
సాక్షి,విజయవాడ: ఉర్సా ల్యాండ్ డీల్‌పై దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఉర్సాకి రూ.3వేల కోట్ల విలువైన భూముల్ని చంద్రబాబు కట్టబెట్టారు. అయితే, ఊరుపేరు లేని ఉర్సాకి వేలకోట్ల భూముల్ని కట్టబెట్టడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఆఫీస్,ట్రాక్ రికార్డ్ లేని ఉర్సాకి భూ కేటాయింపులపై ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఎక్స్ వేదికగా స్పందించారు.
రెండు నెలల కిందట పెట్టిన ఉర్సాకు కోట్ల విలువైన భూముల్ని కేటాయించడంపై విమర్శలు గుప్పించారు. ఆఫీసు లేదు, ట్రాక్ రికార్డ్ లేదు. రెండు నెలల కిందట పెట్టిన ఉర్సాతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోట్ల రూపాయల ఒప్పందం ఎలా కుదుర్చుకుంది? వావ్! చంద్రబాబు ప్రభుత్వం ఘోస్ట్ కంపెనీకి 59.6 ఎకరాల భూమిని దాదాపు ఉచితంగా బహుమతిగా ఇచ్చింది! పూర్తిగా చట్టవిరుద్ధం! 59.6 ఎకరాలు ఘోస్ట్ కంపెనీకి కేటాయించడం చట్ట వ్యతిరేకం’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
No Office, No Track Record: How a Two-Month-Old Firm Landed a Multi-Crore Deal With Andhra Govt. Wow!
59.6 Acres of land gifted virtually free to this ghost company by the CB Naidu govt! Totally illegal!
Is it kickbacks or connections with Top officials? https://t.co/XzoU8HVCp4— Prashant Bhushan (@pbhushan1) April 22, 2025
ఒక్క రూపాయికి కనీసం ఓ ఇడ్లీ కూడా రాదు..! మరి 99 పైసలకు రూ.3,000 కోట్ల భూములు ఎలా..? అంటూ ఉర్సా ల్యాండ్ డీల్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీసీఎస్ కంటే ఎక్కువగా ఉర్సాకి భూ కేటాయింపులపై అనుమానాలు తలెత్తతున్నాయి.

అయినా సరే ఉర్సా ల్యాండ్ డీల్‌పై ఇప్పటి వరకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ నోరు మెదకపోవడం గమనార్హం. ఉర్సా డైరెక్టర్ అబ్బూరి సతీష్‌తో టీడీపీ ఎంపీ కేశినేని చిన్నికి భాగస్వామ్యం ఉంది. కేశినేని చిన్ని, అబ్బూరి సతీష్ బంధం బయటపడటంతో ఉర్సా ల్యాండ్ డీల్‌పై గల్లీ నుంచి ఢిల్లీ వరకు చర్చాంశనీయంగా మారింది.