సీఎం జగన్‌ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డ్‌: తలశిల రఘురాం | MLC Talasila Raghuram Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డ్‌: తలశిల రఘురాం

Published Tue, Apr 23 2024 11:17 AM | Last Updated on Tue, Apr 23 2024 12:39 PM

MLC Talasila Raghuram Comments On Chandrababu - Sakshi

( ఫైల్‌ ఫోటో )

సాక్షి, విశాఖపట్నం: సీఎం జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డు అని ఎమ్మెల్సీ తలశిల రఘురాం అన్నారు. 16 సభలు, 9 రోడ్ షో లు, 6 ప్రత్యేక సమావేశాలు నిర్వహించామని, 2100 కిలోమీటర్ల మేర బస్సు యాత్ర చేపట్టారని ఆయన తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఎం జగన్‌పై హత్యాయత్నం చేసిన వెనక్కి తగ్గలేదన్నారు. ప్రజల్లో సీఎం జగన్ గ్రాఫ్ ఎంత పెరిగిందో స్పష్టమైందన్నారు.

‘‘పగటి పూట సభలు పెట్టలేని స్థితిలో చంద్రబాబు ఉన్నాడు. జనం రాక చంద్రబాబు బస్సులో గంటలకొద్దీ కూర్చుంటున్నాడు. విజయవాడ, విశాఖ రోడ్ షో లతో సీఎం జగన్ విజయం ఎలా ఉండబోతోందో అర్థమైంది. జ్వరం, దగ్గు, జలుబు అని హైదరాబాద్ వెళ్లిపోయే పవన్‌కి సీఎం జగన్‌ని విమర్శించే అర్హత లేదు. రెండు రోజుల్లో ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ ఖరారు చేస్తాం. బస్సు యాత్ర కంటే వినూత్నంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తాం’’ అని రఘురాం తెలిపారు.

‘‘ప్రజలు జగన్ వెంట నడుస్తున్న తీరు ప్రతిపక్షాలకు వణుకు పుట్టిస్తోంది. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు అడ్రాస్‌ ఉండదని తలశిల రఘురాం అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement