Mukesh Kumar Meena
-
ఆధారం ఉంటే ఒట్టు.. అంతా కనికట్టు!
ఫిర్యాదే ఓ కుట్ర.. నివేదికే బూటకం.. కేసే అక్రమం.. ఎఫ్ఐఆర్ కుయుక్తి.. వెరసి దర్యాప్తు పేరుతో వేధింపులు.. అబద్ధపు వాంగ్మూలాలే ఆధారం.. ఇదీ రాష్ట్రంలో సీఐడీ, సిట్ పేరిట అరాచకం. చంద్రబాబు ప్రభుత్వ కుట్రకు తార్కాణం. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై అక్రమ కేసు పేరుతో సాగిస్తున్న రెడ్‌బుక్ కుతంత్రం. ఇందులో భాగంగా కూటమి సర్కారు సిట్ పేరిట ఓ అరాచక వ్యవస్థను సృష్టించి, సాగిస్తున్న వేధింపులు వెర్రి తలలు వేస్తున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అవినీతి అంటూ గగ్గోలు పెట్టిన చంద్రబాబు ముఠా.. అధికారంలోకి వచ్చాక ఒక్క ఆరోపణను నిరూపించలేక చేతులెత్తేసింది. దాంతో తిమ్మిని బమ్మి చేసైనా సరే వేధించాలని లక్ష్యంగా పెట్టుకుని మద్యం విధానంపై అక్రమ కేసుతో రంగంలోకి దిగింది. ఫిర్యాదు మొదలు దర్యాప్తు వరకు సాగుతున్న కుతంత్రం విస్తుగొలుపుతోంది. - సాక్షి, అమరావతికుట్రపూరితంగా ఫిర్యాదువైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై అక్రమ కేసు కోసం కూటమి ప్రభుత్వ పెద్దలు పక్కా పన్నాగంతో పావులు కదిపారు. అందుకోసం కుట్రపూరితంగా ఎవరికీ అనుమానం కలగని రీతిలో వెంకటేశ్వరరావు, శ్రీనివాస్ అనే ఇద్దరు ప్రైవేటు వ్యక్తులను తెరపైకి తెచ్చారు. మద్యం విధానంలో అవినీతి జరిగిందంటూ.. విచారణ చేయాలని వారిద్దరూ ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేశ్ కుమార్ మీనాకు గత ఏడాది సెప్టెంబరు 9న ఫిర్యాదు చేశారు. వాస్తవానికి ప్రభుత్వ శాఖల్లో అవినీతి జరిగిందని భావిస్తే పోలీసు, ఏసీబీ, సీఐడీ తదితర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయాలి. లేదా న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. అంతేగానీ ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేయరు. అయితే ఈ ఇద్దరూ అటు దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయలేదు. ఇటు న్యాయస్థానాన్నీ ఆశ్రయించ లేదు. ఎందుకంటే వీరి వద్ద ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి. వీరిద్దరి నుంచి ఫిర్యాదు అందుకున్న ముఖేశ్ కుమార్ మీనా.. ప్రభుత్వ పెద్దల కుట్రను కొనసాగిస్తూ తర్వాత అంకానికి తెరతీశారు. ఆయన ఆ ఫిర్యాదు కాపీని ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ ఎండీకి పంపించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.రూ.4 వేల కోట్ల కట్టు కథమద్యం కొనుగోళ్లు, ఇతర రికార్డులన్నీ బెవరేజస్ కార్పొరేషన్ కార్యాలయంలోనే ఉంటాయి. ఏయే తేదీల్లో ఏయే డిస్టిలరీలకు ఎంత విలువైన ఆర్డర్లు ఇచ్చారన్న వివరాలు వారి వద్దే ఉంటాయన్నది బహిరంగ రహస్యం. మద్యం విధానంలో అక్రమాలకు పాల్పడితే ఇవిగో అని చూపించవచ్చు. ఇక్కడ ఎలాంటి స్కామ్ జరగలేదు కాబట్టి బెవరేజస్ కార్పొరేషన్ ఎలాంటి ఆధారాలు చూపించ లేదు. అయితే ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగా కేవలం తొమ్మిది రోజుల్లోనే అవినీతి కట్టుకథను సృష్టించారు. ఏకంగా రూ.4 వేల కోట్ల అవినీతి జరిగినట్టు నివేదిక ఇచ్చేశారు. అంటే ఎక్సైజ్ శాఖే తూతూ మంత్రపు విచారణతో రూ.4 వేల కోట్ల అక్రమాలంటూ చంద్రబాబు కుట్రను వండి వర్చేసింది. అంతా అనుకున్నట్టు కుట్ర కథను నడిపించిన తర్వాత, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేశ్ కుమార్ మీనా ఈ విషయంపై సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఎఫ్ఐఆర్ సాక్షిగా అక్రమ కేసు ఇక ప్రభుత్వ పెద్దల కుట్రకు పదును పెట్టడం తమ వంతు అని సీఐడీ రంగంలోకి దిగింది. పక్కా పన్నాగంతో బెవరేజస్ కార్పొరేషన్ ఇచ్చిన నివేదిక, ఎక్సైజ్ శాఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్రమ కేసు నమోదు చేసేసింది. నిందితులు ఎవరో కూడా పేర్కొనకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అంటే ఎఫ్ఐఆర్ నమోదు చేసే నాటికి అందులోని ఏడో కాలమ్‌లో నిందితులను చూపించలేదు. నిందితులు ఎవరో తెలీదని కూడా వెల్లడించింది. అంటే ప్రభుత్వ పెద్దలు ఎవరెవరి పేర్లను చెబితే వారందరినీ నిందితులుగా చూపించేందుకు కుట్ర పూరితంగా వ్యవహరించింది. ఎవరు ఎవర్ని మోసం చేశారన్న కనీస సమాచారం కూడా ఎఫ్ఐఆర్లో పేర్కొన లేదు. పైగా ఐపీసీ సెక్షన్ 420ని చేరుస్తూ కేసు నమోదు చేయడం విడ్డూరం. అసలు కుట్ర ఏమిటన్నది పేర్కొనకుండా, అవినీతి ఏమిటన్నది చూపకుండా ఐపీసీ సెక్షన్లు 409, 120 బి కింద అభియోగాలు నమోదు చేసింది. తద్వారా బెవరేజస్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు, ఉద్యోగులు అందరిపైనా అక్రమ కేసు నమోదు చేసేందుకు ముందస్తు ఎత్తుగడ వేసింది. ఎఫ్ఐఆర్లోని తొమ్మిదో కాలమ్‌లో పేర్కొనాల్సిన ఆ కేసులో అక్రమాలకు సంబంధించిన ఆస్తుల వివరాలు కూడా వెల్లడించ లేదు. అవసరమైతే ప్రత్యేకంగా నివేదిస్తామని చెప్పడం గమనార్హం. అవసరమైతే.. అన్నది ఏమిటో సీఐడీ ఉన్నతాధికారులకే తెలియాలి. ఒక కేసు దర్యాప్తు చేస్తున్నప్పుడు అక్రమాలకు సంబంధించిన అంశాలు అన్నీ అవసరమైనవే కదా.. అని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అంటే ఎఫ్ఐఆర్ నమోదు చేసే నాటికి సీఐడీ వద్ద కనీసం ప్రాథమిక ఆధారాలు కూడా లేవన్నది సుస్పష్టం. దీన్నిబట్టి బెవరేజస్ కార్పొరేషన్ ఇచ్చిన నివేదిక పూర్తిగా కట్టుకథేనని స్పష్టమవుతోంది. అందుకే అక్రమాలకు సంబంధించిన ఆస్తుల వివరాలను వెల్లడించ లేకపోయారు. కానీ ఎఫ్ఐఆర్లోని పదో కాలమ్‌లో ఈ వ్యవహారంలో ఏకంగా రూ.4 వేల కోట్ల కంటే ఎక్కువ అవినీతి జరిగినట్టుగా పేర్కొనడం విడ్డూరం. నిందితులు తెలీదు.. ఆ కేసుకు సంబంధించిన ఆస్తుల వివరాలు లేవు.. కానీ రూ.4 వేల కోట్ల అవినీతి జరిగినట్టు మాత్రం కథ అల్లేశారు. ఈ లెక్కన ఎంతటి నిరాధార ఆరోపణలో.. ఎంతటి అక్రమ కేసో అన్నది తేటతెల్లమవుతోందని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.కట్టు కథకు తగ్గట్టు వాంగ్మూలాలు ఈ కేసు దర్యాప్తు పేరిట వేధింపులు, అరాచకాల కుట్రకు బరితెగించేందుకు సీఐడీ సరిపోదని చంద్రబాబు ప్రభుత్వం భావించింది. అందుకే ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పేరుతో అరచకానికి తెగించింది. ఎలాంటి ఆధారాలు లేని కేసులో అబద్ధపు ఆధారాలు సృష్టించేందుకు సిట్ రెండు నెలలుగా పాల్పడుతున్న వేధింపులే ఇందుకు నిదర్శనం. దర్యాప్తు పేరిట బెవరేజస్ కార్పొరేషన్ అధికారులు, ఉద్యోగులను తీవ్ర స్థాయిలో వేధిస్తోంది. ఆ కేసులో సాక్షుల పేరిట వారిని విచారిస్తూ కనికట్టు చేస్తోంది. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వాలని బెదిరిస్తోంది. శారీరకంగా, మానసికంగా హింసిస్తోంది. సిట్ వేధింపులు తట్టుకోలేక ఉద్యోగులు ఇచ్చిన అబద్ధపు వాంగ్మూలాలను తమ అక్రమ కేసుకు ఆధారంగా చేసుకుంటోంది. ఈ క్రమంలో బెవరేజస్ కార్పొరేషన్ అధికారులు, ఉద్యోగులు తాము సాక్షులుగా భావిస్తూ సిట్ నుంచి తప్పించుకునేందుకు అబద్ధపు వాంగ్మూలాలు ఇస్తున్నారు. ఓసారి వాంగ్మూలాల నమోదు పూర్తయిన తర్వాతే వారినే ఈ కేసులో నిందితులుగా చేర్చాలన్నది సిట్ పన్నాగం. ఈ కేసులో ఎవరెవరిని ఏ విధంగా ఇరికించాలి.. కనికట్టు చేసి జనాన్ని ఎలా నమ్మించాలి.. జరగని నేరాన్ని జరిగినట్లు ఏ విధంగా చూపించాలన్నది టీడీపీ ప్రధాన కార్యాలయంలో తయారయ్యే స్క్రిప్టు మేరకు జరుగుతోంది. అవే డిస్టిలరీలు.. పెరిగిన ఆదాయం.. ఇంకెక్కడ అవినీతి?వాస్తవానికి డిస్టిలరీల ముసుగులో దందా సాగించింది చంద్రబాబే. మద్యం విధానం ముసుగులో చంద్రబాబు తన బినామీలు, సన్నిహితులకు చెందిన మద్యం డిస్టిలరీలకు అడ్డగోలుగా లబ్ధి చేకూర్చారు. వారి ద్వారా ఖజానాకు గండి కొట్టి, నిధులను సొంత ఖజానాకు మళ్లించుకున్నారు. రాష్ట్రంలో 20 మద్యం డిస్టిలరీలు ఉండగా, వాటిలో 14 డిస్టిలరీలకు చంద్రబాబు ప్రభుత్వమే అనుమతులు ఇచ్చింది. మిగిలిన ఆరు డిస్టిలరీలకు అంతకు ముందు ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. (వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019–24 మధ్య ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వనే లేదు) 2014 నవంబర్‌లో జీఓ నెంబర్ 993 ప్రకారం రెవెన్యూ (ఎక్సైజ్) డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా, కమిటీ సూచించిన వాటి కంటే ఎక్కువ డిస్టిలరీల స్థాపనకు టీడీపీ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఇక అప్పటి వరకు ఊరూ పేరూ తెలియని బ్రాండ్ల మద్యం అమ్మకాలకు చంద్రబాబు ప్రభుత్వమే అనుమతులు ఇచ్చింది. డిస్టిలరీలతో కుమ్మక్కై కొన్ని ఉత్పత్తులకు కృత్రిమ డిమాండ్‌ను సృష్టించి దోపిడీకి తెర తీసింది. 2015–2019 మధ్య ఇలా నాలుగైదు కంపెనీలకు లబ్ధి చేకూరింది. వీరి నుంచే 70 శాతం కొనుగోళ్లు చేశారు. ఈ నేపథ్యంలో 2019–24 మధ్య కొత్తగా ఒక్క డిస్టిలరీ కూడా రాలేదు. పైగా మద్యం విక్రయాల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది. ఈ లెక్కన అవినీతికి తావెక్కడ? అంతా చంద్రబాబు అండ్ కో కట్టుకథే. -
BIG Queation: ఈసీ బండారం బట్టబయలు.. సుప్రీం ఆర్డర్లు పక్కనపెట్టి లెక్కలు చెప్పమంటే నీళ్లు నములుతూ..
-
KSR Live Show: ఈవీఎంలపై అనుమానాలు నిజమే.. ఉండవల్లి బయటపెట్టిన సంచలన నిజాలు
-
KSR Live Show: ఈవీఎంలపై అనుమానాలు నిజమే.. ఉండవల్లి బయటపెట్టిన సంచలన నిజాలు
-
KSR Live Show: అనుమానాస్పదంగా ఏపీ ఎన్నికల అధికారి తీరు
-
ఎన్నికల అధికారులకు అభినందనలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని శాంతియుతంగా పూర్తిచేసినందుకు, మొత్తం ఎన్నికల ప్రక్రియను అత్యంత ప్రొఫెషనల్ పద్ధతిలో నిర్వహించినందుకు జిల్లాల ఎన్నికల అధికారులకు, ఆర్వోలకు, ఎన్నికల సిబ్బందికి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా అభినందనలు తెలిపారు. ఇటువంటి ప్రతిభావంతులైన అధికారుల బృందానికి నాయకత్వం వహించినందుకు ఎంతో గర్వపడుతున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్య పండుగను రాష్ట్రంలో ఎంతో విజయవంతంగా నిర్వహించడంతోపాటు ఓట్ల లెక్కింపు ప్రక్రియలో రాష్ట్రవ్యాప్తంగా అనుసరించిన మంచి పద్ధతులను భవిష్యత్తు తరాలవారికి ఎంతో ఆదర్శంగా, మార్గదర్శకంగా ఉండే విధంగా ఒక కరదీపిక రూపొందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా అనుసరించిన వినూత్న పద్ధతులను భారత ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లేందుకు మూడు రోజుల్లో తమ కార్యాలయానికి నివేదికలు పంపాలని కోరారు. అన్ని జిల్లాల నివేదికల ఆధారంగా సమగ్ర నివేదికను రూపొందించి భారత ఎన్నికల సంఘానికి పంపుతామని చెప్పారు. ఐదేళ్లకు ఒకసారి నిర్వహించే ప్రజాస్వామ్య పండుగను రాష్ట్రంలో ఎంతో విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. విమర్శలకు ఆస్కారం లేకుండా రూపొందించిన శుద్ధమైన ఓటర్ల జాబితా మొత్తం ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా నిర్వహించేందుకు నాందిపలికిందని చెప్పారు. ఈ జాబితా రూపొందించేందుకు కృషిచేసిన అధికారులకు, సిబ్బందికి, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు, ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భారత ఎన్నికల సంఘం 2024 మార్చి 16న ఎన్నికల షెడ్యూలు ప్రకటించినప్పటి నుంచి జూన్ 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తిచేసేంతవరకు రాష్ట్రస్థాయి నుంచి జిల్లా, మండలస్థాయి వరకు ఎన్నికల యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం ఎంతో నిబద్ధతతో విధులు నిర్వర్తించినట్లు చెప్పారు. ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ యంత్రాంగం అవిరళ కృషిచేసిందన్నారు. కొన్నిచోట్ల చెదురుమదురు సంఘటనలు మినహా మొత్తం ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహంచడంలో సహకరించిన రాజకీయపక్షాల ప్రతినిధులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
రాష్ట్రంలో రూ.483.15 కోట్ల నగదు, సొత్తు స్వాధీనం: ముఖేష్‌కుమార్ మీనా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని ఈ ఏడాది జనవరి 1 నుంచి ఈనెల 2 వరకు రూ.483.15 కోట్ల విలువైన నగదు ఇతర సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లతోపాటు ఎన్నికల కోడ్ అమల్లో భాగంగా చేపట్టిన చర్యలను సోమవారం సచివాలయంలో ఆయన మీడియాకు వెల్లడించారు. ఎన్నికల కోడ్ అమల్లో భాగంగా రూ.170 కోట్ల నగదు, రూ.61.66 కోట్ల విలువైన లిక్కర్, రూ.35.97 కోట్ల విలువైన డ్రగ్స్, రూ.186.17 కోట్ల విలువైన ఆభరణాలు, రూ.29.34 కోట్ల విలువైన ఉచితాల వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. వీటన్నింటికీ సంబంధించి 11,249 కేసులను, ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి 1,270 కేసులను నమోదు చేసినట్లు మీనా తెలిపారు. ఇక ఎన్నికల హింసలో ఇద్దరు మృతిచెందగా 912 మందికి గాయాలయ్యాయన్నారు. ఈ హింస సందర్భంగా రూ.1,19,13,650 కోట్ల విలువైన ఆస్తి నష్టం జరిగిందన్నారు. 1,03,461 మందిని బైండోవర్ చేశామని.. అలాగే, సమస్యలు, అల్లర్లు సృష్టించే 551 మందిని గుర్తించి చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు.తొలిసారిగా 1,985 ప్రాంతాల్లో కార్టన్ సెర్చ్..ఇదిలా ఉంటే.. సి–విజిల్ ద్వారా 24,557 ఫిర్యాదులు రాగా అందులో 95 శాతం ఫిర్యాదులను 100 నిమిషాల్లోనే పరిష్కరించినట్లు ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు. పోలింగ్ అనంతరం హింసను నివారించేందుకు రాష్ట్రంలో తొలిసారిగా కార్టన్ సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించామని.. సమస్యాత్మకమైన 1,985 ప్రాంతాలను గుర్తించి అక్కడ సోదాలు నిర్వహించారని ఆయన తెలిపారు. ఇప్పటివరకు 1,200 సోదాలు నిర్వహించడం ద్వారా 4,595 వాహనాలను, 1,269 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు 153 మందిపై కేసులు నమోదుచేశామని ఆయన వివరించారు. పోలింగ్ అనంతరం సమస్యలను, అల్లర్లను సృష్టించే 12,639 మందిని గుర్తించి సీఆర్పీసి కింద బైండోవర్ చేసినట్లు మీనా తెలిపారు. -
Watch Live: ఏపీ ఎన్నికల ఫలితాలపై సీఈఓ ముకేశ్ కుమార్ కీలక ప్రెస్ మీట్
-
ఏపీలో కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి: సీఈవో ఎంకే మీనా
సాక్షి, విజయవాడ: ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు సీఈవో ఎంకే మీనా తెలిపారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్‌ను లెక్కించనున్నట్టు వెల్లడించారు.కాగా, సీఈవో ముఖేష్ కుమార్ మీనా సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘ఏపీలో కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. తర్వాత ఈవీఎం బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడెంచెల భద్రతను ఏర్పాటు చేస్తున్నాం. 119 మంది పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది’ అని చెప్పారు. -
అవాంతరాలను ఉపేక్షించొద్దు: ముఖేష్‌కుమార్ మీనా
సాక్షి, అమరావతి: ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఎలాంటి అవాంతరాలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఆటంకాలు కలిగించేందుకు ప్రయత్నించే వారిని ఉపేక్షించొద్దని.. నిర్దాక్షిణ్యంగా బయటకు పంపడమే కాకుండా చట్టపరంగా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ఆదివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 4న నిర్వహించనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమ ఏర్పాట్లను జిల్లాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో తీవ్రమైన పోటీ నెలకొన్న దృష్ట్యా ఓట్ల లెక్కింపు జరిగే 4వ తేదీతో పాటు దానికి ముందు, తర్వాత రోజుల్లో భావోద్వేగాలు అదుపుతప్పే అవకాశం ఉందన్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఉత్పన్నం కాకుండా, వాటి ప్రభావం ఓట్ల లెక్కింపు కార్యక్రమాలపై ఉండకుండా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో ఏమాత్రం రాజీపడకుండా కఠినంగా వ్యవహరించాలని మీనా సూచించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..కౌంటింగ్ పూర్తికాగానే ఈవీఎంలను భద్రపర్చాలి..ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే వాయిదా వేయకుండా అదేరోజు ప్రతి ఈవీఎంకు సీల్‌వేసి భద్రపర్చాలి. ఫలితాల ప్రకటనకు సంబంధించిన ఫారం–21సి/21ఇ లు ఓట్ల లెక్కింపు పూర్తయిన మరుసటి రోజే ఈసీఐకి చేరేలా చేపట్టాల్సిన చర్యలపై మార్గదర్శకాలను జారీచేశాం. అందుకనుగుణంగా చర్యలు చేపట్టాలి. ఇండెక్స్ కార్డులో ఎలాంటి తప్పులకు ఆస్కారంలేకుండా ఎంతో జాగ్రత్తగా ఆ కార్డును పూరించాలి. ఆయా కార్డులు అన్నీ ఈనెల 8లోపు మా కార్యాలయానికి అందజేయాలి. ప్రతి టేబుల్ వద్ద ఒక్కో ఏజెంట్..ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక ఏజంట్‌ను నియమించుకునే అవకాశాన్ని కల్పించాలి. అయితే, ఆర్వో టేబుల్ వద్ద అభ్యర్థి లేనప్పుడు మాత్రమే ఒక ఏజంట్‌కు అవకాశం కల్పించాలి. కౌంటింగ్ కేంద్రంలోకి వచ్చే ఏజెంట్ చేతిలో ఫారం–17సి, పెన్ను లేక పెన్సిల్, ప్లెయిన్ పేపర్ మాత్రమే ఉండేలా చూడాలిజ అంతకుమించి ఏమున్నా అనుమతించొద్దు. అథారిటీ లెటర్లు కలిగిన పాత్రికేయులు అందరినీ మీడియా కేంద్రంలోకి అనుమతించాలి. వారు సెల్‌ఫోన్ కలిగి ఉన్నప్పటికీ అభ్యంతరం చెప్పొద్దు. కౌంటింగ్ సెంటర్లోకి మాత్రం సెల్‌ఫోన్‌తో వారిని అనుమతించడానికి వీల్లేదు.కౌంటింగ్‌కు పటిష్ట చర్యలు..ఓట్ల లెక్కింపు కేంద్రాలు అన్నీ ఫైర్‌సేఫ్టీ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. అందుకు తగ్గట్లుగా అగ్నిమాపక శాఖ నుండి ధృవీకరణ పత్రాన్ని తప్పనిసరిగా పొందాలి. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ప్రవేశం, నిష్క్రమణ ప్రణాళికను పటిష్టంగా ఏర్పాట్లుచేసుకోవాలి. ఈ ప్రణాళికకు జిల్లా స్థాయి కమిటీ ఆమోదం తప్పనిసరిగా ఉండాలి. అదే విధంగా ప్రవేశం, నిష్క్రమణ ద్వారాలను తెలిపే సైన్ బోర్డులను అన్నిచోట్లా ఏర్పాటుచేయాలి. మొత్తం మీద ఓట్ల లెక్కింపు కార్యక్రమం విజయవంతానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలి.అదనపు సీఈఓలు పి. కోటేశ్వరరావు, సీఈఓ ఎంఎన్ హరేంధిర ప్రసాద్, జాయింట్ సీఈఓ ఎస్. వెంకటేశ్వరరావుతో పాటు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు వారి జిల్లాల నుండి ఈ వీడియో కాన్షరెన్స్‌లో పాల్గొన్నారు. -
KSR Live Show: మరో నిమ్మగడ్డలా ముకేశ్ కుమార్ మీనా
-
ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం
సాక్షి, మచిలీపట్నం: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమం జూన్ 4న నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు. ఈ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీల నేతలు, ఏజెంట్లు, కార్యకర్తలు సహకరించాలని కోరారు. కృష్ణాజిల్లా మచిలీపట్నానికి గురువారం వచ్చిన ఆయన కృష్ణా విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. అక్కడ ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూములు.. భద్రత, కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఇక్కడ చేసిన, చేయనున్న ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ ఆస్మిలను అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గాల వారిగా లెక్కింపు కేంద్రాలు, టెబుళ్లు, రౌండ్ల కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కౌంటింగ్‌ను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. లెక్కింపు సమయంలో అభ్యర్థి లేదా వారి ఏజెంట్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే వారిని కౌంటింగ్ హాల్ నుండి బయటకు పంపేస్తామన్నారు. కౌంటింగ్ రోజున ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని ముఖేష్‌కుమార్ మీనా అధికారులకు సూచించారు. పోస్టల్ బ్యాలెట్ల అంశం సీఈసీ పరిధిలో ఉంది..పోస్టల్ బ్యాలెట్లపై వైఎస్సార్సీపీ చేసిన విన్నపాన్ని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ దృష్టికి తీసుకెళ్లామని, అది సీఈసీ పరిధిలో ఉందని ముఖేష్‌కుమార్ మీనా వెల్లడించారు. నేడో, రేపో దీనిపై స్పష్టత వచ్చే అవకాశముందన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్, గన్నవరం రిటర్నింగ్ అధికారి గీతాంజలి శర్మ, డీఆర్ఓ కె.చంద్రశేఖరరావు, పలువురు రిటర్నింగ్ అధికారులు, పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి షాహిద్ బాబు, సర్వే ల్యాండ్ రికార్డుల ఏడీ మనీషా త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు. -
కుట్రపూరితం! పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటుపై ఈసీ కొత్త నిబంధనలు ఎందుకు?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరుపై ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో వేటిని ఆమోదించాలి, వేటిని తిరస్కరించాలని స్పష్టమైన నిబంధనలు కేంద్ర ఎన్నికల సంఘం తన నిబంధనల పుస్తకంలో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ వాటిని సవరిస్తూ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా మారనున్నాయంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తాజా సవరణల వల్ల దొంగ ఓట్లకు ఆస్కారం కల్పించడమే కాకుండా నిజమైన ఓట్లు చెల్లకుండా పోయే అవకాశం ఉందంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘ నిబంధనల్లో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుంటున్న ఓటరు తన వివరాలు, బ్యాలెట్ నంబర్‌తో డిక్లరేషన్ ఫాం13ఏ సమర్పించాలని, ఈ ఓటరు తనకు తెలుసని ఒక గెజిటెడ్ అధికారి ధృవీకరించి సంతకం చేస్తూ.. పొడి అక్షరాలతో ఆ అధికారి పేరు, హోదా వివరాలు, చిరునామాతో పాటు సీల్ వేయాలని స్పష్టంగా ఉంది. మన రాష్ట్రం విషయానికి వస్తే గెజిటెడ్ అధికారి సంతకం ఉండి, అధికారి హోదా వివరాలు లేదా సీల్.. ఏదో ఒకటి ఉన్నా.. ఆ ఓట్లను పరిగణనలోకి తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా టీడీపీ అడిగిన వెంటనే మోమో జారీ చేయడం తెలిసిందే. దాన్ని ఎండార్స్ చేయడంతో పాటు మరికొంత సడలింపు ఇస్తూ గెజిటెడ్ అధికారి హోదా వివరాలు, సీల్ లేకపోయినా.. కేవలం సంతకం ఉంటే చాలు ఓట్లను పరిగణనలోకి తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ సీఈవోకు లేఖ రాయడం వెంట వెంటనే జరిగిపోవడం గమనార్హం. పోస్టల్ బ్యాలెట్ల చెల్లుబాటు విషయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి జారీ చేసిన ఆదేశాలను ఉన్నత న్యాయస్థానంలో ఉపసంహరించుకోవడం అంటే.. ఆ ఉత్తర్వులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లుగా అంగీకరించినట్లే. ఈ కేసులో టీడీపీ ఇంప్లీడ్ పిటీషన్ వేయడం ద్వారా పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారాన్ని మరింత గందరగోళ పరచాలనే ఉద్దేశం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.సంతకంలో వ్యత్యాసాలుంటే..టీడీపీ వినతికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం, ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసి దొంగ ఓట్ల బెడదను సృష్టించిన సీఈవో ఆదేశాలకు అనుగుణంగా కేంద్ర ఎన్నికల సంఘం తందానా అనడం అనుమానాలకు తావిస్తోందని ప్రజాస్వామ్యవాదుల్లో ఆందోళన నెలకొంది. ఈ వ్యవహారం లెక్కింపు సమయంలో తీవ్ర గందరగోళ పరిస్థితులకు దారితీస్తుందని మాజీ ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, కేవలం సంతకంతో అతను అటెస్టేషన్ అధికారే అని నిర్ధారించడం ఎలా సాధ్యమవుతుందని వీరు ప్రశ్నిస్తున్నారు. ఈ నిర్ణయం దొంగ ఓట్లను ప్రోత్సహించే విధంగా ఉందని కేంద్ర ఎన్నికల సంఘానికి సలహాదారునిగా వ్యవహరించిన అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. వివరాలు లేకుండా కేవలం సంతకంతో రిటర్నింగ్ ఆఫీసర్ ఎలా ఆమోదం తెలుపుతారని, అధికారుల సంతకాల్లో వ్యత్యాసాలు ఉండటం అత్యంత సహజమని వివరించారు. ఈ నేపథ్యంలో స్పెసిమెన్ సంతకంతో సరిపోల్చి చూడటం ఎలా సాధ్యమని రిటైర్డ్ ఆర్డీవో ఒకరు ప్రశ్నిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన గెజిటెడ్ అధికారుల సంతకాలు అన్నీ కౌంటింగ్ సెంటర్లలోని ఆర్వోలకు పంపిస్తామని, సంతకంపై అభ్యంతరం వ్యక్తం చేస్తే వాటితో సరిపోల్చి చూసుకొని నిర్ణయం తీసుకోవాలనడం విడ్డూరంగా ఉందంటున్నారు. ఇన్ని స్పెసిమెన్ అధికారుల సంతకాలతో వాటిని ఆ సమయంలో సరిపోల్చి చూడటం సాధ్యమయ్యే పనేనా అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎవరి లబ్ధి కోసం ఆగమేఘాల మీద ఇటువంటి నిర్ణయాలు తీసకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు.ఈసీ నిష్పాక్షికతపై అనుమానాలకు మరింత బలంపోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ల వద్ద ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన అటెస్టింగ్ ఆఫీసర్లు కొంత మంది సీల్ వేయకుండా కేవలం సంతకాలు మాత్రమే చేశారని, ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని తమ ఓట్లను తిరస్కరించకుండా ఆమోదించేలా చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ నుంచి ఇలా విజ్ఞాపనలు రాగానే ఎన్నికల సంఘం వెంటనే పలు నిర్ణయాలు తీసుకుంటూ మొత్తం పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియనే పూర్తి గందరగోళంగా మార్చింది. టీడీపీ ఫిర్యాదు చేయగానే ముఖేష్ కుమార్ మీనా ఈ నెల 25న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం డిక్లరేషన్ ఫారం మీద అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం, పేరు, హోదా (డిజిగ్నేషన్) పూర్తి వివరాలు తప్పనిసరిగా ఉండాలని.. ఇవి ఉండి స్టాంప్ లేకపోయినా వాటిని పరిగణనలోకి తీసుకోవచ్చని ఉంది. ఒకవేళ ఏమైనా అనుమానం వస్తే దాన్ని రిటర్నింగ్ ఆఫీసర్, జిల్లా ఎన్నికల అధికారి వద్ద ఉన్న సంబంధిత అటెస్టింగ్ ఆఫీసర్ సంతకంతో సరిపోల్చుకుని పోస్టల్ బ్యాలెట్‌ను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. తాజాగా గురువారం కేంద్ర ఎన్నికల సంఘం మీనాకు రాసిన లేఖలో మరో ముందడుగు వేసి అటెస్టింగ్ ఆఫీసర్ సీల్ వేయకపోయినా, అతని హోదా వివరాలు లేకపోయినా సంతకం ఉంటే చాలు అని పేర్కొంది. ఎవరి ప్రయోజనాల కోసం ఎన్నికల సంఘం ఇలాంటి గందరగోళ నిర్ణయాలు తీసుకుంటోందని పలువురు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పటి నుంచో అనుసరిస్తున్న నిబంధనలను ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే సడలింపునిస్తూ సీఈవో ఆదేశాలు జారీ చేయడమే విడ్డూరమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈసీ మరో అడుగు ముందుకేసి వివరాలు రాయకపోయినా, సీల్ వేయకపోయినా పోస్టల్ బ్యాలెట్‌ను పరిగణనలోకి తీసుకోవాలనడం తొలి నుంచి ఈసీ నిష్పాక్షికతపై వ్యక్తమవుతున్న అనుమానాలకు మరింత బలం చేకూర్చినట్లయిందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. -
‘మెమో వెనక్కి అంటే.. తప్పుచేసినట్లేకదా!’
కృష్ణా, సాక్షి: కేంద్ర ఎన్నికల సంఘం, ఏపీ ఎన్నికల సంఘాలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఒత్తిడికి లొంగిపోయి పని చేస్తున్నాయన్నారు ఏపీ మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత పేర్ని నాని. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు విషయంలో ఎన్నికల సంఘం డబుల్ గేమ్‌పై, న్యాయస్థానాల్లో తాజా పరిణామాలపైనా ఆయన స్పందించారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా నిబంధనలను మీరారు. స్టాంప్ వేయకపోయినా.. డిజిగ్నేషన్ లేకపయినా ఫర్వాలేదని మెమో జారీ చేశారు. చట్టాన్ని మీరి మరి రూల్స్ తయారు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. .. అందుకే మేం కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశాం. దేశంలో ఎక్కడా లేని రూల్స్ ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్నారు. తాను ఇచ్చిన మెమోను వెనక్కి తీసుకుంటున్నట్లు సీఈవో ఎంకే మీనా కోర్టుకు తెలిపారు. మెమో వెనక్కి అంటే.. ఆయన తప్పు చేసినట్లే కదా. ఆ మెమోను ఈసీ సమర్థించడం అన్యాయం. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన వెసులుబాటుపై కోర్టులో పోరాడుతున్నాం. కచ్ఛితంగా న్యాయం గెలిచి తీరుతుంది. చంద్రబాబు, బీజేపీ ఎన్ని కుయుక్తులు పన్నినా న్యాయస్థానంలో గెలుపు ధర్మానిదే.. .. బీజేపీ ఒత్తిడికి లొంగిపోయే అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో ఎన్నికల సంఘాలు పని చేస్తున్నాయి. ఈ సంగతి ఎప్పటి నుంచో చెబుతున్నాం. టీడీపీ తప్పులపై ఆధారాలతో సహా మేం ఫిర్యాదు చేసినా ఈసీ పట్టించుకోలేదు. అదే ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లలో వార్తలు వస్తే చాలూ.. వైఎస్సార్సీపీ నేతలపై కేసులు పెడుతున్నారు. టీడీపీపై పొరపాటున కేసులు పెడితే ఆ జిల్లా కలెక్టర్లను, ఆర్వోలను బెదిరిస్తున్నారు. .. వైఎస్సార్సీపీపై సాధ్యమైనంత వరకు ఎక్కువ కేసులు పెట్టాలని ఆదేశాలు ఇస్తున్నారు. టీడీపీ, బీజేపీలపై కేసులు పెట్టొద్దనే సంకేతాలిస్తున్నారు అని ఆరోపించారాయన. -
మధ్యాహ్నం 2 గంటలకే 111 అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాల వెల్లడి
సాక్షి, అమరావతి: వచ్చే నెల 4న ఓట్ల లెక్కింపునకు పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముఖేష్ కుమార్ మీనా కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపారు. సత్వరమే ఫలితాల ప్రకటనకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని మొత్తం 175 శాసన సభ నియోజకవర్గాల్లో 111 నియోజకవర్గాల్లో 20 రౌండ్ల లోపు లెక్కింపు జరుగుతుందని, వీటి ఫలితాలు మధ్యాహ్నం 2 గంటల్లోపే ఇచ్చేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. 61 నియోజకవర్గాల్లో 21 నుండి 24 రౌండ్లు లెక్కింపు జరుగుతుందని, వీటి ఫలితాలు సాయంత్రం 4 గంటల్లోపు వస్తాయన్నారు. మిగిలిన 3 నియోజకవర్గాల్లో 25 రౌండ్లకు పైబడి ఓట్ల లెక్కింపు జరుగుతుందని, సాయంత్రం 6.00 గంటల్లోపు వీటి ఫలితాలు రావొచ్చని వివరించారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకు టేబుళ్లను పెంచి సకాలంలో పూర్తి చేస్తామన్నారు. రాత్రి 8 – 9 గంటల మధ్య అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలు ప్రకటించేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. న్యూఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ బుధవారం రాష్ట్ర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియపై సమీక్షించారు. లెక్కింపు ప్రక్రియలో అనుసరించాల్సిన విధానాలు, శాంతిభద్రతల పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో కౌంటింగ్‌కు చేపట్టిన ఏర్పాట్లను సీఈవో మీనా వివరించారు. ఎన్నికల అనంతరం హింసాత్మక ఘటనలు జరిగిన జిల్లాల్లో ఓట్ల లెక్కింపు రోజు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. 144 సెక్షన్ అమలుతో పాటు ఆ జిల్లాల్లో సీనియర్ అధికారులను నియమిస్తున్నట్లు తెలిపారు. డిజీపీతో పాటు తాను కూడా పల్నాడు జిల్లాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులను పరిశీలించామని, అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు. ఓట్ల లెక్కింపులో లోపాలు జరగకూడదు ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనలో ఎటువంటి లోపాలు, జాప్యం జరగడానికి వీల్లేదని, అందుకోసం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, త్వరితగతిన కచ్చితమైన ఫలితాలను ప్రకటించాలని సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ రాష్ట్ర అధికారులకు చెప్పారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఓట్ల లెక్కింపును విజయవంతంగా పూర్తి చేయాలని అన్ని నియోజకవర్గాల ఆర్వోలు, జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, సీపీలకు సూచించారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకటనకు సంబంధించిన ఫారం–21 సీ, 21ఈలను అదే రోజు ఫ్లైట్‌లో ఈసీకి పంపాలని ఆదేశించారు. ఓట్ల లెక్కింపు సమయంలో అభ్యర్థులు, ఏజెంట్లు ఎటువంటి అవాంతరాలు కలిగించకుండా లెక్కింపు ప్రక్రియపై వారికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని చెప్పారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలు, స్ట్రాంగ్ రూముల్లో కూలీల విషయంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలని, అపరిచితులను ఎవ్వరినీ అందుకు వినియోగించొద్దని చెప్పారు. గుర్తింపు కార్డులు ఉన్నవారినే లెక్కింపు కేంద్రాల్లోకి అనుమతించాలన్నారు. ఎన్నికల అనంతరం పల్నాడు జిల్లాలో హింసాత్మక ఘటనలు జరిగినందున, ఈ జిల్లా అధికారులు ఎంతో అప్రమత్తంగా ఉండాలని, ఓట్ల లెక్కింపు రోజు ఎటువంటి ఘటనలకు తావు లేకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. స్టేట్ పోలీస్ నోడల్ ఆఫీసర్, అడిషనల్ డీజీ ఎస్ బాగ్చీ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలను, సీపీలను అప్రమ్తతం చేశామని, శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. లెక్కింపు కేంద్రాల వద్ద ఏర్పాట్లు, త్వరితగతిన ఖచ్చితమైన ఫలితాల ప్రకటనకు చేపడుతున్న చర్యలు, శాంతి భద్రతల పరిరక్షణకు చేస్తున్న బందోబస్తు ఏర్పాట్లను ఆర్వోలు, జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు నితీష్ వ్యాస్‌కు వివరించారు. ఈ సమావేశంలో అదనపు సీఈవో హరేంధిర ప్రసాద్, రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల ఆర్వోలు, జిల్లా ఎన్నికల అధికారులు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు తదితరులు వారి నియోజకవర్గాల నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. -
‘సడలింపు’ని సరిదిద్దండి
సాక్షి, అమరావతి: పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) నిబంధనలను ఏపీలో సడలిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌కుమార్ మీనా ఈనెల 25న జారీచేసిన ఉత్తర్వులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆక్షేపించింది. అటెస్టింగ్ అధికారుల స్పెసిమెన్ సంతకాల సేకరణ గతేడాది జూలై 19న కేంద్ర ఎన్నికల సంఘం జారీచేసిన నిబంధనలకు విరుద్ధమని గుర్తుచేసింది. ఇది పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో ఓట్ల తిరస్కరణకు కారణమవుతుందని.. పైగా తీవ్ర వివాదాలకు సైతం దారితీస్తుందని ఆందోళన వ్యక్తంచేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్‌కు వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు ఎస్. నిరంజన్‌రెడ్డి బుధవారం ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్‌కుమార్ మీనా నిబంధనలను సడలిస్తూ జారీచేసిన ఉత్తర్వులను తక్షణం సమీక్షించి.. సముచిత నిర్ణయం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.దేశవ్యాప్తంగా ఒకలా.. రాష్ట్రంలో మరోలా..నిజానికి.. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారంపై అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం చేసి, స్టాంప్ లేకపోయినా.. తన పేరు, డిజిగ్నేషన్ పూర్తి వివరాలను చేతితో రాస్తే ఆమోదించాలని గతేడాది జూలై 19న కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేసింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇవే మార్గదర్శకాలు అమలవుతున్నాయి. కానీ.. రాష్ట్రంలో టీడీపీ నేతల విజ్ఞప్తి మేరకు ఈ మార్గదర్శకాలను సడలిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్‌కుమార్ మీనా ఈనెల 25న ఉత్తర్వులు జారీచేశారు. నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి (ఆర్వో) నిర్దేశించిన అటెస్టింగ్ ఆఫీసర్ సంతకాలు (స్పెసిమెన్) సేకరించి.. అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఆర్వోలకు పంపాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం ఉంటే చాలు.. డిజిగ్నేషన్ పూర్తి వివరాలను చేతితో రాయకపోయినా సరే.. ఆ సంతకంపై ఏమైనా అనుమానం వస్తే రిటర్నింగ్ ఆఫీసర్ (ఆర్వో), జిల్లా ఎన్నికల అధికారి వద్ద ఉన్న సంబంధిత అటెస్టింగ్ అధికారి సంతకం (స్పెసిమెన్)తో సరిపోల్చుకుని పోస్టల్ బ్యాలెట్‌ను పరిగణనలోకి తీసుకునేలా సడలింపు ఇచ్చారు. గోప్యతకు.. శాంతిభద్రతలకు విఘాతం..ఇక పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు సమయంలో స్పెసిమెన్ సంతకంపై రాజకీయ పక్షాల ఏజెంట్ల మధ్య భేదాభిప్రాయాలు వ్యక్తమవుతాయి. ఇది చినికిచినికి పెను వివాదంగా మారి శాంతిభద్రతల సమస్యగా పరిణమించే ప్రమాదం ఉంది. ఈ నిబంధనలవల్ల ఓటు గోప్యత ఉండదని రాజకీయ పక్షాలు, ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని రీతిలో టీడీపీ నేతలు విజ్ఞప్తి చేయగానే.. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై నిబంధనలను సడలిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి మీనా ఉత్తర్వులు జారీచేయడంపై నివ్వెరపోతున్నారు.నిబంధనల సడలింపుపై న్యాయపోరాటం..ఇదిలా ఉంటే.. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలను సడలిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్‌కుమార్ మీనా జారీచేసిన ఉత్తర్వులపై దుమారం రేగుతోంది. వాటిని సమీక్షించి.. సముచిత నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్‌కు వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం సముచిత నిర్ణయం తీసుకోని పక్షంలో.. మీనా సడలింపు ఉత్తర్వులపై న్యాయపోరాటం చేసేందుకు వైఎస్సార్సీపీ సిద్ధమైంది. -
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పై కేంద్ర ఈసీకి ఫిర్యాదు చేసిన YSRCP నేతలు
-
కక్ష సాధింపు ధోరణిలో ఈసీ..?
-
ఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లు చేశాం
నరసరావుపేట/బాపట్ల: ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు. మంగళవారం పల్నాడు జిల్లా నరసరావుపేటతో పాటు బాపట్లలో ఆయన పర్యటించారు. నరసరావుపేట మండలం కాకాని సమీపంలోని జేఎన్టీయూ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన మీనా జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమస్యాత్మక జిల్లా అయినా పల్నాడులో రీపోలింగ్‌కు అవకాశం లేకుండా ఎన్నికలు నిర్వహించారంటూ అధికారులను అభినందించారు. వెబ్‌కాస్టింగ్ వంటి ఏర్పాట్లు చేసినా కొన్ని బూత్‌లలో జరిగిన ఘటనలు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించటంతో కేంద్ర ఎన్నికల కమిషన్ పలు కఠిన చర్యలు తీసుకుందని చెప్పారు. కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించి.. ఎన్నికల కమిషన్‌పై ప్రజలకు నమ్మకం తీసుకొస్తామన్నారు. అవాంఛనీయ ఘటనలు జరిగితే సంబంధిత రిటరి్నంగ్ అధికారి వెంటనే స్పందించాలని ఆదేశించారు. మద్యం అమ్మకాలను నిషేధించాలి డీజీపీ హరీ‹Ùకుమార్‌గుప్తా మాట్లాడుతూ.. జూన్ 3, 4, 5 తేదీల్లో మద్యం అమ్మకాలను నిషేధించాల్సిన అవసరం ఉందన్నారు. అగ్నిమాపక పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ శ్రీకేశ్ మాట్లాడుతూ.. పారదర్శకంగా ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు 700 మందికి పైగా కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లతో పాటు ఇతర సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారని తెలిపారు. ఎస్పీ మలికా గార్గ్ మాట్లాడుతూ.. కౌంటింగ్ సందర్భంగా పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు 1,196 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఏడు ఈవీఎంలు ధ్వంసం చేసిన కేసుల్లో 59 మందిని అరెస్టు చేశామని చెప్పారు. సమావేశంలో పోలీస్ అధికారులు గోపినాథ్ జెట్టి, సర్వశ్రేష్ఠ త్రిపాఠి, శ్రీకాంత్, జేసీ శ్యాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎల్రక్టానిక్ పరికరాలను అనుమతించొద్దు అలాగే బాపట్ల ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములను, కౌంటింగ్ కేంద్రాల్లోని ఏర్పాట్లను సీఈవో ముఖే‹Ùకుమార్ మీనా మంగళవారం పరిశీలించారు. కలెక్టర్ పి.రంజిత్‌బాషా, ఎస్పీ వకుల్ జిందాల్, జేసీ సీహెచ్ శ్రీధర్, ఆర్వోలతో మీనా సమావేశమయ్యారు. ఎన్నికల కమిషన్ జారీ చేసిన పాస్‌లున్న వారినే కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించాలని ఆయన ఆదేశించారు. సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను లోపలికి అనుమతించవద్దని ఆదేశించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్ సత్తిబాబు, అదనపు ఎస్పీ విఠలేశ్వరరావు, ఆర్వోలు ఉన్నారు. -
ఈ సడలింపులు.. ‘పచ్చ’సిరాతో!
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల సందర్భంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఒక నిబంధనావళి రూపొందించిందంటే అది దేశవ్యాప్తంగా అమలు జరగాలి. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో నిబంధన అంటూ ఏమీ ఉండదు. అలాగే, గత ఎన్నికల్లో లేని నిబంధన.. అదే విధంగా దేశంలో ఎక్కడాలేని నియమం ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే అమలు చేస్తున్నారంటే ఏమనుకోవాలి? పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు విషయంలో ఇప్పుడు రాష్ట్రంలో ఇదే జరుగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు భిన్నంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన సడలింపులు ఇప్పుడు రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఎందుకంటే.. ఈ సడలింపులు టీడీపీ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ఉద్దేశపూర్వకంగా ఇచ్చిందని స్పష్టంగా తెలిసిపోతోంది కాబట్టి. గత ఎన్నికల్లో లేని సడలింపుల్ని.. పైగా ఇంకెక్కడా లేని మినహాయింపులను ఇక్కడే అమలుచేయడం.. అది కూడా టీడీపీ చెప్పింది చెప్పినట్లుగా రాష్ట్ర ఎన్నికల సంఘం తలూపుతూ చేయడం చూస్తుంటే.. రాష్ట్రంలో ఎన్నికల సంఘం.. టీడీపీ సంఘంలా వ్యవహరిస్తోందని కాక ఇంకేమనాలి?కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు భిన్నంగా..నిజానికి.. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారంపై అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం చేసి, స్టాంప్ లేకపోయినా.. తన పేరు, డిజిగ్నేషన్ వివరాలను చేతితో రాస్తే ఆమోదించాలని గతేడాది జూలై 19న కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) మార్గదర్శకాలు జారీచేసింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇవే మార్గదర్శకాలు అమలవుతున్నాయి. కానీ.. రాష్ట్రంలో టీడీపీ నేతల విజ్ఞప్తి మేరకు ఈ మార్గదర్శకాలను సడలిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్‌కుమార్ మీనా ఈనెల 25న ఉత్తర్వులు జారీచేశారు. అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం ఉంటే చాలు.. డిజిగ్నేషన్ పూర్తి వివరాలను చేతితో రాయకపోయినా సరే.. ఆ సంతకంపై ఏమైనా అనుమానం వస్తే రిటర్నింగ్ ఆఫీసర్ (ఆర్వో), జిల్లా ఎన్నికల అధికారి వద్ద ఉన్న సంబంధిత అటెస్టింగ్ అధికారి సంతకంతో సరిపోల్చుకుని పోస్టల్ బ్యాలెట్‌ను పరిగణనలోకి తీసుకునేలా సడలింపు ఇవ్వడంపై రాజకీయ పక్షాలు నివ్వెరపోతున్నాయి. ఎన్నికల సంఘం పచ్చపాతం మరోసారి బహిర్గతమైందని విమర్శిస్తున్నాయి. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు సందర్భంగా ఇది వివాదాలకు దారితీస్తుందని.. శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.మరీ ఇంత ‘పచ్చ’పాతమా?..పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ల వద్ద ఎన్నికల సంఘం ఏర్పాటుచేసిన అటెస్టింగ్ ఆఫీసర్లు కొంతమంది సీల్ వేయకుండా కేవలం సంతకాలు మాత్రమే చేశారని.. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని తమ ఓట్లను తిరస్కరించకుండా ఆమోదించేలా చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్‌కుమార్ మీనాకు టీడీపీ నుంచి పలు విజ్ఞాపనలు వచ్చాయి. వాటిని పరిగణనలోకి తీసుకున్న ఆయన.. 2023, జూలై 19న కేంద్ర ఎన్నికల సంఘం జారీచేసిన మార్గదర్శకాలను ఉటంకిస్తూ ఈనెల 25న ఉత్తర్వులు జారీచేశారు. వాటి ప్రకారం.. డిక్లరేషన్ ఫారం మీద అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం, పేరు, హోదా (డిజిగ్నేషన్) పూర్తి వివరాలు తప్పనిసరిగా ఉండాలి. ఇవి ఉండి స్టాంప్ లేకపోయినా వాటిని పరిగణనలోకి తీసుకోవచ్చు. ఈ నిబంధన దేశవ్యాప్తంగా అమలవుతోంది. కానీ.. అటెస్టింగ్ ఆఫీసర్ స్టాంప్ లేకపోయినా.. పేరు, డిజిగ్నేషన్ వివరాలను చేతితో రాయకపోయినా.. సంతకం ఉంటే చాలు.. దానిపై ఏమైనా అనుమానం వస్తే దాన్ని రిటర్నింగ్ ఆఫీసర్, జిల్లా ఎన్నికల అధికారి వద్ద ఉన్న సంబంధిత అటెస్టింగ్ ఆఫీసర్ సంతకంతో సరిపోల్చుకుని పోస్టల్ బ్యాలెట్‌ను పరిగణనలోకి తీసుకోవాలంటూ సడలింపు ఇవ్వడం గమనార్హం.పోస్టల్ బ్యాలెట్ ఆమోదానికి ఇతర నిబంధనలివీ..⇒ పోస్టల్ బ్యాలెట్ పేపర్ వెనుక రిటర్నింగ్ ఆఫీసరుగానీ లేదా ఫెసిలిటేషన్ సెంటర్ ఇన్‌ఛార్జి సంతకం తప్పనిసరిగా ఉండాలి. ⇒ బ్యాలెట్ పేపర్ వెనుక సంతకం విషయంలో ఏమైనా సందేహాలొస్తే సీరియల్ నెంబర్ ప్రకారం కౌంటర్ ఫైల్‌ను పరిశీలించి అది నిజమైన బ్యాలెట్ అవునా కాదా అని నిర్థారించుకోవాలి. ఒకవేళ సందేహం ఉంటే వాటిని తిరస్కరించాలి.⇒ ఓటరు కవర్–బీ మీద సంతకంలేదన్న కారణంతో కూడా ఓటును తిరస్కరించకూడదు. డిక్లరేషన్ ఫాం–13ఏ ప్రకారం ఓటరును గుర్తించవచ్చు. ఇవికాక.. బ్యాలెట్ పేపర్ ఉండే ఇన్నర్ కవర్ ఫారం–13బీని తెరవకుండానే ఈ సమయాల్లో ఓటును తిరస్కరించవచ్చు.⇒ కవర్–బీని తెరవగానే, ఓటరు డిక్లరేషన్ ఫారం లేకపోతే, డిక్లరేషన్ ఫారంపై గెజిటెడ్ లేదా అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం లేకపోయినా, ఫారం–13ఏ, ఫారం–13బీలో బ్యాలెట్ సీరియల్ నెంబర్లు వేర్వేరుగా ఉంటే బ్యాలెట్ పేపర్ తెరవకుండానే తిరస్కరించొచ్చు.⇒ ఈ విధానం అంతా పూర్తయి బ్యాలెట్ పేపరు తెరిచిన తర్వాత.. ఎవరికీ ఓటు వేయకపోయినా.. ఒకరి కంటే ఎక్కువ మందికి ఓటువేసినా.. అనుమానాస్పద బ్యాలెట్ పేపరుగా గుర్తించినా.. బ్యాలెట్ పేపరు చిరిగిపోయినా.. అది నిజమైన బ్యాలెట్ అని నిర్థారించడానికి అవకాశంలేని సమయంలో.. రిటర్నింగ్ ఆఫీసరు ఇచ్చిన కవర్–బీ లేకపోయినా.. ఓటరు ఎవరో గుర్తించే విధంగా ఏమైనా గుర్తులు, లేక రాతలున్న సందర్భాల్లో తిరస్కరింవచ్చు. -
ఈసీ నోరుమెదపదేం?!
కోట్లాదిమంది పౌరులు నచ్చినవారిని, సమర్థులనుకున్నవారిని తమ ప్రతినిధులుగా ఎంపిక చేసుకునే అసాధారణ ప్రక్రియ ఎన్నికలు. ఆ ప్రక్రియను ఎంత పారదర్శకంగా...ఎంత వివాదరహితంగా...ఎంత తటస్థంగా నిర్వహిస్తే అంతగా ప్రజాస్వామ్యం వర్థిల్లుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి ఆదినుంచీ ఇందుకు విరుద్ధమైన పోకడలు చోటుచేసుకున్నాయి. ఎన్నికల షెడ్యూల్ వెలువడింది మొదలు చిత్ర విచిత్ర ధోరణులు కనబడ్డాయి. పోలింగ్ రోజైన ఈనెల 13న, ఆమర్నాడు రాష్ట్రంలో జరిగిన ఉదంతాలు వీటికి పరాకాష్ఠ. వివిధ జిల్లాల్లో చెదురుమదురుగా చోటుచేసుకున్న ఘటనలు ఒక ఎత్తయితే నర్సరావుపేట పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో జరిగిన ఉదంతాల పరంపర మరో ఎత్తు. టీడీపీ రౌడీ మూకలు పోలింగ్ కేంద్రాల్లోకి జొరబడి వైఎస్సార్ కాంగ్రెస్ ఏజెంట్లపై దౌర్జన్యం సాగించి వెళ్లగొట్టడం, వోటేయడానికి క్యూలో నించున్న బలహీనవర్గాలవారినీ, మహిళలనూ కొట్టి వెనక్కిపంపడం వంటి ఉదంతాలపై ఫిర్యాదు చేసినా అరణ్యరోదనే అయింది. అసాంఘిక శక్తులు చొరబడి పోలింగ్ ప్రక్రియను దెబ్బతీయకుండా చూడటానికీ, అవసరమైనప్పుడల్లా కిందిస్థాయి అధికారులకు తగిన ఆదేశాలివ్వడానికీ, సమస్యాత్మక ప్రాంతాలకు బలగాలు తరలించటానికీ వీలుంటుందని ఏర్పాటుచేసిన వెబ్‌కాస్టింగ్‌ను ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయారు. దాని నియంత్రణ టీడీపీ చేతుల్లోకి పోయింది. ఆ తర్వాత రెండురోజులూ పచ్చమూకలు తెగబడి రోడ్లపై స్వైరవిహారం చేశాయి. వైఎస్సార్ కాంగ్రెస్‌కు వోటేశారనుకున్నవారి ఇళ్లను లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టించాయి. ఈ మూకలకు భయపడి వందలమంది ఇళ్లూ వాకిళ్లూ వదిలి వేరేచోట తలదాచుకోవాల్సివచ్చింది. ఇదంతా చానెళ్లలో ప్రసారం అవుతున్నా రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు బాధ్యతవహించాల్సిన అధికారులకుగానీ, శాంతిభద్రతలు పర్యవేక్షించాల్సిన పోలీసు అధికారులకుగానీ చీమకుట్టినట్టయినా లేదు. ఎన్నికలకు రెండురోజుల ముందు త్రికూటమి సౌజన్యంతో విధుల్లో చేరిన ఉన్నతాధికారులు ఈ విధ్వంసకాండ సాగుతున్న సమయంలో మౌనదీక్షలో మునిగిపోయారు. పరువు బజార్నపడిందనుకున్నదో ఏమో కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని నివేదిక తెప్పించుకుని ముగ్గురు ఎస్పీలనూ, ఒక కలెక్టర్‌నూ బదిలీచేసింది. మూడు జిల్లాల్లో 12 మంది పోలీస్ అధికారులను సస్పెండ్ చేసింది. సిట్ ఏర్పాటుచేసి దర్యాప్తు చేయించింది. ఇంత జరిగినా కారంపూడి సీఐగా ఉంటూ టీడీపీ విధ్వంసకాండకు కొమ్ముకాసిన నారాయణస్వామికి మాత్రం ఏం కాలేదు. ఐజీ త్రిపాఠి సరేసరి. వీరు కొత్త కొత్త కేసులు బనాయిస్తూ స్వామిభక్తిని చాటుకుంటున్నారు.త్రికూటమి ఆడించినట్టల్లా ఆడటానికి ఎన్నికల సంఘం రెడీ అయిపోయిందని ఉన్నతాధికారుల ఏకపక్ష బదిలీలు మొదలైనప్పుడే అందరికీ అర్థమైపోయింది. ఎవరిని ఎక్కడ నియమించాలో ఆదేశిస్తూ కూటమి ఇచ్చిన ఆదేశాలకు ‘జీ హుజూర్’ అంటూ కొత్త అధికారులను దించింది. సమస్యాత్మక ప్రాంతాల్లో ఉద్దేశపూర్వకంగా కొందరు అధికారులను నియమించటంతో మొదలైన కుట్రపై లోతుగా దర్యాప్తు చేస్తే తప్ప ఎన్నికల రోజునా, ఆ తర్వాతా కొనసాగిన హింస, విధ్వంసకాండ వెనక ఏయే శక్తులున్నాయో వెల్లడి కాదు. మన దేశంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న పోలింగ్ ప్రక్రియను చూసి ముచ్చటపడి అనేక దేశాలు దాన్ని అనుసరించటం మొదలెట్టాయి. ఎప్పటికప్పుడు అభివృద్ధి అవుతున్న కొత్త సాంకేతికతలతో ఎన్నికల ప్రక్రియ మరింత మెరుగ్గా, సాఫీగా సాగేందుకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటున్నది. మరి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు ఏమైంది? ఈ ఉదంతాల సమయంలో ఎందుకాయన మౌనంగా ఉండిపోయారు? కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకునేవరకూ తన వంతుగా చేసిందేమిటి? ఎన్నికల రోజున మాచర్ల వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 8 గ్రామాల్లో టీడీపీ రిగ్గింగ్ చేస్తున్న వైనం గురించి వరసగా రెండు లేఖలు రాసినా, అలాంటిచోట్ల రీపోలింగ్ నిర్వహించాలని డిమాండు చేసినా మీనా ఎందుకు జవాబీయలేదు? ఈవీఎం పగలగొట్టినట్టు టీడీపీ ఒక వీడియో విడుదల చేసేవరకూ ఆ ఉదంతం తెలియనట్టే ఎందుకున్నారు? 23 గంటల నిడివికిపైగా ఉన్న ఆ వీడియోలో ముందూ వెనకా ఏం జరిగిందో అసలు ఎన్నికల సంఘం చూసిందా? చూస్తే ఎందుకు మౌనం వహించింది? అన్నిటికన్నా చిత్రమేమంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న పిన్నెల్లి అదే రోజు రీ పోలింగ్ కోసం డిమాండ్ చేయగా నాలుగైదు రోజుల తర్వాత ఆ వీడియో బయటపెట్టిన టీడీపీ ఇంతవరకూ రీపోలింగ్ కోరనేలేదు. వెబ్‌కాస్టింగ్ మొత్తం టీడీపీ ముఠా నియంత్రణలో ఉందన్న ఆరోపణలపై ఎన్నికల సంఘం నోరు మెదపటం లేదు.ఇంత బరితెగింపుతో దేశంలో ఎక్కడా ఎప్పుడూ ఎన్నికలు జరగలేదు. తన బాధ్యతేమిటో, కర్తవ్యవేమిటో మరిచి తోకపట్టుకుని పోయే చందంగా నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్న ఎన్నికల సంఘం ఇప్పటికైనా మౌనం వీడాలి. నర్సరావుపేట పరిధిలోనే కాదు... ఇతర నియోజకవర్గాల్లోనూ ఈవీఎంలు ధ్వంసం చేసిన ఉదంతాలు వెల్లడయ్యాయి. మంత్రి అంబటి రాంబాబు కొన్నిచోట్ల రీపోలింగ్ కోరారు. వీటన్నిటికీ జవాబు రావాలి. సంజాయిషీ ఇవ్వాల్సిన స్థానంలోవున్నవారు మూగనోము పడితే అనుమానాలు మరింత బలపడతాయి. కౌంటింగ్ ప్రక్రియ సక్రమంగా సాగుతుందా అన్న సందేహాలు తలెత్తుతాయి. కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని ఈ తలకిందుల వ్యవస్థను నిటారుగా నిలబెట్టాలి. ప్రజాస్వామ్యంపై ప్రజలకుండే విశ్వసనీయతను కాపాడాలి. -
రాష్ట్రానికి 20 కంపెనీల బలగాలు
పెదకాకాని: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తర్వాత అక్కడక్కడా జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టినట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. కౌంటింగ్ నేపథ్యంలో రాష్ట్రానికి 20 కంపెనీల బలగాలను కేటాయించినట్టు తెలిపారు. సున్నితమైన ప్రాంతాలను గుర్తించడంతో పాటు ఘర్షణలకు పాల్పడే అనుమానితులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. కౌంటింగ్ రోజు డ్రై డేను ప్రకటిస్తున్నామని, 144 సెక్షన్ ఎంతవరకు అవసరమో అంతవరకు విధిస్తామన్నారు. జూన్ నాలుగో తేదీన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఏడు శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లను సోమవారం జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, జిల్లా ఎస్పీ తుషార్ డూడీలతో కలిసి మీనా పరిశీలించారు. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ హాల్, మీడియా సెంటర్‌ను పరిశీలించారు.ఏడు నియోజకవర్గాలు, ఒక పార్లమెంట్ నియోజకవర్గం ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్‌లను, డైక్మెన్ హాల్లో ఏర్పాటు చేసిన టీవీలను పరిశీలించి.. హాజరైన అభ్యర్థులతో మాట్లాడారు. అభ్యర్థులు, వారి తరఫున ప్రతినిధులు కూడా ప్రత్యక్షంగా ఈవీఎంలు భద్రపర్చిన గదులను పరిశీలించుకోవచ్చని చెప్పారు. అభ్యర్థులుగానీ, వారి ప్రతినిధులు గాని రోజుకు రెండు సార్లు స్ట్రాంగ్ రూంలను ఫిజికల్‌గా పరిశీలించుకునేందుకు అవకాశం కలి్పంచామన్నారు. వారి వెంట వివిధ స్థాయిల అధికారులు ఉన్నారు. -
పటిష్ట ఏర్పాట్లు చెయ్యాలి..సీఈఓ ముకేశ్ కుమార్ మీనా
-
పటిష్ట ఏర్పాట్లు చెయ్యాలి.. సీఈఓ ముకేశ్ కుమార్ మీనా
-
పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రం వీడియో లీక్‌తో ఎన్నికల సంఘానికి సంబంధం లేదు... ఆంధ్రప్రదేశ్ సీఈవో ముకేష్ కుమార్ మీనా స్పష్టీకరణ.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ఆ వీడియో లీక్ అయింది.. మేము విడుదల చేయలేదు: సీఈవో
సాక్షి, అమరావతి: మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం సంఘటనకు సంబంధించి మాధ్యమాల్లో ప్రసారమవుతున్న వీడియో లీక్‌తో ఎన్నికల సంఘానికి సంబంధం లేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా స్పష్టం చేశారు. ఆ వీడియో తమ నుంచి బయటకు వెళ్లలేదని గురువారం సచివాలయంలో తనను కలిసిన విలేకరులకు చెప్పారు. ఆ వీడియో ఎలా బయటకు వెళ్లిందన్న దానిపై విచారణ చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో ఎన్నికల అనంతరం జరిగిన సంఘటనలపై దర్యాప్తు చేస్తున్న సందర్భంగా ఎవరి చేతి నుంచో బయటకు వెళ్లి ఉండొచ్చని అనుమానిస్తున్నట్లు తెలిపారు. ఈవీఎం ధ్వంసంపై సరైన సమాచారం ఇవ్వనందుకు విధుల్లో ఉన్న పీవో, ఏపీవోలను సస్పెండ్ చేయాలని ఆదేశాలిచ్చినట్టు మీనా తెలిపారు. మాచర్ల నియోజకవర్గంలో గాయపడిన కార్యకర్తల్ని పరామర్శించేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు వెళ్లడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. అక్కడ పరిస్థితులు ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తున్నాయని, ఇలాంటి తరుణంలో పరామర్శల పేరుతో వెళ్లి రాజకీయాలు చేయవద్దని ఆయన సూచించారు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్లకు అనుమతిస్తే రేపు వేరే పార్టీ వాళ్లు వెళ్తామంటారని, అందుకే బయటి నుంచి నేతలెవరూ పరామర్శకు వెళ్లనీయొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.కౌంటింగ్‌కు పటిష్ట ఏర్పాట్లువచ్చే నెల 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపునకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. కచ్చితమైన ఫలితాలను త్వరితగిన ప్రకటించేలా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్సులో ఆయన మాట్లాడుతూ చెదురుమదురు సంఘటనలు మినహా అందరి సమష్టి కృషితో ఈ నెల 13న రాష్ట్రంలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినట్టు వివరించారు. అదే స్పూర్తితో ఓట్ల లెక్కింపు జరిగేలా పటిష్టమైన ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. ఏ రోజు, ఎన్ని గంటలకు ఎన్నిటేబుళ్లపై ఓట్ల లెక్కింపు జరుగుతుందో రాతపూర్వకంగా సంబంధిత అభ్యర్థులకు, ఎన్నికల ఏజెంట్లకు ముందుగానే తెలియజేయాలన్నారు. ప్రత్యేకంగా మీడియా సెంటర్లను ఏర్పాటు చేయాలన్నారు.పార్లమెంట్, అసెంబ్లీ ఓట్లను వేర్వేరుగా లెక్కింపుస్ట్రాంగ్ రూమ్‌ల నుంచి ఓట్ల లెక్కింపు కేంద్రాలకు పోలింగ్ యంత్రాలను తరలించే మార్గాలు, అభ్యర్థులు, ఏజంట్లు వెళ్లడానికి వేర్వేరు మార్గాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎలాంటి సమస్యలు రాకుండా ఉండటానికి బారికేడ్లతో పాటు సూచికల బోర్డులను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. లెక్కింపు కేంద్రంలో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి వేర్వేరుగా ఓట్ల లెక్కింపు టేబుళ్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకు ప్రత్యేక టేబుళ్లు ఏర్పాటు చేయాలన్నారు. పోస్టల్ బ్యాలెట్లు లెక్కించిన తరువాతనే ఈవీఎంల వారీగా ఓట్లను లెక్కించాలని సూచించారు. హై స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యంతో అవసరమైన కంప్యూటర్లు, ప్రింటర్లను కౌటింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎన్కోర్లో ఎప్పటి కప్పుడు డాటా ఎంట్రీకి సుశిక్షితులై సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. కౌంటింగ్ అధికారులు, సిబ్బంది మొబైల్ ఫోన్లను డిపాజిట్ చేసేందుకు వీలుగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. గుర్తింపు కార్డులు లేనివారిని, అనధికార వ్యక్తులను, ఇతరులను ఎట్టి పరిస్థితుల్లో కౌంటింగ్ కేంద్రం ప్రాంగణాల్లోకి అనుమతికుంచ కుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద మూడంచెల భద్రతఈవీఎంలను భద్రపర్చిన స్ట్రాంగ్ రూముల వద్ద కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలతో పటిష్టమైన మూడంచెల భద్రత కొనసాగుతున్నదని, స్ట్రాంగ్ రూమ్‌లకు సీలు వేసిన తలుపులు, సెక్యూరిటీ కారిడార్లను కవర్ చేసేలా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును, కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేసిన సీసీ కెమెరాల పనితీరును నిరంతరం అధికారులు పర్యవేక్షిస్తుండాలని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు సీఈవోలు పి.కోటేశ్వరరావు, ఎమ్.ఎన్.హరీంధర ప్రసాద్‌తో పాటు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. -
పెరిగిన ఓటు శాతం కేటగిరీల వారీగా..!
-
వెల్లివిరిసిన మహిళా చైతన్యం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సోమవారం జరిగిన ఎన్నికల్లో మహిళా ఓటర్ల చైతన్యం వెల్లి విరిసింది. పురుషులకంటే 4,78,535 మంది మహిళలు అధికంగా పోలింగ్‌లో పాల్గొన్నారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 81.86 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో పోలైన ఓట్ల తుది వివరాలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముఖేష్ కుమార్ మీనా బుధవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోమవారం జరిగిన పోలింగ్‌లో ఈవీఎంల ద్వారా 80.66 శాతం (3,33,340,333 ఓట్లు), పోస్టల్ బ్యాలెట్ ద్వారా 1.2 శాతం ఓట్లు నమోదైనట్లు చెప్పారు. రాష్ట్ర చరిత్రలో ఇంత భారీ స్థాయిలో ఓట్లు నమోదవడం ఇదే తొలిసారన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో జరిగిన నాలుగు దశల పోలింగ్‌లో రాష్ట్రంలోనే అత్యధికంగా పోలింగ్ శాతం నమోదైనట్లు చెప్పారు. పోస్టల్ బ్యాలెట్లో ఉద్యోగులు, అత్యవసర సర్వీసు ఓటర్లు, 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు పాల్గొన్నారని తెలిపారు. 2019 ఎన్నికల్లో 2.62 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్లను వినియోగించుకోగా>, ఈసారి 4.97 లక్షల మంది వినియోగించుకున్నట్లు తెలిపారు. గత ఎన్నికల్లో 56 వేల పోస్టల్ బ్యాలెట్లు తిరస్కరణకు గురయ్యాయని, ఈసారి ఉద్యోగులు ఎంతో జాగ్రత్తగా ఉన్నందున అటువంటి పరిస్థితి తలెత్తలేదని చెప్పారు.విశాఖలో ఎక్కువ ఓట్లు పోలవడం శుభపరిణామంలోక్సభ నియోజకవర్గాల్లో ఒంగోలులో అత్యధికంగా 87.06 శాతం ఓట్లు రాగా, అత్యల్పంగా విశాఖపట్నంలో 71.11 శాతం వచ్చాయన్నారు. శాసన సభ నియోజకవర్గాల్లో అత్యధికంగా దర్శి నియోజకవర్గంలో 90.91 శాతం పోలింగ్ నమోదవగా, అత్యల్పంగా తిరుపతిలో 63.32 శాతం నమోదైనట్లు తెలిపారు. గత ఎన్నికల్లో తిరుపతిలో 65.9 శాతం పోలింగ్ నమోదవగా, ఈసారి 63.32 శాతానికి తగ్గడానికి ఆ నియోజకవర్గంలో బోగస్ ఓట్లను నియంత్రించడమే ప్రధాన కారణమని తెలిపారు. విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో 67 శాతం పోలింగ్ నమోదుకాగా, ఈసారి ప్రత్యేకించి విశాఖ పట్టణ ప్రాంతంలో 71.11 శాతం పోలింగ్ జరగడం ఎంతో శుభపరిణామమని అన్నారు.ఎవరూ రీపోలింగ్ కోరలేదుదేశ, విదేశాల నుండి ఓటర్లు పెద్ద ఎత్తున ఓటింగ్‌కు తరలి రావడం, చివరి రెండు గంటల ముందు క్యూలలో ఓటర్లు ఎక్కువగా ఉండటం వల్ల అర్థరాత్రి వరకూ ఓటింగ్ కొనసాగిందని మీనా తెలిపారు. దీనికితోడు 5,600 పోలింగ్ స్టేషన్లలో 1,200కు పైబడి ఓటర్లు ఉండటం కూడా ఓటింగ్ ఆలస్యానికి కారణమైందన్నారు. దాదాపు 3,500 పోలింగ్ స్టేషన్లలో నిర్ణీత సమయమైన సాయంత్రం 6.00 గంటలు దాటి పోలింగ్ కొనసాగిందని, చివరి పోలింగ్ స్టేషన్లో అర్ధరాత్రి 2 గంటలకు పోలింగ్ ముగిసిందని చెప్పారు. శ్రీకాకుళం, కోనసీమ, ఉదయగిరి తదితర ప్రాంతాల్లో వాతావరణం సహకరించకపోవడం వల్ల ఎన్నికల ప్రక్రియ ముగిసిన తరువాత ఎలక్షన్ టీమ్‌లు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు, స్ట్రాంగ్ రూమ్‌ల వద్దకు వచ్చేసరికి ఆలస్యమైందన్నారు. ఎన్నికలు ముగిసిన తదుపరి రోజు పరిశీలకులు, అభ్యర్థులతో రిటర్నింగ్ అధికారి సమావేశం ఏర్పాటు చేసి ఎక్కడైనా రీపోలింగ్‌కు అవసరం ఉందా లేదా అనే విషయాన్ని సమీక్షిస్తారన్నారు. ఈ సమీక్షల్లో ఒక్క పరిశీలకుడు కూడా రీపోలింగ్‌కు సిఫార్సు చేయకపోవడంవల్ల 25 లోక్‌సభ నియోజకవర్గాలు, 175 అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలను అన్నింటినీ మంగళవారం రాత్రి 33 ప్రాంతాల్లో నున్న 350 స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచినట్లు తెలిపారు. ఈ స్ట్రాంగ్ రూమ్‌లకు మూడంచెల భద్రత కల్పించామని చెప్పారు. ఈ ప్రక్రియ మొత్తం ముగిసిన తరువాతే అసలైన పోలింగ్ శాతాన్ని ఖరారు చేస్తామని, అందువల్లే పోలింగ్ శాతాన్ని ప్రకటించడంలో కొంత ఆలస్యం జరిగిందని వివరించారు.హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ఎన్నికల అనంతరం ప్రత్యేకించి తాడిపత్రి, మాచర్ల, చంద్రగిరి, నర్సరావుపేట ప్రాంతాల్లో పలుచోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయని మీనా చెప్పారు. ఈ ఘటనలను ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించి, వెంటనే డీజీపీతో చర్చించిందని తెలిపారు. మంగళవారం నుంచి పోలీస్ యంత్రాంగం ప్రత్యేకమైన చర్యలు చేపట్టిందని, అయా ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నదని తెలిపారు. ఈ నాలుగు ప్రాంతాలకు సీనియర్ అధికారులు, అదనపు పోలీసు బలగాలను పంపినట్లు చెప్పారు. స్థానికంగా జన సంచారాన్ని నియంత్రించడమే కాకుండా సంబంధిత పార్టీల అభ్యర్థులను గృహ నిర్బంధం చేశామన్నారు. తదుపరి విచారణ జరిపి పోలిస్ కేసులను కూడా పెట్టడం జరుగుతుందన్నారు. 715 ప్రాంతాల్లో పోలీస్ పికెట్లను కూడా ఏర్పాటు చేశామని, అన్ని చోట్లా పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని ఆయన తెలిపారు. పోలింగ్ ఇలా..రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 4,13,33,702లోక్‌సభకు పోలైన ఓట్లు 3,33,40,560అసెంబ్లీకి పోలైన ఓట్లు 3,33,40,333ఈవీఎంల ద్వారా పోలైన ఓట్లుపురుషులు 1,64,30,359మహిళలు 1,69,08,684ఇతరులు 1,517 మందిపోస్టల్ బ్యాలెట్ ద్వారా మొత్తం వచ్చిన ఓట్లు 4.97 లక్షలుఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగుల ఓట్లు 4.44 లక్షలు85 ఏళ్ల పైబడిన వృద్ధులు 13,700దివ్యాంగులు 12,700అత్యవసర సర్వీసు ఓటర్లు 27,100 -
ఏపీ ఎన్నికలపై సీఈఓ ముకేశ్ కుమార్ కీలక ప్రెస్ మీట్
-
రాష్ట్రంలో 81.3% పోలింగ్!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సోమవారం జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో 81.3% పోలింగ్ జరిగింది. పోస్టల్ బ్యాలెట్ 1.2 శాతాన్ని కలుపుకొంటే ఇది 82.5 శాతమని రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈవో) కార్యాలయం వర్గాలు మంగళవారం రాత్రి వెల్లడించాయి. ఈ వివరాలను కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) ధృవీకరించాల్సి ఉంది. 2019 ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ 0.6 శాతంతో కలుపుకొని 79.8 శాతం నమోదైంది. ఈసారి ఎన్నికల్లో రాత్రి 12 గంటల వరకు 79.40 శాతం నమోదైనట్లు మంగళవారం మధ్యాహ్నం సీఈవో ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 2 గంటల వరకు ఓటింగ్ జరిగినందున ఎక్కడ ఎంత ఓటింగ్ జరిగిందో పూర్తి వివరాలు రావడానికి ఆలస్యమవుతోందని వివరించారు. మంగళవారం రాత్రి అందిన సమాచారం ప్రకారం జిల్లాలవారీగా పోలింగ్ (శాతాల్లో)డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ : 83.19అల్లూరి సీతారామరాజు : 63.19ఏలూరు : 83.04సత్యసాయి : 82.77చిత్తూరు : 82.65ప్రకాశం : 82.40బాపట్ల : 82.33కృష్ణా : 82.20అనకాపల్లి : 81.63పశ్చిమ గోదావరి : 81.12నంద్యాల : 80.92విజయనగరం : 79.41తూర్పు గోదావరి : 79.31అనంతపురం : 79.25ఎన్టీఆర్ : 78.76కడప : 78.72పల్నాడు : 78.70నెల్లూరు : 78.10తిరుపతి : 76.83కాకినాడ : 76.37అన్నమయ్య : 76.12కర్నూలు : 75.83గుంటూరు : 75.74శ్రీకాకుళం : 75.41మన్యం : 75.24విశాఖ : 65.50 -
ఏపీలో తుది పోలింగ్ శాతంపై సాయంత్రానికి క్లారిటీ: ఎంకే మీనా
సాక్షి, అమరావతి: ఏపీలో తుది పోలింగ్ శాతంపై ఎన్నికల కమిషన్ లెక్కలు తేలుస్తోంది. జిల్లాల నుంచి వచ్చిన సమాచారాన్ని ఈసీ వర్గాలు క్రోడీకరిస్తున్నాయి. ఈసారి పోలింగ్ 80 శాతం దాటే అవకాశం ఉంది. నేటి సాయంత్రానికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాగా రాష్ట్రంలో 81శాతం పోలింగ్ నమోదు కావొచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా తెలిపారు. ఈ ఎన్నికల్లో రాత్రి 12 వరకు 78.25 శాతం నమోదైనట్లు అంచనా వేస్తున్నట్లు తెలిపారు. 1.2 శాతం పోస్టల్ బ్యాలెట్‌తో కలుపుకొని 79.40 శాతం పోలింగ్ నమోదైందని ఎంకే మీనా పేర్కొన్నారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 2 గంటల వరకూ పోలింగ్ జరిగిందని అన్నారు. పోలింగ్ పర్సంటేజ్‌పై సాయంత్రానికి పూర్తి వివరాలు వస్తాయని చెప్పారు. అయితే 2019 ఎన్నికల్లో 79.64 శాతం పోలింగ్ నమోదైందని పేర్కొన్నారు. -
పోటెత్తిన ఓటర్లు: ఏపీ సీఈవో ముఖేష్‌కుమార్ మీనా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు సోమవారం జరిగిన ఎన్నికల్లో ఓటర్ల చైతన్యం పోటెత్తింది. ఉదయం ఆరు గంటల నుంచే వారు భారీ క్యూలైన్లలో వేచిఉండి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉత్సాహం చూపించారు. గతంలో ఎన్నడూలేని విధంగా సంక్షేమ పథకాల కొనసాగింపునకు మద్దతుగా మహిళలు, వృద్ధులు పెద్దఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చెదురుమదురు సంఘటనలు తప్ప రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంత వాతావరణంలో ముగిసిందని, ఎక్కడా రీపోలింగ్ అవసరం ఏర్పడలేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా సోమవారం సాయంత్రం ప్రకటించారు.తొలిసారి ఓటర్లు, వృద్ధులు పెద్దఎత్తున పోలింగ్‌లో పాల్గొన్నారని, దీంతో గత ఎన్నికల కంటే పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందన్నారు. సా.6 గంటల దాటిన తర్వాత కూడా 3,500 పోలింగ్ స్టేషన్లలో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని, రాత్రి 8.30 గంటలకు కొన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ముగిసిందని మీనా తెలిపారు. మరో 360 పోలింగ్ స్టేషన్లలో రాత్రి 10.30 గంటల వరకు పోలింగ్ కొనసాగిందన్నారు. దీంతో తుది పోలింగ్ శాతం మంగళవారం ప్రకటిస్తామని, సాయంత్రం ఐదు గంటలకు 68.04 శాతం నమోదైందని మీనా తెలిపారు. పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడం, గాలివాన బీభత్సాలతో పోలింగ్ మందకొడిగా సాగిందన్నారు.చెదురుమదురు సంఘటనలుఇక రాష్ట్రంలో ఎటువంటి హింసాత్మక సంఘటనలు, రీపోలింగ్ లేకుండా ఎన్నికలు నిర్వహించాలన్న ఎన్నికల సంఘం గత కొన్ని నెలలుగా చేసిన కసరత్తు సత్ఫలితాలిచి్చందని మీనా చెప్పారు. పల్నాడు, అనంతపురం, అన్నమయ్య జిల్లాల్లో హింసాత్మక సంఘటనలు జరుగుతాయన్న భావనతో ముందస్తు భద్రత ఏర్పాట్లు చేశామని.. దీంతో సంఘటన జరిగిన వెంటనే స్పందించి వాటిని అదుపులోకి తెచ్చామన్నారు. ఈ సంఘటనలకు సంబంధించి పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించారన్నారు. వివిధ ప్రాంతాల్లో మొత్తం 11 ఈవీఎంలను ధ్వంసం చేయగా వాటిని భెల్ అధికారులు పరిశీలించి అందులోని డేటా సురక్షితంగా ఉందని నిర్థారించడంతో రీపోలింగ్ అవసరంలేకుండా కొత్త ఈవీఎంలతో పోలింగ్‌ను కొనసాగించినట్లు తెలిపారు.కౌంటింగ్ సమయంలో ఈ రెండు ఈవీఎంల డేటాను పరిగణనలోకి తీసుకుంటారని మీనా స్పష్టంచేశారు. అత్యధికంగా పల్నాడు జిల్లాలో 12 హింసాత్మక సంఘటనలు జరిగాయన్నారు. తెనాలి, నరసరావుపేటల్లో ఎమ్మెల్యేలను.. అనంతపురంలో ఇరుపార్టీల అభ్యర్థులను గృహనిర్భందం చేయడం ద్వారా ఉద్రిక్త వాతావరణాన్ని నియంత్రించినట్లు ఆయన తెలిపారు. ఇక పుంగనూరులో జరిగిన సంఘటనలో నిందితులను వదిలేసిన ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశించారు. పీలేరులో ఏజెంట్ల కిడ్నాప్ విషయం దృష్టికి రాగానే పోలీసులు రంగం ప్రవేశంచేసి వారిని తీసుకొచ్చి పోలింగ్ కొనసాగించినట్లు తెలిపారు. ఇదిలా ఉంటే.. మంగళవారం పోలింగ్ పరిశీలకులు, రాజకీయ పార్టీలతో 17ఏ స్రూ్కటినీ పూర్తయిన తర్వాత రీ–పోలింగ్‌పై ఒక స్పష్టత వస్తుందని మీనా చెప్పారు. స్ట్రాంగ్ రూమ్‌కు చేరుకున్న ఈవీఎంలుఇక ఎన్నికల ప్రక్రియ పూర్తియిన చోట్ల ఈవీఎం మిషన్లను పటిష్ట బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్‌లకు చేర్చినట్లు మీనా తెలిపారు. కొన్నిచోట్ల 10.30 వరకు పోలింగ్ కొనసాగే అవకాశం ఉండటంతో అక్కడ అర్థరాత్రి దాటిన తర్వాత ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్‌కు చేరుకుంటాయన్నారు. ఈవీఎంలను రాజకీయ పార్టీల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపర్చి ఆ తాళాలను సీఆర్పీఎఫ్ వారికి అందిస్తారన్నారు. 24 గంటలూ కెమెరాల పర్యవేక్షణలో స్ట్రాంగ్‌రూమ్‌లు ఉంటాయని, రాజకీయ పార్టీలకు చెందిన వారు కూడా అక్కడ 24 గంటలు కాపలాగా ఉండటానికి అనుమతిస్తామన్నారు.ఓటు హక్కు వినియోగించుకున్న మీనారాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా సోమవారం ఉ.7.30కు తన ఓటు హక్కును విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని రైల్వే ఫంక్షన్ హాల్లో వినియోగించుకున్నారు. -
ఏపీలో పోలింగ్ శాతం పెరిగింది: ఏపీ సీఈవో
సాక్షి, విజయవాడ: ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్దసంఖ్యలో పోలింగ్ నమోదైందని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేశామని చెప్పారు.పల్నాడులో 12 చోట్ల ఘర్షణలు జరిగాయి. పల్నాడులో ఒక చోట ఈవీఎంను ధ్వంసం చేశారు. ఈవీఎంలోని చిప్‌లో డేటా భద్రంగా ఉంది. ఈవీఎంలను మార్చి మళ్లీ పోలింగ్ ప్రారంభించాం. కొన్ని చోట్ల ఇంకా పోలింగ్ కొనసాగుతోంది. అన్నమయ్య జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. అక్కడ మిషన్లు మార్చి పోలింగ్ పునరుద్ధరించాం. పల్నాడు, అనంతపురం, తెనాలిలో కొందరిని గృహ నిర్బంధం చేశారు’’ అని ఏపీ సీఈవో వెల్లడించారు.11 చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేశారు. ఎక్కడా రీ పొలింగ్ అవసరం పడలేదు. కొన్ని ఘర్షణలు జరిగినా కట్టడి చేశాం. ఇప్పటివరకు 75 శాతం పోలింగ్ నమోదైంది. స్ట్రాంగ్ రూమ్‌లోకి ఈవీఎంల తరలింపు జరుగుతుందని ఎంకే మీనా వెల్లడించారు. -
నేడే పోలింగ్.. ప్రజాతీర్పునకు సర్వం సిద్ధం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అసెంబ్లీకి, లోక్‌సభకు పోటీచేస్తున్న 2,841 మంది అభ్యర్థుల భవిష్యత్తు మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. అసెంబ్లీకి పోటీచేస్తున్న 2,387 మంది, లోక్‌సభకు పోటీచేస్తున్న 454 మంది భవిష్యత్తును నిర్ణయించడానికి 4.14 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రశాంత వాతావరణంలో ఈ ప్రక్రియను పూర్తిచేయడానికి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. రాష్ట్రవ్యాప్తంగా 46,389 పోలింగ్ స్టేషన్లలో ఉ.7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభం కావాల్సి ఉండడంతో అధికారులంతా ఆదివారం రాత్రికే ఎక్కడికక్కడ చేరుకున్నారు. కానీ, దానికి రెండు గంటల ముందు అంటే ఉ.5 గంటల నుంచే అధికారులు ఏర్పాట్లు మొదలుపెడతారని.. ఏజెంట్లు ఉ.5.30కల్లా పోలింగ్ స్టేషన్లకు చేరుకుంటే 90 నిమిషాల పాటు మాక్ పోలింగ్ నిర్వహించి ఏడు గంటలకు పోలింగ్ ప్రక్రియను ప్రారంభిస్తారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా ఆదివారం తెలిపారు. సమస్యాత్మకంగా గుర్తించిన 12,438 పోలింగ్ కేంద్రాల్లో మరింత పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. మొత్తం పోలింగ్ కేంద్రాలకుగాను 31,385 చోట్ల అంటే 75 శాతం కేంద్రాలను లోపలా, బయట పూర్తిస్థాయిలో వెబ్‌కాస్టింగ్ ద్వారా జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో నిరంతరాయంగా పర్యవేక్షించేందుకు అన్ని ఏర్పాట్లు జరిగాయని మీనా చెప్పారు. ఇందుకోసం సచివాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. 26 జిల్లాలకు సంబంధించి 26 టీవీ మానిటర్ల ద్వారా ఆయా జిల్లాల్లోని పోలింగ్ కేంద్రాల్లో జరిగే ఓటింగ్ సరళిని పోలింగ్ కేంద్రం లోపల, బయటా కూడా పర్యవేక్షిస్తారని ఆయన చెప్పారు. ఇందుకు దాదాపు 150 మంది అధికారులు, సిబ్బంది నిరంతరాయంగా పనిచేస్తున్నారన్నారు. ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోండి.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఐదేళ్లకొకసారి జరిగే ఓట్ల పండుగలో ప్రతిఒక్క ఓటరూ పాల్గొని రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకోవాలని ముఖేష్‌కుమార్ మీనా పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణకు, దృఢమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటుకు ప్రశాంత వాతావరణంలో న్యాయంగా, పారదర్శకంగా జరిగే ఎన్నికలు ఎంతో కీలకమని.. అటువంటి ఎన్నికల్లో రాష్ట్రంలోని ఓటర్లంతా పాల్గొని ప్రజాస్యామ్యవ్యవస్థను పరిరక్షించుకోవాలని ఆయన విజ్ఞప్తిచేశారు. 83శాతం ఓటింగ్ లక్ష్యంగా.. ఇక గత ఎన్నికల్లో రాష్ట్రంలో 79.84 శాతం ఓటింగ్ నమోదైందని, ఈ ఎన్నికల్లో 83 శాతం ఓటింగ్ లక్ష్యంగా విస్తృతస్థాయిలో ఓటర్లను చైతన్యపర్చేలా పలు కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహించామన్నారు. ఓటర్లను ఆకర్షించడానికి వయో వృద్ధులు, మహిళలు, యువత, పర్యావరణం పేరుతో మోడల్ పోలింగ్స్టేషన్లను ఏర్పాటుచేసి సుందరంగా అలంకరించారు. అదే విధంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అవసరమైన కనీస వసతులైన తాగునీరు, వీల్చైర్లు, ర్యాంపులు, ప్రథమ చికిత్స సేవలు అందుబాటులో ఉంచామని ముఖేష్‌కుమార్ మీనా చెప్పారు. పురుషులకు, మహిళలకు వేర్వేరుగా క్యూలైన్లు ఏర్పాటుచేయడమే కాకుండా అవసరాన్ని బట్టి వృద్ధులకు, దివ్యాంగులకు ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటుచేయనున్నట్లు మీనా తెలిపారు. 1.60 లక్షల ఈవీఎంలను ఉపయోగిస్తున్నాం.. రాష్ట్రంలో 46,389 పోలింగ్ కేంద్రాల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 1.60 లక్షల కొత్త ఈవీఎంలను వినియోగిస్తున్నట్లు ఆయన తెలిపారు. వీటికి అదనంగా మరో 20 శాతం కొత్త ఈవీఎంలను కూడా సిద్ధంగా ఉంచామన్నారు. నిజానికి.. మొదట్లో ప్రతిపాదించినట్లుగా 46,165 పోలింగ్ కేంద్రాలకు 1.45 లక్షల ఈవీఎంలు సరిపోతాయని, అయితే.. అదనంగా ప్రతిపాదించిన 224 ఆగ్జిలరీ పోలింగ్ కేంద్రాలకు మరో 15 వేల ఈవీఎంలు సమకూర్చుకున్నామన్నారు. మొత్తమ్మీద 46,389 పోలింగ్ కేంద్రాలలో 1.60 లక్షల కొత్త ఈవీఎంలను వినియోగిస్తున్నామని ముఖేష్‌కుమార్ మీనా చెప్పారు. ప్రశాంత పోలింగ్‌కు పటిష్ట భద్రత డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగా, సక్రమంగా నిర్వహించేందుకు పూర్తి భద్రతా ఏర్పాట్లుచేశామని డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా తెలిపారు. రాష్ట్ర పోలీసు బలగాలకు అదనంగా సీఆర్పీఎఫ్, తమిళనాడు, కర్ణాటక పోలీసు బలగాలను మోహరించామన్నారు. వారితోపాటు మాజీ సైనికులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విభాగాల సేవలను కూడా ఉపయోగించుకుంటున్నామని ఆదివారం ఒక ప్రకటనలో ఆయన చెప్పారు. పోలింగ్ విధుల కోసం వినియోగిస్తున్న బలగాల వివరాలు.. -
వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు: ఏపీ సీఈవో
సాక్షి, అమరావతి: పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. జీరో వయొలెన్స్, జీరో రీ-పోలింగ్ లక్ష్యంగా ఎన్నికల నిర్వహణ చేపడతున్నామని పేర్కొన్నారు. 64 శాతం మేర పోలింగ్ స్టేషన్లల్లో వెబ్ కాస్ట్ పెట్టాం. పోలింగ్ స్టేషన్ల లోపల, బయటా వెబ్ కెమెరాలు ఏర్పాటు చేశాం. సెంట్రల్ కమాండ్ కంట్రోల్ నుంచి పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తామని ఆయన తెలిపారు.పోలింగ్ బూత్‌లోకి సెల్ ఫోన్లకు అనుమతి లేదు. పోల్ డేటా మానిటరింగ్ సిస్టం పీడీఎంఎస్ యాప్ ద్వారా పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తాం. కొన్ని చోట్ల కొందరు ప్రలోభాలకు గురి చేస్తున్నారనే సమాచారం వస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా పోలీస్ అబ్జర్వర్లు, జనరల్ అబ్జర్వర్లను ఈసీ నియమించింది. 20 శాతం మేర ఈవీఎంల బఫర్ స్టాక్ వచ్చింది’’ అని సీఈవో వెల్లడించారు.సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా పరిష్కరించే మెకానిజం ఏర్పాటు చేసుకున్నాం. వృద్ధులకు, దివ్యాంగులకు పోలింగ్ స్టేషన్లల్లో ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నామని ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు. -
ఎన్నికలకు సర్వం సన్నద్ధం..
