. జై తెలంగాణ. జై భారత్’ అని సీఎం తన ప్రకటనను ముగించారు. ఇదీ చదవండి: చరిత్రలో ఈ నరమేధ గాథ ఎక్కడ? -
తెలంగాణ కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు
సాక్షి, హైదరాబాద్: కొత్తగా నిర్మిస్తున్న సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్ సోమేశ్ కుమార్‌కు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. అంబేద్కర్ దార్శనికతతో రాజ్యాంగంలో ఆర్టికల్-3 పొందుపరచడం ద్వారా మాత్రమే తెలంగాణ నేడు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైందన్నారు. సచివాలయానికి అంబేద్కర్ నామకరణం.. తెలంగాణ ప్రజలకు గర్వకారణమన్నారు. అంబేద్కర్ పేరు సచివాలయానికి పెట్టడం దేశానికి ఆదర్శమని కొనియాడారు. భారత ప్రజలందరికీ అన్ని రంగాల్లో సమాన గౌరవం దక్కాలనే అంబేద్కర్ మహాశయుని తాత్వికతను తెలంగాణ ప్రభుత్వం అందిపుచ్చుకుని ముందుకు సాగుతున్నదన్నారు. పార్లమెంట్ కొత్త భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. దీనిపై తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసిందన్నారు. త్వరలోనే ప్రధాని మోదీకి లేఖ రాస్తానని వెల్లడించారు. చదవండి: మంత్రి vs సిట్టింగ్ ఎమ్మెల్యే -
అంబేడ్కర్ చిత్రపటాన్ని కాల్పించిన టీచర్‌కు దేహశుద్ధి
పెదపులివర్రు (భట్టిప్రోలు): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటాన్ని విద్యార్థులతో ముక్కలు చేయించి, కాల్పించిన ఉపాధ్యాయుడికి పెదపులివర్రు గ్రామస్తులు బుధవారం దేహశుద్ధి చేశారు. గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం పెదపులివర్రులోని నాదెళ్ల సుబ్బరాయచౌదరి ఉన్నత పాఠశాలలో ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు వి.నరసింహారావు ఏప్రిల్ 14న విద్యార్థులతో అంబేడ్కర్ చిత్రపటాన్ని ముక్కలు చేయించి, కాల్పించాడు. దీనిపై గ్రామస్తులు అభ్యంతరం తెలిపారు. హైస్కూల్ స్థాయిలో సమస్య పరిష్కారం కాలేదు. వేసవి సెలవుల అనంతరం పాఠశాల పునః ప్రారంభమైనా సమస్య పరిష్కారమవలేదు. దీంతో గ్రామస్తులు ఆగ్రహించారు. ఉపాధ్యాయుడు నరసింహారావుకు బుధవారం దేహశుద్ధి చేశారు. గొరిగపూడి పంచాయతీ వరికూటివారిపాలేనికి చెందిన నరసింహారావు మొదటి నుంచీ ఎస్సీ విద్యార్థులపై వివక్ష చూపే వాడని, చితకబాదేవాడని గ్రామస్తులు ఆరోపించారు. విద్యార్థుల మధ్య కుల చిచ్చు పెడతాడని తెలిపారు. పోలీసులు గ్రామానికి చేరుకు ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకుని హైస్కూల్ గదిలో ఉంచారు. బాపట్ల డిప్యూటీ డీఈవో ఎం. వెంకటేశ్వర్లు కూడా అక్కడికి వచ్చి గ్రామస్తులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఉపాధ్యాయుడు నరసింహారావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పారు. శాఖాపరంగా చర్యలు తీసుకుంటామని విద్యా శాఖాధికారులు ప్రకటించారు. ఇందుకు గ్రామస్తులు ససేమిరా అన్నారు. అంబేడ్కర్ చిత్రపటాన్ని ముక్కలు చేసి కాల్పించిన ఉపాధ్యాయుడిని విధుల నుంచి పూర్తిగా తొలగించాలని, ఎస్సీ, ఎస్టీ అట్రిసిటీ యాక్ట్ – 2015 ప్రకారం కేసు నమోదు చేసి, అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుడిచే అంబేడ్కర్ విగ్రహం వద్ద పాలాభిషేకం చేయించి, క్షమాపణ చెప్పించాలని గ్రామస్తులు భీష్మించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సాయంత్రం 6:30 గంటలకు బాపట్ల డీఎస్పీ ఎ. శ్రీనివాసరావు అక్కడికి చేరుకున్నారు. రాత్రి 8:30 గంటల వరకు చర్చలు జరుగుతూనే ఉన్నాయి. చివరకు పోలీసులు గ్రామస్తులను చెల్లా చెదురు చేశారు. ఆ తరువాత ఉపాధ్యాయుడు నరసింహారావును పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ కేసు దర్యాప్తునకు జిల్లాస్థాయి ప్రత్యేక అధికారిని నియమించాలని రాష్ట్ర మాల మహానాడు ప్రధాన కార్యదర్శి బుస్సా నాగరాజు, వేమూరు నియోజకవర్గ కన్వీనర్ గద్దె యతీష్, ఆలిండియా షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర కార్యదర్శి యన్నం సురేష్ డిమాండ్ చేశారు. నరసింహారావుకు సహకరించిన మరో పీఈటీ వి.శ్రీనివాసరావుపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. -
కులరహిత సమాజం కోసం...
ఎడ్మండ్ బర్క్ అనే ఐరిష్ తత్వవేత్త ‘నిజమైన మతమే సమాజానికీ, మానవీయ ప్రభుత్వానికీ పునాది’ అని పేర్కొన్నాడు. ఉదాహరణకు చైనాలో కమ్యూనిజం విజయం సాధించడానికి బుద్ధిజం కారణమని చెప్పవచ్చు. హిందూ దేశంగా ప్రసిద్ధిగాంచిన భారత దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 ఏళ్లు గడిచిపోయినప్పటికీ కుల అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలా సామాజిక సంబంధాల్లో మార్పు లేకుండా ఉండటానికి హిందూ ఆధ్యాత్మిక వ్యవస్థే కారణం. ఎందుకంటే కులాలు జన్మించినవే హిందూ మతానికి చెందిన శాస్త్రాల నుండి కనుక. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పౌరులకు రాజ్యాంగబద్ధంగా సమస్త హక్కులను కల్పించి కుల నిర్మూలన, సమ సమాజ స్థాపనే రాజ్యాంగం లక్ష్యంగా నిర్ధారించారు. ఆర్థిక, విద్య, వ్యవసాయం వంటి రంగాల్లో సంస్కరణలు చేయడం వల్ల మాత్రమే సమాజంలో మార్పు తేలేం. మతంతో సంబంధం లేని సామాజిక సంస్కరణలు తేవడం వలన సమాజంలో కొంత మార్పును మాత్రమే తేగలం. అదే మతంతో ముడిపడి ఉన్న సంస్కరణలైతే అత్యధిక మార్పులు తేవచ్చు. అయితే ఇందుకోసం మత సంస్కరణ జరగాలి. మత సంస్కరణలు చెయ్యలేని సందర్భంలో మతంతో ముడిపడి ఉన్న సమస్యలను రాజ్యాంగ సవరణల ద్వారా అధిగమించవచ్చు. ఫలితంగా సామాజిక దొంతర మారే అవకాశం లభిస్తుంది. రాజ్యాంగ సవరణలు ద్వారా అమెరికా, దక్షిణ ఆఫ్రికా దేశాల్లో మన కుల వ్యవస్థను పోలిన జాతి వివక్షను నిషేధించడాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసు కోవాలి. దక్షిణాఫ్రికాలో 1948లో అక్కడి నేషనల్ పార్టీ వారు తెలుపు–నలుపు ప్రజల మధ్య జాతి వివక్షను చట్టబద్ధమైనదిగా మార్చారు. అయితే ఆ సమయంలో ప్రభుత్వం అమలు చేసిన విధానానికి మద్దతు పలు కుతూ కొంతమంది క్రైస్తవులు బైబిల్‌ను దుర్వినియో గించారు. దేవుడు అందరినీ సమానంగా సృష్టించాడు అని బైబిలు చెప్పినప్పటికీ కొందరు శ్వేత జాతి మత పెద్దలు వారి ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ఇలా చేశారు. అయితే అక్కడి ప్రభుత్వం మత సంస్కరణలు చేయలేని పరిస్థితుల్లో 1994లో రాజ్యాంగ సవరణల ద్వారా సమాజంలో వర్ణవివక్ష లేని సమాజాన్ని స్థాపించింది. అమెరికాలో కూడా 1865లో 13వ రాజ్యాంగ సవరణ ద్వారా జాతి ఆధారిత బానిసత్వాన్ని తొల గించి అందరూ సమానులే అని నిర్ధారించి తద నంతరం అనేక సవరణల ద్వారా సమ సమాజాన్ని స్థాపించారు. (క్లిక్: సామాన్య శూద్రుడికి సెయింట్‌హుడ్) దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లవుతున్నా, పరువు హత్యల పేరున కులాంతర వివాహం చేసుకున్న దంపతులను హత్య చేస్తున్నారు. ఇలాంటి హత్యలు దేశంలో మానవ జాతికే కళంకం తెస్తున్నాయి. ఇలాంటి తరుణంలో... మన దేశంలో హిందూ మతంలో సంస్కరణలు, హిందూ మత గ్రంథాల సవరణలు సాధ్యమయ్యేపని కాదు. కావున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారత రాజ్యంగ పీఠిక, అధికరణల మేరకూ; సుప్రీంకోర్టు 2011లో కె.కె. భాస్కరన్ వర్సెస్ స్టేట్ అఫ్ తమిళనాడు, నందిని సుందర్ వర్సెస్ స్టేట్ అఫ్ ఛత్తీస్‌గఢ్ కేసుల్లో ఇచ్చిన తీర్పుల ప్రకారం... దేశంలో పౌరుల మధ్య సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం కల్పించాలి. ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలి. తద్వారా రాజ్యాంగంలో ‘ఆర్టికల్ 17ఏ’ను చేర్చి కుల వ్యవస్థను నిషేధించాలి. అది సాధ్యం కానిపక్షంలో ‘కులాంతర వివాహాల పరిరక్షణ’ చట్టాన్ని ఏర్పాటు చేసి పక డ్బందీగా అమలు చెయ్యాలి. ప్రాథమిక విద్యాభ్యాసం నుండి విద్యార్థులకు దేశాన్ని పీడిస్తున్న కుల సమస్యను నిర్మూలించడానికి తగు విధానాలను నేర్పించాలి. లేనట్లయితే రాజ్యాంగ లక్ష్యమైన కులరహిత సమాజాన్ని స్థాపించడం అసాధ్యం. (క్లిక్: మతాలు కాదు... మనిషే ప్రధానం) - కోడెపాక కుమార స్వామి వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు -
ఆ నామవాచకం ఓ చైతన్య జ్వలనం!
ఓ జ్ఞానజ్యోతీ, భారత రాజ్యాంగ నిర్మాతా, ప్రపంచ మేధావీ అయిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరును కోనసీమకు పెట్టడంలో ఒక చారిత్రక నేపథ్యం ఉంది. అంబేడ్కర్ స్వయంగా తూర్పుగోదావరి ప్రాంతమంతా పర్యటించారు. ఈ ప్రాంతమంతా చారిత్రకంగా బౌద్ధ భూమి. ఇక్కడ వేల సంవత్సరాలు బౌద్ధం విరాజిల్లింది. అందుకే ఇక్కడ సామాజిక సామరస్యం ఎక్కువ. సర్ ఆర్థర్ కాటన్ మహోన్నతమైన కృషి వల్ల ఇక్కడ వ్యవసాయ విస్తరణ జరిగింది. ప్రాజెక్టుల నిర్మాణంలోనూ, బ్యారేజీల నిర్మాణంలోనూ, నీటిపారుదల కాల్వల నిర్మాణంలోనూ ప్రజలందరూ కులమత భేదాలు లేకుండా భాగస్వాములయ్యారు. ఇక్కడ భాష కూడా అందరూ ఒకే రకంగా కుల మతాలకు అతీతంగా మాట్లాడతారు. ఊనికలు ఒకే రకంగా ఉంటాయి. ఇక్కడ కులాలు రూపొందాయి కానీ కులాలు లేవు. అంబేడ్కర్ స్ఫూర్తితో ఇక్కడ విద్య వికసించింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరులో వ్యక్తిత్వ నిర్మాణం ఉంది. విద్యా వికాసం ఉంది. ప్రపంచ జ్ఞానం ఉంది. ముఖ్యంగా ఆత్మగౌరవం ఉంది. బౌద్ధ సంస్కృతీ వికాసం ఉంది. సామాజిక సమతుల్యత ఉంది. ఆర్థిక సముత్తేజం ఉంది. కుల నిర్మూలన ఉంది. అంబేడ్కర్ పేరు వలన కోనసీమకే కీర్తి వస్తుంది. అంబేడ్కర్‌ది అంతర్జాతీయ నామవాచకం. అందుకే కోనసీమకు అంబేడ్కర్ పేరు ఉచితమై నది. ఆ పేరును భారతదేశంలో ఎక్కువ విశ్వవిద్యాలయాలకు పెట్టారు. భారత దేశంలో ఉన్న ఏడు లక్షల గ్రామాల్లో ఎక్కువ గ్రామాలకు పెట్టిన పేరు అంబేడ్కర్. ఆయన నామవాచకంలో విద్యా, సాంస్కృతిక వికాసం ఉంది. అంబేడ్కర్ కుల నామవాచకం కాదు. కుల నిర్మూ లనా ప్రతీక! అది మతాలకు, కులాలకు సంబంధం లేని జాతీయ స్ఫూర్తిని కలిగిస్తుంది. అంబేడ్కర్ విగ్రహాన్ని లండన్‌లోని ‘ఇండియన్ హౌస్’లో రూపొందించుకున్నారు. నేను స్వయంగా వీక్షించాను. ఆ విగ్రహ సమక్షంలో నా రచన ‘కాస్ట్ అండ్ ఆల్టర్నేటివ్ కల్చర్’ పుస్తకాన్ని వీపీ సింగ్ ఆవిష్కరించారు. లండన్ మ్యూజియం లైబ్రరీలో అంబేడ్కర్ చిత్ర పటం ఉంది. అదీ నేను స్వయంగా వీక్షించాను. లండన్ ‘హౌస్ ఆఫ్ కామన్స్’లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ శత జయంతి చేశారు. దానికి నేను హాజరయ్యాను. అంబేడ్కర్ నామవాచకం బుద్ధుని తర్వాత, అశోకుని తర్వాత భారతదేశ ఔన్నత్యానికి ప్రతీకగా నిలిచింది. నిజానికి కోనసీమ ప్రేమసీమ! ఇక్కడ అంబేడ్కర్ పేరు పెట్టినందుకు వచ్చిన ఆవేశం నీటి తుంపరల నుండి వచ్చిన అగ్నిచ్ఛట లాంటిది. కొన్నిసార్లు ఆవేశం అనర్థానికి దారి తీస్తుంది. ప్రతి ఆవేశం వెనుక కొన్ని రాజకీయ కారణాలుంటాయి. ఈ రాజకీయ కారణాలకు అతీతమైన వాడు అంబేడ్కర్. భారతదేశాన్ని కులరహిత సమాజంగా తీర్చిదిద్దాలనుకున్నవారు. సమాజ పరిణామంలో కులం ఇటీవల వచ్చింది. మళ్లీ అది పోతుంది. కుల భావనకు విరుగుడు జ్ఞానార్జనే అని అంబేడ్కర్ చెప్పారు. మను షులకు మనుషులు పుడతారనేది జ్ఞానం. కులాలకు మనుషులు పుట్టరనేదే తత్త్వం. మామూలు మనుషులు, ప్రతిభ లేని మనుషులు కులం పేరు చెప్పుకుని బతకాలని చూస్తారు. కులానికి అతీతమైన నామవాచకాలు ఇప్పుడు దేశానికి అవసరం. అంబేడ్కర్‌ను మహాత్మా గాంధీ ‘డాక్టర్’ అని పిలిచారు. ఆనాటి ప్రజా సమూహాలు అంబేడ్కర్‌ను ‘బాబా సాహెబ్’ అని పిలిచాయి. అంటే తండ్రి అని అర్థం. పెరియార్ రామస్వామి నాయకర్ అంబేడ్కర్‌ను ‘బాబా సాహెబ్’ అనే ప్రస్తావించారు. ఆయన భారతదేశానికి తండ్రి స్థాయికి బతికి ఉన్నప్పుడే ఎదిగారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ అంబేడ్కర్ మరణించినప్పుడు ‘భారత దేశ ధ్రువతార’ రాలిపోయిందని అన్నారు. అంబేడ్కర్ ఐదు లక్షల మందితో 1956 అక్టోబర్‌లో పూనాలో జరిపిన బౌద్ధ దీక్షకు కోనసీమ నుండి ఆ రోజుల్లోనే ప్రతినిధులు విస్తృతంగా హాజరయ్యారు. ఆయన అందరి మెదళ్లలో దీపాలు వెలిగిస్తూ వెళ్ళారు. కానీ మీరు భవంతులు తగలబెడుతున్నారు. తగలబడిన ప్రతి భవంతీ కొత్తరూపం తీసుకుంటుంది. అంబేడ్కర్ భావజాలంతో మీలో మార్పు రావాలి. నీకు తిరగబడే చైతన్యాన్నిచ్చిన వాడు కూడా ఆయనే అని ముందు గుర్తించాలి. భేదాభిప్రాయాల్ని సదభిప్రాయంగా మార్చు కోవడమే అంబేడ్కరిజం. సుప్రసిద్ధ నరవర్గ శాస్త్రవేత్తల ప్రకారం భారతదేశం క్రీస్తు పూర్వమే ఆర్యుల, ద్రావిడుల, మంగోలుల, సిథియన్ల, మూలవాసుల సమ్మిశ్రితం. అందుకే అంబేడ్కర్... భారతదేశంలో ప్రతి ఒక్కరూ సంకరం నుండి ఆవిర్భవించిన వారే అని చెప్పారు. నిర్దిష్ట కులం లేదని చెప్పారు. ఇప్పుడు కులాతీత జీవనంతో ఉన్న రాజకీయ నాయకులు, కులాంతర వివాహితులు, ఆర్థిక సంపన్నులు, లౌకిక భాషాభివ్యక్తులై ఉండి కూడా.. కులం పునాదుల మీద రాజకీయాలు నిర్మించాలనుకోవడం అపహాస్యమే! కులం మనిషిని సంకుచితుణ్ణి చేస్తుంది. కులం భావావేశాలను రెచ్చగొడుతుంది. దాని ఫలితమే ప్రస్తుతం కోనసీమలో నెలకొన్న పరిస్థితులు. (క్లిక్: మళ్లీ మొదటికొచ్చిన కశ్మీర్ సమస్య) భారత దేశ చరిత్రలో గానీ, సాహిత్యంలో గానీ 500 సంవత్సరాల పూర్వం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఆధిపత్య కులాలేమీ లేవు. అన్నీ ఆయా కాలాల్లో రూపొందిన కులాలే. ఇప్పుడు మనకు కావల్సింది అంబేడ్కర్ ప్రజాస్వామ్య లౌకికవాద ఆచరణ. ఆ స్ఫూర్తితోనే మనం ఆయన నామవాచకాన్ని బహుదా మననం చేసుకుంటున్నాం. కోనసీమకు అంబేడ్కర్ పేరు ఒక లేత సూర్య కాంతి. అంబేడ్కర్ పేరులో చైతన్య జ్వలనం ఉంది. అందుకే ఆ పేరు పాటలుగా, మాటలుగా, సూక్తులుగా, నిర్వచనాలుగా, జీవన గాథలుగా విస్తరిస్తోంది. అందుకే అంబేడ్కర్ పేరును ఆహ్వానిద్దాం! ఆకాశ నక్షత్రాలుగా వెలుగొందుదాం! (క్లిక్: కరోనా కాదు.. అసమానతే.. అసలు వైరస్!) - డాక్టర్ కత్తి పద్మారావు దళిత ఉద్యమ నిర్మాత -
పోలీసులు భోజనం చేస్తున్నారు.. టౌన్లోకి వచ్చేయండి
సాక్షి, అమరావతి: ‘పోలీసు వారు భోజనాలు చేస్తున్నారు. ఇదే మంచి సమయం అమలాపురం టౌన్లోకి రాడానికి..’ ఇది అమలాపురంలో అల్లరి మూకలు విధ్వంసకాడకు పాల్పడిన ఈ నెల 24న కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అయిన సందేశం. ‘కరెక్టుగా 3.10 నిమిషాలకే స్టార్ట్ యుద్ధం..’ ఆ వాట్సాప్ గ్రూపుల్లో మరో పోస్టు ఇది. అంతేకాదు.. ఏబీఎన్ చానల్లో ఆ ర్యాలీ, విధ్వంసానికి సంబంధించి లైవ్ వీడియో క్లిప్పింగులను కూడా ఎప్పటికప్పుడు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తూ అల్లరి మూకలను నడిపించారు. అమలాపురం విధ్వంసం వెనుక ఎంతటి పకడ్బందీ కుట్ర ఉందన్నది ఈ వాట్సాప్ సందేశాలు స్పష్టం చేస్తున్నాయి. టీడీపీ, జనసేన పార్టీల కనుసన్నల్లో అల్లర్లకు ఎంత పక్కాగా పన్నాగం పన్నారన్నది తేటతెల్లమవుతోంది. దీంతో విధ్వంసం వెనుక ఆ రెండు పార్టీల కుట్ర మరింతగా బట్టబయలవుతోంది. ఆ పార్టీలకు చెందిన ముఖ్యనేతలు రిమోట్ కంట్రోల్ ద్వారా నడిపించిన కుట్ర కథలో పాత్రధారులైన ఆ పార్టీ నేతలు, కార్యకర్తల వివరాలు ఆధారాలతోసహా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. విధ్వంసానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజీలు, వీడియో క్లిప్పింగులను పరిశీలించి దాదాపు 1,500 మందిని పోలీసులు ఇప్పటివరకు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీలు, వీడియో రికార్డింగులతోపాటు పోలీసు టెక్నాలజీ విభాగం నిందితులు, అనుమానితుల వాట్సాప్ సందేశాలు, కాల్‌డేటాలను పరిశీలిస్తుండగా విభ్రాంతికర వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కుట్ర వెనుక టీడీపీ, జనసేన పార్టీలు ఎంత పకడ్బందీగా కుట్రపన్నాయన్నది తెలుస్తోంది. వాట్సాప్ సందేశాలతో కుట్ర అమలాపురంలో దాడులకు ప్రేరేపించిన దాదాపు 15 వాట్సాప్ గ్రూపులను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ నెల 24న చలో కలెక్టరేట్ ర్యాలీ సందర్భంగా విధ్వంసం సృష్టించేందుకు ఇతర ప్రాంతాల్లో ఉన్న కీలక నేతలు ఎప్పటికప్పుడు కుట్ర రచించారన్నది స్పష్టమైంది. రిమోట్ కంట్రోల్ నేతలు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన సందేశాల ప్రకారం ఆ వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేస్తూ అల్ల్లర్లకు పన్నాగం పన్నారు. 3.10 గంటలకు విధ్వంసానికి పాల్పడాలని ఆ వాట్సాప్ గ్రూపుల ద్వారా అల్లరి మూకలను ముందుగానే సిద్ధం చేశారు. అంతేకాదు.. పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా దాదాపు 450 మందిని అదుపులోకి తీసుకున్నారు. అయినప్పటికీ బయట నుంచి రప్పించిన అల్లరి మూకలు అమలాపురంలో రహస్య ప్రదేశాల్లో మాటువేశాయి. ర్యాలీలో ఉన్న కుట్ర సూత్రధారులు మొత్తం పరిణామాలను పరిశీలిస్తూ ఆ అల్లరి మూకలతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉన్నారు. పోలీసులు మధ్యాహ్నం భోజనాలు చేస్తుండటాన్ని గుర్తించిన సూత్రధారులు వెంటనే అల్లరి మూకలకు సమాచారం అందించారు. ఆ సమయంలో అమలాపురంలోకి ప్రవేశించాలని చెప్పారు. అమలాపురంలో పరిస్థితిని బయట మాటేసి ఉన్న అల్లరి మూకలకు వివరించేందుకు ఏబీఎన్ టీవీ చానల్లో లైవ్ న్యూస్‌ను ఆధారంగా చేసుకున్నారు. ర్యాలీ సందర్భంగా పట్టణంలో వివిధచోట్ల పరిస్థితి, ఇతర అంశాలను ఆ చానల్ లైవ్ న్యూస్‌లో ఎప్పటికప్పుడు ప్రసారం చేసింది. కుట్ర సూత్రధారులు ఆ చానల్ ప్రసారం చేస్తున్న లైవ్ న్యూస్ వీడియో క్లిప్పింగులను కూడా వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ చేస్తూ వాటిపై.. పోలీసులు భోజనాలు చేస్తున్నారు వెంటనే టౌన్లోకి వచ్చేయండి అని సందేశాలు పెట్టడం గమనార్హం. ఆ పథకం ప్రకారమే అల్లరి మూకలు ఒక్కసారిగా చేతిలో పెట్రోల్ బాంబు సీసాలు, రాళ్లతో అమలాపురంలోకి చొరబడి విధ్వంసానికి తెగించాయి. బస్సులను దహనం చేసిన అనంతరం ముందస్తు కుట్రలో భాగంగానే మంత్రి విశ్వరూప్ క్యాంప్ కార్యాలయం, కొత్తగా నిర్మిస్తున్న నివాసంతోపాటు ఎమ్మెల్యే సతీష్ నివాసంపై దాడికి పాల్పడ్డాయి. ఈ కుట్రకు సంబంధించిన కీలక ఆధారాలను పోలీసులు గుర్తించడం ఈ కేసులో కీలక పరిణామం. ఇదిగో టీడీపీ, జనసేన నేతలు టీడీపీ, జనసేన పార్టీలకు చెందినవారు దగ్గరుండి అమలాపురంలో విధ్వంసాన్ని కొనసాగించారడానికి మరికొన్ని ఆధారాలను పోలీసులు సేకరించారు. ఆ రెండు పార్టీల నేతలు విధ్వంసంలో క్రియాశీలకంగా పాల్గొన్న ఫొటోలను పోలీసులు గుర్తించారు. టీడీపీకి చెందిన పితాని దుర్గాప్రసాద్, సంగడి ఆనందబాబు, జనసేన పార్టీకి చెందిన రాచకొండ శివకుమార్, గండ్రోతి చంద్రమౌళి, బండారు భాస్కరరాజేష్, భీమ్లా దుర్గాసాయి, అశెట్టి సాయిచంద్ర, పళ్ల ప్రభుదేవ్, యర్రంశెట్టి బాలాజీ, సుందరనీది సాధుబాలాజీ ఆ విధ్వంసకాండలో పాల్గొన్న ఫొటోలు, సీసీటీవీ ఫుటేజీ పోలీసులకు చిక్కాయి. రాళ్లు పట్టుకుని, రాళ్లు రువ్వుతూ.. క్రియాశీలకంగా వ్యవహరించినట్టు ఫొటోల్లో స్పష్టంగా తెలుస్తోంది. దీంతో అమలాపురంలో అల్లర్లకు టీడీపీ, జనసేన పార్టీలు ఎంత పకడ్బందీగా కుట్ర పన్నాయన్నది స్పష్టమైంది. అమలాపురం విధ్వంసంలో మరో 18 మంది అరెస్టు అమలాపురం టౌన్: కోనసీమ జిల్లాకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 24న అమలాపురంలో జరిగిన విధ్వంసకర ఘటనల్లో మరో 18 మంది నిందితులను ఆదివారం అరెస్టు చేసినట్టు ఏలూరు రేంజ్ డీఐజీ పాల్రాజు ఆదివారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపారు. వీరితో కలిపి ఈ కేసుల్లో ఇప్పటివరకు 62 మందిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. అమలాపురంలో జరిగిన వరుస అల్లర్లకు సంబంధించి మొత్తం ఏడు ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితులను గుర్తించేందుకు ఏడు, అరెస్టు చేసేందుకు ఏడు.. మొత్తం 14 ప్రత్యేక పోలీసు బృందాలను నియమించినట్లు పేర్కొన్నారు. ఆదివారం అరెస్టు చేసిన నిందితుల్ని ముమ్మిడివరం మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచామని, వారిని సోమవారం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలిస్తామని తెలిపారు. అల్లర్లలో పాల్గొన్న వారిని సైంటిఫిక్ ఎవిడెన్స్, సీసీ కెమెరా ఫుటేజీలు, సోషల్ మీడియా ఆధారంగా గుర్తిస్తున్నట్లు వివరించారు. కోనసీమ జిల్లాలో సెక్షన్ 144, 30 పోలీసు యాక్ట్ అమల్లో ఉన్నట్లు తెలిపారు. ఇంటర్నెట్ సేవల నిలిపివేత సోమవారమూ కొనసాగవచ్చన్నారు. -
‘అంబేడ్కర్ కోనసీమ జిల్లా’గానే కొనసాగించాలి
ఏయూ క్యాంపస్: కోనసీమకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆంధ్ర యూనివర్సిటీ ఆచార్యులు, మేధావులు కోరారు. విదేశాల్లో సైతం అంబేడ్కర్ విగ్రహాలు, సెంటర్లు పెడుతుంటే.. మన రాష్ట్రంలో మాత్రం అడ్డుకోవడం దారుణమన్నారు. శనివారం విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో నిర్వహించిన మేధావుల చర్చాగోష్టిలో ప్రొఫెసర్లు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. మాజీ ప్రిన్సిపాల్ ఆచార్య కె.శ్రీరామమూర్తి మాట్లాడుతూ.. అంబేడ్కర్ భావజాలాన్ని అర్థం చేసుకున్నవారు ఇలా విధ్వంసాలకు పాల్పడరన్నారు. సీఎం జగన్ దావోస్ పర్యటిస్తూ.. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువస్తున్న సమయంలో ఇలాంటి హింసాత్మక ఘటనలు జరగడం విచారకరమన్నారు. మహిళా విద్య కోసం అంబేడ్కర్ ఎనలేని కృషి చేశారని చెప్పారు. ఏయూ లా కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ డి.సూర్యప్రకాశరావు మాట్లాడుతూ.. కొలంబియా యూనివర్సిటీలో సైతం అంబేడ్కర్ కార్నర్ ఉందన్నారు. అంబేడ్కర్‌ను గౌరవించడమంటే.. మనల్ని మనం గౌరవించుకోవడమేనన్నారు. ఉత్తరాంధ్ర కాపు సంఘం అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ఠాగూర్ మాట్లాడుతూ.. సమాజ శ్రేయస్సును ఆకాంక్షించే అంబేడ్కర్ పేరును కోనసీమ జిల్లాకు పెట్టడం స్వాగతించాల్సిన అంశమన్నారు. సమావేశంలో పాలకమండలి సభ్యులు ఆచార్య జేమ్స్ స్టీఫెన్, ఆచార్యులు డి.వి.ఆర్ మూర్తి, కె.పల్లవి, కె.విశ్వేశ్వరరావు, చల్లా రామకృష్ణ, ఎన్.విజయమోహన్, డాక్టర్ జి.రవికుమార్, రెక్టార్ కె.సమత, ప్రిన్సిపాల్స్ పి.రాజేంద్ర కర్మార్కర్, టి.శోభశ్రీ, డీన్లు ఆచార్య ఎన్.సత్యనారాయణ, టి.షారోన్ రాజు, పాల్ తదితరులు పాల్గొన్నారు. -
అంబేడ్కర్ పేరును వ్యతిరేకించడం దారుణం
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): కోనసీమ జిల్లాకు పెట్టిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరును వ్యతిరేకించడం దారుణమని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మండిపడ్డారు. గురువారం గుంటూరులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద మాలమహానాడు, దళిత, బహుజన, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇతర జిల్లాలకు పేర్లు పెట్టినప్పుడు రాని అభ్యంతరం.. కోనసీమకు అంబేడ్కర్ పేరు పెట్టినందుకు రావడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం కోనసీమకు అంబేడ్కర్ పేరును కొనసాగించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే మస్తాన్‌వలి మాట్లాడుతూ ప్రపంచ మేధావి పేరును వ్యతిరేకించడం సరికాదన్నారు. మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ల అరుణ్‌కుమార్ మాట్లాడుతూ డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగానే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ 5న చలో అమలాపురానికి పిలుపునిచ్చినట్లు తెలిపారు. బీజేపీ నేతలు అంబేడ్కర్‌ను చులకన చేసి మాట్లాడుతున్నారని, ఇందుకు సోము వీర్రాజు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రెడ్డి జనసేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు కె.అంజనీశ్రీకాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు, వివిధ సంఘాల నేతలు పాల్గొన్నారు. -
కోనసీమ ప్రశాంతం
అమలాపురం నుంచి సాక్షి ప్రతినిధి: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జిల్లాగా పేరు పెట్టడాన్ని వ్యతిరేకించిన విధ్వంసకారుల దుశ్చర్యలతో అట్టుడికిన కోనసీమలో బుధవారం ప్రశాంత వాతావరణం నెలకొంది. జిల్లాలో పెద్దఎత్తున మోహరించిన పోలీసు బలగాలు పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తెచ్చాయి. దీంతో మంగళవారం నాటి విధ్వంసం తర్వాత 24 గంటల్లోపల సాధారణ పరిస్థితులు నెలకొని జనజీవనం యథావిధిగా సాగుతోంది. కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం సహా పరిసర ప్రాంతాల్లో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చింది. మంగళవారం రాత్రి నుంచి నిలిపివేసిన ఆర్టీసీ బస్సులను బుధవారం ఉదయం 11 గంటల సమయంలో పునరుద్ధరించారు. అమలాపురంలో వ్యాపార లావాదేవీలతో పాటు, ఇంటర్, డిగ్రీ పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరిగాయి. చలో రావులపాలెం పిలుపు ఉందని, ఆందోళనకారులు మళ్లీ అటు వైపు ర్యాలీగా వెళ్లనున్నారనే పుకార్లు సామాజిక మాధ్యమాలలో ప్రచారం అయ్యాయి. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కాగా, ప్రజల భయాందోళనల నేపథ్యంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. పట్టణంలోకి వస్తున్న యువకుల వివరాలు అడిగి వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు దుండగుల కోసం జల్లెడ.. విధ్వంసానికి పాల్పడ్డ దుండగులను పట్టుకునేందుకు క్షేత్ర స్థాయిలో పోలీసులు జల్లెడ పడుతున్నారు. మంగళవారం నాటి దుశ్చర్యలకు పాల్పడ్డ వారిపై ఉక్కుపాదం మోపేందుకు పోలీసు యంత్రాంగం గాలింపు చర్యలు చేపట్టింది. ఈ ఘటనలను ప్రభుత్వం తీవ్రంగా తీసుకుంది. దుండగులను గుర్తించేందుకు ఎనిమిది పోలీసు బృందాలను రంగంలోకి దింపారు. ఘటనలు జరిగిన ప్రాంతాల్లో లభ్యమైన సీసీటీవీ ఫుటేజీలు, సోషల్ మీడియాలో వచ్చిన వీడియో క్లిప్పింగ్‌లు, ఫొటోల ఆధారంగా దుండగులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఇందుకోసం అమలాపురం ఎస్పీ కార్యాలయంలో సుమారు 50 మంది పోలీసులతో ప్రత్యేకంగా ఒక సెల్‌ను ఏర్పాటు చేశారు. సంఘటనలకు సంబంధించి ప్రత్యక్ష సాక్షుల ద్వారా సేకరించిన సమాచారం మేరకు పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితులపై కుట్ర పూరితంగా అల్లర్లు సృష్టించడం ద్వారా అశాంతికి కారణమవ్వడం, పెట్రోలు డబ్బాలతో విధ్వంస రచన, హత్యాయత్నం, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల దగ్ధం, 144, 30 సెక్షన్ల ఉల్లంఘన తదితర 12 సెక్షన్లతో ప్రాథమికంగా కేసులు నమోదు చేశారు. ఇప్పటికే ఉద్యమానికి తొలుత పిలుపునిచ్చిన కోనసీమ పరిరక్షణ సమితి ప్రతినిధి ఎర్రమిల్లి నాగసుధకొండ సహా ఆరుగురు పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ నెల 20న జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టవద్దంటూ చేపట్టిన ఆందోళనలో అమలాపురం కలెక్టరేట్ వద్ద ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంటానని హల్చల్ చేసిన అన్యం సాయి సహా పదిమందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు ఆందోళనలో పాల్గొన్న 320 మందిపై కేసులు నమోదయ్యాయి. దర్యాప్తు కొనసాగే కొద్దీ ఈ సంఖ్య వేలల్లోకి వెళ్లే అవకాశం ఉందని పోలీసు అధికారులు చెబుతున్నారు. పరిస్థితిని సమీక్షిస్తున్న పోలీసు ఉన్నతాధికారులు రాష్ట్ర అదనపు డీజీపీ శంకర్‌బక్షి, ఏలూరు రేంజ్ డీఐజీ జి.పాలరాజు, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీలు ఎం.రవీంద్రనాథ్‌బాబు, ఐశ్యర్య రస్తోగి, ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్ విశాల్‌గున్నీ తదితర పోలీసు ఉన్నతాధికారులు అమలాపురంలో మకాం వేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అమలాపురం పట్టణం నలువైపులా పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసి వచ్చిపోయే వాహనాలను నిశితంగా తనిఖీ చేస్తున్నారు. అనుమానిత యువకులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఘటనలు చోటు చేసుకున్న ఎర్రవంతెన, నల్లవంతెన, కలెక్టరేట్, మంత్రి, ఎమ్మెల్యే ఇళ్ల వద్ద అదనపు బలగాలతో కాపలా కాస్తున్నారు. ఆందోళనకారులు నిప్పుపెట్టిన రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, పొన్నాడ సతీశ్ కుమార్ ఇళ్లను పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు. సంఘటన జరిగిన తీరు, ఆ సమయంలో అక్కడ నెలకొన్న పరిస్థితులు, జరిగిన నష్టంపై పోలీసు అధికారులు స్థానికులను విచారించారు. విధ్వంసంతో బెంబేలెత్తిపోయిన కోనసీమ ప్రజలకు మనోధైర్యం కల్పించే దిశగా సివిల్, ఏపీఎస్పీకి చెందిన 22 బెటాలియన్ల పోలీసులు అమలాపురం పట్టణంలో కవాతు నిర్వహించారు. ఆందోళనకారుల రాళ్ల దాడిలో గాయపడి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న జిల్లా ఎస్పీ కేఎస్ఎస్వీ సుబ్బారెడ్డి, డీఎస్పీ రవిప్రకాష్, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇనస్పెక్టర్లతో కలిపి మొత్తం 30 మంది పోలీసులు కోలుకుంటున్నారు. -
‘కోన’లో కుట్ర కోణం!
