merugu nagarjuna
-
ఏపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి మేరుగు నాగార్జున ధ్వజం
-
‘సకల శాఖ మంత్రి నారా లోకేష్’: మేరుగు నాగార్జున
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో విద్యా శాఖను భ్రష్టు పట్టిస్తున్నారని, లోకేష్ సకల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి మేరుగు నాగార్జున మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో చంద్రబాబు రాజకీయ జీవితంలో ప్రభుత్వ విద్యపై సాఫ్ట్ కార్నర్‌తో ఆలోచించారా? అంటూ ధ్వజమెత్తారు. విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించలేకపోతున్నారని.. పుస్తకాలపై వైఎస్ జగన్ బొమ్మలు ఉన్నాయని ఓర్వలేకపోయారంటూ దుయ్యబట్టారు.‘‘ప్రభుత్వ పథకాలపై చంద్రబాబు బొమ్మలు లోకేశ్‌కు కానరాలేదా?. కూటమి పాలనలో పాఠశాల విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారు. రాష్ట్రంలో విద్యారంగం ప్రోత్సాహకంలో విద్యాశాఖ మంత్రిగా లోకేష్ పాత్ర లేదు. వైఎస్సార్సీపీ హయాంలో హయ్యర్ ఎడ్యుకేషన్‌ను క్వాలిటీతో అందించాం. కూటమి పాలనలో వర్శిటీ వైస్ ఛాన్సలర్లను భయపెట్టి రిజైన్ చేయించారు. ఇదేనా విద్యా వ్యవస్థను నడిపించే తీరు’’ అంటూ మేరుగ నాగార్జున ప్రశ్నించారు.‘‘విద్యాశాఖ మంత్రిగా లోకేష్ విద్యా వ్యవస్థలో ఏమైనా మార్పులు తెచ్చారా?. మేము తెచ్చిన సంస్కరణలను తొలగించడం తప్ప ఇంకేమీ చేయలేదు. అంబేద్కర్ ఆశయాలను చంద్రబాబు ప్రభుత్వం నీరు గార్చింది. జగన్ తెచ్చిన మార్పులను చూసి ఇతర రాష్ట్రాలే మెచ్చుకున్నాయి. కానీ అసెంబ్లీలో చంద్రబాబు, లోకేష్ వెకిలి మాటలు మాట్లాడుతున్నారు. నాలుగుసార్లు సీఎం అయిన చంద్రబాబు ప్రభుత్వ స్కూళ్లను బాగు చేశారా?. ఇంగ్లీషు మీడియం, టెక్నాలజీ అభివృద్ధి, పిల్లలకు యూనిఫాం, షూస్ కూడా ఎందుకు ఇవ్వలేక పోయారు?..పిల్లల పుస్తకాలు, రేషన్ సరుకులు, కుట్టు మిషన్లు, సైకిళ్లు, శ్మశానాలతో పాటు అప్పడాలు మీద కూడా చంద్రబాబు ఫోటోలు వేశారు. యూనివర్సిటీలో క్వాలిటీ చదువులు చెప్పించాం. అలాంటి యూనివర్సిటీలోని 17 మంది వైస్ ఛైర్మన్లను బెదిరించి రాజీనామాలు చేయించారు. 9 నెలలపాటు వీసీలు లేకుండానే యూనివర్సిటీలను నడిపిన నీచ చరిత్ర ఈ ప్రభుత్వానిది. టీడీపీ నేతల పుట్టినరోజులు, వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించిన నీచ చరిత్ర చంద్రబాబుది. చివరికి క్లాసు రూముల్లో పార్టీ సభ్యత్వాలను నమోదు చేసిన నీచ చరిత్ర టీడీపీది. మీ అవసరాలకు యూనివర్సిటీలను వాడుకున్నారేగానీ విద్యార్థుల భవిష్యత్తు కోసం ఏ మంచి ఐనా చేశారా?. ఇప్పటికైనా జగన్ తెచ్చిన సంస్కరణలను అమలు చేయాలి. పేద విద్యార్థులకు నాణ్యమైన చదువులు చెప్పించాలి’’ అని మేరుగు నాగార్జున డిమాండ్ చేశారు. -
‘పోసాని అరెస్ట్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది’
ప్రకాశం జిల్లా: ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నేత మేరుగ నాగార్జున మండిపడ్డారు. అసలు చంద్రబాబు పాలన అంతా కక్షలు కార్పణ్యాలతో నడుస్తోందన్నారు మేరుగ. ఆరోగ్యం బాగా లేదని పోసాని కృష్ణమురళి చెప్పినా వదల్లేదని, ఇంత నీచమా చంద్రబాబు అని మేరుగ ప్రశ్నించారు. అడ్డగోలుగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు.రాష్ట్రంలో రైతులు విలవిలలాడుతున్నారని, ప్రభుత్వం మిర్చి రైతులను నిలువునా మోసం చేసిందన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో వ్యవసాయం పండగలా సాగిందని, చంద్రబాబు పాలనలో అదే వ్యవసాయం నిర్వీర్యం అయ్యిందన్నారు.ఇది కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుఅన్నమయ్య జిల్లా: పోసాని కృష్ణమురళి అక్రమ అరెస్టు అనేది టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్య అని ధ్వజమెత్తారు మదనపల్లి వైఎస్సార్ సీపీ ఇంచార్జి నిసార్ అహ్మద్. పోసాని అనారోగ్యంతో ఉన్నప్పటికీ పోలీసులు రాత్రివేళ అరెస్టు చేయడం అన్యాయమన్నారు.రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని మండిపడ్డారు. తమపై ఎన్ని కేసులు పెట్టినా ఎదురించి నిలబడతామన్నారు నిసార్ అహ్మద్ -
మీరు సెక్యూరిటీ ఇవ్వకపోతే.. మేమే జగన్ కు సైనికులం అవుతాం
-
పోలీసులు లేకపోతే మీటింగ్ జరగదనుకున్నారా నీ కుట్రలు పనిచేయవు బాబు
-
Ys Jagan: మంచిపాలన చేస్తే ప్రజలు ఆదరిస్తారు...
-
టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడిపై చర్యలేవి?: మేరుగ
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: గిరిజన కుటుంబంపై దాడికి పాల్పడిన అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును తక్షణం అరెస్ట్ చేయాలని వైఎస్సార్సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి మేరుగ నాగార్జున డిమాండ్ చేశారు. తిరువూరు నియోజకవర్గం ఏ కొండూరు మండలం గోపాలపురంలో ఎమ్మెల్యే దాడితో మనస్థానం చెంది ఆత్మహత్యాయత్నం చేసిన వైఎస్సార్సీపీ వార్డు సభ్యురాలు భూక్యా చంటిని ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, పార్టీ నేతలు దేవినేని అవినాష్, నల్లగట్ల స్వామిదాసు, రాయన భాగ్యలక్ష్మిలతో కలిసి ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా భూక్యా చంటి కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. అనంతరం మేరుగు నాగార్జున మీడియాతో మాట్లాడుతూ..వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పార్టీ ప్రతినిధి బృందం గోపాలపురంలోని భూక్యాం చంటి కుటుంబాన్ని పరామర్శించింది. తిరువూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అరాచకం సృష్టిస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం పూర్తిగా అపహాస్యం పాలవుతోంది. రాజ్యాంగ విలువలకు పూర్తిగా తూట్లు పొడిచేలా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోంది. భూక్యా చంటిపై దాడి దీనికి నిదర్శనం. వారి కుటుంబానికి సంబంధించిన ఉమ్మడి ఆస్తిని భాగాలుగా విభజించుకునే క్రమంలో స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు జోక్యం చేసుకోవడం, ఆ కుటుంబంలోని వారిపై బూటుకాలితో తన్ని దాడి చేయడం అత్యంత దుర్మార్గమని అన్నారు.ఇదీ చదవండి: కొలికపూడి కలరింగ్ఈ దాడి వల్ల భూక్యా చంటి మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడే పరిస్థితిని కల్పించారు. ఇటువంటి అరాచకాలు చేసే ఎమ్మెల్యే కొలికపూడి పరిపాలనలో ఏ రకంగా భాగస్వామిగా ఉండటానికి అర్హుడని ప్రశ్నిస్తున్నాం. దీనికి కొలికపూడి బాధ్యత వహించాలి. తక్షణం ఆయనపై చట్టపరంగా చర్య తీసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ దాడిని ఖండించింది. గిరిజన కుటుంబంపై అత్యంత హేయంగా జరిగిన ఈ దౌర్జన్యంకు కారకుడైన కొలికపూడి శ్రీనివాసరావును అధికార తెలుగుదేశం పార్టీ వెనకేసుకు రావడం దారుణం. క్రమశిక్షణ సంఘం పేరుతో ఆయనను పిలిపించి, ఏదో మందలించామన్నట్లుగా హైడ్రామా సృష్టించారు. నిజంగా చిత్తశుద్ది ఉంటే తక్షణం కొలికపూడి శ్రీనివాసరావుపై చట్ట పరంగా కేసు నమోదు చేసి, న్యాయస్థానం ముందు హాజరుపరచాలి.అధికార దుర్వినియోగంకు పాల్పడుతున్న ఎమ్మెల్యే: దేవినేని అవినాష్తిరువూరులో టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అధికార దుర్వినియోగంకు పాల్పడుతున్నాడని వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ విజయవాడ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ విమర్శించారు. సంక్రాంతికి ముందు ఒక ప్రైవేటు స్థలం వివాదంలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు జోక్యం చేసుకుని గోపాలపురం గ్రామంలోని వైయస్ఆర్సీపీ వార్డు సభ్యురాలు భూక్యా చంటి, ఆమె భర్త కృష్ణ, వారి కుమారులపై ప్రత్యక్షంగా దాడిచేసి గాయపరిచిన ఘటనపై తక్షణం చర్యలు తీసుకోవాలి.బాధ్యతయుతమైన ఎమ్మెల్యే స్థానంలో ఉన్న నేత ఇటువంటి దాడులకు పాల్పడితే ఇక సామాన్యులకు రక్షణ ఉంటుందా? తెలుగుదేశం పార్టీ ఈ ఘటనపై పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్న ఆగ్రహంతో క్రమశిక్షణ సంఘం పేరుతో హంగామా చేసి, చేతులు దులుపుకున్నారు. ఈ దాడిని చిత్రీకరించిన భూక్యా చంటి కుమారుడి సెల్ ఫోన్‌ను స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకుని దానిలోని వీడియోను డిలీట్ చేయడం ఎంత వరకు సమంజసం? గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏనాడు ఇటువంటి దాడులను ప్రోత్సహించలేదు. నేడు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అరాచకం సృష్టిస్తున్నారు. చివరికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ఈ ఎమ్మెల్యే అరాచకాలపై బహిరంగంగా విమర్శలు చేస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. భూక్యా చంటి కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ పోరాడుతుంది. -
బయటపడ్డ చంద్రబాబు నిజ స్వరూపం: మేరుగ
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ప్రజలపై మోపిన రూ.15,485 కోట్ల భారాన్ని ఉపసంహరించుకునే వరకు వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగుతుందని మాజీ మంత్రి, బాపట్ల జిల్లా పార్టీ అధ్యక్షుడు మేరుగ నాగార్జున స్పష్టం చేశారు. కూటమి పార్టీల మాయమాటలు నమ్మి అధికారం ఇచ్చిన ప్రజలపై దుర్మార్గంగా విద్యుత్ ఛార్జీల రూపంలో పెనుభారం మోపుతున్నారని మీడియా సమావేశంలో మేరుగ నాగార్జున ఆక్షేపించారు.ఆయన ఇంకా ఏమన్నారంటే..:కూటమి ప్రభుత్వం బాదుడే బాదుడు:కూటమి ప్రభుత్వ పాలనంతా ‘బాదుడే బాదుడు’ అన్నట్లుగా మారింది. ‘ఓట్లేయండి తమ్ముళ్లూ.. అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచం. పైగా తగ్గిస్తాం.. నేను గ్యారెంటీ’.. అని ఎన్నికల ముందు చంద్రబాబు మాయమాటలు చెప్పారు. అన్ని వర్గాలకు వరాలు కురిపించారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలలు తిరక్కుండానే యథేచ్ఛగా చంద్రబాబు ఇచ్చిన మాట తప్పారు. తన నిజ స్వరూపాన్ని బట్టబయలు చేశారు. సూపర్‌సిక్స్‌తో సహా, ఇచ్చిన హామీలు తుంగలో తొక్కారు. ఒక్క హామీపైనా త్రికరణ శుద్ధితో ఈ ప్రభుత్వం పని చేయడం లేదు.ప్రజల నడ్డి విరుస్తున్న విద్యుత్ ఛార్జీలు:విద్యుత్ ఛార్జీలపై ఇచ్చిన మాట కూడా మరిచిపోయి ఆరు నెలల్లోనే రూ.15,485.36 కోట్ల బాదుడుకు తెర తీశారు. వాటిలో ఇప్పటికే నవంబరు బిల్లులో రూ.6 వేల కోట్లు వేయగా, వచ్చే నెల నుంచి మరో రూ.9,412 కోట్ల బాదుడుకు సిద్ధమయ్యారు. అలా ప్రజల నడ్డి విరుస్తున్నారు. దీంతో విద్యుత్ గృహ వినియోగదారులపై 25 నుంచి 55 శాతం వరకు అదనపు వడ్డన చేస్తున్నారు.ఎంత దారుణం అంటే.. ఇది శీతాకాలం. అంటే విద్యుత్ వాడకం తక్కువగా ఉంటుంది. ఇప్పుడే ఇంత భారం మోపితే, ఇక వేసవి కాలంలో విద్యుత్ వాడకంపై ఎంత భారం పడుతుందో అర్థం కావడం లేదు. ఆనాడు జగన్ గారు ఎస్సీ, ఎస్టీల ఇళ్లకు నెలకు 200 యూనిట్ల వరకూ ఇచ్చిన ఉచిత విద్యుత్‌ను దూరం చేసింది. బిల్లులు చెల్లించాల్సిందేనంటూ వారిని వేధిస్తోంది. ఇప్పుడు తాజాగా అన్ని వర్గాలపైనే విద్యుత్ ఛార్జీల కొరడాను ఝుళిపిస్తోంది.ఎక్కడా విద్యుత్ కోతలు లేవంటూ అబద్దాలు:రాష్ట్రంలో ప్రస్తుతం దాదాపు 195 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతోంది. డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా చేయలేక రాష్ట్రవ్యాప్తంగా సగటున 2 నుంచి 3 గంటల పాటు కోత విధిస్తున్నారు. వాడకం ఎక్కువగా ఉండే ఉదయం, సాయంత్రం, రాత్రి వేళల్లో అనధికారికంగా కోతలు అమలు చేస్తున్నారు. అయినా అధికారిక నివేదికల్లో విద్యుత్ లోటు, కోతలు లేవంటూ బుకాయిస్తున్నారు. నిజానికి గతేడాది కంటే విద్యుత్ డిమాండ్ 1.17 శాతం తక్కువగా ఉన్నా, అది కూడా సరఫరా చేయలేక ప్రభుత్వం సన్నాయినొక్కులు నొక్కుతోంది. అదే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నిండు వేసవిలోనూ, బొగ్గు సరఫరా సంక్షోభంలోనూ ఎలాంటి కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేయడం జరిగింది.బాబు జమానాలో సబ్సిడీలో కట్:గతంలో టీడీపీ అధికారంలో ఉండగా దాదాపు రూ.20 వేల కోట్ల సర్దుబాటు ఛార్జీలను వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి అంటగట్టి దిగిపోయింది. అయినా సరే ఆ భారాన్నంతా ప్రజలపై మోపకుండా గత ప్రభుత్వం డిస్కంలకు సకాలంలో రాయితీలు అందించింది. 2014–19 వరకు టీడీపీ సర్కారు రూ.13,255.76 కోట్లు మాత్రమే సబ్సిడీల కింద చెల్లించగా, వైయస్సార్సీపీ అధికారంలో ఉండగా రూ.47,800.92 కోట్లను సబ్సిడీగా అందించింది. చంద్రబాబు రైతులకు ఎగ్గొట్టిన రూ.8,845 కోట్ల ఉచిత విద్యుత్ బకాయిలను సైతం వైఎస్సార్సీపీ ప్రభుత్వమే చెల్లించింది. అదీ జగన్ కమిట్మెంట్.విద్యుత్ ఛార్జీలపై పోరాటం:చంద్రబాబులాగా హామీలు ఇవ్వడం, చేతులెత్తేయడం, పారిపోవడం శ్రీ వైయస్ జగన్‌కు తెలియదు. ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, భావితరాల గురించి ఆయన ఆలోచించారు. కాగా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం సబ్సిడీలు భరించకుండా వినియోగదారులపైనే ఛార్జీల భారం మోపుతోంది. విద్యుత్ ఛార్జీలపై ప్రభుత్వ నిర్ణయాలను ఎండగడుతూ, వైఎస్సార్సీపీ రేపు (శుక్రవారం) రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తోంది. కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని మేరుగ నాగార్జున వివరించారు. -
కరెంట్ చార్జీల విషయంలో కూటమి ప్రభుత్వం బాదుడే బాదుడు
-
కరెంట్ ఛార్జీల పెంపుపై నిరసన తెలపనున్న YSRCP
-
మెగా డీఎస్సీ పేరుతో దగా... రైతులకు రూ.20 వేలు పెట్టుబడి సాయం ఏది బాబూ..
-
‘మెగా డీఎస్సీ పేరుతో చంద్రబాబు దగా’
తాడేపల్లి : మెగా డీఎస్సీ పేరుతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగా చేశారని ధ్వజమెత్తారు మాజీ మంత్రి మేరుగు నాగార్జున. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతను చంద్రబాబు మరోసారి మోసానికి గురి చేశారని విమర్శించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసి, తర్వాత టెట్ పెడుతున్నామంటూ మోసానికి పాల్పడ్డారని మండిపడ్డారు.తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రెస్‌మీట్ నిర్వహించిన మేరుగు నాగార్జున.. చంద్రబాబు ప్రభుత్వ పాలనను తూర్పారబట్టారు. ‘ ప్రజలకు సంక్షేమం అందించాల్సిందిపోయి వార్నుంచే డబ్బులు గేసుకుంటున్నారు. దీపం పథకానికి రూ.4500 కోట్లు అవసరమైతే రూ.800 కోట్లతో సరిపెట్టారు. ఇంతేనా దీపం పథకాన్ని అమలు చేయటం?, అన్నా క్యాంటీన్‌కు ఒకసారి వెళ్తే రెండో సారి వెళ్లే పరిస్థితి లేకుండా నిర్వహణ చేస్తున్నారు. వృద్దులు, వికలాంగుల పెన్షన్లు కట్ చేసి వారి జీవితాలతో అడుకుంటున్నారు.రైతులకు రూ.20 వేలు పెట్టుబడి సాయం ఇస్తామని దగా చేశారు. రైతులకు అండగా ఉంటూ రేపు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తాం.వ్యవసాయం దండగా అని తన పుస్తకంలో రాసుకున్న వ్యక్తి చంద్రబాబు. జగన్ హామీ ఇచ్చాడంటే దాన్ని అమలు చేసి చూపించాడు. చంద్రబాబు ఏనాడూ ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. నిరుద్యోగ భృతి పేరుతో ఒక్క పైసా కూడా యువకులకు ఇవ్వలేదు. వాలంటీర్లను ఉద్యోగాల్లో నుండి తొలగించారు.ప్రభుత్వం అసూయ, కక్షలతో పరిపాలన చేస్తోంది. చివరికి ఐపీఎస్, ఐఏఎస్‌లను కూడా వదలకుండా వేధింపులకు గురి చేస్తున్నారు. ఆరు నెలల్లోనే ప్రభుత్వంపై ప్రజలకు తీవ్ర వ్యతిరేకత వచ్చింది’అని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: టార్గెట్ నాగబాబు.. లోకేష్‌కు బూమరాంగ్! -
కూటమి ప్రభుత్వం వచ్చాక పిల్లల భవిష్యత్తును నాశనం
-
ఏ సోషల్ మీడియా కార్యకర్త భయపడొద్దు.. మీకు అండగా జగనన్నఉన్నాడు
-
నాగార్జునపై పెట్టిన కేసును ఏం చేస్తారు?
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి మేరుగు నాగార్జున, మరొకరిపై తాను చేసిన ఆరోపణలన్నీ అసత్యాలని, ఆయన తనపై అత్యాచారం చేయలేదంటూ ఫిర్యాదుదారే ప్రమాణపూర్వక అఫిడవిట్ దాఖలు చేసినందున, ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసును ఏం చేయదలచుకున్నారో చెప్పాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఆ కేసును కొనసాగిస్తారో లేదో పూర్తి వివరాలను లిఖితపూర్వకంగా తమ ముందుంచాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. అప్పటివరకు నాగార్జునపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కేసు కొట్టేయాలంటూ నాగార్జున పిటిషన్ ఉద్యోగం, కాంట్రాక్ట్‌లు ఇప్పిస్తానంటూ తన వద్ద డబ్బులు తీసుకున్నారని, లైంగికంగా వేధించారంటూ విజయవాడకు చెందిన పద్మావతి ఇచి్చన ఫిర్యాదు మేరకు నాగార్జునపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు కొట్టేయాలని కోరుతూ నాగార్జున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం గత వారం విచారణకు రాగా.. పద్మావతి కోర్టు ముందు హాజరై, నాగార్జునపై తానిచి్చన ఫిర్యాదులోని అంశాలు అవాస్తవాలని తెలిపారు. తనపై లైంగిక దాడి చేయలేదని, తమ ఇద్దరి మధ్య ఎలాంటి ఆర్థిక లావాదేవీలు కూడా లేవని చెప్పారు. సమాజంలో చాలా పెద్దవారు, రాజకీయ బలం ఉన్న వారు చేసిన ఒత్తిడి వల్ల నాగార్జునపై ఫిర్యాదు ఇచ్చినట్లు వివరించారు. ఆ మేరకు ఓ అఫిడవిట్ దాఖలు చేశారు. దీంతో ఈ కేసు డైరీ (సీడీ)ని తమ ముందుంచాలని న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు. రాజకీయ ఒత్తిళ్లతోనే ఫిర్యాదు చేశానని మరోసారి కోర్టుకు చెప్పిన పద్మావతి ఈ వ్యాజ్యం మంగళవారం మరోసారి విచారణకు వచ్చింది. పోలీసుల తరఫున అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) సాయి రోహిత్ సీడీ ఫైల్‌ను న్యాయమూర్తికి అందజేశారు. దానిని న్యాయమూర్తి పరిశీలించారు. అనంతరం పద్మావతితో న్యాయమూర్తి మాట్లాడారు. ప్రమాణ పత్రం గురించి ప్రశ్నించారు. దానిని తానే దాఖలు చేశానని పద్మావతి తెలిపారు. నాగార్జున తనపై లైంగిక దాడి చేయలేదని, రాజకీయ ఒత్తిళ్లతోనే ఫిర్యాదు చేశానని మరోసారి చెప్పారు. కేసు ఎందుకు పెట్టాల్సి వచి్చందో సవివరంగా అఫిడవిట్ దాఖలు చేస్తామని పద్మావతి తరఫు న్యాయవాది టి.నాగార్జున రెడ్డి తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్‌పై తప్పుడు ఫిర్యాదు ఇచ్చానంటూ ఫిర్యాదుదారే ప్రమాణపూర్వకంగా చెప్పినందున, కేసును ఏం చేస్తారో చెప్పాలని పోలీసులను ఆదేశించారు. -
మేరుగుపై తప్పుడు కేసు.. నిజం ఒప్పుకున్న మహిళ
సాక్షి, విజయవాడ: తనపైన ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో తాడేపల్లి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ మాజీ మంత్రి మేరుగు నాగార్జున దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది.విచారణ సందర్భంగా తనకు, మేరుగు నాగార్జునకి ఎటువంటి సంబంధం లేదంటూ ఆ మహిళ ప్రమాణ పత్రం దాఖలు చేసింది. తనను కొంతమంది భయపెట్టడం వల్లే మేరుగ నాగార్జునపైన తప్పుడు కేసు పెట్టానని పద్మావతి స్పష్టం చేసింది. తనపై ఆయన ఎలాంటి దాడి చేయలేదని ఆమె పేర్కొంది.‘‘తాను ఆయనకు డబ్బులు ఇవ్వలేదు. కొంతమంది రాజకీయం కోసం నన్ను పావుగా వాడుకున్నారు. కొన్ని ఒత్తిళ్లు, అయోమయానికి గురై తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాల్సి వచ్చింది. మూడు రోజుల క్రితమే ఈ విషయాన్ని తాడేపల్లి పోలీసులు కూడా తెలిపానని ప్రమాణపత్రంలో పద్మావతి తెలిపింది. -
మేరుగు నాగార్జునపై తప్పుడు కేసు..
-
నేను ఏ తప్పూ చేయలేదు.. ఏ టెస్ట్‌కైనా సిద్ధం: మేరుగు నాగార్జున
సాక్షి, గుంటూరు: తనపై ఆరోపణలు చేసి, ఫిర్యాదు చేసిన మహిళతో తనకెలాంటి సంబంధం లేదని, ఆమె తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, తాను ఎలాంటి టెస్ట్‌లకైనా సిద్ధమని మాజీ మంత్రి మేరుగు నాగార్జున ప్రకటించారు. తాను ఆమె దగ్గర రూ.90 లక్షలు తీసుకున్నానని, ఆమెను లోబర్చుకోవడానికి ప్రయత్నించానని చేస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు.రాజకీయాల్లో చాలా కింది స్థాయి నుంచి ఎంతో కష్టపడి ఎదిగానన్న మాజీ మంత్రి, నాడు వైఎస్సార్ హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్‌గా పని చేశానని గుర్తు చేశారు. ఆ తర్వాత క్రమంగా మంత్రిగా ఎదిగిన విషయాన్ని ప్రస్తావించారు. ‘నిరంతరం నేను ప్రజల మధ్య ఉంటాను. నన్ను కలిసేందుకు, నా సహాయం కోసం అనేక మంది వస్తుంటారు. ఎవరికైనా సరే సహాయం చేయాలని అనుకుంటాను. నాపై ఈ ఆరోపణలు, ఫిర్యాదు అంతా కూడా కుట్ర ప్రకారం జరిగింది. చాలా బాధగా ఉంది. నా గురించి ప్రజలకు అంతా తెలుసు’ అని తెలిపారు.తనపై చేసిన ఫిర్యాదుపై తానే స్వయంగా జిల్లా ఎస్పీని కలిసి పూర్తిస్ధాయి విచారణ కోరుతానని మాజీ మంత్రి తెలిపారు. ఈ కుట్ర వెనక ఎవరున్నారో బయట పడాల్సిన అవసరం ఉందని చెప్పారు. అవసరమైతే ప్రైవేట్ కేసులు కూడా వేస్తానన్న ఆయన, కుట్ర వెనుక ఉన్న ఎవరినీ వదిలిపెట్టబోనని తేల్చి చెప్పారు. -
బావ, బామ్మర్దుల.. అన్ స్టాపబుల్ అబద్ధాలు
-
బాబూ.. ఎన్టీఆర్ మరణంపై షోలో మాట్లాడితే బాగుండేది: మేరుగు
సాక్షి, తాడేపల్లి: ప్రజలను వంచించి రాజకీయాలు చేయటమే చంద్రబాబు నైజం అని అన్నారు మాజీ మంత్రి మేరుగు నాగార్జున. ఇచ్చిన హామీలను అమలు చేయటం అనే ఆలోచనే చంద్రబాబుకు లేదన్నారు. అలాగే, ఎన్టీఆర్ మరణానికి కారకులు ఎవరో కూడా ఆహా షోలో చంద్రబాబు, బాలకృష్ణ చెబితే బాగుండేది అంటూ కామెంట్స్ చేశారు.మాజీ మంత్రి మేరుగు నాగార్జున శనివారం మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు తన స్వార్ధ రాజకీయాల కోసం ఏమైనా చేయగలరు. ప్రజలను మోసం చేసైనాసరే అధికారంలోకి రావాలన్నదే ఆయన ఆకాంక్ష. అన్‌స్టాపబుల్ కార్యక్రమం గురించి తెగ హైప్ క్రియేట్ చేశారు. ఎన్టీఆర్ మరణానికి కారకులు ఎవరో కూడా ఆహా షోలో చంద్రబాబు, బాలకృష్ణ చెబితే బాగుండేది. రాబోయే ఐదేళ్లు కరెంటు ఛార్జీలు పెంచనని చంద్రబాబు చెప్పారు. కానీ ఇప్పుడు అడ్డగోలుగా మాట తప్పి వేల కోట్ల భారం జనం మీద వేయబోతున్నారు. రూ.6,072 కోట్లు విద్యుత్ ఛార్జీల పేరుతో జనాన్ని బాదబోతున్నారు.ప్రజలను వంచించి రాజకీయాలు చేయటమే చంద్రబాబు నైజం. ఇచ్చిన హామీలను అమలు చేయటం అనేదే చంద్రబాబుకు లేదు. నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. పంటల ఉచిత బీమాని ఎత్తేసి వ్యవసాయాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు. రూ.20 వేలు చొప్పున రైతులకు ఆర్ధికసాయం అని చెప్పి మోసం చేశారు. రాజమండ్రి జైలులో దోమలు కుడితే ప్రాణానికి హాని అంటూ హడావుడి చేశారు. మాదకద్రవ్యాల కేసులోని ఖైదీలతో ప్రమాదం ఉందని అప్పుడు చెప్పారు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు. అంబులెన్స్ పక్కన ఉండాల్సిందేనని చెప్పి బెయిల్ తెచ్చుకున్నారు. మరి ఇప్పుడు కూడా అంబులెన్స్ పక్కన పెట్టుకునే నిద్ర పోతున్నారా?. డయేరియా, డెంగ్యూలతో జనం చచ్చిపోతుంటే చంద్రబాబుకు పట్టదా. చంద్రబాబుకు ఒక రూల్, ప్రజలకు ఒక రూలా? అని ప్రశ్నించారు. -
సహానా మృతిపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రులు
-
మధిర సహాన మృతిపై వైఎస్సార్సీపీ నేతల తీవ్ర విచారం
సాక్షి,గుంటూరు: టీడీపీ రౌడీషీటర్ నవీన్ దాడిలో గాయపడి మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన మధిర సహాన చివరకు ఓడిపోయింది. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. సహాన మరణంపై సమాచారం అందుకున్న వైఎస్సార్సీపీకి మాజీ మంత్రులు మేరుగు నాగార్జున, విడదల రజిని, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మేయర్ మనోహర్ నాయుడు, నూరి ఫాతిమా, డైమండ్ బాబు యువతి కుటుంబాన్ని పరామర్శించారు.అనంతరం మాజీ మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. ‘ఇవన్నీ ప్రభుత్వ హత్యలే. సహన విషయంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకున్నారో అందరూ చూస్తున్నారు. అక్కడి మంత్రి ఏమైపోయారు. ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. దిశ యాప్ లేకపోవటం వల్లే రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయింది. సహాన మరణ వార్తపై వైఎస్ జగన్ విచారం వ్యక్తం చేశారు. రేపు (బుధవారం)సహన కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తున్నారు’ అని అన్నారు. సహానా మరణంపై మాజీ మంత్రి విడదల రజిని విచారం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఇందుకు సహానలాంటి ఘటనలే నిదర్శనం. సహాన శరీరంపై గాయాలున్నాయి. బయటకు చెప్పుకోలేని అభద్రతాభావంలో సహన తల్లిదండ్రులు ఉన్నారు. మహిళలకు రక్షణ లేదన్న భావన వ్యక్తం అవుతోంది. దిశ లాంటి చట్టాలను వైఎస్ జగన్ హయాంలో తీసుకొచ్చారు. దిశ లాంటి చట్టాల అవసరం ఉంది. మహిళల రక్షణ పట్ల ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
పోరాటాలు వైఎస్సార్సీపీకి కొత్తేమి కాదు: కారుమూరి
సాక్షి, బాపట్ల జిల్లా: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటారని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచి కూటమి ప్రభుత్వం దుర్మార్గపు పాలన చేస్తోందని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఎవరు అధైర్య పడాల్సిన పనిలేదని, పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. పోరాటాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొత్తేమి కాదని చెప్పారు.బాపట్ల జిల్లా ఎమ్‌ఎస్సార్ కళ్యాణ మండపంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మేరుగు నాగార్జున ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఎమ్మెల్సీ లేళ్లప్పిరెడ్డి, ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి, నియోజకవర్గ ఇంచార్జీలు వరికుట్టి అశోక్ బాబు, ఈవూరి గణేష్, కరణం వెంకటేష్, హనుమారెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి శ్యామల, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.పోలీసులు కూటమి నాయకులకు కొమ్ముగాస్తున్నారు!అనంతరం మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. తన మీద నమ్మకంతో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఎంతో పెద్ద బాధ్యత అప్పగించారని తెలిపారు. ఏ కార్యకర్తకు ఇబ్బంది వచ్చిన ముందు తాముంటామని పేర్కొన్నారు. కూటమి నాయకులు జిల్లాలో కొన్నిచోట్ల తమ పార్టీ కార్యకర్తలను, నాయకులను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో మహిళలు, చిన్నారులపై దాడులు, అఘాయిత్యాలు హత్యలు పెరిగిపోయాయని అన్నారు. పోలీసులు కూటమి నాయకులకు కొమ్ముగాస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు: శ్యామల‘కోవిడ్ లాంటి భయంకరమైన విపత్తు వస్తే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎవరిని యాచించలేదు. కానీ ఎప్పటి ప్రభుత్వం విపత్తు వస్తే ప్రజల నుంచి విరాళాలు యాచించే పరిస్థితి. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు. రాష్ట్రంలో చిన్నారులపై అఘాయిత్యాలు, మహిళలపై దాడులు హత్యలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం మహిళల భద్రతపైన దృష్టి పెట్టలేదు కానీ మద్యంపైన దృష్టి పెట్టింది’. అని విమర్శలు గుప్పించారు.కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది: లేళ్ల అప్పిరెడ్డి‘పేదలు, అణగారిన వర్గాల ప్రజల జీవితాల్లో మార్పు కోసం వైఎస్ జగన్ ఎన్నో పథకాలు అమలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలని టార్గెట్ చేసి దాడులు చేసి వేదిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జోలికొస్తే చూస్తూ ఊరుకోం. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది’ అన్నారు. -
ఈవీఎంలపై చంద్రబాబు మాటల గారడీ.. సాక్ష్యాలు చూపిన మేరుగు నాగార్జున
-
చంద్రబాబుపై మెరుగు నాగార్జున ఫైర్
-
ఎందుకు గావుకేకలు పెడుతున్నారు. టీడీపీ నేతలను మేరుగు అదిరిపోయే కౌంటర్
-
నంబూరి శంకర్ రావు పై దాడి మేరుగ నాగార్జున రియాక్షన్
-
హోంమంత్రి అనితా.. అధికారం శాశ్వతం కాదు: మేరుగు నాగార్జున
సాక్షి, గుంటూరు: అధికారం శాశ్వతం కాదు.. టీడీపీ నేతలు, కార్యకర్తలు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు మాజీ మంత్రి మేరుగు నాగార్జున. ఇదే సమయంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులపై దాడులు చేసి విధ్వంసాలు చేసి భయపెట్టాలని ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కామెంట్స్ చేశారు.పల్నాడు జిల్లాలో వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావుపై టీడీపీ నేతలు మంగళవారం దాడికి పాల్పడ్డారు. ఈ దాడిపై మేరుగు నాగార్జున స్పందించారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘నంబూరు శంకర్రావుపై దాడి చేయడం హేయమైన చర్య. పల్నాడులో జరుగుతున్న దాడులపై హోంమంత్రి అనిత సమాధానం చెప్పాలి. హోం మంత్రి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. పల్నాడులో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలపై జరుగుతున్న దాడులపైన మాత్రం ఆమె మాట్లాడటం లేదు.అధికారం శాశ్వతం కాదు అది గుర్తుపెట్టుకోండి. మా పార్టీ కార్యకర్తలు, నాయకులపైన దాడులు, విధ్వంసాలు చేసి భయపెడదాం అనుకుంటే కుదరదు. పోలీసుల సమక్షంలోనే దాడి జరగటం చాలా దారుణం. మా కార్యకర్తలను కొడుతున్నారని శంకర్రావు ఎస్పీకి ఫోన్ చేశారు. పల్నాడు జిల్లా ఎస్పీ మీ కార్యకర్తలు ఎందుకు అంత మంది వచ్చారని అడుగుతున్నారు. తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు వందల మంది కర్రలు, రాళ్లు తీసుకుని రోడ్లపైకి వస్తే వాళ్లని ఎందుకు ప్రశ్నించడం లేదు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపైన దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి’ అని డిమాండ్ చేశారు.ఇది కూడా చదవండి: పల్నాడులో మరోసారి రెచ్చిపోయిన టీడీపీ గూండాలు -
ఇంతకంటే దారుణాలు ఇంకేమైనా ఉన్నాయా? చంద్రబాబుపై మెరుగు నాగార్జున ఫైర్
-
రాష్ట్రంలో రాజకీయ కక్షతో పాలన సాగుతోంది
-
పోలీసులకే రక్షణ లేదు.. ఇంక ప్రజలకా?: మేరుగు నాగార్జున ఫైర్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో నారా వారి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు మాజీ మంత్రి మేరుగు నాగార్జున. రాష్ట్రంలో రాజకీయ కక్షతో పాలన సాగుతోందన్నారు. అలాగే, పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు.కాగా, మాజీ మంత్రి మేరుగు నాగార్జున బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైంది. చంద్రబాబు అసమర్థ పాలనతో పోలీసుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతిన్నది. టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు భార్య పుట్టినరోజు అని పోలీసులు కేక్ కట్ చేయటం ఏంటి?. అసలు ఆమెకి ఏ హోదా ఉందని పోలీసులు అలా వ్యవహరించారు?. టీడీపీ ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి వీడియో కాల్లో సీఐతో సారీ చెప్పించుకున్నారు. ఇంతకంటే దారుణాలు ఇంకేమైనా ఉన్నాయా?. రాజ్యాంగం, చట్టాలు ఉన్నట్టు చంద్రబాబుకు గుర్తులేదా?. పథకం ప్రకారం వ్యవస్థలన్నింటినీ నీరు గార్చుతున్నారు.పోలీసుల మీద తప్పుడు కథనాలు రాయించటం, తర్వాత వారిపై వేటు వేయటం అలవాటుగా మారింది. ఐపీఎస్‌లకు విధులు, బాధ్యతలు లేకుండా పక్కన కూర్చోపెట్టారు. నిజాయితీగా పనిచేయడమే వారు చేసిన తప్పా?. సీతారామపురంలో వైఎస్సార్సీపీ నేత సుబ్బరాయుడి హత్య జరుగుతోందని తెలిసినా పోలీసులు పట్టించుకోలేదు. తొందపడి వెళ్తే చంద్రబాబు ఏం అంటారోనని పోలీసులు భయపడి వెళ్లలేదు. ఇలాంటి పరిస్థితులు వలన పోలీసు వ్యవస్థకి కలంకం ఏర్పడుతోంది.తాడిపత్రిలో జేసీ ఫ్యామిలీకి ఇదేం రాక్షసానందం? సీఐ లక్ష్మీకాంత రెడ్డితో క్షమాపణలు చెప్పించుకున్న @JaiTDP ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి అధికారమదంతో పోలీసుల మనోభావాల్ని దెబ్బతీస్తూ అందరి ముందు సీఐ నుంచి క్షమాపణలు చెప్పించుకున్న జేసీ అస్మిత్ రెడ్డి pic.twitter.com/UNSgk2TEMt— YSR Congress Party (@YSRCParty) August 27, 2024 ప్రజలను రక్షించాల్సిన పోలీసులు తమను తాము రక్షించుకోవాల్సిన దుస్థితిలోకి వెళ్లారు. అసలు రాష్ట్రంలో రాజ్యాంగం నడుస్తోందా?. నారా వారి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందా?. ఏపీలో పోలీసులే కాదు ప్రతీ అధికారి భయంతో బతుకుతున్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలకు అధికారులు జీ హుజూర్ అంటున్నారు. భట్టిప్రోలులో ఒక టీడీపీ కార్యకర్త పోలీసు చొక్కా పట్టుకున్నారు. కడప జిల్లాలో మంత్రి భార్య పోలీసులను బెదిరించారు. లోకేష్ భార్య, కొడుక్కి పోలీసులు గౌరవవందనం చేయటం ఏంటి?. ముంబై వారికి సంబంధించి ఒక కేసు వస్తే పోలీసులు కేసు కట్టారు. దాని గురించి ఎల్లో మీడియా వైఎస్సార్సీపీ నేతలపై విష ప్రచారం చేస్తోంది. కేసు, ఎఫ్ఐఆర్ రికార్డులోనే ఉంది. ఇందులో ఇద్దరు అధికారులు, వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేశారు. ఈ కేసులో ఇంకా ఏం చేస్తారో చూస్తాం అంటూ కామెంట్స్ చేశారు. చిలకలూరిపేటలో పతాక స్థాయికి చేరిన పోలీసుల స్వామి భక్తిఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు భార్య వెంకాయమ్మ పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించిన పోలీసులు గతంలో టోల్ గేట్ దగ్గర గొడవతో వివాదంలో చిక్కుకున్న వెంకాయమ్మ. పాత సంగతుల్ని ఎమ్మెల్యే భార్యని ప్రసన్నం చేసుకోవడానికి పోలీసులు… pic.twitter.com/CiR6NmsbVm— YSR Congress Party (@YSRCParty) August 27, 2024 -
ఎలక్షన్ కమిషన్ ఎందుకు తడబడుతుంది?.. మేరుగు నాగార్జున సంచలన వ్యాఖ్యలు
-
బాబూ.. అంబేద్కర్ భావజాలంపై దాడులా?: మేరుగు నాగార్జున
సాక్షి, కాకినాడ: ఏపీలో అంబేద్కర్ భావజాలం మీద దాడులు జరుగుతున్నాయన్నారు మాజీ మంత్రి మేరుగు నాగార్జున. వ్యాపారం చేసుకోవాలనుకున్న ప్రదేశంలో అంబేద్కర్ విగ్రహం పెట్టడాన్ని చంద్రబాబు సహించలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, మేరుగు నాగార్జున గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘అంబేద్కర్ ఆలోచన విధానంపై చంద్రబాబు ప్రభుత్వం కర్కశంగా పని చేస్తోంది. అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని అసెంబ్లీలో హామీ ఇచ్చి అమలు చేయని వ్యక్తి చంద్రబాబు. విగ్రహం ఎక్కడ పెడుతున్నారు అని నాలాంటి వాళ్ళు వెళితే అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. విజయవాడ నడి బొడ్డులో కోట్లు ఖరీదైన స్థలంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అంబేద్కర్ స్మతివనాన్ని వైఎస్ జగన్ నిర్మించారు.వైఎస్ జగన్ ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం మీద చంద్రబాబుకు ఆగ్రహం పెరిగింది. వ్యాపారం చేసుకోవాలనుకున్న ప్రదేశంలో అంబేద్కర్ విగ్రహం పెట్టడాన్ని చంద్రబాబు సహించ లేకపోయారు. అంబేద్కర్ విగ్రహం మీద పొలుగులు, గునపాలతో దాడి చేయించారు. టీడీపీ తన కర్కశత్వాన్ని చూపించింది. అంబేద్కర్‌పై దాడి మీ తేలిక స్వభావాన్ని బయట పెట్టింది. మేము ఫిర్యాదు చేసిన తొమ్మిదో తారీఖు వరకు కేసు పెట్టరా?.వైఎస్ జగన్ సూచనల మేరకు మేము నిన్న ఢిల్లీలో జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేశాం. జరిగిన విషయాలు చెబితే ఎస్సీ కమిషన్ ముక్కు మీద వేలు వేసుకుంది. అంబేద్కర్ విగ్రహంపై దాడికి సంబంధించి జాతీయ ఎస్సీ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరుతుంది. త్వరలో జాతీయ ఎస్సీ కమిషన్ విజయవాడలో పర్యటిస్తుంది. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా అంబేద్కర్‌పై దాడులు చేపించలేదు. బాబా సాహెబ్ ఆలోచన విధానాన్ని కాపాడుకోవాలని విజ్ఞులను కోరుతున్నాను’ అంటూ కామెంట్స్ చేశారు. -
కక్ష సాధింపులా.. చూస్తూ ఊరుకోం: వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, విజయవాడ: ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేస్తోందని మాజీ మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. జోగి రమేష్ కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందన్నారు.మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘అనుకున్నట్లే కక్ష సాధింపు చర్యలకు దిగారు. అగ్రిగోల్డ్ భూముల కేసులో రాజీవ్ పాత్ర ఉంటే చర్యలు తీసుకోండి.. కానీ లీగల్‌గా కొన్న భూములకు ఇప్పుడు అక్రమ కేసులు పెడుతున్నారు. జోగి రమేష్‌కి అపఖ్యాతి తెచ్చేందుకు అరెస్టులు చేసి దర్యాప్తు పేరుతో వేధిస్తున్నారు. పథకం ప్రకారమే దాడి జరుగుతుంది. కేసులు పెడితే సరిపోదు మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. కక్ష సాధింపు చర్యలో భాగంగా జోగి రమేష్ పావుగా మారారు.’’ అని మేరుగ పేర్కొన్నారు.తిరగబడే రోజులు వస్తాయి: వెల్లంపల్లి శ్రీనివాస్మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ తప్పు జరిగితే పోలీసులు విచారణ చేయాలి. జోగి రమేష్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తున్నారనే అక్రమ కేసులు పెడుతున్నారు. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టడమే పనిగా చంద్రబాబు పెట్టుకున్నారు. తప్పుడు కేసులకు వైఎస్సార్సీపీ నేతలు ఎవ్వరూ తలొగ్గరు. జోగి రమేష్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే చూస్తూ ఊరుకోం. అమ్మఒడి,రైతు భరోసా ఎందుకు ఇవ్వలేదు. పథకాల అమలుపై నిలదీస్తారని భయపడి ప్రతిపక్ష పార్టీ నేతలపై కేసులు పెడుతున్నారు. ఇలాగే ప్రభుత్వ వ్యవహరిస్తే వైఎస్సార్సీపీ నేతలు తిరగబడే రోజులు వస్తాయి’’ అంటూ వెల్లంపల్లి వార్నింగ్ ఇచ్చారు.గొంతు నొక్కాలని చూస్తే ఊరుకోం: లేళ్ల అప్పిరెడ్డిబలహీన వర్గాల నాయకుడిపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి మండిపడ్డారు. జోగి రమేష్ కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేయాలని చూస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలే టార్గెట్‌గా ప్రభుత్వం పనిచేస్తోందని దుయ్యబట్టారు. ‘‘లీగల్ గానే భూమిని కొనుగోలు చేశారు. లీగల్‌గానే అమ్మారు. విదేశాల్లో ఉన్నత చదువులు చదివి ఏపీకి వస్తే ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టింది. రాజీవ్‌పై అక్రమ కేసులు పెట్టడం ద్వారా జోగి రమేష్ గొంతు నొక్కాలని చూస్తే ఊరుకోం’’ అని లేళ్ల అప్పిరెడ్డి హెచ్చరించారు. -
టీడీపీ, చంద్రబాబుపై మేరుగు నాగార్జున ఫైర్
-
‘అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయాలన్నదే కూటమి సర్కార్ ప్లాన్’
సాక్షి, విజయవాడ: అంబేద్కర్ విగ్రహంపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు మాజీ మంత్రి మేరుగు నాగార్జున. విగ్రహంపై ఉద్దేశపూర్వకంగా దాడి జరిగిందన్నారు. అంబేద్కర్ విగ్రహం ప్రతిష్టించడం టీడీపీ నేతలకు ఇష్టంలేదని చెప్పుకొచ్చారు.కాగా, విజయవాడలో అంబేద్కర్ విగ్రహంపై జరిగిన దాడిని ఖండిస్తూ వైఎస్సార్సీపీ నేతలు నిరసన చేపట్టారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసనల్లో మాజీ మంత్రి మేరుగ నాగార్జున, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైఎస్సార్సీపీ నేతలు దేవినేని అవినాష్,షేక్ ఆసిఫ్, పోతిన మహేష్, దళిత సంఘం నేతలు, వైఎస్సార్సీపీ శ్రేణులు పాల్గొన్నాయి.👉ఈ సందర్భంగా మాజీ మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. అంబేద్కర్ విగ్రహాన్ని కొంతమంది ధ్వంసం చేయాలని చూశారు. ఈ దుశ్చర్యను యావత్ రాష్ట్ర ప్రజానీకం ఖండించారు. అంబేద్కర్‌ను అవమాన పరిచిన వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత నిరసన చేపట్టాం. ఈ ఘటనకు కారకులైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈ నిరసన తెలిపాం. కొంతమంది కళ్లు లేని కబోథులు అక్షరాలే కదా అని అజ్ఞానంతో మాట్లాడుతున్నారు. అంబేద్కర్ విగ్రహం ఉన్న ప్రాంతంలో ఏ చిన్న అవాంతరం జరిగినా అవమానమే. గునపాలతో దాడి చేసేందుకు వస్తే మీకు కళ్లు కనిపించలేదా?. అంబేద్కర్ విగ్రహం బెజవాడ నడిబొడ్డున ఉండటం చంద్రబాబుకు, టీడీపీ నేతలకు ఇష్టం లేదు. అంబేద్కర్‌ను అవమాన పరిచిన వారు ఎంతటి వారైనా విడిచిపెట్టవద్దని గవర్నర్, రాష్ట్రపతికి లేఖలు ఇచ్చాం. ఈ ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేస్తాం. అంబేద్కర్ విగ్రహంపై గునపం పడితే ఊరుకునేది లేదు. మా ఆందోళన ఉధృతం చేస్తాం. ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్తాం. ఈ ఘటనకు సంబంధించి బాధ్యులు ఎలాంటి వారైనా శిక్ష పడాల్సిందేనని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 👉మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. అంబేద్కర్ విగ్రహం ఉండటాన్ని ఈ ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది. ఈ ఘటనపై ఇంతవరకూ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం. రాత్రి పూట లైట్లు ఆర్పి అంబేద్కర్ విగ్రహంపై దాడి చేశారు. అంబేద్కర్ విగ్రహం చుట్టూ సెక్యూరిటీ లేదు. ఉద్దేశపూర్వకంగానే ఈ దాడి జరిగింది. ఈ దాడి ఘటనపై కేంద్రాన్ని, గవర్నర్, రాష్ట్రపతిని, కోర్టులను ఆశ్రయిస్తాం. 👉వైఎస్సార్సీపీ నేత దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. అంబేద్కర్ విగ్రహంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు ఉండకూడదని నీచమైన చర్యలకు పాల్పడ్డారు. కూటమి ప్రభుత్వం దిగజారిపోయి వ్యవహరిస్తోంది. అంబేద్కర్ విగ్రహంపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి. 👉విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. గతంలో ఎప్పుడూ లేని సాంప్రదాయానికి కూటమి ప్రభుత్వం తెర తీసింది. అంబేద్కర్ విగ్రహంపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దాడి ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. 👉వైఎస్సార్సీపీ నాయకుడు పోతిన మహేష్ మాట్లాడుతూ.. అంబేద్కర్ విగ్రహంపై దాడిని ప్రజాస్వామ్యం పై దాడిగా పరిగణిస్తాం. రాజ్యాంగంపై నమ్మకం ఉంటే ఈ ఘటనను ప్రభుత్వం ఖండించి ఉండేది. ఈవీఎంలను నమ్ముకున్నారు కాబట్టే అంబేద్కర్‌పై జరిగిన దాడిని ఖండించ లేకపోతున్నారు. చంద్రబాబు అంబేద్కర్ విగ్రహం వద్దకు వచ్చి ఎందుకు నివాళులర్పించలేదు. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి. అంబేద్కర్‌కు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. ఘటన జరిగి 24 గంటలు గడుస్తున్నా ఎందుకు ప్రభుత్వం స్పందించలేదు. స్వరాజ్య మైదానాన్ని చంద్రబాబు చైనా కంపెనీలకు, సుజనా చౌదరికి అమ్మేయాలని చూశారు. వారసత్వ సంపదైన స్వరాజ్య మైదానాన్ని చంద్రబాబు దోచుకోవాలని చూశారు. కానీ, వైఎస్ జగన్ మాత్రం కాపాడారు. కుట్రలు కుయుక్తలతో అంబేద్కర్ విగ్రహాన్ని విధ్వంసం చేయాలనేదే కూటమి పార్టీల ఉద్ధేశం. పవన్ కళ్యాణ్ ఈ ఘటనపై ఎందుకు స్పందించలేదు. అంబేద్కర్ విగ్రహంపై దాడికి పాల్పడిన వారిని శిక్షించకపోతే రాష్ట్ర ప్రజలు త్వరలోనే మిమ్మల్ని తిరస్కరిస్తారు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
అంబేద్కర్ విగ్రహాన్ని కూటమి సర్కార్ కూల్చే అవకాశముంది: మేరుగు నాగార్జున
సాక్షి, తాడేపల్లి: విజయవాడలోని అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూలగొట్టే అవకాశముందన్నారు మాజీ మంత్రి మేరుగు నాగార్జున. అంబేద్కర్ విగ్రహాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అంటూ కామెంట్స్ చేశారు.కాగా, మాజీ మంత్రి మేరుగు నాగార్జున శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..‘భావితరాలకు దికూచ్చిగా ఉండాలని అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేయడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేశారు. గతంలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టమంటే చంద్రబాబు కేసులు పెట్టారు. ఎక్కడైనా విగ్రహం పెట్టినప్పుడు చూడటానికి వెళ్లినా కూడా కేసులు నమోదు చేశారు. ఇప్పుడు విజయవాడలో అంబ్కేదర్ విగ్రహంపై దాడికి ప్రయత్నించారు. కూటమి ప్రభుత్వంపై మాకు నమ్మకం లేదు. అంబేద్కర్ విగ్రహాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూలగొట్టే అవకాశముంది. ఇక్కడ అంబేద్కర్ విగ్రహం ఉండకూడదనే దాడి చేశారు. తక్షణమే ఈ ఘటనపై విచారణ చేపట్టాలి. దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు.ఇదే సమయంలో మాజీ ఎంపీ నందిగాం సురేష్ మాట్లాడుతూ..‘ప్రజల దృష్టిని మళ్లించడానికే అంబేద్కర్ విగ్రహంపై దాడి చేశారు. ప్రజలను భయభాంత్రులకు గురి చేస్తున్నారు. ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చారు. ఇప్పుడు హామీలు అమలు చేయకుండా కమిటీలు వేస్తామని కథలు చెబుతున్నారు’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు.మరోవైపు.. ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. అంబేద్కర్ విగ్రహంపై దాడిని ప్రజాస్వామ్యంపై దాడిగా పరిగణించాలి. ప్రభుత్వమే ఈ దాడి చేయించిందనే అనుమానం కలుగుతోంది. అంబేద్కర్ విగ్రహంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహంపై దాడి చేశారంటే వ్యవస్థలు ఎంతగా దిగజారిపోయాయి అనేది అర్థం చేసుకోవచ్చు. విగ్రహం వద్ద వైఎస్ జగన్ పేరుని తొలగించవచ్చేమో కానీ ప్రజల గుండెల్లో ఆయన పేరును తొలగించలేరు. అంబేద్కర్ విగ్రహానికి కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలి. దాడి జరుగుతున్న సమయంలో పోలీసులు దగ్గరలోనే ఉన్నా ఎందుకు పట్టించుకోలేదు?. సామాజిక న్యాయం కోసం అందరికీ తెలియాలనే ఉద్దేశంతో అంబేద్కర్ విగ్రహం నిర్మించారు. కూటమి నేతలకు సామాజిక న్యాయం అంటే పట్టదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక, ఇదే ఘటనపై తిరుపతిలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాట్లాడుతూ.. అంబేద్కర్ స్మృతివనం వద్ద దాడిని ఖండిస్తున్నాను. అన్ని జాతులకు ఆశాజ్యోతి బాబా సాహెబ్ అంబేద్కర్. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఆరాధ్యదైవంగా అంబేద్కర్‌ను భావిస్తారు. చంద్రబాబు ప్రభుత్వం ఈ ఘటనలో బాధ్యులైన వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలి. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలతో పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. దేశానికే ఆదర్శంగా ఉండాలని వైఎస్ జగన్ విజయవాడ నడి బొడ్డున అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తే చూస్తూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఘటనపై బాధ్యులను వెంటనే అరెస్టు చేయాలి అని కామెంట్స్ చేశారు. -
లోకేష్, పవన్ కు మేరుగు నాగార్జున సూటి ప్రశ్న
-
బాబూ.. ఏనాడైనా ఒక్క మెడికల్ కాలేజీ తెచ్చావా?: మేరుగ నాగార్జున
సాక్షి, తాడేపల్లి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏనాడైనా ఒక్క మెడికల్ కాలేజీని తెచ్చారా? అని ప్రశ్నించారు మాజీ మంత్రి మేరుగు నాగార్జున. చంద్రబాబు వైఖరి ఏరు దాటాక తెప్ప తగలేసే రకంగా ఉందని సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఏపీలో మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడం కరెక్ట్ కాదన్నారు.కాగా, మాజీ మంత్రి మేరుగు నాగార్జున గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నికలకు ముందు మెడికల్ కాలేజీలపై చంద్రబాబు, పవన్, లోకేష్ విషం కక్కారు. వైద్య విద్యను అమ్మేశారంటూ ఎల్లో మీడియాలో అడ్డగోలుగా రాతలు రాశారు, మాట్లాడారు. చంద్రబాబు వైఖరి ఏరు దాటాక తెప్ప తగలేసే రకంగా ఉంది. వైద్య విద్యను ఇప్పుడు ప్రైవేటుపరం చేస్తున్నారు. దీనిపై కేబినెట్లో లోకేష్, పవన్ ఎందుకు మాట్లాడలేదు?. చంద్రబాబు ఏనాడైనా ఒక్క మెడికల్ కాలేజీ తెచ్చారా?.ఏపీలో 12 మాత్రమే మెడికల్ కాలేజీలు ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక మరో 17 కాలేజీలను తెచ్చారు. పేదల గురించి జగన్ ఆలోచిస్తారు కాబట్టే కొత్తగా మెడికల్ కాలేజీలు తెచ్చారు. ఏపీలో అదనంగా 750 సీట్లను వైఎస్ జగన్ పెంచగలిగారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ తెచ్చి పేదలకు వైద్యాన్ని అందించారు. 17 కాలేజీలను పూర్తి చేసి వైద్యాన్ని అందుబాటులోకి తేవాలి. ఈ కాలేజీలను ప్రైవేటుపరం చేయాలనుకోవడం కరెక్టు కాదు. వైద్య విద్య సక్రమంగా పేద విద్యార్థులకు అందాలి. లేకపోతే వైఎస్సార్సీపీ ఉద్యమాలు చేయటానికి రెడీగా ఉంటుంది. రోడ్లను ప్రైవేటీకరణ చేస్తానని చంద్రబాబు అంటున్నారు. టోల్ గేట్లు పెట్టి డబ్బు వసూలు చేయాలనుకుంటున్నారు. ఇలాంటి ప్రైవేటీకరణ గురించి ఎన్నికలకు ముందు ఎందుకు చెప్పలేదు? అని ప్రశ్నించారు. -
‘ఇదేం దుర్మార్గం చంద్రబాబూ.. రాజధానిలో పేదలు ఉండొద్దంటే ఎలా?’
గుంటూరు, సాక్షి: రాజధాని ప్రాంతంలో పేదలు ఉండకూడదనే చంద్రబాబు ఆలోచన అంటూ మాజీ మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. పేద రైతుల నుంచి పొలాలు తీసుకుని అదే పేదలు ఉండొద్దంటే ఎలా?. రాజధానిలో పేదలు ఉంటే ఇబ్బంది ఏంటి? అని ప్రశ్నించారు.తాడేపల్లిలోని వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశాల కోసం ప్రత్యేకంగా రూమ్‌ను సిద్దం చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన మీడియా రూమ్‌ను శాసనమండలిలో ప్రతిపక్షనేత లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు మందపాటి శేషగిరిరావు మంగళవారం ప్రారంభించారు.అనంతరం మాజీ మంత్రి మేరుగ నాగార్జున మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘‘పేదలకు ఇచ్చిన స్థలాలను చంద్రబాబు రద్దు చేయడం ఏంటి? అంటూ నిలదీశారు. అధికారంలోకి వచ్చాక అందరిని సమన్యాయం చేయాలని హితవు పలికారు. కులాలు,మతాలకు అతీతంగా వైఎస్ జగన్ సంక్షేమ పథకాలు అందిచ్చారు. చంద్రబాబు రెండు నెలల పాలన చూస్తేనే ఏం జరగబోతుందో అర్థమవుతోంది. జరుగుతున్న పరిణామాలన్నీ ప్రజలు గమనిస్తున్నారు’’ మేరుగ నాగార్జున చెప్పారు.‘‘రాష్ట్రంలో దాడులు పెట్రేగిపోతున్న చంద్రబాబు పట్టించుకోవడంలేదు. దాడులు నివారించే ఆలోచనే చంద్రబాబుకు లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో దాడులు మంచిదికాదు. మా పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాం’’ అని మేరుగ నాగార్జున భరోసా ఇచ్చారు. -
ఢిల్లీలో జగన్ ధర్నా.. చంద్రబాబుకు చెమటలు
-
ఏపీలో రాష్ట్రపతి పాలన.. మా డిమాండ్ ఇవే..
-
బాబు.. గీతం భూములపై శ్వేతపత్రం ఎక్కడ?: మేరుగు నాగార్జున
సాక్షి, తాడేపల్లి: కేవలం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నిందలు మోపడానికే చంద్రబాబు శ్వేతపత్రం విడుదలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి మేరుగు నాగార్జున. రాష్ట్రంలో కబ్జాలు చేసిన వాళ్లే మళ్లీ నీతులు చెబుతున్నారని విమర్శించారు.కాగా, మాజీ మంత్రి మేరుగు నాగార్జున తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు కేవలం అబద్ధాలతో కాలం గడుపుతున్నారు. చంద్రబాబు ఆస్థాన మీడియా ఇష్టం వచ్చినట్టు రాసింది. గీతం కాలేజీ భూములపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మాట్లాడటం లేదు?.38 ఎకరాల ప్రభుత్వ భూమిని గీతం యాజమాన్యం ఆక్రమించుకుంది. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఆక్రమించుకున్న భూములను మా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. కేవలం వైఎస్ జగన్‌పై నిందలు వేయడానికే చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు. అవినీతిపై ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం ఆయన హయాంలో జరిగిన దోపిడీలాగే ఉంది. విశాఖలోని దసపల్లా భూములు ప్రభుత్వానివి కాదని సుప్రీంకోర్టే చెప్పింది. అయినాసరే దానిపై కూడా చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేశారు. టీడీపీ ఆఫీసు కూడా ఆక్రమిత స్థలంలో కట్టారు. గీతం కాలేజీలో భూములను ఆక్రమించుకుంటే ఎల్లోమీడియా ఎందుకు రాయలేదు?. గీతం భూములపై టీడీపీ నేతలు చర్చకు రాగలరా?పేదల ఇళ్ల కోసం వైఎస్ జగన్ వేలాది ఎకరాలను ఇచ్చారు. రాజధానిలో 52 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తే కోర్టులకు వెళ్లి ఆపేయించారు. పేదలకు ఇళ్ల ఇచ్చిన స్థలాలలో ఇళ్లు కట్టించే దమ్ము చంద్రబాబుకు ఉందా?. ఇసుక గురించి మరోసారి చంద్రబాబు అబద్దాలు చెప్పారు. 2014-19 మధ్యలో కరకట్ట మీద చంద్రబాబు ఇంటి పక్కనే ఇసుక దోపిడీ చేయలేదా?. నేడు ఉచిత ఇసుక పేరుతో ముక్కు పిండి డబ్బు వసూలు చేస్తున్నారు. అప్పట్లో వనజాక్షి అనే తహశీల్దారుపై మీ ఎమ్మెల్యే దాడి చేయలేదా?. వారి విషయంలో చంద్రబాబు రాజీ చేయలేదా?.నాగావళి, కృష్ణా, గోదావరిలో ఇసుక దోపిడీ చేసింది టీడీపీ నేతలే. ఎన్జీటీ సైతం వంద కోట్ల పెనాల్టీ వేసింది చంద్రబాబు హయాంలోనే కదా. రూ.3,825 వేల కోట్లు మా హయాంలో ప్రభుత్వానికి వచ్చింది. మా ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమ రవాణా చేసిన వారిపై కేసులు పెట్టాం. వర్షాకాలంలో ఉపయోగపడేలా ఇసుక నిల్వలు పెడితే వాటిని టీడీపీ నేతలు అక్రమంగా అమ్ముకున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ఎప్పటికైనా అమలు చేయాల్సిందే. కానీ, దానిపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేసి ఎన్నికలలో లబ్ది పొందారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టం అది, రాష్ట్రానికి సంబంధం లేదు. ఆ చట్టం తప్పు అయితే కేంద్రతో మాట్లాడి అక్కడే ఆపేయించాలి’ అని డిమాండ్ చేశారు. -
ప్రభుత్వం మారితే వీసీలు మారాలా ?
-
ప్రభుత్వం మారితే వీసీలు మారాలా?: మేరుగు నాగార్జున
సాక్షి, విశాఖపట్నం/గుంటూరు: ఆంధ్రా యూనివర్సిటీలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు శనివారం హల్ చల్ చేశారు. అరుపులతో హడావుడి చేశారు. అధికారంలోకి వచ్చిన క్షణం నుంచే కక్ష సాధింపు చర్యలకు తెగబడుతున్న టీడీపీ ప్రభుత్వం.. చివరకు సరస్వతీ నిలయాలైన విశ్వవిద్యాలయాలపైనా విరుచుకుపడుతోంది. విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దే విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న వైస్ ఛాన్సలర్లు వెంటనే రాజీనామా చేసి వెళ్లిపోవాలని అల్టిమేటం జారీచేసిన సంగతి తెలిసిందే.యూనివర్శిటీలలో వీసీల బలవంతపు రాజీనామాలపై మాజీ మంత్రి మేరుగు నాగార్జున గుంటూరులోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ, వీసీల రాజీనామాల అంశం చాలా బాధాకరమన్నారు. తాను కూడా విశ్వవిద్యాలయంలో చదువుకుని, అధ్యాపకుడిగా పనిచేశానని తెలిపారు.‘‘ప్రభుత్వాలు వస్తుంటాయి, మారుతుంటాయి, యూనివర్శిటీలు అంటే ఒక మేధాశక్తిని తయారుచేసే కర్మాగారాలు, సీఎంలు మారుతుంటారు, కానీ యూనివర్శిటీలో వీసీని అపాయింట్‌చేస్తే అతని కాలపరిమితి పూర్తయ్యే వరకూ ఎవరూ కదిలించరు. యూజీసీ నిబంధనల మేరకు పనిచేస్తారు, కానీ ఈ రోజు జరుగుతున్న పరిస్ధితులు చాలా బాధాకారం....గతంలో టీడీపీ అపాయింట్ చేసిన వీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగించింది. విద్యా వ్యవస్ధను భ్రష్టు పట్టించవద్దు. ఎవరిపైన అయినా ఆరోపణలు, అభియోగాలు వస్తే గవర్నర్ దృష్టికి తీసుకువెళ్ళాలి, ఆయన కమిటీ వేసి తప్పులు జరిగి ఉంటే ఆయన నిర్ణయం తీసుకోవాలి, అంతేకానీ ఇలా భయపెట్టి రిజైన్ చేయడం సమంజసం కాదు....గవర్నర్ వీసీని అపాయింట్ చేస్తారు. ఇంత దారుణంగా టీడీపీ వ్యవహరించడం సరికాదు. అధికారం ఉంది కదా అని ఇలా వ్యవహరించడం తప్పు. ఇలా ఎప్పుడైనా జరిగిందా?...ఆంధ్రా యూనివర్శిటీలో టీడీపీ అపాయింట్ చేసిన వారిని కాంగ్రెస్ ప్రభుత్వం చక్కగా పనిచేయించుకుని సాగనంపింది, అక్కడే కాదు మిగిలిన యూనివర్శిటీలు, ఉన్నత విద్యామండలిలో కూడా ఇలాగే జరిగింది. విద్యా వ్యవస్ధను నాశనం చేయద్దు. నేను నా అనుభవంతో చెప్తున్నా, ఇకనైనా ఒక పద్దతి ప్రకారం నిర్ణయాలు తీసుకోండి. మీరు చేసిన తప్పులు ఇకనైనా సరిదిద్దుకోవాలి....వైఎస్ జగన్ సెక్యూరిటీపై కూడా బురదచల్లుతున్నారు. మేం ఎప్పుడూ ఇలా చేయలేదు. మీరు ప్రభుత్వాన్ని చక్కగా నడపాలని మేం కోరుకుంటున్నాం. మేం ఎక్కడా క్యాడర్‌ను ఉసిగొల్పలేదు’’ అని మేరుగు నాగార్జున పేర్కొన్నారు. -
మీపై ప్రజలు తిరగబడే రోజు దగ్గర్లోనే ఉంది: మేరుగు నాగార్జున
సాక్షి, గుంటూరు: వేమూరు నియోజకవర్గంలో దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహాన్ని దగ్ధం చేయటం అత్యంత హేయమైన చర్య అని మాజీ మంత్రి మేరుగు నాగార్జున మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైఎస్సార్ విగ్రహానికి నిప్పంటించి పక్కనే ఉన్న జెండా దిమ్మను పగలగొట్టిన టీడీపీ నాయకులు.. మా కార్యకర్తలపై కేసు పెట్టడానికి పూనుకున్నారని ధ్వజమెత్తారు.ఇదేనా మీ పాలన అంటూ చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ను దుయ్యబట్టారు. మీకు ప్రజలు అధికారం ఇచ్చింది ప్రజలపైన దాడులు చేయడానికా...? మహా నాయకుల విగ్రహాలు తగలబెట్టడానికా...? ప్రజలు మీపై తిరగబడే రోజు దగ్గర్లోనే ఉంది’’ అంటూ మేరుగ నాగార్జున హెచ్చరించారు.బాపట్ల జిల్లాలో టీడీపీ నేతలు అరాచకం సృష్టించారు. జిల్లాలోని వేమూరు నియోజకవర్గంలో దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి టీడీపీ నాయుకులు నిప్పంటించారు. ఈ ఘటన భట్టిప్రోలు మండలం అద్దేపల్లి దళితవాడలో చోటు చేసుకుంది. రోజురోజుకు పెరుగుతున్న టీడీపీ నేతల అరాచకాలపై వైఎస్సార్సీపీ నాయకులు తీవ్రంగా మండిపడితున్నారు. -
అసైన్డ్ భూములపై రామోజీవి రోత రాతలు
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారనే దుగ్ధతో రామోజీరావు, పచ్చ మీడియా అసైన్డ్ భూములపై రోత రాతలు రాస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున మండిపడ్డారు. ఆయన గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ దళితులకు వారి భూములపై హక్కులు కల్పించాలనే సీఎం జగన్ చట్టం తెచ్చారని, అది కూడా 2003కు ముందు ఉన్న భూములపైనే హక్కులు కల్పించారని తెలిపారు. ఇదంతా పారదర్శకంగానే చేశారన్నారు. అసైన్డ్ భూముల కుంభకోణానికి పాల్పడింది తెలుగుదేశం పార్టీ నేతలు, పచ్చ మీడియానే అని ఆరోపించారు. చంద్రబాబు అమరావతిలో దళితుల భూములు ఎకరం కేవలం రూ.5 లక్షలకు కొని రూ. కోట్లు దోపిడీ చేశారని చెప్పారు. రామోజీరావు దళితుల భూములు దోచుకుని ఫిలిం సిటీని నిర్మించింది వాస్తవం కాదా.. అని నిలదీశారు. అందరి గురించి లేనివి ఉన్నట్లు, ఉన్నవి లేనట్లు పిచ్చి రాతలు రాసే రామోజీరావు ఈ విషయాలను ఈనాడులో ఎందుకు రాయలేదన్నారు. ఆయన అక్రమాలు చేసినా మంచి, ఇతరులు మంచి చేసినా అక్రమమా.. అని నిలదీశారు. వయస్సు పెరిగినా రామోజీ బుద్ధి మారలేదన్నారు. సీఎం వైఎస్ జగన్ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ బడుగు, బలహీన వర్గాలను అక్కున చేర్చుకున్నారని తెలిపారు. చంద్రబాబు దళితవ్యతిరేకి అని చెప్పారు. దళితులలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా.. అన్న చంద్రబాబును ప్రజలు ఎప్పుడో చెత్తబుట్టలో పడేశారని తెలిపారు. చంద్రబాబుకు, రామోజీకి దళితుల అభ్యున్నతి ఇష్టంలేదని, అందుకే దళితులకు లబ్ధి చేకూర్చే సీఎం జగన్ నిర్ణయంపై విషం కక్కుతున్నారని చెప్పారు. తాము చంద్రబాబులా దళితుల భూములను కొట్టేసి తప్పుడు పనులు ఎన్నటికీ చేయబోమన్నారు. రామోజీ వాస్తవాలు గ్రహించాలని, సీఎం జగన్ ప్రభుత్వంపై పిచ్చి రాతలు మానుకోవాలని అన్నారు. -
ఆ నిబంధనలను ఈసీ ఉపసంహరించుకోవాలి: వైఎస్సార్సీపీ
సాక్షి, గుంటూరు: అడిషనల్ సీఈవోను వైఎస్సార్సీపీ నేతలు పేర్ని నాని, మేరుగు నాగార్జున, లేళ్ల అప్పిరెడ్డి కలిశారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు సడలింపు నిబంధనలపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది.అనంతరం మీడియాతో మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, ‘‘అన్ని రాష్ట్రాలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై గతంలో నిబంధనలు పంపారు. పోస్టల్ బ్యాలెట్ కవర్లు, 13ఏ, 13 బీ నిబంధనలు చెప్పారు. గెజిటెడ్ అధికారం సంతకం పెట్టి స్టాంప్ వేయాలని గతంలో చెప్పారు. స్టాంప్ లేకపోయినా చేతితో రాసినా ఆమోదించాలని గతంలో చెప్పారు. ఇప్పుడు కొత్తగా స్టాంప్ వేయకపోయినా సరే ఆమోదించాలని అంటున్నారు’’ అని పేర్ని నాని నాని అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేనిది ఇక్కడే ఎందుకు తీసుకొచ్చారని ఆయన ప్రశ్నించారు.‘‘ఈసీ ఇచ్చిన ఆదేశాలు గొడవలకు దారి తీసే అవకాశం ఉంది. ఈసీ నిబంధనలు వలన ఓటు రహస్యత ఉండదు. ఏజెంట్లు అభ్యంతరం తెలిపితే ఘర్షణలకు దారి తీస్తుంది. ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పని నిబంధనలను ఎలా అమాలు చేస్తారు అని అడిగాం. ఈ నిబంధనల పై పునరాలోచించాలి అని కోరాం’’ అని పేర్ని నాని వివరించారు.మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ, ‘‘చంద్రబాబు ఎన్నికల్లో అలజడులు సృష్టించారు. పేదల పైన టీడీపీ నేతలు దాడులు చేస్తే ఎన్నికల కమిషన్, టీడీపీ నేతలు చర్యలు తీసుకోలేదు. ఆఖరికి ఈసీఐ నిబంధనలని కూడా ఏపీలో మార్చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు విషయంలో ఈసీఐకి విరుద్ధంగా సీఈఓ ఆదేశాలు ఇవ్వడం ఏంటి..? వెంటనే ఆ నిబంధనలను ఉపసంహరించుకోవాలి. స్పెసిమెన్ సంతకం ద్వారా ఆమోదించడం సమంజసం కాదు. పోలింగ్ రోజున అక్రమాలకు టీడీపీ పాల్పడింది. ఇప్పుడు లెక్కింపు సక్రమంగా జరగకూడదు అన్నది టీడీపీ కుట్ర’’ అంటూ మండిపడ్డారు. -
ఏపీ పోలీస్ అబ్జర్వర్ పై మెరుగు నాగార్జున ఫైర్
-
పోలీస్ ఫెయిల్యూర్.. బాబు, పురందేశ్వరి మేనేజ్..
-
వైఎస్సార్సీపీ గెలుపుతో చంద్రబాబు రథచక్రాలు విరిగిపోతాయి...
-
వెనుకబడిన వర్గాలను గుండెల్లో పెట్టుకున్న వ్యక్తి వైఎస్ జగన్
-
2019 సీన్ మళ్లీ రిపీట్ అవుతుంది
-
2023 అక్టోబర్-డిసెంబర్ లో వివాహం చేసుకున్న జంటలకు పెళ్లి కానుక
-
చీమకుర్తి మండలంలో అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి
-
తల్లిదండ్రులు పిల్లల్ని చూసి గర్వపడేలా సీఎం జగన్ విద్యారంగం అభివృద్ధి
-
‘సాధికారత’తో మురిసిన మంగళగిరి
సాక్షి ప్రతినిధి, గుంటూరు: బడుగు, బలహీన వర్గాల సాధికారతతో గుంటూరు జిల్లా మంగళగిరి మురిసింది. బుధవారం పట్టణంలో ఘనంగా నిర్వహించిన వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు వేలాదిగా పాల్గొన్నారు. సీఎం జగన్ నేతృత్వంలో తాము సాధించిన సాధికారతను సగర్వంగా ప్రదర్శించారు. యువత నుంచి వృద్ధుల వరకు ఈ యాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. ‘మళ్లీ నీవే ముఖ్యమంత్రివి కావాలి జగన్’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త గంజి చిరంజీవి అధ్యక్షతన మిద్దె సెంటర్లో జరిగిన భారీ బహిరంగ సభలో వేలాదిగా ప్రజలు పాల్గొన్నారు. సభలో ప్రసంగించిన నేతలు సీఎం వైఎస్ జగన్ సారథ్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సాధించిన అభివృద్ధిని వివరించారు. సీఎం జగన్ అమలు చేస్తున్న సామాజిక న్యాయానికి మంగళగిరే నిదర్శనమని చెప్పారు. మంగళగిరి సీటును అగ్రకులానికి చెందిన అభ్యర్థి నుంచి మార్చి బీసీలకు కేటాయించడమే బీసీలకు సీఎం జగన్ ఇస్తున్న ప్రాధాన్యతను తెలుపుతుందని అన్నారు. సామాజిక విప్లవం తెచ్చిన తొలి సీఎం జగన్ దేశంలో సామాజిక కులాల గురించి ఆలోచించి, సామాజికి విప్లవాన్ని తెచ్చిన తొలి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డే అని మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. సీఎం వైఎస్ జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను అందలం ఎక్కించారని, ఈరోజు ఇలా తలెత్తుకొని తిరగడానికి సీఎం జగనే కారణమని చెప్పారు. చంద్రబాబు ఆణగారిన వర్గాలను అవమానించేవారని, ఈ వర్గాలను ఓటు బ్యాంకులా మాత్రమే తప్ప ఏనాడూ సాటి మనిషిగా చూడలేదని అన్నారు. మంగళగిరిలో స్థానికుడిగా ఉన్న గంజి చిరంజీవిని గెలిపించుకోవాలని, హైదరాబాదులో ఉండే టీడీపీ అభ్యర్థిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అగ్రస్థానం రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం వైఎస్ జగన్ అన్నింటా అగ్రస్థానం ఇస్తున్నారని మంత్రి జోగి రమేష్ చెప్పారు. మంత్రి పదవులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలుగా, నామినేటెడ్ పదవుల్లోనూ ఈ వర్గాలకే పెద్ద పీట వేసిన తొలి సీఎం వైఎస్ జగన్ అని తెలిపారు. అగ్రవర్ణ అభ్యర్థులు గెలిచిన మంగళగిరిలో బీసీ అభ్యర్థి గంజి చిరంజీవిని నిలబెడుతున్నారని, సీఎం జగన్ సామాజిక న్యాయానికి ఇదే నిదర్శనమని చెప్పారు. మంగళగిరి అని స్పష్టంగా పలకటం రాని లోకేశ్‌కి మంగళగిరి ఎందుకు అని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ పేదల పక్షపాతి అని, బడుగు వర్గాలకు ఆయన చేసిన మేలు మరెవరూ చేయలేరని పార్టీ నేత, ప్రభుత్వ సలహాదారు (సామాజిక న్యాయం) జూపూడి ప్రభాకర్ అన్నా రు. రెండుసార్లు రెడ్డి సామాజిక వర్గం గెలిచిన మంగళగిరిలో బీసీ అభ్యర్ధిని రంగంలోకి దింపే సాహసం ఒక్క జగన్ మాత్రమే చేయగలరని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ చెప్పారు. మంగళగిరిలో బీసీ నేతను గెలిపించుకొనే అవకాశాన్ని వదులుకోవద్దని పిలుపునిచ్చారు. పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త, ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, బీసీ విభాగం ఉపాధ్యక్షులు చిల్లపల్లి మోహనరావు పాల్గొన్నారు. -
ఈనాడు, చంద్రబాబుపై మంత్రి మెరుగు నాగార్జున ఫైర్
-
రామోజీ.. నీ నీచపు రాతలు చూస్తే జాలేస్తోంది
సాక్షి, అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయవాడలో ప్రపంచంలోనే అతి పెద్ద డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరిస్తుంటే ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి, ఎల్లో మీడియా అధిపతులు ఓర్వలేకపోతున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు. అంబేడ్కర్ విగ్రహావిష్కరణ వేడుకపై విషం చిమ్ముతూ శుక్రవారం ఈనాడు పత్రిక కథనం ప్రచురించడంపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి నాగార్జున, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద ఈనాడు పేపర్‌ను చించివేసి, పత్రిక ప్రతులను కాల్చివేశారు. ఈ సందర్భంగా మంత్రి నాగార్జున మాట్లాడుతూ.. దళితుల భూములను ఆక్రమించి ఫిల్మ్ సిటీ కట్టుకున్న నీచుడు రామోజీరావని ధ్వజమెత్తారు. దుర్మార్గుడైన రామోజీరావు దళిత బంధువైన సీఎం వైఎస్ జగన్‌పై విషం చిమ్మటం గర్హనీయమన్నారు. రామోజీరావు ఈనాడు పేపర్‌ను చంద్రబాబుకు తాకట్టుపెట్టి, పత్రిక విలువలు మంటగలిపారన్నారు. ఆయన కులపోడు సీఎంగా లేడన్న కారణంతోనే రాష్ట్రంపై రామోజీ విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. రామో‘ఛీ’.. నీ నీచపు రాతలపై జాలేస్తోందని వ్యాఖ్యానించారు. సీఎం వైఎస్ జగన్‌పై ఈనాడులో రాసిన చెత్త రాతలపై రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు, నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. రామోజీ వయసుకు తగినట్టు నడుచుకోవాలని హితవు పలికారు. అంబేడ్కర్ విగ్రహం స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేస్తున్నారని తెలిసినప్పటి నుంచే పచ్చ మీడియా ఏడుపే ఏడుపు అని అన్నారు. సీఎం జగన్ దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టారని చెప్పారు. దశాబ్దాలుగా దళితులను అణచివేసిన చంద్రబాబుకు రామోజీ ఒక బ్రోకర్ అని విమర్శించారు. ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. దళితులకు మేలు చేయటం అంటే రామోజీ, చంద్రబాబు, రాధాకృష్ణలకు నచ్చదని చెప్పారు. కాటికి కాలుచాచిన వయసులో కూడా రామోజీ విషం కక్కటం మానలేదని వ్యాఖ్యానించారు. దళితులు వారి ఇళ్లలో పాచి పనులు చేయటానికే బతకాలనేది రామోజీ, చంద్రబాబుల నైజమన్నారు. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగించేవారిలో దేశంలోనే సీఎం జగన్ ముందున్నారని చెప్పారు. ఈ విగ్రహం సీఎం జగన్‌కి బడుగు బలహీన వర్గాల మీద ఉన్న ప్రేమ, అభిమానాలను ప్రతిబింబిస్తోందని చెప్పారు. ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ మాట్లాడుతూ.. అంబేడ్కర్ విగ్రహావిష్కరణతో రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొందని అన్నారు. ఇది తట్టుకోలేక రామోజీ, చంద్రబాబు ఏడుస్తున్నారన్నారు. -
అది మా దేవుడి విగ్రహం మీరెందుకు ఏడుస్తున్నారు..!
-
‘అంబేద్కర్ విగ్రహంపై అవమానకరంగా మాట్లాడుతున్నారు’
సాక్షి, విజయవాడ: ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా అంబేద్కర్ మహా శిల్పం ఏర్పాటు చేస్తున్నామని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు గతంలో 100 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడతానని పెట్టలేదన్నారు. అంబేద్కర్ స్మారక చిహ్నన్ని సీఎం జగన్ ఏర్పాటు చేస్తే చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. ఎల్లో మీడియాలో పనులు పూర్తవ్వలేదంటూ తప్పుడు వార్తలు రాస్తున్నారని, ఎల్లో మీడియా, చంద్రబాబు ఇక్కడికి వస్తే పనులు చూపిస్తానన్నారు. రూ. 400 కోట్లు పెడితే ఎందుకంత ఖర్చు అని టీడీపీ నేతలు అవమానకరంగా మాట్లాడుతున్నారు. అంబేద్కర్ విగ్రహంపై చంద్రబాబు చేసిన రాజకీయాన్ని ప్రజల్లో ఎండగడతామని మంత్రి పేర్కొన్నారు. రేపు విజయవాడలో డా.బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించనున్నారు. తొలుత ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో సామాజిక సమతా సంకల్ప సభకు హాజరు కానున్న సీఎం.. అనంతరం స్వరాజ్ మైదానంలో సామాజిక న్యాయ మహా శిల్పాన్ని ఆవిష్కరించనున్నారు. వెలుగుల నడుమ బడుగు బాంధవుడు (ఫొటోలు).. క్లిక్ చేయండి -
అంబేద్కర్ విగ్రహంపై చంద్రబాబు మోసం చేశారు: మంత్రి మేరుగ
సాక్షి, విజయవాడ: ప్రపంచం గర్వించదగిన రీతిలో అంబేద్కర్ విగ్రహం మన రాష్ట్రంలో ఏర్పాటైందని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. ఈనెల 19వ తేదీన విగ్రహం ఆవిష్కరణ వైభవంగా నిర్వహిస్తామన్నారు. తుమ్మలపల్లి క్షేత్రయ్యవారి కళాక్షేత్రంలో డా.బీ.ఆర్ అంబేద్కర్ రాష్ట్రస్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మయన్మార్ నుంచి వచ్చిన బౌద్ధ భిక్షువులు ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. సమాజంలో ఉన్న అసమానతలను తొలగించేందుకు కృషి చేసిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్.. ఆయన భావజాలాన్ని భుజాన వేసుకుని పాలన చేస్తున్న ఒకే ఒక్కడు సీఎం జగన్ అని మంత్రి మేరుగ నాగార్జున కొనియాడారు. అంబేద్కర్ ఆలోచనలతో పాలన చేస్తూ చరిత్ర పుటల్లో సీఎం జగన్ తన పేరు లిఖించుకున్నారన్నారు. సీఎం జగన్ భావితరాల భవిషత్తు కోసం పనిచేస్తున్నారని మంత్రి అన్నారు. ‘‘అంబేద్కర్ విగ్రహం పెడతామని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు. గత పాలనలో అవమానాలు.. అవహేళనలు.. దాడులు.. చూశాం. సీఎం జగన్ వల్లే మేం రాజ్యాధికారం పొందగలిగాం. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం పెడతానని సీఎం చెప్పారు. చెప్పినట్లుగానే రూ. 425 కోట్లతో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారు’’ అని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా సీఎం జగన్ పాలన: మంత్రి ఆదిమూలపు పేదరికం విద్యకు అడ్డు కాకూడదని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా సీఎం జగన్ పాలన సాగుతోందన్నారు. బడుగు, బలహీన,అణగారిన,దళిత వర్గాలకు సీఎం పెద్ద పీట వేశారు. చిట్టచివరి వారికి సైతం సంక్షేమం అందాలనే లక్ష్యంతో ఆయన పనిచేస్తున్నారు. అవినీతి లేని పాలన.. పారదర్శకత.. జవాబుదారీ తనం మా ప్రభుత్వం ఎంచుకున్న ప్రధాన లక్ష్యాలు. నేను ఉన్నాను...నేను విన్నానని పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకున్నారు. ఈ నాలుగున్నరేళ్లలో సీఎం జగన్ అండగా నిలిచారు’’ అని మంత్రి అన్నారు. ఇంగ్లీష్ మీడియం పెడుతుంటే తెలుగు భాషను చంపేస్తున్నారని నానా యాగీ చేశారు. సీఎం జగన్ ధైర్యంగా పేదలకు ఇంగ్లీష్ మీడియం విద్యను అందిస్తున్నారు. ఈ రోజు మావంటి వారు క్యాబినెట్లో ఉన్నారంటే సీఎం జగనే కారణమని మంత్రి అన్నారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు ఒక చరిత్ర: మల్లాది విష్ణు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు ఒక చరిత్ర అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సీఎం జగన్ ఆలోచన అభినందనీయమని.. భారతదేశంలో ఏపీ అగ్రగామిగా నడవాలంటే అంబేద్కర్ ఆలోచనలతోనే సాధ్యమన్నారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించే ప్రభుత్వం.. వైఎస్ జగన్ ప్రభుత్వమని విష్ణు అన్నారు. -
పేదవాడి జీవితాల్లో వెలుగులు నింపిన నాయకుడు జగన్
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి మేరుగు నాగార్జున
-
చంద్రబాబుపై మంత్రి మేరుగు నాగార్జున సంచలన వ్యాఖ్యలు
-
పేదలను చంద్రబాబు ఏనాడైనా పట్టించుకున్నారా..?
-
క్రైస్తవ ఆస్తులను కొల్లగొట్టింది తెలుగు తమ్ముళ్లే బాబూ!
కర్నూలు (సెంట్రల్): రాష్ట్రంలో క్రైస్తవ మిషనరీ ఆస్తులను కొల్లగొట్టింది, అమ్ముకున్నది టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన అనుచరులేనని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు. చంద్రబాబు తమతో గుంటూరు, విజయవాడ వస్తే నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఆయన ఎక్కడకు రమ్మంటే అక్కడికి వచ్చి టీడీపీ నాయకులు ఆక్రమించిన క్రైస్తవ ఆస్తుల వివరాలు ఇస్తామని, దీనిపై బహిరంగ చర్చకు రావాలని మంత్రి సవాల్ విసిరారు. శుక్రవారం కర్నూలులో ప్రభుత్వ అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గురువారం విజయవాడలో ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో చంద్రబాబు చేసిన ఆరోపణలపై మంత్రి స్పందించారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్ కోసం అసెంబ్లీలో తీర్మానం చేసిన ఘనత సీఎం జగన్‌దని చెప్పారు. అమరావతిలో దళితుల అసైన్మెంట్ భూములను చంద్రబాబు భయపెట్టి బలవంతంగా గుంజుకున్నాడన్నారు. రేపల్లెలో 400 దళిత కుటుంబాలను వెలివేసిన చరిత్ర చంద్రబాబుదన్నారు. చివరికి దళిత కుటుంబాల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారని చెప్పి అవమానించిన వ్యక్తి ఆయన కాదా... అని ప్రశ్నించారు. దళితుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం జగన్‌ను మరోసారి గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. సీఎం జగన్ దళితులపై అక్రమ కేసులు ఎత్తివేస్తే బాబుకు భయమెందుకని ప్రశ్నించారు. ఎమ్మెల్యే డాక్టర్ జె.సుధాకర్, వైఎస్సార్సీపీ నాయకులు యాట ఓబులేసు, సత్తిరాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
రాజకీయ మనుగడ కోసమే చంద్రబాబు కొత్త నాటకాలు: మంత్రి మేరుగ
సాక్షి, కర్నూలు: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి మేరుగు నాగార్జున. తమ గురించే మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. ఎన్నికలు వస్తున్నాయని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని సీరియస్ అయ్యారు. చంద్రబాబు ఓ గజదొంగ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. కాగా, మంత్రి మేరుగు నాగార్జున శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు మతిస్థిమితంలేదని మేము ఎప్పటి నుంచో చెబుతున్నాం. ఇతరులు ఆస్తులు కాజేస్తున్నామని మాపై ఆరోపణలు చేశారు. మా గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు. ఇతరుల ఆస్తుల కోసం వెంపర్లడింది చంద్రబాబు, టీడీపీ నాయకులు. రాజకీయంగా తమ మనుగడ కోసం చంద్రబాబు మాట్లాడుతున్నారు. గుంటూరు, విజయవాడలో ఎన్ని ఆస్తులు అమ్ముకున్నారో రండి మేము చూపిస్తాం. ఎన్నికలు వస్తున్నాయని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. చంద్రబాబు ఓ గజదొంగ. మా మీద దాడులు, అఘాయిత్యాలు చేయించారు. చంద్రబాబు హయాంలో దళితులపై ఎన్నో దాడులు జరిగాయి. దళితులపై అమానుషంగా కేసులు పెట్టారు. కానీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం వారిపై కేసులు ఎత్తివేశారు. చంద్రబాబుకు అసలు మానవత్వం ఉందా?. చంద్రబాబు కుట్రలు, కుతంత్రలు పన్నుతున్నారు. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల ఇస్తామంటే కేసులు పెట్టారు. నాడు-నేడు కింద స్కూల్స్, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ బాగుచేసిన చరిత్ర వైఎస్ జగన్‌ది. వైఎస్సార్సీపీకి దళితుల సంపూర్ణ మద్దతు ఉంది అని వ్యాఖ్యలు చేశారు. దళితులు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఉంది. ఇది కూడా చదవండి: బాలయ్య మిస్సింగ్.. ‘ఆంధ్రజ్యోతి’పై భగ్గుమన్న ఫ్యాన్స్ -
పేదవాడి గుండె చప్పుడు సీఎం జగన్
-
ప్రజా సంక్షేమ రథ సారథి!
ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అప్పటికే ఉన్న వ్యవస్థలను అత్యంత ప్రభావవంతం చేయడంతో పాటు, ప్రజల కోసం నూతన వ్యవస్థలను ప్రవేశపెట్టారు. ముఖ్యంగా సంక్షేమ రంగంలో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలూ, ప్రజలకు సంక్షేమ ఫలాలను చేరవేస్తున్న తీరూ విప్లవాత్మకం. అందుకే సంక్షేమ రంగానికి సంబంధించినంత వరకూ ప్రగతి గురించి చెప్పుకోవాలంటే జగన్‌కు ముందు, జగన్ తర్వాత అని చెప్పుకోవాలి. ఈ కారణంగానే యావత్ భారత దేశం ఈరోజున ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది. జగన్ తన నాలుగేళ్ల పదవీ కాలంలోనే ఎవరూ పూర్తిగా గుర్తు పెట్టుకోలేనన్ని ఎక్కువ సంక్షేమ పథకాలను అమల్లోకి తీసుకొచ్చారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అప్పటి వరకూ ఉన్న వ్యవస్థల పని తీరును ప్రభావితం చేస్తూ వాటిని ప్రజలకు మరింత చేరువ చేయగలిగారు. ఉదాహరణకు వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెన్షన్లు ఇచ్చే పథకాలు గత ప్రభుత్వాల హయాంలోనూ ఉన్నాయి. అయితే అప్పట్లో పెన్షన్ మంజూరు కావడం, పెన్షన్ మొత్తాలు చేతికి అందడం పెద్ద ప్రహసనంగా ఉండేది. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అర్హత కలిగిన వారికి పెన్షన్ల మంజూరు చాలా సులభతరంగా మారింది. కచ్చితంగా ఒకటవ తేదీన సూర్యోదయానికి ముందే ఇంటి కొచ్చి తలుపుతట్టి పెన్షన్ మొత్తాలను అందించే సరికొత్త వ్యవస్థ రాష్ట్రంలో ఏర్పడింది. పెన్షన్లను మాత్రమే కాదు రాష్ట్రంలో రేషన్ షాపుల ద్వారా పేదలకు అందించే బియ్యం తదితర చౌక వస్తువుల కోసం దుకాణాల వరకూ వెళ్లాల్సిన పని లేకుండా ఇంటి ముంగిటకే రేషన్ వాహనాలను తెచ్చి పెట్టారు. అలాగే ఆపదలో ఉన్న మహిళలను ఆదుకోవడానికి ‘దిశ యాప్’ను జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టి అందరి మన్ననలూ పొందుతోంది. గతంలోనూ సంక్షేమ పథకాలు ఉన్నా... లబ్ధిదారులకు ఆ ఫలాలు చేరడానికి దళారీ వ్యవస్థ వాహకంగా ఉండేది. ‘కులం చూడం, మతం చూడం, పార్టీలు అసలే చూడం.. పేదరికం ఒక్కటే అర్హతకు ప్రామాణికం’ అన్నదే సంక్షేమ పథకాల అజెండాగా జగన్ పెట్టుకున్నారు. ఒక్క బటన్ నొక్కడం ద్వారా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తున్న ‘డీబీటీ’ (డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ ఫర్) విధానం సీఎంగా జగన్ రాకతోనే వచ్చింది. ఈ సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేయ డంలో ఎక్కడైనా పొరపాట్లు దొర్లి దాని కారణంగా ఎవరైనా అర్హులు నష్టపోయే పరిస్థితి ఏర్పడితే అలాంటివారు ఎప్పుడైనా ఆ పథకాల కోసం దరఖాస్తు చేసుకొని లబ్ధి పొందే వెసులుబాటు కలిగించారు. గతంలో కుల, ఆదాయ సర్టిఫికెట్లు లాంటివి తీసుకోవాలంటే పెద్ద తతంగమే ఉండేది. లంచాలు ఇవ్వాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ గ్రామ, వార్డు సచివాలయాల వ్యవ స్థకు రూపకల్పన చేశారు. క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్‌కం సర్టిఫికెట్, ఈడబ్లు్యఎస్ సర్టిఫికెట్, రెసిడెన్స్ సర్టిఫికెట్, మ్యారేజ్ సర్టిఫికెట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ లాంటి ముఖ్యమైన సర్టిఫికెట్లను ఈ రోజున ప్రజలు ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా, ఎవ రినీ కలవాల్సిన అవసరం లేకుండా సచివాలయాల ద్వారా సులభంగా అందుకోగలుగుతున్నారు. రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుపేదలకు ఎలాంటి వివాదాల్లేకుండా ఇళ్ల స్థలాలను అందించడం కూడా సచివాలయాల ద్వారా మత్రమే సాధ్యమైంది. సచివాలయాలకు అనుబంధంగా సీఎం జగన్ సృష్టించిన 2.56 లక్షల మంది ‘వాలంటీర్ల’ వ్యవస్థ... సిఫార్సులు, పైరవీలను పాతరేసింది. వ్యవసాయానికి వెన్ను దన్నుగా రైతుకు విత్తనాలు అందించడం దగ్గర నుంచి వ్యవసాయోత్పత్తుల అమ్మకాల దాకా ఆసరాగా నిలిచే ‘రైతు భరోసా కేంద్రాలు’ (ఆర్బీకే) కూడా ఈ రోజున దేశ, విదేశీ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సామాజిక న్యాయం కోసం బాబాసాహెబ్ అంబేడ్కర్, జ్యోతిబా ఫూలే, బాబూ జగ్జీవన్ రామ్, మౌలానా ఆజాద్, కొమురం భీం, అల్లూరి సీతారామరాజు కోరుకున్న సమాజం దిశగా ప్రభుత్వ ఫలాలు అట్టడుగువర్గాల వారికి చేరాలంటే పరిపాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి అత్యధిక ప్రాధా న్యత ఇవ్వాలన్నది జగన్ ప్రభుత్వం నమ్మిన సిద్ధాంతం. తాను నమ్మిన సిద్ధాంతాన్ని మాటల్లో చెప్పకుండా చేతల్లో చేసి చూపిస్తున్న ఘనత ముఖ్యమంత్రిది. ఏ వర్గాలైతే ఇంత కాలం అణచి వేయబడ్డాయో, ఏ వర్గాలైతే ఇంత కాలం రాజకీయ పదవులకు దూరంగా ఉన్నాయో ఆ వర్గాలకు రాజ్యాధికారం దక్కుతోంది. శాసనసభ స్పీకర్‌గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాం, శాసనమండలి ఛైర్మన్‌గా ఎస్సీ వర్గానికి చెందిన కొయ్యే మోషేన్ రాజు, మండలి డిప్యూటీ ఛైర్ పర్సన్‌గా మైనార్టీ వర్గానికి చెందిన జకియా ఖానవ్ుకు అవకాశం ఇచ్చారు. ఇది కాకుండా శాశ్వత ప్రాతిపదికన ‘బీసీ కమిషన్’తో పాటుగా ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లు ఏర్పాటు చేశారు. నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేసి, దాన్ని అమలు చేసిన తొలి ప్రభుత్వం జగన్‌దే. అందులోనూ 50 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించిన ఘనతా జగన్ సర్కార్‌దే. గత మూడేళ్ల కాలంలోనే రెగ్యులర్, ఔట్ సోర్సింగ్లతో కలిపి ఇప్పటి వరకూ 2.61 లక్షల ఉద్యో గాలను బీసీ వర్గాల వారికి ఇవ్వడం, గ్రామ వార్డు సచివాలయాల్లో ఇచ్చిన 1.30 లక్షల శాశ్వత ఉద్యో గాలలో 83 శాతం ఉద్యోగాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికే ఇవ్వడం రాష్ట్ర చరిత్రలో సరికొత్త అధ్యాయమే. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వర్గాల వారికి జగనన్న ప్రభుత్వం అందిస్తున్న చేయూతను చూసి ‘మేము కూడా ఈ సామాజిక వర్గాల్లో పుట్టి ఉంటే బాగుండేద’నే భావన ఈ రోజున అగ్రవర్ణాల వారిలో కలుగుతోందంటే అతిశయోక్తి కాదు. ఈ విధంగా నవ్యాంధ్ర రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న జగన్ కలకాలం ఆయురారోగ్యాలతో విలసిల్లాలి! డా‘‘ మేరుగు నాగార్జున వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి -
రాజంపేట.. జనంతోట
సాక్షి రాయచోటి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయూతతో ఆర్థికంగా, సామాజికంగా నిలదొక్కుకొన్న బడుగు, బలహీన వర్గాలు అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో సాధికారతను ప్రదర్శించాయి. నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు మంగళవారం రాజంపేటకు తరలివచ్చారు. వేలాది మంది జై జగన్ నినాదాలు చేస్తుండగా వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్ర సాగింది. మధ్యాహ్నం మన్నూరు వద్దగల యల్లమ్మ ఆలయంలో నేతలు పూజలు చేసి ర్యాలీని ప్రారంభించారు. అక్కడి నుంచి యాత్ర పాత బస్టాండ్ వరకు సాగింది. వేలాది ప్రజలు హాజరైన సభలో నేతలు ప్రసంగించారు. బడుగు, బలహీనవర్గాలను వెన్ను తట్టి నడిపించిన నాయకుడు జగన్: డిప్యూటీ సీఎం అంజాద్బాష రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచి వారిని వెన్నుతట్టి నడిపించిన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని డిప్యూటీ సీఎం అంజాద్బాష చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అభివృద్ధి పథంలో నడిపించి, సామాజిక న్యాయంతో సాధికారత సాధించిన సీఎం దేశంలో వైఎస్ జగన్ ఒక్కరేనని అన్నారు. కేవలం మాటలతో సరిపెట్టక, ఆలోచనలతో ఆగిపోకుండా, ఆచరణలో అనేక పథకాలతో పేదల ఆర్థికస్థాయిని పెంచారని, రాజకీయంగా ఉన్నత పదవులిచ్చి సామాజిక సాధికారతకు అసలైన అర్థం చెప్పారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేబినెట్లో 17 పదవులిచ్చారని, ఇతర పదవులు, నామినేటెడ్ పదవుల్లోనే అధికశాతం ఈ వర్గాలకే ఇచ్చారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు మరింతగా అభివృద్ధి సాధించాలంటే జగన్‌ను మరోసారి సీఎంను చేసుకోవాలన్నారు. మనకు, పిల్లల భవిష్యత్తుకు వైఎస్ జగన్ అవసరం: మంత్రి మేరుగు మనతోపాటు మన పిల్లల భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మరికొంత కాలం సీఎంగా ఉండాల్సిన అవసరం ఉందని మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. అనేక సంక్షేమ పథకాలతో బడుగులకు అండగా నిలుస్తున్న నాయకునికి మద్దతు ఇవ్వాలని అన్నారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు గుండెల మీద చేయి వేసుకుని బతుకుతున్నారంటే అది సీఎం జగన్ చలవేనని చెప్పారు. బడుగు, బలహీన వర్గాలను అడుగడుగునా అవహేళన చేసి, అవమానించిన చంద్రబాబు ఓ దురహంకారి అని అభివర్ణించారు. రాష్ట్రంలో బడుగులకే పెద్దపీట: మాజీ ఎంపీ బుట్టా రేణుక రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకే సీఎం జగన్ పెద్దపీట వేసి, వారిని అన్ని రంగాలలో అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని మాజీ ఎంపీ బుట్టా రేణుక తెలిపారు. ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా బీసీలను ఉన్నత స్థానాల్లో నిలుపుతోందని తెలిపారు. ప్రతి హామీని నెరవేర్చారు సీఎం జగన్ : ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలంటూ ఈ వర్గాలన్నింటినీ అక్కున చేర్చుకున్న ముఖ్యమంత్రి దేశంలో జగనన్న ఒక్కరేనని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ కొనియాడారు. విద్యా వ్యవస్థను పూర్తిగా మార్చేసి, బడుగు బలహీనవర్గాల పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్య అందిస్తున్నారన్నారు. ఇంగ్లిష్ చదువులతో పేద, వెనుకబడిన వర్గాల పిల్లలు అంతర్జాతీయస్థాయిలో పోటీపడాలని తపిస్తున్న జగనన్నను 2024లో మరోమారు ముఖ్యమంత్రిని చేసుకొనేందుకు ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి , జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి, రాయలసీమ జిల్లాల సమన్వయకర్త, ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, కడప మేయర్ సురే‹Ùబాబు, ఎమ్మెల్సీ రమే‹Ùయాదవ్, టీటీడీ బోర్డు మెంబర్ అశ్వర్థనాయక్ పాల్గొన్నారు. -
మళ్లీ జగనే కావాలి... మళ్లీ జగనే రావాలని
-
కమలాపురం.. జనసంద్రం
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో ఆదివారం నిర్వహించిన సామాజిక సాధికార యాత్రకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు పోటెత్తారు. చెన్నూరులో నిర్వహించిన బహిరంగ సభకు జనం వెల్లువలా తరలివచ్చారు. వివిధ గ్రామాల నుంచి డప్పుల దరువులు, ఆటపాటలతో ప్రజానీకం ర్యాలీగా ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. ఇలా వేలాది మంది తరలి రావడంతో సభాస్థలిలో అందరూ కూర్చునే పరిస్థితి లేకుండా పోయింది. వెరసి చెన్నూరులో ఎటు చూసినా, ఏ వీధిలో చూసినా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వైఎస్సార్సీపీ జెండాలను రెపరెపలాడిస్తూ కనిపించారు. కమలాపురం ఎమ్మెల్యే పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నాయకులు తమ ప్రసంగాల్లో సీఎం జగన్ పేరును ఉచ్ఛరించగా.. సభికులు పెద్దపెట్టున హర్షధ్వానాలు చేశారు. అంబేడ్కర్ ఆలోచన విధానాలు అమలు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జ్యోతిరావ్ పూలే, కొమురం బీమ్ వంటి మహానీయుల ఆలోచనలను అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డేనని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. అణగారిన వర్గాలకు అండగా, భావి తరాల ఉన్నతికి దూరదృష్టితో పెద్దపీట వేస్తున్న వైఎస్ జగన్‌ను మరోమారు మన కోసం ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కామెడీ యాక్టర్ పవన్, నయవంచకుడు చంద్రబాబు కలిసికట్టుగా వస్తున్నారని, వారి మాయమాటలు నమ్మొద్దని సూచించారు. సామాజిక సాధికారత మా విధానం : డిప్యూటీ సీఎం అంజద్‌బాషా స్వతంత్ర భారతదేశంలో సామాజిక సాధికారత అనేది ఒక నినాదంగానే మిగిలిపోయిందని, అయితే వైఎస్సార్సీపీ సామాజిక సాధికారతను తన విధానంగా మార్చుకుందని ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్బీ అంజాద్‌బాషా చెప్పారు. 2014–19 వరకు సాగిన టీడీపీ ప్రభుత్వంలో ఒక్క మైనార్టీకి కూడా మంత్రివర్గంలో స్థానం లభించలేదని, వైఎస్సార్సీపీ.. నలుగురు మైనార్టీలను ఎమ్మెల్యేలుగా చేసిందని, మరో నలుగురికి ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించిందన్నారు. తనకు ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టారని చెప్పారు. ఏపీలోనే సామాజిక విప్లవం: మంత్రి మేరుగు సామాజిక న్యాయం అనేది ఏపీలోనే, వైఎస్ జగన్ నాయకత్వంలోనే సాకారమైందని సాంఘిన సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. రాజ్యాంగ బద్ధంగా బడుగులకు రావాల్సిన హక్కులు సంక్రమిస్తున్నాయని తెలిపారు. చంద్రబాబు హయాంలో దళితులపై, బీసీలపై దాడులు చూశామని, దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అన్న నాడే చంద్రబాబు దళితద్రోహి అని తేలిపోయిందని, బీసీల తోకలు కత్తిరిస్తానన్న నాడే బీసీ వ్యతిరేకి అని వారు పసిగట్టారని చెప్పారు. సన్నిధి గొల్ల కొనసాగింపు: మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తిరుమల సన్నిధి గొల్లను తిరిగి కొనసాగించి రాష్ట్రంలోని యాదవుల ఆత్మగౌరవాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలిపారని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. రాయలసీమలో తొలిసారి యాదవులకు ఎమ్మెల్సీ దక్కిందని, మేయర్ పదవులను యాదవులకు అప్పగించి గౌరవించిన చరిత్ర సీఎం జగన్‌దేనన్నారు. ఆచరణలో చూపిన సీఎం: ఎంపీ అవినాష్‌రెడ్డి సామాజిక సాధికారిత కాగితాలకే పరిమితమయ్యేదని.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే దానిని ఆచరణలో చూపారని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి చెప్పారు. కేబినెట్ కూర్పు నుంచి నామినేటెడ్ పదవులు.. చివరకు ఆలయాల పాలక మండళ్లలో సైతం చిత్తశుద్ధి ప్రదర్శించారని కొనియాడారు. బడుగు బలహీన వర్గాలకు సమన్యాయం పాటించిన చరిత్ర జగనన్నదేనని మాజీ ఎంపీ బుట్టా రేణుకా అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు రమేష్‌యాదవ్, రామచంద్రారెడ్డి, ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి, టీటీడీ బోర్డు మెంబర్ యానాదయ్య తదితరులు పాల్గొన్నారు. -
సాయం..శరవేగం
-
రెండుచోట్లా ఓటేయకుండా చర్యలు తీసుకోండి
సాక్షి, అమరావతి:తెలంగాణలో ఓటు వేసిన వారు ఏపీలో ఓటు వేయకుండా ఎన్నికల కమిషన్ కలెక్టర్లకు ప్రత్యేక ఆదేశాలు ఇవ్వాలని మంత్రి మేరుగు నాగార్జున, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ అప్పిరెడ్డితో కూడిన వైఎస్సార్సీపీ ప్రతినిధుల బృందం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్‌కు విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్‌లో ఓటు వేసిన వారు ఏపీలో ఓటు వేసేందుకు సిద్ధంగా ఉండటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. రాష్ట్ర చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనాను కలిసి ఓటర్ల నమోదుకు సంబంధించి టీడీపీ చేస్తున్న అక్రమాలపై మంగళవారం ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో టీడీపీ, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఆధ్వర్యంలో ఏపీకి సంబంధించి ఓటర్ల నమోదు, రిజిస్ట్రేషన్ డ్రైవ్ నిర్వహించడంపై ఫిర్యాదు చేసి, ఆధారాలు సమర్పించారు. మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు హైదరాబాద్ ప్రగతి నగర్లో బ్యానర్లు కట్టి మరి ఓటర్ల రిజిస్ట్రేషన్ చేస్తున్నారని వివరించారు. ఎమ్మెల్యే లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. మాజీ ఎన్నికల కమిషనర్ రమేషు్కమార్ సిటిజన్ ఫర్ డెమోక్రసీ పేరుతో సంస్థ పెట్టి, దానికి కార్యదర్శిగా ఉంటూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో లేని వారిని తీసుకువచ్చి టీడీపీ ఇక్కడ ఓటర్లుగా చేర్పిస్తోందన్నారు. ఇది నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. -
చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేయడంలో సిద్ధహస్తుడు
-
తెలంగాణ ఓట్లను ఏపీకి మార్చడానికి సిగ్గులేదా?: వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, విజయవాడ: ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనాను మంత్రి మేరుగు నాగార్జున, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి మంగళవారం కలిశారు. హైదరాబాద్‌లో టీడీపీ ఆధ్వర్యంలో ఏపీ ఓటర్ల రిజిస్ట్రేషన్ చేయడంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. తెలంగాణలో ఓటు వేసిన వారు ఏపీలో ఓటు వేయకుండా కలెక్టర్లకు ఆదేశాలివ్వాలని ఎన్నికల ప్రధానాధికారిని కోరారు. చంద్రబాబు వ్యవస్థలు మేనేజ్ చేయడంలో సిద్ధహస్తుడు: మంత్రి మేరుగు అనంతరం మంత్రి మేరుగు నాగార్జున మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు వ్యవస్థలు మేనేజ్ చేయడంలో సిద్ధహస్తుడని, ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు టీడీపీ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. హైదరాబాద్‌లో ఓటు వేసిన వారు ఏపీలో ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. హైదరాబాద్‌లో చంద్రబాబు ఆధ్వర్యంలో ఏపీ న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. హైదరాబాద్ ప్రగతినగర్‌లో బ్యానర్లు కట్టి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. సిగ్గులేకుండా పక్క రాష్ట్రంలో బ్యానర్లు కట్టి ఓట్లు రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. మాజీ మంత్రి ఉమా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి’’ అంటూ మంతి మేరుగ మండిపడ్డారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు టీడీపీ కుట్రలు: మల్లాది విష్ణు ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు టీడీపీ కుట్రలు చేస్తుందని, వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. స్థిర నివాసం ఉన్నచోటే ఓటు హక్కు కల్పించాలి: లేళ్ల అప్పిరెడ్డి లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ, స్థిర నివాసం ఉన్నచోటే ఓటు హక్కు కల్పించాలని సీఈవోను కోరాం. తెలంగాణ ఓట్లను ఏపీలో మార్చడానికి సిగ్గులేదా?. ఎన్నికల ప్రక్రియలో ఎక్కడా వాలంటీర్లను ఉపయోగించడం లేదు. మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ టీడీపీ కండువా వేసుకుని మాట్లాడితే బాగుంటుంది’’ అంటూ అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. చదవండి: ‘మిచౌంగ్’ దెబ్బ.. ఇలా వచ్చి.. అలా ముంచేసింది -
అన్ని మూసుకొని కూర్చున్న చంద్రబాబు...కాంగ్రెస్ గెలిస్తే సంబరాలా !
-
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు న్యాయం చేసిన ఏకైక నాయకుడు
-
బడుగుల అభివృద్ధి కనిపించడంలేదా?
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో బడుగువర్గాల అభివృద్ధి ఈనాడు రామోజీరావుకు కనిపించడంలేదా అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పరిఢవిల్లుతున్న సామాజిక విప్లవం, నెరవేరుతున్న అంబేడ్కర్ ఆశయాలు వృద్ధ రామోజీరావు కంటికి కనిపించడం లేదని మండిపడ్డారు. దేశంలో మరే రాష్ట్రంలో జరగని విధంగా రాష్ట్రంలో బడుగులు అభివృద్ధి చెందుతున్నారని తెలిపారు. పని గట్టుకుని వైఎస్ జగన్ ప్రభుత్వంపై బురద జల్లుతూ రోత రాతలు రాసే రామోజీకి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఆయన శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సామాజిక విప్లవానికి తెరదీశారని చెప్పారు. అంబేడ్కర్ కోరుకున్న విధంగా విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తూ పరిపాలన చేస్తున్నారన్నారు. నాడు – నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యా సంస్థలకన్నా మిన్నగా తీర్చిదిద్ది, ఇంగ్లిష్ మీడియం బోధన ప్రవేశపెట్టి పేద కుటుంబాల్లోని పిల్లలకు అంతర్జాతీయ స్థాయి విద్యనందిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు ఇప్పుడు ఇంగ్లిష్ కూడా అనర్గళంగా మాట్లాడటం రామోజీకి కనిపించడంలేదన్నారు. ఇవేవీ రామోజీకి పట్టవని.., ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అణగదొక్కిన చంద్రబాబు మాత్రం ఆయనకు చాలా స్వీటుగా కనిపిస్తున్నారని అన్నారు. ఏపీలో దళితులకు అన్యాయం జరుగుతున్నట్లు రామోజీ చూపిస్తున్న కపట ప్రేమ అని, వాస్తవానికి రామోజీ, చంద్రబాబు ఇద్దరూ దళిత వ్యతిరేకులేనని స్పష్టంచేశారు. దళితుల భూముల్ని లాక్కుని ఫిల్మ్‌సిటీ నిర్మించుకుని రూ.లక్షల కోట్ల ఆస్తులు పోగేసుకున్నది రామోజీరావని అన్నారు. దళితులపై దాడుల్లో దేశంలో నాలుగో స్థానంలో నిలిచిన చరిత్ర చంద్రబాబుదన్నారు. బాబు చేసిన దళిత ఊచకోతలు ఎన్నో ఉన్నాయని చెప్పారు. కారంచేడు, పదిరికుప్పం, చుండూరు, నీరుకొండ ఘటనలన్నీ బాబు హయాంలో ఆయన సామాజికవర్గం చేసిన దాష్టీకాలేనన్నారు. దళితులు బిక్కుబిక్కు మంటూ బతికారని, ఎప్పుడు టీడీపీ ప్రభుత్వం మారుతుందా అని ఎదురుచూశారన్నారు. సీఎం జగన్ అధికారంలోకొచ్చాక దళిత కుటుంబాల స్థితిగతులు మారాయని, ధైర్యంగా బతుకుతున్నారని చెప్పారు. పేదరికం 12 శాతం నుంచి 6 శాతానికి వచ్చిందంటేనే సీఎం జగన్ పాలనా సమర్థత అర్ధమవుతుందన్నారు. సీఎం జగన్ ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కమిషన్ ఉండాల్సిన అవసరాన్ని గుర్తించి ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేశారన్నారు. దళిత క్రైస్తవుల్ని ఎస్సీలు చేసేందుకు తీర్మానం చేసిన చరిత్ర సీఎం జగన్‌దని చెప్పారు. ప్రపంచం గర్వించేలా అంబేడ్కర్ విగ్రహం చంద్రబాబు సీఎంగా ఉండగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ముళ్ల పొదలకే పరిమితం చేయాలని చూశారని.., సీఎంగా జగన్ వచ్చాక విజయవాడ నడిబొడ్డున ఆకాశమంత ఎత్తులో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఒకప్పుడు చంద్రబాబు అమ్ముకోవాలని ప్రయత్నించిన అత్యంత ఖరీదైన ప్రాంతంలో ప్రపంచం గర్వించేలా 125 అడుగుల విగ్రహాన్ని రూ.400 కోట్లతో సీఎం జగన్ ఏర్పాటు చేస్తున్నారన్నారు. సీఎం జగన్ అందిస్తున్న సుపరిపాలనను ప్రపంచం యావత్తూ కొనియాడుతుంటే రామోజీరావు మాత్రం ఎందుకు రాయలేకపోతున్నారని ప్రశ్నించారు. బాబును అధికార పీఠంపై కూర్చోబెట్టాలన్న కుతితో రామోజీరావు రోజుకో రీతిగా ప్రభుత్వ పథకాలపై, లబ్ధి పొందుతున్న వర్గాలపై రామోజీ రోత రాతలు రాస్తున్నారన్నారు. ఆయనెంతగా రాసుకుని, గునపాలతో పైకి లేపినా బాబుకు అధికారం కల్లేనని, రామోజీ పిచ్చి కలేనని చెప్పారు. ఇప్పటికైనా నీచమైన రాతలు మానుకోవాలని హితవు చెప్పారు. -
గత ప్రభుత్వం వెనుకబడిన వర్గాలను పట్టించుకుందా?
-
నువ్వు ఎంత లేపిన చంద్రబాబుని జనం నమ్మరు: మేరుగు నాగార్జున
-
రామోజీ.. విషం కక్కడం కాదు.. చర్చకు రా : మంత్రి మేరుగ
సాక్షి,తాడేపల్లి : అబద్ధాల రామోజీకి చంద్రబాబంటే ఎంతో స్వీటని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. శుక్రవారం తాడేపల్లిలోని సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. పత్రికలో మళ్ళీ విషం కక్కి మళ్లీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దానికి సమాధానం చెప్పాలని రాశారని మండిపడ్డారు. ఏపీ చరిత్రలోనే సీఎం జగన్ సామాజిక విప్లవానికి తెరతీశారని కొనియాడారు. అంబేద్కర్ ఆశయ సాధనలో సీఎం జగన్ పని చేస్తుంటే రామోజీకి కనపడటం లేదని విమర్శించారు. ‘నాడు నేడు కింద సీఎం జగన్ స్కూల్లను బాగు చేయించారు. చంద్రబాబు హయాంలో రెండు వేల స్కూళ్లను మూసివేసి పేదపిల్లల జీవితాలను నాశనం చేశారు. కార్పొరేట్ స్కూళ్లకు పోటీగా జగన్ ప్రభుత్వ స్కూళ్లని అభివృద్ధి చేశారు. చంద్రబాబు హయాంలో విదేశీ విద్య పేరుతో అక్రమాలకు పాల్లడ్డారు. దీనిపై ప్రస్తుతం విజిలెన్స్ విచారణ జరుగుతోంది. జగన్ చేసిన మంచిపనులు రామోజీరావుకి కనపడటం లేదు. ఆయన రాతలను జనం నమ్మే పరిస్థితి లేదుజ జగన్ వచ్చాకే దళితుల స్థితిగతులు మారాయి’ అని మేరుగ తెలిపారు. ‘జగన్ వచ్చాక పేద బతుకుల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి. ఎస్సీలను బాగు చేయడానికి కార్పొరేషన్లు పెట్టి నిధులు ఖర్చు చేస్తున్నాం. ప్రతి పైసా దళితులకు అందేలా చర్యలు చేపట్టాం. దళిత క్రైస్తవులు చంద్రబాబుకు ఏనాడైనా కనిపించారా? రాజధానిలో దళితులు ఉండటానికి వీల్లేదని చంద్రబాబు కోర్టుకు వెళ్తే రామోజీరావు ఎందుకు రాయలేదు? ఇంగ్లీష్ మీడియం పేదలకు అవసరం లేదని కోర్టుకు వెళ్తే మీ పత్రికలో ఎందుకు రాయలేదు? రాజధానిలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టకుండా చంద్రబాబు కుట్ర పన్నితే ఎందుకు రాయలేదు’ అని మేరుగ ప్రశ్నించారు. ‘అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున జగన్ కట్టిస్తుంటే రామోజీరావుకి కనిపించడం లేదా? చంద్రబాబు హయాంలో దళితుల మీద దాడులు జరిగితే నీ పత్రికలో ఎందుకు రాయలేదు రామోజీ? దళితులపై దాడిలో దేశంలోనే నాలుగో స్థానంలో ఏపీ ఉందని చంద్రబాబు హయాంలో తేలితే ఎందుకు రాయలేదు? గిరిజనుల కోసం ఎస్టీ కమిషన్‌ను జగన్ ఏర్పాటు చేశారు. పోడు భూములకు పట్టాలిచ్చి భరోసా కల్పిస్తే ఎందుకు రాయలేదు? గిరిజన యూనివర్సిటీ మేము నిర్మిస్తుంటే ఎందుకు రాయలేదు? దీనిపై చర్చకు మేము సిద్దమే, టీడీపీ నేతలు, రామోజీరావు చర్చకు వస్తారా? అని మంత్రి సవాల్ విసిరారు. ఇదీచదవండి...ఏపీ పోలీసులపై కేసు నమోదు చేసిన తెలంగాణ పోలీసులు -
ఒకరికి ఒక చోటే ఓటుండాలి
సాక్షి, అమరావతి: ప్రజాస్వామ్యంలో ఒకరికి ఒకచోట మాత్రమే ఓటు ఉండాలని.. ఇది వైఎస్సార్సీపీ సిద్ధాంతమని మంత్రులు మేరుగు నాగార్జున, జోగి రమేష్ స్పష్టం చేశారు. ఓటర్ల ముసాయిదా జాబితాలో కొందరికి రెండు, మూడుచోట్ల ఓట్లు ఉన్నట్లు తాము గుర్తించామన్నారు. పొరుగు రాష్ట్రం తెలంగాణతో పాటు విదేశాల్లో ఉన్న వారికి సైతం ఇక్కడ ఓట్లు ఉన్నాయన్నారు. వాస్తవానికి ఆధార్ కార్డు ఎక్కడ ఉంటే.. అక్కడే ఓటు హక్కు ఉండటం న్యాయమని స్పష్టం చేశారు. బుధవారం వైఎస్సార్సీపీ నాయకుల బృందం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌కుమార్ మీనాను కలిసి ఓటర్ల జాబితాలో చోటుచేసుకున్న అవకతవకలు, డూప్లికేట్ ఓట్లు, డీ రిజిస్ట్రేషన్ (తెలంగాణ), ఓటర్ల రీఎన్రోల్మెంట్ (ఆంధ్రప్రదేశ్) అంశాలపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మంత్రులు మేరుగు నాగార్జున, జోగి రమేష్, శాసనమండలిలో ప్రభుత్వ విప్ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కూడిన వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందం రాష్ట్ర సచివాలయంలో ముఖేష్‌కుమార్ మీనాను కలిసి వినతిపత్రం సమర్పించారు. తొలగించారని ఒకరోజు.. చేర్పించారని మరో రోజు: మంత్రి రమేష్ ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన అనంతరం మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. ఒక వ్యక్తికి ఒకచోట మాత్రమే ఓటు ఉండాలని.. కానీ.. ఒకే వ్యక్తికి రెండు, మూడుచోట్ల ఓట్లు ఉన్నట్టు తమ పార్టీ గుర్తించిందన్నారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రెండుచోట్ల కొందరికి ఓట్లు ఉన్నట్టు తమ పరిశీలనలో తేలిందన్నారు. ఇలాంటివి కొన్ని తాము గుర్తించామని.. వాటి గురించి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వివరించామని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేయలేని టీడీపీ నేతలు కొందరు తమ పార్టీపై రోజూ ఎల్లో మీడియాలో వార్తలు రాయిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల సిబ్బంది లక్షల ఓట్లు తొలగించారని ఒక రోజు.. లక్షల ఓట్లు చేర్పించారని ఇంకో రోజు రాస్తున్నారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో ఎలాగూ ఓడిపోతామని తెలిసే టీడీపీ అనుకూల పచ్చమీడియా అలాంటి రాతలు రాస్తోందన్నారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత 70 రోజులు పత్తా లేకుండా పారిపోయిన లోకేశ్, మంత్రులకు భయం చూపెడతానంటున్నాడని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయమన్నారు. పీపుల్స్ యాక్ట్ ప్రకారం చర్యలు కోరాం: మంత్రి మేరుగు నాగార్జున మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. గత నెలలో ఎన్నికల సంఘానికి వినతిపత్రం ఇచ్చామని గుర్తు చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రెండుచోట్ల 16 లక్షలకు పైగా ఓటర్లుగా నమోదయ్యారన్నారు. అలాంటి వాటిని తొలగించాలని కోరామన్నారు. 1950 పీపుల్స్ యాక్ట్ సెక్షన్–17 ప్రకారం ఏ నియోజకవర్గంలో అయినా ఒక వ్యక్తికి ఒకచోట మాత్రమే ఓటు హక్కు ఉండాలన్నారు. దాని ప్రకారం చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరామన్నారు. తెలంగాణలో ఈ నెల 30న ఎన్నికలు జరుగుతున్నాయని, అక్కడ ఓటు హక్కు వినియోగించుకుని, అక్కడ ఓట్లు క్యాన్సిల్ చేయించుకుని ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకునేలా కొందరు చూస్తున్నారన్నారు. పక్క రాష్ట్రాల్లో ఇప్పుడు ఓటు వేసి.. ఆ తర్వాత మన రాష్ర్టంలో జరిగే ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చే వారిపై చట్టప్రకారం చర్య తీసుకోవాలని కోరినట్టు వివరించారు. ఈ మేరకు అధికారులకు క్లియర్‌గా ఆదేశాలు ఇవ్వాలని కోరినట్టు చెప్పారు. ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. రాజ్యాంగాన్ని రక్షించుకుందాం’ అనేది తమ నినాదమన్నారు. యుద్ధానికి రాకుండానే.. అస్త్ర సన్యాసం చేసే సన్నాసులు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు, పవన్ కల్యాణే అని మేరుగ ఎద్దేవా చేశారు. -
చంద్రబాబుకు, జగన్‌కు మధ్య తేడా ఇదే: మంత్రి మేరుగు
సాక్షి, విజయవాడ: ఏపీ చరిత్రలో నూతన శకం నెలకొందని, సామాజిక సమతుల్యత విరాజిల్లుతుందనడానికి నిదర్శనమే ఈ అంబేద్కర్ విగ్రహం అని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. స్వరాజ్యమైదానంలో అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను సోమవారం.. మంత్రులు మేరుగ నాగార్జున, కొట్టు సత్యనారాయణ. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు పరిశీలించారు. ఈ సందర్బంగా మంత్రి మేరుగ నాగార్జున మీడియాతో మాట్లాడుతూ, సుమారు రూ. 420 కోట్లతో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. అంబేద్కర్ విగ్రహం, స్మృతివనాన్ని దేశంలోనే ఒక చారిత్రక ప్రాంతంగా తీర్చిదిద్దాలని సీఎం జగన్ భావించారు. త్వరితగతిన పనులు జరుగుతున్నాయి. త్వరలోనే సీఎం చేతుల మీదుగా అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవమవుతుందని మంత్రి మేరుగ తెలిపారు. అంబేద్కర్ పేరు ఉచ్ఛరించడానికి చంద్రబాబు, లోకేష్‌కు అర్హత లేదు లోకేష్ ఎక్కడైనా ఎమ్మెల్యేగా చేశాడా అంటూ మంత్రి మేరుగ నాగార్జున ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఎస్సీ కులంలో ఎవరూ పుట్టకూడదంటే లోకేష్ ఎందుకు మాట్లాడలేదు?. అంబేద్కర్ విగ్రహం ముళ్లపొదల్లో పెట్టాలని చంద్రబాబు చూశాడు. చంద్రబాబు దళితులను అవమానించాడు.. దాడులు చేయించాడు. చంద్రబాబుకు, జగన్‌కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అంబేద్కర్ పేరు ఉచ్ఛరించడానికి చంద్రబాబు కుటుంబానికి అర్హత లేదు. ఐదేళ్లలో పాలనలో దళితులను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు’’ అంటూ మంత్రి మేరుగ దుయ్యబట్టారు. చారిత్రాత్మకమైన నిర్ణయం: మంత్రి కొట్టు సత్యనారాయణ మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడూతూ, భారతదేశంలోనే ఒక పర్యాటక కేంద్రంగా అంబేద్కర్ విగ్రహాన్ని తీర్చిదిద్దుతామన్నారు. అంబేద్కర్ జీవిత చరిత్రను తెలియజేసేలా స్మృతివనం ఉంటుంది. అంబేద్కర్ భావజాలాన్ని ఆకళింపు చేసుకున్న వ్యక్తి సీఎం జగన్. దేశానికి ఆదర్శవంతమైన పాలన సీఎం జగన్ అందిస్తున్నారు. అన్ని వర్గాలకు మేలు చేయడమే అంబేద్కర్ భావజాలం. బెజవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తుండటం చారిత్రాత్మకమైన నిర్ణయం’’ అని మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. చదవండి: వైద్యుడి ఆత్మహత్యపై టీడీపీ రాజకీయం -
రాష్ట్రంలో రజకులకు సమున్నత స్థానం
ఏఎన్‌యూ: రజకుల సాధికారతకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న మైదానంలో ఆదివారం రాత్రి ఆంధ్రప్రదేశ్ రజక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన రజక ఆత్మగౌరవ మహాసభలో మంత్రి ప్రసంగిస్తూ.. రజకుల సమస్యల పరిష్కారానికి ఏపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తోందన్నారు. రజక కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా రజకులకు సమున్నత స్థానం కల్పించారని తెలిపారు. అంబేడ్కర్ ఆశించిన సామాజిక న్యాయమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు పేదవాడి చెంతకు చేరుతున్నాయని తెలిపారు. అణగారిన వర్గాల సాధికారతకు అంకితభావంతో పనిచేస్తున్న ముఖ్యమంత్రి ఉండటం మన అదృష్టమన్నారు. ఆయన నాయకత్వంలో పనిచేయడం మాకు గర్వంగా ఉందని తెలిపారు. రజకుల సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషిచేస్తానని నాగార్జున హామీ ఇచ్చారు. సామాజిక సాధికారతకు ఏపీ వేదిక.. బీసీ సంక్షేమ శాఖా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. కులగణన విషయంలో దేశంలో ఏ రాష్ట్రం చేయని సాహసం ఏపీ ప్రభుత్వం చేస్తోందన్నారు. ఈ ప్రక్రియ తరువాత రజకులకు మరిన్ని ప్రయోజనాలు అందుతాయన్నారు. సామాజిక సాధికారతకు ఏపీ వేదికగా నిలుస్తోందని తెలిపారు. గత పాలకుల వివక్షకు గురైన వర్గాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమున్నత స్థానం కల్పిస్తోందన్నారు. ప్రస్తుతం ఏపీలో బీసీల రాజ్యం నడుస్తోందని తెలిపారు. రజకుల సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని ప్రభుత్వ విప్ లేళ్ల అప్పిరెడ్డి, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ తెలిపారు. రజకులకు ఏపీ ప్రభుత్వం అగ్రస్థానం కల్పించిందని.. రానున్న రోజుల్లో మరిన్ని పదవులు కల్పించనుందన్నారు. చట్టసభల్లో రజకులకు తప్పకుండా స్థానం దక్కుతుందన్నారు. రజకులను వంచించిన చంద్రబాబు ఏపీ రజక కార్పొరేషన్ చైర్మన్ రంగన్న, రజక సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు అంజిబాబు ప్రసంగిస్తూ.. రజకుల సమస్యల పరిష్కారంపై సీఎం జగన్‌కు ప్రత్యేక ప్రణాళిక ఉందన్నారు. మాటతప్పే వ్యక్తిత్వం ఆయనది కాదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం రజకులను తీవ్రంగా వంచించిందన్నారు. రజకుల్లో 50 ఏళ్ల వారికి పింఛన్ ఇవ్వమంటే మీకు ఇస్తే మిగతా కులాలు కూడా అడుగుతాయని చంద్రబాబు అవమానించారన్నారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. రజకుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు, ఏపీ ఎన్జీఓ రాష్ట్ర నాయకుడు బండి శ్రీనివాసరావు, పలువురు బీసీ సంఘాలు, రజక సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఏపీలో గొప్ప సంక్షేమ పథకాలు అమలు.. ఏపీలో గొప్ప సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలంగాణ ఎమ్మెల్సీ, కవి గోరటి వెంకన్న అన్నారు. రజకులపై తాను రాసిన పాట అంటే మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి ఎంతో ఇష్టమన్నారు. రాష్ట్రంలో గతానికి, ఇప్పటికి ఉన్న మంచిని గమనించాలని రజకులకు సూచించారు. పాటలతో ఆయన సభికులను ఉత్తేజపరిచారు. -
అన్ని స్పీచ్ లు ఒక లెక్క..ఈ స్పీచ్ ఒక లెక్క..
-
జగనన్న ఇది గొప్ప ఆలోచన..!
-
సీఎం జగన్ సంక్షేమ పాలన చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు: మంత్రి మేరుగు నాగార్జున
-
‘ఏపీలో సంక్షేమ పాలన.. చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు’
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగున్నరేళ్లుగా అన్నీ చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. ఆయన శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పేదలకు భూమి హక్కులు కల్పించిన నాయకుడు సీఎం జగన్. గత టీడీపీ ప్రభుత్వం పేదలను పట్టించుకుందా?’’ అని ప్రశ్నించారు. సీఎం జగన్ రైతుల పక్షపాతి. ఆయన సంక్షేమ పాలన చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు. చంద్రబాబు ఏరోజైనా వెనుకబడిన వర్గాలను పట్టించుకున్నారా?. సామాజిక న్యాయాన్ని అమలు చేసిన ఘనత వైఎస్ జగన్‌దే. చంద్రబాబు ఎన్ని హామీలిచ్చారు? ఎన్ని అమలు చేశారు?. అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తున్న నాయకుడు జగన్’’ మంత్రి పేర్కొన్నారు. ‘‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం జగన్ అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. దళితులను గుండెల్లో పెట్టుకున్న నాయకుడు వైఎస్ జగన్. ఈ రాష్ట్రంలో చంద్రబాబుకు కనీసం సొంతిల్లు కూడా లేదు. రాష్ట్రంలో ఉండని వ్యక్తులు ప్రజలకు ఇంకేం న్యాయం చేస్తారు’’ అంటూ మంత్రి మేరుగు నాగార్జున దుయ్యబట్టారు. చదవండి: బెయిల్ కోసం ఇన్ని డ్రామాలెందుకు?: మంత్రి సీదిరి -
తంబళ్లపల్లెలో సంక్షేమ యాత్ర
బి.కొత్తకోట: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన చర్యల ఫలితం అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో ప్రతిబింబించింది. శుక్రవారం నియోజకవర్గంలో జరిగిన సామాజిక సాధికార యాత్రకు బడుగు, బలహీన వర్గాల ప్రజలు వెల్లువెత్తారు. సీఎం జగన్ తమకు చేసిన మేలును వివరిస్తూ యాత్రలో సాగారు. పీటీఎం నుంచి మద్దయ్యగారిపల్లె వరకు పాదయాత్ర సాగింది. అనంతరం ములకలచెరువులో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాధరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో పెద్ద ఎత్తున పాల్గొని, జై జగన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం వైఎస్ జగన్ చేసిన మేలును మంత్రులు, నాయకులు వివరించారు. సామాజిక సాధికారతను నిజం చేసిన సీఎం జగన్: మంత్రి మేరుగు ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకూ మేలు చేసి ప్రతి గుండెలో సీఎం వైఎస్ జగన్ ఉన్నారని మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. జ్యోతిరావు పూలే, అంబేడ్కర్ కలలుగన్న సామాజిక సాధికారతను సీఎం జగన్ ఆచరణలో నిజం చేస్తున్నారని అన్నారు. దేశ ప్రధానులకే సాధ్యంకాని సామాజిక విప్లవానికి సీఎం వైఎస్ జగన్ నాంది పలికారని అన్నారు. చంద్రబాబు 2014లో 645 హామీలతో గెలిచి ప్రజలను మోసం చేశారన్నారు. 2024లో మరోసారి మోసం చేసేందుకు బాబు వస్తున్నారని, ప్రజలు మోసపోవద్దని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఆర్థికంగా, రాజకీయంగా మరింతగా ఎదగడానికి సీఎం జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. జగన్‌తోనే స్వాతంత్య్రం: మంత్రి గుమ్మనూరు జయరాం 75 ఏళ్ల స్వాతంత్య్ర చరిత్రలో సీఎం వైఎస్ జగన్ పాలనలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు స్వాతంత్య్రం వచ్చిందని మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. బీసీల్లోని అన్ని వర్గాలకు సీఎం జగన్ అండగా నిలుస్తున్నారని చెప్పారు. జగన్ అనే శక్తి లేకపోతే, పార్టీ పెట్టకపోతే ఈ మార్పు ఉండేది కాదని అన్నారు. స్కీం సీఎం జగన్ : మంత్రి ఉషశ్రీ చరణ్ ఏపీలో స్కీం సీఎం జగన్ అయితే స్కాం సీఎం చంద్రబాబు అని మంత్రి ఉషశ్రీ చరణ్ అన్నారు. మహిళలను కార్పొరేషన్ చైర్మన్లు చేసిన ఘనత జగన్‌దేనని చెప్పారు. కనకదాస్, వాల్మికి జయంతిని అధికారికంగా నిర్వహించి గౌరవం పెంచారన్నారు. టీడీపీ నేతల మాటలు ఎవరూ వినడంలేదు: మాజీ మంత్రి అనిల్ కుమార్ చంద్రబాబును స్థానిక ఎన్నికల్లో సొంత జిల్లా చిత్తూరు ప్రజలే తిప్పికొట్టారని, ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ,బీసీలు మైనార్టీలంతా వచ్చే ఎన్నికల్లో ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి అనిల్ కుమార్ పేర్కొన్నారు. నెల్లూరు గడ్డపై ఓ బీసీకి టికెట్ ఇచ్చి రెండుసార్లు గెలిపించి మంత్రిగా చేసిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. కష్టంతో పాలు పోసిన వారి ఆదాయంతో చంద్రబాబు హెరిటేజ్ ఆస్తులు పెరిగాయని అన్నారు. ఎన్నికల్లో కిలో బంగారం, బెంజి కారు ఇస్తామని చెబుతారని, అలాంటి వారి మాటలకు మోసపోవద్దని కోరారు. సామాజిక సాధికార యాత్రలో నల్ల రిబ్బన్లతో నిరసనలు తెలపాలని టీడీపీ నేతలంటున్నారని, వారి మాటలు ఎవరూ వినడంలేదని చెప్పారు. -
సామాజిక న్యాయంలో చరిత్ర సృష్టించిన జగన్
పామర్రు: సామాజిక న్యాయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశంలోనే చరిత్ర సృష్టించారని మంత్రి జోగి రమేష్ చెప్పారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అక్కున చేర్చుకొని, అనేక కార్యక్రమాలతో ఈ వర్గాలను అభివృద్ధిలోకి తీసుకొచ్చి సామాజిక సాధికారత సాధించిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో ఏ రాష్ట్రంలో, ఏ ముఖ్యమంత్రీ ఈ ఘనత సాధించలేదన్నారు. సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా గురువారం కృష్ణాజిల్లా పామర్రులో ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కేబినెట్ సహా అన్ని పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సీఎం జగన్ పెద్ద పీట వేశారని, మహిళలకు 50 శాతం పదవులిచ్చారని అన్నారు. ఇది ఓ చరిత్రగా నిలిచిపోతుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలు ఊపిరిగా ఉన్న సీఎం వైఎస్ జగన్‌ని ప్రజా క్షేత్రంలో ఎవరూ ఓడించలేరని, పవన్ కళ్యాణ్ షణ్ముఖ వ్యూహం, చంద్రబాబు, లోకేశ్, రామోజీ, రాధాకృష్ణతో కలిసి ఎన్ని వ్యూహాలు పన్నినా జగన్ ముందు పనిచేయవన్నారు. చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంకుగానే వాడుకొన్నారని, సీఎం జగన్ నలుగురు బీసీలను రాజ్యసభకు పంపించి చరిత్ర సృష్టించారని చెప్పారు. రాజ్యసభ సీటిస్తానని ఎస్సీ వర్గానికి చెందిన వర్ల రామయ్యకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. అదే సీటును వంద కోట్లకు కనకమేడల రవీంద్రకుమార్‌కు అమ్ముకున్నారని తెలిపారు. ఇలా అడుగడుగునా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అవమానించిన చంద్రబాబును మరోసారి చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలంటూ అక్కున చేర్చుకున్న సీఎం జగన్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని ప్రజలను కోరారు. ఉన్నత స్థితికి బడుగు వర్గాలు: మంత్రి నాగార్జున మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ అంబేడ్కర్, పూలే, జగజ్జీవన్‌రామ్, సాహూ మహరాజ్, అబ్దుల్ కలామ్ వంటి మహానుభావుల ఆలోచనా విధానాలకు అనుగుణంగా సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలను ఉన్నత స్థితికి చేరుస్తున్నారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం కోసం లక్షల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారన్నారు. కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా, రూపాయి లంచం లేకుండా పేదవారి చెంతకు సంక్షేమ పథకాలను చేరుస్తున్నారని అన్నారు. 31 లక్షల మంది పేద అక్కచెల్లెమ్మలకు ఇళ్ళ పట్టాలిచ్చి వారి కుటుంబాలకు గూడు కల్పించిన సీఎంగా దేశంలోనే రికార్డు సృష్టించారన్నారు. అంతర్జాతీయ స్థాయి విద్యను, అత్యాధునిక కార్పొరేట్ వైద్యాన్ని పేదవారికి అందిస్తున్న ఏకైక సీఎం జగన్ అని చెప్పారు. 2014లో 648 వాగ్దానాలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. పైగా, రుణాలు మాఫీ చేస్తానని రైతులు, మహిళలను మోసం చేశారని, ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎందుకూ పనికిరారని అవహేళన చేశారని తెలిపారు. మన విలువలు కాపాడుకోవడానికి 2024లో తిరిగి జగన్మోహన్రెడ్డిని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. బాబును ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎప్పటికీ క్షమించరు : ఎంపీ సురేష్ సంక్షేమ పథకాలతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సోమరిపోతులవుతారన్న చంద్రబాబును ఈ వర్గాలు ఎప్పటికీ క్షమించబోవని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ చెప్పారు. ఆరు లక్షల కోట్లు అక్రమంగా సంపాదించిన చంద్రబాబు సోమరిపోతు కాదా అని ప్రశ్నించారు. రెండెకరాల నుంచి లక్షల కోట్లు ఎలా సంపాదించారో చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు చెబితే వారు కూడా కోటీశ్వరులు అవుతారని అన్నారు. రూ.370 కోట్లు అవినీతికి పాల్పడిన చంద్రబాబు జైలుకు వెళితే టీడీపీ ఆందోళనలు చేయడం సిగ్గుచేటన్నారు. నిజం గెలవాలి అని చంద్రబాబు సతీమణి భువనేశ్వరి చెబుతున్నారని, నిజం గెలిస్తే చంద్రబాబు జీవితాంతం జైలులోనే ఉంటారని అన్నారు. బడుగులను అందలమెక్కిస్తున్న సీఎం జగన్: ఎంపీ మోపిదేవి అనేక పథకాలతో రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలను సీఎం జగన్ అందలమెక్కిస్తున్నారని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదిగేలా కార్యక్రమాలు అమలు చేస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ మాట్లాడుతూ గతంలో పెన్షన్ కావాలంటే నాయకులకు దండాలు పెడితేనో, టీడీపీ కండువాలు కప్పుకుంటేనే మంజూరయ్యేదన్నారు. సెంటర్లో కనబడి దండం పెట్టకపోతే పెన్షన్ రద్దయ్యేదని చెప్పారు. సీఎం జగన్ పాలనలో కులం, మతం, రాజకీయాలతో సంబంధం లేకుండా అర్హులైన వారందరికీ సంక్షేమ పధకాలు అందుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారథి, సింహాద్రి రమేష్ బాబు, పేర్ని నాని, ముస్తాఫా, జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక పాల్గొన్నారు. -
ఇది బడుగు, బలహీన వర్గాల ప్రభుత్వం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల ప్రభుత్వమని మంత్రులు మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్ చెప్పారు. సామాన్యుల సంక్షేమమే సీఎం జగన్ ధ్యేయమని, సామాజిక సాధికారత మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపించి దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను పెద్దన్నలా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని చెప్పారు. సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా బుధవారం ప్రకాశం జిల్లా కనిగిరిలో జరిగిన బహిరంగ సభలో మంత్రులు మాట్లాడారు. మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో సామాజిక విప్లవం తెచ్చారని, దేశంలో ఇప్పటివరకు మరే ముఖ్యమంత్రీ కనీసం ఆలోచన కూడా చేయలేదని చెప్పారు. బడుగు, బలహీన వర్గాల స్థితిగతులు, వారి బాధలు స్వయంగా తెలుసుకుని సీఎం జగన్ న్యాయం చేశారని కొనియాడారు. అనేక పథకాలతో రాష్ట్రవ్యాప్తంగా 2.53 లక్షల కోట్లు ప్రజలకు సంక్షేమం అందించారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే రూ.1.76 లక్షల కోట్లు లబ్ధి చేకూర్చిన ఘనత వైఎస్ జగన్‌దేనని అన్నారు. కనిగిరిలో జరిగిన బహిరంగసభకు హాజరైన జనసందోహంలో ఒక భాగం బడుగుల ఆత్మ బంధువు సీఎం జగన్: మంత్రి సురేష్ బడుగు, బలహీనవర్గాల ఆత్మ బంధువు సీఎం జగన్ అని మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. పేదరికం పిల్లలకు విద్యను దూరం చేయకూడదనే సంకల్పంతో సీఎం జగన్ నిరుపేదలకు సైతం అంతర్జాతీయ స్థాయిలో ఇంగ్లిష్ మీడియం చదువులు అందుబాటులోకి తెచ్చారని అన్నారు. దళితుడినైన తనను విద్యా శాఖ మంత్రిని చేయడం సాధికారత కాదా అని ప్రశ్నించారు. ఇంగ్లిష్ మీడియంపై గొడవ పెట్టిన టీడీపీ, జనసేన నేతలకు పేద బిడ్డలు మంచి చదువులు చదవడం ఇష్టం లేదా అంటూ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్‌కు దమ్ముంటే ప్రభుత్వ పాఠశాలలో చదివే బడుగు, బలహీన వర్గాల విద్యార్థులతో ఇంగ్లిష్‌లో మాట్లాడాలని సవాల్ చేశారు. ఇంత మేలు మరే రాష్ట్రంలో జరగలేదు: ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం వైఎస్ జగన్ చేసిన మేలు ఇప్పటివరకు దేశంలో మరే రాష్ట్రంలోనూ జరగలేదని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా చెప్పారు. మొట్టమొదటిసారి దేశంలో మంత్రివర్గంలో 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను నియమించడం, ఐదుగురు ఉప ముఖ్యమంత్రుల్లో నాలుగు పదవులు ఇవే సామాజిక వర్గాల వారికివ్వడం సీఎం జగన్‌కే సాధ్యమైందన్నారు. నాలుగు ఎమ్మెల్సీ, 12 రాష్ట్రస్థాయి చైర్మన్ పోస్టులు ఇచ్చిన ఘనత కూడా సీఎం జగన్‌కే దక్కుతోందన్నారు. ఏకంగా ముస్లిం మహిళను మండలి డిప్యూటీ చైర్మన్‌గా నియమించి చరిత్ర సృష్టించారన్నారు. బీసీలను అణగదొక్కడమే చంద్రబాబు సిద్ధాంతం: ఎంపీ బీద మస్తాన్‌రావు బీసీలను ఎన్నికల్లో ఓటు బ్యాంకుగా ఉపయోగించుకొని, అధికారంలోకి వచ్చాక అణగదొక్కడమే చంద్రబాబు సిద్ధాంతమని రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు చెప్పారు. 30 ఏళ్లు టీడీపీలో పనిచేసిన తనకు అనేకమార్లు రాజ్యసభ సీటు ఇస్తానని మోసం చేశారని తెలిపారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం జగన్ నలుగురు బీసీలకు రాజ్యసభకు వెళ్లే అవకాశం కల్పించారని, దేశ చరిత్రలోనే ఇదొక సువర్ణాధ్యాయమని తెలిపారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన తాను, కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదనరావు వంటి తామే సీఎం జగన్ సామాజిక సాధికారత తెచ్చారనడానికి ఉదాహరణ అని చెప్పారు. కనిగిరిలో రూ.3,471 కోట్లతో అభివృద్ధి : ఎమ్మెల్యే బుర్రా మధుసూదనరావు సామాన్యుడినైన తనను శాసన సభ్యుడిగా చేసిన ఘనత వైఎస్ జగన్‌దేనని కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదనరావు చెప్పారు. సీఎం వైఎస్ జగన్ అండతో కనిగిరిలో రూ. 3,471 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. కనిగిరిని రెవెన్యూ డివిజన్‌గా చేసి వెనుకబడిన ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దారని కొనియాడారు. 18 వేల ఇళ్లకు ఇంటింటి కుళాయిలు ఇచ్చేందుకు రూ. 125 కోట్లతో పనులు వేగంగా జరుగుతున్నాయని, రూ. 150 కోట్లతో జేజేఎం ద్వారా పనులు చేపడుతున్నామని తెలిపారు. కనిగిరిలో రోడ్లన్నీ అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. కనిగిరి ప్రజలకు మంచి నీటిని అందించేందుకు రూ.1,250 కోట్లతో చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు టెండర్ల దశలో ఉందని చెప్పారు. -
చంద్రబాబు మోసపు మాటల్లో పడొద్దు: మేరుగు నాగార్జున
-
బీజేపీ అధ్యక్షురాలివా.. బాబుకు తొత్తువా?
నగరం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తన ఉనికిని కాపాడుకునేందుకే ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు మండిపడ్డారు. బీజేపీ అధ్యక్షురాలివా.. చంద్రబాబుకు తొత్తువా... అని పురందేశ్వరిని ప్రశ్నించారు. ఆదివారం బాపట్ల జిల్లా నగరంలో వారు మీడియా సమావేశం నిర్వహించారు. మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ బీజేపీ ఎదుగుదల కోసం, భవిష్యత్ కోసం పనిచేస్తున్నారో.. టీడీపీ అభివృద్ధి కోసం పనిచేస్తున్నారో చెప్పాలని పురందేశ్వరిని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పా ర్టీలో ఉన్నప్పుడు రాష్ట్రానికి పట్టిన దరిద్రం, రైతులను, ప్రజల్ని మోసం చేశారంటూ చంద్రబాబును విమర్శించిన పురందేశ్వరి.. నేడు ప్రజలపై టీడీపీ అజెండా రుద్దేందుకు ప్రయత్నించడం దారుణమన్నారు. పురందేశ్వరి బీజేపీ నావ ఎక్కి.. టీడీపీ తెడ్డు తిప్పుతున్నారని విమర్శి«ంచారు. ఏ అర్హతతో ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని లేఖ రాశారో చెప్పాలన్నారు. ఎంపీ మోపిదేవి వెంకటరమణ మాటా్లడుతూ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుతో పురందేశ్వరి కూడా ఉన్నారని చెప్పారు. చంద్రబాబును కాపాడుకోవాలనే తాపత్రయం తప్ప.. బీజేపీ అధ్యక్షురాలిలా ఆమె వ్యహరించడం లేదన్నారు. అవినీతికి పాల్పడి స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు జైలుకు వెళితే ఆయనకు వత్తాసుగా పురందేశ్వరి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉంటే.. పురందేశ్వరి పదేపదే ప్రభుత్వంపై బురదజల్లడం సరికాదన్నారు. -
బీఆర్ అంబేద్కర్ గురుకుల బాలుల పాఠశాలను ప్రారంభించిన మంత్రి మేరుగు నాగార్జున
-
సామాజిక ప్రభంజనం
సీఎం వైఎస్ జగన్ చర్యలతో రాష్ట్రంలో సాకారమైన సామాజిక సాధికారతను వివరించేందుకు వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రలకు జనం పోటెత్తుతున్నారు. సాధికారత ఫలితాలను ప్రతిబింబిస్తున్నారు. గత నెల 26న ప్రారంభమైన సామాజిక సాధికార యాత్రలు ఇప్పటివరకు 3 ప్రాంతాల్లో 19 నియోజకవర్గాల్లో విజయవంతంగా సాగాయి. వీటికి వస్తున్న అశేష జనం సామాజిక విప్లవ సారథి సీఎం జగన్‌కు జేజేలు పలుకుతున్నారు. ‘మా నమ్మకం నువ్వే జగన్, జగనన్నే మా భవిష్యత్తు, జగనే కావాలి – జగనే రావాలి’ అంటూ నినదిస్తున్నారు. యాత్రలో భాగంగా పలు చోట్ల బైక్, కారు ర్యాలీలు, పాదయాత్రలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాల్లో యాత్ర ముగింపు సందర్భంగా నిర్వహిస్తోన్న సభలకు పెద్ద ఎత్తున ప్రజలు కదలివస్తుండటంతో సభా ప్రాంగణాలు జనసంద్రాలుగా మారుతున్నాయి. సాక్షి ప్రతినిధి, గుంటూరు: వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సామాజిక విప్లవానికి తెరతీశారని రాష్ట్ర మంత్రులు ఆదిమూలపు సురేష్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మేరుగు నాగార్జున చెప్పారు. దేశంలో గరీబీ హటావో వంటి నినాదాలు ఎన్ని వచ్చినా పేదవాడి తలరాతని మార్చింది ఒక్క వైఎస్ జగన్ మాత్రమేనని అన్నారు. దళితులు, బీసీలను చిన్నచూపు చూసిన చంద్రబాబు పాలనకు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ వారి అభ్యున్నతికి కృషి చేస్తున్న సీఎం వైఎస్ జగన్ పాలనకు తేడా గమనించాలని కోరారు. వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా శనివారం గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని మాయాబజారు సెంటర్లో స్థానిక ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో మంత్రులు ప్రసంగించారు. సీఎం వైఎస్ జగన్ నాలుగున్నరేళ్ల సుపరిపాలనలో కుల, మత, ప్రాంత, పార్టీల వివక్ష చూపకుండా సామాజిక న్యాయం పాటించి ప్రతి ఒక్కరికీ మేలు చేశారని మంత్రి సురేష్ చెప్పారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మహాత్మ జ్యోతిరావు పూలే కలగలిపితే అభినవ అంబేడ్కర్ వైఎస్ జగన్ అని కొనియాడారు. డాక్టర్ వైఎస్సార్ మైనార్టీలకు కల్పించిన రిజర్వేషన్ల సాక్షిగా సీఎం వైఎస్ జగన్ ప్రతి అంశంలోనూ వారికి పెద్ద పీట వేస్తున్నారన్నారు. టీడీపీ హయాంలో కనీసం మైనార్టీలను పట్టించుకోలేదని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం లేవన్న విపక్షాల ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. 2019లో 22వ స్థానంలో ఉన్న రాష్ట్ర స్థూల ఉత్పత్తి వైఎస్ జగన్ పాలనలో మొదటి స్థానానికి రావడం అభివృద్ధి, ప్రజలకు అందిన సంక్షేమానికి నిదర్శనమని తెలిపారు. తెలుగుదేశం పార్టీ భావజాలమే ప్రజలను మోసం చేయడమన్నారు. చంద్రబాబు ఆఖరికి న్యాయమూర్తికి కూడా అబద్ధాలు చెప్పి ఒక్క రోజు ఆసుపత్రిలో ఉండి, రెండో రోజే ఇంటికి వచ్చి కార్యకలాపాలు చేస్తున్నారని విమర్శించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో జరిగిన సభకు హాజరైన అశేష జన సందోహంలో ఓ భాగం చంద్రబాబు అంటే అబద్ధం.. వైఎస్ జగన్ అంటే నిజం రాష్ట్రంలో అధిక భాగం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను అన్ని రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకులానే చూశాయని, సీఎం వైఎస్ జగన్ వారికి అన్ని రంగాల్లో పెద్ద పీట వేసి, బలహీన వర్గాల పక్షమని చాటి చెప్పారని సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ చెప్పారు. చంద్రబాబు అంటేనే అబద్ధమని, సీఎం జగన్ అంటే నిజమని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాధికారం దిశగా సీఎం వైఎస్ జగన్ పునాది వేశారన్నారు. సమ సమాజ స్థాపన కోసం సీఎం జగన్ కృషి చేస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. చంద్రబాబు హయాంలో అణగారిన వర్గాలను అవమానించి, అణచివేశారని, సీఎం వైఎస్ జగన్ ఈ వర్గాలకు పూర్తి స్థాయి ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో పేదలకు రూ. 2.35 లక్షల కోట్లు నేరుగా అందజేసిన ఘనత సీఎం జగన్‌దేనని అన్నారు. అవినీతి, ఆశ్రిత పక్షపాతం లేకుండా ప్రజలకు మేలు చేసిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అని అన్నారు. సీఎం వైఎస్ జగన్ నాలుగున్నరేళ్లలో పేదరిక నిర్మూలనకు, పేదలకు ఆస్తుల కల్పనకు కృషి చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు చెప్పారు. సీఎం జగన్ పాలన దేశంలోనే ఓ చరిత్రకు శ్రీకారం చుట్టిందన్నారు. ఏసీల్లో కూర్చొని మాట్లాడుకునే చంద్రబాబు, పవన్, లోకేశ్‌లకు పేదల కష్టాలు ఎలా తెలుస్తాయని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ అన్నారు. వైఎస్ జగన్ చేసిన మేలును చూశారు కాబట్టే ఆయన కటౌట్ చూసి ప్రజలు రాష్ట్రవ్యాప్తంగా బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. 2024 ఎన్నికల్లో సీఎం జగన్‌ను తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రజలకు అత్యంత ఆవశ్యకమైన వైద్యం, విద్య అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందని వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ నూరిఫాతిమా చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త, ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్, ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డి, చంద్రగిరి ఏసురత్నం, పోతుల సునీత, పార్టీ జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాద్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెర హెనీక్రిస్టినా తదితరులు పాల్గొన్నారు. -
సీఎం జగన్ పాలనలోనే సామాజిక న్యాయం జరిగింది: మంత్రి కారుమూరి
సాక్షి, చిత్తూరు/కృష్ణా: వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్ర అయిదో రోజు కొనసాగుతోంది. ఉత్తరాంధ్రలో అనకాపల్లి జిల్లా మాడుగుల, కోస్తాలో అవనిగడ్డ, రాయలసీమలో చిత్తూరు జిల్లాల్లో బస్సుయాత్ర సాగుతోంది. కృష్ణాజిల్లా అవనిగడ్డలో బస్సు యాత్ర ఓటు వేసిన వారికి, వేయని వారికి సంక్షేమ పథకాలు అందించామని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. సీఎం జగన్ పాలనలోనే సామాజిక న్యాయం జరిగింది. 56 కార్పొరేషన్లు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌దేనని ప్రశింసించారు. రావాలి జగన్.. కావాలి జగన్ అని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. టీడీపీ హయాంలో 36 వేల కోట్లతో కత్తెరలు,ఇస్త్రీ పెట్టెలు ఇచ్చి తిరిగి డబ్బు కట్టించుకున్నారని విమర్శించారు. లక్ష కోట్లతో తిరిగి చెల్లించే అవసరం లేకుండానే సీఎం సాయం చేశారని ప్రస్తావించారు. ► 65 వేల కోట్లతో నాడు-నేడు పనులతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చారు: మంత్రి కారుమూరి ►పేద పిల్లల నుంచి ఐఏఎస్ లు, ఐపీఎస్‌లు రావాలని ఆకాంక్షించిన వ్యక్తి సీఎం జగన్. ►పేదరికాన్ని 6%కి తగ్గించిన మహానేత వైఎస్ జగన్ ►పోషకాహార లోపాన్ని అధిగమించేలా పిల్లలకు పౌష్టికాహారం అందించిన మనసున్న నేత ►చంద్రబాబు జీవిమంతా స్కాములే ►జగన్ మోహన్ రెడ్డి పాలనలో స్కీములు ►చంద్రబాబు కలెక్టర్ల మీటింగ్‌లలో మా వాళ్లకే చేయమని చెప్పాడు. ►సీఎం జగన్ పార్టీలు, కులాలను చూడకుండా మేలు చేయాలని చెప్పారు. ►సీఎంకు రెడ్డికి వ్యతిరేక ఓటనేదే లేదు ►మా నినాదం వై నాట్ 175 ►చంద్రబాబు, పవన్‌కు ఈ ఎన్నికల్లో చరమగీతమే ఎమ్మెల్సీ,మర్రి రాజశేఖర్ ►మ్యానిఫెస్టోలో చెప్పివన్నీ అమలు చేసిన వ్యక్తి సీఎం జగన్. ►రైతులను ఆదుకున్న ప్రభుత్వం ఇది. ►అన్ని వర్గాలకు మేలు చేసిన ప్రభుత్వం ఇది. ►చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. ►డ్వాక్రా మహిళలు, రైతులను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు. ►ధైర్యంగా ప్రతీ ఇంటికీ ఓటు అడిగే హక్కు సీఎం జగన్ మాకు కల్పించారు. ►ప్రతీ ఇంటికీ లబ్ధి చేకూర్చిన ప్రభుత్వం ఇది. ►గత 75 ఏళ్లలో సచివాలయాలు, వెల్ నెల్ సెంటర్లు ఏ గ్రామంలోనూ చూడలేదు. ►ప్రజలు సామాజికంగా,ఆర్ధికంగా వృద్ధి చెందాలన్నదే సీఎం ఆలోచన మోపిదేవి వెంకట రమణ ►గత ప్రభుత్వంలో బీసీ వర్గాలు ఓటు బ్యాంకు రాజకీయాలకే పరిమితమయ్యారు. ► సీఎం జగన్ పాలనలో బీసీలకు ఎంతో మేలు జరిగింది. ►బీసీ, ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ వర్గాలు తలెత్తుకు తిరిగేలా చేసిన వ్యక్తి సీఎం జగన్. ► 2 లక్షల 38కోట్లతో నేరుగా లబ్ధిదారులకు మేలు జరిగింది. ►భూతద్ధం పెట్టి వెతికినా సంక్షేమం అందలేదనే వ్యక్తి కనిపించడం లేదు. ►గత ప్రభుత్వంలో బిసిలకు రాజ్యసభ సీటు ఇచ్చిన పరిస్థితి లేదు. ►చరిత్రలో బీసీలకు పెద్ద పీట వేసిన ఒకే ఒక్క నేత జగన్ మోహన్ రెడ్డి . ►జగన్ మోహన్ రెడ్డి బీసీ,ఎస్సీ, ఎస్టీ,మైనార్టీ వర్గాలకు ఆర్ధికంగా, రాజకీయంగా సాధికారత కల్పించారు. మంత్రిమేరుగ నాగార్జున ►సామాజిక సాధికార యాత్ర ఎందుకు అవసరమో మనం తెలుసుకోవాలి. ►అనేక మంది ఉద్ధండులు సామాజిక రుగ్మతలు పోవాలని ఉద్యమాలు చేశారు. ►ఏపీ చరిత్రలో సామాజిక విప్లవానికి తెరతీసిన వైఎస్ జగన్. ►చంద్రబాబు ఎస్సీలను ఘోరంగా అవమానించాడు. ►మాకు జరిగిన అవమానాన్ని మేం ఎన్నటికీ మర్చిపోం. ►పేదలకు ఇళ్లు ఇస్తుంటే సామాజిక అసమానతలు వస్తాయన్న మాట మర్చిపోం. ►దళితుల వెలివేతలు మర్చిపోం. ►పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్న వ్యక్తి సీఎం జగన్. ►చంద్రబాబు 14 ఏళ్లలో ఏనాడైనా వైఎస్ జగన్ సంక్షేమం చేశాడా? ►చంద్రబాబు ఎందుకు వద్దో.. జగన్ఎందుకు కావాలో చెప్పేందుకే ఈ సాధికార యాత్ర ►చంద్రబాబు రాష్ట్ర రాజకీయాలను కలుషితం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ►జగన్ మోహన్ రెడ్డిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ►బీసీ, ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ వర్గాలు ఐక్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. ►మనమంతా కలిసి చంద్రబాబు రధ చక్రాలు ఊడగొడదాం. ►చంద్రబాబు ఆరోగ్యం బాలేదని...బయటికి వచ్చి రాజకీయ వ్యాపారం చేస్తున్నాడు. ►రాజకీయ వ్యాపారం చేస్తున్న చంద్రబాబు అంతు చూడాల్సిన బాధ్యత మనపై ఉంది. ►జగన్ మోహన్ రెడ్డికి మనమంతా అండగా నిలవాలి. ►అవననిగడ్డలో సింహాద్రి రమేష్ బాబును.. రాష్ట్రంలో జగన్‌ను గెలిపించుకోవాల్సిన అవసరం మనపై ఉంది. చిత్తూరులో సామాజిక సాధికార బస్సు యాత్ర చిత్తూరులో ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు ఆధ్వర్యంలో బస్సు యాత్ర సాగింది. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, అంజాద్ భాషా తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్నం 2:45 గంటలకు విలేకర్ల సమావేశంలో నేతలు పాల్గొన్నారు. సూర్య ప్రతాప కళ్యాణమండపం నుంచి బైక్, ఆటో ర్యాలీ చేశారు. అనంతరం 4 గంటలకు నాగయ్య కళాక్షేత్రం వద్ద బహిరంగ సభలో నేతలు ప్రసంగించారు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ►సీఎం జగన్ పాలన సంక్షేమానికి చిరునామా. ► అన్ని వర్గాలకూ న్యాయం చేసిన నాయకుడు సీఎం జగన్ ► బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అండగా నిలిచిన నాయకుడు వైఎస్ జగన్ ►పేదల తలరాత మార్చాలంటే సామాజిక న్యాయంతోనే సాధ్యం ►చంద్రబాబు ఏ రోజూ వెనుకబడిన వర్గాలను పట్టించుకోలేదు ►దళితులను అవమానించిన నీచుడు చంద్రబాబు ►ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్నది ఎవరు? ►దళితులను అవమానించిన నీచుడు చంద్రబాబు ►ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని అన్నది ఎవరు? ►బీసీలను చంద్రబాబు ఎప్పుడైనా పట్టించుకున్నారా ►సామాజిక న్యాయం నినాదాన్ని గత ప్రభుత్వం ఓటు బ్యాంకుగానే వాడుకుంది. ►ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన నాయకుడు సీఎం జగన్. -
నువ్వు రాజకీయాల్లోకి రావడమే దరిద్రం
-
అభివృద్ధి పథంలో అన్ని రంగాలు
సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాలను ఆత్మబంధువులా అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని రాష్ట్ర మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఆత్మగౌరవంతో తలెత్తుకొని బతకగలుగుతున్నారని తెలిపారు. వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్రలో భాగంగా శనివారం భీమిలి నియోజకవర్గం తగరపువలసలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు దళితులకు ఏ మేలూ చేయలేదని చెప్పారు. పైగా, అన్ని వర్గాలను మోసం చేశారని, మహిళలపై దాడులు చేయించారని, అవమానకరంగా మాట్లాడారని చెప్పారు. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల బతుకులు బాగు చేశారని తెలిపారు. బడుగులకు రాజ్యాధికారం రావాలన్న అంబేడ్కర్ కలలను సీఎం వైఎస్ జగన్ సాకారం చేస్తున్నారని చెప్పారు. మనసు, మానవత్వంతో ఆలోచించి గిరిజనుడికి, దళితుడికి, బీసీలకు రాజ్యాధికారం ఇచ్చారన్నారు. పేదవాడికి మంచి వైద్యాన్ని, మంచి విద్యను అందిస్తున్నారని, మంచి గూడు ఉండాలన్న ఆలోచనతో ఒక్కో కుటుంబానికి దాదాపు రూ.10 లక్షలు విలువ చేసే ఇళ్ల స్థలాలు ఉచితంగా ఇచ్చి, ఇళ్లు కూడా నిర్మిస్తున్నారని గుర్తుచేశారు. 2014 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిపి 650కు పైగా వాగ్దానాలు ఇచ్చాయని, అధికారంలోకి వచ్చాక చంద్రబాబు వాటిని అమలు చేయకుండా మోసం చేశారని అన్నారు. వారంతా కలిసి మరోసారి మోసం చేయడానికి వస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. రాష్ట్రంలో అన్ని వర్గాల అభ్యున్నతికి మరోసారి వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పారు. ఇంత మంచి ఎప్పుడూ జరగలేదు: మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాష్ట్రంలో జరుగుతున్న మంచి గతంలో ఎప్పుడూ జరగలేదని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరావు అన్నారు. పేదింటి పిల్లలు పెద్ద చదువులు చదవాలని సీఎం వైఎస్ జగన్ ఎంతో ముందు చూపుతో ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం పెట్టారని, ఇది ఇష్టంలేని దత్త పుత్రుడు పవన్ వ్యతిరేకంగా మాట్లాడటం మన దౌర్భాగ్యమని చెప్పారు. ఇటీవల తాను యూఎస్‌లో ఒక సమావేశానికి వెళితే.. ఓ యువకుడు వచ్చి అతని తండ్రి రిక్షా తొక్కే వాడని, వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకంతో ఉన్నత చదువులు చదివానని, ఇప్పుడు సాప్‌్టవేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నానని ఆనందంతో చెప్పాడన్నారు. ప్రస్తుత సీఎం జగన్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని మరింత మందికి అందించడమే కాకుండా, విదేశీ విద్య పథకాన్ని ప్రవేశపెట్టడం చాలా సంతోషకరమని కొనియాడారని తెలిపారు. వైఎస్సార్సీపీకి ఓటు వేయనప్పటికీ, జగనన్న సంక్షేమ పథకాల రూపంలో రెండున్నర లక్షల రూపాయలు బ్యాంక్ ఖాతాలో వేశాడని ఓ మహిళ ఇటీవల తనతో చెప్పారన్నారు. ఇలా.. వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా కుల, మత, పార్టీ రహితంగా ఎంతో మంది పేదలు లబి్ధపొందారన్నారు. సీఎం జగన్ బీసీలకు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. విశాఖ పరిపాలన రాజధాని అయితే మొదటిగా అభివృద్ధి జరిగేది భీమిలి నియోజకవర్గమని, రానున్న ఎన్నికల్లో ఇక్కడ అత్యధిక మెజారిటీ ఇచ్చి సీఎం వైఎస్ జగన్‌కు కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్సీలు వంశీకృష్ణ శ్రీనివాస్, వరుదు కల్యాణి, మాజీ మంత్రి బాలరాజు, మేయర్ గొలగాని హరివెంకట కుమారి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె.సుభద్ర తదితరులు పాల్గొన్నారు. ‘దొరికిన దొంగ’ చంద్రబాబు: మంత్రి సీదిరి అప్పలరాజు పేదలకు మేలు జరగడం ఇష్టం లేని ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పచ్చ పత్రికల్లో తప్పుడు కథనాలు అచ్చేయడం కాదని, ఈరోజు భీమిలిలో జరిగిన సామాజిక న్యాయాన్ని చూడాలని మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పారు. వారు రాస్తున్నట్లు తుస్సుమనే యాత్ర కావాలంటే నారా భువనేశ్వరి యాత్ర చూడాలన్నారు. చంద్రబాబు సీఎంగా ఉండగా మత్స్యకారులమంతా వెళితే.. తాట తీస్తా.. తోలు తీస్తా అంటూ అవమానించారన్నారు. బీసీలు జడ్జీలుగా పనికిరారని అవమానించారు. ఇలా అన్ని వర్గాలను అవమానించిన చంద్రబాబు ఇప్పుడు జైల్లో ఉన్నాడని, ఆయనో ‘దొరికిన దొంగ‘ అని అన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి బీసీ సోదరుడు చంద్రబాబు చేసిన అవమానాలను గుర్తుంచుకుని వచ్చే ఎన్నికల్లో సీఎంగా మరోసారి జగనన్నను ఆశీర్వదించాలన్నారు. -
దొరికిన దొంగ రా మీ నాన్న అంటూ మేరుగు నాగార్జున కౌంటర్
-
సీఎం జగన్ లా సామాజిక ధర్మాన్ని పాటించాలి: జోగి రమేష్
-
చంద్రబాబుపై నిప్పులు చెరిగిన మంత్రి మెరుగ
-
చంద్రబాబు హయాంలో దళితులకు అన్యాయం జరిగింది
-
చర్చకు వచ్చే దమ్ముందా?.. టీడీపీ నేతలకు మంత్రి మేరుగ సవాల్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు హయాంలో దళితులకు అన్యాయం జరిగిందని, సీఎం జగన్ పాలనలో ఎంతో మేలు జరుగుతోందని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ, పేదవాడు పేదవాడుగానే ఉండాలనేది టీడీపీ విధానం అంటూ దుయ్యబట్టారు. కాకినాడలో చనిపోయిన దళితుని విషయంలో చట్టం ఏం చెబితే అదే చేస్తాం. కానీ చంద్రబాబు పార్టీ ఆ విషయాన్ని రాజకీయం చేస్తోంది. నాలుగున్నరేళ్లుగా దళితులకు చేసిన న్యాయంపై చర్చకు మేము సిద్దం. చర్చకు వచ్చే దమ్ము టీడీపీ నేతలకు ఉందా?’’ అంటూ మంత్రి సవాల్ విసిరారు. టీడీపీ హయాంలో దళితులపై దాడులు, మహిళలపై అఘాయిత్యాలు, వెలివేతలు ఎన్నో జరిగాయి. వీటిపై టీడీపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదు?. నిన్న మీటింగ్ పెట్టిన టీడీపి నేతలు నా సవాల్‌ని స్వీకరించగలరా?. పేదలకు ఇళ్లు, స్థలాలు ఇస్తుంటే కోర్టులకు వెళ్లి ఆపిన నీచ చరిత్ర టీడీపీ నేతలది. ఇంగ్లీషు మీడియం చదవాలనుకున్న పిల్లలకు ఆ అవకాశం రాకూడదని కోర్టులకు వెళ్లిన నీచ చరిత్ర వారిది. దళితులకు అసైన్డ్ భూములను అప్పగించిన సీఎం జగన్‌ని చూసి మిగతా రాష్ట్రాలు వారి మ్యానిఫెస్టోలో పెట్టుకుంటున్నారు. మా ఆత్మగౌరవమైన అంబేద్కర్ విగ్రహం విజయవాడ నడిబొడ్డున పెడుతున్నాం. 14 ఏళ్లు సీఎంగా ఉండి మా దళితులకు చంద్రబాబు ఏం చేశారు. దీనిపై చర్చిద్దామా?’’ అంటూ మంత్రి మేరుగ నిలదీశారు. ‘‘కుటిల కులతత్వం చంద్రబాబుది. దళితులకు మేలు జరగాలని చూసే వ్యక్తి జగన్. ఏపీలో పేదరికం తగ్గింది. జగన్ చేసిన సంక్షేమం వలనే ఇది సాధ్యమయ్యింది. చంద్రబాబులాగ మేము రాజకీయాలను కలుషితం చేయం. దళిత సంక్షేమాన్ని భుజాన వేసుకొని పనిచేస్తాం. జగన్ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. పేద విద్యార్థులు ఐక్య రాజ్యసమితిలో మాట్లాడగలిగారు’’ అని మంత్రి పేర్కొన్నారు. ‘‘కోర్టు రిమాండ్‌కి పంపితే చంద్రబాబు జైలుకు వెళ్లారు. దీనిపై రాజకీయాలు చేయటం అనవసరం. చంద్రబాబు ఆరోగ్యం గురించి ఏదేదో మాట్లాడటం సిగ్గుచేటు. ఆయన కోసం ప్రత్యేకంగా వైద్య బృందాలు ఉన్నాయని మంత్రి మేరుగ అన్నారు. చదవండి: అన్ని సీట్లలో పోటీ చేయదట.. టీడీపీపై విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు -
చంద్రబాబు చెంప చెళ్ళు..
-
అత్యంత ప్రతిష్టాత్మకంగా అంబేడ్కర్ విగ్రహాన్ని నిర్మిస్తున్నాం
-
ఏ స్కీముకు ఎంత ఖర్చు చేశారో వివరించిన మంత్రి మేరుగు
-
చంద్రబాబు దొరికిపోయిన దొంగ: మంత్రి మెరుగు నాగార్జున
-
కళ్యాణమస్తు, షాదీతోఫా ఆపే ప్రసక్తే లేదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, భవన నిర్మాణ కార్మికుల పిల్లలు వివాహాలను గౌరవప్రదంగా నిర్వహించుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కళ్యాణమస్తు, షాదీతోఫా పథకాలను ఆపే ప్రసక్తే లేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున స్పష్టంచేశారు. ఈ పథకాలను ఆపేస్తోందంటూ చేస్తున్న అసత్య ప్రచారాన్ని, ప్రభుత్వంపై బురదజల్లడాన్ని టీడీపీ మానుకోవాలని అన్నారు. మంత్రి అసెంబ్లీలో గురువారం ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల ప్రశ్నలకు సమాధానమిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాల ద్వారా నిరుపేదలకు మరింత ఆర్ధిక చేయూత ఇచ్చే సంకల్పంతో అనేక మార్పులు తీసుకొచ్చారని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం 17,709 మంది లబ్ధిదారులకు రూ.68.68 కోట్లు ఎగ్గొట్టిందని చెప్పారు. ఆ డబ్బు కూడా తమ ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వంలో కళ్యాణమస్తు పథకం కింద ఎస్సీలకు రూ.40 వేలు ఇవ్వగా, ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.లక్ష ఇస్తోందని తెలిపారు. వీరు కులాంతర వివాహాలు చేసుకుంటే ఇచ్చే మొత్తాన్ని రూ.75 వేల నుంచి రూ.లక్షకు పెంచామన్నారు. గిరిజనులకు గతంలో రూ.50 వేలు ఇవ్వగా, ఈ రోజు రూ. లక్ష ఇస్తున్నామని, కులాంతర వివాహాలు చేసుకుంటే ఇచ్చే మొత్తాన్ని రూ.75 వేల నుంచి రూ.1.20 లక్షలకు పెంచామని తెలిపారు. బీసీ వర్గాలకు ఇచ్చే మొత్తాన్ని రూ.35 వేల నుంచి రూ.50 వేలకు, వీరు కులాంతర వివాహం చేసుకుంటే ఇచ్చే మొత్తాన్ని రూ.50 వేల నుంచి రూ.75 వేలకు పెంచామని వివరించారు. మైనార్టీలకు గతంలో రూ.50 వేలే ఇస్తే, ప్రస్తుతం రూ.లక్ష ఇస్తున్నామని చెప్పారు. వికలాంగులకు గతంలో రూ.లక్ష ఇవ్వగా, ఈరోజు రూ.1.50 లక్షలు ఇస్తున్నామన్నారు. భవన నిర్మాణ కార్మికులకు గతంలో రూ.20 వేలు ఇస్తే, ప్రస్తుతం రూ.40 వేలు ఇస్తున్నట్లు చెప్పారు. కొత్తగా దూదేకుల, నూర్‌బాషా సామాజికవర్గాల వారిని మైనార్టీలుగా పరిగణించి, వారికి కూడా రూ.లక్ష చొప్పున ఇస్తున్నామని చెప్పారు. ఈ విధంగా ఈ 4 ఏళ్లలో 35 వేల దంపతులకు రూ.267 కోట్ల లబ్ధి చేకూర్చామన్నారు. ఈ పథకాల ద్వారా ఆర్ధిక సాయం ఒక్కటే కాదు.. బాల్య వివాహాలను అరికట్టడంతో పాటు వారి అక్షరాస్యతను పెంపొందించేలా నిబంధనలు పెట్టామన్నారు. మొదటి వివాహం చేసుకున్న వారికి మాత్రమే ఈ ఆర్ధిక సాయం అందిస్తున్నామని చెప్పారు. అత్యంత సమర్ధవంతంగా పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే విశ్వసరాయ కళావతి మాట్లాడుతూ నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగులకు కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాలు వరమేనని చెప్పారు. గొప్ప ఆశయంతో ఈ పథకాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆయా వర్గాలు జీవితాంతం రుణపడి ఉంటాయని అన్నారు. -
టీడీపీ నేతల తీరుపై మంత్రి మేరుగు నాగార్జున ఫైర్
-
చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ నాయకుల కామెంట్స్
-
చంద్రబాబు జీవితమంతా అవినీతిమయం
-
‘చట్టాలు చంద్రబాబుకు చుట్టాలు కావు’
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి మేరుగు నాగార్జున సీరియస్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు.. ప్రజల సొమ్ము దోచుకుని చివరికి జైలు పాలయ్యాడు. ఎప్పుడో ఒకప్పుడు చేసిన పాపం పండకపోదు. చట్టానికి దొరికిన దొంగ చంద్రబాబు అంటూ వ్యాఖ్యలు చేశారు. కాగా, మంత్రి మేరుగు నాగార్జున మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు జీవితమంతా అవినీతిమయం. చట్టాలు చంద్రబాబుకు చుట్టాలు కావు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. చంద్రబాబు ఇంకా అనేక కేసుల్లో ఇరుక్కుంటారు. ప్రజల్లో చంద్రబాబుకు సానుభూతి లేదు. త్వరలో నారా లోకేశ్ కూడా ముద్దాయి కాబోతున్నాడు. ఇకనైనా చంద్రబాబు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి. లోకేశ్ బూతులు మాట్లాడటం మానుకో.. ఇంతకాలం వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ చంద్రబాబు బతికారు. ఎన్నో అక్రమాలు చేసిన చంద్రబాబు చివరికి దొరికిపోయారు. నారా లోకేశ్.. ముందు బూతులు మాట్లాడటం మానుకో. మేము కూడా మీలాగ మాట్లాడితే తట్టుకోలేరు. పేదలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పారదర్శకంగా సంక్షేమం అందిస్తుంటే చంద్రబాబు తట్టుకోలేక పోయారు. అనేక కుట్రలు చేసి అడ్డుకోవాలని చూశారు. దత్తపుత్రుడిని వెంటేసుకుని సీఎం జగన్ మీద ఎన్నెన్ని ఆరోపణలు చేశారో జనం చూస్తూనే ఉన్నారు. అన్నీ కేసులో చంద్రబాబే ముద్దాయి.. సమర్ధవంతమైన సీఎం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలో ఉన్నారు. చంద్రబాబు మీద మాకు కక్షలేదు. అదే ఉంటే అధికారంలోకి వచ్చాకే ఆయన్ను అరెస్టు చేసేవాళ్లం. ఇప్పుడు అన్ని కేసుల్లోనూ ఆయనే ముద్దాయి. కచ్చితంగా కోర్టులో అన్ని కేసుల్లోనూ ముద్దాయిగా నిలబడక తప్పదు. పవన్ కళ్యాణ్ మొన్న చంద్రబాబును అరెస్టు చేయగానే హడావుడిగా వచ్చారు. అంతే హడావుడిగా వెళ్లిపోయారు. ఎందుకు వచ్చాడో, రోడ్డుమీద ఎందుకు పడుకున్నాడో ఆయనకే తెలియదు. రాష్ట్రంలో టీడీపీ బంద్‌కు ఎలాంటి స్పందన లేదు. జనం ఎవరూ బంద్‌ను పట్టించుకోలేదు అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: రామోజీ, శైలజాలకు బిగ్ షాక్.. -
ప్రజల సొమ్ము పందికొక్కుల తిన్నాడు అందుకే జైలుకు పోయాడు..
-
ప్రజా సంపదను దోచుకున్న బాబును అరెస్ట్ చేయాల్సిందే..!
సాక్షి, తాడేపల్లి: ప్రజా సంపదను దోచుకున్న చంద్రబాబును అరెస్ట్ చేయాల్సిందేనని మంత్రి మేరుగ నాగార్జున డిమాండ్ చేశారు. విదేశీ ప్రయాణాలకు రూ. 100 కోట్లు, నవ నిర్మాణ దీక్షలకు రూ. 80 కోట్లు ఖర్చు చేశాడన్నారు. ప్రజల సొమ్మును మంచి నీళ్లలా ఖర్చు చేసి బాబు నీతులు చెబుతుండటంపై మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ముడుపులో కేసులో ఐటీకి బాబు అడ్డంగా దొరికిపోయాడని స్పష్టం చేశారు. మంత్రి మేరుగు నాగార్జున ఇంకా ఏమన్నారంటే.. ప్రజల సొమ్మును మంచినీళ్లలా ఖర్చుచేసి నీతులా..? గౌరవ ముఖ్యమంత్రి గన్మోహన్రెడ్డి లండన్ పర్యటన గురించి చంద్రబాబు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. నీ మాదిరిగా వందల కోట్ల ప్రజల సొమ్ముతో సోకులు పోయి, విలాసాలు, దుబారా చేయలేదని తెలుసుకో చంద్రబాబు. నీకు ప్రజాధనమంటే పరమాన్నం లెక్క. అధికారంలో ఉన్నప్పుడు, నీ విదేశీ ప్రయాణాలకు, రాష్ట్రంలో తిరగడానికి బుల్లెట్‌ప్రూఫ్ బస్సు పెట్టుకుని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేశావు. ఓటుకు కోట్లు కేసులో పారిపోయి వచ్చేముందు సీఎం కార్యాలయం పేరుతో.. లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్ మరమ్మత్తులకు రూ.10 కోట్లు.. సీఎం కార్యాలయానికి మరో రూ.10 కోట్లు ఖర్చుచేశావు. నీ విదేశీ ప్రయాణాలకు స్పెషల్ ఫ్లైట్లు వాడి, మొత్తంగా రూ.100 కోట్లు ఖర్చు చేశావు. అలాగే ఆనాడు బీజేపీకి వ్యతిరేకంగా నువ్వు చేసిన ధర్మపోరాట దీక్షకు, నవనిర్మాణ దీక్షలకు.. రూ.80 కోట్లు రాష్ట్ర ప్రజల సొమ్మును వెచ్చించావు. ఇవన్నీ ప్రజాధనం కాదా చంద్రబాబు..? అని అడుగుతున్నాను. ప్రజల డబ్బును నీ స్వార్థ రాజకీయాల కోసం, నీ శ్రేయస్సు కోసం, నీ ఆరోగ్యం కోసం ఖర్చుపెట్టిన నీచుడివి నువ్వు. అలాంటి నువ్వా మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడేది..? అని చంద్రబాబును ప్రశ్నిస్తున్నాను. బాబు దోచుకుంటే.. జగన్ పంచారు ప్రజల సొమ్ముతో చంద్రబాబు కులికితే... జగన్ ప్రజలకు డీబీటీ ద్వారా నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేసి, పేదలకు పంచారు. నీకులా మా జగన్ ఈ నాలుగున్నరేళ్ల కాలంలో ఒక్క పైసా ప్రజాధనం వృథా చేయలేదు. ప్రభుత్వ సంక్షేమం పేరిట రూ.2.31 లక్షల కోట్లు డీబీటీ ద్వారా బటన్ నొక్కి ప్రజల ఖాతాల్లో నేరుగా లబ్ధిని చేకూర్చిన మహోన్నత ముఖ్యమంత్రి మా జగన్‌గారు. మరి, నువ్వెందుకు ప్రజలకు మేలు చేసే అలాంటి బటన్ నొక్కలేకపోయావని అడుగుతున్నాను. నువ్వెప్పటికీ, అలాంటి బటన్ నొక్కలేవు. ఎందుకంటే, ప్రజల సంపదను దోచుకునే నువ్వొక పందికొక్కువు. "మంచి అన్నది మాల అయితే మాల నేనగుదున్" అని గురజాడ గారు చెప్పినట్టు.. మాల మంచైతే, నేను పెద్దమాలను అన్న నాయకుడు మా జగన్ గారైతే.. దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా..? అని ఎస్సీ, ఎస్టీలను అవమానించిన వ్యక్తి చంద్రబాబు అని గుర్తుచేస్తున్నాను. బాబును ఖచ్చితంగా అరెస్టు చేయాల్సిందే.. ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలకు నేను రెండు చేతులు జోడించి ఒక విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నాను. చంద్రబాబు పెద్ద అవినీతిపరుడని తేలిపోయింది. ఇప్పటికైనా మీరంతా ఆయన నిజస్వరూపాన్ని, కుయుక్తులను తెలుసుకోవాలని మనవి చేస్తున్నాను. అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి షాపూర్జీ పల్లంజీ, ఎల్అండ్టీ కంపెనీల నుంచి రూ.118 కోట్లు ముడుపులు కొట్టేసింది చంద్రబాబు కాదా..? అని అడుగుతున్నాను. ఆ సొమ్ముకు సంబంధించిన లెక్కలు చెప్పాలని ఐటీశాఖ నోటీసులు జారీచేస్తే.. మేము వాటిపై నిలదీస్తుంటే.. నన్ను అరెస్టు చేయడానికి చూస్తున్నారంటూ చంద్రబాబు మాట్లాడుతున్నాడు. అరెస్టంటే చంద్రబాబులో అంత భయం ఎందుకు..? తప్పేమీ లేనప్పుడు దమ్మూ,ధైర్యంగా ఐటీశాఖ నోటీసులుకు సమాధానం చెప్పొచ్చుకదా..? అలా చెప్పలేడు. ఎందుకంటే, తన దొంగతనం బట్టబయలైంది కనుక. మరి, ఈ సందర్భంగా చంద్రబాబును ఒక ప్రశ్న అడుగుతున్నాను. నిన్నెందుకు అరెస్టు చేయకూడదని.. నువ్వైమైనా చట్టానికి అతీతుడివా..? అడుగుతున్నాను. ప్రజల సొమ్మును దోచుకున్న చంద్రబాబును ఖచ్చితంగా అరెస్టు చేయాల్సిందే. జైల్లో పెట్టాల్సిందే. చట్టబద్ధమైన విచారణ చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాను. పవన్ ఎక్కడ నిద్రపోతున్నావ్.? అమరావతి రాజధాని పేరుతో, రెండు చిన్న కాంట్రాక్టుల్లోనే చంద్రబాబు అప్పనంగా రూ.118 కోట్లు దోచేశాడు. లేనిపోని సొల్లుకబుర్లతో ఛాలెంజ్‌లు విసిరే చంద్రబాబు- ఈరోజు ఐటీశాఖ నోటీసులపై ఉలుకూపలుకు లేకుండా ఉన్నాడు. స్పందించే అవసరమే లేనట్లు ప్రజలకు బిల్డప్ లు ఇస్తున్నాడు. చంద్రబాబు, లోకేశ్ మీద ఈగ వాలనీయకుండా, చీమ చిటుక్కుమంటే గంగవెర్రులెత్తి మాట్లాడే దత్తపుత్రుడు ఏమయ్యాడు..? ఐటీశాఖ నోటీసులపై జాతీయ మీడియా సైతం పెద్ద ఎత్తున కథనాలు రాస్తుంటే, ప్రశ్నిస్తానన్న పెద్దమనిషి పవన్‌కళ్యాణ్ ఎక్కడ నిద్రపోతున్నాడు..? సీపీఐ నారాయణ, రామకృష్ణ నోరుమెదపకుండా ఏం చేస్తున్నట్లు..? ఈనాడు రామోజీరావు, ఏబీఎన్, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఉలుకుపలుకూ లేకుండా ఉండటానికి కారణమేంటి..? అని అడుగుతున్నాను. ఆయన దోచుకున్న ముడుపుల్లో మీకూ వాటాలందాయా..? అని ప్రశ్నిస్తున్నాను. పిరికిపందలా వణుకిపోతున్న బాబు చంద్రబాబు ఒక మోసకారి. అవినీతిపరుడు. ప్రజల సొమ్మును, పేదల సొమ్మును దోచుకున్న వ్యక్తి. బాబు స్కాములు చాలా ఉన్నాయి. ఫైబర్‌గ్రిడ్, స్కిల్‌డెవలప్‌మెంట్, అసైన్డ్‌భూముల విషయంలో, రింగురోడ్డు పనుల్లో, రాజధాని నిర్మాణాలు, ఈఎస్ఐ కుంభకోణాల్లో చంద్రబాబు వందల, వేల కోట్లను దోచుకున్నాడు. వీటిపై కూడా సత్వరమే విచారణ చేసి చంద్రబాబును అరెస్టు చేయించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి అవినీతిపరుడు తప్పించుకుంటే.. రాష్ట్రానికి తీరని నష్టం. నిన్నటిదాకా చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్ కలిసి మమ్మల్ని ఏం పీక్కుంటారో పీక్కోండి అన్నారుగా.. మరి, ఇప్పుడెం దుకు నన్ను అరెస్టు చేస్తారని పిరికిపందల్లా భయపడుతున్నారు..? నువ్వు దొంగలా దొరికావు కాబట్టే.. అప్పన్నంగా ప్రజల సొమ్మును ముడుపుల రూపంలో కాజేశావు కనుకే ఈరోజు నువ్వు వణికిపోతున్నావని చంద్రబాబును ప్రశ్నిస్తున్నాను. మీ అబ్బాకొడుకులు రాజధాని ప్రాంతం పేరుతో ప్రజాధనాన్ని దోచుకుంటుంటే మేం చూస్తూ ఉండాలా..? ఈ ప్రభుత్వంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మీ మాదిరిగా, వ్యవస్థల్ని మేనేజ్ చేస్తామంటే కుదరదు. ప్రజల సొమ్మును పందికొక్కుల్లా తిన్న మీ తండ్రీ-కొడుకులు చట్టం ముందు దోషులుగా నిలబడాల్సిందేనని గుర్తుచేస్తున్నాను. చదవండి: ఐటీ నోటీసులపై నీ మౌనం అర్ధాంగీకారం కాదా బాబు? -
తనను అరెస్టు చేస్తారని చంద్రబాబు భయపడుతున్నాడు: మంత్రి మేరుగు నాగార్జున
-
బాబు గుండెల్లో ఐటీ భయం
ఒంగోలు: ప్రజాబాహుళ్యంలో దొరికిన దొంగ చంద్రబాబు అని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి, ప్రకాశం జిల్లా ఇన్చార్జి మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. ఆయన ఆదివారం ఒంగోలులో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసంలో మీడియాతో మాట్లాడారు.నోటీసులు చంద్రబాబుకు కొత్తేమీ కాదన్నారు. ఎటువంటి నోటీసులు ఇచ్చినా కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకోవడం పరిపాటేనన్నారు. తాజాగా ఐటీశాఖ నోటీసులు జారీచేయడంతో బాబు గుండెల్లో భయం పట్టుకుందని చెప్పారు. దీంతో బీజేపీ పంచన చేరి ఏదో ఒక విధంగా గట్టెక్కాలనే ఉద్దేశంతోనే ఢిల్లీ వెళ్లి చేతులు కట్టుకుని మరీ వినయాన్ని నటిస్తున్నారని విమర్శించారు. చివరికి పురందేశ్వరి ద్వారా ఢిల్లీ పెద్దల ప్రాపకం కోరుతున్నారన్నారు. -
ఆ మాటలు ప్రజలు ఇంకా మర్చిపోలేదు చంద్రబాబూ: మంత్రి మేరుగు
సాక్షి, తాడేపల్లి: ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు ఎన్ని రకాలుగానైనా మాట్లాడతారని, అప్పట్లో ప్రత్యేక హోదా సంజీవినా అన్న మాటలు ప్రజలు మర్చిపోలేదని మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘ప్యాకేజీ ఇస్తున్నారంటూ కేంద్ర పెద్దలను సన్మానించిన సంగతి కూడా అందరికీ గుర్తుంది. ఇప్పుడు ఏ మొఖం పెట్టుకుని మళ్లీ మాటలు మార్చుతారు?’’ అంటూ దుయ్యబట్టారు. ‘‘టీడీపీ ఎప్పుడో ఖాళీ అయ్యింది. ఇక ఆ పార్టీలోకి ఎవరు వెళ్తారు. టీడీపీ మునిగిపోయే పడవ. ఒంటరిగా పోటీ చేసే దమ్ము చంద్రబాబుకు లేదు. అందుకే పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారు. చంద్రబాబు భవిష్యత్తుకే గ్యారెంటీ లేదు.. ప్రజలకు ఆయనేం షూరిటీ ఉంటారు?’’ అంటూ మంత్రి ఎద్దేవా చేశారు. చదవండి: అయ్యో లక్ష్మీపార్వతి.. ‘రాబంధు’వుల రాజకీయం ఇది! -
చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది: మంత్రి మేరుగు
సాక్షి, తిరుపతి: చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని మంత్రి మేరుగు నాగార్జున మండిపడ్డారు. మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని మంత్రి దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు ఏపీకి చేసిందేమీ లేదన్నారు. రాష్ట్రంలో 60 లక్షల దొంగ ఓట్లు చంద్రబాబు సృష్టించారు. అర్హత ఉన్న ఓట్లు ఉండాల్సిందే. కుప్పంలో చంద్రబాబు దొంగ ఓట్లతో గెలిచారని ధ్వజమెత్తారు. సీఎం జగన్ బాధ్యతల స్వీకరించిన తర్వాత సామాజిక విప్లవానికి తెర తీశారని, రాష్ట్రంలో ఎక్కడా కూడా అసమానతలు లేకుండా చేశారని కొనియాడారు. పేద ప్రజల గుండెచప్పుడుగా పరిపాలన జరుగుతోందన్నారు. గతంలో లేనివిధంగా ఒక లక్ష 50 వేల కోట్ల రూపాయలు డిబిటి రూపేనా సీఎం జగన్ అందించారన్నారు. చదవండి: AP: వచ్చే నెల వర్షాలే వర్షాలు! 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ప్రజలకు ఒక మంచి పని కూడా చేయలేదన్నారు.. ప్రజలను మోసం చేసేందుకు, ఏమార్చేందుకు చంద్రబాబు తిరుగుతున్నారని మండిపడ్డారు. కరోనా సమయంలో రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయిన చంద్రబాబు.. మళ్లీ రాష్ట్రంలో రాజకీయాలు చేసేందుకు వస్తున్నారని మంత్రి దుయ్యబట్టారు. -
దొంగ ఓట్లతోనే కుప్పంలో బాబు గెలుపు
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): రాష్ట్రంలో ఒక్క దొంగ ఓటు కూడా ఉండకూడదని, రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరగాలని.. తమ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిజాయితీగా కోరుకుంటున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మేరుగు నాగార్జున స్పష్టం చేశారు. ఈ విషయమై తాము ఇవాళ (28వ తేదీన) కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను కలవనున్నామని చెప్పారు. బృందావన్ గార్డెన్స్‌లోని ఎమ్మెల్సీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత టీడీపీ పథకం ప్రకారం రాష్ట్రంలో 60 లక్షల దొంగ ఓట్లు చేర్పిచిందని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా అధికారంలోకి రాలేమన్న బలమైన అభిప్రాయంతో చంద్రబాబు ఇలా చేశారని విమర్శించారు. దీనికి పూర్తి భిన్నంగా రాష్ట్రంలో అసలు దొంగ ఓట్లే ఉండకూడదనే సదుద్దేశంతో సీఎం జగన్ ముందుకు సాగుతున్నారన్నారు. దీంతో ప్రతిపక్ష నేతల కూసాలు కదలిపోతున్నాయని, అందుకే చంద్రబాబు సహా టీడీపీ నేతలంతా మతి భ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాజాగా మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ప్రేలాపనలే ఇందుకు నిదర్శనమని అన్నారు. దొంగ ఓట్లతోనే కుప్పంలో బాబు గెలుపు చంద్రబాబు ఇప్పటి వరకు దొంగ ఓట్లతోనే కుప్పంలో గెలుపొందుతూ వచ్చారని మంత్రి స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిష్పక్షపాతంగా జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాభవం ఎదురైన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. రానున్న ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు పునరావృతం కాబోతున్నాయని చెప్పారు. ఈసారి కుప్పంలో చంద్రబాబుకు కూడా ఓటమి తప్పదన్నారు. నాలుగేళ్లలో సంక్షేమాభివృద్ధి నేరుగా దళితుల ఇంటి తలుపులు తడుతోందని స్పష్టం చేశారు. దళిత సంక్షేమంపై తాము చర్చకు సిద్ధం అని చెప్పారు. ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం కుప్పంలోనే కుప్పకూలిపోయిన వాస్తవాన్ని గుర్తించాలని కోరారు. 2024 ఎన్నికల్లో సైతం 2019 ఫలితాలే పునరావృతం అవుతాయని, టీడీపీకి మరోసారి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. -
తెలుగు రాష్ట్రలో ఘనంగా 77వ స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలు
-
గురుకుల పాఠశాల, కళాశాల భవనాలు ప్రారంభం
తాడేపల్లిగూడెం రూరల్: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలనులో రూ.22.17 కోట్లతో నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల భవనాలను రాష్ట్ర సాంఘిక, సంక్షేమ శాఖమంత్రి మేరుగు నాగార్జున, ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆదివారం ప్రారంభించారు. మేరుగు నాగార్జున మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను వాడుకుని వదిలేసిన ఏకైక వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం వైఎస్ జగన్ చొరవతో విజయవాడ నడిబొడ్డున 19 ఎకరాల్లో రూ.400 కోట్ల వ్యయంతో బీఆర్ అంబేడ్కర్ భారీ విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. డిసెంబర్ నాటికి ఈ పనులు పూర్తి చేయనున్నట్టు వెల్లడించారు. రాష్ట్రానికి దిక్సూచిగా అంబేడ్కర్ విగ్రహం నిలవనుందన్నారు. ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి పాల్గొన్నారు. -
దళిత ద్రోహి లోకేశ్‌ను అరెస్ట్ చేయాలి
తిరుపతి సిటీ: దళిత ద్రోహి నారా లోకేశ్‌ను వెంటనే అరెస్ట్ చేసి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున డిమాండ్ చేశారు. ‘సాక్షి’ విలేకరి కరుణాకర్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ శనివారం తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద అంబేడ్కర్ విగ్రహం ఎదుట దళిత సంఘాల నాయకులు నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నాగార్జున మాట్లాడుతూ వార్తల కవరేజ్ చేస్తున్న దళిత విలేకరిని అతి దారుణంగా లోకేశ్ గూండాలు తిట్టడం, కొట్టడం అమానుషమన్నారు. నాయకులు మల్లారపు మధు, నల్లారి బాబు, వెంకటస్వామి, యలమంచిలి ప్రవీణ్, తళారి రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
‘చంద్రబాబుకు దళితులంటే మొదటి నుంచి చిన్నచూపే’
సాక్షి, తిరుపతి: చంద్రబాబు నాయుడుకు దళితులంటే మొదటి నుంచి చిన్నచూపేనని మంత్రి మేరుగ నాగార్జున విమర్శించారు. సాక్షి పత్రిక రిపోర్టర్ కరుణాకర్ పై దాడి ను నిరసిస్తూ ఎస్వీ యూని వర్సిటీ మెయిన్ గేట్ ఎదురుగా అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాలు చేపట్టాయి. నల్ల రిబ్బన్లతో చేపట్టిన ఈ కార్యక్రమంలో మంత్రి మేరుగ పాల్గొన్నారు. దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ‘చంద్రబాబుకు దళితులు అంటే మొదటి నుంచి చిన్న చూపే. చంద్రబాబు దళితులకు డిప్యూటీ సీఎం ఏనాడు ఇవ్వలేదు. చంద్రబాబు పాలనలో ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు మళ్లించినా, దళిత సంక్షేమం గాలికి వదిలేసిన ఈనాడు పత్రిక ఏనాడూ రాయలేదు. ఈరోజు సీఎం జగన్ దళితులకు ఉప ముఖ్యమంత్రి పదవితోపాటు, ఐదుగురికి మంత్రి పదవులు ఇచ్చి గౌరవించారు. ఈనాడు రామోజీ రావు అవసాన దశలో నైనా వాస్తవాలు తన పత్రికలో రాయాలి. ఎస్సీ ఎస్టీ, బీసీలకు రాజధాని లో పేదలకు ఇళ్ళ స్థలాలు వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్ళిన చంద్రబాబు గురించి ఈనాడు వార్తలు రాయలేదు’ అని పేర్కొన్నారు. -
అంబేద్కర్ స్మృతివనం: ‘ఆ ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది’
సాక్షి, విజయవాడ: విజయవాడలో అంబేద్కర్ స్మృతివనం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక, విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్మృతివనం నిర్మాణ పనులను మంత్రి మేరుగు నాగార్జున, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పరిశీలించారు. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు పనులు, స్మృతివనం నిర్మాణ పనులను పర్యవేక్షించారు. ఈ సందర్బంగా మంత్రి నాగార్జునకు, సజ్జలకు పనుల వివరాలను అధికారులు వివరించారు. అనంతరం, మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. అంబేద్కర్ స్మృతివనం నిర్మాణం గొప్ప కార్యక్రమం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుంది. గత ప్రభుత్వం దళితులను ఎంతో మోసం చేసింది. అంబేద్కర్ విగ్రహం నిర్మించేందుకు సరైన స్థలం కూడా చంద్రబాబు ఇవ్వలేదు. ప్రస్తుతం పనులు వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే అంబేద్కర్ స్మృతివనం పనులు పూర్తి చేసి ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్బంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. విజయవాడ నగరం నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం నిర్మాణం జరుగుతోంది. భారతదేశం గర్వించదగ్గ అంబేద్కర్ స్మారకార్ధం స్మృతివనం పనులు 20 ఎకరాలలో శరవేగంగా జరుగుతున్నాయి. దేశంలోనే అతి పెద్ద 125 అడుగుల విగ్రహాన్ని నగరం నడిబొడ్డున ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు అంబేద్కర్ స్మృతివనం పనులు పరిశీలించాం. భారతదేశం గర్వించదగిన నేత అంబేద్కర్. ప్రపంచంలోనే భారత రాజ్యాంగం చాలా పటిష్టమైనది. అన్ని వర్గాలకి అంబేద్కర్ ఆదర్శం. అంబేద్కర్ పేరు చరిత్రలో నిలిచిపోయేలా ప్రతిపాదించడమే కాదు.. పనులు ప్రారంభించిన ఘనత సీఎం జగన్‌ది. అంబేద్కర్ జ్ఞాపకాలను ఎన్నేళ్లయినా గర్వంగా చెప్పుకుంటాం. రాజకీయపరంగా ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా గొప్ప రాజ్యాంగాన్ని అంబేద్కర్ రూపొందించారు. టీడీపీ హయాంలో అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి మూలపడిన ప్రాంతంలో స్థలం పేరుకే కేటాయించారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రకటించి ఎటువంటి పనులు చేయలేదని అన్నారు. ఇది కూడా చదవండి: మరోసారి వైఎస్సార్సీపీ ప్రభుత్వమే: నటుడు సుమన్ -
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే జగనన్న సురక్ష లక్ష్యం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అర్హత ఉన్న 99 శాతం మందికి సంక్షేమ పథకాలను సీఎం వైఎస్ జగన్ అందించారని.. సాంకేతిక కారణాలతో లబ్ధి పొందని ఒక శాతం లబ్ధిదారులకు కూడా ప్రయోజనం చేయాలన్న లక్ష్యంతోనే ‘జగనన్న సురక్ష’ కార్యక్రమాన్ని చేపట్టారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ చెప్పారు. శనివారం రాష్టవ్యాప్తంగా ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞ్ఞప్తి చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో మండలానికి రెండు చొప్పున 1,305 సచివాలయాల్లో క్యాంపులు నిర్వహించారని తెలిపారు. లబ్ధిదారులకు అవసరమైన ధ్రువపత్రాలను అక్కడికక్కడే అధికారులు జారీ చేశారని వెల్లడించారు. ఇంకా ఏమన్నారంటే... దేశ చరిత్రలో ఇదే ప్రథమం: మంత్రి మేరుగు కులం, మతం, పార్టీలు చూడకుండా అర్హతే ప్రామాణికంగా.. ఎలాంటి లంచాలకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో డీబీటీ రూపంలో రూ.2.23 లక్షల కోట్లను జమ చేశారు. దేశ చరిత్రలో ఈ స్థాయిలో డీబీటీ రూపంలో పేదల ఖాతాల్లో డబ్బులు జమ చేసిన దాఖలాలు లేవు. చిన్న చిన్న సాంకేతిక కారణాల వల్ల పథకాలు అందని వారు ఎవరైనా ఉంటే.. వారికి లబ్ది చేకూర్చడానికి అవసరమైన సర్టిఫికెట్లు ఉచితంగా జారీ చేయడం, వారి సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా జగనన్న సురక్ష పథకాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. వలంటీర్లు, సచివాలయాల సిబ్బంది, గృహసారథులు ప్రతి ఇంటి వద్దకు వెళ్లి.. వారి సమస్యలను తెలుసుకుని టోకెన్లు ఇస్తారు. శనివారం నుంచి ఈ నెల 30 వరకూ సచివాలయాల పరిధిలో క్యాంపులు నిర్వహించి.. ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్ల జారీ, పథకాల ద్వారా లబ్ధి చేకూర్చడం వంటి సమస్యలను మండల, సచివాలయ అధికారులు దగ్గరుండి పరిష్కరిస్తారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. అధికారులే ప్రజల వద్దకు వస్తున్నారు ఎక్కడైనా మాకు సమస్యలు ఉన్నాయని ప్రజలు అధికారుల వద్దకు వస్తారు. కానీ.. సీఎం వైఎస్ జగన్ మాత్రం అధికారులనే ప్రజల వద్దకు పంపి వారి సమస్యలు ఏమిటో తెలుసుకుని పరిష్కరించేలా క్యాంపులు ఏర్పాటు చేయడం సుపరిపాలనకు తార్కాణం. ఈ నెలలోనే విద్యార్థులు కళాశాలలకు వెళ్తారు కాబట్టి వారికి కావాల్సిన సర్టిఫికెట్లను ముందుగానే ఇవ్వడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీంతోపాటు ఆగస్టు నుంచే సంక్షేమ పథకాల క్యాలెండర్ కూడా అమలవుతుంది. -
దళిత ద్రోహి చంద్రబాబు: మంత్రి నాగార్జున
సాక్షి, తాడేపల్లి: సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు దళితులను ఏ రోజైనా పట్టించుకున్నారా అని మంత్రి మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు. చంద్రబాబుకి దళితులు ఇప్పుడు గుర్తొచ్చారా అని నిలదీశారు. బాబు దళిత ద్రోహి అని, ఆయన హయాంలో దళితులపై ఎన్నో దాడులు జరిగాయని విమర్శించారు. రాజధాని ప్రాంతంలో దళితులకు ఇళ్ల పట్టాలు ఇస్తామంటే బాబు అడ్డుకునే ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు. దళితులపై దాడులు చేసిన వారిపై తమ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ‘రామోజీ కళ్లు ఉన్న కబోది. నిజాలు రాయడం రామోజీకి చేతకాదు. పథకం ప్రకారం తప్పుడు రాతలు రాస్తున్నారు. ప్రభుత్వంపై రామోజీ విషం కక్కుతున్నారు. దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని చంద్రబాబు అన్నప్పుడు రామోజీ తన పత్రికలో ఎందుకు రాయలేదు.’ అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: ‘దళితులకు ఎక్కడ ఏ కష్టం వచ్చినా ఆదుకున్నది మా ప్రభుత్వమే’ -
దేశానికే ఆదర్శంగా రాష్ట్రంలో ఎస్సీల అభివృద్ధి
సాక్షి, అమరావతి: దేశంలో మరెక్కడా లేనివిధంగా ఏపీలో ఎస్సీల సంక్షేమం అద్భుతంగా జరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీలకు మేలు జరగడం లేదంటూ టీడీపీ నేతలు విమర్శించడం వారి అవివేకానికి నిదర్శనమని పేర్కొన్నారు. చంద్రబాబుకి దమ్ముంటే రాష్ట్రంలో ఎస్సీల అభివృద్ధిపై బహిరంగచర్చకు రావాలని సవాలు చేశారు. రాష్ట్రంలో మాదిగలకు అన్యాయం జరుగుతోందంటూ టీడీపీ నేతలు చేసిన విమర్శలను మంత్రి బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఖండించారు. దేశంలో గతంలో పరిపాలించిన ఎస్సీ, బీసీ ముఖ్యమంత్రులు ఎవరూ చేయని విధంగా సీఎం జగన్మోహన్రెడ్డి దళితుల అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్నారని తెలిపారు. ఎస్సీ సబ్‌ప్లాన్ ద్వారా అన్ని రాష్ట్రాలు కలిపి ఎస్సీలకు చేస్తున్న సాయం కంటే ఒక్క ఏపీ సాయమే అత్యధికమని కేంద్ర ప్రభుత్వమే చెప్పిందని గుర్తుచేశారు. 2022 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కలిసి ఎస్సీ సబ్‌ప్లాన్ ద్వారా 34.86 లక్షల కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందించాయని, వాటిలో ఒక్క ఏపీలోనే 33.57 లక్షల కుటుంబాలున్నాయని తెలిపారు. ఎస్సీ సబ్‌ప్లాన్ ద్వారా 2014–19 మధ్య చంద్రబాబు పాలనలో చేసిన ఖర్చు రూ.33,625 కోట్లు కాగా, మూడున్నరేళ్ల కాలంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.49,710.17 కోట్లని తెలిపారు. ఐదేళ్లలో చంద్రబాబు ఎస్సీల సంక్షేమానికి రూ.33,629 కోట్లు ఖర్చుచేస్తే, జగన్మోహన్రెడ్డి మూడున్నరేళ్ల పాలనలో ఎస్సీల కోసం రూ.58,353 కోట్లు ఖర్చుచేశారని వివరించారు. టీడీపీ నేతలు దళితపల్లెకు వెళ్లి పేదగుడిసె తలుపుతట్టి జగన్మోహన్రెడ్డికి వ్యతిరేకంగా వారు చెబుతున్న మాటలను ప్రస్తావిస్తే చెప్పుతో కొడతారని ఆయన హెచ్చరించారు. చదవండి: AP EAPCET Results 2023: ఏపీ ఈఏపీసెట్ ఫలితాల విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే.. -
‘లోకేశ్ యువగళం, పవన్ వారాహిని ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు’
సాక్షి, తిరుపతి: విద్య వల్లే సమాజంలో మార్పు అని నమ్మిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. బీఆర్ అంబేద్కర్ భావజాలాన్ని అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి.. సీఎం జగన్ అని అన్నారు మంత్రి మేరుగు నాగార్జున. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి సీఎం జగన్ కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. కాగా, మంత్రి మేరుగు నాగార్జున సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నారా లోకేశ్ యువగళం, పవన్ కల్యాణ్ వారాహిని ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. ఎన్ని కుట్రలు చేసినా టీడీపీ, బీజేపీని ప్రజలు నమ్మరు. ఏపీలో విద్యా వ్యవస్థలో విప్లాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిన ఏకైక వ్యక్తి సీఎం జగన్. రాష్ట్రంలో పిల్లల బంగారు భవిష్యత్‌కు బాటలు వేస్తున్నారని అన్నారు. బీజేపీ నేతలు టీడీపీ నేతలు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలని బీజేపీ నేతలకు సలహా ఇచ్చారు. ఇది కూడా చదవండి: టీడీపీ ట్రాప్‌లో బీజేపీ.. అమిత్‌షా వ్యాఖ్యలపై వైవీ సుబ్బారెడ్డి స్పందన -
ఎస్సీ ప్రాంతాలకు రూ.3,853.93 కోట్లతో మంచినీరు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఎస్సీ నివాసిత ప్రాంతాల్లో మంచినీరు అందించేందుకు రూ.3,853.93 కోట్లు ఖర్చు చేస్తున్నారు. జల్‌జీవన్ మిషన్(జేఎంఎం) ద్వారా 45,13,256 మంది ఎస్సీలకు మేలు కలగనుంది. రాష్ట్రంలో జల్‌జీవన్ మిషన్ ద్వారా ఎస్సీ, ఎస్టీ, మైదాన ప్రాంతాల్లో మొత్తం రూ.25,485.36 కోట్ల అంచనాతో 71,201 పనులు చేపట్టాలని ప్రతిపాదించారు. ఎస్సీ ప్రాంతాల్లో రూ.3,853.93 కోట్లతో తొలిదశ పనులు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో ఎస్సీలకు చెందిన 7,917 శివారు ప్రాంతాలున్నాయి. వాటిలో 4,852 ప్రాంతాలకు సమృద్ధిగా నీరు అందుతోంది. మరో 3,065 ప్రాంతాలకు నిర్దేశించినంత (మనిíÙకి 55 లీటర్లు) నీటి సరఫరాలేదని అధికారులు అంచనా వేశారు. దీంతో ఎస్సీ ప్రాంతాల్లో నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా మొత్తం 19,619 పనులు ప్రతిపాదించారు. నీటి ట్యాంకు (రక్షిత నీటిపథకాలు), పైపులైను వంటి నిర్మాణాలు చేపట్టనున్నారు. ఎస్సీ నివాసిత ప్రాంతాల్లో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇచ్చేలా చర్యలు చేపట్టారు. 2024 నాటికి మొత్తం మూడుదశల్లో పనులు పూర్తిచేయాలని నిర్ణయించారు. ఎస్సీ కాలనీలు, ఎస్సీలు అత్యధికంగా నివసిస్తున్న ప్రాంతాలు, జగనన్న కాలనీల్లో వాటర్ ట్యాంకులు, పైపులైన్లు, ట్యాప్ కనెక్షన్లు ఇచ్చే పనులు పూర్తయితే 45,13,256 మంది ఎస్సీలకు లబ్ధికలుగుతుంది. వేగంగా పనులు పూర్తి చేస్తాం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల భాగస్వామ్యంతో చేపట్టిన పనుల్ని వేగవంతంగా పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టాం. అత్యవసరమైన రక్షిత మంచినీటి సౌకర్యాన్ని మెరుగుపరచాలనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో ఇప్పటికే పనుల పురోగతిపై సమీక్షించాం. పనులకు అడ్డంకులు లేకుండా చూడటం, వేగంగా జరిగేలా చూడటం, బిల్లుల చెల్లింపు వంటి అన్ని అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. ప్రభుత్వం జల్‌జీవన్ మిషన్ కార్యక్రమాన్ని ఉపయోగించుకుని రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, మైదాన ప్రాంతాల్లో అవసరమైనమేరకు మంచినీటిని అందించడం కోసం కృషిచేస్తోంది. గ్రామీణ నీటిసరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) యంత్రాంగం సమన్వయంతో ప్రస్తుత వేసవిలో ఎక్కడా మంచినీటి కొరత తలెత్తకుండా చేశాం. – మేరుగు నాగార్జున, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి -
పేదలకిచ్చే స్థలాలను సమాధులతో పోలుస్తారా?
-
పేదల చేతుల్లోనే బాబుకు శాశ్వతంగా రాజకీయ సమాధి: మంత్రి నాగార్జున
సాక్షి, అమరావతి: 2014 ఎన్నికల మేనిఫెస్టో హామీలన్నీ బాబు గాలికొదిలేశాడని మేరుగు నాగార్జున విమర్శించారు. 650కిపైగా హామీల్లో 10శాతం కూడా నెరవేర్చలేదని దుయ్యబట్టారు.చంద్రబాబు రాజమండ్రిలో ఆదివారం కొత్త పలుకులు, వాగ్దానాలతో ఊదరగొట్టాడని, ఆయన వాగ్దానాలపై జనం నవ్వుకుంటున్నారని మండిపడ్డారు. అమరావతి సచివాలయంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున సోమవారం మీడియాతో మాట్లాడారు. పేదవాళ్లు అంటూ ఇప్పుడు కొత్తగా వారిపట్ల ప్రేమ కురిపిస్తున్న ఈ బాబు తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశాడనేది ప్రజలందరికీ తెలుసని అన్నారు. ‘ఈ రాష్ట్రంలోని ఏ ఒక్క పేదవాడ్ని ఆయన కోటీశ్వరుడ్ని చేసిన దాఖలాలు లేదు. తల్లికి అన్నం పెట్టనోడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్న సామెత చందంగా అధికారంలో ఉన్నప్పుడు పేదవాళ్లకు మంచి చేయనోడు.. రేపు అధికారం ఇస్తేనే మంచి చేస్తానని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. పేదవారి గురించి, వారి భవిష్యత్తు గురించి చంద్రబాబు కొత్తగా పలుకుతుంటే ప్రజలంతా నవ్వుకుంటున్నారు. చెప్పుకోదగ్గ పథకం లేదని బాబు సిగ్గుపడాలి చంద్రబాబు హయాంలో ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేసిన, ఆయన గొప్పగా చెప్పుకోదగ్గ ఒక్క ప్రభుత్వ పథకమైనా ఉందా..? ఈ ప్రశ్నకు సమాధానమివ్వలేని చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలి. చంద్రబాబు హయాంలో ఆయన ప్రవేశపెట్టి అమలు చేసిన పథకాలు ఏమైనా ఉన్నాయంటే, అది బాబు దోపిడీముఠాలకు దోచిపెట్టే పథకాల్ని మాత్రమే పెట్టాడు. జన్మభూమి కమిటీల పేరుతో ఇష్టానుసారంగా పేదల్ని దోచుకునేందుకు గేట్లు తెరిచి చంద్రబాబు, ఆయన తాబేదార్లు కోటాను కోట్లు గడించి బాగుపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలు అనేకమంది ప్రభుత్వం తరఫున పేదలు లబ్ధిపొందాలంటే జన్మభూమి కమిటీల గ్రీన్‌సిగ్నల్ కోసం లంచాలు సమర్పించుకోవాల్సిరావడంతో తీవ్రంగా నష్టపోయిన పరిస్థితుల్ని చూశారు. బాబు దృష్టిలో మేనిఫెస్టో అనేది చెత్తబుట్ట చంద్రబాబు వాగ్దానాలు, అమలుతీరును పరిశీలిస్తే.. ఆయన రాజకీయాల్లో మాట్లాడిన ఏ ఒక్కమాటను నిలబెట్టుకోలేదు. అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకురాని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, పేదవాళ్లు ఇప్పుడు అధికారంలో లేనప్పుడు గుర్తుకు వస్తారా..? 2014లో ఎన్నికలప్పుడు 650కి పైగా వాగ్దానాలతో టీడీపీ మ్యానిఫెస్టో ప్రకటిస్తే.. వాటిలో కనీసం 10 శాతం కూడా చంద్రబాబు నిలబెట్టుకోలేదనేది జగమెరిగిన సత్యం. పైగా, తనను జనం నిలదీస్తారనే భయంతో తమ పార్టీ వెబ్సైట్ నుంచి మేనిఫెస్టోను తొలగించుకున్న నీచమైన చరిత్ర చంద్రబాబుది. అంటే, ఎన్నికల మ్యానిఫెస్టో అనేది చంద్రబాబు దృష్టిలో చెత్తబుట్టతో సమానంగా చూస్తాడని అర్థమౌతుంది. ఈ రోజు కొత్తగా పేదవాళ్ల భవిష్యత్తు అంటూ బాబు చెప్పే వాగ్దానాల్ని నమ్మేందుకు ప్రజలు కళ్లులేని కబోధులు కాదు. చదవండి: చంద్రబాబు చెప్పేవన్నీ నంగనాచి కబుర్లే: కురసాల కన్నబాబు అందలం ఎక్కించిన వారినే తన్నడం బాబు నైజం చంద్రబాబుకు అబద్ధాలాడటం వెన్నతో పెట్టిన విద్యగా చెప్పుకోవచ్చు. అబద్ధాలను నిజాలుగా నమ్మించాలనే బాబు ఆతృత ఆయన కుసంస్కారానికి నిదర్శనం. అందలం ఎక్కడం.. అధికారంలోకి రాగానే అందలం ఎక్కించిన వారిని ఎగిరెగిరి తన్నడం చంద్రబాబుకు బాగా అలవాటు. 2014లో సాయపడి అధికార కుర్చీలో కూర్చొబెట్టిన దత్తపుత్రుడ్ని కూడా చంద్రబాబు తన్నాడు కదా..? దాన్ని ఎవరూ మరిచిపోలేరు. అప్పట్లో ఆ దత్తపుత్రుడికి కనీసం ఇంటర్వ్యూ కూడా ఇవ్వకుండా వాడుకుని నీచంగా ప్రవర్తించిన పరిస్థితిని అందరూ చూశారు. మేనిఫెస్టో అంటే భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా నమ్మిన జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో చంద్రబాబుకు, సీఎం జగన్‌కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఎన్నికలు, మ్యానిఫెస్టో హామీలు, ప్రజల సంక్షేమంలో చంద్రబాబు పాలనని, జగన్ పాలనతో పోల్చి చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎన్నికల మేనిఫెస్టో అనేది అన్ని వర్గాల ఆరాధ్యదైవమైన భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా మనం నమ్మాలని.. ఆయన నమ్ముకున్న సిద్ధాంతం మేరకు అందులోని 98.5 శాతం హామీల్నీ నిలబెట్టుకున్న దమ్మున్న నాయకుడు మా జగన్ అని మేం గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎన్నికల మేనిఫెస్టో హామీల్ని నిలబెట్టుకోవడంలో జగన్ ఎంత త్రికరణ శుద్ధిగా ఉన్నారో.. అదే మాకు, మాపార్టీకి బలమని మేం దమ్ముగా చెప్పుకుంటున్నాం. పేదల వ్యతిరేక మనస్తత్వంతో బాబు చంద్రబాబు రాజకీయం, ఆయన మనస్తత్వం అడుగడుగునా పేదల వ్యతిరేక భావనతోనే నడిచింది. బాబు చెప్పే వాగ్దానాలు నాలుగు రోజుల తర్వాత ఎక్కడుంటాయో కూడా చెప్పలేం. కులాల్ని రెచ్చగొట్టి.. పేదలపై ఉసిగొలిపి.. వారికి సరైన విద్య అందకుండా, ఇళ్లస్థలాలు దక్కకుండా కోర్టులకెళ్లే నీచ, నయవంచన స్వభావి చంద్రబాబు అని గుర్తుచేస్తున్నాను. నాడు నేడు పేరుతో మేం ప్రభుత్వ బడుల్ని అభివృద్ధి చేస్తుంటే అడ్డుపడ్డాడు. పేద పిల్లలకు ఇంగ్లీషు మీడియంలో విద్యాబోధన చేస్తామంటే కోర్టులకెళ్లి కాదన్నాడు. నిన్న అమరావతి రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్లు ఇస్తుంటే డెమోగ్రఫికల్ ఇన్‌బ్యాలెన్స్ వస్తుందంటూ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్లాడు. చంద్రబాబుకు పేదల పట్ల ఇంత అహంకారం ఏమిటి..? దమ్ముంటే చర్చకు వస్తావా .? మోసం చేసిన ఏ ఒక్క నాయకుడ్ని కూడా ప్రజలు అంతుచూసేదాకా వదిలిపెట్టరు. ప్రభుత్వ సంక్షేమ పథకాల పేరుతో సీఎం జగన్ నాలుగేళ్ల పాలనలో ఇప్పటికే రాష్ట్రంలో రూ.2.11 లక్షల కోట్లు డీబీటీ ద్వారా లబ్ధిని నేరుగా ప్రజల ఖాతాల్లో జమ చేశాం కనుక.. ఎక్కడా ఒక్క పైసా అవినీతికి తావులేకుండా సంక్షేమ వ్యవస్థ నడుస్తున్నందున మేం ఇంత ధీమాగా ఉన్నాం. ప్రజలంతా ఈరోజు సంతోషంగా ఉండటమే మాకు శ్రీరామరక్ష. ఇలాంటి సంక్షేమ వాతావరణం చంద్రబాబు హయాంలో ఏనాడైనా చూశారా..? ఉంటే, చర్చిద్దాం వస్తారా..? అంటూ సవాల్ విసురుతున్నాను. బాబు ఊసరవెల్లి కబుర్లు జనం నమ్మరు ఎన్నికల వాతావరణం వచ్చేసరికి తాను ఏ రకమైన చిలుక జోస్యం చెప్పినా.. జనం తన మాటల మాయలో పడతారనుకోవడం చంద్రబాబు భ్రమ మాత్రమే. గతంలో మాదిరిగా ఆయన మాటల మాయాజాలంలో పడి చంద్రబాబును ఎత్తుకునేందుకు జనం కళ్లులేని కబోధులేమీ కాదని.. ఆయన ఊసరవెల్లి కబుర్లును జనం నమ్మరుగాక నమ్మరు. గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణాల్లోని పేదల పట్ల హీనంగా, నీచంగా ప్రవర్తించినందునే 2019లో బాబును ఓడించారు.. రేపు 2024లోనూ ఇదే పరిస్థితి ఉంటుంది. పేదల ఇళ్లను సమాధులతో పోల్చినప్పుడే బాబుకు శాశ్వత రాజకీయ సమాధి కట్టాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. బాబుకు భవిష్యత్తు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు’ అని మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు. -
బాబుకు మేనిఫెస్టో అంటే చిత్తుకాగితం
చిలకలూరిపేట/తాడేపల్లిగూడెం రూరల్/గుడివాడ టౌన్/సింహాచలం: మేనిఫెస్టో అంటే సినిమా కాదని.. దానిని విడతల వారీగా విడుదల చేస్తానని చంద్రబాబునాయుడు చెప్పడం ఏమిటోనని వైఎస్సార్సీపీ నేతలు ఎద్దేవా చేశారు. అసలు చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానమని వారన్నారు. ముసలి బ్యాచ్ ఒకరినొకరు పలకరించుకోడానికే మహానాడు పెట్టారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు వంటి దుర్మార్గుడిని సమూలంగా రాజకీయాలకు దూరంగా ఉంచేలా ప్రజలు నిర్ణయం తీసుకోవాలని కోరారు. మహానాడు నేపథ్యంలో ఆదివారం ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, మంత్రులు విడదల రజిని, మేరుగు నాగార్జున, మాజీమంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని వేర్వేరుచోట్ల టీడీపీపై విమర్శలు గుప్పించారు. వారేమన్నారంటే.. మేనిఫెస్టోపై బాబు మాట్లాడడం సిగ్గుచేటు: మంత్రి రజిని మేనిఫెస్టో గురించి చంద్రబాబు మాట్లాడం సిగ్గుచేటు. తొలి విడత అంటూ దానిని విడుదల చేయడం ఏంటో ఎవరికీ అర్థంకాని విషయం. మేనిఫెస్టో అంటే ఏ పార్టీకి అయినా పవిత్రమైనదిగా భావించాలి. మా నాయకుడు జగనన్న మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావిస్తారు. ఇచ్చిన హామీల్లో 98 శాతానికి పైగా నెరవేర్చి ప్రజల బతుకుల్లో జగనన్న వెలుగులు నింపారు. కానీ, చంద్రబాబు 2014లో 600కు పైగా హామీలిచ్చి ఒక్కటి కూడా నెరవేర్చలేదు. పైగా దానిని ఎవరికీ కనపడకుండా చేశారు. మేనిఫెస్టో అంటే ఆయనకు చిత్తుకాగితంతో సమానం. ఇక మహానాడు వేదికగా చంద్రబాబునాయుడు డిక్షనరీలో లేని సంక్షేమం, అభివృద్ధి, పేదలు అంటూ కొత్త రాగం అందుకున్నారు. నిజానికి.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని తిట్టడానికే మహానాడును పెట్టినట్లుగా ఉంది. సైకిల్ ముందుచక్రం సంక్షేమానికి, వెనక చక్రం అభివృద్ధికి నిదర్శనమని బాబు ప్రకటించటం హాస్యాస్పదం. వాస్తవానికి సైకిల్ ముందు చక్రం దోచుకోవటానికి, వెనుక చక్రం దాచుకోవటానికి నిదర్శనం. బాబువి తప్పుడు రాజకీయాలు: డిప్యూటీ సీఎం ‘కొట్టు’ చంద్రబాబు ఎక్కడో హైదరాబాద్‌లో ఉండి చుట్టం చూపుగా రాష్ట్రానికి వచ్చి ఇక్కడ తప్పుడు రాజకీయాలు చేస్తున్నాడు. పిల్లనిచ్చిన సొంత మామకు వెన్నుపోటు పొడిచాడు. అటువంటి దుర్మార్గుడు ప్రజల సంతోషాన్ని నాశనం చేసేందుకు మళ్లీ ఎన్టీఆర్ బొమ్మతో ముందుకొస్తున్నాడు. ఈయనకు పవన్ తోడవుతున్నాడు. పవన్‌ను నమ్మి గ్రామాల్లో జనసేన కార్యకర్తలు సొంత డబ్బులు ఖర్చుపెడుతుంటే పవన్ మాత్రం తన సొంత సామాజికవర్గాన్ని చంద్రబాబుకు తాకట్టు పెట్టేస్తున్నాడు. తనకు సీఎం అయ్యే పరిస్థితిలేదని తెలిసి.. చంద్రబాబు సీఎం అయితే ఆయన నీడలో బతికేయవచ్చని పవన్ తప్పుడు ఆలోచన చేస్తున్నాడు. జగన్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉంటే చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ ఓర్వలేకపోతున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో మారీచులు వస్తారు.. వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. బాబు దళిత వ్యతిరేకి: మంత్రి ‘మేరుగు’ చంద్రబాబు దళిత వ్యతిరేకి. ఆయనకు ఎస్సీలంటే చులకన. ఎస్సీ కులంలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని ఆయన చేసిన వ్యాఖ్యలు అంబేడ్కర్‌ని అగౌరవపరిచినట్లే. ఆనాడు ఆయన చేసిన వ్యాఖ్యలు తప్పని చంద్రబాబు ఇప్పటికీ అంబేడ్కర్ విగ్రహం పాదాల చెంతకు వచ్చి చెప్పలేదు. అది ఆయనలోని అహంకారానికి నిదర్శనం. అసలు అంబేడ్కర్ ఆలోచన విధానానికి ఆయన పూర్తి వ్యతిరేకం. కానీ, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచన అంబేడ్కర్ భావజాలంతో ముడిపడి ఉంది. టీడీపీ హయాంలో దళితులపై దాడులు జరిగితే చంద్రబాబు ఏనాడు పట్టించుకోలేదు. దళిత మహిళలను అగౌరవపరిచినా కూడా స్పందించలేని పరిస్థితి. దళిత భూములను లాక్కున్నారని ప్రశ్నిస్తే స్వయంగా నన్నే అరెస్టుచేశారు. అదే జగనన్న పాలనలో దళితులకు ఎంతో మేలు జరిగింది. టీడీపీ నేతలు స్క్రాప్ బ్యాచ్: కొడాలి నాని టీడీపీ నేతలందరూ కలిసి రాజమండ్రిలో మహానాడు సభ పెట్టారు. దానివల్ల తెలుగుదేశానికి వచ్చే లాభం ఏమీ ఉండదు. వారంతా స్క్రాప్ బ్యాచ్. ప్రస్తుతం ఎన్టీఆర్ పేరుతో ప్రజలకు వెన్నుపోటు పొడవడానికి చంద్రబాబు ఈ కార్యక్రమం ద్వారా సిద్ధమవుతున్నాడు. గతంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే పార్టీ, రాష్ట్రం నాశనం అవుతుందని చెప్పిన చంద్రబాబు నేడు తిరిగి ఆ మహా నాయకుని పేరు వాడుకుంటున్నారు. 1999 ఎన్నికల్లో వాజ్‌పేయిని అడ్డుపెట్టుకుని గెలిచిన చంద్రబాబు ఆ తర్వాత ఆయన పేరును ఎక్కడా కనబడనివ్వలేదు. నాలాంటి అభిమానులు ఎన్టీఆర్ ఫొటో పెట్టుకుంటే బెదిరించిన పరిస్థితులున్నాయి. ఇప్పుడు గతిలేక రాజకీయంగా బతకడానికి తిరిగి ఎన్టీఆర్‌ను ఈ 420 చంద్రబాబు వాడుకొంటున్నాడు. 2024 ఎన్నికల్లో ప్రజలు ఆయన్ను చెప్పుదెబ్బలు కొడతారు. చంద్రబాబు, లోకేశ్‌కు దమ్ముంటే గుడివాడ, గన్నవరంలో పోటీచేయాలి. -
కోర్టుల్లో ఓడిపోయినా చంద్రబాబుకు సిగ్గులేదు: మంత్రి మేరుగ
సాక్షి, అమరావతి: అమరావతిలో రైతులను చంద్రబాబు నిలువునా ముంచారని, రియల్ ఎస్టేట్ బ్రోకర్ అయిపోయాడంటూ ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. గురువారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పేదల ఇళ్లను అడ్డుకునేందుకు కోర్టుకు వెళ్లిన వ్యక్తి చంద్రబాబు. కోర్టుల్లో ఓడిపోయినా చంద్రబాబుకు సిగ్గులేదని ధ్వజమెత్తారు. ‘‘51 వేల ఇళ్ల పట్టాలు ఇవ్వడం అంటే ఒక చరిత్ర. పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే ధర్నాలు చేస్తారా?. డబ్బులు ఇచ్చి ఉద్యమాలు చేయిస్తున్నాడు. చంద్రబాబు ఎవరి కోసం రాజకీయాలు చేస్తున్నాడు?. రాజధానిలో పేదలు ఉండకూడదని చంద్రబాబు కుట్రలు పన్నాడు. సామాజిక సమతుల్యత ఏర్పడుతుందంటూ అడ్డుపడ్డారు. పేదలకు ఎక్కడ లాభం చేకూరుతుందోనని చంద్రబాబు భయపడుతున్నారు. రేపు సామాజిక పండుగ జరుగుతోంది. అసలు రేపు వీరి దగ్గరకు వచ్చి ఓట్లు అడగగలుగుతావా చంద్రబాబు?. చంద్రబాబు వలనే రాజధాని ప్రాంత రైతులు నష్టపోయారు’’ అంటూ ఆయన దుయ్యబట్టారు. చదవండి: సీఎం జగన్ ఏం సాధించారు?.. ఎల్లో బ్యాచ్‌కు దిమ్మతిరిగే సమాధానం ఇదే.. సీఎం జగన్ రైతు పక్షపాతి. రైతులు ప్రశాంతంగా బతకాలని కోరుకునే వ్యక్తి జగన్. ఎల్లో మీడియాని అడ్డుపెట్టుకుని ఏదేదో చేయాలనుకుంటే కుదరదు. కోర్టులు తీర్పులు ఇచ్చినా ఇంకా అడ్డుకోవాలని చూసే చంద్రబాబుకు ప్రజలే బుద్ది చెప్తారు. మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయటం కరెక్ట్ కాదు. ఎవరైనా అడ్డుకోవాలని చూస్తే చట్టం తన పని తాను చేస్తుందని, ఇప్పుడు ఇళ్లు ఇచ్చే స్థలాలు ముంపునకు గురయ్యేవి కాదు’’ అని మంత్రి స్పష్టం చేశారు. -
ఎస్సీ గురుకుల ఉపాధ్యాయుల వేతనాలు పెంపు
సాక్షి, అమరావతి: ఎస్సీ గురుకులాల్లో పనిచేస్తున్న 1,791 మంది పార్ట్ టైమ్ టీచర్ల వేతనాలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసినట్టు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. టీచర్లతో పాటు వ్యాయామ ఉపాధ్యాయులు, హెల్త్ సూపర్ వైజర్ల వేతనాలు కూడా పెంచినట్టు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ అంబేడ్కర్ ఎస్సీ గురుకులాల్లో పనిచేస్తున్న జూనియర్ లెక్చరర్లు, పీజీటీలు, టీజీటీలు, పీఈటీలు, హెల్త్ సూపర్ వైజర్ల వేతనాలు పెంచాలంటూ ఉపాధ్యాయులు చేసిన విజ్ఞప్తి మేరకు బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశంలో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. గతంలో జూనియర్ లెక్చరర్ల(జేఎల్)వేతనం రూ.18 వేలు ఉండగా.. దీనిని రూ.24,150కు పెంచినట్టు తెలిపారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ల(పీజీటీ) వేతనం రూ.16,100 నుంచి రూ.24,150కు, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ల(టీజీటీ) వేతనం రూ.14,800 నుంచి రూ.19,350కు, వ్యాయామ ఉపాధ్యాయుల (పీఇటీ) వేతనం రూ.10,900 ఉండగా.. దానిని రూ.16,350కు పెంచినట్టు చెప్పారు. వీరితో పాటు హెల్త్ సూపర్ వైజర్, స్టాఫ్ నర్స్‌ల వేతనం రూ.12,900 ఉండగా దాన్ని రూ.19,350కు పెంచామన్నారు. కాగా, తమ కష్టాలను గుర్తించి తమ వేతనాలను పెంచినందుకు గురుకుల విద్యాలయాల సంస్థ ఉద్యోగుల జేఏసీ నేతలు, టీచర్లు మంత్రి మేరుగు నాగార్జునను శుక్రవారం సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ నాగభూషణం మాట్లాడుతూ తాము కోరిన వెంటనే న్యాయం చేశారని కొనియాడారు. -
రూ.65 కోట్లతో చర్మపరిశ్రమ అభివృద్ధి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రూ.65 కోట్లతో చర్మపరిశ్రమ అభివృద్ధి చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. ఆయన సోమవారం రాష్ట్ర సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ చర్మ పరిశ్రమాభివృద్ధి సంస్థ (లిడ్‌క్యాప్) కార్యకలాపాలను సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో లిడ్‌క్యాప్‌కు అత్యంత విలువైన 133.74 ఎకరాల భూములున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఈ భూములు, భవనాలన్నింటినీ వినియోగంలోకి తెచ్చేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. పీఎం అజయ్ పథకం కింద మంజూరైన రూ.11.50 కోట్లతో కృష్ణాజిల్లాలోని జి.కొండూరు, ప్రకాశం జిల్లాలోని యడవల్లిల్లో రెండు పాదరక్షల తయారీ (ఫుట్‌వేర్ మాన్యుఫాక్చర్) కేంద్రాలు నిర్మించనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన టెండర్ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. విజయవాడ ఆటోనగర్ గేట్ వద్ద ఉన్న భూమిలో చర్మ ఉత్పత్తుల శిక్షణ, విక్రయాలకు అవసరమైన భవనాన్ని నిర్మించే ప్రతిపాదన ఉందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 9 మినీ లెదర్‌పార్కులను నిర్మించడానికి కూడా చర్యలు చేపడుతున్నామన్నారు. ఇవికాకుండా రూ.65 కోట్లతో లిడ్‌క్యాప్‌లో పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. దీన్లో భాగంగా పాదరక్షలకు సంబంధించిన రూ.10 కోట్లతో కామన్ ఫెసిలిటీ సెంటర్, రూ.30 కోట్లతో చర్మపరిశ్రమకు సంబంధించిన శిక్షణ కోసం కామన్ ఫెసిలిటీ సెంటర్, రూ.15 కోట్లతో కొత్త భవనాల నిర్మాణం, రూ.10 కోట్లతో ప్రస్తుతం ఉన్న భవనాల అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా రాష్ట్రంలో చర్మపరిశ్రమ అభివృద్ధికి, చర్మకారుల సంక్షేమానికి ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సూచించారు. లిడ్‌క్యాప్ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారని చెప్పారు. తాను సూచించిన ప్రతిపాదనలు, కోరిన వివరాలతో వారం రోజుల్లో మరోసారి సమావేశానికి రావాలని లిడ్‌క్యాప్ అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో లిడ్‌క్యాప్ ఎండీ శంకర్, జీఎం నల్లమోతు అధికారి తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు హయాంలో పెళ్లికానుక ఎగ్గొట్టారు: మంత్రి మేరుగు
సాక్షి, అమరావతి: చంద్రబాబు హయాంలో పెళ్లికానుక ఎగ్గొట్టారని, సీఎం జగన్ గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రంలో పేదల బతుకులను కాలరాసే వ్యక్తి చంద్రబాబు అంటూ మండిపడ్డారు. ‘‘వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా కింద 12 వేల 132 మంది జంటలకు 87.32 కోట్ల డబ్బును సీఎం జగన్ నేరుగా ఖాతాల్లో జమ చేశారు. ఇప్పటి వరకు 16 వేల 668 కుటుంబాలకు 125.50 కోట్లు బటన్ నొక్కి కుటుంబాలను ఆదుకున్నారు. గత ప్రభుత్వంలో పెళ్లి కానుక కోసం 17,709 జంటలు దరఖాస్తు చేస్తే 68.90 కోట్లు చంద్రబాబు ఎగ్గొట్టారు. గతంలో పెళ్లికానుకను ఎందుకు ఎగ్గొట్టారో చంద్రాబాబు చెప్పాలి. మోసం చేసి వెళ్లిపోతే జగన్ వచ్చి ఆర్ధిక సాయంపెంచి అమలు చేస్తున్నారు. అక్షరాస్యత పెంచేందుకే పదో తరగతి విద్యార్హతగా నిర్ణయించాం. ఎస్సీలకు గతంలో 40 వేలు ఇస్తుండగా ఇప్పుడు లక్ష రూపాయలు ఇస్తున్నాం’’ అని మంత్రి అన్నారు. చదవండి: అమరావతి పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఎస్సీల్లో కులాంతర వివాహాలు చేసుకున్నవారికి 75 వేలు ఇస్తుండగా ఇప్పుడు 1 లక్ష 20 వేలు బీసీలకు గత ప్రభుత్వంలో 50 వేలు ఇస్తుండగా ఇప్పుడు లక్ష రూపాయలు ఇస్తున్నాం. కళ్యాణమస్తు , షాదీ తోఫా పథకంపై మేము చర్చకు సిద్దమే. రాజధానిలో పేదలకు ఇళ్లస్థలాలు రాకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారు. రాష్ట్రంలో పేదల బతుకులను కాలరాసే వ్యక్తి చంద్రబాబు. రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదు. రైతులను నిట్టనిలువునా ముంచిన వ్యక్తి చంద్రబాబు. వ్యవసాయం దండగ అని అన్న వ్యక్తి చంద్రబాబు. వ్యవసాయం అభివృద్ధి గురించి కనీసం ఆలోచన లేని వ్యక్తి చంద్రబాబు’’ అంటూ మంత్రి దుయ్యబట్టారు. చదవండి: బాబు అక్రమాలపై విచారణకు సుప్రీం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం శుభ పరిణామమే ‘‘మా ప్రభుత్వానికి వ్యవసాయం, రైతులపై త్రికరణ శుద్ది ఉంది. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే ప్రభుత్వం మాది. పంట నష్టం వస్తే సకాలంలో పరిహారం ఇచ్చిన పరిస్ధితి గతంలో ఉందా?. ప్రత్యేకంగా నిధి పెట్టి రైతులను ఆదుకుంటోన్న ప్రభుత్వం మాది. ఏదో విధంగా అధికారం లోకిరావాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. లైలా తుఫాను వస్తే చంద్రబాబు పరిహారం ఇవ్వలేదు. వ్యవసాయంపై చర్చించేందుకు చంద్రబాబు సహా ఎవరు వచ్చినా చర్చకు సిద్దం. చిత్తశుద్దితో పనిచేసే సీఎం జగన్ గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదు. గతంలో చంద్రబాబు సామాజికంగా ఎంత అన్యాయం చేశారో చెప్పేందుకు మేం సిద్దం. బహిరంగ చర్చకు రావాలి. చంద్రబాబు హయాంలో ప్రజలు మోస పోయారు.. ప్రజలు ఆయన్నుఎన్నటికీ నమ్మరు. చంద్రబాబు రథచక్రాలు ఊడగొట్టేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారు’’ అని మంత్రి అన్నారు. -
చంద్రబాబు దళిత ద్రోహి.. వారి కోసం ఒక్క పనైనా చేశారా?: మేరుగు
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దళిత ద్రోహి అని మండిపడ్డారు మంత్రి మేరుగు నాగార్జున. దళితుల అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని బాబుకు సవాల్ విసిరారు. దళితుల కోసం సీఎం జగన్ రూ.53వేల కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. చంద్రబాబు హయాంలో దళితుల కోసం ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ దళితులను అవమానించేలా మాట్లాడిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఇద్దరూ దళిత వ్యతిరేకులని ద్వజమెత్తారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు దళితుల అభివృద్ధి కోసం గానీ, సంక్షేమం కోసం గానీ ఒక్క పనైనా చేశారా? అని మేరుగు ప్రశ్నించారు. దళివుల పేరుతో టీడీపీ కార్యకర్తలే దోపిడీకి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. చదవండి: ‘ఎన్టీఆర్ మాట్లాడిన వీడియోలు విడుదల చేసే దమ్ముందా?’ -
రామోజీరావు, ఈనాడు పత్రికపై మంత్రి మేరుగు నాగార్జున ఫైర్
సాక్షి, ప్రకాశం జిల్లా: రామోజీరావు, ఈనాడు పత్రికపై మంత్రి మేరుగు నాగార్జున మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈనాడులో దళితులపై పిచ్చి రాతలు రాస్తున్నారని ధ్వజమెత్తారు. దళితులపై చంద్రబాబు పిచ్చి వాగుడును ఎందుకు రాయలేదని ఆయన ప్రశ్నించారు. ‘‘దళితులు ఏం పీకుతారని లోకేష్ అన్నప్పుడు రామోజీ ఎందుకు రాయలేదు?. లోకేష్‌కు కూడా దళితులు అంటే లోకువ’’ అంటూ మంత్రి దుయ్యబట్టారు. ‘‘ఎస్సీలు మీటింగ్ పెట్టి మాట్లాడుకుంటే ఎల్లో మీడియా విషం చిమ్ముతుంది. చంద్రబాబు హయాంలో దళితులను కొట్టినా.. చంపినా రాయలేదు. 14 ఏళ్లు దళితులే టార్గెట్‌గా చంద్రబాబు పాలన చేశారు. గజదొంగలను అడ్డుపెట్టుకుని సీఎం జగన్‌ను అభాసుపాలు చేయాలని చంద్రబాబు చూస్తున్నారు. సీఎం జగన్ దళితుల కోసం రూ.53 వేల కోట్లు ఖర్చు చేశారు’’ అని మంత్రి నాగార్జున అన్నారు. చదవండి: చంద్రబాబు లెగ్గు మహిమ.. సైకిల్ నాలుగు ముక్కలు -
అధికారంలో ఉన్నప్పుడు దళితులను మోసం చేసావు
-
విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా అంబేడ్కర్ జయంతి వేడుకలు
-
చరిత్రలో ఇన్ని పథకాలు ఎవ్వరూ ఇవ్వలేదు
-
ఎస్సీ కార్పొరేషన్ పథకాల కోసం దరఖాస్తు చేసుకోండి: మంత్రి మేరుగ
సాక్షి, అమరావతి: ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అమలు చేయనున్న అమృత్ జలధార, యంగ్ ఎంటర్ ప్రెన్యూర్ పథకాలలో లబ్ది కోసం అర్హులైన ఎస్సీలు దరఖాస్తులు చేసుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున ఒక ప్రకటనలో కోరారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ జలధార పథకం కింద ఎస్సీ రైతుల భూములకు నీటి వసతిని కల్పించేందుకు బ్యాంకులు, ఇతర సంస్థల ద్వారా ఇప్పటికే రుణాలు మంజూరైన రైతులకు బోరు బావులు, స్పింక్లర్లు, డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేసుకోవడానికి రూ.50 వేలు సబ్సిడీగా ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. రైతులు రెండున్నర ఎకరాల భూమి, రూ.3 లక్షలకు లోపు వార్షిక ఆదాయం కలిగిన రైతులు అమృత్ జలధార పథకంలో లబ్ది పొందేందుకు అర్హులని తెలిపారు. అలాగే యంగ్ ఎంటర్ ప్రెన్యూర్ పథకంలో భాగంగా ట్రాక్టర్లు, ట్రాలీలు, కమర్షియల్ వాహనాలు, వేర్ హౌసెస్ తదితర స్వయం ఉపాధి పథకాలకు ఇప్పటికే బ్యాంకులు, ఇతర సంస్థల ద్వారా రుణాలు మంజూరైన ఎస్సీ యువతకు రూ.60 వేలు సబ్సిడీగా ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు. అమృత్ జలధార పథకం కోసమైతే పట్టాదారు పాసు పుస్తకాలు, రవాణాకు సంబంధించిన యంగ్ ఎంటర్ ప్రెన్యూర్ పథకం కోసమైతే వ్యాలీడ్ డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటుగా ఆదాయ, కుల, విద్యా ధృవీకరణ పత్రాలు, రేషన్ కార్డ్, ఆధార్, బ్యాంక్ పాసుపుస్తకాల నకళ్లతో దరఖాస్తులు చేసుకోవాలని నాగార్జున వివరించారు. అర్హులైన వారు తమ దరఖాస్తులను ఆయా జిల్లాలకు చెందిన ఎస్సీ కార్పొరేషన్ ఇ.డి.లకు తమ దరఖాస్తులను సమర్పించాలని కోరారు. ఈ పథకాల మంజూరు లో పరిమితి లేదని అర్హులైన వారందరికీ వీటిని మంజూరు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. చదవండి: ‘ఎన్టీఆర్ హయాంలో రామోజీతో ఇలాంటి ప్రచారమే!’.. ప్రసన్నకుమార్‌రెడ్డి ఫైర్ -
మార్గదర్శి అక్రమాల డొంక కదలడంతో రామోజీరావు బెంబేలు
సాక్షి, అమరావతి: మార్గదర్శి అక్రమాల డొంక కదిలి ప్రధాన ముద్దాయిగా నిరూపణ అయ్యే పరిస్థితి రావడంతో రామోజీరావు బెంబేలెత్తుతున్నాడని, అందుకే ‘దళితులపై దమనకాండ’ అంటూ ‘ఈనాడు’లో అడ్డగోలు రాతలు రాస్తున్నాడని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున నిప్పులు చెరిగారు. ఆయన మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ ‘దొంగ బాబుకు మద్దతుగా గజదొంగ రామోజీ తన రాతలతో వెర్రి కూతలు కూస్తున్నాడు. ముసుగు దొంగలైన వీరిద్దరికీ ఇబ్బంది వస్తే దళితులు గుర్తొస్తారు. గతంలో కాల్‌మనీ సెక్స్ రాకెట్‌ను పక్కదారి పట్టించేందుకు అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటును చంద్రబాబు తెరమీదకు తెచ్చారు. ఇప్పుడు మార్గదర్శి కేసును మళ్లించేందుకు దళితులపై దమనకాండ అంటూ రామోజీ రాస్తున్నారు. రామోజీకి ఈనాడు పేపర్ పెట్టుకున్న ఇన్నేళ్లకు దళితులు గుర్తుకొచ్చారా? చంద్రబాబు హయాంలో ఎస్సీ, ఎస్టీలపై దాడులు, వెలివేతలు జరిగితే ఈనాడుకు ముచ్చటగా అనిపించాయా? జెర్రిపోతులపాలెంలో దళిత మహిళను వివస్త్రను చేసినా ఎందుకు రాయలేదు? అచ్చెన్నాయుడు మహిళను కాలితో తంతే ఏం చేశారు? గరగపర్రులో దళితుల వెలివేత, కారంచేడులో దళితులపై మారణహోమం జరిగినప్పుడు ఎందుకు రాయలేదు? నాడు దళితులపై జరిగిన దమనకాండకు కారకులైన నీ సొంత సామాజికవర్గం గురించి ఇప్పుడు రాయొచ్చు కదా రామోజీ’ అంటూ ప్రశ్నించారు. ‘ఫిల్మ్ సిటీ కోసం దళితుల భూముల్ని కబ్జా చేసినట్లు రామోజీపై ఇప్పటికీ కోర్టుల్లో కేసులు ఉన్నాయి. దళితులను మోసం చేసిన రామోజీ ఇప్పుడు చంద్రబాబుకు రాజకీయ పట్టం కట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించవు. బాబు హయాంలో ఐదేళ్లలో ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి రూ.33,625.49 కోట్లు ఖర్చు చేసినట్లు లెక్కల్లో చూపితే దానిలో దేనికోసం ఖర్చుచేశారో? అవినీతి ఎంత జరిగిందో రాసే దమ్ము రామోజీకి ఉందా? అదే వైఎస్సార్సీపీ ప్రభుత్వం మూడున్నరేళ్లలో దళితుల సంక్షేమానికి రూ.51,293 కోట్లు ఖర్చు చేసింది. డీబీటీ ద్వారా పైసా అవినీతి లేకుండా నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి నిధులు జమయ్యాయి. ఈ మంచిపై రాయడానికి రామోజీకి చేతులు కదలడంలేదు. బాబు హయాంలో దళితులకు జరిగిన అన్యాయం, సీఎం జగన్ పాలనలో జరుగుతున్న న్యాయంపై చర్చకు మేము సిద్ధం’ అని మంత్రి సవాల్ విసిరారు. తప్పు చేసింది కాబట్టే ఎమ్మెల్యే శ్రీదేవికి భయం రాజకీయాల్లో అవకాశం కల్పిం చిన సీఎం జగన్‌ను, వైఎస్సార్సీపీని మోసం చేసింది కాబట్టే తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి భయపడుతోందని మంత్రి అన్నారు. చంద్రబాబు ఉచ్చులో చిక్కుకున్న ఆమె హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టి చంద్రబాబు స్క్రిప్టు చదువుతోందన్నారు. -
‘కదులుతున్న ‘మార్గదర్శి’ అక్రమాల డొంక.. రామోజీ బెంబేలు’
సాక్షి, అమరావతి: మార్గదర్శి అక్రమాల డొంక కదలడంతో రామోజీ బెంబేలెత్తుతున్నారని.. అందుకే దళితులపై దమనకాండ అంటూ ‘ఈనాడు’ అడ్డగోలు రాతలు రాస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘‘మార్గదర్శి కేసులో ప్రధాన ముద్దాయి రామోజీరావు. ఆ కేసు నుంచి తప్పించుకునేందుకే ప్రభుత్వంపై బురదజల్లే రాతలు. ప్రజల్ని మభ్యపెట్టాలనుకుంటే రామోజీకి పరాభవం తప్పదు. బాబు, రామోజీ ముసుగు దొంగలు’’ అంటూ మంత్రి ధ్వజమెత్తారు. ‘‘దళితులపై దమనకాండ జరిగింది బాబు హయాంలోనే.. దళితులను అడ్డుపెట్టుకుని మా ప్రభుత్వంపై బురదచల్లుతావా?. టీడీపీ హయాంలో కారంచేడు, దళితుల ఊచకోత ఘటనలపై రామోజీ ఎందుకు కథనాలు రాయలేదు..?. గరగపర్రులో దళితుల వెలివేత, పెందుర్తిలో దళిత మహిళను వివస్త్రను చేసిన ఘటనలు రామోజీ కళ్లకు కనిపించలేదా?. అచ్చెన్న మహిళను కాలితో తంతే.. మీకు ముచ్చటగా అనిపించిందా..?. సీఎం జగన్ పాలనలో దళితులకు జరుగుతున్న మేలు రామోజీకి అట్రాసిటీగా కనిపిస్తుందా..? ఫిల్మ్ సిటీలో దళితుల భూములను కొట్టేసింది రామోజీనే’’ అంటూ మంత్రి నాగార్జున దుయ్యబట్టారు. మంత్రి నాగార్జున ఇంకా ఏమన్నారంటే..: రామోజీ.. ఇవేనా జర్నలిజం విలువలు..? రామోజీరావు, ఈనాడు పేపర్ పెట్టుకున్న తర్వాత ఇన్నేళ్లకు దళితులు గుర్తుకొచ్చారా..? ఈరోజు రాష్ట్రంలో దళితులపై దాడులు పెరుగుతున్నట్లు కథనాలు రాయడానికి ఆయనకు సిగ్గుందా..? అని అడుగుతున్నాను. చంద్రబాబు హయాంలో దళితులపై ఏ విధంగా దాడులు, అఘాయిత్యాలు, వెలివేతలు, జెర్రిపోతులపాలెంలో దళిత మహిళను వివస్త్రను చేసిన సంఘటనలపై కథనాలను ఎందుకు రాయలేదు రామోజీ..? ఇదేనా మీ జర్నలిజం విలువలు..?. కారంచేడులో దళితులపై దాడులు జరిగినప్పుడు.. అప్పుడు జరిగిన అగ్రవర్ణాల అహంకారం గురించి ఈనాడు ఎందుకు రాయలేదు..? ఆరోజు దళితులపై జరిగిన దమనకాండకు కారకులైన వారి గురించి ఇప్పుడు రాయొచ్చు కదా.. రామోజీరావు సొంత సామాజికవర్గానికి చెందిన వారు దళితులపై మారణకాండ జరుపుతున్నప్పుడు .. ఇది తప్పు అని ఎందుకు రాయలేదు..? అని ప్రశ్నిస్తున్నాను. బాబు, రామోజీ ముసుగుదొంగలు ఎందుకంటే.. తన రాతలతో చంద్రబాబుకు రాజకీయంగా లబ్ధి జరగాలి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని, ఈనాడు ముసుగులో నువ్వు వ్యాపారాలు చేయాలి. మార్గదర్శి ఎవరిది..? అందులో వ్యాపార భాగస్వాములు ఎవరు..? ఎవరి డబ్బులతో రామోజీరావు వ్యాపారం చేస్తున్నాడు. మార్గదర్శి చిట్ ఫండ్స్ అక్రమాల కేసులో.. ప్రస్తుతం సీఐడీ ఇప్పటికే నలుగుర్ని అరెస్టు చేశారు. రేపు మార్గదర్శి కేసులో ఈనాడు రామోజీరావు ప్రధాన ముద్దాయి అవుతున్నాడని .. ప్రభుత్వం మీద అక్కసు వెళ్ళగక్కుతున్నాడు. అందుకే, ఇప్పుడు దళితులపై దాడులంటూ.. తప్పుడు కథనాలు రాస్తున్నాడనేది పచ్చి నిజం. మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అక్రమాల డొంక కదిలేకొద్దీ.. రామోజీకి బుర్ర పనిచేయడం లేదు. మార్గదర్శి చిట్ ఫండ్ పేరుతో.. జనం సొమ్మును తన వేరే వ్యాపారాలకు విస్తరించి, చిట్స్ వేసిన ఖాతాదారుల జీవితాలతో చెలగాటమాడుతున్నది రామోజీనే. రామోజీ చిట్స్- చీటింగ్ బాగోతాన్ని సీబీసీఐడీ అధికారులు తవ్వి తీస్తుంటే.. ఆయనకు, ఆయనకు వకాల్తా పలుకుతున్న చంద్రబాబు, దుష్ట చతుష్టయానికి కడుపు రగిలిపోతుంది. ఫిల్మ్ సిటీలో దళితుల భూములు కొట్టేసిన రామోజీరావు రామోజీఫిల్మ్‌సిటీ నిర్మాణానికి సంబంధించి దళితుల భూముల్ని కబ్జా చేసినట్లు రామోజీరావుపై పలు కేసులు ఉన్నాయి. ఆ కేసులు ఇప్పటికీ కోర్టుల్లో నడుస్తూనే ఉన్నాయి. ఇవన్నీ పక్కనబెట్టి ఈరోజు దళితులపై ప్రేమ పుట్టుకొచ్చినట్లు, ఈ రాష్ట్రంలో ఎవరో దళిత డాక్టర్లపై దాడులు జరుగుతున్నట్లు తప్పుడు రాతలతో నీచమైన మనస్తత్వాన్ని రామోజీరావు ప్రదర్శిస్తున్నారు. ఇది చాలా సిగ్గుచేటు. ఇటువంటి దౌర్భాగ్యపు రాతలతో చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్ లకు రాజకీయంగా పట్టం కట్టాలనుకుంటే వారి ప్రయత్నాలు ఫలించేదే లేదు. రాజకీయాల్లో చంద్రబాబు ఒక దొంగ అయితే.. ఆయన్ను భుజానెత్తుకుని విషపురాతలు రాసే రామోజీరావేమో గజదొంగ అని చెప్పుకోవాలి. ఇప్పటికైనా ప్రజల్ని మభ్యపెట్టే రాతలు మానుకోకపోతే ఈనాడు రామోజీరావుకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరిస్తున్నాను. చంద్రబాబు హయాంలో దళితులపై అరాచకాలు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు దళితులు అలో లక్ష్మణా.. అంటూ కన్నీరుమున్నీరయ్యారు. ఎస్సీ, ఎస్టీలపై ఇష్టానుసారంగా దాడులు, అఘాయిత్యాలు జరిగినప్పుడు పోలీసుస్టేషన్ల చుట్టూ తిరిగి కేసులు పెట్టమని రోధిస్తే ఏ ఒక్కడూ పట్టించుకున్న దాఖలాల్లేవు. అచ్చెన్నాయుడు మహిళను కాలుతో తంతే ఎందుకు కేసు పెట్టలేదు..? గరగపర్రులో దళితులు వెలివేత కేసు ఏంచేశారు..? పెందుర్తిలో దళిత మహిళను వివస్త్రను చేసిన కేసుకు సంబంధించి పెందుర్తి పోలీసుస్టేషన్ ముందు ధర్నాకు దిగితే.. ఆ కేసుల్ని ఏం చేశారు..? వాటిని ఎందుకు అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు..? ఈ ఘటనలపై ఈనాడులో వరుస కథనాలు ఎందుకు రాయలేదో.. రామోజీరావు సమాధానం చెప్పాలి..? ఇవన్నీ ఈనాడుకు ముచ్చటగా అనిపించాయా..? దళితుల మేలుపై చర్చకొస్తారా..? రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో సుభిక్షమైన పరిపాలన జరుగుతోంది. రాజ్యాంగ బద్ధంగా, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచనా విధానంతో సుభిక్షమైన పరిపాలన అందజేస్తుంటే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంతా సంక్షేమపథకాలతో సంతోషంగా ఉన్నారు. కొన్ని దశాబ్దాల తర్వాత దళితుల ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం గురించి మంచిగా ఆలోచించే ముఖ్యమంత్రి వచ్చారని వైఎస్ జగన్‌ని ప్రతీ పేదోడి ఇంట్లో దేవుడుగా కొలుస్తూ ఉన్నారు. ఇది చంద్రబాబుకు, రామోజీరావుకు కన్నుకుట్టే విషయమైంది. దళితుల రక్షణకు, వారి మేలుకు మేం బాధ్యతగా పనిచేస్తున్నామని దమ్ముగా చెబుతున్నాను. అడ్డగోలు రాతలకు, నీచమైన రాతలకు ఈనాడు వేదికగా ఉంది. దళితులకు ఎవరి హయాంలో ఏం మేలు జరిగిందో... మీరు చర్చకు రాగలరా..? అట్రాసిటీ అంటే అర్ధమేంటి..? ఈనాడు మాత్రం ‘దళితులపై దమనకాండ’ అంటూ విషప్రచారానికి పూనుకుంటుంది. అసలు అట్రాసిటీ అంటే రామోజీరావు దృష్టిలో ఏంటి..? రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఇంగ్లీషుమీడియం తీసుకొచ్చి పేదపిల్లలకు చదువు చెప్పడాన్ని అట్రాసిటీ అంటారా..? రాజధాని ప్రాంతంలో భూముల్ని పేదలకు ఇస్తామంటే.. ఇస్తే డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందని టీడీపీ అడ్డుకోవడాన్ని అట్రాసిటీ అంటారా..? కొన్ని లక్షల కోట్లు డీబీటీ రూపంలో దళితులకు సంక్షేమపథకాల కింద నేరుగా మా ప్రభుత్వం అందజేస్తుంటే అది అట్రాసిటీనా..?. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 68శాతం రాజకీయ పదవులిచ్చి అత్యున్నత స్థానాల్లో నిలబెట్టడాన్నిరామోజీరావుకు అట్రాసిటీగా కనిపిస్తున్నాయా.?. పేదోడికి గూడును కల్పిద్దామని.. వారికి ఉచితంగా ఇంటి స్థలమిచ్చి రుణసాయంతో ఇల్లు నిర్మించడమే కాకుండా వారికి ఉపాధిచూపాలని తపనపడే ప్రభుత్వం మీకు అట్రాసిటీకి పాల్పడుతున్నట్లు కనిపిస్తుందా..? పేదవాళ్లకు సాయం చేయడం అనేది నీకు, నువ్వు అండగా ఉండే నీ నాయకుడు చంద్రబాబుకు చేతగాదు. పేదవాళ్లను అక్కునజేర్చుకుని భావితరాల భవిష్యత్తుకోసం మా ప్రభుత్వం గొప్ప పరిపాలన అందిస్తుంటే.. అది రామోజీరావుకు అట్రాసిటీగా కనిపిస్తుందా..? దళితులకు ‘బాబు’చేసిన మోసం గురించి ఎందుకు రాయవు..? చంద్రబాబు హయాంలో ఐదు ఏళ్లలో, ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి రూ.33,625.49 కోట్లు ఖర్చు చేసినట్లు లెక్కల్లో చూపితే.. ఆ డబ్బు దళితులకు దేనికోసం ఖర్చుచేశారో.. అందులో అవినీతి ఎంత జరిగిందో.. ఎంతమంది చేతులు మార్చుకున్నారో.. ఈ కుంభకోణాలపై కథనాలు రాసే దమ్ము రామోజీరావుకు ఉందా..? అని అడుగుతున్నాను. అదే మా వైస్సార్సీపీ ప్రభుత్వం మూడున్నరేళ్ల పాలనలో ఫిబ్రవరి మాసాంతానికి దళితుల సంక్షేమానికి రూ.51,293 కోట్లు ఖర్చుచేశాం. డీబీటీ ద్వారా ఒక్క పైసా అవినీతి లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులు జమ అయితే.. వీటిమీద రాతలు రాయడానికి చేతులు కదలడం లేదా రామోజీరావు..? అని అడుగుతున్నాను. చదవండి: లోకేష్‌కు ఆ సంగతి తెలిసినా.. తెలియనట్లు నటిస్తున్నారా? -
ఉండవల్లి శ్రీదేవి వ్యాఖ్యలపై మంత్రి మేరుగ నాగార్జున రియాక్షన్
సాక్షి, అమరావతి: వెనుకబడిన వర్గాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెన్నుదన్నుగా ఉంటున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. మంగళవారం ఆయన తాడేపల్లిలో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘‘పచ్చ పత్రికలో పిచ్చి రాతలు మానుకోవాలని హితవు పలికారు. ఎమ్మెల్యే శ్రీదేవి టీడీపీ లైన్లో నడుస్తున్నారు. చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారం ఆమె మాట్లాడుతున్నారు’’ అని మంత్రి దుయ్యబట్టారు. ‘‘తప్పుడు రాతలతో ప్రజలను మభ్యపెట్టొద్దు. ప్రజలంతా సీఎం జగన్ వెంటే ఉన్నారు. ఉండవల్లి శ్రీదేవి చంద్రబాబు ట్రాప్‌లో పడ్డారు. ఆమె హైదరాబాద్‌లో కూర్చుని మాపై విమర్శలు చేస్తోంది. మా పార్టీ నాయకుడి చెమట చుక్కలతో గెలిచావ్. మాట్లాడితే దళిత మహిళనంటావ్. నువ్వు తప్పు చేసి దళిత మహిళనంటే సరిపోతుందా. ఏం తప్పుచేశావ్.. నియోజకవర్గంలో నువ్వేం చేశావో అందరికీ తెలుసు. శ్రీదేవి తప్పు చేసి సమర్థించుకునే యత్నం చేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారో ఆమెకే అర్థం కావట్లేదు. తప్పు చేసిన వారు ప్రాయశ్చిత్తం చేసుకోక తప్పదు’’ అని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. చదవండి: చంద్రబాబు, అచ్చెన్నా, బాలకృష్ణకు మంత్రి రోజా సవాల్ -
చంద్రబాబు పాలనలో అరాచకాలు తప్ప అభివృద్ధి లేదు: మంత్రి మేరుగ నాగార్జున
-
సీఎం జగన్ మాటలతో కాదు చేతల్లో చేసి చూపించారు
-
జీవో నెం.1ను రాజకీయ కోణంలో చూడొద్దు: మంత్రులు
సాక్షి, విజయవాడ: డా.బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం పనులు పీడబ్ల్యూడీ గ్రౌండ్లో చకచకా సాగుతున్నాయి. ఈ పనులను మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సురేష్ మీడియాతో మాట్లాడుతూ, జీవో నెం.1ను రాజకీయ కోణంలో చూడొద్దన్నారు. ఇరుకు సందుల్లో సభలు, సమావేశాలు పెట్టేవారి కోసం జీవో తీసుకొచ్చాం. సభల పేరుతో కందుకూరు, గుంటూరులో 11 మంది బలి తీసుకున్నారని మంత్రి సురేష్ అన్నారు. జీవోకు కట్టుబడి ఉన్నాం: మేరుగ నాగార్జున మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ, పేద ప్రజల ప్రాణాల రక్షణకే ప్రభుత్వం జీవో నెం.1 తెచ్చిందని, జీవోకు మేం కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. పేద ప్రజల జీవనాన్ని న్యాయస్థానాలు గమనించాలన్నారు. పేదల కోసం జీవితంలో ఒక్కసారైనా చంద్రబాబు ఆలోచించారా? అంటూ మంత్రి నాగార్జున దుయ్యబట్టారు. అడగకుండానే విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. దేశ చరిత్రలో ఇలాంటి సాహసం ఎవరూ చేయలేదు. విగ్రహం కోసం 300 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఏప్రిల్ 14 న అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరిస్తామని నాగార్జున వెల్లడించారు. చదవండి: టీడీపీ మాజీ ఎంపీ కుటుంబానికి పథకాల లబ్ధి రూ.45,702