Talasila Raghuram
-
తనపై వచ్చిన ఆరోపణలను ఎమ్మెల్సీ తలశిల రఘురాం ఖండించారు.
-
రాజకీయ కుట్రతోనే నాపై ఆరోపణలు: తలశిల రఘురాం
సాక్షి, తాడేపల్లి: తనపై వచ్చిన ఆరోపణలను ఎమ్మెల్సీ తలశిల రఘురాం ఖండించారు. ఇది పూర్తిగా రాజకీయ కోణంలో జరుగుతున్న కుట్ర అని.. ఇందులో ఎలాంటి వాస్తవాలు లేవని స్పష్టం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనపై కొందరు కావాలనే ఆరోపణలు చేస్తున్నారన్నారు.‘‘గొల్లపూడిలో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి టీడీపీ నేత. టీడీపీ నేతలకు అతను రూ.30 కోట్ల వరకు ఇవ్వాలి. వాళ్లు గొడవలు పడి కేసులు పెట్టుకున్నారు. దీంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. దీనిపై పూర్తి స్థాయి విచారణ చేసుకోవచ్చు. నేను ఎవరి దగ్గరా డబ్బులు తీసుకోలేదు...నేను ఎవరి దగ్గరా డబ్బులు తీసుకోలేదు. ఆత్మహత్య చేసుకునే ముందు అతను వీడియో తీసుకున్నాడు. టీడీపీ వారే తన చావుకు కారణమని వీడియోలో చెప్పాడు. నాపై కుట్రలు మాని.. విచారణ జరిపించాలి. నా మీద ఆరోపణలు చేయటం విచిత్రంగా ఉంది. ఇది పూర్తిగా రాజకీయ కోణంలో జరుగుతున్న కుట్ర’’అని తలశిల రఘురాం మండిపడ్డారు. -
బస్సు యాత్రలో జగన్ జైత్రయాత్ర కనిపిస్తోంది..!
-
సీఎం జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డ్: తలశిల రఘురాం
సాక్షి, విశాఖపట్నం: సీఎం జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డు అని ఎమ్మెల్సీ తలశిల రఘురాం అన్నారు. 16 సభలు, 9 రోడ్ షో లు, 6 ప్రత్యేక సమావేశాలు నిర్వహించామని, 2100 కిలోమీటర్ల మేర బస్సు యాత్ర చేపట్టారని ఆయన తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఎం జగన్‌పై హత్యాయత్నం చేసిన వెనక్కి తగ్గలేదన్నారు. ప్రజల్లో సీఎం జగన్ గ్రాఫ్ ఎంత పెరిగిందో స్పష్టమైందన్నారు. ‘‘పగటి పూట సభలు పెట్టలేని స్థితిలో చంద్రబాబు ఉన్నాడు. జనం రాక చంద్రబాబు బస్సులో గంటలకొద్దీ కూర్చుంటున్నాడు. విజయవాడ, విశాఖ రోడ్ షో లతో సీఎం జగన్ విజయం ఎలా ఉండబోతోందో అర్థమైంది. జ్వరం, దగ్గు, జలుబు అని హైదరాబాద్ వెళ్లిపోయే పవన్‌కి సీఎం జగన్‌ని విమర్శించే అర్హత లేదు. రెండు రోజుల్లో ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ ఖరారు చేస్తాం. బస్సు యాత్ర కంటే వినూత్నంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తాం’’ అని రఘురాం తెలిపారు. ‘‘ప్రజలు జగన్ వెంట నడుస్తున్న తీరు ప్రతిపక్షాలకు వణుకు పుట్టిస్తోంది. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు అడ్రాస్ ఉండదని తలశిల రఘురాం అన్నారు. -
జనంలోకి సీఎం జగన్ బస్సు యాత్ర షెడ్యూల్
-
బస్సు యాత్రతో జనంలోకి సీఎం జగన్
-
సీఎం జగన్ చొక్కా మడత పెడితే...!
-
3న ఏలూరులో ‘సిద్ధం’ బహిరంగ సభ!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: వైఎస్సార్సీపీ ఎన్నికల శంఖారావం బహిరంగసభ ‘సిద్ధం’కు ఏలూరు ముస్తాబవుతోంది. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని 50 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి లక్షలాది మంది పార్టీ కేడర్ సభకు రానున్న క్రమంలో విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం సభా ప్రాంగణంలో జరుగుతున్న పనులను పార్టీ ముఖ్యులు పరిశీలించారు. గోదావరి జిల్లా రీజనల్ కో–ఆర్డినేటర్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, సీఎం ప్రోగ్రామ్స్ కో–ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆళ్ల నాని, దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి, ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్‌కుమార్‌యాదవ్, చింతలపూడి అసెంబ్లీ అభ్యర్థి కంభం విజయరాజు తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం సభా ప్రాంగణంలో ‘సిద్ధం’ పోస్టర్లను ఆవిష్కరించారు. 110 ఎకరాల ప్రాంగణంలో.. ఏలూరు నగర సమీపంలో, దెందులూరు జాతీయ రహదారి వద్ద 110 ఎకరాల స్థలంలో సభావేదిక నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. భారీ వేదిక నిర్మాణం, పదుల సంఖ్యలో గ్యాలరీలు.. కార్యకర్తలందరికీ దగ్గరగా వెళ్లి అభివాదం చేసేందుకు సభా వేదిక నుంచి వాక్‌వే ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. సభా ప్రాంగణం వెనుక భాగంలో హెలీప్యాడ్‌ను ఏర్పాటు చేశారు. 50 నియోజకవర్గాల నుంచి లక్షలాది మంది రానున్న క్రమంలో వాహనాల పార్కింగ్తో సహా ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. సభా ప్రాంగణానికి సమీపంలోని దెందులూరు ఊరు ప్రారంభంలో 40 ఎకరాల ప్రాంగణాన్ని, అలాగే సభా ప్రాంగణానికి, ఆటోనగర్‌కు మధ్యలో 25 ఎకరాల ప్రాంగణం, మరో రెండు పార్కింగ్ స్థలాలు, ఆటోనగర్ లోపల, ఆశ్రం కళాశాల, ఏలూరు ప్రారంభంలోని రియల్ ఎస్టేట్ వెంచర్లో మొత్తం 150 ఎకరాల స్థలాన్ని పార్కింగ్ కోసం కేటాయించి జిల్లాల వారీగా వచ్చే వాహనాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. బుధవారం ఎంపీ మిథున్‌రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని మాట్లాడుతూ ఏలూరు జిల్లా రాజకీయ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ‘సిద్ధం’ బహిరంగ సభ జరుగుతుందని, 3న మధ్యాహ్నం 2 గంటలకు సీఎం జగన్ సభా ప్రాంగణానికి చేరుకుని పార్టీ కేడర్‌కు దిశా నిర్దేశం చేస్తారని వివరించారు. ఏర్పాట్లను పరిశీలించిన వారిలో కలెక్టర్ ప్రసన్నవెంకటేష్, ఎస్పీ డీ.మేరీప్రశాంతి తదితరులున్నారు. -
ఎమ్మెల్సీ తలసిల రఘురాం కుమార్తె వివాహానికి హాజరైన వైఎస్సార్సీపీ నేతలు
-
తలశిల రఘురామ్ కుమార్తె వివాహ వేడుకకు సీఎం జగన్ దంపతులు
సాక్షి, విజయవాడ: శాసనమండలి సభ్యుడు తలశిల రఘురామ్ కుమార్తె వివాహ వేడుకకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతులు హాజరయ్యారు. ఎ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన వేడుకలో వధువు ప్రణవ, వరుడు విష్ణులను సీఎం జగన్, వైఎస్ భారతి దంపతులు ఆశీర్వదించారు. ఈ వివాహ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు హాజరయ్యారు. -
‘భర్త అవినీతి చేయలేదని భువనేశ్వరి ప్రమాణం చేస్తారా?’
సాక్షి, విజయవాడ: తన భర్త చంద్రబాబు నాయుడు అవినీతి చేయలేదని భువనేశ్వరి ప్రమాణం చేస్తారా? అని సవాల్ విసిరారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం. నారా భువనేశ్వరి కాణిపాకంలో ప్రమాణం చేసి యాత్ర ప్రారంభించాలన్నారు. నిజం గెలవాలంటే తమ ఆస్తుల మీద విచారణకు భువనేశ్వరి సిద్ధమా? అని చాలెంజ్ చేశారు రఘురాం. ‘నారా లోకేష్ ఏ యాత్ర చేపట్టినా మధ్యలో ఆగిపోతుంది. పాదయాత్ర లోకేష్ మధ్యలో ఆపేస్తాడని ఎప్పుడో చెప్పా. భవిష్యత్ లేని లోకేష్ భవిష్యత్‌కి గ్యారంటీ యాత్ర చేస్తే ఏం లాభం. ఒక చోట ఓడిన లోకేష్.. రెండు చోట్ల ఓడిన పవన్‌లను చూసి జనం నవ్వుకుంటున్నారు. చంద్రబాబు జైలు లేఖ పై సమగ్రమైన విచారణ జరగాలి. వ్యవస్థలను చంద్రబాబు మేనేజ్ చేస్తాడు. ఈ విషయం రిటైర్డ్ జడ్జిలే చెప్పారు. సీఎం జగన్ జనంని, దేవుడ్ని నమ్ముతారు. చంద్రబాబు తరహాలో లా వ్యవస్థలను మేనేజ్ చేసే నైజం సీఎం జగన్‌ది కాదు. లోకేష్ ఢిల్లీ వెళ్లి అమిత్ షా ని ఎందుకు కలిశారు. చంద్రబాబు ఆస్తులపైన, కేసుల పైన సీబీఐ విచారణకు సిద్ధమా..?’ అని నిలదీశారు. అన్ని నియోజకవర్గాల్లో బస్సుయాత్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సాధికారత చాటి చెప్పేలా బస్సు యాత్ర ఉంటుందని స్పష్టం చేశారు ఎమ్మెల్సీ తలశిల రఘురాం. సామాజిక సాధికర యాత్ర అన్ని నియోజకవర్గాల్లో సాగుతుందన్న తలశిల.. 26వ తేదీన ఇచ్చాపురం, తెనాలి, సింగణమాలలో యాత్ర ప్రారంభం అవుతుందన్నారు. -
ఎమ్మెల్సీ తలశిల రఘురాంను పరామర్శించిన వైఎస్ విజయమ్మ
-
తలశిల సతీమణి భౌతికకాయానికి సీఎం జగన్ దంపతుల నివాళులు
తాడేపల్లి: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ సతీమణి స్వర్ణకుమారి కన్నుమూయడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తలశిల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు సీఎం జగన్ దంపతులు ఆదివారం మధ్యాహ్నం గొల్లపూడి బయల్దేరి వెళ్లారు. రఘురాం భార్య స్వర్ణకుమారికి నివాళులు అర్పించి.. తలశిల కుటుంబాన్ని సీఎం జగన్ దంపతులు పరామర్శించారు. -
నారా లోకేశ్‌కు ఎమ్మెల్సీ తలశిల రఘురాం కౌంటర్
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్‌పై ఎమ్మెల్సీ తలశిల రఘురాం ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నీతిమాలిన రాజకీయాలు చేస్తోంది. రాజకీయాల కోసం తప్ప ప్రజల కోసం పాదయాత్ర చేస్తే మంచిది అంటూ కామెంట్స్ చేశారు. కాగా, ఎమ్మెల్సీ రఘురాం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని యాత్ర చేశారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను సీఎం వైఎస్ జగన్ నెరవేర్చారు. నారా లోకేశ్ పాదయాత్రకు కూడా అవే నిబంధనలు అమలవుతాయి. లోకేశ్ పాదయాత్రకు అనుమతులు ఇవ్వలేదంటూ కొన్ని పత్రికలు రాతలు రాస్తున్నాయి. అవన్నీ అవాస్తవాలు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నాము. కానీ, లోకేష్ మొదటి అడుగు పడకముందే కుట్రలు చేస్తున్నారు. రాజకీయాల కోసం తప్ప ప్రజల కోసం పాదయాత్ర చేస్తే మంచిది. అమరావతి రైతుల పేరుతో చేసిన యాత్ర కూడా మధ్యలోనే ఆగిపోయింది. నిజమైన లక్ష్యంతో యాత్రలు చేస్తేనే సక్సెస్ అవుతాయి. ప్రగల్భాల మాటలను టీడీపీ లీడర్లు మానుకోవాలి. సెక్యూరిటీ సమస్యలు రాకూడదనే మేము వివరాలు అడుగుతున్నాం. శాంతియుతంగా పాదయాత్ర చేస్తే అందరూ హర్షిస్తారు. లోకేష్, పవన్ కల్యాణ్‌తోపాటు ఇంకెవరైనా ఉంటే వారితో కూడా పాదయాత్ర చేయించుకోవచ్చు అని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. -
YSRCP Plenary 2022: ప్లీనరీ పండుగకు ముస్తాబు
సాక్షి, అమరావతి: అధికారంలోకి వచ్చాక తొలిసారిగా నిర్వహిస్తున్న ప్లీనరీని వైఎస్సార్సీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పార్టీ ఆవిర్భవించాక 2011 జూలై 8, 9వ తేదీల్లో తొలి ప్లీనరీ జరగగా 2017 జూలై 8, 9వ తేదీల్లో రెండో ప్లీనరీని నిర్వహించారు. అంతకంటే మిన్నగా ఈ దఫా మూడో ప్లీనరీని జూలై 8, 9వ తేదీల్లో నిర్వహించేలా భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇతర పార్టీలకు భిన్నంగా ప్రజాభ్యుదయమే అజెండాగా ప్లీనరీలు నిర్వహించడం వైఎస్సార్సీపీ విధానం. ఈ మేరకు ప్లీనరీల్లో తీసుకున్న నిర్ణయాలను, హామీలను అధికారంలోకి వచ్చాక సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 95 శాతం అమలు చేశారు. రానున్న రెండేళ్లలో ప్రజలకు మరింత సేవ చేయడం, బాసటగా నిలిచి రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడమే అజెండాగా మూడో ప్లీనరీని వైఎస్సార్సీపీ నిర్వహిస్తోంది. ప్రజాభ్యుదయమే లక్ష్యంగా.. ప్లీనరీకి విస్తృత స్థాయిలో ఆహ్వానాలు పంపుతున్నారు. గ్రామ, వార్డు సభ్యుల నుంచి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నామినేటెడ్ పదవుల్లో ఉన్న వారి వరకూ పేరుపేరునా ప్లీనరీకి ఆహ్వానిస్తూ సీఎం జగన్ లేఖలు రాశారు. వాటిని నాయకులకు అందచేసి ప్లీనరీకి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు ఆహ్వానిస్తున్నారు. తొలిరోజు ప్లీనరీకి పార్టీ నాయకులు హాజరుకానున్నారు. రెండో రోజు మరింత విస్తృత స్థాయిలో పార్టీ శ్రేణులు పాల్గొంటాయి. వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ ప్రారంభ ఉపన్యాసంతో ఆరంభమయ్యే ప్లీనరీ ఆయన ముగింపు ప్రసంగంతో ముగుస్తుంది. ప్రజాభ్యుదయమే లక్ష్యంగా చేపట్టాల్సిన చర్యలపై పార్టీ శ్రేణులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. భారీ వేదిక.. భోజన శాలలు రెండో ప్లీనరీ నిర్వహించిన ప్రదేశంలోనే విజయవాడ–గుంటూరు రహదారి పక్కనే నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న సువిశాల మైదానంలో మూడో ప్లీనరీని వైఎస్సార్సీపీ నిర్వహిస్తోంది. జాతీయ రహదారి నుంచి స్పష్టంగా కనిపించేలా 100 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పు, 6.5 అడుగుల ఎత్తుతో భారీ వేదిక నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. భారీ వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా 40 ఎకరాల విస్తీర్ణంలో భారీ టెంట్ నిర్మాణ పనులు ఇప్పటికే కొలిక్కి వచ్చాయి. ప్లీనరీకి హాజరయ్యే శ్రేణులకు వేడివేడిగా టిఫిన్లు, టీ, కాఫీలు, భోజనాల తయారీకి రెండు భారీ వంటశాలలను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఒక వంటశాల పనులు కొలిక్కిరాగా రెండో వంటశాల పనులను సోమవారం ప్రారంభించనున్నారు. అక్కడకు సమీపంలోనే భారీ భోజన శాలలు సిద్ధమవుతున్నాయి. ప్లీనరీకి విస్తృత స్థాయిలో శ్రేణులు హాజరుకానున్న నేపథ్యంలో భారీ ఎత్తున వాహనాలు రానున్నాయి. ట్రాఫిక్ పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గుంటూరు–విజయవాడ ప్రధాన రహదారితో అనుసంధానిస్తూ ప్లీనరీకి రోడ్లు నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమాలను సీఎం ప్రోగ్రామ్స్ కో–ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. -
అల్లూరి ఖ్యాతిని ఇనుమడింపజేసేలా..
సాక్షి ప్రతినిధి, ఏలూరు: అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు వచ్చేనెల 4న భీమవరంలో ఘనంగా నిర్వహించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డితోపాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. భీమవరంలో సభా ప్రాంగణం ఏర్పా ట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే స్పెషల్ ఎస్పీజీ, ఏఐజీ హిమాన్షుగుప్త, కేంద్ర కల్చరల్ డైరెక్టర్ అతుల్‌మిశ్రాలు ప్రాంగణాన్ని పరిశీలించి భద్రతా పరమైన ఏర్పాట్లపై స్థానిక అధికారులతో చర్చించారు. బుధవారం సీఎం ప్రోగ్రామ్స్ కో–ఆర్డినేటర్ తలశిల రఘురాం, జీఐడీ అదనపు కార్యదర్శి, ప్రధాని పర్యటన నోడల్ అధికారి రేవు ముత్యాలరాజు, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రజిత్ భార్గవ్‌లు సభా ప్రాంగణాన్ని, హెలిప్యాడ్‌ను పరిశీ లించారు. అనంతరం కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. 14 ఎకరాల ప్రాంగణంలో బహిరంగ సభావేదికను సిద్ధం చేస్తున్నారు. ప్రధాని సభావేదిక, వీఐపీలకు ప్రత్యేక గ్యాలరీతోపాటు ఇతర ఏర్పాట్లను చేస్తున్నారు. ప్రధాని పర్యటన ఖరారైన నేపథ్యంలో పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టారు. భీమవరంలో ట్రాఫిక్ మళ్లింపు, పార్కింగ్ ప్రాంతాలపైనా అధికారులు దృష్టి పెట్టారు. మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఉండి నియోజకవర్గ గడపగడపకు మన ప్రభుత్వం ఇన్చార్జి, డీసీసీబీ చైర్మన్ పీవీఎల్ నర్సింహరాజు, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి సర్రాజు ఏర్పాట్లను పరిశీలించారు. భీమవరంలో 30 అడుగుల అల్లూరి విగ్రహం భీమవరం ఏఎస్ఆర్ నగర్‌లోని మున్సిపల్ పార్కు లో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ జరుగనుంది. వచ్చేనెల 4న అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని, ముఖ్యమంత్రి చేతులమీదుగా విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. రూ.3 కోట్ల వ్యయంతో 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రత్యేకంగా సిద్ధం చేయించి పార్కులో ఏర్పాటుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా అల్లూరి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పకడ్బందీ ఏర్పాట్లు సాక్షి, భీమవరం: ప్రధాని నరేంద్ర మోదీ భీమవరం పర్యటన సందర్భంగా ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని జీఏడీ అదనపు కార్యదర్శి, ప్రధాని పర్యటన నోడల్ అధికారి రేవు ముత్యాల రాజు అధికారులను ఆదేశించారు. బుధవారం భీమవరం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో ఆయన సమావేశమై ప్రధాని పర్యటన ఏర్పాట్లపై శాఖల వారీగా సమీక్షించారు. అధికారులు, నోడల్ అధికారులు వారికి కేటాయించిన విధులపై పూర్తి అవగాహన కలిగి పీఎంఓ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. బహిరంగ సభకు వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సభాస్థలికి వెళ్లే మార్గాల్లో బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. తాగునీటి ప్యాకెట్లు, అల్పాహారం, బయో టాయిలెట్స్ ముందుగానే సిద్ధం చేసుకోవాలన్నారు. అనంతరం ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రజిత భార్గవ్‌తో కలిసి హెలిప్యాడ్లు, బహిరంగ సభ ప్రదేశాన్ని పరిశీలించారు. -
నిరాశాజనకంగా కేంద్ర బడ్జెట్
సాక్షి, అమరావతి: కేంద్ర బడ్జెట్ చాలా నిరాశాజనకంగా ఉందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం చెప్పారు. మంగళవారం ఆయన తాడేపల్లిలో మాట్లాడుతూ.. ఆంద్రప్రదేశ్ పట్ల కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపించిందని తెలిపారు. భారతీయ జనతా పార్టీ అనేది ఉత్తర భారతీయ జనతా పార్టీగా నిజస్వరూపాన్ని మరోసారి చూపించుకొందని వ్యాఖ్యానించారు. దక్షిణాది రాష్ట్రాలను మరోసారి వంచించే ప్రయత్నం చేశారన్నారు. విభజన హామీలు అయిన ప్రత్యేక హోదా, రైల్వే జోన్, ఆంధ్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు బడ్జెట్లో కేటాయింపులు లేకపోవడాన్ని చూస్తే బీజేపీ ఆంద్రప్రదేశ్‌ని పూర్తిగా విస్మరించినట్లు స్పష్టమైందని అన్నారు. కేంద్రం తీరును ఖండిస్తున్నామన్నారు. కేవలం ఎన్నికలు జరిగే రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ రూపొందించడం చాలా దుర్మార్గమని మండిపడ్డారు. పార్టీలు ఏవయినా అన్ని రాష్ట్రాలను సమదృష్టితో చూడాలని, అప్పుడే కేంద్ర రాష్ట్రాల మధ్య సమైక్య స్పూర్తి వర్ధిల్లుతుందని తెలిపారు. రాష్ట్ర బీజేపీ నాయకత్వం కేంద్రం మీద ఒత్తిడి చేసి రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. ఆంద్రప్రదేశ్‌కు వెంటనే తగిన న్యాయం చేసి, బడ్జెట్లో కేటాయింపులను సరి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
మర్యాద పూర్వకంగా గవర్నర్‌ను కలిసిన ఎమ్మెల్సీలు
సాక్షి, అమరావతి: నూతనంగా ఎమ్మెల్సీలుగా బాధ్యతలు తీసుకున్న తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను శనివారం మర్యాద పూర్వకంగా కలిసారు. రాజ్ భవన్ వేదికగా జరిగిన ఈ భేటీలో గవర్నర్ వీరితో ముచ్చటించారు. ప్రజా సేవే పరమావధిగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. శాసన వ్యవస్ధలో క్రియాశీలక పాత్ర పోషించే శాసన పరిషత్తుకు వన్నె తీసుకురావాలని, అర్ధవంతమైన చర్యలతో ప్రజా సమస్యలకు పరిష్కారాలు కనుగొనాలని గవర్నర్ సూచించారు. ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్తగా కూడా వ్యవహరిస్తున్న తలశిల రఘురామ్ ప్రభుత్వం అమలు చేస్తున్న విభిన్న సంక్షేమ కార్యక్రమాలను గురించి గవర్నర్‌కు వివరించారు. అలాగే పార్టీ కార్యాలయ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న లేళ్ల అప్పిరెడ్డి ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ క్రాస్ నేతృత్వంలో నిర్వహించిన రక్తదాన శిబిరాలు, ఇతర సేవ కార్యక్రమాల గురించి గవర్నర్‌కు వివరించారు. ఈ సందర్భంగా క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని రఘురామ్, అప్పిరెడ్డి గౌరవ గవర్నర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. చదవండి: Hyderabad: పబ్బుల యాజమాన్యాలకు సీపీ సీరియస్ వార్నింగ్!! -
టీడీపీకి మిగిలింది నిమ్మగడ్డ, నిమ్మాడే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో మొదటి విడతలో వైఎస్సార్సీపీ అభిమానులను గెలిపించడం ద్వారా సీఎం వైఎస్ జగన్ పాలనను ప్రజలు ఆశీర్వదించారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం అన్నారు. ఈ ఎన్నికలతో రాష్ట్రంలో టీడీపీ కనుమరుగు అవుతుందన్నారు. టీడీపీకి మిగిలింది నిమ్మగడ్డ, నిమ్మాడ మాత్రమేనని చెప్పారు. ఎన్నికలు పెడితే ఏదో తేల్చేస్తామన్న చంద్రబాబు ఇప్పుడేం చెబుతారని నిలదీశారు. చదవండి: (మళ్లీ అదే తీర్పు.. 2,319 పంచాయతీల్లో వైఎస్సార్సీపీ..) -
జీవితకాల మధుర‘యాత్ర’
ఈ రాష్ట్ర ప్రగతి, ప్రజా సంక్షేమాన్ని ఓ మేలి మలుపు తిప్పిన ప్రజా సంకల్పయాత్ర వంటి ఓ చారిత్రక ఘట్టంలో మేమూ భాగస్వాములమైనందుకు గర్వంగా భావి స్తాను. నిరాశ, నిçస్పృహలు అలముకున్న ప్రజలకు ‘నేనున్నాను’ అని ధైర్యం చెబుతూ జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వేసిన ఆ అడుగులు ఈ రాష్ట్ర అభివృద్ధికి పడిన గొప్ప ముందడుగు. ఇటీవల ప్రతిపక్ష నేత చంద్రబాబు తాను చేసిన పాదయాత్ర గురించి చెబుతూ ఆనాడు తన కాళ్లలో దిగిన ముళ్లు ఇప్పటికీ గుర్తుకు వస్తాయన్నారు. కానీ వైఎస్ జగన్మోహన్రెడ్డికిగానీ ఆయనతో కలసి పాదయాత్రలో పాల్గొన్న మాకుగానీ మేము పడిన కష్టాలు.. కాళ్ల బొబ్బలు.. జలుబులు, జ్వరాలు, వర్షాలు ఏవీ గుర్తుకు రావు. చివరికి అప్పటి టీడీపీ ప్రభుత్వ సహకారంతో విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో తనపై చేయించిన హత్యాయత్నం కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డికి గుర్తుకు రాదు. ఆ పాదయాత్రలో చూసిన ప్రజల కష్టాలు, వారి సమస్యలు, ఆవేదన గుర్తుకు వస్తాయి. అంతటి బాధల్లోనూ ప్రజలు పాదయాత్రకు బ్రహ్మరథం పట్టడం... తమ బాధలు తీర్చడానికి రాజన్న కొడుకు వచ్చాడని వాళ్ల మొహాల్లో కనిపించిన నమ్మకం గుర్తుకు వస్తుంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజకీయాలు విడిచిపెట్టారు. ప్రజలకు హామీ ఇచ్చినట్టుగా కులం చూడం.. మతం చూడం.. పార్టీలు చూడం.. అర్హులు అందరికీ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఆ యాత్ర ఎన్నో గొప్ప అనుభవాలు, జ్ఞాపకాలు మిగిల్చింది. అసలు కష్టం అన్నది ఏమిటో తెలియకుండా పెరిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర చేస్తానంటే మేము మొదట్లో కంగారుపడ్డాం. ఆయన పాదయాత్రకు ఏర్పాట్లు ఎలా చేయాలా అని తర్జనభర్జనపడ్డాం. మేము పది మందిమి ఓ జట్టుగా ఉండి పాదయాత్ర ఏర్పాట్లు పర్యవేక్షించాం. పగటి పూట అంతా పాదయాత్ర చేసే నాయకుడు రాత్రి వేళ అయినాసరే కాస్త హాయిగా విశ్రాంతి తీసుకునేలా చూడాలన్నది మా ఉద్దేశం. కానీ పాదయాత్రలో అన్ని చోట్ల విశ్రాంతికి సరైన ప్రదేశాలు దొరికేవి కావు. ఊరి చివర పొలాల్లో, కొన్ని సార్లు అయితే శ్మశానాల సమీపంలో కూడా రాత్రి విడిది ఏర్పాటు చేయాల్సి వచ్చేది. కానీ అవేవీ వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టించుకునే వారు కాదు. విడిది ఏర్పాట్లు ఎలా ఉన్నా ఆయనకు పట్టేది కాదు. ఆ రోజు ఎంతమంది ప్రజలను కలిశాను.. వారు చెప్పిన సమస్యలు ఏమిటి.. ఇంకా తనను ఎవరైనా కలవలేక పోతున్నారా... ఇంకా మారుమూల పల్లెలకు వెళ్లాలి... ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా చూడాలి.. అందుకోసం పాదయాత్రలో ఏమైనా మార్పులు చేయాలా అని మాతో చర్చించేవారు. కానీ తన వసతుల గురించి ఒక్కరోజు కూడా ఆయన మాట్లాడలేదు. పగటి పూట మొత్తం ఏమీ తినకుండా... అంటే టిఫిన్, భోజనం లేకుండానే ఆయన పాదయాత్ర చేసేవారు. మధ్యాహ్నం కొన్ని పండ్లు తినేవారు. రాత్రి వేళల్లోనే భోజనం చేసేవారు. అందుకనే ఆయన చిత్తశుద్ధి, దృఢ సంకల్పాన్ని ప్రజలు గుర్తించారు. అందుకే అఖండ మెజార్టీతో ఎన్నికల్లో గెలిపించి అధికారాన్ని అప్పగించారు. ప్రజల విశ్వాసాన్ని నిజం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 17 నెలలుగా ప్రజా సంక్షేమం, రాష్ట్ర ప్రగతి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. అంతటి జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వెన్నంటి పాదయాత్రలో మొదటి నుంచీ చివరి వరకూ పాల్గొనడం.. ఆ పాదయాత్ర కోఆర్డినేటర్‌గా వ్యవహరించడం ఓ గొప్ప అనుభూతి. జీవితకాలం పాటు గుర్తుండిపోయే ఓ మధుర జ్ఞాపకం. పాదయాత్రకు ముందు జగనన్న సైనికులుగా ఉండేవాళ్లం. ఆయన్ను చూసిన తర్వాత జనం సేవకులుగా మారిపోయాం. తలశిల రఘురాం వ్యాసకర్త ఏపీ ముఖ్యమంత్రి ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్, పాదయాత్రకు కోఆర్డినేటర్‌గా వ్యవహరించారు -
ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకున్న వైఎస్ జగన్
-
వైఎస్సార్సీపీ నేత తలశిల రఘురామ్‌కు కీలక బాధ్యతలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తలశిల రఘురామ్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వ కార్యక్రమాల సమన్వయ కర్తగా నియమిస్తూ.. ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. కీలక పదవి దక్కడంపై తలశిల స్పందిస్తూ... ప్రభుత్వంలో బాధ్యతలు అప్పగించిన సీఎం వైఎస్ జగన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనపై సీఎం పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా బాధ్యతలు నిర్వహిస్తానన్నారు. క్యాబినెట్ హోదాను హోదాలా కాకుండా బాధ్యతగా భావిస్తాననీ, ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్లి గుర్తింపు తెచ్చుకునేలా పనిచేస్తానని, పథకాలను ప్రజల్లోకి మరింత చేరువయ్యేలా పనిచేస్తానన్నారు. ప్రభుత్వానికి, పార్టీకి, కార్యకర్తలకు మధ్య సంధానకర్త గా వ్యవహరించి బాధ్యతలు నిర్వహిస్తానని పేర్కొన్నారు. -
‘ఆ వార్తలకు నాకు ఎలాంటి సంబంధం లేదు’
సాక్షి, అమరావతి : ప్రజావేదికకు సంబంధించి సోషల్ మీడియాలో తన పేరుతో సర్క్యులేట్ అవుతోన్న వార్తలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ స్పందించారు. కృష్ణా నది కరకట్టపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ నివాసం సమీపంలో నిర్మించిన ప్రజావేదికపై తానుగానీ, వైఎస్సార్సీపీ నుంచి గానీ ఎలాంటి లేఖలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో తనకు ఎటువంటి సంబంధం లేదని ఇదివరకే ప్రకటించానని పేర్కొన్నారు. కానీ, ఇంకా ఈ అంశంపై మీడియాలో వస్తున్న కథనాలను చూసి మరోసారి స్పష్టం చేయదలచుకున్నానని ఓ ప్రకటనలో పునరుద్ఘాటించారు. మీడియా మిత్రులు ఈ విషయాన్ని గమనించగలరని కోరారు. -
చివరి రోజు జగన్ ఎన్నికల ప్రచారం ఇలా...
సాక్షి, అమరావతి: ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారానికి గడువు మంగళవారంతో ముగుస్తుండగా.. చివరి రోజున ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు జిల్లాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు గుంటూరు జిల్లా మంగళగిరి, 11.30 గంటలకు కర్నూలు, మధ్యాహ్నం 2 గంటలకు చిత్తూరు జిల్లా తిరుపతిలో జరిగే ప్రచార సభల్లో జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. తిరుపతిలో జరిగే ప్రచార సభతో జగన్ తన ఎన్నికల ప్రచారాన్ని ముగిస్తారని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేడు డోన్, ఆళ్లగడ్డలో వైఎస్ విజయమ్మ ఎన్నికల ప్రచారం సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మంగళవారం ప్రచారం చివరి రోజున కర్నూలు జిల్లాలోని డోన్, ఆళ్లగడ్డ శాసనసభ నియోజకవర్గాల్లో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగిస్తారు. విజయవాడ పశ్చిమ, మైలవరం, జగ్గయ్యపేటలో షర్మిల ప్రచారం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మంగళవారం కృష్ణా జిల్లాలోని విజయవాడ(పశ్చిమ), మైలవరం, జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగిస్తారు. -
నేడు జగన్ పర్యటన ఇలా..
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం మూడు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం 9.30 గంటలకు గూడూరు (నెల్లూరు జిల్లా), 11.30 గంటలకు గిద్దలూరు (ప్రకాశం జిల్లా), మధ్యాహ్నం 1.30 గంటలకు దర్శి, 3.30 గంటలకు మైలవరం (కృష్ణా జిల్లా)లో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో వైఎస్ జగన్ పాల్గొని ప్రసంగిస్తారని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ తెలిపారు.