సాక్షి, అమరావతి: కోనసీమలో విధ్వంసం వెనుక కుట్ర కోణం బట్టబయలవుతోంది. అమలాపురంలో ర్యాలీని అసాంఘిక శక్తులు హైజాక్ చేసి అల్లర్లకు పాల్పడటం వెనుక కొన్ని రాజకీయ శక్తుల ముందస్తు కుట్ర దాగి ఉన్నట్లు తేటతెల్లమవుతోంది. కోనసీమ పరిరక్షణ సమితి ముసుగులో టీడీపీ, జనసేన కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలే ఈ కుట్రలో పాలు పంచుకున్నారని పోలీసులు ప్రాథమికంగా గుర్తించినట్లు విశ్వసనీయ సమాచారం. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఇటీవలే డిమాండ్ చేయగా.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన పార్టీ నేతలతో ఈమేరకు ఏకంగా దీక్షలు కూడా చేయించారు.మరోవైపు ఇందుకు విరుద్ధంగా అమలాపురంలో అల్లర్లకు పాల్పడేలా టీడీపీ, జనసేన శ్రేణులను ఆ పార్టీల అధినేతలు ఉసిగొల్పడంపై సామాజికవేత్తలు, మేధావులు, రాజకీయ విశ్లేషకులు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఫుటేజీలు, క్లిప్పింగుల పరిశీలన అమలాపురంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చిన పోలీసు శాఖ ఈ విధ్వంసం వెనుక కుట్ర కోణంపై దర్యాప్తును ముమ్మరం చేసింది. ముందస్తు చర్యల్లో భాగంగా మంగళవారం 46మందిని అదుపులోకి తీసుకున్నారు. సీసీ టీవీ ఫుటేజీలు, వీడియో క్లిప్పింగుల ఆధారంగా విధ్వంసానికి పాల్పడిన వారిని గుర్తించే ప్రక్రియ చేపట్టారు. దాడుల్లో ప్రత్యక్షంగా పాల్గొని విధ్వంసం సృష్టించిన 72 మందిని ఇప్పటివరకు గుర్తించారు. వారిలో 12 మందిని తాజాగా అదుపులోకి తీసుకున్నారు. కోనసీమతోపాటు పొరుగు జిల్లాల్లో రౌడీషీటర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో విస్మయకర అంశాలు వెలుగు చూస్తున్నట్లు తెలుస్తోంది. అసాంఘిక శక్తులు పక్కా పన్నాగంతోనే కుట్రను అమలు చేశాయి. ఎర్రవంతెన వద్ద బస్సులు దగ్ధమైన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న అడిషనల్ డీజీపీ శంకర్ భక్షీ, ఇతర పోలీసు అధికారులు టీడీపీ, జనసేన నేతల పనే! ► అమలాపురంలో విధ్వంసం వెనుక టీడీపీ, జనసేన నేతల ప్రమేయం ఉందని పోలీసుల దర్యాప్తుల్లో ప్రాథమికంగా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. హింసకు పాల్పడి తిరిగి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేలా రెండు పార్టీలకు చెందిన నేతలు పథకం రచించారు. ► విధ్వంసానికి పాల్పడినట్లు గుర్తించిన 72 మందిలో ఇప్పటివరకు 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 9 మంది జనసేన, ఇద్దరు టీడీపీకి చెందిన వారున్నారు. ఒకరు మాత్రం ఏ పార్టీతోనూ సంబంధంలేని యువకుడని పోలీసుల దర్యాప్తులో తేలినట్లు సమాచారం. ► హింసకు పాల్పడినట్లు గుర్తించిన వారిలో 60 మంది పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. జనసేన, టీడీపీతో అనుబంధం ఉన్నవారే వీరిలో ఎక్కువగా ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ► ఇటీవల మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు వ్యతిరేకంగా ఆందోళనలకు నేతృత్వం వహించిన ఓ నేత అమలాపురం అల్లర్ల వెనుక కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. తనను తాను తటస్థుడినని చెప్పుకునే ఆయన టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తారన్నది బహిరంగ రహస్యమే. ర్యాలీకి జనసమీకరణ, అవసరమైన సామగ్రి సమకూర్చడం, ర్యాలీలో ఎవరు ముందుండాలి? ఎప్పుడు, ఏ దిశగా తీసుకువెళ్లాలి? అనే అంశాలను మరికొందరితో కలసి నిర్దేశించినట్లు తెలుస్తోంది. దాడుల్లో పాల్గొన్న కొందరిని పోలీసులు విచారించగా ఆ నేత పేరు వెల్లడించినట్లు సమాచారం. ► అక్కడకు అత్యంత సమీపంలో ఉన్న ఉన్న మాజీ హోంమంత్రి, పెద్దాపురం టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, టీడీపీ మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు నివాసాల వైపు రౌడీమూకలు కన్నెత్తి కూడా చూడలేదు. ► అల్లర్ల వెనుక ప్రతిపక్ష పార్టీలు పక్కా ప్రణాళికతో వ్యవహరించాయన్నది స్పష్టమవుతోంది. పోలీసులు అదుపులోకి తీసుకున్న జనసేన కార్యకర్త అన్యం సాయి తీరే దీనికి నిదర్శనం. కోనసీమ జిల్లాకు బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టడానికి వ్యతిరేకంగా మూడు రోజుల క్రితం జరిగిన కలెక్టరేట్ ముట్టడి సందర్భంగా అతడు ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించాడు. నిందితుడు ఉద్దేశపూర్వకంగానే వైఎస్సార్సీపీ నేతలతో కలసి ఫొటోలు దిగి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. వైఎస్సార్సీపీతో అతడికి ఎలాంటి సంబంధం లేనప్పటికీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందుకు పక్కా ప్రణాళికతో వ్యవహరించినట్లు స్పష్టమైంది. వాస్తవానికి అన్యం సాయి జనసేనలో క్రియాశీల కార్యకర్త. పవన్ కల్యాణ్ పర్యటనలో సైతం పాల్గొన్నాడు. పవన్ కల్యాణ్‌తోపాటు నాగబాబు, నాదెండ్ల మనోహర్‌తో జనసేన కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ► కుట్రలో పాత్రధారులే కాకుండా తెరవెనుక సూత్రధారులపై కూడా పోలీసులు దృష్టి సారించారు. వీరిలో కొందరు సోషల్ మీడియాలో పోస్టులు డిలీట్ చేసినట్లు గుర్తించారు. మొబైల్ టెక్నాలజీ సహకారంతో వాటిని వెలికి తీయనున్నారు. కీలక అనుమానితుల కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు. కనుసైగతో విధ్వంసం అసాంఘిక శక్తులు కొద్ది రోజులుగా కుట్రకు పదును పెట్టాయి. శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తామంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన కోనసీమ పరిరక్షణ సమితి భారీగా యువతను తరలించింది. ర్యాలీలో చొరబడ్డ ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు సరిగ్గా మధ్యాహ్నం 3 గంటల సమయంలో కుట్రను అమలు చేశాయి. పెద్ద సంఖ్యలో రౌడీషీటర్లు, అసాంఘిక శక్తులు పెట్రోల్ బాటిళ్లు, డబ్బాలు, రాళ్లు, సోడాబుడ్లతో అమలాపురం వీధుల్లో, సందుల్లో మాటేశాయి. ర్యాలీలో ముందు భాగంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలకు చెందిన ద్వితీయశ్రేణి నేతలు సైగ చేయగానే ఒక్కసారిగా చొరబడి బీభత్సం సృష్టించాయి. నినాదాలు చేస్తూ ప్రణాళిక ప్రకారం యువకులను దారి మళ్లించాయి. ఏమాత్రం జాప్యం జరిగినా.. బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్న శక్తులు ప్రభుత్వంపై దుష్ప్రచారానికి ఈ ర్యాలీని వేదికగా మార్చుకున్నాయి. దళిత, బీసీ వర్గాలకు చెందిన మంత్రి పినిపె విశ్వరూప్, వైఎస్సార్సీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు, ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ను అసాంఘిక శక్తులు లక్ష్యంగా చేసుకుని ర్యాలీని వారి నివాసాల వైపు మళ్లించాయి. అందుకు రెండు రోజులుగా పక్కా పన్నాగం పన్నినట్టు పోలీసులు గుర్తించారు. ర్యాలీలో చొరబడ్డ రౌడీషీటర్లు అమలాపురంలోని ఎర్రవంతెన వైపు యువకులను పరుగులు తీయించారు. మార్గమధ్యంలో మూడు బస్సులను దగ్ధం చేసి రౌడీమూకలు అటు చేరుకున్నాయి. పెట్రోల్ బాటిళ్లు ఇంట్లోకి విసిరి నిప్పు పెట్టాయి. అనంతరం మంత్రి విశ్వరూప్ కొత్తగా నిర్మిస్తున్న ఇంటిని లక్ష్యంగా చేసుకుని అటువైపు కదిలాయి. ఆ ఇంటికి కూడా నిప్పంటించి విధ్వంసానికి పాల్పడ్డాయి. కుట్రలో తరువాత ఘట్టంగా ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంటిపైకి దండెత్తాయి. ఎమ్మెల్యే సతీష్ కుటుంబ సభ్యులతో సహా మొదటి అంతస్తులోగా ఉండగా గ్రౌండ్ ఫ్లో్లర్లోని ఆయన కార్యాలయాన్ని తగలబెట్టారు. రెండో అంతస్తుకు కూడా మంటలు వ్యాపించేసరికి పోలీసులు అతికష్టం మీద ఎమ్మెల్యే సతీష్, ఆయన కుటుంబ సభ్యులను అక్కడి నుంచి తరలించారు. కుటుంబ సభ్యులతో ఎమ్మెల్యే సతీష్ ఇంట్లో ఉన్నట్లు తెలుసుకునే దాడికి దిగారు. పోలీసులు తక్షణం అప్రమత్తం కాకుంటే ఘోరం జరిగిపోయేదని ప్రత్యక్ష సాక్షులు పేర్కొనడం గమనార్హం. ఎమ్మెల్యేను అంతమొందించే లక్ష్యంతోనే పెట్రోల్ బాటిళ్లు విసిరేశారని దర్యాప్తులో గుర్తించినట్టు సమాచారం. దేశవ్యాప్తంగా మహనీయుడి పేరు ► రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరును దేశవ్యాప్తంగా> ఎన్నో ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు, ఆస్పత్రులు, విమానాశ్రయాలు, జిల్లాలకు పెట్టారని సామాజికవేత్తలు, మేధావులు, రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్ జిల్లాలో ఓ డివిజన్‌ను విభజించి 1995 సెప్టెంబరు 29న అంబేడ్కర్‌నగర్ జిల్లాగా పేరు పెడితే ఆ ప్రాంత ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ► జిల్లాల పునర్ వ్యవస్థీకరణ సమయంలో స్థానికులతో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ సహా ప్రతిపక్షాలు డిమాండ్ చేసిన మేరకు కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెడుతూ ఈనెల 18న ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అంటే అన్ని వర్గాల ఏకాభిప్రాయంతోనే కోనసీమకు అంబేడ్కర్ పేరు పెట్టినట్లు స్పష్టమవుతోంది. దిగజారుడుకు పరాకాష్ట.. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆపార్టీ శ్రేణులతో దీక్షలు చేయించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సైతం ఇటీవల కాకినాడ జిల్లా తాళ్లరేవు పర్యటన సందర్భంగా కోనసీమకు అంబేడ్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు వారిద్దరూ రెండు నాలుకల ధోరణితో వ్యవహరించడం దిగజారుడుకు పరాకాష్టగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. అన్ని వర్గాలు అభిమానించే అంబేడ్కర్‌ను ఓ కులానికి పరిమితం చేసే కుట్రకు టీడీపీ, జనసేనలు పాల్పడ్డాయని మండిపడుతున్నారు. మంగళవారం మంటల్లో కాలిపోతున్న బస్సు ప్రజాస్వామ్యం అపహాస్యం.. ప్రజాస్వామ్యంలో అధికారపక్షానికి ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్షాలకు అంతే బాధ్యత ఉంటుంది. అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీల డిమాండ్ల మేరకే కోనసీమకు అంబేడ్కర్ పేరును ప్రభుత్వం పెట్టింది. దీనిపై ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే ఆయా వర్గాలకు చెందిన నేతలు అంబేడ్కర్ గొప్పతనాన్ని వివరించి చైతన్యం చేయాలన్సిన బాధ్యత ఉంటుంది. ప్రతిపక్ష టీడీపీ, జనసేన మాత్రం తమ శ్రేణులను పురిగొల్పి విధ్వంసం సృష్టించి హింసకు పాల్పడటం ద్వారా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు. -
అన్ని పక్షాలు కోరాకే పేరు మార్పు
సాక్షి, అమలాపురం: ‘రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు కోరాకనే కోనసీమ జిల్లా పేరు మార్పునకు ప్రభుత్వం డ్రాఫ్ట్రు నోటిఫికేషన్ విడుదల చేసిందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. అమలాపురం క్షత్రియ కళ్యాణ మండపంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా ముఖ్యమంత్రి జగన్ నేరుగా ప్రకటించలేదని, మార్పు చేయాలని అన్ని పార్టీలు విస్తృతంగా డిమాండ్ చేశాయన్నారు. అంబేడ్కర్ పేరు పెట్టాలని జనసేన డిమాండ్ చేసిందని, పేరు మార్పును బీజేపీ ఆహ్వానించిందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రాన్ని, విభజన తర్వాత రాష్ట్రాన్ని 14 ఏళ్ల పాటు పాలించిన ప్రతిపక్ష నేత చంద్రబాబు తాళ్లరేవులో జరిగిన సమావేశంలో అంబేడ్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని పేరు ప్రకటించిన విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. పేరు మార్పు మీద అభ్యంతరం ఉంటే కలెక్టర్, ఆర్డీవోలకు చెప్పుకొనే స్వేచ్ఛ అందరికీ ఉందన్నారు. శాంతి భద్రతలు దృష్టిలో పెట్టుకుని ఏ విధమైన కవ్వింపు చర్యలు చేపట్టవద్దని, ర్యాలీలు, ధర్నాలు చేయకుండా ఇక్కడి ప్రత్యేకతను కాపాడాలని మంత్రి విశ్వరూప్ కోరారు. -
కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు
సాక్షి, అమరావతి/అమలాపురం టౌన్/రాజమహేంద్రవరం సిటీ: కోనసీమ జిల్లా పేరును రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా మార్చింది. ఇటీవల జిల్లాల పునర్వ్యస్థీకరణలో అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం కోనసీమ జిల్లాగా ఏర్పాటైంది. తూర్పుగోదావరి జిల్లా నుంచి అమలాపురం ప్రాంతాన్ని వేరుచేసి ప్రత్యేక జిల్లాగా ఏర్పాటుచేసి దానికి కోనసీమ పేరు పెట్టారు. ఈ జిల్లాకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాలని ప్రభుత్వానికి పెద్దఎత్తున వినతులు వచ్చాయి. రాజ్యాంగ రూపశిల్పి అంబేడ్కర్‌ను గౌరవించేలా ఆయన పేరును కోనసీమ జిల్లాకు పెట్టాలని ప్రజల నుంచి విజ్ఞప్తులు రావడంతో ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు బుధవారం రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ ప్రాథమిక నోటిఫికేషన్ జారీచేశారు. దీనిపై కోనసీమ జిల్లా పరిధిలో నివసించేవారు 30 రోజుల్లోపు సూచనలు, అభ్యంతరాలు తెలపవచ్చని పేర్కొన్నారు. 9 మండలాలతో రేపల్లె రెవెన్యూ డివిజన్ రేపల్లె కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటును ప్రతిపాదిస్తూ ప్రభుత్వం మరో నోటిఫికేషన్ ఇచ్చింది. బాపట్ల జిల్లాలో ఇప్పటికే బాపట్ల, చీరాల రెవెన్యూ డివిజన్లు ఏర్పాటుచేయగా తాజాగా తొమ్మిది మండలాలతో రేపల్లె డివిజన్‌ను ఏర్పాటు చేసింది. రేపల్లె, నిజాంపట్నం, చెరుకుపల్లి, భట్టిప్రోలు, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు, నగరం మండలాలతో ఈ డివిజన్‌ను ప్రతిపాదించారు. ఈ మండలాలన్నీ ప్రస్తుతం బాపట్ల రెవెన్యూ డివిజన్లో ఉన్నాయి. వాటిని రేపల్లె డివిజన్‌లోకి మార్చారు. ప్రస్తుతం చీరాల డివిజన్లో ఉన్న పర్చూరు, మార్టూరు, యద్ధనపూడి మండలాలను బాపట్ల డివిజన్లో చేర్చారు. వీటిపై అభ్యంతరాలుంటే 30 రోజుల్లో బాపట్ల జిల్లా కలెక్టర్‌కు తెలపాలని నోటిఫికేషన్లో సూచించారు. మంత్రుల హర్షం కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా మార్చడంపై రాష్ట్ర మంత్రులు విశ్వరూప్, వేణు హర్షం వ్యక్తం చేశారు. అమలాపురంలో మంత్రి విశ్వరూప్ ‘సాక్షి’తో మాట్లాడుతూ రాష్ట్రంలోని దళితుల మనోభావాలను గుర్తించి ముఖ్యమంత్రి జగన్ ఈ నిర్ణయం తీసుకోవడం హర్షణీయమన్నారు. మంత్రి వేణు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మాట్లాడుతూ సీఎం కోనసీమ జిల్లా ప్రజల మనోభావాలు గుర్తించి జిల్లా పేరు మార్చటం సంతోషకరమన్నారు. -
AP: కోనసీమ జిల్లా పేరు మార్పు
-
AP: కోనసీమ జిల్లా పేరు మార్పు
Konaseema District.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోనసీమ జిల్లా పేరును మార్చింది. జిల్లాను పేరును డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చుతున్నట్టు నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం కోనసీమ జిల్లా పేరును బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా మార్పు చేస్తూ ప్రాథమిక నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీ చేసింది. పేరు మార్పుపై ఏవైనా అభ్యంతరాలు, సూచనలు ఉంటే 30 రోజుల్లోగా తెలపాలని ప్రభుత్వం కోరింది. సూచనలు, సలహాలను జిల్లా కలెక్టర్‌కు తెలపాలని పేర్కొంటూ నోటిఫికేషన్ జారీ చేసింది. -
సరిగ్గా అమలు చేసివుంటే...
భారత ఉపఖండంలో పుట్టి ప్రపంచ మానవాళి కంతటికీ దుఃఖనివారణోషధి నందించిన మొట్ట మొదటి తాత్వికుడు బోధిసత్వుడు. ఆయనను గురువుగా భావించి తన జీవితాన్ని అణగారిన జాతుల అభ్యున్నతికి అంకితం చేసిన వారు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్. మన దేశంలో చాలామంది రాజకీయ నాయకులు అంబేడ్కర్ పేరును తమతమ రాజకీయ ప్రయోజనాలకే ఉపయోగించుకుంటున్నారు కానీ చిత్తశుద్ధితో ఆయన ఆశయాలను నెరవేర్చడం లేదు. ఇటువంటి సమయంలో ఐక్యరాజ్యసమితి మాత్రం ఆయన జన్మదినాన్ని ‘విశ్వశ్రేయస్సు’ దినంగా ప్రపంచమంతా జరుపుకోవాలని పిలుపు నివ్వడం మనందరికీ గర్వకారణం. వందలాది దేశాల రాజ్యాంగాలు క్షుణ్ణంగా చదివి జీర్ణించుకొని, దేశ దేశాల చరిత్రలను అవగాహన చేసుకొని, భారతీయాత్మను ఆవహింప జేసుకొని అద్భుతమైన రాజ్యాంగాన్ని రాశారు అంబేడ్కర్. ఈ రాజ్యాంగం భిన్న మతాలూ, భాషలూ, సంస్కృతులూ కలిగిన భారతదేశాన్ని ఐక్యం చేసింది. నోరులేని వారు కూడా స్వేచ్ఛగా తమ భావాలను వ్యక్తీకరించడానికి భావప్రకటనా స్వేచ్ఛ నిచ్చింది. ప్రతి మనిషీ తనకు ఇష్టమున్న రీతిలో జీవించడానికి మతస్వేచ్ఛ నిచ్చింది. వివిధ మత విశ్వాసాలను గౌరవిస్తూనే లౌకికత్వాన్ని అనుసరించాలని నిర్దేశించింది. నిరక్షరాస్యులై విద్యా గంధానికి దూరంగా ఉన్న భారతీయులందరికీ విద్యాహక్కునిచ్చింది. రాష్ట్రాలు, కేంద్రం మధ్య సత్సంబంధాలు ఉండేలా సమాఖ్య రాజ్యంగా భారత్‌ను ప్రకటించింది. ప్రతి రాష్ట్రం కేంద్ర సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తూనే... తమతమ రాష్ట్రాలను తమదైన పద్ధతిలో అభివృద్ధి చేసుకునే స్వేచ్ఛ దీని వల్ల లభించింది. యుగాలుగా అణచివేతకు గురైన భారతీయ మహిళకు అన్ని విధాలా అభివృద్ధి చెందే హక్కులు ప్రసాదించింది రాజ్యాంగం. వర్ణవ్యవస్థ వల్ల దేశ ప్రజల్లో ఏర్పడిన సామాజిక, ఆర్థిక అసమానతలను రూపుమాపడానికి స్టేట్ సోషలిజం కావాలని చెప్పింది. ప్రభుత్వరంగం బలోపేతం కావాలని పేర్కొంది. అసమానతలను, అంతరాలను తగ్గించడానికి బలహీన కులాల వారికి విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లను పొందుపరిచింది. ప్రభుత్వరంగ ప్రాజెక్టులను, కర్మాగారాలను, విశ్వ విద్యాలయాలను ప్రోత్సహించింది. ఎలా చూసినా భారత రాజ్యాంగం సమగ్రమైనది. అవసరమైన సవరణలు చేయడానికి వీలుకలిగింది కూడా. ఇటు వంటి రాజ్యాంగాన్ని మార్చాలనడం సరికాదు. (క్లిక్: మలి అంబేడ్కరిజమే మేలు!) కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని సరిగ్గా అమలు చేసి ఉంటే దేశంలో ఇప్పుడున్న చాలా సమస్యలు పరిష్కారమయ్యుండేవి. సామాజిక, ఆర్థిక అంతరాలు, కుల మత భావనలు ఈ స్థాయిలో ఉండేవి కావు. ఫెడరల్ స్ఫూర్తి, లౌకిక భావన, స్టేట్ సోషలిజం భావనలు పేరుకు మాత్రమే మిగిలిపోయేవి కాదు. (క్లిక్: లెక్కల్లో లేదు వాస్తవంలో ఉంది) - డాక్టర్ కాలువ మల్లయ్య వ్యాసకర్త సాహితీవేత్త -
‘అంబేడ్కర్ దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించారు’
సాక్షి, హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించారని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఉద్ఘాటించారు. భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అసెంబ్లీ ఆవరణలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. దేశంలో సమానత్వం పెంపొందించి, ప్రజల అభ్యున్నతికి అంబేడ్కర్ కృషి చేశారని, ఆయన ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు లాభం చేకూర్చేవిధంగా, అంబేడ్కర్ ఆశయాలకు, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పని చేస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎం.ఎస్.ప్రభాకర్ రావు, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, వీజీ గౌడ్, గరపు దయానంద్, జనార్ధన్ రెడ్డి, తెలంగాణ లెజిస్లేచర్ సెక్రెటరీ డా.నరసింహాచార్యులు, టిఆర్ఎస్ఎల్పీ కార్యదర్శి రమేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాస్వామ్య రూపశిల్పి అంబేడ్కర్
సాక్షి, హైదరాబాద్: మనదేశం అత్యుత్తమ ప్రజాస్వామ్య వ్యవస్థగా రూపుదిద్దుకోవడంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ది అత్యంత కీలక పాత్ర అని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ అన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యు న్నతి కోసం, వారి హక్కుల కోసం అంబేద్కర్ అహర్నిశలు శ్రమించారన్నారు. రాష్ట్ర బార్ కౌన్సిల్, హైకోర్టు న్యాయవాదుల సంఘం సంయుక్తంగా గురువారం నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దళిత కుటుంబం నుంచి వచ్చి అత్యున్నత శిఖరాలకు చేరారని, ఆయన జీవి తం పౌరులందరికీ ఆదర్శప్రాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ నందా, రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసా ద్, బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ.నర్సింహారెడ్డి, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్య క్షుడు పొన్నం అశోక్ గౌడ్ ప్రసంగించారు. -
ప్రపంచంలో ఉన్నవి ‘రెండే’ కులాలు.. కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్యాంక్‌బండ్ దగ్గర పీవీ మార్గ్‌లో 125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహం నిర్మాణ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి విగ్రహా నిర్మాణం పూర్తి కానున్నట్టు తెలిపారు. ఇక్కడ పర్యాటక రంగాన్ని ఆకర్షించేలా మ్యూజియం కూడా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అనంతరం.. కేటీఆర్ మరోసారి బీజేపీ పార్టీపై విరుచుకుపడ్డారు. ఏం తినాలో కూడా బీజేపీనే చెబుతోందని విమర్శించారు. దళితులపై కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. దళితబంధుకు రూ. 17,700 కోట్లు కేటాయించాం. టాలెంట్ ఎవరి అబ్బసొత్తు కాదు. ప్రపంచంలో రెండు కులాలు.. డబ్బు ఉన్నవారు.. డబ్బు లేని వారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేవుడి అందర్నీ సామానంగానే పుట్టించాడు. కులం, ఉప కులం, మతం అనేవి మనమే సృష్టించుకున్నామని అన్నారు. Live: Speaking at the 131st Birth Anniversary celebrations of Bharat Ratna Dr. B.R. Ambedkar https://t.co/ZaSQcvNoQy — KTR (@KTRTRS) April 13, 2022 -
గద్వాల జిల్లా ఇర్కిచేడులో 144 సెక్షన్
గద్వాల రూరల్/ కేటీదొడ్డి: బీఆర్ అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుపై రాజుకున్న వివాదం.. చివరికి విగ్రహానికి నిప్పుపెట్టడంతో పాటు ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకునే వరకు వెళ్లింది. దీంతో గ్రామంలో ఏప్రిల్ 6 వరకు 144 సెక్షన్‌ను విధించారు. జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం ఇర్కిచేడులో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుకు ఒక వర్గం వారు నిర్ణయించి తహసీల్దార్ వద్ద అనుమతి పొందారు. సదరు స్థలం అప్పటికే నీలమ్మ అనే మహిళ కబ్జాలో ఉంది. గురువారం ఆ స్థలంలో విగ్రహాన్ని పెట్టేందుకు యత్నించగా నీలమ్మ, ఆమె కుటుంబీకులు ఆత్మహత్య చేసుకుంటామని అడ్డుకున్నారు. దీంతో విగ్రహాన్ని రోడ్డు మధ్యలో పెట్టేందుకు యత్నించగా గ్రామానికి చెందిన మరోవర్గం వారు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పటికే ఆత్మహత్య చేసుకుంటానని వెంట తెచ్చుకున్న పెట్రోల్ సీసాలను విగ్రహం పరిసర ప్రాంతంలో పడేశారు. పోలీసులు అక్కడి నుంచి వారిని చెదరగొట్టే ప్రయత్నం చేయగా గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ పోసిన చోట నిప్పు అంటించారు. దీంతో మంటలు చెలరేగి పక్కనే ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి, ఎస్సై కురుమయ్య కాలికి అంటుకున్నాయి. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి విగ్రహాన్ని తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. విషయం తెలుసుకొని కర్ణాటకలోని రాయచూరు, ఇర్కిచేడు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అంబేడ్కర్‌వాదులు భారీ సంఖ్యలో గ్రామానికి చేరుకోవడంతో మళ్లీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించగా ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. స్పెషల్ పార్టీ పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఎస్పీ రంజన్ రతన్‌కుమార్ ఇర్కిచేడును సందర్శించి ఏప్రిల్ 6 వరకు గ్రామంలో 144 సెక్షన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. -
అంబేడ్కర్ స్థాయిని తగ్గిస్తారా?
ఒంగోలు: చంద్రబాబు వ్యాఖ్యలు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అభిమానులైన ప్రతి ఒక్కరికీ ఆగ్రహాన్ని కలిగించేలా ఉన్నాయని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక విష్ణుప్రియ ఫంక్షన్ హాల్లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ ద్వారా ముఖ్యమంత్రి అయినా.. ఎన్టీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచేలా చేయడంలో చంద్రబాబు విఫలమయ్యారని విమర్శించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని చంద్రబాబు తప్పుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జాతీయ స్థాయి నాయకుడైతే జిల్లాకు ఎలా పేరు పెడతారంటూనే.. మరోవైపు అంబేడ్కర్ పేరుతో జిల్లా నామకరణం జరగాలని డిమాండ్ చేయడం దారుణమన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగ నిర్మాత అని, అటువంటి నాయకుడి పేరును జిల్లాకు పెట్టాలంటూనే ఎన్టీఆర్ పేరును జిల్లా స్థాయిలో పెట్టడమేంటంటూ చంద్రబాబు ప్రశ్నించడాన్ని ప్రజలు గమనించాలన్నారు. అంబేడ్కర్, ఎన్టీఆర్లలో ఎవరు గొప్పవారో విజులు గమనించాలని సూచించారు. జిల్లాల విభజనకు 99 శాతం మద్దతు జిల్లాల విభజన ప్రక్రియకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉండవచ్చని, అయితే 99 శాతం మంది ప్రజలు హర్షిస్తున్నారని మంత్రి బాలినేని చెప్పారు. టీడీపీ నాయకులు మాత్రం దీనిపైనా రాజకీయం చేయడం, నాటకాలు ఆడడం, కుట్రలు పన్నడం చేస్తున్నారని, ఈ ప్రక్రియను అడ్డుకునేందుకు కోర్టుకెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్నారు. అయితే కందుకూరులో రెవెన్యూ డివిజన్ తొలగించడంతో పాటు.. ఆ నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపడంపై ప్రజలు అసంతృప్తికి గురవుతున్న విషయాన్ని సీఎం కార్యాలయం దృష్టికి తీసుకెళ్లినట్టు మంత్రి చెప్పారు. సోము వీర్రాజు ఒక రోజు టీడీపీని, మరుసటి రోజు వైఎస్సార్సీపీని, ఇంకో రోజు సొంత పార్టీని సైతం విమర్శిస్తారని, అలాంటి వ్యక్తి బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారని ఎద్దేవా చేశారు. -
ఆయన హెచ్చరికలు సజీవ సత్యాలు
ఆధునిక రాజకీయవ్యవస్థ నిర్మాణంలో వ్యక్తి ఆధారిత వికాసమే స్ఫూర్తి కావాలని నినదించిన మహోన్నత రాజ్యాంగం మనది. ప్రజా స్వామ్యం కేవలం రాజ కీయ పాలనా పద్ధతి మాత్రమే కాదు, సంపదలో సమాన పంపిణీ ఆవశ్యక తను చర్చించిన భావనగా రాజ్యాంగ రచనా సంఘం ఆవిష్కరించింది. అందుకు భారతీయ బౌద్ధం నుంచి ఆచరణాత్మక ప్రజాస్వామ్యాన్ని నిపుణులు వెలికి తీశారు. ఉత్పత్తి కులాల అణచివేతకు కారణాలను ఆనాడే గుర్తించారు. వీటిని అధిగమించాలంటే ప్రజాస్వామ్య పాలనా వ్యవస్థే దివ్యఔషధమనే ప్రతిపాదన ఆమోదం పొందింది. ప్రజాస్వామ్య మూలాలున్న బౌద్ధం భారతీయుల వారసత్వ సంపదగా ప్రశంసలం దుకుంది. దీనిలో అభిప్రాయాల పరస్పర మార్పిడి, చర్చావిధానం రాజ్యాంగసభను సమ్మో హనపరిచాయని డాక్టర్ అంబేడ్కర్ రాజ్యాంగ రచనా సంఘంలో మాట్లాడుతూ అన్నారు. ప్రజాస్వామ్య మన్నికకు వర్గరహిత సమాజం ఎంతో అవసరమని అంబేడ్కర్ పేర్కొన్నారు. అలాగే ప్రజల మనోభావాలకు అనుగుణంగా మార్పులు, చేర్పులకు అవకాశం వుండాలన్నారు. ప్రభుత్వం గరిష్ఠ సామాజిక జీవనం ప్రాతిపదికగా బాధ్యత తీసుకోవాలి. సమాజం ప్రజాస్వామ్య బద్ధంగా లేనప్పుడు, ప్రభుత్వం కూడా అలా ఉండ టానికి అవకాశం లేదు. ప్రభుత్వాలు ఉద్యోగుల మీద ఆధారపడి పనిచేస్తాయి. ఆ ఉద్యోగులు వచ్చిన సామాజిక నేపథ్యం అప్రజాస్వామిక లక్షణాలు కలిగివుంటే ప్రభుత్వం కూడా అప్రజా స్వామికంగా మారిపోతుంది. ఈ సందర్భంలోనే ‘ప్రభుత్వం’ అనే పదాన్ని అంబేడ్కర్ నిర్వచించారు. ప్రభుత్వం అంటే మంచి చట్టాలు, మంచి పరిపాలన. ముఖ్యమైన విధులు న్యాయవ్యవస్థ చేతికి చేరాలి. రాజ్యాంగం అందించిన ప్రాథమిక హక్కులు నిర్లక్ష్యానికి గురికాకూడదు. దీనిని విస్మ రించి పాలకులు తమ స్వప్రయోజనాల కోసమే పనిచేస్తే, బలహీనవర్గాల అభివృద్ధి, సంక్షేమం కుంటువడుతుంది. తోటి మనిషి మీద గౌరవం, సమభావం కలిగి ఉన్నప్పుడే నిజమైన సమాజం ఏర్పడుతుందని, అదే పరిపూర్ణ ప్రజా స్వామ్యానికి పునాది కాగలుతుందనే విషయాన్ని తేటతెల్లం చేశారు. ఆదేశిక సూత్రాల అమలు ద్వారా ఆదర్శ ప్రజాస్వామ్యాన్ని నిర్మించవచ్చని, దీని కార్యాచరణ సాధ్యం కావాలంటే ప్రభుత్వమే ఈ బాధ్యత తీసుకోవాలని ఆయన సూచించారు. లేకుంటే భారత సమాజం పాలక వర్గం, పాలిత వర్గంగా విభజన చెంది, వ్యక్తి శ్రేయస్సుకు విఘాతం కలిగే ప్రమాదం ఉందన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే ప్రధానంగా రెండు విషయాలు మూలస్తంభాలుగా నిలవాలనేది రాజ్యాంగ నిర్దేశం. అవి ఒకటి సమర్ధ మైన పాత్ర పోషించగల ప్రతిపక్షం, రెండు నిజాయితీతో కూడిన ఎన్నికల నిర్వహణ. అప్పుడే అధికారమార్పిడి ప్రక్రియ సులభతరంగా జరుగు తుంది. ఈ వ్యవస్థ ద్వారానే అణగారిన ప్రజానీకం విముక్తి సుసాధ్యమవుతుంది. పరిపూర్ణ ప్రజా స్వామ్య మనుగడకు అడ్డంకిగా ఎన్ని అవరోధాలు ఎదురయినా జనబాహుళ్యం కలిగిన భారత దేశా నికి ప్రజాస్వామ్యమే శరణ్యంగా నిలిచింది. ప్రజా స్వామ్యం వర్ధిల్లాలంటే ప్రజలు చైతన్యవంతులై అప్రమత్తంగా వ్యవహరించాలి. ప్రజాస్వామ్యం సజీవంగా వర్ధిల్లితేనే దాని ఫలాలు ప్రజల అను భవంలోకి వస్తాయని అంబేడ్కర్ అన్నారు. ప్రజా స్వామ్యం అంతరించిపోతే ప్రజల ఆకాంక్షలు నీరు గారిపోతాయన్న ఆయన హెచ్చరికలు ఎప్పటికీ సజీవసత్యాలుగా నిలుస్తాయి. -డాక్టర్ జి.కె.డి.ప్రసాద్ వ్యాసకర్త సామాజిక, రాజకీయ విశ్లేషకులు, విశాఖపట్నం -
BR Ambedkar: అంబేడ్కర్ బాటలో తెలంగాణ
సామాజిక న్యాయం కోసం జరిగే సమరశీల పోరాటాలపై చెరగని ముద్రవేసిన మహానీయుడు బి.ఆర్.అంబేడ్కర్. ఈ దేశ సామాజిక వ్యవస్థ ఆధారంగా నిరుపమాన అధ్యయనంతో జాతీయోద్యమ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే రాజ్యాంగాన్ని అందించాడు. అంబేడ్కర్ సేవలు, ఆలోచనలు మానవ మర్యాద కోసం, అంతరాల్లేని సమాజం కోసం, దోపిడీ పీడనలు లేని వ్యవస్థ నిర్మాణం కోసమనే స్పృహను భారతీయ సమాజం కలిగి ఉన్నందు వల్లే ఆయన దూరమై ఆరు దశాబ్దాలు దాటినా ప్రజలు ఆయన జయంతులు, వర్ధంతులు జరుపుకొంటున్నారు. రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణపై అంబేడ్కర్ అభిప్రాయాలు, ఏర్పాటుచేసిన ప్రకరణ 3 తెలంగాణ రాష్ట్ర పోరాటానికి తాత్విక సమర్థనను ఇచ్చాయి. ఆధునిక భారతీయ పునరుజ్జీవన ఉద్యమ వెలుగుగా కొనసాగిన అంబేడ్కర్ తాత్విక ధారలో ముఖ్యమైన సంక్షేమ రాజ్యభావనను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఏడేళ్లుగా కొనసాగిస్తున్నారు. సాధ్యమైనంత తక్కువ కాలంలో ఎక్కువ సంక్షేమ రాజ్య ఫలాలను అందజేస్తున్నారు. అంబేడ్కర్ వ్యవసాయాన్ని మౌలికమైన పరిశ్రమగా గుర్తించారు. భూమి సక్రమ వినియోగానికి సరైన పెట్టుబడిని, ఉత్పత్తి సాధనాలను సమకూర్చాలనీ, నీటి పారుదల సౌకర్యాలను కలిగించాలనీ, వీటికి రాజ్యమే బాధ్యత వహించాలనీ అన్నారు. ఈ వెలుగులో రైతుబంధు పథకాన్ని విజయవంతంగా కేసీఆర్ అమలుచేస్తున్నారు. స్త్రీలు సాధించిన అభివృద్ధి ఆధారంగా సమాజ ప్రగతి నిర్ధారించబడుతుందనే అంబేడ్కర్ దార్శనికతలో శిశు సంక్షేమం, స్త్రీల అభివృద్ధికి అనేక కార్యక్రమాలను అమలుచేస్తున్నారు. అంగన్వాడీ టీచర్ల, ఆశా వర్కర్ల జీతాలను పెంచారు. బాధిత మహిళలను రక్షించటం కోసం సఖి కేంద్రాలను ఏర్పాటు చేశారు. బాలికల డ్రాపౌట్సు తగ్గించడం కోసం హెల్త్ కిట్స్, భారీ సంఖ్యలో గురుకులాలను, కళాశాలలను ప్రారంభించారు. నాగరికత వల్ల లభించే భౌతిక ప్రయోజనాలను వదులుకోవచ్చు గానీ విద్యా ఫలాలను అందుకోవడంలో ఎలాంటి నిర్లక్ష్యం చూపరాదన్నారు అంబేడ్కర్. స్వరాష్ట్రం సిద్ధించాక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 1000 పైగా గురుకులాలను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. జాతీయపార్టీల పాలకులు అధికారాలను ఎక్కువగా తమ గుప్పిట్లో ఉంచుకొని రాష్ట్రాలపై పెత్తనం చలాయిస్తున్నారు. అందుకే ఫెడరల్ ఫ్రంట్ దిశగా అంబేడ్కర్ సూచించిన సమాఖ్య స్ఫూర్తి అమలుకోసం కేసీఆర్ జాతీయస్థాయి ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజల సంక్షేమమే పరమావధిగా నడవాల్సిన రాజకీయాలు వ్యక్తిగత విశ్వాసాలైన మతం, ఆరాధనా స్థలాల చుట్టూ తిరుగుతూ వాటి ఆధారంగా మరల అధికారాన్ని పొందే అవాంఛనీయ ధోరణులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అంబేడ్కర్ అలోచనాధారలో స్వరాష్ట్రం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఆయన సాధించిపెట్టిన అపూర్వ ఫలితాలను కాపాడుకుంటూ మనపై మోపిన బాధ్యతలను కొనసాగించడంలో ముందువరసలో ఉండాలి. – అస్నాల శ్రీనివాస్ తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (నేడు అంబేడ్కర్ వర్ధంతి) -
BR Ambedkar: స్మృతివనం చరిత్రాత్మకం
Ambedkar Death Anniversary 2021: సమాజ దిశా నిర్దేశాన్ని ప్రభావితం చేసి, ఒక సమున్నత ఆశయం కోసం కృషి చేసిన యుగపురుషుడు డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్. అనేక వివక్షలకు గురైనా తన పట్టుదలతో రాజ్యాంగాన్ని రచించే స్థాయికి ఎదిగారు. సామాజిక, రాజకీయ, ఆర్థిక సంస్కర్తగా జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిని అందుకున్నారు. ఇరవై మిలియన్ ఓట్లతో ‘ద గ్రేటెస్ట్ ఇండియన్’గా గుర్తింపు పొందారు. ప్రముఖ ఆర్థికవేత్త నరేంద్ర జాదవ్.. అంబేడ్కర్‌ను ‘భూమి ఉన్నంతకాలం దేశ అత్యున్నత ఆర్థికవేత్త’గా పేర్కొన్నారు. అమర్త్య సేన్ ‘భారత ఆర్థిక రంగ పితామహుడి’గా అభివర్ణించారు. బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్ ఆఫ్ వెస్ట్రన్ కెనడా ఆయన జయంతిని ‘సమానత్వ దినోత్సవం’గా జరుపుకోవాలని నిశ్చయించింది. అమెరికాలోని బోస్టన్ నగరంలో ఉన్న మసాచుసెట్స్ యూనివర్సిటీలోనూ, న్యూయార్క్ లోని కొలంబియా విశ్వ విద్యాలయంలోనూ, బ్రాండియస్ యూనివర్సిటీలలోనూ ఆయన విగ్రహాలను ఏర్పాటు చేశారు. భారత పార్లమెంట్ ఆయన విగ్రహాన్ని సెంట్రల్ హాల్లో ప్రతిష్ఠించి గౌరవించింది. అటువంటి మహనీయునికి స్మృతివనం నిర్మించడం అంటే ఆయన స్ఫూర్తిని కొనసాగించేందుకు కంకణబద్ధులు కావడమే. ఇందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ నడిబొడ్డున ఉన్న స్వరాజ్ మైదాన్‌లో (పి.డబ్లు్య.డి. గ్రౌండ్స్) స్మృతివనం ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం అంబేడ్కర్ అభిమానులకు, ప్రజాస్వామ్యవాదులకు సంతోషాన్ని కలిగిస్తోంది. ఇరవై ఎకరాల స్ధలంలో నిర్మిస్తున్న ఈ స్మృతివనంలో 125 అడుగుల విగ్రహంతో పాటు ఆయన జీవిత విశేషాలను ప్రదర్శించేందుకు మ్యూజియం, గ్యాలరీ, ఇంకా పుస్తక పఠనంతో జ్ఞాన సముపార్జన చేసిన అంబేడ్కర్ స్ఫూర్తిని గుర్తుచేస్తూ అంతర్జాతీయ స్థాయి గ్రంథాలయాన్ని నిర్మించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్వయంగా అధికారులతో చర్చించి 2022 ఏప్రిల్ 14 అంబేడ్కర్ జయంతి నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందుకుగానూ 249 కోట్ల రూపాయలు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌లో అంబేడ్కర్ స్మృతివనం చరిత్రాత్మకం కానున్నది. గత ప్రభుత్వం నగరానికి దూరంగా నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్టు చిత్తశుద్ధి లోపం కారణంగా ఐదేళ్ల కాలంలో అతీగతీ లేకుండా పోయింది. అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన జరిగినప్పటికీ అప్పటి ప్రభుత్వం శ్రద్ధ చూపలేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడలోని స్వరాజ్ మైదానంలో ఈ ప్రాజెక్టును నిర్మించాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2020 జూలై 8న శంకుస్థాపన చేసి త్వరితగతిన పనులు ప్రారంభించి పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. దీని ద్వారా ముఖ్యమంత్రి దళిత, ఆదివాసీ, అట్టడుగు వర్గాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా అర్థమవుతోంది. అంబేడ్కర్ స్ఫూర్తిని కొనసాగించేందుకు చర్యలు తీసుకోవడం అభినందనీయం. – నేలపూడి స్టాలిన్ బాబు సామాజిక రాజకీయ విశ్లేషకులు (నేడు అంబేడ్కర్ వర్ధంతి) -
‘కరెన్సీ నోటుపై అంబేడ్కర్ ఫొటోను ముద్రించాలి’
సాక్షి, హైదరాబాద్: కరెన్సీ నోట్లపై భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఫొటోను ముద్రించాలని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండా ప్రకాశ్ ముదిరాజ్ కేంద్ర ప్రభుతాన్ని కోరారు. ఈ అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించి చర్చించేందుకు చొరవ తీసుకుంటానని తెలిపారు. అంబేడ్కర్ ఫొటో సాధన సమితి ఆధ్వర్యంలో ఈ నెల 26న యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ప్రారంభమై 2022 ఏప్రిల్ 14వరకు జరిగే జ్ఞానయుద్ధ యాత్ర కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ ఆవిష్కరణ ఆదివారం హైదర్‌గూడలోని ప్రకాష్ ముదిరాజ్ కార్యాలయంలో జరిగింది. అంబేడ్కర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు జేరిపోతుల పరశురాం, బొల్లిస్వామి, జాతీయ అధికార ప్రతినిధి మబ్బు పరశురాం, నాయకులు రవి, జి.కష్ణ తదితరులు పాల్గొన్నారు. -
అంబేడ్కర్ బతికుంటే ఆయననూ బీజేపీ నేతలు దూషించేవారు
శ్రీనగర్: ఆర్టికల్ 370కి అనుకూలంగా మాట్లాడిన కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్‌పై బీజేపీ నాయకులు విరుచుకుపడడాన్ని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ తీవ్రంగా తప్పుపట్టారు. ఈ మేరకు ఆమె ఆదివారం ట్వీట్ చేశారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ ఇప్పుడు మనమధ్య లేరని, ఒకవేళ జీవించి ఉంటే ఆయన పాకిస్తాన్ మద్దతుదారుడంటూ బీజేపీ నాయకులు దూషించేవారని అన్నారు. అంబేడ్కర్ రచించిన భారత రాజ్యాంగం ఆర్టికల్ 370 ద్వారా జమ్మూకశ్మీర్‌కు కల్పించిన ప్రత్యేక ప్రతిపత్తిని కేంద్ర ప్రభుత్వం కూలదోసిందని మండిపడ్డారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370ని పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తామని దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దిగ్విజయ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ వైఖరేంటో చెప్పాలి: రవిశంకర్ ఆర్టికల్ 370 విషయంలో దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వైఖరేంటో స్పష్టం చేయాలని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ డిమాండ్ చేశారు. మౌనం వీడాల్సిన సమయం వచ్చిందన్నారు. దిగ్విజయ్ చెప్పినట్లుగా ఆర్టికల్ 370ని మళ్లీ తీసుకురావాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోందా? అని ప్రశ్నించారు. రవిశంకర్ ప్రసాద్ ఈ మేరకు ఆదివారం ట్వీట్ చేశారు. -
ముంచెత్తిన ‘అభిమానం’
సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, దళిత సంఘాల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అయితే అభిమానంతో వేసిన పూలమాలలతో బాబాసాహెబ్ విగ్రహం ముఖం కనబడకుండా పూలమలలతో ముంచెత్తింది. చదవండి: ఆశ్రమానికి వెళ్లిన తల్లీకొడుకులు అదృశ్యం జరిమానా తప్పించుకోవడానికి...క్యా ఐడియా సర్ జీ -
నాణ్యంగా ఉండేలా రూపొందించాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మృతివనం వద్ద లైబ్రరీ, మ్యూజియం, గ్యాలరీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. వీటితో పాటు ఆయన జీవిత విశేషాలను, ఆయన ప్రవచించిన సూక్తులను అక్కడ ప్రదర్శించాలని నిర్దేశించారు. అదే విధంగా పార్కు వద్ద రహదారిని విస్తరించి, ఫుట్‌పాత్‌ను కూడా అభివృద్ధి చేసి, రెండింటిని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. విజయవాడలోని బీఆర్ అంబేడ్కర్ స్వరాజ్ మైదాన్‌లో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు – పార్క్ అభివృద్ది మాస్టర్ ప్లాన్‌పై సీఎం జగన్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా.. భారీ అంబేడ్కర్ విగ్రహం, స్మృతివనానికి సంబంధించి రెండు రకాల ప్లాన్లను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రికి వివరించారు. ఇందులో భాగంగా నాగపూర్‌లో ఉన్న అంబేడ్కర్ దీక్ష భూమి, ముంబైలో ఉన్న చైత్య భూమి, లక్నోలోని అంబేడ్కర్ మెమోరియల్, నోయిడాలోని ప్రేరణాస్థల్‌ను ఉదాహరణగా చూపారు. అదే విధంగా గ్యాలరీ, ఆడిటోరియమ్ ఎలా ఉంటుందన్న అంశంపైనా అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. పనులు ప్రారంభమైన 14 నెలల్లో పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. (చదవండి: శరవేగంగా పోలవరం ప్రాజెక్ట్ పనులు) ఈ క్రమంలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. అంబేడ్కర్ స్మృతివనంలో ఏర్పాటు చేసే విగ్రహం ఏమాత్రం కళ తగ్గకుండా, దీర్ఘకాలం నాణ్యంగా ఉండేలా రూపొందించేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ల్యాండ్‌స్కేప్‌లో పచ్చదనంతో నిండి ఉండాలని పేర్కొన్నారు. కాగా ఈ సమీక్షా సమావేశంలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.కరికాల వలవన్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. భూసేకరణపై దృష్టి సారించండి రాష్ట్రంలో విమానాశ్రయాల విస్తరణ అంశంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణకు..అవసరమైన భూసేకరణపై దృష్టి సారించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదే విధంగా, కడప ఎయిర్‌పోర్టు విస్తరణ కోసం అవసరమైన భూమి సేకరించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఐటీ మంత్రి గౌతమ్‌రెడ్డి, సీఎస్ నీలం సాహ్ని తదితరులు పాల్గొన్నారు. -
13 నెలల్లోగా పనులు పూర్తి కావాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం తయారీకి వెంటనే ఆర్డర్ ఇవ్వాలని, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. నవంబరు 1న పనులు ప్రారంభించి 13 నెలల్లోగా పూర్తయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. విజయవాడలోని బీఆర్ అంబేడ్కర్ స్వరాజ్ మైదాన్‌లో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు – పార్క్ అభివృద్ది మాస్టర్ ప్లాన్‌పై సీఎం జగన్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సంస్థల ప్రతినిధులు పలు నమూనాలు ప్రదర్శించారు. విగ్రహంతో పాటు, పార్కు నిర్మాణానికి సంబంధించిన విషయాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.(చదవండి: నూతన విద్యా విధానంపై సీఎం జగన్ సమీక్ష) ఇందుకు స్పందించిన సీఎం జగన్.. అంబేద్కర్ విగ్రహం విజిబిలిటీ ముఖ్యమని, ఎక్కడి నుంచి చూసినా విగ్రహం స్పష్టంగా కనిపించాలని సూచించారు. అదే విధంగా అక్కడ నిర్మించే పార్కు సైతం పూర్తి ఆహ్లాదకర వాతావరణం కలిగి ఉండాలని స్పష్టం చేశారు. విగ్రహం ఎక్కడ ఏర్పాటు చేస్తే గ్రాండ్‌లుక్ వస్తుందోనన్న అంశంపై దృష్టి పెట్టాలని, అందుకు అనువైన స్థలం ఎక్కడ ఉందో గమనించి త్వరితగతిన పనులు ప్రారంభించాలని ఆదేశించారు. నవంబరులో పనులు మొదలుపెట్టి 13 నెలల్లోగా పూర్తయ్యేలా చూడాలని, ఈలోపు ఆ స్ధలంలో ఉన్న ఇరిగేషన్ ఆఫీస్‌లు, మిగిలిన ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ వెంటనే తరలించాలని అధికారులను ఆదేశించారు. అంతేగాకుండా ఎంజీ రోడ్ నుంచి పార్క్ కనెక్టివిటీ కూడా అందంగా తీర్చిదిద్దాలని.. మొత్తం మీద అక్కడంతా ఆహ్లాదకర వాతావరణమే కనిపించేలా ప్రణాళిక రచించాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా పార్కులో ఒక కన్వెన్షన్ హాల్ కూడా ఏర్పాటు చేస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందన్న ముఖ్యమంత్రి.. కన్వెన్షన్ సెంటర్, ఫుడ్ కోర్టు మాత్రమే కమర్షియల్‌గా ఉండాలని, వీటిపై వచ్చే ఆదాయం పార్క్ నిర్వహణకు ఉపయోగపడుతుందని సూచించారు. వీలైనంత వరకు కాంక్రీట్ నిర్మాణాలు తగ్గించాలని, మంచి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. -
విగ్రహాల ఏర్పాటు ఉద్దేశం ఇదే: ఉప రాష్ట్రపతి
సాక్షి, న్యూఢిల్లీ: భారత దేశాభివృద్ధికి అవినీతి ఓ అవరోధంగా మారిందని.. దీన్ని దేశం నుంచి పారద్రోలేందుకు ప్రభుత్వంతోపాటు పౌరసమాజం, ప్రజలు సంయుక్తంగా పనిచేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఢిల్లీలోని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని బుధవారం ఆయన ఆవిష్కరించి ప్రసంగించారు. ‘రాజనీతిజ్ఞతతోపాటు సంఘ సంస్కర్తగా, తత్వవేత్తగా, మేధావిగా, న్యాయకోవిదుడిగా, ఆర్థికవేత్తగా, రచయితగా, మానవతా మూర్తిగా బహుముఖ ప్రజ్ఞ కలిగిన గొప్ప వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్. ప్రపంచంలోనే దృఢమైన రాజ్యాంగం కలిగి ఉండటం భారతదేశ ప్రత్యేకత. దీని రూపకల్పనతోపాటు క్లిష్టమైన సమయంలో బాబాసాహెబ్ అంబేడ్కర్ పోషించిన పాత్ర అత్యంత కీలకం‘ అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. (చదవండి: సరిహద్దు ఉద్రిక్తతలను పెంచే దిశగా చైనా చర్యలు) భారత రాజ్యాంగం నేటికీ దేశానికి ఓ మార్గదర్శిగా దారిచూపిస్తోందన్న విషయాన్ని ఉప రాష్ట్రపతి గుర్తుచేశారు. అలాంటి రాజ్యాంగ పవిత్రతను కాపాడటంలో ప్రతి భారతీయుడు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. బడుగు, బలహీన, అణగారిన వర్గాల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న డాక్టర్ అంబేడ్కర్.. తన జీవితంలో చివరి క్షణం వరకు సామాజిక అసమానత, కుల, లింగ వివక్షతకు వ్యతిరేకంగా మహిళా సాధికారతకోసం కృషిచేశారన్నారు. ‘ఇలాంటి మహనీయుల జీవితాన్ని, వారు చూపిన ఆదర్శాలను గుర్తుచేసుకుని.. వాటినుంచి మనతోపాటు భవిష్యత్ తరాలు స్ఫూర్తి పొందడమే.. వీరి విగ్రహాలను ఏర్పాటుచేయడం వెనక ఉద్దేశం’ అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. డాక్టర్ అంబేడ్కర్ దూరదృష్టి కారణంగానే.. కాగ్ వంటి సంస్థల ఏర్పాటుతోపాటు వీటికి స్వయం ప్రతిపత్తి దక్కిందని ఆయన గుర్తుచేశారు. ‘2022 కల్లా కాగితరహిత కార్యలాపాలు నిర్వహించాలన్న కాగ్ నిర్ణయం ముదావహం’ అని ఉపరాష్ట్రపతి అన్నారు. ఈ కార్యక్రమంలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రాజీవ్ మెహర్షి, డిప్యూటీ కాగ్ అనితా పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. (కరోనాపై పోరులో మీడియాది అసమాన పాత్ర) -
అంబేద్కర్ వ్యక్తి కాదు.. శక్తి: ఆర్కే రోజా
సాక్షి, నగరి(చిత్తూరు): డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ ఒక్క కులానికి, మతానికీ చెందిన వారు కాదని ఆయన ఓ శక్తి అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. కాగా మంగళవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా నగరి, పుత్తూరులోని ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లడుతూ.. సమ సమాజ శ్రేయస్సు కోసం పోరాడిన రాజ్యాంగ నిర్మాత, నిగర్వి, శ్రేయోభిలాషి ఆయన అన్నారు. ఇక కొంతమంది ఆయనను తమ సమూహానికి సంబంధించిన వ్యక్తిగా ఆపాదించడం సబబు కాదన్నారు. (అంబేడ్కర్‌కు సీఎం జగన్ ఘన నివాళి) యావత్ భారతదేశానికి చెందిన వ్యక్తి అంబేద్కర్ అని ఎమ్మెల్యే అన్నారు. పేద, దళితులకు రెండు పురపాలక సంఘం పరిధిలో నిత్యావసర సరుకలతో పాటు మూడు రకాల కూరగాయలను రెండు వేల కుటుంబాలకు పంపిణీ చేశారు. రాష్ట్రంలో చూస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమ సమాజ స్థాపనకోసం అట్టడుగు వర్గాల వారిని పైకి తీసుకురావడానికి కృషి చేస్తున్నారన్నారు. సీఎం జగన్ అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ మహిళలకు అన్నింటిలోను 50 శాతం స్థానాన్ని కల్పించారని తెలిపారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న సీఎం జగన్ క్యాబినెట్లో పార్టీలో ఒక ఎమ్మెల్యేగా తాను ఉండటం చాలా గర్వంగా ఉందని రోజా పేర్కొన్నారు. (మరణం లేని మహా శక్తి ఆయన : సీఎం జగన్) -
అంబేద్కర్‌ను ఓడించాలని ప్రయత్నిస్తే..
సాక్షి, గుంటూరు : భారత రాజ్యాంగ రూపకర్త బీఆర్ అంబేద్కర్‌ను ఎంపీగా ఓడించాలని అప్పట్లో కాంగ్రెస్ ప్రయత్నిస్తే.. ఆయన్ని గెలిపించటానికి బీజేపీ అండగా నిలిచిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు అన్నారు. స్వాతంత్య్రం తర్వాత దళితుల అభ్యున్నతికి బీజేపీ కట్టుబడి ఉంటూ వచ్చిందని తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రిజర్వేషన్ల విషయంలో బీజేపీకి ఎలాంటి వ్యతిరేకత లేదని స్పష్టం చేశారు. దేశ విస్తృత ప్రయోజనాల కోసం పనిచేసే పార్టీ బీజేపీ అన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు.. ప్రాంతాలకు అతీతంగా అంకితభావంతో పనిచేయటం బీజేపీ గొప్పతనంగా పేర్కొన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా దళితులు, గిరిజనుల అభ్యున్నతి కోసం పని చేసే పార్టీ బీజేపీ అన్నారు. రామ జన్మభూమి ఉద్యమం కోసం గ్రామ గ్రామానా శిలాన్యాస్ సేకరణ నుంచి రామ జన్మభూమి ట్రస్టు ఏర్పాటు వరకూ బీజేపీ పాత్ర ఉందన్నారు. రామ జన్మభూమి ట్రస్టులో దళితులు తప్పనిసరిగా ఉండాలని ప్రధాని మోదీ పట్టుబట్టి నియమించారని తెలిపారు. భారత దేశ అభివృద్ధిలో దళితులు లేకుండా ఏమీ జరగదని బీజేపీ గట్టిగా నమ్ముతోందన్నారు. దేశంలో 35 కోట్ల మందికి కనీసం బ్యాంకు అకౌంట్లు కూడా లేకుండా యాభై ఏళ్లు పరిపాలించారని, వారందరికీ జన్ దన్ ఖాతాలు తెరిపించిన చరిత్ర మోదీదేనని చెప్పారు. ఈ 35 కోట్లలో 70 శాతానికిపైగా దళితులు, గిరిజనులే ఉన్నారని తెలిపారు. -
రాజ్యాంగమే కరదీపిక!
గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించి డెబ్భైయ్యేళ్లు పూర్తయిన వేళ దేశం మొత్తం ఒక రకమైన సంక్షోభాన్ని ఎదు ర్కొంటున్నది. వ్యక్తిగత విశ్వాసంగా ఉండాల్సిన మతం ప్రభుత్వ విశ్వా సంగా మారినప్పుడు, ఆ క్రమంలో రాజ్యాంగాన్ని ఉల్లంఘించడానికి కూడా సిద్ధపడుతున్నప్పుడు ఇలాంటి పరిస్థితులు ఏర్పడటంలో ఆశ్చర్యం లేదు. ఈ ధోరణులను వ్యతిరేకించేవారు రాజ్యాంగంలోని స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సౌభ్రాతృత్వం గురించి మాట్లాడుతుంటే అది పాలకులకు మింగుడు పడటం లేదు. కేంద్ర పాలకులకు మన దేశం పౌరాణికంగా అర్థమవుతోంది తప్ప భౌగోళికంగా, సామాజికంగా అర్థం కావడం లేదు. రాజకీయ నాయకులు నెత్తుటి తిలకాలు దిద్దుకోవటానికి వెనకాడటం లేదు. ఈ దేశంలో మొదటినుంచీ వున్న పరమత సహనాన్ని తుంచేం దుకు వారు ప్రయత్నిస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర నమోదు చిట్టా(ఎన్ఆర్సీ), జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్)లను అమలు చేయొద్దంటూ దేశ వ్యాప్తంగా నిరసన ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి హిందువులు, సిక్కులు, పారశీకులు, బౌద్ధులు, జైనులు, క్రైస్తవులకు అవ కాశం ఇస్తూ, కేవలం ముస్లింలకు మాత్రం అనుమతి నిరా కరించడం వివక్ష కాదా? వారిపై వివక్ష ప్రదర్శించడం మన దేశ సంస్కృతి కాదు, మన రాజ్యాంగానికి అనుగుణమైనది కాదు. ముస్లింలు ఈ దేశ సంస్కృతిని, సాంకేతిక రంగాన్ని ఉన్నతీ కరించడంలో ప్రధాన పాత్ర పోషించారు. వారు తీసుకొచ్చిన వాస్తు శాస్త్రం ఆధారంగా రూపొందిన అనేక చారిత్రక కట్టడాలు మన దేశానికి వన్నె తెస్తున్నాయి. ఆటోమొబైల్ రంగాన్ని కూడా వారు ఎంతో ప్రభావితం చేశారు. ముస్లింలు పరాయివారు కాదు. వారు ఈ దేశ చరిత్రలో భాగం. దేశ స్వాతంత్య్రో ద్యమంలో వారు కీలక పాత్ర పోషించారు. ఈ దేశ విముక్తికి తమ ప్రాణాలు అర్పించారు. 130 కోట్ల దేశ జనాభాలో ముస్లింల జనాభా 20 కోట్లు. ఈ దేశ జనాభా మొత్తం తాము ఈ దేశ పౌరులమని నిరూపించుకోవాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం అడుగుతోంది. అందుకవసరమైన పత్రాలు చూపని వారిని ప్రత్యేక శిబిరాల్లో నిర్బంధిస్తామంటున్నారు. ఈ దేశంలో నిరక్షరాస్యులు 60 శాతం ఉన్నారు. ముస్లింలతోపాటు దళి తులు, ఆదివాసీలు, బహుజనులు ఈ నిరక్షరాస్యుల్లో అధికం. ఎన్ఆర్సీ, సీఏఏలకు వివరాలివ్వలేకపోతే నేరంగా పరిగణించే టట్టయితే ఈ వర్గాలవారంతా ఇబ్బందుల్లో పడతారు. అసలు అక్షరాలు, అంకెలు రాని ప్రజలను తల్లిదండ్రుల బర్త్ సర్టిఫికెట్లు కావాలని, మీకు సంబంధించిన సర్టిఫికెట్లు కావాలని ఒత్తిడి తెస్తే వారేం చెప్పగలుగుతారు? చూపగలుగు తారు? ఈ దుర్మార్గమైన చర్యను అడ్డుకోవాల్సిన అవసరం లేదా? ఇక నుంచి రైల్వే స్టేషన్లలో ఉండే బోర్డులపై ఉర్దూ బదులు సంస్కృత భాషలో రాస్తామని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ మధ్య ప్రకటించింది. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే పాటించడం మొదలు పెట్టే అవకాశం కూడా లేకపోలేదు. రైల్వే స్టేషన్లలో సైన్ బోర్డులను ఆయా రాష్ట్రాల ద్వితీయ భాషలో రాయాలనే నిబంధన ప్రకారం ఉత్తరాఖండ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. దీన్నిబట్టి చూస్తుంటే సంస్కృతీకరణ ద్వారా వారు దేశాన్ని విభజించాలని చూస్తున్నట్టు అర్థమవు తుంది. దేశంలోని అన్ని సామాజిక శ్రేణులు, ముస్లింలు రాజ్యాంగ పీఠికే శిరోధార్యమని నమ్ముతున్నారు. ఇది గొప్ప పరిణామం. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ దేశ దేశాల రాజ్యాంగాలనూ అధ్యయనం చేసి మన దేశానికి ఉత్కృష్టమైన రాజ్యాంగాన్ని రూపొందించి దానిద్వారా పటిష్టమైన లౌకికవాద సౌధాన్ని నిర్మించారు. ఈ రాజ్యాంగం అసమగ్రమైనది, పెటీ బూర్జు వాలది అని ఒకప్పుడు ప్రచారం చేసిన వామపక్షాలు ఈరోజు దాన్ని సమున్నతమైనదని గుర్తించడం శుభ పరిణామం. ఈ రిపబ్లిక్ డే సందర్భంగా ఈ దేశం మా సొంతమని కుల, మతా లకు అతీతంగా అన్ని వర్గాలవారూ గొంతెత్తుతున్నారు. రాజ్యాంగ ప్రతిని చేతబూనుతున్నారు. దాన్ని కరదీపికగా భావిస్తున్నారు. ఇది మరో స్వాతంత్య్ర పోరాటం. ఇందులో అంతిమ విజేతలు ప్రజలే. డాక్టర్ కత్తిపద్మారావు వ్యాసకర్త సామాజిక తత్వవేత్త, నవ్యాంధ్రపార్టీ, వ్యవస్థాపక అధ్యక్షులు మొబైల్ : 98497 41695 -
ఏపీభవన్‌లో అంబేద్కర్‌కు ఘన నివాళి
సాక్షి,న్యూఢిల్లీ : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 63వ వర్ధంతిని పురస్కరించుకొని న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రాంగణంలో గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఏపీ భవన్ ప్రత్యేక కమిషనర్ ఎన్వి రమణారెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం "మహిళలపై అత్యాచారాలను అరికట్టేందుకు ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ, ప్రజల సామాజిక బాద్యత" అంశంపై ఎఐడిఆర్ఎఫ్, ఏపీ భవన్ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురజాడ సమావేశ మందిరంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు .ఈ కార్యక్రమంలో ఏపీ భవన్ అధికారులు,సిబ్బంది, ఢిల్లీలోని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొని డాక్టర్ అంబేద్కర్ చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు