Nara Bhuvaneshwari
-
సీఎం గారి భార్య కదా..
-
గెస్ట్‌గా నారా భువనేశ్వరి.. రూ.7కోట్లు ఖర్చు పెట్టిన ఏపీ ప్రభుత్వం
సాక్షి,అమరావతి : సీఎం చంద్రబాబు భార్య భువనేశ్వరి హాజరైన ఈవెంట్‌కి కూటమి ప్రభుత్వం రూ.7 కోట్లు ఖర్చు పెట్టింది. మహిళ సాధికారత పేరుతో పర్యాటక శాఖ భవాని ద్వీపంలో నిర్వహించిన శక్తి విజయోత్సవ్కి నారా భువనేశ్వరి ముఖ్య అతిధిగా హాజరయ్యారు .అయితే ఈ ఈవెంట్‌కు ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది.మొదట రూ.2 కోట్లకి మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తర్వాత మరో రూ.5 కోట్లుకి అనుమతి తెలిపింది ప్రభుత్వం. చంద్రబాబు భార్య కావడంతో ప్రభుత్వం అడిగినంత మంజూరు చేసింది. భువనేశ్వరి వచ్చిన ఈవెంట్‌కు రూ.7కోట్లు ఖర్చు పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
CBN: టెన్షన్‌తో బాబుకి ముచ్చెమటలు!
ఏపీ శాసనసభ ఎన్నికలలో ఆయా రాజకీయ పార్టీల విజయావకాశాలపై ఎంత చర్చ జరుగుతున్నదో, అంతకన్నా ఎక్కువ చర్చ కొందరు ప్రధాన నేతల నియోజకవర్గాలపై కూడా జరుగుతోంది. ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో మరోసారి ఆయన గెలుస్తారా?లేదా? అన్నది ఆసక్తికరంగా ఉంది. వైఎస్సార్సీపీ నేతలు ఈసారి తాము హిట్ కొడతామని చెబుతున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో తనను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. కాకపోతే ఆయన ఎన్నడూ అంత మెజార్టీతో గెలవలేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఆయన గెలుస్తారా?ఓడతారా అన్నది పక్కన పెడితే, ఈ ఎన్నికలలో ఆయనకు ముచ్చెమటలు పట్టాయన్నది మాత్రం వాస్తవం. అందుకే ఆయన పలు రకాల వ్యూహాలు అమలు చేశారని చెబుతున్నారు. అందులో ధనబలం కూడా ప్రముఖంగా ఉందన్న విశ్లేషణలు వస్తున్నాయి.కుప్పం నియోజకవర్గంలో టీడీపీ ఏకంగా ఓటుకు పదివేల రూపాయలు ఖర్చు చేయడానికి వెనుకాడలేదని కొందరు చెబుతున్నారు. వివిద నియోజకవర్గాలలో అన్ని పార్టీలు డబ్బు ఖర్చు చేసినా, కుప్పంలో చంద్రబాబు తరపున ఓట్ల కొనుగోలుకు వెచ్చించిన వ్యయం ఒక రికార్డుగా కొందరు విశ్లేషిస్తున్నారు. చంద్రబాబునాయుడు కుప్పంలో వరసగా ఏడుసార్లు గెలిచి ఎనిమిదో సారి పోటీచేస్తున్నారు. అంతకుముందు చంద్రగిరిలో ఆయన ఒకసారి గెలిచి, మరోసారి ఓడిపోయారు. ఆ తర్వాత వ్యూహాత్మకంగా చిత్తూరు జిల్లాలో మారుమూల ఉండే, వెనుకబడిన ప్రాంతం అయిన కుప్పంను ఎంపిక చేసుకుని రాజకీయం చేస్తున్నారు. ఆయన ఇంతవరకు ఆ విషయంలో సఫలం అవుతున్నారు. అత్యధికంగా బీసీ వర్గాలు ఉండే కుప్పంను ఆయన తన కోటగా మార్చుకున్నారు. అభివృద్ది విషయంలో మాత్రం ఇప్పటికీ అంతంత మాత్రంగానే ఉంటుంది. అయినా చంద్రబాబు డబ్బు, దొంగ ఓట్లు ఇతర వ్యూహాల ద్వారా గెలుస్తూ వస్తున్నారు.సరిహద్దులోని తమిళనాడు, కర్నాటక గ్రామాలకు చెందినవారిని కూడా కుప్పం ఓటర్లుగా నమోదు చేయించి రాజకీయంగా లబ్ది పొందేవారని చెబుతారు. ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉండడం కూడా కలిసి వచ్చింది. గతంలో వైఎస్ హయాంలో కిరణ్ కుమార్ రెడ్డికి కుప్పం బాధ్యతలు అప్పగించినా ప్రయోజనం లేకపోయింది. ఎవరో వీక్ అభ్యర్ధిని కాంగ్రెస్ కుప్పంలో పెట్టేలా చేసుకునేవారని అంటారు. రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితి కొంత మారింది. క్రమేపి ఆయన మెజార్టీని తగ్గించే పనిలో వైఎస్సార్సీపీ పడింది. రిటైర్డ్ ఐఏఎస్ చంద్రమౌళి కుప్పంలో ఈయనను ఢీకొట్టడానికి సిద్ధం అయ్యారు. కుప్పం నియోజకవర్గంలో కీలకమైన దొంగ ఓట్లను తొలగించడానికి ఆయన అహర్నిశలు కృషి చేశారు. సుమారు 17 వేల దొంగ ఓట్లను ఆయన తొలగించగలిగానని చెప్పేవారు. దురదృష్టవశాత్తు ఆయన అనారోగ్యంతో మరణించారు.తదుపరి ఆయన కుమారుడు, వైఎస్సార్సీపీ అభ్యర్ధి భరత్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ ఇవ్వడమే కాకుండా, కుప్పం అభివృద్దిపై దృష్టి పెట్టారు. కుప్పంను మున్సిపాలిటీ చేయడం, రెవెన్యూ డివిజన్ చేయడం, స్కూళ్లు బాగు చేయడం, హంద్రీ-నీవా నీటిని విడుదల చేయడం వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలను కొంత ఆకట్టుకున్నారు. వైఎస్సార్సీపీ గట్టి కృషి ఫలితంగా స్థానిక ఎన్నికలలో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబుకు అది షాక్ అయింది. దాంతో ఆయన అప్రమత్తం అయ్యారు. ఇంతకాలం ఏడాదికి ఒకటి, రెండుసార్లు కుప్పం వచ్చినా సరిపోయే పరిస్థితి పోయిందని చంద్రబాబు అర్థం చేసుకున్నారు. నెల, నెల రావడం ఆరంభించారు. అది సరిపోదని భావించి అక్కడ ఇల్లు నిర్మించుకుంటున్నట్లు కథ నడిపారు.అదే టైమ్‌లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం నియోజకవర్గంలో పట్టు బిగించడం ఆరంభించారు. దాంతో చంద్రబాబుకు రాజకీయంగా ఊపిరి ఆడని పరిస్థితి కల్పించారు. ఈ నేపధ్యంలో ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు కొద్ది రోజులు అక్కడే ఉండి గడప, గడపకు వెళ్లడం చేశారు. కుప్పంలో రాజకీయం చేయడం ఆరంభించిన తర్వాత ఇలా ఓటర్ల ఇళ్లకు వెళ్లడం, ఆయా వర్గాలతో ప్రత్యేక సమావేశాలు పెట్టడం వంటివి ఈసారే చేశారు. గతంలో ఆయన తన ప్రతినిధులతో పనులు చేయించేవారు. అలాగే కుప్పం నుంచే కొంతమందిని పిలిపించుకుని హైదరాబాద్‌లోనో, ఉండవల్లిలోనో మాట్లాడి పంపించేవారు. ఆ పరిస్థితి మారి, ఎన్నికల సమయంలో స్వయంగా ఆయన భార్య భువనేశ్వరి కుప్పంలోనే ఉండి ఎన్నికల ప్రచారాన్ని పర్యవేక్షించవలసి వచ్చింది.తనకు లక్ష ఓట్ల మెజార్టీ రావాలని అప్పుడప్పుడు డైలాగులు చెప్పినా, ఆయనకు ఎప్పుడూ అంత ఆధిక్యత రాలేదు సరికదా! క్రమేపి తగ్గుతూ వచ్చింది. 2014లో నలభై ఎనిమిదివేల మెజార్టీ వస్తే 2019లో అది 30 వేలకు తగ్గింది. ఇప్పుడు దొంగ ఓట్లను మరింత తగ్గించగలగడంతో చంద్రబాబులో టెన్షన్ మొదలైంది. స్థానిక ఎన్నికలలో టీడీపీ కన్నా వైఎస్సార్సీపీకి చాలా ఎక్కువ ఓట్లు వచ్చాయి. అదే ట్రెండ్ కొనసాగినా, ఆ ఓట్లను ప్రామాణికంగా తీసుకున్నా చంద్రబాబు ఓటమికి గురికాక తప్పదు. స్థానిక ఎన్నికలకు, శాసనసభ ఎన్నికల సరళికి కొంత తేడా ఉంటుంది. ఈ కారణంగానే ఇప్పుడు తిరిగి తన ఆధిపత్యం నిలబెట్టుకోవడం కోసం ఆయన శ్రమపడ్డారు. అయినా గెలుస్తారా? లేదా? అన్న సందేహం వ్యక్తం అవుతోంది.ఇక వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ భరత్ నిత్యం కుప్పంలోనే ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉన్నారు. మంత్రి పెద్దిరెడ్డి అండతో అక్కడ నిరంతరం జనంలో తిరుగుతున్నారు. దాంతో వైఎస్సార్సీపీ గ్రాఫ్ పెరిగిందన్నది ఆ పార్టీ వాదన. అయితే చంద్రబాబుకు అక్కడ ఉన్న పట్టు అంత తేలికగా పోదని, ఆయా వర్గాలవారిని తనవైపు తిప్పుకోవడానికి చంద్రబాబు అన్ని ప్రయత్నాలు చేశారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఓటుకు పదివేల రూపాయల వరకు పంచవలసిన పరిస్థితి ఏర్పడిందంటే అక్కడ పోటీ ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఓటింగ్ పూర్తి అయ్యాక కొన్ని సర్వేలలో చంద్రబాబు ఓడిపోయే అవకాశం కూడా ఉందని వార్తలు రావడం ఆయనకు, టీడీపీకి ఆందోళన కలిగించే అంశమే.స్థానిక ఎన్నికల తర్వాత ఒక దశలో కుప్పంతో పాటు మరో నియోజకవర్గాన్ని కూడా ఎంపిక చేసుకుంటారన్న ప్రచారం జరిగింది. కానీ అలా చేస్తే పార్టీకి నష్టం వస్తుందని భయపడ్డారు. రిస్కు ఉందని తెలిసినా అక్కడే పోటీ చేయక తప్పలేదు. టీడీపీ ఎమ్మెల్సీ శ్రీకాంత్‌ను అక్కడే ఉంచి రాజకీయం నడిపారు. గతంలో చంద్రబాబుకు కుప్పంలో ఎంత మెజార్టీ వస్తుందన్న చర్చ ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు చంద్రబాబు గెలుస్తారా? లేదా? అనే చర్చ జరగడం విశేషమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహం కానీ, వైఎస్సార్సీపీ కార్యక్రమాలు కానీ సఫలం అయ్యాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇదే పెద్ద విజయంగా భావిస్తున్నారు.జగన్ అమలు చేసిన వివిద సంక్షేమ స్కీములు కుప్పంలో కూడా అమలు అయ్యాయి. దానివల్ల సుమారు రెండువేల కోట్ల మేర అక్కడి ప్రజలు లబ్దిపొందారు. కొన్ని వందల మందికి స్థలాలు ఇచ్చి, ఇళ్ళు కూడా నిర్మించారు. ఆ రకంగా బలహీనవర్గాలను వైఎస్సార్సీపీ బాగానే ఆకట్టుకుంది. దానికితోడు బీసీలలో రెండు బలమైన వర్గాలను వైఎస్సార్సీపీ తనవైపు తిప్పుకోగలిగింది.ఈ నేపథ్యంలో చంద్రబాబు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. తన హయాంలో జరగని పనులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో జరుగుతుండడం ఆయనకు ఇబ్బందిగా ఉంది. స్థానిక ఎన్నికలలో ఓటమితో నైతికంగా దెబ్బతిన్న చంద్రబాబుకు దొంగ ఓట్లు కూడా చాలావరకు వైదొలగడం గడ్డుగా మారింది. అయినప్పటికీ ఆయనకు ఉండే క్లౌట్ ఆయనకు ఉండవచ్చు. అందువల్లే చంద్రబాబు ఓడిపోతారని పలువురు చెబుతున్నా, ఒకవేళ చంద్రబాబు ఓడిపోకపోయినా, మెజార్టీ బాగా తగ్గిపోతుందని అంచనాలు ఉన్నాయి.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
భువనేశ్వరి తిట్ల దండకం.. ఇదే అసలు నిజం
-
నారా భువనేశ్వరి ఆడియోపై కొమ్మినేని షాకింగ్ కామెంట్స్
-
చెత్త నా కొడుకులు.. చెత్త బుట్టలో పుట్టారు..
సాక్షి, అమరావతి పోరా.. పో ఇక్కడ నుంచి లం..కొడకా.. నేను నీకంటే పెద్ద ఇంటిలో పుట్టిన దాన్ని. చెత్త నా కొడుకులు. చెత్త బుట్టలో పుట్టి కూడా వేషాలు వేస్తారు. దేనికీ పనికిరారు.. అడుక్కు తింటానికి కూడా.. బాస్టర్డ్. మీ అందరినీ మానిటర్ చేయలేక (పర్యవేక్షించలేక) నేను చస్తున్నా..తప్పుడు నా కొడకా, ఊడిగం చేసే కుక్క.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి తిట్ల దండకంతో కూడిన ఆడియో ఒకటి గురువారం రాత్రి నుంచి వివిధ సోషల్ మీడియా వేదికల్లో హల్చల్ చేస్తోంది. కేవలం ఒక్క భువనేశ్వరి మాటలు మాత్రమే ఆ ఆడియో టేపుల్లో వినిపిస్తోంది. అందులో కొన్ని పదాలు పత్రికలో రాయడానికి వీలు లేనంత అసభ్యంగా ఉన్నాయి. ఆమె ఎప్పుడు, ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారన్న దానిపై అటు తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పాటు, ఇటు రాష్ట్రంలోని రాజకీయ వర్గాలందరిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పం నియోజకవర్గంలో భర్త నామినేషన్ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు ఆమె ఈ నెల 18, 19, 20 తేదీల్లో కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. ఆ సమయంలో.. కొందరు స్థానిక టీడీపీ నాయకులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసిన మాటలుగా టీడీపీలో చర్చ సాగుతోంది. ‘కుప్పంలో లోకేశ్ తన సొంత మనుషులతో ఓ స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. ఈ కమిటీ సభ్యులు కొందరు నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి బాగోలేదని చెప్పారు. ఆ పరిస్థితిని మార్చడంలో భాగంగా ఎక్కువగా ప్రచారం నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగా అయిన ఖర్చుకు సంబంధించి బిల్లులు పెట్టిన సందర్భంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు’ అని కుప్పం టీడీపీ నాయకులు చెబుతున్నారు. కాగా, మొదటి నుంచి పార్టీ కోసం పని చేస్తూ.. చంద్రబాబు కుటుంబ సభ్యులందరితో పరిచయం ఉన్న ఓ దళిత నాయకుడు ప్రస్తుత ఎన్నికల్లో తన టికెట్ కోసం భువనేశ్వరిని కలిసి సిఫార్సు కోసం ప్రయతి్నంచినప్పుడు ఆమె ఈ రకంగా ఆగ్రహావేశాలతో ఊగిపోయారన్న చర్చ కూడా సాగుతోంది. అయితే భువనేశ్వరి మాటలతో కూడిన ఆ ఆడియో టేపుల్లోని మాటలు సమాజంలో కొన్ని వర్గాల వారిని బాగా కించ పరిచేలా ఉండడంతో వివిధ కుల సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. -
నారా భువనేశ్వరి సంచలన ఆడియో
-
నారా భువనేశ్వరి సంచలన ఆడియో
-
నారా భువనేశ్వరిపై..జనసేన కార్యకర్తల ఆగ్రహం
-
AP: నారా భువనేశ్వరికి ఎన్నికల సంఘం నోటీసులు
సాక్షి, గుంటూరు: ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి వ్యవహరించడంపై 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్‌కు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ‘నిజం గెలవాలి’ పేరుతో పర్యటిస్తూ ఓటర్లను ఆకట్టుకునేలా ఆర్థిక సహాయం పేరుతో నగదును భువనేశ్వరి పంపిణీ చేయడంపై వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదుపై ఎన్నికల కమిషన్ స్పందించింది. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఈ నెల 20న నారా భువనేశ్వరీ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని.. ఇది ఎన్నికల రూల్స్ ప్రకారం ప్రలోభాల కిందకే వస్తుందని ఈసీకి లేళ్ల అప్పిరెడ్డి ఈ నెల 21న ఆధారాలతో ఫిర్యాదు చేశారు. దీనిపై మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం విచారణ జరిపి 24 గంటల్లోగా తమకు నివేదిక పంపాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్‌కు సీఈవో ఆదేశాలు జారీ చేశారు. -
ఆరని మంటలు.. బాబుకు చెమట్లు!
సాక్షి, అనకాపల్లి/సాక్షి, అమలాపురం/ అయినవిల్లి/మడకశిర/పెనుకొండ/ఉదయగిరి: రాష్ట్రంలో టికెట్ల కేటాయింపు వ్యవహారం టీడీపీలో కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. అభ్యర్థుల ఖరారు విషయంలో అధినేత అనుసరిస్తున్న వైఖరిపై బహిరంగంగానే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా జెండా మోసినవారిని పక్కన పెట్టి కొత్తగా వచ్చినవారికి అందలం ఎక్కించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. మరోవైపు జనసేనతో పొత్తు నేపథ్యంలో ఆ పార్టీకి కేటాయించిన స్థానాల్లోనూ ఆందోళనలు మిన్నంటుతున్నాయి. అనకాపల్లిలో పెల్లుబికిన నిరసనలు అనకాపల్లి స్థానాన్ని టీడీపీ–జనసేన కూటమి తరఫున కొణతాల రామకృష్ణకు కేటాయించడంపై అక్కడి టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇన్నాళ్లుగా తాను పార్టీకోసం కష్టపడితే తనను పార్టీ అధిష్టానం గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా అక్కడి అభ్యర్థి కొణతాల తనను పట్టించుకోకుండా తన వ్యతిరేక వర్గమైన బుద్ధా నాగ జగదీశ్‌ను కలవడాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఈ విషయంలో తాడో పేడో తేల్చుకోవాలని పీలాపై ఆయన వర్గీయులు ఒత్తిడి తీసుకొస్తున్నారు. బాబు సతీమణి భువనేశ్వరి అడ్డగింత ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లాలో పర్యటిస్తున్న నారా భువనేశ్వరిని యలమంచిలి వెళ్లే దారిలో కూండ్రం వద్ద పీలా గోవింద వర్గీయులు అడ్డుకున్నారు. అనకాపల్లి రూరల్ మండల అధ్యక్షుడు పచ్చికూర రాము ఆధ్వర్యంలో నాయకులు సుమారు 10 నిమిషాలపాటు రోడ్డుకు అడ్డంగా నిలబడి పీలా గోవిందకే అనకాపల్లి టికెట్ ఇవ్వాలని పట్టుబట్టారు. అయితే భువనేశ్వరి కారు దిగి పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళతానని హామీ ఇవ్వడంతో వారంతా తప్పుకున్నారు. తాడోపేడో తేల్చుకునేందుకు ‘బొల్లినేని’ నిర్ణయం నెల్లూరు జిల్లా ఉదయగిరి అభ్యర్థిగా తనను నియమించనందుకు ఇక తాడోపేడో తేల్చుకోవాలని అక్కడి టీడీపీ ఇన్చార్జి బొల్లినేని వెంకట రామారావు నిర్ణయించుకున్నారు. పన్నెండేళ్లుగా పార్టీని, కేడర్‌ను కాపాడుకుంటూ వస్తే ఇప్పుడు ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్‌కు టికెట్ కేటాయించడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని ఆత్మీయుల వద్ద వెలిబుచ్చి కన్నీటిపర్యంతం కావడంతో కేడర్ ఉద్రేకానికి లోనైంది. ఒక్క మాట చెబితే కాకర్లను ఉదయగిరిలో నామినేషన్ కూడా వేయనివ్వమని తేల్చిచెప్పింది. గురువారం కలిగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆత్మీయులతో మాట్లాడుతూ తనకు టికెట్ విషయంలో న్యాయం జరగకపోతే కార్యకర్తల అభీష్టం మేరకు మార్చి రెండో తేదీన అధినేతను కలసిన తరువాత తుది నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. పెనుకొండలో కొనసాగుతున్ననిరసనలు అనంతపురం జిల్లా పెనుకొండలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథికి కాదని అన్నా క్యాంటీన్ అంటూ హడావుడి చేసిన సవితకు టికెట్ ఇవ్వడంపై నిరసనలు కొనసాగుతున్నాయి. నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి టీడీపీ కార్యకర్తలు రోజూ బీకే ఇంటి వద్దకు చేరుకుని నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. గురువారం కూడా నిరసనలు కొనసాగాయి. పార్థసారథికి టికెట్ ఇవ్వకుంటే టీడీపీని ఓడిస్తామని నేతలు చెబుతున్నారు. సునీల్‌ను మార్చకుంటేరాజీనామా శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు సునీల్‌కుమార్ అభ్యర్థిత్వాన్ని మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. గురువారం మరోసారి తిప్పేస్వామి వర్గీయులు నిరసనకు దిగారు. సునీల్‌ను మార్చకుంటే తామంతా రాజీనామా చేయడానికి వెనుకాడేది లేదని తేల్చిచెప్పారు. -
కుప్పంలో చంద్రబాబు కుర్చీని మడతపెట్టేసిన భువనేశ్వరి
-
భువనేశ్వరి చాలా లేట్ చేసింది.. భార్య కంటే చంద్రబాబు గురించి ఎవరికి తెలుస్తుంది
-
ఎన్నికల నుండి తప్పుకోవడమే బెటర్
-
లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి మాస్టర్ ప్లాన్...?
-
కుప్పంలో బాబు హ్యాండ్సప్
-
చంద్రబాబుపై నారా భువనేశ్వరి వ్యాఖ్యలు..రోజా రియాక్షన్
-
కుప్పంలో చంద్రబాబుకు రెస్ట్ ఇద్దామన్న భువనేశ్వరి
-
చంద్రబాబు ఓటమి భువనేశ్వరికి ముందే తెలుసు: వైఎస్సార్సీపీ నేతలు
-
చంద్రబాబు కుర్చీని భువనేశ్వరి మడత పెట్టేసింది: మంత్రి అంబటి
-
భువనేశ్వరి పోటీ చేసినా ఓటమి తప్పదు
సత్తెనపల్లి: చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పోటీ చేసినా కుప్పంలో ఓటమి తప్పదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు టీడీపీ కుర్చీని ఎప్పుడో మడత పెట్టేశారని, రాజ్యసభలోనూ, కుప్పంలోనూ సీటు ఖాళీ అయిందని ఎద్దేవా చేశారు. సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసిన చంద్రబాబు కుప్పం ప్రజలకు మంచినీళ్లు కూడా ఇప్పించలేక పోయారన్నారు. వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం కుప్పం ప్రజలకు మంచినీళ్లు ఇస్తోందని చెప్పారు. నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ మరో 50 రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయని, టీడీపీ పని అయిపోయిందని ప్రజలకు అర్థమైందన్నారు. -
బాబుకు రెస్ట్! నేనే పోటీ చేద్దామని అనుకుంటున్నా: నారా భువనేశ్వరి
(సాక్షి, అమరావతి–తిరుపతి–శాంతిపురం) :‘జీవితంలో ప్రతి ఒక్కరికీ ఒక రోజు వస్తుంది. అప్పటిదాకా ఓపిక పట్టాలంతే!’ అంటారు పెద్దలు. బహుశా! కుప్పం ప్రజలకు కూడా 35 ఏళ్ల తరవాత ఆ రోజు వచ్చినట్లుంది. దశాబ్దాలుగా తాము గెలిపిస్తున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని.. రెండేళ్ల కిందటిదాకా కనీసం సొంతిల్లు కూడా కట్టు కోలేదని వాళ్లకి అర్థమయింది. బ్రాంచ్ కెనాల్ ద్వారా నీళ్లు తెస్తానని ఇన్నాళ్లూ మోసపు మాటలు చెప్పారే తప్ప.. ఆ పనిని చేసి చూపించింది వైఎస్ జగన్మోహన్రెడ్డేనని వాళ్లకు అనుభవంలోకి వచ్చింది. అందుకే రాబోయే ఎన్నికల్లో బాబుకు బైబై చెప్పేందుకు వాళ్లంతా సిద్ధమవటంతో.. 40 ఇయర్స్ ఇండస్ట్రీ నక్కజిత్తుల నారా వారు తనను ఓడించక ముందే ఆ నియోజకవర్గానికి ‘బై’ చెప్పటానికి సిద్ధమయ్యారు. ‘‘35 ఏళ్లుగా మీరు చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తున్నారు. ఇక ఆయనకు రెస్ట్ ఇవ్వాలనిపిస్తోంది. అందుకే ఈ సారి ఇక్కడి నుంచి నేను పోటీ చేయాలనుకుంటున్నాను’’ అంటూ చంద్రబాబు నాయుడి భార్య నారా భువనేశ్వరి బుధవారం కుప్పంలో ఓ బహిరంగ సభలో స్పష్టంగా చెప్పారు. స్కిల్ కుంభకోణంలో వేల కోట్లు నేరుగా విత్‌డ్రా చేసుకుని మింగేసిన కేసులో ఈ మధ్య చంద్రబాబు నాయుడిని పోలీసులు అరెస్టు చేయటంతో ఆయన జైలుకు వెళ్లటం తెలిసిందే. అది జరిగిన 10–15 రోజుల తరవాత కూడా ఆయన జైలు జీవితాన్ని చూసి తట్టుకోలేక కొందరు మరణించారన్నది టీడీపీ–ఎల్లో మీడియా వ్యాఖ్యానం. వారందరికీ సాయం చెయ్యడానికి నేరుగా నారా భువనేశ్వరి ఓ యాత్ర చేస్తున్నారు. ఆమేమీ రాజకీయ నాయకురాలు కాదు. దీంతో యాత్రలో భాగంగా ఎక్కడికి వెళ్లాలి? ఎవరెవరిని కలవాలి? ఎవరికి చెక్కులివ్వాలి? ఏమేం మాట్లాడాలి? అనేది మొత్తం స్క్రిప్టు ప్రకారమే చేస్తున్నారు. బుధవారం మాట్లాడిన మాటలు కూడా ఆ స్క్రిప్టులో భాగమే. కళ్లెదుట ఓటమి స్పష్టంగా కనిపిస్తుండడంతో ఏదో ఒక వంకతో అక్కడి నుంచి పోటీ చేయకుండా జారుకోవాలనేది బాబు పన్నాగమని, అందుకే భార్య చేత ఆ మాటలు మాట్లాడించారు తప్ప అవేమీ చమత్కారమో, యథాలాపమో కావని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. కుప్పంలో పడిపోయిన బాబు గ్రాఫ్... కుప్పం బరి నుంచి పక్కకు తప్పుకొని వేరే నియోజకవర్గం చూసుకోవాలని, లేకపోతే ఈ సారి ఎన్నికల్లో పోటీయే చేయకుండా నాన్ ప్లేయింగ్ కెపె్టన్‌గా వ్యవహరించాలని బాబు ఆలోచిస్తున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కుప్పంలో బాబు గ్రాఫ్ అంతకంతకూ దారుణంగా పడిపోవటం దీనికి మొదటి కారణం. నిజానికి 2019 ఎన్నికల్లోనే ఆయన మెజారిటీ బాగా తగ్గిపోవటం నుంచి ఈ గ్రాఫ్ పతనం మొదలయింది. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు చేతి నుంచి కుప్పం జారిపోయింది. మున్సిపల్ ఎన్నికల్లో కుప్పం మున్సిపాలిటీని వైఎస్సార్సీపీ చేజిక్కించుకుంది. 25 వార్డుల్లో టీడీపీ కేవలం 7 వార్డుల్లో గెలవగా మిగిలిన 18 వార్డుల్లోనూ వైఎస్సార్ సీపీ అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. అంతకుముందు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 89 పంచాయతీలకు గాను 70 పంచాయతీలను వైఎస్సార్సీపీ గెలుచుకుంది. నాలుగు జెడ్పీటీసీలు, నాలుగు ఎంపీపీ స్థానాల్లో కూడా టీడీపీ ఓడిపోయింది. ఈ ఫలితాలన్నీ కుప్పంలో చంద్రబాబు పని అయిపోయినట్లేనని స్పష్టంగా చెప్పాయి. వాస్తవానికి తనను ఏడుసార్లు గెలిపించిన కుప్పం నియోజకవర్గాన్ని చంద్రబాబు ఎప్పుడూ పట్టించుకోలేదు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ ఆ ప్రాంతానికి మేలు చేయలేదు. కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా హంద్రీనీవా నీళ్లు తెస్తానని మోసం చేశారే తప్ప పని చేయలేదు. కుప్పం నియోజకవర్గానికి హంద్రీనీవా ద్వారా నీళ్లు వచ్చినా, దాన్ని మున్సిపాలిటీగా మార్చినా, రెవెన్యూ డివిజన్‌గా అప్‌గ్రేడ్ చేసినా.. అవన్నీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నపుడే జరిగాయి. ఇక్కడ 20వేల మందికి ఇళ్ల పట్టాలివ్వటంతో పాటు వాటిలో 10వేల ఇళ్ల నిర్మాణం కూడా పూర్తయింది. దాదాపు 90 శాతం ఇళ్లకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. సుదీర్ఘకాలం సీఎంగా ఉన్నా బాబు ఈ స్థానాన్ని పట్టించుకోలేదు సరికదా... కనీసం సొంతిల్లు కూడా కట్టుకోలేదు. వరస పరిణామాలతో కుప్పం తనకు గుడ్‌బై చెప్పబోతోందోని అర్థమై రెండేళ్ల కిందట సొంతిల్లు కట్టారు. అయినా పరిస్థితి మారకపోవటంతో ఓటమిని తప్పించుకోవటానికి కుప్పం నియోజకవర్గానికి గుడ్‌బై చెప్పే ఆలోచన చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ‘సిద్ధం’ సభలతో ఉక్కిరి బిక్కిరి చంద్రబాబు ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోనూ ‘రా... కదలిరా’ పేరిట సభలు నిర్వహించారు. మరోవైపు లోకేశ్ ‘శంఖారావం’ పేరుతో సభలు పెట్టారు. ఇక నారా భువనేవ్వరి ‘నిజం గెలవాలి’ అంటూ సమావేశాలు పెడుతున్నారు. వైఎస్పార్ సీపీ తరఫున వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరే... ‘సిద్ధం’ అంటూ సభలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మూడు ప్రాంతాల్లో సభలు నిర్వహించారు. బాబు...లోకేశ్... భువనేశ్వరి సభలన్నిట్లోనూ కలిపినా... రాప్తాడులో జరిగిన సిద్ధం సభకు వచ్చిన జనాల్లో సగం కూడా రాలేదు. ‘సిద్ధం’ సభలు మూడూ ఒకదాన్ని మించి మరొకటి జనసంద్రాలయ్యాయి. జనం నాడి అర్థమైన చంద్రబాబుకు వణుకు మొదలైంది. అందుకే పొత్తులతోనైనా ఎలాగోలా పరువు నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కుప్పంలో కూడా తాను ఓడిపోతే పరిస్థితి దయనీయంగా మారుతుందని, పార్టీ చేజారిపోతుందని అర్థమై.. ఈ సారికి వేరే చోట నుంచి పోటీ చెయ్యడమో... లేకపోతే ఎక్కడా పోటీ చేయకుండా నాన్ ప్లేయింగ్ కెపె్టన్లా వ్యవహరించి పరువు నిలుపుకోవటమో చేయాలని చూస్తున్నారన్నది పార్టీ వర్గాల మాట. – చంద్రబాబుకి రెస్ట్ ఇచ్చి.. తానే పోటీ చేయాలనుందన్న భువనేశ్వరి! – కుప్పంలో పర్యటనలో బాబు సతీమణి వ్యాఖ్యలతో టీడీపీలో ఆందోళన – ఓటమి భయంతోనే.. బాబు అలా పలికించారనే ప్రచారం సాక్షి, తిరుపతి/శాంతిపురం: ‘‘కుప్పానికి వచ్చాను. ఇక్కడ నాకొక కోరిక ఉంది. నా మనస్సులో ఎప్పటి నుంచో ఆ కోరిక ఉంది, నేనేమీ మిమ్మల్ని కొట్టను.. తిట్టను.. 35 ఏళ్లుగా చంద్రబాబు గారు కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు నాకొక కోరిక ఉంది. ఆయన్ను రెస్ట్ తీసుకోమని చెబుతున్నా. నేనే ఇక్కడి నుంచి పోటీ చేద్దామని అనుకుంటున్నా’’ (కుప్పం నియోజక వర్గం శాంతిపురం బహిరంగ సభలో నారా భువనేశ్వరి) నారా భువనేశ్వరి చేసిన కీలకమైన వ్యాఖ్యలు టీడీపీలో దుమారాన్ని రేపుతున్నాయి. ఆమె సరదాగా చేసిన వ్యాఖ్యలే అనుకుంటే పొరబడ్డట్టేనని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఆమె ఎప్పుడూ బహిరంగ సభలో ప్రసంగించలేదు. చంద్రబాబు అరెస్ట్ తరువాత జనంలోకి వచ్చిన నారా భువనేశ్వరి ఏం మాట్లాడాలో స్క్రిప్ట్ రాసిస్తారు. ఆ స్క్రిప్‌్టని ఆమె బట్టీ పట్టి సభలో మాట్లాడుతారని టీడీపీలోని ఓ ముఖ్య నేత స్పష్టం చేశారు. కుప్పం నియోజకవర్గంలో రెండు రోజులుగా పర్యటిస్తున్న నారా భువనేశ్వరి బుధవారం శాంతిపురంలో ఏర్పాటుచేసిన సభలో ప్రసంగించారు. ఆమె ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలపై టీడీపీలో చర్చ జరుగుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక.. 35 ఏళ్ల కాలంలో చంద్రబాబు కుప్పానికి కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోయారని స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు చేయలేని ఎన్నో అభివృద్ధి పనులు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసి చూపించడంతో పాటు.. కుప్పం వాసుల కలగా మిగిలిన హంద్రీ–నీవాకు కృష్ణా జలాలు తీసుకొచ్చిన విషయాన్ని గుర్తుచేసుకుంటున్నారు. సీఎం వైఎస్ జగన్ కేవలం ఐదేళ్ల కాలంలో కాలువ పనులు పరుగెత్తించి నీరు తీసుకురావడంతో కుప్పం వాసులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. కుప్పాన్ని మున్సిపాలిటీతో పాటు రెవెన్యూ డివిజన్‌గా చేశారు. చంద్రబాబు చేయలేని ఎన్నో కార్యక్రమాలు సీఎం వైఎస్ జగన్ వల్లే కావడంతో కుప్పం వాసుల్లో మార్పు కనిపించింది. అందులో భాగంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీకి బ్రహ్మరథం పట్టారు. కుప్పంలో నాలుగు జెడ్పీటీసీ స్థానాలు, ఎంపీపీలు, మున్సిపాలిటీని వైఎస్సార్సీపీ కైవశం చేసుకుంది. పంచాయతీల్లోనూ అత్యధికంగా వైఎస్సార్సీపీ బలపరచిన అభ్యర్థులే విజయం సాధించారు. కుప్పంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించిన సమయంలో స్థానికుల నుంచి అనూహ్య స్పందన లభించడం వంటి పరిణామాలు చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టించాయి. అప్పటి నుంచి చంద్రబాబు నియోజకవర్గాన్ని మార్చాలని భావించారు. అందులో భాగంగా స్థానిక, జిల్లా, రాష్ట్ర నాయకులతో పలుమార్లు ఈ విషయం గురించి చర్చించారు. సతీమణి చేత చెప్పిండం వెనుక మర్మమం అదే ఎన్నికలకు సరిగ్గా రెండు నెలలు కూడా లేని సమయంలో నిజం గెలవాలి అనే కార్యక్రమం పేరుతో తన సతీమణి భువనేశ్వరిని కుప్పానికి పంపించారు. కుప్పంలో ఏం మాట్లాడాలో స్క్రిప్ట్ రాసి పంపారని, అందులో భాగంగా భార్యతో స్పష్టంగా చెప్పించారని టీడీపీ నేతలు చెబుతున్నారు. జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు అనారోగ్యంతో బాధపడుతున్నారని కోర్టుకు నివేదికలు సమర్పించిన విషయాన్ని గుర్తుచేసుకుంటున్నారు. అనారోగ్యం, ఆపై వయస్సు మీద పడడంతో వేగంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని టీడీపీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు తప్పుకోవడమే మేలని ఆ పార్టీ శ్రేణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. కుప్పంలో పోటీచేసి ఓడిపోతే మొదటికే మోసం వస్తుందనే భయంతో భార్యతో చెప్పించారని, ఆ తరువాత పారీ్టతో ప్రకటన చేయించే ఆలోచనలో ఉన్నట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. నారా భువనేశ్వరి చేసిన ప్రకటనతో చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో అస్త్ర సన్యాసం చేస్తారని సొంత జిల్లాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. -
బాబు రాజకీయాలకు పనికిరాడని ఇప్పుడు తెలిసిందా.. భువనేశ్వరీ?
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఇప్పటికే మూడు ‘సిద్ధం’ సభలు జరిపామని, తమ నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో అమలు చేసిన విప్లవాత్మక సంస్కరణలను.. నవరత్నాల్లోని ప్రతీ అంశాన్ని ప్రజలకు వివరించామని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రభుత్వ సలహాదారు (మహిళాశిశు సంక్షేమం) నారమల్లి పద్మజ అన్నారు. ‘2019 మ్యానిఫెస్టోలో మేము చెప్పిన ప్రతీ వాగ్దానాన్నీ.. చేసి చూపించాం. మా పాలనే సాక్ష్యంగా 2024 ఎన్నికల్లో ప్రజల ముందుకెళ్ళి.. కాలర్ ఎగరేసి మరీ ఓట్లు అడుగుతామని ఆరోజు చెప్పాం.. ఈరోజూ అదే చెబుతున్నాం’ అని అన్నారు. మూటాముల్లె సర్దేసిన తెలుగుదేశం పార్టీ రాబోయే ఎన్నికలకు మేము సిద్ధంగా ఉన్నాం.. మా పాలనే దానికి సాక్ష్యం.. మమ్మల్ని మరోమారు ఆశీర్వదించడానికి సిద్ధమా..? అని మా నాయకుడు జగన్ గారు ప్రజలను కోరినప్పుడు వాళ్ల నుంచి వచ్చిన రెస్పాన్స్‌ను చూసి తెలుగుదేశం పార్టీకి వెన్నులో చలి పుట్టిందేమో.. ఇప్పటికే మూటాముల్లె సర్దేసింది. దాని పరిణామాలు కూడా ఒక్కొక్కటిగా ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. చంద్రబాబు రెస్టు తీసుకోవాలని భువనమ్మే చెబుతోంది ఈరోజు నారా భువనేశ్వరి కూడా ఇదే విషయాన్ని మరోమారు ధృవీకరించింది. మా ఆయన చంద్రబాబు రెస్ట్ తీసుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పింది. తన భర్త రాజకీయాలకు ఇక పనికిరాడని.. అలసిపోయాడని.. మీడియా ముందుకొచ్చి ఆమె మాట్లాడిన సందర్భాన్ని చూశాం. ఇది నిజమే.. హైదరాబాద్‌లోని ఏఏజీ ఆస్పత్రి కూడా చంద్రబాబు గురించి అదే చెప్పింది. ‘నీకు సకల రోగాలు ఉన్నాయి. నువ్వు గానీ నడవాలంటే.. వెనుక ఒక అంబులెన్స్ ఉండాలి. ఇక, బిజీ రాజకీయాలకు నువ్వు పనికిరావు.. రెస్టు తీసుకోవాలి..’ అని ఆస్పత్రి రిపోర్టు ద్వారానే చెప్పారు. అయినా.. ఆయన విన్లేదు. అందుకే.. చంద్రబాబు బైబై.. అని ఓపెన్‌గా చెప్పింది తన భార్యను ఎవరూ ఏమీ అనకుండానే వెక్కి వెక్కి ఏడుస్తాడు చంద్రబాబు నాయుడు. మా నాన్నను ముసలోడంటున్నారని లోకేశ్ కూడా వెక్కివెక్కి ఏడుస్తున్నాడు. తండ్రీ కొడుకులు ఎంతగా ఏడ్చినా.. మొత్తుకున్నా.. ప్రజల నుంచి వారు ఆశించినంత స్పందన రాకపోవడంతో ఇక, చివరికి కుర్చీలు మడత పెట్టుకునే పనిలో పడ్డారు. పాపం, తన భర్త, కొడుకు పడుతున్న పాట్లు గమనించిన భువనేశ్వరి ఈరోజు ఓపెన్‌గానే చంద్రబాబు బైబై.. అని చెప్పారు. ఆయన కూడా రాజకీయాలకు బైబై చెప్పాల్సిన అవసరముందని.. రెస్టు తీసుకోవాల్సిన వయసొచ్చిందని.. నీకు ప్రజల నుంచి ఆదరణ కరువైందని తన భర్తకూ ఆమె గుర్తుచేశారు. వెన్నుపోటుకు బదులు చెప్పిందా..? లోకేశ్ మాట్లాడించాడా..? సుదీర్ఘకాలం కుప్పం ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు ఇక పనికిరాడని స్వయంగా ఆయన భార్యే చెబుతున్న క్రమంలో.. అందరిలోనూ ఓ ప్రశ్న ఉత్పన్నమౌతోంది. ఆయన ఎమ్మెల్యేగానే పనికిరాడా..? లేదంటే, తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడిగా పనికిరాడా..? అని భువనేశ్వరి మాటల అంతరార్థాన్ని విశ్లేషిస్తున్నారు. ఆమె ఇవన్నీ నిజంగానే చెబుతుందా..? లేదంటే, తండ్రి ఎన్టీఆర్‌కు పొడిచిన వెన్నుపోటుకు బదులుగా చెబుతుందా..? ఒకవేళ.. లోకేశ్బాబే తన తల్లి చేత ఇలా మాట్లాడిస్తున్నాడా..? మా నాన్న పని అయిపోయింది. నేటి రాజకీయాలకు ఆయనెటూ పనికిరాడని.. ఎలాగైనా మూలన కూర్చోబెట్టాలని తల్లికి చెప్పాడా..? అనేది తేలాల్సిన సందర్భమిది. అబద్ధాలాడటంలో తండ్రీకొడుకుల్ని మించిపోయింది భువనేశ్వరి అక్క పురందేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉంది. అలాగే, టీడీపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు కూడా భువనేశ్వరి చేపడితే బాగుంటుందేమో.. ఎందుకంటే, ఆమె మాటల్లోని అబద్ధాల్ని చూస్తుంటే.. ఖచ్చితంగా రాజకీయాల్లోకి పనికొస్తుందని చెప్పొచ్చు. కన్నార్పకుండా అబద్ధాలు అల్లి ప్రచారం చేయడంలో తన భర్త, తన కొడుకును మించిపోయింది. మహిళల పక్షాన అప్పుడెందుకు నోరుమెదపలేదు..? ఆడపిల్ల ఆర్థరాత్రి నడవాలంటే మంచి ప్రభుత్వం రావాలంటున్న నువ్వు.. నీ బుద్ధి, నీ విచక్షణను నీ భర్త పాలనలో ఎక్కడ పెట్టుకున్నావని మేం ప్రశ్నిస్తున్నాం. చంద్రబాబు పాలన లేకుంటే మహిళలు వీధుల్లో నడవలేని పరిస్థితుల్లేవని మాట్లాడుతున్న నీకు మేము కొన్ని ప్రశ్నలడుగుతున్నాం. జవాబివ్వగలవా..? నీ భర్త చంద్రబాబు హయాంలో మహిళలపై అనేక దురాగతాలు జరిగినప్పుడు నువ్వెక్కడున్నావు..? కాల్‌మనీ, సెక్స్‌రాకెట్‌లో నీ తెలుగుదేశం పార్టీ నాయకులే దాదాపు 200 మంది మహిళల్ని లైంగికంగా హింసించి.. బెదిరించి బ్లూ ఫిల్మ్‌లు తీసినప్పుడు నువ్వెందుకు స్పందించలేకపోయావు..? తహశీల్దార్ వనజాక్షిని నీ పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఏవిధంగా దాడిచేసి అవమానించాడో మీడియా సాక్షిగా నువ్వు చూసినా.. బయటకొచ్చి ఇది తప్పు అని మహిళల పక్షాన ఎందుకు మాట్లాడలేకపోయావు..? రిషితేశ్వరి అనే విద్యార్థినిని అత్యంత పాశవికంగా హింసిస్తే.. ఆమె ఆత్మహత్య చేసుకుని మరణిస్తే చదువుకునే బాలికల తరఫున నువ్వెందుకు నీ భర్తను నిలదీయలేదు..? వీటన్నింటికీ.. నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరముంది. బీసీ, దళిత మహిళల్ని అవమానిస్తే.. నువ్వు స్పందించలేదేం..? కుప్పంలో ఓ బీసీ మహిళ వైఎస్ఆర్సీపీ మీటింగ్‌కు హాజరైందని .. ఆమెను వివస్త్రను చేసి వీడియోలు చిత్రించి హింసించిన వైనం నీకు తెలియదా ..? ఆ ఘటనను కుప్పం ప్రజలు మరిచిపోగలరా..? అదేవిధంగా పెందుర్తిలో ఓ దళిత మహిళ.. తన అసైన్డ్ స్థలాన్ని లాక్కోవద్దని కాళ్లు పట్టుకుని ప్రాధేయపడితే నీ పార్టీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ ఎలా కిరాతకంగా ప్రవర్తించాడో నీకు మీడియాలో నువ్వు చూడలేదా.? నీ సొంత తమ్ముడు మహిళల గురించి ఏం మాట్లాడాడో.. వినలేదా..? వాటిని చూసి ఒక మహిళగా స్పందించలేదెందుకు..? మీ హయాంలో జరిగిన తప్పులకు క్షమాపణ చెప్పు సభా వేదికపైనే ఒక మహిళను చూస్తే ముద్దెట్టుకోవాలి.. కడుపైనా చేయాలని నీ సోదరుడు మాట్లాడిన సంగతి నీకు తెలిసీ ఎందుకు మౌనంగా ఉన్నావు..? సాటి మహిళగా స్పందించి.. నీ తమ్ముడుకి గడ్డిపెట్టాలని అనిపించలేదా..? నీ తమ్ముడు బాలకృష్ణలాంటి అచ్చోసిన ఆంబోతుల్ని ఏం చేయాలి..? నిలువునా కాల్చేయాల్నా..? వీటన్నింటికీ నువ్వు స్పందించి.. నీ పార్టీ హయాంలో జరిగిన తప్పులను ఒప్పుకుని.. మీ తెలుగుదేశం పార్టీ తరఫున.. నీ తమ్ముడి తరఫున బహిరంగంగా క్షమాపణ చెప్పాలని భువనేశ్వరిని మేము డిమాండ్ చేస్తున్నాం. పక్క రాష్ట్రాల్లో జరిగిన నేరాలనూ ఆంధ్రకు అంటగడతారా..? చంద్రబాబుకు మూటలు మోసే నాయకుడున్న పక్క రాష్ట్రం తెలంగాణలో కిందటేడాది ఆగస్టు 22న జరిగిన అత్యాచారం గురించి ఈరోజు ఇక్కడ భువనేశ్వరి మాట్లాడింది. అక్కడ ఓ బాలికపై గంజాయి తాగిన ఉన్మాదులు అఘాయిత్యానికి పాల్పడితే.. ఆ నేరాన్ని తెచ్చి ఇప్పుడు ఆంధ్రలో ఉన్న ప్రభుత్వంపై అంటకట్టడానికి ప్రయత్నించడం నీకు సిగ్గనిపించడం లేదా..? అని భువనేశ్వరిని అడుగుతున్నాను. అబద్ధాల్లో నీ భర్త, నీ కొడుకును మించి పోయావు గనుక.. ఇప్పుడు నిలువునా మునిగిపోతున్న తెలుగుదేశం పార్టీకి నువ్వు అధ్యక్షరాలివయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి కనుక పగ్గాలు చేపట్టమని చెప్తున్నాం. -
బాబు గారి బండారాన్ని బయటపెట్టిన భువనేశ్వరి
-
మంగళగిరిలో ఓటమి భయంతో రెండుచోట్ల పోటీపై లోకేష్ స్కెచ్?
-
‘చంద్రబాబు ఫ్యూచర్ భువనేశ్వరి ముందే కనిపెట్టేశారు’
సాక్షి, విజయవాడ: భువనేశ్వరి ఆమె మనసులో మాట బయటపెట్టారని, రాష్ట్ర ప్రజలంతా చంద్రబాబును అసహ్యించుకుంటున్నారని మంత్రి జోగి రమేష్ అన్నారు. నారా భువనేశ్వరి వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. చంద్రబాబుకు రెస్ట్ ఇవ్వాలని ప్రజలంతా నిర్ణయించుకున్నారు. భువనేశ్వరి ఈ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ప్రజల మనసులో ఉన్న ఆకాంక్షను ఆమె గమనించారని మంత్రి వ్యాఖ్యానించారు. భువనేశ్వరి సరదాగా చెప్పిన మాట కాదు.. ఆమె మనసులో ఉన్న భావనే బయటపెట్టారు. 35 ఏళ్ల నుంచి కుప్పానికి చంద్రబాబు ఏం చేయలేదు. చంద్రబాబు కుప్పానికీ పనికిరాడు. రాష్ట్రానికీ పనికిరాడని సొంత భార్యే చెప్పేసింది. సిద్ధాంతం, విలువలు, విశ్వసనీయత లేని వ్యక్తి చంద్రబాబు. 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు 175 స్థానాల్లో టీడీపీని నిలబెట్టలేని అసమర్ధుడయ్యాడు. టీడీపీని కొన్ని ప్రాంతాలకే పరిమితం చేశాడు. పవన్‌కు 50, 60 పంచాలి.. మరో పార్టీకి ఇంకొన్ని పంచాలనే ఆలోచనలో ఉన్నాడు. చంద్రబాబు దిక్కులేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇవన్నీ గమనించారు కాబట్టే చంద్రబాబును పక్కకు తోసేయాలని భువనేశ్వరి ఆలోచన’’ అని జోగి రమేష్ పేర్కొన్నారు. చంద్రబాబు, లోకేష్ పనికిరాడు.. ఎన్టీఆర్ కూతురుగా తానే బెటర్ అని భువనేశ్వరి భావిస్తున్నట్లున్నారు. చంద్రబాబు ఓడిపోతున్నాడని భువనేశ్వరి ముందే కనిపెట్టారు. ఎన్టీఆర్ కూతురుగా తనకైనా ఓట్లేస్తారని భువనేశ్వరి అనుకుంటున్నారు. ఈసారి కుప్పంలో చంద్రబాబు అడ్రస్ గల్లంతవ్వడం ఖాయం’’ అని జోగి రమేష్ చెప్పారు. ఇదీ చదవండి: చంద్రబాబుకి రెస్ట్.. కుప్పం బరిలో భువనేశ్వరి? -
టీడీపీకి కుర్చీలు మడతపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది: నారమల్లి పద్మజ
-
ముందే ఓటమిని అంగీకరించిన బాబు: లక్ష్మీ పార్వతి
-
బాబుకు రెస్ట్ భువనేశ్వరి వ్యాఖ్యల్లో అంతరార్థం
-
చంద్రబాబుపై భువనేశ్వరి వ్యాఖ్యలు వరుదు కళ్యాణి రియాక్షన్
-
ఓడిపోతారనే భయం.. కుప్పానికి బాబు గుడ్ బై
-
కుప్పంలో చంద్రబాబా పోటీపై కుండబద్దలుకొట్టిన భువనేశ్వరి
-
నారా భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు
-
చంద్రబాబు పై నారా భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు
-
చంద్రబాబుకి రెస్ట్.. కుప్పం బరిలో భువనేశ్వరి?
సాక్షి, చిత్తూరు: కుప్పం నుంచి పారిపోయే యోచనలో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్నేళ్లలో సొంత నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోయారాయన. కనీసం మంచినీళ్లు కూడా అందించలేకపోయారు. అయితే వైఎస్ జగన్ సీఎం అయ్యాక.. తన మన పార్టీ భేదాలు లేకుండా అన్ని నియోజకవర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. చంద్రబాబు భార్య భువనేశ్వరీ ఓ కీలక ప్రకటన చేశారు. చంద్రబాబుకు విశ్రాంతి ఇచ్చి తాను పోటీ చేద్దామనుకుంటున్నానని బహిరంగ సభలో ప్రకటించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కుప్పం రూపురేఖల్ని మార్చేశారు, భారీగా అభివృద్ధి పనులు చేపట్టారు. దీంతో చంద్రబాబుకి ఓటమి భయం పట్టుకుంది. తాజాగా.. ఆయన సతీమణి నారా భువనేశ్వరి వ్యాఖ్యలతో ఒక్కసారిగా కలకలం రేగింది. కుప్పం నుంచి పోటీకి ఆసక్తికనబరుస్తూ నారా భువనేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో 35 ఏళ్ల నుంచి చంద్రబాబు పోటీ చేస్తున్నారు. ఈసారి ఆయనకు రెస్ట్ ఇచ్చి.. తాను పోటీ చేయాలనుకుంటున్నట్లు తెలిపారామె. బహిరంగ సభలో భువనేశ్వరీ ఏమన్నారంటే.. "కుప్పంకు వచ్చాను.. ఇక్కడ నాకొక కోరిక ఉంది నా మనసులో ఎప్పటి నుంచో ఆ కోరిక ఉంది (సభకు వచ్చిన వారిని ఉద్దేశిస్తూ..) నేనేమి మిమ్మల్ని కొట్టను.. తిట్టను 35ఏళ్లుగా చంద్రబాబును కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నాడు ఇప్పుడు నాకొక కోరిక ఉంది ఆయన్ను రెస్ట్ తీసుకోమని చెబుతున్నా నేనే ఇక్కడి నుంచి పోటీ చేద్దామని అనుకుంటున్నా" చంద్రబాబు అస్త్ర సన్యాసం.!? భువనేశ్వరీ చేసిన ప్రకటన రాజకీయంగా అత్యంత కీలకమైన ప్రకటనగా చూడాలి. చాలా కాలంగా చంద్రబాబు నియోజకవర్గాన్ని మార్చాలని భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే.. సరిగా ఎన్నికలకు రెండు నెలల ముందు భార్య భువనేశ్వరీతో ప్రకటన చేయించాడని భావిస్తున్నారు. పైగా భువనేశ్వరీ మాటల్లో స్పష్టంగా ఏం చెప్పారంటే.. చంద్రబాబుకు విశ్రాంతి కావాలని చెబుతున్నారు. చంద్రబాబు 52 రోజుల పాటు జైల్లో ఉన్నప్పుడు ఎన్నో రోగాలున్నాయని కోర్టుకు నివేదిక రూపంలో ఇచ్చారు. అసలే అనారోగ్యం.. ఆపై వయస్సు మీద పడడం.. చంద్రబాబుకు ఇబ్బందికరంగా మారింది. వృద్ధాప్యం పెరగడంతో వేగంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే కొడుకు లోకేష్‌ను ఎంత ఎంకరేజ్ చేసినా.. ఫలితం లేకపోవడంతో రాజకీయాల నుంచే తప్పుకోవడం మేలని టిడిపిలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. చంద్రబాబు తప్పుకోవడానికి కారణమేంటీ? కుప్పం నియోజకవర్గంలో నాలుగు జడ్పీటీసీ స్థానాలున్నాయి. నాలుగు చోట్ల YSRCP గెలిచింది కుప్పం నగర పంచాయతీలో వైఎస్సార్సిపి ఘనవిజయం సాధించింది కుప్పం మండలంలోని 29 పంచాయతీల్లో 25 చోట్ల YSRCP గెలిచింది కుప్పంలో వరుస ఇబ్బందులు తలెత్తుతున్న దృష్ట్యా తప్పుకోవడం మేలని భావిస్తున్నారు కుప్పం పట్టణాన్ని చంద్రబాబు హయాంలో మున్సిపాలిటీ చేయలేదు. 2019 తర్వాత సీఎం జగన్ వచ్చిన తర్వాత మున్సిపాలిటీ అయింది కుప్పంను రెవెన్యూ డివిజన్ చేయాలన్న డిమాండ్‌ను కూడా చంద్రబాబు పట్టించుకోలేదు. గత ఏడాది సీఎం జగన్ వచ్చిన తర్వాత రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించారు కుప్పంలో తాగునీటి సమస్యకు చంద్రబాబు పరిష్కారం చూపించలేదు. ఈ పనులను సీఎం జగన్ పూర్తి చేయించి ఈ నెలలో పరిష్కారం కల్పిస్తున్నారు కుప్పంలో దొంగ ఓట్ల తొలగింపు అత్యంత కీలకమైన విషయం. ఏకంగా 30వేల దొంగ ఓట్లు ఉన్నట్టు వైఎస్సార్సిపి ఫిర్యాదు చేసింది. వీటిని ఎన్నికల సంఘం తొలగించడంతో టిడిపికి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. అత్యంత ప్రతికూలతలున్న ప్రస్తుత సమయంలో తాను పోటీ చేసి ఓడిపోవడం సరికాదన్న ఆలోచనలో బాబు ఉన్నారు భరత్, కుప్పం YSRCP ఇన్ఛార్జ్ "అన్ని స్థానిక సంస్థల్లో YSRCP విజయం సాధించింది. తాజా సర్వేల్లో ఓడిపోతానని చంద్రబాబుకు అర్థమయింది. ఎలాగూ ఓడిపోతానని తేలిపోవడంతో చంద్రబాబు పలాయనవాదం ఎంచుకున్నట్టుంది. అందుకే భువనేశ్వరీతో ఎన్నికల ముందు ఈ ప్రకటన చేయించాడు. చంద్రబాబు హయాంలో కుప్పంలో పార్టీ వివక్ష వీపరీతంగా సాగింది. టిడిపికి చెందిన వాళ్లకు మాత్రమే పనులు జరిగాయి. 2019 తర్వాత ప్రజలు స్పష్టమైన మార్పు చూస్తున్నారు. అర్హులైన వారు ఏ పార్టీ అయినా సంక్షేమం అందింది. జగన్ రూపంలో గొప్ప నాయకత్వాన్ని చూశారు. ఓటమి కళ్ల ముందు కనబడడంతో చంద్రబాబు ముందే కుప్పం నుంచి పారిపోతున్నారు." చంద్రబాబు కింకర్తవ్యం.!? చంద్రబాబు గత కొన్నాళ్లుగా పెనమలూరు నియోజకవర్గంపై కన్నేశారు. కుప్పంలో ఎలాగూ గెలవలేను కాబట్టి .. తన సామాజిక వర్గం అంటే కమ్మ ఓటర్లు అత్యధికంగా ఉన్న పెనమలూరు అయితే తనకు సేఫ్ అన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. తొలుత విశాఖ అనుకున్నా.. అక్కడ గెలిచే అవకాశం లేదని పార్టీ సర్వేల్లో తేలింది. దీంతో కుప్పంను వదిలిపెట్టి పెనమలూరులో పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టున్నారు చంద్రబాబు. 2019లో పెనమలూరులో వైఎస్సార్సిపి ఘనవిజయం సాధించింది. ఇక్కడ గెలిచిన పార్థసారథిని తెర వెనక ఏం చేశారో కానీ తనవైపునకు తిప్పుకున్నారు చంద్రబాబు. భువనేశ్వరీ ప్రకటనను ఎలా చూడాలి? భువనేశ్వరీ ప్రకటన సరదా కామెంట్ కాదు భువనేశ్వరీ ఏ సభలో ఎలా మాట్లాడాలి అన్నది పక్కగా స్క్రిప్టింగ్ చేస్తారు ముందే ఏం చేయాలి.? ఎలా ప్రకటనలు చేయాలి అన్నదానిపై శిక్షణ ఇస్తారు కార్పోరేట్లో ఉండడం వేరు, ప్రజల్లోకి రావడం వేరు కాబట్టి భువనేశ్వరీ విషయంలో పార్టీ అంత జాగ్రత్త తీసుకుంటారు శిక్షణ కోసమే నిజం గెలవాలి యాత్రను వెంట వెంటనే కాకుండా.. బ్రేకులిస్తూ తీసుకెళ్తున్నారు అంటే భువనేశ్వరీ మాట్లాడే ప్రతీ మాటకు చంద్రబాబు డైరెక్షన్ ఉంటుంది చంద్రబాబు ఒక విషయాన్ని ప్రజల్లోకి చొప్పించడానికి చేసిన ప్రయత్నం ఇది కుప్పంలో పోటీ చేసి చంద్రబాబు ఓడిపోతే.. అసలుకే మోసం వస్తుందన్న భయం కుప్పం సేఫ్ సీటు కాదు కాబట్టి ముందే భార్యతో చెప్పించడం రెండు నియోజకవర్గాలు అనుకున్నా.. రెండింటా ఓడిపోతే ఎలా అన్న భయాలు తెలంగాణలోనూ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసిన అందరూ ఓడిపోయారు (ఈటల రెండు చోట్లు, రేవంత్, కేసిఆర్ ఒక్కో చోట) చంద్రబాబు కుప్పంలో పోటీ చేయలేనప్పుడు పార్టీని ఏం నడిపిస్తాడు? భువనేశ్వరీ ద్వారా చంద్రబాబే ఒక ఫీలర్ వదిలారు ముందుగా భువనేశ్వరీతో చెప్పించి, ఆ తర్వాత ఓ పార్టీ ప్రకటన చేయించే ఆలోచన చంద్రబాబుది ఇప్పటికీ పొత్తులపైనే నమ్మకం తప్ప.. ఇది చేస్తానని, ఇది చేశానని బలంగా చెప్పుకోలేని చంద్రబాబుకు రిటైర్మెంట్ టైం వచ్చింది భువనేశ్వరీ ప్రకటన చూస్తుంటే ఇది చంద్రబాబు అస్త్ర సన్యాసమే -
చంద్రబాబు టేస్ట్.. వెరీ వేస్ట్.. పరువు తీసిన భువనేశ్వరి
-
మైలవరంలో నారా భువనేశ్వరికి చేదు అనుభవం
-
నారా భువనేశ్వరికి బిగ్ షాక్..
-
టీడీపీని పాడెపై మోస్తున్న నలుగురు.. పార్టీని భూస్థాపితం చేస్తారా?
ఆత్మకూరు: నలుగురు వ్యక్తులు, నాలుగు నెలలుగా టీడీపీని పాడైపె పండబెట్టి మోస్తున్నారని, 40 ఏళ్ల తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తారా అంటూ మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు స్థానిక టీడీపీ నేతలను ప్రశ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఆధ్వర్యంలో శుక్రవారం ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని 22వ వార్డు అల్లీపురంలో ‘నిజం గెలవాలి’ కార్యక్రమం జరిగింది. భువనేశ్వరి ప్రకటించిన షెడ్యూల్ కన్నా ముందుగానే.. ఇటీవల మృతిచెందిన టీడీపీ కార్యకర్త కముజుల ఆంజనేయరెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఈ కార్యక్రమం కోసం తెలుగు తమ్ముళ్లు రహదారి వెంట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో కేవలం ఆనం రామనారాయణరెడ్డి ఫొటోలు, స్థానిక టీడీపీ నాయకుల ఫొటోలు మాత్రమే ఉండడంతో దీనిపై మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు మండిపడ్డారు. తనతోపాటు మరో మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్య, పార్టీ అధికార ప్రతినిధి గూటూరు మురళీ కన్నబాబు ఫొటోలు, పేర్లు లేకపోవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో అక్కడే ఉన్న టీడీపీ పట్టణ అధ్యక్షుడు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ టి.చంద్రారెడ్డి, కౌన్సిలర్ మాదాల శ్రీనివాసులునాయుడు, మహిళా నాయకురాలు పులిమి శైలజారెడ్డి, వెంకటేశ్వర్లునాయుడు తదితరులను నిలదీశారు. ఆనంను అభ్యర్థిగా ప్రకటించారా ? ఆనంను అధిష్టానం ఆత్మకూరు అభ్యర్థిగా ప్రకటించిందా.. మీకేమైనా అలాంటి సమాచారం ఎవరైనా చెప్పారా.. ఎందుకు ఆయన ఫొటోలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారంటూ స్థానిక టీడీపీ నేతలను కొమ్మి ప్రశ్నించారు. దీంతో వారు అక్కడి నుంచి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. కనీసం సీనియర్ నాయకులను, మాజీ ఎమ్మెల్యేలను పట్టించుకొనే పరిస్థితి లేకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం భువనేశ్వరి పరామర్శించేందుకు వెళ్లిన ఇంట్లోకి కొమ్మి లక్ష్మయ్యనాయుడుతోపాటు మరో నాయకుడు చంద్రారెడ్డి వెళ్లబోతుండగా, యువగళం పాదయాత్ర టీము వారిని అడ్డుకున్నారు. దీంతో కొమ్మి తాను మాజీ ఎమ్మెల్యేనని, ఎవరు చెబితే మీరు నన్ను అనుమతించడం లేదంటూ నిలదీశారు. దీంతో వారు ఆయనను లోపలికి అనుమతించారు. అయితే చంద్రారెడ్డిని మాత్రం అనుమతించకపోవడంతో ఆయన వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో చంద్రారెడ్డిని కూడా ఇంట్లోకి వెళ్లేందుకు అనుమతించారు. -
విజయవాడ: రన్ వే పైకి వచ్చి మళ్లీ గాల్లోకి లేచిన విమానం
-
నారా భువనేశ్వరి సమక్షంలో టీడీపీలో వర్గ విభేదాలు
సాక్షి, కోనసీమ జిల్లా: నారా భువనేశ్వరి సమక్షంలో రాజోలు టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. నారా భువనేశ్వరి పర్యటనలో మహిళా సర్పంచ్‌కు అవమానం జరిగింది.రాజోలు మండలం శివకోడులో నారా భువనేశ్వరిని కలవడానికి తాటిపాక సర్పంచ్ కోటిపల్లి రత్నమాల రాగా, ఆమెను లోపలికి రానివ్వకుండా గొల్లపల్లి సూర్యారావు వర్గీయులు తోసేశారు. ఇటీవల రాజోలులో జరిగిన లోకేష్ పాదయాత్ర లో సర్పంచ్ రత్నమాల ప్లెక్సీలను గొల్లపల్లి వర్గం చించేశారు. అప్పట్లో టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్న సంగతి తెలిసిందే. -
భువనేశ్వరి మళ్లీ బస్సు యాత్ర చేసేది అందుకేనా?
అదేమిటో విచిత్రం. చంద్రబాబుకు.. ఆయన కుటుంబ సభ్యులకు తాము ఇబ్బందుల్లోను, చిక్కుల్లోను, ప్రతిపక్షంలో ఉన్నపుడు మాత్రమే జనం గుర్తొస్తారు. తాను అధికారంలో విలాసాల్లో.. కంఫర్ట్‌గా ఉన్నపుడు ఏనాడూ పేదలు.. నిర్భాగ్యులు కనిపించరు. అప్పుడు వీళ్లంతా చీమల్లా.. దోమల్లా..పూచిక పుల్లలలా కనిపిస్తారు.. తమకు కష్టాలు రాగానే ప్రజల మద్దతు కోరతారు..చంద్రబాబు అరెస్టును భరించలేక రాష్ట్రంలో దాదాపు 300 మంది గుండె పోటు వచ్చి చనిపోయారని తెలుగుదేశం దాని మద్దతుదారు అయిన మీడియాలు ఊదరగొట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ మరణాలను తమకు అనుకూలంగా . సానుభూతిగా మార్చుకునే క్రమంలో నిజం గెలవాలి అంటూ ఓ మూడు రోజులు బస్సు యాత్ర చేశారు. మృతుల కుటుంబాలకు రూ. మూడు లక్షలు చొప్పున ఆర్థిక సాయం అందించారు. పనిలోపనిగా తన భర్తను జగన్ ప్రభుత్వం కుట్రపూరితంగా అరెస్ట్ చేసిందని ఆరోపిస్తూ కొంత సానుభూతిని పోగేసి ప్రయత్నం చేసారు. ఈలోగా చంద్రబాబుకు బెయిల్ వచ్చింది. దీంతో ఆమె ఆయనకు స్వగాతాలు పలుకుతూ ఆ ఆనందంలో ఇటు కార్యకర్తలు మరణించిన అంశాన్ని మరచిపోయారు. ఓ విలేకరి ఇదే విషయాన్నీ ప్రస్తావించగా ఆయనకు బెయిల్ వచ్చేశాక ఇంకా యాత్ర అవసరం ఏముంది అంటూ తనకు మళ్ళీ ప్రజలను కలవాల్సిన అవసరం లేదని తప్పించుకున్నారు. దీనిమీద సోషల్ మీడియాలో విమర్శలు.. ట్రోలింగులు మొదలయ్యాయి. కేవలం సానుభూతికోసమే యాత్ర చేస్తారా.. మీ ఆయనకు బెయిల్ వస్తే ఇక కార్యకర్తల కుటుంబాలను పరామర్శించక్కరలేదా? తాజాగా మళ్ళీ భువనేశ్వరి నిన్న బుధవారం విజయనగరం జిల్లాలో పర్యటించారు.. చంద్రబాబు అరెస్టు భరించలేక గుండెలు ఆగిన ముగ్గురు కార్యకర్తల కుటుంబాలకు ఆర్థికసాయం చేసారు. టీడీపీ ప్రభుత్వం వస్తే వారికీ ఇంటి స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా అప్పట్లోనే ఈ యాత్ర చేయకుండా కొన్నాళ్ళు బ్రేకిచ్చి ఎందుకు యాత్ర చేస్తున్నారన్న సందేహాలు వస్తున్నాయి. పార్టీకి ఓటమి భయం పట్టుకుందా ? ఇంటిల్లిపాది తిరగడం కాకుండా పవన్ కళ్యాణ్.. బీజేపీ ఇతర పార్టీలతో సైతం పొత్తులు ఉండాలా ... ఇవేం లేకపోతే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని అడ్డుకోలేం అని భయం పట్టుకుందా.. అందుకే మళ్ళీ ఆమె బస్సు యాత్ర.. పరామర్శలు అంటూ ప్రజల్లోకి వెళ్తున్నారా అనే సందేహాలు కలుగుతున్నాయి. అటు యువనాయకుడు అని ఎంతగానో హైప్ ఇచ్చిన లోకేష్ పెద్దగా ప్రజలను ప్రభావితం చేయలేకపోవడం తెలుగుదేశానికి ఇబ్బందిగా మారింది. ఈ ఎన్నికలవేళ చంద్రబాబు వయసు రీత్యా ఎక్కువగా ప్రయాణాలు చేయడం.. భారీ ప్రసంగాలు చేయడం వంటికి ఇబ్బందిగా మారిన తరుణంలో లోకేష్ కానీ సమర్థంగా ఉంటే పార్టీకి కొంత బలం అయ్యేది. కానీ లోకేష్ ఎక్కడికి వెళ్తే అక్కడ పార్టీ మటాష్ అయిపోయేలా కనిపిస్తుండడంతో టీడీపీ పెద్దలతోబాటు.. చంద్రబాబు, భువనేశ్వరి సైతం ఆందోళన చెందుతున్నారు. పనికిమాలిన కొడుకు. పార్టీకి భారమే తప్ప లాభం లేదని లోలోన భావిస్తున్నా బయటకు ఆ భావన కనిపించకుండా కవర్ చేస్తూ వస్తున్నారు. కానీ ఇప్పుడు ఎన్నికల సమయంలో సైతం అలా కప్పి ఉంచలేక.. ఇప్పుడు భువనేశ్వరిని రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. ఆమె అయితే కాస్త మహిళా సెంటిమెంట్‌ను రగిలిస్తూ మహిళలతో మాట్లాడడం.. కొంత సానుభూతి పోగేసే అవకాశాలు ఉన్నట్లు భావించిన చంద్రబాబు ఆ మేరకు ఆమెను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది -సిమ్మాదిరప్పన్న -
ఆత్మశాంతి చేస్తారా భువనేశ్వరీ!
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి ప్రజలకు రూ. 10 కోట్లు బాకీ పడ్డారు. అవును రాష్ట్ర వ్యాప్తంగా 300 పైగా కుటుంబాలకు ఆ డబ్బు ఇవ్వాల్సి ఉంది.. ఇస్తారా.. ఇవ్వరా ? ఎగ్గొడతారా చూడాలి. వాస్తవానికి స్కిల్ స్కామ్ కింద చంద్రబాబు అరెస్ట్ అయ్యాక దేశ్ కీ నేతా.. విజనరీ.. తెలుగువాళ్ళ ఆత్మగౌరవం.. ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచపటంలో పెట్టిన చాణక్యుడు .. నిప్పుకు ప్రతిరూపం.. సత్యానికి ప్రతిరూపం అయిన తన భర్తను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆక్రోశిస్తూ సభలు సమావేశాలు పెట్టి సానుభూతి ప్రోగుచేయాలని చూశారు. ఊరకనే ఈవెంట్లు చేస్తే వర్కవుట్ కావడం లేదని నిజం గెలవాలి అంటూ అక్టోబర్ 25 నుంచి బస్సు యాత్ర మొదలు పెట్టారు. వెళుతూ తన భర్త ఘనతను చెబుతూ కాస్త బాధపడుతూ.. అప్పుడప్పుడూ నవ్వుతూ ఏదో ఈవెంట్ నడిపించారు. పనిలో పనిగా ఎల్లో మీడియాలో సైతం చంద్రబాబు అరెస్టును భరించలేక వందలాది మంది చనిపోతున్నారంటూ రోజూ వార్తలు వచ్చేవి. ఇంకా ఈ చావులని సైతం తమ మైలేజీ కోసం వాడుకోవాలని ప్లాన్ చేసిన టీడీపీ అలా మరణించిన ఒక్కో కుటుంబానికి రూ. మూడు లక్షలు సాయం అన్నారు. కొన్ని కుటుంబాలకు మాత్రం ఇచ్చారు. ఫోటోలు దిగారు. ఈలోపు చంద్రబాబుకు బెయిల్ వచ్చింది. అంతే ఠక్కున కరెంట్ పోగానే టీవీ ఆగిపోయినట్లు భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర ఆగిపోయింది. అదేంటో మరి మిగతా 300 పైగా కుటుంబాలకు పైసా ఇవ్వలేదు. కనీసం ఉచిత సానుభూతి కూడా పలకలేదు. హఠాత్తుగా బస్సుయాత్ర నిలిపివేశారు. మరి మిగతా కుటుంబాలను ఆదుకునేది ఉందా లేదా? అంటే తన భర్తకు బెయిల్ రాగానే నిజం గెలిచినట్లా? బెయిల్ రాగానే రాష్ట్రంలో నిజం గెలిచిందా? మరి చంద్రబాబు అరెస్టు భరించలేక ప్రాణాలు విడిచిన కుటుంబాలను ఓదార్పు.. ఆదరువు అక్కర్లేదా.. మీరు మీకుటుంబం సంతోషంతో ఉంటే చాలా?. మరి ఎంతోమంది చనిపోయారు అని మీరే అన్నారు కదా.. మరి వాళ్ళను ఎందుకు ఆదుకోరూ అని అంటున్నారు. మీకు బెయిల్ వస్తే నిజం గెలిచినట్లా? మాకు శాంతి లేదా.. అని మరణించినవారి ఆత్మలు ఘోషపెడుతున్నాయి. ఆ డబ్బులేవో మా కుటుంబీకులకు ఇచ్చేసి మా ఆత్మలకు శాంతి చేకూర్చాలని కోరుతున్నాయి. - సిమ్మాదిరప్పన్న -
అమ్మ మహానటి..భువనేశ్వరిని ఇమిటేట్ చేసిన మంత్రి
-
భువనేశ్వరి, పురంధేశ్వరి ఇద్దరూ వెన్నుపోటు సిస్టర్స్: వరుదు కల్యాణి
సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబంపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు ఎమ్మెల్సీ వరుదు కల్యాణి. సీఎం జగన్ కాలిగోటికి కూడా సరిపోని వ్యక్తులు ఈరోజు మాట్లాడటం సిగ్గుచేటు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా, వరుదు కల్యాణి బుధవారం వైజాగ్‌లో మీడియాతో మాట్లాడుతూ..‘టీడీపీ తిరిగి పాలనలోకి రాదని తేలిపోయింది. వైఎస్సార్సీపీ చేపట్టిన బస్సు యాత్ర విజయవంతమైన తీరు బట్టి టీడీపీ ఓటమి ఖాయమని తెలిసిపోయింది. ఆడవాళ్లను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం చంద్రబాబుకి అలవాటు. చంద్రబాబు శిఖండి లాంటి వ్యక్తి. టీవీ 5, ఈనాడు, ఏబీఎన్ చంద్రబాబు ఫొటో లేకుండా ఆయన కోసం పనిచేస్తున్నాయి. నారా భువనేశ్వరి, పురంధేశ్వరి ఇద్దరూ వెన్నుపోటు సిస్టర్స్. వైఎస్సార్సీపీ నేతలు ఎప్పుడైనా టీడీపీ నాయకుల కుటుంబ సభ్యులను విమర్శించారా?. అనవసరంగా సీఎం జగన్ కుటుంబ సభ్యులను విమర్శిస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అస్సలు ఊరుకోము’ అంటూ హెచ్చరించారు. -
మనవడికి అబద్ధం చెప్పి జైలుకు తీసుకెళ్లావు..
-
చంద్రబాబు ఆరోగ్యంపై సవాలక్ష అసత్య ప్రచారాలు చేస్తోన్న కుటుంబం
-
Big Question: ఆ లేఖలలో ఉన్నదేంటి? భువనేశ్వరి చేసినదేంటి?
-
పవన్, భువనేశ్వరిపై ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి సెటైర్లు
-
నారా లోకేష్ తల్లిని కూడా రింగ్ రోడ్ కేసులో ఇరికిస్తున్నాడు...
-
చంద్రబాబు రాజకీయ జీవితంలో చోటు లేనిది దానికే!
సాక్షి, గుంటూరు: 371 కోట్ల రూపాయలు లూటీ చేసిన స్కిల్ స్కాంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. స్కిల్ స్కాం ఆద్యంతం అబద్ధాలతో ముందుకు తీసుకెళ్లారాయన. సాక్ష్యాలతో దొరికినా సిఐడీ అధికారులకు అబద్ధాలే చెప్పారాయన. న్యాయస్థానం ఆయన్ను జైలుకు పంపితే..ఆయన కుటుంబ సభ్యులు, టిడిపి నేతలు అబద్ధాలపై అబద్ధలు పేర్చుకుపోయారు. బాబు ఆరోగ్యంపైనా లేనిపోని అబద్ధాలు చెప్పి ఆయనకు మాయరోగాలన్నీ అంటించారు. ఇన్ని అబద్ధాలతో కోట కట్టేసి ఇపుడు నిజం గెలవాలని భువనేశ్వరి చేత యాత్ర చేయిస్తున్నారు. నిజం గెలవాలంటున్నారు నారా భువనేశ్వరి. నిజమే నిజమే గెలవాలి. అబద్ధం ఎప్పుడూ గెలవకూడనే కూడదు. కాకపోతే దురదృష్ట వశాత్తూ అబద్ధాలతోనే చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితమంతా నెట్టుకొచ్చేశారని అంటున్నారు పరిశీలకులు. చంద్రబాబు నాయుడికి నిజానికి అసలు సంబంధంమే లేదంటున్నారు ఆయన గురించి బాగా తెలిసిన రాజకీయ నేతలు. 371 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అమాంతం భోంచేసిన అతి పెద్ద అవినీతి ఘట్టంలో చంద్రబాబు నాయుడి పాత్రకు సంబంధించి ప్రాధమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని న్యాయస్థానం భావించింది కాబట్టే చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండాల్సి వచ్చింది. ► నిజానికి స్కిల్ వ్యవహారంలో సిమన్స్ కంపెనీతో ఒప్పందం కుదిరిందని కేబినెట్ ను నమ్మించారు. అది అబద్ధం ► మనం 10 శాతం నిధులు పెడితే సిమన్స్ కంపెనీ 90 శాతం నిధులను గ్రాంట్ ఇన్ ఎయిడ్ గా ఇస్తుందని మంత్రివర్గాన్ని నమ్మించారు. అది అబద్ధం ► స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా లక్షలాది మందికి నైపుణ్యాలు నేర్పితే వేలాది మందికి బంగారంలాంటి ఉద్యోగాలు వచ్చాయన్నారు. అది అబద్ధం ► సెప్టెంబరు 9న చంద్రబాబు నాయుణ్ని సిఐడీ పోలీసులు అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టుముందు హాజరు పరిస్తే తనను 24 గంటల లోపు కోర్టు ముందు హాజరు పర్చలేదని ఫిర్యాదు చేశారు. అది అబద్ధం ► 48 రోజులకు పైగా జైల్లో ఉండి..ఏ కోర్టులోనూ బెయిల్ రాకపోవడంతో మధ్యంతర బెయిల్ కోసం ఆరోగ్యం బాగాలేదని సాకులు చెబుతున్నారు. అది అబద్ధం ► చంద్రబాబు నాయుణ్ని ములాఖత్ లో కలిసిన ఆయన సతీమణి నారా భువనేశ్వరి నా భర్త జైలుకెళ్లాక అయిదు కిలోల బరువు తగ్గిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. అది అబద్ధం ఆయన ఒక కిలో బరువు పెరిగారన్నది నిజం. ► జైల్లో సరఫరా అవుతోన్న నీళ్లు కలుషితంగా ఉన్నాయని భువనేశ్వరి ఆరోపించారు. అది అబద్ధం ► తన తండ్రికి స్టెరాయిడ్స్ ఇచ్చి అంతమొందించేందుకు కుట్ర చేస్తున్నారని నారా లోకేష్ ఆరోపించారు. అది అబద్ధం ► చైనా నుండి డ్రాగన్ దోమలను దిగుమతి చేసి వాటిని చంద్రబాబు పైకి ఉసిగొల్పి కుట్టిస్తున్నారని ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయించారు. అది అబద్ధం ► తన భర్త కు సరియైన భద్రత లేదని.. ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని భువనేశ్వరి ఆరోపించారు. అది అబద్ధం. అత్యంత పటిష్ఠమైన భద్రతను చంద్రబాబుకు ఏర్పాటు చేశారన్నది నిజం. ► ఇపుడు తాజాగా చంద్రబాబు నాయుడు కూడా తనను అంతమొందించేందుకు కుట్ర చేస్తున్నారని అంటున్నారు . అది అబద్ధం. చంద్రబాబుకు జైలును మించిన సురక్షితమైన చోటు మరోటి లేదని వారు అంటున్నారు. ► అసలు స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగనే లేదని చంద్రబాబు నాయుడు అంటున్నారు. అది అబద్ధం. 371 కోట్ల రూపాయలకు ఎలా రెక్కలు వచ్చాయో.. ఎలా షెల్ కంపెనీలు దాటుకుంటూ హవాలా మార్గంలో చంద్రబాబు నాయుడికి అవి చేరాయో ఈడీ అధికారులు మొత్తం రూట్ ని కనిపెట్టారు. ఆధారాలతో సహా వెలుగులోకి తెచ్చారు. హవాలా మార్గంలో చంద్రబాబుకు నిధులు సేకరించిన బాబు పి.ఎస్. పెండ్యాల శ్రీనివాస్, లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్ లతో పాటు షాపూర్జీ పల్లోంజీ కంపెనీకి చెందిన మనోజ్ పార్ధసానికి సిఐడీ నోటీసులు ఇవ్వడంతోనే వారు పరారయ్యారు. కిలారు రాజేష్ అయితే నెల రోజులకు పైగా అజ్ఞాతంలో ఉండి ఆ తర్వాత అమాంతం సిఐడీ ముందు ప్రత్యక్షమయ్యారు. అయితే విచారణకు ఏ మాత్రం సహకరించలేదు. ఏం అడిగినా తెలీదు గుర్తులేదు అని దాటవేశారు. రెండో రోజు విచారణకు వచ్చేటపుడు కొన్ని డాక్యుమెంట్లు తీసుకుని రావలసిందిగా సిఐడీ అధికారులు ఆదేశించారు. అంతే తాను విచారణకు రాలేనని ఆ డాక్యుమెంట్లు తీసుకురాడానికి కొంత సమయం పడుతుందని దసరా తర్వాత తిరిగి విచారణకు హాజరవుతానని చెప్పి రాజేష్ మాయమయ్యాడు. పెండ్యాల శ్రీనివాస్ ఇప్పటికీ ఎక్కడ ఉన్నాడో తెలీదు. ఆయన ఎందుకు పారిపోయాడో మాత్రం సిఐడీ అధికారులకు తెలుసు. అతగాణ్ని విచారిస్తే షెల్ కంపెనీల ద్వారా తలరించిన 241 కోట్ల రూపాయల నిధులు ఏయే ఖాతాల్లో జమ చేశారో తెలుస్తుంది. ఆ భయానికే చంద్రబాబు నాయుడే శ్రీనివాస్ ను దేశంలో లేకుండా బయటకు పంపేశారని సిఐడీ అనుమానిస్తోంది. స్కిల్ స్కాం ఒక్కటే కాదు చంద్రబాబు నాయుడి అపకీర్తి కిరీటంలో ఎన్నో అవినీతి రాళ్లు పొదిగి ఉన్నాయి. అమరావతి ల్యాండ్ స్కాం, అసైన్డ్ ల్యాండ్స్ స్కాం, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ స్కాం, ఫైబర్ నెట్ స్కాం వంటివి క్యూలో నిలబడ్డాయి. చంద్రబాబును ఎప్పుడు విచారిద్దామా అని దర్యాప్తు సంస్థలు కాచుక్కూర్చున్నాయి. వీటిలోనే కొన్నింటికి పీటీ వారంట్లు జారీ చేసింది అందుకే. న్యాయస్థానాల అనుమతి రాగానే ఒకటొకటిగా పాపాలు బద్దలు అవుతాయి. అబద్ధాల పుట్టలు పేలిపోతాయి...అని న్యాయ రంగ నిపుణులు అంటున్నారు. అన్ని కేసుల్లోనూ స్కిల్ స్కాం తరహాలోనే అబద్ధాలపై అబద్ధాలు పేర్చుకుంటూ పోయి పెద్ద కోట కట్టేశారు. ఆ కోటకు ఇంతకాలానికి బీటలు వారాయి. ఇక అది కుప్పకూలడం ఖాయం అంటున్నారు పరిశీలకులు. బెయిల్ ఎంతకీ రాకపోయే సరికి చంద్రబాబుకు ఆ రోగం ఉంది ఈ సమస్య ఉంది అని రోజుకో ఫిర్యాదు చేస్తున్నారు కుటుంబ సభ్యులు. చివరకు 73 ఏళ్ల వయసున్న నేతని జైల్లో పెట్టి ఇబ్బంది పెడుతున్నారంటూ సానుభూతి కోసం డ్రామాలాడుతున్నారు. చంద్రబాబు నాయుడికన్నా వయసులో చాలా పెద్ద వారు అయిన నేతలు మాజీ ముఖ్యమంత్రులు కూడా జైల్లో ఉన్న సంగతిని టిడిపి నేతలు కానీ..భువనేశ్వరి అండ్ కో కానీ తెలివిగా విస్మరిస్తున్నారు. అబద్ధాల చంద్రబాబును కాపాడుకోడానికి భువనేశ్వరి ఎన్ని ప్రయత్నాలు చేసినా అంతిమంగా నిజం గెలిచి తీరుతుందని.. అపుడు చంద్రబాబు శాశ్వతంగా జైల్లోనే ఉండక తప్పదని పాలక పక్ష నేతలు అంటున్నారు. -
అబద్ధాల కోట బీటలువారింది
-
మనవడికి అబద్ధం చెప్పిన నారా భువనేశ్వరి..!
-
Oct 28th 2023 : చంద్రబాబు కేసు టుడే అప్డేట్స్
Chandrababu Arrest, Remand, Cases, Petitions And Political Updates 16:56 PM, అక్టోబర్ 28, 2023 చంద్రబాబు క్షేమంగా ఉన్నారు : డాక్టర్లు ► కోర్టు సూచనల మేరకు హెల్త్ బులెటిన్ విడుదల చేసిన అధికారులు ► రిమాండ్ ముద్దాయి నెంబర్ 7691 : చంద్రబాబు నాయుడు, తండ్రి పేరు ఖర్జూరనాయుడు ఆరోగ్య నివేదిక ► ఆరోగ్య పరిస్థితి అన్ని రకాలుగా నిలకడగా ఉంది : డాక్టర్లు 17:36 PM, అక్టోబర్ 28, 2023 నిజాలు చెప్పడానికి వచ్చిందట.. అబద్దాల భువనేశ్వరీ : YSRCP ► వచ్చే వారంలో రెండో విడత నారా భువనేశ్వరి పరామర్శ యాత్ర ► ఉత్తరాంధ్రలో ‘నిజం గెలవాలి’ పేరుతో నారా భువనేశ్వరి పర్యటన ► శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలో యాత్ర ► కుటుంబాలను పరామర్శించనున్న భువనేశ్వరి ► ఇప్పటివరకు అన్నీ అబద్దాలతో కొత్త రికార్డు సృష్టిస్తోన్న భువనేశ్వరీ 17:05 PM, అక్టోబర్ 28, 2023 రాజకీయ వ్యభిచారి చంద్రబాబు : బాపట్లో మంత్రి జోగి రమేష్ ► జైల్లో ఉన్న చంద్రబాబును లోకేష్ కలిసొచ్చి మీరు ఏం పీకారని మమల్ని అడుగుతున్నాడు ► 40 ఏళ్ల చరిత్ర అని చెప్పిన చంద్రబాబు తప్పు చేసి జైలు జీవితం గడుపుతున్నాడు ► చంద్రబాబు జైల్లో ఉంటే లోకేష్ కి పండగలాగా ఉంది ► రాజకీయ వ్యభిచారం అనేది చంద్రబాబుతోనే పుట్టింది ► ఆ రోజుల్లో చంద్రబాబు రాజకీయ వ్యభిచారి ఎన్టీఆర్ అని చెప్పారు ► వందల పేజీల అవినీతి చిట్టా ఉంది కాబట్టే బాబుకు బెయిల్ రాలేదు ► పాపం పండింది కాబట్టే చంద్రబాబు అరెస్టు అయ్యాడు ► వ్యవస్థలను మేనేజ్ చేసి ఇప్పటివరకు బతికిందే చంద్రబాబు : మంత్రి జోగి రమేష్ 16:45 PM, అక్టోబర్ 28, 2023 పచ్చమీడియా.. కళ్లు తెరవండి ► విశాఖ భీమిలిలో మాట్లాడిన మంత్రి సిదీరి అప్పలరాజు ► పచ్చమీడియా.. కొంచెం కళ్లు తెరిచి భీమిలీలో ఉన్న జనాలను చూడండి ► జనాలు లేని సభలు చూడాలంటే భువనేశ్వరి సభలకు వెళ్ళండి ► దొరికిన దొంగ చంద్రబాబు ► బీసీలను చంద్రబాబు దారుణంగా అవమానించారు ► నిప్పు తుప్పు అనే చంద్రబాబు జైల్ లో చిప్ప కూడు తింటున్నారు ► చంద్రబాబు తప్పు చేయలేదని టిడిపి నేతలు కూడా చెప్పడం లేదు ► నిన్నటి వరకు కుర్రాడినని చెప్పుకునే చంద్రబాబు.. ఇప్పుడు బెయిల్ కోసం మాట మార్చి వయస్సు అయిపోయిందని అంటున్నారు ► తోకలు తోలు తీస్తానని నిన్నటిదాకా చంద్రబాబు బెదిరించారు ► బీసీలు జడ్జిలు గా పనికి రారని లేఖలు రాశారు 16:15 PM, అక్టోబర్ 28, 2023 రేపట్నుంచి సమన్వయం నెక్ట్స్ లెవల్.! ► ఏపీ : రేపటి నుంచి టీడీపీ - జనసేన సమన్వయ సమావేశాలు ► ఉమ్మడి జిల్లాల వారీగా సమన్వయ సమావేశాలు ► ఈ నెల 29,30,31 న జిల్లాల్లో టీడీపీ - జనసేన సమన్వయ సమావేశాలు ► ఇరు పార్టీల నుంచి ఒక్కొక్కరు చొప్పున సీనియర్ నేతలు ► ఎవరెవరి సీట్లు ఉంటాయి? ఎవరివి పొత్తులో భాగంగా పోతాయి? ► ఎవరికి సర్దిచెప్పాలి? ఎవరిని బుజ్జగించాలి? ► 29న శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, ప్రకాశం, అనంత జిల్లాల్లో సమావేశాలు ► 30న పశ్చిమ గోదావరి, కృష్ణా, చిత్తూరు, కడప జిల్లాల్లో సమావేశాలు ► 31న విశాఖ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో సమావేశాలు 15:58 PM, అక్టోబర్ 28, 2023 హైకోర్టు రోస్టర్‌లో మార్పులు ► ఏపీ హైకోర్టులో రోస్టర్ విధానంలో భాగంగా న్యాయమూర్తుల బెంచ్‌లో మార్పులు ► కొత్తగా నలుగురు జడ్జిలు ఏపీ హైకోర్టులో బాధ్యతలు స్వీకరించటంతో వారికి రోస్టర్ విధానంలో బెంచ్ లు కేటాయింపు ► బెయిల్ పిటిషన్ల మీద విచారణ చేపట్టనున్న జస్టిస్ మల్లికార్జునరావు బెంచ్ ► క్వాష్ పిటిషన్ల మీద విచారణ చేయనున్న జస్టిస్ భానుమతి బెంచ్ 14:56 PM, అక్టోబర్ 28, 2023 పాపం.. బతకనివ్వండి ప్లీజ్.. రాజకీయం కోసం రోగాలంటగడతారా? ► చంద్రబాబు ఆరోగ్యంతో ఆటలాడుకుంటోన్న కుటుంబసభ్యులు, టిడిపి నేతలు, ఎల్లో మీడియా ► ఒకసారి ఎవరి వర్షన్ ఏంటో మీరే చూడండి. ► పుట్టుకతోనే చంద్రబాబుకు గుండె సమస్య ఉంది, ఇప్పటి వరకు జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటున్నారు : కొడుకు లోకేష్ ► ఇప్పుడు జైలులో గుండె సమస్య తీవ్రతరమయ్యే అవకాశముంది : నారా లోకేష్ ► చంద్రబాబు కంటి సమస్య ఉంది, తక్షణం సర్జరీ చేయాలని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి డాక్టర్లు చెబుతున్నారు : ఎల్లో మీడియాలో ఒక పత్రిక ► చంద్రబాబుకు యాంగిల్ క్లోజర్ గ్లకోమా అనే కంటి వ్యాధి ఉంది. ఇంట్రా ఆక్యులర్ ప్రెజర్ ద్వారా కేవలం ఆస్పత్రిలోనే చికిత్స అందించాలి : ఎల్లోమీడియాలో ఓ ఛానల్ ► చంద్రబాబు వెన్ను కింది భాగంలో నొప్పితో పాటు చర్మవ్యాధులున్నాయి. వీపరీతంగా దద్దర్లు రావడం వల్ల గోకుతున్నారు : ఎల్లో మీడియాలోని మరో ఛానల్ ► చంద్రబాబు మలద్వారం వద్ద తీవ్రంగా నొప్పి వస్తోంది. రాత్రంతా నిద్ర లేకుండా నొప్పితో బాధపడుతున్నారు : ఎల్లో మీడియాలోని ఓ పత్రిక ► చంద్రబాబు ఒకే భంగిమలో ఎక్కువసేపు కూర్చోవద్దు, బాగా సౌకర్యంగా ఉండే సింహాసనం లాంటి కుర్చీ అయితే బెటర్ : ఎల్లోమీడియాలోని మరో ఛానల్ మీరే కదా, నిన్న మొన్నటిదాకా.. వయస్సు అనేది చంద్రబాబుకు ఒక నెంబర్ మాత్రమే అని రాసింది..! 14:36 PM, అక్టోబర్ 28, 2023 ఇంకా ఇన్ని భ్రమలా? ► తెలంగాణలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం : కాసాని ► బీజేపీతో పొత్తుల విషయంపై క్లారిటీ రాలేదు : కాసాని ► రేపు ఉదయం లోకేష్ తో చర్చించి ఫైనల్ చేస్తాం : కాసాని ► తెలంగాణలో టీడీపీ బలంగానే ఉంది : కాసాని ► నాకు ఏ పార్టీ నుంచి పిలుపు రాలేదు : కాసాని ► కాసాని తీరుపై విస్మయపోతున్న రాజకీయ వర్గాలు ► ఏది చెబితే అది నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు.! ► అసలు ఒక్క చోట కూడా పోటీ చేయదని ఇప్పటికే లోకేష్ సంకేతాలిచ్చారు.! ► ఆ విషయం తెలిసి కూడా ఇంకా దొంగాట ఎందుకు కాసాని.? ► ఏ పార్టీ నుంచి పిలుపు రాలేదని చెప్పడంలో మీ ఉద్దేశ్యమేంటీ? ► అసలు జైల్లో ఉన్న చంద్రబాబు, బయట ఉన్నలోకేష్ మీకిచ్చిన బ్రీఫింగ్ ఏంటీ? 14:27 PM, అక్టోబర్ 28, 2023 డామిట్.. కథ ఎందుకు అడ్డం తిరుగుతోంది? ► తెలుగుదేశంలో ఉన్నది విజన్ కాదు.. కోడి బుర్ర అని స్పష్టం చేస్తోన్న దృష్టాంతాలు ► ఓటుకు కోట్లు కేసులో ఓ మత పెద్దను పట్టుకుని రూ.50లక్షలతో అడ్డంగా దొరికిన పచ్చ గ్యాంగ్ ► ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేయడమే కాకుండా.. మనవాళ్లు బ్రీఫ్డ్మీ అంటూ హామీలిచ్చి రికార్డు చేయించుకుని పట్టుపడ్డ చంద్రబాబు ► గుడిలో విగ్రహాలను కూల్చి ఏపీ సర్కారుకు చెడ్డ పేరు తేవాలనుకున్న కుట్రలో సీసీ కెమెరాలో అడ్డంగా దొరికిపోయిన తెలుగు తమ్ముళ్లు ► ఢిల్లీకి వెళ్లి లాయర్లతో మాట్లాడతాను అన్నప్పుడే తెలుగుదేశం వాళ్లు భయపడ్డారు.. చినబాబు గురించి బాగా తెలుసుకాబట్టి.! ► చేసిన పనికి ఎదురు తన్నిన పరిణామాలు, కిక్కురుమనకుండా తిరిగొచ్చేసిన లోకేష్ ► నాట్ బిఫోర్ వెనక కథ నడిపి అడ్డంగా దొరికిపోయిన ఎల్లోమీడియా ఓనర్ ► ఇంత గుడ్డిగా చేయడం, దొరికిన తరవాత అన్యాయం జరిగిపోయిందనడం మీ విజనా? ► మీ రాజకీయ అధికారం కోసం ఇంకెన్ని అక్రమాలు చేస్తారు? ఇంకెన్ని దుర్మార్గాలు చేస్తారు? ► మీ కక్కుర్తి కోసం దేనికైనా దిగజారుతారా? 14:08 PM, అక్టోబర్ 28, 2023 బ్రోకర్ పని చేసి అడ్డంగా దొరికిపోయిన ఎల్లోమీడియా ఓనర్ ► సాంకేతిక అంశాలను అడ్డుపెట్టుకుని న్యాయవ్యవస్థను దెబ్బతీసే కుట్ర చేసిన తెలుగుదేశం ► నాట్ బిఫోర్ గేమ్‌లో తెర వెనక ప్లాన్ చేసిన పచ్చ టీవీ ఛానల్ ఓనర్ ► అందర్నీ మేనేజ్ చేస్తానంటూ వెళ్లి అడ్డంగా పట్టుబడ్డ పచ్చ టీవీ ఛానల్ ఓనర్ ► హై ప్రొఫైల్ లాబీయిస్ట్‌గా బిల్డప్ ఇచ్చి దొరికిపోయిన పచ్చ టీవీ ఛానల్ ఓనర్ 13:48 PM, అక్టోబర్ 28, 2023 నారా వారి అబద్ధాల ఫ్యాక్టరీ ►సీమెన్స్ కంపెనీతో ఒప్పందం కుదిరిందని కేబినెట్‌కు చెప్పింది.. అబద్ధం ►పది శాతం నిధులు పెడితే.. సీమెన్స్ సిమన్స్ కంపెనీ 90 శాతం నిధులను గ్రాంట్ ఇన్ ఎయిడ్ గా ఇస్తుందన్నది.. అబద్ధం ►స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా లక్షలాది మందికి నైపుణ్యాలు నేర్పితే వేలాది మందికి బంగారంలాంటి ఉద్యోగాలు వచ్చాయన్నది.. అబద్ధం ►సెప్టెంబరు 9న చంద్రబాబు నాయుడ్ని సీఐడీ పోలీసులు అరెస్ట్ చేస్తే.. 24 గంటల లోపు కోర్టు ముందు హాజరు పర్చలేదని చంద్రబాబు ఆరోపణ.. అబద్ధం. ►48 రోజులకు పైగా జైల్లో ఉండి.. ఏ కోర్టులోనూ బెయిల్ రాకపోవడంతో మధ్యంతర బెయిల్ కోసం ఆరోగ్యం బాగాలేదని చెప్తుండడం.. అబద్ధం ►చంద్రబాబు నాయుడు జైల్లో బరువు తగ్గారని నారా భువనేశ్వరి చేస్తున్న ప్రచారం.. అబద్ధం. ► జైల్లో సదుపాయాల గురించి టీడీపీ చేస్తున్న ప్రచారం.. అబద్ధం ►తన తండ్రికి స్టెరాయిడ్స్ ఇచ్చి అంతమొందించేందుకు కుట్ర చేస్తున్నారని నారా లోకేష్ చెప్తుండడం.. అబద్ధం ► చైనా నుండి డ్రాగన్ దోమలను దిగుమతి చేసి వాటిని చంద్రబాబు పైకి ఉసిగొల్పి కుట్టిస్తున్నారని ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయించడం.. అబద్ధం ►తనను అంతమొందించేందుకు కుట్ర చేస్తున్నారని చంద్రబాబు గగ్గోలు పెడుతుండడం.. అబద్ధం ► స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్లో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగనే లేదని చంద్రబాబు చెప్తుండడం.. అబద్ధం 12:55 PM, అక్టోబర్ 28, 2023 చంద్రబాబు జైల్లో ఉండడమే సరైంది విశాఖ సామాజిక సాధికార యాత్ర సమావేశంలో సీదిరి అప్పలరాజు కామెంట్స్ ►నారా భువనేశ్వరి సభకు, వైఎస్సార్సీపీ సామాజిక సాధికార సభలకు వచ్చే జనాన్ని చూడండి. ►లోకేష్ యాత్రను మొదటి పేజీలో వేసుకోలేని స్థితిలో పచ్చ మీడియా ►చంద్రబాబు తప్పు చేయలేదు బెయిల్ ఇవ్వండి అనడం లేదు.. బాగోలేదు గనుకే బెయిల్ ఇవ్వండి అంటున్నారు ►చంద్రబాబు జైల్లో ఉండడమే సరైంది ►బాబు బయటకు ఉంటే ప్రజలకు ప్రమాదం ►చంద్రబాబు పూర్తిగా అవినీతిలో కూరుకు పోయారు.. ఇక బయటకు రాలేరు 12:32 PM, అక్టోబర్ 28, 2023 చంద్రబాబు పిటిషన్.. అత్యంత తొందరపాటు చర్య ►చంద్రబాబు పిటిషన్‌కు వ్యతిరేకంగా సుప్రీంలో బలమైన వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ముకుల్‌రోహత్గి(అక్టోబర్ 17న) ►స్కిల్ స్కామ్ కేసులో సీఐడీ ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలంటూ చంద్రబాబు క్వాష్ పిటిషన్ వేయడం తొందరపాటు చర్యే ►17ఏ సెక్షన్ అనేది నిజాయితీ కలిగిన ప్రభుత్వ అధికారులకు ప్రజాప్రతినిధులకే వర్తిస్తుంది ►17ఏ సెక్షన్ చంద్రబాబుకి వర్తించదు ►ఈ కేసులో నేరం జరిగినట్లు ప్రాథమిక ఆధారాలున్నాయి ►పాత నేరాలకు సంబంధించి ఈ సెక్షన్ వర్తించదు ►స్కిల్ స్కామ్ జరిగిన 2015-16 సమయంలో.. అంటే నేరం జరిగిన సమయంలో 17ఏ సెక్షన్ లేదు ►17ఏ సెక్షన్ అధికారిక నిర్ణయాల సిఫార్సులకు మాత్రమే వర్తిస్తుంది ►అవినీతి పరులకు ఈ సెక్షన్ రక్షణ కవచం కాకూడదు ►అవినీతి నిరోధక చట్టాన్ని బలోపేతం చేయడానికే ఈ సెక్షన్ తెచ్చారు ►నిజాయితీ గల ప్రజాప్రతినిధులు నిర్ణయాలు తీసుకునే సమయంలో భయం లేకుండా ఉండేందుకు 17-ఏ తెచ్చారు ►ప్రజాప్రతినిధులు తీసుకుంటున్న నిర్ణయాల్లో ఎక్కడైనా పొరపాటు జరిగితే 17-ఏ కాపాడుతుందనేది చట్టం ఉద్దేశం ►అరెస్ట్ చేసిన ఐదు రోజులకే క్వాష్ పిటిషన్ వేయడం అత్యంత తొందరపాటు చర్య ►విచారణ చేస్తున్న అధికారులకు కనీసం సమయం ఇవ్వకపోవడం కూడా సరికాదు ►సెక్షన్ 482 ప్రకారం క్వాష్ చేడయం అనేది.. అత్యంత అరుదైన కేసుల్లోనే తీసుకునే నిర్ణయం ►కేసు ట్రయల్ దశలో ఉన్నప్పుడు సెక్షన్ 482 ద్వారా క్వాష్ కోరడం సరికాదు ►గతంలో కొన్ని కేసుల్లో పీసీయాక్ట్ కొట్టేసినా సెక్షన్ 4 ప్రకారం.. ఐపీసీ సెక్షన్లపై స్పెషల్ ట్రయల్ కోర్టు విచారణ కొనసాగించవచ్చు ►ఈ కేసులో ఉన్న ఆరోపణలన్నీ ప్రత్యేక కోర్టు ద్వారా విచారించదగినవే ►పీసీ యాక్ట్ వర్తించకపోయినా.. మిగిలిన సెక్షన్లపై విచారించొచ్చు ►పీసీ యాక్ట్ లేకపోయినా.. విచారణ చేసే అధికారం స్పెషల్ కోర్టుకు ఉంది ►సగం సెక్షన్లకు ఒక కోర్టులో విచారణ, మరో సగం సెక్షన్లకు మరో కోర్టులో విచారణ అనడం లా కాదు ►ఇలా భావిస్తే.. వ్యవస్థ అపహస్యం అవుతుంది ►ఇది తీవ్రమైన నేరం...విచారణ చేసే అధికారం స్పెషల్ కోర్టుకు ఉంది ►జిల్లా జడ్జికి ఉండే అధికారాలూ స్పెషల్ జడ్జికి కూడా ఉంటాయి ►స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు.. చాలా తీవ్రమైన ఆర్థిక నేరం ►ఈ కేసులో 17ఏ వర్తించినా.. మిగిలిన ఐపీసీ సెక్షన్లపై విచారించే అధికారం ప్రత్యేక కోర్టుకు ఉంది ►ఎఫ్ఐఆర్లో కాగ్నిజబుల్ అఫెన్సెస్‌కు సంబంధించిన సెక్షన్లు ఉన్నాయా? లేదా? అనేది ముఖ్యం ►ఈ విషయాన్ని మాత్రమే కోర్టులు పరిగణనలోకి తీసుకోవాలి ►ఈ కేసులో ఎఫ్ఐఆర్ కొట్టేయాలని క్వాష్ పిటిషన్ వేశారు ►స్కిల్ స్కామ్ కేసులో వందల కోట్ల అవినీతి జరిగింది ►పక్కా ఆధారాలతో చంద్రబాబు దొరికారు ►ఇప్పటికే ఈ కేసులో ఈడీ, ఇన్‌కమ్‌ట్యాక్స్ సంస్థలు విచారణ చేస్తున్నాయి ►ఇన్ని విచారణ సంస్థలు దర్యాప్తు జరుపుతున్నప్పుడు ఇది రాజకీయ కక్ష ఎలా అవుతుంది? ►ఈ కేసులో ఫొరెన్సిక్ నివేదిక చూస్తే షాక్‌కు గురవుతారు ►రూ. 371కోట్ల రూపాయలు ప్రజా సొమ్ము ను లూటీ చేశారు ►అధికారులు వద్దని వారించినా.. ఇచ్చేయండి ఇచ్చేయండంటూ ఆదేశాలు జారీచేశారు ►మొత్తంగా ఈ కేసు 482సెక్షన్ కింద క్వాష్ చేయాలా? వద్దా? అనే నిర్ణయాధికారం తీసుకునే కేసు ►ఇది ఏదో ఇద్దరు గల్లా పట్టుకుని కొట్టుకున్న కేసు కాదు ►ఇది చాలా తీవ్రమైన ఆర్ధికనేరానికి సంబంధించి కేసు ►నేరం జరిగిందనే ప్రాథమిక ఆధారాలు ఉన్న కేసుల్లో... సెక్షన్ 482 కింద క్వాష్ చేయకూడదని ఎంఆర్ షా తీర్పు ఉంది ►సెక్షన్ 482కింద క్వాష్ అనేది చాలా అరుదైన కేసుల్లో మాత్రమే వర్తింపజేయాలని సుప్రీంకోర్టు తీర్పులు చెబుతున్నాయి ►17ఏ అనేది ఈ కేసులో వర్తించదు ► 17ఏ చట్టం రావడానికి ముందే నేరం జరిగింది ►2018 జులైలో 17ఏ చట్టం అమలులోకి వచ్చింది ►2018 జులై కంటే ముందు నేరం జరిగింది కాబట్టి 17ఏ అనేది ఈ కేసులో వర్తించదు ►2015-16లో లేని చట్టం అనేది అప్పుడు జరిగిన నేరానికి ఎలా వర్తిస్తుంది? ►స్కిల్ స్కామ్ కేసులో మరింత దర్యాప్తు అవసరం ►ఒక వ్యక్తి మీద అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదయింది ►ఒక వేళ కోర్టు ఆ సెక్షన్లు తొలగించాలనుకుంటే.. మిగతా సెక్షన్ల కింద కేసు కొనసాగుతుంది ►గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ ఇది ►శాసనవ్యవస్థ ద్వారా తనకు సంక్రమించిన అధికారాన్ని దుర్వినియోగం చేసిన కేసు ఇది. అందుకే సెక్షన్ 44 PMLA పెట్టారు ►ఏసీబీ కోర్టుకు (ప్రత్యేక కోర్టు)కు కచ్చితమైన పరిధి ఉంది. ►ఎప్పుడయితే వేర్వేరు సెక్షన్ల కింద నమోదయిన నేరాలన్నీ ఒక అంశంలో నమోదయి ఉంటే.. ప్రత్యేక కోర్టుకు అధికారం ఉంటుంది. ►ఆరోపణలు ఉన్నప్పుడు ఛార్జిషీట్లు వేసి విచారణ జరిపి శిక్షకూడా వేయవచ్చు. ►అవినీతి కేసుల్లో ప్రాథమిక ఆధారాలున్నప్పుడు ప్రత్యేక కోర్టుకు విచారించే న్యాయ పరిధి ఉంటుంది. ►జీఎస్టీ,ఆదాయపన్నుతో పాటు మరికొన్ని విభాగాలు కూడా ఈ కేసును దర్యాప్తు చేశాయి ►నేరం జరిగిందా లేదా..ఎఫ్ఐఆర్ నమోదైందా లేదా.. అంతవరకే పరిమితం కావాలి ►అవినీతి నిరోధక,సాధారణ కేసుల్లోనూ అదే పోలీసులు విచారణ చేస్తారు ►ఒకే పోలీసులు విచారణ చేసినప్పుడు ఈ కేసులో ఎఫ్ఐఆర్ ను ఎలా క్వాష్ చేస్తారు? ►ఈ కోర్టులో జరుగుతున్న వాదనలు కేవలం ప్రొసీజర్ ప్రకారమే కాకూడదు. కేసులో ఉన్న వాస్తవ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. 17ఏ అనేది హైబ్రిడ్ సెక్షన్..అవినీతిపరులకు ఇది రక్షణ కాకూడదన్నదే నేను చెప్పేది ►రాఫేల్ కేసులో వేసిన రివ్యూ పిటిషన్‌ను బెంచ్‌లోని ఇద్దరు న్యాయమూర్తులు డిస్మిస్ చేశారు ►కాని మరో జడ్జ్ తీర్పును అంగీకరిస్తూనే 17ఏ కీలక వ్యాఖ్యలు చేశారు ►రాఫెల్ కేసులో 17ఏపై జస్టిస్ జోసెఫ్ చేసిన వ్యాఖ్యలు చాలా కీలకమైనవి ►కోర్టు విచారణకు ఆదేశించిన కేసుల్లో 17ఏ అనేది వర్తించదు 12:02 PM, అక్టోబర్ 28, 2023 బాబు హయాంలో ఫైబర్ గ్రిడ్ కుంభకోణం.. జరిగిందిలా ►సుప్రీంకోర్టులో నవంబర్ 9వ తేదీన ఫైబర్ గ్రిడ్ కేసు ►ఫైబర్ నెట్ కుంభకోణంలో 25వ నిందితుడిగా చంద్రబాబు ►చంద్రబాబు హయాంలో జరిగిన కుంభకోణం ► గతంలో ఏపీ సివిల్ సప్లైస్‌కు సర్వీసులు అందించిన టెర్రాసాఫ్ట్ కంపెనీ ► నాసిరకం ఈ- పోస్ మిషన్లు పంపిణీ చేసినందుకు టెర్రా సాఫ్ట్‌ను నాడు బ్లాక్ లిస్టులో పెట్టిన ప్రభుత్వం ► అయినా టెర్రాసాఫ్ట్‌పై అంతులేని ప్రేమ కురిపించిన చంద్రబాబు సర్కారు ► టెర్రాసాఫ్ట్‌కు టెండర్లు కట్టబెట్టేందుకు నాడు చంద్రబాబు సర్కారు అవకతవకలు ► బ్లాక్‌లిస్ట్‌లో టెర్రాసాఫ్ట్‌ను రెండు నెలలు కూడా పూర్తి కాకుండానే తప్పించిన వైనం ► బ్లాక్ లిస్ట్ లో పెట్టిన 2 నెలలకే టెర్రాసాఫ్ట్‌ను లిస్ట్ నుంచి తొలగించిన అప్పటి సివిల్ సప్లైస్ డైరక్టర్ రవిబాబు ► హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ కంపెనీతో జట్టు కట్టి ప్రాజెక్టు దక్కించుకున్న టెర్రాసాఫ్ట్ ► టెండర్లు దక్కించుకున్న తర్వాత హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ కంపెనీని నిబంధనలకి విరుద్దంగా బయటకి పంపిన టెర్రాసాఫ్ట్ ► ఇప్పటికే హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ అనీల్ జైన్ స్టేట్ మెంట్ రికార్డు చేసిన CID ► తమని మోసం చేసినట్టు వాంగ్మూలమిచ్చిన హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ VP అనీల్ జైన్ ► నిబంధనలకి విరుద్దంగా మరొక కంపెనీ నుంచి రూ.115 కోట్ల నాసిరకం మెటీరియల్‌ను కొనుగోలు చేసి ఫైబర్ నెట్‌కు సరఫరా చేసిన టెర్రా సాఫ్ట్ ► చంద్రబాబు సూచనల మేరకే టెర్రాసాఫ్ట్ వ్యవహరం మలుపులు తిరిగిందని తేల్చిన సీఐడీ 11:26 AM, అక్టోబర్ 28, 2023 చంద్రబాబుతో ములాఖత్‌లో కాసాని ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో ములాఖత్ అయిన కుటుంబ సభ్యులు ►నారా భువనేశ్వరి, నారా లోకేష్‌తోపాటు తెలంగాణ టీడీపీ చీఫ్ కాసాని జ్ఞానేశ్వర్ కూడా ►అసలు తెలంగాణలో పోటీ చేయమంటారా? వేరే దారి చూస్కోమంటారా? అని బాబును నిలదీయనున్న కాసాని 11:19 AM, అక్టోబర్ 28, 2023 ఇంతకీ తెలంగాణలో టీడీపీకి ఎంత సీను? ► నిజంగానే చంద్రబాబు సామాజికవర్గానికి, తెలుగుదేశానికి తెలంగాణలో అంత సీను ఉందా? ► హైదరాబాద్ కట్టింది నేనే అని ప్రచారం చేసుకున్న చంద్రబాబుకు గ్రేటర్ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చాయి? ► గ్రేటర్ హైదరాబాద్‌లో ఉన్న 150 డివిజన్ లలో ఒక డివిజన్‌ను కూడా తెలుగుదేశం ఎందుకు గెలవలేదు? ► మా పార్టీ, మా వర్గం బలంగా ఉందని చెప్పుకునే గుంటూరు జిల్లా పక్కనే నాగార్జున సాగర్ నియోజకవర్గం ► 2021లో నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో టీడీపీ కి వచ్చిన ఓట్లు 1 ,714 (మే 3, 2021 ) ► ఇక్కడ మొత్తం పోల్ అయిన ఓట్లు -1 .91 లక్షలు, టీడీపీ కి వచ్చిన ఓట్లు 1 శాతం లోపే (1 ,714) ► తెలుగుదేశం పార్టీకి కనీసం ఒక శాతం ఓట్లయినా గ్యారంటీ లేకున్నా బిల్డప్‌లు ఎందుకు? ► నిజంగా నాలుగు ఓట్లయినా పడే సీను లేకున్నా.. గొప్పలకు పోయి వాతలెందుకు పెట్టించుకుంటారు? ► ఏ సర్వేలోనయినా తెలుగుదేశం ప్రభావం ఉందని చెప్పింది ఒక్కరయినా ఉన్నారా? 11:01 AM, అక్టోబర్ 28, 2023 ఎన్టీఆర్‌ను మానసికంగా హత్య చేసింది వాళ్లే! ►ప్రాణహాని ఉందని చంద్రబాబు నాయుడు ఏసీబీ జడ్జికి లేఖ రాయడం హాస్యాస్పదం ►పాపం పండింది కాబట్టి చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఊచలు లెక్కబెడుతున్నాడు ►ఎన్టీఆర్‌ను మానసికంగా హత్య చేసింది ఆయన సంతానమే! ► కన్నతండ్రిపై చెప్పులు విసిరినప్పుడు తండ్రి ప్రేమ భువనేశ్వరికి కనపడలేదా..? నారా భువనేశ్వరి, చంద్రబాబు నాయుడు పై కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న ఫైర్ 10:32 AM, అక్టోబర్ 28, 2023 నిజం గెలవాలితో ఏం ఒరగదు ►నిజం గెలవాలి పేరుతో ఓదార్పు యాత్ర చేస్తున్న నారా భువనేశ్వరి ►భర్త చంద్రబాబు తప్పుల్ని ఒప్పుకోకుండా.. పచ్చి అబద్ధాలతో కొనసాగుతున్న యాత్ర ►నిజం గెలవాలి యాత్రపై మేకపాటి రాజారెడ్డి వ్యంగ్యాస్త్రాలు ►యాత్ర వల్ల అనారోగ్య సమస్యలు తప్ప.. ఆమెకి ఒరిగేది ఏమి లేదని ఎద్దేవా ►చంద్రబాబు అవినీతి చేశాడని ప్రజలకు తెలిసిపోయింది ►ఆయన చేసిన ఘనకార్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.. 10:10 AM, అక్టోబర్ 28, 2023 చంద్రబాబుతో కాసాని.. తాడోపేడోనా? ►ఇవాళ చంద్రబాబుతో ములాఖత్ కానున్న లోకేష్, భువనేశ్వరి ►ములాఖత్ కోసం 11 గంటలకు సెంట్రల్ జైలుకు చేరుకోనున్న చంద్రబాబు కుటుంబ సభ్యులు ►టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కూడా ములాఖత్ కు హాజరయ్యే అవకాశం ►తెలంగాణలో ఒంటరి పోరు వల్ల కాదని.. పోటీకి దూరంగా ఉండాలని నారా లోకేష్ సూచన ►అదే జరిగితే పార్టీ ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపిన కాసాని ►అయినా వినని చినబాబు అండ్ కో ►ఇప్పటికే ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్న కాసాని ►నేటి చంద్రబాబు భేటీతో మరింత స్పష్టత వచ్చే అవకాశం 09:17 AM, అక్టోబర్ 28, 2023 దిగజారిపోతున్న టీడీపీ రాజకీయం ►అధినేత చంద్రబాబు నాయుడు బాటలోనే టీడీపీ శ్రేణుల దిగజారుడు రాజకీయాలు ►సెంట్రల్ జైల్ కేంద్రంగా చంద్రబాబు రాజకీయ మంతనాలు ►జైల్లో ఉన్నా మారని చంద్రబాబు, తెలుగుదేశం తీరు ►చంద్రబాబు బహిరంగ లేఖ పేరిట తప్పుడు ప్రచారం ►పదుల సంఖ్యలో చంద్రబాబు కోసం పిటిషన్లతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం ►ఒక పక్క లోకేష్‌ను, మరో పక్క భువనేశ్వరీని రంగంలోకి దించుతున్న బాబు ►సానుభూతి కోసం సర్వప్రయత్నాలు చేస్తోన్న చంద్రబాబు ►చంద్రబాబు జైల్లో ఉండడంతో నిస్తేజంగా మారిన తెలుగుదేశం ►మ్యానిఫెస్టో విడుదల చేయలేనంత దుస్థితిలో తెలుగుదేశం 09:00 AM, అక్టోబర్ 28, 2023 చంద్రబాబు న్యాయవాదులకు బిగ్ ఝలక్ ►ఏపీ హైకోర్టులో తన ట్రేడ్‌మార్క్ అస్త్రం ‘నాట్ బిఫోర్’ ప్రయోగం ►స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఏపీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ ►తన బెయిల్ పిటిషన్‌పై జస్టిస్ జ్యోతిర్మయి విచారణ చేయకుండా అడ్డుకునే ఎత్తుగడ ►పార్టీతో, లీగల్ సెల్‌తో సంబంధం లేని మూర్తితో కన్సెంట్ వకాలత్ దాఖలు ►మూర్తి వెనుక ఓ ఎల్లో మీడియా చానెల్ ఓనర్, ఒక విశ్రాంత న్యాయమూర్తి ►నిబంధనల ప్రకారం నడుచుకునే జడ్జిగా జస్టిస్ జ్యోతిర్మయికి పేరు ►మూర్తి సతీమణి తనకు తెలిసి ఉండటంతో నైతిక విలువలకు లోబడి విచారణ నుంచి తప్పుకున్న న్యాయమూర్తి ►అందుకే ఆమె ముందు నాట్ బిఫోర్ అస్త్రం ►ఆమె నైతిక విలువలనే అవకాశంగా మలుచుకున్న చంద్రబాబు ►ఆమె తప్పుకుంటే ఆయన వ్యాజ్యాలు జస్టిస్ నిమ్మగడ్డ, జస్టిస్ అడుసుమిల్లి ముందుకు ►అయితే ఊహించని విధంగా ఉత్తర్వులు జారీ చేసిన జస్టిస్ జ్యోతిర్మయి ►సోమవారం విచారణకు వచ్చేందుకు వీలుగా ఈ కేసును సీజే ముందుంచాలని ఆదేశం ►దీంతో కంగుతిన్న చంద్రబాబు న్యాయవాదులు 08:12 AM, అక్టోబర్ 28, 2023 చంద్రబాబును వెంటాడుతున్న చేసిన పాపాలు ► అధికారంలో ఉండగా అవినీతి భాగోతాలు ►స్కిల్ డెవలప్మెంట్ కేసు, ఫైబర్ గ్రిడ్ కేసు, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు ►కేసులు.. కిందిస్థాయి నుంచి సుప్రీం కోర్టు దాకా పలు పిటిషన్లు.. ములాఖత్‌లతో బాబు బిజీ బిజీ ►జైల్లోనే రాజకీయ మంత్రాంగం చేస్తోన్న చంద్రబాబు ►పార్టీలో ఎవరెవరు ఏం చేయాలన్నదానిపై ములాఖత్‌లో సుదీర్ఘ చర్చలు ►లోకేష్ ఏం చేయాలి? భువనేశ్వరీ ఏం చేయాలన్నదానిపై లోపలి నుంచే బాబు సూచనలు ►నవంబర్ 8వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుపై ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న తెలుగుదేశం శ్రేణులు 07:55 AM, అక్టోబర్ 28, 2023 వివిధ కోర్టులో పెండింగ్‌లో బాబు పిటిషన్లు ►ఏసీబీ కోర్టులో కాల్ డేటా రికార్డింగ్‌ల పిటిషన్ ► స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన అధికారుల కాల్ డేటాను భద్రపర్చాలని, అరెస్ట్ వెనుక కుట్ర ఉందని చంద్రబాబు లాయర్ల వాదన ►డేటా భద్రపర్చడం అంటే.. బహిర్గత పర్చడమే!. అది అధికారుల వ్యక్తిగత భద్రతకు మంచిది కాదని సీఐడీ తరపు న్యాయవాదుల వాదన ►వాదనలు పూర్తి కావడంతో అక్టోబర్ 31కి తీర్పు వాయిదా వేసిన ఏసీబీ కోర్టు ►స్కిల్ స్కామ్‌లో ఏపీ హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ ►విచారణ నుంచి తప్పుకుని సీజే బెంచ్‌కు రిఫర్ చేసిన న్యాయమూర్తి ►అక్టోబర్ 30(సోమవారం) సీజే బెంచ్ ముందుకు వచ్చే అవకాశం ►కంటికి అత్యవసరంగా ఆపరేష్ అవసరం ఉందని వేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు నో ►ఏపీ హైకోర్టులో ఇన్నర్‌రింగ్‌రోడ్డు కేసు విచారణ వచ్చే నెల 7కు వాయిదా ►ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన చంద్రబాబు తరఫు న్యాయవాదులు ►సుప్రీం కోర్టులో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ క్వాష్ పిటిషన్‌పై తీర్పు నవంబర్ 8వ తేదీన ►సుప్రీంలో నవంబర్ 9వ తేదీన ఫైబర్‌నెట్ స్కామ్ కేసు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ►ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబుపై ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్‌పై వేసిన సీఐడీ ►విచారణను ఏసీబీ కోర్టు నవంబర్ 10కి వాయిదా 07:15 AM, అక్టోబర్ 28, 2023 జైల్లో బాబు.. సానుభూతి కోసం కుటుంబ సభ్యులు ►పదుల కొద్ది పిటిషన్లతో కోర్టులను పరీక్షిస్తోన్న బాబు లాయర్లు ►ముందు క్వాష్, తర్వాత బెయిల్, ఆ తర్వాత ఏసీ, మళ్లీ వైద్యం, ఆ తర్వాత కాల్ డాటా ►చేతిలో లాయర్లున్నారన్న ధీమాతో కింది నుంచి పైదాకా అన్నికోర్టుల్లో పిటిషన్లు ►లేని భయాలు, సాకులు చూపుతూ ACB కోర్టు న్యాయమూర్తికి చంద్రబాబు మూడు పేజీల లేఖ ►ఎన్నికల వేళ సానుభూతి కోసం కుటుంబ సభ్యుల నానా పాట్లు ►పేరుకు నిజం గెలవాలి.. చెప్పేవన్నీ అబద్దాలు 06:58 AM, అక్టోబర్ 28, 2023 చంద్రబాబు అవినీతిపరుడు విజయనగరంలో మంత్రి ధర్మాన కామెంట్స్ ►స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో అవినీతి జరిగిందని కేంద్ర దర్యాప్తు సంస్థలు చెప్పాయి ►సొమ్ము చంద్రబాబు పీఏ, లోకేశ్ పీఏ ఖాతాల్లోకి వెళ్లాయి ►విశాఖకు రాజధాని వస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది 06:54 AM, అక్టోబర్ 28, 2023 బాబు భద్రతపై ఎలాంటి అనుమానాలు లేవు : జైళ్ల శాఖ డీఐజీ ►చంద్రబాబు సెక్యూరిటీపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నాం ►బాబు భద్రత కట్టుదిట్టంగా ఉంది ►మావోల పేరుతో వచ్చిన లేఖ నకిలీ లేఖగా గుర్తించాం ►జైల్లోకి వచ్చే ప్రతి ఖైదీని తనిఖీ చేశాకే లోనికి అనుమతిస్తాం ►శ్రీనివాస్ అనే ఖైదీని రిమాండ్ కు తీసుకునే సమయంలో బటన్ కెమెరా స్వాధీనం చేసుకున్నాం ►చంద్రబాబు జైలుకు వచ్చిన విజువల్స్ బయటకు రావడంపై దర్యాప్తు పూర్తి చేశాం రాజమండ్రి సెంట్రల్ జైలులో తన ప్రాణాలకి ముప్పు ఉందని ఆరోపిస్తూ ఏసీబీ గౌరవ జడ్జికి చంద్రబాబు రాసిన లేఖపై జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ స్పందించారు. జైలులో బాబుకి పూర్తి స్థాయిలో పటిష్టమైన భద్రతని కల్పిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చిన డీఐజీ.. ఆయనని చంపబోతున్నట్లు మావోయిస్టులు రాసిన లేఖ కూడా… pic.twitter.com/uo4YLUTTmu — YSR Congress Party (@YSRCParty) October 27, 2023 ►జైలు చుట్టూ ఐదు వాచ్ టవర్స్ ఉన్నాయి ►జైల్లోకి ఎలాంటి గాంజా ప్యాకెట్లు విసిరి వేయలేదు ►ప్రతి గంటకు ఒకసారి జైలు చుట్టూ గార్డింగ్ చేస్తున్నాం ►సెంట్రల్ జైలు చుట్టూ పోలీస్ భద్రత ఉంది ►బీపీవో సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నాం ►సెక్యూరిటీ అంశాలు బహిరంగంగా చర్చించలేం ►చంద్రబాబును ఏ రూమ్ లో పెట్టామనేది చెప్పలేం ►చంద్రబాబు భద్రత విషయంలో ఎలాంటి భయాందోళన అవసరం లేదు ►చంద్రబాబు కంటి సమస్యపై భువనేశ్వరికి రెండు సార్లు సమాచారం ఇచ్చాం ►చంద్రబాబు కుటుంబ సభ్యులకు చెప్పిన తరువాత బయట చెప్పాల్సిన అవసరం లేదు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న ప్రతి ఖైదీ భద్రత, ఆరోగ్యం మా బాధ్యత. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ఖైదీలందరికీ మూడు రోజుల పాటు వైద్య పరీక్షలు నిర్వహించారు. చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబ సభ్యులకి కూడా సమాచారం ఇస్తున్నాం. - జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్… pic.twitter.com/SptXh0Dv8i — YSR Congress Party (@YSRCParty) October 27, 2023 06:51 AM, అక్టోబర్ 28, 2023 నేడు బాబుతో కుటుంబసభ్యుల ములాఖత్ ►చంద్రబాబుతో ములాఖత్ కానున్న భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి ►ఇప్పటికే రాజమహేంద్రవరం చేరుకున్న భువనేశ్వరి, లోకేష్ ►క్రమం తప్పకుండా వారం వారం ములాఖత్ అవుతున్న నారా ఫ్యామిలీ ►జైల్లోనూ కుటుంబ సభ్యులతో బాబు రాజకీయాల ప్రస్తావన ►ములాఖత్ తర్వాత బయటకు వచ్చి.. బాబు భద్రత, ఆరోగ్యం గురించి క్రమం తప్పకుండా అబద్ధాలు ప్రచారం 06:43 AM, అక్టోబర్ 28, 2023 రాజమండ్రి జైల్లో చంద్రబాబు @49 ► స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ ►సెప్టెంబర్ 9వ తేదీన ఉదయం నంద్యాలలో అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ పోలీసులు ►స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా రూ.371 కోట్లు సొంత ఖాతాలోకి మళ్లించుకున్నారని అభియోగం ►ఆధారాలతో అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ ►అరెస్ట్ సమయం నుంచి మొదలైన డ్రామా ►రిమాండ్ విధించిన విజయవాడ అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక న్యాయస్థానం (ఏసీబీ కోర్టు) ►ఇప్పటిదాకా ఐదుసార్లు జ్యూడీషియల్ రిమాండ్ పొడిగింపు ► నవంబర్ 1 వరకు జైల్లోనే చంద్రబాబు ►రాజమండ్రి సెంట్రల్ జైలు 49వ రోజు రిమాండ్ ఖైదీగా చంద్రబాబు ►స్నేహా బ్లాక్‌లో ప్రత్యేక గది.. ఇంటి భోజనం.. టవర్ ఏసీ సదుపాయం ►చంద్రబాబుకు నిత్యం ఆరోగ్య పరీక్షలు, ఎప్పటికప్పుడు జాగ్రత్తలు ►జైలు, లోపల బయటా చంద్రబాబుకు పూర్తిస్థాయి భద్రత ఏర్పాట్లు -
చంద్రబాబు మోసం చేయడంలో ఘనుడు: మంత్రి బొత్స
-
అబద్దం గెలవాలి అంటున్న రాజేష్
-
తాత దొంగతనం గురించి నిజం చెప్పాల్సింది!
సాక్షి, తిరుపతి: టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి ఓదార్పు యాత్ర.. పేలవమైన ప్రసంగాలతో ముందుకు సాగుతోంది. ప్రభుత్వాన్ని విమర్శించేలా ఎవరో రాసిచ్చిన ప్రసంగాలను చదవలేక ఇబ్బంది పడుతున్న ఆమె.. భర్తకు సంఘీభావంగా ఇస్తున్న స్టేట్మెంట్లతో ఇటు సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు దారితీస్తున్నాయి. తాజాగా తిరుపతిలో నిర్వహించిన సభలో తెలుగుదేశం మహిళా నేతలు ఆమెను వెరైటీగా ప్రశ్నలు అడగడం.. ఆ ప్రశ్నలతో అయోమయానికి గురైన ఆమె పొంతనలేని సమాధానాలు చెప్పారు. అందులో తాతామనవడి సెంటిమెంట్‌ను పండించేందుకు ఆమె పడిన తాపత్రయం నవ్వులపాలు జేస్తోంది. ‘తాత ఎక్కడ అని మా మనవడు దేవాన్ష్ అడుగుతున్నాడు.. ఆయన జైల్లో ఉన్నట్లు దేవాన్ష్‌కు తెలియదు. చిన్న వయసు కావడంతో తనకు చెప్పదల్చుకోలేదు. తాత విదేశాలకు వెళ్లారని చెబుతున్నాం’ అని తెదేపా నేత నన్నపనేని రాజకుమారి ప్రశ్నకు భువనేశ్వరి సమాధానమిచ్చారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. అధికార మదంతో, పైగా అధికారుల అభ్యంతరాలను కూడా పట్టించుకోకుండా అడ్డగోలుగా అవినీతికి పాల్పడి అక్రమార్జన చేశారని ఆధారాలతో సహా బయటపెట్టింది దర్యాప్తు సంస్థ. అలాంటిది ప్రజల సొమ్ము దొంగతనం చేసి జైలుకు వెళ్లిన 73 ఏళ్ల తాత గురించి.. తొమ్మిదేళ్ల వయసున్న మనవడికైనా కనీసం నిజం చెప్పాల్సిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి ఇప్పుడు. తిరుపతిలో నారా భువనేశ్వరి నిర్వహించిన నిజం గెలవాలి సభలో పలువురు @JaiTDP నాయకులకు చేదు అనుభవం ఎదురైంది. మాజీమంత్రి అమరనాథ్ రెడ్డి, తుడా మాజీ చైర్మన్ నరసింహయాదవ్, నాయకుడు పులివర్తి నానిలను వేదికపైకి పిలవకపోవడంతో వారు సభ నుంచి అలిగి వెళ్ళిపోయారు. అలాగే భువనేశ్వరి ప్రసంగం పేలవంగా… — YSR Congress Party (@YSRCParty) October 26, 2023 -
Oct 27th 2023: చంద్రబాబు కేసు అప్డేట్స్
Chandrababu Naidu Arrest Remand Petitions Court Hearings And Political Updates 09:00PM, అక్టోబర్ 27, 2023 మావోయిస్టుల పేరుతో వచ్చిన లేఖ నిజం కాదు: జైళ్ల శాఖ డీఐజీ ►చంద్రబాబు భద్రత విషయంలో ఎంతో కట్టుదిట్టంగా భద్రతను ఏర్పాటు చేశాం ►జైలు లోపల చంద్రబాబుకు భద్రత కట్టుదిట్టంగానే ఉంది. ►మొదటి నుంచి 24 గంటలు సెక్యూరిటీ ఏర్పాటు చేశాం. ►అడిషనల్ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. ►కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పుటికప్పుడు సెక్యూరిటీ వాచ్ చేస్తున్నాం. ►మావోయిస్టుల పేరుతో వచ్చిన లేఖ నిజం కాదని తేలింది. ►చంద్రబాబు జైలుకు వచ్చినప్పటి నుంచి ప్రతీ వారం సెక్యూరిటీ పరిశీలిస్తూనే ఉన్నాం. 15:00 PM, అక్టోబర్ 27, 2023 సోమవారం హైకోర్టు ముందుకు చంద్రబాబు పిటిషన్.! ► సోమవారం హైకోర్టు సీజే బెయిల్ పిటిషన్‌ను విచారిస్తారన్న వెకేషన్ బెంచ్ న్యాయమూర్తి ►సోమవారం కాకుండా వెంటనే విచారించే విధంగా తాము విజ్ఞప్తి చేసుకుంటామని చెప్పిన చంద్రబాబు న్యాయవాదులు ►చంద్రబాబు న్యాయవాదుల విజ్ఞప్తి మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ ముందుకు కేసును బదిలీ చేసిన న్యాయమూర్తి ►ఏ కోర్టు విచారించాలన్నది హైకోర్టు రిజిస్ట్రార్ నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేసిన న్యాయమూర్తి ►చంద్రబాబు తరఫున వాదించేందుకు ఢిల్లీ నుంచి విజయవాడకు వచ్చిన లూథ్రా 14:50 PM, అక్టోబర్ 27, 2023 అసైన్డ్ భూముల్లో అక్రమాలు ►అసైన్డ్ భూముల కేసులో ఫ్రీజ్ చేసిన అకౌంట్ల పై ఏసీబీ కోర్టులో వాదనలు ►వాదనలు వినిపించిన ఇరుపక్షాల న్యాయవాదులు ►అసైన్డ్ భూముల కేసులో ఫ్రీజ్ చేసిన అకౌంట్లను రిలీజ్ చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసిన నారాయణ లాయర్లు ►అప్పటి మున్సిపల్ మంత్రిగా ఉన్న నారాయణ అకౌంట్ లోకి వివిధ మార్గాల్లో నిధులు చేరాయన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ ►ఏ34గా ఉన్న నారాయణ అకౌంట్ లోకి రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి నిధులు వెళ్లాయని తెలిపిన ఏసీబీ తరఫు న్యాయవాది 14:40 PM, అక్టోబర్ 27, 2023 జైలు నుంచి రాసిన లేఖలో చంద్రబాబు ఏం కోరారంటే..! ►ఏసీబీ న్యాయమూర్తికి రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబు లేఖ ►తన ప్రాణాలకు ముప్పు ఉందని న్యాయమూర్తికి లేఖ రాసిన చంద్రబాబు ►జైల్లో నన్ను చంపాలని కొందరు మావోయిస్టులు కుట్ర పన్నుతున్నారు ►నన్ను చంపాలని మావోయిస్టులు లేఖ రాసినట్లు నాకు తెలిసింది ►అసంబద్ధ సంఘటనలను ఉదహరిస్తూ లేఖ రాసిన చంద్రబాబు ►తన భద్రత, ఆరోగ్యం పై అనుమానాలు, ఆందోళన వ్యక్తం చేస్తూ 3 పేజీల లేఖ ►తన హత్య కోసం కోట్ల రూపాయలు చేతులు మారినట్లు చంద్రబాబు అనుమానం ► ఆకాశ రామన్న ఉత్తరంలో సంచలన విషయాలు ఉన్నాయన్న చంద్రబాబు ►నార్కోటిక్స్ డ్రగ్స్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న శృంగవరపుకోటకు చెందిన ఓ నిందితుడు పెన్ కెమెరాతో జైలులో ఖైదీల ఫోటోలు తీస్తున్నాడు ►కొందరు ఆగంతకులు జైలులోకి గంజాయి ప్యాకెట్లను విసిరేశారు ►జైలులో మొత్తం 2200 మంది ఉన్నారు, వీరిలో 750 మంది నార్కోటిక్స్ డ్రగ్స్ కేసు నిందితులు ►2019 జూన్ 25వ తేదీన నా సెక్యూరిటీని తగ్గించారు ►2022 నవంబర్ 4వ తేదీన ఎన్టీఆర్ జిల్లా నందిగామలో తన కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగింది ►2023 ఏప్రిల్ 1న ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో మరోసారి రాళ్ళదాడి జరిగిందని చంద్రబాబు ఆరోపణ ►అంగళ్లులో పోలీసులపై టిడిపి కార్యకర్తలు చేసిన దాడిని మాత్రం ప్రస్తావించని చంద్రబాబు ►అల్లర్లు జరిగేలా తాను ఎలా రెచ్చగొట్టిన విషయాన్ని దాచిపెట్టిన చంద్రబాబు ►ప్రతీ బహిరంగసభలో ప్రజలను రెచ్చగొట్టేందుకు ఎలాంటి మాటలు మాట్లాడాడో బయటకు చెప్పని చంద్రబాబు 14:35 PM, అక్టోబర్ 27, 2023 కేసు విచారణ నుంచి తప్పుకున్న న్యాయమూర్తి ►ఏపీ : హైకోర్టులో స్కిల్ కేసు విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ జ్యోతిర్మయి ►నాట్ బిఫోర్ మీ అని విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ జ్యోతిర్మయి ►చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ పై వెకేషన్ బెంచ్ విచారణ ►ఏ బెంచ్ విచారించాలో నిర్ణయించనున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి 14:20 PM, అక్టోబర్ 27, 2023 పిటిషన్లే పిటిషన్లు ►ఏపీ హైకోర్టులో వర్ల రామయ్య రెండు పిటిషన్ల దాఖలు ►రెండు పిటిషన్లను నాట్ బిఫోర్ మీ అన్న న్యాయమూర్తి ►టీడీపీ బ్యాంక్ ఖాతా వివరాలను సీఐడీ కోరడంపై పిటిషన్లు 14:05 PM, అక్టోబర్ 27, 2023 చంద్రబాబు కోసం పిటిషన్ల వెల్లువ ►కోర్టులను ప్రభావితం చేసేలా పిటిషన్లతో వెల్లువెత్తుతున్న చంద్రబాబు మనుష్యులు ►చంద్రబాబు అరెస్ట్ అక్రమ నిర్బంధమని హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ ►లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు నిరాకరించిన హైకోర్టు 13:45 PM, అక్టోబర్ 27, 2023 కాల్ డాటా పిటిషన్ ►చంద్రబాబు అరెస్టు సమయంలో సిఐడీ కాల్ డేటా అంశంపై విచారణ ►విజయవాడ ఏసీబీ కోర్టులో ముగిసిన వాదనలు, తీర్పు రిజర్వ్ ►కాల్ డేటా అంశంపై ఈనెల 31న తీర్పు ఇవ్వనున్న ఏసీబీ కోర్టు ►చంద్రబాబు ఉద్దేశ్యాలు సరిగా లేవని తెలిపిన CID 13:45 PM, అక్టోబర్ 27, 2023 ఏపీ హైకోర్టులో వర్ల రామయ్యకు చుక్కెదురు ►ఏపీ హైకోర్టులో వర్ల రామయ్యకు చుక్కెదురు ►వర్ల రామయ్య లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు వెకేషన్ బెంచ్ నిరాకరణ ►టీడీపీ అకౌంట్స్, ఫండ్స్ వివరాలు సీఐడీ కోరటాన్ని.. సవాల్ చేస్తూ లంచ్ మోషన్ పిటిషన్ 13:25 PM, అక్టోబర్ 27, 2023 కాల్ డేటా రికార్డు పిటిషన్‌పై వాదనలు ఇలా.. ►కాల్ డేటా రికార్డు పిటిషన్‌పై తీర్పు చేసిన ఏసీబీ కోర్టు ►ఈనెల 31వ తేదీన తీర్పు వెల్లడించిన ఏసీబీ న్యాయమూర్తి చంద్రబాబు తరపు న్యాయవాదుల వాదనలు ►చంద్రబాబు తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి ఈ కాల్ డేటా కీలకం ►చంద్రబాబును విచారించిన గది దర్యాప్తు అధికారి నియంత్రణలో ఉంటుంది ►దర్యాప్తు అధికారికి తెలియకుండా ఫోటోలు, వీడియోలు బయటకి రావు ►మా పిటీషన్ రైట్ టూ ప్రైవసీ కిందకి రావడం లేదు ►కాల్ డేటా ఇవ్వడం వల్ల అధికారులు వ్యక్తిగత సమాచారానికి ఇబ్బంది లేదు ►చంద్రబాబు ఏ తప్పు చేయలేదు.. చంద్రబాబు అరెస్టు అక్రమం పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు ►చంద్రబాబు ని అరెస్టు చేసే సమయంలో శాంతి భద్రతల సమస్య వస్తుందని జిల్లా పోలీసు అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు ►ఆ పోలీసు అధికారుల ఫోన్ నెంబర్ లు, వివరాలు తీసుకోవాల్సిన అవసరం సీఐడీకి లేదు ►చంద్రబాబు అరెస్టు అక్రమం అని చెప్పుకునేందుకు ఈ విధంగా పిటిషన్లు వేస్తున్నారు ►చంద్రబాబు స్వయంగా తనను ఉదయం ఆరు గంటలకి అరెస్టు చేసినట్లు చెప్పారు ►సీఐడీ ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ ను బట్టి ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది ►ఇదే విషయాన్ని హైకోర్టు సమర్ధించింది ►ఇలా కాల్ డేటా రికార్డు కోరటం న్యాయ విరుద్దం ►దర్యాప్తు అధికారులకు వ్యక్తిగతంగా ఇబ్బందులు వస్తాయి ►అందువల్ల కాల్ డేటా రికార్డు పిటీషన్ కొట్టివేయాలి 13:15 PM, అక్టోబర్ 27, 2023 అసైన్డ్ భూముల కేసు.. ఏసీబీ కోర్టులో వాదనలు ►అసైన్డ్ భూముల కేసులో ఫ్రీజ్ చేసిన అకౌంట్లపై ఏసీబీ కోర్టులో వాదనలు ►వాదనలు వినిపించిన ఇరుపక్షాల న్యాయవాదులు ►అసైన్డ్ భూముల కేసులో ఫ్రీజ్ చేసిన అకౌంట్లను రిలీజ్ చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసిన నారాయణ తరపు న్యాయవాదులు ►అప్పటి మున్సిపల్ మంత్రిగా ఉన్న నారాయణ అకౌంట్లోకి వివిధ మార్గాల్లో నిధులు చేరాయన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ ►గురునానక్ కాలనీలోని ఎస్బీఐలో ఉన్న ఏ34 గా ఉన్న నారాయణ అకౌంట్లోకి రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి నిధులు వెళ్లాయని తెలిపిన ఏసీబీ తరపు న్యాయవాది ►మధ్యాహ్నం నుండి వాదనలు కొనసాగే అవకాశం 12:20 PM, అక్టోబర్ 27, 2023 కాల్ డేటా పిటిషన్ తీర్పు రిజర్వ్ ►సీఐడీ కాల్ డేటా పిటిషన్ పై ఏసీబీ కోర్టులో ముగిసిన వాదనలు ►తీర్పు అక్టోబర్ 31వ తేదీకి వాయిదా వేసిన న్యాయమూర్తి ►స్కిల్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన అధికారుల కాల్ డేటా రికార్డింగ్‌లను కోరుతూ పిటిషన్ ►అరెస్టు చేసే సమయానికి ముందు సీఐడీ అధికారులు పలువుర్ని ఫోన్ ద్వారా సంప్రదించారని, ఆ వివరాలు తెలిస్తే అరెస్టులో కీలక విషయాలు బయటపడతాయంటున్న చంద్రబాబు తరఫు న్యాయవాది ►ఇది అధికారుల గోప్యతకు భంగమని, ఆ ప్రభావం విచారణపై పడుతుందని సీఐడీ న్యాయవాది వాదన 12:06 PM, అక్టోబర్ 27, 2023 సీడీఆర్ పిటిషన్‌పై మొదలైన వాదనలు ►సీఐడీ కాల్ డేటా పిటిషన్ పై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ ►మొదలైన వాదనలు ►వాదనలు వినిపిస్తున్న చంద్రబాబు తరపు న్యాయవాదులు 12:00 PM, అక్టోబర్ 27, 2023 ఏపీ హైకోర్టులో చంద్రబాబు మరో పిటిషన్ ►చంద్రబాబు ను అరెస్టు చేసి జైలుకు పంపించటం అక్రమ నిర్భమేనని వాదన ►హైకోర్టులో హెబియస్ కార్పస్ లంచ్ మోషన్ పిటిషన్ ►లంచ్ మోషన్ పిటిషన్ నిరాకరించిన హైకోర్టు 11:45 PM, అక్టోబర్ 27, 2023 నా ప్రాణాలకు ముప్పు ఉంది.. ఏసీబీ జడ్జికి చంద్రబాబు లేఖ ►ఏసీబీ న్యాయమూర్తికి రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబు లేఖ ►జైలు అధికారుల ద్వారా లేఖ పంపిన చంద్రబాబు ►జైల్లో తన ప్రాణాలకు ముప్పు ఉందని న్యాయమూర్తికి లేఖ రాసిన చంద్రబాబు ►తనను చంపాలని కొందరు కుట్ర పన్నుతున్నారంటూ లేఖలో ప్రస్తావన ►తన భద్రత, ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ 3 పేజీల లేఖ రాసిన చంద్రబాబు ►మావోయిస్టులు తనను చంపాలని లేఖ రాసినట్లు నాకు తెలిసింది(లేఖలో చంద్రబాబు) ►అసంబద్ధ సంఘటనల్ని ఉదహరిస్తూ లేఖ రాసిన చంద్రబాబు ►ఈ నెల 25న లేఖ రాసిన చంద్రబాబు 11:22 AM, అక్టోబర్ 27, 2023 ఖమ్మంలో తెలుగు తమ్ముళ్ల ఓవరాక్షన్ ►ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు అడ్డుకున్న టీడీపీ శ్రేణులు ►ఖమ్మంలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి గురువారం రాత్రి హాజరైన మంత్రి అంబటి ►అంబటి బస చేసిన హోటల్‌ను ముట్టడించి చంద్రబాబు నినాదాలు చేసిన టీడీపీ శ్రేణులు ►అంబటి కాన్వాయ్‌పైకి 10 మంది కుర్రాలు కర్రలతో దూసుకొచ్చిన వైనం ►పోలీసుల ఎంట్రీతో తమ్ముళ్ల పరుగులు 10:58 AM, అక్టోబర్ 27, 2023 ప్లీజ్ ప్లీజ్.. సోమవారం దాకా వద్దు ►స్కిల్ స్కామ్ కేసులో ఏపీ హైకోర్టులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ ►నాట్ బిఫోర్ మీ అనేసిన వెకేషన్ బెంచ్ న్యాయమూర్తి ►బిత్తరపోయిన చంద్రబాబు లాయర్లు ►హైకోర్టు సీజే సోమవారం విచారణ చేపడతారని చెప్పిన న్యాయమూర్తి ►సోమవారం కాకుండా వెంటనే విచారణ చేపట్టేలా తాము విజ్ఞప్తి చేసుకుంటామన్న లాయర్లు ►విజ్ఞప్తి మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ ముందుకు కేసు బదిలీ చేసిన న్యాయమూర్తి ►ఎవరు విచారణ చేపడతారనే నిర్ణయం హైకోర్టు రిజిస్ట్రార్‌కే వదిలేసిన న్యాయమూర్తి 10:50 AM, అక్టోబర్ 27, 2023 చంద్రబాబు పిటిషన్.. నాట్ బిఫోర్ మీ ►చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ ►బాబు తరపున వాదనలు వినిపించేందుకు వచ్చిన లాయర్ లూథ్రా ►నాట్ బిఫోర్ మీ అనేసిన న్యాయమూర్తి ►వ్యక్తిగత కారణాలతో విచారణ చేపట్టలేనని వెల్లడి ►ఎవరు విచారించాలన్నది హైకోర్టు రిజిస్ట్రార్ నిర్ణయిస్తారన్న న్యాయమూర్తి ►మరో జడ్జి ముందుకు వెళ్లనున్న చంద్రబాబు పిటిషన్ 10:46 AM, అక్టోబర్ 27, 2023 సీడీఆర్ పిటిషన్లో బాబు లాయర్ల వాదన ఇది ►సీఐడీ కాల్ డేటా పిటిషన్ పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ ►చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన సీఐడీ అధికారుల కాల్ డేటా రికార్డ్‌ను భద్రపరచాలంటూ చంద్రబాబు లాయర్లు ►చంద్రబాబును అరెస్ట్ చేసిన సమయంలో ఇతర వ్యక్తుల డైరెక్షన్ లో సీఐడి అధికారులు చంద్రబాబును అరెస్ట్ చేశారని వాదన ►సీఐడీ తరపున న్యాయవాదులకు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన ఏసీబీ కోర్టు ►కాల్ డేటా రికార్డ్ పిటిషన్ పై నిన్న(అక్టోబర్ 26, గురువారం) కౌంటర్ దాఖలు చేసిన సీఐడీ అధికారులు ►అధికారుల కాల్ డేటా ఇస్తే వారి స్వేచ్ఛకు భంగం కలుగుతుందని పిటిషన్ లో పేర్కొన్న సీఐడి న్యాయవాదులు ►అధికారుల భద్రతకు నష్టం ఉంటుందని పిటిషన్ లో పేర్కొన్న సీఐడీ ►ఇరువర్గాల న్యాయవాదులు దాఖలు చేసిన సిఐడి కాల్ డేటా రికార్డ్ పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ ►మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానున్న విచారణ 10:23 AM, అక్టోబర్ 27, 2023 అత్యవసర విచారణ లేదు ►అనారోగ్యం పేరుతో హైకోర్టులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ ►స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో మధ్యంతర బెయిల్ పిటిషన్ వేసిన చంద్రబాబు ►వెంటనే విచారించాలంటూ హౌజ్‌మోషన్ ద్వారా హైకోర్టును కోరిన చంద్రబాబు లాయర్లు ►అత్యవసర విచారణకు నిరాకరించిన హైకోర్టు ►రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌ను విచారించనున్న వెకేషన్ బెంచ్ 09:05 AM, అక్టోబర్ 27, 2023 నిజం గెలవాలి అంటున్న భువనేశ్వరీకి పది సూటి ప్రశ్నలు 1)నా ఆస్థి లక్ష కోట్లు అని బాబు చెప్పిన వీడియోలు ఉన్నాయి, ఆ ఆస్తిని పాలు, పెరుగు అమ్మి సంపాదించాడా? 2)బాబు అవినీతికి నేను అడ్డు అని నాకు వెన్నుపోటు పొడిచాడు బాబు అని ఎన్టీఆర్ చెప్పింది నిజమా? కాదా? 3)మహానాడు హుండీ డబ్బులు కాజేసేవాడు బాబు అని దగ్గుపాటి పుస్తకం రాసింది నిజమా? కాదా? 4)గొర్రెలు తినే కాంగ్రెస్ పోయి బర్రెలు తినే బాబు వచ్చాడు అని హరికృష్ణ అన్నది నిజమా? కాదా? 5)బాబు జమానా అవినీతి ఖజానా అని కమ్యూనిస్టులు పుస్తకం రాసింది నిజమా? కాదా? 6)బాబు పాలనలో అంతా అవినీతి అని , బీహార్ నయం అని జపాన్ మాకీ సంస్థ యజమాని పూమిహికో లేఖ రాసి వెళ్ళిపోయింది నిజమా? కాదా? 7)అమరావతి కాంట్రాక్టర్ ల నుంచి 600 కోట్ల సచివాలయం బిల్డింగ్ లో 119 కోట్లు (20 శాతం ) ముడుపులు బాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాస్ చౌదరి కి ఇచ్చానని అమరావతి కాంట్రాక్టర్ అయిన షాపుర్జీ పల్లంజి ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ చెప్పాడు. అవును నిజమే ఆ డబ్బు బాబుకు ఇచ్చాను అని బాబు పర్సనల్ సెక్రటరీ ఒప్పుకున్నాడు అని ఆగష్టు 4 న కేంద్ర సంస్థ ఇన్కమ్ టాక్స్ బాబుకు నోటీస్ ఇచ్చింది. నిజమా? కాదా? 8 ) 371 కోట్ల స్కిల్ కుంభకోణంలో మాకు ఎటువంటి సంబంధం లేదు అని సీమెన్స్ చెప్పింది అంటే టెండర్ లేకుండా సిమ్సన్ పేరుతో రూ.371 కోట్లు పక్కదారి పట్టించారు. ఈ స్కిల్ కుంభకోణం లో కేంద్ర సంస్థ ED నలుగురిని అరెస్ట్ చేసింది. ఇది నిజమా? కాదా? 9) ఓటుకు కోట్లు అంటూ తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం రేవంత్ రెడ్డితో రూ.50 లక్షల నగదును స్టీఫెన్సన్కు ఇచ్చిన నేరంలో తెర వెనక కథనడిపింది, మనవాళ్లు బ్రీఫ్డ్మీ అన్నది చంద్రబాబు. నిజమా? కాదా? 10)బాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాసచౌదరి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు జరిపినపుడు(ఫిబ్రవరి 13 ,2020) 2 వేల కోట్ల అక్రమలావాదేవీలకు సంబందించి నల్లధన వివరాలు లభ్యమయ్యాయని ఫిబ్రవరి 17,2020 న ఐటీ శాఖ కమిషనర్ సురభి అహ్లువాలియా ప్రెస్ నోట్ విడుదల చేశారు. నిజమా? కాదా? 08:17 AM, అక్టోబర్ 27, 2023 బాబుకి కంటి సర్జరీ అవసరం లేదు ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు ►ప్రతిరోజు మూడుసార్లు చంద్రబాబుకు వైద్య పరీక్షలు ►కుడి కంటికి కాటరాక్ట్ సర్జరీ చేయించాల్సి ఉందని జైలు అధికారులకు చెప్పిన చంద్రబాబు ►చంద్రబాబు పరీక్షించిన రాజమండ్రి జిజిహెచ్ వైద్యులు ►ఇప్పటికిప్పుడు కంటి సర్జరీ అవసరం లేదని స్పష్టం చేసిన ప్రభుత్వ వైద్యుడు ►ఇదే విషయాన్ని చంద్రబాబుకు తెలియజేసిన జైలు అధికారులు 07:15 AM, అక్టోబర్ 27, 2023 తాత అవినీతి గురించి దేవాన్ష్‌కు చెప్పలేదా భువనేశ్వరమ్మా? ►తాత చంద్రబాబు ఎక్కడ అని మా మనవడు దేవాన్ష్ అడుగుతున్నాడట! ►కానీ, స్కిల్ అవినీతితో అరెస్టై జైల్లో ఉన్నట్లు దేవాన్ష్‌కు తెలియదట ►తాత విదేశాలకు వెళ్లారని భువనేశ్వరి చెబుతోందట ►నన్నపనేని రాజకుమారి ఈ ప్రశ్న అడగడం.. దానికి భువనేశ్వరి ఇలాంటి సమాధానం ఇవ్వడం ►‘నిజం గెలవాలి’ యాత్రలో తిరుపతిలో ఇలాంటి విచిత్రమైన డిబేట్ నడిచింది మరి! ► చంద్రబాబు అరెస్టు తర్వాత దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ మాత్రమే అండగా నిలిచారని భువనేశ్వరి చెబుతుండడం గమనార్హం 07:03 AM, అక్టోబర్ 27, 2023 ఏసీబీ కోర్టులో సీడీఆర్ పిటిషన్‌పై నేడు విచారణ ►స్కిల్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన అధికారుల కాల్ డేటా రికార్డింగ్‌లను కోరుతూ పిటిషన్ ► గతంలోనే పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు తరఫు లాయర్లు ► ప్రతివాదుల్ని మెన్షన్ చేయకపోవడంతో మళ్లీ పిటిషన్ వేయాలని జడ్జి సూచన ►జడ్జి సూచనతో తిరిగి ఫైల్ చేసిన చంద్రబాబు లాయర్లు ►పిటిషన్‌పై గురువారం(26వ తేదీన) ఏసీబీ కోర్టులో విచారణ.. శుక్రవారానికి వాయిదా ► పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసిన సీఐడీ అధికారులు ►అరెస్టు చేసే సమయానికి ముందు సీఐడీ అధికారులు పలువుర్ని ఫోన్ ద్వారా సంప్రదించారని, ఆ వివరాలు తెలిస్తే అరెస్టులో కీలక విషయాలు బయటపడతాయంటున్న చంద్రబాబు తరఫు న్యాయవాది ►ఇది అధికారుల గోప్యతకు భంగమని, ఆ ప్రభావం విచారణపై పడుతుందని సీఐడీ న్యాయవాది వాదన ► పిటిషన్‌పై నేడు విచారణ జరపనున్న ఏసీబీ కోర్టు 06:55 AM, అక్టోబర్ 27, 2023 హైకోర్టు ముందుకు చంద్రబాబు బెయిల్ పిటిషన్ ►స్కిల్ డెవలప్మెంట్ కేసులో హైకోర్టులో చంద్రబాబు బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్లు ► నేడు విచారణ చేపట్టనున్న దసరా సెలవుల ప్రత్యేక బెంచ్ (వెకేషన్ బెంచ్) ►న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప బెంచ్ ముందు శుక్రవారం 8వ కేసుగా లిస్టింగ్ ►స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏసీబీ కోర్టు బెయిల్ నిరాకరణ ► హైకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు ►ఈ నెల 19న విచారణ జరిపి వెకేషన్ బెంచ్‌కు కేటాయించిన హైకోర్టు ధర్మాసనం ►చంద్రబాబుకు సంబంధించిన వైద్య నివేదికలను కోర్టు ముందు ఉంచాలని రాజమహేంద్రవరం జైలు అధికారుల్ని ఆదేశించిన కోర్టు 06:42 AM, అక్టోబర్ 27, 2023 వివిధ కోర్టులో బాబు పిటిషన్ల పరిస్థితి ఇది ►స్కిల్ స్కాం కేసులో సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్‌పై తీర్పు నవంబర్ 8న ►ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ నవంబర్ 9న ►ఫైబర్‌నెట్ కేసు పీటీ వారెంట్‌పై ఏసీబీ కోర్టు నిర్ణయం నవంబర్ 10న 06:35 AM, అక్టోబర్ 27, 2023 రాజమండ్రి జైల్లో చంద్రబాబు @48 ► స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ►రాజమండ్రి సెంట్రల్ జైలు 48వ రోజు రిమాండ్ ఖైదీగా చంద్రబాబు ►చంద్రబాబుకు నిత్యం ఆరోగ్య పరీక్షలు, ఎప్పటికప్పుడు జాగ్రత్తలు ►జైలు, లోపల బయటా చంద్రబాబుకు పూర్తిస్థాయి భద్రత ఏర్పాట్లు -
భువనేశ్వరి ప్రసంగాలతో ఆ స్పష్టత వచ్చినట్లే!
ఆంధ్రప్రదేశ్ రాజకీయ తెరపైకి కొత్త పాత్ర ప్రవేశించింది. ఆమె ఎవరో వేరే చెప్పనవసరం లేదు. తెలుగుదేశం పార్టీ ఆ పాత్ర ద్వారా రాజకీయ లబ్ది పొందాలని ప్రయత్నిస్తోంది. అవినీతి కేసులో జైలులో ఉన్న ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుకు మద్దతుగా ఆయన భార్య నారా భువనేశ్వరి యాత్ర ఆరంభించారు. ఆమె వచ్చే శాసనసభ ఎన్నికలలో తాను కూడా పోటీచేయాలని ఆలోచిస్తూ ఈ యాత్ర చేస్తున్నారేమో తెలియదు. నిజం గెలవాలి అనే బ్యానర్ ఆమె చేబూని తిరగడం ఆరంభిస్తే, అవును.. నిజం గెలిచింది ..అందుకే చంద్రబాబు జైలులో ఉన్నారు.. అని వైఎస్సార్సీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. నిజం పూర్తిగా గెలిస్తే చంద్రబాబు జీవితాంతం జైలులోనే ఉంటారని వారు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక 150 మంది మరణించారట. వారి కుటుంబాలను ఓదార్చడానికి ఈమె యాత్ర చేస్తున్నారట. భర్త జైలులో ఉంటే.. రాజమహేంద్రవరంలో క్యాంప్ ఇంటిలో ఉండి ఆయనకు అవసరమైన ఆహారం, మందులు వంటివాటిని పంపిచే బాధ్యతను తొలుత చేపట్టిన భువనేశ్వరి, ఆపై ఆ పని మాని జనంలో సానుభూతి కోసం తిరగడం ఆరంభించారు. ఆ సందర్భంగా ఆమె ఎవరో రాసిచ్చిన ఉపన్యాసాన్ని చదువుతున్నారు. తప్పు లేదు. కాకపోతే అందులో ఉన్న నిజాలు ఎన్ని అన్నదే ప్రశ్న. ఈ మొత్తం వ్యవహారం చూస్తే వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం అధికారంలోకి రాకపోతే, ఆ పార్టీ ఉనికి కోల్పోతుందన్న భయం, దానికి మించి చంద్రబాబుపై వచ్చిన అవినీతి కేసుల ఉచ్చు మరింత బిగిస్తుందనే ఆందోళన, తన కుమారుడు లోకేష్ రాజకీయ భవిష్యత్తు గోవిందా అవుతుందన్న అనుమానం వంటి కారణాలతో భువనేశ్వరి ఈ ఓదార్పు యాత్ర చేస్తున్నారు. తెలుగుదేశం ఒకవిధంగా కొత్త విన్యాసం చేస్తోందని చెప్పాలి. తమ నాయకుడిని అరెస్టు చేస్తేనే దానిని తట్టుకోలేక మరణిస్తున్నారని జనాన్ని నమ్మించడానికి యత్నిస్తూ, అందుకు కొంత పెట్టుబడి కూడా పెడుతోంది. తద్వారా చంద్రబాబు అమాయకుడని, ఆయనపై అక్రమ కేసులు పెట్టారని ప్రజలలో ప్రచారం చేయాలన్నది వారి లక్ష్యం. నిజం ఏమిటో చంద్రబాబుకు తెలుసు! భువనేశ్వరికి తెలుసు. లోకేష్‌కు తెలుసు. బహుశా బ్రాహ్మణికి కూడా తెలిసి ఉండాలి. అయినా జైలులో ఉన్న చంద్రబాబు సూచన మేరకు ఈ డ్రామాను ఆరంభించి ఉండాలి. భువనేశ్వరి ఏమి చెబుతున్నారంటే.. చంద్రబాబు కేసుల్లో అసలు ఆధారాలు లేవట. అయితే చంద్రబాబుకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆదాయపన్ను శాఖ ఇచ్చిన నోటీసును ఆమెకు చూపించి, అందులో చంద్రబాబుకు ఎలా ,ఎక్కడెక్కడ ముడుపులు ముట్టాయన్న విషయం చాలా స్పష్టంగా తెలిపిన విషయాన్ని వివరించాలి. అయినా ఆమె బుకాయించవచ్చు. చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ షాపూర్జిపల్లంజీ ప్రతినిధి మనోజ్ నుంచి ముడుపులు ముట్టాయని వాంగ్మూలం ఇచ్చిన సంగతి గురించి ఆమె మాట్లాడగలరా? ఆదాయపన్ను శాఖ నోటీసులోని అంశాలతో కాని, అంతకుముందు శ్రీనివాస్ ఇంటిలో సోదాలు జరిపి రెండువేల కోట్ల అక్రమాలు గుర్తించినట్లు సీబీటీడీ చేసిన ప్రకటన గురించి ఆమె ఏమైనా చెప్పగలరా?. రాజకీయాలు చేయడానికి రాలేదంటూనే రాజకీయాలు మాట్లాడిన ఆమె అచ్చం అబద్దాలనే తన ఉపన్యాసంలో చెప్పినట్లు అర్ధం అవుతుంది. చివరికి ఆమె ఇచ్చి న మూడు లక్షల రూపాయల చెక్కు లో కూడా అబద్దం ఉండడం విశేషం. చంద్రబాబు సెప్టెంబర్ తొమ్మిదిన అరెస్టు అయితే, ఆయన సెప్టెంబర్ మూడవ తేదీనే ఎలా సంతకాలు చేశారన్నది సహజంగానే వచ్చే ప్రశ్న. చంద్రబాబు తమ జీవితాలలో వెలుగులు నింపుతారని ప్రజలకు ఎంతో నమ్మకం ఉందని ఆమె అన్నారు. నిజంగా ఆ నమ్మకం ఉంటే గత శాసనసభ ఎన్నికలలో టిడిపిని 23 సీట్లకే ఎందుకు పరిమితం చేస్తారు?. చంద్రబాబు ఐదేళ్లపాలనపై ఎందుకు అంత ఆగ్రహం ప్రదర్శిస్తారు!. ఏపీని చీకటి పాలు చేశారనే కదా ఆ ఓటమి ఎదురైంది. ఆయన హైదరాబాద్ లో హైటెక్ సిటీని ఏర్పాటు చేస్తే అప్పట్టో అవహేళన చేశారని మరో అబద్దం చెప్పారు. నిజానికి అంతకు కొన్ని ఏళ్ల ముందే నేదురుమల్లి జనార్దనరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇదే ప్రాంతంలో సాఫ్ట్ వేర్ పార్క్ ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన విషయం దాచి వేయాలన్నది ఆమె ఉద్దేశం కావొచ్చు. ఆయన 2000 సంవత్సరంలో హైటెక్ సిటీ పేరుతో ఒక భవనం ఒకటి కట్టించారు. దానిపై కూడా అప్పట్లో పలు ఆరోపణలు వచ్చాయి. ఆనాటి ప్రతిపక్ష నేత పి.జనార్దనరెడ్డి ఈ భవన నిర్మాణంలో జరిగిన అవినీతిపై పలు విషయాలు చెబుతుండేవారు. అది వేరే సంగతి. ఆ తర్వాత మూడేళ్లలో ఆయన ఓటమి చెందారు. తదుపరి వైఎస్ రాజశేఖరరెడ్డి వచ్చారు. ఆయన హయాంలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తో సహా అనేక ఐటి సంస్థలు వచ్చాయి. అవుటర్ రింగ్ రోడ్డు, పీవీ నరసింహారావు ఎక్స్ ప్రెస్ హైవే తదితర సదుపాయాలు వచ్చాయి. ఆ తర్వాత కాలంలో వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆ ప్రాంతంలో అనేక కొత్త వంతెనలు వచ్చాయి. అనేక ప్రైవేటు సంస్థలు ప్రైవేటు భూములలో భవంతులు కట్టాయి. ఇరవైఏళ్ల క్రితం సి.ఎమ్. గా చేసిన చంద్రబాబు ఇప్పటికీ హైదరాబాద్ ను తానే నిర్మించానని క్లెయిమ్ చేసుకోవడం అతిశయోక్తి తప్ప ఇంకొకటికాదు. నిజంగానే చంద్రబాబుకు అంత అభివృద్ది దృష్టి ఉంటే విభజిత ఏపీలో ఐదేళ్లపాటు పాలించి ఎందుకు ఐటి కంపెనీలను రాబట్టలేకపోయారు?ఎక్కడ ఏ అభివృద్ది జరిగినా అదంతా తన ఖాతాలో వేసుకోవడం చంద్రబాబుకు బాగా అలవాటైన విద్య. ఇప్పుడు ఆయన భార్య భువనేశ్వరి కూడా అదే బాట పట్టినట్లున్నారు. పుంగనూరులో టీడీపీ కార్యకర్తలపై దాడులు చేశారట. అంతే తప్ప పోలీసు వాహనాన్ని టీడీపీ కార్యకర్తలు దగ్దం చేయడం, ఒక పోలీసుకు కన్ను పోవడం.. ఇవేమీ అసలు హింసకిందకు రావని ఆమె అనుకుంటున్నారేమో తెలియదు. న్యాయాన్ని జైలులో నిర్భంధించారట. చంద్రబాబు కోసం జనం రోడ్ల మీదకు వచ్చారట. అవన్నీ నిజం అయితే ఆమె ఇప్పుడు ఓదార్పు యాత్ర డ్రామాకు తెరదీయవలసిన అవసరం ఏమి ఉంటుంది. లోకేష్ సమర్ధతపై నమ్మకం లేకే చంద్రబాబు తన భార్యను రంగంలో దించారన్నది ఒక అభిప్రాయంగా ఉంది. తెలుగు పౌరుషం అంటే ఏమిటో ఎన్.టి.ఆర్.చెప్పారట. మరి అలాంటి ఎన్.టి.ఆర్.ను తన భర్త దారుణంగా అవమానించి పదవి నుంచి దించేయడాన్ని ఏమనాలి. అసలు చంద్రబాబు గురించి ఎన్.టి.ఆర్. ఏ స్థాయిలో దూషించింది భువనేశ్వరి తెలియనట్లే నటిస్తున్నారు. ఎంతైనా చంద్రబాబు భార్య కదా! అచ్చం ఆయన మాదిరే నటనావైదుష్యాన్ని ప్రదర్శించాలని ఆమె ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నారు. మహిళగా ఆమె బాధను అర్ధం చేసుకోవాలని అంటున్నారు. ఒక భార్యగా ఆమె బాధపడడంలో తప్పు లేదు. మరి రాజమహేంద్రవరంలోనే గోదావరి పుష్కరాలలో వీరి స్నానం కారణంగా తొక్కిసలాట జరిగి మృతి చెందిన 29 మంది కుటుంబాల బాధను ఏమనాలి. చంద్రబాబు సభల కారణంగా కందుకూరు, గుంటూరులలో తొక్కిసలాటలు జరిగి పదకుండు మంది మరణించారు. వారి కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించారా! చంద్రబాబు ప్రజాధనం వందల కోట్లు కొల్లగొట్టారని దర్యాప్తు సంస్థలు చెబుతున్నప్పుడు కోర్టులు ప్రాథమిక సాక్ష్యాధారాలు చూపుతున్నప్పుడు న్యాయాన్ని నిర్భందించడం ఎలా అవుతుంది?. సెంటిమెంట్ డైలాగులు వాడితే జనం పడిపోతారా! న్యాయం,చట్టం ఎవరికైనా ఒకటే నని ఇన్నాళ్ల తర్వాత తేలుతోందని ప్రజలు భావిస్తున్నారు. వయసుకు ,అవినీతి కేసులకు సంబంధం లేదని పలు ఉదాహరణలు చెబుతున్నాయి. ఏది ఏమైనా భువనేశ్వరి రాసుకు వచ్చిన ప్రసంగం చదువుతూ ప్రజలలో సానుభూతిని ఆశిస్తున్నారు. కాని, అక్కడ కూర్చున్న మహిళల ముఖాలు చూస్తే ఈమె ఏమి చెబుతున్నారో, ఎందుకు చెబుతున్నారో అర్ధం కాక దిక్కులు చూస్తున్నారనిపించింది. చంద్రబాబు భార్యగా ఆమె అబద్దాలు చెబుతున్నారు తప్ప, ఎన్.టి.ఆర్.కుమార్తెగా నిజాలు చెప్పాలని ఆమె అనుకోవడం లేదు. ఆ విషయం ప్రజలకు ఇట్టే బోధపడుతోంది. :::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
‘చంద్రబాబు ఎప్పుడు నిజం చెప్పారు?’
సాక్షి, తూర్పు గోదావరి: టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ అని యాత్ర మొదలుపెట్టారని.. అయితే నిజం గెలవాలని ఉద్యమం చేస్తే చంద్రబాబు మరింత ఇరుక్కుంటారని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఆధారాలు ఉన్నాయి కాబట్టే చంద్రబాబు ఇవాళ జైల్లో ఉన్నారని స్పష్టం చేశారాయన. గురువారం రాజమహేంద్రవరంలో అంబటి మీడియాతో మాట్లాడారు. ‘‘భువనేశ్వరి నిజం గెలవాలి అని యాత్ర చేపట్టారు. అలా కాకుండా.. అవినీతి గెలవాలి, అబద్ధం గెలవాలి, అన్యాయం గెలవాలి అని ఉద్యమం చేయండి. అప్పుడు మీకు ఉపయోగం ఉండొచ్చు’’ అని ఎద్దేవా చేశారాయన. ‘‘సింపతీ కోసమే మీరు(భువనేశ్వరిని ఉద్దేశిస్తూ..) యాత్ర చేస్తున్నారు. మీ ఆస్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణకు మీరు సిద్ధమా?. మీరు విచారణకు ఆహ్వానిండి.. అప్పుడు నిజం గెలుస్తుంది’’ అని అంబటి అన్నారు. చంద్రబాబు కేసులో ప్రాథమిక ఆధారాలున్నాయి. అందుకే బాబును అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబు ఇవాళ జైల్లో ఉన్నారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అన్ని ఆధారాలతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారని, ఇది అక్రమ అరెస్ట్ ఎలా అవుతుంది? అని అంబటి, టీడీపీ శ్రేణుల్ని ఉద్దేశించి ప్రశ్నించారు. సీఎం జగన్‌పై బురద జల్లేందుకు పథకం ప్రకారమే ప్రచారం చేస్తున్నారని అన్నారాయన. స్కామ్‌లన్నీ చంద్రబాబు హయాంలోనే జరిగాయి. చంద్రబాబు ఎప్పుడు నిజం చెప్పారు? కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు చెప్పారా? ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచినప్పుడు నిజం చెప్పారా? తెలంగాణలో ఓటుకు నోటు కేసులో నిజం చెప్పారా? రాజధాని భూముల కేసులో నిజం చెప్పారా? అధికార ధనబలంతో నిజాన్ని ఇంతకాలం తొక్కిపెట్టారు అని అని భువనేశ్వరికి చురకలంటించారాయన. పురందేశ్వరికి కౌంటర్ బీజేపీ ఏపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి చేసిన మద్యం ఆరోపణలపై అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక మద్యం అమ్మకాలు దగ్గాయి. కొత్త డిస్టరీస్లకు అనుమతి ఇవ్వలేదు. కొత్త బ్రాండ్లకు అనుమతి ఇవ్వలేదు. బూమ్ బూమ్ బీర్లకు, ప్రెసిడెంట్మెడల్కు సైతం చంద్రబాబే అనుమతి ఇచ్చారు అని అంబటి గుర్తు చేశారు. -
మా యాత్ర పేదల కోసం.. వాళ్లది జైల్లో ఉన్నవారి కోసం
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 175 నియోజకవర్గాల్లోనూ వైఎస్సార్సీపీ తరపున సామాజిక భేరి మోగించబోతున్నట్లు పార్టీ నేత, రాష్ట్ర మంత్రి ప్రకటించారు. ఈ సామాజిక భేరి ద్వారా పెత్తందార్ల కోటలు బద్ధలు కొట్టబోతున్నామని అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జోగి రమేష్‌తోపాటు వైఎస్సార్సీపీ నేతలు పలువురు సామాజిక భేరీ బస్సు యాత్రకు సంబంధించిన పోస్టర్‌ను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా నేతలు మీడియాతో మాట్లాడారు. ‘‘ఇచ్చాపురం, తెనాలి, శింగనమలో రణభేరి మోగించబోతున్నాం. పేదలు పెత్తందారుల మధ్య యుద్ధం జరగబోతోంది’’ అంటూ జోగి రమేష్ వివరించారు. టీడీపీ తరపున నారా భువనేశ్వరి చేపట్ట తలపెట్టిన ‘నిజం గెలవాలి’ యాత్రపై మంత్రి వ్యంగ్యాత్మక విమర్శలు చేశారు. ‘‘నిజం గెలవాలి అని కాకుండా వారు పాప పరిహార యాత్ర చేస్తే బాగుండు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినప్పటి నుంచి చేసిన పాపాలకు పరిహారం చేసేలా యాత్ర చేయాలి. చంద్రబాబు నలభై ఏళ్ల రాజకీయ జీవితం గురించి భువనేశ్వరి ప్రజలకు వివరించాలి. మీ నాన్నకు (దివంగత ఎన్టీఆర్) ఎలా వెన్నుపోటు పొడిచారో మీకే బాగ తెలుసు, కాబట్టి ఆ నిజాలు చెప్పాలి. రెండు ఎకరాల నుంచి రెండు లక్షల కోట్లు ఎలా సంపాదించారో చెప్పాలి. నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నారు. పాపం పండినందున కోర్టులు చంద్రబాబుకు రిమాండ్ విధించాయి’’ అని జోగి రమేష్ ఎద్దేవా చేశారు. జగన్ పాలన.. జనం మెచ్చిన పాలన అని, సామాజిక ధర్మం పాటించిన నాయకుడు జగన్ అని ఆయన సీఎంపై ప్రశంసల వర్షం కురిపించారు. సీఎం పలు కార్యక్రమాల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను ఏకతాటి మీదకు తెచ్చారని, మొత్తం 175 నియోజకవర్గాలలో ఈ విషయాలను వివరించనున్నామని, తద్వారా సామాజిక భేరి మోగించబోతున్నామని ఆయన వివరించారు. ‘‘గురువారం మొదలయ్యే బస్సు యాత్రతో పెత్తందార్ల కోటలు బద్దలు కొట్టబోతున్నాం. జగన్ జనరల్ కేటగిరి నియోజకవర్గాల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయించారు. నాయకత్వం అంటే అది. జగన్ సామాజిక న్యాయం చేసిన తీరును దేశమంతా చూస్తోంది. మంచి జరిగితేనే మద్దతు ఇవ్వమని కోరుతున్నాం’’ అని జోగి రమేష్ అన్నారు. ► మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ....దళితుల మీద చంద్రబాబు హయాంలో జరిగినన్ని దాడులు మరెప్పుడూ జరగలేదని, వైఎస్సార్సీపీ పాలనలో పేదల బతుకులు మారాయని అన్నారు. తాము పేదల కోసం బస్సు యాత్ర చేస్తుంటే.. జైల్లో ఉన్న వ్యక్తి కోసం వారు యాత్ర చేస్తున్నారంటూ భువనేశ్వరిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘‘చంద్రబాబు బీసీల తోకలు కత్తిరిస్తానన్నారు. మత్స్యకారులను తోలు తీస్తానన్నారు. కానీ, జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను అక్కున చేర్చుకున్నారు. ఎలాంటి పక్షపాతం లేకుండా పాలన చేస్తున్నారు. మా పాలన నచ్చితేనే మాకు ఓటు వేయమని అడిగే ధైర్యం ఉన్న నాయకుడు జగన్. జగన్ ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం. ఆయన పాలన ఉంటేనే పేదలకు బతుకు’’ అని మేరుగ నాగార్జున అన్నారు. ► రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ... ‘‘చేసిన మేలు చెప్పుకునేందుకే సామాజిక సాధికార యాత్ర చేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు జగన్ పాలనలో న్యాయం జరుగుతోంది. బీసీలంటే బాబు క్యాస్ట్ అనే విధంగా చంద్రబాబు ఓటు బ్యాంకుగా వాడుకున్నారు’’ అని మండిపడ్డారు. పేదల పిల్లలకు ఇంగ్లీషు మీడియం వద్దని, ఇళ్ల పట్టాలు వద్దనీ, అమరావతిలో పేదలు ఉండడానికి వీల్లేదని చంద్రబాబు ప్రయత్నించారని, వారిని ఆలయాల్లోకి కూడా రానివ్వలేదని అన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాకే పేదలకు అవే ఆలయ కమిటీలలో పదవులు ఇచ్చారని గుర్తు చేశారు. ‘‘మన చేయి పట్టుకొని నడిపిస్తున్నది జగనే. ఎన్నికల సమయంలో మాయ మాటలు చెప్పి తర్వాత తప్పించుకునే వ్యక్తి చంద్రబాబు. ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసి ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి జగన్’’ అని మంత్రి ఆదిమూలపు అన్నారు. ‘‘నారా భువనేశ్వరి.. చంద్రబాబు ఎన్టీఆర్ ను ఎలాంటి వేధింపులకు గురి చేశారో చెప్పండి .. ఇప్పటికైనా నిజం చెప్పాలి’’ డిమాండ్ చేశారాయన.. ఆంధ్రప్రదేశ్‌లో విద్యా వ్యవస్థపై పవన్ కల్యాణ్ డ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారంటూ విమర్శించిన మంత్రి ఆదిమూలపు ఆయనకో ఛాలెంజ్ విసిరారు. ఏపీ ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న దళిత విద్యార్థులతో పవన్ ఇంగ్లీష్‌లో మాట్లాడగలరా? అని ప్రశ్నించారు. ►మాజీ మంత్రి కొలుసు పార్థసారథి కామెంట్స్ ‘‘ముఖ్యమంత్రిగా జగన్ఈ రాష్ట్ర వనరులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కూడా అందించాలని చూశారు. పనులు లేని సమయంలో చేయి చాచి అడుక్కునే పరిస్థితి రాకూడదని సీఎం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. కరోనా సమయంలో తిండిలేక అనేక రాష్ట్రాల్లో ప్రజలు చనిపోయారు. కానీ జగన్ పుణ్యమా అని ఆంధ్రప్రదేశ్‌లో అలాంటి పరిస్థితి రాలేదు.’’ అని మాజీ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ►మాజీ ఎమ్మెల్యే జియావుద్దీన్ పాయింట్స్ ఈ సమావేశంలోనే మాజీ ఎమ్మెల్యే జియావుద్దీన్ మాట్లాడుతూ గురువారం నుంచి జరిగే బస్సు యాత్రను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. జగన్ సీఎం అయ్యాక అనేక సంస్కరణలు తెచ్చారని, సామాజిక సంక్షేమాభివృద్దిని చేసి చూపించారని కొనియాడారు. వచ్చే ఎన్నికలు పేదలు పెత్తందార్ల మధ్య జరిగేవని స్పష్టం చేశారు. ‘‘సామాజిక న్యాయం కేవలం నినాదం కాదు.. అమలు చేయాల్సిన విధానం. జగన్ పేదల వైపు నిలపడితే, చంద్రబాబు పెత్తందార్ల వైపు నిలబడ్డారు. ఈ యుద్దంలో పేదలు బాగుపడాలంటే జగనే మళ్ళీ సీఎం కావాలి’’ అని ఆకాంక్షించారు. వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం జగన్ సూచించడంతో.. వైఎస్సార్సీపీ సామాజిక న్యాయ యాత్రకు సిద్ధమైంది. ఈ నెల 26 నుంచి నవంబర్ 9 వరకు మొదటి విడత బస్సుయాత్ర జరిగేలా ప్రణాళిక రూపొందించింది. ఆదివారాలు మినహా మిగిలిన ఆరు రోజులు యాత్ర కొనసాగనుంది. ఉత్తరాంధ్రలో ఇచ్చాపురం, దక్షిణ కోస్తాలో తెనాలి, రాయలసీమలో శింగనమల నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. బస్సు యాత్ర షెడ్యూల్ అక్టోబర్ 26 – ఇచ్చాపురం, తెనాలి, శింగనమల అక్టోబర్ 27 – గజపతినగరం, నరసాపురం, తిరుపతి అక్టోబర్ 28 – భీమిలి, చీరాల, పొద్దుటూరు అక్టోబర్ 30 – పాడేరు, దెందులూరు, ఉదయగిరి అక్టోబర్ 31 – ఆముదాలవలస, నందిగామ, ఆదోని నవంబర్ 1 – పార్వతీపురం, కొత్తపేట, కనిగిరి నవంబర్ 2 – మాడుగుల, అవనిగడ్డ, చిత్తూరు నవంబర్ 3 – నరసన్నపేట, కాకినాడ రూరల్, శ్రీకాళహస్తి నవంబర్ 4 – శృంగవరపుకోట, గుంటూరు ఈస్ట్, ధర్మవరం నవంబర్ 6 – గాజువాక, రాజమండ్రి రూరల్, మార్కాపురం నవంబర్ 7 – రాజాం, వినుకొండ, ఆళ్లగడ్డ నవంబర్ 8 – సాలూరు, పాలకొల్లు, నెల్లూరు రూరల్ నవంబర్ 9 – అనకాపల్లి, పామర్రు, తంబళ్లపల్లె ఇలా రాష్ట్రవ్యాప్తంగా 3 ప్రాంతాల్లో ప్రతిరోజూ యాత్ర ఉంటుంది. మొత్తంగా డిసెంబర్ 31 వరకూ 60 రోజుల పాటు సభలు జరుగుతాయి. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఈ యాత్రను నిర్వహించనున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నాయకులు ఈ యాత్రలో పాల్గొంటారు. జగనన్న పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు వివరించడమే ఈ యాత్ర ఉద్దేశం. ఎమ్మెల్యేలు, స్థానిక సమన్వయకర్తలు ఈ బస్సు యాత్రకు అధ్యక్షత వహిస్తారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, తలశిల రఘురాంలకు సీఎం జగన్ సమన్వయ బాధ్యతలను అప్పగించారు. -
‘నిజం గెలవాలనుకుంటే చంద్రబాబు జీవితంలో బయటకురారు’
సాక్షి, కృష్ణా జిల్లా: నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్రపై మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నాడు. భువనేశ్వరి కూడా నిజం గెలవాలనుకుంటే చంద్రబాబు జీవితంలో బయటకురాడు. చంద్రబాబు కుటుంబమంతా అవినీతి సొమ్ముతో మునిగిపోయింది’’ అని ధ్వజమెత్తారు. ‘‘ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఏ స్థితిలో ఉన్నారు.. భువనేశ్వరి ఏ స్థాయిలో ఉంది. రెండు ఎకరాలతో ప్రారంభమైన చంద్రబాబు ప్రస్థానం నేడు 2 వేల కోట్లు దాటింది. 40 రోజుల్లో ఢిల్లీ లాయర్లకు రూ.35 కోట్లు ఏ విధంగా ఫీజులు కట్టారు?. కష్టపడి పొలం దున్నితే వచ్చిన డబ్బుతోనే ఏడు కోట్లతో రూపొందించిన బస్సులో యాత్ర చేస్తున్నారా?’’ అంటూ కొడాలి నాని దుయ్యబట్టారు. చంద్రబాబు కోసమే పవన్ జన సున్నా పార్టీ.. ‘‘2019 ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ తెర వెనుక టీడీపీకి మద్దతుగా ఉన్నాడని ఇప్పుడు ముసుగు తొలగింది అంతేనని కొడాలి నాని అన్నారు. ‘‘చంద్రబాబు కోసమే పవన్ కళ్యాణ్ జన సున్నా పార్టీ పెట్టారు. లోకేష్ పప్పు అని మరోసారి రుజువైంది. ఢిల్లీ పారిపోయి తల్లిని రోడ్లపై తిప్పుతున్నాడు’’ అని కొడాలి వ్యాఖ్యానించారు. చదవండి: నిజం గెలిచింది.. బాబు జైలుకెళ్లారు -
‘భర్త అవినీతి చేయలేదని భువనేశ్వరి ప్రమాణం చేస్తారా?’
సాక్షి, విజయవాడ: తన భర్త చంద్రబాబు నాయుడు అవినీతి చేయలేదని భువనేశ్వరి ప్రమాణం చేస్తారా? అని సవాల్ విసిరారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం. నారా భువనేశ్వరి కాణిపాకంలో ప్రమాణం చేసి యాత్ర ప్రారంభించాలన్నారు. నిజం గెలవాలంటే తమ ఆస్తుల మీద విచారణకు భువనేశ్వరి సిద్ధమా? అని చాలెంజ్ చేశారు రఘురాం. ‘నారా లోకేష్ ఏ యాత్ర చేపట్టినా మధ్యలో ఆగిపోతుంది. పాదయాత్ర లోకేష్ మధ్యలో ఆపేస్తాడని ఎప్పుడో చెప్పా. భవిష్యత్ లేని లోకేష్ భవిష్యత్‌కి గ్యారంటీ యాత్ర చేస్తే ఏం లాభం. ఒక చోట ఓడిన లోకేష్.. రెండు చోట్ల ఓడిన పవన్‌లను చూసి జనం నవ్వుకుంటున్నారు. చంద్రబాబు జైలు లేఖ పై సమగ్రమైన విచారణ జరగాలి. వ్యవస్థలను చంద్రబాబు మేనేజ్ చేస్తాడు. ఈ విషయం రిటైర్డ్ జడ్జిలే చెప్పారు. సీఎం జగన్ జనంని, దేవుడ్ని నమ్ముతారు. చంద్రబాబు తరహాలో లా వ్యవస్థలను మేనేజ్ చేసే నైజం సీఎం జగన్‌ది కాదు. లోకేష్ ఢిల్లీ వెళ్లి అమిత్ షా ని ఎందుకు కలిశారు. చంద్రబాబు ఆస్తులపైన, కేసుల పైన సీబీఐ విచారణకు సిద్ధమా..?’ అని నిలదీశారు. అన్ని నియోజకవర్గాల్లో బస్సుయాత్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సాధికారత చాటి చెప్పేలా బస్సు యాత్ర ఉంటుందని స్పష్టం చేశారు ఎమ్మెల్సీ తలశిల రఘురాం. సామాజిక సాధికర యాత్ర అన్ని నియోజకవర్గాల్లో సాగుతుందన్న తలశిల.. 26వ తేదీన ఇచ్చాపురం, తెనాలి, సింగణమాలలో యాత్ర ప్రారంభం అవుతుందన్నారు. -
భువనేశ్వరి సెంటిమెంట్ అస్త్రంపై నెటిజన్స్ కామెంట్స్
-
జనంలోకి భువనేశ్వరి..రోజా కౌంటర్
-
నారా భువనేశ్వరిపై ఎమ్మెల్సీ కళ్యాణి సెటైర్లు..
-
నిప్పో...తుప్పొ తేలిపోతుందా ?
-
భువనేశ్వరి యాత్ర ఉద్దేశం ఏమిటి?
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, అవినీతి కేసులో అరెస్టు అయి జైలులో ఉన్న నారా చంద్రబాబు నాయుడు తరపున ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఓదార్పు యాత్ర నిర్వహిస్తారన్న సమాచారం వచ్చింది. భువనేశ్వరి నిజం గెలవాలి అనే బ్యానర్‌తో తిరుగుతారట. వాస్తవమే.. నిజం గెలవాలి! ఏ నిజం గెలవాలి? అన్నదే ప్రశ్న. మొన్నటి వరకు న్యాయం గెలవాలి అన్నారు. ఇప్పుడు నిజానికి మారారు. ఏది నిజమో? ఏది అబద్దమో? ప్రజలకు తెలియకుండా చేయాలన్న వారి ఆలోచన కనబడుతూనే ఉంది. చంద్రబాబు అవినీతికి పాల్పడలేదని ఆయన తరపు న్యాయవాదులు కోర్టుల్లో గట్టిగా వాదించలేకపోతున్న తరుణంలో.. ప్రజల్ని ఏమార్చడానికి భువనేశ్వరి ఈ కార్యక్రమం తీసుకున్నట్లు కనిపిస్తోంది. చంద్రబాబు అరెస్టు అయిన తర్వాత నిజంగానే ఎవరైనా దానిని తట్టుకోలేక మరణించారా ? అనేది కూడా చూడాలి. అది ఎంతవరకు నిజమనేది కూడా భువనేశ్వరి ఆలోచించుకోవాలి. గతంలో ఎంపీగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓదార్పు యాత్ర చేసిన సందర్భం వేరు. ఆ పరిస్థితులువేరు. ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అనూహ్య రీతిలో హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు.అది ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ ప్రజలందరిని తీవ్రంగా కలచి వేసింది. కొందరు ఆయన మరణాన్ని తట్టుకోలేక గుండెపోటుకో, మరో తీవ్ర అస్వస్థతతోనో మరణించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ప్రత్యేకించి తెలుగుదేశంకు మద్దతు ఇచ్చే మీడియానే సంబంధిత వివరాలను కవర్ చేసింది కూడా. వాటి ఆధారంగానే జగన్ అలా మరణించినవారి కుటుంబాలను ఆదుకోవాలని నిర్ణయించుకున్నారు. ✍️అప్పట్లో జగన్ కాంగ్రెస్‌లో ఉన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆయా కుటుంబాలవారిని ఒకచోటకు తెచ్చి సాయం చేయాలని సూచించారు. ఓదార్పు యాత్ర మాదిరి వారి ఇళ్లకు వెళ్లవద్దని ఆదేశించారు. కానీ, అందుకు జగన్ ఒప్పుకోలేదు.అలా అందరిని ఒకచోటకు తీసుకు వచ్చి సాయం చేయడం మర్యాద కాదని అభిప్రాయపడ్డారు. అప్పట్లో కాంగ్రెస్ లోని ఒక వర్గం ఇదంతా జగన్ తన నాయకత్వాన్ని నిలబెట్టుకోవడానికి, సీఎం పదవి పొందడానికి అని పితూరీలు చేసేది. వారినెవరిని ఆయన ఖాతరు చేయలేదు.తను అనుకున్న బాటలోనే ఆయన ముందుకు వెళ్లారు. ఏదో రకంగా కేసులుపెడతారని తెలిసినా జగన్ వెనక్కి తగ్గలేదు. అది ఆయన ధైర్యం. కొందరుదానిని మొండి తనం అని అన్నా ఆయన పట్టించుకోలేదు. చివరికి నిజంగానే ఆయన దాని కారణంగా అనేక కష్టాలు పడ్డారు. జైలుకు వెళ్లేలా తప్పుడు కేసులుపెట్టారు. సోనియాగాంధీకి తోడు చంద్రబాబునాయుడు కూడా తోడై జగన్ ను ఇబ్బంది పెట్టడానికి పోటీపడ్డారు. వాటన్నిటిని ఎదుర్కుని 2014 విభజిత శాసనసభ ఎన్నికలలో పోటీచేసినా, ఆయన అధికారంలోకి రాలేకపోయారు, ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడి పాత్రకు పరిమితమై తనకంటూ ఒక ఎజెండా తయారు చేసుకుని ప్రజలలోకి వెళ్లి వారి మన్ననలు పొందారు. అది అప్పటి చరిత్ర. మరి ఇప్పుడు.. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ పేరుతో మామూలుగా జనంలో తిరిగితే తిరగవచ్చు. కానీ ఆమె ఓదార్పు యాత్ర చేస్తారన్నదే కాస్త ఆశ్చర్యం కలిగించే విషయం. ముందుగా చంద్రబాబు అరెస్టు కారణంగానే ఎవరైనా మరణించారా? అనే విషయాన్ని ఆమె నిర్ధారించుకోవాలి. ఎందుకంటే టీడీపీ మీడియాగా ఉన్న ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివే ఏదో పేరుకు అలాంటి వార్తలు ఇస్తున్నారు తప్ప.. వారికి తెలుసు అవన్నీ అవాస్తవాలని!. అందుకే ఆ వార్తలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. మరో వైపు ఈనాడు, ఆంద్రజ్యోతిలలో వచ్చిన విధంగా ఎవరైనా చంద్రబాబు కోసమే మరణించారా? అని సాక్షి మరికొన్ని మీడియా సంస్థలు కూపీ లాగి అసలు విషయాలు బయటపెట్టేస్తున్నారు. ✍️ఏ ఊళ్లో ఎవరు మరణించినా వారిని ఈ ఖాతాలో వేశారని.. పేర్లు,వారికి ఉన్న వ్యాధి,మరణించిన తీరు మొదలైనవాటిని ప్రచురిస్తున్నారు. అలాంటప్పుడుఈ విషయంలోనే నిజం చెప్పలేని టీడీపీ నేతలు.. భువనేశ్వరితో నిజం గెలవాలి అని ఎలా కార్యక్రమం చేపడతారో తెలియదు. ఎవరైనా అవినీతికేసులో అరెస్టు అయితే వారి కోసం కొందరు మరణించే పరిస్థితి ఉంటుందా?. ఒక నాయకుడి మరణానికి, ఒక నాయకుడి అరెస్టుకు మధ్య ఉన్న తేడాను ప్రజలు గమనించలేరా?. జగన్ ఓదార్పు యాత్ర చేసినప్పుడు దానిని కాంగ్రెస్‌లోని ఒకవర్గంతో పాటు తెలుగుదేశం కూడా తప్పు పట్టింది. మరి ఇప్పుడు భువనేశ్వరి అలాంటి ఓదార్పు యాత్రను చేయడం ఎంతవరకు నైతికంగా సమంజసం?. ✍️ప్రతిదానిలో డబుల్ గేమ్ ఆడడం టీడీపీకి చంద్రబాబు చేతుల్లోకి వెళ్లినప్పటి నుంచే అలవాటు. ఇప్పుడు భువనేశ్వరి అదే దారిలో వెళ్లబోతున్నారా? జనంలోకి వెళ్లి ఏమని చెబుతారు?. ప్రభుత్వం అక్రమ కేసు పెట్టిందని ఆరోపిస్తారు. ఇప్పటికే ఆ పని చేస్తున్నారు. చంద్రబాబు కాని, ఆయన లాయర్లుకాని చెప్పలేని నిజాలు ఏమైనా భువనేశ్వరి చెబుతారా? సెక్షన్17ఏ చంద్రబాబుకు వర్తించదని కోర్టులు అభిప్రాయపడడం తప్పు అని ఆమె చెబుతారా. దానిని నిజం అని నమ్మమని ఆమె చెబుతారా?. చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ అమెరికాకు పారిపోయిన విషయం అవాస్తవమని చెబుతారా?. టీడీపీకి ఖాతాకు నేరుగా రూ.27 కోట్లు వచ్చాయని సీఐడీ అభియోగం మోపింది. ఆ డబ్బు పార్టీ ఖాతాలోకి రాలేదని రుజువుచేసే పరిస్థితి భువనేశ్వరికి ఉంటుందా? చంద్రబాబు లాయర్ హరీష్ సాల్వే చివరికి 17ఏని పక్కనబెట్టి ఆయన వయసును దృష్టిలో ఉంచుకుని మద్యంతర బెయిల్ ఇవ్వాలని, కావాలంటే మళ్లీ జైలుకు పంపవచ్చని అనడం నిజం కాదని భువనేశ్వరి అనగలరా? తన కుమారుడు లోకేష్ ఈ కేసులో చంద్రబాబు అరెస్టు అయింది మొదలు డిల్లీలోనే ఎక్కువ రోజులు ఎందుకు బస చేస్తున్నారు? అందులో ఉన్న మతలబు ఏమిటో ఆమె వివరిస్తారా? ప్రజల కోట్ల సొమ్ము చంద్రబాబు బృందం స్వాహా చేసిందన్నది సీఐడీ ఆరోపణ. అలా జరగలేదని భువనేశ్వరి అంటారు.ఓకే. మరి నిజం ఏమిటో కూడా ఆమె తెలియచేయాలి కదా? ప్రజలను మభ్య పెట్టి సానుభూతి పొందాలన్న ప్రయత్నం చేయడమే తప్ప ఆమె నిజం చెప్పడానికి ఓదార్పు యాత్ర చేయరన్న సంగతి తెలుస్తూనే ఉంది. చంద్రబాబు బెయిల్ కోసం ఎందుకు భువనేశ్వరి మొదటే యత్నించలేదు? ఈ కేసులో ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి కనుకే కోర్టులు చంద్రబాబును రిమాండ్‌లో పెట్టాయన్న సంగతి భువనేశ్వరికి తెలియదా? చంద్రబాబును విడిచిపెట్టాల్సింది కోర్టులు తప్ప, ఏపీ సీఐడీనో, లేక ప్రభుత్వమో కాదన్న సంగతి భువనేశ్వరికి తెలియదా?. చంద్రబాబు మాజీ పీఎస్. లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేశ్ చాలా రోజులు కనిపించకుండా వెళ్లి, ఒకరోజు సీఐడీ విచారణకు హాజరై, రెండో రోజు గాయబ్ అవడంలో ఆంతర్యం ఏమిటోకూడా భువనేశ్వరి తెలుపుతారా? జీఎస్టీ అధికారులు, ఈడీ అధికారులు ఇప్పటికే ఈకేసును చెప్పట్టడం నిజం కాదని ప్రజలకు ఆమె చెప్పగలరా? ✍️ప్రస్తుతానికి ఇది ఒక్కటే కేసు కాదు. ఇన్నర్ రింగ్ రోడ్డు,ఫైబర్ నెట్ కేసులు ఎదురు చూస్తున్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లింగమనేని రమేష్ ఇంటికి భువనేశ్వరి ఎందుకు రూ. 27 లక్షల అద్దె చెల్లించారు? ఆమెకు ఈ ఇంటికి ఏమి సంబంధం. అది ప్రభుత్వ భవనమని కదా గతంలో ఆమె భర్త ప్రచారం చేసింది?. హెరిటేజ్ సంస్థ పేరుతో కంతేరు వద్దే ఎందుకు భూమి కొనుగోలు చేశారో కూడా ప్రజలకు నిజం చెబుతారా?ఇక లోకేష్ కూడా భవిష్యత్తుకు గ్యారంటీ అనే ప్రచారం చేపడతారట. ఆ హామీలే పెద్ద బోగస్ .వాటిని ప్రజలకు చెప్పడం అంటే వారిని మోసం చేయడమే. అసలు లోకేష్ భవిష్యత్తుకే గ్యారంటీ లేని పరిస్థితిలో ఆయన జనానికి ఏమి గ్యారంటీ ఇస్తారో తెలియదు. ఏది ఏమైనా తల్లి ,కొడుకులు మాత్రమే జనంలో పర్యటనలు చేస్తారా?లేక కోడలు బ్రాహ్మణి కూడా రంగంలో దిగుతారా అన్నది తెలియదు. తమ యాత్రల ద్వారా సానుభూతి సంపాదించాలన్న వారి యత్నం వికటించడానికే ఎక్కువ అవకాశం ఉంటుందని చెప్పాలి. :::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
బాబు హయాంలో బీసీలకు అన్యాయం చేశారు: కారుమూరి నాగేశ్వరరావు
-
‘బాబు అరెస్ట్‌తో హరికృష్ణ ఆత్మకూడా శాంతిస్తోంది’
సాక్షి, తాడేపల్లి: టీడీపీకి పట్టిన శని నారా లోకేష్. చంద్రబాబు అరెస్ట్‌తో నందమూరి హరికృష్ణ ఆత్మకూడా శాంతిస్తోంది. రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు ఆరోగ్యంపై నాటకం ఆడుతున్నారని మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, మంత్రి అంబటి రాంబాబు గురువారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు అరెస్ట్‌తో కలత చెంది ఎవరూ చనిపోలేదు. చంద్రబాబుకు జైలులో పటిష్ట భద్రత ఉంది. ఆధారాలతో సహా దొరికిపోయిన దొంగ చంద్రబాబు. నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ అనే పేరుతో యాత్ర చేయబోతున్నారట. నిజంగానే నిజం గెలవాలనే జనం కోరుకుంటున్నారు. చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి నిజాలను పాతాళంలోకి తొక్కేశారు. వ్యవస్థలను మ్యానేజ్ చేసేవారు. ఇప్పుడు నిజం గెలుస్తున్నందునే చంద్రబాబు జైల్లో ఉన్నారు. నిజం గెలవాలని కోరుకునేవారు 17A పట్టుకునే ఎందుకు తిరుగుతున్నారు?. నిజాన్ని ఓడించాలనే మీ ప్రయత్నం ఓడిపోతూనే ఉంది. బాలకృష్ణ ఏమయ్యాడు?.. చంద్రబాబు మోసాలు, అన్యాయాలు చేసే మనిషి. ఆయన జైలుకు వెళ్తే గుండెలు పగిలి జనం చచ్చిపోయారని కట్టుకథలు అల్లారు. చంద్రబాబు జైలుకు వెళ్లాక ఎన్టీఆర్, హరికృష్ణ, వంగవీటి రంగా, కందుకూరు, గుంటూరు సభలో చనిపోయిన వారి ఆత్మలు శాంతిస్తున్నాయి. చంద్రబాబు జైల్లో నుండి కూడా కుట్రలు చేస్తున్నారు. చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శిస్తానని బాలకృష్ణ అన్నారు. మరి బాలకృష్ణ కాకుండా ఇప్పుడు భువనేశ్వరి వెళ్లాలనుకోవడం ఏంటి?. ఇది ములాఖత్‌లో జరిగిన కుట్ర కాదా?. నారావారి చేతిలో నుండి పార్టీ నందమూరి వారి చేతిలోకి వెళ్తుందనే భయం కాదా?. తనకు ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు చంద్రబాబు ఏసీబీ కోర్టులో చెప్పారు. కొన్ని సంవత్సరాలుగా చంద్రబాబుకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. టీడీపీకి, నారా వారి కుటుంబానికి భవిష్యత్తు లేదు. అలాంటి వారు భవిష్యత్తు గ్యారంటీ పేరుతో మళ్ళీ తిరుగుతారంట. క్వాష్ రాదనీ, బెయిల్ రాదనీ వారికి అర్థం అయింది. అందుకే ఆరోగ్య సమస్యలు అంటూ హడావుడి చేశారు. చంద్రబాబు ఉన్నది జ్యడీషియల్ రిమాండ్‌లో.. కోర్టు చెప్పిందే అధికారులు చేస్తారు. ముఖ్యమంత్రి, హోం మంత్రి చెబితే అధికారులు వినరు. టీడీపీ డ్రామాలను ప్రజలు నమ్మరు.. టీడీపీకి పట్టిన శని నారా లోకేష్. ఆయన వచ్చాకే టీడీపీ భ్రష్టు పట్టింది. లాయర్ల ములాఖత్‌లు ఐదుసార్లు కావాలన్నా కోర్టుకు వెళ్లి అనుమతులు తెచ్చుకోవచ్చు. కోర్టు చెప్పిందే ఫైనల్. టీడీపీ నేతలు గవర్నర్‌ను కలవటం పొలిటికల్ డ్రామా. లోకేష్ వెళ్లి అమిత్ షాని కలిస్తే కోర్టుల నిర్ణయాలు జోక్యం చేసుకుంటారా?. టీడీపీ వారు ఎన్ని డ్రామాలు చేసినా జనం నమ్మరు. అన్ని ఆధారాలతో కేసు బలంగా ఉంది. చంద్రబాబు కేసు నుండి తప్పించుకోలేరు. పవన్ కల్యాణ్‌కు కౌంటర్.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఆలోచన లేదు, ఆలోచనా విధానం లేదు. జనసేన, బీజేపీ కలిసి ఉన్నాయా? లేదా? అనే డౌట్ చాలాకాలం ఉంది. తెలంగాణలో టీడీపీతో ఎందుకు కలవటం లేదు?. ఏపీలో మళ్ళీ చంద్రబాబుతో పొత్తు ఏంటి?. పవన్ రాజకీయాలకు పనికిరారు. నిజజీవితంలో చేసినట్టే ఒకరితో ఉంటూ ఇంకొకరితో పొత్తు పెట్టుకోవటం ఏంటి?. చంద్రబాబును అరెస్టు చేయటంపై అమిత్ షాతో మాట్లాడతానని చెప్పిన పవన్ ఏమయ్యారు? అంటూ ప్రశ్నలు సంధించారు. -
నారా భువనేశ్వరి, బ్రాహ్మణిపై మంత్రి బొత్స కామెంట్స్
-
చంద్రబాబుకు ఏదైనా జరిగితే వారిదే బాధ్యత: మంత్రి కొట్టు
సాక్షి, పశ్చిమగోదావరి: చంద్రబాబుకు ఏదైనా జరిగితే దానికి భువనేశ్వరి, లోకేష్‌లదే బాధ్యత అంటూ వ్యాఖ్యానించారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. పెంటపాడు మండలం పెంటపాడు పోస్ట్ బేసిక్ స్కూల్ దగ్గర ‘‘జగనన్న ఆరోగ్య సురక్ష’’ మెగా వైద్య శిబిరాన్ని పరిశీలించిన మంత్రి.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు ప్రాణాలకు ఆయన కుటుంబ సభ్యుల నుంచే హాని ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాలో జరిగినట్లే జరిగే అవకాశం లేకపోలేదన్న మంత్రి.. చంద్రబాబును ఆయన కుటుంబీకులే కుట్ర చేసి అంతం చేస్తారనే భయం చంద్రబాబుకి ఉందన్నారు. ఆనాడు తన కన్నతండ్రి ఎన్టీ రామారావును కట్టుకున్న భర్త చంద్రబాబే వెన్నుపోటు పొడిచారు. ఎన్టీఆర్‌ను అధికారంలో నుంచి దించేసి చివరకు ఆయన చావుకు కారణమైన కానీ భువనేశ్వరి స్పందించలేదు’’ అని మంత్రి గుర్తు చేశారు. చదవండి: టీడీపీ వీరాభిమానికి గుండె వ్యాధి.. ఆదుకున్న సీఎం జగన్ ప్రభుత్వం -
భువనేశ్వరిని ఏకిపారేసిన వరుదు కళ్యాణి
-
భువనేశ్వరి చంద్రబాబుకు మంచి భోజనం, మందులు పంపట్లేదా?
సాక్షి, విజయవాడ: చంద్రబాబు జైల్లో ఉండి అల్లర్లు సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నాడని, అందుకే నారా భువనేశ్వరి, లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎపీఎఫ్‌డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణ మురళి మండిపడ్డారు. ‘‘చంద్రబాబుకి మందులు, భోజనం పంపేది భువనేశ్వరినే కదా.. మరి ఆమె మంచి భోజనం, మందులు పంపట్లేదా..?’’ అంటూ పోసాని నిలదీశారు. ‘‘చంద్రబాబు జ్యుడిషల్ రిమాండ్‌లో ఉన్నారు.. జగన్ రిమాండ్‌లో కాదు. జైల్లో చంద్రబాబు ఆరోగ్యంగా లేకపోతే లోకేష్ ఎందుకు ఢిల్లీ వెళ్ళాడు. అమిత్ షాని కలవడానికి లోకేష్‌కి సిగ్గు లేదా? అమిత్ షా మీద రాళ్లేయించి ఇప్పుడేమో కేసులు కోసం ఆయన్ను కలుస్తారా?. లోకేష్ ఆడే డ్రామాలు అమిత్ షాకి తెలియవనుకుంటున్నారా..?. కమ్మ వాళ్లని రెచ్చగొట్టడానికి భువనేశ్వరి, లోకేష్ అబద్దాలు చెబుతున్నారు. జైల్లో చంద్రబాబు డాక్టర్లు, పోలీసుల నిరంతర పర్యవేక్షణలో ఉన్నాడు’’ అని పోసాని వివరించారు. కాంగ్రెస్ అలవాట్లు బీజేపీకి అంటించాలని పురంధేశ్వరి అనుకుంటున్నారు. అమిత్ షా పై రాళ్లు వేయించిన లోకేష్‌ని ఆయన దగ్గరకి తీసుకెళ్లారు. మోదీని నీచంగా తిట్టిన చంద్రబాబు కోసం పురంధేశ్వరి తాపత్రయ పడటమా..?. పవన్ కళ్యాణ్, లోకేష్‌లు రాజకీయాలకు పనికిరారు. బట్టలు విప్పుతాం, కొడతాం అంటే ప్రజలు ఛీ కొడుతున్నారు’’ అని పోసాని మురళీ కృష్ణ దుయ్యబట్టారు. చదవండి: చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ డ్రామాలు: సజ్జల -
స్పందనేది ‘బాబూ’!
సాక్షి, అమరావతి : చంద్రబాబు అరెస్టుపై ప్రజల్లో ఏమాత్రం స్పందన కనిపించడంలేదు. తమ నాయకుడిని అరెస్టు చేసిన తర్వాత ప్రజల నుంచి సానుభూతి వెల్లువెత్తుతోందని ఆ పార్టీ నాయకులు చెప్పుకుంటున్నా, అది ఎక్కడా మచ్చుకైనా కనిపించడంలేదు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో టీడీపీ పలు కార్యక్రమాలు ప్రకటించి, వాటిలో పాల్గొనాలని ప్రజలకు పిలుపునిస్తున్నా, స్పందన ఉండటంలేదు. ప్రజలే కాదు.. ఆ పార్టీ శ్రేణుల్లోనూ స్పందన కరవైంది. శనివారం రాత్రి కూడా కాంతితో క్రాంతి అంటూ టీడీపీ చేపట్టిన కార్యక్రమమూ విఫలమైంది. రాత్రి 7 గంటలకు ప్రజలంతా ఇళ్లలో లైట్లు ఆర్పేసి కొవ్వొత్తులు వెలిగించి చంద్రబాబు అరెస్టుకు నిరసన తెలపాలని టీడీపీ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమాన్ని ప్రజలు అసలు పట్టించుకునే లేదు. ఇలాంటి కార్యక్రమం ఒకటి జరుగుతోందనే విషయం కూడా చాలామందికి తెలియదు. రాజమహేంద్రవరంలో భువనేశ్వరి, ఢిల్లీలో లోకేశ్, అక్కడక్కడ కొందరు నేతలు, కొంతమంది మద్దతుదారులు ఇళ్లలో లైట్లు ఆర్పి, కొవ్వొత్తులు వెలిగించి సోషల్ మీడియాలో హంగామా చేశారు తప్ప ప్రజలు, ఆ పార్టీ కార్యకర్తలు కూడా స్పందించలేదు. అవినీతి చేసినందువల్లే చంద్రబాబు అరెస్టయి జైలుకు వెళ్లారని జనం నమ్మడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబుపై ఏమాత్రం సానుభూతి లేదని ఈ కార్యక్రమానికి వచ్చిన స్పందనే చెబుతోందని అంటున్నారు. బాబు అరెస్ట్ అయిన సమయంలో కూడా ప్రజల నుంచే కాదు పార్టీలోనే స్పందన కనిపించలేదు. బయటకు వచ్చి ఆందోళనలు చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఇతర నేతలు బతిమలాడుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత చేసిన బంద్‌తో సహా ఏ కార్యక్రమానికీ జనం నుంచి స్పందన రాలేదు. దీపాలు వెలిగించి భువనేశ్వరి నిరసన.. ప్రత్యేక విమానంలో ఢిల్లీకి లోకేశ్, బ్రాహ్మణి సాక్షి, రాజమహేంద్రవరం/మధురపూడి: చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా ‘కాంతితో క్రాంతి’ పేరుతో శనివారం రాత్రి 7 నుంచి 7.05 గంటల వరకు రాజమహేంద్రవరంలోని లోకేశ్ శిబిరంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, మహిళా నేతలు దీపాలు వెలిగించారు. అంతకు ముందే నారా లోకేశ్, బ్రాహ్మణి ప్రత్యేక విమానంలో మధురపూడి విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్లారు. కాగా, బాబు జ్యుడిషియల్ రిమాండ్ 27వ రోజుకు చేరింది. -
నేడు మూలాఖత్ లో చంద్రబాబును కలవనున్న భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి
-
అడ్డంగా దొరికినా కతలే..!
-
అవినీతి చేసి అడ్డంగా దొరికిన వ్యక్తి చంద్రబాబు
-
Babu Case : లోకేషా.. ఈ ప్రశ్నలకు జవాబేదీ?
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు తనయుడు నిన్న ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కొన్ని ప్రకటనలు చేశారు. ఇంతకీ ఆయన చేసిన ప్రకటనలేంటీ? వాటి అంతరార్థమేంటీ? లోకేష్ : తెలుగుదేశం పార్టీ ఏనుగు లాంటిది. సిద్ధమవడానికి సమయం పడుతుంది. సందేహాలు : పార్టీని ఏనుగులా పోల్చడమేంటీ? అసలు ఏనుగు అనడంలో లోకేష్ ఉద్దేశ్యమేంటీ? ఎవరూ కదలలేకపోతున్నారనా? లేక పార్టీ బలంగా ఉందని చెప్పడమా? తెలుగుదేశం పార్టీ ఒకవేళ ఏనుగే అనుకుంటే, సిద్ధమవడానికి సమయం పడుతుందనుకొందాం. కానీ తెలుగుదేశం పార్టీ కొత్తగా వచ్చింది కాదు కదా. దాదాపు 40 ఏళ్లుగా ఉన్న ఒక పార్టీలో చంద్రబాబు అనే ఒకే ఒక వ్యక్తి అవినీతి పాలయి జైల్లోకి వెళ్లాడు. ఒక్క అరెస్ట్‌తోనే పార్టీ తలకిందులయిందన్నది లోకేష్ ఉద్దేశ్యమా? లేక పార్టీ నిద్రాణంగా ఉందన్న భావనలో ఉన్నారా? లోకేష్ : చేయని తప్పుకు శిక్షించే వ్యవస్థ ఉండకూడదన్న ఉద్దేశ్యంతో, ఆ వ్యవస్తను మార్చడానికే నేను రాజకీయాల్లోకి వచ్చాను. సందేహాలు : లోకేష్ రాజకీయాల్లోకి 2014 తర్వాత వచ్చాడు. రాజకీయాల్లోకి వచ్చాను అని చెప్పుకుంటున్న లోకేష్ ముందెక్కడ పోటీ చేయలేదు. అప్పటికే పార్టీ అధికారంలో ఉంది. తండ్రి ముఖ్యమంత్రి కావడంతో లోకేష్ నేరుగా ఎమ్మెల్సీ అయ్యాడు. దొడ్డిదారిన ఎమ్మెల్సీ పదవి తీసుకున్నాడు. పార్టీ చెప్పుచేతల్లో ఉంది కాబట్టి జాతీయ కార్యదర్శి పదవి తీసుకున్నాడు. అధికారం తమదే కాబట్టి క్యాబినెట్ మినిస్టర్ అయ్యాడు. అంతే తప్ప.. ఎక్కడ ఎన్నికల్లో పోటీ చేసి పదవులు సాధించుకోలేదు. తెలుగు రాజకీయాలను భ్రష్టు పట్టించి ఓటుకు కోట్లు కెమెరాల సాక్షిగా ఇస్తూ అడ్డంగా దొరికి, లంచం ఇవ్వడం తప్పు కాదని వాదించే మీలాంటి నాయకులు ఉండడం వల్లే రాజకీయాల్లోకి కొత్తగా ఎవరూ రావడం లేదు. ఇంకొక ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏంటంటే.., లోకేష్ రాజకీయాల్లోకి వచ్చేసమయంలో లోకేష్ గానీ, లోకేష్ తండ్రి చంద్రబాబు గానీ జైల్లో లేరు. నిజానికి ఆ సమయంలో చేయని తప్పుకు కేసులు పెట్టి జైలుకు పంపింది వైఎస్ జగన్మోహన్ రెడ్డిని. కాంగ్రెస్ కక్ష కడితే, దానికి చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం వంత పాడి కేసుల్లో ఇంప్లీడ్ అయి తప్పుడు అభియోగాలు బనాయించి వైఎస్ జగన్మోహన్రెడ్డిని అక్రమంగా జైలుకు పంపించారు. ఈ కేసులు తప్పని ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టే.. 2014లో 67 స్థానాలు, 2019లో 151 స్థానాలు కట్టబెట్టారు. అంటే లోకేష్ చెప్పే అరెస్ట్ ఇదేనా.? తాము అక్రమంగా అరెస్ట్ చేసి పంపామన్న అపరాధన భావనలో ఉన్నాడా? లోకేష్ : మేం ఎనిమిదేళ్లుగా ఆస్తులు ప్రకటిస్తున్నాం. మాకు హైదరాబాద్/సైబరాబాద్‌లో ఎకరం జాగా లేదు. అసలు నిజాలు : లోకేష్, చంద్రబాబు ఆస్తుల వెల్లడి అన్న కార్యక్రమం ఎంత కామెడీనో తెలుగు ప్రజలందరికీ తెలుసు. హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన జూబ్లీహిల్స్‌లో కట్టిన రాజసౌధం విలువ లక్షల్లోచూపిస్తావు. ఏంటంటే.. కొన్నప్పుడు అంతే ఉందంటావు. ఇక అసలు మాకు ఒక్క గజం భూమి ఉన్నా.. ఇచ్చేస్తానంటావు. మరి మదీనాగూడలో 14 ఎకరాల్లో ఉన్న ఫాంహౌజ్ సంగతేంటీ? అంత ఖరీదైన లోకేషన్లో అంత భూమి ఎలా వచ్చింది? ఖరీదైన స్థలాలన్నీ మీ నానమ్మ నీ ఒక్కరికే ఎందుకు గిఫ్ట్‌గా ఇచ్చింది? ఇందులో క్విడ్ ప్రో కోల గురించి ఎప్పుడైనా వివరణలిస్తావా? దీని గురించి వేసిన కేసుల్లో విచారణ జరగకుండా స్టేలు ఎందుకు తెచ్చుకున్నారు? మీకు, మీ కొడుకు దేవాన్ష్ కు ఇచ్చిన బహుమతులు అమ్మణ్ణమ్మ, బాలకృష్ణ ఐటీ రిటర్నులు, ఎన్నికల అఫిడవిట్లలో ఎందుకు లేవు? లోకేష్ : మా నాన్న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల మా సంస్థ హెరిటేజ్ నిదానంగా ఎదిగింది. లేదంటే సంస్థ విలువ ఇప్పటికీ మూడు రెట్లు పెరిగేది. అసలు నిజాలు : హెరిటేజ్ విలువ ఎంత? ఆ సంస్థ అంచలంచెలుగా ఎలా ఎదిగింది అన్నది చిత్తూరు నుంచి విజయనగరం వరకు ఎవరిని అడిగినా చెబుతారు. పదవిని అడ్డు పెట్టుకుని హెరిటేజ్ కోసం చిత్తూరు డెయిరీని దివాళా తీయించినప్పుడే వ్యవస్థలను ముంచే మీ ప్రతిభ అర్థం చేసుకోవాలి. అయినా హెరిటేజ్ అసలు లెక్కలు ఎప్పుడయినా బయటపెట్టారా? ఇందులో మీ కుటుంబ సభ్యులు కాకుండా ఇంకెవరయినా కీలక స్థానాల్లో ఉన్నారా? ఈ మధ్యే మీ అమ్మ భువనేశ్వరీ ఏం చెప్పారు? మా సంస్థ హెరిటేజ్‌లో 2% షేర్లు అమ్మినా మాకు రూ.400 కోట్లు వస్తాయన్నారు. అంటే ఈ లెక్క ప్రకారం మీ సంస్థ విలువ రూ.20వేల కోట్లు. కేవలం పాలు, డెయిరీ ప్రొడక్ట్‌లు, సూపర్ మార్కెట్ల ద్వారా రూ.20వేల కోట్ల సామ్రాజ్యాన్ని నెలకొల్పిన మానవ మాత్రుడు ఎవరయినా ప్రపంచంలో ఉంటారా? మీరు తప్ప. ఇందులో అక్రమ సంపాదన ఎంత? వ్యవస్థలను ముంచిందెంత? మీ సంస్థ బాగు కోసం ఎవరెవరిని తొక్కేశారు. కొంచెం లెక్కలు వివరంగా చెబితే అందరూ నోళ్లు వెల్లబెట్టి వింటారు. లోకేష్ : రాజకీయాల్లోకి బ్రాహ్మణి రావడం ఆమె ఇష్టం. మేం మా దారులు ఎంచుకొన్నాం. అసలు నిజమేంటీ : పార్టీ లోడు నువ్వెత్తడం లేదని విషయం స్పష్టమయిన తర్వాతే మీ నాన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్‌ను ఎంచుకున్నారని తెలుగుదేశంలో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు గత మూడు వారాలుగా మీకు సంబంధించిన ఎల్లో మీడియాలోనే బ్రాహ్మణి పేరు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బ్రాహ్మణి రావాలి, పాదయాత్ర చేయాలి, పార్టీని నడిపించాలని ప్రచారం చేస్తున్నారు. అంటే దానర్థమేంటన్నది మీ స్టాన్ఫోర్డ్ బ్రెయిన్‌కు అర్థం కానంత గొప్పదేం ఉండదు. మీరు తారా స్థాయిలో రాజకీయాలు నడిపితే బ్రాహ్మణి పేరు ముందుకు ఎందుకు వస్తుంది? హెరిటేజ్ సంస్థను విడిచిపెట్టి బ్రాహ్మణి రాజకీయాల్లోకి రావాలి అని పచ్చమీడియా పిచ్చిగా ప్రచారం చేస్తోందంటే ఇంతకు మించిన అర్థం ఇంకేముంటుంది? (Courtesy : Nidhi) లోకేష్ : స్కిల్ డెవలప్మెంట్, రింగ్‌రోడ్డు అక్రమ అలైన్మెంట్, ఫైబర్ గ్రిడ్.. ఈ మూడు ప్రాజెక్టులు నా మంత్రిత్వ పరిధిలోనివి కావు, కాబట్టి వాటికి నేను బాధ్యుడిని కాదు సందేహాలేంటీ : మొన్నటి వరకు ఏం వాదించారు.? బ్యాంకు మేనేజర్ తప్పు చేస్తే బ్యాంకు ఓనర్‌ను అరెస్ట్ చేస్తారా? అని ఎదురు ప్రశ్నించారు. అంటే అర్థమేంటీ? తప్పు జరిగింది కానీ మాది బాధ్యత కాదంటున్నావు. ఇక ఈ మూడు ప్రాజెక్టులకు సంబంధించిన శాఖలకు కూడా నేను మంత్రిగా పని చేయలేదంటున్నావు. అంటే అర్థమేంటీ? కుంభకోణం జరిగింది కానీ నా ప్రమేయం ప్రత్యక్షంగా లేదని అర్థమా? స్కిల్ డెవలప్మెంట్ మీ నాన్న శాఖలోనిది అయితే మీ ప్రమేయం అంతగా ఎందుకుంది? ఫైబర్ గ్రిడ్‌కు మీకు సంబంధం లేకుంటే.. మీవైపే అన్ని ఆధారాలు ఎందుకు చూపిస్తున్నాయి? మీ సంస్థ భూములు రింగ్‌రోడ్డు చుట్టే భూములు కొనాలని మీకు కలలో ఐడియా వచ్చిందా? పైగా మీ బెయిల్ పిటిషన్లో మీ అడ్వొకేట్ దమ్మాలపాటి శ్రీనివాస్ ఏం వాదించారు? కరకట్టపై ఉన్న లింగమనేని గెస్ట్ హౌజ్‌లో తండ్రి చంద్రబాబుతో కలిసి ఉన్నందుకు నాపై కేసు ఎలా పెడతారని కోర్టు ముందు వాదించారు. అంటే మునగాల్సి వస్తే తండ్రిని కూడా వదిలేస్తారా? ఇవేనా మీరు నేర్చుకున్న కుటుంబ విలువలు? అసలు నోటీసులు రాకముందే ఢిల్లీకి ఎందుకు వెళ్లిపోయారు? సుప్రీంకోర్టు లాయర్లతో మాట్లాడాల్సిన మంతనాలకు ఇన్ని రోజులు పడుతుందా? అయినా న్యాయశాస్త్రంలో మీరేమీ డాక్టరేట్ చేయలేదు కదా.. మీకున్న ప్రతిభకు సాల్వే, లూథ్రా లాంటి సీనియర్ లాయర్లకు ఏం సూచనలు చేస్తారు? రాజమండ్రిలో కుటుంబాన్ని వదిలేసి ఢిల్లీ హోటళ్లలో ఉంటూ వీడియో కాన్ఫరెన్స్‌లు పెట్టేకంటే.. పాదయాత్ర ద్వారా ప్రజల్లో ఉండడం మిమ్మల్ని నాయకుడిగా నిలిపేది కదా. పైగా నన్ను అరెస్ట్ చేసే అవకాశముంది కాబట్టి ఏపీ నుంచి ఢిల్లీ వచ్చానని నిజాయతీగా చెబితే సగటు తెలుగు ప్రజలకు కనీసం సానుభూతి అయినా వచ్చేది కదా. ఇంత చిన్న పాయింట్ ఎలా మిస్సయ్యారు? -
ఏపీకి ఇద్దరు గాంధీలు.. చంద్రబాబు, లోకేష్: పోసాని సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: చంద్రబాబు, లోకేష్ నాశనం కావడానికి భువనేశ్వరే కారణమని ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి విమర్శించారు. భువనేశ్వరి, బ్రాహ్మణి వ్యాఖ్యలు సరైనవి కావని మండిపడ్డారు. ఆ మాటలు విని షాక్‌కు గురైనట్లు తెలిపారు. చంద్రబాబుకు కాంగ్రెస్ రాజకీయ భిక్ష పెట్టిందని దుయ్యబట్టారు. తండ్రిపై చెప్పులు వేయించినా భువనేశ్వరి ఏం అనలేదు భువనేశ్వరి కోసం ఎన్టీఆర్ చంద్రబాబును పార్టీలో చేర్చుకున్నారని ప్రస్తావించారు. ఇందుకు ఎన్టీఆర్ టీడీపీ సీనియర్ నేతలను ఒప్పించారని గుర్తుచేశారు. అంత సాహసం చేసి బాబును పార్టీలోకి తీసుకొచ్చిన తండ్రిపై చెప్పులు వేయించినా భువనేశ్వరి చూస్తూ ఊరుకున్నారని మండిపడ్డారు. భారతదేశానికి ఒకరే గాంధీ. కానీ ఏపీకి మాత్రం ఇద్దరు గాంధీలు ఉన్నారని.. ఒకరు చంద్రబాబు మరొకరు లోకేష్ అంటూ సెటైర్లు వేశారు. భర్తలను మించిన రాజకీయ నాయకురాళ్లు భర్తలను మించిన రాజకీయ నాయకురాలు ఉన్నారంటూ నారా భువనేశ్వరి, బ్రహ్మణిలను ఉద్ధేశిస్తూ పోసాని వ్యాఖ్యానించారు. అత్తా కోడళ్ళు ఇద్దరూ భర్తల కంటే పెద్ద రాజకీయ నాయకురాళ్లని ఎద్దేవా చేశారు. భర్తలను తిట్టారనే విషయం మర్చిపోయి... వచ్చే ఎన్నికల్లో అత్తాకోడళ్లు పవన్ మద్దతు కోరారని విమర్శించారు. జ్యూస్ ఇవ్వగానే టీడీపీకి మద్దతు చంద్రబాబు కాంగ్రెస్ నుంచి టీడీపీ వెళ్ళేటప్పుడు మనకేం కర్మ అని భువనేశ్వరి ఎందుకు అడ్డుకోలేదు?. చంద్రబాబు దొంగ అని ఆనాడే నాదేండ్ల భాస్కర్ రావు అన్నారు. తండ్రిని చెప్పుతో కొడితే భువనేశ్వరి చుక్క కన్నీరు కార్చలేదు. సమసామాజిక స్థాపన పేరుతో పవన్ కల్యాణ్ పార్టీ పెట్టారు. ఆనాడు ఒకమాట ఇవాళ మరో మాట మాట్లాడుతున్నారు. ఆయన అమాయకుడు. భువనేశ్వరి, బ్రహ్మని జ్యూస్ ఇవ్వగానే టీడీపీకి మద్దతు ప్రకటించారు. ఎన్టీఆర్‌ను ఒంటరి వాడిని చేసి, ఆయన్ను మోసం చేసి చావడానికి కారణం అయిన వాళ్లు దండం పెట్టగానే.. అభయం ఇచ్చేశాడు. చదవండి: పవన్ ఫ్లాప్.. చంద్రబాబు జిమ్మిక్కే! అభివృద్ధి చేసిన వాళ్ళను గెలిపించండి పవన్‌కు వ్యక్తిత్వం ఉంటే పోటీలో ఒంటరిగా నిలబడాలి. సీఎం జగన్ వ్యక్తిత్వం ఉన్న నాయకుడు. అందుకే కులం, మతం లేదు. పవన్ వైస్సార్సీపీకి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పడం మానేసి.. తనకు ఎన్ని సీట్లు వస్తాయో చెప్పాలి తనను గెలిపిస్తే ప్రజలకు ఎలాంటి అభివృద్ధి చేస్తానని పదేళ్లలో ఎక్కడైనా చెప్పారా?. వైఎస్ జగన్ మొదటి రోజు నుంచి ప్రజల అభివృద్ధి గురించే మాట్లాడారు. పవన్ కనీసం కాపులకు అండగా ఉంటానని కూడా చెప్పలేదు. కాపులు ఎవరికైనా ఓట్లు వేయండి చంద్రబాబుకు తప్ప. మీరు ఎవరి మైకంలోకి వెళ్ళకండి. ఎవరు మంచి అభివృద్ధి చేస్తే వాళ్ళను గెలిపించండి. ఇప్పటికే చాలా సార్లు మోసపోయారు. ఇక భవిష్యత్తులో మళ్ళీ రిపీట్ కావొద్దు. అప్పుడు సత్యమేవ జయతే ఎక్కడ పోయింది? వైఎస్ జగన్ పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను కొన్నప్పుడు సత్యమేవ జయతే ఎక్కడ పోయింది? సత్యమేవ జయతే కాదు. అసత్యమేవ అజయతే అని బోర్డు పెట్టుకోవాలి. హెరిటేజ్ పెట్టింది మా సినిమా లెజెండ్ కానీ ఇప్పుడు నారావారి అధీనంలో ఉన్నది. పాలిటిక్స్ అంటే డబ్బులు సంపాదించుకోవచ్చు అనే కొటేషన్ చంద్రబాబుకు కరెక్ట్‌గా సరిపోతుంది. చంద్రబాబును చెప్పుతో కొట్టినప్పుడు ఈ సత్యమేవ జయతే దీక్షలు ఎక్కడికి పోయాయి? జయప్రద లాంటి వాళ్ళు ప్రజాసేవ కోసం వస్తే వాళ్ళ జీవితాలను నాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తే మంచి లేదంటే అక్రమ కేసులా? ఏపీలో జగన్ ప్రభుత్వానికి ఉన్న అడ్డంకులు దేశంలో ఏ ప్రభుత్వానికి లేదు. సీఎం జగన్ ఏనాడు కోర్టును ప్రశ్నించలేదు’ అని పోసాని పేర్కొన్నారు. -
చంద్రబాబును ఇరికించిన భువనేశ్వరి
-
ఇవి చిన్న పిట్ట స్కాములే.. అసలు స్కాము త్వరలో బయటకి..
-
అడ్డంగా దొరికిన బాబును కాపాడేందుకు ఎవరూ సిద్ధంగా లేరు: మంత్రి రోజా
సాక్షి, విజయవాడ: నారా లోకేష్ ఢిల్లీలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా కాళ్లు పట్టుకోవడం కోసం తిరుగుతున్నారని మంత్రి రోజా ధ్వజమెత్తారు. ఇప్పటికే రాష్ట్రపతిని కలిసిన లోకేష్.. తప్పు చేసిన తన తండ్రిని కాపాడాలని కోరారని అన్నారు. ప్రజల సొమ్ము దోచేసినా చర్యలు తీసుకోకూడదని అడిగేందుకు డిల్లీ వెళ్లారని విమర్శించారు. అడ్డంగా దొరికిన చంద్రబాబును కాపాడేందుకు ఎవరూ సిద్ధంగా లేరని.. అందుకే మోదీ, అమిత్ షా అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. చంద్రబాబు స్కిల్ డెవెలప్ మెంట్ సహా అమరావతి, ఫైబర్ నెట్ వంటి అనేక స్కాంలు చేశారని మంత్రి రోజా దుయ్యబట్టారు. ఇన్నర్ రింగ్ రోడ్డు లేదు కదా.. ఇంకా స్కాం ఎలా జరిగిందని లోకేష్ అడుగుతున్నారని.. రోడ్డు వేయకముందే ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్మెంట్ పేరుతో దోచుకున్నారని విమర్శలు గుప్పించారు. ఆరు నెలల్లో రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని లోకేష్ చెప్తుంటే అందరూ నవ్వుతున్నారని అన్నారు. స్కాంలలో ఇరుక్కుని లోకేష్ ఢిల్లీ పారిపోయాడని.. కాళ్ళ నుంచి కళ్ళ వరకూ భయంతో వణికిపోతున్నాడని ఎద్దేవా చేశారు. ‘రెడ్‌బుక్ రాసుకుంటానని బెదిరిస్తున్న లోకేష్ సీఐడీ మెమోలో ఆయన పేరు రాశారని గుర్తు చేసుకోవాలి. హెరిటేజ్‌లో 2 శాతం షేర్లు అమ్మితెనే 400కోట్లు వస్తాయని భువనేశ్వరి చెప్తున్నారు. అంటే చంద్రబాబు ఆస్తి 20 వేల కోట్లా. చంద్రబాబు అఫిడవిట్ ఆ విషయం స్పష్టం చేశారా. కర్జూర నాయుడు చంద్రబాబుకు, ఆయన తమ్ముడికి చెరో ఎకరం ఇచ్చారు. అక్కడి నుంచి లక్షల కోట్లకు చంద్రబాబు ఆస్తి ఎలా పెరిగింది. హైదరాబాద్ లో చంద్రబాబు ఇల్లు రూ. 600 కోట్లు.. భువనేశ్వరి లోకేష్ 118 కోట్ల అయితే నోటీసులకు సమాధానం చెప్పాలి. ప్రపంచ దేశాల్లోని తెలుగువారంతా ఈ స్కామ్‌ల గురించి తెలుసుకోవాలి. భువనేశ్వరి, బ్రహ్మణి అబద్ధాలు చెప్తుంటే ఎన్టీఆర్ కూతురు, మనవరాలు అనే గౌరవం కూడా పోతుంది. చంద్రబాబు దోపిడీదారుడు అని అందరికీ తెలుసు. చంద్రబాబు టీమ్ వర్క్‌గా కుటుంబసభ్యులంతా దోపిడీలో భాగస్వామ్యం అయినట్టు ప్రజలకు స్పష్టమైంది’ అని రోజా పేర్కొన్నారు. విజయవాడ: ఏపీ ఆన్యువల్ టూరిజం ఎక్స్‌లెన్స్ అవార్డులను మంత్రి రోజా అందజేశారు. 5స్టార్, 7స్టార్, బడ్జెట్ హోటల్స్, ఎకో ఫ్రెండ్లీ విభాగాల్లో పలు హోటల్స్, పలువురు చెఫ్‌లు, ట్రావెల్ ఏజన్సీలకు, అడ్వెంచర్ క్లబ్స్‌కు అవార్డులు అందించారు. ఈ సందర్భంగా మంత్రి ఆరోజా మాట్లాడుతూ.. ‘టూరిజంలో అనేక మార్పులు వస్తున్నాయి. టూరిజంలో ఈ జనరేషన్‌కు క్రియేటివిటీ పెరిగింది. స్ట్రెస్ రిలీఫ్‌కు డెస్టినేషనే సొల్యూషన్. పర్యావరణ హిత టూరిజాన్ని ప్రోత్సహిస్తున్నాం. 2023 సంవత్సరానికి లేపాక్షి ఉత్తమ పర్యాటక ప్రాంతంగా ఎంపికైంది. దేశంలోనే 3వ ప్రజాదరణ కలిగిన పర్యాటక ప్రాంతంగా ఏపీ ఉందని కేంద్ర పర్యాటక శాఖ వెల్లడించింది. మొదటి స్థానంలోకి తీసుకు వచ్చేందుకు కృషి చేస్తాం. టూరిజంలో అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం. పర్యాటక రంగంలో పెట్టుబడులకు రాయితీలు ఇస్తున్నాం. ఒబెరాయ్ ఏపీలో 7స్టార్ హోటళ్లు ప్రారంభించనుంది. 117 టూరిజం ప్రాజెక్టస్ విశాఖ గ్లోబల్ సమ్మిట్ లో ఎంవోయూలు కుదుర్చుకున్నాం. సీఎం జగన్ పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ దేశంలోనే నెం.1 స్థానంలో ఉంది. టెంపుల్ టూరిజం, నేచర్ టూరిజం కు ప్రాధాన్యత ఇస్తున్నాం. పర్యాటక స్థలాలను అన్యాక్రాంతం కాకుండా కాపాడుతున్నాం. ఏపీ టూరిజం పని చేస్తున్న ఉద్యోగులకు ప్రోత్సాహకంగా అవార్డులు ఇస్తున్నాం.’ అని తెలిపారు. -
భువనేశ్వరి వ్యాఖ్యలకు వరుదు కళ్యాణి కౌంటర్
-
అక్కా చెల్లెళ్లకు డబ్బు పిచ్చి ఎక్కువ
-
Sep 27th 2023: చంద్రబాబు కేసు అప్డేట్స్
Chandrababu Arrest: Petitions in different courts - Live Updates 5:10 PM, సెప్టెంబర్ 27, 2023 కిం కర్తవ్యం.? ► ఢిల్లీ: ఎంపీ గల్లా జయదేవ్ నివాసంలో టిడిపి ఎంపీలతో లోకేష్ మంతనాలు ► పారని లీగల్ వ్యూహంతో దిగాలు పడ్డ చిన బాబు ► ఇప్పట్లో ఏపీకి వెళ్లకపోవడమే మంచిదని లోకేష్‌కు సూచించిన ఎంపీలు ► ఆంధ్రప్రదేశ్‌కు వస్తే లోకేష్‌ను అరెస్ట్ చేస్తారని కొన్ని రోజులుగా ఎల్లోమీడియా వార్తలు ► లోకేష్ వెళ్లగానే అరెస్ట్ కావడానికి అన్ని రకాల అవకాశాలున్నాయన్న ఎంపీలు ► ముందస్తు బెయిల్‌కు ఎలాంటి బలమైన వాదనలు లేవన్న ఎంపీలు ► వెళ్లి అరెస్ట్ అయ్యేకంటే ఇక్కడే హోటల్లో ఉండడమే మంచిదన్న భావనలో లోకేష్ 4:50 PM, సెప్టెంబర్ 27, 2023 ACB కోర్టు : బాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై అక్టోబర్ 4న నిర్ణయం ► చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై వచ్చే నెల నాలుగు విచారణ వాయిదా ► అదే రోజున రెండు వర్గాలు వాదనలు పూర్తి చేయాలని న్యాయమూర్తి ఆదేశం ► మరోసారి వాదనాలు వేయవద్దని చంద్రబాబు లాయర్లకు సూచన ►ఎవరు వాదనలు చెప్పకపోయినా ఆర్డర్ పాస్ చేస్తామన్న న్యాయమూర్తి 4:25 PM, సెప్టెంబర్ 27, 2023 ACB కోర్టులో కస్టడీ, బెయిల్ పిటిషన్లపై కొనసాగుతున్న వాదనలు ► చంద్రబాబును కస్టడీకి ఇవ్వండి, దర్యాప్తు పూర్తి చేస్తాం : CID లాయర్ పొన్నవోలు ► మొన్నటి కస్టడీలో చంద్రబాబు సహకరించలేదు ► ఆధారాలు చూపించడంతో చంద్రబాబు సమాధానాలు దాటవేశారు ► కస్టడీకి ఇస్తే కేసులో పూర్తి కుట్ర కోణం బయటపెడతాం ► విచారణ అక్టోబర్ 5కు వాయిదా వేయాలనుకున్నట్టు చెప్పిన న్యాయమూర్తి ► కస్టడీపై తమ వాదనలు పూర్తి చేయనివ్వాలని విజ్ఞప్తి చేసిన AAG పొన్నవోలు ► విచారణ వాయిదా వేయాలని కోరిన చంద్రబాబు లాయర్లు ► శుక్రవారం వాదనలు వినిపిస్తామన్న బాబు న్యాయవాదులు ► చంద్రబాబు తరపు లాయర్లపై ఏసీబీ కోర్టు ఆగ్రహం ► పిటిషన్ దాఖలు చేస్తారు, పదేపదే వాయిదా వేయాలని ఎందుకు కోరతారు? ► బెయిల్ పిటిషన్ దాఖలు చేసి 17 రోజులైనా వాదనలు ఎందుకు వినిపించడం లేదు? ► విచారణ ఎందుకు ముందుకు జరగనివ్వడం లేదని బాబు లాయర్లను ప్రశ్నించిన జడ్జి ► కోర్టు సమయం వృధా ఎందుకుచ చేస్తున్నారంటూ ప్రశ్నించిన న్యాయమూర్తి ► ఎంతకాలం పిటిషన్‌ను పెండింగ్ లో ఉంచాలి? ► లిఖిత పూర్వక మెమో దాఖలు చేయండి 4:20 PM, సెప్టెంబర్ 27, 2023 హైకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు ఎల్లుండికి వాయిదా ► అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కొనసాగిన వాదనలు ► చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దంటూ కోరిన CID ► ఈ స్కాంలో చంద్రబాబు కుటుంబానికి లబ్ధి చేకూరింది : అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ ► ఏ కేసుకి ఆ కేసు ప్రత్యేకమని కులకర్ణి కేసులో గౌరవ న్యాయస్థానం స్పష్టం చేసింది ► ఒక కేసులో అరెస్ట్ అయితే అన్ని కేసుల్లో అరెస్ట్ అయినట్టు కాదు ► ఒక కేసులో రిమాండ్ విధించినప్పుడు అది మరో కేసుకు వర్తించదు ► మరో కేసులో మళ్లీ రిమాండ్ విధించవచ్చు ► ఈ అంశానికి సంబంధించిన పలు తీర్పును న్యాయమూర్తికి అందజేసిన అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ ► కేసును ఈ నెల 29, శుక్రవారం మధ్యాహ్నంకు వాయిదా వేసిన కోర్టు 4:05 PM, సెప్టెంబర్ 27, 2023 బలమైన ఆధారాలు vs పసలేని వాదనలు : సీనియర్ లాయర్లు ► స్కిల్ స్కాం కేసులో చంద్రబాబువి అత్యంత బలహీనమైన వాదనలు ► తనను అరెస్ట్ చేసిన విధానమే చంద్రబాబు చెప్పుకుంటున్న ఏకైక పాయింట్ ► ఎల్లోమీడియాలో చెప్పేదొకటి, కోర్టుల ముందు వాదించేది ఒకటి ► ప్రజలను నమ్మించడానికి తెలుగుదేశం, ఎల్లో మీడియా అబద్డాల ప్రచారం ► 17A కింద అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి అవసరమంటూ గగ్గోలు ► తప్పు చేయలేదు అని కోర్టు ముందు బలంగా చెప్పుకోలేని దుస్థితి ► కోర్టుల ముందు తప్పనిసరి పరిస్థితుల్లో నిజాల ఒప్పుకోలు ► పీకల్లోతు ఆరోపణలు, ప్రతీ దాంట్లో బాబుకు వ్యతిరేకంగా ఆధారాలు ► ఏకంగా 13 చోట్ల స్వయంగా సంతకాలు చేసిన చంద్రబాబు ► ఈ కేసులో చంద్రబాబు తప్పించుకోవడం కష్టమంటున్న లాయర్లు 3:40 PM, సెప్టెంబర్ 27, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబుకు చుక్కెదురు ► చంద్రబాబు కేసును చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ముందుకు తీసుకెళ్లిన బాబు లాయర్ లూథ్రా చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ : మీకు ఏం కావాలి? సిద్ధార్థ్ లూథ్రా : చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ పై విచారణ జరపాలి చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ : చంద్రబాబుకు రిలీఫ్ కావాలంటే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోండి సిద్ధార్థ్ లూథ్రా : మేం బెయిల్ కావాలని అడగడం లేదు, త్వరగా లిస్ట్ చేయమని అడుగుతున్నాం చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ : అక్టోబర్ 3న ఈ కేసును ఏదో ఒక బెంచ్ కు కేటాయిస్తాం సిద్ధార్థ్ లూథ్రా : 17A సెక్షన్ ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోలేదు, మధ్యంతర ఉపశమనం కావాలని అడుగుతున్నాం చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ : ACB కోర్టు విచారణ జరుపుతున్న ఇలాంటి కీలక సమయంలో మేం దర్యాప్తును అడ్డుకోలేం. సిద్ధార్థ్ లూథ్రా : Z కేటగిరి ఉన్న వ్యక్తిని జైల్లో పెట్టారు, కనీసం CIDకి కస్టడీ ఇవ్వకుండా ఆదేశాలివ్వండి చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ : చంద్రబాబు నాయుడిని పోలీస్ కస్టడీ ఇవ్వొద్దన్న ఆదేశాలను ఈ సమయంలో ఇవ్వలేం. ఈ కేసును అక్టోబర్ 3, 2023, మంగళవారానికి వాయిదా వేస్తున్నాం 3:30 PM, సెప్టెంబర్ 27, 2023 సుప్రీంకోర్టులో CID వాదనలు ► ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున లాయర్ రంజిత్ కుమార్ వాదనలు ► స్కిల్ స్కాం కుట్ర, కుంభకోణం పరిధి చాలా పెద్దవి ► రూ.3300 కోట్ల ప్రాజెక్టు అని చెప్పుకొచ్చారు ► దీంట్లో 90% గ్రాంటు కింద సీమెన్స్ ఇస్తుందని చెప్పారు ► ప్రభుత్వం కేవలం 10% పెడితే చాలంటూ నిధులు విడుదల చేశారు ► ఇక్కడ కథ మలుపు తిరిగింది, 90% మాయమయింది ► ఈ 10% నిధులు మాత్రం ముందుకెళ్లిపోయాయి ► తొలుత ఈ స్కాంను GST అధికారులు గుర్తించారు ► 2018 , పిసి యాక్ట్ - 17ఏ సవరణ రాకముందే నేరం జరిగింది ► ప్రస్తుత పరిస్థితుల్లో దర్యాప్తును సజావుగా సాగనివ్వాలి ► చీఫ్ జస్టిస్ చంద్రచూడ్‌కు విజ్ఞప్తి చేసిన లాయర్ రంజిత్ 3:20 PM, సెప్టెంబర్ 27, 2023 రెండు కేసులు వేర్వేరు, బాబుకు బెయిల్ వద్దు : అడ్వొకేట్ జనరల్ శ్రీరాం ► హైకోర్టు : ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై వాదనలు ► వేర్వేరు కేసుల్లో సెక్షన్ 428 వర్తించదన్న ఏజీ శ్రీరామ్ ► స్కిల్, ఇన్నర్ రింగ్‌రోడ్ కేసుల్లో 2 వేర్వేరు లావాదేవీలు జరిగాయి ► రెండు కేసుల్లో వేర్వేరు నిందితులు ఉన్నారు ► రెండు వేర్వేరు కుట్రలు, రెండు వేర్వేరు కుంభకోణాలు ► ఈ రెండు కేసుల్లోనూ చంద్రబాబు కీలక సూత్రధారి, కీలక పాత్రధారి ► చంద్రబాబుకు బెయిల్ ఇవ్వొద్దు : AP అడ్వొకేట్ జనరల్ శ్రీరాం 3:00 PM, సెప్టెంబర్ 27, 2023 "నాట్ బిఫోర్ మీ" ఎందుకంటే.. ► జస్టిస్ SVN భట్టి పూర్తి పేరు సరస వెంకట నారాయణ భట్టి ► 2013 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జడ్జిగా సేవలందించిన జస్టిస్ భట్టి ► 14 జులై 2023 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలందిస్తోన్న జస్టిస్ భట్టి ► ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మ్యాటర్ కాబట్టి ఈ కేసు నుంచి దూరంగా ఉంటున్నానని ప్రకటించిన జస్టిస్ భట్టి ► జస్టిస్ భట్టి నిర్ణయాన్ని గౌరవించాలని సూచించిన జస్టిస్ ఖన్నా 2:45 PM, సెప్టెంబర్ 27, 2023 చంద్రబాబు పిటిషన్ వాయిదా ► చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ వాయిదా ► పిటిషన్‌పై వాదనల కంటే ముందే ప్రకటన చేసిన జస్టిస్ ఖన్నా జస్టిస్ ఖన్నా : మా సహచరుడు జస్టిస్ SVN భట్టి ఈ కేసుకు దూరంగా ఉండాలనుకుంటున్నారు హరీష్ సాల్వే : వీలయినంత తొందరగా విచారణకు వచ్చేలా చూడగలరు జస్టిస్ ఖన్నా : వచ్చే వారం చూద్దాం సిద్ధార్థ లూథ్రా : ఒక సారి చీఫ్ జస్టిస్ దృష్టికి తీసుకెళ్తాను జస్టిస్ ఖన్నా : మీరు కలవొచ్చు. ప్రస్తుతానికి ఈ కేసు వాయిదా వేస్తున్నాను హరీష్ సాల్వే : వాయిదా వేయడం ఒక్కటే మార్గం కాదు జస్టిస్ ఖన్నా : చీఫ్ జస్టిస్‌ను కలిసి మరో బెంచ్ ముందు వాదనలు వినిపిస్తానని లూథ్రా అంటున్నారు హరీష్ సాల్వే : సోమవారం వాదనలకు అవకాశం ఇవ్వండి జస్టిస్ ఖన్నా : సోమవారం అవకాశం లేదు. వచ్చే వారం తప్పకుండా వింటాం సిద్ధార్థ లూథ్రా : ఒక అయిదు నిమిషాలు నాకు సమయం ఇవ్వండి జస్టిస్ ఖన్నా : సరే, నేను ఆర్డర్ పాస్ చేస్తున్నాను జస్టిస్ ఖన్నా : "ప్రస్తుతం బెంచ్ ముందు ఉన్న ఈ స్పెషల్ లీవ్ పిటిషన్‌ను వచ్చే వారం విచారణకు స్వీకరిస్తాం. ఆ బెంచ్‌లో మా సహచరుడు SVN భట్టి ఉండేందుకు సుముఖంగా లేరు కాబట్టి మరో జడ్జితో కలిసి ఈ కేసును విచారిస్తాం. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తుది ఆదేశాలకు లోబడి ఈ ఆర్డర్ వర్తిస్తుంది". 2:35 PM, సెప్టెంబర్ 27, 2023 నాట్ బిఫోర్ : సుప్రీంకోర్టు ► చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్‌పై స్పందించిన సుప్రీంకోర్టు ► చంద్రబాబు పిటిషన్‌పై "నాట్ బిఫోర్ మి" అని స్పందించిన జస్టిస్ SVN భట్టి ► మరో బెంచ్‌కు పిటిషన్‌ను మార్చాల్సిన అవశ్యకత ► ఈ కేసును విచారించలేనని తేల్చిచెప్పిన జస్టిస్ భట్టి ► బాబు పిటిషన్‌పై వచ్చే వారం విచారణ జరిగే అవకాశం ► రేపటి నుంచి అక్టోబర్ 2 వరకు సుప్రీంకోర్టుకు సెలవులు 2:15 PM, సెప్టెంబర్ 27, 2023 న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు హాల్ నెంబర్ 3కు ఇరుపక్షాల లాయర్లు ► చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్‌పై కొద్దిసేపట్లో విచారణ ► చంద్రబాబు తరపున మరోసారి హరీష్ సాల్వే, సిద్ధార్థ లూథ్రా ► కిక్కిరిసిన హాల్ నెంబర్ 3, వాదనలు వినేందుకు వచ్చిన లాయర్లు, ఇతరులు ► బెంచ్ మీదకు వచ్చిన కేసు 2:10 PM, సెప్టెంబర్ 27, 2023 న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు కిక్కిరిసిన హాల్ నెంబర్ 3 ► మరికొద్దిసేపట్లో స్పెషల్ లీవ్ పిటిషన్‌ను విచారించనున్న సుప్రీంకోర్టు ► విచారణ జరపనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ SVN భట్టి ధర్మాసనం ► ఐటం నెంబర్ 61గా లిస్ట్ అయిన చంద్రబాబు పిటిషన్ ► స్పెషల్ లీవ్ పిటిషన్ నెంబర్ 12289/2023 ► చంద్రబాబు తరపున రికార్డు ప్రకారం అడ్వొకేట్ గుంటూరు ప్రమోద్ ► ఇప్పటికే హేమాహేమీలను రంగంలోకి దించుతామని చెబుతోన్న లోకేష్ ► గత 11 రోజులుగా ఢిల్లీలోనే ఉంటూ సుప్రీంకోర్టు లాయర్లతో లోకేష్ మంతనాలు ► హైకోర్టులో క్వాష్ పిటిషన్ సందర్భంగా బాబు తరపున హరీష్ సాల్వే, సిద్ధార్థ లూథ్రా ► Follow www.sakshi.com LIVE updates 1:56 PM, సెప్టెంబర్ 27, 2023 బాబు దోచుకుంటే.. జగన్ ఫ్రీగా స్కిల్ ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు ► చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కాంపై మండలిలో స్వల్పకాలిక చర్చ.. ఎమ్మెల్సీ తోమాటి మాధవరావు కామెంట్స్ ► స్కిల్ డెవలప్మెంట్ ను స్కామ్ గా మార్చి చంద్రబాబు తన ఆదాయవనరుగా చేసుకున్నారు ► చంద్రబాబు 371 కోట్లు స్కిల్ డెవలప్మెంట్ పేరుతో కొల్లగొట్టాడు. ► ప్రజాధనాన్ని దోచుకుని తాను ఏమీ చేయలేదన్నట్లు మాట్లాడుతున్నాడు ► సీఎం జగన్ మోహన్ రెడ్డి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా విద్యార్థుల భవితకు అండగా నిలుస్తున్నారు ► 26 జిల్లాలలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లఏర్పాటుకు ఒక్కొక్క దానికి ఐదు ఎకరాల భూమిని సీఎం జగన్మోహన్రెడ్డి కేటాయించారు ► సీఎం జగన్.. ప్రభుత్వ నిధుల నుండి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా వివిధ సంస్థల సీఎస్ఆర్ ఫండ్స్ ద్వారా విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు 1:10 PM, సెప్టెంబర్ 27, 2023 హైకోర్టులో నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ ► ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ అలైన్మెంట్ కేసులో A14గా లోకేష్ ► అరెస్ట్ భయంతో గత 11 రోజులుగా ఢిల్లీకే పరిమితమైన లోకేష్ ► తాజాగా ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్ పాత్రను తేల్చిన CID ► లోకేష్‌కు ఏ రకంగా లబ్ది చేకూరిందో తెలుపుతూ A14గా తేల్చిన CID ► తనను అరెస్ట్ చేయకుండా నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ ► ముందస్తు బెయిల్ ఇస్తే పాదయాత్ర చేసుకుంటానంటున్న లోకేష్ 1:00 PM, సెప్టెంబర్ 27, 2023 సుప్రీంకోర్టులో లంచ్ బ్రేక్ తర్వాతే చంద్రబాబు కేసు ► ఢిల్లీ: సుప్రీం కోర్టు లో లంచ్ బ్రేక్ ► లంచ్ బ్రేక్ తర్వాతే చంద్రబాబు కేసు విచారణ ► లంచ్ కోసం బెంచ్ నుంచి లేచిన జస్టిస్ సంజీవ్ కన్నా జస్టిస్ SVN భట్టి ► మధ్యాహ్నం రెండు గంటల తర్వాత తిరిగి ప్రారంభం కానున్న విచారణ ► ఐటెం నెం.61 గా ఉన్న చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ 12:50 PM, సెప్టెంబర్ 27, 2023 ఈ ప్రశ్నలకు సమాధానాలున్నాయా? ► ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ అలైన్‌మెంట్‌పై టిడిపికి YSRCP ఏడు ప్రశ్నలు 1. అలైన్మెంట్ ఖరారుకు ముందు లింగమనేని ఎకరాను రూ.8 లక్షలకు విక్రయించారు, అలైన్మెంట్ తర్వాత రూ.36 లక్షల రిజిస్టర్ విలువ చూపించారు. అంటే రిజిస్టర్ విలువే నాలుగున్నర రెట్లకు పైగా పెరిగింది వాస్తవం కాదా? 2. మార్కెట్ ధర ప్రకారం ఎకరా రూ.2.50 కోట్లు పలికింది. 355 ఎకరాల విలువ మార్కెట్ ధర ప్రకారం అమాంతంగా రూ.887.50 కోట్లకు పెరిగింది వాస్తవం కాదా? 3. అమరావతి నిర్మాణం పూర్తయితే సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో ఎకరా విలువ రూ.4 కోట్లకు చేరుతుందని నాడు సీఎం హోదాలో చంద్రబాబే ప్రకటించింది వాస్తవం కాదా? 4. ఇన్నర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న భూముల విలువ ఎకరా రూ.6 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది వాస్తవం కాదా? 5. అమరావతి నిర్మాణం పూర్తయితే ఇన్నర్ రింగ్ రోడ్డు పక్కనున్న 355 ఎకరాల విలువ ఏకంగా రూ.2,130 కోట్లకు చేరుతుందని అంచనా వాస్తవం కాదా? 6. ఆ ప్రకారం మార్కెట్ ధరను బట్టి హెరిటేజ్‌ఫుడ్స్ 10.4 ఎకరాల మార్కెట్ విలువ రూ.5.20 కోట్ల నుంచి రూ.41.6 కోట్లకు కోట్లు పెరిగిందన్నది వాస్తవం కాదా? 7. ఇన్నర్ రింగ్ రోడ్డే లేదు.. స్కాం జరగలేదంటారు.. మరి ఇన్నాళ్లు ప్రజలకు రాజధాని కట్టామని ఎందుకు చెప్పారు? చంద్రబాబు సృష్టించిన సంపద అంటే మాయా ప్రపంచమేనా? 12:40 PM, సెప్టెంబర్ 27, 2023 లోకేష్ జోలికి రావొద్దు : తెలుగుదేశం ► అర్జంటుగా భుజాలు తడుముకుంటోన్న తెలుగుదేశం బృందం ► లోకేష్‌ను A14గా అభియోగాలు మోపుతూ కోర్టులో CID పిటిషన్ ► A14 అని తెలియగానే ఢిల్లీలో చిందులు తొక్కిన చినబాబు ► ఏమైనా చేయండి, నాపై కేసును ఖండించాలని టిడిపి నేతలకు ఆదేశం ► ఆఘమేఘాల మీద పవర్ పాయింట్ ప్రజంటేషన్ పెట్టిన పంచుమర్తి అనురాధ ► అసలు మేం రాజధానే కట్టలేదు, ఇక ఇన్నర్ రింగ్ రోడ్డు ఎక్కడిది? : పంచుమర్తి ► అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకు భూమి సేకరించలేదు, బడ్జెట్ కేటాయించలేదు ► హెరిటేజ్‌కు ప్రయోజనం చేకూర్చారన్న ఆరోపణలు కూడా సరికాదు ► లింగమనేనికి అనుకూలంగా ఇన్నర్ రింగ్ రోడ్ తయారు చేశారని ఎలా చెబుతారు?: పంచుమర్తి ► TDP తీరును తప్పుబట్టిన YSRCP, ఇదే విషయం కోర్టులో చెప్పగలరా? : YSRCP ► CID చూపించిన ఆధారాలకు ఏమని సమాధానం చెబుతారు? : YSRCP 12:10 PM, సెప్టెంబర్ 27, 2023 ACB కోర్టులో మీ నిర్ణయమేంటీ? ► కస్టడీ, బెయిల్ పిటిషన్‌పై CID, బాబు లాయర్ల వాదనలు ► వెంటనే వాదనలు వినాలన్న CID లాయర్లు ► సుప్రీంకోర్టులో SLP ఉన్నందున దాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్న బాబు లాయర్లు ► వాదనల విషయంలో ఒక నిర్ణయానికి రావాలని ఇరుపక్షాల లాయర్లకు కోర్టు సూచన ► సాయంత్రం 5గంటలలోపు వాదనలపై ఏకాభిప్రాయానికి వస్తే వింటామన్న న్యాయమూర్తి 11:40 AM, సెప్టెంబర్ 27, 2023 కోర్టుల మీద నోరు పారేసుకుంటారా? క్రిమినల్ కేసు పెట్టమని హైకోర్టు సీరియస్ ► చంద్రబాబు అరెస్టు తర్వాత న్యాయవ్యవస్థపై దుర్మార్గపు వ్యాఖ్యలు చేసిన ఎల్లో బ్యాచ్ ► నిందలు, ఆరోపణలు, విమర్శలు చేసిన పచ్చ మీడియా, టిడిపి నేతలు ► హైకోర్టు జడ్జిలు, దిగువ కోర్టు న్యాయమూర్తులపై దూషణలకు దిగిన గ్యాంగ్ ► ఈ వ్యవహారం అడ్వొకేట్ జనరల్ శ్రీరాం దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు ► ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ ► తెలుగుదేశం నాయకులు, సానుభూతి పరులు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన హైకోర్టు ► టిడిపి నేతలు బుచ్చయ్య చౌదరీ, బుద్ధా వెంకన్న, రామకృష్ణ సహా 26 మందికి నోటీసులు ► ట్రోల్ చేసిన సోషల్ మీడియా ఖాతాలకు నోటీసులు ఇవ్వాలని AP DGPకి ఆదేశం ► బుద్ధా వెంకన్న ► గోరంట్ల బుచ్చయ్య చౌదరీ ► ఎస్. రామకృష్ణ ► రామకృష్ణ గోనె ► మువ్వా తారక్ కృష్ణ యాదవ్ ► రవికుమార్ ముదిరాజు ► రుమాల రమేష్ ► ఎల్లా రావు ► కళ్యాణి ► అకౌంట్ : @NCHIRAN17457886 ► అకౌంట్ : In Jesus New Life @ NewIN34229 ► అకౌంట్ : @TrueAPDeveloper ► అకౌంట్ : Mosapu ► అకౌంట్ : Jail Jj ► అకౌంట్ : The Ark @ArkTheAce ► అకౌంట్ : @EdukondaluMupp2 ► అకౌంట్ : @Royanenenu ► అకౌంట్ : @Wish_cap ► అకౌంట్ : @Cdattu ► అకౌంట్ : @Bean9989 ► అకౌంట్ : Chary Veda ► అకౌంట్ : Paramasivaiah Gsanju Chandu ► అకౌంట్ : SriKishore Kumar ► సంస్థ : గూగుల్ ఇండియా ► సంస్థ : ట్విట్టర్ ఇండియా ► సంస్థ : ఫేస్బుక్ ఇండియా 11:30 AM, సెప్టెంబర్ 27, 2023 అసెంబ్లీలో చంద్రబాబు అసలు రంగు బయటపెట్టిన MLA వరప్రసాద్ ► వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు ► ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 23 మంది ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకున్నాడు ► ఓటుకు కోట్లు అనే కాన్సెప్ట్‌ను చంద్రబాబు ఎప్పటినుంచో అనుసరిస్తున్నాడు ► తిరుపతి ఎంపీగా నేను ఉన్నప్పుడు టిడిపిలో చేరమని ఒత్తిడి తెచ్చాడు ► ఒకటి కాదు..రెండు కాదు.. వంద కోట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చాడు ► చంద్రబాబు లాంటి దిగజారిన రాజకీయాలు చేసే వ్యక్తి ఇంకొకరు లేరు 11:15AM, సెప్టెంబర్ 27, 2023 ACB కోర్టులో బాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లు ► ACB కోర్టుకు చేరుకున్న ఇరు వర్గాల న్యాయవాదులు ► కస్టడీ పిటిషన్ పై విచారణ చేయాలన్న CID లాయర్ వివేకానంద ► బెయిల్ పిటిషన్ పై వాదనలు వినాలన్న చంద్రబాబు లాయర్ ప్రమోద్ దూబే ► మధ్యాహ్నం 12 గంటల తర్వాత వాదనలు వింటానన్న న్యాయమూర్తి 11:10AM, సెప్టెంబర్ 27, 2023 సుప్రీంకోర్టు ఏం తేల్చబోతుంది? ► అందరి చూపు సుప్రీంకోర్టు వైపు ► చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్లో నేడు వాదనలు జరిగే అవకాశం ► చంద్రబాబు తరపున దేశంలోనే అత్యంత ఖరీదైన లాయర్లు ► అరెస్ట్ జరిగిన తీరును ప్రశ్నిస్తూ పిటిషన్ వేసిన బాబు లాయర్లు ► 17A సెక్షన్ ప్రకారం గవర్నర్‌కు చెప్పలేదంటూ సాంకేతిక అంశాలు ► హైకోర్టులో ఇదే అంశంపై వాదనలు, బాబు లాయర్ల వాదనను తిరస్కరించిన కోర్టు ► కేసు కీలక దశలో ఉంది, దర్యాప్తును నిలిపివేయలేమని తేల్చిచెప్పిన హైకోర్టు ► ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం తేల్చబోతుందన్న దానిపై ఉత్కంఠ ► రేపటి నుంచి అక్టోబర్ 3వరకు సుప్రీంకోర్టుకు సెలవులు 11:00AM, సెప్టెంబర్ 27, 2023 ఏసీబీ కోర్టు ముందుకు చంద్రబాబు పిటిషన్లు ► చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విచారణ జరిగే అవకాశం ► విచారణ కోసం జడ్జి ముందు మెన్షన్ చేసిన చంద్రబాబు లాయర్లు ► రెండు పిటిషన్లను విచారించి ఉత్తర్వులు ఇస్తామని తెలిపిన జడ్జి ► స్కిల్ డెవలప్ మెంట్ కేసులో బెయిల్ కోరుతూ చంద్రబాబు పిటిషన్ ► చంద్రబాబును మరో 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ పిటిషన్ 10:50AM, సెప్టెంబర్ 27, 2023 హైకోర్టు ముందుకు ఉండవల్లి అరుణ్‌కుమార్ పిటిషన్ ►హైకోర్టు చీఫ్ జస్టిస్ ముందుకు మాజీ ఎంపీ ఉండవల్లి పిటిషన్ ►ఇప్పటికే బెంచ్‌ను కేటాయించిన హైకోర్టు రిజిస్ట్రీ ►పిల్ విచారించేందుకు తమలో ఒకరికి అభ్యంతరం ఉందని పేర్కొన్న బెంచ్ ►నాట్ బి ఫోర్ మీ అని పేర్కొన్న జస్టిస్ రఘునందన్ రావు ►మరో బెంచ్‌కు వెంటనే బదిలీ చేయాలని ఆదేశించిన చీఫ్ జస్టిస్ ►ప్రజా ప్రయోజనవ్యాజ్యానికి రిట్ నెంబర్ 38371/2023 కేటాయింపు ►చంద్రబాబు A1గా ఉన్న స్కిల్ స్కాం పరిధి చాలా పెద్దదని పేర్కొన్న ఉండవల్లి ►ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థలు CBI, ED, ITలకు అప్పగించాలని విజ్ఞప్తి ►నిధులు పక్కదారి పట్టించేందుకు ఇతర ప్రాంతాల్లో షెల్ కంపెనీలు ఏర్పాటయ్యాయి ►ఈ కంపెనీల గుట్టు బయటపడాలంటే సమగ్ర దర్యాప్తు అవసరం ►కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలన్నీ ఏకమై విచారణ చేస్తేనే కుట్ర బహిర్గతమవుతుంది ►ఈ కుంభకోణంలో చంద్రబాబు పాత్ర పై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలి ►44 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ రిట్ పిటీషన్ దాఖలు ►హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ రఘునందన్ రావు బెంచ్ ముందుకు పిటిషన్ 10:30AM, సెప్టెంబర్ 27, 2023 తప్పు చేయలేదని చెప్పడం లేదు, అరెస్ట్‌ను తప్పుపడుతున్నారంతే.! ►నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు విచారణ ►విచారణ చేయనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్విఎన్ భట్టి ధర్మాసనం ►ఐటం నెంబర్ 61 గా లిస్ట్ అయిన బాబు కేసు ►తన క్వాష్ పిటిషన్‌ను డిస్మిస్ చేసిన హైకోర్టు తీర్పును కొట్టేయాలని అభ్యర్థన ►తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ , రిమాండ్ ను రద్దు చేయాలని పిటిషన్ లో వినతి ►అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ తనకు వర్తిస్తుందని వాదన ►గవర్నర్ అనుమతి లేకుండా తన అరెస్టు చేయడం చట్ట విరుద్ధమని పిటిషన్ లో వెల్లడి 10:00AM, సెప్టెంబర్ 27, 2023 తప్పు చేయలేదని చెప్పడం లేదు, అరెస్ట్‌ను తప్పుపడుతున్నారంతే.! ►అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ తనకు వర్తిస్తుందని చంద్రబాబు వాదన ►గవర్నర్ అనుమతి లేకుండా తన అరెస్టు చేయడం చట్ట విరుద్ధమని పిటిషన్ లో వెల్లడి ►కానీ, 17 (ఏ) సెక్షన్ చంద్రబాబుకు వర్తించదని హైకోర్టు స్పష్టీకరణ ►ఈ క్రమంలోనే క్వాష్ పిటిషన్ కొట్టివేత కూడా ► ఆ వెంటనే సుప్రీంలో చంద్రబాబు క్వాష్ పిటిషన్ ►తన క్వాష్ పిటిషన్ ను డిస్మిస్ చేసిన హైకోర్టు తీర్పును కొట్టేయాలని అభ్యర్థన ►తనపై నమోదైన స్కిల్ స్కాం కేసును కొట్టివేయాలని పిటిషన్ ►తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ , రిమాండ్ ను రద్దు చేయాలని పిటిషన్ లో వినతి.. నేడు విచారణ 09:22AM, సెప్టెంబర్ 27, 2023 ముందు ఏ పిటిషన్‌పై విచారణ? ►ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటీషన్లపై విచారణ ►చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలని కోరిన చంద్రబాబు తరపు న్యాయవాదులు ►రెండురోజుల కస్టడీలో చంద్రబాబు సహకరించలేదని, మరో ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ అధికారుల పిటిషన్ ►ఏ పిటిషన్ పై ముందు వాదనలు జరుపుతామనేది ఈ రోజు ప్రకటించనున్న కోర్టు ►ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో పిటి వారెంట్, ఏపి ఫైబర్ నెట్ కేసులో పిటి వారెంట్ పైనా ఈరోజు వాదనలు జరిగే అవకాశం ►ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాం కేసులో నారా లోకేష్ ను A14గా చేర్చి ఇంచార్జి ఎమ్ఎస్ జే కోర్టులో మెమో దాఖలు చేసిన సీఐడీ ►లోకేష్ పేరుతో కూడిన మెమోపై కూడా ఇవాళ విచారణ జరిగే అవకాశం.. 09:10AM, సెప్టెంబర్ 27, 2023 అసెంబ్లీ సమావేశాల్లో బాబు స్కామ్‌లపై చర్చ ►ఏపీ అసెంబ్లీ సెషన్.. చివరిరోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. ►పలు బిల్లులతో పాటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణంపై చర్చ జరగనుంది. ►అలాగే శాసనమండలిలో స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంపైనా చర్చ జరగనుంది 08:55AM, సెప్టెంబర్ 27, 2023 లోకేష్ పాత్ర ఉందనే ఫిర్యాదు చేశా: ఎమ్మెల్యే ఆర్కే ►ఇన్నర్ రోడ్ స్కాంలో లోకేష్ పాత్ర ఉందనే సీఐడీకి ఫిర్యాదు చేశా ►చట్టాలు గౌరవిస్తానని చెప్పే చంద్రబాబు, లోకేస్.. కోర్టు విషయంలో ఎందుకు భయపడుతున్నారు ►ఇన్నర్ రింగ రోడ్ అలైన్మెంట్ విషయంలో తన వారికి లబ్ధి చేకూరే విధంగా మార్పు చేశారనేది స్పష్టం. 08:00AM, సెప్టెంబర్ 27, 2023 తండ్రీకొడుకుల ఆట ముగిసింది: ఎంపీ విజయసాయిరెడ్డి ►తండ్రి ఎలాగో కొడుకు అలాగే! ►ఇన్నర్ రింగ్ రోడ్ స్కాంలో నారా లోకేష్ A14ని కలవండి. ►ఢిల్లీలో ఉన్నప్పుడు తను కలిసే లాయర్లకు బై-వన్-గెట్-వన్-ఫ్రీ స్కీమ్ అందించాలి. ►తండ్రి కేసును టేకప్ చేయండి.. కొడుకు కేసును ఉచితంగా పొందండి ►ఈ తండ్రీకొడుకుల ఆట ఇప్పుడు ముగిసింది. Like father, Like son! Meet Nara Lokesh A14 in the Inner Ring Road scam. While in Delhi he should offer a buy-one-get-one-free scheme to the lawyers he is meeting. Take up the father’s case and you’ll get the son's case for free. This father-son duo’s game is now over. pic.twitter.com/JIhpnXrA8R — Vijayasai Reddy V (@VSReddy_MP) September 27, 2023 06:52AM, సెప్టెంబర్ 27, 2023 క్రిమినల్ కంటెంప్ట్ పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ ►హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన ఏజీ ►నేడు విచారిస్తామన్న హైకోర్టు డివిజన్ బెంచ్ 06:52AM, సెప్టెంబర్ 27, 2023 నేడు చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్ల పై ఏసీబీ కోర్టులో విచారణ ►బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్ల పై విచారణ నేటికి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు ►రెండు పిటిషన్ల పై నేడు విచారణ జరిపి ఉత్తర్వులు ఇస్తామన్న ఏసీబీ కోర్టు ►చంద్రబాబును మరో 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ ►సీఐడీ వేసిన కస్టడీ పిటిషన్ లో కౌంటర్ దాఖలు చేసిన చంద్రబాబు న్యాయవాదులు 06:45AM, సెప్టెంబర్ 27, 2023 నేడు హైకోర్టులో అమరావతి రింగ్ రోడ్డు కేసు విచారణ ►అమరావతి రింగ్ రోడ్డు కేసు విచారణను నేటికి వాయిదా వేసిన హైకోర్టు ►మధ్యాహ్నం 2.15 గం.కు వాదనలు వింటామన్న హైకోర్టు ►రింగ్ రోడ్డు కేసులో బెయిల్ కోరుతూ హైకోర్టులో చంద్రబాబు పిటిషన్ 06:44AM, సెప్టెంబర్ 27, 2023 నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు విచారణ ►విచారణ చేయనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్విఎన్ భట్టి ధర్మాసనం ►ఐటెం నెం.61 గా లిస్ట్ అయిన బాబు కేసు ►తన క్వాష్ పిటిషన్ ను డిస్మిస్ చేసిన హైకోర్టు తీర్పును కొట్టేయాలని అభ్యర్థన ►తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ , రిమాండ్ ను రద్దు చేయాలని పిటిషన్ లో వినతి ►అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ తనకు వర్తిస్తుందని వాదన ►గవర్నర్ అనుమతి లేకుండా తన అరెస్టు చేయడం చట్ట విరుద్ధమని పిటిషన్ లో వెల్లడి 06:00AM, సెప్టెంబర్ 27, 2023 రాజమండ్రి జైల్లో చంద్రబాబు @18 ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో 18వ రోజుకు చేరుకున్న చంద్రబాబు రిమాండ్. ► స్కిల్‌డెవలప్‌మెంట్ స్కామ్‌లో సెప్టెంబర్ 9వ తేదీన నంద్యాలలో అదుపులోకి తీసుకున్న ఏపీ సీఐడీ ► ఏసీబీ కోర్టు రిమాండ్‌తో ఖైదీ నెంబర్ 7691గా రాజమండ్రి సెంట్రల్ జైలు స్నేహా బ్లాక్‌లో చంద్రబాబు ► రెండుసార్లు జ్యూడీషియల్ రిమాండ్ పొడిగింపు ► తాజా పొడిగింపుతో అక్టోబర్ 5వ తేదీ వరకు జైల్లోనే చంద్రబాబు -
చంద్రబాబుని ముంచింది లోకేష్, భువనేశ్వరే అంటున్న కొడాలి నాని
-
చంద్రబాబు ఏం చేశాడో ఢిల్లీకి వెళ్తే తెలుస్తోంది: రోజా
-
చెవిలో పువ్వు పెట్టిన భువనేశ్వరి
-
హెరిటేజ్ విలువెంత? భువనేశ్వరి మాటల్లో నిజమెంత?
స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. గత ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో రూ.371.25 కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారని చంద్రబాబుపై అభియోగాలు ఉన్నాయి. దీంతో సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా ‘మా కుటుంబానికి ప్రజల డబ్బు అవసరం లేదు. నేనూ ఓ కంపెనీని నడుపుతున్నా. అందులో 2 శాతం అమ్ముకున్నా నాకు రూ.400 కోట్లు వస్తాయి. ప్రజల సొమ్ము మాకు అక్కర్లేదు’ అంటూ హెరిటేజ్ కంపెనీని ఉద్దేశిస్తూ చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి తాజాగా పేర్కొన్నారు. ఆమె లెక్క ప్రకారం హెరిటేజ్ కంపెనీ విలువ రూ.20 వేల కోట్లు. ఇదీ.. హెరిటేజ్ అసలు విలువ 1992లో పెట్టిన హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ కంపెనీకి నారా భువనేశ్వరి మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం.. 2023 సెప్టెంబర్ 21 నాటికి హెరిటేజ్ కంపెనీ విలువ (మార్కెట్ క్యాప్) రూ.2,181 కోట్లు. 2023లో ఆ కంపెనీ రెవెన్యూ రూ.3,241 కోట్లు. ఇక నెట్‌వర్త్ చూసుకుంటే రూ.756 కోట్లు. నోటికొచ్చిన లెక్కలు హెరిటేజ్ కంపెనీ ప్రస్తుత మార్కెట్ విలువ రూ. 2,181 కోట్లు. అందులో 1 శాతం అంటే రూ. 21 కోట్లు. 2 శాతం అంటే రూ. 42 కోట్లు. వాస్తవ విలువ ఇలా ఉంటే తమ కంపెనీలో కేవలం 2 శాతం అమ్ముకుంటే చాలు రూ.400 కోట్లు వస్తాయని నారా భువనేశ్వరి చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న ఆమె ఇలా నోటికొచ్చిన లెక్కలు చెప్పడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. -
బాబు బాటలోనే భువనేశ్వరి
సాక్షి, అమరావతి: కళ్లు మూయకుండా అబద్ధాలు చెప్పడంలో సిద్ధహస్తుడిగా పేరొందిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బాటలోనే ఆయన సతీమణి భువనేశ్వరి కూడా ప్రయాణిస్తున్నారు. సోమవారం కాకినాడ జిల్లా జగ్గంపేటలో తెలుగుదేశం పార్టీ నాయకులను కలిసి తొలిసారిగా రాజకీయ ప్రసంగం చేస్తూ అబద్ధాలను అలవోకగా వల్లెవేశారు. స్కిల్ కుంభకోణాన్ని కప్పిపుచ్చుకునేందుకు అమాంతంగా తమ హెరిటేజ్ కంపెనీ విలువను పెంచేశారు. రూ.371 కోట్ల కోసం తాము కక్కుర్తి పడ¯నక్కర్లేదని, హెరిటేజ్‌లో రెండు శాతం వాటా అమ్ముకుంటే తమకు రూ.400 కోట్లు వస్తాయంటూ కార్యకర్తలను నమ్మించే ప్రయత్నం చేశారు. రెండు శాతానికి రూ.400 కోట్లు అంటే హెరిటేజ్ కంపెనీ విలువ రూ.20,000 కోట్లుగా ఉండాలి. కానీ సోమవారం స్టాక్ మార్కెట్ గణాంకాల ప్రకారం హెరిటేజ్ మార్కెట్ క్యాప్ అంటే కంపెనీ మొత్తం విలువ రూ.2,171 కోట్లు మాత్రమే. ఈ ప్రకారం చూస్తే రెండు శాతం వాటా విక్రయిస్తే భువనేశ్వరి చేతికి వచ్చేది కేవలం రూ.43.2 కోట్లు మాత్రమే. మరి రెండు శాతం అమ్మితే రూ.400 కోట్లు వస్తాయంటూ ఎలా చెప్పారంటూ స్టాక్ మార్కెట్ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మా కంపెనీలో 2% వాటా అమ్మినా రూ.400 కోట్లు వస్తాయ్.. జగ్గంపేట/అన్నవరం: మా కంపెనీ(హెరిటేజ్)లో 2 శాతం వాటా అమ్మినా రూ.400 కోట్లు వస్తాయని.. బినామి కంపెనీ పేరుతో చంద్రబాబు కోట్లాది రూపాయలు కాజేశారన్న ఆరోపణల్లో నిజం లేదని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చెప్పారు. చంద్రబాబు అరెస్టుకు నిరసగా కాకినాడ జిల్లా జగ్గంపేటలో జరుగుతున్న నిరాహర దీక్షల శిబిరాన్ని ఆమె సోమవారం సందర్శించారు. శిబిరంలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల సొమ్ము తమకు వద్దని.. తమ కుటుంబం ప్రజా సేవకే అంకితమైందని, తన భర్త చంద్రబాబు ఏ తప్పు చేయలేదని.. అయినా జైల్లో పెట్టారని చెప్పారు. ఓట్ల తొలగింపునకు కుట్ర జరుగుతోందని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి ఓట్లు పోకుండా కాపాడుకోవాలని సూచించారు. అనంతరం టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో చేపట్టిన లక్ష సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం జరిగే అన్న సంతర్పణ కార్యక్రమాన్నీ ప్రారంభించారు. ఇదిలా ఉండగా, నారా భువనేశ్వరి రత్నగిరిపై సత్యదేవుని దర్శించుకున్నారు. చంద్రబాబు వెంటనే జైలు నుంచి విడుదలవ్వాలని పూజలు చేశారు. వేదపండితులు ఆమెకు ఆశీస్సులు అందజేశారు. ఆమె వెంట పార్టీ నేతలు యనమల రామకృష్ణుడు, వరుపుల సత్యప్రభ, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తదితరులున్నారు. -
అమ్మా.. భార్య అంటే ఇలా ఉండకూడదు..
-
‘మీ నాన్నపై చెప్పులు వేయించింది కూడా ప్రజల కోసమేనా?’
సాక్షి, హైదరాబాద్: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు నాయుడు.. జైల్లో కూడా ప్రజల కోసమే ఆలోచిస్తారని ఆయన భార్య నారా భువనేశ్వరి సానుభూతి రాజకీయం చేయడంపై ఏపీఎఫ్డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి మండిపడ్డారు. ఈరోజు(శనివారం) మీడియాతో మాట్లాడిన పోసాని.. ‘ చంద్రబాబు జైల్లో సైతం ప్రజల కోసమే ఆలోచిస్తున్నాడని అనటం దుర్మార్గం. ఆనాడు మీ నాన్న ఎన్టీఆర్‌ను చెప్పులతో కొట్టించింది కూడా ప్రజల కోసమేనా?, మీనాన్నని వెన్నుపోటు పొడిచింది ప్రజలకోసమేనా’ అని ప్రశ్నించారు పోసాని. ఎన్టీఆర్ పదవిని చంద్రబాబు అక్రమంగా లాక్కున్నారు., ఎన్టీఆర్‌పై చెప్పులతో దాడి చేయించింది కూడా చంద్రబాబే. ఈ విషయాలు నారా భువనేశ్వరికి గుర్తులేవా? అని నిలదీశారు. ఇదిలా ఉంచితే, రాజమహేంద్రవరం కేంద్రకారాగారంలో కుట్రలు అంటూ ఈనాడు రామోజీరావు కథనాలు రాస్తుండటంపై సైతం పోసాని ధ్వజమెత్తారు. రామోజీరావు రాజకీయ వ్యభిచారం చేస్తున్నారంటూ విమర్శించారు. జైలు సూపరెంటింటెండ్ రాహుల్ భార్య అనారోగ్యం మృతి చెందితే రామోజీరావు పిచ్చి రాతలు రాయడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. ‘ఓ మహిళ చనిపోతే రామోజీ పిచ్చి రాతలు రాశారు. రామోజీ చనిపోతే ఆయన కుటుంబ సభ్యులు వెళ్లరా?, రాజమండ్రి జైలర్‌పై ఈనాడు తప్పుడు కథనాలు రాసింది. తన భార్య అనారోగ్యం కారణంగా రాహుల్ లీవ్ పెట్టారు. అందుకే వేరే అధికారికి ఆ బాధ్యతలు అప్పగించారు’ అని పోసాని స్పష్టం చేశారు. ఈనాడు, టీవీ5 ఎంత ఏడ్చినా ప్రజలు వైఎస్ జగన్ వెంటే ఉన్నారన్నారు పోసాని. చదవండి: Babu : కేవలం ఆ కులానికే నాయకుడా? -
ఇదంతా చంద్రబాబుకి తెలిస్తే ఫీల్ అవ్వరా?
ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ‘నైపుణ్యాభివృద్ది సంస్థ కుంభకోణం’లో చిక్కి జైలు పాలు కావడంతో.. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏమి అవుతుందో అనే చర్చ సర్వత్రా జరుగుతోంది. పార్టీపై ఇప్పటికే పట్టు సడలుతున్న తరుణంలో.. పులిమీద పుట్రలా చంద్రబాబుపై కేసులు రావడం ఆ పార్టీకి శరాఘాతంగా మారింది. ఆయన కుమారుడు లోకేష్ కూడా కేసులలో ఉండడం ఆ పార్టీ క్యాడర్‌కు మరింత ఆందోళనకరంగా మారింది. ఇదే టైమ్‌లో పార్టీ ఆఫీస్‌లో చంద్రబాబు వియ్యంకుడు , హిందుపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హల్ చల్ చేయడం పార్టీని మరింత గందరగోళంలో పడేసింది. ఇవి చాలవన్నట్లు కొద్ది రోజుల క్రితం తెలుగుదేశంకు మద్దతు ఇచ్చే ఆంధ్రజ్యోతి పత్రికలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి.. రంగంలోకి రావాలని, టూర్లు చేయాలని సూచించడం ఆ పార్టీలో ఏర్పడిన అయోమయ స్థితికి దర్పణం పడుతోంది. ఈ మధ్యకాలంలో చంద్రబాబు.. కొన్ని పేర్లతో రాష్ట్రంలో పర్యటిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దూషణలు చేస్తూ, కార్యకర్తలను రెచ్చగొడుతూ ప్రసంగాలు సాగించారు. అలాగే యువగళం పాదయాత్ర పేరిట లోకేష్ కార్యకర్తలలో గరళం నూరిపోస్తూ.. హింసకు ప్రేరిపిస్తూ వచ్చారు. వాటి ఫలితంగా పలు చోట్ల టీడీపీ కార్యకర్తలు వందల సంఖ్యలో కేసుల పాలై జైళ్లలో పడ్డారు. వాళ్లను ఆదుకునే పరిస్థితి టీడీపీ నాయకత్వానికి లేకుండా పోయింది. ఎన్ని ఎక్కువ కేసులు నమోదు అయితే.. ఆ వ్యక్తికి అంత పెద్ద పదవి ఇస్తామని లోకేష్ ప్రచారం చేశారు. ఇప్పుడు ఆయన తండ్రే రాజమండ్రి జైలులో ఉండవలసి వచ్చింది. దాంతో ఢిల్లీ నుంచి పెద్ద,పెద్ద లాయర్లను ప్రత్యేక విమానాలలో రప్పించి కోర్టులలో వాదనలు చేయిస్తున్నారు. వారేమో అవినీతి జరగలేదని చెప్పలేకపోతున్నారు. కేవలం సాంకేతిక అంశాలపైనే వాదనలు చేస్తుండడంతో పార్టీ క్యాడర్‌కు తమ నేత అవినీతి చేసి దొరికిపోయాడన్న భావన నెలకొంది. అదే టైమ్ లో చంద్రబాబు,లోకేష్‌ల మాట నమ్మి హింసాకాండకు తెగపడ్డ కార్యకర్తలు ,స్థానిక నేతలు దిక్కులేక అల్లాడుతున్నారు. వారిలో ఆర్ధికంగా స్థితిమంతులైనవారు కొద్దిమంది ముందస్తు బెయిల్ పొందినా, తొంభై శాతం మంది జైళ్లలోనే మగ్గవలసి వచ్చింది. దాంతో టీడీపీ క్యాడర్‌కు కనువిప్పు అయింది. ✍️ చంద్రబాబు, లోకేష్‌లు తమ పరపతి ఉపయోగించి.. పెద్ద,పెద్ద లాయర్లను కాకపోయినా, ఓ మోస్తరు లాయర్లను పెట్టి తమను ఎలాగో కేసుల నుంచి బయటవేస్తారని భావించిన కార్యకర్తలకు సీన్ రివర్స్ అవడం జీర్ణం కావడం లేదు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడే బెయిల్ కోసం ఎదురు చూడవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ వాతావరణం అంతా టీడీపీకి పెద్ద షాక్‌గా మారింది. వాస్తవ పరిస్థితి అర్ధం అయ్యేసరికి టీడీపీ నాయకత్వం బంద్ కాల్ ఇచ్చినా.. పెద్దగా బయటకు రాకుండా క్యాడర్ జాగ్రత్తపడింది. కొందరు నేతలైతే పోలీసులను అభ్యర్ధించి మరీ హౌస్ అరెస్టు అయ్యారు. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు పాత్ర లేదని ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటివి ఎంత ప్రచారం చేసినా.. నమ్మలేకపోతున్నారు. దానికి కారణం.. కోర్టు చంద్రబాబును రిమాండ్ విధించి.. రాజమండ్రి జైలుకు పంపడమే!. చంద్రబాబు రిమాండ్ వెనుక.. ప్రాథమిక ఆధారాలు లేకుండా కోర్టు ఇలా చేయరన్న సంగతిని వాళ్లు(టీడీపీ క్యాడర్) అర్ధం చేసుకున్నారు. వైఎస్సార్సీపీ నేతలు కాని, మంత్రులు.. అధికారులు కాని ఆ స్కామ్‌లో చంద్రబాబు పాత్రను ఆధారసహితంగా చెబుతుండడంతో టీడీపీ క్యాడర్‌కు వాస్తవ పరిస్థితి అర్ధం అవుతోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబును అరెస్టు చేసి నంద్యాల నుంచి విజయవాడకు తీసుకు వచ్చినా, విజయవాడ నుంచి రాజమండ్రి జైలుకు తీసుకు వెళ్లినా రోడ్ల వెంట నిలబడి ఆయనకు కనీసం సంఘీభావం కూడా తెలపలేదు. ✍️ ఇక చంద్రబాబుకు బెయిల్ కోసం కాకుండా.. ఇతరత్రా పిటిషన్లు ఆయన లాయర్లు వేయడంతో ఆయన ఎప్పుడు బయటకు వస్తారో తెలియదు. ఈ కేసులో చంద్రబాబును తప్పించాలని కోరుతూ క్వాష్ పిటిషన్ వేసినా.. అది ఏమవుతుందో తెలియదు. కాని, ఈలోగా చంద్రబాబు జైలులోనే గడపవలసి రావడం పార్టీ క్యాడర్‌ను డీమోరలైజ్ చేస్తోంది. అందుకే పార్టీ నాయకత్వం ఎన్ని రకాలుగా పిలుపు ఇచ్చినా పెద్దగా స్పందించడం లేదనేది స్పష్టమవుతోంది. మరోవైపు లోకేష్‌పై కూడా కేసుల కత్తి వేలాడుతోంది. తనకు ఏమవుతుందో తెలియక ఆయన బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ముఖ్యమంత్రిని, పోలీసులను నోటికి వచ్చినట్లు దూషించినంత తేలికగా కేసులు ఉండవన్న సంగతి అర్దం అయ్యేసరికి లోకేష్ ఊబిలో చిక్కుకుపోయారు. ఆయన కూడా అరెస్టు అయితే పార్టీని నైతికంగా మరింత దెబ్బతీస్తుంది. అసలే ఆయన నాయకత్వంపై ఇంకా నమ్మకం ఏర్పడలేదు. దానికి తోడు ఈ కేసులు రావడంతో వీళ్లతో జట్టుకట్టి ఉంటే ఏమవుతామోనన్న భయం క్యాడర్‌కు పట్టుకుంది. ✍️ మరోవైపు.. చంద్రబాబు, లోకేష్‌లు సంక్షోభంలో ఉండగా.. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ టీడీపీ కార్యాలయంలో హల్ చల్ చేశారన్న వార్తతో క్యాడర్లో అయోమయం నెలకొంది. తన కుమారుడు బాలకృష్ణ రాజకీయ వారసుడు కావాలని ఎప్పుడో 1986 ప్రాంతంలోనే ఎన్.టి.రామారావు ప్రకటన చేయడం, దానిని విత్ డ్రా చేసుకునే వరకు చంద్రబాబు ప్రయత్నాలు సాగించడం తెలిసిందే. ఇప్పుడు పార్టీ మొత్తం నారా వారి పార్టీగా మారిపోయి.. నందమూరి వంశానికి ప్రాధాన్యత లేకుండా పోయిందన్న అభిప్రాయం బలంగా జనాల్లోనే ఉంది. అందువల్ల బాలకృష్ణ ఏమైనా చొరవ తీసుకునే.. ధైర్యం చేశారా? అనే చర్చ నడిచింది క్యాడర్లో!. ఇంతకాలం చంద్రబాబు తర్వాత లోకేష్ నాయకత్వం అని భావిస్తుంటే, బాలకృష్ణ వచ్చి చంద్రబాబు సీటులో కూర్చోవడం.. ఆయనకు సంబందించిన వార్తలేవి చంద్రబాబు సన్నిహితంగా ఉండే ఆంధ్రజ్యోతిలో రాకపోవడంతో.. బాలకృష్ణ చేసిన హడావుడి ఆ తండ్రీకొడుకులకు నచ్చలేదా? అనే ప్రశ్న తలెత్తింది కూడా!. ఒకవేళ బాలకృష్ణ తానే నాయకత్వం వహించాలనుకుని ఇలా చేశారా? అనే అనుమానమూ పార్టీ వర్గాలలో ఏర్పడింది. ఇదే ఆంధ్రజ్యోతి పత్రికలో కొద్ది రోజుల కిందట.. చంద్రబాబు భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణిలు కూడా రంగంలో దిగాల్సిన సమయం ఆసన్నమైందంటూ కథనం రావడం పార్టీ శ్రేణులను ఆశ్చర్యపరచింది. అంటే దీని అర్ధం చంద్రబాబు ఇప్పట్లో జైలు నుంచి బయటకు రాలేరనా?.. లేక చంద్రబాబు నాయకత్వ పటిమపై సందేహాలు వచ్చాయా? లేదంటే లోకేష్ కూడా జైలుకు వెళతారనా? లేకుంటే లోకేష్ నాయకత్వం సరిపోదనా?. ఒకవేళ వీరిద్దరూ(భువనేశ్వరి, బ్రహ్మణీలు) రావడం వల్ల జనంలో సానుభూతి వస్తుందనా?.. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం లేక క్యాడర్‌ను వేధిస్తున్నాయి. ✍️ గతంలో జగన్ జైలులో ఉన్నప్పుడు ఆయన తల్లి విజయమ్మ, సోదరి విజయమ్మలు పర్యటనలు చేశారు. సభలలో మాట్లాడారు. కాని అప్పుడు అది ఉప ఎన్నికల సమయం కావడంతో.. వారి అవసరం పడింది. అలాగే షర్మిల పాదయాత్ర కూడా చేశారు. ఇప్పుడు కేవలం చంద్రబాబు జైలులో ఉన్నారు కనుక వీరు జనంలోకి వస్తే రిసీవ్ చేసుకుంటారా?. ఒకవేళ చూడడానికి వచ్చినా జనం.. ఆ తర్వాత ఓట్ల వరకు పరిస్థితిని తెస్తారా? అనేది అనుమానమే!. ఇవన్నీ ఒక ఎత్తయితే.. అసలు ఈ పరిణామాలన్నిటికి జైలులో ఉన్న చంద్రబాబు అంగీకరిస్తారా?.. దానివల్ల తన రాజకీయ అనుభవానికి.. పరువుకి భంగం అనుకునే అవకాశం ఉండదా?.. ఇలా ఎన్నో చిక్కుల నడుమ తెలుగుదేశంలో నిరాశ, నిస్పృహలు అలముకున్నాయి. టీడీపీ క్యాడర్‌ను ఎంత ఉత్తేజపరచాలని చూస్తున్నా.. రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నా.. వారిలో ఆ కాక కనిపించడం లేదు. చంద్రబాబు, లోకేష్‌లు ఇన్ని రోజులు రెచ్చగొట్టి వారి పబ్బం గడుపుకున్నారని, ఇప్పుడు వాళ్లే ఇక్కట్లపాలయ్యారని, అందువల్ల అనవసరంగా తాము ఎందుకు రిస్క్ తీసుకోవాలని పార్టీ కార్యకర్తలు సహజంగానే భావించి ఉండొచ్చు. ఈ నేపథ్యంలోనే.. తెలుగుదేశం పార్టీ మరింత సంక్షోభంలోకి కూరుకుపోతుందనిపిస్తోంది. ‘‘బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ’’ నినాదం ఇచ్చిన పార్టీలో.. ఇప్పుడు ఆ పిలుపు ఇచ్చిన చంద్రబాబు, ఆయన వారసుడు లోకేష్‌ల భవితవ్యంతో పాటు టీడీపీ భవిష్యత్తుకు గ్యారెంటీ లేకుండా పోయిందన్న భావన ఆ పార్టీ క్యాడర్లోనే నెలకొంది!!. :::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
భువనేశ్వరికి లాయర్ల కౌంటర్
-
భువనేశ్వరికి చంద్రబాబుతోనే అపాయం
నగరి: చంద్రబాబు వల్లే భువనేశ్వరికి అపాయం ఉందని, జరగని విషయాన్ని జరిగినట్టు ఏడ్చి నానాయాగి చేశారంటే ఏదో స్కెచ్ వేశాడని అర్థమవుతోందని, జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యే ఆర్కే రోజా సూచించారు. ఆడవారి ఉసురు తగిలినందుకే చంద్రబాబు గత ఎన్నికల్లో 23 సీట్లకే పరిమితమయ్యారన్నారు. ఆడవారిపై అనవసరంగా ఎవరు నోరు పారేసుకుంటారో, ఎవరు కుట్రలు చేసి తొక్కేయాలని చూస్తారో వారి పాపాన వారే పోతారు.. అంటూ చంద్రబాబు సతీమణి భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. మంగళవారం నగరిలోని తన నివాసం వద్ద రోజా విలేకరులతో మాట్లాడారు. ‘‘చంద్రబాబు హయాంలో జరిగిన కాల్‌మనీ సెక్స్ రాకెట్లో ఎంతో మంది మహిళల జీవితాలు నాశనమయ్యాయి. వాటిపై అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఏడాది పాటు తనను సస్పెండ్ చేసి వేధింపులకు గురిచేసిన ఘటన భువనేశ్వరికి కనిపించలేదా? ఎమ్మార్వో వనజాక్షిని ఇసుక మాఫియా వారు చేయిచేసుకున్నరోజు వారి ఏడుపు ఆమెకు వినిపించలేదా?. రిషితేశ్వరి లాంటి విద్యార్థులు ఎంతో మంది చనిపోయారు. వారి మృతికి గల కారణాలు తెలుసుకోకుండా, బాధ్యులపై కనీసం ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయకుండా తల్లిదండ్రులను కడుపుకోతకు గురిచేసినప్పుడు భువనేశ్వరి ఏంచేస్తున్నారు? గోదావరి పుష్కరాల పేరిట 30 మందిని చంపేసినప్పుడు వారి కుటుంబాల కన్నీరు కనిపించలేదా?’’ అని రోజా ప్రశ్నల వర్షం కురిపించారు. ఎన్టీఆర్ ఏడుపునకు కారణమైన వారు ఏవిధంగా నామరూపాలు లేకుండా పోతున్నారో జనం చూస్తూనే ఉన్నారన్నారు. నేడు మహిళలు పూర్తి రక్షణతోనే ఉన్నారని, వారికి అన్నింటా సమాన అర్హత కల్పించి, దిశ లాంటి చట్టాలను ప్రవేశపెట్టి జగన్ అంటే మా అన్న అని మహిళలు చెప్పుకునే విధంగా వారికి ముఖ్యమంత్రి అండగా ఉన్నారని చెప్పారు. -
గుప్తాపై దాడిని నేనే ఆపా
సాక్షి, అమరావతి, ఒంగోలు: పార్టీ సమావేశంలో విమర్శలకు దిగిన సోమిశెట్టి సుబ్బారావు గుప్తాను కొందరు కొడుతున్నట్లు తెలిసి వెంటనే తానే ఫోన్ చేసి ఆపానని ఇంధనశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. భౌతిక దాడులను సహించబోమని స్పష్టం చేశారు. సుబ్బారావు గుప్తాకు రక్షణ కల్పించాలని, దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. మతిస్థిమితం లేకే గుప్తా ఆ సభలో అలా మాట్లాడారని ఆయన భార్యే స్వయంగా చెబుతున్నారని మంత్రి తెలిపారు. ఈ ఘటనపై టీడీపీ, ఓ వర్గం మీడియా దుష్ప్రచారం చేయటాన్ని ఖండించారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక బురదజల్లుతున్నారని మండిపడ్డారు. తన గురించి ఒంగోలు ప్రజలకు బాగా తెలుసని, దాడులు చేయడం తమ సంస్కృతి కాదని చెప్పారు. సోమవారం విజయవాడ, ఒంగోలులో మంత్రి విలేకరులతో మాట్లాడారు. ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు.. తాను ఐదు సార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా ఉన్నానని, తనది ఎవరినీ ఇబ్బంది పెట్టే మనస్తత్వం కాదని మంత్రి బాలినేని స్పష్టం చేశారు. తనపై రెండు సార్లు ఆర్యవైశ్యులు పోటీ చేశారని, ఎప్పుడూ వారిని ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవన్నారు. వారిని సోదరులుగానే భావించి సహాయ సహకారాలు అందించానన్నారు. టీడీపీ ఆరోపిస్తున్నట్లు తాను ఆర్యవైశ్యులను ఇబ్బంది పెట్టినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. దాడి జరిగిన విషయం తెలియగానే ఎస్పీకి ఫోన్ చేసి బాధ్యులపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని కోరానని చెప్పారు. కావాలనే వివాదం.. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి గురించి తమ పార్టీ వారెవరూ శాసనసభలో తప్పుగా మాట్లాడలేదని, కావాలనే ఆమెను టీడీపీ వారే వివాదంలోకి లాగుతున్నారని బాలినేని తెలిపారు. లోకేష్ నేతృత్వంలో తనపై తప్పుడు ప్రచారం జరిగినప్పుడు తాను ఎంతో బాధ పడ్డానని చెప్పారు. క్షమించండి.. అదృశ్య శక్తుల పనే: గుప్తా తప్పుగా మాట్లాడినందుకు తనను సీఎం జగన్మోహన్రెడ్డి, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి క్షమించాలని సోమిశెట్టి సుబ్బారావు గుప్తా కోరారు. మంత్రి బాలినేనితో తనకు ఎన్నో ఏళ్లుగా అనుబంధం ఉందని మీడియాతో పేర్కొన్నారు. తాను సామాజిక మాధ్యమాల్లో ఎలాంటి పోస్టింగ్‌లు చేయలేదని, ఇదంతా కొన్ని అదృశ్య శక్తుల పనేనని చెప్పారు. తనపై దాడి జరిగిందన్న విషయం తెలియగానే ముందుగా బాలినేని స్పందించి తనకు అండగా నిలిచి ధైర్యం చెప్పారని వెల్లడించారు. తనపై ఎంతో అభిమానం ఉండబట్టే తనకు వీరాంజనేయస్వామి దేవస్థానం ట్రస్టుబోర్డు చైర్మన్ పదవి ఇచ్చారన్నారు. మంత్రి పుట్టిన రోజును పురస్కరించుకుని తాను చేసిన కొన్ని వ్యాఖ్యలను కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన సోదరి షర్మిల మధ్య విబేధాలను సృష్టించేందుకు గతంలో ఆంధ్రజ్యోతి పత్రిక కథనం రాస్తే ఆ పత్రిక కార్యాలయం వద్దే ప్రతులను దగ్థం చేశానని చెప్పారు. తల్లి, అత్త ఇటీవలే మృతి చెందడంతో తన భర్త మనోవ్యధకు గురైనట్లు గుప్తా భార్య నాగమణి తెలిపారు. జై జగన్.. జై బాలినేని అని నినదించారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు తొలుత ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాని సుబ్బారావు గుప్తా మంత్రి బాలినేని అభయం ఇవ్వడంతో భార్యతో కలసి వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. మంత్రి వాసన్న అభయం ఇచ్చారంటే ఇక భయం లేదని అందుకే ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు గుప్తా తెలిపారు. సుబ్బారావు ఫిర్యాదుపై వన్‌టౌన్ సీఐ సుభాషిణి 506,323, 427 రెడ్‌విత్ 34 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు. -
భువనేశ్వరి గురించి సభలో ఎవరూ పల్లెత్తు మాట అనలేదు..
సాక్షి, అమరావతి: పదవి కోసం ఎంతటి నీచానికైనా చంద్రబాబు వెనుకాడరని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. స్వభావరీత్యా జిత్తులమారి అయిన చంద్రబాబు నాడు మామ ఎన్టీఆర్‌ను, నేడు భార్యను అడ్డుపెట్టుకుని దుర్మార్గ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. శుక్ర వారం సచివాలయంలోని మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. ‘చంద్రబాబు అర్ధాంగి భువనేశ్వరిని ఏదో అన్నామని చెబుతున్నారు. ఆమెను నేను కానీ, మా పార్టీవాళ్లు కానీ ఏమీ అనలేదు. చేతులు జోడించి నమస్కరించి చెబు తున్నాం. మహిళలను అనే స్వభావం మాది కాదు. చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసమే ఇదంతా చేసు ్తన్నారు. నాడు ఎన్టీఆర్‌ను అడ్డం పెట్టుకుని రాజ కీయాల్లో ఎదిగి, ఆయనకు వెన్నుపోటు పొడిచి సీఎం అయ్యారు. ఈ రోజు భార్యను అడ్డు పెట్టు కుని సానుభూతి పొందాలని డ్రామాలు చేస్తున్నారు. భువనేశ్వరిని అన్నట్టు ఆధారాలుంటే బయట పెట్టండి. ఈ విషయంలో భువనేశ్వరి కూడా చంద్రబాబును నిలదీయాలి. గతంలో సీఎం జగన్‌ను టీడీపీ ఆఫీసులో ప్రెస్‌మీట్ పెట్టించి తిట్టించారు. ఆ సందర్భంగా జగన్ తనను ఎవరు.. ఏమని దూషించారో బహిరంగంగానే చెప్పారు. అదే మీ గురించి, మీ కుటుంబ సభ్యుల గురించి మేం ఏదైనా తప్పు మాట్లాడితే అసెంబ్లీలో రికార్డ్స్ లో ఉంటాయి కదా? బయటపెట్టండి. వాస్తవాలను కప్పిపుచ్చుతూ, సానుభూతి కోసం దిగజారొద్దు. ఇప్పటికే తెలంగాణలో కనుమరుగైన టీడీపీ ఇప్పుడు ఏపీలోనూ కనిపించకుండా పోతోంది. అందుకే ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో గుడ్డకాల్చి మాపై వేస్తున్నారు’ అని విమర్శించారు. -
అమరావతి భూ కుంభకోణంలో.. ‘పెద్ద’ తలకాయలు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో భూ కుంభకోణనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం హైకోర్టులో కీలక వాదనలు వినిపించింది. మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి లోకేష్ సన్నిహితులు అమరావతి చుట్టుపక్కల కొనుగోలు చేసిన భూముల వివరాలను డాక్యుమెంట్ నెంబర్లతో సహా హైకోర్టు ముందు ఉంచింది. ఎన్నారైలతో కొందరు సాగించిన వాట్సాప్ సంభాషణల వివరాలను కూడా కోర్టుకు సమర్పించింది. అమరావతి భూ కుంభకోణం వెనుక చాలా పెద్ద తలకాయలున్నాయని, సీఐడీ దర్యాప్తును కొనసాగనివ్వాలని అభ్యర్థిస్తూ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ వాదనలు వినిపించారు. సీఐడీ అదనపు ఎస్పీ గోపాలకృష్ణ కౌంటర్ దాఖలు చేశారు. తదుపరి వాదనల నిమిత్తం విచారణను బుధవారానికి వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏజీ శ్రీరామ్ హైకోర్టుకు నివేదించిన అంశాల్లో కీలక వివరాలివీ... బాబు హయాంలో లలిత ఆస్పత్రికి భారీ లబ్ధి లలిత సూపర్ స్పెషాలిటీస్ ఆస్పత్రి యాజమాన్యం వెలగపూడి, తాడికొండ, తక్కెళ్లపాడు గ్రామాల్లో 2014 సెప్టెంబర్ 26 నుంచి నవంబర్ 27 వరకు 26.62 ఎకరాలను కొనుగోలు చేసింది. తమ భూములున్న చోట కోర్ క్యాపిటల్ వస్తుందని, ల్యాండ్ పూలింగ్ పథకాన్ని ప్రకటిస్తారని తెలియక భూములు విక్రయించినట్లు అమ్మకందార్లు వాంగ్మూలం ఇచ్చారు. నార్త్‌ఫేస్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు తొట్టెంపూడి వెంకటేశ్వరరావు, చేకూరి తేజస్వి తదితరులు చినకాకాని, కంచికచర్ల, బలుసుపాడు, లింగాపురం, నవులూరు, బేతంపూడి, మందడం, ధరణికోట, ఉంగుటూరు తదితర గ్రామాల్లో 2014 జూన్ 6 నుంచి డిసెంబర్ 24 వరకు 17.80 ఎకరాలను కొనుగోలు చేశారు. చేకూరి తేజస్వి ఇంట్లో భూ లావాదేవీల డాక్యుమెంట్లు పెద్ద సంఖ్యలో లభించాయి. మనీ లాండరింగ్ దిశగా దర్యాప్తు జరపాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌ను కోరాం. లోకేష్ సన్నిహితుడు రాజేశ్.. చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి చెందిన హెరిటేజ్ ఫిన్‌లీజ్‌లో పనిచేసిన కిలారు రాజేశ్‌కు లోకేష్‌తో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. రాజేశ్ భార్య శ్రీహాస, మరొకరు కంతేరులో 2.64 ఎకరాల భూమిని 2014 ఆగస్టు, సెప్టెంబర్‌లో కొన్నారు. తాళ్లం మణికొండ అనంత సాయి విశ్వనాథ్ భాగస్వామిగా ఉన్న గాయత్రీ రియల్టర్స్ రాజధాని గ్రామాల్లో 23.60 ఎకరాలను 2014 మార్చి నుంచి నవంబర్ వరకు కొనుగోలు చేసింది. వర్టెక్స్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం నంబూరు, కంతేరు, కాజ గ్రామాల్లో 2014 జూన్ నుంచి నవంబర్ వరకు 12.23 ఎకరాలు కొనుగోలు చేసింది. గుడ్ లైఫ్ ఎస్టేట్స్ యాజమాన్యం కూడా నవులూరు, బేతపూడి, ఆత్మకూరు గ్రామాల్లో 10.23 ఎకరాలను కొనుగోలు చేసింది. చదవండి: సీఎం జగన్‌పై పిటిషన్లు విచారణార్హం కాదు -
కుటుంబాన్ని తీసుకొచ్చి వేషాలు వెయ్యొద్దు: రోజా
-
కుటుంబాన్ని తీసుకొచ్చి వేషాలు వెయ్యొద్దు: రోజా
సాక్షి, కాకినాడ: వైస్రాయ్ హోటల్లో తన తండ్రి మీద చెప్పులు వేసి అవమానించినప్పుడు భువనేశ్వరి ఎందుకు బయటకు రాలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ రోజా ప్రశ్నించారు. ఇన్సైడర్ ట్రేడింగ్‌లో తాము కొన్న భూములు, హెరిటేజ్‌కు చెందిన చంద్రబాబు కుటుంబం భూముల రేట్లు పడిపోతాయనే టీడీపీ నేతలు ధర్నా చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు దిగజారి తన భార్యను రాజకీయ పావుగా వాడుకుంటున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారమిక్కడ రోజా మాట్లాడుతూ.. చంద్రబాబు అమరావతిపై ప్రేమ ఉన్నట్లు నటిస్తుంటే ఎలా నమ్మాలని ప్రజలు అడుగుతున్నారన్నారు. ‘లోకేష్.. ఆయన భార్య నూతన సంవత్సర వేడుకలు ఎక్కడ జరుపుకొన్నారు? వారెందుకు రాజధాని రైతులకు అండగా లేరు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినప్పుడు... పదవి పోయి ఆయన ఏడ్చినప్పుడు భువనేశ్వరి తన తండ్రిని పరామార్శించలేదు. తన అక్క పురందేశ్వరి.. బావ దగ్గుబాటి వెంకటేశ్వరరావును టీడీపీ నుంచి వెలేసినా ఆమె బయటకు రాలేదు. అన్న హరికృష్ణను పార్టీ నుండి గెంటేసి.. అవమానించినా బయటకు రాని భువనేశ్వరి ఈరోజు రాజధాని రైతుల కోసం బయటకు వచ్చి రెండు బంగారు గాజులు ఇచ్చారంటే ఎలా నమ్మాలని రాజధాని రైతులు ప్రశ్నిస్తున్నారు. రాజధాని నిర్మాణం కోసం సెక్రటేరియట్లో హుండీలు పెట్టినప్పుడు భువనేశ్వరి గానీ... ఆమె కొడుకు-కోడలు గానీ ఎందుకు డబ్బులు డొనేట్ చేయలేదు’ అని రోజా ప్రశ్నించారు.(బంగారు గాజు రహస్యం!) అప్పులు చేసి వెళ్లారు.. గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వకుండా రాష్ట్రానికి చంద్రబాబు రాష్ట్రానికి అన్యాయం చేశారని రోజా మండిపడ్డారు. ‘రాజధాని కోసం స్కూల్ పిల్లల నుండి రూ.10 వసూలు చేసిన చంద్రబాబు... ఎందుకు తన కుటుంబ సభ్యుల నుండి వసూలు చేయలేదు? రైతులను మోసం చేసి భూములు లాక్కున్న చంద్రబాబుకు ఎవరైనా మద్దతు పలుకుతారా. ఇన్సైడర్ ట్రేడింగ్‌లో కొన్న తమ భూముల కోసం ఇష్యూ చేయడాన్ని చూసి చంద్రబాబును ప్రజలు అసహ్యించుకుంటున్నారు’ అని విమర్శించారు. ‘రాష్ట్రానికి రూ.3 లక్షల కోట్లు అప్పులు పెట్టి చంద్రబాబు వెళ్ళిపోయారు. రైతులకు అన్యాయం జరగకుండా వారి భూములు వారికి ఇస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అంటున్నారు. ఈ పరిస్థితిలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని సీఎం జగన్ అధికార వికేంద్రీకరణ చేయాలనుకుంటున్నారు. దయచేసి.. చంద్రబాబు తన కుటుంబాన్ని తీసుకువచ్చి వేషాలు వేయొద్దని కోరుతున్నాను’ అని రోజా విఙ్ఞప్తి చేశారు. చంద్రబాబు మాటలు నమ్మి బయటకు వస్తే భువనేశ్వరికి ఉన్న పరువు కూడా పోతుందని... ఎన్టీఆర్ కూతురన్న గౌరవం ఆమె పోగొట్టుకుంటారని హితవు పలికారు. -
నిరూపిస్తే క్షమాపణ.. రాజీనామా : ఆర్కే
సాక్షి, తాడేపల్లి : అమరావతిలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్‌ను ఆధారాలతో చూపించామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. రాజధాని పేరుతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. అమరాతిలో తన పేరిట భూములు ఉన్నాయనే తప్పుడు ప్రచారాన్ని ఆయన ఖండించారు. నీరుకొండలో తనకు ఐదు ఎకరాల భూమి ఉన్నట్టు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాలను తప్పుకుంటానని ఆర్కే సవాలు విసిరారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. రాజధానిలో తనపేరు మీద గానీ, తన భార్య పేరు మీద గానీ భూములు లేవని స్పష్టం చేశారు. తన భార్య పేరు మీద ఐదెకరాల భూమి ఉందని టీడీపీ నేత బోండా ఉమా ఆరోపిస్తున్నారని తెలిపారు. తమకు భూమి ఉందని చూపిస్తే ఆ ఐదెకరాలు వారికే రాసిస్తానని.. అంతేకాకుండా బహిరంగంగా క్షమాపణ చెప్తానని అన్నారు. రామోజీ, రాధాకృష్ణ తెగ తాపత్రాయపడుతున్నారు.. తనను వివరణ అడగకుండానే పేపర్లలో తప్పుడు వార్తలు రాశారని మండిపడ్డారు. అవాస్తవాలు రాయవద్దని ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలను కోరారు. చంద్రబాబును కాపాడుకోవడానికి రామోజీరావు, రాధాకృష్ణ తెగ తాపత్రయపడుతున్నారని ఎద్దేవా చేశారు. లక్షల కోట్ల రూపాయల అవినీతి బయటపడుతుందనే కులం పేరుతో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాజధానిలో అవినీతి జరగలేదని చంద్రబాబు గుండెల మీద చేయ్యి వేసుకుని చెప్పగలరా అని ప్రశ్నించారు. రాజధానికి చంద్రబాబు శాపం అని.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వరం అని అన్నారు. చంద్రబాబు రూ. 5వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క శాశ్వత బిల్డింగ్ కూడా కట్టలేకపోయారని గుర్తుచేశారు. గత ప్రభుత్వంలోని నేతలు రాజధాని ప్రాంతంలో కి.మీ రోడ్డు కోసం రూ. 40 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పి వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. రాజధానికి భూములు ఇవ్వని రైతులను అప్పటి మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ బెదిరించారని తెలిపారు. అక్రమంగా రైతులపై కేసులు పెట్టించారని విమర్శించారు. దళితుల భూములను కాజేసిన చంద్రబాబు వాటిని తన బినామీలకు కట్టబెట్టారని మండిపడ్డారు. చంద్రబాబు కొత్త బినామీ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అని అన్నారు. అర్ధరాత్రి కరకట్టకు వెళ్లి ప్యాకేజీ తెచ్చుకోలేదా అని పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించారు. మంగళగిరిలో జనసేన కూటమి అభ్యర్థుల తరఫున పవన్ ప్రచారం ఎందుకు చేయలేదని నిలదీశారు. భువనేశ్వరి అప్పుడేందుకు రోడ్లపైకి రాలేదు.. చంద్రబాబు అవినీతికి పాల్పడినందుకే మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లో టీడీపీని ప్రజలు ఓడించారని అన్నారు. టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్‌కు మంగళగిరి హద్దులు కూడా తెలియవని ఎద్దేవా చేశారు. రైతుల నుంచి అన్యాయంగా భూములు తీసుకున్నప్పుడు, వారిని పోలీసు స్టేషన్లలో పెట్టి కొట్టినప్పుడు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఎందుకు రోడ్లపైకి రాలేదని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినప్పుడు భువనేశ్వరి ఎందుకు బయటకు రాలేదో చెప్పాలన్నారు. రైతుల నుంచి భూములు తీసుకుని ఒక్క శాశ్వత భవనం ఎందుకు కట్టలేదో భువనేశ్వరి చంద్రబాబును అడగాలని సూచించారు. రాజధాని కట్టాలంటే రూ. లక్ష 25వేల కోట్లు ఖర్చు అవుతుందని అన్నారు. చంద్రబాబు రాష్ట్రాలన్ని మూడున్నర లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో నెట్టారని విమర్శించారు. -
భువనేశ్వరి దత్తత గ్రామంలో టీడీపీకి ఎదురుదెబ్బ!
సాక్షి, అమరావతి: కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గం కొమరవోలు గ్రామం.. ఇద్దరు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్న గ్రామం. స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు భార్య బసవతారకం పుట్టినిల్లు.. మరో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అమ్మమ్మ ఊరు. పైగా ఈ గ్రామాన్ని భువనేశ్వరి దత్తత కూడా తీసుకున్నారు. అభివృద్ధి చేస్తానంటూ ఆమె భారీఎత్తున ప్రచారం కూడా చేసుకున్నారు. ఇంతటి ప్రాముఖ్యం గల ఈ గ్రామంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తెలుగుదేశం అభ్యర్థి కన్నా వైఎస్సార్సీపీ అభ్యర్థి కైలే అనిల్‌కుమార్‌కు 295 ఓట్ల మెజార్టీని ఇక్కడి గ్రామస్తులు కట్టబెట్టారు. ఈ గ్రామంలో 1,474 ఓట్లు పోలవ్వగా అందులో వైఎస్సార్సీపీకి 843 ఓట్లు రాగా, టీడీపీకి 548 ఓట్లు మాత్రమే లభించాయి. దత్తత తీసుకున్నా చేసిందేమి లేదు భువనేశ్వరి కొమరవోలు గ్రామాన్ని దత్తత తీసుకుని ఆ గ్రామానికి చేసిందేమి లేదు. గ్రామంలో డ్రైనేజీ, తాగునీటి సమస్యలను తీర్చలేకపోయారు. నారా దేవాన్ష్ కాలనీ పేరిట గృహనిర్మాణాలు అంటూ హడావుడి చేసినప్పటికీ కేవలం కొందరికే ఇళ్ల నిర్మాణాలు చేపట్టడంతో వ్యతిరేకత వ్యక్తమైంది. ఇన్ని రోజులపాటు టీడీపీని ఆదరించిన గ్రామస్తులు విసుగుచెంది ఈ దఫా ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. -
నారావారిపల్లెకి చేరుకున్న సీఎం
చంద్రగిరి: సంక్రాంతి సందర్భంగా సీఎం చంద్రబాబు సోమవారం మధ్యాహ్నం తన స్వగ్రామమైన చిత్తూరు జిల్లా నారావారిపల్లెకి చేరుకున్నారు. కాశిపెంట్లోని హెరిటేజ్‌లో ఓ కార్యక్రమం ముగించుకుని, ఆయన సతీమణి నారా భువనేశ్వరితో కలసి ఇంటికి చేరుకున్నారు. స్థానికుల నుంచి అర్జీలను స్వీకరించి వాటిని పరిష్కరించాలని తిరుపతి సబ్ కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్‌ను ఆదేశించారు. అనంతరం ఆయన నివాసంలో కుటుంబ సభ్యులతో వేడుకలు జరుపుకుని సా.6 గంటలకు మరోమారు ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. -
ఆలయ పూజల్లో పాల్గొన్న సీఎం సతీమణి
నక్కపల్లి: సీఎం చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి గురువారం నక్కపల్లి మండలంలోని చినదొడ్డిగల్లు, ఉపమాక వచ్చారు. షిర్డీ సాయి ఆలయంలో సాయిబాబాకు ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించారు. పూర్ణాహుతిలో పాల్గొన్నారు. ఇదేరోజు చంద్రబాబునాయుడు జన్మనక్షత్రం కావడంతో బాబుగోత్రనామాలతో హోమాలు, పూజలు చేయించారు. గ్రామ ఉపసర్పంచ్ బివి రమేష్‌రాజు ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమాన్ని భువేనేశ్వరి ప్రారంభించారు. అనంతరం ఆమె ఉపమాక వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ప్రధానార్చకులు వరప్రసాద్ క్షేత్రమహత్యాన్ని వివరించారు. స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. ఆమె పర్యటనలో అనకాపల్లి ఎంపీ ఎం శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వంగలపూడి అనిత,జడ్పి చైర్పర్సన్ లాలం భవానీ,ఎంపిపిలు వినోద్‌రాజు, లావణ్య, జిల్లాగ్రంధాలయసంస్ద మాజీ చైర్మన్ తోటనగేష్, పార్టీ సీనియర్ నాయకులు కొప్పిశెట్టి వెంకటేష్, రెడ్డిరామకృష్ణ, బాబ్జిరాజు, మీగడసత్తిబాబు, కురందాసు నూకరాజు, కానీనాయుడు, సర్పంచ్ శ్రీనివాసరావు, ఎంపిటీసి ఈశ్వరరావు,ఆర్డివో సూర్యారావు, ప్రత్యేకాధికారి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు బంపర్ ఆఫర్!
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన ఆస్తులు, కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు ప్రకటించారు. తన ఆస్తుల మొత్తం విలువ రూ. 42.06 లక్షలని ఆయన తెలిపారు. తన భార్య భువనేశ్వరి పేరిట రూ. 33.03 కోట్ల విలువైన ఆస్తులున్నాయన్నారు. తన కుమారు లోకేష్ ఆస్తుల విలువ రూ. 4.92 కోట్లు, కోడలు బ్రహ్మణి ఆస్తులు విలువ 3.30 కోట్లు అని వెల్లడించారు.. తాను ప్రకటించిన ఆస్తులు కాకుండా తనకింకా ఆస్తులు ఉన్నట్టు నిరూపిస్తే వాటా ఇస్తానని చంద్రబాబు ప్రకటించారు. తాము స్థాపించిన హెరిటేజ్ కంపెనీని పూర్తి పారదర్శకంగా పద్ధతి ప్రకారం నిర్వహిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. 1992లో హెరిటేజ్ కంపెనీ ప్రారంభించామని చెప్పారు. గతేడాదితో పోలిస్తే 14.96 శాతం వృద్ధి సాధించిందని తెలిపారు. రాజకీయ నాయకుడిగా సమాజానికి జవాబుదారి కాబట్టి స్వచ్ఛందంగా ఆస్తులు ప్రకటించినట్టు తెలిపారు. తనలా ప్రజా జీవితంలో ఉన్న నాయకులు ఆస్తులు ప్రకటిస్తే బాగుంటుందన్నారు. తనకు డబ్బుల మీద వ్యామోహం లేదన్నారు. అయితే టీడీపీ నాయకులు అందరూ ఆస్తులు ఎందుకు ప్రకటించలేదన్న ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానమివ్వలేదు. ఆస్తుల ప్రకటించాలని వారిపై ఒత్తిడి పెంచాబోమని చెప్పారు. కాగా, తనకు రూ. 38 కోట్ల విలువ చేసే ఆస్తులున్నాయని 2012లో చంద్రబాబు ప్రకటించారు. 2011లోనూ ఇదే మొత్తం చెప్పారు. సింగపూర్‌లో తనకు ఏవిధమైన ఆస్తులు లేవని మరీ మరీ చెప్పారు.