సాక్షి, అమరావతి: కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గం కొమరవోలు గ్రామం.. ఇద్దరు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్న గ్రామం. స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు భార్య బసవతారకం పుట్టినిల్లు.. మరో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అమ్మమ్మ ఊరు. పైగా ఈ గ్రామాన్ని భువనేశ్వరి దత్తత కూడా తీసుకున్నారు. అభివృద్ధి చేస్తానంటూ ఆమె భారీఎత్తున ప్రచారం కూడా చేసుకున్నారు. ఇంతటి ప్రాముఖ్యం గల ఈ గ్రామంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తెలుగుదేశం అభ్యర్థి కన్నా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కైలే అనిల్‌కుమార్‌కు 295 ఓట్ల మెజార్టీని ఇక్కడి గ్రామస్తులు కట్టబెట్టారు. ఈ గ్రామంలో 1,474 ఓట్లు పోలవ్వగా అందులో వైఎస్సార్‌సీపీకి 843 ఓట్లు రాగా, టీడీపీకి 548 ఓట్లు మాత్రమే లభించాయి.
దత్తత తీసుకున్నా చేసిందేమి లేదు
భువనేశ్వరి కొమరవోలు గ్రామాన్ని దత్తత తీసుకుని ఆ గ్రామానికి చేసిందేమి లేదు. గ్రామంలో డ్రైనేజీ, తాగునీటి సమస్యలను తీర్చలేకపోయారు. నారా దేవాన్ష్ కాలనీ పేరిట గృహనిర్మాణాలు అంటూ హడావుడి చేసినప్పటికీ కేవలం కొందరికే ఇళ్ల నిర్మాణాలు చేపట్టడంతో వ్యతిరేకత వ్యక్తమైంది. ఇన్ని రోజులపాటు టీడీపీని ఆదరించిన గ్రామస్తులు విసుగుచెంది ఈ దఫా ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు.
Comments
Please login to add a commentAdd a comment