-
ప్రశాంత ఎన్నికలే లక్ష్యం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి గతంలో ఎన్నడూ లేనివిధంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా చెప్పారు. ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కోకుండా 1,06,145 మందితో భద్రత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ముగిసి, మే 13న ఓటింగ్ ప్రక్రియ జరగనున్న నేపథ్యంలో ఆయన శనివారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్నికల ఏర్పాట్లను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో 197 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను ఎన్నికల కోసం వినియోగిస్తే ఈ ఎన్నికల్లో 295 కంపెనీలకు చెందిన 26,550 మంది సాయుధుల్ని వినియోగిస్తున్నట్లు తెలిపారు. పోలింగ్ స్టేషన్లలో ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొనకుండా పురుషులు, మహిళలు, వృద్ధులు/దివ్యాంగులకు మూడు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసి ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, ఉద్యోగ విరమణ చేసిన పోలీసు అధికారులతో నియంత్రించనున్నట్లు చెప్పారు. 2019 ఎన్నికల్లో 79 శాతం పోలింగ్ నమోదు కాగా ఈసారి 82 నుంచి 83 శాతం పోలింగ్ నమోదవుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. భారీస్థాయిలో డూప్లికేట్ ఓట్లు, చనిపోయినవారి ఓట్లు తొలగించడంతో పాటు కొత్తగా తొలిసారి ఓటువేస్తున్న వారు పదిలక్షల మందికిపైగా ఉండటంతో పోలింగ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. పోలింగ్ స్టేషన్‌కు 200 మీటర్ల వరకు ఓటరుకు తప్ప మిగిలిన వారికి ప్రవేశంఉండదని స్పష్టం చేశారు. వృద్ధులు, దివ్యాంగులు ఓటు వేయడానికి సహకరించడానికి ఒక సహాయకుడిని ఒకసారి మాత్రమే అనుమతిస్తామన్నారు. 11 గంటల పాటు పోలింగ్ రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాల్లో.. ఆరు నియోజకవర్గాలు మినహా మిగిలిన అన్నిచోట్ల ఉదయం ఏడుగంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు అంటే 11 గంటలపాటు ఓటింగ్‌కు అనుమతించనున్నట్లు తెలిపారు. అరకు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో నక్సలైట్ల ప్రభావం ఉన్న పాలకొండ, కురుపాం, సాలూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం ఐదుగంటల వరకు, అరకు, పాడేరు, రంపచోడవరం అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం నాలుగుగంటల వరకు ఓటింగ్‌కు అనుమతించనున్నట్లు వివరించారు. పోలింగ్ సిబ్బంది ఆదివారం సాయంత్రానికే పోలింగ్ స్టేషన్లకు చేరుకోవాలని చెప్పారు. సోమవారం ఉదయం ఐదుగంటల నుంచే పోలింగ్‌కు ఏర్పాట్లు చేసి ఏడుగంటలకు ఓటింగ్ ప్రారంభించాలని పేర్కొన్నారు. ఏజెంట్ల సమక్షంలో 90 నిమిషాలు మాక్ పోలింగ్ నిర్వహించి సీల్‌వేసిన అనంతరం ఏడు గంటలకు ఓటింగ్ ప్రారంభిస్తామన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌కు ముగ్గురు ఏజెంట్లకు అనుమతి ఇస్తామని, కానీ పోలింగ్ స్టేషన్లోకి ఒక ఏజెంటుకు మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పారు. పోలింగ్ స్టేషన్లోకి సెల్ఫోన్లు, మారణాయుధాలు అనుమతించరని తెలిపారు. సెల్ఫోన్లు తీసుకొస్తే వాటిని బయటే వదిలి లోపలికి వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల అయినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.269 కోట్ల విలువైన నగదు, వస్తువులను సీజ్‌చేసినట్లు తెలిపారు. దీన్లో నగదు రూ.71 కోట్లు ఉన్నట్లు ఆయన చెప్పారు. అమల్లోకి 144వ సెక్షన్శనివారం సాయంత్రం ఆరుగంటల నుంచి సోమవారం సాయంత్రం ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు రాష్ట్రంలో సైలెంట్ పీరియడ్ కొనసాగుతుందని, ఈ సమయంలో రాష్ట్రంలో 144వ సెక్షన్ అమల్లో ఉంటుందని చెప్పారు. అయిదుగురి కంటే ఎక్కువమంది గుమికూడరాదని, ఎటువంటి రాజకీయ ప్రచారాలు, ర్యాలీలు చేయకూడదని స్పష్టం చేశారు. కానీ రాజకీయ పార్టీ లు ఎన్నికల సంఘం నుంచి ఆమోదం పొందిన ప్రకటనలు పత్రికల్లో ఇవ్వడానికి అనుమతిస్తామన్నారు. ఇకనుంచి ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ జూన్ 1న చివరిదశ ఎన్నికలు ముగిసేవరకు ప్రచారం చేయకూడదని చెప్పారు -
పోలింగ్‌కు సర్వం సన్నద్ధం: ఏపీ సీఈవో
సాక్షి, అమరావతి: ఎల్లుండి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6 వరకూ పోలింగ్ జరుగుతుందని సీఈవో ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 వరకూ.. పాలకొండ, కురుపాం, సాలూరులో సాయంత్రం 5 వరకూ, ఆయా నియోజకవర్గాల్లో 48 గంటల ముందు సైలెన్స్ పీరియడ్ స్టార్ట్ అవుతుందని వెల్లడించారు.సైలెన్స్ పీరియడ్‌లో రాజకీయ ప్రచారం పూర్తిగా నిలిచిపోతుంది. సైలెన్స్ పీరియడ్‌లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. సాయంత్రం 6 తర్వాత ప్రచారం కోసం బయటినుంచి వచ్చిన వారు స్వస్థలాలకు వెళ్ళిపోవాలన్నారు. రేపు ఉదయం నుంచి సాయంత్రం లోగా ఈవీఎం మెషిన్లు పోలింగ్ కేంద్రాలకు చేరుతాయి. ఉదయం 7 లోపు మాక్ పోలింగ్ పూర్తి చేసి పోలింగ్ ప్రారంభించాలని సీఈవో తెలిపారు.పోలింగ్ స్టేషన్లో ఒక పోలింగ్ ఏజెంట్ మాత్రమే ఉండాలి. పోలింగ్ స్టేషన్‌కు 200 మీటర్ల పరిధిలో ఎలాంటి ప్రచారం చేయకూడదు. పోలింగ్ కేంద్రాలోకి ఫోన్లకు అనుమతి లేదు. ఇప్పటివరకూ 269.28 కోట్లు నగదు,మద్యం,ఇతర అభరణాలు సీజ్ చేశాం. సివిల్ పోలీసులు 58,948 మంది విధుల్లో ఉంటారు.ఏపీఎస్పీ, కేంద్ర బలగాలు కలిపి మొత్తం 28,588 మంది విధుల్లో ఉన్నారు. ఎన్సీసీ, ఎన్‌ఎస్‌స్, మాజీ సర్వీస్ మెన్, రిటైర్డ్ పోలీసులు 18,609 మంది ఉన్నారు. మొత్తంగా 1,06,145 మంది పోలీసులు,ఇతరులు ఉన్నారు. మొత్తం 46,389 పోలింగ్ స్టేషన్లలో 12,438 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. మొత్తం 34,651 పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ ఉంటుంది. జూన్ 1 వరకూ ఎగ్జిట్ పోల్ చేయకూడదు. 10,30,000 మంది యువ ఓటర్లు ఉన్నారు’’ అని సీఈవో వెల్లడించారు. -
Andhra Pradesh: నేటితో ప్రచారానికి తెర
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి ప్రచారంతో హోరెత్తించిన రాజకీయ పార్టీల మైకులు మూగబోనున్నాయి. మే 13న జరిగే పోలింగ్‌కు 48 గంటల ముందు ఎటువంటి ప్రచారం లేకుండా నిశ్శబ్ద కాలం అమల్లో ఉంటుంది. ఈ సమయంలో ఎటువంటి సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ ప్రచురించడం, ప్రసారం చేయకూడదు. పోలింగ్ ప్రక్రియ దగ్గరపడటంతో వచ్చే 72 గంటల్లో అధికారులు చేపట్టాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖే‹Ùకుమార్‌మీనా ఆదేశాలు జారీ చేశారు. హింసకు, రీ పోలింగ్‌కు తావు లేకుండా ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్లు, ఎస్పీలను మీనా ఆదేశించారు. ఆ ఆదేశాల్లో పేర్కొన్న ప్రకారం. 11వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు నుండి నిశ్శబ్ద కాలం (సైలెంట్ పీరియడ్) అమల్లోకి వస్తుంది. ఆ సమయంలో ఎన్నికల ప్రచారానికి పూర్తిగా తెరపడుతుంది.చట్టవిరుద్ధమైన సమావేశాలపై నిషేధం ఉంటుంది. పోలింగ్ ముగింపు సమయం ఆధారంగా మద్యం దుకాణాలకు 48 గంటల డ్రై డే సవరించబడుతుంది. నియోజకవర్గం వెలుపల నుంచి ప్రచారం నిమిత్తం తీసుకువచ్చిన, నియోజకవర్గ ఓటర్లు కాని రాజకీయ కార్యకర్తలు/పార్టీ కార్యకర్తలు అంతా ప్రచార సమయం ముగిసిన వెంటనే నియోజకవర్గం నుంచి వెళ్లిపోవాలి. 48 గంటల వ్యవధిలో ఓటర్లు కాని ఇతర వ్యక్తులు స్థానిక లాడ్జిలు, కల్యాణ మండపాలు, కమ్యూనిటీ హాళ్లు మొదలైన వాటిలో లేరని అధికారులు నిర్ధారించుకోవాలి.ఏజెంట్ల జాబితా ఇవ్వాల్సిన అవసరం లేదు పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ ఏజెంట్ల నియామక జాబితాను రిటరి్నంగ్ అధికారికి ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొంది. పోలింగ్ తేదీ రోజు ప్రిసైడింగ్ అధికారికి పోలింగ్ ఏజెంట్ తమ వివరాలు సమర్పించి విధులకు హాజరు కావచ్చు. -
ప్రశాంత పోలింగ్‌కు పటిష్ట ఏర్పాట్లు
అమరావతి: పోలింగ్ ప్రశాంతంగా, సక్రమంగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్‌కుమార్ మీనా ఆదేశించారు. ఆయన గురువారం డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తాతో కలిసి వెలగపూడిలోని సచివాలయం నుంచి జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలతో నిర్వహించిన సమావేశంలో పోలింగ్‌కు 72 గంటల ముందు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖేశ్‌కుమార్ మీనా మాట్లాడుతూ రానున్న మూడురోజులు అత్యంత కీలకమైనవని చెప్పారు. అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలన్నారు. ఓటర్లను ఎవరూ ఎలాంటి ప్రలోభాలకు గురిచేయకుండా, అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను వెబ్‌కాస్టింగ్ ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించాలని చెప్పారు. షాడో ఏరియాలో పటిష్టమైన సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన హెలికాప్టర్లను సద్వినియోగం చేసుకుని పోలింగ్ శాతం పెరిగేలా చూడాలని కోరారు. ఓటర్లందరికీ స్లిప్పులు అందేలా చూడాలన్నారు. ఈవీఎంలను తరలించే వాహనాలను జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా పర్యవేక్షించాలని చెప్పారు.పోలింగ్ రోజున ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా షామియాలు వేయడంతోపాటు తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉంచాలని ఆయన సూచించారు. డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా మాట్లాడుతూ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా తగిన ప్రణాళికలు రూపొందించుకుని పోలింగ్ ప్రశాంతంగా ముగిసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.తెలంగాణ సరిహద్దుల్లోని జిల్లాల అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని, పోలింగ్ రోజున వాహనాలు, వ్యక్తుల రాకపోకలపై దృష్టి సారించాలని చెప్పారు. ఈ సమావేశంలో ఏపీఎస్పీ బెటాలియన్ అదనపు డీజీ అతుల్‌సింగ్, రాష్ట్ర పోలీస్ నోడల్ అధికారి, అదనపు డీజీ శంకబ్రత బాగ్చీ, అదనపు ఈసీవోలు పి.కోటేశ్వరరావు, ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
పోస్టల్ బ్యాలెట్‌తో 3.03 లక్షల మంది ఓటు
సాక్షి, అమరావతి: పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్న 4.30 లక్షల మందిలో మంగళవారం నాటికి 3.03 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకున్నారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘కొన్ని జిల్లాల్లో 3వ తేదీన, మరికొన్ని జిల్లాల్లో 4వ తేదీన హోమ్ ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రారంభమయ్యాయి.ఇప్పటివరకు పోస్టల్ బ్యాలెట్‌కు 4.30 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో 3.20 లక్షల మంది ఉద్యోగులు, 40 వేల మంది పోలీసులు, హోమ్ ఓటింగ్ కేటగిరీ కింద 28 వేల మంది, ఎసెన్షియల్ సర్వీసెస్ కింద 31 వేల మంది ఉన్నారు. మిగిలిన వారిలో సెక్టార్ ఆఫీసర్లు, ఇతరులున్నారు. ఇప్పటివరకు 2.76 లక్షల మంది ఉద్యోగులు, దాదాపు 28 వేల మంది హోమ్ ఓటింగ్, ఎసెన్షియల్ సర్వీసెస్ కేటగిరీల వారు ఓట్లు వేశారు. కొందరు ఉద్యోగులు పలు రకాల కారణాల వల్ల పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని ఉపయోగించుకోలేకపోయారు. వారికి ఏ ఆర్వో పరిధిలో ఓటు ఉంటే.. ఆ ఫెసిలిటేషన్ కేంద్రంలోనే స్పాట్లో ఈ సౌకర్యాన్ని వినియోగించుకునేలా మంగళ, బుధవారాల్లో అవకాశాన్ని కల్పించాం. ఈ విషయంపై అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు రెండు రోజుల క్రితమే ఆదేశాలు జారీ చేశాం. కానీ ఈరోజు కూడా కొన్ని సమస్యలు తలెత్తాయని మా దృష్టికి వచ్చింది’ అని చెప్పారు.ప్రలోభాలకు గురైతే కఠిన చర్యలుపోస్టల్ బ్యాలెట్ విషయంలో ప్రలోభాలకు గురయ్యే ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు సస్పెండ్ చేస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా హెచ్చరించారు. ఆయన మాట్లాడుతూ.. ‘ప్రభుత్వ ఉద్యోగులు కొందరు నగదు తీసుకొని ఓటు వేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇది చెడు సంకేతం. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో డబ్బులు పంచుతున్న నలుగురిని అరెస్టు చేశాం. అనంతపురంలో ఒక కానిస్టేబుల్ ఉద్యోగుల జాబితా పట్టుకుని నగదు పంపిణీ చేస్తున్నట్లు గుర్తించాం. అతన్ని వెంటనే సస్పెండ్ చేశాం.విశాఖ తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఫెసిలిటేషన్ సెంటర్ వద్ద ఇద్దరి నుంచి నగదు సీజ్ చేసి అరెస్టు చేశాం. ఒంగోలులో యూపీఐ విధానం ద్వారా కొందరు ఉద్యోగులకు నగదు పంపించినట్లు తెలిసింది. ప్రాథమిక విచారణ పూర్తయ్యింది. కాల్ డేటా, బ్యాంక్ లావాదేవీల ఆధారంగా దాదాపు 8, 10 మంది ఉద్యోగులను గుర్తించాం’ అని ముఖేష్‌కుమార్ మీనా చెప్పారు. కాగా, మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలో పలువురు వీవీఐపీలు పర్యటిస్తున్న నేపథ్యంలో బందోబస్తులో ఉండే పోలీసులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవడంలో సమస్యలు తలెత్తుతున్నాయని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తమ దృష్టికి తెచ్చారని చెప్పారు. బందోబస్తులో పాల్గొనే పోలీసులు వారి ఓటు హక్కును వినియోగించుకునేలా సహకరించాలని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలకు ఆదేశాలిచ్చామన్నారు. ఇంకా ఎవరైనా పోలీసులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోకపోతే.. ఈ నెల 9న వారికి అవకాశం కల్పించాలని ఆదేశాలు జారీ చేశాం’ అని చెప్పారు. -
14 నియోజకవర్గాల్లో 100 శాతం వీడియో నిఘా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మే 13న జరిగే సాధారణ ఎన్నికల్లో హింసాత్మక సంఘటనలకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించే విధంగా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 46,389 పోలింగ్ స్టేషన్లున్నట్లు చెప్పారు. వీటిలో 64 శాతానికిపైగా అంటే 29,897 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ చేస్తున్నట్లు తెలిపారు. సచివాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఎన్నికల ఏర్పాట్ల గురించి వివరించారు.అత్యంత సమస్మాత్మకమైనవిగా గుర్తించిన 12,438 పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేకదృష్టి సారించినట్లు తెలిపారు. వీటితోపాటు కేంద్ర ఎన్నికల పర్యవేక్షకులు రాష్ట్ర పర్యటనకు తర్వాత ఇచ్చిన సూచనల ప్రకారం అత్యధిక ఫిర్యాదులు అందుతున్న 14 నియోజకవర్గాలు.. మాచర్ల, గురజాల, పెదకూరపాడు, వినుకొండ, ఆళ్లగడ్డ, ఒంగోలు, తిరుపతి, చంద్రగిరి, పుంగనూరు, పలమనేరు, విజయవాడ సెంట్రల్, పీలేరు, రాయచోటి, తంబళ్లపల్లిల్లో పోలింగ్ ప్రక్రియ మొత్తాన్ని వెబ్‌కాస్టింగ్ చేయనున్నట్లు వివరించారు. రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల అయినప్పటి నుంచి ఇప్పటివరకు తనిఖీల్లో రూ.203.80 కోట్ల విలువైన నగదు, వస్తువులు, మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పట్టుబడుతున్న మద్యంలో అత్యధికంగా గోవా రాష్ట్రానికి చెందినదని, దీనికి సంబంధించి ఏసీబీ దర్యాప్తు చేస్తోందని చెప్పారు. వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని పోలింగ్ కేంద్రాల వద్ద చల్లదనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఆదేశించిందని తెలిపారు. దీనికి అనుగుణంగా షామియానాలు, ఫ్యాన్లు, కూలర్లు, వడదెబ్బ నుంచి తట్టుకోవడానికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు, తడి చేతిరుమాళ్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్స్ అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు. 4.14 కోట్లకు చేరిన ఓటర్ల సంఖ్యరాష్ట్రంలో లోక్‌సభకు 454 మంది, అసెంబ్లీకి 2,387 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 4,14,01,887 మంది ఉన్నట్లు చెప్పారు. ఏప్రిల్ 25తో కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ నిలిపేసిన తర్వాత రాష్ట్రంలో మహిళా ఓటర్ల సంఖ్య 2,10,56,137, పురుష ఓటర్ల సంఖ్య 2,02,74,144 ఉన్నట్లు పేర్కొన్నారు. జనవరిలో విడుదల చేసిన తుది ఓటర్ల సవరణ జాబితా తర్వాత నుంచి ఏప్రిల్ 25 నాటికి కొత్తగా 5.94 లక్షల ఓటర్లు చేరినట్లు తెలిపారు. ప్రతి 1,500 మందికి ఒక పోలింగ్‌స్టేషన్ చొప్పున పెరిగిన ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా కొత్తగా 224 పోలింగ్ స్టేషన్లను జతచేయడంతో మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య 46,389కి చేరిందని వివరించారు. 15 వేల అదనపు బ్యాలెట్ యూనిట్లు తెప్పించాం కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు భారీగా పోటీపడుతుండటంతో మూడు కంటే ఎక్కువ బ్యాలెట్ యూనిట్లు వినియోగించాలి్సన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈవీఎంకు అనుసంధానంగా ఉండే ఒక బ్యాలెట్ యూనిట్లో 16 మంది అభ్యర్థుల పేర్లు పడతాయన్నారు. విశాఖ లోక్‌సభకు 32 మంది అభ్యర్థులు పోటీలో ఉండటంతో మూడు బ్యాలెట్ యూనిట్లు ఉపయోగించాలని చెప్పారు. పది పార్లమెంటు స్థానాల్లో రెండు బ్యాలెట్ యూనిట్లు అవసరమవుతాయన్నారు. అసెంబ్లీ విషయానికి వస్తే మంగళగిరి, తిరుపతిల్లో మూడు బ్యాలెట్ యూనిట్లు, 20 చోట్ల రెండు బ్యాలెట్ యూనిట్లు ఉపయోగించాల్సి వస్తోందని చెప్పారు. దీంతో అదనంగా 15 వేల బ్యాలెట్ యూనిట్లు అవసరం కావడంతో కర్ణాటక నుంచి తెప్పించినట్లు తెలిపారు. జనసేన పోటీచేస్తున్న అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో స్వతంత్రులకు కేటాయించిన గాజుగ్లాసు గుర్తును 15 చోట్ల రద్దుచేసినట్లు చెప్పారు. పెన్షన్లపై రాజకీయ విమర్శలకు స్పందించంరాష్ట్రంలో పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రానికి స్పష్టమైన ఆదేశాలు జారీచేసిందని చెప్పారు. సాధ్యమైనంతవరకు డీబీటీ విధానంలోనే ఇవ్వమని గత నెలలో ఆదేశాలు జారీచేసినట్లు తెలిపారు. కానీ గత నెలలో డీబీటీ విధానంలో ఇవ్వకపోవడం వల్ల ఆ ఆదేశాలను తిరిగి గుర్తుచేస్తూ రాష్ట్రానికి మరోసారి లేఖరాసినట్లు తెలిపారు. పెన్షన్ల పంపిణీకి సంబంధించి రాజకీయ పార్టీలు చేస్తున్న విమర్శలపై తాము స్పందించబోమని ఆయన పేర్కొన్నారు. వీళ్లు ఓటు వేసేశారుసాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ప్రజలు అప్పుడే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 85 ఏళ్లు దాటిన వృద్ధులు, 40 శాతానికిపైగా అంగవైకల్యం ఉన్న వారు ఇంటివద్దే ఓటుహక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించడంతో పోలింగ్ తేదీ మే 13 కంటే ముందే వీరు ఓటుహక్కు వినియోగించుకున్నారు.రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో గురువారం నుంచి హోమ్ ఓటింగ్ పక్రియ మొదలైనట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా చెప్పారు. ఆయన గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 85 ఏళ్లు పైబడిన వృద్ధులు 2,11,257 మంది, 40 శాతానికిపైగా అంగ వైకల్యం ఉన్న దివ్యాంగులు 5,17,227 కలిపి మొత్తం 7,28,484 మంది హోమ్ ఓటింగ్‌కు అర్హులని చెప్పారు. అయితే వీరిలో 28,591 మంది మాత్రమే హోం ఓటింగ్ విధానాన్ని ఎంచుకున్నారన్నారు. హోం ఓటింగ్‌ను ఎంచుకున్న వారిలో 14,577 మంది వృద్ధులు, 14,014 మంది దివ్యాంగులు ఉన్నారని చెప్పారు. మార్చి 16న ఎన్నికల షెడ్యూలు ప్రకటించినప్పటి నుంచి ఏప్రిల్ 22వ తేదీ వరకు అధికారులు హోం ఓటింగ్‌కు అర్హులైన వారి ఇళ్లకు వెళ్లి.. హోం ఓటింగ్ వినియోగించుకోదలచిన వారి నుంచి ఫారం–12డీ సేకరించినట్లు తెలిపారు. హోం ఓటింగ్‌కు అర్హత ఉన్నవారిలో 3 శాతం మంది ఓటర్లు మాత్రమే హోం ఓటింగ్‌ను ఎంచుకోవడం సానుకూల సంకేతమని పేర్కొన్నారు. హోమ్ ఓటింగ్‌ను ఎంచుకున్న ఓటర్ల ఇంటికే అధికారులు వెళ్లి బ్యాలెట్ పేపర్లను ఇచ్చి ఓట్లు వేయించే ప్రక్రియ కొన్ని జిల్లాల్లో గురువారం ప్రారంభించినట్లు తెలిపారు. జిల్లాల ఎన్నికల అధికారులు వారి పరిస్థితులకు అనుగుణంగా హోం ఓటింగ్ షెడ్యూలు రూపొందించుకుని అమలు చేస్తున్నట్లు చెప్పారు. హోం ఓటింగ్ ప్రక్రియ ఈ నెల 8వ తేదీకల్లా పూర్తవుతుందని ఆయన తెలిపారు. -
ఓటు.. హక్కు మాత్రమే కాదు.. బాధ్యత
గుంటూరు వెస్ట్: యువ ఓటర్లుగా నమోదైన ప్రతి ఒక్కరు ఓటు వేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా కోరారు. ఓటు హక్కు మాత్రమే కాదని అంతకు మించిన బాధ్యతగా భావించాలని చెప్పారు. రాష్ట్ర ఎన్నికల సంఘం, జిల్లా యంత్రాంగం లెట్స్ ఓట్ స్వచ్ఛంద సంస్థతో కలసి శనివారం గుంటూరు ఎన్టీఆర్ స్టేడియంలో యువ ఓటర్ల కోసం 3కే వాక్ నిర్వహించాయి. ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ 18–19 ఏళ్ల మధ్య ఉన్న అర్హులైన యువత రాష్ట్రంలో 10.30 లక్షల మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారని తెలిపారు. ఇది శుభపరిణామమన్నారు. వీరంతా ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గత ఎన్నికల్లో రాష్ట్రంలో ఓటింగ్ శాతం 79 అని తెలిపారు. దీన్ని 82 శాతానికి తీసుకెళ్లేందుకు కృషిచేస్తున్నట్లు చెప్పారు. అర్బన్ ప్రాంతాల్లో ఓటింగ్ కొన్నిచోట్ల తక్కువగా ఉందన్నారు. పరిశ్రమల యజమానులతోపాటు వ్యాపారసంస్థలను సంప్రదిస్తున్నామని, ఆ రోజు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని, జీతం మాత్రం కట్ చేయవద్దని చెబుతున్నామని వివరించారు. దీంతోపాటు స్వచ్ఛంద సంస్థల సహకారం కూడా తీసుకుంటున్నామన్నారు. లెట్స్ ఓట్ స్వచ్ఛంద సంస్థ తీసుకున్న చొరవ చాలా గొప్పదని ప్రశంసించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరు మే 13వ తేదీ ఓటు వేసేందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అనంతరం మీనా, గుంటూరు జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి, ఎస్పీ తుషార్ డూడీ, జాయింట్ కలెక్టర్ జి.రాజకుమారి, జీఎంసీ కమిషనర్ కీర్తి చేకూరి, తెనాలి సబ్ కలెక్టర్ ప్రఖార్ జైన్, లెట్స్ ఓట్ సంస్థ కన్వీనర్ మాలకొండయ్య జెండా ఊపి 3కే వాక్‌ను ప్రారంభించారు. ఆర్డీవో పి.శ్రీకర్, డీఆర్వో పెద్ది రోజా, లెట్స్ ఓట్ సంస్థ గుంటూరు చాప్టర్ కోఆరి్డనేటర్ టి.బాలాజీశ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఓటు అనేది హక్కు మాత్రమే కాదు బాధ్యత: ముఖేష్ కుమార్ మీనా
సాక్షి, గుంటూరు: ఏపీలో రాబోయే ఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా. దేశ భవిష్యత్తును మార్చే అవకాశం ఓటు హక్కుకు ఉందని వ్యాఖ్యలు చేశారు. కాగా, గుంటూరులో మొదటిసారి ఓటు హక్కు పొందిన వారికి అవగాహన కార్యక్రమంలో భాగంగా అధికారులు 3k రన్ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా, గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ..‘ఓటు అనేది హక్కు మాత్రమే కాదు బాధ్యత కూడా. దేశ భవిష్యత్తును మార్చే అవకాశం ఓటు హక్కుకు ఉంది. దేశ భవిష్యత్తే యువత.యువత ఓటు నమోదు చేసుకొని ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ప్రోత్సహిస్తుంది. తుది ఓటర్ జాబితా తయారీ చేయడంలో చాలా ఇబ్బందులుంటాయి. యువత ఎప్పటికప్పుడు మొదటి సారి ఓటు నమోదు చేసుకునే అవకాశం కల్పించాంము. ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలి. 20 నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం 68 శాతం కంటే తక్కువగా ఉంటుంది. అర్బన్ నియోజకవర్గాల్లోనే తక్కువ ఓటింగ్ శాతం నమోదవుతుంది. ప్రతీ ఒక్కరు ఓటు వేయాలి’ అని కోరారు. -
ఆ ఉద్యోగ సంఘాలనేతలపై చర్యలు తీసుకోండి
సాక్షి, అమరావతి: ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న కొందరు ఉద్యోగ సంఘాల నేతలపై చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ చైర్మన్ కె.వెంకట్రామిరెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొందరు ఉద్యోగ సంఘాల నేతలు చేస్తున్న వ్యాఖ్యలను నిత్యం కొన్ని పత్రికలు ప్రచురిస్తున్నాయని తెలిపారు. ఆయా పత్రికల క్లిప్పింగులను కూడా మీనాకు అందజేశారు. ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడటం ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని తనను సస్పెండ్ చేశారని.. మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న కొన్ని ఉద్యోగ సంఘాల నేతల వ్యాఖ్యలు కూడా ఎన్నికల ప్రవర్తనా నియామవళి ఉల్లంఘన కిందకే వస్తాయని వెంకట్రామిరెడ్డి వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈనాడు తప్పుడు కథనాల వల్లే.. మార్చి 31న ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ హోదాలో తాను వైఎస్సార్ జిల్లాలో ఏపీపీటీడీ ఉద్యోగులను కలిసి వారి సమస్యలపై చర్చించానని వెంకట్రామిరెడ్డి తెలిపారు. అయితే అదే రోజు ఈనాడు పత్రిక ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం వల్లే ఉద్యోగులు మునిగిపోయారంటూ ఒక తప్పుడు కథనం ప్రచురించిందన్నారు. ఈ కథనాన్ని తాను ఖండిస్తూ విలీనం వల్ల ఉద్యోగులకు మేలే జరిగిందని.. ఉద్యోగుల గురించి తప్పుడు కథనాలు రాయొద్దని పత్రికా ప్రకటన విడుదల చేశానని తెలిపారు. దీంతో తనపై కక్ష కట్టిన ఈనాడు ఏప్రిల్ 2న తాను ఉద్యోగులతో మాట్లాడుతున్న ఫొటోను ప్రచురించి.. ఒక పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నానని తప్పుడు కథనం రాసిందన్నారు. ఈ కథనం ఆధారంగా తమపైన నాలుగు కేసులు పెట్టడంతోపాటు 11 మందిని సస్పెండ్ చేశారని వెంకట్రామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పత్రికలు విష పురుగులు కొన్ని పత్రికలు రోజూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని సంఘాల నాయకులతో మాట్లాడిస్తున్నాయని, అది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కాదా? అని వెంకట్రామిరెడ్డి నిలదీశారు. ప్రభుత్వం ఉద్యోగులకు మంచి చేసింది అంటే తప్పు.. ప్రభుత్వం ఉద్యోగులను ఇబ్బంది పెడుతోంది అంటే అది కరెక్టా? అది కోడ్ ఉల్లంఘన కాదా? అని ప్రశ్నించారు. నిష్పక్షపాతంగా వార్తలు రాయడమంటే ఇదేనా అని ధ్వజమెత్తారు. కొంతకాలంగా ఆ పత్రికలు తమకు నచ్చిన వారికి మేలు చేయడమే లక్ష్యంగా కథనాలు రాస్తున్నాయని మండిపడ్డారు. ఈ పత్రికలు విష పురుగులతో సమానమన్నారు. ఎయిడ్స్, కరోనా లాంటివే ఈ పత్రికలు కూడా అని పేర్కొన్నారు. ఆ వ్యాధులకు మందు కనుక్కున్నారు కానీ ఈ పత్రికలకు మాత్రం మందు కనుక్కోలేకపోతున్నారన్నారు. ఉద్యోగుల సమాఖ్య తరఫున ఈనాడును బహిష్కరిస్తున్నామని వెంకట్రామిరెడ్డి వెల్లడించారు. -
షర్మిలకు ఈసీ నోటీసులు..
అమరావతి: వైఎస్ వివేకా హత్య కేసులో తప్పుడు ఆరోపణలు చేసిన ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలకు ఈసీ నోటీసులు జారీ చేసింది. వివేకా హత్య కేసులో పదే పదే తప్పుడు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో షర్మిలకు ఈసీ నోటీసులిచ్చింది. కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే మల్లాది విష్ణులు ఇచ్చిన ఫిర్యాదుతో షర్మిలకు నోటీసులు ఇచ్చిన ఈసీ.. 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని పేర్కొంది. 48 గంటల్లో వివరణ ఇవ్వకపోతే విచక్షణాధికారంతో చర్యలు తీసుకుంటామని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా నోటీసుల్లో స్పష్టం చేశారు. -
ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: రాజకీయాలకు అతీతంగా.. అత్యంత పారదర్శకంగా.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా చెప్పారు. లోక్‌సభ ఎన్నికలకు రాష్ట్రపతి, శాసనసభ ఎన్నికలకు గవర్నర్ గురువారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ మొదలయిందని తెలిపారు. సచివాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడుతూ రాజకీయ పార్టీల నుంచి అత్యధికసంఖ్యలో ఫిర్యాదులు వస్తుండటంతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా పర్యవేక్షిస్తోందని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నామనడానికి.. షెడ్యూల్ విడుదల అయినప్పటి నుంచి ఇప్పటివరకు టీడీపీకి చెందిన 126 మందిపైన, వైఎస్సార్సీపీకి చెందిన 136 మందిపైన కేసులు నమోదు చేయడమే నిదర్శనమని చెప్పారు. 12,459 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో తొలిసారిగా పోలింగ్ గది లోపల, వెలుపల క్యూలైన్ల వద్ద వెబ్‌కెమెరాలు బిగించినట్లు తెలిపారు. అభ్యర్థులు ఇంకా సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను తమ దృష్టికి తీసుకొస్తే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో 30,111 పోలింగ్ స్టేషన్లలో వెబ్‌టెలికాస్టింగ్ ద్వారా నిరంతరం పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో అక్రమ మద్యం సరఫరాను అరికట్టడానికి దేశంలోనే తొలిసారిగా జియోట్యాగింగ్‌తో రోజూ పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. మద్యం సరఫరా కేంద్రాల వద్ద వినియోగిస్తున్న ముడిపదార్థాల నుంచి ఉత్పత్తి గోడౌన్లు, అక్కడినుంచి షాపులు, బార్లకు వెళ్లేవరకు వాహనాలను నిరంతరం ట్రాక్‌చేసే విధంగా జియోట్యాగింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. జప్తు నుంచి సాధారణ ప్రజలకు ఊరట ఎన్నికల నిఘా సందర్భంగా జప్తుచేస్తున్న నగదు, వస్తువుల విషయంలో సాధారణ ప్రజలపై ఎఫ్ఆర్ఐలు నమోదు చేయడంపై ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. రాజకీయపార్టీలు, చట్టవ్యతిరేక కార్యక్రమాలతో సంబంధంలేని నగదు, వస్తువులు జప్తుచేసినప్పుడు సరైన ఆధారాలు చూపిస్తే 24 గంటల్లోనే ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా వెనక్కి ఇస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన గ్రీవెన్స్ సెల్ రోజూ రెండుసార్లు సమావేశమై ఇటువంటి సమస్యలను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఇప్పటివరకు రూ.121.91 కోట్ల విలువైన నగదు, వస్తువులను జప్తు చేశామన్నారు. దీన్లో రూ.31.75 కోట్ల నగదు ఉందని, సరైన ఆధారాలు చూపించిన రూ.18 కోట్లను వెనక్కి ఇచ్చేశామని చెప్పారు. వీఐపీల భద్రతపై ప్రత్యేక మార్గదర్శకాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసు దర్యాప్తు కేంద్ర పోలీస్ అబ్జర్వర్ల పర్యవేక్షణలో కొనసాగుతోందని మీనా తెలిపారు. దర్యాప్తు వివరాలను రోజూ ఎన్నికల సంఘానికి అందజేస్తున్నారన్నారు. ఈ సంఘటన తర్వాత వీఐపీల ఎన్నికల ప్రచారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక ప్రణాళికను రూపొందించి ఎస్పీలకు ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలోని ఉన్నతాధికారులపై వచ్చిన ఫిర్యాదులను కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలిస్తోందని, ఈసీఐ ఆదేశాల మేరకు ఆ ఉద్యోగుల వివరణ తీసుకుని పంపామని చెప్పారు. రాజీనామా చేసిన ప్రభుత్వ ఉద్యోగులు, వలంటీర్లపై ఎటువంటి ఆంక్షలు ఉండవన్నారు. వారిని ఎన్నికల ఏజెంట్లుగా కూర్చోనీయకూడదంటూ రాజ్యాంగంలో ఎక్కడా నిబంధన లేదని చెప్పారు. రాజీనామా చేసిన వలంటీర్లను ఏజెంట్లుగా అనుమతించకూడదంటూ ఇప్పటికే అందిన ఫిర్యాదులను కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించినట్లు తెలిపారు. ‘అరకు’లో పోలింగ్ సమయం కుదింపు సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 25 లోక్‌సభ స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలకు మే 13వ తేదీ పోలింగ్ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. అందుకనుగుణంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా తెలుగు, ఇంగ్లిషుల్లో గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. దీంతో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రంలో అరకు లోక్‌సభ స్థానం పరిధిలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ సమయం కుదించారు. మిగతా అన్ని నియోజకవర్గాలకు మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అరకు లోక్‌సభ పరిధిలో కొండ ప్రాంతాలున్నందున పాలకొండ, కురుపాం, సాలూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. అరకు వ్యాలీ, పాడేరు, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తారు. ఈ ప్రాంతాలకు పోలింగ్ సామగ్రి, సిబ్బంది తరలింపునకు హెలికాప్టర్లను వినియోగించనున్నారు. చీకటిపడితే హెలికాప్టర్లో ఈవీఎంలను, సిబ్బందిని తిరిగి స్ట్రాంగ్‌రూమ్‌లకు చేర్చడం కష్టమవుతుందని పోలింగ్ సమయాన్ని కుదించారు. మిగతా అన్ని నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లో ఉన్న ఓటర్లందరికీ ఎంత సమయమైనా ఓటువేసే అవకాశం కల్పిస్తారు. మే 5 నుంచి 10 వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు ఈసారి పోస్టల్ బ్యాలెట్లను పోస్టు ద్వారా కాకుండా ఫెసిలిటేషన్ సెంటర్లో వినియోగించుకోవాల్సి ఉంటుందని ముఖేష్‌కుమార్ మీనా చెప్పారు. పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకున్నవారు గతంలో వలే పోస్టు ద్వారా పంపడం కాకుండా స్థానికంగా ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటుహక్కును వినియోగించుకోవాలని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కేవలం సర్విసు ఓటర్లు మాత్రమే పోస్టల్ ద్వారా బ్యాలెట్‌ను వినియోగించుకోవాల్సి ఉంటుందన్నారు. బ్యాలెట్ పత్రాల ముద్రణ పూర్తయిన తర్వాత మే 2వ తేదీ నుంచి మే 10 వరకు ఇంటివద్ద ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకునే విధంగా జిల్లా అధికారులు తేదీలను నిర్ణయిస్తారని చెప్పారు. 85 ఏళ్లు దాటిన వృద్ధులు, అంగవైకల్యం 40% దాటినవారు ఇంటివద్దే ఓటుహక్కును మే 2 నుంచి మే 10వ తేదీలోగా, పోస్టల్ బ్యాలెట్‌ను మే 5 నుంచి మే 10వ తేదీ వరకు వినియోగించుకోవచ్చని తెలిపారు. ఒక్కసారి ఇంటివద్ద ఓటుహక్కు వినియోగించుకునేందుకు దరఖాస్తు చేసుకుంటే వారు ఇంటివద్దే ఓటుహక్కు వినియోగించుకోవాలని స్పష్టం చేశారు. 10వ తేదీలోగా ఇంటింటి ఓటింగ్ ప్రక్రియను పూర్తిచేసే విధంగా ఎన్నికల సిబ్బంది రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుని ముందస్తు సమాచారం అందిస్తారని చెప్పారు. ఇద్దరు పోలింగ్ సిబ్బంది, వీడియోగ్రాఫర్, భద్రతా సిబ్బంది ఇంటి దగ్గరకు వచ్చి ఓటింగ్ ప్రక్రియను పూర్తిచేస్తారని తెలిపారు. రాష్ట్రంలో ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ కోసం సుమారు 5.50 లక్షలమంది సిబ్బందిని వినియోగిస్తున్నామని, వీరందరికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం కల్పించామని చెప్పారు. కేవలం ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న డ్రైవర్లు, వీడియోగ్రాఫర్లు వంటి బయట వ్యక్తులకు కూడా పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. -
నేటి నుంచి నామినేషన్ల పర్వం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 25 లోక్‌సభ స్థానాలకు గురువారం నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. నాల్గవ దశ ఎన్నికల్లో భాగంగా మే 13న రాష్ట్రంలో జరిగే ఈ ఎన్నికలకు గురువారం కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ జారీచేయనుంది. దీంతో అప్పటి నుంచే అంటే ఈనెల 18 నుంచి ఏప్రిల్ 25 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. అతి కీలకమైన ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముఖేష్ కుమార్ మీనా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్లమెంట్ స్థానాలకు పోటీచేసే అభ్యర్థులు ఆయా కలెక్టరేట్లలో.. అసెంబ్లీ స్థానాలకు పోటీచేసే అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల ప్రధాన కేంద్రాల్లో ఎన్నికల కోడ్‌ను పాటిస్తూ నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు. నామినేషన్ల ప్రక్రియను పూర్తిగా రికార్డు చేసేందుకు నామినేషన్లు స్వీకరించే గదిలో అభ్యర్థులు ప్రవేశించే ద్వారాల వద్ద సీసీ కెమేరాలను ఏర్పాటుచేసినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో భాగంగా అభ్యర్థుల ఊరేగింపులను, నామినేషన్ల దాఖలు ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేస్తామన్నారు. ఈ క్రతువులో అభ్యర్థుల భవితవ్యాన్ని 4.10 కోట్ల మంది ఓటర్లు నిర్ణయించనున్నారు. ఇప్పటికే ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంతో తొలిరోజు నుంచే నామినేషన్ల దాఖలు ప్రక్రియ మొదలుకానుంది. వీటిని ఏప్రిల్ 26 వరకు పరిశీలించి, 29 వరకు ఉపసంహరణకు సమయమిస్తారు. మే 13న పోలింగ్ కాగా.. జూన్ 4 ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఉ.11 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ.. ఎన్నికల నోటిఫికేషన్ గురువారం జారీకాగానే నామినేషన్ల దాఖలు ప్రక్రియ వెంటనే ప్రారంభమవుతుంది. సంబంధిత అసెంబ్లీ లేదా లోక్‌సభ స్థానం రిటర్నింగ్ ఆఫీసు కార్యాలయంలో ఉ.11 గంటల నుంచి మ.3 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ప్రభుత్వం ప్రకటించిన సెలవు రోజుల్లో స్వీకరించరు. ఒక అభ్యర్థి గరిష్టంగా నాలుగు సెట్ల నామినేషన్లు వెయ్యొచ్చు. ఒక అభ్యర్థి ఏదైనా రెండు స్థానాల్లో మాత్రమే పోటీచేసే అవకాశముంది. ఎంపీ అభ్యర్థి అయితే ఫారం–2ఏ, ఎమ్మెల్యే అభ్యర్థయితే ఫారం–2బీ ఉపయోగించాల్సి ఉంటుంది. అభ్యర్థులు సువిధ యాప్ ద్వారా ఆన్లైన్లో నామినేషన్లు, అఫిడవిట్లను దాఖలు చేయవచ్చు. అయితే, వాటి కాపీలను భౌతికంగా ఆర్వోలకు అందజేయాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘం గుర్తించిన రాజకీయ పార్టీల అభ్యర్థి కి స్థానికంగా ఉండే ఒక ఓటరు ప్రతిపాదన (ప్రపోజర్‌గా) సంతకం చేయాల్సి ఉంటుంది. అదే ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు 10 మంది ప్రతిపాదించాలి. ఒక ఓటరు ఎంతమంది అభ్యర్థుల కైన ప్రపోజ్ చేయడానికి ఎన్నికల సంఘం అనుమతించింది. నామినేషన్ దాఖలు సందర్భంగా ప్రతీ అభ్యర్థి కొన్ని కచ్చితమైన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. నామినేషన్ వేయడానికి వెళ్లే సమయంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి 100 మీటర్ల పరిధిలోనికి కేవలం మూడు వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. నామినేషన్ దాఖలు చేసేటప్పుడు రిటర్నింగ్ అధికారి గదిలోకి అభ్యర్థి తో కలిపి కేవలం ఐదుగురికి మాత్రమే అనుమతి ఉంటుంది. నామినేషన్లు దాఖలు చేసినప్పుడు ఫారం–ఏ, ఫారం–బీలు కూడా సమర్పించవచ్చు. లేకపోతే నామినేషన్ల చివరి రోజున 3 గంటలలోపు వీటిని సమర్పించాల్సి ఉంటుంది. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నామినేషన్ల స్వీకరణకు సంబంధించి హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటుచేశారు. ఫారం–26 తప్పనిసరి.. ఇక నామినేషన్ దాఖలుతోపాటు ఫారం–26 (అఫిడవిట్) కూడా అభ్యర్థులు విధిగా సమర్పించాలి. ఇది నామినేషన్ల చివరి తేదీ ఏప్రిల్ 25, మ.3 గంటల లోపు ఇవ్వొచ్చు. ఫారం–26 స్టాంప్ పేపర్ విలువ రూ.10 కంటే ఎక్కువ ఉండాలి. భౌతిక స్టాంప్ పేపర్ అందుబాటులో లేకపోతే ఈ–స్టాంప్ పేపర్ ఉపయోగించవచ్చు. ఫారం–26 అంటే.. పోటీచేసే అభ్యర్థులు తన కుటుంబసభ్యుల ఆస్తులు, అప్పులతోపాటు క్రిమినల్ కేసులు, న్యాయస్థానాల్లో విచారణలో ఉన్న అన్ని కేసుల వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీకి చెందిన అభ్యర్థి అయితే ఆ పార్టీకి కేటాయించిన గుర్తును నామినేషన్ ఫారంలో రాయాలి. అదే ఇతర అభ్యర్థులైతే ఫ్రీ సింబల్స్ నుండి తనకు నచ్చిన మూడు గుర్తులను కోరుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ రిజిస్టర్ అయివుండి, గుర్తింపు పొందని పార్టీలు ఎన్నికల సంఘం నుండి కామన్ సింబల్ కేటాయించినట్లయితే ఆ గుర్తును నామినేషన్ ఫారంలో రాయాలి. నామినేషన్ రుసుం ఇలా.. పార్లమెంటు అభ్యర్థి అయితే రూ.25,000లు, అసెంబ్లీ అభ్యర్థి అయితే రూ. 10,000లు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఈ రుసుంలో 50 శాతం రాయితీ కల్పించారు. వీరు సామాజిక ధ్రువపత్రాన్ని విధిగా సమర్పించాల్సి ఉంటుంది. నామినేషన్ వేసిన తర్వాత ప్రతి అభ్యర్థి రిటర్నింగ్ అధికారి ముందు ప్రమాణం చేయాల్సి ఉంటుంది. ప్రతి అభ్యర్థి నామినేషన్‌తో పాటు లేటెస్ట్ పాస్‌పోర్టు సైజ్ ఫొటో (2 ్ఠ2.5 సెం.మీ) ఇవ్వాల్సి ఉంటుంది. నామినేషన్ వేసిన తరువాత అభ్యర్థి రశీదుతోపాటు స్కూృట్నీ తేదీ, సమయం.. నామినేషన్ ఉపసంహరణ తేదీ, సమయం.. గుర్తులు కేటాయించే తేదీ, సమయం తెలిపే నోటీసులను అధికారుల నుంచి తీసుకోవాలి. నామినేషన్ల దాఖలుకు అభ్యర్థులు 13 రకాల పత్రాలను తీసుకురావల్సి ఉంటుంది. నేటి నుంచి అభ్యర్థుల ఖర్చు కౌంట్ నామినేషన్ల పర్వం ప్రారంభైన నాటి నుంచి అంటే గురువారం నుంచే అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు పోటీచేసే అభ్యర్థుల ఖర్చును ఆయా అభ్యర్థుల ఖాతాలో నమోదు చేస్తారు. పత్రికల్లో వచ్చే పెయిడ్ న్యూస్, ప్రకటనలు, వార్తలను సైతం అభ్యర్థి ఖాతా కింద లెక్కిస్తారు. అసెంబ్లీ స్థానాలకు పోటీచేసే అభ్యర్థి రూ.40 లక్షల వరకు ఖర్చు పెట్టొచ్చు. అలాగే, ఎంపీ అభ్యర్థి రూ.95 లక్షల వరకు వ్యయం చెయ్యొచ్చు. అభ్యర్థుల ఖర్చును ఎప్పటికప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన నోడల్ అధికారులు పర్యవేక్షిస్తారు. అభ్యర్థులు ఎన్నికల వ్యయానికి ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాను తెరవాలి. ముఖ్యమైన తేదీలు నామినేషన్ల దాఖలు చివరి తేదీఏప్రిల్ 25 గురువారం ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ జారీ ఏప్రిల్ 18 గురువారం నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 26 శుక్రవారం నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ ఏప్రిల్ 29 సోమవారం పోలింగ్ తేదీ మే 13 సోమవారం ఓట్ల లెక్కింపు జూన్ 4 మంగళవారం ఎన్నికల ప్రక్రియ ముగింపు తేదీజూన్ 6 గురువారం -
స్వయం సహాయక సంఘాలను ప్రభావితం చేసే కార్యక్రమాలొద్దు
సాక్షి, అమరావతి : ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో స్వయం సహాయక బృందాల సభ్యులను ప్రభావితం చేసేలా ఎలాంటి కార్యక్రమాలను నిర్వహించకూడదంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలిచ్చారు. రాష్ట్ర పంచాయతీరాజ్–గ్రామీణాభివృద్ధి, రాష్ట్ర పురపాలక– పట్టణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో పనిచేసే సంబంధిత అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బంది ఎవరూ స్వయం సహాయక బృందాల సభ్యులను ప్రభావితం చేసేలా ఎలాంటి కార్యక్రమాలను నిర్వహించకూడదన్నారు. కోడ్ అమల్లో ఉన్నంత వరకూ స్వయం సహాయక బృందాల సభ్యులను వ్యక్తిగతంగా, సమష్టిగా రాజకీయ కోణంలో అభిప్రాయానికి అనుకూలంగా, వ్యతిరేకంగా ప్రభావితం చేసే ఏ విధమైన సమీకరణ, అవగాహన, సర్వే వంటి ఇతర కార్యకలాపాలు నిర్వహించకూడదని స్పష్టం చేశారు. నిబంధనల అమల్లో సెర్ప్ సీఈవో, మెప్మా మిషన్ డైరెక్టర్ ప్రత్యేక శ్రద్ధ, చొరవ చూపాలని ఆదేశించారు. మహిళల గౌరవానికి పెద్దపీట ఎన్నికల ప్రచారంలో మహిళల గౌరవం విషయంలో కఠిన వైఖరిని అమలుచేస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. మహిళలను కించపరిచేలా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన పార్టీల నాయకులకు తక్షణం నోటీసులివ్వడం ద్వారా మహిళల గౌరవం విషయంలో గట్టి వైఖరిని అమలు చేస్తున్నట్లు తెలిపింది. పార్టీ నేతలు, ప్రచారకర్తలు ఇలాంటి అవమానకరమైన వ్యాఖ్యలను ఆశ్రయించకుండా చూసుకోవడానికి పార్టీ ముఖ్యులు/అధ్యక్షులు జవాబుదారీతనం వ్యవహరించాలని కోరింది. రేపటి నుంచి ఎన్నికల ప్రక్రియకు సిద్ధంకండి ఈ నెల 18న (రేపు) నోటిఫికేషన్ జారీతో ప్రారంభమయ్యే అసలైన ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు జిల్లా ఎన్నికల అధికారులు సిద్ధం కావాలని మీనా ఆదేశించారు. ఎన్నికలను శాంతియుతంగా, స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా నిర్వహించడంతోపాటు రోజూ క్రమం తప్పకుండా నివేదికలను పంపేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. 18న నోటిఫికేషన్ జారీ నుంచి రోజూ ఈసీఐకి నివేదికలు పంపాలని చెప్పారు. ఈ విషయంలో అలసత్వం వహించరాదన్నారు. ఓటర్ల గుర్తింపు కార్డుల పంపిణీపై దృష్టి పెట్టాలన్నారు. ఎపిక్ కార్డుల పంపిణీపై మే 4న ఈసీఐ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తుందని తెలిపారు. ఈ లోపు కార్డుల పంపిణీ పూర్తిచేయాలని ఆదేశించారు. సీ–విజిల్ ఫిర్యాదులను అధికారులు సంతృప్తకరస్థాయిలో పరిష్కరిస్తున్నారని చెప్పారు. కౌంటింగ్ కేంద్రాలకు పరిశీలకులను నియమించే విషయంలో ఈసీఐ మార్గదర్శకాలను పాటించాలని, అదనంగా కావాల్సిన పరిశీలకులు, ఏఆర్వోల ప్రతిపాదనలను సాధ్యమైనంత త్వరగా పంపాలని ఆదేశించారు. పోలింగ్ పక్రియ, కేంద్రాలు వెబ్‌కాస్టింగ్ ద్వారా గరిష్టస్థాయిలో కవర్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. -
ఓటు నమోదుకు మూడు రోజులే గడువు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓటు నమోదుకు ఇక మూడు రోజుల సమయమే ఉంది. 18 సంవత్సరాల వయసు నిండి.. ఓటర్ జాబితాలో పేరులేని వారంతా ఈ నెల 15లోగా ఆన్లైన్ ద్వారా గానీ లేదా సంబంధిత రెవెన్యూ కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాల్లో గానీ ఫాం–6ను సమర్పించడం ద్వారా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా సూచించారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఓటర్ జాబితాలో పేరుందో, లేదో ఒకసారి ఆన్లైన్లో చెక్ చేసుకోవాలి. ఓటర్ గుర్తింపు కార్డు ఉన్నప్పటికీ.. జాబితాలో పేరు లేకపోతే పోలింగ్ రోజు ఓటు వేయలేరు. పేరు లేకపోతే ఈ నెల 15లోగా ఫాం–6 సమర్పిస్తే తప్పకుండా ఓటు హక్కు కల్పిస్తాం. సాధారణంగా అయితే నామినేషన్ల చివరి తేదీ వరకు ఓటు నమోదుకు అవకాశముంటుంది. 15వ తేదీ తర్వాత నమోదు చేసుకున్న వారి దరఖాస్తులను పరిశీలించి ఓటు హక్కు జారీ చేయడానికి 10 రోజుల సమయం పడుతుంది. అందువల్ల చివరి వరకు ఆగకుండా ఏప్రిల్ 15లోగా నమోదు చేసుకోవడం మంచిది’ అని సూచించారు. ఓటర్ల నమోదు ప్రక్రియపై రాజకీయ పార్టీల నుంచి ఆరోపణలు రాకుండా.. అధికారులు అన్ని ధ్రువపత్రాలు సక్రమంగా ఉన్నాయా, లేవా అని సరి చూసిన తర్వాతే ఓటర్‌గా నమోదు చేస్తున్నారు. ఆన్లైన్లో ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకున్నా.. ఫిజికల్‌గా ఆధార్ కాపీ, వయసు నిర్దారణ ధ్రువపత్రంతో పాటు ఇంత వరకు ఎక్కడా ఓటు హక్కు లేదన్న ధ్రువీకరణ పత్రాలను తీసుకొని ఓటర్‌గా నమోదు చేస్తున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కేవలం ఆన్లైన్లో దరఖాస్తు చేసి వదిలేయకుండా.. అన్ని కాపీలను తీసుకువచ్చి ఇవ్వాల్సిందిగా అధికారులు కోరుతున్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్‌గా నమోదు కావడమే కాకుండా మే 13న జరిగే పోలింగ్‌లో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకోవాలని మీనా సూచించారు. -
అక్రమ మద్యంపై గట్టి నిఘా పెట్టాలి
సాక్షి, అమరావతి/సింగరాయకొండ (మర్రిపూడి)/శ్రీకాళహస్తి(తిరుపతి జిల్లా)/నెల్లూరు(బారకాసు): త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం అక్రమ నిల్వలు, అమ్మకం, పంపిణీని నిరోధించేందుకు వెబ్ క్యాస్టింగ్, జీపీఎస్ సాంకేతికత ద్వారా నిఘా పెంచేందుకు తగు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా ఆదేశించారు. రాష్ట్రంలోని డిస్టిలరీలు, బ్రూవరీలు, మద్యం గొడౌన్ల ఎంట్రీ–ఎగ్జిట్ పాయింట్లు, మద్యం తయారీ–నిల్వ చేసే స్థలాల వంటి ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. గోడౌన్ల నుంచి షాపులకు మద్యం సరఫరా చేసే వాహనాలకు జీపీఎస్ కనెక్టివిటీని ఈనెల 15లోగా ఏర్పాటు చేసి ట్రాకింగ్ ద్వారా నిఘా ఉంచాలన్నారు. ఈ ప్రక్రియను వెబ్ క్యాస్టింగ్ ద్వారా గమనించేలా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం, జిల్లా ఎన్నికల అధికారుల కార్యాలయాలకు అనుసంధానం చేయాలన్నారు. అదేవిధంగా తనిఖీలను ముమ్మరం చేయాలని అబ్కారీ శాఖ కమిషనర్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కమిషనర్లకు ఆదేశాలు జారీచేశారు. మద్యం ద్వారా ఓటర్లను ప్రలోభపరచకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ఎన్నికల అధికారులు మార్గదర్శకాలను పటిష్టంగా అమలు చేయాలన్నారు. ప్రలోభాలపై గట్టి నిఘా రాష్ట్రంలో ఓటర్లను ప్రలోభ పెట్టే చర్యలపై గట్టి నిఘా ఉంచామని, ఎన్నికల షెడ్యూలు ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా రూ. 100 కోట్ల విలువకు పైబడి నగదు, లిక్కర్, డ్రగ్స్, ఇతర విలువైన వస్తువులు జప్తు చేశామని ముకేశ్ కుమార్ మీనా ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్ పోస్టులతో పాటు రాష్ట్రంలోని పలు చెక్ పోస్టుల ద్వారా అలాగే పోలీస్, ఎక్సైజ్, ఐటీ, ఫారెస్టు, ఈడీ, ఎన్సీబీ, ఆర్పీఎఫ్, కస్టమ్స్ తదితర 20 ఎన్ఫోర్సుమెంట్ ఏజన్సీలతో నిరంతరం నిఘా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు జప్తు చేసిన వాటిలో రూ. 25.03 కోట్ల నగదు, రూ. 12.49 కోట్ల విలువైన మద్యం, రూ.2.05 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు, రూ. 51.23 కోట్ల విలువైన లోహాలు, రూ. 2.42 కోట్ల విలువైన ఉచితాలు, రూ. 7.04 కోట్ల విలువైన ఇతర వస్తువులను జప్తుచేయడం జరిగిందని ఆయన తెలిపారు. నామినేషన్లకు 18న నోటిఫికేషన్ నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరినారాయణన్, ఎస్పీ ఆరిఫ్ హఫీజ్‌తో కలిసి గురువారం ముకేశ్ కుమార్ మీనా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 18న ప్రారంభం అవుతుందని చెప్పారు. కోడ్‌ను అమలు చేస్తున్న తీరు పరిశీలించి అధికారులను అభినందించారు. ఓటు ఆవశ్యకతను తెలుపుతూ ప్రత్యేకంగా రూపొందించిన అవగాహన మస్కట్‌ను ఆవిష్కరించారు. ముక్కంటి సేవలో మీనా జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామిని గురువారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా దర్శించుకున్నారు. దక్షిణ గోపురం వద్ద ఆర్డీవో రవిశంకర్‌రెడ్డి, ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. దర్శనానంతరం గురుదక్షిణామూర్తి సన్నిధిలో వేదపండితులు మీనాకు ఆశీర్వచనం ఇవ్వగా.. స్వామి, అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థప్రసాదాలను అధికారులు అందజేశారు. సింగరాయకొండ చెక్‌పోస్టు తనిఖీ ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని జిల్లా సరిహద్దులో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును గురువారం ముకేశ్ కుమార్ మీనా తనిఖీ చేశారు. ఈమార్గంలో వస్తున్న వాహనాలను సిబ్బంది తనిఖీ చేస్తున్న తీరు, వీడియో రికార్డింగ్ చేస్తున్న విధానాన్ని ఆయన చెక్‌పోస్టు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు సీజ్ చేసిన నగదు, నిర్వహిస్తున్న రికార్డులను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. మహిళా ప్రయాణికుల బ్యాగులను కచ్చితంగా మహిళా సిబ్బందితోనే తనిఖీ చేయించాలని సూచించారు. తగిన ఆధారాలు లేకుండా రూ. 50 వేలకు పైగా నగదు ఉంటే దానిని సీజ్ చేసి ట్రెజరీకి జమచేయాలన్నారు. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో రెండు రోజుల పాటు పర్యటిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఒంగోలులో బుధవారం రాత్రి జరిగిన ఘటనపై పూర్తి విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకోసం ఎన్నికల రాష్ట్ర పోలీసు అబ్జర్వర్ దీపక్‌మిశ్రా ఆధ్వర్యంలో విచారణ చేసి బాధ్యులపై కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రకాశం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఏఎస్ దినేష్ కుమార్, ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించాలి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికలను శాంతియుతంగా, నిష్పక్షపాతంగా, అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. ఈ బాధ్యత జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలపైనే ఉందన్నారు. ఓర్పు, సమన్వయంతో వ్యవహరించాలని, సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలు చేయాలన్నారు. రాష్ట్ర సచివాలయం నుంచి శనివారం అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో మీనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల ఏర్పాట్లు, నిర్వహణకు తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలను సమీక్షించారు. ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఎటువంటి హింసకు, రీపోలింగ్‌కు తావులేకుండా పటిష్ట భద్రతా చర్యలను చేపట్టాలన్నారు. గంజాయి, మద్యం, నగదు, ఉచితాల అక్రమ రవాణాపై పటిష్ట నిఘా ఉంచాలని ఆదేశించారు. రాష్ట్రాలు, జిల్లాల సరిహద్దుల్లో ఉండే చెక్ పోస్టుల్లో నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు. గోవా, హరియాణాల నుంచి అక్రమ మద్యం రాష్ట్రంలోకి రాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, వ్యక్తులు రూ.50 వేలకు మించి నగదు కలిగి ఉంటే వెంటనే జప్తు చేయాలని ఆదేశించారు. వ్యాపారులు, సాధారణ పౌరుల విషయంలో ఆచితూచి అడుగేయాలని, వారిని ఎలాంటి ఇబ్బందులకు గురిచేయొద్దన్నారు. నగదు జప్తు కేసులను 24 గంటల్లోనే పరిష్కరించాలని సూచించారు. ఇందుకోసం రాష్ట్రమంతా ఒకే విధానాన్ని అనుసరించేలా త్వరలో నిర్దిష్ట నిబంధనలను (ఎస్వోపీ) ప్రకటించనున్నామని తెలిపారు. 10 లక్షలు దాటితే ఐటీకి సమాచారం ఇవ్వండి.. రాష్ట్ర పోలీస్ నోడల్ అధికారి, అదనపు డీజీపీ (లా అండ్ ఆర్డర్) శంఖబ్రత బాగ్చీ మాట్లాడుతూ ప్రత్యేక సాధారణ పరిశీలకులు రాష్ట్ర పర్యటన సందర్భంగా చేసిన పలు సూచనలను డీఈవో, ఎస్పీలకు వివరించారు. రూ.10 లక్షలకు పైబడి జప్తు చేసిన నగదు, బంగారం, ఇతర విలువైన వస్తువుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆదాయపన్ను (ఐటీ) శాఖ అధికారులకు తెలియజేయాలన్నారు. మద్యం, గంజాయి రవాణా చేసే కింగ్పిన్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అదనపు సీఈవో పి.కోటేశ్వరరావు మాట్లాడుతూ అదనంగా ఏఆర్వోలు కావాల్సినవారు సంబంధిత జాబితాలను మూడు రోజుల్లో సీఈవో కార్యాలయానికి పంపిస్తే, వాటిని కన్సాలిడేట్ చేసి ఈసీ ఆమోదం కోసం పంపిస్తామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు సీఈవో హరేందిరప్రసాద్, అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, జాయింట్ సీఈవో ఎ.వెంకటేశ్వరరావు, డిప్యూటీ సీఈవో కె.విశ్వేశ్వరరావు, అసిస్టెంట్ సీఈవో తాతబ్బాయి తదితరులు పాల్గొన్నారు. ఉల్లంఘనలపై తక్షణమే చర్యలు చేపట్టాలి.. రాజకీయ పార్టీల ప్రతినిధులు ఇంటింటా ప్రచారానికి ముందుగా పొందాల్సిన అనుమతి విషయంలో మరింత స్పష్టత కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపామని మీనా చెప్పారు. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి తగిన వివరణ అందేలోపు ఇంటింటా ప్రచారానికి అభ్యర్థులు సంబంధిత ఆర్వో, పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇస్తే సరిపోతుందన్నారు. ఈ విషయాన్ని అన్ని రాజకీయ పార్టీలకు తెలియజేయాలని కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రానికి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిందని, వీరే ఈసీకి కళ్లు, చెవులు వంటి వారని తెలిపారు. ఎన్నికల ఏర్పాట్లు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు విషయంలో ప్రత్యేక సాధారణ పరిశీలకులు, ప్రత్యేక వ్యయ పరిశీలకులు సంతృప్తి చెందేలా చూసుకోవాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన ఫిర్యాదులపై తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తమ కార్యాలయం నుంచి పంపించే ఫిర్యాదులపై జిల్లా స్థాయిలోనే సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకున్నాకే నివేదిక పంపాలని సూచించారు. -
కోడ్ ఉల్లంఘిస్తే కొరడా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎలాంటి హింసాత్మక సంఘటనలు, రీపోలింగ్ వంటివి లేకుండా పూర్తి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) అందుకోసం కఠినమైన చర్యలు తీసుకుంటోంది. ఏపీలో ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానప్పటికీ షెడ్యూల్ విడుదలైన మార్చి 16 నుంచే ఈసీ కొరడా ఝుళిపిస్తోంది. అప్పటినుంచే రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలుచేస్తోంది. షెడ్యూల్ విడుదలైన 20 రోజుల్లోనే కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి 4,584 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. ఇందులో 4,337 ఎఫ్ఐఆర్లు నగదు, వస్తువుల జప్తుకు సంబంధించినవి కాగా, అనుమతుల్లేకుండా నియమావళికి విరుద్ధంగా ప్రచారం చేస్తున్న వారిపై 247 కేసులు నమోదు చేశారు. నేరుగా ఫిర్యాదుకు నిర్దేశిత సమయం రోజు సా.4–5 గంటల మధ్య స్వీకరణ సాధారణ ఎన్నికల ప్రక్రియపై ఎన్నికల సంఘాన్ని నేరుగా కలిసి ఫిర్యాదు లేదా విజ్ఞాపనపత్రం ఇవ్వాలనుకనే వారికి రాష్ట్ర ప్రధాన ఎన్నికల కార్యాలయం నిర్దేశిత సమయాన్ని కేటాయించింది. ప్రతిరోజు సా.4–5 గంటల మధ్య తమకు నేరుగా అందజేయవచ్చని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఒక ప్రకటనలో తెలిపారు. కార్యాలయ పనిదినాలతో పాటు ప్రభుత్వ సెలవు దినాల్లో కూడా తాము కార్యాలయంలో అందుబాటులో ఉంటే అందజేయవచ్చన్నారు. తాను కార్యాలయంలో అందుబాటులో లేని పక్షంలో అదనపు ప్రధాన ఎన్నికల అధికారులకు లేదా సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారికి అందజేయవచ్చన్నారు. ప్రభుత్వ సెలవు దినాల్లో ఫిర్యాదులివ్వడానికి వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం గ్రౌండ్ ఫ్లోర్ రూమ్ నెం.129 లోని ఫిర్యాదు సెల్లో అందుబాటులో ఉంటుందని ముకే‹Ùకుమార్ పేర్కొన్నారు. రూ.47.49 కోట్లు జప్తు.. ఇక ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఏప్రిల్ 5 వరకు రూ.47.49 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ప్రకటించింది. ఇందులో.. ♦ నిబంధనలకు విరుద్ధంగా తీసుకెళ్తున్న రూ.17.85 కోట్ల నగదు, రూ.8.82 కోట్ల విలువైన మద్యం, రూ.1.63 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు, రూ.12.36 కోట్ల విలువైన బంగారం వంటి విలువైన లోహాలను స్వాదీనం చేసుకున్నారు. ♦ ఇవికాక.. ఓటర్లను ప్రలోభాలు పెట్టేందుకు సిద్ధంచేసిన రూ.1.56 కోట్ల విలువైన వివిధ వస్తువులతో పాటు రూ.5.24 కోట్ల విలువైన ఇతర సామగ్రిని స్వాదీనం చేసుకున్నట్లు పేర్కొంది. ♦ ఎన్నికల వేళ లైసెన్స్‌లు కలిగిన ఆయుధాలను పోలింగ్ స్టేషన్లో సమర్పించాల్సి ఉండగా ఇప్పటివరకు 8,681 ఆయుధాలను డిపాజిట్ చేయగా ఇంకా 17 చేయాల్సి ఉంది. ♦మరోవైపు.. ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో 32 హింసాత్మక సంఘటనలు నమోదయ్యాయి. అలాగే, ఎన్నికల సందర్భంగా సమస్యలను సృష్టించడానికి అవకాశమున్న 432 మందిని గుర్తించామని ఇంకా 21 మందికి నాన్ బెయిలబుల్ వారెంట్స్ జారీచేయాల్సి ఉందని ఈసీ పేర్కొంది. ♦ సీ–విజిల్ యాప్ ద్వారా 7,838 ఫిర్యాదులు రాగా అందులో 90 శాతం కేసులను నిర్దేశిత 100 నిమిషాల్లోనే పరిష్కరించినట్లు తెలిపింది. ♦ రాష్ట్రంలోను, రాష్ట్ర సరిహద్దుల వద్ద నిఘా కోసం 298 చెక్‌పోస్టులను ఏర్పాటుచేసి నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ♦ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులపై ఏర్పాటుచేసిన 5,07,561 బ్యానర్లు, హోర్డింగులు తొలగించారు. -
హోమ్ ఓటింగ్.. పోలింగ్ స్టేషన్..
సాక్షి, అమరావతి: వచ్చే సాధారణ ఎన్నికల్లో తొలిసారిగా మన రాష్ట్రంలో కల్పిస్తున్న ఇంటి వద్ద నుంచే ఓటింగ్ హక్కుపైన, పోస్టల్ బ్యాలెట్ వినియోగంపైన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ ఎన్నికల్లో 85 ఏళ్లు దాటిన వృద్ధులు, 40 శాతానికిపైగా అంగవైకల్యం ఉన్నవారు పోలింగ్‌స్టేషన్‌కు వచ్చిగానీ, ఇంటివద్ద నుంచే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించారు. పోస్టల్ బ్యాలెట్ అండ్ హోం ఓటింగ్‌కు సన్నద్ధత, తీసుకోవాలి్సన జాగ్రత్తలపై సోమవారం సచివాలయం నుంచి మీనా జిల్లాల ఎన్నికల అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు. ఇంటివద్దే ఓటుహక్కు వినియోగించుకోవాలనుకునేవారు ముందుగా రిటర్నింగ్ ఆఫీసరుకు ఫారం 12డీ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఒకసారి ఇంటివద్ద నుంచే ఓటువేసే అవకాశం పొందితే వారు నేరుగా పోలింగ్ స్టేషన్‌కు వచ్చి ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం కోల్పోతారన్న విషయంపై ఓటర్లకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇంటివద్దే ఓటుహక్కు వినియోగించుకునేవారి కోసం వీడియో గ్రాఫర్‌తో, అయిదుగురు సభ్యులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలని, ఇందుకు ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే వివిధ శాఖల ఉద్యోగులు, సర్వీసు ఓటర్లకు సంబంధించి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఇందుకోసం ప్రతి రిటర్నింగ్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఫెసిలిటేషన్ ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల కలెక్టర్లు హోమ్ ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్లకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, అదనపు సీఈవో ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ పాల్గొన్నారు. -
ఎన్నికల సన్నద్ధతపై క్షేత్రస్థాయి పరిశీలన
సాక్షి, అమరావతి/ఏలూరు(మెట్రో): రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధత, ఏర్పాట్లపై ఇప్పటి వరకు జిల్లాల వారీగా వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా సమీక్షించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా.. ఇక క్షేత్రస్థాయిలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించనున్నారు. వారానికి కనీసం మూడు జిల్లాల చొప్పున.. ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదలయ్యేలోగా 15 జిల్లాల్లో పర్యటించి ఎన్నికల ఏర్పాట్లను స్వయంగా పరిశీలించాలని ముఖేష్‌కుమార్ మీనా లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఎన్నికల నిర్వహణలో కీలకమైన జిల్లాస్థాయి ఎన్నికల కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు, ఫిర్యాదుల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలు, ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను ఆయన పరిశీలించనున్నారు. ఇందులో భాగంగా ముఖేష్ కుమార్ మీనా శుక్రవారం ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో పర్యటించారు. ఏలూరు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా కంట్రోల్ రూమ్‌ను సందర్శించారు. ఎన్నికల ఏర్పాట్లు, ఎన్నికల కోడ్ అమలుపై వచ్చే ప్రతికూల వార్తలను నమోదు చేస్తున్న విధానం, వాటి పరిష్కారం తీరుపై ఆరా తీశారు. అలాగే స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాల కోసం ఎంపిక చేసిన ఏలూరు సీఆర్ఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలను సందర్శించి.. అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరంలోని ఈవీఎం గోడౌన్లను తనిఖీ చేశారు. ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలను నన్నయ్య యూనివర్సిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లకు తీసుకువచ్చి కౌంటింగ్ నిర్వహించనున్నట్లు ముఖేష్‌కుమార్‌కు అధికారులు తెలియజేశారు. ఈ పర్యటనల సందర్భంగా ముఖేష్‌కుమార్ మీనా మాట్లాడుతూ.. వేసవిని దృష్టిలో పెట్టుకొని తాగునీరు, టెంట్లు వంటి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్, ఎస్పీ డి.మేరీ ప్రశాంతి, జేసీ బి.లావణ్య, తూర్పుగోదావరి కలెక్టర్ కె.మాధవీలత, ఎస్పీ పి.జగదీశ్ తదితరులు పాల్గొన్నారు. -
పార్టీల శాశ్వత కార్యాలయాల్లో హోర్డింగులు తొలగించొద్దు
సాక్షి, అమరావతి: రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో శాశ్వత ప్రాతిపదికన ఉన్న రాజకీయ పార్టీల కార్యాలయాల్లో హోర్డింగులను కొనసాగించవచ్చని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టంచేశారు. స్థానిక చట్టాలు, అనుమతుల మేరకు ప్రస్తుతం ఉన్న రాజకీయ ప్రకటనల హోర్డింగులను కొనసాగించాలని జిల్లా ఎన్నికల అధికారులను ఆయన ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం నుంచి బుధవారం ఆయన అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖేష్‌కుమార్ మీనా మాట్లాడుతూ మంగళవారం అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం సందర్భంగా పార్టీల శాశ్వత కార్యాలయాల్లో హోర్డింగులను తొలగించడంతోపాటు పలు సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చాయని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తాత్కాలిక ప్రాతిపదికన ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాల్లో 4గీ8 అడుగుల బ్యానర్, ఒక జెండాను అనుమతించాలని అధికారులకు చెప్పారు. రాజకీయ పార్టీల కార్యక్రమాలకు ముందస్తు అనుమతి తప్పనిసరని, అయితే ఇందుకు 48 గంటల ముందుగా సువిధా పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉందన్నారు. అత్యవసర పరిస్థితిల్లో రాజకీయ పార్టీల నుంచి ఆఫ్‌లైన్ ద్వారా కూడా దరఖాస్తులను స్వీకరించి, ఆ వివరాలను ఎన్కోర్ పోర్టల్‌లో నమోదుచేసి సకాలంలో తగిన అనుమతులను జారీచేయాలని సూచించారు. ఇంటింటి ప్రచారంపై త్వరలో నిర్ణయం ముందుగా అనుమతి పొందిన తర్వాతే అభ్యర్థులు ఇంటింటి ప్రచారానికి వెళ్లాలనే నిబంధన సరికాదని, దానిని పునఃసమీక్షించాలని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు కోరారని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఈ నిబంధన అమలు విషయంలో భారత ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. ఈ అంశంపై త్వరలోనే సరైన నిర్ణయం తీసుకుంటామన్నారు. అదేవిధంగా రాజకీయ పార్టీల ప్రకటనలకు సంబంధించి భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలతోపాటు ఆంధ్రప్రదేశ్ పురపాలక చట్టం, స్థానిక సంస్థల చట్టం, జీవీఎంసీ చట్టాలను పరిగణనలోకి తీసుకుని అనుమతులు మంజూరు చేయాలని జిల్లా ఎన్నికల అధికారులకు సూచించారు. నిబంధనల మేరకు ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన వాణిజ్య స్థలాలతోపాటు కార్యాలయాల్లో కూడా ఎటువంటి రాజకీయ ప్రకటనలు, హోర్డింగులు, పోస్టర్లు, బ్యానర్లను అనుమతించవద్దని స్పష్టంచేశారు. ప్రస్తుతం జాతీయ, ప్రధాన రహదారుల పక్కన ఉన్న హోర్డింగులను అన్ని రాజకీయ పార్టీలకు సమాన ప్రాతిపదికన కేటాయించాలని, నూతన హోర్డింగులకు అనుమతి ఇవ్వొద్దని చెప్పారు. ప్రైవేటు భవనాలపై వాల్ పెయింట్లకు అనుమతిలేదని, ఇప్పటికే ఉన్నవాటిని వెంటనే చెరిపించేయాలన్నారు. సమావేశంలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, అదనపు సీఈవోలు పి.కోటేశ్వరరావు, ఎంఎన్ హరీంధరప్రసాద్, జాయింట్ సీఈవో ఎ.వెంకటేశ్వరరావు, డిప్యూటీ సీఈవోలు కె.విశ్వేశ్వరరావు, ఎస్.మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు. -
శాంతిభద్రతల నిర్వహణలో అప్రమత్తంగా ఉండండి..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా తనిఖీలు, ఆస్తుల జప్తు జరుగుతున్న విధానంపై కేంద్ర ఎన్నికల సంఘం ఏప్రిల్ 3న సీఎస్, డీజీపీలతో సమీక్ష నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టం వినియోగాన్ని విస్తృత స్థాయిలో మెరుగు పర్చాల్సిందిగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు తీరును సమీక్షించారు. సీజర్ అంశంపై ఎన్ఫోర్స్మెంట్ ఏజన్సీలను అప్రమ్తతం చేయాలని, జిల్లా పరిధుల్లోనే కాకుండా సరిహద్దు ప్రాంతాల్లో కూడా నిఘాను పటిష్టపర్చాలన్నారు. ప్రతి సరిహద్దు చెక్ పోస్టు వద్ద కనీసం ఒక కెమేరాతో స్టాటిక్ సర్వలెన్స్ టీమ్‌ను ఉంచాలని చెప్పారు. భారత ఎన్నికల సంఘం జారీ చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం నిత్యావసర సేవల్లో ఉండే 33 విభాగాలకు చెందిన ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించినట్టు తెలిపారు. వీటిలో ముఖ్యంగా పోలీస్, విద్యుత్, రవాణా, పోస్టల్ తదితర శాఖలు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే మీడియా ప్రతినిధులతో పాటు ఆయా శాఖల ఉద్యోగులకు వారి విజ్ఞప్తి మేరకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించాలని ఆదేశించారు. ముందస్తు అనుమతి తప్పనిసరి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు నిర్వహించే ఎలాంటి కార్యక్రమాలకైనా ముందుగా అనుమతి తప్పనిసరిగా పొందాల్సి ఉందని ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. అయితే నేరుగా గానీ, ఎన్కోర్ పోర్టల్ ద్వారా గానీ అందే దరఖాస్తులను వెంటనే పరిశీలించి సకాలంలో అనుమతులను మంజూరు చేయాలని ఆదేశించారు. శాంతి భద్రతల నిర్వహణ విషయంలో అప్రమ్తతంగా ఉండాలని, ఎలాంటి దుర్ఘటనలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఆ ఘటనలకు సంబంధించిన వాస్తవ నివేదికను వెంటనే తమకు పంపాలని ఆదేశించారు. ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపునకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఫారం–7, వివరాలు సరిదిద్దేందుకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఫారం–8లను చట్టబద్ధమైన విధానంలో ఈ నెల 26లోపు పరిష్కరించాలని ఆదేశించారు. నూతన ఓటర్ల నమోదు విషయంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి రోజూ తొమ్మిది నివేదికలను భారత ఎన్నికల సంఘానికి పంపాల్సి ఉందని, ఈ నివేదికలు పంపే విషయంలో ఏమాత్రం అలక్ష్యం వహించొద్దన్నారు. సమావేశంలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో పాటు అదనపు సీఈవోలు పి.కోటేశ్వరరావు, ఎం.ఎన్ హరేంధిరప్రసాద్, జాయింట్ సీఈవో వెంకటేశ్వరరావు, డిప్యూటీ సీఈవోలు కె.విశ్వేశ్వరరావు, మల్లిబాబు, సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
3 జిల్లాల ఎస్పీలు వివరణ ఇచ్చారు
సాక్షి, అమరావతి: నంద్యాల, ప్రకాశం జిల్లాల్లో జరిగిన హత్యలు, పల్నాడు జిల్లాలో కారు దహనంపై ఆ మూడు జిల్లాల ఎస్పీలు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముఖేష్ కుమార్ మీనాకు వివరణ ఇచ్చారు. సీఈవో మీనా ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా ఎస్పీ కె.రఘువీరా రెడ్డి, ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి గురువారం సాయంత్రం సచివాలయంలోని సీఈవో కార్యాలయానికి వచ్చారు. అక్కడ సీఈవో ముఖేష్ కుమార్ మీనా, అదనపు డీజీపీ (లా అండ్ ఆర్డర్) శంకబ్రత్ బాగ్చీ ఎదుట హాజరై ఆ సంఘటనలకు దారి తీసిన పరిస్థితులు, అనంతరం తాము చేపట్టిన చర్యలపై నివేదికలు అందజేశారు. అనంతరం సీఈవో మీనా విలేకరులతో మాట్లాడుతూ గిద్దలూరులో జరిగినది రాజకీయ హింసేనని ఎస్పీ నివేదిక ఇచ్చారని తెలిపారు. ఆళ్లగడ్డలో జరిగిన హత్య కుటుంబ కక్షల వల్ల జరిగిందని ఆ జిల్లా ఎస్పీ వివరించారన్నారు. మాచర్లలో రెండు వర్గాల ఘర్షణ సందర్భంగా కారు దహనం జరిగిందని, గురువారం రాత్రిలోగా నిందితులను అరెస్ట్ చేస్తామని పల్నాడు ఎస్పీ చెప్పినట్లు తెలిపారు. ఎస్పీలు ఇచ్చిన నివేదికలను కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీకి) సమర్పిస్తామని తెలిపారు. ఎన్నికల్లో ఎటువంటి హింసాత్మక ఘటనలు, రీపోలింగ్ లేకుండా నిర్వహించాలనేది తమ లక్ష్యమని చెప్పారు. రాజకీయ హింసను నిరోధించేలా కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. చెక్కులు పంపిణీ చేస్తే కోడ్ ఉల్లంఘనే నారా భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమంలో చెక్కులు పంపిణీ చేసినట్లు వచ్చిన ఫిర్యాదులపై ఆ జిల్లాల కలెక్టర్ల నుంచి నివేదికలు కోరినట్లు మీనా తెలిపారు. డబ్బులు పంపిణీ కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని స్పష్టం చేశారు. నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో చేపట్టిన పరామర్శ యాత్ర కొనసాగించవచ్చని, కానీ చెక్కులు పంపిణీ చేయకూడదని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని సభలో భద్రత వైఫల్యంపై ఈసీ నివేదిక కోరింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్న చిలకలూరిపేట బహిరంగ సభలో భద్రత వైఫల్యంపై ఈసీ నివేదిక కోరిందని మీనా తెలిపారు. ఈ సభలో భద్రత వైఫల్యంపై వివిధ రాజకీయ పార్టీల నుంచి ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ సభలో జరిగిన సంఘటనలపై వాస్తవాలను సమర్పించాలని ఈసీ కోరిందని, త్వరలోనే పూర్తి వివరాలను తెప్పించుకొని నివేదిక పంపుతామని తెలిపారు. -
ఏపీ సీఈవోను కలిసిన వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, విజయవాడ: ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు కలిశారు. ప్రత్తిపాడులో టీడీపీ అభ్యర్థి దాడి, నారా భువనేశ్వరి డబ్బు పంపిణీపై వైఎస్సార్సీపీ ప్రత్తిపాడు అభ్యర్థి బాలసాని కిరణ్, నారాయణ మూర్తి ఫిర్యాదు చేశారు. టీడీపీ అభ్యర్థి రామాంజనేయులు, ఆయన అనుచరులు దాడికి దిగారని, తన ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడికి వచ్చారని బాలసాని కిరణ్ అన్నారు. 20 కార్లలో రామాంజనేయులు గూండాలను తీసుకొచ్చారు. నా డ్రైవర్, మా కార్యకర్తలకు గాయాలయ్యాయి. మహిళా కార్యకర్త పిల్లి మేరిపై టీడీపీ అభ్యర్థి రామాంజనేయులు దాడి చేశాడు. నన్ను హత్య చేసేందుకు ప్రయత్నించారు. ఓటమి భయంతో టీడీపీ హత్య రాజకీయాలు చేయాలని ప్రయత్నిస్తోందన్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ గుండాయిజాన్ని ప్రోత్సహిస్తున్నారని బాలసాని కిరణ్ మండిపడ్డారు. నారా భువనేశ్వరి అవినీతి సొమ్ముతో ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తోందని వైఎస్సార్సీపీ నేత నారాయణమూర్తి మండిపడ్డారు. రాయచోటిలో భువనేశ్వరి డబ్బులు పంపిణీ చేస్తోంది. నారా భువనేశ్వరి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. భువనేశ్వరిపై చర్యలు తీసుకోవాలని సీఈవోని కోరాం. ఈనాడు పత్రిక అడ్డగోలు రాతలపై కూడా ఫిర్యాదు చేశాం. సీఎం జగన్‌పై విషపు రాతలతో తప్పుడు ప్రచారం చేస్తోంది. ఈనాడు పత్రికపై చర్యలు తీసుకోవాలని కోరాం’’ అని నారాయణ మూర్తి పేర్కొన్నారు. -
ఎన్నికల కమిషన్ చేతిలో డీఎస్సీ భవితవ్యం
రాష్ట్రంలో 144 సెక్షన్ రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లో ఉందని, ప్రతి అభ్యర్థి ప్రచారానికి, ర్యాలీలకు అనుమతి తీసుకోవాలని ఇందుకోసం సవిధ యాప్‌ను వినియోగించుకోవాలని చెప్పారు. ఇప్పటికే 398 అభ్యర్థనలు వచ్చాయన్నారు. అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచి ఎన్నికల వ్యయం అమల్లోకి వస్తుందన్నారు. 85 ఏళ్లు దాటిన వారు ఇంటి వద్దే ఓటేసే అవకాశం ఉన్నా, ఇటీవలి తెలంగాణ ఎన్నికల్లో 2 శాతం మందే వినియోగించుకున్నారని, చాలామంది పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయడానికే ఆసక్తి చూపిస్తున్నారని చెప్పారు. సాక్షి, అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి లభించిన తర్వాతే డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. అంతవరకు టెట్ పరీక్షల ఫలితాలను కూడా ప్రకటించవద్దని ఆదేశించినట్లు తెలిపారు. బుధవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డీఎస్సీలో 6,100 పోస్టులకు 4.72 లక్షల మంది పోటీపడుతున్నట్లు తెలిపారు. డీఎస్సీ నిర్వహించాలని కొందరు, వాయిదా కోరుతూ మరికొందరు మెయిల్స్, ఫోన్ ద్వారా విజ్ఞప్తి చేయడంతో ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. డీఎస్సీ పరీక్ష నిర్వహించడానికి అనుమతి కోరుతూ ఈసీకి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో లేఖ రాయనుందని, ఇందుకోసం సీఎస్ ఆధ్వర్యంలో ఒక స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం డీఎస్సీ నిర్వహించమంటే నిర్వహిస్తామని, లేదంటే వాయిదా వేస్తామని స్పష్టం చేశారు. పటిష్టంగా ఎన్నికల నియమావళి అమలు రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. గత మూడు రోజుల్లో రూ.3.39 కోట్ల విలువైన నగదు, వస్తువులు జప్తు చేశామన్నారు. కోడ్ ఉల్లంఘించిన వారిపై 385 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని, 46 మందిపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇందులో 40 మంది వలంటీర్లు ఉన్నారని, వారిని విధుల నుంచి తొలగించామని చెప్పారు. మరో ఇద్దరు రెగ్యులర్ ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలపై ఉన్న గోడ రాతలు, బ్యానర్లు, ఇతర వస్తువులు మొత్తం 1,99,000 తొలగించగా, ప్రైవేటు స్థలాల్లో 1,15,000 తొలగించినట్లు తెలిపారు. అనుమతి లేకుండా ప్రచారం కోసం ఆస్తులను వినియోగించిన వారిపై 94 కేసులు, ప్రభుత్వ వాహనాలను దుర్వినియోగం చేసినవారిపై 37 కేసులు నమోదు చేశామన్నారు. కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి రోజూ డిస్టిలరీల నుంచి మద్యం ఉత్పత్తి, గొడౌన్ల నుంచి మద్యం నిల్వల వివరాలు తెప్పించి, గతేడాది గణాంకాలతో పోల్చి చూస్తున్నామని, ఎక్కడా మద్యం అమ్మకాలు పెరగలేదన్నారు. ఇంతవరకు అనుమానాస్పద బ్యాంకు లావాదేవీలు కనిపించలేదన్నారు. ప్రధాని భద్రత కేంద్ర హోంశాఖ అంశం ప్రధాని భద్రత కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, ఎస్పీజీ పరిధిలోనికి వస్తుందని, సీఈవో పరిధిలోకి రాదని స్పష్టం చేశారు. ప్రధాని సభ భద్రతా వైఫల్యాలపై వివిధ రాజకీయ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదులను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపామన్నారు. రాష్ట్రంలో ఎటువంటి హింసాత్మక ఘటనలు రీపోలింగ్ వంటివి లేకుండా ఎన్నికలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కోడ్ వచ్చిన తర్వాత గిద్దలూరు, ఆళ్లగడ్డ, మాచర్లల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై గురువారం స్వయంగా వచ్చి నివేదిక ఇవ్వాలని ప్రకాశం, నంద్యాల, పల్నాడు జిల్లాల ఎస్పీలను ఆదేశించినట్లు తెలిపారు. వారి వివరణ ఆధారంగా కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక ఇస్తామన్నారు. సీవిజిల్‌తో సత్వర పరిష్కారం ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఓటరు సీవిజిల్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని ఎన్నికల అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ఆయన పిలుపునిచ్చారు. సీవిజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే 100 నిమిషాల్లోనే చర్యలు తీసుకుంటామని, అదే నేరుగా తమకు ఫిర్యాదు చేస్తే సంబంధిత అధికారికి పంపి వివరణ తీసుకొని చర్యలు చేపట్టడానికి చాలా సమయం పడుతుందన్నారు. కోడ్ ఉల్లంఘన అంశాలు వీడియో తీసి యాప్‌లో అప్లోడ్ చేస్తే వాటిపై తక్షణం స్పందించడానికి 1,173 ప్లైయింగ్ స్క్వాడ్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి వరకు సీవిజిల్ యాప్ ద్వారా 1,307 ఫిర్యాదులు వస్తే అందులో 40 తప్ప అన్నీ పరిష్కరించినట్లు తెలిపారు. -
టీజర్లో గ్లాస్ డైలాగ్.. ఎన్నికల అధికారి ఏమన్నారంటే?
సినిమాలను అడ్డుపెట్టుకుని పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నాడన్న వార్తలపై ఈసీ స్పందించింది. ఎవరు ఏ గుర్తయినా ప్రచారం చేసుకోవచ్చు కానీ, కొన్ని షరతులు వర్తిస్తాయని తెలిపింది. ఏదైనా మీడియా ద్వారా ప్రచారం చేస్తే ముందస్తు అనుమతి తప్పనిసరి అని తెలిపింది. అసలేం జరిగింది? డైలాగులు చెప్తే ఓట్లు రాలవు.. ఈ విషయం పవన్ కల్యాణ్‌కు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మాటివ్వడమే కాకుండా మాట మీద నిలబడే సత్తా ఉన్నవారే రాజకీయాల్లో రాణిస్తారు. అంతేకానీ ఆవేశంతో ఊగిపోతూ డైలాగులు చెప్తే ఏం ఫాయిదా ఉండదు. అయినా సరే ఇప్పటికీ రాజకీయాల కోసం సినిమాల మీదే ఆధారపడుతున్నాడు పవన్ కల్యాణ్. అలా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో తన ప్యాకేజీ పాలిటిక్స్ అప్లై చేశాడు. మంగళవారం నాడు ఈ సినిమా టీజర్ రిలీజైంది. ఇందులో తన గ్లాసు గుర్తు గురించి డైలాగ్ చెప్పాడు. గ్లాస్ అంటే సైన్యం అంటూ సినిమాతో సంబంధం లేని డైలాగులు పలికాడు. టీజరే చప్పగా ఉందంటే.. ఈ అర్థం పర్థం లేని డైలాగులు అవసరమా? అని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అసలు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఈ రకంగా గ్లాస్ గురించి ప్రచారం చేసుకోవచ్చా? అన్న ప్రశ్నలు సైతం తలెత్తాయి. ‘నిర్మాత డబ్బులతో పార్టీ ప్రచారమా?’ అంటూ ‘సాక్షి’ తో పాటు పలు వెబ్సైట్లు విశ్లేషణాత్మక వార్తలను రాసుకొచ్చాయి. పవన్ అనుమతి కోరలేదు: ఎన్నికల అధికారి గ్లాస్ డైలాగ్స్ ఇష్యూపై ఏపీ ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ స్పందించారు. పవన్ కల్యాణ్ సినిమా టీజర్‌ను చూడలేదని, గాజు గుర్తు ప్రచారం చేసుకునేందుకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. కానీ ఏదైనా మీడియా ద్వారా ప్రచారం చేస్తే తప్పకుండా అనుమతి తీసుకోవాలన్నారు. పవన్ కల్యాణ్ అయితే ఎటువంటి అనుమతి కోరలేదని, ఈ విషయాన్ని పరిశీలిస్తామన్నారు. -
టీడీపీ, జనసేనకు షాకిచ్చిన ఎన్నికల కమిషన్
సాక్షి, తాడేపల్లి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభ ఫెయిల్యూర్‌పై ఫిర్యాదు చేసిన టీడీపీ, జనసేనకు ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. పరిధిలో లేని అంశంపై తమకు ఫిర్యాదు చేశారని సీఈవో ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. ఎన్డీఏ సభ ఫెయిల్యూర్ని పోలీసులపై నెట్టేందుకు టీడీపీ, జనసేన ప్రయత్నించింది. బీజేపీ, టీడీపీ, జనసేన సభ విఫలం కావడానికి పోలీసులే కారణమంటూ గగ్గోలు పెట్టింది. పోలీసులను బ్లాక్ మెయిల్ చేయడానికి ఈసీకి ఫిర్యాదు చేసిన టీడీపీ, జనసేన బండారం.. సీఈవో ముఖేష్ కుమార్ మీనా సమాధానంతో బట్టబయలైంది. ప్రధానమంత్రి భద్రత అంశం మా పరిధిలో లేదు.. ప్రధానమంత్రి భద్రత అంశం తమ పరిధిలో లేదని సీఈవో ముఖేష్ కుమార్ మీనా అన్నారు. ‘ప్రధాని సభ భద్రత కేంద్ర హోంశాఖ, ఎస్ పీజీ పరిధిలో ఉంటాయి. ప్రధాని పర్యటన భద్రత అంతా హోమ్ శాఖనే చూస్తుంది. ఎన్నికల కమిషన్‌కు ఇందులో ఎటువంటి పాత్ర ఉండదు. నాకు ఫిర్యాదు చేసినా నేను ఎలాంటి చర్యలు తీసుకోలేదు’ అని సీఈవో ముఖేష్ కుమార్ మీనా అన్నారు. ఇదీ చదవండి: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు.. పిఠాపురం వర్మ కౌంటర్ -
కట్టుదిట్టంగా ‘కోడ్’
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో.. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్)ని కట్టుదిట్టంగా అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించారు. ప్రభుత్వ వెబ్‌సైట్లన్నింటిలోనూ ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఫొటోలు, ఆడియో, వీడియోలు కూడా వెంటనే తొలగించాలని సీఎస్ స్పష్టంచేశారు. అంతేకాక.. రాష్ట్రస్థాయి నుండి గ్రామస్థాయి వరకూ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఫొటోలను, ఫ్లెక్సీలతోపాటు ప్రభుత్వ ఆస్తులపైనున్న రాజకీయ ప్రకటనలన్నీ కూడా తొలగించాలని ఆయన ఆదేశించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనాతో కలిసి కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో మంగళవారం వెలగపూడి సచివాలయంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై జవహర్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి.. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై ఏ శాఖపైనైనా ఫిర్యాదులు వస్తే సకాలంలో స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వోద్యోగులు పార్టీల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటే వారిపై విచారణ జరిపి ఎన్నికల నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. కోడ్ అమలుకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలను కట్టుదిట్టంగా అమలుచేసేందుకు అధికారులందరూ చర్యలు తీసుకోవాలి. చాలావరకు కార్యదర్శి స్థాయి అధికారులు ఎన్నికల పరిశీలకులుగా వెళ్లనున్నందున వారంతా కోడ్ మార్గదర్శకాలపై అవగాహన పెంచుకోవాలి. కోడ్‌కు సంబంధించి సీఈఓ ఇచ్చే ప్రత్యేక ఫార్మాట్లో కార్యదర్శులందరూ నివేదిక ఇవ్వాలి. పెన్షన్ల పంపిణీ, ఉపాధి పనులకు అభ్యంతరంలేదు : ముఖేష్ కుమార్ మీనా ♦ ఎన్నికల షెడ్యూల్ వెలువడి కోడ్ అమల్లోకి వచ్చాక కొత్త పథకాలు ప్రకటించడానికి వీల్లేదు. ♦ బడ్జెట్ ప్రొవిజన్ ఉన్నప్పటికీ కొత్త ప్రాజెక్టులు, పథకాలు, రాయితీలు, గ్రాంట్ల మంజూరు, హామీలు, శంకుస్థాపనలు నిషిద్ధం. ♦వర్క్ఆర్డర్ ఉండి క్షేత్రస్థాయిలో మొదలు కాని పనులను చేపట్టకూడదు. పనులు పూర్తయిన వాటికి నిధుల విడుదలలో ఎలాంటి నిషేధంలేదు. ♦ అలాగే, వివిధ రకాల పించన్లపంపిణీకీ ఎలాంటి అభ్యంతరంలేదు. ♦ఉపాధి హామీ పథకం కింద రిజిస్టర్డ్ లబ్ధిదారులకు యధావిధిగా ఉపాధి పనులు కల్పించవచ్చు. కోడ్ అమలులోకి రాకముందు ఏవైనా పనులకు సంబంధించి టెండర్లు పలిచి ఉంటే ఆ ప్రక్రియను కొనసాగించుకోవచ్చు. కానీ, టెండర్లను ఖరారు చేయడానికి వీల్లేదు. ♦ కోడ్ అమలులోకి వచ్చాక ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై సమీక్షలు లేదా వీడియో సమావేశాలు నిర్వహించకూడదు. ♦ పీఎం, సీఎం సహాయ నిధి కింద రోగుల చికిత్స నిమిత్తం నిధులు మంజూరు చెయ్యొచ్చు. అన్ని రకాల ప్రకటనలనూ నిలిపివేయాలి.. ఇక కోడ్ అమలులోకి వచ్చినందున ప్రభుత్వ ఆస్తులపై ఉన్న అన్ని రకాల వాల్ రైటింగులు, పోస్టర్లు, కటౌట్లు, హోర్డింగులు, బ్యానర్లు, జెండాలు వంటివన్నీ వెంటనే తొలగించాలి. అలాగే, వివిధ పబ్లిక్ ఆస్తులు అంటే.. బహిరంగ ప్రదేశాలు, బస్స్టాండ్లు, రైల్వేస్టేషన్లు, రైలు..రోడ్డు వంతెనలు, ప్రభుత్వ బస్సులు, విద్యుత్ స్తంభాలు, మున్సిపల్ సమావేశ ప్రదేశాల్లోని అన్ని రకాల రాజకీయ ప్రకటనలు.. వాల్ రైటింగులు, పోస్టర్లు, కటౌట్లు వంటివన్నింటినీ వెంటనే తొలగించాలి. అదే విధంగా.. ప్రింట్ అండ్ ఎల్రక్టానిక్ మీడియా ప్రసార మాధ్యమాల్లో ప్రభుత్వ ప్రకటనలను కూడా నిలిపివేయాలి. మంత్రులెవరూ అధికారిక వాహనాలు వాడరాదు.. ఎన్నికల ప్రకటన వచ్చేసినందున ఇక మంత్రులెవరూ అధికారిక వాహనాలను ఎన్నికల ప్రచారం కోసం వినియోగించరాదు. ఎంపీ లేదా ఎంఎల్ఏ నిధులు లేక ఇతర ప్రభుత్వ పథకాల నిధులతో నిర్వహించే వాటర్ ట్యాంకులు, అంబులెన్సులు వంటి వాటిపై ప్రజాప్రతినిధుల ఫొటోలు కూడా ఉండరాదు. ప్రభుత్వ భవనాలు, కార్యాలయాల్లో ప్రధాని, ముఖ్యమంత్రి సహా మంత్రుల ఫొటోలూ ఉండకూడదు. అలాగే, విద్యుత్, నీటి బిల్లులు, బోర్డింగ్ పాస్‌లు, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లపై కూడా ప్రజాప్రతినిధుల ఫొటోలు, సందేశాలు వంటివి కూడా ఉండకూడదు. ప్రభుత్వోద్యోగులెవరైనా ఏ రాజకీయ పార్టీకైనా అనుకూలంగా వ్యవహరించినా లేదా ఆయా పార్టీలు నిర్వహించే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా, గిఫ్టులు, ఇతర ఏ రకమైన లబి్ధపొందినా అలాంటి వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ప్రవీణ్‌కుమార్, వై. శ్రీలక్ష్మి, కె. విజయానంద్, వర్చువల్‌గా.. ఎం.టి. కృష్ణబాబు, అనంతరాము పాల్గొన్నారు. ముఖ్య కార్యదర్శులు శశిభూషణ్‌కుమార్, హరీశ్‌కుమార్ గుప్తా, ప్రవీణ్‌ప్రకాశ్, సునీత, కాంతిలాల్ దండే, చిరంజీవి చౌదరి, వాణీమోహన్, పలువురు కార్యదర్శులు, కమిషనర్లు తదితర అధికారులు పాల్గొన్నారు. -
కోడ్‌కు విరుద్ధమైన రాజకీయ ప్రచారాన్ని అనుమతించొద్దు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలకు చెందిన వాణిజ్య స్థలాల్లో ఎటువంటి రాజకీయ ప్రకటనలు, హోర్డింగులు, పోస్టర్లు, బ్యానర్లను అనుమతించవద్దని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లాల ఎన్నికల అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం జాతీయ, ప్రధాన రహదారుల పక్కనున్న హోర్డింగులను అన్ని రాజకీయ పార్టీలకు సమాన ప్రాతిపదికన కేటాయించాలని, నూతన హోర్డింగులకు అనుమతులను మాత్రం ఇవ్వద్దని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు తీరును అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో రాష్ట్ర సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్బంగా మీనా మాట్లాడుతూ.. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోనున్న నేపథ్యంలో రాజకీయ ప్రకటనలు, పోస్టర్లు, హోర్డింగులు, బ్యానర్ల ప్రదర్శన విషయంలో జిల్లా ఎన్నికల అధికారులు ఎంతో అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు విరుద్ధంగా ఎటువంటి రాజకీయ ప్రచారాన్ని అనుమతించవద్దని సూచించారు. సరిహద్దుల్లో లిక్కర్ రవాణాను నియంత్రించాలి ప్రైవేటు భవనాలపై వాల్ పెయింట్లకు ఎటువంటి అనుమతిలేదని, ఇప్పటికే ఉన్నవాటిని వెంటనే చెరిపించేయాలని ఆదేశించారు. ప్రభుత్వ అనుమతితో ప్రైవేటు భవనాలపై ఇప్పటికే ఉన్న పెద్ద హోర్డింగులు, కటౌట్ల భద్రతను, నిర్మాణ స్థిరత్వాన్ని పరిశీలించాలని, ఏమాత్రం దృఢత్వం లేకపోయినా ప్రకటనలకు అనుమతించ వద్దన్నారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి లిక్కర్, ఓటర్లను ప్రభావితం చేసే పలు రకాల వస్తువులు అక్రమ రవాణాను నియంత్రించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. ఇందులో భాగంగా సరిహద్దు ప్రాంతాల్లో శాశ్వత ప్రాతిపదికన చెక్ పోస్టులు ఉన్న చోట వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణను పెంచాలని ఆదేశించారు. రాజకీయ పార్టీలు ఉద్యోగులకు, ఓటర్లకు నగదు, బహుమతులు వంటి తాయిలాలు పంపిణీ చేసే అంశాన్ని తీవ్రంగా పరిగణించాలని, అటు వంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలను నియంత్రించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. ఎన్నికల ప్రణాళికలు వెంటనే ఇవ్వాలి సి విజిల్ ఫిర్యాదులను నిర్ణీత సమయంలో నూరు శాతం పరిష్కరించాలని, ఎలక్ట్రానిక్ సీజర్ మేనేజ్మెంట్ వ్యవస్థను పెద్ద ఎత్తున వినియోగించుకునేలా ఎన్ఫోర్స్మెంట్ ఏజన్సీలపై ఒత్తిడి పెంచాలని మీనా అన్నారు. ఇంకా కొన్ని జిల్లాల నుంచి జిల్లా ఎన్నికల నిర్వహణ ప్రణాళికలు అందలేదని, వాటిని వెంటనే తమకు అందజేయాలని ఆదేశించారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేలోపే ఎన్నికల సిబ్బందికి మరోసారి లేదా రెండు సార్లు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించే అంశంపై జిల్లా ఎన్నికల అధికారులు దృష్టి సారించాలన్నారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో పాటు అదనపు సీఈవోలు పి.కోటేశ్వరరావు, ఎమ్.ఎన్.హరేంధిర ప్రసాద్, డిప్యూటీ సీఈవో కె. విశ్వేశ్వరరావు, సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
ఏపీ సీఈవోకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, విజయవాడ: ఈనాడు, నాగబాబు, టీడీపీ సోషల్ మీడియా పోస్టింగ్‌లపై సీఈవో ముఖేష్ కుమార్ మీనాకి ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ గౌతమ్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. సీఎం జగన్‌పై తప్పుడు పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన ఈనాడు, నాగబాబు, టీడీపీ సోషల్ మీడియా పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
ఏపీ ఎన్నికలు.. సీఈవో ముఖేష్‌కుమార్ కీలక ఆదేశాలు
సాక్షి, విజయవాడ: ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ స్థలాల్లో రాజకీయ ప్రకటనలతో ఉన్న హార్డింగ్స్, పోస్టర్లు, కటౌట్లను ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల్లోపు తొలగించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలుపర్చడానికి అన్ని జిల్లా ఎన్నికల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలుపరచడం, ఎలక్ట్రానిక్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టంను విస్తృత స్థాయిలో వినియోగించడం, సీ విజిల్ ద్వారా అందే ఫిర్యాదుల సకాలంలో పరిష్కరించడం తదితర అంశాలను ఈ సమావేశంలో ఆయన సమీక్షించారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో పాటు అదనపు సీఈవోలు పాల్గొన్నారు. -
స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు
సాక్షి, అమరావతి: ఎటువంటి హింస, రీపోలింగ్ వంటివి లేకుండా స్వేఛ్చాయుత వాతావరణంలో రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించేలా పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. రాష్ట్రంలో మే 13న జరిగే ఎన్నికలకు ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదల అవుతుందన్నారు. ఆయన శనివారం సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లను వివరించారు. ఎక్కడైనా అల్లర్లు జరిగితే ఆ జిల్లా ఎస్పీ, రీపోలింగ్ జరిగితే ఆ జిల్లా కలెక్టరే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా గతంలోకంటే అధికంగా పోలింగ్, పోలీసు సిబ్బందిని వినియోగిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 46,156 పోలింగ్ స్టేషన్లలో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఓటర్ల సంఖ్య 1600 దాటితే వాటిని రెండు పోలింగ్ స్టేషన్లుగా విభజిస్తామని, దీనివల్ల 887 కొత్త పోలింగ్ స్టేషన్లు ఏర్పాటుకు కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపామన్నారు. మహిళా ఓటర్లను ఆకర్షించేలా కేవలం మహిళా సిబ్బందితో 179 పోలింగ్ కేంద్రాలు, అదే విధంగా దివ్యాంగులతో 63, యువతతో 50, మోడల్ పోలింగ్ స్టేషన్లు 555 ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌కు 1 ప్లస్ 5 మంది ఉద్యోగులు ఉంటారన్నారు. గతంలో ఎన్నికల విధుల్లో అంగన్వాడీలు, తాత్కాలిక సిబ్బంది సేవలను కూడా వినియోగించుకున్నారని, ఈ సారి పూర్తిగా రెగ్యులర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులనే నియమిస్తున్నట్లు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న రెగ్యులర్ సిబ్బందికి ప్రధాన బాధ్యతలు కాకుండా సిరా వేయడం వంటి విధులను అప్పగిస్తామన్నారు. ఎవరు ఎక్కడ విధుల్లో పాల్గొంటారో ర్యాండమ్‌గా సాఫ్ట్వేర్ ద్వారా ఎంపిక చేస్తామని చెప్పారు. వలంటీర్లు, తాత్కాలిక సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉండరన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి పోలింగ్ స్టేషన్‌కు కనీసం ఇద్దరు పోలీసు సిబ్బంది ఉంటారన్నారు. ఇందుకోసం 1,14,950 మంది సివిల్ పోలీసులు, 58 కంపెనీల రాష్ట్ర ఆర్మ్డ్ పోలీసులు, 465 కంపెనీల కేంద్ర బలగాలు అవసరమవుతాయని ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు శనివారం నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని, కోడ్ ఉల్లంఘిస్తే తనతో సహా ఏ స్థాయి అధికారిపైన అయినా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఇప్పటికే ఫిర్యాదులు అందిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా నిరంతరం నిఘా కోసం 50 మంది జనరల్ అబ్జర్వర్లు, 115 మంది వ్యయ పరిశీలకులు, 13 మంది పోలీసు అబ్జర్వర్లు ఉంటారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 22 విభాగాలతో తనిఖీలు చేస్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా 121 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని తెలిపారు. వీటికి అదనంగా ఫ్లయింగ్ స్క్వాడ్స్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే తనిఖీల ద్వారా రూ.164.35 కోట్లు విలువైన నగదు, వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రధాన మంత్రి మినహా మిగతా రాజకీయ నేతలందరినీ తనిఖీ చేస్తారని, చేతి బ్యాగులు తప్ప మిగతా వాటిని సోదా చేస్తారని చెప్పారు. విమానాశ్రయాల్లో కాకుండా ప్రైవేటుగా విమానాలు, హెలికాప్టర్లలో దిగిన స్థలాల వద్దకు సంచార స్క్వాడ్స్ వెళ్లి తనిఖీలు చేస్తాయన్నారు. అనుమానాస్పద బ్యాంకు లావాదేవీలను జిల్లా కలెక్టర్లకు తెలియజేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. పెయిడ్ ఆర్టికల్స్, సోషల్ మీడియా తప్పుడు ప్రచారాలపైనా నిఘా ఉంటుందన్నారు. ఎన్నికల ప్రచారంలో ఎటువంటి మత ప్రచారం చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎన్నికల ఉల్లంఘనలపై 1950 నంబరుకు లేదా సీ విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరారు. 85 ఏళ్లు దాటిన వృద్ధులకుఇంటి వద్దే ఓటింగ్ 85 ఏళ్లు దాటిన వృద్ధులు ఇంటి వద్ద లేదా పోలింగ్ స్టేషన్‌కు వచ్చి ఓటు వేయొచ్చని మీనా తెలిపారు. ఇంటి వద్దే ఓటు వేయాలనుకొంటే ముందుగా ఫారం 12 పూర్తి చేసి రిటర్నింగ్ అధికారికి ఇస్తే దాన్ని పరిశీలించి పోస్టల్ బ్యాలెట్‌కు అనుమతిస్తారన్నారు. ఒకసారి పోస్టల్ బ్యాలెట్‌కు అనుమతి లభిస్తే వారు పోలింగ్ స్టేషన్‌కు వచ్చి ఓటు వేయడానికి కుదరదని స్పష్టం చేశారు. ఇలా పోస్టల్ బ్యాలెట్ కోరిన వారికి ఎన్నికల తేదీకి పది రోజుల ముందే వీడియోగ్రాఫర్‌తో కలిపి ఐదుగురు సిబ్బంది ఇంటికి వచ్చి పోస్టల్ బ్యాలెట్‌కు ఏర్పాట్లు చేస్తారని చెప్పారు. పోలింగ్ బూత్‌లో లానే గోప్యంగా ఓటు హక్కును వినియోగించుకొని ఆ పోస్టల్ బ్యాలెట్‌ను రెండు కవర్లలో పెట్టి పోలింగ్ బాక్స్‌లో వేయాలని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్‌కు ఇంటికి వస్తున్న సమాచారాన్ని పోటీలో ఉన్న అభ్యర్థులకు ముందుగానే తెలియజేస్తామన్నారు. ఈ సమావేశంలో అదనపు డీజీపీ (లా – ఆర్డర్) శంకబ్రత్ బాగ్చీ, అదనపు సీఈవోలు హరేంధర ప్రసాద్, పి. కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 53 రోజుల్లో కొత్తగా 1.30 లక్షల మంది ఓటర్లు ఈ నెల 16 నాటికి 4.09 కోట్లు దాటిన ఓటర్లు జనవరి 22న విడుదల చేసిన తుది ఓటర్ల జాబితాతో పోలిస్తే ఈ నెల 16 నాటికి ఓటర్ల సంఖ్య 1,30,096 పెరిగినట్లు ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. జనవరిలో విడుదల చేసిన జాబితాలో ఓటర్ల సంఖ్య 4,08,07,256 మంది ఉండగా ఇప్పడు 4,09,37,352కు చేరినట్లు తెలిపారు. ఎన్నికల షెడ్యూలు వచ్చినందున ఓట్ల తొలిగింపు, చిరునామా మార్పులకు అవకాశం ఉండదని, కొత్త ఓటర్ల నమోదుకు నామినేషన్ల చివరి రోజు వరకు అవకాశం ఉందని చెప్పారు. ఇవి చేయొచ్చు ♦ ఇప్పటికే అమల్లో ఉన్న పథకాల లబ్ధిదారులకు ప్రయోజనాలను కొనసాగించవచ్చు ♦ చేయూత పథకానికి ఇప్పటికే నిధులిస్తే వాటిని కొనసాగించవచ్చు ♦ ఇప్పటికే చేపట్టిన పనులు కొనసాగించొచ్చు. పూర్తయిన పనులకు బిల్లులు చెల్లించొచ్చు ♦ ఏపీపీఎస్సీ, యూపీఎస్సీ వంటి సంస్థలు ఉద్యోగాల నియామకాల ప్రక్రియ కొనసాగించొచ్చు ఇవి చేయకూడదు ♦ పథకాలకు కొత్తగా లబ్ధిదారులను ఎంపిక చేయకూడదు ♦ పథకాలకు కొత్తగా నిధులు విడుదల చేయాల్సి వస్తే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ముందుగా అనుమతి తీసుకోవాలి ♦ పనులు మంజూరైనప్పటికీ, ఇంకా ప్రారంభించని వాటిని ఇప్పుడు చేపట్టకూడదు ♦ కంపెనీలకు, వ్యక్తులకు భూములు కేటాయించకూడదు. అసాధారణ కేసుల్లో సీఎంఆర్ఎఫ్ మంజూరుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాలి ♦ మంత్రులు ఫైలెట్ కార్లను వినియోగించకూడదు ♦ ప్రధానమంత్రి తప్ప మిగతా ఏ రాజకీయ నాయకులకు ప్రొటోకాల్ ఉండదు -
ఏపీ ఎన్నికల నిర్వహణకు సిద్ధం
-
ఏపీ ఎన్నికల నిర్వహణకు సిద్ధం: సీఈవో ముఖేష్ కుమార్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ సీట్లకు, 25 లోక్ సభ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనునట్లు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఏపీలో మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ నిర్వహిస్తామన్నారు. ఏపీలో 46 వేలకు పైగా పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుపుతామని, ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఫామ్ 12 ద్వారా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయవచ్చన్నారు. 85 ఏళ్లు దాటిన వారికి ఓటు ఫ్రమ్ హోమ్ సౌకర్యం కల్పిస్తామన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి నెలాఖరులోగా ఓటరు కార్డులు పంపిణీ చేస్తామని తెలిపారు. ఓటరు కార్డు లేకుంటే 12 రకాల గుర్తింపు కార్డులు చూపించొచ్చని వెల్లడించారు. ►ఏప్రిల్ 18న ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ ►ఏప్రిల్ 18 నుంచి 25 వరుకు నామినేషన్ల స్వీకరణ ►ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన ►ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణ గడువు ►మే 13న పోలింగ్ ►జూన్ 4న ఓట్ల లెక్కింపు ►ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్ధానాలకు ఎన్నికలు ►ఏపీలో తాజా ఓటర్ల సంఖ్య 4,09,37,352...ఇందులో సర్వీస్ ఓటర్లు సంఖ్య 67393 ►18 నుంచి 19 సంవత్సరాల వయస్సు కలిగిన 9,01,863 మంది ఓటర్లు వున్నారు ►ఏపీలో జనవరి ఒకటి నాటికి 4.07 కోట్ల మంది ఓటర్లు ఉంటే.. తాజాగా 1,97,000 మంది పెరిగారు ►ఈ రోజు వరకు వచ్చిన 6ఏ దరఖాస్తులు తీసుకుంటాం ►ఏపీలో 46165 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి ►ఇందులో 179 పోలింగ్ కేంద్రాలు ప్రత్యేకంగా మహిళా పోలింగ్ కేంద్రాలుగా ఏర్పాటు చేస్తాం ►పోలింగ్‌కు ఐదు రోజుల ముందు ఓటర్ల స్లిప్ కూడా పంపిణీ చేస్తాం ►ఎపిక్ కార్డులు లేకపోతే పోలింగ్ రోజు 12 రకాల గుర్తింపు కార్డులు చూపించవచ్చు ►85 సంవత్సరాలు పైబడిన వారు, వికలాంగులకి ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ►ఇందుకోసం ఫారం 12 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు ►అభ్యర్ధుల తమపై ఉన్న క్రిమినల్ కేసులను పేపర్, టీవీలలో మూడుసార్లు పబ్లిష్ చేయాల్సి ఉంటుంది ►3.82 లక్షలు ఉద్యోగులను ఎన్నికల కోసం వినియోగిస్తాం ►ఏపీ ఎన్నికలకి 50 మంది జనరల్ అబ్జర్వర్స్ ఉంటారు ►ప్రతీ అసెంబ్లీకి మూడు ఫ్లైయింగ్ స్క్వాడ్ లు ఉంటాయి ►అనుమానిత ఖాతాలపై నిఘా ►నాన్ కమర్షియల్ ప్రాంతాలలో ల్యాండ్ అయ్యే హెలీకాప్టర్లని తనిఖీలు చేపడతాం ►50 శాతం పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తాం ►నేటి నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలుల్లో ఉంటుంది. ►బహిరంగ ప్రదేశాలలో 48 గంటలలోపు పోస్టర్లు, బ్యానర్లు తొలగించాలి ►ప్రభుత్వ వెబ్ సైట్ నుంచి వచ్చే 24 గంటలలోపు అన్ని ఫొటోలు తీసేయాల్సి ఉంటుంది ►కొత్త పనులకు పర్మిషన్ లేదు.. జరుగుతున్న పనులకు ఇబ్బంది లేదు ►మంత్రులు సమీక్షలు చేయకూడదు ►మంత్రులకు ప్రోటోకాల్ ఉండదు ►కొత్తగా లబ్దిదారులను ఎంపిక చేయడానికి లేదు -
ఆ లావాదేవీల జాబితా ఇవ్వండి..
సాక్షి, అమరావతి: త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బ్యాంకు ఖాతాల ద్వారా రాష్ట్రంలో అనుమానాస్పద, అధిక మొత్తంలో జరిగే లావాదేవీల వివరాలు ఎప్పటికప్పుడు ఆదాయపు పన్ను శాఖకు, ఎన్నికల కమిషన్‌కు అందజేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (ఎస్ఈసీ) ముకేశ్‌కుమార్ మీనా బ్యాంకర్లను ఆదేశించారు. గత ఏడాది అక్టోబరు 1 నుండి రోజుకి రూ.10 లక్షలకు మించి.. గత 30 రోజుల కాలవ్యవధిలో రూ.50 లక్షలకు మించి లావాదేవీలు జరిగిన బ్యాంకు ఖాతాల వివరాలను సమర్పించాలని అన్ని బ్యాంకుల నోడల్ అధికారులను ఆయన కోరారు. ఎన్నికల వ్యయ పర్యవేక్షణ, ఎలక్ట్రానిక్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఈసీఎంసీ) అమలు అంశాలను సమీక్షించేందుకు శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ఎస్ఈసీ అధ్యక్షతన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల్లో పోటీచేసే ప్రతీ లోక్‌సభ అభ్యర్థి రూ.95 లక్షలు, ఎమ్మెల్యే అభ్యర్థి రూ.40 లక్షల మేర వ్యయం చేసేందుకు అనుమతి ఉందన్నారు. అయితే, అంతకుమించి జరిగే వ్యయంపై పటిష్టమైన నిఘా ఉంటుందని, ఈ విషయంలో బ్యాంకర్లు కీలకపాత్ర పోషించి గుర్తించాలన్నారు. రాజకీయ పార్టీలు, వారి అభ్యర్థుల బ్యాంకు ఖాతాల నుండి జరిగే లావాదేవీల వివరాలను ఎప్పటికప్పుడు ఐటి శాఖతోపాటు ఎన్నికల సంఘానికి అందజేయాలని ఆయన చెప్పారు. ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన తర్వాత అభ్యర్థులు, వారి సంబంధీకులు లేదా రాజకీయ పార్టీల బ్యాంకు అకౌంట్ల నుంచి రూ.లక్షకు మించి జరిపే లావాదేవీల వివరాలను కూడా అందజేయాలని ఎస్ఈసీ కోరారు. ప్రలోభాలపై నిఘా.. ఇక ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న సమయంలో అధిక మొత్తంలో నగదు, లిక్కరు, ఓటర్లను ప్రలోభపరిచే సామాగ్రి అక్రమ తరలింపుపై కూడా పూర్తిస్థాయిలో నిఘా ఉంటుందని ముకేశ్‌కుమార్ చెప్పారు. అలా తరలించే సమయంలో సీజ్ చేయబడిన వివరాలను రియల్ టైమ్ బేసిస్‌లో నివేదించేందుకు ఈసీఎంసీ విధానాన్ని కేంద్ర ఎన్నికల సంఘం అమల్లోకి తెచ్చిందన్నారు. ఈ అంశానికి సంబంధించి ఐటి, జీఎస్టీ, పోలీస్, ఎౖMð్సజ్ తదితర 22 ఎన్ఫోర్సుమెంట్ ఏజన్సీలు నిరంతరం పనిచేస్తున్నాయని, వీరు సీజ్‌చేసే నగదు, వస్తువుల వివరాలను ఈ యాప్‌లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తామన్నారు. అన్ని బ్యాంకుల ప్రతినిధులు ఈ యాప్‌ను పటిష్టంగా వినియోగించుకునేందుకు వీలుగా అందులోకి లాగిన్ కావాలని ఆయన సూచించారు. మరోవైపు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు బ్యాంకులు తరలించే సొమ్మును అకారణంగా జప్తు చేయకుండా ఉండేందుకు ఈఎస్ఎంఎస్ యాప్‌ను వినియోగించుకోవచ్చన్నారు. ఈ యాప్ ద్వారా నగదు తరలింపునకు బ్యాంకులు అనుమతులు, రశీదు పొందవచ్చని, క్యూఆర్ కోడ్ ద్వారా అధికారులు ధ్రువీకరణ చేసుకునే వీలుందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ కన్వీనర్ రవీంద్రబాబు, అన్ని బ్యాంకుల ప్రతినిధులు మరియు డిప్యూటీ సీఈఓ కె. విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పెయిడ్ ఆర్టికల్స్‌పై కన్ను.. ఆయా మాధ్యమాల్లో ప్రచురితం, ప్రసారమయ్యే పెయిడ్ ఆర్టికల్స్‌పై గట్టి నిఘా ఉంటుందని, ఈ విషయంలో వాటి ప్రతినిధులు అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్‌కుమార్ మీనా కోరారు. ఎన్నికల సమయంలో ప్రసార మాధ్యమాలు అనుసరించాల్సిన విధి విధానాలపై కేంద్ర ఎన్నికల సంఘం జారీచేసిన తాజా మార్గదర్శకాలు, చట్టాలు.. సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాలకు అనుగుణంగా మీడియా యూనిట్లు ప్రవర్తించాలన్నారు. ఈ విషయమై మీనా అధ్యక్షతన శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన మీడియా వర్క్‌షాపులో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించే విషయంలో మీడియా పాత్ర ఎంతో కీలకమన్నారు. అందుకు అన్ని మాధ్యమాల ప్రతినిధులు సహకరించాలని ఆయన కోరారు. అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసినప్పటి నుండి పెయిడ్ న్యూస్ అంశాన్ని జిల్లా, రాష్ట్రస్థాయిలో ఉండే మీడియా సర్టిఫికేషన్, మీడియా మానిటరింగ్ (ఎంసీ అండ్ ఎంసీ) కమిటీలు ఎంతో అప్రమత్తంగా పర్యవేక్షిస్తుంటాయన్నారు. నిర్దేశించిన రేట్ కార్డు ప్రకారం పెయిడ్ న్యూస్‌ను గణించి, ఆ వ్యయాన్ని సంబంధిత అభ్యర్థి ఖాతాలో వేస్తామన్నారు. ఇక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనలకు సంబంధించి కూడా అనుమతి పొందాల్సి ఉంటుందని, ఆ ఆర్డరు కాపీ నెంబరును ప్రకటనపై ముద్రించాల్సి ఉంటుందన్నారు. -
ఏపీ ఎన్నికలు.. సీఈఓ ముఖేష్ కుమార్ మీనా కీలక సూచనలు
సాక్షి, అమరావతి: హింసలేని, రీపోలింగ్‌కు ఆస్కారం లేని ఎన్నికలే లక్ష్యంగా ఈ సారి ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఎక్కడ హింసాత్మక ఘటనలు జరిగినా ఎస్పీలదే బాధ్యత అని, ఘటనపై తక్షణం చర్యలు తీసుకోకపోతే ఎస్పీలపై చర్యలు తీసుకుంటామని సీఈఓ అన్నారు. ‘‘ఎన్నికల కోడ్ అమలు నుంచి పెయిడ్ న్యూస్‌పై ప్రత్యేక దృష్టి పెడతామని, పార్టీ అనుబంధ ఛానళ్లలో అనుకూల వార్తలు వస్తే ఆ వ్యయాన్ని సదరు పార్టీ, అభ్యర్ధుల ఖాతాల నుంచే చేసిన వ్యయంగా భావిస్తామని ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. ఎంసీఎంసీ కమిటీలు ఈ తరహా వార్తలను, ప్రచారాలను నిశితంగా పరిశీలన చేస్తున్నాయని పేర్కొన్నారు. ‘‘ఇప్పటి వరకూ అన్ని రాజకీయ పార్టీల నుంచి 155 ప్రకటనల కోసం ఈసీకి దరఖాస్తుులు వచ్చాయి. ఎమ్మెల్యేకు 40 లక్షలు, ఎంపీ అభ్యర్ధికి 95 లక్షల వ్యయాన్ని మాత్రమే ఈసీ ఎన్నికల వ్యయంగా అనుమతించింది. నామినేషన్ల చివరి తేదీ నుంచి అభ్యర్ధుల ఎన్నికల వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుంటాం. ప్రభుత్వ ఉద్యోగులు ఏ పార్టీ ప్రచారంలో పాల్గొనకూడదని సర్వీసు నిబంధనల్లోనే ఉంది. అలాంటి ఉదంతాలు వస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. ఇదీ చదవండి: టీడీపీతో పొత్తు.. బీజేపీలో రచ్చ.. ‘వినోద్ ధావడే’ ఉక్కిరిబిక్కిరి -
నో వయెలెన్స్.. నో రీపోలింగ్
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో జీరో వయెలెన్స్, నో రీపోల్ ప్రధాన మంత్రాలు కావాలని.. అందుకు అనుగుణంగా జిల్లా ఎన్నికల అధికారులు, పోలీస్ సూపరింటెండెంట్లు, పోలీస్ కమిషనర్లు ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్‌కుమార్ మీనా ఆదేశించారు. బుధవారం రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, పోలీస్ సూపరింటెండెంట్లు, పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్పరెన్స్ ద్వారా ఎన్నికల సంసిద్ధతకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ.. భారత ఎన్నికల సంఘం సూచించిన ఈ రెండు మంత్రాల అమల్లో ఎటువంటి తేడా వచ్చినా అందుకు సంబంధిత అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందనే విషయాన్ని గమనించాలన్నారు. ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాలు పటిష్టంగా పనిచేసే విధంగా ముందుగానే తగు ఏర్పాట్లు చేసుకోవాలని, బూత్ క్యాప్చరింగ్‌కు ఎటువంటి అవకాశం లేకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు కూడా చేసుకోవాలని సూచించారు. త్వరలో ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారులు, పోలీస్ సూపరింటెండెంట్లు, పోలీస్ కమిషనర్లు తీసుకోవాల్సిన చర్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కంట్రోల్ రూముల ద్వారా నిరంతర పర్యవేక్షణ, ఎన్నికల ప్రవర్తనా నియమావళిలోని ముఖ్యమైన ఆదేశాలు, రాజకీయ పార్టీల అనధికార ప్రకటనలు, 50% పోలింగ్ స్టేషన్లలో ఎన్నికల ప్రక్రియ వెబ్ కాస్టింగ్, ఎన్నికల షెడ్యూల్ ప్రకటన, రోజూ వారీ పంపాల్సిన నివేదికలు తదితర అంశాలను జిల్లాల ఎన్నికల అధికారులు, పోలీస్ సూపరింటెండెంట్లు, పోలీస్ కమిషనర్లకు ఆయన వివరించారు. గుర్తింపు కార్డుల జారీని వేగిరపర్చండి ఓటర్ల గుర్తింపు కార్డుల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని మీనా ఆదేశించారు. ఓటర్ల గుర్తింపు కార్డులను తప్పనిసరిగా పోస్టల్ ద్వారానే బటా్వడా చేయాలని, ఒక్క పాడేరు ప్రాంతం మినహా మరే ఇతర ప్రాంతాల్లో మాన్యువల్‌గా పంపిణీ చేయడానికి వీలు లేదనే విషయాన్ని గుర్తించాలన్నారు. పెండింగ్ ఫారాలను సకాలంలో పరిష్కరించాలని, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తదుపరి ఫారాల పరిష్కార ప్రక్రియను మరింత వేగవంతంగా అమలు పర్చాలని ఆదేశించారు. ఓటర్లను ఆకర్షించేందుకు నగదు, బహుమతులను విరివిగా పంపిణీ చేస్తున్నట్టు వార్తా పత్రికల్లో కథనాలతో పాటు ఫిర్యాదులు కూడా వస్తున్నాయని, వాటిపై సమగ్ర విచారణ జరిపిన సంబంధిత నివేదికలను తమకు వెంటనే పంపించాలని ఆదేశించారు. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర పోలీస్ శాఖ చేస్తున్న ఏర్పాట్లను అదనపు డీజీపీ (లా అండ్ ఆర్డర్) ఎస్బీ బాగ్చీ పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా వివరించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పటిష్టంగా అమలుతోపాటు ఎన్నికలకు ముందు, ఎన్నికల రోజు, ఎన్నికల తదుపరి అమలుచేయనున్న బందోబస్తు కార్యాచరణ ప్రణాళికను ఆయన వివరించారు. సమావేశంలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, పోలీస్ సూపరింటెండెంట్లు, పోలీస్ కమిషనర్లతోపాటు అదనపు సీఈవో ఎంఎన్ హరేందిర ప్రసాద్, డిప్యూటీ సీఈవోలు కె.విశ్వేశ్వరరావు, ఎస్.మల్లిబాబు, సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
ఎన్నికల నియమావళిని తప్పక పాటించాలి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల నియమావళిపై సమగ్ర అవగాహన ఏర్పర్చుకుని, రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో నియమావళిని పాటించాల్సిందేనని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టంచేశారు. ఈ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, వారి ప్రతినిధులు అనుసరించాల్సిన విధి విధానాలను వివరించేందుకు గుర్తింపు పొందిన అన్ని పార్టీల ప్రతినిధులతో గురువారం రాష్ట్ర సచివాలయంలో వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ వర్క్‌షాప్‌లో అదనపు సీఈవోలు పి. కోటేశ్వరరావు, ఎమ్.ఎన్. హరేంధిర ప్రసాద్, రాజకీయ పార్టీల ప్రతినిధులు అంకంరెడ్డి నారాయణమూర్తి (వైఎస్సార్సీపీ), ఎ.రాజేంద్రప్రసాద్ (టీడీపీ), ఐ.కె.అన్నపూర్ణ (బీజేపీ), వె.వి.రావు (సీపీఐ–ఎం) పాల్గొన్నారు. ఈ సందర్బంగా మీనా మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో ఎన్నికల షెడ్యూలు ప్రకటన, ప్రవర్తన నియమావళి అమలు, నామినేషన్ల ప్రక్రియ, వ్యయ పర్యవేక్షణ ఎంతో కీలకమైన అంశాలని చెప్పారు. ఈ అంశాలపై సమగ్ర సమాచారాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. భారత ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే ప్రవర్తన నియమావళి అమల్లోకి వస్తుందని తెలిపారు. నోటిఫికేషన్ మాత్రం ఐదారు రోజుల తరువాత వస్తుందన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు ప్రవర్తన నియమావళి అమల్లో ఉంటుందని చెప్పారు. ఈ సమయంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల నియమావళికి లోబడి ప్రవర్తించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. మీనా వివరించిన నియమావళిలో ప్రధానాంశాలు.. ♦ ఎటువంటి బహిరంగ కార్యక్రమాలకైనా ముందుగా అనుమతి పొందాలి ♦ పార్టీలు, ప్రతినిధులు నిర్వహించే అన్ని కా>ర్యక్రమాలను పూర్తి స్థాయిలో వీడియోగ్రఫీ ద్వారా పర్యవేక్షిస్తాం ♦ కులం, మతం, భాష ప్రాతిపదికన ఓటర్లను ప్రేరేపించడం, ఓట్లు వేయమని అడగడం పూర్తిగా నిషిద్ధం ♦ అభ్యర్థులు, ఏజెంట్లు, కార్యకర్తలు రూ.50 వేలకు మించి నగదు, రూ.10 వేలకు మించి విలువైన వస్తువులు వాహనాల్లో రవాణా చేయడం నిషిద్ధం ♦ స్టార్ క్యాంపెయినర్లు రూ. లక్షకు మించి నగదు కలిగి ఉండకూడదు ♦ పరిమితికి మించి నగదు ఉన్న వాహనాలను, నగదుని సీజ్ చేస్తాం ♦ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం అవుతుంది ♦ ఎన్నికల్లో పోటీ చేసే లోక్‌సభ అభ్యర్థులు రూ.25 వేలు, శాసన సభ అభ్యర్థులు రూ.10 వేలు నగదు రూపేణాగానీ లేదా ఆర్.బి.ఐ./ట్రెజరీ ద్వారా సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి. చెక్కులు, బ్యాంకు డ్రాప్టులు అనుమతించం ♦ ప్రభుత్వ పనిదినాల్లో ఉదయం 11 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే సంబంధిత ఆర్వోలు, ఏఆర్వోలు నామినేషన్లు స్వీకరిస్తారు ♦ నామినేషన్లు వేసేందుకు వచ్చే అభ్యర్థుల వాహనాలను 100 మీటర్ల దూరంలో నిలిపివేస్తాం ♦ అభ్యర్థితో కలిపి మొత్తం ఐదుగురిని మాత్రమే లోపలకు అనుమతిస్తాం ♦ ఈ ఎన్నికల ప్రక్రియలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చేసే ఎన్నికల వ్యయంపై పూర్తి స్థాయిలో నిఘా ఉంటుంది ♦ ప్రతి లోక్‌సభ అభ్యర్థికి రూ.95 లక్షలు, శాసనసభ అభ్యర్థికి రూ.40 లక్షల మేర వ్యయం చేసేందుకు అనుమతి ఉంటుంది ♦ ఈ వ్యయాన్ని బహిరంగ సభల నిర్వహణకు, పోస్టర్లు, బ్యానర్లు, వాహనాల వినియోగానికి మాత్రమే ఖర్చు చేయాలి ♦ ఓటర్లను ప్రభావితం చేసేలా నగదు, బహుమతులు, లిక్కరు, ఇతర వస్తువులు పంపిణీ చేయడాన్ని చట్టవిరుద్ధమైన వ్యయంగా పరిగణిస్తాం ♦ ఎన్నికల వ్యవయానికి ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా నిర్వహించాలి ♦ రోజువారీ రిజిస్టరుతో పాటు నగదు, బ్యాంకు రిజిస్టర్లను కూడా తప్పనిసరిగా నిర్వహించాలి -
వివాద రహితంగా ఎన్నికల ప్రక్రియ
సాక్షి, అమరావతి: వివాదాలకు ఆస్కారం లేకుండా ఎన్నికల ప్రక్రియ కొనసాగించాలని, పారదర్శకంగా ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్‌కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలనూ పరిగణలోకి తీసుకుంటూ కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికల సంసిద్ధతకు తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. మీనా మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు, ఓటర్ల నమోదు, తొలగింపు, మార్పులు, చేర్పులకు సంబంధించి అందే ఫిర్యాదుల పరిష్కారం విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని చెప్పారు. అలాగే దినపత్రికల్లో వచ్చే ప్రతికూల వార్తాంశాలపై చర్యలు తీసుకుని, సంబంధిత వివరాలను ప్రతివారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించే సమావేశంలో వివరించాలన్నారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చేయాల్సిన పోలీసు బందోబస్తు ఏర్పాట్లు, శిక్షణా కార్యక్రమాల నిర్వహణ, ఓటర్లను ప్రభావితం చేసే వస్తువుల అక్రమ రవాణా నియంత్రణ అంశాలకు సంబంధించి ప్రతివారం సంబంధిత జిల్లాల ఎస్పీలతో సమీక్షా సమావేశం నిర్వహించాలని ఎన్నికల అధికారులకు ఆయన సూచించారు. ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టం యాప్ ఇప్పటికే సిద్ధంగా ఉందని, ఆ యాప్ ట్రయల్ రన్‌ను మార్చి మొదటి వారంలో నిర్వహిస్తామన్నారు. ఆ యాప్‌ను అధికారులు డౌన్లోడ్ చేసుకోవాలని, ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటిక్ సెర్వెలెన్స్ టీమ్‌లు, జిల్లాస్థాయి బ్యాంకర్ల కమిటీ సభ్యులు లాగిన్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోనే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఓటర్ల నమోదు, తొలగింపు, మార్పులు, చేర్పులకు సంబంధించిన పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా ఎన్నికల అధికారులకు ఆయన సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతుల కల్పన, ఎన్నికల అధికారులు, సిబ్బంది నియామకం, శిక్షణ తదితర అంశాలపై ఆయన సమీక్షించారు. అదనపు సీఈవోలు కోటేశ్వరరావు, హరెంధిర ప్రసాద్, జాయింట్ సీఈవో వెంకటేశ్వరరావు, డిప్యూటీ సీఈవో విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఈసీ కొత్త మార్గదర్శకాలు తప్పక పాటించాలి
సాక్షి, విశాఖపట్నం/తిరుపతి సిటీ: రానున్న ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా జారీచేసిన మార్గదర్శకాలు, సూచనలను ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టంచేశారు. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం కెమికల్ ఇంజరింగ్ బ్లాక్‌లో లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గ ఆర్వోలు, ఏఆర్వోలకు నిర్వహిస్తున్న తొలి విడత శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. మీనా మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల గురించి అధికారులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతల్లో 1,000 మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణ ఇచ్చేందుకు జాతీయస్థాయి మాస్టర్ ట్రైనర్లు వచ్చారని, వారి నుంచి ఎన్నికల ప్రారంభం నుంచి ముగిసే వరకు కొనసాగాల్సిన ప్రక్రియపై పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించుకోవాలని, సందేహాలను నివృత్తి చేసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం మాస్టర్ ట్రైనర్ సమీర్ అహ్మద్ జాన్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. మల్లిఖార్జున ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. డీఆర్వో కె.మోహన్‌కుమార్, విశాఖ, విజయనగరం, అనకాపల్లి, పాడేరు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల జాయింట్ కలెక్టర్లు, ఏఆర్వోలు హాజరయ్యారు. -
నెలాఖరుకల్లా ఎన్నికల శిక్షణ పూర్తి చేయాలి
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ త్వరలో ప్రకటించనున్నందున అన్ని రకాల బృందాల శిక్షణను ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. ఆయన శనివారం రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఎన్నికల సంసిద్ధత, ఓటర్ల జాబితా నవీకరణపై సమీక్షించారు. ఈ సందర్బంగా మీనా మాట్లాడుతూ.. షెడ్యూలు ప్రకటించిన వెంటనే ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుందని చెప్పారు. దాని ప్రకారం ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటిక్ సెరై్వలెన్స్, వీడియో వ్యూయింగ్, ఎలక్షన్ ఎక్సె్పండిచర్ మేనేజ్మెంట్ టీమ్‌లు, ఇతర బృందాల కార్యకలాపాలు ప్రారంభమవుతాయని తెలిపారు. అందువల్ల ఆ బృందాలకు వారి విధులపై సమగ్ర అవగాహన ఉండాలన్నారు. ఎన్నికల నిర్వహణ, కౌంటింగ్‌లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి శిక్షణను మార్చి నెలలో ఇవ్వవచ్చని చెప్పారు. విధుల్లో చేరకపోతే చర్యలు తప్పవు అన్ని జిల్లాల్లో ఆర్వోలు, ఏఆర్వోలు, ఈఆర్వోలు, ఏఈఆర్వోల నియామకం జరిగిందని, వారిలో ఇప్పటికీ విధుల్లో చేరని వారి వివరాలను వెంటనే తెలియజేయాలని ఆదేశించారు. వారి సమాచారాన్ని ప్రభుత్వానికి పంపి, తగిన చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు సౌకర్యాలు కల్పించే బృందాలు, హోమ్ ఓటింగ్ బృందాల్లో తగినంత మందిని సమకూర్చుకోవాలని సూచించారు. విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులకు ఇంటి వద్దే ఓటింగ్‌కు అవకాశం ఉన్నందున రెవెన్యూ అధికారులు, సిబ్బందితో హోం ఓటింగ్ బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. పోలింగ్ సిబ్బంది డేటాను సంబంధిత పోర్టల్‌లో వెంటనే ఫీడ్ చేయాలన్నారు. ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టంను పటిష్టంగా అమలు పర్చేందుకు రెగ్యులేటరీ అథారిటీలతో సమన్వయం చేసుకోవాలని, ప్రతి అథారిటీ నుండి తప్పనిసరిగా ఒక నోడల్ అధికారి ఉండాలని అన్నారు. ఈవీఎంలను తరలించే వాహనాలు, ఫ్లయింగ్ స్క్వాడ్లు, ఇతర బృందాల వాహనాలకు తప్పనిసరిగా జీపీఎస్ ఉండాలని చెప్పారు. జిల్లా కేంద్రం నుండి బ్లాక్ స్థాయి వరకు అందరు అధికారులతో పటిష్టమైన కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని మీనా ఆదేశించారు. సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు అన్నింటికీ తప్పనిసరిగా మైక్రో అబ్జర్వర్లను నియమించాలని, వెబ్ కాస్టింగ్, మీడియో కవరేజిల్లో పోలింగ్ కేంద్రాల పరిసరాలను కూడా చిత్రీకరించాలని చెప్పారు. అందుకు అవసరమైన వీడియోగ్రాఫర్లను, జిల్లా స్థాయిలోనే సమకూర్చుకోవాలన్నారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో పాటు అదనపు సీఈవోలు పి. కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికలకు పటిష్టమైన ఏర్పాట్లు చేయండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలను పటిష్టంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. ఆయన శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్పరెన్సు నిర్వహించారు. ఎన్నికల సంసిద్దత, ఓటర్ల జాబితా నవీకరణపై సమీక్షించారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు ప్రకటన, నోటిఫికేషన్ జారీకి ఎక్కువ సమయం లేదని, ఈ లోపే పోలింగ్ స్టేషన్లు, మౌలిక వసతులను పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగులు, వయో వృద్ధుల కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ నెల 5వ తేదీకల్లా ర్యాంపుల నిర్మాణం పూర్తి చేయాలని చెప్పారు. ఎన్నికల విధుల్లో ప్రభుత్వ ఉద్యోగులనే తప్పనిసరిగా నియమించాలని, సకాలంలో మాస్టర్ ట్రైనర్ల ద్వారా శిక్షణ పూర్తి చేయాలన్నారు. పోలింగ్ కేంద్రం పరిసరాల్లోనూవెబ్ టెలికాస్టింగ్ జిల్లాల వారీగా ఉన్న సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ల విషయంలో ప్రత్యేక శ్రద్ద చూపాలని చెప్పారు. సున్నితమైన, సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్లలతో పాటు 1,200 మందికి పైగా ఓటర్లు ఉన్న పోలింగ్ స్టేషన్లకు తప్పనిసరిగా వెబ్ టెలీకాస్టింగ్ సౌకర్యాన్ని కల్పించాలన్నారు. వెబ్ కాస్టింగ్‌పై తాత్కాలిక నివేదికను వెంటనే పంపాలన్నారు. ప్రతి జిల్లాలో కనీసం 50 శాతం పోలింగ్ స్టేషన్లు వెబ్ టెలీకాస్టింగ్‌లో కవర్ అవ్వాలని, ఇది పోలింగ్ స్టేషన్‌కే పరిమితం కాకుండా చుట్టు ప్రక్కల ఉన్న ప్రాంతాలు కూడా కవర్ అవ్వాలని తెలిపారు. ప్రాంతాలవారీగా సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ల మ్యాపింగ్ కూడా సత్వరమే పూర్తి చేయాలన్నారు. వచ్చే సోమవారానికల్లా ఎన్నికల నిర్వహణ ముసాయిదా పంపాలి ప్రతి జిల్లా ఎన్నికల నిర్వహణ ప్రణాళిక ముసాయిదా ప్రతిని వచ్చే సోమవారానికల్లా తమ కార్యాలయానికి పంపాలని సూచించారు. ఎన్ఫోర్స్మెంట్ ఏజన్సీల సమన్వయంతో అక్రమ నగదు, లిక్కరు, ఇతర నిషేధిత సామగ్రి రవాణాపై ప్రత్యేక దృష్టి ఉంచాలన్నారు. కేవలం రాష్ట్ర సరిహద్దుల్లోనే కాకుండా జిల్లాల్లోనూ అక్రమ కార్యకలాపాలపై నిఘా ఉంచాలన్నారు. ఇందుకు సంబందించిన నివేదికలను తమకు సకాలంలో పంపాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు సీఈవోలు పి. కోటేశ్వరరావు, ఎమ్.ఎన్. హరేంధిర ప్రసాద్, డిప్యూటీ సీఈవోలు ఎస్.మల్లిబాబు, కె.విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికలతో సంబంధం ఉన్న .. అధికారులను 25లోగా బదిలీ చేయండి
సాక్షి, అమరావతి: ఒకే ప్రాంతంలో మూడేళ్లు సర్వీసు పూర్తి చేసుకుని, ఎన్నికల విధులతో సంబంధం ఉన్న అధికారులు, సిబ్బందిని ఈ నెల 25వ తేదీలోగా బదిలీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డా. కేఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. త్వరలో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో కల్పించాల్సిన సౌకర్యాలు, సిబ్బంది ఖాళీల భర్తీ, బదిలీలు తదితర అంశాలపై ఆయన సోమవారం రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా, సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. పోలింగ్ కేంద్రాల్లో కల్పించాల్సిన కనీస సౌకర్యాలు, ముఖ్యంగా విభిన్న ప్రతిభావంతులైన ఓటర్ల కోసం ర్యాంపులు వంటివి కల్పించాలని పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, విద్యా తదితర శాఖల అధికారులను ఆదేశించారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం, ఇతర నిషేధిత వస్తువుల అక్రమ రవాణా నియంత్రణతో పాటు పటిష్ట నిఘాకు ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులను వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, జిల్లా ఎన్నికల అధికారుల (కలెక్టర్లు) కార్యాలయాల్లో ఖాళీల భర్తీకి త్వరగా చర్యలు తీసుకోవాలని సీఈవో, సీసీఎల్ఏను ఆదేశించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా మాట్లాడుతూ బదిలీ చేయాల్సిన అధికారులు, సిబ్బందిని గుర్తించామని, ఇప్పటికే కొందరిని బదిలీ చేశామని తెలిపారు. ముఖ్యంగా రెవెన్యూ, మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఎక్సైజ్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్), పోలీస్ శాఖల్లో మూడు రోజుల్లోగా బదిలీలు పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎక్సైజ్ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, అదనపు డీజీపీ (శాంతి భద్రతలు) ఎస్.బాగ్చి, సీడీఎంఏ వివేక్ యాదవ్, సెబ్ డైరెక్టర్ ఎం.రవిప్రకాశ్, ఐజీ రవీంద్ర బాబు, అదనపు సీఈవో కోటేశ్వరరావు, సంయుక్త కార్యదర్శులు ప్రభాకర్ రెడ్డి, నిషాంతి పాల్గొన్నారు. ఆ ఫైళ్లను ముందుగా ఆర్థిక శాఖకు పంపాలి: సీఎస్ సచివాలయ బిజినెస్ రూల్స్ ప్రకారం నిర్దిష్ట అంశాల ఫైళ్లను ముందుగా ఆర్థిక శాఖకు పంపించి అనుమతి తీసుకోవాలని సీఎస్ డా. కేఎస్ జవహర్ రెడ్డి అన్ని శాఖలను ఆదేశించారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగాల భర్తీ, పదోన్నతులు, బడ్జెట్, ప్రాజెక్టు పనులు, సవరించిన అంచనాలు, విధానపరమైన అంశాల ఫైళ్లను ముందుగా ఆర్థిక శాఖకు పంపించి అనుమతి తీసుకోవాలని చెప్పారు. ఇటీవల ఈ నిబంధనలకు విరుద్ధంగా కొన్ని శాఖలు వ్యవహరిస్తున్నాయని తెలిపారు. పరిపాలన అనుమతులు మంజూరు చేసిన తరువాత ఆర్థిక శాఖకు ఫైళ్లు పంపిస్తున్నట్లు గుర్తించామన్నారు. ఉద్యోగుల నియామకాలు, పదోన్నతులు, బడ్జెట్ మంజూరు, నిధుల విడుదల, అదనపు నిధులు, ప్రొక్యూర్మెంట్ ప్రాజెక్టులు, పనులు, సర్వీసెస్ పరిపాలన అనుమతులు, సవరించిన అంచనాలు, కార్యక్రమాలు, పథకాలు, ఇన్స్టిట్యూషన్స్, విధానపరమైన అంశాలు, చట్టాలు, జీవోలు, విధివిధానాల మార్గదర్శకాలకు సంబంధించిన ఫైళ్లను తప్పనిసరిగా ఆర్థిక శాఖకు పంపి, అనుమతి పొందాలని పేర్కొన్నారు. సంబంధిత శాఖల కార్యదర్శులు ఆర్థిక శాఖకు పంపే ఫైళ్లపై తగిన సిఫార్సులు కూడా చేయాలని, నిబంధనల మేరకు సంబంధిత అథారిటీ అనుమతి మేరకే ఫైళ్లు పంపుతున్నారా లేదా అనే విషయాలను కూడా ఫైళ్లలో స్పష్టంగా పేర్కొనాలన్నారు. ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చే ముందు అందుకు తగిన నిధులు ఉన్నాయా లేదా, సంబంధిత ఫైళ్లకు సంబంధించిన అంశాల వల్ల ప్రభుత్వ ప్రాధాన్యతలు నెరవేరుతాయా లేదా అనే విషయాలను పరిగణనలోకి తీసుకుంటుందని తెలిపారు. శాఖలు పంపే ప్రతిపాదనలు ఎఫ్ఆర్బీఎం పరిధిలో ఉన్నాయా లేదా, బడ్టెట్ కేటాయింపులున్నాయా లేదా అనే విషయాలను ఆ ర్థికశాఖ పరిగణనలోకి తీసుకుంటుందని తెలిపారు. -
Andhra Pradesh: ఏపీ ఓటర్లు 4.08 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,08,07,256కు చేరుకుంది. వీరిలో పురుష ఓటర్లు 2,00,74,322 మంది కాగా మహిళా ఓటర్లు 2,07,29,452, థర్డ్ జెండర్ 3,482 మంది ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. 2024 ఓటర్ల తుది జాబితాను సోమవారం ఆయన విడుదల చేశారు. గతేడాది అక్టోబర్ 27న విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాపై ఫిర్యాదులను జనవరి 11 వరకు స్వీకరించి ఇంటింటి సర్వే చేసి అనంతరం పూర్తి పారదర్శకంగా తుది జాబితాను విడుదల చేసినట్లు తెలిపారు. ప్రతి 1,500 మంది ఓటర్లకు ఒక పోలింగ్ స్టేషన్ ఉండేలా చర్యలు చేపట్టడంతో పోలింగ్ స్టేషన్లు మరో 214 పెరిగాయన్నారు. పోలింగ్ స్టేషన్ల సంఖ్య 46,165కి చేరింది. తాజాగా విడుదల చేసిన తుది జాబితాపై అభ్యంతరాలుంటే ఫిర్యాదు చేసేందుకు జనవరి 23 నుంచి సీఈవో కార్యాలయంలో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఓటర్ల జాబితాను https://electoralsearch.eci.gov.in/లో చూడొచ్చన్నారు. ఫారం 6 పూర్తి చేసి ఓటరుగా నమోదు చేసుకోవడానికి నామినేషన్ల చివరి రోజు వరకు అనుమతిస్తామని చెప్పారు. ముసాయిదాతో పోలిస్తే పెరుగుదల అక్టోబర్‌లో విడుదలైన ముసాయిదాతో పోలిస్తే తుది జాబితాలో నికరంగా 5,86,530 ఓటర్లు పెరిగారు. ముసాయిదాలో 4.02 కోట్లుగా ఉన్న ఓటర్ల సంఖ్య కొత్త ఓటర్ల చేరిక, తొలగింపుల తర్వాత 4.08 కోట్లకు చేరింది. సవరణ సందర్భంగా 22,38,952 మంది కొత్త ఓటర్లు నమోదయ్యారు. ముసాయిదా జాబితా సమయంలో 18–19 ఏళ్ల ఓటర్ల సంఖ్య 2,88,155గా ఉంటే తుది జాబితా వచ్చే సరికి ఈ సంఖ్య 8,13,544కు చేరింది. అంటే అదనంగా 5,25,389 మంది కొత్త యువ ఓటర్లు నమోదయ్యారు. ఇంటింటి సర్వే చేసి మరణించిన వారు, ఒక చోట కంటే ఎక్కువ చోట్ల ఓటు హక్కు ఉన్న వారిని గుర్తించడం ద్వారా 16,52,422 మంది ఓటర్లను తొలగించారు. 2019లో 3.93 కోట్లుగా ఉన్న ఓటర్ల సంఖ్యతో పోలిస్తే ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో అదనంగా 15 లక్షల మంది కొత్త ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 6.55 లక్షల మంది మహిళా ఓటర్లు అదనం రాష్ట్రంలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 6,55,130 మంది అదనంగా ఉన్నారు. పురుష ఓటర్ల సంఖ్య 2,00,74,322 కాగా మహిళా ఓటర్లు 2,07,29,452 మంది ఉన్నారు. ప్రతి వెయ్యి మంది పురుష ఓటర్లకు 1,036 మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. శ్రీకాకుళం మినహా మిగిలిన 25 జిల్లాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో పురుష ఓటర్ల సంఖ్య 9,37,988 కాగా దానికంటే కొద్దిగా తక్కువగా 9,37,883 మంది మహిళా ఓటర్లున్నారు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 20,16,396 మంది ఓటర్లు ఉంటే అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 7,61,538 మంది ఓటర్లు ఉన్నారు. పూర్తి పారదర్శకంగా జాబితా జనవరి 2022 నుంచి తొలగించిన ఓటర్లను ఇంటింటి సర్వే ద్వారా పరిశీలించి వంద శాతం ఆధారాలను సేకరించిన తరువాతే సవరణ చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఈ సమయంలో 21,18,940 ఓటర్లను తొలగించగా కేవలం 13,061 కేసుల్లో మాత్రమే నిబంధనలు పాటించలేదని, వాటిని నిబంధనలకు అనుగుణంగా సవరించామని పేర్కొంది. సున్నా ఇంటి నెంబర్‌పై 2,51,767 ఇళ్లు, ఒకే ఇంటి నెంబర్‌పై పది కంటే ఎక్కువ ఓట్లు ఉన్న 1,57,939 ఇళ్లను గుర్తించి ఆగస్టు, సెప్టెంబర్‌లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి సవరణ చేసినట్లు తెలిపింది. జీరో నెంబర్ ఇంటి కేసులను 97 శాతం సవరణ చేయగా పది కంటే ఎక్కువ ఓట్లున్న ఇళ్ల సంఖ్యలో 98 శాతం పరిష్కరించినట్లు తెలిపింది. ఓట్ల తొలగింపు, డూప్లికేటు ఓట్లు, మరణాలు, చిరునామా మార్పు లాంటి వాటిపై రాజకీయ పార్టీల నుంచి 14,48,516 ఫిర్యాదులు రాగా అందులో 5,64,497 కేసులు అర్హత ఉన్నవిగా గుర్తించి వాటిని తొలగించినట్లు పేర్కొంది. కొన్ని నియోజకవర్గాల్లో ఒక్కరే పెద్ద మొత్తంలో ఓట్ల తొలగింపు, చేర్పులకు దరఖాస్తు చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయని, ఇలా బల్క్‌గా దరఖాస్తులు సమర్పించిన 70 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించినట్లు స్పష్టం చేసింది. ఒకే కుటుంబంలోని ఓట్లు వేరువేరు చోట్ల నమోదైన కేసులను గుర్తించి వాటిని సవరించామని, ఈ విధంగా విశాఖలో 26,000 ఓట్లను సవరణ చేయగా, ఎన్టీఆర్ జిల్లాలో 2,27,906 ఓటర్లను సవరించినట్లు తెలిపింది. నెల్లూరు, గుంటూరు, కాకినాడ జిల్లాల్లో కూడా చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. వారికి ఇంటివద్దే ఓటు హక్కు 80 ఏళ్లు దాటిన వారు, దివ్యాంగులు, కోవిడ్ సోకిన వారు ఈ ఎన్నికల్లో ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. రానున్న సాధారణ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్న వారిలో 80 ఏళ్లు దాటిన వారు 5,76,791 మంది ఉండగా, దివ్యాంగులు 4,87,594 మంది ఉన్నారు. ఇటీవలే పొరుగు రాష్ట్రాల్లో ఓటు హక్కు వినియోగించుకుని ఇప్పుడు ఏపీలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి దరఖాస్తు చేసుకునే ఓటర్ల విషయంలో జిల్లా ఎన్నికల అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేసిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడే నివాసం ఉంటున్నట్లు (ఆర్డినరీ రెసిడెన్స్) ధృవపత్రం ఇచ్చిన వారు మాత్రమే ఓటరుగా చేరడానికి అర్హులని, తప్పుడు ధృవపత్రాలు ఇచ్చిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పది రోజులు ముందు దాకా.. ఎన్నికల వరకు ఓటర్ల నమోదు, తొలగింపు ప్రక్రియ చేపడుతూనే ఉంటామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. ఎన్నికల తేదీకి పది రోజుల ముందు వరకు అందిన వివరాలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. ఓటర్ల తుది జాబితా ప్రకటించిన నేపథ్యంలో సోమవారం గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సచివాలయంలో సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబితాలో సందేహాలు, ఉంటే అధికారుల దృష్టికి తీసుకు వెళ్లాలని రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. -
ఎన్నికల పటిష్ట నిర్వహణకు కార్యాచరణ
సాక్షి, అమరావతి: రానున్న సాధారణ ఎన్నికల సక్రమ నిర్వహణకు వీలుగా సంబంధిత శాఖలు ఇప్పటి నుంచే తగిన కార్యాచరణను సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కేఎస్ జవహర్‌రెడ్డి ఆదేశించారు. ఎన్నికల సన్నద్ధతపై రాష్ట్ర సచివాలయంలో గురువారం ఆయన వివిధ విభాగాల అధికారులతో సమీక్షించారు. రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు సహా ఎన్నికల విధులతో నేరుగా సంబంధమున్న వివిధ విభాగాల అధికారుల ఖాళీల భర్తీతోపాటు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం, జిల్లా ఎన్నికల అధికారుల కార్యాలయాల్లో అవసరమైన సిబ్బంది కేటాయింపు తదితర అంశాలపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) ముఖేష్‌కుమార్ మీనాతో సీఎస్ జవహర్‌రెడ్డి ఈ సమావేశంలో చర్చించారు. అలాగే, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల నిర్వహణతో సంబంధం ఉండి ఒకే ప్రాంతంలో మూడు నాలుగేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న అధికారుల తప్పనిసరి బదిలీ, కొత్తవారికి పోస్టింగులు వంటి వాటిపై కూడా వెంటనే చర్యలు తీసుకోనున్నట్లు జవహర్‌రెడ్డి తెలిపారు. పోలింగ్ కేంద్రాల వారీగా ఉండాల్సిన కనీస సౌకర్యాలకు సంబంధించిన అంశాలపైనా సమీక్షించారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులు.. ఇక రానున్న ఎన్నికల్లో డబ్బు, మద్యం వంటి అక్రమ రవాణా నియంత్రణకు సంబంధిత శాఖల అధికారులు, సిబ్బందితో అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో పటిష్టమైన ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టుల ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపైనా సీఎస్ జవహర్‌రెడ్డి సమీక్షించారు. ముఖ్యంగా ఏపీ, ఒడిశా రాష్ట్ర అధికారులతో త్వరలో ఒక సమావేశం నిర్వహించాలని.. దీనిపై ఒడిశా సీఎస్‌తో తాను మాట్లాడతానన్నారు. అలాగే, ఎన్నికలు అత్యంత పారదర్శకంగా సజావుగా నిర్వహించాల్సిన ప్రక్రియని.. కాబట్టి ప్రతి ఒక్కరూ అత్యంత బాధ్యతాయుతంగా పనిచేయాల్సి ఉంటుందని.. ఆ దిశగా సంబంధిత శాఖలన్నీ ఎన్నికల కసరత్తు మొదలుపెట్టాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. 9, 10 తేదీల్లో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర పర్యటన.. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా మాట్లాడుతూ.. ఎన్నికల సన్నాహక ఏర్పాట్లపై సమీక్షకు కేంద్ర ఎన్నికల సంఘం రెండ్రోజుల పర్యటన నిమిత్తం ఈనెల 9న రాష్ట్రానికి రానుందని తెలిపారు. 10న విజయవాడలో సీఎస్, డీజీపీ, సీఈఓ సహా ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, ఆర్ అండ్ బీ, అటవీ, విద్యా తదితర శాఖల ఉన్నతాధికారులతో సమీక్షిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో 46,165 పోలింగ్ కేంద్రాలున్నాయని.. వాటిలో ఉండాల్సిన కనీస సౌకర్యాలు కోసం తీసుకోవాల్సిన చర్యలపై సీఎస్ దృష్టికి తీసుకొచ్చి వీటిపై జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లకు తగిన ఆదేశాలు జారీచేయాల్సి ఉందని సీఎస్‌కు చెప్పారు. అలాగే, వివిధ పోలింగ్ కేంద్రాల్లో విభిన్న ప్రతిభావంతులకు ఏర్పాటుచేయాల్సిన సౌకర్యాలపైనా ఆదేశాలివ్వాల్సి ఉందన్నారు. రాష్ట్ర ఎన్నికల కార్యాలయం, జిల్లా ఎన్నికల అధికారుల కార్యాలయాల్లో ఎన్నికల విధుల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని డిప్యుటేషన్‌పై నియమించాల్సి ఉందని సీఈఓ చెప్పగా.. వెంటనే తగిన ప్రతిపాదనలు పంపాలని సీఎస్ జవహర్‌రెడ్డి కోరారు. ఇంకా ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇతర అంశాలపైనా సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, చీఫ్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ గిరిజాశంకర్, అదనపు పీసీసీఎఫ్ విజిలెన్స్ గోపీనాథ్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డైరెక్టర్ ఎం. రవిప్రకాశ్, రవాణా శాఖ కమిషనర్ మణీష్కుమార్ ఎస్ఎల్బీసీ కన్వీనర్ తదితర అధికారులు పాల్గొన్నారు. ఆదే విధంగా.. ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు బి. రాజశేఖర్, రజత్ భార్గవ, ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, కమిషనర్, స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కె.భాస్కర్, సీడీఎంఏ కోటేశ్వరరావు తదితరులు వర్చువల్‌గా పాల్గొన్నారు. చెక్‌పోస్టులో నిఘా మరింత ముమ్మరం.. రాష్ట్ర ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఎం. రవిప్రకాశ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో 29 ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులున్నాయని, వాటిని పటిష్టంగా నిర్వహించడం ద్వారా డబ్బు, మద్యం, గంజాయి ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా నివారణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. వీటితో పాటు రాష్ట్రంలో 76 పోలీసు చెక్‌పోస్టులు, 14 అటవీ చెక్ పోస్టులున్నాయని వీటన్నింటి ద్వారా నిఘాను మరింత ముమ్మరం చేయనున్నట్లు ముఖేష్‌కుమార్ చెప్పారు. -
మూడేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న అధికారులను బదిలీ చేయాలి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో పాల్గొనే అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లపై కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా తక్షణం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. సంబంధిత శాఖాధిపతులు, కార్యదర్శులు వెంటనే చర్యలు తీసుకుని ఈ నెల చివరి వారంలోగా బదిలీలు, పోస్టింగ్‌ల ప్రక్రియను పూర్తిచేయాలని సూచించారు. ఈ నెలాఖరుకల్లా బదిలీల, పోస్టింగ్‌ల నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించాల్సి ఉంటుందని తెలిపారు. మూడేళ్లు ఒకచోట, ఒకే జిల్లాలో పనిచేస్తున్న అధికారులను బదిలీలు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో పాల్గొనే అధికారులందరికీ ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపారు. ఆ ఉత్తర్వుల మేరకు.. ♦ నాలుగు సంవత్సరాల్లో.. జిల్లాలో మూడు సంవత్సరాలు పూర్తిచేసిన అధికారులు, లేదా ఈ ఏడాది జూన్ 30 లేదా అంతకుముందు 3 సంవత్సరాలు పూర్తిచేసుకున్న ఉద్యోగులను మరో జిల్లాకు బదిలీ చేయాలి. ♦ ఎన్నికలకు సంబంధం ఉన్న ఏ అధికారిని సొంత జిల్లాలో కొనసాగించడానికి వీల్లేదు. ♦ జిల్లా అధికారులతో పాటు నిర్దిష్టంగా ఎన్నికల విధులకు నియమించిన జిల్లా ఎన్నికల అధికారులు, ఉప ఎన్నికల అధికారులు, ఏఆర్వోలు, ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, నోడల్ అధికారులతో పాటు డిప్యూటీ కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, తహసీల్దార్లు, బ్లాక్ డెవలప్మెంట్ అధికారులతో సహా ఇంకా ఎన్నికలకు సంబంధించిన అధికారులందరికీ బదిలీల నిబంధనలు వర్తిస్తాయి. మున్సిపల్ కార్పొరేషన్, డెవలప్మెంట్ అథారిటీ అధికారులకు కూడా బదిలీల నిబంధనలు వర్తిస్తాయి. ♦ పోలీసుశాఖకు కూడా బదిలీల నిబంధనలు వర్తిస్తాయి. అదనపు డీజీలు, ఐజీలు, డీఐజీలు, రాష్ట్ర ఆర్మ్డ్ పోలీసులు, ఎస్ఎస్పీలు, ఎస్పీలు, అదనపు ఎస్పీలు, సబ్ డివిజనల్ హెడ్ ఆఫ్ పోలీసు, ఎస్‌హెచ్‌వోలు, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, జిల్లాస్థాయిలో ఎన్నికల బందోబస్తుకు ఉపయోగించే పోలీసు బలగాలకు వర్తిస్తాయి. ♦ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్లను వారి స్వంత జిల్లాలో నియమించకూడదు. ♦ ఒక పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ నాలుగేళ్లలో 3 సంవత్సరాల పదవీకాలాన్ని పూర్తిచేస్తే మరో పోలీసు సబ్ డివిజన్‌కు బదిలీ చేయాలి. ఆ సబ్ డివిజన్ అంతకుముందు పనిచేసిన అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉండకూడదు. లేదంటే మరో జిల్లాకు బదిలీ చేయాలి. ♦ ఎక్సైజ్ అధికారులకు బదిలీ నిబంధనలు వర్తిసాయి. సబ్ ఇన్స్పెక్టర్, అంతకంటే ఎక్కువ ర్యాంక్ ఉన్న రాష్ట్రంలోని ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ అధికారులకు కూడా బదిలీల నిబంధనలు వర్తిస్తాయి. ♦ఎన్నికలతో నేరుగా సంబంధం లేని వైద్యులు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు బదిలీలుండవు. అయితే వారిలో ఎవరైనా రాజకీయ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు వస్తే.. విచారణలో రుజువైతే.. అటువంటి అధికారిని బదిలీ చేయమని ఆదేశించడంతోపాటు శాఖాపరమైన చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘం సిఫార్సు చేస్తుంది. ♦ గతంలో కేంద్ర ఎన్నికల సంఘం క్రమశిక్షణ చర్యలకు సిఫార్సు చేసి పెండింగ్‌లో ఉన్న అధికారులు లేదా గతంలో ఎన్నికలకు సంబంధించి ఏదైనా తప్పుపట్టిన, అభియోగాలు మోపిన అధికారులకు ఎన్నికలకు సంబంధించి ఎలాంటి విధులను అప్పగించకూడదు. గతంలో ఎన్నికల సమయంలో బదిలీ చేసిన అధికారులు ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదు. ♦ అధికారిక పనితీరుకు సంబంధించిన క్రిమినల్ కేసు ఏదైనా న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉంటే అలాంటి అధికారులు ఎన్నికల సంబంధిత విధుల్లో ఉండకూడదు. ♦ ఆరునెలల్లో పదవీ విరమణ చేయనున్న అధికారులు ఎవరైనా ఎన్నికల సంబంధిత పోస్టులో ఉంటే ఆ వ్యక్తిని ఆ విధుల నుంచి తప్పించాలి. అలాంటి వారిని బదిలీ చేయాల్సిన అవసరం లేదు. ♦ పదవీ విరమణ తరువాత వివిధ హోదాల్లో తిరిగి నియమించిన, పొడిగింపులపై ఉన్న అధికారులు ఎన్నికల సంబంధిత విధుల్లో ఉండకూడదు. ♦ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఉన్న అధికారులకు సంబంధించిన బదిలీ ఉత్తర్వులు ఏమైనా ఉంటే సంబంధిత ప్రధాన ఎన్నికల అధికారిని సంప్రదించి ఓటర్ల జాబితా తుది ప్రచురణ తర్వాత మాత్రమే బదిలీలు అమలు చేయాలి. ఏదైనా అసాధారణ కారణాల వల్ల బదిలీ చేయాల్సి వస్తే కేంద్ర ఎన్నికల సంఘం ముందస్తు అనుమతి తీసుకోవాలి. బదిలీలపై ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని సంప్రదించడంతో పాటు బదిలీ ఉత్తర్వులను ఆయనకు ఇవ్వాలి. ♦ ఎన్నికల సంబంధిత అధికారులందరూ ప్రస్తుత ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల్లో ఎవరికీ దగ్గర బంధువు కానని డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. క్రిమినల్ కేసుల వివరాలను నిర్ధారించిన నమూనాపత్రంలో సమర్పించాలి. ఏ అధికారి అయినా తప్పుడు సమాచారం ఇస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. ఈనెల 9న రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల సంఘం సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్, కమిషనర్లు అనూప్‌చంద్ర పాండే, అరుణ్ గోయల్ ఈ నెల 9వ తేదీన ఏపీకి రానున్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియతో పాటు ఈవీఎంల సన్నద్ధత, ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇతర ఏర్పాట్లపై 9, 10 తేదీల్లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్, కమిషనర్లు సమీక్షిస్తారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు, కలెక్టర్లు, ఎస్పీలతో కేంద్ర ఎన్నికల సంఘం సమీక్షలు నిర్వహించనుంది. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుకు తీసుకోవాల్సిన చర్యలు, చెక్‌పోస్టుల ఏర్పాటు, మద్యం, నగదు పంపిణీలను నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర ఉన్నతాధికారులకు మార్గనిర్దేశం చేయనుంది. -
AP: ఎన్నికల ప్రధాన అధికారిని కలిసిన వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాని వైఎస్సార్సీపీ నేతలు బుధవారం కలిశారు. ఓటర్ల జాబితా అవకతవకలు, టీడీపీ నేతల అక్రమాలపై ఫిర్యాదు చేశారు. ఎలక్ట్రోరల్ ఆఫీసర్ని కలిసిన వారిలో మంత్రులు మేరుగ నాగార్జున, జోగి రమేష్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఉన్నారు. -
జనాభా పెరుగుదలకు తగ్గట్లుగా ఓటర్లు పెరగలేదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఓటర్ల పెరుగుదల నమోదు కాలేదని.. ఈ విషయంపై ఎన్నికల కమిషన్ విచారణ జరపాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరింది. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి పేర్ని నాని సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌కుమార్ మీనాను గురువారం కలిసి వినతిపత్రం అందించారు. రాష్ట్రంలో 2014 నుండి 2019 వరకు, 2019 నుండి 2023 వరకు రాష్ట్రంలో నమోదైన ఓటర్ల సంఖ్య హెచ్చుతగ్గులకు సంబంధించిన వివరాలను ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 2014 నుంచి 2019 వరకూ ఓటర్ల జాబితాలో 30,08,032 ఓట్లు పెరిగాయని.. కానీ, 2019 నుంచి 2023 కాలంలో 38 వేల ఓట్లు తగ్గాయని వివరించారు. అదే విధంగా.. ఓటర్ల వృద్ధి చూసినట్లయితే 2014–19 మధ్య కాలంలో 8.1 శాతం మేర వృద్ధి నమోదైందని.. 2019 నుంచి 2023 మధ్య 0.09 శాతం క్షీణత నమోదైందని తెలిపారు. గతేడాది కంటే 2023లో నికర ఓట్ల సంఖ్య తగ్గిందని, దీనిని బట్టి నకిలీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయని స్పష్టమవుతోందన్నారు. 2019 ఓటర్ల జాబితా నుండి నకిలీ ఓట్లను తొలగించే అంశాన్ని పరిశీలించి, నకిలీ ఓట్ల విషయంపై సమగ్ర విచారణ జరపాలని పేర్ని నాని కోరారు. అలాగే, 2014–2023 మధ్య జనాభా వృద్ధి రేటు 1.1 శాతం వుందని, ఈ విధంగా చూస్తే నికర ఓటర్ల సంఖ్య పెరగాలి కానీ తగ్గడంపై తమకు అనుమానాలున్నాయన్నారు. దీనికి కారణం 2014–19 సమయంలో తెలుగుదేశం పార్టీ పెద్దఎత్తున దొంగ ఓట్లను చేర్చడమే ప్రధాన కారణమని ఆయన ఆరోపించారు. -
ప్రతి ఓటరూ ఆధార్‌తో లింక్!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి ఓటరునూ ఆధార్‌తో అనుసంధానం చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) ముఖేష్‌కుమార్ మీనాకు మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) విజ్ఞప్తి చేశారు. దీనివల్ల దొంగ ఓట్లను పూర్తిగా నివారించడంతోపాటు ఒకే వ్యక్తికి రెండు మూడు చోట్ల ఓట్లు ఉండకుండా అడ్డుకట్ట వేయవచ్చని తెలిపారు. మంగళవారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో సీఈవో ముఖేష్‌కుమార్ మీనాను మాజీ మంత్రులు పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్‌కుమార్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, కైలే అనిల్‌కుమార్, పార్టీ నేత దేవినేని అవినాశ్‌తో కూడిన వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందం కలిసింది. ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఫిర్యాదు చేసిన అనంతరం మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. చాలా చోట్ల డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని, ఒకే ఫోటో లేదా ఒకే పేరు, ఒకే ఓటర్ ఐడీతో చాలా ఓట్లు ఉన్న విషయాన్ని సీఈవో దృష్టికి తెచ్చామన్నారు. ఒక మనిషికి ఒకే ఓటు ఉండాలని వైఎస్సార్సీపీ కోరుకుంటోందన్నారు. ప్రతి ఓటరునూ ఆధార్‌తో అనుసంధానం చేయాలన్న తమ విజ్ఞప్తిపై సీఈవో సానుకూలంగా స్పందించారని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి వినతిపత్రమిస్తున్న వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందం అక్రమాలు టీడీపీ సర్కార్ నిర్వాకాలే.. ఓటర్ల జాబితాలను ప్రభుత్వం మార్చేస్తోందంటూ గత 15 రోజులుగా ఈనాడు, ఆంధ్రజ్యోతితోపాటు టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. 2017, 2018, 2019 ఓటర్ల జాబితాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు 2023లో ఓటర్ల జాబితా ఎలా ఉందనే విషయాన్ని సీఈవోకి ఉదాహరణలతో సహా తెలియచేశాం. పేరులో చిన్న మార్పు, అడ్రస్‌లో చిన్న మార్పుతో ఒకే మనిషికి రెండు, మూడు ఓట్లు ఉన్నాయి. అలా 59,18,631 ఓట్లు ఉన్నట్లు 2019 ఎన్నికలకు ముందే వైఎస్సార్సీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఇవాళ 2023 జాబితాను చూస్తే పేరు, చిరునామాలో చిన్న మార్పులు, ఫోటోల మార్పుతో.. ఒకే మనిషికి రెండు మూడు చోట్ల దాదాపు 40 లక్షల ఓట్లు ఉండగా.. తెలంగాణ, ఏపీలో రెండు చోట్లా ఓట్లున్న వారు దాదాపు 16.59 లక్షల మంది ఉన్నారు. ► 9,242 ఇళ్లలో 20 నుంచి 30 ఓట్ల వరకు ఉండగా 2,643 ఇళ్లలో 31 నుంచి 40 ఓట్ల వరకు ఉన్నాయి. 1,223 ఇళ్లలో 41–50 ఓట్లున్నాయి. ఇంకా 1,614 ఇళ్లలో 51–100 వరకు ఓట్లున్నాయి. 386 ఇళ్లలో 101–200 ఓట్లున్నాయి. 96 ఇళ్లలో 201 నుంచి ఏకంగా 500 వరకు ఓట్లున్నాయి. 14 ఇళ్లలో 501 నుంచి 1,000 ఓట్ల దాకా ఉన్నాయి. ఇవన్నీ 2019 ఓటర్ల జాబితాలో కూడా ఉన్నాయి. ఇక ఏ డోర్ నెంబరూ లేకుండా ఎక్కడెక్కడ ఎన్ని ఓట్లున్నాయో కూడా సీఈవోకు వివరించాం. 2019లో కూడా ఆ ఓట్లపై చర్యలు తీసుకోవాలని మేం కోరినా అప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వీటన్నింటిపై సమగ్ర దర్యాప్తు జరిపి ఓటర్ల జాబితాను సవరించాలని సీఈవోను కోరాం. నాడు కళ్లు మూసుకున్నావా రామోజీ? ► ఒకే డోర్ నెంబరుతో 500 ఓట్లున్నాయని ఈనాడు రామోజీరావు మమ్మల్ని నిందిస్తున్నారు. 2019 ఓటర్ల జాబితా ప్రకారం విజయవాడ సూర్యారావుపేట పోలింగ్ బూత్‌ను పరిశీలిస్తే కడియాలవారి వీధి పేరుతో ఉన్న డోర్ నెంబర్లో 2019లో కూడా 500 ఓట్లు ఉన్నాయి. మరి ఆ ఆషాఢభూతి ఇప్పుడు కొత్తగా ఓట్లు చేర్చారని మాపై ఆరోపణలు చేస్తున్నారు. పాపాలు చేసింది వారైతే నిందలు మోపేది మాపైనా? ► రేపల్లెలో ఎడాపెడా దొంగ ఓట్లున్నాయని ఒక పేపర్లో రాశారు. నిజానికి అది 2019 నాటి ఓటర్ల జాబితా. అప్పుడే అవకతవకలు చేశారు. ఒకే డోర్ నెంబర్లో 148 ఓట్లు న్నాయి. జర్నలిస్టుల ముసుగులో కుల పత్రికలు తప్పుడు వార్తలు రాస్తున్నాయి. ఆ అవకతవకలన్నీ 2019 ఓటర్ల జాబితాలో ఉన్నాయి. మరి ఆనాడు ఎందుకు వార్తలు రాయలేదు? ► పార్వతీపురం నియోజకవర్గంలో సున్నా నెంబర్ ఇంట్లోనూ వందల సంఖ్యలో ఓటర్లు ఉన్నారు. మరి ఆనాడు మీకు ఇవేవీ కనిపించలేదా? ధృతరాష్ట్రుడిలా రామోజీకి కళ్లు కనిపించలేదా? ► 2019లోనే ఓటర్ల జాబితాల్లో అవకతవకలు జరిగాయి. అప్పుడే మేం వాటిపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. వాటిని ఇప్పుడు మేం సవరిస్తుంటే దొంగ ఓట్లు చేరుస్తున్నామంటూ నిందిస్తున్నారు. జాబితాలో పెరిగిందెక్కడ? రాష్ట్రంలో 2019 జనవరి నాటికి 3,98,34,776 మంది ఓటర్లు ఉండగా 2023 జనవరి నాటికి 3,97,96,678 మంది ఓటర్లున్నారు. మరి అలాంటప్పుడు మేం కొత్తగా ఓటర్లను ఎక్కడ చేర్పించినట్లు? మేం నిజంగా ఆ పని చేసి ఉంటే ఓటర్ల సంఖ్య పెరగాలి కదా? గజదొంగ చంద్రబాబు దొంగతనాలు చేసి నీతికధలు చెబుతున్నాడు. ఓటమి భయంతో మాపై ఆరోపణలు చేస్తున్నాడు. ప్రజలను కాకుండా కుట్ర రాజకీయాలను నమ్ముకున్న చంద్రబాబును సమర్థిస్తూ ఈనాడు, ఆంధ్రజ్యోతి తప్పుడు వార్తలు రాస్తున్నాయి. డూప్లికేట్లనే తొలగించామని సీఈవోనే చెప్పారు ► వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దొంగ ఓట్లను గుర్తించి 2020లో 1,85,193 ఓట్లను తొలగించింది. 2021లో 1,11,076 ఓట్లు, 2022లో 11.23 లక్షల ఓట్లు వెరసి మొత్తం 14 లక్షలకు పైగా దొంగ ఓట్లను తొలగించారు. డూప్లికేట్ ఓట్లు, ఒకే ఫోటో ఉన్న ఓట్లకు సంబంధించి 10,52,326 ఓట్లను తొలగించినట్లు సీఈవోనే స్వయంగా మీడియాకు చెప్పారు. ఒకవేళ మేం దొంగ ఓట్లను చేర్పిస్తే ఇలా తొలగిస్తామా? ఆ నీచ రాజకీయం బాబుదే.. రాష్ట్రంలో 2019 ఓటర్ల జాబితాలే ఇవాళ్టికి కూడా కొనసాగుతున్నాయి. ఆ లోపాలను సవరించమని మేం కోరుతున్నాం. దొంగ ఓట్లను చేర్చడం.. అవతల పార్టీ ఓట్లను తొలగించడం చంద్రబాబుకే అలవాటు. తప్పుడు మార్గాల్లో గెలవాలని ప్రయత్నించడం ఆయనకు ఆనవాయితీ. ► తెలంగాణకు చెందిన బీజేపీ నేత బండి సంజయ్ కూడా మమ్మల్ని విమర్శిస్తున్నాడు. చంద్రబాబు కోసం ఆయన పని చేస్తున్నారు. ఎందుకీ దిక్కుమాలిన రాజకీయాలు? ► నాడు టీడీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే అంటే 2015 జనవరి నాటికి 22,76,714 మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. మరో ఏడాదిలో అంటే 2016లో 13,00,613 మంది ఓటర్లను తొలగించారు. 2017లో మరో 14,46,238 మందిని తొలగించారు. అలా మూడేళ్లలో టీడీపీ హయాంలో మొత్తం 50,23,565 మంది ఓటర్లను జాబితాల నుంచి తొలగించారు. ► సేవామిత్ర అనే యాప్ ద్వారా వైఎస్సార్సీపీ సానుభూతిపరులను గుర్తించి వారందరినీ ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. దానిపై మేం పోరాడాల్సి వచ్చింది. కోర్టులు, కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించి ఆ ఓట్లను తిరిగి చేర్పించే ప్రయత్నం చేశాం. -
ఒకే ఇంటి నంబరుపై అధిక ఓటర్లు తక్కువే.. డూప్లికేట్లను తొలగిస్తున్నాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉన్న మొత్తం ఓటర్లతో పోలిస్తే ఒకే ఇంటి నంబర్‌పై అధిక ఓటర్లు నమోదైన సంఖ్య చాలా తక్కువని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. ఒకే ఇంట్లో 500 కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న ఆరు ఇంటి నంబర్లను గుర్తించామన్నారు. 2018కు ముందు నుంచే ఇలా ఉందని చెప్పారు. పట్టణాల్లో అపార్ట్మెంట్లలో నివసించేవారు ఒకటే ఇంటి నంబరు, కొన్నిచోట్ల ఒకటే వీధి పేరు మీద ఓటర్‌గా నమోదు చేసుకోవడం వల్ల ఇలాంటి తప్పులు దొర్లాయని వెల్లడించారు. 50 కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న ఇళ్లు 2,100 ఉన్నాయని తెలిపారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3.98 కోట్ల ఓటర్లకుగానూ ఒకే రకమైన ఇంటి నంబర్లు కలిగినవారు 1.62 లక్షల మంది ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. వీటిని ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల సవరణ–2024 (ఎస్ఎస్ఆర్–2024) కార్యక్రమంలో పరిశీలించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. సోమవారం సచివాలయంలో మీనా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎస్ఎస్ఆర్–2024 షెడ్యూల్‌ను ప్రకటించారు. ఆధార్‌తో అనుసంధానించలేదు.. అలాగే రెండు, మూడు చోట్ల ఒకరే ఓటర్లుగా ఉన్నవారిని గుర్తించామని మీనా తెలిపారు. వారు కోరుకున్న చోట ఓటు ఉంచి మిగిలిన చోట్ల రద్దు చేశామన్నారు. ఒకే ఫొటోతో రెండు, మూడు కార్డులున్న 15 లక్షల మంది ఓటర్లను గుర్తించి.. అందులో 10.20 లక్షల నకిలీ ఓటర్లను తొలగించామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఓటరు కార్డుతో ఆధార్ నంబర్‌ను లింక్ చేయలేదన్నారు. 80 శాతం మంది ఓటర్ల నుంచి ఆధార్ సమాచారం తీసుకున్నామే కానీ వాటిని ఇంకా అనుసంధానించలేదని స్పష్టం చేశారు. యువ ఓటర్ల నమోదుపై దృష్టి మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో యువ ఓటర్ల సంఖ్య చాలా తక్కువగా ఉందని ముకేశ్ కుమార్ మీనా చెప్పారు. వీరిని ఓటర్లుగా నమోదు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించామన్నారు. 18–19 ఏళ్ల వయసు ఉన్నవారు.. దేశ సగటు ప్రకారం చూస్తే రాష్ట్ర ఓటర్ల సంఖ్య ప్రకారం కనీసం 12 లక్షలు ఉండాలన్నారు. కానీ అది మన రాష్ట్రంలో 3.5 లక్షలకు మాత్రమే పరిమితమైందని తెలిపారు. జనవరి 1, 2024 నాటికి 18 ఏళ్లు నిండే వాళ్లు ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి అర్హులన్నారు. ఇందుకు ఎస్ఎస్ఆర్–2024ను వినియోగించుకోవాలని సూచించారు. ఎస్ఎస్ఆర్ కోసం జూలై 20 వరకు ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, బీఎల్వోలకు శిక్షణ ఇస్తామన్నారు. బీఎల్వోలు ఇంటింటా సర్వే చేశాక అక్టోబర్ 17న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేసి అన్ని రాజకీయపార్టీలకు అందిస్తామన్నారు. దీనిపై అభ్యంతరాలు, సూచనలను నవంబర్ 30 వరకు స్వీకరిస్తామని వెల్లడించారు. ఇందుకోసం అక్టోబర్ 28, 29, నవంబర్ 18, 19 తేదీల్లో ప్రత్యేకంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. వచ్చినఅభ్యంతరాలను డిసెంబర్ 26లోగా పరిష్కరించి వచ్చే ఏడాది జనవరి 5న తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తామని వివరించారు. రాజకీయ పార్టీలు సర్వేలో పాల్గొనాలి.. కాగా విజయవాడలో ఒకే ఇంటి నంబరుపై అధిక ఓటర్లు ఉన్నట్లు పత్రికల్లో వచ్చిన వార్తలపై విచారణ చేస్తున్నామని మీనా తెలిపారు. ఇలా 2018 నుంచి ఒకటే ఇంటి పేరు మీద అధిక ఓటర్లు ఉన్నట్లు తేలిందన్నారు. 2018లో 674 మంది ఓటర్లు ఉంటే 2019లో 675 మంది.. ఇప్పుడు 516 మంది ఓటర్లు ఉన్నారన్నారు. వీటిని పరిశీలించాక చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకు బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు) ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తారని చెప్పారు. ఈ క్రమంలో ఓటర్ల సవరణ చేస్తారన్నారు. ఈ సమయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు బీఎల్ఏలను నియమించుకొని బీఎల్వోలతో కలిసి సర్వేలో పాల్గొనాలని కోరారు. -
AP: ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
Live Updates: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మూడు గ్రాడ్యుయేట్, 2 టీచర్, 4 స్థానిక సంస్థలకు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. 16న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ►ఏలూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సజావుగా సాగుతోంది. ►మధ్యాహ్నం 12 గంటల వరకు 80.63% శాతం పోలింగ్ నమోదైంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1105 ఓట్లు ఉండగా, అందులో పోలైనవి 891 ఓట్లు. పోలింగ్ శాతం 80.63% నమోదైంది. ►జంగారెడ్డిగూడెం లో మొత్తం ఓట్లు :184 ,పోలైన ఓట్లు:153 ,... 83.15% పోలింగ్ శాతం నమోదు కొవ్వూరులో మొత్తం ఓట్లు: 242, పోలైన ఓట్లు: 225,... 92.98 నపోలింగ్ శాతం నమోదు నర్సాపురంలో మొత్తం ఓట్లు: 229 పోలైన ఓట్లు: 179,... 78.17 పోలింగ్ శాతం నమోదు ఏలూరులో మొత్తం ఓట్లు :249, పోలైన ఓట్లు:153,.. 61.45 పోలింగ్ శాతం నమోదు భీమవరం లో మొత్తం ఓట్లు : 201 పోలైన ఓట్లు:181 .. 90.05 పోలింగ్ శాతం నమోదు ► ఏలూరు జిల్లా: జంగారెడ్డిగూడెం మండల పరిషత్ కార్యాలయం లో ఎమ్మెల్సీ ఓటు ఉపయోగించుకున్న ఎమ్మెల్యే తెల్లం బలరాజు. ► తిరుపతి జిల్లా: నాయుడుపేట జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల పోలింగ్ స్టేషన్లో పోలింగ్ సరళిని పరిశీలించిన సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య. ► నెల్లూరు జిల్లా: కావలి జడ్పీ హైస్కూల్లో గ్రాడ్యుయేట్ ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి. ► విశాఖ నగరంలోని మద్దిలపాలెం కృష్ణా డిగ్రీ కళాశాల, ఎవిఎన్ కళాశాలలో పోలింగ్ కేంద్రాలని పరిశీలించిన విశాఖ సిపి శ్రీకాంత్. ► శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో గ్రాడ్యుయేట్ MLC ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి. ► అనంతపురం: ఉరవకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉరవకొండ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ► పశ్చిమగోదావరి జిల్లా: భీమవరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, ఎమ్మెల్సీ అభ్యర్థి వంకా రవీంద్ర నాథ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ► తిరుపతి జిల్లా: వెంకటగిరిలో ఎమ్మెల్సీ ఓటు హక్కును వినియోగించుకున్న నెల్లూరు జిల్లా గ్రంధాలయ సమస్త చైర్మన్ దొంతు శారద. ► ప్రకాశం జిల్లా: ఒంగోలు సెయింట్ థెరిసా స్కూల్ పోలింగ్ బూత్ వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. మహిళపై టీడీపీ కార్యకర్త దురుసుగా ప్రవర్తించాడు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు తిరగబడటంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గుంపులు గుంపులు గా ఉన్న జనాన్ని పోలీసులు చెదర గొట్టారు. ► శ్రీ సత్యసాయి జిల్లా: నల్లమాడ మండల కేంద్రంలో పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి దంపతులు గ్రాడ్యుయేట్ MLC ఓటు హక్కును వినియోగించుకున్నారు. ► అనంతపురం: కేఎస్ఆర్ కళాశాలలో ఎంపీ తలారి రంగయ్య ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు హక్కు వినియోగించుకున్నారు. ► అనంతపురం జిల్లా: కళ్యాణదుర్గంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంత్రి ఉషశ్రీచరణ్ పట్టభద్ర ఓటు హక్కును వినియోగించుకున్నారు. ► అనంతపురం నగరంలోని విద్యారణ్య పాఠశాలలో మున్సిపల్ మేయర్ మహమ్మద్ వసీం ఓటు హక్కును వినియోగించుకున్నారు. ► తిరుపతి టి.పి.పి.ఎం .కార్పొరేషన్ హైస్కూల్ లో మేయర్ డాక్టర్ శిరీష ,డాక్టర్ ముని శేఖర్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ► పశ్చిమగోదావరి జిల్లా: నర్సాపురం ఎండిఓ కార్యాలయంలో మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ అభ్యర్థి కౌరు శ్రీనివాస్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ► నెల్లూరు:DKW లోని పోలింగ్ కేంద్రంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ► తిరుపతి: సత్యనారాయణ పురం జడ్పీ హైస్కూల్ వద్ద టిడిపి నేత మబ్బు దేవనారాయణ రెడ్డిని పోలీసులుఅరెస్ట్ చేశారు. పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ పడటంతో అలిపిరి పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ► తిరుపతి: నగరంలోని సత్యనారాయణపురంలోని జడ్పీ హైస్కూల్ లో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ► అనంతపురం: రాజేంద్ర మున్సిపల్ పాఠశాలలో పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ► అనంతపురం: నెహ్రూ మున్సిపల్ పాఠశాలలో ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ► నెల్లూరు: DKWలో ఏఎస్పీ హిమవతి పోలింగ్ కేంద్రాలను పరిశీలించిచారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలపై నిరంతర నిఘా ఉంచామని వెల్లడించారు. ► ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ► మొత్తం 1,538 పోలింగ్ స్టేషన్లలో ఎమ్మెల్సీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ► సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరిగేందుకు పటిష్టమైన ఏర్పాట్లుచేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సోమవారం జరగనున్న తొమ్మిది ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉ.8 గంటల నుంచి సా.4 గంటల వరకు పోలింగ్ జరిగేందుకు పటిష్టమైన ఏర్పాట్లుచేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు. ఆదివారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం మొత్తం 1,538 పోలింగ్ స్టేషన్లను సిద్ధంచేసినట్లు తెలిపారు. మూడు పట్టభద్రులు.. రెండు టీచర్లు, మూడు స్థానిక సంస్థల నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 9 ఎమ్మెల్సీ స్థానాలకు సంబందించిన అభ్యర్థుల భవిష్యత్తును 10,59,420 మంది ఓటర్లు నిర్ణయించనున్నారు. ప్రతీ పోలింగ్ స్టేషన్లోను వెబ్‌కాస్టింగ్ ఏర్పాటుచేశామని, పోలింగ్ హాల్లోకి పోలీసులు, జర్నలిస్టులతో పాటు ఎవ్వరూ లోపలికి వెళ్లడానికి అనుమతిలేదని మీనా స్పష్టంచేశారు. 584 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించామని, ఇక్కడ మైక్రో అబ్జర్వర్లతోపాటు బయట వీడియోగ్రాఫర్‌ను కూడా ఏర్పాటుచేసినట్లు తెలిపారు. కడప–అనంతపురం–కర్నూలు పట్టభద్రుల నియోజకవర్గంలో అత్యధికంగా 49 మంది పోటీపడుతుండటంతో ఇక్కడ జంబో బ్యాలెట్ బాక్సులను తెలంగాణ నుంచి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఉ.7.30కు ఏజెంట్లు సమక్షంలో బ్యాలెట్ బాక్సుల సీలింగ్ జరుగుతుందని, 8 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమై సా.4 గంటల వరకు కొనసాగుతుందన్నారు. ఐదు స్థానాల్లో ఏకగ్రీవం.. మొత్తం 9 స్థానిక సంస్థల అభ్యర్థులకు ఎన్నికల నోటిఫికేషన్ జారీకాగా.. అందులో ఐదుచోట్ల కేవలం వైఎస్సార్సీపీ అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు వేశారు. దీంతో అనంతపురం లోకల్ అథారిటీ నుంచి ఎస్.మంగమ్మ, కడప పి. రామసుబ్బారెడ్డి, నెల్లూరు మేరిగ మురళీధర్, తూర్పుగోదావరి కుడుపూడి సూర్యనారాయణరావు, చిత్తూరు నుంచి సుబ్రమణ్యం సిపాయిల ఎన్నిక ఏకగ్రీవం అయినట్లు ప్రకటించామన్నారు. శ్రీకాకుళం లోకల్ అథారిటీ నుంచి ఇద్దరు, పశ్చిమ గోదావరిలో రెండు స్థానాలకు ఆరుగురు, కర్నూలులో ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక పట్టభద్రుల నియోజకవర్గాల్లో శ్రీకాకుళం–విజయనగరం–విశాఖ నుంచి 37 మంది, ప్రకాశం–నెల్లూరు–చిత్తూరు నుంచి 22, కడప–అనంతపురం–కర్నూలు నుంచి 49 మంది పోటీపడుతున్నారు. ప్రకాశం–నెల్లూరు–చిత్తూరు టీచర్ల నియోజకవర్గంలో 8మంది, కడప–అనంతపురం–కర్నూలు టీచర్ల నియోజకవర్గం నుంచి 12 మంది పోటీలో ఉన్నారు. వయొలెట్ పెన్ను మాత్రమే ఉపయోగించాలి మరోవైపు.. ఓటర్లకు స్లిప్పుల పంపిణీ ఇప్పటికే పూర్తయిందని, వీటితోపాటు ఎన్నికల సంఘం గుర్తింపు కార్డు లేదా, ఆథార్, పాన్, ప్రభుత్వ ఐడీ కార్డు, పాస్‌పోర్టు వంటి పది గుర్తింపు కార్డులు ఉంటేనే ఓటింగ్‌కు అనుమతించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌కుమార్ మీనా స్పష్టంచేశారు. బ్యాలెట్ పేపర్ విధానంలో ఎన్నికలు జరుగుతాయని.. పోటీలోని అభ్యర్థులకు ఎదురుగా వారి ప్రాధాన్యతా క్రమంలో నెంబర్లు మాత్రమే నమోదు చేయాల్సి ఉంటుందని, టిక్ లేదా ఇంటూ మార్కులు, సంఖ్యను పదాల్లో రాసినా, సంతకాలు చేసినా వాటిని చెల్లని ఓట్లుగా పరగణిస్తారని స్పష్టంచేశారు. పంపిణీ చేసిన ఓటరు స్లిపుల వెనుక ఓటు ఏ విధంగా వేయాలో వివరంగా పేర్కొన్నట్లు ఆయన తెలిపారు. అదే విధంగా.. బ్యాలెట్ పేపర్‌తోపాటు ఇచ్చే వయొలెట్ కలర్ పెన్నుతో మాత్రమే అంకెలు వేయాలని, ఇతర రంగులు, సొంత పెన్నులు వినియోగిస్తే ఆ ఓట్లను చెల్లని వాటిగా పరగణిస్తామని మీనా స్పష్టంచేశారు. బోగస్ ఓట్ల ఆరోపణలపై చర్యలు ఇక ఎన్నికల ప్రచార సమయంలో ఇప్పటివరకు రూ.77.48 లక్షల నగదు, 1,02,819.05 లీటర్ల మద్యాన్ని పట్టుకున్నట్లు మీనా తెలిపారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన కేసుల్లో 75 మందిని అరెస్టుచేశామన్నారు. అలాగే, మొత్తం 663 ఓట్లకు సంబంధించి మాత్రమే టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా ఇతర పార్టీల నుంచి ఫిర్యాదులు వచ్చాయని, ఇవన్నీ కూడా అత్యధికంగా తిరుపతి పట్టణ ప్రాంతం నుంచే ఉన్నట్లు తెలిపారు. ఇక్కడ మొత్తం ఓటర్లు 87వేలకు పైగా ఉంటే 663 ఓట్లపై అభ్యంతరాలు వచ్చాయని.. ఇప్పటికే వాటిలో 500కు పైగా ఫిర్యాదులను పరిశీలించి చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇక ఒకే ఇంటి చిరునామాతో చాలామందిని ఓటర్లు నమోదు చేశారన్న ఆరోపణలను పరిశీలించగా.. ఓటర్లు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉన్నారని.. నమోదు సమయంలో అధికారులు చిరునామా ఒకటే పేర్కొనడంతో ఈ గందరగోళం తలెత్తిందని.. సంబంధింత అధికారులపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఎనిమిదిచోట్ల స్ట్రాంగ్ రూమ్‌లు.. పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులను భద్రపర్చడానికి ఎనిమిది చోట్ల స్ట్రాంగ్ రూమ్‌లను ఏర్పాటుచేసినట్లు మీనా తెలిపారు. ఈనెల 16వ తేదీ ఉ.8 గంటలకు ఓట్ల లెక్కింపు జరుగుతుందని, సాధారణ ఎన్నికలతో పోలిస్తే ఈ ఓట్ల లెక్కింపు భిన్నమైనది కావడంతో దానికి తగ్గట్లుగా అధికారులకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఇది సుదీర్ఘ ప్రక్రియని.. ఫలితాల ప్రకటనకు రెండు మూడు రోజులు సమయం కూడా పట్టే అవకాశం ఉందన్నారు. ఫలితాలను సాధ్యమైనంత త్వరగా ప్రకటించడానికి వీలుగా 40 వరకు టేబుల్స్ ఏర్పాటుచేశామన్నారు. -
AP: ఎన్నికల్లో కీలక శక్తిగా మహిళలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చట్ట సభలకు ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడంలో మహిళలే కీలక శక్తిగా మారనున్నారు. రాష్ట్రంలో పురుష ఓటర్లతో పోలిస్తే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉండటం ఈ అంశాన్ని స్పష్టం చేస్తోంది. ప్రత్యేక ఓటర్ల సవరణ తుది జాబితా 2023ను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా గురువారం విడుదల చేశారు. ఈ జాబితా ప్రకారం రాష్ట్రంలో సర్వీసు ఓటర్లతో కలిపి మొత్తం ఓటర్ల సంఖ్య 3,99,84,868. వీరిలో పురుష ఓటర్లు 1,97,59,489 మంది కాగా, మహిళా ఓటర్లు 2,02,21,455 మంది ఉన్నారు. అంటే 4,61,966 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. థర్డ్ జెండర్స్ ఓటర్ల సంఖ్య 3,924గా ఉంది. మొత్తం 26 జిల్లాల్లో 22 జిల్లాల్లో పురుషులకంటే మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉంది. శ్రీకాకుళం, విశాఖపట్నం, ప్రకాశం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో మాత్రమే పురుష ఓటర్ల సంఖ్య అధికంగా ఉంది. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 19,41,277 మంది ఓటర్లు ఉన్నారు. అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 7,29,085 మంది, పార్వతీపురం మన్యం జిల్లాలో 7,76,716 మంది ఓటర్లు ఉన్నారు. 2022తో పోలిస్తే తగ్గిన ఓటర్ల సంఖ్య గతేడాది తుది ఓటర్ల సవరణ జాబితాతో పోలిస్తే ఈ ఏడాది ఓటర్ల సంఖ్య 7,51,411 తగ్గింది. 2022 తుది జాబితాలో 4,07,36,279గా ఉన్న ఓటర్ల సంఖ్య 2023 జాబితా నాటికి 3,99,84,868కి పరిమితమయింది. కానీ, నవంబర్‌లో విడుదల చేసిన ముసాయిదా జాబితా సవరణ తర్వాత నికరంగా ఓటర్ల సంఖ్య 1,30,728 పెరిగినట్లు మీనా తెలిపారు. ముసాయిదా జాబితా తర్వాత కొత్తగా 5,97,701 మంది ఓటర్లు చేరితే 4,66,973 మంది ఓటర్లను తొలగించినట్లు పేర్కొన్నారు. గతంతో పోలిస్తే అదనంగా ఒక పోలింగ్ స్టేషన్ పెరిగిందని తెలిపారు. రాష్ట్రంలో 45,951 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ప్రతి వెయ్యి మంది జనాభాకు 721 మందికి ఓటు హక్కు ఉండగా, లింగ నిష్పత్తి 1,027గా ఉంది. పెరిగిన తొలి ఓటు హక్కు వినియోగదారులు 2023 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే వారిని ఓటర్లుగా చేర్చుకున్నారు. గత ఏడాది నవంబర్ 9న ప్రకటించిన ముసాయిదా జాబితాలో 18 నుంచి 19 ఏళ్లు ఉన్న తొలి ఓటు హక్కు వినియోగదారుల సంఖ్య 78,438గా ఉంటే తుది జాబితా నాటికి ఈ సంఖ్య 3,03,225కు చేరినట్లు మీనా తెలిపారు. విద్యా సంస్థల్లో ప్రత్యేకంగా ప్రచారం చేయడమే కొత్త ఓటర్ల సంఖ్య భారీగా పెరగడానికి కారణమని చెప్పారు. మొత్తం ఓటర్లలో దివ్యాంగుల సంఖ్య 5,17,403గా ఉంది. ఈ తుది ఓటర్ల జాబితాను అన్ని జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు శుక్రవారం అందజేస్తామని తెలిపారు. ఓటరుగా నమోదు చేసుకోలేకపోయినవారు ఫారం–6 ద్వారా నమోదు చేసుకోవచ్చని, అభ్యంతరాలను ఫారం–7 ద్వారా, సవరణలను ఫారం–8 ద్వారా చేయవచ్చని తెలిపారు. -
నామినేషన్ల గడువుకు 10 రోజుల ముందువరకు ఓటర్ల నమోదు
సాక్షి, అమరావతి: త్వరలో ఎన్నికలు జరగనున్న ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి నామినేషన్ల దాఖలు గడువుకు పదిరోజుల ముందువరకు ఓటర్ల నమోదుకు అవకాశం కల్పిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్‌కుమార్ మీనా చెప్పారు. ఎన్నికలు జరగనున్న మూడు పట్టభద్రుల, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన తుది ఓటర్ల జాబితాపై గుర్తింపు పొందిన రాజకీయపార్టీలతో ఆయన సోమవారం సచివాలయంలో సమావేశం నిర్వహించారు. సమావేశానికి హాజరైన సీపీఐ, సీపీఎం, వైఎస్సార్సీపీ ప్రతినిధులకు తుది ఓటర్ల జాబితా అందచేశారు. ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ అర్హత ఉండి తుది జాబితాలో పేరులేని ఓటరు నమోదుకు అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. నామినేష్ల దాఖలు గడువుకు పదిరోజుల ముందువరకు సంబంధిత ధ్రువపత్రాలను సమర్పించి పేరు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. తుది ఓటర్ల జాబితాపై గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలు లేవనెత్తిన అభ్యంతరాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. శ్రీకాకుళం–విజయనగరం–విశాఖపట్నం పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ పి.వి.ఎన్.మాధవ్, ప్రకాశం–నెల్లూరు–చిత్తూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ వై.శ్రీనివాసులరెడ్డి, కడప–అనంతపురం–కర్నూలు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ గోపాలరెడ్డి వెన్నపూస పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. ప్రకాశం–నెల్లూరు–చిత్తూరు టీచర్ల నియోజకవర్గ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం, కడప–అనంతపురం–కర్నూలు టీచర్ల నియోజకవర్గ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి పదవీకాలం కూడా మార్చి 29తో ముగుస్తోంది. దీంతో ఈ ఐదుస్థానాలకు ఎన్నికలు నిర్వహిచేందుకు ఎన్నికల సంఘం కసరత్తు మొదలుపెట్టింది. ఇదీ చదవండి: విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులకు సీఎం అభినందనలు -
యువ ఓటర్లే లక్ష్యం
సాక్షి, అమరావతి: అర్హులైన యువతను ఓటర్లుగా నమోదు చేయడమే లక్ష్యంగా ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు. రాష్ట్ర ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసిన అనంతరం బుధవారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. విజయవాడలోని సిద్ధార్థ ఆడిటోరియంలో ఓటరు నమోదుపై కళాశాల విద్యార్థులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ ఎస్.ఢిల్లీరావుతో కలసి పాల్గొన్నారు. బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకుంటామంటూ యువతతో ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట్రంలో 18 – 19 ఏళ్ల వయసున్న యువత 12 లక్షల వరకు ఉండగా ముసాయిదా ఓటర్ల జాబితాలో 78 వేల మంది మాత్రమే ఉన్నారని ముఖేష్‌కుమార్ మీనా చెప్పారు. ఈ వయసు వారిలో 10 – 11 లక్షల మంది ఓటర్లుగా నమోదయ్యేలా ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకరు చొప్పున ప్రత్యేకంగా అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్‌ను నియమించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించిందని, ఈ ప్రక్రియ సోమవారం నాటికి పూర్తవుతుందన్నారు. ► ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,98,54,093 కాగా ఇందులో అత్యధికంగా 2,01,34,621 మంది మహిళా ఓటర్లున్నారు. 1,97,15,614 మంది పురుష ఓటర్లు, 3,858 మంది ధర్డ్ జెండర్ ఓటర్లున్నారు. కాగా ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన తుది జాబితా ప్రకారం రాష్ట్రంలో 4,07,36,000 మంది ఓటర్లు ఉన్నారు. మృతులు, మరో ఊరికి వెళ్లిన వారు, డూప్లికేట్ ఓట్లు కలిపి మొత్తం దాదాపు 8.82 లక్షల ఓట్లను తొలగించారు. ► ఓటర్లుగా నమోదు, అభ్యంతరాలు సమర్పించేందుకు ప్రత్యేక సవరణలో భాగంగా డిసెంబర్ 8వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. సీఈవో వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పరిశీలన పూర్తి చేసిన తరువాత వచ్చే ఏడాది జనవరి 5వ తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. ఓటర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేసేందుకు నవంబరు 19, 20, డిసెంబర్ 3, 4వ తేదీల్లో పోలింగ్ కేంద్రాల స్థాయిలో ప్రత్యేక క్యాంపెయిన్లను నిర్వహిస్తారు. ► ప్రస్తుతం 17 సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ వచ్చే ఏడాది ఏప్రిల్ 1వ తేదీ, జూలై 1వ తేదీ, అక్టోబర్ 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండే యువతీ యువకులు కొత్తగా ఓటర్లుగా నమోదుకు ఫామ్–6 ద్వారా ముందుగానే దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ► డూప్లికేట్ పేర్లను గుర్తించే ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో రాష్ట్రంలో 25 లక్షల పేర్లతో కూడిన జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా పంపింది. దీని ప్రకారం క్షేత్రస్థాయిలో తనిఖీల అనంతరం డూప్లికేట్ పేర్లను ఫొటోలతో సహా గుర్తించి 10,52,326 ఎంట్రీలను తొలగించారు. ఫలితంగా ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన జాబితాతో పోలిస్తే ముసాయిదాలో 8.82 లక్షల మంది ఓటర్లు తగ్గారు. ► ఇళ్లు లేని వారు, ఫుట్‌పాత్‌లపై నివసించే నిరాశ్రయులను సైతం ఓటర్లుగా నమోదు చేసేందుకు ఇంటి చిరునామా ధ్రువీకరణ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం మినహాయింపు ఇచ్చింది. ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి పరిశీలన చేసి అలాంటి వారికి ఓటు హక్కు కల్పిస్తారు. ► మారుమూల గిరిజన గ్రామాల్లో సైతం ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఓటర్ల నమోదు చేపడతారు. రాష్ట్రంలో జనాభా ఓటర్ల నిష్పత్తి 70.9 శాతం ఉండాల్సి ఉండగా 72.4 శాతం ఉంది. మిగతా రాష్ట్రాల కన్నా ఏపీలో నిష్పత్తి మెరుగ్గా ఉంది. ► ఏపీలో గతంలోనూ పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. ఇప్పుడు ప్రతి వెయ్యి మంది పురుష ఓటర్లకు 1,025 మంది మహిళా ఓటర్లున్నారు. ► 18 ఏళ్లు నిండిన అర్హుల్లో 5,23,580 మంది దివ్యాంగ ఓటర్లున్నారు. ► అత్యధిక ఓటర్లున్న జిల్లాలుగా అనంతపురం (19,13,813), కర్నూలు (19,13,654), శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు (18,99,103) వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. అత్యల్ప ఓటర్లున్న జిల్లాలుగా అల్లూరి సీతారామరాజు (7,15,990), పార్వతీపురం మన్యం (7,70,175), బాపట్ల (12,66,110) జిల్లాలు నిలిచాయి. ఆధార్ అనుసంధానం స్వచ్ఛందమే ఓటర్ల జాబితా విషయంలో అత్యంత పారదర్శకత పాటిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఐదు సూత్రాలను అమలు చేస్తోందని ముఖేష్‌కుమార్ మీనా వెల్లడించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి ముసాయిదా జాబితాలను అందచేస్తామన్నారు. ఓటరు కార్డులతో ఆధార్ అనుసంధానం ఇప్పటికే 60 శాతం పూర్తి కాగా మిగతా 40 శాతం డిసెంబర్ నాటికి పూర్తవుతుందన్నారు. ఫోన్ నంబర్లు కూడా సేకరించాల్సిందిగా సూచించామన్నారు. ఆధార్ అనుసంధానం స్వచ్ఛందమే కానీ తప్పనిసరి కాదన్నారు. ఆధార్ ఇవ్వకున్నా ఇతర సర్టిఫికెట్లు సమర్పించవచ్చన్నారు. ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించాలంటే సంబంధిత ఫామ్ ద్వారా క్షేత్రస్థాయి తనిఖీ ద్వారానే జరగాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బూత్ స్థాయి అధికారులే ఓటర్ల నమోదు ప్రక్రియ చేపడతారని, వలంటీర్లకు అవకాశం లేదని తెలిపారు. ఏవైనా ఫిర్యాదులు వస్తే విచారించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించామన్నారు. పట్టభద్రులు, టీచర్ల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియపై ఫిర్యాదులు వచ్చాయని, విచారణ జరిపి తప్పుడు ధ్రువీకరణ ఇచ్చే అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. -
ఓటర్ల నుంచి ఆధార్ నంబర్ సేకరణ.. అమల్లోకి నూతన మార్గదర్శకాలు..
సాక్షి, అమరావతి: ఓటర్ల జాబితా సవరణకు నూతన మార్గదర్శకాలు సోమవారం అమల్లోకి వచ్చినట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. గత ఏడాది డిసెంబర్ 30న జారీచేసిన నోటిఫికేషన్ ద్వారా ప్రజాప్రాతి నిధ్య చట్టం 1950లో సవరణలు చేసినట్లు చెప్పారు. సవరించిన చట్టంలోని సెక్షన్ 23 ప్రకా రం ఇప్పటికే ఓటర్లుగా ఉన్నవారితో పాటు ఓట ర్లుగా నమోదు కావాలనుకునేవారు వచ్చే మార్చి నెలాఖరుకల్లా ఆధార్ సంఖ్యను పొందుపర్చాలని ఒక ప్రకటనలో తెలిపారు. ఓటర్ల గుర్తింపును ఖరారు చేయడానికి, జాబితాలో వ్యక్తులను ప్రామాణీకరించడానికి, ఒక వ్యక్తి పేరు ఒకటికంటే ఎక్కువ చోట్ల నమోదు కాకుండా చూడటమే ఆధార్ సంఖ్య సేకరణ ప్రధాన ఉద్దేశమని వివరించారు. ఇది పూర్తిగా స్వచ్ఛందమని, ఆధార్ నంబరును సమర్పించని వారిని ఓటర్ల జాబితా నుండి తొలిగిం చటం ఉండదని స్పష్టం చేసారు. ఇప్పటికే ఓటర్లుగా నమోదై ఉన్న వారి ఆధార్ నంబరు కోసం నూతనంగా ఫారమ్ 6 బి ప్రవేశపెట్టామన్నారు. ఇసిఐ, ఇరోనెట్, గరుడ, ఎన్వీఎస్పీ, వీహెచ్ఏ తదితర వెబ్ సైట్లలో నూతన దరఖాస్తులు అందుబాటులో ఉంచామన్నారు. 6బి దరఖాస్తును ఆన్లైన్, ఆఫ్‌లైన్ విధానంలో ఎన్నికల సంఘానికి సమర్పించవచ్చని చెప్పారు. ఎన్వీఎస్పీ, ఓటర్ల హెల్ప్‌లైన్ యాప్‌ని అనుసరించి స్వీయ ప్రామాణీకరణతో యూఐడీఐఏతో రిజిస్టర్ చేసిన మొబైల్ నంబరు ఓటీపీని ఉపయోగించి ఆధార్‌ను ప్రామాణీకరించవచ్చని తెలిపారు. మరో వైపు బూత్ లెవల్ అధికారి ఓటర్ల నుండి ఆధార్ నంబరు సేకరించడానికి ఇంటింటిని సందర్శిస్తారని, ప్రత్యేక శిబిరాలు కూడా నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఆధా ర్ నంబరు ఇవ్వలేని ఓటర్లు ఫారం 6బిలో పేర్కొన్న 11 ప్రత్యామ్నాయపత్రాలలో ఏదైనా ఒకటి సమ ర్పించాలని చెప్పారు. ఆధార్ సంఖ్య సేకరణ, నిర్వ హణలో జాగ్రత్తలు తీసుకుంటారని, ఇది జన బాహుళ్యంలోకి వెళ్లదని తెలిపారు. సేకరించిన హార్డ్ కాపీలు సురక్షితమైన కస్టడీలో ఉంటాయని, యూఐడీఏఐ నిబంధనలకు అనుగుణంగా భద్రత చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. పోస్టర్ విడుదల నూతన మార్గదర్శకాలపై ఓటర్లలో అవగాహన కల్పించేందుకు రూపొందించిన పోస్టర్లను డెప్యూటీ సీఈవో వెంకటేశ్వరరావు సోమవారం సచివాలయం ఐదో బ్లాక్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాసరావు, స్వీప్ కన్సల్టెంట్ మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఓటరు జాబితాతో ఆధార్ అనుసంధానం
సాక్షి, అమరావతి: ఓటర్ల జాబితాల సవరణలకు సంబంధించి ఆగస్టు ఒకటి నుంచి నూతన మార్గనిర్దేశకాలు అమల్లోకి రానున్నాయని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు. ఓటరు నమోదు, సవరణ పత్రాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం పలు కీలక మార్పులు చేసిందని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 17 ఏళ్లు నిండినవారు కొత్త ఓటరుగా నమోదు చేసుకోవడంతోపాటు, ఇప్పటికే నమోదైన వారు ఆధార్ నంబరును అనుసంధానం చేయాల్సి ఉంటుందని తెలిపారు. నూతన చట్ట సవరణలను అనుసరించి ఇప్పటికే నమోదై ఉన్న ఓటర్లు 2023 ఏప్రిల్ ఒకటోతేదీ నాటికి తమ ఆధార్ నంబరు తెలియజేయాలని పేర్కొన్నారు. అయితే ఇది పూర్తిగా స్వచ్ఛందమని, ఆధార్ నంబరు ఇవ్వని వారిని ఓటర్ల జాబితా నుంచి తొలగించరని స్పష్టం చేశారు. ఇప్పటికే ఓటర్లుగా ఉన్న వారి ఆధార్ నంబరు కోసం నూతనంగా ఫారం 6బీ ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. ఈసీఐ, ఇరోనెట్, గరుడ, ఎన్వీఎస్పీ, వీహెచ్ఏ తదితర వెబ్సైట్లలో ఈ నెలాఖరు నాటికి నూతన దరఖాస్తు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. త్వరలోనే ఇంటింటికి తిరిగి ఆధార్ నంబరును అనుసంధానించే ప్రక్రియను చేపడతామని, ఆన్లైన్ ద్వారా కూడా ఆధార్ నంబరును అనుసంధానం చేయవచ్చని తెలిపారు. 6బీ ఇవ్వని వారు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొన్న 11 ప్రత్యామ్నాయాల్లో ఒకదాన్ని సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. ఆధార్ వివరాలను అత్యంత గోప్యంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఫారం 6తో నియోజకవర్గం మార్పు కుదరదు ఫారం 6 ఇకపై కొత్త ఓటర్ల నమోదు కోసం మాత్రమే నిర్దేశించారని, ఓటరు నియోజకవర్గం మారడానికి ఫారం 6లో దరఖాస్తు చేసేందుకు అవకాశం లేదని తెలిపారు. జాబితాలో పేరు తొలగింపునకు ఉపయోగించే ఫారం 7 విషయంలో ఇకపై మరణ ధ్రువీకరణపత్రాన్ని జతచేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఫారం 8 విషయంలో కీలక మార్పులు జరిగాయని తెలిపారు. ఇప్పటివరకు దీన్ని ఓటర్ల జాబితాలో నమోదు చేసిన వివరాల సవరణ కోసం వినియోగిస్తుండగా, ఇకపై విభిన్న అంశాలకు వినియోగించనున్నట్లు వెల్లడించారు. నియోజకవర్గ పరిధిలోనేగాక, ఇతర నియోజకవర్గాలకు ఓటరు మార్పు, నూతన ఓటరు గుర్తింపు కార్డు జారీ, వైకల్యం ఉన్న వ్యక్తిని గుర్తించడం వంటి అంశాలకు కూడా ఫారం 8 వినియోగించవచ్చని ఆయన వివరించారు. -
నేడు రాష్ట్రపతి ఎన్నిక
సాక్షి, అమరావతి: కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ పూర్తి కట్టుదిట్టమైన భద్రత మధ్య రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో 16వ రాష్ట్రపతి ఎన్నికకు ఏర్పాట్లు చేశారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నిక జరగనుంది. రాష్ట్ర అసెంబ్లీ కార్యాలయం మొదటి అంతస్థులో ఏర్పాటు చేసిన పోలింగ్ ఏర్పాట్లను కేంద్రం నుంచి వచ్చిన రాష్ట్రపతి ఎన్నికల పర్యవేక్షకుడు చంద్రేకర్ భారతి (ఐఏఎస్), ఎన్నికల స్పెషల్ ఆఫీసర్ సంతోష్ అజ్మీరా(ఐఐఎస్)లు ఆదివారం పరిశీలించారు. వారు తొలుత సచివాలయంలోని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌కుమార్ మీనాతో సమావేశమై పోలింగ్ ఏర్పాట్లపై ఆరా తీశారు. అనంతరం శాసనసభ ప్రాంగణంలో ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన సూచనలు, సలహాలను చంద్రేకర్ భారతి.. అధికారులకు వివరించారు. ఎన్నికల నిర్వహణ సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యుత్ జనరేటర్లను సిద్ధంగా ఉంచుకోవాలని, ఎన్నికల ప్రక్రియను అంతా వీడియో తీయించాలని, ఎన్నికల విధుల నిర్వహణకు సంబంధించిన డ్యూటీ చార్టును పటిష్టంగా రూపొందించాలని అధికారులకు సూచించారు. పోలింగ్ కేంద్రంలోకి నిర్దిష్ట విరామాల్లో పరిమిత సంఖ్యలో వీడియోగ్రాఫర్లను ఏ విధంగా అనుమతిస్తారు, వారు వచ్చి.. వెళ్లే మార్గాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల నిర్వహణకు ఏర్పాటు చేసిన అన్ని కేంద్రాలు, మార్గాల్లో భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. తదనంతరం కంట్రోల్ రూమ్‌ను సందర్శించి అక్కడ సీటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. శాసన సభా భవనం మొదటి అంతస్తులోని ఓటర్లు వేచి ఉండే 203, 205 గదులను పరిశీలించి, ఓటర్ల సూచనల ఫ్లెక్స్ బ్యానర్లను, కరపత్రాలను అక్కడ ఏర్పాటు చేయాల్సిందిగా ఏఆర్వో రాజ్‌కుమార్‌ను ఆదేశించారు. పర్యటనలో డిప్యూటీ సీఈవో వెంకటేశ్వరరావు, అసిస్టెంట్ సీఈవో శ్రీనివాసశాస్త్రి, ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసన మండలి ఉప కార్యదర్శులు, ఎన్నికల సహాయ రిటర్నింగ్ అధికారులు రాజకుమార్, వనితా రాణి తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ ఎన్నికల సంఘం సీఈవోగా ముఖేష్‌కుమార్ మీనా
సాక్షి, అమరావతి: ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవోగా ముఖేష్‌కుమార్ మీనా నియామకమయ్యారు. ముఖేష్‌కుమార్‌ను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఇది కూడా చదవండి: ఏపీ సీఎస్ సమీర్‌శర్మ పదవీకాలం పొడిగింపు -
పార్లమెంటు నియోజకవర్గానికో ఆహారశుద్ధి పరిశ్రమ
సాక్షి, అమరావతి: రానున్న రెండేళ్లలో ప్రతీ పార్లమెంటు నియోజకవర్గానికో ఆహారశుద్ధి పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసిందని వాణిజ్యం, పరిశ్రమల శాఖ (ఆహారశుద్ధి) కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. సచివాలయంలో సోమవారం బాధ్యతలు స్వీకరించిన ఆయన తొలుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌తో భేటీ అయ్యారు. అనంతరం సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ ఆహార శుద్ధి పరిశ్రమల రంగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాధాన్యతనిస్తున్నారని, అందుకే ఈ శాఖకు ప్రత్యేకంగా కార్యదర్శిని నియమించారని చెప్పారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఆహార శుద్ధి పరిశ్రమలు ఏర్పాటు చెయ్యాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందన్నారు. ఆయా జిల్లాల్లో పండే పంటల ఆధారంగా ఏ జిల్లాలో ఎలాంటిæ పరిశ్రమ రావాలన్న దానిపై కార్యాచరణ రూపొందిస్తామన్నారు. రాష్ట్ర ఆహారశుద్ధి సొసైటీ సీఈవో శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ముఖేష్ కుమార్ మీనాకు ఏపీ గవర్నర్ వీడ్కోలు
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో నూతన రాజ్ భవన్ ఏర్పాటు సమయంలో తొలి కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ముఖేష్ కుమార్ మీనా ఎంతో శ్రమించి మంచి పనితీరుతో అనతి కాలంలోనే రాజ్ భవన్ ప్రాంగణానికి సర్వహంగులు సమకూర్చారని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ప్రస్తుతం గవర్నర్ కార్యదర్శిగా ఉన్న ముఖేష్ కుమార్ మీనా పరిశ్రమల శాఖ(ఆహార శుద్ది) కార్యదర్శిగా, గవర్నర్ ఎడీసీఎస్‌వీ మాధవరెడ్డి విజిలెన్స్ విభాగంలో అదనపు ఎస్పీగా బదిలీ అయిన నేపధ్యంలో గవర్నర్ వారికి ఘనంగా వీడ్కోలు పలికారు.(చదవండి: అఫ్గానిస్తాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న తెలుగు జవాన్) ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. ముఖేష్ కుమార్ మీనా విశ్వసనీయమైన, సమర్ధవంతమైన అధికారి అని, రాజ్ భవన్ వ్యవస్ధను తీర్చిదిద్దటంలో మంచి పనితీరును చూపారని, రోజువారీ కార్యాలయ వ్యవహారాలలో సైతం ఎప్పుడు ఎలాంటి అసౌకర్యం తనకు కలగలేదని అన్నారు. నూతన శాఖ విషయంలోనూ మీనాపై ప్రభుత్వం ఎంతో ముఖ్యమైన భాధ్యతలను ఉంచిందని, అక్కడ కూడా విజయాన్ని సాధిస్తారన్న నమ్మకం తనకుందని హరిచందన్ అన్నారు. అదే క్రమంలో వ్యక్తిగత భద్రత, అధికారిక కార్యక్రమాలతో సహా విభిన్న అంశాలను మాధవ రెడ్డి చాలా జాగ్రత్తగా నిర్వహించారని గవర్నర్ ప్రస్తుతించారు. మీనా, మాధవ రెడ్డిలు రాజ్‌భవన్‌ను వీడుతున్నప్పటికీ ప్రభుత్వం అప్పగించిన అతి ముఖ్యమైన పనుల నిర్వహణకు వెళుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. రాజ్ భవన్ అధికారులు, సిబ్బందిని తన కుటుంబ సభ్యులుగానే తాను భావిస్తానని, వారిలో ఎవరికి ఏ సమయంలో ఆపద ఎదురైనా తగిన స్పందన కనబరచాలని తాను ఉన్నతాధికారులను ఆదేశిస్తూ ఉంటానని గవర్నర్ అన్నారు. -
ఏపీలో రాజ్‌భవన్‌కు భవనం కేటాయింపు
సాక్షి, విజయవాడ : నగరంలోని పాత ఇరిగేషన్ కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజ్‌భవన్‌కు కేటాయించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్ జారీచేసింది. ఇటీవల కేంద్రం ఏపీకి కొత్త గవర్నర్‌గా విశ్వభూషణ్ హరిచందన్‌ను నియమించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వం రాజ్‌భవన్‌ను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. సూర్యారావుపేటలోని పాత ఇరిగేషన్ కార్యాలయాన్ని రాజ్‌భవన్‌గా మార్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నెల 24వ తేదీన విశ్వభూషణ్ ఏపీ గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రవీణ్‌కుమార్ ప్రమాణం చేయించనున్నారు. గవర్నర్ కార్యదర్శిగా ఎంకే మీనా అలాగే గవర్నర్ కార్యదర్శిగా ముకేశ్‌కుమార్ మీనాను ఏపీ ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న ఎంకే మీనాకు.. గవర్నర్ కార్యదర్శిగా ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించింది. -
క్రీడలతో బంగారు భవితకు బాటలు
హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు ముకేష్‌కుమార్ మీనా అట్టహాసంగా రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్స్ పురుషుల హాకీ పోటీలు ప్రారంభం నెల్లూరు(బృందావనం): బాలబాలికలు క్రీడల్లో రాణించి తమ బంగారుభవితకు బాటలు వేసుకోవాలని హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ కమిషనర్ ముకేష్‌కుమార్ మీనా తెలిపారు. వీఆర్ ఉన్నత పాఠశాల మైదానంలో నాలుగు రోజులు జరగనున్న ఏడో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సబ్ జూనియర్స్ పురుషుల అంతర్‌జిల్లాల హాకీ చాంపియన్‌షిప్ పోటీలను శుక్రవారం సాయంత్రం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. హాకీ ఆంధ్రప్రదేశ్ పర్యవేక్షణలో హాకీ నెల్లూరు డిస్ట్రిక్ట్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి పోటీలకు నెల్లూరు వేదిక కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తాను హాకీ క్రీడాకారుడిగా రాణిస్తూ సివిల్ సర్వీస్‌లోకి 25 ఏళ్లక్రితం వచ్చానంటూ తన అనుభవాన్ని వివరించారు. హాకీ స్టిక్స్ పట్టుకున్న క్రీడాకారులను చూస్తుంటే తనకు ఉత్సాహం వస్తోందని చెప్పారు. అంతర్జాతీయస్థాయిలో సాధించిన పతకాలతో భారతదేశంలో హాకీ క్రీడకు సమానమైన క్రీడ ఏదీ లేదన్నారు. రాష్ట్రంలో హాకీ ప్రగతికి కృషి రాష్ట్రంలో హాకీ ప్రగతికి అసోసియేషన్ పరంగా తన వంతు సహాయ సహకారాలను అందిస్తానని ముకేష్‌కుమార్‌మీనా వివరించారు. విభజన నేపథ్యంలో క్రీడారంగం మౌలిక వసతుల కొరతను ఎదుర్కొంటోందని, రానున్న ఐదేళ్లలో సమస్యను అధిగమించగలదనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. హాకీ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి నిరంజన్‌రెడ్డి, కోశాధికారి డాక్టర్ విజయబాబు, ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసులు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కోశాధికారి పసుపులేటి రామ్మూర్తి, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి రమణయ్య, హాకీ నెల్లూరు డిస్ట్రిక్ట్ అధ్యక్ష, కార్యదర్శులు శేషయ్య, థామస్‌పీటర్, జిల్లా పీఈటీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సనత్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు. 12 జిల్లాల నుంచి క్రీడాకారుల రాక పోటీలకు విజయనగరం జిల్లా మినహాయించి 12 జిల్లాలకు చెందిన 240 మంది క్రీడాకారులు, 60 మంది కోచ్‌లు, 15 మంది అఫీషియల్స్ హాజరయ్యారు. తొలుత జాతీయపతాకాన్ని ముకేష్‌కుమార్‌మీనా, రాష్ట్ర క్రీడాపతాకాన్ని నిరంజన్‌రెడ్డి, జిల్లా క్రీడాపతాకాన్ని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి రమణయ్య ఎగురవేసి గౌరవవందనం చేశారు. అనంతరం క్రీడాకారుల గౌరవ వందనం స్వీకరించారు. క్రీడాజ్యోతిని ముకేష్‌కుమార్‌మీనా వెలిగించి, కపోతాలు, బెలూన్లను ఎగురవేసి బాణసంచా హోరులో క్రీడలను ప్రారంభించారు. -
'..లేదంటే మద్యం సరఫరా నిలిపివేస్తాం'
విశాఖ: ఎక్సైజ్ శాఖకు గత నెల జనవరి వరకు వ్యాట్ సహా రూ. 10, 270 కోట్ల ఆదాయం వచ్చిందని ఎక్సైజ్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. మార్చి నాటికి రూ. 12, 500 కోట్లు ఆదాయం సమకూర్చుకోవాలనేది తమ లక్ష్యంగా ఆయన పేర్కొన్నారు. సోమవారం ముఖేష్ మీనా విలేకరులతో మాట్లాడుతూ.. కొన్ని జిల్లాల్లో నాటు సారా నియంత్రణలో ఉందని చెప్పారు. ఇంకా మూడు, నాలుగు జిల్లాల్లో నియంత్రణ కావాల్సి ఉందని అన్నారు. రెండు వేల మంది నాటుసారా అమ్మకందారులపై బైండోవర్లు కేసులు నమోదు చేశామన్నారు. మరో 2, 800 మందిపై బైండోవర్లు చేయాల్సి ఉందని తెలిపారు. 4 వేల దుకాణాలకు కంప్యూటీకరణ పూర్తియిందని చెప్పారు. వచ్చే నెల నాటికి మిగిలిన మద్యం దుకాణాలు కంప్యూటీకరణ చేసుకోవాలని సూచించారు. లేదంటే మద్యం సరఫరా నిలిపివేస్తామని ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించారు. -
మీనాపై చార్జిషీటు సీవీసీకి
డోర్ కర్టన్లు, ఆ కర్టన్లు పెట్టుకునే స్టీల్ రాడ్ల కొనుగోళ్లలో దాదాపు రూ.20 లక్షల అవినీతికి పాల్పడ్డారంటూ ఢిల్లీ ఏసీబీ చీఫ్ ముకేశ్ కుమార్ మీనాపై నమోదయిన కేసు వివరాలను ఢిల్లీ ప్రభుత్వం మంగళవారం చీఫ్ విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ)కు పంపింది. 2005లో ఢిల్లీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ చీఫ్‌గా పనిచేసిన కాలంలో మీనా ఈ కుంభకోణానికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. అప్పట్లో ఆయన సహచరులుగా పనిచేసిన ఇద్దరు పోలీసు అధికారుల ఫిర్యాదుతో మొత్తం వ్యవహారం బయటికొచ్చిన సంగతి తెలిసిందే. కాగా, మీనాపై విచారణ విషయంలో ఢిల్లీ లెఫ్టినెంట్ జనరల్ నజీబ్ జంగ్కు, ఆమ్ ఆద్మీ సర్కారుకు విబేధాలు తలెత్తాయి. దీంతో వ్యవహారారం కాస్తా చీఫ్ విజిలెన్స్ కమిషనర్ వద్దకు చేరింది. ఇదిలా ఉండగా, సీఎన్జీ వాహనాలకు ఫిట్నెస్ మంజూరులో అవకతవకలకు పాల్పడ్డారంటూ మీనాపై దాఖలైన మరో కేసులో.. ప్రభుత్వం జారీ చేసిన సమన్లకు స్పందించనందున మీనాపై నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంటు జారీచేయడంతోపాటు అతడి వేతనంలో 30 శాతం కోత విధించాలని కేజ్రీవాల్ సర్కారు నిర్ణయించింది. అయితే నాన్ బెయిలబుల్ వారెంటు జారీని సెప్టెంబర్ 23 వరకు నిలిపివేస్తున్నట్లు ఢిల్లీ హైకోర్టు మంగళవారం మధ్యంతర ఆదేశాలు జారీచేసింది. -
సమగ్ర సర్వేకు కసరత్తు
* సమీక్ష నిర్వహించిన జీహెచ్ఎంసీ సాక్షి, హైదరాబాద్: ఈ నెల 19న జరగనున్న సామాజిక, ఆర్థిక ఇంటింటి సర్వే నిర్వహణకు గ్రేటర్ అధికారులు కసరత్తు ప్రారంభించారు. 625 చ.కి.మీ. మేర విస్తరించిన జీహెచ్ఎంసీలో దాదాపు 20 లక్షల ఇళ్లున్నట్లు అంచనా వేసిన అధికారులు సర్వే నిర్వహణకు దాదాపు లక్షమంది సిబ్బంది అవసరమవుతారని అంచనా వేశారు. జీహెచ్ఎంసీ, పోలీసులు, ఇతర ప్రభుత్వ సిబ్బందిని సర్వే సేవలకు వినియోగించుకున్నా 40 వేల నుంచి 50 వేల మంది వరకు మాత్రమే ఉన్నట్లు అంచనా వేశారు. దీంతో.. ప్రైవేటు విద్యాసంస్థలు, స్వయం సహాయక మహిళా గ్రూపులు, స్వచ్ఛంద సేవాసంస్థలు, తదితరుల సేవల్ని విని యోగించుకుంటే ఎలా ఉంటుంది ? అనే ఆలోచనలో ఉన్నారు. సర్వే నిర్వహణ సన్నాహకాల్లో భాగంగా బుధవారం జీహెచ్ఎంసీలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్‌తోపాటు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ముఖేశ్‌కుమార్ మీనా, గ్రేటర్ పరిధిలోకి వచ్చే హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సర్వే ఎలా చేస్తే బాగుంటుంది.. పర్యవేక్షణ ఎలా ఉండాలి.. తదితర వివరాలపై ఒకటి రెండు రోజుల్లో నివేదిక రూపొందించాల్సిందిగా కమిషనర్ సూచించారు. * ఇంటింటి సర్వే నిర్వహణ కోసం జీహెచ్ఎంసీలో సిబ్బందితో పాటు, వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన 30 వేల నుంచి 40 వేల మంది ఉద్యోగులను వినియోగించనున్నారు. * 19వ తేదీ సర్వేకు ఒక రోజు ముందు అంటే 18వ తేదీన కూడా సంబంధిత సిబ్బంది తమ పరిధిలోని ఇళ్లకు వెళ్లి సర్వే పై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. * సర్వేలో కీలకమైన 9 అంశాలను సిద్ధంగా ఉంచుకోవలసిందిగా ప్రజలను కోరుతారు. * ప్రభుత్వం కోరిక మేరకు కేంద్రం సైన్యాన్ని పంపితే వినియోగించుకుంటారు. * జీహెచ్ఎంసీ పరిధిలో సర్వే తీరును పర్యవేక్షించేందుకు 250 మంది నోడల్ అధికారులను నియమిస్తారు. * మరో 2వేల మందిని క్లస్టర్ ఇంచార్జిలుగా నియమిస్తారు. కలెక్టరేట్లో సమీక్ష రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 19న తలపెట్టిన సామాజిక ఆర్ధిక సర్వేను విజయవంతం చే సేందుకు హైదరాబాద్ జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఏజేసీ సంజీవయ్య వివిధ ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇంటింటి సర్వేలో పాల్గొనేందుకు అవసరమైన సిబ్బంది వివరాల సేకరణపై బుధవారం వివిధ ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష జరిపారు. జిల్లా వ్యాప్తంగా 94 ప్రభుత్వ విభాగాలు ఉండగా, ఇప్పటి వరకు కేవలం 32 విభాగాల నుంచే సిబ్బంది వివరాలు అందాయని ఏజేసీ పేర్కొన్నారు. నగరంలో సర్వే కోసం 36 వేల మంది సిబ్బంది అవసరం కాగా, అన్ని ప్రభుత్వ విభాగాల్లో కలిపి 16వేల మందే ఉన్నట్లు పలువురు అధికారులు ఏజేసీ దృష్టికి తెచ్చారు. సీపీవో బలరాం మాట్లాడుతూ.. హైదరాబాద్ జిల్లాలోని 108 డివిజన్లను 8600 ఎన్యుమరేటర్ బ్లాకులుగా విభజించామన్నారు. ఆయా బ్లాకుల్లో 9 లక్షలకు పైగా కుటుంబాలు ఉన్నట్లు అంచనా వేశామన్నారు. ప్రొఫార్మాలో వివరాల నమోదుకు ముందు తగిన అధారాలను కూడా పరిశీలించాలని సీపీవో బలరాం సూచించారు. -
21న ‘బోనాల’ సెలవు
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ జిల్లాలో ఆదివారం ఆషాఢ బోనాలు జరుగనున్న నేపథ్యంలో వివిధ ప్రభుత్వ విభాగాలకు సోమవారం సెలవు ఇచ్చేందుకు సర్కార్ సుముఖత వ్యక్తం చేసింది. జిల్లాలో ప్రభుత్వ యంత్రాంగమంతా ఆదివారం ఉత్సవ ఏరాట్లలో నిమగ్నమైనందున సోమవారం సెలవు ఇవ్వాలని కలెక్టర్ ముఖేష్ కుమార్ మీనా ప్రభుత్వానికి లేఖ రాశారు. కలెక్టర్ లేఖకు స్పందించిన సర్కారు హైదరాబాద్ జిల్లాలో సోమవారం సెలవుకు అంగీకరించింది. అయితే ఏఏ ప్రభుత్వ విభాగాలకు సెలవు ఇవ్వాలనే విషయంపై కలెక్టర్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 21న సెలవు విషయమై శనివారం అధికారికకంగా ప్రకటన వెలువడే అవకాశం ఉందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. -
'ఇప్పటికే 118 స్కూళ్లను సీజ్ చేశాం'
హైదరాబాద్:విద్యా ప్రమాణాలు పాటించకుండా నిబంధనలను పాతరేస్తున్న స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. ఈ రోజు ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై ఆయన సమీక్ష నిర్వహించారు. నిబంధనలు పాటించని స్కూళ్లపై కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు. నిబంధనలు పాటించని 118 స్కూళ్లను ఇప్పటికే సీజ్ చేసినట్టు తెలిపారు. ఫీజుల అంశానికి సంబంధించి రిపోర్ట్ ఇవ్వని 770 స్కూళ్లకు ఇవాళ నోటీసులు పంపుతున్నామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆ స్కూళ్లు వారంలోగా సమాధానం ఇవ్వకుంటే గుర్తింపు రద్దు చేస్తామన్నారు. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ వరకూ రూ.9 వేలు ఫీజు మాత్రమే ఉండాలని, హైస్కూళ్లకు మాత్రం రూ. 12 వేలు వసూలు చేయాలని కలెక్టర్ తెలిపారు. అంతకు మించి వసూళ్లు చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవన్నారు. -
‘చేప ప్రసాదం’ ఏర్పాట్లను పర్యవేక్షించిన కలెక్టర్
అబిడ్స్, న్యూస్‌లైన్: ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఈనెల 8,9 తేదీల్లో బత్తిని సోదరులు నిర్వహించే చేప ప్రసాదం పంపిణీ ఏర్పాట్లను హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ముఖేష్‌కుమార్‌మీనా, ఇతర అధికారులు పర్యవేక్షించారు. జిల్లా కలెక్టర్ మంగళవారం డీఆర్వో అశోక్‌కుమార్, ఆర్డీవో నవ్య, డీసీపీ కమలాసన్‌రెడ్డి, ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు అశ్వినీమార్గం, సుఖేష్‌రెడ్డిలతో తొలుత సమావేశమయ్యారు. అనంతరం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నలుమూలల సందర్శించారు. గత నెలలో ఎగ్జిబిషన్‌లోని కళాశాలలో ఎన్నికల కౌంటింగ్ ఉన్నందున సర్కస్ మే 16వ తేదీన ప్రారంభమైందని జూన్ 16న ముగింపు ఉండడంతో సర్కస్‌కు అవకాశం ఇవ్వాలని సొసైటీ ప్రతినిధులు కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 4న చీఫ్ సెక్రటరీతో చేప ప్రసాదంపై సమావేశమైన తర్వాత తుది వివరాలు ప్రకటిస్తామన్నారు. ఆయన వెంట ఏసీపీ జైపాల్, ఇన్స్పెక్టర్ ప్రభాకర్ తదితరులున్నారు. -
పోలింగ్ పెంపే లక్ష్యం
బంజారాహిల్స్, న్యూస్‌లైన్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటి వరకు 53 శాతం మాత్రమే ఉన్న పోలింగ్‌ను 75 శాతానికి పెంచడమే లక్ష్యంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా ‘నో యువర్ పో లింగ్ బూత్’ పేరుతో కార్యక్రమాన్ని చేపట్టామని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్ వెల్లడించారు. ఓటర్ స్లిప్‌ల పంపిణీ, జాబితాలపై ఆదివారం ఆయన బంజారాహిల్స్ రోడ్‌నెం.14లోని బాదం సరోజాదేవి పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌బూత్‌ను జిల్లా కలెక్టర్ ముఖేష్ కుమార్ మీనా, జీహెచ్ఎంసీ సెంట్రల్ జోనల్ కమిషనర్ రొనాల్డ్ రాస్, డీఎంసీ సోమరాజుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సోమేష్‌కుమార్ మాట్లాడుతూ, నగరంలో పోలింగ్ శాతం తక్కువగా ఉండటానికి కారణం పోలింగ్ కేంద్రాలు ఎక్కడున్నాయో, జాబితాలో పేరు ఉందో లేదో, ఓటరు స్లిప్‌లు అందాయో లేదో అనే విషయాలు ఓటర్లకు తెలియకపోవడమే కారణమని ఓ సర్వేలో తేలిందన్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 40 వేల మంది ఓటర్ల పేర్లు జాబితాలో లేవని తెలియడంతో తమకు ఈ ఆలోచన వచ్చిందన్నారు. నగరంలో 3091 పో లింగ్ బూత్‌లలో ఓటర్లకు తమ పోలింగ్ బూత్‌లపై అవగాహన, ఓటరు జాబితాలో పేరు ఉందో లేదో చూసుకునే నిమిత్తం పది రోజుల ముందు నుంచే ఏర్పాట్లు చేశామని చెప్పారు. బీఎల్ఓలు గైర్హాజరైతే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. వందశాతం ఓట ర్లకు ఓటర్ స్లిప్‌లు పంపిణీ చేస్తామన్నారు. 24 గంటలు పని చేసే 040-21111111 నంబర్లో తమ బీఎల్ఓ పేరు, తమ పోలింగ్ స్టేషన్ వివరాలు తెలుసుకోవచ్చన్నారు. ఈ పోలింగ్ కేంద్రాల పని తీరును 35 మంది సీనియర్ అధికారులు పర్యవేక్షిస్తున్నారన్నారు. 30న థియేటర్ల బంద్ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఈనెల 30న అన్ని థియేటర్లు, షాపింగ్ మాల్స్, పార్కులు, కార్యాలయాలు, పరిశ్రమలు మూయించి వేస్తామని సోమేష్‌కుమార్ వెల్లడించారు. ఈ మేరకు ఇప్పటికే థియేటర్లు, ఆయా సంస్థలకు నోటీసులు జారీ చేశామన్నారు.ఇందు కోసం 15 స్క్వాడ్స్ రంగంలోకి దించుతున్నామని, ఎక్కడైనా తెరిచినట్లు తెరిస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు అన్ని బంద్ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. దీని వల్ల ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. -
లక్ష్యం గోరంత.. నిర్లక్ష్యం బోలె డంత!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ జిల్లాలో సంక్షేమ పథకాలు, పేదలకు రుణాల మంజూరు విషయంలో బ్యాంకర్ల తీరుపై జిల్లా కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టరేట్లో బుధవారం జరిగిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమీక్షలో ఆయా శాఖల నుంచి ఇదేతీరు వ్యక్తమైంది. చిన్న చిన్న టార్గెట్లను కూడా చేరని బ్యాంకులపై జిల్లా కలెక్టర్ ముఖేష్ కుమార్ మీనా రిజర్వ్ బ్యాంకు ఏజీఎంకు ఫిర్యాదు చేశారు. కీలకమైన డీసీసీ, డీఎల్ఆర్సీ సమావేశానికి డుమ్మా కొట్టిన బ్యాంకు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఎల్డీఎంను ఆదేశించారు. మైనార్టీ రుణాలకు‘అధోగతి’ రుణాల మంజూరులో ఎస్సీ కార్పొరేషన్, యువజన సంక్షేమం విభాగాలు లక్ష్యానికి చేరువలో ఉండగా, మైనార్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ల వెనుకబడి ఉండడంపై కలెక్టర్ ఆరా తీశారు. రుణాల మంజూరు నత్తనడకన సాగడంలో బ్యాంకుల నిర్లక్ష్యం ఉందని తేల్చారు. ముఖ్యంగా బీసీ కార్పొరేషన్ రుణాలకు సంబంధించి.. బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర, యూకో బ్యాంకు, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, మైనార్టీ కార్పొరేషన్ రుణాలకు సంబంధించి.. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, విజయాబ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, దీనాబ్యాంకులు జారీచేసిన అనుమతి పత్రాలు నాలుగుకు మించిలేవని తేల్చారు. సమావేశానికి ఆహ్వానించినా యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓబీసీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుల ప్రతినిధుల గైర్హాజరుపై ఎల్డీఎంను వివరణ కోరారు. కాగా, బీసీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్ల నుంచి బ్యాంకు శాఖలకు తగినన్ని దరఖాస్తులు కూడా అందలేదని బాంకర్లు ఫిర్యాదు చేయడంతో కార్పొరేషన్ అధికారులపై కలెక్టర్ మండిపడ్డారు. ఫిబ్రవరి 10, 20, 29 తేదీల్లో బ్యాంకర్లు, కార్పొరేషన్ అధికారులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని ఎల్డీఎంను ఆదేశించారు. లక్ష్యానికి చేరువైన యువజన సంక్షేమ విభాగం, ఎస్సీ కార్పొరేషన్ అధికారులను కలెక్టర్ అభినందించారు. లక్ష్యానికి మించి రుణాలిస్తాం: లక్ష్మణ్ కుమార్ ఎస్సీ కులాలకు చెందిన పేదలకు ఆర్థికంగా చేయూతనిచ్చే ఉద్దేశంతో ఎస్సీ యాక్షన్ ప్లాన్‌ను రాష్ట్ర ప్రభుత్వం గతేడాది డిసెంబరు నుంచి అమల్లోకి తెచ్చిందని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మణ్‌కుమార్ చెప్పారు. మంజూరైన రుణ ంలో 60శాతం సబ్సిడీని ప్రభుత్వం అందజేస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చి, నగరంలోని మురికివాడల్లో నివసిస్తున్న ఎస్సీలకు రుణాలు మంజూరు చేయడానికి బ్యాంకర్లు ముందుకు రావాలని కోరారు. హైదరాబాద్ జిల్లాలో బ్యాంకులు కన్సెంట్లు ఇచ్చిన పక్షంలో అవసరమైతే ఈ ఏడాది వార్షిక లక్ష్యానికి మించి కూడా సబ్సిడీ విడుదల చేయడానికి ఎస్సీ కార్పొరేషన్ సంసిద్ధంగా ఉందన్నారు. రుణాల కోసం దరఖాస్తు చేసుకొనే వారికి త్వరితగతిని కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. సమావేశంలో లీడ్‌బ్యాంక్ మేనేజర్ భరత్‌కుమార్, రిజర్వ్ బ్యాంక్ ఏజీఎం బి.సరోజిని, ఎస్బీహెచ్ ఎజీఎం బద్రీనాథ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సత్యనారాయణ, మైనార్టీ కార్పొరేషన్ ఈడీ సలీంపాషా, బీసీ కార్పొరేషన్ ఈడీ ఖాజానజీం అలీ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శివప్రసాద్, యువజన సంక్షేమాధికారి సత్యనారాయణరెడ్డి తదితరులున్నారు. -
హౌసింగ్ పీడీపై సరెండర్ వేటు
ఇళ్లు మంజూరు చేస్తానని దళారులతో కుమ్మక్కు ‘అవామీ’ సొసైటీ ఫిర్యాదుతో బండారం బట్టబయలు సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ జిల్లా హౌసింగ్ విభాగం పీడీపై వేటు పడింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న హౌసింగ్ పీడీ ఎస్.కృష్ణయ్యను సరెండర్ చేస్తూ జిల్లా కలెక్టర్ ముఖేష్ కుమార్ మీనా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్చార్జి బాధ్యతలను హౌసింగ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ప్రకాశంకు అప్పగించారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు ఇళ్లు కావాలని ‘అవామీ హౌసింగ్ సొసైటీ’ అనే సంస్థ జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని మండలాల్లో దరఖాస్తు పెట్టించింది. హౌసింగ్ విభాగానికి షేక్‌పేట్, ఖైరతాబాద్ మండలాల్లో 1,450 దరఖాస్తులు అందాయి. ఇందులో 300మందికే ఇళ్ల మంజూరుకు సిఫారసు చేశారు. అయితే ఒక్కొక్క దరఖాస్తుదారుడి నుంచి రూ.20 వేల చొప్పున అవామీ సొసైటీ ప్రతినిధి ఒకరు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇల్లు మంజూరు కాని వారంతా ఒత్తిడి చేయడంతో.. కనీసం 600 మందికైనా ఇళ్లు ఇప్పించేలా హౌసింగ్ పీడీతో రూ.60లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు ‘అవామీ హౌసింగ్ సొసైటీ’ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. -
సమావేశానికి ఒట్టిచేతుల్తో వస్తే ఎలా..!
ఆర్డీవో, హౌసింగ్ పీడీలపై కలెక్టర్ ఆగ్రహం వాడీవేడిగా హౌసింగ్ సమీక్ష సాక్షి, సిటీబ్యూరో: ‘ఇళ్ల నిర్మాణం ఎందుకు పూర్తికాలేదంటే.. కోర్టు కేసులని సాకులు చెబుతారు. కేసుల సంగతి అడిగితే రికార్డులు లేవంటారు. సమీక్షా సమావేశానికి చేతులూపుకుంటూ వస్తారా?’.. అంటూ హౌసింగ్ పీడీ, హైదరాబాద్ ఆర్డీవోపై హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ముఖేష్ కుమార్ మీనా మండిపడ్డారు. జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న హౌసింగ్ ప్రాజెక్టులపై వివిధ మండలాల తహశీల్దార్లు, ఆర్డీవోలు, హౌసింగ్ అధికారులతో గురువారం కలెక్టరేట్లో ఆయన సమీక్షించారు. హైదరాబాద్ డివిజన్లోని ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టిన హౌసింగ్ ప్రాజెక్టులు నత్తనడక సాగుతుండటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కోర్టు కేసులుంటే త్వరగా పరిష్కరించుకోవాలని, కేసులు లేని చోట్ల లబ్ధిదారులకు ఇళ్ల కేటాయింపులు వెంటనే పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కొత్త లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి సామాజిక ఆర్థిక సర్వే(ఎస్ఈఎస్)ను వెంటనే పూర్తి చేయాలని తహశీల్దార్లను ఆదేశించారు. జీవో లేకపోవడంపై మందలింపు నిర్మాణం పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ చేసేందుకు ఆ శాఖ అధికారులు స్టాంప్ డ్యూటీ చెల్లించమంటున్నారని.. గతంలో పేదల ఇళ్లకు ఉచితంగా రిజి స్ట్రేషన్ చేయాలని ప్రభుత్వం జీవో ఇచ్చిందని సైదాబా ద్ తహశీల్దారు కలెక్టర్‌కు దృష్టికి తెచ్చారు. ఉచిత రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో మీవద్ద ఉందా.. అని హౌసింగ్ పీడీని, హైదరాబాద్ ఆర్డీవోను కలెక్టర్ ప్రశ్నించారు. కలెక్టర్ అడిగిన ప్రశ్నకు అధికారులు నీళ్లు నమలడంతో కలెక్టర్ మరోమారు కోపగించుకున్నారు. ఉచిత రిజిస్ట్రేషన్‌పై ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నట్లైతే, ఆశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి పేదల ఇళ్లకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసేలా చూస్తానని తెలిపారు. ల్యాండ్ బ్యాంక్ .. జాగ్రత్త! జిల్లా వ్యాప్తంగా ల్యాండ్ బ్యాంక్‌లో ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలాలు కబ్జా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తహశీల్దార్లను కలెక్టర్ ముఖేష్‌కుమార్ ఆదేశించారు. ప్రభుత్వ స్థలాల పరిరక్షణపై శుక్రవారం జరగనున్న సమావేశానికి సమగ్ర వివరాలతో రావాలని తహశీల్దార్లను, ఆర్డీవోలకు సూచించారు. సమావేశంలో.. హౌసింగ్ ప్రాజెక్టు డెరైక్టర్ కృష్ణయ్య, జాయింట్ కలెక్టర్ ఇ.శ్రీధర్, హైదరాబాద్ ఆర్డీవో నవ్య, సికింద్రాబాద్ ఆర్డీవో కిషన్, అన్ని మండలాల తహశీల్దార్లు, జీహెచ్ఎంసీ, హౌసింగ్ విభాగాల ఇంజినీర్లు పాల్గొన్నారు. -
ఈ-జిల్లాగా హైదరాబాద్!
=విలువైన రికార్డుల కంప్యూటరైజేషన్‌కు కలెక్టర్ ఆదేశం =జిల్లాలోని అధికారులందరికీ ల్యాప్‌ట్యాప్‌లు =అన్ని కార్యాలయాలకు డెస్క్‌టాప్‌లు, స్కానర్లు సాక్షి, సిటీబ్యూరో/కలెక్టరేట్, న్యూస్‌లైన్: హైటెక్ జిల్లాగా పేరుగాంచిన హైదరాబాద్ ఇకపై ఎలక్ట్రానిక్ డిస్ట్రిక్ట్‌గా మార నుంది. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ విభాగాల్లోని అధికారులందరికీ ల్యాప్‌ట్యాప్‌లు, అన్ని కార్యాయలయాలకు డెస్క్‌టాప్‌లను అందజే యనున్నట్లు జిల్లా కలెక్టర్ ముఖేష్ కుమార్ మీనా ప్రకటించారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యాలయాలకు కంపూటర్లతో పాటు స్కానర్లు, ప్రింటర్లు, యూపీఎస్‌లు కూడా ఇస్తామన్నారు. ఆయా విభాగాలకు సంబంధించి విలువైన పాత రికార్డులన్నింటినీ గుర్తించి, వాటిని జాగ్రత్తగా స్కాన్ చేసి భద్రపరచాలని సూచించారు. సొంత భవనాల్లేని ప్రభుత్వ విభాగాలకు అవసరమైతే స్థలాలను కేటాయిస్తామని చెప్పారు. విభాగాల వారీగా అవసరమైన కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ప్రభుత్వ స్థలాలు.. తదితర వివరాలను వెంటనే జిల్లా యంత్రాంగానికి అందజేయాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 974 అంగన్వాడీ కేంద్రాలుండగా వాటిలో కేవలం ఆరు కేంద్రాలకు మాత్రమే సొంత భవనాలున్నట్లు ఐసీడీఎస్ పీడీ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వ స్థలాలు కేటాయించే విషయమై సహకరించాలని తహశీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు. పటిష్టంగా భూముల పరిరక్షణ అనంతరం రెవెన్యూ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమైన కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రభుత్వ భూముల వివరాలు సేకరించి, వాటి పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని తహశీల్దార్లను ఆదేశించారు. అర్బన్ ల్యాండ్ సీలింగ్ స్థలాలను క్షణ్ణంగా పరిశీలించి రెగ్యులరైజ్ చే యాలని సూచించారు. ప్రభుత్వ ఖాళీ స్థలాలను గుర్తించి వివరాలను ల్యాండ్ బ్యాంకులో పొందుపరచాలని ఆదేశించారు. ఆపద్భందు పథకం కింద లబ్ధిదారులకు ఆర్థిక సహాయం వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు స త్వర న్యాయం జరిగేలా చూడాలన్నారు. మిగు లు భూములను గుర్తించి హద్దులను నిర్ణయిం చాలన్నారు. వివిధ సంస్థలు, ప్రభుత్వ విభాగాలకు కేటాయించిన స్థలాలను, ఆయా సంస్థలు వినియోగించుకోని పక్షంలో నోటీసులు జారీ చేసి వాటిని స్వాధీనం చేసుకోవాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ శ్రీధర్, డీఆర్ఓ అశోక్‌కుమార్, ఆర్డీఓలు నవ్య, కిషన్లతో పాటు తహశీల్దార్లు, కలెక్టరేట్ పరిపాలన అధికారి రవీందర్ తదితరులున్నారు.