Sep 27th 2023: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌ | Hearing On Chandrababu CID Custody And Bail Petitions In ACB Court Today, Live Updates And Latest News In Telugu - Sakshi
Sakshi News home page

Sep 27th 2023: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

Published Wed, Sep 27 2023 7:13 AM | Last Updated on Fri, Sep 29 2023 11:37 AM

Chandrababu Arrest: Court Hearings September 27 Live Updates - Sakshi

Chandrababu Arrest: Petitions in different courts - Live Updates

5:10 PM, సెప్టెంబర్‌ 27, 2023
కిం కర్తవ్యం.?
► ఢిల్లీ: ఎంపీ గల్లా జయదేవ్ నివాసంలో టిడిపి ఎంపీలతో లోకేష్ మంతనాలు
► పారని లీగల్‌ వ్యూహంతో దిగాలు పడ్డ చిన బాబు
► ఇప్పట్లో ఏపీకి వెళ్లకపోవడమే మంచిదని లోకేష్‌కు సూచించిన ఎంపీలు
► ఆంధ్రప్రదేశ్‌కు వస్తే లోకేష్‌ను అరెస్ట్‌ చేస్తారని కొన్ని రోజులుగా ఎల్లోమీడియా వార్తలు
► లోకేష్‌ వెళ్లగానే అరెస్ట్‌ కావడానికి అన్ని రకాల అవకాశాలున్నాయన్న ఎంపీలు
► ముందస్తు బెయిల్‌కు ఎలాంటి బలమైన వాదనలు లేవన్న ఎంపీలు
► వెళ్లి అరెస్ట్‌ అయ్యేకంటే ఇక్కడే హోటల్‌లో ఉండడమే మంచిదన్న భావనలో లోకేష్‌

4:50 PM, సెప్టెంబర్‌ 27, 2023
ACB  కోర్టు : బాబు కస్టడీ, బెయిల్‌ పిటిషన్లపై అక్టోబర్‌ 4న నిర్ణయం
► చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై వచ్చే నెల నాలుగు విచారణ వాయిదా
► అదే రోజున రెండు వర్గాలు వాదనలు పూర్తి చేయాలని న్యాయమూర్తి ఆదేశం
► మరోసారి వాదనాలు వేయవద్దని చంద్రబాబు లాయర్లకు సూచన
►ఎవరు వాదనలు చెప్పకపోయినా ఆర్డర్ పాస్ చేస్తామన్న న్యాయమూర్తి

4:25 PM, సెప్టెంబర్‌ 27, 2023
ACB  కోర్టులో కస్టడీ, బెయిల్‌ పిటిషన్లపై కొనసాగుతున్న వాదనలు
► చంద్రబాబును కస్టడీకి ఇవ్వండి, దర్యాప్తు పూర్తి చేస్తాం : CID లాయర్‌ పొన్నవోలు
► మొన్నటి కస్టడీలో చంద్రబాబు సహకరించలేదు
► ఆధారాలు చూపించడంతో చంద్రబాబు సమాధానాలు దాటవేశారు
► కస్టడీకి ఇస్తే కేసులో పూర్తి కుట్ర కోణం బయటపెడతాం
► విచారణ అక్టోబర్ 5కు వాయిదా వేయాలనుకున్నట్టు చెప్పిన న్యాయమూర్తి
► కస్టడీపై తమ వాదనలు పూర్తి చేయనివ్వాలని విజ్ఞప్తి చేసిన AAG పొన్నవోలు
► విచారణ వాయిదా వేయాలని కోరిన చంద్రబాబు లాయర్లు
► శుక్రవారం వాదనలు వినిపిస్తామన్న బాబు న్యాయవాదులు
► చంద్రబాబు తరపు లాయర్లపై ఏసీబీ కోర్టు ఆగ్రహం
► పిటిషన్‌ దాఖలు చేస్తారు, పదేపదే వాయిదా వేయాలని ఎందుకు కోరతారు?
► బెయిల్ పిటిషన్ దాఖలు చేసి 17 రోజులైనా వాదనలు ఎందుకు వినిపించడం లేదు?
► విచారణ ఎందుకు ముందుకు జరగనివ్వడం లేదని బాబు లాయర్లను ప్రశ్నించిన జడ్జి
► కోర్టు సమయం వృధా ఎందుకుచ చేస్తున్నారంటూ ప్రశ్నించిన న్యాయమూర్తి
► ఎంతకాలం పిటిషన్‌ను పెండింగ్ లో ఉంచాలి?
► లిఖిత పూర్వక మెమో దాఖలు చేయండి

4:20 PM, సెప్టెంబర్‌ 27, 2023
హైకోర్టులో ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసు ఎల్లుండికి వాయిదా
► అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కొనసాగిన వాదనలు
► చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దంటూ కోరిన CID
► ఈ స్కాంలో చంద్రబాబు కుటుంబానికి లబ్ధి చేకూరింది : అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌
► ఏ కేసుకి ఆ కేసు ప్రత్యేకమని కులకర్ణి కేసులో గౌరవ న్యాయస్థానం స్పష్టం చేసింది
► ఒక కేసులో అరెస్ట్ అయితే అన్ని కేసుల్లో అరెస్ట్ అయినట్టు కాదు
► ఒక కేసులో రిమాండ్ విధించినప్పుడు అది మరో కేసుకు వర్తించదు
► మరో కేసులో మళ్లీ రిమాండ్ విధించవచ్చు
► ఈ అంశానికి సంబంధించిన పలు తీర్పును న్యాయమూర్తికి అందజేసిన అడ్వకేట్ జనరల్ శ్రీరామ్
► కేసును ఈ నెల 29, శుక్రవారం మధ్యాహ్నంకు వాయిదా వేసిన కోర్టు

4:05 PM, సెప్టెంబర్‌ 27, 2023
బలమైన ఆధారాలు vs పసలేని వాదనలు : సీనియర్ లాయర్లు
► స్కిల్ స్కాం కేసులో చంద్రబాబువి అత్యంత బలహీనమైన వాదనలు
► తనను అరెస్ట్ చేసిన విధానమే చంద్రబాబు చెప్పుకుంటున్న ఏకైక పాయింట్
► ఎల్లోమీడియాలో చెప్పేదొకటి, కోర్టుల ముందు వాదించేది ఒకటి
► ప్రజలను నమ్మించడానికి తెలుగుదేశం, ఎల్లో మీడియా అబద్డాల ప్రచారం
► 17A కింద అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి అవసరమంటూ గగ్గోలు
► తప్పు చేయలేదు అని కోర్టు ముందు బలంగా చెప్పుకోలేని దుస్థితి
► కోర్టుల ముందు తప్పనిసరి పరిస్థితుల్లో నిజాల ఒప్పుకోలు
► పీకల్లోతు ఆరోపణలు, ప్రతీ దాంట్లో బాబుకు వ్యతిరేకంగా ఆధారాలు
► ఏకంగా 13 చోట్ల స్వయంగా సంతకాలు చేసిన చంద్రబాబు
► ఈ కేసులో చంద్రబాబు తప్పించుకోవడం కష్టమంటున్న లాయర్లు

3:40 PM, సెప్టెంబర్‌ 27, 2023
సుప్రీంకోర్టులో చంద్రబాబుకు చుక్కెదురు
► చంద్రబాబు కేసును చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ముందుకు తీసుకెళ్లిన బాబు లాయర్ లూథ్రా
చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ :  మీకు ఏం కావాలి?
సిద్ధార్థ్ లూథ్రా : చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ పై విచారణ జరపాలి
చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ :  చంద్రబాబుకు రిలీఫ్ కావాలంటే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోండి
సిద్ధార్థ్ లూథ్రా : మేం బెయిల్‌ కావాలని అడగడం లేదు, త్వరగా లిస్ట్‌ చేయమని అడుగుతున్నాం
చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ :  అక్టోబర్ 3న ఈ కేసును ఏదో ఒక బెంచ్ కు కేటాయిస్తాం
సిద్ధార్థ్ లూథ్రా : 17A సెక్షన్ ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోలేదు, మధ్యంతర ఉపశమనం కావాలని అడుగుతున్నాం
చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ :  ACB కోర్టు విచారణ జరుపుతున్న ఇలాంటి కీలక సమయంలో మేం దర్యాప్తును అడ్డుకోలేం.
సిద్ధార్థ్ లూథ్రా : Z కేటగిరి ఉన్న వ్యక్తిని జైల్లో పెట్టారు, కనీసం CIDకి కస్టడీ ఇవ్వకుండా ఆదేశాలివ్వండి
చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ : చంద్రబాబు నాయుడిని పోలీస్ కస్టడీ ఇవ్వొద్దన్న ఆదేశాలను ఈ సమయంలో ఇవ్వలేం. ఈ కేసును  అక్టోబర్ 3, 2023, మంగళవారానికి వాయిదా వేస్తున్నాం

3:30 PM, సెప్టెంబర్‌ 27, 2023
సుప్రీంకోర్టులో CID వాదనలు
► ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున లాయర్ రంజిత్ కుమార్ వాదనలు
► స్కిల్ స్కాం కుట్ర, కుంభకోణం పరిధి చాలా పెద్దవి
► రూ.3300 కోట్ల ప్రాజెక్టు అని చెప్పుకొచ్చారు
► దీంట్లో 90% గ్రాంటు కింద సీమెన్స్ ఇస్తుందని చెప్పారు
► ప్రభుత్వం కేవలం 10% పెడితే చాలంటూ నిధులు విడుదల చేశారు
► ఇక్కడ కథ మలుపు తిరిగింది, 90% మాయమయింది
► ఈ 10% నిధులు మాత్రం ముందుకెళ్లిపోయాయి
► తొలుత ఈ స్కాంను GST అధికారులు గుర్తించారు
► 2018 , పిసి యాక్ట్ - 17ఏ సవరణ రాకముందే నేరం జరిగింది
► ప్రస్తుత పరిస్థితుల్లో దర్యాప్తును సజావుగా సాగనివ్వాలి
► చీఫ్ జస్టిస్ చంద్రచూడ్‌కు విజ్ఞప్తి చేసిన లాయర్ రంజిత్

3:20 PM, సెప్టెంబర్‌ 27, 2023
రెండు కేసులు వేర్వేరు, బాబుకు బెయిల్‌ వద్దు : అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరాం
► హైకోర్టు : ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై వాదనలు
► వేర్వేరు కేసుల్లో సెక్షన్‌ 428 వర్తించదన్న ఏజీ శ్రీరామ్
► స్కిల్, ఇన్నర్‌ రింగ్‌రోడ్‌ కేసుల్లో 2 వేర్వేరు లావాదేవీలు జరిగాయి
► రెండు కేసుల్లో వేర్వేరు నిందితులు ఉన్నారు
► రెండు వేర్వేరు కుట్రలు, రెండు వేర్వేరు కుంభకోణాలు
► ఈ రెండు కేసుల్లోనూ చంద్రబాబు కీలక సూత్రధారి, కీలక పాత్రధారి
► చంద్రబాబుకు బెయిల్ ఇవ్వొద్దు : AP అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరాం

3:00 PM, సెప్టెంబర్‌ 27, 2023
"నాట్‌ బిఫోర్‌ మీ" ఎందుకంటే..
► జస్టిస్‌ SVN భట్టి పూర్తి పేరు సరస వెంకట నారాయణ భట్టి
► 2013 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో జడ్జిగా సేవలందించిన జస్టిస్‌ భట్టి
► 14 జులై 2023 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలందిస్తోన్న జస్టిస్‌ భట్టి
► ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మ్యాటర్‌ కాబట్టి ఈ కేసు నుంచి దూరంగా ఉంటున్నానని ప్రకటించిన జస్టిస్‌ భట్టి
► జస్టిస్‌ భట్టి నిర్ణయాన్ని గౌరవించాలని సూచించిన జస్టిస్‌ ఖన్నా

2:45 PM, సెప్టెంబర్‌ 27, 2023
చంద్రబాబు పిటిషన్‌ వాయిదా
► చంద్రబాబు స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వాయిదా
► పిటిషన్‌పై వాదనల కంటే ముందే ప్రకటన చేసిన జస్టిస్‌ ఖన్నా
జస్టిస్‌ ఖన్నా : మా సహచరుడు జస్టిస్‌ SVN భట్టి ఈ కేసుకు దూరంగా ఉండాలనుకుంటున్నారు
హరీష్‌ సాల్వే : వీలయినంత తొందరగా విచారణకు వచ్చేలా చూడగలరు
జస్టిస్‌ ఖన్నా : వచ్చే వారం చూద్దాం
సిద్ధార్థ లూథ్రా : ఒక సారి చీఫ్‌ జస్టిస్‌ దృష్టికి తీసుకెళ్తాను
జస్టిస్‌ ఖన్నా : మీరు కలవొచ్చు. ప్రస్తుతానికి ఈ కేసు వాయిదా వేస్తున్నాను
హరీష్‌ సాల్వే : వాయిదా వేయడం ఒక్కటే మార్గం కాదు
జస్టిస్‌ ఖన్నా : చీఫ్‌ జస్టిస్‌ను కలిసి మరో బెంచ్‌ ముందు వాదనలు వినిపిస్తానని లూథ్రా అంటున్నారు
హరీష్‌ సాల్వే : సోమవారం వాదనలకు అవకాశం ఇవ్వండి
జస్టిస్‌ ఖన్నా : సోమవారం అవకాశం లేదు. వచ్చే వారం తప్పకుండా వింటాం
సిద్ధార్థ లూథ్రా : ఒక అయిదు నిమిషాలు నాకు సమయం ఇవ్వండి
జస్టిస్‌ ఖన్నా : సరే, నేను ఆర్డర్‌ పాస్‌ చేస్తున్నాను
జస్టిస్‌ ఖన్నా : "ప్రస్తుతం బెంచ్‌ ముందు ఉన్న ఈ స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను వచ్చే వారం విచారణకు స్వీకరిస్తాం. ఆ బెంచ్‌లో మా సహచరుడు SVN భట్టి ఉండేందుకు సుముఖంగా లేరు కాబట్టి మరో జడ్జితో కలిసి ఈ కేసును విచారిస్తాం. సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ తుది ఆదేశాలకు లోబడి ఈ ఆర్డర్‌ వర్తిస్తుంది".

2:35 PM, సెప్టెంబర్‌ 27, 2023
నాట్‌ బిఫోర్‌ : సుప్రీంకోర్టు
► చంద్రబాబు స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై స్పందించిన సుప్రీంకోర్టు
► చంద్రబాబు పిటిషన్‌పై "నాట్‌ బిఫోర్‌ మి" అని స్పందించిన జస్టిస్‌ SVN భట్టి
► మరో బెంచ్‌కు పిటిషన్‌ను మార్చాల్సిన అవశ్యకత
► ఈ కేసును విచారించలేనని తేల్చిచెప్పిన జస్టిస్‌ భట్టి
► బాబు పిటిషన్‌పై వచ్చే వారం విచారణ జరిగే అవకాశం
► రేపటి నుంచి అక్టోబర్ 2 వరకు సుప్రీంకోర్టుకు సెలవులు

2:15 PM, సెప్టెంబర్‌ 27, 2023
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు హాల్‌ నెంబర్‌ 3కు ఇరుపక్షాల లాయర్లు
► చంద్రబాబు స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై కొద్దిసేపట్లో విచారణ
► చంద్రబాబు తరపున మరోసారి హరీష్‌ సాల్వే, సిద్ధార్థ లూథ్రా
► కిక్కిరిసిన హాల్‌ నెంబర్‌ 3, వాదనలు వినేందుకు వచ్చిన లాయర్లు, ఇతరులు
► బెంచ్‌ మీదకు వచ్చిన కేసు

2:10 PM, సెప్టెంబర్‌ 27, 2023
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు కిక్కిరిసిన హాల్‌ నెంబర్‌ 3
► మరికొద్దిసేపట్లో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను విచారించనున్న సుప్రీంకోర్టు
► విచారణ జరపనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ SVN భట్టి ధర్మాసనం
► ఐటం నెంబర్‌ 61గా లిస్ట్ అయిన చంద్రబాబు పిటిషన్‌
► స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ నెంబర్‌ 12289/2023
► చంద్రబాబు తరపున రికార్డు ప్రకారం అడ్వొకేట్‌ గుంటూరు ప్రమోద్‌
► ఇప్పటికే హేమాహేమీలను రంగంలోకి దించుతామని చెబుతోన్న లోకేష్‌
► గత 11 రోజులుగా ఢిల్లీలోనే ఉంటూ సుప్రీంకోర్టు లాయర్లతో లోకేష్‌ మంతనాలు
► హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ సందర్భంగా బాబు తరపున హరీష్‌ సాల్వే, సిద్ధార్థ లూథ్రా
► Follow www.sakshi.com LIVE updates

1:56 PM, సెప్టెంబర్‌ 27, 2023
బాబు దోచుకుంటే.. జగన్‌ ఫ్రీగా స్కిల్‌ ‍ట్రైనింగ్‌ ఇప్పిస్తున్నారు
►  చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కాంపై మండలిలో స్వల్పకాలిక చర్చ.. ఎమ్మెల్సీ తోమాటి మాధవరావు కామెంట్స్
►   స్కిల్ డెవలప్మెంట్ ను స్కామ్ గా మార్చి చంద్రబాబు తన ఆదాయవనరుగా చేసుకున్నారు
►  చంద్రబాబు 371 కోట్లు స్కిల్ డెవలప్మెంట్ పేరుతో కొల్లగొట్టాడు.
►  ప్రజాధనాన్ని దోచుకుని తాను ఏమీ చేయలేదన్నట్లు మాట్లాడుతున్నాడు
►   సీఎం జగన్ మోహన్ రెడ్డి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా విద్యార్థుల భవితకు అండగా నిలుస్తున్నారు
►  26 జిల్లాలలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లఏర్పాటుకు ఒక్కొక్క దానికి ఐదు ఎకరాల భూమిని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కేటాయించారు
►  సీఎం జగన్‌.. ప్రభుత్వ నిధుల నుండి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా వివిధ సంస్థల సీఎస్ఆర్ ఫం‍డ్స్‌ ద్వారా విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు

1:10 PM, సెప్టెంబర్‌ 27, 2023
హైకోర్టులో నారా లోకేష్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌
►  ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అక్రమ అలైన్‌మెంట్‌ కేసులో A14గా లోకేష్
►  అరెస్ట్‌ భయంతో గత 11 రోజులుగా ఢిల్లీకే పరిమితమైన లోకేష్‌
►  తాజాగా ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో లోకేష్‌ పాత్రను తేల్చిన CID
►  లోకేష్‌కు ఏ రకంగా లబ్ది చేకూరిందో తెలుపుతూ A14గా తేల్చిన CID
►  తనను అరెస్ట్‌ చేయకుండా నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్
►  ముందస్తు బెయిల్‌ ఇస్తే పాదయాత్ర చేసుకుంటానంటున్న లోకేష్‌

1:00 PM, సెప్టెంబర్‌ 27, 2023
సుప్రీంకోర్టులో లంచ్‌ బ్రేక్‌ తర్వాతే చంద్రబాబు కేసు
►  ఢిల్లీ: సుప్రీం కోర్టు లో లంచ్ బ్రేక్
►  లంచ్ బ్రేక్ తర్వాతే చంద్రబాబు కేసు విచారణ
►  లంచ్‌ కోసం బెంచ్ నుంచి లేచిన జస్టిస్ సంజీవ్ కన్నా జస్టిస్ SVN భట్టి
►  మధ్యాహ్నం రెండు గంటల తర్వాత తిరిగి ప్రారంభం కానున్న విచారణ
►  ఐటెం నెం.61 గా ఉన్న చంద్రబాబు స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌

12:50 PM, సెప్టెంబర్‌ 27, 2023
ఈ ప్రశ్నలకు సమాధానాలున్నాయా? 
►  ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అక్రమ అలైన్‌మెంట్‌పై టిడిపికి YSRCP ఏడు ప్రశ్నలు
1. అలైన్‌మెంట్ ఖరారుకు ముందు లింగమనేని ఎకరాను రూ.8 లక్షలకు విక్రయించారు, అలైన్‌మెంట్‌ తర్వాత రూ.36 లక్షల రిజిస్టర్ విలువ చూపించారు. అంటే రిజిస్టర్‌ విలువే నాలుగున్నర రెట్లకు పైగా పెరిగింది వాస్తవం కాదా?
2. మార్కెట్ ధర ప్రకారం ఎకరా రూ.2.50 కోట్లు పలికింది. 355 ఎకరాల విలువ మార్కెట్ ధర ప్రకారం అమాంతంగా రూ.887.50 కోట్లకు పెరిగింది వాస్తవం కాదా?
3. అమరావతి నిర్మాణం పూర్తయితే సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో ఎకరా విలువ రూ.4 కోట్లకు చేరుతుందని నాడు సీఎం హోదాలో  చంద్రబాబే ప్రకటించింది వాస్తవం కాదా?
4. ఇన్నర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న భూముల విలువ ఎకరా రూ.6 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది వాస్తవం కాదా?
5. అమరావతి నిర్మాణం పూర్తయితే ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు పక్కనున్న 355 ఎకరాల విలువ ఏకంగా రూ.2,130 కోట్లకు చేరుతుందని  అంచనా వాస్తవం కాదా?
6. ఆ ప్రకారం మార్కెట్ ధరను బట్టి హెరిటేజ్‌ఫుడ్స్ 10.4 ఎకరాల మార్కెట్ విలువ రూ.5.20 కోట్ల నుంచి రూ.41.6 కోట్లకు కోట్లు పెరిగిందన్నది వాస్తవం కాదా?
7. ఇన్నర్‌ రింగ్ రోడ్డే లేదు.. స్కాం జరగలేదంటారు.. మరి ఇన్నాళ్లు ప్రజలకు రాజధాని కట్టామని ఎందుకు చెప్పారు? చంద్రబాబు సృష్టించిన సంపద అంటే మాయా ప్రపంచమేనా?

12:40 PM, సెప్టెంబర్‌ 27, 2023
లోకేష్‌ జోలికి రావొద్దు : తెలుగుదేశం
► అర్జంటుగా భుజాలు తడుముకుంటోన్న తెలుగుదేశం బృందం
► లోకేష్‌ను A14గా అభియోగాలు మోపుతూ కోర్టులో CID పిటిషన్‌
► A14 అని తెలియగానే ఢిల్లీలో చిందులు తొక్కిన చినబాబు
► ఏమైనా చేయండి, నాపై కేసును ఖండించాలని టిడిపి నేతలకు ఆదేశం
► ఆఘమేఘాల మీద పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ పెట్టిన పంచుమర్తి అనురాధ
► అసలు మేం రాజధానే కట్టలేదు, ఇక ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు ఎక్కడిది? : పంచుమర్తి
► అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకు భూమి సేకరించలేదు, బడ్జెట్ కేటాయించలేదు
► హెరిటేజ్‌కు ప్రయోజనం చేకూర్చారన్న ఆరోపణలు కూడా సరికాదు
► లింగమనేనికి అనుకూలంగా ఇన్నర్ రింగ్ రోడ్ తయారు చేశారని ఎలా చెబుతారు?: పంచుమర్తి
► TDP తీరును తప్పుబట్టిన YSRCP, ఇదే విషయం కోర్టులో చెప్పగలరా? : YSRCP
► CID చూపించిన ఆధారాలకు ఏమని సమాధానం చెబుతారు? : YSRCP

12:10 PM, సెప్టెంబర్‌ 27, 2023
ACB కోర్టులో మీ నిర్ణయమేంటీ?
► కస్టడీ, బెయిల్‌ పిటిషన్‌పై CID, బాబు లాయర్ల వాదనలు
► వెంటనే వాదనలు వినాలన్న CID లాయర్లు
► సుప్రీంకోర్టులో SLP ఉన్నందున దాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్న బాబు లాయర్లు
► వాదనల విషయంలో ఒక నిర్ణయానికి రావాలని ఇరుపక్షాల లాయర్లకు కోర్టు సూచన
► సాయంత్రం 5గంటలలోపు వాదనలపై ఏకాభిప్రాయానికి వస్తే వింటామన్న న్యాయమూర్తి

11:40 AM, సెప్టెంబర్‌ 27, 2023
కోర్టుల మీద నోరు పారేసుకుంటారా? క్రిమినల్‌ కేసు పెట్టమని హైకోర్టు సీరియస్‌
► చంద్రబాబు అరెస్టు తర్వాత న్యాయవ్యవస్థపై దుర్మార్గపు వ్యాఖ్యలు చేసిన ఎల్లో బ్యాచ్‌
► నిందలు, ఆరోపణలు, విమర్శలు చేసిన పచ్చ మీడియా, టిడిపి నేతలు
► హైకోర్టు జడ్జిలు, దిగువ కోర్టు న్యాయమూర్తులపై దూషణలకు దిగిన గ్యాంగ్‌
► ఈ వ్యవహారం అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరాం దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు
► ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ శ్రీరామ్
► తెలుగుదేశం నాయకులు, సానుభూతి పరులు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన హైకోర్టు
► టిడిపి నేతలు బుచ్చయ్య చౌదరీ, బుద్ధా వెంకన్న, రామకృష్ణ సహా 26 మందికి నోటీసులు
► ట్రోల్‌ చేసిన సోషల్‌ మీడియా ఖాతాలకు నోటీసులు ఇవ్వాలని AP DGPకి ఆదేశం

► బుద్ధా వెంకన్న
► గోరంట్ల బుచ్చయ్య చౌదరీ
► ఎస్‌. రామకృష్ణ
► రామకృష్ణ గోనె
► మువ్వా తారక్‌ కృష్ణ యాదవ్‌
► రవికుమార్‌ ముదిరాజు
► రుమాల రమేష్‌
► ఎల్లా రావు
► కళ్యాణి
► అకౌంట్‌ :  @NCHIRAN17457886
► అకౌంట్‌ :  In Jesus New Life @ NewIN34229
► అకౌంట్‌ :  @TrueAPDeveloper
► అకౌంట్‌ :  Mosapu
► అకౌంట్‌ :  Jail Jj
► అకౌంట్‌ :   The Ark @ArkTheAce
► అకౌంట్‌ :  @EdukondaluMupp2        
► అకౌంట్‌ :  @Royanenenu
► అకౌంట్‌ :  @Wish_cap
► అకౌంట్‌ :  @Cdattu
► అకౌంట్‌ :  @Bean9989
► అకౌంట్‌ :  Chary Veda
► అకౌంట్‌ :  Paramasivaiah Gsanju Chandu
► అకౌంట్‌ :  SriKishore Kumar
► సంస్థ : గూగుల్‌ ఇండియా
► సంస్థ : ట్విట్టర్‌ ఇండియా
► సంస్థ : ఫేస్‌బుక్‌ ఇండియా

11:30 AM, సెప్టెంబర్‌ 27, 2023
అసెంబ్లీలో చంద్రబాబు అసలు రంగు బయటపెట్టిన MLA వరప్రసాద్‌
► వ్యవస్థలను మేనేజ్‌ చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు
► ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 23 మంది ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకున్నాడు
► ఓటుకు కోట్లు అనే కాన్సెప్ట్‌ను చంద్రబాబు ఎప్పటినుంచో అనుసరిస్తున్నాడు
► తిరుపతి ఎంపీగా నేను ఉన్నప్పుడు టిడిపిలో చేరమని ఒత్తిడి తెచ్చాడు
► ఒకటి కాదు..రెండు కాదు.. వంద కోట్లు ఇస్తామని ఆఫర్‌ ఇచ్చాడు
► చంద్రబాబు లాంటి దిగజారిన రాజకీయాలు చేసే వ్యక్తి ఇంకొకరు లేరు

11:15AM, సెప్టెంబర్‌ 27, 2023
ACB కోర్టులో బాబు కస్టడీ, బెయిల్‌ పిటిషన్లు
► ACB కోర్టుకు చేరుకున్న ఇరు వర్గాల న్యాయవాదులు
► కస్టడీ పిటిషన్ పై విచారణ చేయాలన్న CID లాయర్‌ వివేకానంద
► బెయిల్ పిటిషన్ పై వాదనలు వినాలన్న చంద్రబాబు లాయర్‌ ప్రమోద్ దూబే
► మధ్యాహ్నం 12 గంటల తర్వాత వాదనలు వింటానన్న న్యాయమూర్తి

11:10AM, సెప్టెంబర్‌ 27, 2023
సుప్రీంకోర్టు ఏం తేల్చబోతుంది?
► అందరి చూపు సుప్రీంకోర్టు వైపు
► చంద్రబాబు స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌లో నేడు వాదనలు జరిగే అవకాశం
► చంద్రబాబు తరపున దేశంలోనే అత్యంత ఖరీదైన లాయర్లు
► అరెస్ట్‌ జరిగిన తీరును ప్రశ్నిస్తూ పిటిషన్‌ వేసిన బాబు లాయర్లు
► 17A సెక్షన్‌ ప్రకారం గవర్నర్‌కు చెప్పలేదంటూ సాంకేతిక అంశాలు
► హైకోర్టులో ఇదే అంశంపై వాదనలు, బాబు లాయర్ల వాదనను తిరస్కరించిన కోర్టు
► కేసు కీలక దశలో ఉంది, దర్యాప్తును నిలిపివేయలేమని తేల్చిచెప్పిన హైకోర్టు
► ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం తేల్చబోతుందన్న దానిపై ఉత్కంఠ
► రేపటి నుంచి అక్టోబర్‌ 3వరకు సుప్రీంకోర్టుకు సెలవులు

11:00AM, సెప్టెంబర్‌ 27, 2023
ఏసీబీ కోర్టు ముందుకు చంద్రబాబు పిటిషన్లు
► చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విచారణ జరిగే అవకాశం
► విచారణ కోసం జడ్జి ముందు మెన్షన్ చేసిన చంద్రబాబు లాయర్లు
► రెండు పిటిషన్లను విచారించి ఉత్తర్వులు ఇస్తామని తెలిపిన జడ్జి
► స్కిల్ డెవలప్ మెంట్ కేసులో బెయిల్ కోరుతూ చంద్రబాబు పిటిషన్
► చంద్రబాబును మరో 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ పిటిషన్

10:50AM, సెప్టెంబర్‌ 27, 2023
హైకోర్టు ముందుకు ఉండవల్లి అరుణ్‌కుమార్‌ పిటిషన్‌
►హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ముందుకు మాజీ ఎంపీ ఉండవల్లి పిటిషన్‌
►ఇప్పటికే బెంచ్‌ను కేటాయించిన హైకోర్టు రిజిస్ట్రీ
►పిల్ విచారించేందుకు తమలో ఒకరికి అభ్యంతరం ఉందని పేర్కొన్న బెంచ్
►నాట్ బి ఫోర్ మీ అని పేర్కొన్న జస్టిస్ రఘునందన్ రావు
►మరో బెంచ్‌కు వెంటనే బదిలీ చేయాలని ఆదేశించిన చీఫ్‌ జస్టిస్‌
►ప్రజా ప్రయోజనవ్యాజ్యానికి రిట్‌ నెంబర్‌ 38371/2023 కేటాయింపు
►చంద్రబాబు A1గా ఉన్న స్కిల్‌ స్కాం పరిధి చాలా పెద్దదని పేర్కొన్న ఉండవల్లి
►ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థలు CBI, ED, ITలకు అప్పగించాలని విజ్ఞప్తి
►నిధులు పక్కదారి పట్టించేందుకు ఇతర ప్రాంతాల్లో షెల్‌ కంపెనీలు ఏర్పాటయ్యాయి
►ఈ కంపెనీల గుట్టు బయటపడాలంటే సమగ్ర దర్యాప్తు అవసరం
►కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలన్నీ ఏకమై విచారణ చేస్తేనే కుట్ర బహిర్గతమవుతుంది
►ఈ కుంభకోణంలో  చంద్రబాబు పాత్ర పై  పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలి
►44 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ రిట్ పిటీషన్ దాఖలు
►హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ రఘునందన్ రావు బెంచ్‌ ముందుకు పిటిషన్

10:30AM, సెప్టెంబర్‌ 27, 2023
తప్పు చేయలేదని చెప్పడం లేదు, అరెస్ట్‌ను తప్పుపడుతున్నారంతే.!
►నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు విచారణ
►విచారణ చేయనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్విఎన్ భట్టి ధర్మాసనం
►ఐటం నెంబర్‌ 61 గా లిస్ట్ అయిన బాబు కేసు
►తన క్వాష్ పిటిషన్‌ను డిస్మిస్ చేసిన హైకోర్టు తీర్పును కొట్టేయాలని అభ్యర్థన
►తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ , రిమాండ్ ను రద్దు చేయాలని  పిటిషన్ లో వినతి
►అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ తనకు వర్తిస్తుందని వాదన
►గవర్నర్ అనుమతి లేకుండా తన అరెస్టు చేయడం చట్ట విరుద్ధమని పిటిషన్ లో వెల్లడి

10:00AM, సెప్టెంబర్‌ 27, 2023
తప్పు చేయలేదని చెప్పడం లేదు, అరెస్ట్‌ను తప్పుపడుతున్నారంతే.!
►అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ తనకు వర్తిస్తుందని చంద్రబాబు వాదన 
►గవర్నర్ అనుమతి లేకుండా తన అరెస్టు చేయడం చట్ట విరుద్ధమని పిటిషన్ లో వెల్లడి
►కానీ, 17 (ఏ) సెక్షన్ చంద్రబాబుకు వర్తించదని హైకోర్టు స్పష్టీకరణ
►ఈ క్రమంలోనే క్వాష్‌ పిటిషన్‌ కొట్టివేత కూడా
► ఆ వెంటనే సుప్రీంలో చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ 
►తన క్వాష్ పిటిషన్ ను డిస్మిస్ చేసిన హైకోర్టు తీర్పును కొట్టేయాలని అభ్యర్థన
►తనపై నమోదైన స్కిల్ స్కాం  కేసును కొట్టివేయాలని పిటిషన్ 
►తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ , రిమాండ్ ను రద్దు చేయాలని  పిటిషన్ లో వినతి.. నేడు విచారణ

09:22AM, సెప్టెంబర్‌ 27, 2023
ముందు ఏ పిటిషన్‌పై విచారణ?
►ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటీషన్లపై విచారణ
►చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలని కోరిన చంద్రబాబు తరపు న్యాయవాదులు
►రెండురోజుల కస్టడీలో చంద్రబాబు సహకరించలేదని, మరో ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని  సీఐడీ అధికారుల పిటిషన్‌
►ఏ పిటిషన్ పై ముందు వాదనలు జరుపుతామనేది ఈ రోజు ప్రకటించనున్న కోర్టు
►ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో పిటి వారెంట్, ఏపి ఫైబర్ నెట్ కేసులో పిటి వారెంట్ పైనా ఈరోజు వాదనలు జరిగే అవకాశం
►ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాం కేసులో నారా లోకేష్ ను A14గా చేర్చి ఇంచార్జి ఎమ్ఎస్ జే కోర్టులో మెమో దాఖలు చేసిన సీఐడీ
►లోకేష్‌ పేరుతో కూడిన మెమోపై కూడా ఇవాళ విచారణ జరిగే అవకాశం..

09:10AM, సెప్టెంబర్‌ 27, 2023
అసెంబ్లీ సమావేశాల్లో బాబు స్కామ్‌లపై చర్చ
►ఏపీ అసెంబ్లీ సెషన్‌.. చివరిరోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. 
►పలు బిల్లులతో పాటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ కుంభకోణంపై చర్చ జరగనుంది.
►అలాగే శాసనమండలిలో  స్కిల్ డెవలప్‌మెంట్‌ కుంభకోణంపైనా చర్చ జరగనుంది

08:55AM, సెప్టెంబర్‌ 27, 2023
లోకేష్‌ పాత్ర ఉందనే ఫిర్యాదు చేశా: ఎమ్మెల్యే ఆర్కే
►ఇన్నర్‌ రోడ్‌ స్కాంలో లోకేష్‌ పాత్ర ఉందనే సీఐడీకి ఫిర్యాదు చేశా
►చట్టాలు గౌరవిస్తానని చెప్పే చంద్రబాబు, లోకేస్‌.. కోర్టు విషయంలో ఎందుకు భయపడుతున్నారు
►ఇన్నర్‌ రింగ​ రోడ్‌ అలైన్మెంట్‌ విషయంలో తన వారికి లబ్ధి చేకూరే విధంగా మార్పు చేశారనేది స్పష్టం. 

08:00AM, సెప్టెంబర్‌ 27, 2023
తండ్రీకొడుకుల ఆట ముగిసింది: ఎంపీ విజయసాయిరెడ్డి
►తండ్రి ఎలాగో కొడుకు అలాగే!
►ఇన్నర్ రింగ్ రోడ్ స్కాంలో నారా లోకేష్ A14ని కలవండి.
►ఢిల్లీలో ఉన్నప్పుడు తను కలిసే లాయర్లకు బై-వన్-గెట్-వన్-ఫ్రీ స్కీమ్ అందించాలి.
►తండ్రి కేసును టేకప్ చేయండి.. కొడుకు కేసును ఉచితంగా పొందండి
►ఈ తండ్రీకొడుకుల ఆట ఇప్పుడు ముగిసింది.

06:52AM, సెప్టెంబర్‌ 27, 2023
క్రిమినల్ కంటెంప్ట్ పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ
►హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన ఏజీ
►నేడు విచారిస్తామన్న హైకోర్టు డివిజన్ బెంచ్

06:52AM, సెప్టెంబర్‌ 27, 2023
నేడు చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్ల పై ఏసీబీ కోర్టులో విచారణ
►బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్ల పై విచారణ నేటికి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు
►రెండు పిటిషన్ల పై నేడు విచారణ జరిపి ఉత్తర్వులు ఇస్తామన్న ఏసీబీ కోర్టు
►చంద్రబాబును మరో 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్
►సీఐడీ వేసిన కస్టడీ పిటిషన్ లో కౌంటర్ దాఖలు చేసిన చంద్రబాబు న్యాయవాదులు

06:45AM, సెప్టెంబర్‌ 27, 2023
నేడు హైకోర్టులో అమరావతి రింగ్ రోడ్డు కేసు విచారణ
►అమరావతి రింగ్ రోడ్డు కేసు విచారణను నేటికి వాయిదా వేసిన హైకోర్టు
►మధ్యాహ్నం 2.15 గం.కు వాదనలు వింటామన్న హైకోర్టు
►రింగ్ రోడ్డు కేసులో బెయిల్ కోరుతూ హైకోర్టులో చంద్రబాబు పిటిషన్

06:44AM, సెప్టెంబర్‌ 27, 2023
నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు విచారణ
►విచారణ చేయనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్విఎన్ భట్టి ధర్మాసనం
►ఐటెం నెం.61 గా లిస్ట్ అయిన బాబు కేసు
►తన క్వాష్ పిటిషన్ ను డిస్మిస్ చేసిన హైకోర్టు తీర్పును కొట్టేయాలని అభ్యర్థన
►తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ , రిమాండ్ ను రద్దు చేయాలని  పిటిషన్ లో వినతి
►అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ తనకు వర్తిస్తుందని వాదన 
►గవర్నర్ అనుమతి లేకుండా తన అరెస్టు చేయడం చట్ట విరుద్ధమని పిటిషన్ లో వెల్లడి

06:00AM, సెప్టెంబర్‌ 27, 2023
రాజమండ్రి జైల్లో చంద్రబాబు @18
►రాజమండ్రి సెంట్రల్ జైల్లో 18వ రోజుకు చేరుకున్న చంద్రబాబు రిమాండ్.
► స్కిల్‌డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో సెప్టెంబర్‌ 9వ తేదీన నంద్యాలలో అదుపులోకి తీసుకున్న ఏపీ సీఐడీ
► ఏసీబీ కోర్టు రిమాండ్‌తో  ఖైదీ నెంబర్‌ 7691గా రాజమండ్రి సెంట్రల్‌ జైలు స్నేహా బ్లాక్‌లో చంద్రబాబు
► రెండుసార్లు జ్యూడీషియల్‌ రిమాండ్‌ పొడిగింపు
► తాజా పొడిగింపుతో అక్టోబర్‌ 5వ తేదీ వరకు జైల్లోనే చంద్రబాబు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement