Chief Electoral Officer
-
Watch Live: ఏపీ ఎన్నికల ఫలితాలపై సీఈఓ ముకేశ్ కుమార్ కీలక ప్రెస్ మీట్
-
ఫలితాల రోజు ఈసీ పెట్టిన రూల్స్ పై పేర్నినాని రియాక్షన్
-
KSR Live Show: మరో నిమ్మగడ్డలా ముకేశ్ కుమార్ మీనా
-
పటిష్ట ఏర్పాట్లు చెయ్యాలి.. సీఈఓ ముకేశ్ కుమార్ మీనా
-
పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రం వీడియో లీక్‌తో ఎన్నికల సంఘానికి సంబంధం లేదు... ఆంధ్రప్రదేశ్ సీఈవో ముకేష్ కుమార్ మీనా స్పష్టీకరణ.. ఇంకా ఇతర అప్డేట్స్
-
తెలంగాణ వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది -వికాస్ రాజ్
-
పెరిగిన ఓటు శాతం కేటగిరీల వారీగా..!
-
ఏపీ ఎన్నికలపై సీఈఓ ముకేశ్ కుమార్ కీలక ప్రెస్ మీట్
-
ఏపీలో తుది పోలింగ్ శాతంపై సాయంత్రానికి క్లారిటీ: ఎంకే మీనా
సాక్షి, అమరావతి: ఏపీలో తుది పోలింగ్ శాతంపై ఎన్నికల కమిషన్ లెక్కలు తేలుస్తోంది. జిల్లాల నుంచి వచ్చిన సమాచారాన్ని ఈసీ వర్గాలు క్రోడీకరిస్తున్నాయి. ఈసారి పోలింగ్ 80 శాతం దాటే అవకాశం ఉంది. నేటి సాయంత్రానికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాగా రాష్ట్రంలో 81శాతం పోలింగ్ నమోదు కావొచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా తెలిపారు. ఈ ఎన్నికల్లో రాత్రి 12 వరకు 78.25 శాతం నమోదైనట్లు అంచనా వేస్తున్నట్లు తెలిపారు. 1.2 శాతం పోస్టల్ బ్యాలెట్‌తో కలుపుకొని 79.40 శాతం పోలింగ్ నమోదైందని ఎంకే మీనా పేర్కొన్నారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 2 గంటల వరకూ పోలింగ్ జరిగిందని అన్నారు. పోలింగ్ పర్సంటేజ్‌పై సాయంత్రానికి పూర్తి వివరాలు వస్తాయని చెప్పారు. అయితే 2019 ఎన్నికల్లో 79.64 శాతం పోలింగ్ నమోదైందని పేర్కొన్నారు. -
ఏపీలో పోలింగ్ శాతం పెరిగింది: ఏపీ సీఈవో
సాక్షి, విజయవాడ: ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్దసంఖ్యలో పోలింగ్ నమోదైందని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేశామని చెప్పారు.పల్నాడులో 12 చోట్ల ఘర్షణలు జరిగాయి. పల్నాడులో ఒక చోట ఈవీఎంను ధ్వంసం చేశారు. ఈవీఎంలోని చిప్‌లో డేటా భద్రంగా ఉంది. ఈవీఎంలను మార్చి మళ్లీ పోలింగ్ ప్రారంభించాం. కొన్ని చోట్ల ఇంకా పోలింగ్ కొనసాగుతోంది. అన్నమయ్య జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. అక్కడ మిషన్లు మార్చి పోలింగ్ పునరుద్ధరించాం. పల్నాడు, అనంతపురం, తెనాలిలో కొందరిని గృహ నిర్బంధం చేశారు’’ అని ఏపీ సీఈవో వెల్లడించారు.11 చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేశారు. ఎక్కడా రీ పొలింగ్ అవసరం పడలేదు. కొన్ని ఘర్షణలు జరిగినా కట్టడి చేశాం. ఇప్పటివరకు 75 శాతం పోలింగ్ నమోదైంది. స్ట్రాంగ్ రూమ్‌లోకి ఈవీఎంల తరలింపు జరుగుతుందని ఎంకే మీనా వెల్లడించారు. -
సోమవారం సెలవు ఇవ్వని సంస్థలపై చర్యలు: టీఎస్ సీఈవో
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల పోలింగ్ రోజు (మే13)న అన్ని కంపెనీలు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని, నిబంధనలు పాటించని సంస్థలపై చర్యలుంటాయని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ హెచ్చరించారు. జూన్ 1న సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం ఉందని తెలిపారు.బందోబస్తు కోసం కేంద్ర బలగాలతో పాటు, 60 వేల మంది రాష్ట్ర పోలీసులు విధుల్లో ఉంటారని వికాస్‌రాజ్ వెల్లడించారు. తనిఖీల్లో ఇప్పటివరకు రూ.320 కోట్ల విలువైన సొత్తు సీజ్ చేశామని, తనిఖీలకు సంబంధించి 8 వేలకు పైగా కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 1.88 లక్షల మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారన్న సీఈవో వికాస్‌రాజ్.. పోలింగ్ సమయం దగ్గర పడటంతో నిఘా మరింత పెంచామని తెలిపారు. -
కన్ఫ్యూజ్ చేయబోయి బొక్కబోర్లా పడ్డారు
కన్విన్స్ చేయడం చేతగానపుడు ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం సులువు.. ఇది చంద్రబాబు దశాబ్దాల నుంచి అమలు చేస్తున్న కుట్ర.. తన పాలనా గురించి,. తాను చేసిన అభివృద్ధి గురించి ఏనాడూ ఎప్పుడూ చెప్పుకోలేని చంద్రబాబు..ఎన్నికల సమయంలో అవతలి పార్టీవల్ల మీద దుమ్మెత్తిపోసి ప్రజలను గందరగోళపరిచి లభ్ది పొందుతూ ఎన్నికల్లో గట్టెక్కుతూ వస్తున్నారు. ఇప్పుడు కూడా తాను గత ఐదేళ్ళలో ఏమి చేసిందీ చెప్పుకోలేని చంద్రబాబు సీఎం వైఎస్ జగన్ పాలనలోని గొప్పతనాన్ని గుర్తించే మనసులేక.. ఏకంగా లేని చట్టాన్ని చూపించి ప్రజలను భయపెట్టాలని చూశారు.కేవలం ల్యాండ్ టైట్లింగ్ చట్టం అనే అంశాన్ని చూపించి ప్రజలను భయపెట్టి లబ్ధిపొందాలన్నది చంద్రబాబు కుట్రగా తెలుస్తోంది... ఈ క్రమంలో అయన కొంతమంది కార్యకర్తలు, యువత, రైతులను డబ్బులిచ్చి జనంలోకి పంపించి ఆ చట్టం పేరిట జనాన్ని భయపెట్టాలని చూాశారు. దీంతోబాటు TDP ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా జగన్‌పై, ప్రభుత్వం మీద దుష్ప్రచారం మొదలు పెట్టారు. దీంతోబాటు ప్రజల భూములను ప్రభుత్వం లాక్కోవాలని చూస్తోందని దుష్ప్రచారం మొదలు పెట్టింది. ప్రజలకు లక్షల ఎకరాల అటవీ భూములు, చుక్కల భూములకు సంబంధించి ప్రజలకు శాశ్వత హక్కులు కల్పించిన జగన్ తిరిగి ప్రజల భూములు లాక్కోవడం ఏమిటన్న చర్చ జనంలోకి వచ్చింది. తెలుగుదేశం అనుకూల మీడియా కూడా కేవలం ఇదే అంశాన్ని రాస్తూ..టీవీల్లో...చూపిస్త్తూ ప్రజలను భయపెట్టేందుకు ప్రయతించింది. దీంతో ఈ తప్పుడు ప్రచారాన్ని ఆపాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్‌ను కలిసి టీడీపీ తీరుమీద ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదులో బలం ఉందని గ్రహించిన ఎన్నికల కమిషన్ ఇక ముందు ఈ చట్టం గురించి ఇష్టానుసారం మాట్లాడుతున్నవాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారని రాష్ట్ర సీబీసీఐడీని సైతం ప్రశ్నించింది.. దీంతో తెలుగుదేశం వారి గొంతులో వెలక్కాయపడినట్లు అయింది.. సీఐడీ ని ఎన్నికల సంఘం ఆదేశించడం ఆంటే అందులో నిజం ఉన్నట్లే... ఇకముందు నోటికొచ్చినట్లు మాట్లాడితే కేసులు తప్పవని ఈసీ ఆదేశాలతో టీడీపీ వాళ్లకు అర్థం ఐంది.-సిమ్మాదిరప్పన్న -
ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
భోపాల్: లోక్‌సభ ఎన్నికల రెండు దశలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇదివరకు నమోదైన విధంగా తక్కువ ఓటింగ్ శాతాన్ని పరిష్కరించడానికి లేదా ఓటింగ్ శాతాన్ని పెంచుకోవడానికి భోపాల్‌లోని అధికారులు ఓ కొత్త వ్యూహాన్నిరూపొందించారు. ఓటు ప్రాముఖ్యతను గుర్తించి.. ఓటర్లను ఆకర్శించడానికి (ఓటు హక్కును వినియోగించుకోవడానికి) లక్కీ డ్రా నిర్వహించడానికి అధికారులు కంకణం కట్టుకున్నారు.మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే 13 ఎంపీ స్థానాలకు ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది. మిగిలిన స్థానాలకు మూడు, నాలుగవ దశల్లో ఓటింగ్ జరగనుంది. ఈ దశల్లో ఓటర్లను ఎక్కువ సంఖ్యలో ఆకర్శించడానికి పోలింగ్ రోజు ప్రతి రెండు గంటలకు ఒక లక్కీ డ్రా నిర్వహించడానికి అధికారులు సంకల్పించారు.లక్కీ డ్రాలో డైమండ్ రింగ్స్, రిఫ్రిజిరేటర్లు, టెలివిజన్ వంటి ఆకర్షణీయమైన బహుమతులు అందించనున్నారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో మధ్యప్రదేశ్ అంతటా 8.5 శాతం ఓటింగ్ తగ్గింది. 2019 ఎన్నికలలో కూడా ఓటింగ్ శాతం 65.7% మాత్రమే. ఈ సారి మాత్రం ఓటు హక్కును తప్పకుండా అందరూ ఉపయోగించుకోవాలని అనే నేపథ్యంలో ఈ లక్కీ డ్రా విధానం ప్రవేశపెట్టారు.జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కౌశలేంద్ర విక్రమ్ సింగ్ ఈ లక్కీ డ్రా గురించి మాట్లాడుతూ.. పోలింగ్ రోజు ప్రతి బూట్ వద్ద ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు, సాయంత్రం 6 గంటలకు లక్కీ డ్రాలో విజేతలను ప్రకటిస్తాము. ఎన్నికలు పూర్తయిన ఒకటి లేదా రెండు రోజుల్లో వారికి గిఫ్ట్స్ ఇచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఓటరులో చైతన్యాన్ని తీసుకురావడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని కౌశలేంద్ర పేర్కొన్నారు.భోపాల్ పార్లమెంటరీ నియోజకవర్గం 2,097 పోలింగ్ బూత్‌లను కలిగి ఉంది. పోలింగ్ రోజున ప్రతి పోలింగ్ బూత్ వద్ద ఒక వాలంటీర్‌ను నియమిస్తారు. ఓటు వేసిన తరువాత ఓటరు పేరు, మొబైల్ నెంబర్ రాసి వారి దగ్గర ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తరువాత జరిగే లక్కీ డ్రాలో విజేతలను ఎంపిక చేయడం జరుగుతుంది.#SVEEP के अंतर्गत 'राज्य स्तरीय स्लोगन प्रतियोगिता' ▶️प्रविष्टि भेजने की अंतिम तिथि आज ▶️“प्रत्येक वोट जरूरी है” विषय पर लिखें स्लोगन और जीतें आकर्षक पुरस्कार ➡️प्रविष्टि भेजने के लिए विजिट करें 👇https://t.co/ZX4TawpjyZ @rajivkumarec @ECISVEEP @SpokespersonECI pic.twitter.com/f4CSpBaKDK— Chief Electoral Officer, Madhya Pradesh (@CEOMPElections) April 30, 2024 -
AP: నారా భువనేశ్వరికి ఎన్నికల సంఘం నోటీసులు
సాక్షి, గుంటూరు: ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి వ్యవహరించడంపై 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్‌కు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ‘నిజం గెలవాలి’ పేరుతో పర్యటిస్తూ ఓటర్లను ఆకట్టుకునేలా ఆర్థిక సహాయం పేరుతో నగదును భువనేశ్వరి పంపిణీ చేయడంపై వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదుపై ఎన్నికల కమిషన్ స్పందించింది. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఈ నెల 20న నారా భువనేశ్వరీ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని.. ఇది ఎన్నికల రూల్స్ ప్రకారం ప్రలోభాల కిందకే వస్తుందని ఈసీకి లేళ్ల అప్పిరెడ్డి ఈ నెల 21న ఆధారాలతో ఫిర్యాదు చేశారు. దీనిపై మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం విచారణ జరిపి 24 గంటల్లోగా తమకు నివేదిక పంపాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్‌కు సీఈవో ఆదేశాలు జారీ చేశారు. -
ఏపీ ఎన్నికలు.. సీఈవో ముఖేష్‌కుమార్ కీలక ఆదేశాలు
