
ఢిల్లీ: మద్యం విధానం కేసులో మద్యం తనకు సీఆర్‌పీసీ 160 నోటీసు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టులో రాజ్ కేసిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణలో నివసిస్తున్న తనకు నోటీసులు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. నోటిసు ఇచ్చే పరిధి ఏపీ సీఐడికి లేదని పిటిషన్‌లో ఆయన పేర్కొన్నారు.
విచారణ జరిపిన జస్టిస్ జేబీ పార్థివాల, జస్టిస్ మహదేవన్ ధర్మాసనం.. ఏపీ ప్రభుత్వం, సిట్, ముఖేష్‌కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. రాజ్ కేసిరెడ్డి తరపున న్యాయవాది శ్రీహర్ష వాదనలు వినిపించారు. తదుపరి విచారణ మే 13కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
