సాక్షి, విజయవాడ: ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనాను మంత్రి మేరుగు నాగార్జున, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి మంగళవారం కలిశారు. హైదరాబాద్‌లో టీడీపీ ఆధ్వర్యంలో ఏపీ ఓటర్ల రిజిస్ట్రేషన్ చేయడంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి వైఎస్సార్‌సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. తెలంగాణలో ఓటు వేసిన వారు ఏపీలో ఓటు వేయకుండా కలెక్టర్లకు ఆదేశాలివ్వాలని ఎన్నికల ప్రధానాధికారిని కోరారు.
చంద్రబాబు వ్యవస్థలు మేనేజ్ చేయడంలో సిద్ధహస్తుడు: మంత్రి మేరుగు
అనంతరం మంత్రి మేరుగు నాగార్జున మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు వ్యవస్థలు మేనేజ్ చేయడంలో సిద్ధహస్తుడని, ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు టీడీపీ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. హైదరాబాద్‌లో ఓటు వేసిన వారు ఏపీలో ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. హైదరాబాద్‌లో చంద్రబాబు ఆధ్వర్యంలో ఏపీ న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. హైదరాబాద్ ప్రగతినగర్‌లో బ్యానర్లు కట్టి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. సిగ్గులేకుండా పక్క రాష్ట్రంలో బ్యానర్లు కట్టి ఓట్లు రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. మాజీ మంత్రి ఉమా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి’’ అంటూ మంతి మేరుగ మండిపడ్డారు.
ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు టీడీపీ కుట్రలు: మల్లాది విష్ణు
ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు టీడీపీ కుట్రలు చేస్తుందని, వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు.
స్థిర నివాసం ఉన్నచోటే ఓటు హక్కు కల్పించాలి: లేళ్ల అప్పిరెడ్డి
లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ, స్థిర నివాసం ఉన్నచోటే ఓటు హక్కు కల్పించాలని సీఈవోను కోరాం. తెలంగాణ ఓట్లను ఏపీలో మార్చడానికి సిగ్గులేదా?. ఎన్నికల ప్రక్రియలో ఎక్కడా వాలంటీర్లను ఉపయోగించడం లేదు. మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ టీడీపీ కండువా వేసుకుని మాట్లాడితే బాగుంటుంది’’ అంటూ అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. చదవండి: ‘మిచౌంగ్’ దెబ్బ.. ఇలా వచ్చి.. అలా ముంచేసింది
Comments
Please login to add a commentAdd a comment