సాక్షి, విజయవాడ: ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ స్థలాల్లో రాజకీయ ప్రకటనలతో ఉన్న హార్డింగ్స్, పోస్టర్లు, కటౌట్లను ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల్లోపు తొలగించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలుపర్చడానికి అన్ని జిల్లా ఎన్నికల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలుపరచడం, ఎలక్ట్రానిక్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టంను విస్తృత స్థాయిలో వినియోగించడం, సీ విజిల్ ద్వారా అందే ఫిర్యాదుల సకాలంలో పరిష్కరించడం తదితర అంశాలను ఈ సమావేశంలో ఆయన సమీక్షించారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో పాటు అదనపు సీఈవోలు పాల్గొన్నారు. -
ఏపీ ఎన్నికల నిర్వహణకు సిద్ధం: సీఈవో ముఖేష్ కుమార్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ సీట్లకు, 25 లోక్ సభ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనునట్లు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఏపీలో మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ నిర్వహిస్తామన్నారు. ఏపీలో 46 వేలకు పైగా పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుపుతామని, ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఫామ్ 12 ద్వారా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయవచ్చన్నారు. 85 ఏళ్లు దాటిన వారికి ఓటు ఫ్రమ్ హోమ్ సౌకర్యం కల్పిస్తామన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి నెలాఖరులోగా ఓటరు కార్డులు పంపిణీ చేస్తామని తెలిపారు. ఓటరు కార్డు లేకుంటే 12 రకాల గుర్తింపు కార్డులు చూపించొచ్చని వెల్లడించారు. ►ఏప్రిల్ 18న ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ ►ఏప్రిల్ 18 నుంచి 25 వరుకు నామినేషన్ల స్వీకరణ ►ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన ►ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణ గడువు ►మే 13న పోలింగ్ ►జూన్ 4న ఓట్ల లెక్కింపు ►ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్ధానాలకు ఎన్నికలు ►ఏపీలో తాజా ఓటర్ల సంఖ్య 4,09,37,352...ఇందులో సర్వీస్ ఓటర్లు సంఖ్య 67393 ►18 నుంచి 19 సంవత్సరాల వయస్సు కలిగిన 9,01,863 మంది ఓటర్లు వున్నారు ►ఏపీలో జనవరి ఒకటి నాటికి 4.07 కోట్ల మంది ఓటర్లు ఉంటే.. తాజాగా 1,97,000 మంది పెరిగారు ►ఈ రోజు వరకు వచ్చిన 6ఏ దరఖాస్తులు తీసుకుంటాం ►ఏపీలో 46165 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి ►ఇందులో 179 పోలింగ్ కేంద్రాలు ప్రత్యేకంగా మహిళా పోలింగ్ కేంద్రాలుగా ఏర్పాటు చేస్తాం ►పోలింగ్‌కు ఐదు రోజుల ముందు ఓటర్ల స్లిప్ కూడా పంపిణీ చేస్తాం ►ఎపిక్ కార్డులు లేకపోతే పోలింగ్ రోజు 12 రకాల గుర్తింపు కార్డులు చూపించవచ్చు ►85 సంవత్సరాలు పైబడిన వారు, వికలాంగులకి ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ►ఇందుకోసం ఫారం 12 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు ►అభ్యర్ధుల తమపై ఉన్న క్రిమినల్ కేసులను పేపర్, టీవీలలో మూడుసార్లు పబ్లిష్ చేయాల్సి ఉంటుంది ►3.82 లక్షలు ఉద్యోగులను ఎన్నికల కోసం వినియోగిస్తాం ►ఏపీ ఎన్నికలకి 50 మంది జనరల్ అబ్జర్వర్స్ ఉంటారు ►ప్రతీ అసెంబ్లీకి మూడు ఫ్లైయింగ్ స్క్వాడ్ లు ఉంటాయి ►అనుమానిత ఖాతాలపై నిఘా ►నాన్ కమర్షియల్ ప్రాంతాలలో ల్యాండ్ అయ్యే హెలీకాప్టర్లని తనిఖీలు చేపడతాం ►50 శాతం పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తాం ►నేటి నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలుల్లో ఉంటుంది. ►బహిరంగ ప్రదేశాలలో 48 గంటలలోపు పోస్టర్లు, బ్యానర్లు తొలగించాలి ►ప్రభుత్వ వెబ్ సైట్ నుంచి వచ్చే 24 గంటలలోపు అన్ని ఫొటోలు తీసేయాల్సి ఉంటుంది ►కొత్త పనులకు పర్మిషన్ లేదు.. జరుగుతున్న పనులకు ఇబ్బంది లేదు ►మంత్రులు సమీక్షలు చేయకూడదు ►మంత్రులకు ప్రోటోకాల్ ఉండదు ►కొత్తగా లబ్దిదారులను ఎంపిక చేయడానికి లేదు -
Andhra Pradesh: ఏపీ ఓటర్లు 4.08 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,08,07,256కు చేరుకుంది. వీరిలో పురుష ఓటర్లు 2,00,74,322 మంది కాగా మహిళా ఓటర్లు 2,07,29,452, థర్డ్ జెండర్ 3,482 మంది ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. 2024 ఓటర్ల తుది జాబితాను సోమవారం ఆయన విడుదల చేశారు. గతేడాది అక్టోబర్ 27న విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాపై ఫిర్యాదులను జనవరి 11 వరకు స్వీకరించి ఇంటింటి సర్వే చేసి అనంతరం పూర్తి పారదర్శకంగా తుది జాబితాను విడుదల చేసినట్లు తెలిపారు. ప్రతి 1,500 మంది ఓటర్లకు ఒక పోలింగ్ స్టేషన్ ఉండేలా చర్యలు చేపట్టడంతో పోలింగ్ స్టేషన్లు మరో 214 పెరిగాయన్నారు. పోలింగ్ స్టేషన్ల సంఖ్య 46,165కి చేరింది. తాజాగా విడుదల చేసిన తుది జాబితాపై అభ్యంతరాలుంటే ఫిర్యాదు చేసేందుకు జనవరి 23 నుంచి సీఈవో కార్యాలయంలో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఓటర్ల జాబితాను https://electoralsearch.eci.gov.in/లో చూడొచ్చన్నారు. ఫారం 6 పూర్తి చేసి ఓటరుగా నమోదు చేసుకోవడానికి నామినేషన్ల చివరి రోజు వరకు అనుమతిస్తామని చెప్పారు. ముసాయిదాతో పోలిస్తే పెరుగుదల అక్టోబర్‌లో విడుదలైన ముసాయిదాతో పోలిస్తే తుది జాబితాలో నికరంగా 5,86,530 ఓటర్లు పెరిగారు. ముసాయిదాలో 4.02 కోట్లుగా ఉన్న ఓటర్ల సంఖ్య కొత్త ఓటర్ల చేరిక, తొలగింపుల తర్వాత 4.08 కోట్లకు చేరింది. సవరణ సందర్భంగా 22,38,952 మంది కొత్త ఓటర్లు నమోదయ్యారు. ముసాయిదా జాబితా సమయంలో 18–19 ఏళ్ల ఓటర్ల సంఖ్య 2,88,155గా ఉంటే తుది జాబితా వచ్చే సరికి ఈ సంఖ్య 8,13,544కు చేరింది. అంటే అదనంగా 5,25,389 మంది కొత్త యువ ఓటర్లు నమోదయ్యారు. ఇంటింటి సర్వే చేసి మరణించిన వారు, ఒక చోట కంటే ఎక్కువ చోట్ల ఓటు హక్కు ఉన్న వారిని గుర్తించడం ద్వారా 16,52,422 మంది ఓటర్లను తొలగించారు. 2019లో 3.93 కోట్లుగా ఉన్న ఓటర్ల సంఖ్యతో పోలిస్తే ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో అదనంగా 15 లక్షల మంది కొత్త ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 6.55 లక్షల మంది మహిళా ఓటర్లు అదనం రాష్ట్రంలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 6,55,130 మంది అదనంగా ఉన్నారు. పురుష ఓటర్ల సంఖ్య 2,00,74,322 కాగా మహిళా ఓటర్లు 2,07,29,452 మంది ఉన్నారు. ప్రతి వెయ్యి మంది పురుష ఓటర్లకు 1,036 మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. శ్రీకాకుళం మినహా మిగిలిన 25 జిల్లాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో పురుష ఓటర్ల సంఖ్య 9,37,988 కాగా దానికంటే కొద్దిగా తక్కువగా 9,37,883 మంది మహిళా ఓటర్లున్నారు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 20,16,396 మంది ఓటర్లు ఉంటే అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 7,61,538 మంది ఓటర్లు ఉన్నారు. పూర్తి పారదర్శకంగా జాబితా జనవరి 2022 నుంచి తొలగించిన ఓటర్లను ఇంటింటి సర్వే ద్వారా పరిశీలించి వంద శాతం ఆధారాలను సేకరించిన తరువాతే సవరణ చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఈ సమయంలో 21,18,940 ఓటర్లను తొలగించగా కేవలం 13,061 కేసుల్లో మాత్రమే నిబంధనలు పాటించలేదని, వాటిని నిబంధనలకు అనుగుణంగా సవరించామని పేర్కొంది. సున్నా ఇంటి నెంబర్‌పై 2,51,767 ఇళ్లు, ఒకే ఇంటి నెంబర్‌పై పది కంటే ఎక్కువ ఓట్లు ఉన్న 1,57,939 ఇళ్లను గుర్తించి ఆగస్టు, సెప్టెంబర్‌లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి సవరణ చేసినట్లు తెలిపింది. జీరో నెంబర్ ఇంటి కేసులను 97 శాతం సవరణ చేయగా పది కంటే ఎక్కువ ఓట్లున్న ఇళ్ల సంఖ్యలో 98 శాతం పరిష్కరించినట్లు తెలిపింది. ఓట్ల తొలగింపు, డూప్లికేటు ఓట్లు, మరణాలు, చిరునామా మార్పు లాంటి వాటిపై రాజకీయ పార్టీల నుంచి 14,48,516 ఫిర్యాదులు రాగా అందులో 5,64,497 కేసులు అర్హత ఉన్నవిగా గుర్తించి వాటిని తొలగించినట్లు పేర్కొంది. కొన్ని నియోజకవర్గాల్లో ఒక్కరే పెద్ద మొత్తంలో ఓట్ల తొలగింపు, చేర్పులకు దరఖాస్తు చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయని, ఇలా బల్క్‌గా దరఖాస్తులు సమర్పించిన 70 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించినట్లు స్పష్టం చేసింది. ఒకే కుటుంబంలోని ఓట్లు వేరువేరు చోట్ల నమోదైన కేసులను గుర్తించి వాటిని సవరించామని, ఈ విధంగా విశాఖలో 26,000 ఓట్లను సవరణ చేయగా, ఎన్టీఆర్ జిల్లాలో 2,27,906 ఓటర్లను సవరించినట్లు తెలిపింది. నెల్లూరు, గుంటూరు, కాకినాడ జిల్లాల్లో కూడా చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. వారికి ఇంటివద్దే ఓటు హక్కు 80 ఏళ్లు దాటిన వారు, దివ్యాంగులు, కోవిడ్ సోకిన వారు ఈ ఎన్నికల్లో ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. రానున్న సాధారణ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్న వారిలో 80 ఏళ్లు దాటిన వారు 5,76,791 మంది ఉండగా, దివ్యాంగులు 4,87,594 మంది ఉన్నారు. ఇటీవలే పొరుగు రాష్ట్రాల్లో ఓటు హక్కు వినియోగించుకుని ఇప్పుడు ఏపీలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి దరఖాస్తు చేసుకునే ఓటర్ల విషయంలో జిల్లా ఎన్నికల అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేసిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడే నివాసం ఉంటున్నట్లు (ఆర్డినరీ రెసిడెన్స్) ధృవపత్రం ఇచ్చిన వారు మాత్రమే ఓటరుగా చేరడానికి అర్హులని, తప్పుడు ధృవపత్రాలు ఇచ్చిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పది రోజులు ముందు దాకా.. ఎన్నికల వరకు ఓటర్ల నమోదు, తొలగింపు ప్రక్రియ చేపడుతూనే ఉంటామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. ఎన్నికల తేదీకి పది రోజుల ముందు వరకు అందిన వివరాలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. ఓటర్ల తుది జాబితా ప్రకటించిన నేపథ్యంలో సోమవారం గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సచివాలయంలో సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబితాలో సందేహాలు, ఉంటే అధికారుల దృష్టికి తీసుకు వెళ్లాలని రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. -
డూప్లికేట్, డబుల్ ఓట్లపై ఈసీ కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: పక్క రాష్ట్రాల ఓటర్లకు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో ఓటు ఉన్నవారికి చెక్ పెడుతూ.. డూప్లికేట్, డబుల్ ఓట్లపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదుపై ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. అన్ని జిల్లాల కలెక్టర్లకు ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. వేరే రాష్ట్రాల్లో ఓటు ఉన్న వారికి ఏపీలో ఓట్లు ఉన్నాయని ఫిర్యాదులు రావడంతో ఈసీ చర్యలకు ఉపక్రమించింది. ఒక వ్యక్తికి ఒకే నియోజకవర్గం, ఒకే రాష్ట్రంలో ఓటు ఉండాలి. ఒక వ్యక్తి కి ఎక్కువ చోట్ల ఓటు ఉండటం నిబంధనలు కు విరుద్దం. ఫామ్ 6 ద్వారా కొత్త ఓటు నమోదు మాత్రమే చేయాలి. కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు డిక్లరేషన్ తీసుకోవాలి. వేరే ఎక్కడ ఓటు లేదని డిక్లరేషన్ ఇవ్వాలి. తప్పుడు డిక్లరేషన్ ఇచ్చే వారిపై కేసులు పెట్టాలి’’ అని ఈసీ పేర్కొంది. తప్పుడు డిక్లరేషన్‌తో ఓటు నమోదు దరఖాస్తు చేస్తే జైలు శిక్ష. 20 ఏళ్లు పైబడ్డ వాళ్లు ఫామ్ 6 ద్వారా దరఖాస్తు చేస్తే అధికారులు విచారించి రిమార్క్ ఇవ్వాలి. ఎక్కడ నివాసం ఉంటే అక్కడే ఓటు హక్కు. ఇళ్లు మారే వాళ్లు ఓటుకి ఫామ్ 8 ద్వారా డిక్లరేషన్ ఇవ్వాలి. తప్పుడు డిక్లరేషన్ ఇస్తే కేసు నమోదు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. -
తెలంగాణ ఓట్లను ఏపీకి మార్చడానికి సిగ్గులేదా?: వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, విజయవాడ: ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనాను మంత్రి మేరుగు నాగార్జున, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి మంగళవారం కలిశారు. హైదరాబాద్‌లో టీడీపీ ఆధ్వర్యంలో ఏపీ ఓటర్ల రిజిస్ట్రేషన్ చేయడంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. తెలంగాణలో ఓటు వేసిన వారు ఏపీలో ఓటు వేయకుండా కలెక్టర్లకు ఆదేశాలివ్వాలని ఎన్నికల ప్రధానాధికారిని కోరారు. చంద్రబాబు వ్యవస్థలు మేనేజ్ చేయడంలో సిద్ధహస్తుడు: మంత్రి మేరుగు అనంతరం మంత్రి మేరుగు నాగార్జున మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు వ్యవస్థలు మేనేజ్ చేయడంలో సిద్ధహస్తుడని, ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు టీడీపీ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. హైదరాబాద్‌లో ఓటు వేసిన వారు ఏపీలో ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. హైదరాబాద్‌లో చంద్రబాబు ఆధ్వర్యంలో ఏపీ న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. హైదరాబాద్ ప్రగతినగర్‌లో బ్యానర్లు కట్టి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. సిగ్గులేకుండా పక్క రాష్ట్రంలో బ్యానర్లు కట్టి ఓట్లు రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. మాజీ మంత్రి ఉమా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి’’ అంటూ మంతి మేరుగ మండిపడ్డారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు టీడీపీ కుట్రలు: మల్లాది విష్ణు ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు టీడీపీ కుట్రలు చేస్తుందని, వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. స్థిర నివాసం ఉన్నచోటే ఓటు హక్కు కల్పించాలి: లేళ్ల అప్పిరెడ్డి లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ, స్థిర నివాసం ఉన్నచోటే ఓటు హక్కు కల్పించాలని సీఈవోను కోరాం. తెలంగాణ ఓట్లను ఏపీలో మార్చడానికి సిగ్గులేదా?. ఎన్నికల ప్రక్రియలో ఎక్కడా వాలంటీర్లను ఉపయోగించడం లేదు. మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ టీడీపీ కండువా వేసుకుని మాట్లాడితే బాగుంటుంది’’ అంటూ అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. చదవండి: ‘మిచౌంగ్’ దెబ్బ.. ఇలా వచ్చి.. అలా ముంచేసింది -
ఏఎస్డీ జాబితాలో ‘వలస’ ఓటర్లు
ఓటరు నమోదుకు ఎప్పటిలోగా దరఖాస్తు చేసుకోవాలి? వేరే ప్రాంతానికి ఓటును బదిలీ చేసుకోవచ్చా? వికాస్‌రాజ్: కొత్త ఓటర్ల నమోదుకు ఫారం–6, వేరే ప్రాంతానికి బదిలీ/వివరాల దిద్దుబాటుకు ఫారం–8ను అక్టోబర్ 31లోగా దరఖాస్తు చేసుకోవాలి. నామినేషన్లు నవంబర్ 10తో ముగుస్తాయి.ఆ తర్వాత అర్హులైన వారి పేర్లతో అనుబంధ ఓటర్ల జాబితాను ప్రచురిస్తాం. కొత్త ఓటర్లకు కార్డుల పంపిణీ ఎప్పుడు చేస్తారు? ఇప్పటికే 27.5 లక్షల కొత్త ఓటర్లకు సంబంధించిన ఓటరు గుర్తింపు కార్డులను ముద్రించి స్పీడు పోస్టు ద్వారా వారి చిరునామాలకు పంపాం. మరో 12.5 లక్షల కార్డులను ముద్రించి నవంబర్ 15లోగా పంపిస్తాం. నవంబర్ 10 తర్వాత ఓటర్లందరికీ ఓటరు ఇన్ఫర్మేషన్ స్లిప్పుల పంపిణీ ప్రారంభిస్తాం. హైదరాబాద్‌లో పోలింగ్ కేంద్రం ఎక్కడుందో తెలియక చాలామంది ఓటేయలేకపోతున్నారు? పోలింగ్ కేంద్రం వివరాలతో ఓటర్లందరికీ ఓటరు ఇన్ఫర్మేషన్ స్లిప్పులను పంపిణీ చేస్తాం. ‘ఓటర్ హెల్ప్‌లైన్ యాప్’తోపాటు ఈసీఐ వెబ్‌సైట్‌లోని ‘ఓటర్ సహాయ మిత్ర’ అనే లింక్ ద్వారా పోలింగ్ కేంద్రం వివరాలు తెలుసుకోవచ్చు. ఓటరు కార్డు నంబర్ ద్వారా వివరాలు తెలుస్తాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి కొందరి పోలింగ్ కేంద్రాలు మారొచ్చు. ఓటర్ల జాబితాలో 120 ఏళ్లకు పైబడిన ఓటర్లు వందల సంఖ్యలో ఉన్నారు? ఎలా సాధ్యం? పుట్టిన సంవత్సరం సరిగ్గా తెలియక కొందరు తమ పుట్టిన సంవత్సరాన్ని 1900గా నమోదు చేయించారు. దీంతో కొందరు ఓటర్ల వయసు 120 ఏళ్లకు పైగా ఉన్నట్టు జాబితాలో వచ్చింది. ఆ ఓటర్లే తమ పుట్టిన సంవత్సరం సవరణకు దరఖాస్తు చేసుకోవాలి. పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఎలా పొందాలి? 80 ఏళ్లుపైబడిన వృద్ధులు, 40శాతానికి మించిన వైకల్యమున్న ఓటర్లు ఇంటి నుంచే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేయొచ్చు. ఇందుకోసం వీరికి ‘ఫారం–12డీ’ దరఖాస్తులను పంపిణీ చేస్తున్నాం. వీటిని బీఎల్ఓలు సేకరిస్తారు. ముందే నిర్దేశించిన తేదీల్లో ప్రిసైడింగ్ అధికారి నేతృత్వంలోని బృందం వీరి ఇళ్లకు వెళ్లి పోస్టల్ బ్యాలెట్ అందజేస్తుంది. రహస్యంగా ఓటేసేందుకు వీలుగా ఇంట్లో కంపార్ట్మెంట్ సైతం ఏర్పాటు చేస్తుంది. వీడియో కెమెరా బృందం, పోలీసులు సైతం ఉంటారు. పార్టీల ఏజెంట్లనూ అనుమతిస్తారు. ఓటేసిన తర్వాత ఓటరే స్వయంగా బ్యాలెట్ పత్రాన్ని కవర్లో ఉంచి సీల్ చేసి ప్రిసైడింగ్ అధికారికి ఇవ్వాలి. జర్నలిస్టులతో సహా 13 అత్యవసర సేవల విభాగాల ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించారు. ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇచ్చే కేంద్రాల్లోనే పోలింగ్ ఫెసిలిటేటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. అక్కడే వారికి పోస్టల్ బ్యాలెట్ ఇచ్చి ఓటు వేయించుకుంటాం. ప్రగతి భవన్లో బీ–ఫారాల పంపిణీ, రజాకార్ సినిమా, సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై అధికార, విపక్ష పార్టీలు ఫిర్యాదు చేశాయి కదా? ఆ ఫిర్యాదులు కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలనలో ఉన్నాయి. అక్కడి నుంచి అందే సూచనల మేరకు చర్యలు తీసుకుంటాం. ఎన్నికల సంఘం ఇటీవల రాష్ట్రంలోపెద్దఎత్తున అధికారులను ఆకస్మిక బదిలీ చేసింది? కారణమేంటి? బదిలీ ఉత్తర్వుల్లో ప్రత్యేకంగా కారణాలేమీ తెలపలేదు. వారి వద్ద ఉన్న సమాచారం ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు వివరాలిస్తే నామినేషన్ తిరస్కరిస్తారా? అఫిడవిట్లో తప్పుడు సమా చారమిస్తే రిటర్నింగ్ అధికారి నామినేషన్‌ను తిరస్కరించరు. అన్ని కాలమ్‌లను భర్తీ చేయనిపక్షంలో అభ్యర్థికి నోటీసులిస్తారు. అయినా భర్తీ చేయకుంటే ఆ నామినేషన్‌ను తిరస్కరించవచ్చు. నేర చరిత్రపై అభ్యర్థులు, పార్టీలు సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా అనామక పత్రికల్లో ప్రకటనలు ఇస్తున్నాయి? త్వరలో అన్ని పార్టీలకు సూచనలు జారీ చేస్తాం. సర్క్యులేషన్, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఏ పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలో ఓ జాబితాను పార్టీలకు అందజేస్తాం. ఆన్లైన్ ద్వారా ఓటర్లకు నగదు బదిలీపై నిఘా ఉంచారా? యూపీఐ ద్వారా ఏ బ్యాంకు ఖాతా నుంచి ఎంత డబ్బు బదిలీ చేస్తున్నారు? అనే అంశంపై ఆదాయ పన్ను శాఖకు రోజువారీగా నివేదికలు అందుతున్నాయి. రాష్ట్రానికి కేంద్ర బలగాలు ఎన్ని వస్తున్నాయి? ఎన్నికల బందోబస్తు కోసం 65 వేల మంది పోలీసుల సేవలు అవసరం కాగా, రాష్ట్రంలో 40వేల మంది ఉన్నారు. మరో 25,000 మంది బలగాలను పంపాలని డీజీపీ అడిగారు. 100 కంపెనీల కేంద్ర బలగాలు రాష్ట్రానికి వస్తున్నాయి. -
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసిన ఎమ్మెల్యే పేర్నినాని
-
కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన ఏపీ సీఈవో
న్యూఢిల్లీ: ఏపీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా కేంద్ర ఎన్నికల సంఘాన్ని మంగళవారం కలిశారు. డిప్యూటీ కమిషనర్‌తో దాదాపు మూడు గంటల పాటు ఆయన సమావేశమయ్యారు. ఓటర్ల జాబితా స్పెషల్ సమ్మరీ రివిజన్‌పై చర్చించారు. ఈనెల 20న ఏపీలో రాజకీయ పార్టీలతో ముఖేష్ కుమార్ మీనా సమావేశం కానున్నారు. బూత్ లెవెల్ అధికారులు (బీఎల్ఓలు)ఇంటింటికి వెళ్లి ఓటర్లను తనిఖీ చేయనున్నారు. కొత్త ఓటర్లను చేర్చుకోవడం, చనిపోయిన వారిని తొలగించడం తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. ఇంటింటికి వెళ్లే ఈసీ బృందంలో ఆయా రాజకీయ పార్టీలు ఏజెంటును (బీఎల్ఏ) ను నియమించుకునే అవకాశం ఉంది. ఆగస్టు 2, 3 తేదీల్లో విశాఖలో ఎన్నికల సంఘం సమావేశం కానుంది. ఏపీలో ఈఆర్వోల నియామకం, ఓటర్ల జాబితా తయారీ తదితర అంశాలను కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు పరిశీలించనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 100% ఓటరు కార్డుల ముద్రణ పూర్తి కాగాకొత్త ఓటర్లకు సాధ్యమైనంత త్వరగా ఓటర్ కార్డులను ఇచ్చేందుకు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం ప్రయత్నిస్తోంది. -
లోకేశ్‌కుమార్ బదిలీ.. జీహెచ్ఎంసీ నెక్ట్స్ బాస్ ఎవరో?
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేశ్‌కుమార్ అడిషనల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌గా వెళ్లనుండటంతో కొత్త కమిషనర్ ఎవరన్నది చర్చనీయాంశంగా మారింది. లోకేశ్‌కుమార్ జీహెచ్ఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించి మూడున్నరేళ్లు దాటింది. మరో రెండు నెలలైతే నాలుగేళ్లు పూర్తయ్యేవి. రాష్ట్ర అసెంబ్లీకి మరో నాలుగైదు నెలల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో బదిలీలు అనివార్యంగా మారాయి. కొత్త కమిషనర్‌గా ఆర్థికశాఖ కార్యదర్శి రోనాల్డ్ రాస్, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందనరావు, ఎస్సీ అభివృద్ధిశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, వాటర్‌బోర్డు ఎండీ దానకిశోర్, మేడ్చ ల్ జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక పేర్లు వినిపిస్తున్నాయి. వీరితో పాటు గతంలో జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్‌గా పని చేసిన హరిచందన పేరు కూడా ప్రచారంలో ఉంది. ఏ పేర్లు వినబడినప్పటికీ, అన్నీ ఊహాగానాలే తప్ప నియామకం జరిగేంతదాకా చెప్పలేమని ప్రభుత్వ తీరు తెలిసిన వారు చెబుతున్నారు. జీహెచ్ఎంసీ చరిత్రలోనే ఎక్కువ కాలం జీహెచ్ఎంసీ చరిత్రలోనే అత్యధిక కాలం కమిషనర్‌గా ఉన్న డీఎస్ లోకేశ్‌కుమార్ తన పనేమిటో తాను.. అన్నట్లుగా పనులు చేసుకుంటూ పోయారు. బయట హడావుడి, హంగామా లేకుండా అంతర్గతంగా పనులు చేయించడంలో తనదైన ముద్ర వేశారు. తరచూ ఫోన్ కాన్ఫరెన్స్‌లు, గూగుల్ మీట్ వంటి వాటితో ఎప్పటికప్పుడు పనులు చేయించేవారు. ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినా జీహెచ్ఎంసీలో నెలనెలా జీతాలకు ఇబ్బందులెదురైనప్పటికీ, నయానో భయానో ట్యాక్స్ సిబ్బందితో, ఇతరత్రా పన్నుల వసూళ్లు జరిగేలా చూసేవారు. ఎస్సార్డీపీతో సహా వివిధ ప్రాజెక్టుల పనులు కుంటుపడకుండా చేయగలిగారు. ఎవరెన్నివిమర్శలు చేసినా, క్షేత్రస్థాయిలో తిరగరనే ఆరోపణలున్నా పట్టించుకునేవారు కాదు. ఎలాంటి హడావుడి లేకుండానే నగరంలో క్షేత్రస్థాయి పరిస్థితులు పరిశీలించేవారు. ప్రభుత్వం నుంచి, పైఅధికారుల నుంచి అందిన ఆదేశాలకనుగుణంగా పనులు చేసేవారని చెబుతారు. ఎలాంటి సమాచారం, ప్రచారం లేకుండానే నిశ్శబ్దంగా తాను చేయాల్సిన పనులేవో చేసుకుంటూపోయేవారు. చదవండి: అంతర్గత విబేధాలు.. సైలెంట్ మోడ్‌లోకి ఎమ్మెల్యే రఘునందన్ రావు -
తెలంగాణ: సమీపిస్తున్న ఎన్నికలు.. కీలక పోస్టులకు సీఈసీ నియామకాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల కమిషన్‌లో ఖాళీగా ఉన్న రెండు ప్రధాన పోస్టుల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. దీర్ఘకాలిక సెలవులో ఉన్న టీ రవికిరణ్ స్థానంలో డీఎస్ లోకేష్ కుమార్‌ను అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌గా, మరో సీనియర్ IAS అధికారి సర్ఫరాజ్ అహ్మద్‌ను జాయింట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌గా నియమిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈ మేరకు తెలంగాణ సీఎస్‌కు బుధవారం లేఖ రాసింది. కాగా, లోకేష్ కుమార్ ప్రస్తుతం జీహెచ్ఎంసీ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అదే విధంగా తెలంగాణ ప్రొహిబిషన్, ఎక్సైజ్ కమిషనర్ బాధ్యతల్లో ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారిగా ఐఏఎస్ వికాస్ రాజ్ కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా.. ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణలో రాజకీయ కలాహలం కనిపిస్తోంది. దీంతో ఎన్నికల ప్రక్రియను ప్రారంభించేందుకు, నోటిఫికేషన్ విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఎన్నికల సన్నద్దతపై వారం రోజుల క్రితం కేంద్ర ఎన్నికల ఉన్నతాధికారులు రాష్ట్రంలో పర్యటించి సీఎస్, డీజీపీ, కలెక్టర్లతో సమావేశమయ్యారు. ఈ ఏడాది అక్టోబర్‌లో తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. -
రెండు చోట్ల ఈవీఎంలు మొరాయించాయి : ఎన్నికల అధికారి వికాస్ రాజ్
-
మునుగోడు ఉప ఎన్నికపై 500 ఫిర్యాదులు: సీఈవో వికాస్ రాజ్
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ రేపు(గురువారం) ఉదయం జరగనుంది. ఈ క్రమంలో.. ఏర్పాట్ల పర్యవేక్షణపై సాక్షి టీవీతో తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ మాట్లాడారు. మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ నుంచి కౌంటింగ్ వరకు సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సీఈవో వికాస్ రాజ్ సాక్షికి వెల్లడించారు. ‘‘వెబ్ క్యాస్టింగ్ ద్వారా 298 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ పరిశీలిస్తాం. పోలింగ్ కేంద్రాల్లోకి వచ్చే ఓటర్లకు చేతిపై ఎలాంటి పార్టీల గుర్తులు ఉండరాదు. పోలింగ్ కేంద్రాల్లో గుర్తులు ప్రదర్శించరాదు. ఈ ఉప ఎన్నికకు సంబంధించి.. దాదాపుగా ఐదు వందల వరకు ఫిర్యాదులు వచ్చాయి. వాటిని పరిశీలించి కేసులు నమోదు చేయించాం. పోలింగ్ సిబ్బంది ఈవీఎంలను తిరిగి రిసెప్షన్ లో ఇచ్చే వరకు జాగ్రత్తగా ఉండాలి. ఈవీఎంలను వదిలి వెళ్లవద్దు. స్ట్రాంగ్ రూమ్ లో ఈవీఎంలను భద్రపరించేందుకు ఏర్పాట్లు చేశాం. కౌంటింగ్ ప్రక్రియలో వెయ్యి మందికి పైగా ఏజెంట్లు ఉండే అవకాశం ఉంది. కౌంటింగ్ కేంద్రంలోకి కూడా అనుమతి ఉన్నవారినే పంపిస్తాం అని సీఈవో వికాజ్‌రాజ్ సాక్షితో అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక- కీలక పాయింట్లు.. ► మునుగోడు నియోజకవర్గంలో 2,41,855 మంది ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గం మొత్తం 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ► నవంబర్ 3న ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ► అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు. ఐదు వేల మంది పోలీస్ సిబ్బందిని మోహరిస్తారు. ► 199 మైక్రో అబ్సర్వస్ అందుబాటులో ఉంటారు. సిబ్బంది, పోలింగ్ స్టాప్ కోసం జిల్లా అడ్మినిస్ట్రేషన్ అన్ని ఏర్పాట్లు చేపట్టింది. ► పోలింగ్ నిర్వాహణ కోసం 1,192 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. ► ఫ్లైయింగ్ స్కాడ్‌తో కలిసి మొత్తం 50 బృందాలు పర్యవేక్షిస్తాయి. ► 45 స్థానాల్లో 105 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టనున్నారు. ► వంద చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. -
ఓటర్ల జాబితాపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు
శ్రీనగర్/జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో ఓటర్ల జాబితా విషయంలో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్(సీఈఓ) చేసిన ప్రకటనపై కొన్ని దుష్టశక్తులు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు సీఈఓ వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ శనివారం స్థానిక దినపత్రికల్లో ఒక ప్రకటన విడుదల చేశారు. కశ్మీర్లో ఓటర్ల జాబితా రివిజన్ తర్వాత కొత్తగా 25 లక్షల మంది ఓటర్లుగా నమోదయ్యే అవకాశం ఉందని సీఈఓ ఆగస్టు 17న విలేకరుల సమావేశంలో వెల్లడించారు. దీనిపై రాజకీయంగా అలజడి రేగింది. బయటి వ్యక్తులను తీసుకొచ్చి, ఓటు హక్కు కల్పించేందుకు కుట్ర పన్నారని రాజకీయ పార్టీలు మండిపడ్డాయి. ఈ అంశంపై చర్చించేందుకు నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లా సోమవారం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు వివరణ ఇచ్చారు. -
ఈనెల 8 వరకు నామినేషన్ల స్వీకరణ
-
ఆ రెండు జిల్లాల్లోనే ఎన్నికల కోడ్.. ప్రస్తుత పథకాలు యథాతథం
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన నేపథ్యంలో కరీంనగర్, హనుమకొండ జిల్లాల పరిధిలో తక్షణమే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) శశాంక్ గోయల్ స్పష్టం చేశారు.హుజూరాబాద్ స్థానం కరీంనగర్, హన్మకొండ జిల్లాల పరిధిలో ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై ఎన్నికల కోడ్ ప్రభావం ఉండదని, యథావిధిగా కొనసాగుతాయని వెల్లడించారు. ఉప ఎన్నికల నిర్వహణపై మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హుజూరాబాద్ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహిస్తున్నందున రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 6 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు సైతం త్వరలో ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో సైతం ఎమ్మెల్సీ ఎన్నికలు జరగాల్సి ఉందని, అన్ని రాష్ట్రాలతో చర్చించి కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుందన్నారు. 305 పోలింగ్ కేంద్రాలు హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా కోవిడ్–19 నిబంధనలను కఠినంగా అమలు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిందని శశాంక్ గోయల్ తెలిపారు. నామినేషన్ సమయంలో అభ్యర్థితో పాటు మూడు వాహనాలను మాత్రమే అనుమతిస్తారని, ఎలాంటి ర్యాలీలను అనుమతి ఉండదన్నారు. ప్రచార వాహనాల్లో కూర్చునే పార్టీల నేతలు సైతం కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించినట్లు తెలిపారు. హుజూరాబాద్ పరిధిలో 2,36,430 మంది ఓటర్లు ఉండగా, 305 పోలింగ్ కేంద్రాలున్నాయన్నారు. పోలింగ్‌లో ఉపయోగించనున్న ఈవీఎంలకు ఇప్పటికే అన్ని పార్టీల సమక్షంలో తనిఖీలు పూర్తి చేశామన్నారు. వయోజనులు, దివ్యాంగులు, కోవిడ్ పాజిటివ్ వ్యక్తులకు పోస్టల్‌బ్యాలెట్ సదుపాయం కల్పిస్తామని చెప్పారు. పోలింగ్‌కు వారం ముందు వరకు ఓటరుగా నమోదు చేసుకోవచ్చని వెల్లడించారు. -
రేపే పోలింగ్ : భారీ నగదు, నగలు పట్టివేత
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఎత్తున నగలు నగదు పట్టుబడింది. అసెంబ్లీ ఎన్నికలు మరికొన్ని గంటల్లో పప్రారంభం కానున్న నేపథ్యంలో మొత్తం 428 కోట్ల రూపాయల విలువైన నగదు, ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. స్వాధీనం చేసుకున్న వాటిలో 225.5 కోట్ల నగదు స్వాధీనం చేసుకోగా, బంగారంతో సహా విలువైన లోహాలు 176.11 కోట్లు ఉన్నట్టు వెల్లడించింది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మద్యం కూడా పట్టుబడింది. గత 24 గంటలలో కరూర్, కోయంబత్తూర్, తిరుప్పూర్ , చెన్నైలు భారీ దాడులు నిర్వహించినట్టు ఎన్నికల అధికారి ఒకరు తెలిపారు. ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో గత కొన్ని వారాలుగా ఈ దాడులు జరిగాయన్నారు. ఇందులో కరూర్ అగ్రస్థానంలో ఉండగా, కోయంబత్తూర్, తిరుప్పూర్, చెన్నై తరువాతి స్థానాల్లో నిలిచాయి. తాజాగా రాణిపేట జిల్లాలో రూ. 91.56 లక్షలు, చెన్నైలోని థౌజండ్ లైట్స్ నియోజకవర్గంలో 1.23 కోట్ల రూపాయలు, సేలం వీరపాండి వద్ద 1.15 కోట్ల రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కాగా గత నెలలో, ఆదాయపు పన్ను శాఖ 16 కోట్లకు పైగా అక్రమ నగదును స్వాధీనం చేసుకుంది.అలాగే ఎన్నికల నిఘాలో భాగంగా రాష్ట్రంలో పలు సంస్థలపై దాడుల తరువాత సుమారు రూ. 80 కోట్ల బ్లాక్ మనీని గుర్తించింది. కాగా 234 నియోజకవర్గాల్లో మంగళవారం పోలింగ్ షురూ కానుంది. తమిళనాట సింగిల్-ఫేజ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికే ప్రచార పర్వం ముగిసి నసంగతి తెలిసిందే. -
రాష్ట్ర సీఈవోగా శశాంక్ గోయల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో)గా శశాంక్ గోయల్‌ను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ఆయన ప్రస్తుతం కార్మిక, ఉపాధి కల్పన, కర్మాగారాల శాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్నారు. గతంలో ఆయన సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిగా, ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా, పర్యాటక, సాంస్కృ తిక శాఖ కార్యదర్శిగా, ఢిల్లీలోని ఏపీ రెసిడెంట్ కమిషనర్‌గా పనిచేశారు. అంతకుముందు కొంత కాలం కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సంయుక్త కార్యదర్శిగా డిప్యూటేషన్‌పై పనిచేశారు. విద్యా శాఖ డైరెక్టర్‌గా, నిజామాబాద్, గుంటూరు జిల్లాల కలెక్టర్‌గా కూడా వ్యవహరించారు. గతంలో సీఈవోగా పనిచేసిన రజత్‌కుమార్‌ను ప్రభుత్వం నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమిం చిన నేపథ్యంలో ఆయన స్థానంలో తాజాగా సీఈసీ శశాంక్ గోయల్‌ను నియమించింది. 2018 మేలో టర్కీకి విహార యాత్రకు వెళ్లిన శశాంక్ గోయల్ కుమారుడు శుభం గోయల్‌ను ఇస్తాంబుల్‌లో దోపిడీ దొంగలు కాల్చి చంపారు. -
5.30కి మాక్ పోలింగ్
సాక్షి, అమరావతి: ఎన్నికల రోజైన ఏప్రిల్ 11న గురువారం ఉదయం 5.30కే మాక్ పోలింగ్ ప్రారంభమవుతుందని, ఆ సమయానికే పోలింగ్ ఏజెంట్లు చేరుకోవాలని రాజకీయ పార్టీలకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది సూచించారు. మంగళవారం సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. 11న ఉదయం ఏడు గంటలకు పోలింగ్ మొదలవుతుందని, దానికి ముందే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు సరిగా పనిచేస్తున్నాయా లేదా అన్న విషయాన్ని పరిశీలించడానికి ఏజెంట్ల సమక్షంలో 50 ఓట్ల వరకు మాక్ ఓటింగ్ నిర్వహిస్తామని, ఆ తర్వాత వారి సమక్షంలోనే డిలీట్ చేసి 7 గంటలకు పోలింగ్‌కు ప్రారంభిస్తామని చెప్పారు. 5.30 తర్వాత పావుగుంట వరకు మాత్రమే చూస్తామని, ఆ తర్వాత ఏజెంట్లు ఉన్నా లేకపోయినా మాక్ పోలింగ్‌ను నిర్వహిస్తారని స్పష్టం చేశారు. రెండు రోజులు బల్క్ ఎస్ఎంఎస్లను నిషేధిస్తున్నట్లు చెప్పారు. 9 వేల సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు 2,118 మంది, 25 పార్లమెంటు స్థానాలకు 319 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 3.93 కోట్ల మంది ఓటర్లు ఉండగా వీరి కోసం మొత్తం 45,920 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 9 వేల సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించి ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఓటు వినియోగంపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయడంతో 85 శాతానికి పైగా పోలింగ్ జరిగే అవకాశముందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. పోలింగ్ కేంద్రాల్లో సెల్ఫోన్లు నిషేధం.. పోలింగ్ కేంద్రాల్లోకి ఎట్టి పరిస్థితుల్లో సెల్ఫోన్లు, కెమెరాలు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించేది లేదని ద్వివేది స్పష్టం చేశారు. స్విచ్ ఆఫ్ చేసిన ఫోన్లను కూడా లోపలికి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఎవరైనా ఓటు వేసినట్లు ఫోటోలు తీస్తే శిక్ష తప్పదని హెచ్చరించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి సోమవారం వరకు రూ.196.3 కోట్ల విలువైన వస్తువులను సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ మొత్తం రూ.200 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నామన్నారు. పట్టుకున్న మొత్తం పరంగా దేశంలో ఏపీ మూడవ స్థానంలో ఉందని చెప్పారు. నగదు, మద్యం పట్టివేతలో ఏపీనే మొదటి స్థానంలో ఉందని వివరించారు. సోమవారం నాటికి రూ.118.89 కోట్ల నగదు, రూ.24.15 కోట్ల విలువైన మద్యం పట్టుబడినట్లు వెల్లడించారు. -
రాష్ట్ర ఎన్నికలపై కేంద్రం ప్రత్యేక దృష్టి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించిందని, అందుకనే తొలిసారిగా రాష్ట్రస్థాయిలో పోలీసు, వ్యయ పరిశీలకులను ఏర్పాటు చేసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ దివ్వేది తెలిపారు. రాష్ట్రస్థాయి పోలీసు పరిశీలకులుగా నియమించిన కేకే శర్మ శనివారం విజయవాడ చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొని ఉన్న శాంతి భద్రతల పరిస్థితి, కావాల్సిన పోలీసు బలగాల వివరాలతో కూడిన ప్రత్యేక నివేదికను కేకే శర్శకు దివ్వేది అందజేశారు. శనివారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఒకటి రెండు రోజుల్లో ఎన్నికల వ్యయ పరిశీలకుల నియామకం జరగనుందని తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గాలకు వారిగా సాధారణ, వ్యయ, పోలీసు పరిశీలకులను పంపించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీకి 2,395, పార్లమెంటుకు 344 మంది పోటీ రాష్ట్రంలో 175 మంది అసెంబ్లీ స్థానాలకు 2,395 మంది, 25 పార్లమెంటుకు 344 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు దివ్వేది తెలిపారు. రాజకీయ పార్టీలతో సమావేశమైన దివ్వేది తుది ఓటర్ల జాబితాను రాజకీయల పార్టీలకు అందజేశారు. అదే విధంగా ప్రతి జిల్లా కలెక్టర్లు రాజకీయ పార్టీలకు ఓటర్ల జాబితాను అందజేస్తారని తెలిపారు. రాష్ట్రానికి కేటాయించిన పరిశీలకులు పేర్లు, ఫోను నంబర్లను రాజకీయ పార్టీలకు అందజేస్తామని, ఏదైనా సమస్య ఉంటే వారిని సంప్రదించవచ్చని తెలిపారు. వేసిన ఓటు చూసుకోవచ్చు రాష్ట్రంలో తొలిసారిగా వీవీప్యాట్లను వినియోగిస్తున్నామని, వీటి ద్వారా ఓటరు వేసిన ఓటును ఒకసారి చూసుకునే వెసులుబాటు కలుగుతుందన్నారు. ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయిల్ (వీవీప్యాట్)లో వేసిన ఓటు ఏడు సెకన్లు కనిపించి బాక్స్‌లో పడుతుందన్నారు. ఒక గుర్తుకు ఓటు వేస్తే వేరే గుర్తుకు ఓటు పడుతోందన్న అపోహలను తొలగించడానికి 2017జూన్ నుంచి జరుగుతున్న ఎన్నికల్లో వీవీప్యాట్లను వినియోగిస్తున్నామని, రాష్ట్రంలో తొలిసారిగా వీటిని ఉపయోగిస్తున్నామని తెలిపారు. అసెంబ్లీ నియోకవర్గంలో లాటరీ విధానంలో ఒక వీవీప్యాట్‌ను ఎంపిక చేసి, ఇందులో స్లిప్‌లను లెక్కించి ఈవీంఎలో పోలైన ఓట్లతో సరిపోల్చి చూడటం జరుగుతుందన్నారు. వీవీప్యాట్ స్లిప్ ఎండలో ఎండినా, వానలో తడిసినా పాడవదని, ఐదేళ్ల పాటు ఈ స్లిప్ చెరిగిపోకుండా ఉంటుందన్నారు. 1400 ఓటర్లకు ఒక వీవీప్యాట్‌ను వినియోగిస్తామని, ఓటర్లు 1400 మించి ఉంటే మరో పోలింగ్ బూత్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ద్వివేది తెలిపారు. ఆరు నెలల నుంచి వీవీప్యాట్లు, ఎలక్ట్రానికి ఓటింగ్ యంత్రాలపై అధికారులకు శిక్షణ ఇస్తున్నట్లు జాయింట్ సీఈవో మార్కేండేయులు తెలిపారు. ఈ విధానంలో ఈవీఎంల మిషన్లను ట్యాపరింగ్ చేసే అవకాశమే లేదని, స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్టమైన రెండంచెల భద్రతను ఏర్పాటు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. -
పార్టీలకు అనుబంధ సంఘంగా పనిచేయొద్దు
సాక్షి, అమరావతి: ఎన్నికల సమయంలో అధికార పక్షానికో, ప్రతిపక్షానికో అనుకూలంగా పనిచేశారనే ఆరోపణలకు ఆస్కారం ఇవ్వొద్దని, ఎన్నికల నిర్వహణలో తటస్థంగా వ్యవహరించకపోతే చర్యలు తప్పవని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సునీల్ అరోరా స్పష్టం చేశారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని కలెక్టర్లు, ఐపీఎస్‌లతో సోమవారం ఆయన సమీక్షించారు. విజయవాడ నోవాటెల్ హోటల్లో దాదాపు ఆరు గంటలకు పైగా జరిగిన సుదీర్ఘ అంతరంగిక సమావేశంలో ఈసీ దృష్టికి వచ్చిన వివిధ అంశాల్ని సీఈసీ సూటిగా ప్రస్తావించినట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కొందరు అధికారులు రాజకీయ విభాగం(పొలిటికల్ ఎక్స్టెన్షన్ వింగ్)గా పనిచేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయంటూ తన దృష్టికి వచ్చిన అంశాల్ని ప్రస్తావించారు. అలాంటి లోపాలు ఉంటే సరిచేసుకోవాలని, తెలిసి తప్పుచేస్తే కఠిన చర్యలు తప్పవని ఈసీ గట్టిగా చెప్పడంతో సమావేశం అనంతరం పలువురు అధికారులు ఈ అంశంపై చాలా సేపు చర్చించుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. సమావేశంలో ఎన్నికల కమిషన్ ప్రస్తావించిన అంశాల్లో కొన్ని.. ‘కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అసాధారణంగా ఓట్ల చేర్పులు, తొలగింపులు జరిగాయి. కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో 16 నుంచి 18 వేల కొత్త ఓట్లు చేర్చారు. కొన్ని నియోజకవర్గాల్లో 8 వేల వరకు ఓట్లు తొలగించారు. వీటిపై కూడా ఫిర్యాదులు అందాయి. అమాంతం ఓట్లు పెరిగితే పరిశీలించుకోవాలి. ఇప్పటికైనా ఆయా నియోజకవర్గాల్లో ఓట్ల చేర్పులు, తొలగింపులపై సమీక్షించేలా కలెక్టర్లు బాధ్యత వహించాలి. లేదంటే జాతీయ ఎన్నికల కమిషన్ నుంచే ప్రత్యేక టీంలను పంపి సమీక్షించాల్సి ఉంటుంది. ఏకంగా 18 శాతంపైగా ఓట్ల చేర్పులు జరిగితే వాటిపై లెక్క చూపించాల్సిన అవసరం ఉంది. ఓటర్ల లిస్టులపై రాజకీయ పార్టీల నుంచి వచ్చే ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు స్పందించి సత్వర చర్యలు చేపట్టాలి. నియోజకవర్గాల వారీగా మొత్తం ఓట్లు, కొత్త ఓట్లు, తొలగించిన ఓట్ల పూర్తి వివరాలతో ఎన్నికల కమిషన్‌కు నివేదిక ఇవ్వాలి. జిల్లాల్లో ఓటర్ల కోసం 1950 కాల్ సెంటర్ ఏర్పాటు చేశాం. ఓటర్ల అనుమానాల నివృత్తికి, సాయం కోసం కాల్‌సెంటర్‌ను ఉపయోగించుకునేలా ప్రచారం చేయాలి. ఈ కాల్ సెంటర్ 24 గంటలు పనిచేయాలి. గత ఎన్నికల్లో నమోదైన కేసులు ఇంకా పెండింగ్‌లో పెడితే ఉపేక్షించేది లేదు. నాన్‌బెయిల్‌బుల్ వారెంట్(ఎన్బీడబ్ల్యూ) పెండింగ్‌లో ఉంటే అలాంటి వారిని వెంటనే అదుపులోకి తీసుకుని బైండోవర్ చేయాలి. లైసెన్స్డ్ వెపన్స్(ఆయుధాలు)ను స్వాధీనం(డిపాజిట్) చేసుకోవాలి’ అని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సునీల్ అరోరా సూచించినట్లు సమాచారం. వీవీప్యాట్లపై అవగాహన కల్పించండి ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా ఎన్నికల్లో వీవీప్యాట్లను వినియోగిస్తున్నామని, వాటిపై ఓటర్లలో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని సీఈసీ సూచించారు. ఫిర్యాదులపై స్పందించకపోతే ఎన్నికల కమిషన్ ఉపేక్షించదని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన చెప్పారు. జిల్లాల వారీగా ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్లు, ఎస్పీలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. -
నేతలు బడా.. ఖర్చులు చోటా
సాక్షి, హైదరాబాద్: శాసనసభ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా కొండంత వ్యయం చేసిన నేతలు.. ఎన్నికల వ్యయ లెక్కలకు వచ్చేసరికి కొంతే చూపించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి విచ్చలవిడిగా డబ్బులు, మద్యాన్ని పంచిపెట్టినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. నేతలు తాము చాలా తక్కువ ఖర్చు చేసినట్లు లెక్కలు చూపారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి వివరాలు సమర్పించారు. అభ్యర్థుల రోజువారీ ఖర్చును పరిశీలించడానికి వీలుగా జిల్లా ఎన్నికల అధికారులు(డీఈవో) జిల్లాల్లో ఎన్నికల ప్రచారానికి వినియోగించే వస్తువులు, పదార్థాల ధరలను సేకరించి తయారు చేసిన ధరల పట్టికలతో పొంతన లేకుండా అభ్యర్థులు లెక్కలు సమర్పించారు. ఉదాహరణకు కారు రోజువారీ అద్దె, నిర్వహణ వ్యయం కేవలం రూ.800 మాత్రమే. 30 కార్లు/ఇతర వాహనాలను 15 రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో వినియోగించినందుకు కేవలం రూ.4.3 లక్షలు మాత్రమే ఖర్చు అయిందని ఓ మాజీమంత్రి లెక్కలు వేశారు. ఎన్నికల వ్యయపరిశీలకులు సైతం పెద్దగా అభ్యంతరం చెప్పకుండానే ఇలాంటి లెక్కలను ఆమోదించడం గమనార్హం. ఇటీవల ముగిసిన శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థులు చేసిన వ్యయలెక్కలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) కార్యాలయం తన వెబ్సైట్ ద్వారా బహిర్గతం చేసింది. కొందరు ముఖ్య నేతలు సమర్పించిన ఎన్నికల వ్యయలెక్కలు ఇలా ఉన్నాయి. రేవంత్ ఖర్చు రూ.7.4 లక్షలే! ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు అత్యధిక ధనప్రవాహం జరిగిన నియోజకవర్గాల్లో ఒకటిగా కొడంగల్ పేరు సంపాదించింది. ఇక్కడి నుంచి పోటీచేసి ఓడిపోయిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి ఎన్నికల్లో రూ.7,44,280 మాత్రమే ఖర్చుచేసినట్లు నివేదించారు. ఆయనపై గెలిచిన టీఆర్ఎస్ అభ్యర్థి రూ.19,44,503 ఖర్చు చేసినట్లు ఎన్నికల సంఘానికి లెక్కలు సమర్పించారు. లెక్కల్లో ‘ఉత్తమ్’ హుజూర్నగర్ నుంచి గెలుపొందిన టీపీసీసీ చీఫ్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రూ.17,06,473 ఎన్నికల వ్యయం చేసినట్లు లెక్కలు చూపారు. ఎన్నికల ఖర్చుల కోసం రూ.15 లక్షల విరాళాలు, రూ.5 లక్షల చేబదులు అప్పు తీసుకున్నట్లు నివేదించారు. అక్బరుద్దీన్ రూ.12 లక్షలు.. ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ చాంద్రాయణగుట్ట నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఎన్నికల్లో రూ.12,97,005 ఖర్చు చేసినట్లు ఎన్నికల సంఘానికి నివేదించారు. అందులో రూ.6,55,859 కేవలం బహిరంగసభలు, ర్యాలీలు, యాత్రలు నిర్వహించడానికి ఖర్చు చేసినట్లు లెక్కలు చూపారు. నల్లగొండ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన సీనియర్ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సరిగ్గా ఎన్నికల సంఘం అనుమతించిన గరిష్ట వ్యయపరిమితి రూ.28 లక్షలను ఎన్నికల్లో ఖర్చు చేసినట్లు నివేదించడం గమనార్హం. మాజీ ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ రూ.15,42,978 వ్యయమైనట్లు చూపించారు. మాజీ మంత్రి జి.జగదీశ్వర్‌రెడ్డి రూ.16,10,464 ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. కేసీఆర్ రూ.6.53 లక్షలు..కేటీఆర్ రూ.7.53 లక్షలే ఎన్నికల సంఘానికి సమర్పించిన లెక్కల ప్రకారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గజ్వేల్ నుంచి పోటీ చేసేందుకు అయిన ఖర్చు రూ.6,53,639. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు సిరిసిల్ల నుంచి పోటీ చేసేందుకు రూ.7,56,372 ఖర్చు చేశారు. ఎన్నికల వ్యయం ఎందుకంటే? ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంతోపాటు పోటీ చేసేందుకు అభ్యర్థులందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఎన్నికల వ్యయంపై కేంద్ర ఎన్నికల సంఘం పరిమితులు విధించింది. రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఓ అభ్యర్థి గరిష్టంగా రూ.28 లక్షలు ఖర్చు పెట్టవచ్చని పరిమితి పెట్టింది. నామినేషన్ దాఖలు చేసిన రోజు నుంచి ఎన్నికల ఫలితాలు ప్రకటించే తేదీ వరకు పెట్టిన ఎన్నికల ఖర్చు వివరాలను అభ్యర్థులు రాసుకుని చూపెట్టాల్సి ఉంటుంది. అభ్యర్థి తన ఎన్నికల ఖర్చు వివరాలను ఫలితాల ప్రకటన అనంతరం 30 రోజుల్లోగా నిర్దిష్ట పద్ధతిలో సమర్పించకపోయినా లేదా అసలు ఎన్నికల ఖర్చు వివరాలు ఇవ్వడంలో విఫలమైనా, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 10ఏ నిబంధన కింద కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుంది. మూడేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేయనుంది. గత శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి ఖర్చుల వివరాలను సమర్పించడంలో విఫలమైన 46 మంది స్వతంత్ర అభ్యర్థులు ప్రస్తుతం ఈ అనర్హతను ఎదుర్కొంటున్నారు. -
రాష్ట్ర ఓటర్లు 2,80,64,680
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో 2,80,64,680 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం కింద గత అక్టోబర్ 12న తొలి అనుబంధ జాబితాను ప్రచురించిన సంగతి తెలిసిందే. అప్పుడు రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,73,18,603గా ఉంది. ఆ తర్వాత ఓటర్ల నమోదుకు వచ్చిన దరఖాస్తులను పరిష్కరించి ఓటర్ల జాబితా రెండో అనుబంధాన్ని సోమవారం ఎన్నికల సంఘం ప్రచురించింది. ఈ జాబితాలో కొత్తగా 7,46,077 మంది ఓటర్లు చేరినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) రజత్‌కుమార్ వెల్లడించారు. రెండో అనుబంధాన్ని ఒకట్రెండు రోజుల్లో ఎన్నికల సంఘం వెబ్సైట్లో పెడతామన్నారు. సోమవారం రాత్రి ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల స్వీకరణ ముగిసిందన్నారు. 3 గంటల తర్వాత వచ్చిన వారి నామినేషన్లను స్వీకరించలేదన్నారు. ఇప్పటి వరకు ఆరు రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలను సమర్పించాయని చెప్పారు. -
అభ్యంతరకరమైన భాష వాడిన నేతలకు నోటీసులు
-
ఉర్దూ, మరాఠీల్లో ఓటర్ల జాబితాల ప్రచురణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 16 శాసన సభ నియోజక వర్గాల్లో ఉర్దూ.. 3 నియోజక వర్గాల్లో మరాఠీ భాషల్లో ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రచురించింది. ఈ ఓటర్ల జాబితాను తమ కార్యాలయ వెబ్సైట్లో కూడా పొందుపరిచినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) రజత్‌కుమార్ బుధవారం ఓ ప్రకట నలో తెలిపారు. ఎన్నికల నియమావళి ప్రకారం ఒక శాసన సభ నియోజకవర్గంలో అధికార భాష కాకుండా ఇతర భాష మాట్లాడేవారు 20% మించి ఉన్నా, ఇతర భాష అక్షరాస్యులు చెప్పుకో దగ్గ సంఖ్యలో ఉన్నా వారి కోసం ఓటర్ల జాబితా ఆ భాషల్లో ప్రచురించాలి. హైదరాబాద్ జిల్లాలో ని ముషీరాబాద్, మలక్‌పేట, అంబర్ పేట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్‌నగర్, నాంపల్లి, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చాంద్రా యణ్గుట్ట, యాకుత్‌పుర, బహదూర్‌పుర, సికింద్రాబాద్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గాలు.. ఇటు నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ (అర్బన్) నియోజక వర్గంలో ఓటర్ల జాబితాను ఉర్దూలో ప్రచురించా రు. అలాగే అదిలాబాద్ జిల్లాలోని బోధ్, నిర్మల్ జిల్లాలోని ముధోల్, నిజామాబాద్ జిల్లాల్లోని జుక్కల్ అసెంబ్లీ నియోజక వర్గాల్లో మరాఠీలో నూ ఓటర్ల జాబితా ప్రచురించారు. -
