
తాడేపల్లిగూడెం రూరల్: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలనులో రూ.22.17 కోట్లతో నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల భవనాలను రాష్ట్ర సాంఘిక, సంక్షేమ శాఖమంత్రి మేరుగు నాగార్జున, ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆదివారం ప్రారంభించారు. మేరుగు నాగార్జున మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను వాడుకుని వదిలేసిన ఏకైక వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం వైఎస్ జగన్ చొరవతో విజయవాడ నడిబొడ్డున 19 ఎకరాల్లో రూ.400 కోట్ల వ్యయంతో బీఆర్ అంబేడ్కర్ భారీ విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. డిసెంబర్ నాటికి ఈ పనులు పూర్తి చేయనున్నట్టు వెల్లడించారు. రాష్ట్రానికి దిక్సూచిగా అంబేడ్కర్ విగ్రహం నిలవనుందన్నారు. ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment