‘ఇదేం దుర్మార్గం చంద్రబాబూ.. రాజధానిలో పేదలు ఉండొద్దంటే ఎలా?’ | Ex Minister Merugu Nagarjuna Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

‘ఇదేం దుర్మార్గం చంద్రబాబూ.. రాజధానిలో పేదలు ఉండొద్దంటే ఎలా?’

Published Tue, Aug 6 2024 3:34 PM | Last Updated on Tue, Aug 6 2024 5:03 PM

Ex Minister Merugu Nagarjuna Comments On Chandrababu

గుంటూరు, సాక్షి: రాజధాని ప్రాంతంలో పేదలు ఉండకూడదనే చంద్రబాబు ఆలోచన అంటూ మాజీ మంత్రి మేరుగ‌ నాగార్జున మండిపడ్డారు. పేద రైతుల నుంచి పొలాలు తీసుకుని అదే పేదలు ఉండొద్దంటే ఎలా?. రాజధానిలో పేదలు ఉంటే ఇబ్బంది ఏంటి? అని ప్రశ్నించారు.

తాడేపల్లిలోని వైఎస్‌ జగన్‌ క్యాంప్‌ కార్యాలయంలో మీడియా సమావేశాల కోసం ప్రత్యేకంగా రూమ్‌ను సిద్దం చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన మీడియా రూమ్‌ను శాసనమండలిలో ప్రతిపక్షనేత లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, గుంటూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు మందపాటి శేషగిరిరావు మంగళవారం ప్రారంభించారు.

అనంతరం మాజీ మంత్రి మేరుగ నాగార్జున మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘‘పేదలకు ఇచ్చిన స్థలాలను చంద్రబాబు రద్దు చేయడం ఏంటి? అంటూ నిలదీశారు. అధికారంలోకి వచ్చాక అందరిని సమన్యాయం చేయాలని హితవు పలికారు. కులాలు,మతాలకు అతీతంగా వైఎస్‌ జగన్‌ సంక్షేమ పథకాలు అందిచ్చారు. చంద్రబాబు రెండు నెలల పాలన చూస్తేనే ఏం జరగబోతుందో అర్థమవుతోంది. జరుగుతున్న పరిణామాలన్నీ ప్రజలు గమనిస్తున్నారు’’ మేరుగ నాగార్జున చెప్పారు.

‘‘రాష్ట్రంలో దాడులు పెట్రేగిపోతున్న చంద్రబాబు పట్టించుకోవడంలేదు. దాడులు నివారించే ఆలోచనే చంద్రబాబుకు లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో దాడులు మంచిదికాదు. మా పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాం’’ అని మేరుగ నాగార్జున  భరోసా ఇచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement