సాక్షి, అమరావతి: ఏపీలో తుది పోలింగ్ శాతంపై ఎన్నికల కమిషన్ లెక్కలు తేలుస్తోంది. జిల్లాల నుంచి వచ్చిన సమాచారాన్ని ఈసీ వర్గాలు క్రోడీకరిస్తున్నాయి. ఈసారి పోలింగ్ 80 శాతం దాటే అవకాశం ఉంది. నేటి సాయంత్రానికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
కాగా రాష్ట్రంలో 81శాతం పోలింగ్ నమోదు కావొచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా తెలిపారు. ఈ ఎన్నికల్లో రాత్రి 12 వరకు 78.25 శాతం నమోదైనట్లు అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
1.2 శాతం పోస్టల్ బ్యాలెట్‌తో కలుపుకొని 79.40 శాతం పోలింగ్ నమోదైందని ఎంకే మీనా పేర్కొన్నారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 2 గంటల వరకూ పోలింగ్ జరిగిందని అన్నారు. పోలింగ్ పర్సంటేజ్‌పై సాయంత్రానికి పూర్తి వివరాలు వస్తాయని చెప్పారు. అయితే 2019 ఎన్నికల్లో 79.64 శాతం పోలింగ్ నమోదైందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment