
సాక్షి, విజయవాడ: తన భర్త చంద్రబాబు నాయుడు అవినీతి చేయలేదని భువనేశ్వరి ప్రమాణం చేస్తారా? అని సవాల్ విసిరారు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం. నారా భువనేశ్వరి కాణిపాకంలో ప్రమాణం చేసి యాత్ర ప్రారంభించాలన్నారు. నిజం గెలవాలంటే తమ ఆస్తుల మీద విచారణకు భువనేశ్వరి సిద్ధమా? అని చాలెంజ్ చేశారు రఘురాం.
‘నారా లోకేష్ ఏ యాత్ర చేపట్టినా మధ్యలో ఆగిపోతుంది. పాదయాత్ర లోకేష్ మధ్యలో ఆపేస్తాడని ఎప్పుడో చెప్పా. భవిష్యత్ లేని లోకేష్ భవిష్యత్‌కి గ్యారంటీ యాత్ర చేస్తే ఏం లాభం. ఒక చోట ఓడిన లోకేష్.. రెండు చోట్ల ఓడిన పవన్‌లను చూసి జనం నవ్వుకుంటున్నారు. చంద్రబాబు జైలు లేఖ పై సమగ్రమైన విచారణ జరగాలి. వ్యవస్థలను చంద్రబాబు మేనేజ్ చేస్తాడు. ఈ విషయం రిటైర్డ్ జడ్జిలే చెప్పారు. సీఎం జగన్ జనంని, దేవుడ్ని నమ్ముతారు. చంద్రబాబు తరహాలో లా వ్యవస్థలను మేనేజ్ చేసే నైజం సీఎం జగన్‌ది కాదు. లోకేష్ ఢిల్లీ వెళ్లి అమిత్ షా ని ఎందుకు కలిశారు. చంద్రబాబు ఆస్తులపైన, కేసుల పైన సీబీఐ విచారణకు సిద్ధమా..?’ అని నిలదీశారు.
అన్ని నియోజకవర్గాల్లో బస్సుయాత్ర
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సాధికారత చాటి చెప్పేలా బస్సు యాత్ర ఉంటుందని స్పష్టం చేశారు ఎమ్మెల్సీ తలశిల రఘురాం. సామాజిక సాధికర యాత్ర అన్ని నియోజకవర్గాల్లో సాగుతుందన్న తలశిల.. 26వ తేదీన ఇచ్చాపురం, తెనాలి, సింగణమాలలో యాత్ర ప్రారంభం అవుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment