సాక్షి, తాడేపల్లి: ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు ఎన్ని రకాలుగానైనా మాట్లాడతారని, అప్పట్లో ప్రత్యేక హోదా సంజీవినా అన్న మాటలు ప్రజలు మర్చిపోలేదని మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘ప్యాకేజీ ఇస్తున్నారంటూ కేంద్ర పెద్దలను సన్మానించిన సంగతి కూడా అందరికీ గుర్తుంది. ఇప్పుడు ఏ మొఖం పెట్టుకుని మళ్లీ మాటలు మార్చుతారు?’’ అంటూ దుయ్యబట్టారు.
‘‘టీడీపీ ఎప్పుడో ఖాళీ అయ్యింది. ఇక ఆ పార్టీలోకి ఎవరు వెళ్తారు. టీడీపీ మునిగిపోయే పడవ. ఒంటరిగా పోటీ చేసే దమ్ము చంద్రబాబుకు లేదు. అందుకే పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారు. చంద్రబాబు భవిష్యత్తుకే గ్యారెంటీ లేదు.. ప్రజలకు ఆయనేం షూరిటీ ఉంటారు?’’ అంటూ మంత్రి ఎద్దేవా చేశారు.
చదవండి: అయ్యో లక్ష్మీపార్వతి.. ‘రాబంధు’వుల రాజకీయం ఇది!
Comments
Please login to add a commentAdd a comment