వాటిపై ఎలాంటి ఫిర్యాదులు రాలేదు : రజత్ కుమార్
సాక్షి, హైదరాబాద్ : ఈవీఎం, వీవీపాట్లపై ఎలాంటి ఫిర్యాదులు రాలేదని, అన్ని సక్రమంగా ఉన్నాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈవీఎంలపై రాజకీయ పార్టీల అనుమానాల నివృత్తికి 24 గంటలు సిబ్బంది అందుబాటులో ఉంటారని అన్నారు. ఈవీఎంల పరిశీలనను వీడియో చిత్రీకరిస్తున్నామని, ఎప్పటికప్పుడు కేంద్ర ఎన్నికల సంఘానికి పంపుతున్నామని తెలిపారు. ఈవీఎంల రక్షణ బాధ్యత జిల్లా ఎన్నికల అధికారి, సహాయ అధికారులే చూసుకోవాలన్నారు. మీడియా, సోషల్ మీడియాలో రాజకీయ ప్రకటనలకు సంబంధించి ముందస్తు ధ్రువీకరణ పత్రం తీసుకోవాలని చెప్పారు. పలు జిల్లాల్లో ఇంకా ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు వస్తున్నట్లు ఎన్నికల అధికారులు ఈసీ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. అటువంటి పరిస్థితుల్లో ఈవీఎంల సమస్యలు పరిష్కరించటం లేదా కొత్త ఈవీఎంలను జిల్లాల్లో అందుబాటులో పెట్టాలని ఆదేశించారు. వీవీపాట్లలో ఓటరు ఎవరికి ఓటు వేశారో తెలుసుకోవటానికి అన్ని భాషల్లో కనిపించేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఆదిలాబాద్‌లో 10 కోట్లు, హైదరాబాద్‌లో 49 లక్షలు, సైబరాబాద్‌లో 59 లక్షలతో పాటు పలు జిల్లాల్లో డబ్బులు దొరికింది నిజమేనని, దానిపై విచారణ జరుగుతోందని చెప్పారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ క్షేత్రస్థాయిలో పర్యటించటం లేదని, అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశమై వారి సూచనలు, సలహాలు తీసుకుంటారని తెలిపారు. మేజర్ ఎలక్షన్ పనులు అయిపోయాయని, కేంద్ర ఎన్నికల సంఘం పోలీసు ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ఉంటుందన్నారు. -
అభ్యర్థుల ఖాతాలపై నిఘా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులు, వారి బంధువుల బ్యాంకు ఖాతాలపై నిఘా పెట్టాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్ ఆదేశించారు. బ్యాంకుల ద్వారా పెద్ద మొత్తంలో జరిగే ఆర్థిక లావా దేవీలపై ఎప్పటికప్పుడు పరిశీలించాలని కోరారు. ఓటర్లకు మద్యం, డబ్బుల పంపిణీ నిర్మూలనతో పాటు ఎన్నికల బందోబస్తు ఏర్పాట్లపై బుధ వారం ఆయన సచివాలయంలో ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ ముఖ్యకార్యదర్శి సోమేశ్ కుమార్, ఆదాయపన్నుశాఖ డైరెక్టర్ జనరల్ ప్రవీణ్‌కుమార్, అద నపు డీజీ(శాంతి భద్రతలు) నారాయణతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు ఈ నెల 22న సీఈసీ బృందం రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో పలు కీలక అంశాలను చర్చించారు. మద్యం అక్రమ పంపిణీ నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలను సోమేశ్‌కుమార్ వివరించారు. మద్యం కొనుగోళ్లు, అమ్మకాల పర్యవేక్షణకు ప్రతి జిల్లాలో కంట్రోల్ రూంతో పాటుగా నోడల్ అధికారిని నియమించామన్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం రవాణాను నిర్మూలించేందుకు సరిహద్దుల్లో 6 చెక్‌పోస్టులు ఏర్పా టుచేశామన్నారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు జరిగే మద్యం, డబ్బుల పంపిణీని ఎక్సైజ్, పోలీసు, ఐటీ శాఖలు అడ్డుకోవాలని సీఈఓ సూచించారు. -
ఈవీఎంలు.. ఎలాంటి ఆందోళన అవసరం లేదు!
సాక్షి, హైదరాబాద్ : ఈవీఎంలలో సాంకేతిక వినియోగంపై రాజకీయ పార్టీలకు ఎలాంటి ఆందోళన అవసరం లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ మరోసారి స్పష్టం చేశారు. ఇప్పటికే 85 శాతంపైగా ఈవీఎంల తనిఖీ పూర్తయిందని, ఈ నెల 4లోగా అన్ని జిల్లాల్లో తనిఖీలు పూర్తవుతాయని వెల్లడించారు. ఈసారి ఎన్నికల్లో ఈవీఎంలతోపాటు కొత్తగా వీవీపాట్ యంత్రాలను వినియోగిస్తున్న నేపథ్యంలో ఓటర్లకు అవగాహన కల్పించేందుకు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో రాష్ట్ర స్థాయి మాక్ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆ కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించిన రజత్ కుమార్.. ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని రకాలుగా సిద్ధమైనట్లు తెలిపారు. వీవీప్యాట్ యంత్రాల పనితీరు, సాంకేతిక సమస్యలు-పరిష్కారాలను వివరించారు. దేశంలో ఎంతో నమ్మకమైన బీహెచ్ఈఎల్, ఈసీఐఎల్ వంటి సంస్థలు వీవీప్యాట్ లను తయారు చేశాయని, ఎన్నికల్లో వినియోగించే సాంకేతికతపై తమకు పూర్తి విశ్వాసం ఉందని రజత్ కుమార్ తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 10 మొబైల్ వాహనాల ద్వారా వీవీపాట్ యంత్రాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. అలాగే కేంద్ర ఎన్నికల సంఘం సీ-విజిల్ అనే ప్రత్యేక యాప్ ను రూపొందించిందని, ఎన్నికల సమయంలో ప్రజలు అందులో అక్రమాలపై నేరుగా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. -
ముందస్తుపై మాకు సమాచారం లేదు
-
నకిలీ ఓటరు కార్డుల కలకలం
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్ర రాజకీయం మరింత వేడెక్కుతోంది. బెంగళూరు నగరంలోని రాజరాజేశ్వరి నియోజకవర్గంలో దాదాపు 10వేల నకిలీ ఓటరు గుర్తింపుకార్డులు దొరకటం సంచలనం సృష్టించింది. మంజుల అనే ఓ మహిళ పేరుతో రిజిస్టర్ అయి ఉన్న అపార్ట్మెంట్లో జరుగుతున్న నకిలీ కార్డుల ప్రింటింగ్ వ్యవహారం బట్టబయలైంది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేశారు. కాగా, ఇవి అసలైన కార్డుల్లాగే కనబడుతున్నాయని అయితే విచారణలోనే అసలు విషయాలు వెల్లడవుతాయని కర్ణాటక ప్రధాన ఎన్నికల అధికారి సంజీవ్ కుమార్ పేర్కొన్నారు. ‘ఇదే కాంగ్రెస్ సిద్ధాంతం. ఓటర్లు వారికి ఓటేయకపోతే.. నకిలీ ఓటర్లను సృష్టిస్తారు. స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే మునిరత్న నాయుడే ఈ రాకెట్ వెనక ఉన్నారు’ అని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆరోపించారు. ఇక్కడి ఎన్నికను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా ఖండించారు. ఆ ఫ్లాట్ యజమాని మంజుల నంజమారి, పట్టుబడిన రాకేశ్‌లకు బీజేపీతో సత్సంబంధాలున్నాయని ఆరోపించారు. అటు కాంగ్రెస్ బృందం ఈ ఘటనపై ఢిల్లీలో కేంద్ర ప్రధాన ఎన్నికల కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. నకిలీ ఓటరు గుర్తింపు కార్డుల వి వాదంలో కాంగ్రెస్‌ను క్షమించొద్దని మోదీ అన్నారు. -
ఎన్నికలు.. చివరిరోజు నామినేషన్ల వరద
సాక్షి, కోహిమ: నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల దాఖలకు చివరి తేదీ దగ్గర పడుతున్నా ఉలుకు పలుకూ లేకుండా ఉన్న నేతలు చివరి రోజు మాత్రం నామినేషన్ వేశారు. బుధవారం (ఫిబ్రవరి 7) చివరిరోజు కాగా.. అదే రోజు నాగా పీపుల్స్ ఫ్రంట్, నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ, కాంగ్రెస్, బీజేపీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, స్వతంత్రులు కలిపి 253 మంది నేతలు తమ నామినేషన్లు దాఖలు చేశారు. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి 27న నాగాలాండ్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించనున్నారు. మంగళవారం అధికార నాగా పీపుల్స్ ఫ్రంట్ తొలి నామినేషన్ దాఖలు చేయగా, అదేరోజు సీఎం టీఆర్ జెలియాంగ్ తన నామినేషన్ పత్రాలు సమర్పించినట్లు సమాచారం. నాగాల తిరుగుబాటు గ్రూపులు గ్రేటర్ నాగాలాండ్ లేదా నాగాలిమ్ కోసం చేస్తున్న డిమాండ్లు, చర్చల కారణంగా మెజార్టీ నేతలు చివరిరోజు వరకూ నామినేషన్ వేయలేదని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అభిజిత్ సిన్హా తెలిపారు. నామినేషన్ పత్రాలను గురువారం పరిశీలించనుండగా, ఉపసంహరణకు ఫిబ్రవరి 12 చివరితేదీ అని చెప్పారు. ఉన్నతాధికారులతో నాగాలాండ్ సీఎం టీఆర్ జెలియాంగ్ నాగాలాండ్, మేఘాలయాల్లో ఫిబ్రవరి 27న, త్రిపురలో ఫిబ్రవరి 18న ఎన్నికలు జరగనున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లోనూ మార్చి 3న ఎన్నికల లెక్కింపు జరుగుతుంది. త్రిపుర, నాగాలాండ్, మేఘాలయాల్లో ఒక్కో రాష్ట్రంలో 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా, ఎన్నికల్లో ఈవీఎంలకు వీవీ ప్యాట్ మిషన్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ అచల్ కుమార్ జ్యోతి ఇదివరకే స్పష్టం చేశారు. -
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా సిసోడియా
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో)గా ఆర్.పి.సిసోడియాను నియమిస్తూ బుధవారం కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఆయన ప్రస్తుతం గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు భన్వర్‌లాల్ సీఈవోగా పనిచేశారు. ఆయన పదవీ విరమణ చేసిన తర్వాత జాయింట్ సీఈవో అనూప్‌సింగ్ రెండు రాష్ట్రాలకు ఇన్చార్జి సీఈవోగా విధులు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. -
భన్వర్ లాల్‌ను కలిసిన ఎంపీ విజయ సాయిరెడ్డి
-
రెండోదశలో 55% పోలింగ్‌బిహార్
ఎన్నికలు ప్రశాంతం పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో శుక్రవారం జరిగిన రెండోదశలో 55 శాతం పోలింగ్ నమోదైంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో ఆరు జిల్లాల్లోని 32 నియోజకవర్గాలకు జరిగిన పోలింగ్‌లో ఒకటి, రెండు చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. రెండోదశలో మహిళా ఓటర్లే అధికంగా పోలింగ్ బూత్‌లకు తరలివచ్చారని ప్రధాన ఎన్నికల అధికారి వెల్లడించారు. మహిళల్లో 57.5 శాతం మంది పోలింగ్‌లో పాల్గొనగా... పురుషుల్లో 52.5 శాతం మంది ఓట్లేశారని ఆయన చెప్పారు. గయ జిల్లాలోని ఇమామ్‌గంజ్ నియోజకవర్గ పరిధిలో రెండు బాంబులను సీఆర్పీఎఫ్ సిబ్బంది గుర్తించి నిర్వీర్యం చేశారని ఎన్నికల అధికారి తెలిపారు. రెండోదశలో కైమూర్ నియోజకవర్గంలో అత్యధికంగా 57.86 శాతం పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా ఔరంగాబాద్‌లో 52.5 శాతం పోలింగ్ జరిగింది. ఇమామ్‌గంజ్ నియోజకవర్గం నుంచి స్పీకర్ చౌదరీతో తలపడుతున్న మాంఝీ శుక్రవారం ఓటేశారు. ఎన్డీఏ గెలుపు అభివృద్ధికి ఊతం: బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏకి అనుకూలంగా తీర్పిస్తే అభివృద్ధికి ఊతం లభిస్తుందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఎన్డీఏ గెలిస్తే రాజ్యసభలో బలం పెరిగి కీలక బిల్లుల ఆమోదం సాధ్యమవుతుందని, దేశ అభివృద్ధిలో ముందుకు సాతుందని శుక్రవారమిక్కడ విలేకర్లతో పేర్కొన్నారు. కాగా, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ కుడి చేతిపై ఫ్యాన్ పడటంతో స్వల్పంగా గాయపడ్డారు. తూర్పు చంపారన్ల్ లో ఎన్నికల సభా వేదికపై టీ తాగుతుండగా శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. మహాకూటమికి స్వల్ప ఆధిక్యం! న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిపై.. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌ల మహాకూటమి స్వల్ప ఆధిక్యం చూపే అవకాశముందని ఇండియా టుడే-సిసిరో గ్రూపు తాజా సర్వేలో తేలింది. తొలిదశ ఎన్నికలు జరిగిన ఈ నెల 12కు కొన్ని రోజుల ముందు ఈ గ్రూపు నిర్వహించిన రెండో సర్వేలో మొత్తం 243 సీట్లకు గాను మహాకూటమికి 122 సీట్లు, ఎన్డీఏకు 111 సీట్లు దక్కొచ్చని వెల్లడైంది. అయితే ఇదే గ్రూపు నెల కిందట నిర్వహించిన తొలి సర్వేలో ఎన్డీఏకు 125, మహాకూటమికి 106 సీట్లు వస్తాయని తేలడం గమనార్హం. తొలి సర్వేలో యువ ఓటర్లలో 46 శాతం మంది బీజేపీపై మొగ్గు చూపగా రెండో సర్వేలో వారి శాతం 36కు పడిపోయింది. తొలి సర్వేలో సీఎం పదవికి నితీశ్‌పై 28 శాతం మంది, రెండో సర్వేలో 38 శాతం మొగ్గుచూపారు. -
హైకోర్టు తీర్పు తర్వాతే ఆళ్లగడ్డ ఉప ఎన్నిక
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నవంబర్‌లో యువ ఓటర్ల దరఖాస్తుల స్వీకరణ ఒంగోలు: హైకోర్టు తీర్పు ఆధారంగానే కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహిస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ వెల్లడించారు. గురువారం ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ఎన్నిక విషయమై రెండు మూడు రోజుల్లో స్పష్టత రానుందని తెలిపారు. 2015 జనవరి 1నాటికి 18 ఏళ్లు నిండే వారంతా ఓటరుగా పేర్లు నమోదు చేసుకునేందుకు నవంబర్ 1 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు చెప్పారు. 8 ఓట్లకు రూ.5లక్షల ఖర్చా..? ఒంగోలులో జరిగిన సమీక్ష సమావేశంలో అధికారులు చెప్పిన విషయం భన్వర్‌లాల్‌ను ఆశ్చర్యానికి గురి చేసింది. వివరాలివీ...గిద్దలూరు నియోజకవర్గ పరిధిలో 6,276 సర్వీస్ ఓటర్లున్నారు. వీరంతా దేశంలోని వివిధ ప్రాంతాల్లో విధి నిర్వహణలో ఉండటంతో ఎన్నికల అధికారులు అందరికీ పోస్టల్ బ్యాలెట్లు పంపించారు. అందుకుగాను రూ. 5లక్షల ఖర్చయింది. కానీ, ఓటు హక్కు వినియోగించుకున్నది 8మందే. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు భన్వర్‌లాల్ తెలిపారు. -
కేసీఆర్ వ్యాఖ్యలపై నివేదిక ఇవ్వండి
నల్లగొండ కలెక్టర్‌కు రాష్ర్ట ఎన్నికల సంఘం ఆదేశం హైదరాబాద్: ప్రజల మధ్య ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్‌రావు ఎన్నికల ప్రసంగాలు చేస్తున్నారని, తగిన చర్యలు తీసుకోవాలని టీడీపీ చేసిన ఫిర్యాదుపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ స్పందించారు. నల్లగొండ జిల్లాలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో.. ఆయన ప్రసంగానికి సంబంధించిన వీడియో, ఆడియోలతో నివేదికను పంపాల్సిందిగా జిల్లా కలెక్టర్‌ను భన్వర్‌లాల్ ఆదేశించారు. దీని ఆధారంగా కేంద్ర ఎన్నికల కమిషన్‌కు భన్వర్‌లాల్ ఓ నివేదిక పంపించనున్నారు. కాగా, రాజకీయ పార్టీల ఎన్నికల ప్రణాళికలపైనా ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఆయా పార్టీల నుంచి వివరణ కోరామని, అయితే ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని భన్వర్‌లాల్ బుధవారం తెలిపారు. పార్టీల నుంచి వచ్చే వివరణలను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తామని చెప్పారు. -
15 నుంచి ఓటర్ స్లిప్పుల జారీ
తనిఖీల్లో దొరికిన మొత్తం రూ. 92.58 కోట్లు 69.50 కిలోల బంగారం, 289.74 కిలోల వెండి స్వాధీనం రాష్ర్ట ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ వెల్లడి హైదరాబాద్: తెలంగాణలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. 17 పార్లమెంట్ స్థానాలకు గాను 267 మంది రంగంలో మిగిలారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1682 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ శనివారం వెల్లడించారు. తెలంగాణ ప్రాంతంలో ఈ నెల 12వ తేదీ వరకు ఓటర్ల సంఖ్య 2,81,66,266గా ఉందని చెప్పారు. సీమాంధ్ర ప్రాంతంలో 3.63 కోట్ల మందితో కలిపి రాష్ట్రం మొత్తం మీద 6.45 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు వివరించారు. తెలంగాణలో ఈ నెల 30న పోలింగ్ జరుగనున్నందున, 28వ తేదీ సాయంత్రం ఐదు గంటలతో ప్రచార పర్వానికి తెరపడుతుందన్నారు. 15 కంటే ఎక్కువ మంది అభ్యర్థులు రంగంలో ఉన్న స్థానాల్లో రెండేసి ఈవీఎంలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఈ నెల 15 నుంచి ఇంటింటికీ ఓటరు స్లిప్పుల పంపిణీ మొదలవుతుందని, వారంలో ఈ ప్రక్రియ పూర్తవుతుందని భన్వర్‌లాల్ చెప్పారు. ఓటరు స్లిప్పులను ఓటర్‌కు లేదా వారి కుటుంబ సభ్యులకు మాత్రమే ఇస్తామని, అందువల్ల ఈ వారం పాటు ఇళ్లలో ఎవరో ఒకరు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఫొటోలతో కూడిన ఓటర్ స్లిప్పులను గుర్తింపు కార్డులుగా కూడా ఉపయోగించుకోవచ్చని చెప్పారు. వాటిలో పోలింగ్ కేంద్రం సంఖ్య, ప్రాంతం, పోలింగ్ సమయం ముద్రించి ఉంటుందని వివరించారు. మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి చీరలు, ఇతర సామగ్రి పంపిణీకి సంబంధించి కలెక్టర్ నుంచి నివేదిక అందిందని, దాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించామని, వారి ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. నోటా గుర్తు విషయంలో హైకోర్టు ఆదేశాలపై ఈసీకి నివేదించామని, వారే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని భన్వర్‌లాల్ తెలిపారు. దేశంలోనే అత్యధికంగా నగదు స్వాధీనం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి నగదు తరలిస్తున్న వారి నుంచి రాష్ర్టవ్యాప్తంగా ఇప్పటి వరకు 92.58 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. ఇది దేశంలోనే అత్యధికమని తెలిపారు. అలాగే 69.50 కిలోల బంగారం, 289.74 కిలోల వెండితోపాటు 3.48 లక్షల లీటర్ల అక్రమ మద్యాన్ని సీజ్ చేసినట్లు వెల్లడించారు. ఈ డబ్బును కోర్టుకు అప్పగించి, ఆదాయపన్ను శాఖకూ సమాచారమిస్తున్నామన్నారు. సరైన ఆధారాలను చూపించి డబ్బును తిరిగి పొందవచ్చని, అలాగే ఆదాయపన్ను శాఖకు సరైన వివరాలు ఇవ్వలేనిపక్షంలో వారు విధించే జరిమానా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కాగా.. రాష్ట్రానికి 400 కంపెనీల కేంద్ర బలగాలు రానున్నాయని, వాటిని నక్సల్ ప్రభావిత, ఫ్యాక్షన్ ప్రాంతాల్లో వినియోగించనున్నామని చెప్పారు. మల్కాజిగిరి, సికింద్రాబాద్ ఎంపీకి పోటీ ఎక్కువ నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజైన శనివారం 39 మంది ఎంపీ అభ్యర్థులు, 554 మంది అసెంబ్లీ అభ్యర్థులు బరి నుంచి తప్పుకొన్నారు. దీంతో మల్కాజిగిరి, సికింద్రాబాద్ లోక్‌సభ స్థానాల నుంచి అత్యధికంగా 30 మంది చొప్పున, నాగర్‌కర్నూలుకు అత్యల్పంగా ఆరుగురు అభ్యర్థులు పోటీలో మిగిలారు. నియోజకవర్గాలవారీగా చూస్తే.. ఆదిలాబాద్(8), పెద్దపల్లి(17), కరీంనగర్(17), నిజామాబాద్(16), జహీరాబాద్(10), మెదక్(13), మల్కాజిగిరి(30), సికింద్రాబాద్(30), హైదరాబాద్(16), చేవెళ్ల(16), మహబూబ్‌నగర్(10), నాగర్‌కర్నూల్(6), నల్లగొండ(9), భువనగిరి(13), వరంగల్(12), మహబూబాబాద్(17), ఖమ్మం ఎంపీ స్థానానికి 27 మంది రంగంలో ఉన్నారు. ఆందోల్ అసెంబ్లీ స్థానానికి ఐదుగురే..: మెదక్ జిల్లా అందోల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఐదుగురే రంగంలో నిలవగా.. ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్, ఖమ్మం అసెంబ్లీ స్థానాలకు అత్యధికంగా 25 మంది చొప్పున పోటీలో ఉన్నారు. కాగా జిల్లాల వారీగా చూస్తే... ఆదిలాబాద్‌లో 10 స్థానాలకు 124 మంది, నిజామాబాద్‌లో 9 సీట్లకు 101 మంది, కరీంనగర్‌లోని 13 నియోజకవర్గాలకు 168 మంది, మెదక్‌లో పది స్థానాలకు 105 మంది, రంగారెడ్డిలో 14 స్థానాలకు 284 మంది, హైదరాబాద్‌లో 15 స్థానాలకు 298 మంది, మహబూబ్‌నగర్‌లో 14 స్థానాలకు 144 మంది, నల్లగొండలోని 12 స్థానాల్లో 161 మంది, వరంగల్‌లో 12 నియోజకవర్గాలకు 154 మంది, ఖమ్మంలో పది స్థానాలకు 143 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు.