Bus Yatra 2024
-
‘రైతుబంధు’ వచ్చింది.. పిడికిలి బిగిస్తేనే! : కేసీఆర్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఆరు గ్యారంటీల పేరిట కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపిస్తోందని.. హామీలు అమలు చేయకుండా తప్పించుకోవాలని చూస్తోందని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. కేసీఆర్ పిడికిలి బిగించి నిలదీయడంతోనే.. కాంగ్రెస్ సర్కారుకు దెబ్బకు దెయ్యం వదిలి రైతుల ఖాతాల్లో రైతుబంధు (రైతు భరోసా) డబ్బులు వేసిందని చెప్పారు. ఇక రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ కోసం పిడికిలి బిగించి పోరాటం చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి హామీలన్నీ అమలు చేసేలా చేయాలంటే బీఆర్ఎస్ ఎంపీలు గెలవాల్సిందేనన్నారు. 12–14 సీట్లలో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. సోమవారం నిజామాబాద్ జిల్లాలోని కమ్మర్పల్లి, మోర్తాడ్, ఆర్మూర్, నిజామాబాద్‌లలో కేసీఆర్ బస్సుయాత్ర నిర్వహించారు. నిజామాబాద్ నగరంలో రోడ్ షో నిర్వహించి.. నెహ్రూ పార్క్ వద్ద కార్నర్ మీటింగ్‌లో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నెలలుగా ఆరు గ్యారంటీల పేరిట మోసం చేస్తూ వస్తోంది. అరచేతిలో వైకుంఠం చూపుతోంది. కాంగ్రెస్ అసమర్థ పాలన కారణంగా మళ్లీ రాష్ట్రంలో చేనేతల ఆత్మహత్యలు మొదలయ్యాయి. దేవుళ్ల కాడ ఒట్లు.. కేసీఆర్ మీద తిట్లు.. అనే పాలసీతో సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. అంతకుమించి చేస్తున్నదేమీ లేదు. రేవంత్ ప్రభుత్వం వచ్చాక ఫీజు రీయింబర్స్మెంట్, అంబేడ్కర్ ఓవర్సీస్, సీఎంఆర్ఎఫ్, కేసీఆర్ కిట్లు.. వంటివన్నీ ఆగిపోయాయి. కరెంటు సరిగా రావడం లేదు.. మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పంటలన్నీ ఎండబెట్టింది. గోదావరి నీళ్లను మోదీ వేరే రాష్ట్రాలకు ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటే సీఎం రేవంత్ అడ్డుకోలేకపోతున్నారు. బీఆర్ఎస్కు అండగా నిలవాలి.. కేసీఆర్ పిడికిలి బిగించి నిలదీయడంతోనే దెబ్బకు దెయ్యం వదిలి రైతుబంధు డబ్బులు ఖాతాల్లో వేశారు. అయినా రైతుబంధుకు 5 ఎకరాలకే కటాఫ్ పెట్టడం ఏమిటి? 6, 7 ఎకరాలున్న రైతులు బతకొద్దా? ఇక రూ.2 లక్షల రుణమాఫీ కోసం పిడికిలి బిగించి పోరాటం చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి ఆరు గ్యారంటీలు అమలు చేసేలా చేయాలంటే బీఆర్ఎస్ ఎంపీలు గెలవాల్సిందే. తెలంగాణ శక్తి, తెలంగాణ గళం, తెలంగాణ బలం బీఆర్ఎస్సే. 12–14 సీట్లలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలి. బీడీ కార్మికులకు పింఛన్లు ఇచ్చేది ఒక్క తెలంగాణలో మా త్రమే. మోదీ పింఛన్లు ఇవ్వలేదు. బీడీ కార్మీకులంతా బీఆర్ఎస్కు అండగా నిలబడాలి. కేంద్రంలో వచ్చేది ప్రాంతీయ పార్టీల ప్రభుత్వమేబీజేపీకి 400 సీట్లు వస్తాయని మోదీ గొప్పగా చెప్తున్నారు. కానీ 200లోపే సీట్లు వస్తాయి. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు రావు. కేంద్రంలో వచ్చేది ప్రాంతీయ పార్టీల ప్రభుత్వమే. బీజేపీ, కాంగ్రెస్ రెండూ కుమ్మక్కయ్యాయి. అందుకే పరస్పరం బలహీన అభ్యర్థులను నిలబెట్టుకున్నాయి. సబ్కా సాథ్ సబ్కా వికాస్ అంటున్న నరేంద్ర మోదీ... దేశంలో 157 మెడికల్ కళాశాలలు ఇస్తే తెలంగాణకు ఒక్కటి కూడా ఎందుకు ఇవ్వలేదు? ఒక్క నవోదయ పాఠశాల సైతం ఇవ్వలేదేం? ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానన్న మోదీ.. ఏం చేశారు? తెలంగాణకు ఏమీ చేయని మోదీకి ఎందుకు ఓటెయ్యాలి? నేను ప్రాణాలకు తెగించి కొట్లాడి తెలంగాణ తెచ్చిన. యావత్ తెలంగాణకు కేసీఆర్ ఆత్మబంధువు. నేను కూడా హిందువునే. కానీ మత విద్వేషాలు రెచ్చగొట్టవద్దన్నదే నా అభిమతం. నేను ప్రధాని మోదీని నిలదీసినందుకే.. నా కుమార్తె కవితను జైల్లో పెట్టారు. అయినప్పటికీ లొంగిపోయే ప్రసక్తే లేదు. గులాబీ జెండాను గుండెలో పెట్టుకోవాలి యువత ఆవేశంగా ఓట్లు వేయకుండా ఆలో చించి ఓట్లేసి బీఆర్ఎస్ను గెలిపించాలి. విద్యు త్, రైతుబంధు సరిగా రావాలన్నా.. మన గోదావరి నీళ్లు మనకే దక్కాలన్నా.. పార్లమెంటులో తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడాలన్నా.. బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలి. ప్రజల మంచి కోసం పేగులు తెగేదాకా కొట్లాడతాం. గులాబీ జెండాను గుండెల్లో పెట్టుకోవాలి..’’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు.రాకేశ్ రెడ్డికి ఎమ్మెల్సీ బీఫాం ఇచ్చిన కేసీఆర్నిజామాబాద్ నాగారం: వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజక వర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏనుగుల రాకేశ్ రెడ్డికి బీఫాంను స్వయంగా పార్టీ అధినేత కేసీఆర్ సోమవారం రాత్రి నిజామాబాద్‌లో అందజేశారు. నగరంలో రోడ్ షో ముగిసిన అనంతరం కేసీఆర్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా నివాసంలో బస చేశారు. ఈ సందర్భంగా బీఫాం అందజేసిన కేసీఆర్‌కు రాకేశ్ రెడ్డి పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, నాయకులు మహేశ్ బిగాల, రాజారాం యాదవ్ పాల్గొన్నారు.కేసీఆర్ వాహనాన్ని తనిఖీ చేసిన అధికారులుజగిత్యాల క్రైం: ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేస్తున్న కేసీఆర్.. సోమవారం సాయంత్రం జగిత్యాల నుంచి కోరుట్లకు వెళ్తుండగా చల్గల్ గ్రామశివారులో ఎన్నికల అధికారులు ఆయన బస్సును, ఇతర వాహనాలను తనిఖీ చేశారు. తనిఖీల్లో ఏమీ లభించలేదని వారు ప్రకటించారు. -
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
మేమంతా ‘సిద్దం’ బస్సు యాత్రముగింపు సభలో జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఒకమాట ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మధ్య తరగతిని ఆలోచనలో పడేసింది. “ఈ సభ నుంచి మీరు మీ ఇళ్ళకు వెళ్ళాక, మీ కుటుంబ సభ్యులు అందరూ పిల్లలు అవ్వాతాతలుతో సహా కలిసి కూర్చుని ఎవరికి వోటు వేయాలోమీరు చర్చించుకోండి...” అన్నారు.ఈ మాట విన్నాక, ప్రతి ఒక్కరూ ఆలోచనలో పడ్డారు. ఇన్నాళ్ళూ “నా వల్ల మేలు జరిగితే నాకు వోటు వేయండి” అని చెప్పిన సిఎం, ఇప్పుడు అదే మాటను మీ కుటుంబంలో అందరూ ఒక మాట అనుకొని ఒక నిర్ణయానికి రండి, అని దీన్ని ఒక ‘హోమ్లీ ఎఫైర్’గా మార్చారు. ఓటర్లు పోలింగ్ బూత్ లోకి వెళ్ళడానికిఇంకా మూడు వారాలు సమయం ఉండగా ఆయన ఇటువంటి కొత్త పని వాళ్లకు అప్పగించారు. వినడానికి ఇది సాదాసీదా ప్రకటనగా ఉన్నప్పటికీ, ‘పిల్లలు అవ్వాతాతలుతో సహా కలిసి కూర్చుని...’ అనిఅనడం ద్వారా జగన్ దీన్ని ఒక ఇంట్లో మూడు తరాలు కలిసి కూర్చుని చేసే నిర్ణయంగా మార్చారు.కొన్ని కుటుంబాలు ఒక నిర్ణయం తీసువడం అంటే, ఎక్కడో పనిచేస్తూ ‘పోలింగ్’ రోజు ఊళ్లోకి వచ్చేవారి పిల్లలతో‘ఫోన్’లోమాట్లాడి కూడా కావొచ్చు. జగన్ చెప్పాడు- “కొన్ని కొంచెం మాత్రం పెంచి ఇంతకు ముందు ఇచ్చినవన్నీ మళ్ళీ ఇస్తాడంట...” అనేది అ చర్చలో కీలకం అవుతుంది. అయితేవారి‘నిర్ణయం’ ఏమిటి? అనే విషయం వద్దకు వచ్చేసరికి.మూడు తరాల్లో కూడా యువతరం (ఎమర్జింగ్ జెనరేషన్) ఏమనుకుంటున్నది అనేదిప్రధానం అవుతున్నది.నిర్లక్ష్యిత, లేదా వర్ధమాన సమాజాల్లోని యువతరం తమ ఆర్ధిక ప్రయోజనాన్ని మించి మరీ,సామాజిక కోణంలో రాజకీయ స్పృహను పెంచుకుంటున్న తీరు ఈ ఎన్నికల్లోస్పష్టంగా కనిపిస్తున్నది.ఈ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కొందరు విశ్లేషకులు ఈ పార్టీకి నాయకులు తప్ప ‘కేడర్’ లేదు అనేవారు. స్థానిక సంస్థల ఎన్నికలు, నామినేటెడ్ పదవుల భర్తీ తర్వాత ఆ ఖాళీ చాలావరకు నిండింది. అయితే, ఏప్రెల్ చివరి వారంలో ఈ పార్టీకి ఉన్న అదృశ్యశక్తి ఏమిటో విశాఖ జిల్లా భీమిలి‘సోషల్ మీడియా వారియర్స్’ సదస్సులో దృశ్యమానం అయింది. ఇన్నాళ్ళూ జగన్ కోసం స్వచ్చందంగా పనిచేసినఅదృశ్య ‘కేడర్’ ఇది. అభిమానమే అర్హతగా తలుపులు లేని పుష్పక విమానమిది. ఆధునిక ప్రపంచంలో ఇప్పుడు ఉన్నవి రెండు రకాల యుద్దాలు అంటారు తత్వవేత్తలు.ఒకటి-'టెరిటోరియల్ బ్యాటిల్' మరొకటి-'ఐడిలాజికల్ బ్యాటిల్'. దీన్నేజగన్-‘పేదల కోసం పెత్తందార్లతో తన ప్రభుత్వం చేస్తున్న యుద్ధం’అంటారు.కావొచ్చు కూడా మరిఅటువంటప్పుడుఒక ప్రాంతం కోసం నాయకుడు తనను తానుకట్టేసుకోవడం రెండవ రకం యుద్ధం అయితే కావొచ్చు.అదలా ఉంచి స్వచ్చందంగా ‘సోషల్ మీడియా వారియర్స్’ఈ పార్టీని ఇలా ‘వోన్’ చేసుకోవడానికి మూడుకారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి- తమ సామాజిక వర్గాల వారు చిన్నదో పెద్దదో ఏదో ఒక రాజకీయ పదవితో ఈ ప్రభుత్వంలో గుర్తింపును పొందడం.రెండు- సంస్కరణలు వల్ల పరిపాలన వ్యవస్థ వారి సమీపానికి రావడం. మూడు- మొదటి ఐదేళ్లలోనే ‘రియాల్టీ’గా కనిపిస్తున్న2019 ఎన్నికల వాగ్దానాలు. వీటిని మించి విభజిత ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రంగా రూపాంతర (ట్రాన్ఫార్మింగ్) దశలో ఉన్నప్పుడు,తమ కొత్త రాష్ట్రం ఎలా ఉండాలి? అనే భావన, దాన్ని వాస్తవం చేసే నాయకుడు ఎవరు? ప్రభుత్వం ఏది? అనే విషయంలో యువతఇప్పుడుపూర్తి స్పష్టతతో ఉంది. రేపటి వారి అవసరాలు,వారి పిల్లల అవసరాలు వారికీ ప్రధానం. వాటివెనుక- ఆర్ధికం సామాజికం సాంస్కృతికం ప్రాంతీయం ఇన్ని అంశాల నేపధ్యాలు ఉన్నాయి.ఎన్నికలు అనేసరికి తమ పార్టీల ప్రాధాన్యతల ఎంపికలో ‘కన్ఫ్యూజన్’కు గురి అవుతున్నది ఎవరు? వాటిని నిజాయతీగా అర్ధం చేసుకుంటున్నది ఎవరు?అనేది వాళ్లకు ఇప్పుడు పూర్తిగా అర్ధమయింది. ఎన్నికల ముందు ‘సీట్ల’ కోసం జరిగిన కొందరి పార్టీల మార్పు, నిరుపేదలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం ఇచ్చే ప్రయత్నాలను పబ్లిగ్గా అవహేళన చేస్తున్న తీరు, వారి దృష్టిని దాటిపోయేవి కాదు. అటువంటివి వాళ్లకు ఎక్కడ గుచ్చుకోవాలో అక్కడ గుచ్చుకుంది. అందుకే, కేవలం పార్టీ పట్ల రాజకీయ అభిమానం ఉంచుకోవవడమే కాకుండా,నాయకుడి పట్ల యువత దాన్ని బహిరంగంగా వ్యక్తం చేసే తీరులో మునుపు ఎన్నడూ మనం చూడనివ్యక్తీకరణ ఒక‘హై వోల్టేజ్’ దేహభాషగా స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ కసి వెనుక ఉన్న కారణాల కోసం చూసినప్పుడు, రెండు ప్రధాన అంశాలు కనిపిస్తాయి. మొదటిది- ప్రభుత్వం నుంచి అందే మేలు ఏదైనా నిర్ణయాధికారం స్థానిక ఆధిపత్య వర్గాల చేతిలో నుంచి ఇప్పుడు అది సాంకేతికం అయింది. ఊళ్ళోని గ్రామ సచివాలయాల సిబ్బంది, ‘వాలంటీర్ల’ వద్దకు ‘ఆన్ లైన్’లోఅది చేరువయింది. దాన్ని ఆక్షేపిస్తూ ఏదొ వంకతో అ సేవలను నిలపాలనే వర్గాల నైజం కూడా అర్ధమయింది. జరుగుతున్న ‘యుద్దం’లో నిర్లక్ష్యిత, లేదా వర్ధమాన సమాజాల్లోని యువత ఇది తమ నిశబ్దవిజయం అనుకొంటున్నారు. రెండవది- గడచిన ఇరవై ఏళ్లుగాచిన్న’బ్యాగ్’ భుజాన వేసుకుని కాళ్ళకు చక్రాలు కట్టుకుని, దేశంలో ఎక్కడ పని దొరికితే అక్కడికిజీవిక వెతుక్కుంటూవెళ్ళాము. ఇక ముందు మాకు ఈ తిరుగుడు తగ్గాలి. దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి వర్గాల్లో కుటుంబం అంతా కనీసం సమీపంగా కలిసి జీవించే పరిస్థితి రావాలిఅనేది వారి ఆకాంక్ష. ఇప్పుడు వున్నఈ- ‘ఫీల్ గుడ్’ వాతావరణంతో పాటుగా,వేగవంతమైన అభివృద్ధి కోసం ఇప్పటికే సిద్దమయిన ‘లాజిస్టిక్స్’, వాటికితోడుగావిస్తరిస్తున్న మౌలిక వసతుల వల్లఇకముందు ఉపాధి అవకాశాలు ఇక్కడే మెరుగవుతాయనికొత్త పార్టీ ప్రణాళిక చూశాక వాళ్ళు బలంగా నమ్ముతున్నారు.జాన్సన్ చోరగుడి వ్యాసకర్త అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత -
జగన్ మార్కుతో సమాజం ‘సిద్ధం’: సీఎం వైఎస్ జగన్
సమాజంలో ప్రతి రంగాన్ని మీ బిడ్డ ప్రభుత్వం అధికారం దక్కిన మొదటి రోజు నుంచే ఎలా సిద్ధం చేసిందో మీరే గమనించాలని కోరుతున్నా. రాష్ట్రంలో ఎప్పుడూ చూడని మార్పులతో గ్రామస్థాయిలో వ్యవసాయ రంగం సిద్ధం! విప్లవాత్మక మార్పులతో మన గవర్నమెంట్ బడి సిద్ధం! గ్రామస్థాయి నుంచి వైద్య ఆరోగ్య రంగంలో అనేక విప్లవాత్మక మార్పులతో గవర్నమెంట్ ఆస్పత్రి సిద్ధం! పట్టణాలు, గ్రామాల్లో ఇంటింటికీ సేవలందిస్తున్న వలంటీర్ల వ్యవస్థ సిద్ధం! ఏకంగా 1.35 లక్షల మంది శాశ్వత ఉద్యోగాలతో మన చెల్లెమ్మలు, తమ్ముళ్లు దాదాపు 600 రకాల సేవలందిస్తూ మన గ్రామాల్లో సచివాలయాల్లో సిద్ధం! 58 నెలల్లో గ్రామ స్వరాజ్యం సిద్ధం! పట్టణాల్లో సైతం ఇంటింటికీ పౌరసేవలు సిద్ధం! దేశ చరిత్రలో తొలిసారిగా లంచాలు, వివక్ష లేకుండా రూ.2.70 లక్షల కోట్లు ఇంటింటికీ డోర్ డెలివరీ చేసిన వ్యవస్థ సిద్ధం! ఒకటో తేదీనే ఇంటికే వచ్చి రూ.3,000 పెన్షన్ ఇచ్చే వలంటీర్ల వ్యవస్థ సిద్ధం! ఇదీ మీ బిడ్డ ప్రభుత్వం సమాజాన్ని సిద్ధం చేసిన తీరు. – సీఎం జగన్ సాక్షి, శ్రీకాకుళం: ‘‘ఇంటింటి అభివృద్ధిని కాపాడుకునేందుకు సిక్కోలు సింహాలు ఇవాళ ఇక్కడకు కదలివచ్చాయి. ఈ విప్లవ గడ్డపై ఆ పెత్తందార్ల ముఠాపై ఎగురవేస్తున్న తిరుగుబాటు బావుటా కనిపిస్తోంది. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు అడుగడుగునా జన సముద్రమే. వైఎస్సార్ జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు దారి పొడవునా జన సునామీని చూస్తుంటే 25 ఎంపీలకు 25 ఎంపీలు, 175 అసెంబ్లీ స్థానాలకు 175 అసెంబ్లీ స్థానాలు మొత్తంగా డబుల్ సెంచరీ కొట్టేందుకు మీరంతా సిద్ధమేనా?’’ అని ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. 22 రోజుల పాటు సాగిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగింపు సందర్భంగా బుధవారం శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం అక్కవరం వద్ద నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. ఆ వివరాలివీ..బలమైన పునాదులతో..ఇంటింటి భవిష్యత్తు, పథకాల కొనసాగింపును నిర్ణయించే ఎన్నికలు మరో 18 రోజుల్లో జరగనున్నాయి. ఇవి కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవి మాత్రమే కాదు. ఈ 58 నెలల కాలంలో బలమైన పునాదులతో పేదల కోసం తెచ్చిన పలు సంస్కరణలు, పథకాలు కొనసాగాలా? వద్దా? అనేది నిర్ణయించే ఎన్నికలు. జగన్‌కు ఓటు వేస్తేనే పథకాలన్నీ కొనసాగుతాయి. చంద్రబాబుకు ఓటేయమంటే పథకాలన్నింటికీ ముగింపే. మళ్లీ మోసపోవటమే. జగన్‌ను ఓడించాలని వాళ్లు.. పేదలను గెలిపించాలని మనం తలపడుతున్న ఈ యుద్ధంలో మరో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకునేందుకు మీరంతా సిద్ధమేనా? మంచి చేసిన చరిత్రగానీ, పేదల ఆశీస్సులుగానీ లేని ఆ మూడు పార్టీల కూటమి, వారి మోసాలకు చెంప ఛెళ్లుమనేలా సమాధానం చెప్పేందుకు మీరంతా సిద్ధమేనా? కుటుంబంతో చర్చించండిసినిమాకు వెళ్లినప్పుడు హీరో ఎందుకు నచ్చుతాడు? విలన్ ఎందుకు నచ్చడో ఒక్కసారి ఆలోచించండి. గుణగణాలు, మంచితనం వల్ల మా హీరో అని అనుకుంటాం. మోసాలు, అబద్ధాలు, కుట్రలు పన్నే క్యారెక్టర్‌ను విలన్ అంటాం. నిజ జీవితంలో, రాజకీయాల్లో హీరో ఎవరు? విలన్ ఎవరు? అనేది ఒక్కసారి ఆలోచన చేయండి. మీరంతా ఇంటికి వెళ్లాక కాసేపు కుటుంబ సభ్యులతో కూర్చుని నింపాదిగా మాట్లాడండి. చిన్నపిల్లల అభిప్రాయాన్ని కూడా తెలుసుకోండి. అవ్వాతాతలు, ఆడపడుచుల అంతరంగాన్ని గమనించండి. ఎవరి పాలనలో మంచి జరిగింది? ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుందనే నమ్మకం కలుగుతుందో వారితోనే అడుగులు ముందుకు వేయాలని కోరుతున్నా. మీ గుండె చప్పుడే ‘‘సిద్ధం’’పొత్తుల జిత్తులు, జత కట్టిన జండాలకు బదులిస్తూ జగన్ వెనుక ఎన్ని కోట్ల మంది పేదలున్నారో చూపిస్తే అదే.. సిద్ధం! సామాన్యులు, పేదల గుండె చప్పుడే ఈ సిద్ధం. ఇడుపులపాయలో మొదలై ఇచ్ఛాపురం వరకు సాగిన ఈ బస్సు యాత్ర మన పార్టీ జైత్రయాత్రకు సంకేతం. ఇది మూడు నాలుగు నెలల క్రితం మొదలు పెట్టింది కాదు. ఓ 25 సభలతో వచ్చింది కాదు. మనందరి ప్రభుత్వం 58 నెలలుగా విప్లవాత్మక మార్పులు తెస్తూ చేస్తున్న యుద్ధమే ఈ సిద్ధం. ఆ చైతన్యం పేరే..ఇక్కడ నిర్వహిస్తున్న సభ పేరు మాత్రమే కాకుండా మరో ఐదేళ్లు ఈ మార్పులన్నీ కొనసాగాలని ఇంటింటికీ వెళ్లి వారు మరో వంద మందికి వివరించాల్సిన అవసరాన్ని చెప్పే అవసరమే ఈ సిద్ధం! మీకు మంచి జరిగి ఉంటే.. మీ ఇంటికి మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలవాలని ప్రజలను కోరే ధైర్యమే సిద్ధం! ఎన్నికలు కాగానే మేనిఫెస్టోను చెత్తబుటలో పారేసే చంద్రబాబు సంస్కృతిని సమాధి కట్టి 99 శాతం వాగ్దానాలను నెరవేర్చి ఇంటింటికీ మళ్లీ ఆ మేనిఫెస్టోను పంపి ఎన్నికల వాగ్దానాలపై చేసిన చైతన్యం పేరే సిద్ధం!పేదలు, అక్కచెల్లెమ్మలను రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా సాధికారత దిశగా చెయ్యి పట్టుకుని నడిపించే ఘటమే ఈ సిద్ధం! ఇంతగా సిద్ధమైన సమాజంతో, మీ జగన్ పార్టీతో యుద్ధానికి బాబు మరో మూడు పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సి వస్తోంది. పరోక్షంగా కూడా పొత్తులు వెతుక్కోవాల్సి వస్తోంది. కుట్రలకు దిగజారాల్సి వస్తోంది. నాలుగు మంచి పనులు చేశానని చెప్పలేని చంద్రబాబు రోజూ నన్ను తిట్టడం, తిట్టించడం, వారి ఛానళ్లు, పత్రికల్లో అదో ఘనకార్యమన్నట్లుగా చూపిస్తున్నారు. ఇది గొప్ప రాజకీయం అవుతుందా? మన అభ్యర్థులను ఆశీర్వదించండిఎంపీ అభ్యర్థి తిలక్, టెక్కలి నుంచి శ్రీను, ఆమదాలవలస నుంచి తమ్మినేని సీతారామ్, పలాస నుంచి డాక్టర్ అప్పలనాయుడు, పాతపట్నం నుంచి శాంతమ్మ, ఇచ్చాపురం నుంచి విజయమ్మ, నర్సీపట్నం నుంచి ధర్మాన కృష్ణదాస్, శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావును ఆశీర్వదించి గెలిపించాలని కోరుతున్నా. ఏనాడైనా ఆత్మవిమర్శ చేసుకున్నారా?మన ప్రభుత్వం వల్ల పేదల కుటుంబాల్లో, వారి చదువుల్లో, అక్కచెల్లెమ్మల సాధికారతలో, అవ్వాతాతలకు అందిన మనశ్శాంతిలో, రైతన్నలకు అందిన ఆత్మస్థైర్యంలో, సామాజిక వర్గాలకు దక్కిన ఆత్మగౌరవంలో ఎంత మార్పు తీసుకురాగలిగామో టీడీపీ, చంద్రబాబు, ఆయనకు దరువు వేసే ఎల్లో మీడియా ఏనాడైనా కనీసం ఆత్మవిమర్శ చేసుకోవడం చూశారా? ఇలాంటి వారికి పరిపాలన ఇవ్వడం అంటే అర్థమేమిటి? ప్రభుత్వం అనేది ఎవరి కోసం? అందమైన వాగ్ధానాలతో అధికారం లాక్కుని ఐదేళ్లు వంచించటానికి, లూటీ చేసి దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం, దాచుకోవడం కోసమే వారికి అధికారం కావాలని అడుగుతున్నారు. బాబు రోల్డ్ గోల్డ్ దుకాణం..మీ బిడ్డ కరోనా కష్టంలో కూడా సాకులు వెతుక్కోలేదు. ఏ ఒక్క పథకాన్నీ, బటన్లు నొక్కటాన్ని ఆపలేదు. పేదవారి కష్టం తన కష్టం కంటే ఎక్కువని భావించాడు. మీ జగన్ స్వచ్ఛమైన మనసుతో, మంచి చేశాననే ఆత్మవిశ్వాసం, ఆత్మ సంతృప్తితో మీ ముందు సవినయంగా తలెత్తుకుని నిలబడ్డాడు. 2014 ఎన్నికల్లో కూడా చేయలేని ఏ వాగ్దానాలనూ మేనిఫెస్టోలో మీ బిడ్డ చెప్పలేదు. రాష్ట్ర ప్రజలు, నమ్ముకున్న వారిని ఎన్నటికీ మోసం చేయడు. బాబు మాదిరిగా రోల్డ్ గోల్డ్ దుకాణం తెరవడు.దాన్ని బంగారం అని నమ్మించే యత్నం చేయడు. చంద్రబాబు నిర్వహించే వాగ్దానాల వేలంలో మీ బిడ్డ పాల్గొనడు. 14 ఏళ్లు అధికారంలో ఉండీ ఏ ఒక్క మంచి పని చేయని చంద్రబాబుతో మీ బిడ్డ పోటీ పడడు. మీ జగన్ మార్కు ఇవాళ ప్రతి పేద ఇంట్లోనూ కనిపిస్తుంది. ప్రతి అక్కచెల్లెమ్మ చిరునవ్వులో, అవ్వాతాతల ఆనందంలో, పిల్లల ఆత్మవిశ్వాసంలో కనిపిస్తుంది. మీ జగన్ మార్కు ప్రతి గ్రామంలోనూ కనిపిస్తుంది. జగన్‌కు పేదలపై ఉన్నంత ప్రేమ ఈ దేశ రాజకీయ చరిత్రలో మరే నాయకుడికీ లేదు, ఉండదు. ఇది నిజం. ఇది మాత్రమే నిజం. ఇదీ చదవండి: యువనేత జైత్రయాత్ర!నావల్ల కానిది బాబు జేజమ్మ కూడా చేయలేదు..జగన్ చేయలేని ఏ స్కీమ్‌నూ చంద్రబాబు కాదు కదా.. ఆయన జేజమ్మ కూడా చేయలేదు! మోసాలు, అబద్ధాలతో ఏ స్థాయికైనా దిగజారి పొత్తులు పెట్టుకునే ఆయనతో మీ బిడ్డ పోటీ పడలేడు. నిజాలు, నిజాయితీకి ప్రజలు విలువ ఇస్తారన్న నమ్మకం నాకుంది. బాబు మాదిరిగా నేను మోసపూరిత వాగ్దానాలు చేయను. మోసాన్ని మోసంతోనే జయించాలన్న రాజనీతిని మీ బిడ్డ పాటించడు. మోసాన్ని నిజాయితీతోనే జయించవచ్చని నిరూపించటానికి మీ బిడ్డ సిద్ధం. మరి మీరంతా కూడా సిద్ధమేనా? మోసాలా.. విశ్వసనీయతా? మీకు ఎలాంటి నాయకుడు కావాలని అందరినీ అడుగుతున్నా. బాబు లాంటి మోసగాడు కావాలా? జగన్ లాంటి నిజాయితీపరుడు కావాలా? మేనిఫెస్టోలో చెప్పేవన్నీ ఎగ్గొట్టే నాయకుడు అబద్ధాలు, వెన్నుపోట్లు నైజంగా కలిగిన నాయకుడు కావాలా? లేక నోటి నుంచి ఒక మాట వస్తే, మేనిఫెస్టోలో చేరిస్తే తు.చ. తప్పకుండా పాటించే జగన్ లాంటి నాయకుడు కావాలా? సొంత బలం లేక పొత్తుల డ్రామాలాడే నాయకుడు కావాలా? లేక చేసిన మంచిని చూపిస్తూ సింహంలా సింగిల్‌గా వచ్చే నాయకుడు కావాలా? మోసాలు చేసే చంద్రబాబు కావాలా? విశ్వసనీయతతో నిలబడే జగన్ కావాలా? తమ నాయకుడి గురించి కాలర్ ఎగరేసి గర్వంగా ఇంటింటికీ చెప్పుకోగలిగిన మీ బిడ్డ కావాలా? చెప్పిన మాటలు గాలికి వదిలేసే బాబు కావాలా? వ్యత్యాసాన్ని తుడిచి వేస్తూ..పిల్లలెవరకూ తమ కులం, మతం, ఆర్థిక పరిస్థితుల వల్ల మంచి చదువులు చదువుకోలేకపోయామని బాధపడేందుకు వీల్లేని సమ సమాజాన్ని మీ బిడ్డ నిర్మిస్తున్నాడు. ధనికులు, పేదలకు వేర్వేరు చదువులు అనే వ్యత్యాసాన్ని మీ బిడ్డ తుడిచి వేస్తున్నాడు. ఒక రైతు, ఒక కూలీ, చిరువ్యాపారి, పేద కుటుంబం, నిరుపేద సామాజిక వర్గం.. ఇలా ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వం నా కుటుంబానికి మంచి చేసిందని, ఆ మంచిని కొనసాగిస్తుందనే నమ్మకాన్ని ఇవ్వగలిగే పరిపాలనను 58 నెలలుగా అందిస్తున్నాడు. వ్యవస్థలు బాగుండాలంటే..మోసాలు, అబద్ధాలతో పోరాడుతూ రాష్ట్రం, పేదల భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమేనా? సిద్ధమైతే వారి చీకటి యుద్ధాన్ని, ఆ ఎల్లో మీడియా అసత్యాల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు సెల్ఫోన్లలో టార్చిలైట్లను వెలిగించండి. వలంటీర్లు మళ్లీ మన ఇంటికే రావాలన్నా, పేదలకు పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు, వివక్ష లేని పాలనతో ముందుకు పోవాలన్నా, మన వ్యవస్థలన్నీ బాగుండాలన్నా ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేసి 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లోనూ గొప్ప మెజార్టీతో గెలిపించాలి. బలమైన పునాదులతో..ఇంటింటి భవిష్యత్తు, పథకాల కొనసాగింపును నిర్ణయించే ఎన్నికలు మరో 18 రోజుల్లో జరగనున్నాయి. ఇవి కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవి మాత్రమే కాదు. ఈ 58 నెలల కాలంలో బలమైన పునాదులతో పేదల కోసం తెచ్చిన పలు సంస్కరణలు, పథకాలు కొనసాగాలా? వద్దా? అనేది నిర్ణయించే ఎన్నికలు. జగన్‌కు ఓటు వేస్తేనే పథకాలన్నీ కొనసాగుతాయి. చంద్రబాబుకు ఓటేయమంటే పథకాలన్నింటికీ ముగింపే. మళ్లీ మోసపోవటమే. జగన్‌ను ఓడించాలని వాళ్లు.. పేదలను గెలిపించాలని మనం తలపడుతున్న ఈ యుద్ధంలో మరో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకునేందుకు మీరంతా సిద్ధమేనా? మంచి చేసిన చరిత్రగానీ, పేదల ఆశీస్సులుగానీ లేని ఆ మూడు పార్టీల కూటమి, వారి మోసాలకు చెంప ఛెళ్లుమనేలా సమాధానం చెప్పేందుకు మీరంతా సిద్ధమేనా? కుటుంబంతో చర్చించండిసినిమాకు వెళ్లినప్పుడు హీరో ఎందుకు నచ్చుతాడు? విలన్ ఎందుకు నచ్చడో ఒక్కసారి ఆలోచించండి. గుణగణాలు, మంచితనం వల్ల మా హీరో అని అనుకుంటాం. మోసాలు, అబద్ధాలు, కుట్రలు పన్నే క్యారెక్టర్‌ను విలన్ అంటాం. నిజ జీవితంలో, రాజకీయాల్లో హీరో ఎవరు? విలన్ ఎవరు? అనేది ఒక్కసారి ఆలోచన చేయండి. మీరంతా ఇంటికి వెళ్లాక కాసేపు కుటుంబ సభ్యులతో కూర్చుని నింపాదిగా మాట్లాడండి. చిన్నపిల్లల అభిప్రాయాన్ని కూడా తెలుసుకోండి. అవ్వాతాతలు, ఆడపడుచుల అంతరంగాన్ని గమనించండి. ఎవరి పాలనలో మంచి జరిగింది? ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుందనే నమ్మకం కలుగుతుందో వారితోనే అడుగులు ముందుకు వేయాలని కోరుతున్నా. 2014లో చంద్రబాబు ముఖ్యమైన మోసాలివీ..► రైతులకు రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాల మాఫీ జరిగిందా? ► పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రూ.14,205 కోట్లు మాఫీ చేస్తామని చెప్పి కనీసం ఒక్క రూపాయైనా మాఫీ చేశాడా?► ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు చొప్పున బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నాడు. ఎవరికైనా ఒక్క రూపాయి డిపాజిట్ చేశారా?► ఇంటికో ఉద్యోగం లేదంటే రూ.2 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు. ఐదేళ్లలో అంటే 60 నెలల పాటు నెలకు రూ.రెండు వేలు చొప్పున ప్రతి ఇంటికి రూ.1.20 లక్షలు ఒక్కరికైనా ఇచ్చాడా?► అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు ఇస్తామన్నారు. ఏ పేదవాడికైనా ఒక్క సెంటు స్థలం ఇచ్చాడా?► రూ.10 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ అన్నాడు. చేనేత, పవర్‌లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు. మరి అయ్యాయా?► మహిళా ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. మరి చేశాడా? ► సింగపూర్‌కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు.. చేశాడా? ► ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. కట్టాడా? టెక్కలిలో లేదా శ్రీకాకుళంలో ఏమైనా కనిపిస్తోందా? ► ముఖ్యమైన హామీలంటూ ఒక్కటైనా నెరవేర్చాడా? ► పోనీ ప్రత్యేక హోదా తెచ్చాడా అంటే అదీ లేదు.► ఇప్పుడు సూపర్ సిక్స్, సెవెన్, ఇంటింటికీ కేజీ బంగారం, బెంజి కార్ అంటూ మళ్లీ మోసాలకు తయారయ్యారు. -
టెక్కలి సభలో సీఎం జగన్ పొలిటికల్ పంచ్‌లు
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: ‘‘మీ బిడ్డకు ఓటేస్తేనే.. పథకాలు కొనసాగుతాయి. చంద్రబాబుకు ఓటేస్తే.. పథకాలన్నీ ముగింపే. కూటమి మోసాలకు చెంప చెళ్లుమనిపించాలంటూ టెక్కలి బహిరంగ సభ వేదికగా ప్రతిపక్షాల కుట్రలను సీఎం జగన్ తిప్పికొట్టారు. అబద్ధపు హామీలిచ్చి చంద్రబాబు ప్రజలను మోసం చేశారు. దోచుకోవడం, పంచుకోవడం వారి అలవాటు. మీ బిడ్డ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం చేశాం. ధనికులకు, పేదలకు వేర్వేరు చదువుల వ్యత్యాసం తుడిచివేశాం. డబుల్ సంచరీ కొట్టేందుకు మీరంతా సిద్ధంగా ఉండాలి’’ అని సీఎం జగన్ పిలుపునిచ్చారు.సీఎం జగన్ స్పీచ్ హైలైట్స్..బాబు లాంటి మోసగాడు కావాలా? జగన్ లాంటి నిజాయితీపరుడు కావాలా?చంద్రబాబు మోసాలు, అబద్దాలు, వెన్నుపోట్లతో నేను పోటీ పడలేను.చంద్రబాబులాగా నేను మోసపు హామీలు ఇవ్వనుఎన్నికలు కాగానే మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసిన చంద్రబాబు సంస్కృతిని చూశాం చంద్రబాబు పేరు చెబితే ఒక మంచి పని కూడా గుర్తుకురాదు.పేద ప్రజల గుండె చప్పుళ్లే ఈ సిద్ధం సభలువిద్యారంగంలో విప్లవాత్మక మార్పులతో ప్రభుత్వ బడులు సిద్ధంవైద్యరంగంలో విప్లవాత్మక మార్పులతో ప్రభుత్వాసుపత్రులు సిద్ధంఇంటింటికి పౌరసేవలందిస్తున్న వాలంటీర్ల వ్యవస్థ సిద్ధం600లకు పైగా సేవలందిస్తున్న గ్రామ, వార్డు సచివాలయాలు సిద్ధంమంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి. మీ జగన్ మార్క్.. ప్రతి పేదింట్లో కనిపిస్తోందిమీ జగన్ మార్క్.. అక్కా చెల్లెమ్మల చిరునవ్వులో కనిపిస్తుందిమీ జగన్ మార్క్.. ప్రతి గ్రామంలోనూ కనిపిస్తోందిమాట మీద నిలబడే మీ జగన్ కావాలా?. మోసం, దగా చేసే చంద్రబాబు కావాలా? ఆలోచన చేయండి2014లో ఇదే కూటమి చేసిన మోసాలు గుర్తున్నాయా?రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తానన్నాడు.. చేశాడా?ఆడబిడ్డ పుడితే రూ.25వేలు డిపాజిట్ చేస్తానన్నాడు..చేశాడా?ఇంటికో ఉద్యోగం అన్నాడు.. ఇచ్చాడా?ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు.. ఇచ్చాడా?అర్హులకు మూడు సెంట్ల ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?10వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ అన్నాడు.. చేశాడా?సింగ్‌పూర్‌ని మించి అభివృద్ధి చేస్తానన్నాడు.. చేశాడా?ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తానన్నాడు.. నిర్మించాడా?మళ్లీ ఇదే కూటమి కొత్త కొత్త మోసాలతో వస్తుందిఇంటింటికి కేజీ బంగారం, బెంజ్‌కారు ఇస్తారంట నమ్ముతారా?.ఈ మోసగాళ్ల నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు మీరంతా సిద్ధమా?ఇప్పుడు సూపర్ సిక్స్ అంటూ చంద్రబాబు వస్తున్నాడు -
ఈ యాత్ర వైఎస్సార్సీపీ జైత్రయాత్రకు సంకేతం: సీఎం జగన్
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: ఈ యాత్ర వైఎస్సార్సీపీ జైత్రయాత్రకు సంకేతం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం శ్రీకాకుళం జిల్లా టెక్కలి వద్ద నిర్వహించిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగింపు సభలో ఆయన ప్రసంగించారు. ‘‘సిక్కోలు జనం సింహాల్లా కదిలివచ్చారు. వైఎస్సార్ జిల్లా నుంచి శ్రీకాకుళం వరుకూ జన సముద్రాలే కనిపించాయి. శ్రీకాకుళం జిల్లాలో జన సముద్రం కనిపిస్తోంది. డబుల్ సంచరీ కొట్టేందుకు మీరంతా సిద్ధమా?’’ అంటూ సీఎం పిలుపునిచ్చారు.‘‘జగన్‌కు ఓటేస్తేనే.. పథకాలన్నీ కొనసాగుతాయి. చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నింటికి ముగింపే. పేద ప్రజల గుండుచప్పుడే ఈ సిద్ధం సభ. మూడు పార్టీల కూటమి మోసాలకు చెంపచెళ్లు మనేలా సమాధానం చెప్పాలి. ఈ యాత్ర వైఎస్సార్సీపీ జైత్రయాత్రకు సంకేతం. జగన్‌కు ఓటేస్తే పథకాలన్నీ ముందుకే. 175కు 175 అసెంబ్లీ, 25కి 25 ఎంపీ సీట్లు గెలవాల్సిందే’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.‘‘రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరుకు జన సునామీ చూశాం. విద్యా, వైద్య, ఆరోగ్యం రంగాల్లో మార్పులు తీసుకువచ్చాం. గ్రామ స్వరాజ్యంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. 58 నెలల్లో పేదల బతుకుల్లో వెలుగు నింపాం. మరో 18 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి.. మీకు మంచి జరిగి ఉంటే ఓటు వేయండని అడిగే ధైర్యమే సిద్ధం. మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో 99 శాతం నెరవేర్చాం. పొత్తులు పెట్టుకుని కుట్రలు చేస్తూ దిగజారిపోయారు. మంచి పనులు చేసానని చంద్రబాబు చెప్పుకోలేడు. అందుకే నన్ను తిట్టడమే చంద్రబాబు పని. ఇదొక రాజకీయం అవుతుందా చంద్రబాబూ..’’ అంటూ సీఎం జగన్ దుయ్యబట్టారు.అబద్ధపు హామీలిచ్చి చంద్రబాబు ప్రజలను మోసం చేశారు. దోచుకోవడం, పంచుకోవడం వారి అలవాటు. మీ బిడ్డ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం చేశాం. ధనికులకు, పేదలకు వేర్వేరు చదువుల వ్యత్యాసం తుడిచివేశాం. డబుల్ సంచరీ కొట్టేందుకు మీరంతా సిద్ధం ఉండాలి. చంద్రబాబులాగా నేను మోసపు హామీలు ఇవ్వను. ఎన్నికలు కాగానే మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసిన చంద్రబాబు సంస్కృతిని చూశాం. చంద్రబాబు పేరు చెబితే ఒక మంచి పని కూడా గుర్తుకురాదు. సంక్షేమ పథకాలను డోర్ డెలివరీ చేసిన చరిత్ర వైఎస్సార్సీపీ ప్రభుత్వానిది. బాబు లాంటి మోసగాడు కావాలా? జగన్ లాంటి నిజాయితీపరుడు కావాలా?. చంద్రబాబు మోసాలు, అబద్దాలు, వెన్నుపోట్లతో నేను పోటీ పడలేను. 87 వేల కోట్ల రుణమాఫీ చేస్తానని చంద్రబాబు ఇచ్చిన హామీ ఏమైంది?’’ అని సీఎం జగన్ ప్రశ్నించారు. ‘‘పేద ప్రజల గుండె చప్పుళ్లే ఈ సిద్ధం సభలు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులతో ప్రభుత్వ బడులు సిద్ధం. వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులతో ప్రభుత్వాసుపత్రులు సిద్ధం. ఇంటింటికి పౌరసేవలందిస్తున్న వాలంటీర్ల వ్యవస్థ సిద్ధం. 600లకు పైగా సేవలందిస్తున్న గ్రామ, వార్డు సచివాలయాలు సిద్ధం. మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి. మేనిఫెస్టోలో 99 శాతం హామీలు నెరవేర్చాం. అక్కా చెల్లెమ్మలకు ఆర్థికంగా, రాజకీయంగా తోడుగా ఉన్నాం. కరోనా కష్టకాలంలోనూ ప్రతి ఇంటికి సంక్షేమం అందించాం. చంద్రబాబు పేరు చెప్తే ఒక్క మంచిపనైనా గుర్తుకొస్తుందా?’’ అంటూ సీఎం ధ్వజమెత్తారు. సాధ్యం కాని హామీలను మీ బిడ్డ ఎప్పుడూ ఇవ్వడు. మీ జగన్ మార్క్.. ప్రతి పేదింట్లో కనిపిస్తోంది. మీ జగన్ మార్క్.. అక్కా చెల్లెమ్మల చిరునవ్వులో కనిపిస్తుంది. మీ జగన్ మార్క్.. ప్రతి గ్రామంలోనూ కనిపిస్తోంది. మాట మీద నిలబడే మీ జగన్ కావాలా?. మోసం, దగా చేసే చంద్రబాబు కావాలా? ఆలోచన చేయండి. 2014లో ఇదే కూటమి చేసిన మోసాలు గుర్తున్నాయా?. రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?. పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తానన్నాడు.. చేశాడా?. ఆడబిడ్డ పుడితే రూ.25వేలు డిపాజిట్ చేస్తానన్నాడు..చేశాడా?. ఇంటికో ఉద్యోగం అన్నాడు.. ఇచ్చాడా?. ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు.. ఇచ్చాడా?. అర్హులకు మూడు సెంట్ల ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?. 10వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ అన్నాడు.. చేశాడా?. సింగ్‌పూర్‌ని మించి అభివృద్ధి చేస్తానన్నాడు.. చేశాడా?. ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తానన్నాడు.. నిర్మించాడా?, మళ్లీ ఇదే కూటమి కొత్త కొత్త మోసాలతో వస్తుంది. ఇంటింటికి కేజీ బంగారం, బెంజ్‌కారు ఇస్తారంట నమ్ముతారా?. . ఈ మోసగాళ్ల నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు మీరంతా సిద్ధమా?. ఇప్పుడు సూపర్ సిక్స్ అంటూ చంద్రబాబు వస్తున్నాడు’’ అని సీఎం జగన్ మండిపడ్డారు. -
కేసీఆర్ బస్సు యాత్ర.. కాన్వాయ్‌లో ప్రమాదం
సాక్షి,నల్లగొండజిల్లా: బస్సు యాత్రలో భాగంగా మిర్యాలగూడ వెళ్లిన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కాన్వాయ్‌లో బుధవారం(ఏప్రిల్24) సాయంత్రం ప్రమాదం జరిగింది. మిర్యాలగూడ రోడ్ షో కు వెళ్తుండగా కేసీఆర్ కాన్వాయ్‌లో వాహనాలు ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. వేములపల్లి సమీపంలో కాన్వాయ్‌లో ముందు వెళుతున్న వాహనం సడెన్ బ్రేక్ కొట్టడంతో ప్రమాదం జరిగింది.ముందు వెళుతున్న కారును వెనుక వస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో కాన్వాయ్‌లో తొమ్మిది వాహనాలు స్వల్పంగా ధ్వంసం అయ్యాయి. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం.కాగా, లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం కేసీఆర్ బుధవారం నుంచి బస్సుయాత్ర చేపట్టారు. బుధవారం మిర్యాలగూడ నుంచి ప్రారంభమైన ఈ బస్సు యాత్ర మే 10వ తేదీన సిద్దిపేటలో ముగియనుంది. బస్సు యాత్రలో భాగంగా పలు చోట్ల కేసీఆర్ రోడ్‌షోలలో ప్రసంగిస్తారు. ఇదీ చదవండి.. కవిత బెయిల్‌పై మే మొదటి వారంలో తీర్పు -
కేసీఆర్ బస్సు యాత్ర
-
ఈరోజు బస్సు యాత్ర చివరి రోజు..సీఎం జగన్ షెడ్యూల్..
-
నేడు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ఇలా..
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 22వ రోజైన బుధవారం(ఏప్రిల్ 24) షెడ్యూల్‌ను వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం మంగళవారం విడుదల చేశారు. ఈ యాత్రలో భాగంగా సీఎం జగన్ మంగళవారం రాత్రి బస చేసిన అక్కివలస నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు. ఎచ్చెర్ల బైపాస్, శ్రీకాకుళం బైపాస్, నరసన్నపేట బైపాస్, కోటబొమ్మాళి, కన్నెవలస మీదుగా పరశురాంపురం జంక్షన్ వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం కె.కొత్తూరు మీదుగా టెక్కలి వద్దకు చేరుకొని.. 3 గంటలకు అక్కడ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని సీఎం జగన్ ప్రసంగిస్తారు. -
మీ డ్రీమ్సే.. నా స్కీమ్స్: సీఎం వైఎస్ జగన్
ఊరు కలలనూ నెరవేర్చాం..ఊరికి కూడా కలలుంటాయి. గ్రామంలో అందే సేవలు బాగుంటేనే తమ ఊరు బాగుంటుందని.. ఆ గ్రామాన్ని విడిచిపెట్టి ఎక్కడికెక్కడికో వెళ్లిపోరని.. గ్రామానికి కూడా కల ఉంటుంది. ఆ గ్రామం డ్రీమ్ కోసం మీ జగన్ ఎన్ని స్కీమ్‌లు తెచ్చాడో తెలుసా? ఏకంగా ఏడు స్కీమ్‌లు తెచ్చాడు. ఆ గ్రామంలోనే కనిపిస్తాయి సచివాలయాలు, 60–70 ఇళ్లకో వలంటీర్ వ్యవస్థ, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్, నాడు–నేడుతో మారిన ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు, మహిళా పోలీసు వ్యవస్థ కనిపిస్తాయి. వీటితోపాటు నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు కూడా కనిపిస్తాయి. గ్రామానికే వచ్చిన ఫైబర్ గ్రిడ్.. ఇవన్నీ మీ గ్రామాల్లోనే కనిపించే జగన్ మార్కు విప్లవాత్మక మార్పులు. గ్రామాలే కాకుండా రాష్ట్రం కలలను కూడా సాకారం చేస్తూ విప్లవాత్మక చర్యలు చేపట్టాం. సాక్షి ప్రతినిధి, విజయనగరం: ‘‘డ్రీమ్స్ మీవి.. స్కీమ్స్ మీ బిడ్డ జగన్‌వి! ప్రతి కుటుంబం, ప్రతి గ్రామం కలలను నెరవేరుస్తూ విప్లవాత్మక పథకాలు, వ్యవస్థలు తీసుకొచ్చాం. 58 నెలల పాలనలో మీ అందరి కలలను నెరవేర్చిన ప్రజా ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించి 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ స్థానాల్లో ఫ్యాన్ గుర్తుపై రెండు బటన్లు నొక్కాలి’’ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. మంగళవారం సాయంత్రం విజయనగరం జిల్లా చెల్లూరు వద్ద నిర్వహించిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. ‘చెల్లూరు సభ జనసముద్రాన్ని తలపిస్తోంది. ఒక్కసారిగా లక్షల మంది తాండ్ర పాపారాయుళ్లు శత్రుసైనాన్ని చిత్తుగా ఓడించేందుకు సిద్ధమైతే, ఆ యుద్ధం ఎలా ఉంటుందో పేదల వ్యతిరేకులకు రుచి చూపించడానికి నా ఉత్తరాంధ్ర, నా విజయనగరం సిద్ధం సిద్ధం అని అడుగులు వేస్తోంది. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేవి మాత్రమే కావు. ఇంటింటి భవిష్యత్తును, తమకు అందుతున్న పథకాలను, ఇంటికే వచ్చే పౌర సేవలను, తమ పిల్లల భవిష్యత్తును రాబోయే ఐదేళ్లు కాపాడుకోవాల్సిన అవసరాన్ని ప్రజలంతా గుర్తించారు. వారికి అడ్డుతగులుతున్న ఆ పెత్తందార్లకు, ఆ కౌరవ సైన్యానికి, ఆ నారా సైన్యానికి బుద్ధి చెప్పేందుకు సిద్ధం సిద్ధం అని అడుగులు వేస్తున్న ప్రజాసైన్యం ఈ రోజు నా కళ్ల ఎదుట కనిపిస్తోంది. చంద్రబాబుకు కాంగ్రెస్, బీజేపీ పరోక్షంగా, ప్రత్యక్షంగా మద్దతిస్తున్నాయి. ఇదే బాబుకు తోడుగా దత్తపుత్రుడున్నా, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఉన్నాయి. వాళ్లు చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు, మోసాలు, అబద్ధాలు కళ్ల ఎదుటే కనిపిస్తున్నాయి. ఒక్క జగన్ మీదకు ఇంతమంది ఏకమవుతున్నారు. జగన్ కనుక ఇంటింటికీ మంచి చేయకపోయి ఉంటే, జగన్‌ను ప్రతీ ఇంట్లోనూ తమ బిడ్డగా, తమ అన్నగా, తమ్ముడిగా భావించకపోతే ఇన్ని తోడేళ్లు ఏకం కావాల్సిన అవసరం ఏముంది? జగన్ ఒకే ఒక్కడు కాదు. నాకున్న ధైర్యం మీరే అని సగర్వంగా చెబుతున్నా. 58 నెలల పాలనలో ఇంటింటికీ చేసిన మంచి నా నమ్మకం. ప్రతీ వర్గాన్ని మోసం చేసిన వారితో ఈరోజు ఎన్నికల కురుక్షేత్రంలో తలపడుతున్నాం. జగన్‌ను ఓడించాలని వారు, పేదల్ని గెలిపించి ఇంటింటి అభివృద్ధిని కొనసాగించాలని మనం చేయబోతున్న ఈ యుద్ధంలో మరో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకునేదానికి మీరంతా సిద్ధమేనా? ప్రజల కలల్ని తన మోసాలతో వంచించడమే పనిగా పెట్టుకున్న చంద్రబాబుకు, ఆ బాబు కూటమికి బుద్ధి చెప్పేందుకు మీరంతా సిద్ధమేనా? 420.. చంద్రముఖి బృందం వస్తువులు ఎత్తుకుపోయేవారని దొంగల ముఠా అంటాం. బెదిరించి దోచుకునే వారిని దోపిడీ ముఠా అంటాం. మరి ఎన్నికలప్పుడు నమ్మించి ఆ ప్రజలు ఇచ్చిన అధికారంతో ఐదేళ్లూ మోసం చేసిన చరిత్ర ఉన్న కూటమిని ఏమనాలి? తియ్యటి మాటలు మేనిఫెస్టోలో చెప్పి ఎన్నికలు అయిపోయిన తరువాత ప్రజల్ని మోసం చేసేవారిని ఏమంటాం? 420 అనే కదా అంటారు. పేదల కలల్ని, బతుకుల్ని బలిపెట్టి దోచుకునేందుకు వచ్చిన ఈ రాజకీయ కూటమిని చంద్రముఖి బృందం అని కూడా అంటాం. చంద్రబాబు అంటే చంద్రముఖి... తల్లుల కలలు, బాధల గురించి 14 ఏళ్లు పాలించానని చెప్పుకునే చంద్రబాబు ఏరోజైనా ఆలోచన చేశాడా? ఆయనకు ఆ ఆలోచన ఎందుకు రాలేదంటే కారణం.. చంద్రబాబు అంటే చంద్రముఖి కాబట్టి. పేదలకు మంచి చేయడం కోసం కాకుండా పేదల రక్తం తాగేందుకు లకలకా అని తపిస్తాడు. కలలను నెరవేర్చిన స్కీములు... ఏ అక్కచెల్లెమ్మ అయినా ఆత్మగౌరవంతో బతకాలని కోరుకుంటుంది. పిల్లలకు మంచి చదువులు చెప్పించాలని, కుటుంబం మరింత బాగుండేలా రెండు మెట్లు ఎదగాలని కలగంటుంది. చంద్రబాబు మాటలు నమ్మి 2014 నుంచి 2019 మధ్య కుదేలయిపోయిన పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల సాధికారత, మళ్లీ వాళ్లను తమ కాళ్ల మీద తమను నిలబెట్టేందుకు వారి డ్రీమ్స్‌ను సాకారం చేస్తూ వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాలు పుట్టాయి. 45 – 60 సంవత్సరాల వయసున్న నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉంటూ ఆత్మగౌరవంతో జీవించేలా చేసేందుకు పుట్టింది వైఎస్సార్ చేయూత పథకం. నా కాపు అక్కచెల్లెమ్మల కోసం తెచ్చిన మరో పథకం వైఎస్సార్ కాపు నేస్తం. ఈబీసీ అక్కచెల్లెమ్మల కోసం వైఎస్సార్ ఈబీసీ నేస్తం అనే పథకం. తెచ్చాం. చంద్రబాబు హయాంలో ఏరోజూ ఇలాంటి స్కీములు ఎందుకు లేవు? నాడు ఉన్నదల్లా అక్కచెల్లెమ్మలను మోసం చేయడం, రక్తాన్ని పీల్చే ఒక చంద్రముఖి పాలన మాత్రమే. అక్కచెల్లెమ్మల సొంతింటి కల... తమకు సొంత ఇల్లు ఉండాలని ప్రతి అక్కచెల్లెమ్మ కల కంటుంది. కొన్ని కుటుంబాలకు ఇది జీవితకాల కల లాంటిది. వారి డ్రీమ్‌ను నెరవేరుస్తూ 31 లక్షల ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి మీ బిడ్డ జగన్ ఇచ్చాడు. అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాం. భావోద్వేగానికి గురైన మంత్రి బొత్స... చీపురుపల్లి అభ్యర్ధిగా మంత్రి బొత్స సత్యనారాయణను సీఎం జగన్ పరిచయం చేసిన సందర్భంలో ఉద్వేగ వాతావరణం నెలకొంది. బొత్స తనకు తండ్రి లాంటివారని, ఆయన్ను ఆప్యాయంగా అన్నా అని పిలుస్తానని సీఎం జగన్ చెప్పడంతో బొత్స భావోద్వేగానికి గురయ్యారు. అవ్వాతాతలు.. రైతుల కలలు నెరవేర్చాం ► అవ్వా తాతల డ్రీమ్ ఏమిటో తెలుసా? బాబు హయాంలో మాదిరిగా పెన్షన్ల కోసం క్యూలో నిలబడి తమ ప్రాణాలు అక్కడికక్కడే పోయే పరిస్థితి రాకూడదన్నది వారి డ్రీమ్. ఆ పెన్షన్ సొమ్ము కాస్తంత పెంచి ఇస్తే బాగుంటుందన్నది డ్రీమ్. వారి మనవడు జగన్ తెచ్చిన స్కీమ్ ఏమిటంటే అవ్వాతాతల ఆత్మ గౌరవాన్ని నిలబెడుతూ వలంటీర్లు నేరుగా ఇంటికి వచ్చి రూ.3 వేల పెన్షన్ ఇవ్వడం. ఎక్కడా లంచాలు, వివక్ష లేదు. నాడు చంద్రబాబు ముష్టి వేసినట్లు రూ.వెయ్యి రాష్ట్రంలో 39 లక్షల మందికి మాత్రమే ఇచ్చారు. ► మీ బిడ్డ వచ్చాక ఇంటివద్దే నాణ్యమైన బియ్యాన్ని అందిస్తున్నాడు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా 58 నెలల కాలంలో 2.31 లక్షల ఉద్యోగాలు యువతకు ఇచ్చి వారి కలను సాకారం చేశాం. రైతన్నలు కోరుకున్నట్లుగా పంట వేసే సమయానికి పెట్టుబడి సాయం, సమయానికి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు గ్రామంలోనే అందచేస్తున్నాం. అమూల్‌ను తెచ్చి పాడి రైతులకు అండగా నిలిచాం. ఏకంగా 35 లక్షల ఎకరాల భూముల మీద రైతులకు పూర్తి హక్కులు ఇచ్చిందీ మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే. మరి రైతుల గురించి చంద్రబాబు ఏరోజైనా ఆలోచించాడా? నాడూ నేడూ ఇదే రాష్ట్రం.. ఇదే బడ్జెట్. కానీ చంద్రబాబు హయాంలో డీబీటీలు, బటన్లు నొక్కడం లేవు. మీ పొలాలలో పెట్టే దిష్టిబొమ్మనైనా నమ్మొచ్చేమో గానీ చంద్రబాబును మాత్రం నమ్మలేమని గుర్తు పెట్టుకోండి. విజయవాడలో కాల్‌మనీ, సెక్స్ రాకెట్లు నడపటం మినహా బాబు చేసిందేమిటి? మళ్లీ ప్రజల రక్తం తాగడానికి చంద్రముఖిలా మారాడు. జనానికి మంచి చేసిన మీ జగన్‌పై తోడేళ్లలా దాడి చేస్తున్నారు. మన 58 నెలల పాలనలో జరిగిన మేలుపై మీ కుటుంబమంతా చర్చించుకోవాలి. పిల్లలు, సంక్షేమ పథకాల భవిష్యత్తు గురించి ఆలోచించాలి ఏకంగా 40 పథకాలు.. ఏ మనిషికైనా, ఏ కుటుంబానికైనా కొన్ని కలలు, లక్ష్యాలు ఉంటాయి. వాటిని నిజం చేసే మార్గాలు ఉంటే ఆ కుటుంబం ఒక్కో మెట్టు ఎదుగుతూ పోతుంది. అలాంటి పేదల కలల్ని అర్ధం చేసుకుని నెరవేర్చేందుకు మీ బిడ్డ పెట్టిన స్కీమ్స్ ఎన్నో తెలుసా? దాదాపుగా 40. ఈ 58 నెలల కాలంలో వాటిని నెరవేర్చేందుకు మీ బిడ్డ ఏకంగా 130 సార్లు బటన్లు నొక్కాడు. ఏకంగా రూ. 2.70 లక్షల కోట్లు నేరుగా అందజేశాడు. నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్లాయి. ఎక్కడా లంచాలు, వివక్ష లేదు. దీనికి తోడు నాన్ డీబీటీ అంటే ఇళ్లస్థలాలు, విద్యాకానుక, టాబ్స్... ఇవన్నీ కలిపి మరో రూ.లక్ష కోట్లకుపైగా ప్రయోజనాన్ని చేకూర్చాం. ఇలా వాళ్ల డ్రీమ్స్.. మీ బిడ్డ స్కీమ్స్ ద్వారా ఏకంగా రూ. 3.75 లక్షల కోట్లు పై చిలుకు లబ్ధి చేకూర్చాడని చెప్పడానికి గర్వపడుతున్నా. విద్యా విప్లవం.. ప్రతి నిరుపేద తల్లి కలను నిజం చేయడానికే పుట్టింది జగనన్న అమ్మఒడి పథకం. పేద తల్లులు తన పిల్లల భవిష్యత్తు కోసం కనే కలలు గురించి అర్థం చేసుకున్నాను. తమ పిల్లల్ని డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఐఏఎస్‌లుగా, ఐపీఎస్‌లుగా, పెద్ద కంపెనీల్లో ఉద్యోగస్తులుగా చూడాలని, ఉన్నత చదువులు చదివించాలన్న కలల నుంచి పుట్టిన స్కీములతో నాడు – నేడు, ఇంగ్లిష్ మీడియం బడులు, సీబీఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం చేశాం. 3వ తరగతి నుంచి గవర్నమెంట్ బడుల్లో టోఫెల్ శిక్షణ, సబ్జెక్టు టీచర్లు, బైజూస్ కంటెంట్, 6వ తరగతి నుంచి డిజిటల్ బోధన, క్లాస్ రూముల్లో ఐఎఫ్‌పీ ప్యానళ్లతో డిజిటల్ బోధన, 8వ తరగతికి పిల్లల చేతుల్లో ట్యాబులు పెట్టాం. పెద్ద చదువులు చదువుతున్న 93 శాతం మందికి ఈ రోజు విద్యాదీవెనతో లబ్ధి చేకూరుతోంది. డిగ్రీ కరిక్యులమ్‌లో మార్పులు తీసుకొస్తూ, విదేశీ విశ్వవిద్యాలయాల్లో సర్టిఫైడ్ ఆన్ లైన్ వర్టికల్స్‌ను మన డిగ్రీలతో అనుసంధానం చేయడం, డిగ్రీలో తప్పనిసరి ఇంటర్న్‌షిప్ తెచ్చాం. ఇవన్నీ నా అక్కచెల్లెమ్మలు, ఆ పిల్లల డ్రీమ్స్ నుంచి వచ్చిన మీ జగనన్న స్కీమ్స్. అత్యధిక మెజార్టీతో గెలిపించండి... విజయనగరం పార్లమెంట్, ఏడు అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్న వైఎస్సార్సీపీ అభ్యర్థులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు పరిచయం చేశారు. ఎంపీ అభ్యర్థిగా బెల్లాన చంద్రశేఖర్, విజయనగరం అసెంబ్లీ అభ్యర్థిగా కోలగట్ల వీరభద్రస్వామి, బొబ్బిలి అసెంబ్లీ అభ్యర్థిగా శంబంగి చిన అప్పలనాయుడు,. నెల్లిమర్ల అసెంబ్లీ అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడు, రాజాం నుంచి పోటీచేస్తున్న డాక్టరు తలే రాజేష్, గజపతినగరం నుంచి పోటీచేస్తున్న బొత్స అప్పలనరసయ్య, ఎచ్చెర్ల నుంచి పోటీచేస్తున్న గొర్లె కిరణ్‌ను గొప్ప మెజార్టీతో ఆశీర్వదించాలని కోరారు. 2014లో ‘చంద్రముఖి’ మోసాలివీ.. ► రైతులకు రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాల మాఫీ జరిగిందా? ► పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రూ.14,205 కోట్లు మాఫీ చేస్తామని చెప్పి కనీసం ఒక్క రూపాయైనా మాఫీ చేశాడా? ► ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు చొప్పున బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నాడు. ఎవరికైనా ఒక్క రూపాయి డిపాజిట్ చేశారా? ► ఇంటికో ఉద్యోగం లేదంటే రూ.2 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు. ఐదేళ్లలో అంటే 60 నెలల పాటు నెలకు రూ.రెండు వేలు చొప్పున ప్రతి ఇంటికి రూ.1.20 లక్షలు ఇచ్చాడా? ► అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు ఇస్తామన్నారు. ఏ పేదవాడికైనా ఒక్కటంటే ఒక్క సెంటు స్థలం ఇచ్చాడా? ► రూ.10 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ అన్నాడు. చేనేత, పవర్‌లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు. మరి అయ్యాయా? ► మహిళా ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. మరి చేశాడా? ► సింగపూర్‌కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు.. చేశాడా? ► ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. మరి నిర్మించాడా? విజయనగరంలో ఏమైనా కనిపిస్తోందా? ► పోనీ ప్రత్యేక హోదా తెచ్చాడా అంటే అదీ లేదు. ► ఇప్పుడు సూపర్ సిక్స్, సెవెన్, ఇంటింటికీ కేజీ బంగారం, బెంజి కార్ అంటూ మళ్లీ మోసాలకు తయారయ్యారు. -
లక్షల మంది తాండ్ర పాపారాయుడులు
-
పొలాల్లో దిష్టిబొమ్మనైనా నమ్మొచ్చు కానీ.. బాబును నమ్మలేం: సీఎం జగన్
సాక్షి, విజయనగరం: టీడీపీ అధినేత చంద్రబాబు వెనక బీజేపీ, కాంగ్రెస్ ఉన్నాయన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఒకరు ప్రత్యక్షంగా మరొకరు పరోక్షంగా మద్దతిస్తున్నాయని విమర్శించారు. ఒక్క జగన్ మీదకు బాబు, దత్తపుత్రుడు, బీజేపీ, కాంగ్రెస్ ఎగబడుతున్నారని మండిపడ్డారు. ఇంత మంది తోడేళ్లు ఏకమై తన మీద యుద్ధానికి వస్తున్నారని తెలిపారు. పెత్తందార్లకు, నారా కౌరవ సైన్యానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ప్రజలకు మంచి చేసిన జగన్‌పై తోడేళ్ల దాడి సీఎం జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 21వ రోజు మంగళవారం విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా చెల్లూరులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రతిపక్ష కూటమిపై నిప్పులు చెరిగారు. ప్రజలను మోసాలతో వంచించడమే చంద్రబాబు పని అంటూ ధ్వజమెత్తారు. ప్రజలకు మంచి చేసిన జగన్‌పై తోడేళ్లు దాడికి దిగుతున్నాయని దుయ్యబట్టారు. మీ బిడ్డకు తోడుగా దేవుడి దయ, కోట్ల ప్రజల హృదయాలు ఉన్నాయన్నారు. మోసాల బాబుకు బుద్ది చెప్పేందుకు సిద్ధమా? ఎన్నికలప్పుడు కూటమి నమ్మించి మోసం చేస్తుందని మండిపడ్డారు సీఎం జగన్. నమ్మించి మోసం చేసిన కూటమి నేతల్ని 420 అంటారని అన్నారు. చంద్రబాబు వెనక దత్తపుత్రుడు ఉన్నాడని అన్నారు. ఓవైపు జగన్ ఒక్కడే అయితే మరోవైపు తోడేళ్లు ఏకమయ్యాయని విమర్శించారు. మోసాల బాబుకు బుద్ది చెప్పేందుకు మీరంతా సిద్ధమా?..చంద్రబాబుబు కూటమికి బుద్ధి చెప్పేందుకు మీరంతా సిద్ధమా? అంటూ చెల్లూరు సభకు హాజరైన జనవాహినిని ఉద్ధేశించి సీఎం జగన్ ప్రసంగించారు. సీఎం జగన్ ఇంకా మాట్లాడుతూ. విజయ నగరం జిల్లాలో మహాసముద్రం కనిపిస్తోంది. శత్రు సైన్యాన్ని చిత్తుగా ఓడించేందుకు మీరంతా సిద్ధమా? ఈ ఎన్నికలు.. రాబోయే అయిదేళ్ల భవిష్యత్తు. 58 నెలల్లో 130సార్లు బటన్ నొక్కి సంక్షేమం అందించాం. దాదాపు 40 పథకాలను పేదలకు, మధ్యతరగతి ప్రజలకు అందించాం. 2 లక్షల 70 వేల కోట్లు నేరుగా ప్రజలకు అందించాం. నాన్‌డీబీటీ ద్వారా మరో లక్ష కోట్లకు పైగా ఇచ్చాం. మొత్తం రూ. 3 లక్షల 75 వేల కోట్లకు పైగా అందించాం. ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా బటన్ నొక్కి నేరుగా ప్రజల ఖాతాలకు నగదు వేశాం. మీ డ్రీమ్స్‌ను నా స్కీమ్స్‌తో నెరవేర్చాను. పిల్లలను చదివించేందుకు అమ్మఒడి పథకం తీసుకొచ్చాం. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ బోధన. పిల్లల ఉన్నత చదువుల కోసం విద్యా దీవెన, వసతి దీవెన. డ్రీమ్స్ పేదింటి అమ్మది.. స్కీమ్స్ మీ బిడ్డవి. అక్కాచెల్లెమ్మల సాధికారత కోసం వైఎస్సార్ ఆసరా, సున్నా వడ్డీ. అక్కాచెల్లెమ్మల కోసం వైఎస్సార్ చేయూత తీసుకొచ్చాం. వైఎస్సార్ కాపునేస్తం, వైఎస్సార్ ఈబీసీ నేస్తం తీసుకొచ్చాం. చంద్రబాబుకు ఎప్పుడైనా ఇంతమంచి ఆలోచన వచ్చిందా? పేద ప్రజల గురించి ఏ ఒక్కరోజు కూడా చంద్రబాబు ఆలోచన చేయలేదు. చంద్రబాబు అంటే చంద్రముఖి కాబట్టి ఆ ఆలోచన రాలేదు. చంద్రబాబు హయాంలో చంద్రముఖి పాలన చూశాం. డ్రీమ్స్ అవ్వాతాతలవి.. స్కీమ్స్ మీ బిడ్డవి అవ్వాతాతల డ్రీమ్స్ నెరవేరుస్తూ ప్రతినెలా రూ.3 వేల పెన్షన్. వాలంటీర్ల ద్వారా ఒకటో తేదీనే ఇంటి వద్దకే రూ. 3 వేల పెన్షన్. డ్రీమ్స్ యువతది.. స్కీమ్స్ మీ జగనన్నది. దేశంలో ఎప్పుడూ జరగని విధంగా ఉద్యోగాలిచ్చాం. 58 నెలల్లోనే 2 లక్షల 31 వేల ఉద్యోగాలిచ్చాం. 31 లక్ష ఇళ్ల పట్టాలను పేదింటి మహిళలకు ఇచ్చింది మన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇంత మంచి చేసిన మీ అన్నకు రాఖీ కడతారా?. స్టార్ క్యాంపెయిన్లుగా మీరంతా మీ అన్నకు తోడుగా ఉంటారా? చంద్రబాబు హయాం అంతా.. మోసం,మోసం, మోసం బాబు పాలనలో స్కీంలు ఉండవు.. స్కాంలు మాత్రమే ఉంటాయి. జన్మభూమి కమిటీలతో చంద్రబాబు రాష్ట్రాన్ని దోచుకున్నారు. విజయవాడలో కాల్ మనీ, సెక్స్ రాకెట్ నడపడం తప్ప చంద్రబాబు చేసింది ఏంటి? ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు చేసిన మోసాలు చెప్పండి. డ్రీమ్స్ రైతులవి.. స్కీమ్స్ మీ జగన్‌వి ప్రతీ గ్రామంలో రైతు భరోసా కేంద్రం, పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్. పెట్టుబడి సాయంగా రైతు భరోసా రూ. 13,500 ఇచ్చాం. సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ, రూ. 65 వేల కోట్లతో ధాన్యం కొనుగోలు. దోచుకోవడం.. పంచుకోవడమే చంద్రబాబు డ్రీమ్. పొలాల్లో పెట్టే దిష్టిబొమ్మనైనా నమొచ్చేమోకానీ చంద్రబాబును నమ్మలేం. ప్రతి ఎన్నికల సమయంలో రంగరంగుల మేనిఫెస్టో తెస్తారు. ఎన్నికల అయిపోయాక మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేస్తాడు చంద్రబాబు. నారా కౌరవ సైన్యానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. గ్రామాల కోసం 7 స్కీమ్‌లు తీసుకొచ్చాం సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ, ఆర్బీకే, విలేజ్‌క్లినిక్ స్కూళ్ల రూపురేఖలు, మహిళా పోలీస్, డిజిటల్ లైబ్రరీలు 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి మాట ఇస్తే నిలబడే పాలన మీ జగన్‌ది చంద్రబాబు మోసాలను గుర్తు చేసుకోండి ఎవరుంటే మంచి జరుగుతుందో ఆలోచన చేయండి -
వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలతో సీఎం జగన్ ముఖాముఖి (ఫొటోలు)
-
మీ అభిమానిగా ఒక్కరోజు బ్రతికినా చాలన్న: YSRCP సోషల్ మీడియా వింగ్
సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 21వ రోజు విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో ప్రభంజనంలా కొనసాగుతోంది. దారిపొడవునా సీఎం జగన్‌కు ప్రజలకు బ్రహరథం పడుతున్నారు. మంగళవారం వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ప్రతినిధులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. విశాఖపట్నం పెద్దిపాలెంలోని చెన్నాస్ కన్వెషన్ హాలులో జరిగిన ఈ సమావేశంలో రెండు వేల మందితో కూడిన వైఎస్సార్సీపీ సోషల్ మీడియా వింగ్‌తో సీఎం సంభాషించారు. పలువురు YSRCP సోషల్ మీడియా కార్యకర్తలు తమ మనోగతాన్ని సీఎం జగన్‌తో పంచుకున్నారు. మీకు మా కుటుంబం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది ‘నా తమ్ముడు భరత్ కుమార్ రెడ్డి ఫిబ్రవరి నెలలో ఎన్నికల ప్రచారానికి వెళ్లి తిరిగివస్తూ ప్రమాదవశాత్తు మృతిచెందాడు. ఆ సమయంలో ఎమ్మెల్యే శ్రీకాంత్, భార్గవ్ అన్న మా కుటుంబానికి అండగా నిలిచారు. నా తమ్ముడుకు మీరే దైవం అన్న. మీరు బాగుంటేనే మేము బాగుంటాం. మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని ఎల్లోమీడియా ఎంతో దుష్ప్రచారం చేసేది. అయితే భార్గవ్ అన్న ఛార్జ్ తీసుకున్న తర్వాత మన వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ప్రతిపక్షాలు భయపడేంతగా స్ట్రాంగ్ అయ్యింది. మా తమ్ముడు చనిపోయినా బాధగా ఉన్నాకూడా మీతో ఒక్కసారి ఫోటో దిగానా, మిమ్మల్ని కలుసుకున్నా వాడి ఆత్మ శాంతిస్తుందని వచ్చా. మీ అభిమానిగా ఒక్కరోజు బ్రతికినా చాలు.. మీకు మా కుటుంబం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది’ -ఎం. అనిల్ కుమార్ రెడ్డి, అన్నమయ్య జిల్లా, రాయచోటి నియోజకవర్గం జగనన్న మీరు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. మనస్సుకు ఎంతగాయమైనా, దేహానికి ఎంతగాయమైనా చిరునవ్వుతో బతకాలని అన్నది మిమ్మల్ని చూసి ఇన్పైర్ అయ్యాము. నా పిల్లలకు ఎంతో సాయం చేశారు అయితే ఇంకా అండాదండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్లీ మీరే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాను సార్.. -బాలచంద్ర, గుంటూరు జిల్లా, తెనాలి మండలం (గీతాంజలి భర్త) బాల చంద్ర వ్యాఖ్యలపై సీఎం జగన్ స్పందిస్తూ.. ‘బాలచంద్ర.. నీ కుటుంబానికి 100 శాతం అన్నిరకాలుగా తోడుగా ఉండే కార్యక్రమం ఇప్పటికే జరుగుతోంది. ఇది ఎప్పటికీ మనస్సులో పెట్టుకో. సజ్జల భార్గవ్‌కు కూడా చాలా క్లియర్‌గా చెప్పాను. అన్నిరకాలుగా నిన్ను చేయి పట్టుకుని నడిపిస్తాడు’ అని భరోసా ఇచ్చారు చంద్రబాబు యుద్ధానికి డైరెక్ట్‌గా రాడు ‘అన్న ఒక చిన్న విషయం చెప్తాను. తెనాలిలో ఇళ్ల పట్టా తీసుకుని గీతాంజలి చాలా సంతోషంతో చెప్పలేని ఆనందంతో తన అభిప్రాయాన్ని చెప్పుకుంది. కానీ మీరు చెప్పినట్టు.. కాయలున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాయలున్న చెట్టు. తెలుగుదేశం పార్టీ ముళ్లున్న చెట్టు. గీతాంజలి కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంతో అండగా నిలిచింది. మీ మీద దాడి జరిగితే అది మా మీద జరిగినట్టు భావించాం. అన్నా మీరు చాలా జాగ్రత్త.. వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబుకు ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చు. చంద్రబాబు యుద్ధానికి డైరెక్ట్‌గా రాడు, వారి వెన్నుపోటుకు జాగ్రత్తగా ఉండమని చేతులెత్తి దండమెడుతున్నా. -పి. నాని, బాపట్ల జిల్లా 2014 నుంచి 2019 వరకు ముస్లింలంతా భయపడుతూ బ్రతికారు. 2019లో మా రాజన్న బిడ్డ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత కాలర్ ఎగరేసుకుని బ్రతుకుతున్నాం. మైనార్టీలను నలుగురిని ఎమ్మెల్యేలు చేశారు, ఎమ్మెల్సీలను చేశారు, డిప్యూటీ సీఎంను చేశారు, మండలి వైస్ ఛైర్మన్‌ను చేశారు. అంతేకాకుండా ఇప్పుడు ఏడుగురికి ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చారు, అదీగాక హఫీజ్ ఖాన్ కు రాజ్యసభ అనౌన్స్ చేశారు. ముస్లింల కోసం వైఎస్సార్ ఒక అడుగు ముందుకేస్తే.. మీరు నాలుగు అడుగులు ముందుకేశారు. వాళ్లు మూడు జెండాలతో వస్తున్నారు మనది ఒకటే జెండా కానీ ఆ జెండాకు మూడక్షరాలు Y.S.R అదిచాలన్నా ఆ జెండాను మోసేందుకు.. -వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమాని.. నా గుండెల్లోంచి జగనన్నను తీయలేకపోయా ‘విశాఖ ఎయిర్‌పోర్టు ఫుడ్ కోర్టుకు సంబంధించి అంతా టీడీపీ వాళ్లు అని తెలియక అక్కడ ఉద్యోగంలో చేరాను నేను. కోడికత్తి శ్రీను విశాఖలో మీమీద దాడి చేసిన ఘటనకు ప్రత్యక్ష సాక్షిని నేను. ఆ ఘటన తర్వాత నేను జగన్ అభిమానిని అని తెలిసి వాళ్లు నన్ను చాలా వేధించారు. అక్కడ టీడీపీ నాయకులు లోకేష్, చంద్రబాబు, బాలకృష్ణ, సీఎస్‌వో వేణుగోపాల్, హర్షవర్థన్ అందరూ ఒక కూటమిలా అక్కడ ఉండేవాళ్లు. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా నేను PCS రూల్ ప్రకారమే ఉండాలని ప్రయత్నించేదాన్ని. మీ అభిమానిని అన్న కారణంగా నన్ను అనుమానించి, నాపై దొంగకేసులు బనాయించారు. నాకెక్కడా ఉద్యోగం రాకుండా చేశారు. నా కుటుంబాన్ని కూడా ఎంతగానో హింసించారు. వేణుగోపాల్ అయితే నిన్ను ఎక్కడా బతకనివ్వను అని బెదిరించారు. మీ మీద హత్యాయత్నం వ్యవహారంలో నేనే చేయించినట్టు చెప్పాలంటూ నా మీద ఒత్తిడి తెచ్చారు. దీంతో నేను ఉద్యోగానికి రిజైన్ చేశాను. కుటుంబం అంతా కూడా దూరంగా వెళ్లిపోయాం. ఇన్నేళ్లూ నేను ఉద్యోగం కూడా లేకుండానే ఉన్నాను. కానీ మొన్న విజయవాడలో మీ మీద బోండా ఉమ చేయించిన దాడి చూశాక మౌనంగా ఉండకూడదు అనుకున్నాను. ఈ విషయాన్ని ఇప్పుడు మీ ముందే బయటపెడుతున్నాను. దొంగ కేసు పెట్టి నా కెరీర్ నాశనం చేసారు. అయినా నేను బాధపడలేదు. నా ఉద్యోగం అయితే తీయగలిగారు కానీ నా గుండెల్లోంచి జగనన్నను తీయలేకపోయారు. -సామ్రాజ్యం, గతంలో ప్రేవేట్ చీఫ్ సెక్యూరిటీ అఫీసర్, విశాఖ ఎయిర్‌పోర్టు సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. సోషల్ మీడియాపరంగా ఎవరైనా హెరాస్మెంట్కి లోనైతే సహాయం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఎవరైనా సోషల్ మీడియా వల్ల ఇబ్బందులకు గురైతే చెప్పుకోగలిగేలా ఒక యాప్ తయారుచేయాలి. ప్రతివారం నాకు దానిపై రిపోర్టు కావాలి. అవతలి వాళ్లు మన మీద దాడి చేస్తున్నారు అంటే, సుచిత్ర కానీ, గీతాంజలి కానీ, సాక్షాత్తూ నామీద కానీ, దాని అర్థం ఏమిటంటే.. మనం విజయానికి చేరువగా ఉన్నామని...విజయానికి వాళ్లు దూరంగా ఉన్నారని. మిమ్మల్ని తలవని రోజు, మీ గురించి మాట్లాడని రోజు, మీ గురించి రాయని రోజు లేదు. మా గురించి, మా కుటుంబం గురించి అయినా మర్చిపోతామేమో కానీ మీ గురించి మర్చిపోయి ఒక్కరోజు కూడా లేము. మా కుటుంబం కంటే ఎక్కువ అయ్యారు మీరు. ఎందుకంటే మీరు ఎంతో గొప్ప ఇన్స్పిరేషన్ మాకు. అబ్రహాం లింకన్, మహాత్మాగాంధి, అంబేడ్కర్ గురించి పుస్తకాల్లో చదువుకున్నాం కానీ మీరు మాకు కనిపించే లైవ్ ఎగ్జాంపుల్. 36 ఏళ్ల వయసులో మీరు ఢిల్లీ పీఠాన్ని ఎదిరించారు. మీ లైఫ్ జర్నీ ఇంకా తెలుసుకోవాలని ఉంది. మీరు చెప్పే మాటలు మాకెంతో ఇన్సిపిరేషన్ ఇస్తాయి. యువతను ఉత్తేజపరుస్తాయి. మీకోసం ప్రాణాలిచ్చేందుకైనా సిద్ధం. -హెబ్సిబా, అసోసియేట్ ప్రొఫెసర్, ఫార్మసీ *కడుపు కాలేవాడికే మీ పథకాల విలువ తెలుస్తుంది. మా అన్నయ్య మన పార్టీ వీరాభిమాని, సోషల్ మీడియా సైనికుడు. 2022లో యాక్సిడెంట్లో మరణించాడు. అది తెల్సుకుని ముందుగా సజ్జల భార్గవ్ గారు స్పందించారు. మా ఇంటికి వచ్చారు. మీ గురించి జగనన్నకు కూడా తెలియజేసామని, మీకు సాయం అందించమని ఆదేశించారని కూడా చెప్పారు. మా కుటుంబానికి అండగా నిలుస్తామని చెప్పి రెండు నెలల్లోనే మా వదినకు ఉద్యోగం ఇప్పించారు. అంతే కాదు మా సొంత పిన్నీ, బాబాయ్ టీడీపీ అభిమానులు, అంతేకాదు గత టీడీపీ ప్రభుత్వంలో వాళ్లే జన్మభూమి కమిటీలో మెంబర్లు కూడా. వాళ్లకి సైతం పెన్షన్ మన ప్రభుత్వంలోనే ఇచ్చారు. సంక్షేమ పథకాలు మాకు, వాళ్లకూ కూడా వస్తున్నాయి. ఇప్పుడు వాళ్లింట్లో ఆడవాళ్లంతా కూడా జగనన్నకే ఓటు వేస్తాం అని చెబుతున్నారు. మీరు అందించే పథకాల విలువ కడుపు కాలేవాడికే తెలుస్తుంది. కడుపు నిండిన వాడికి తెలియదు. ఆ పెత్తందారులు మాకు గాయం చేస్తే మీరు మాకు సాయం చేస్తున్నారు. మా చివరి శ్వాస వరకూ జై జగన్ అనే అంటాం. ఫ్యాన్‌కే ఓటేస్తాం. వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కూడా మాకు కుటుంబమే అన్నా.. మా అన్న చనిపోయినప్పుడు ఓ కూలీ చేసుకునే వ్యక్తి ఫోన్ చేసి నేను ఇవాళ కూలి పనికి వెళ్తున్నా, కూలీగా వచ్చిన రూ.600 నీకు పంపుతా తమ్ముడూ అని చెప్పాడు. ఇంత గొప్ప కుటుంబం ఇచ్చింది నువ్వే కదా జగనన్నా...నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. -వినయ్ కుమార్, మల్కాపురం, జగ్గయ్యపేట మండలం, ఎన్టీఆర్ జిల్లా -
గీతాంజలిని దారుణంగా ట్రోల్ చేసి వేధించారు: సీఎం జగన్
విశాఖపట్నం, సాక్షి: సోషల్ మీడియాలో టీడీపీ, దాని మిత్రపక్షాలు దిగజారి ప్రవర్తిస్తున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా ఆనందపురంలో రెండు వేల మందితో కూడిన వైఎస్సార్సీపీ సోషల్ మీడియా వింగ్‌తో ముఖాముఖి నిర్వహించారాయన. ‘‘మనం కూటమి కుట్రలు, కుతంత్రాలతో యుద్ధం చేస్తున్నాం. చంద్రబాబు, దత్తపుత్రుల కుట్రలతో యుద్ధం చేస్తున్నాం. అబద్ధాలు, మోసాలతో యుద్ధం చేస్తున్నాం. నేను ఒక్కడిని ఒకవైపు.. చంద్రబాబు, దత్తపుత్రుడు, ఇతరులు మరోవైపు. ఒకే ఒక్కడిగా ఎన్నికల కురుక్షేత్రంలో దిగుతున్నా. విజయానికి దగ్గరగా ఉన్నామనే.. మనపై దాడి తీవ్రతరం చేశారు. గీతాంజలిని దారుణంగా ట్రోల్ చేసి వేధించారు. టీడీపీ.. వ్యవస్థ ఎంత దిగజారిందో అనడానికి గీతాంజలి ఆత్మహత్య ఘటనే ఉదాహరణ. కానీ, సోషల్ మీడియా మనతోనే ఉంది. సెల్‌ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరూ మనతోనే ఉన్నారు. దాడులకు భయపడేది లేదు. దేవుడు ఇంకా ఏదో పెద్ద స్క్రిప్ట్ ఏదో రాశాడు. అందుకే దాడి నుంచి బయటపడగలిగాను. ఈసారి ఎన్నికల్లో 175కి 175 రావాలి. 25కి 25 లోక్‌సభ సీట్లు గెలవబోతున్నాం’’ అని సోషల్ మీడియా కార్యకర్తలతో సీఎం జగన్ అన్నారు. సీఎం వచ్చి నేరుగా విశాఖలో కూర్చుంటే.. బెంగళూరు, హైదరాబాద్, చెన్నైతో పోటీ పడే స్థాయికి వెళ్తుంది. విశాఖపట్నం ఏపీకి డెస్టినేషన్ అవుతుంది. ఐటీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని సీఎం జగన్ తెలిపారు. ఈ సందర్భంగా పలువురు YSRCP సోషల్ మీడియా కార్యకర్తలు తమ మనోగతాన్ని సీఎం జగన్‌తో పంచుకున్నారు. సోషల్ మీడియా కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమంలో సీఎం జగన్ ఏమన్నారంటే.. ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన పార్టీ సోషల్ మీడియా ఆఫీస్ బేరర్స్ కు, పార్టీ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ కు, ఇండిపెండెంట్ ఇన్ ఫ్లూయెన్సర్స్ కు, ఎన్ఆర్ఐ యాక్టివిటీలో అక్కడ నుంచి వర్చువల్ గా అటెండ్ అవుతున్న సోషల్ మీడియా సైనికులకు, యూట్యూబ్ నెట్ వర్క్ ద్వారా కనెక్ట్ అయి ఉన్న వాళ్లందరికీ, ఇక్కడికి రాలేకపోయినా కూడా మీ అభిమానంలో మాత్రం ఎక్కడా కూడా తక్కువ అనేదే లేకుండా మీ అన్నకు, దాదాపుగా 5 సంవత్సరాల పాటు మనం అధికారంలోకి రాకమునుపటి నుంచి ఇప్పటిదాకా ప్రతి సందర్భంలోనూ తోడుగా ఉంటూ వస్తున్న నా చెల్లెమ్మలకు, నా తమ్ముళ్లకు, కొంత మంది నా అన్నలకు కూడా మీ అందరికీ కూడా మీ జగన్, మీ అన్న, మీ తమ్ముడు పేరు పేరునా రెండు చేతులూ జోడించి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాడు. ఈరోజు ఇక్కడ మనమంతా ఏకమయ్యాం రాబోయే మరో 18 రోజుల్లో జరగబోతున్న ఎన్నికల కురుక్షేత్రంలో మనమంతా కూడా క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసే కార్యక్రమంలో ఈరోజు అందరం కూడా షేర్ చేసుకునే విషయంలో ఏకమయ్యాం. ఈరోజు నేను మీ అందరితో కూడా ఒకటే చెబుతున్నాను. మనకు ఒకవైపున చూస్తే, అటువైపు ఉన్న బలాలు మన దగ్గర లేవు. అటువైపు మనం యుద్ధం చేస్తున్నది ఎవరితో అని చూస్తే, ఇటువైపున కేవలం మీ జగన్ ఒకే ఒక్కడు కనిపిస్తాడు. కానీ అటువైపున కూటమిలో వాళ్లను చూస్తే చాలా గంభీరంగా కనిపిస్తుంటుంది. ఒక్క జగన్ మీద ఒక చంద్రబాబు, ఒక దత్తపుత్రుడు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5.. వీళ్లందరూ సరిపోరు అన్నట్టుగా ఒక బీజేపీ, ఒక కాంగ్రెస్. వీళ్లందరే కాకుండా మనం యుద్ధం చేస్తున్నది ఎవరితో అంటే వీళ్ల కుట్రలతో, కుతంత్రాలతో, అబద్ధాలతో, మోసాలతో యుద్ధం చేస్తున్నాం. ఈ మధ్య కాలంలో అయితే వాళ్ల ఉక్రోశం ఏ స్థాయిలోకి వెళ్లిపోయింది అంటే చివరికి సోషల్ మీడియాలో మీ జగన్ కు అంటే వాళ్ల అన్నకు తాను సపోర్ట్ చేసింది అని, ఆ సపోర్ట్ కూడా పాపం తాను ఎందుకు చేసిందంటే.. తాను జగనన్న చేసిన మంచితో తాను కూడా బాగుపడింది అని, జగనన్న వల్ల తనకు ఇల్లు వచ్చిందని, ఇంటి స్థలం వచ్చిందని, మిగిలిన పథకాలు కూడా జగనన్న వల్ల వచ్చాయని, తన సంతోషాన్ని తన సోషల్ మీడియాలో పాలు పంచుకుంటే ఏకంగా ఆ గీతాంజలి అనే నా చెల్లెల్లి ఎంత దారుణంగా ట్రోల్ చేశారో అందరం కూడా చూశాం. ఎంతటి దారుణంగా వేధించారో కూడా అందరం చూశాం. చివరికి ఆ చెల్లి సూసైడ్ చేసుకునేంత దూరం కూడా పోయింది అంటే నిజంగా ఈ వ్యవస్థ అన్నది ఎంత దారుణంగా చెడిపోయింది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. మనకు సోషలో మీడియా ఉంది. ఇంతకు ముందు నేను చెప్పాను. జగన్ ఇటువైపున ఒకే ఒక్కడు. అటువైపున చూస్తే ఇంత మంది.. ఈ ఇంత మందికీ తోడు కుట్రలు, కుతంత్రాలు, అబద్ధాలు, మోసాలు, బెదిరింపులు, హెరాస్ మెంటు, అన్నీ కూడా జరుగుతున్నాయి. మరి ఇంత మందితో, ఇన్ని కుట్రలతో, ఇన్నిన్ని ఇబ్బందుల మధ్య మీ జగన్.. మీ అన్న, మీ తమ్ముడు.. తట్టుకొని నిలబడగలుగుతున్నాడంటే కారణం.. వాళ్లకు ఈనాడు ఉండొచ్చు, ఆంధ్రజ్యోతి ఉండొచ్చు, టీవీ5 ఉండొచ్చు. కానీ మనకు.. సోషల్ మీడియా ఉంది. సెల్ ఫోన్ చేతిలో ఉన్న నా ప్రతి చెల్లెమ్మ, ప్రతి తమ్ముడూ జగన్ కు తోడుగా ఉన్నాడు. అందుకే జగన్ ఒంటరి కాదు. జగన్ కు ఇన్ని కోట్ల గుండెలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. జగన్ కోసం ప్రాణం ఇచ్చేదానికి కొన్ని లక్షల గుండెలు అండగా, తోడుగా ఉన్నాయి. ఇంత మంది తోడున్న జగన్ ఒంటరివాడు కాదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ఒంటరి ఎలా అవుతాడు? ఆ దేవుడి దయ మీద జగన్ కు నమ్మకం ఉంది. జగన్ ను ప్రేమించే గుండెల మీద జగన్ కు నమ్మకం ఉంది. మీ అందరూ చేసిన, చేస్తున్న, చూపిస్తున్న అభిమానానికి, ఆప్యాయతలకు మీ జగన్ మాత్రం నిండు మనసుతో ఒకటే చెప్పగలుగుతాడు. మీకు ఎంత చేసినా, ఏమి చేయగలిగినా కూడా అది తక్కువే అవుతుందని మాత్రం ఈ సందర్భంగా సగర్వంగా చెప్పగలుగుతాడు. అన్ని రకాలుగా మీ అందరికీ తోడుగా ఉంటామని మాత్రం మరొక్కసారి భరోసా ఇస్తున్నాను. ఆర్గనైజేషన్ ను కూడా స్ట్రీమ్ లైన్ చేసే విషయంలో చాలా ఎఫెక్టివ్ గా స్ట్రీమ్ లైనింగ్ కూడా జరిగింది. భార్గవ్ కూడా చాలా క్రియాశీలకంగా స్ట్రీమ్ లైనింగ్ చేసే కార్యక్రమంలో తాను కూడా ముందుండి అడుగులు వేస్తున్నాడు. మీ అందరికీ భరోసా ఇస్తున్నా... అందరం కూడా మీ అందరికీ కూడా ఒకటే అసూరెన్స్ ఇస్తున్నాం.మీ వెనకాల ఉండేది ఒక్క జగనే కాదు. మీ వెనకాల ఉన్నది ఒక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మొత్తం మీ వెనకాల ఉంది అని చెబుతున్నాను.ప్రతి నియోజకవర్గంలోనూ తోడుగా ఉంది. ప్రతి మండలంలోనూ, ప్రతి గ్రామంలోనూమీకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా చెబుతున్నాను. ఈ విషయాలన్నీ మీ అందరికీ చెబుతూ, సోషల్ మీడియా పరంగా మీరు ఏదైనా అడగాలి అనుకుంటే మీ అన్న, మీ తమ్ముడు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడని ఈ సందర్భంగా చెబుతూ ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడమని కూడా కోరుతున్నాను. సిటీ ఆఫ్ డెస్టినీ రేపు ఆంధ్రా డెస్టినీ కాబోతుంది ఈ రోజు ఎలాగూ అందరూ విశాఖపట్నానికి వచ్చారు. కొంతమంది విశాఖపట్నం వాసులు, కొంత మంది విశాఖపట్నం బయట నుంచి కూడా వచ్చిన వాళ్లు. ఈరోజు ఈ సిటీని చూస్తున్నారు కదా.. ఈ సిటీ ఆఫ్ డెస్టినీ అనేది రేప్పొద్దున ఆంధ్ర రాష్ట్ర డెస్టినీ అవుతుందన్నది మాత్రం ఈ సందర్భంగా కచ్చితంగా తెలియజేస్తున్నాను. ఈ విషయం తెలియజేస్తూ, ఎప్పుడైతే ఒక ముఖ్యమంత్రి వచ్చి ఈ సిటీలో కూర్చోవడం మొదలు పెడతాడో, ఎప్పుడైతే ముఖ్యమంత్రి ఈ సిటీ నుంచి పరిపాలన చేయడం మొదలు పెడతాడో అప్పుడు ఈ సిటీ అన్నది హైదరాబాద్ తో పోటీ పడే పడే పరిస్థితి, చెన్నై, బెంగళూరుతో పోటీ పడే పరిస్థితి, ఐటీని ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ కు తీసుకుని పోయే పరిస్థితి కూడా ఉంటుంది. ఈ మాట చెబుతూ మైకులో మాట్లాడాలని ఎవరైనా అనుకుంటే మీ దాకా మైకు వస్తుంది. మీరు ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. నేను ఎదైనా నోట్ చేసుకోవాల్సి ఉంటే నోట్ చేసుకుంటాను. మీకు ఏదైనా నేను సమాధానం చెప్పాల్సి వస్తే చెప్తాను. థ్యాంక్యూ. అని సీఎం జగన్ ప్రసంగంలో పేర్కొన్నారు. సోషల్ మీడియా ప్రతినిధులు మాట్లాడిన అనంతరం సీఏం జగన్ ఏం మాట్లాడారంటే.. జగనన్న మీకు ఎప్పుడూ అండగా, తోడుగా ఉంటాడు మీ అందరితో కూడా ఒకే ఒక విషయం చెప్పదల్చుకున్నాను. చాలా మంది మాట్లాడగలిగారు. ఇంకా చాలా మంది మాట్లాడలేని పరిస్థితి. కానీ మీ అందరితో ఒకటే చెబుతున్నాను. మీ అందరికీ కూడా తోడుగా, మీ జగనన్న ఎప్పుడూ మీకు అండగా ఉంటాడని మాత్రం ఈ సందర్భంగా చెబుతున్నాను. దేవుడు పెద్ద స్క్రిప్టే రాశాడు ఇంకొక విషయం కూడా చెబుతున్నాను. ఈ దెబ్బ ఇక్కడ (నుదురుపైన) తగిలింది అంటే అది ఇక్కడా(కంటి మీద) తగల్లేదు. ఇక్కడా (కణత మీద) తగల్లేదు అంటే దేవుడు ఇంకా పెద్ద స్క్రిప్టే మనతో రాయించే కార్యక్రమంలో ఉన్నాడు అని దాని అర్థం. కాబట్టి భయం లేదు. పైన దేవుడు – కింద మీరు అండగా ఉండగా మీ అన్నకు భయంలేదు మనం గెలిచేది 175కు 175 సీట్లే అని 25కు 25 ఎంపీ సీట్లే. ఒక్క సీటు కూడా ఎక్కడా తగ్గేందుకు వీల్లేదు. మీ భుజస్కందాల మీద ఫోన్ అనే ఈ ఆయుధం మీ చేతుల్లో ఉందనేది గుర్తుపెట్టుకోమని అందరితో కోరుతున్నాను. అటు వైపున 100 ఈనాడులు వచ్చినా, 100 ఆంధ్ర జ్యోతులు వచ్చినా, 100 టీవీ 5లు వచ్చినా, 100 మంది చంద్రబాబులు, 100 మంది దత్తపుత్రులు వచ్చినా, జాతీయ పార్టీలు పరోక్షంగానూ, ప్రత్యక్షంగానూ మద్దతు పలికినా, కుట్రలు పన్నినా కుతంత్రాలు పన్నినా, అబద్ధాలు చెప్పినా, మోసాలు చేసినా మీ అందరికీ ఒకటే చెబుతున్నాను మీ జగన్‌కు భయం లేదు. మీ అన్నకు. మీ తమ్ముడుకి భయం లేదు. కారణం పైన దేవుడు ఉన్నాడు. కింద మీరంతా మీ అన్నకు అండగా ఉన్నారు. మీ అందరి ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు ఇక్కడ ఉన్న వాళ్లకు, ఇక్కడికి రాలేకపోయిన చాలా మంది ఆత్మీయులకు, దేశంలోనే కాకుండా విదేశాల్లో ఉండి కూడా వారి ప్రేమానురాగాలు, ఆప్యాయతలు చూపిస్తున్న నా అన్నదమ్ములకు, అక్కచెల్లెమ్మలకు అందరికీ కూడా మీ జగన్ మరొక్కసారి మనసారా చేతులు జోడించి పేరు పేరునా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను ఇటువైపున తిరుగుతా వచ్చినంత మేర సెల్ఫీ తీసుకుంటాను అంటూ... సీఎం వైఎస్ జగన్ తన ప్రసంగాన్ని ముగించారు. -
Memantha Siddham Bus Yatra: వన్స్‌మోర్ జగన్.. గళమెత్తిన విశాఖ (ఫొటోలు)
-
CM Jagan: ‘స్టీల్ ప్లాంట్ అంశంపై మాది రాజీలేని ధోరణి’
విశాఖపట్నం, సాక్షి: విశాఖ స్టీల్ ప్లాంట్ పునర్ వైభవం కోసం తమ ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషిచేస్తోందని, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వంపై నిరంతరంగా ఒత్తిడి చేస్తూనే ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అంటున్నారు. మంగళవారం మేమంతా సిద్ధం యాత్ర ప్రారంభానికి ముందు ఎండాడ వద్ద విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నాయకులు సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంలో స్టీల్ ప్లాంట్ విషయంలో తమది రాజీ లేని ధోరణి అని వాళ్లకు ఆయన స్పష్టం చేశారాయన. సీఎం జగన్‌ను కలిసిన సందర్భంలో.. విశాఖ ఉక్కు కర్మాగారం సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు కార్మిక సంఘాల నాయకులు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘రాష్ట్ర ప్రభుత్వం, వైయస్సార్సీపీ కూడా స్టీల్ ప్లాంట్ విషయంలో కార్మికులకు అండగా నిలుస్తుంది. ఈ సమస్యపై మొదటిసారిగా కార్మికుల తరపున రాష్ట్ర ప్రభుత్వమే గళమెత్తింది. తొలిసారిగా ప్రధానికి లేఖ కూడా రాశాం. అంతేకాదు.. స్టీల్ ప్లాంట్ కర్మాగారం అంశంపై పరిష్కారాలు కూడా సూచించాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం కూడా చేశాం. .. ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్సార్సీపీ పార్టీది రాజీలేని ధోరణి. ఎన్నికలొచ్చేసరికి ప్రతిపక్ష పార్టీలన్నీ ఇప్పుడు జట్టుకట్టాయి, కూటమిగా ఏర్పడ్డాయి. స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రతిపక్షాలు నైతికతను, విలువలను విడిచిపెట్టాయి. స్టీల్ ప్లాంట్ విషయంలో వారి వైఖరి ఏంటో బయటపడింది. శాశ్వతంగా ఇనుప ఖనిజం గనులు కేటాయింపుతో ప్లాంట్ పరిస్థితి మెరుగుపడుతుంది. మిగతా అంశాలు దీనివల్ల పరిష్కారం అవుతాయి.. .. విశాఖ స్టీల్ ప్లాంట్ పునర్ వైభవానికి శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వంపై నిరంతరంగా ఒత్తిడి తీసుకు వస్తూనే ఉన్నాం. ఈ ఎన్నికల్లో కార్మికుల మద్దతు కోరే నైతికత YSRCPకే ఉంది. ఎన్నికల వేళ పార్టీ అభ్యర్థులకు అండగా నిలవాలని కోరుతున్నాను అని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నాయకులకు సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకం. స్టీల్ ప్లాంట్ పై మా వైఖరిలో ఏ మార్పు లేదు. మేము కన్సెంటు ఇవ్వలేదు కాబట్టే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని సీఎం జగన్ చెప్పారు. ఉద్యమానికి మొదటి నుంచి వైఎస్సార్సీపీ అండగా ఉంది. ఇకపై కూడా ప్రభుత్వ సహకారంతోనే ఉద్యమం జరుగుతుంది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రధానమంత్రికి సీఎం జగన్ ఇప్పటికే రెండుసార్లు లేఖలు రాశారు. అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు. కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ మెజార్టీ రాకూడదని మేం కోరుకుంటున్నాం. -
సీఎం జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డ్: తలశిల రఘురాం
సాక్షి, విశాఖపట్నం: సీఎం జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డు అని ఎమ్మెల్సీ తలశిల రఘురాం అన్నారు. 16 సభలు, 9 రోడ్ షో లు, 6 ప్రత్యేక సమావేశాలు నిర్వహించామని, 2100 కిలోమీటర్ల మేర బస్సు యాత్ర చేపట్టారని ఆయన తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఎం జగన్‌పై హత్యాయత్నం చేసిన వెనక్కి తగ్గలేదన్నారు. ప్రజల్లో సీఎం జగన్ గ్రాఫ్ ఎంత పెరిగిందో స్పష్టమైందన్నారు. ‘‘పగటి పూట సభలు పెట్టలేని స్థితిలో చంద్రబాబు ఉన్నాడు. జనం రాక చంద్రబాబు బస్సులో గంటలకొద్దీ కూర్చుంటున్నాడు. విజయవాడ, విశాఖ రోడ్ షో లతో సీఎం జగన్ విజయం ఎలా ఉండబోతోందో అర్థమైంది. జ్వరం, దగ్గు, జలుబు అని హైదరాబాద్ వెళ్లిపోయే పవన్‌కి సీఎం జగన్‌ని విమర్శించే అర్హత లేదు. రెండు రోజుల్లో ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ ఖరారు చేస్తాం. బస్సు యాత్ర కంటే వినూత్నంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తాం’’ అని రఘురాం తెలిపారు. ‘‘ప్రజలు జగన్ వెంట నడుస్తున్న తీరు ప్రతిపక్షాలకు వణుకు పుట్టిస్తోంది. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు అడ్రాస్ ఉండదని తలశిల రఘురాం అన్నారు. -
చెల్లూరు మేమంతా సిద్ధం సభ: సీఎం జగన్ స్పీచ్ హైలైట్స్
Live Updates.. కొప్పేర్ల చేరుకున్న సీఎం జగన్ సార్ బస్సు యాత్ర భోగాపురం క్రాస్ అయిన సీఎం జగన్ చెల్లూరు మేమంతా సిద్ధం సభ: సీఎం జగన్ స్పీచ్ హైలైట్స్ విజయనగరం జిల్లా సిద్ధం విజయనగరం జిల్లాలో ఈరోజు ఇక్కడ ఓ మహా సముద్రం కనిపిస్తోంది ఒక్కసారిగా లక్షలమంది, తాండ్ర పాపారాయుళ్లు, శత్రుసైన్యాన్ని ఓడించేందుకు సిద్ధమైతే.. ఆ యుద్ధం ఎలా ఉంటుందో రుచిచూపించడానికి నా ఉత్తరాంద్ర సిద్ధం సిద్ధం అని అడుగులు వేస్తోంది ఈ సభకు వచ్చిన నా అక్క చెల్లెమ్మలకు, నా అన్న దమ్ములకు, నా అవ్వాతాతలకు, నా ప్రతీ సోదరుడికి, నా ప్రతీ స్నేహితుడికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జరగబోయే ఎన్నికలు కేవలం ఎంపీలను, ఎమ్మెల్యేలను ఎన్నుకోవడానికే మాత్రమే కాదు.. ఈ ఎన్నికలు తమ ఇంటింటి భవిష్యత్‌ను, తమకు అందుతున్న పథకాలను, ఇంటికే వచ్చే పౌర సేవలను, వాటి భవిష్యత్‌ను, పిల్లల భవిష్యత్‌ను, రాబోయే ఐదేళ్లు కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తించిన ప్రజలంతా, అడ్డుతగులుతున్న పెత్తందార్లు మీద, ఆ కౌరవ సైన్యం, ఆ నారా సైన్యానికి బుద్ధి చెప్పటానికి సిద్ధం సిద్ధం సిద్ధం అని అడుగులు వేస్తున్న ఓ ప్రజా సైన్యం నా కళ్ల ముందు కనిపిస్తోంది. ఈ రోజు చంద్రబాబు వెనకాల ఓ కాంగ్రెస్ ఉంది, ఓ బీజేపీ ఉంది.. ప్రత్యక్షంగా ఒకరు, పరోక్షంగా మద్దతు ఇస్తున్నారు.. చంద్రబాబుకు తోడుగా ఈరోజు ఓ దత్తపుత్రుడు ఉన్నాడు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ-5 ఉంది. ఇవి సరిపోవన్నుట్లుగా కుట్రలు, మోసాలు, అబద్ధాలు ఉన్నాయి ఇవన్నీ కళ్ల ముందే కనిపిస్తున్నాయి ఈ రోజు మీ జగన్ వెనకాల ఆ యెల్లో మీడియా లేదు.. ఆ పార్టీలు లేవు.. ఒక్క జగన్ మీదకు ఇంతమంది ఏకం అవుతా ఉన్నారు జగన్ కనుక ఇంటింటికి మంచి చేయకపోయి ఉంటే, ప్రతీ ఇంట్లోను జగన్‌ను బిడ్డ గా, తమ్ముడిగా భావించకపోతే.. ఇంతమంది తోడేళ్లు ఏకం కావాల్సిన అవసరం ఏముందని అడుగుతున్నాను జగన్ ఒకే ఒక్కడు కాదు.. నాకున్నది కోట్ల మంది మీరు అని సగర్వంగా చెబుతున్నాను ఈ 58 నెలల పాలనలో మీ జగన్, మీ బిడ్డ.. ఇంటింటికి చేసిన మంచే నాకున్న నమ్మకం.. ఆపై పైనున్న దేవుడి దయ ప్రతీ వర్గానికి మంచి చేశాం.. న్యాయం చేశాం మనం.. మోసం చేసింది మాత్రం వారు ఎన్నికల కురుక్షేత్రంలో తలపడుతున్నాం. పేదల్ని ఓడించాలని వారు.. ఇంటింటి అభివృద్ధిని కొనసాగించాలని మనం చేయబోతున్న ఈ యుద్ధంలో మరో చార్మిత్రాత్మకం విజయాన్ని సొంతం చేసుకునేందుకు మీరంతా సిద్ధమేనా? ప్రజల కలల్ని తన మోసాలతో వంచించడమే పనిగా పెట్టుకున్న ఆ బాబుకు , ఆ కూటమికి బుద్ధి చెప్పేందుకు మీరంతా సిద్ధమేనా? ఎక్కడైనా గమనించమని కోరతా ఉన్నాను వస్తువులు ఎత్తుకుపోతే దొంగల ముఠా అంటాం బెదిరించి దోచుకునే వారిని దోపిడీ ముఠా అంటాం ఎన్నికలప్పుడు మోసం చేసి, మోసపూరిత చరిత్ర ఉన్న ఆ మూడు పార్టీల కూటమిని ఏమనాలి అని అడుగుతున్నాను ఎన్నికలప్పుడు తీయటి మాటలు చెప్పి, ఆ తర్వాత మోసం చేస్తే.. అలాంటి మోసగాళ్లను ఏమంటాం అలాంటి వాళ్లను 420లు అందామా... వారిని 420లనే అంటాం మళ్లీ మన పేదల కలల్ని, మన పేదల బతుకుల్ని బలిపెట్టేందుకు వచ్చిన ఈ రాజకీయ కూటమిని చంద్రముఖి బృందం అని కూడా అంటాం 420 అనే కాదు.. చంద్రముఖి బృందం అని కూడా అంటాం పేదల కలల్ని అర్దం చేసుకుని మీ జగన్, మీ బిడ్డ పెట్టిన స్కీమ్స్ ఎన్నో తెలుసా దాదాపుగా 40 స్కీమ్స్ పెట్టాం మీ కలల్ని పూర్తి చేసేందుకు ఏకంగా 130 సార్లు బటన్ నొక్కాడు మీ బిడ్డ ఆ క్రమంలో అందజేసిన సొమ్ము ఎంతో తెలుసా ఏకంగా రెండు లక్షల డబ్బై కోట్ల రూపాయలు నేరుగానే అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి జమ చేశాం ఈ డీబీటీకి తోడు నాన్ డీబీటీ కూడా కలుపుకుంటే.. ఏకంగా మరో లక్ష కోట్లకు పైగానే ఇచ్చాం నా అక్క చెల్లెమ్మల డ్రీమ్స్‌ను.. నా స్కీమ్స్ ద్వారా నేరుగా వారి ఖాతాల్లోకి పంపించానని గర్వంగా చెప్పగలుగుతున్నాను ఇది కేవలం 58 నెలల కాలంలోనే పంపడం జరిగింది నా అక్క చెల్లెమ్మల కలలు, నా అవ్వా తాతల కలలు.. ఇలా డ్రీమ్స్ మీవి.. స్కీమ్స్ మావిగా ఈ 58 నెలల కాలం ప్రయాణం జరిగింది. పేదరికం కారణంగా పిల్లల్ని బడులకు పంపలేని పరిస్థితిని నేను నా ఓదార్పుయాత్రలో చూశాను.. నా పాదయాత్రలోనూ చూశాను అలాంటి నిరుపేద కలల్నినిజం చేయడానికే పుట్టింది.. జగనన్న అమ్మ ఒడి అని గర్వంగా చెబుతున్నాను. అంతే కాకుండా ఆ పేద తల్లి తమ పిల్లల గొప్ప భవిష్యత్‌కు కోసం కనే కలలు గురించి అర్ధం చేసుకున్నాను కాబట్టే ఒక నాడు నాడు, ఒక ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు, ఒక సీబీఎస్ఈ నుంచి ఐబీ వరకూ ప్రయాణం మూడో తరగతి నుంచి ఆ గవర్నమెంట్ బడుల్లో టోఫెల్ శిక్షణ, బైజూస్ కంటెంట్, ఆరోతరగతి నుంచే డిజిటల్ బోధనలు, ఎనిమిదో తరగతి వచ్చేసరికే ఆ పిల్లల చేతుల్లో ట్యాబ్స్... ఇలా ఎంతో సంక్షేమాన్ని తీసుకొచ్చాం ఈ రోజు పెద్ద చదువులు చదువుతున్న పిల్లలు ఏకంగా 93 శాతం మందికి విద్యా దీవెన, వసతి దీవెన ప్రవేశపెట్టాం ఒక డిగ్రీలో కరిక్యులమ్‌లో మార్పులు తీసుకొస్తూ.. విదేశీ విద్యాలయాల్లో సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్స్‌ను మన డిగ్రీలతో అనుసంధానం చేశాం మన డిగ్రీల్లో మ్యాండెటరీ ఇంటర్నెషిప్ తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా నా అక్క చెల్లెమ్మలు, ఆ పిల్లల డ్రీమ్స్.. వాటి నుంచి వచ్చినవే ఈ నా స్కీమ్స్ మరి వీటి గురించి మూడుసార్లు సీఎంగా, 14 ఏళ్లు సీఎంగా ఉన్నానని చెప్పుకునే చంద్రబాబు కనీసం ఆలోచనైనా చేశాడా అని అడుగుతున్నాను మరి ఈ ఆలోచనలు చంద్రబాబుకు ఎందుకు రాలేదంటే.. చంద్రబాబు అంటే చంద్రముఖి కాబట్టి. పేదలకు మంచి చేయడం కోసం కాదు.. పేదల రక్తాన్ని తాగేందుకు లకలకాని తపిస్తాడు కాబట్టి ప్రతీ అక్క చెల్లెమ్మకు ఆత్మ గౌరవంతో బ్రతకాలనే ఒక కల ఉంటుంది. కుటుంబం బాగుండాలని, పిల్లలకు మంచి చదువులు చెప్పించాలని కలలు కంటుంది. ఒక రూపాయి సంపాదించి కుటుంబానికి తోడుగా ఉండాలని కలలుకంటుంది. మరి అటువంటి కలలు కన్న వారి కోసం ఎటువంటి స్కీమ్స్ తీసుకొచ్చామో చూద్దామా.. ఓ వైఎస్సార్ ఆసరా పథకం, ఓ వైఎస్సార్ సున్నా వడ్డీ అనే పథకం. అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసున్న నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ వారు నిలదొక్కుకునేలా ఉండేందుకే పుట్టిందే వైఎస్సార్ చేయూత అనే పథకం నా కాపు అక్క చెల్లెమ్మల కోసం పుట్టింది.. కాపునేస్తం అనే పథకం నా ఈబీసీ అక్క చెల్లెమ్మల కోసం పుట్టింది ఈబీసీ నేస్తం అనే పథకం అక్క చెల్లెమ్మల డ్రీమ్స్‌ను.. వాటిని నిజం చేయడానికి మీ జగన్ పెట్టిన స్కీమ్స్ ఇవి అని చెబుతున్నాను డ్రీమ్స్ పేదింటి అమ్మవి.. స్కీమ్స్ మీ బిడ్డవి అని గర్వంగా చెబుతున్నాను చంద్రబాబు హయాంలో ఇలాంటి స్కీమ్స్ లేవు. చంద్రబాబు హయాంలో నా అక్క చెల్లెమ్మలను మోసం చేయడం, వారిని వంచించి రోడ్డు మీద పడేసి వారి రక్తాన్ని పీల్చే చంద్రముఖి పాలన మాత్రమే చూశాం. ప్రతీ అక్క చెల్లెమ్మ కలకంటుంది. సొంత ఇల్లు ఉండాలని కలలు కంటుంది. దీని కోసం జీవితకాలం ఎదురుచూస్తాం. మరి ఆ డ్రీమ్‌ను నెరవేరుస్తూ మీ బిడ్డ ఏం చేశాడు నా అక్క చెల్లెమ్మల పేరిటి 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాడు. అందులో 21 లక్షల ఇళ్ల నిర్మాణం కూడా జరుగుతోంది. డ్రీమ్ మీవి.. స్కీమ్ మీ బిడ్డవి, మీ తమ్ముడివి, మీ అన్నవి చంద్రబాబు మోసాలను గుర్తు చేసుకోండి మీ బిడ్డ పాలనలో ఎటువంటి మంచి జరిగిందో ఆలోచన చేయండి ప్రతీ గ్రామంలో రైతు భరోసా కేంద్రం, పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్. పెట్టుబడి సాయంగా రైతు భరోసా రూ. 13,500 ఇచ్చాం. సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ, రూ. 65 వేల కోట్లతో ధాన్యం కొనుగోలు. దోచుకోవడం.. పంచుకోవడమే చంద్రబాబు డ్రీమ్. పొలాల్లో పెట్టే దిష్టిబొమ్మనైనా నమొచ్చేమోకానీ చంద్రబాబును నమ్మలేం. ప్రతి ఎన్నికల సమయంలో రంగరంగుల మేనిఫెస్టో తెస్తారు. ఎన్నికల అయిపోయాక మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేస్తాడు చంద్రబాబు. పొలాల్లో దిష్టిబొమ్మనైనా నమ్మొచ్చుకానీ బాబును నమ్మలేం నారా కౌరవ సైన్యానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. మాట ఇస్తే నిలబడే పాలన మీ జగన్‌ది.. ఎవరుంటే మంచి జరుగుతుందో ఆలోచన చేయండి చెల్లూరు బహిరంగ సభ వద్దకు చేరుకున్న సీఎం జగన్ ర్యాంప్‌పై నడుస్తూ ప్రజలకు అభివాదం చేస్తున్న సీఎం జగన్ అశేష జనవాహినితో నిండిపోయిన సభా ప్రాంగణం జై జగన్ నినాదాలతో మార్మోగుతున్న సభా ప్రాంగణం విజయనగరం: చెల్లూరు చేరుకున్న సీఎం జగన్ మరికాసేపట్లో మేమంతా సిద్ధం సభలో ప్రసంగించనున్న సీఎం జగన్ లక్షలాది మందితో కిక్కిరిసిపోయిన సభా ప్రాంగణం జై జగన్ నినాదాలతో మార్మోగుతున్న సభా ప్రాంగణం విజయనగరం: కాసేపట్లో చెల్లూరు బహిరంగ సభ వద్ద చేరుకోనున్న సీఎం జగన్ చెల్లూరు సభకు భారీ సంఖ్యలో హాజరైన ప్రజలు సీఎం జగన్‌కు ఘనస్వాగతం పలికిన ఉత్తరాంధ్ర ప్రజలు మేమంతా సిద్ధమంటూ హోరెత్తుతున్న ఉతర్రాంధ్ర విజయనగరం: ఐనాడు జంక్షన్ వద్దకు భారీగా చేరుకున్న ప్రజలు రోడ్లకు ఇరువైపులా జన ప్రభంజనం ఐనాడుకు కొద్దీ దూరంలోనే జరగనున్న సిద్ధం సభ. విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం జగన్ బస్సు యాత్ర మోదవలస వద్ద విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం జగన్ 21 రోజు బస్సుయాత్ర విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో సీఎం జగన్ బస్సు యాత్ర విజయనగరం జిల్లా ఎంట్రన్స్‌లో సీఎం జగన్ బస్సుయాత్రకు ఘనస్వాగతం పలికిన వైఎస్సార్సీపీ నేతలు పదిహేను వందల బైక్‌లతో భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు.. ప్రజలు పువ్వులతో స్వాగతం పలుకుతూ హారతులతో ఆశీర్వదించారు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ప్రతినిధులకు సీఎం జగన్ భరోసా వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ప్రతినిధులపై దాడులు జరిగితే నేరుగా తనకు తెలిసేలా వేదిక ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశం సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదుతో పాటు పార్టీ నుంచి న్యాయ సహాయం దాడులకు భయపడేది లేదు దేవుడు ఇంకా ఏదో పెద్ద స్క్రిప్ట్ రాశాడు వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలతో సీఎం జగన్ ముఖాముఖి నా చెల్లెమ్మలకు, తమ్ముళ్లకు కృతజ్ఞతలు: సీఎం జగన్ ఇటు వైపు జగన్ ఒక్కడే.. అటు వైపు కూటమితో ఏకమయ్యారు మనం కూటమి కుట్రలు, కుతంత్రాలతో యుద్ధం చేస్తున్నాం అబద్ధాలు,మోసాలతో యుద్ధం చేస్తున్నాం గీతాంజలిని దారుణంగా ట్రోల్ చేశారు టీడీపీ ఎంత దిగజారిందో దానికి గీతాంజలి ఆత్మహత్యే నిదర్శనం సోషల్ మీడియా మనతోనే ఉంది సెల్‌ఫోన్ ఉన్న ప్రతిఒక్కరూ మనతోనే ఉన్నారు విశాఖపట్నం ఏపీకి డెస్టినీ అవుతుంది ఐటీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుంది సీఎం వచ్చి నేరుగా విశాఖలో కూర్చుంటే బెంగుళూరు, హైదరాబాద్, చెన్నైతో పోటీ పడే స్థాయికి వెళ్తుంది జగనన్న మీకు ఎప్పుడూ అండగా, తోడుగా ఉంటాడు. మీ అందరితో కూడా ఒకే ఒక విషయం చెప్పదల్చుకున్నాను. చాలా మంది మాట్లాడగలిగారు. ఇంకా చాలా మంది మాట్లాడలేని పరిస్థితి. కానీ మీ అందరితో ఒకటే చెబుతున్నాను. మీ అందరికీ కూడా తోడుగా, మీ జగనన్న ఎప్పుడూ మీకు అండగా ఉంటాడని మాత్రం ఈ సందర్భంగా చెబుతున్నాను. దేవుడు పెద్ద స్క్రిప్టే రాశాడు. ఇంకొక విషయం కూడా చెబుతున్నాను. ఈ దెబ్బ ఇక్కడ (నుదురుపైన) తగిలింది అంటే అది ఇక్కడా(కంటి మీద) తగల్లేదు. ఇక్కడా (కణత మీద) తగల్లేదు అంటే దేవుడు ఇంకా పెద్ద స్క్రిప్టేదో మనతో రాయించే కార్యక్రమంలో ఉన్నాడు అని దాని అర్థం. కాబట్టి భయం లేదు. పైన దేవుడు – కింద మీరు అండగా ఉండగా మీ అన్నకు భయంలేదు. మనం గెలిచేది 175కు 175 సీట్లే అని 25కు 25 ఎంపీ సీట్లే. ఒక్క సీటు కూడా ఎక్కడా తగ్గేందుకు వీల్లేదు. మీ భుజస్కందాల మీద ఫోన్ అనే ఈ ఆయుధం మీ చేతుల్లో ఉందనేది గుర్తుపెట్టుకోమని అందరితో కోరుతున్నాను. అటు వైపున 100 ఈనాడులు వచ్చినా, 100 ఆంధ్రజ్యోతులు వచ్చినా, 100 టీవీ5లు వచ్చినా, 100 మంది చంద్రబాబులు, 100 మంది దత్తపుత్రులు వచ్చినా, జాతీయ పార్టీలు పరోక్షంగానూ, ప్రత్యక్షంగానూ మద్దతు పలికినా, కుట్రలు పన్నినా కుతంత్రాలు పన్నినా, అబద్ధాలు చెప్పినా, మోసాలు చేసినా మీ అందరికీ ఒకటే చెబుతున్నాను మీ జగన్ కు భయం లేదు. మీ అన్నకు. మీ తమ్ముడుకి భయం లేదు. కారణం పైన దేవుడు ఉన్నాడు. కింద మీరంతా మీ అన్నకు అండగా ఉన్నారు. మీ అందరి ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు ఇక్కడ ఉన్న వాళ్లకు, ఇక్కడికి రాలేకపోయిన చాలా మంది ఆత్మీయులకు, దేశంలోనే కాకుండా విదేశాల్లో ఉండి కూడా వారి ప్రేమానురాగాలు, ఆప్యాయతలు చూపిస్తున్న నా అన్నదమ్ములకు, అక్కచెల్లెమ్మలకు అందరికీ కూడా మీ జగన్ మరొక్కసారి మనసారా చేతులు జోడించి పేరు పేరునా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను ఇటువైపున తిరుగుతా వచ్చినంత మేర సెల్ఫీ తీసుకుంటాను అంటూ.. సీఎం జగన్ తన ప్రసంగాన్ని ముగించారు. సీఎం జగన్ బస్సు యాత్రకు అపూర్వ స్వాగతం సీఎం జగన్‌కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలైన తప్పెటగుళ్లు, కోలాటంతో స్వాగతం పలికిన ప్రజలు బస్సు పైకి ఎక్కి ప్రజలకు అభివాదం చేసిన ముఖ్యమంత్రి కార్మిక సంఘాల నాయకులతో మాట్లాడిన సీఎం జగన్ విశాఖపట్నం జిల్లా ఎండాడ నైట్ స్టే పాయింట్ వద్ద సీఎం జగన్‌ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నాయకులు విశాఖ ఉక్కు కర్మాగారం సమస్యను నివేదించిన కార్మిక సంఘాల నాయకులు రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్సార్సీపీ కూడా స్టీల్ ప్లాంట్ విషయంలో కార్మికులకు అండగా నిలుస్తుంది: సీఎం జగన్ ఈ సమస్యపై మొదటిసారిగా కార్మికుల తరపున రాష్ట్ర ప్రభుత్వమే గళమెత్తింది: తొలిసారిగా ప్రధానికి లేఖ రాశాం స్టీల్ ప్లాంట్ కర్మాగారం అంశంపై పరిష్కారాలు కూడా సూచించాం: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం కూడా చేశాం ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలది రాజీలేని ధోరణి ప్రతిపక్ష పార్టీలన్నీ ఇప్పుడు జట్టుకట్టాయి, కూటమిగా ఏర్పడ్డాయి స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రతిపక్షాలు నైతికతను, విలువలను విడిచిపెట్టాయి స్టీల్ ప్లాంట్ విషయంలో వారి వైఖరి ఏంటో బయటపడింది శాశ్వతంగా ఇనుప ఖనిజం గనులు కేటాయింపుతో ప్లాంట్ పరిస్థితి మెరుగుపడుతుంది మిగతా అంశాలు దీనివల్ల పరిష్కారం అవుతాయి విశాఖ స్టీల్ ప్లాంట్ పునర్ వైభవానికి శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నాం కేంద్ర ప్రభుత్వంపై నిరంతరంగా ఒత్తిడి తీసుకు వస్తూనే ఉన్నాం ఈ ఎన్నికల్లో కార్మికుల మద్దతు కోరే నైతికతక వైఎస్సార్సీపీకే ఉంది పార్టీ అభ్యర్థులకు అండగా నిలవాలని కోరుతున్నాను: సీఎం జగన్ 21వరోజు ప్రారంభమైన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఎండాడ ఎండాడ ఎంవీవీ సిటీ నుంచి బస్సు యాత్ర ప్రారంభం కాసేపట్లో సోషల్ మీడియా కార్యకర్తలతో సీఎం జగన్ ముఖాముఖి సాయంత్రం చెల్లూరులో ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభ బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం వైఎస్ జగన్ పీఎంపాలెం వద్ద కోలాహలం పీఎంపాలెం వైయస్సార్ స్టేడియం వద్ద సందడి వాతావరణం.. సీఎం జగన్ ను చూసేందుకు భారీగా తరలివచ్చిన మహిళలు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.. మరి కాసేపట్లో ప్రారంభం కానున్న మేమంతా సిద్ధం బస్సుయాత్ర నేడు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ఇలా.. మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 21వ రోజైన మంగళవారం(ఏప్రిల్ 23) షెడ్యూల్ సీఎం జగన్ ఎండాడ ఎంవీవీ సిటీ నుంచి మంగళవారం ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు మధురవాడ మీదుగా ఆనందపురం చేరుకుని చెన్నాస్ కన్వెన్షన్ హాల్ వద్ద సోషల్ మీడియా కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు అక్కడ నుంచి తగరపువలస మీదుగా జొన్నాడ చేరుకుంటారు జొన్నాడ దాటిన తర్వాత సీఎం జగన్ భోజన విరామం తీసుకుంటారు అనంతరం బొద్దవలస మీదుగా సాయంత్రం 3.30 గంటలకు చెల్లూరు వద్దకు చేరుకొని బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు ఆ తర్వాత చింతలవలస, భోగాపురం, రణస్థలం మీదుగా అక్కివలసలో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి ముఖ్యమంత్రి జగన్ చేరుకుంటారు ఇదీ చదవండి: ఓ విజేత జైత్రయాత్ర Memantha Siddham Yatra, Day -21. ఉదయం 9 గంటలకు ఎండాడ MVV సిటీ రాత్రి బస నుంచి ప్రారంభం సాయంత్రం 3:30 గంటలకు చెల్లూరు వద్ద బహిరంగ సభ అక్కివలస దగ్గర రాత్రి బస#MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/IAQvjd6MPK — YSR Congress Party (@YSRCParty) April 23, 2024 జననేతకు అడుగడుగునా జన నీరాజనం రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసిన సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ఇప్పటిదాకా 20 రోజుల పాటు 21 జిల్లాల్లో సాగిన యాత్ర.. ఈనెల 24న శ్రీకాకుళం జిల్లాలో బస్సు యాత్ర ముగింపు తమ బతుకుల్లో వెలుగులు నింపిన నేతకు అడుగడుగునా జన నీరాజనం రాయలసీమ.. దక్షిణ కోస్తా.. ఉత్తర కోస్తా.. ఉత్తరాంధ్ర.. ప్రాంతం ఏదైనా అదే ప్రభంజనం మండుటెండల్లోనూ పిల్లల నుంచి పండుటాకుల దాకా ఒకే ఆరాటం మంచి చేసిన మిమ్మల్ని గెలిపించుకుని మళ్లీ సీఎంగా చేసుకుంటామంటూ ప్రతిజ్ఞ బస్సు యాత్రలో భాగంగా నిర్వహించిన 14 సభలు జనసంద్రాలను తలపించిన వైనం కూటమి వెన్నులో వణుకు పుట్టించిన విశాఖ, విజయవాడ, రాజమహేంద్రవరం రోడ్ షోలు అపూర్వ ఆదరణ చూసి ఓర్వలేక సీఎం జగన్‌పై హత్యాయత్నానికి తెగబడ్డ టీడీపీ మూక.. నుదిటిపై తీవ్ర గాయమైనా చెదరని సంకల్పంతో సీఎం యాత్ర బస్సు యాత్ర ప్రభంజనంతో పోటీ ఏకపక్షంగా మారిందంటున్న రాజకీయ పరిశీలకులు -
అప్పుడు పాదయాత్ర - ఇప్పుడు బస్సు యాత్ర..ఎక్కడా తగ్గని జగన్ మార్క్
-
మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఆపన్నహస్తం అందిస్తోన్న సీఎం జగన్
-
విశాఖ సాగర తీరంలో సీఎం జగన్ సునామీ
-
ఉక్కునగరంలో అభిమాన సంద్రం.. మేమంతా సిద్ధం బస్సుయాత్రలో సమరోత్సాహం.. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి జన నీరాజనం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
వేపగుంట జంక్షన్ లో దుమ్మురేపిన బస్సు యాత్ర
-
కన్నీళ్లు పెట్టుకున్న చిన్నారి తండ్రి...సీఎం జగన్ భరోసా..
-
కాసేపట్లో చిన్నయ్యపాలెం నుంచి బస్సు యాత్ర ప్రారంభం
-
మేమంతా సిద్ధం బస్సు యాత్ర 20వ రోజు షెడ్యూల్ విడుదల
-
ఎగసిపడే అలలను తలపించేలా సీఎం జగన్ బస్సు యాత్ర..
-
Anakapalle Memantha Siddham: ‘మేమంతా సిద్ధం’ అంటున్న అనకాపల్లి జన సంద్రం (ఫోటోలు)
-
సింగల్ గా వస్తున్న నన్ను చూసి బాబు భయంతో వణికిపోతున్నాడు
-
సీఎం జగన్ బస్సుయాత్ర : ఎగిసిన జనసంద్రం (ఫొటోలు)
-
ప్రభంజనంలా సీఎం జగన్ బస్సు యాత్ర నక్కపల్లి
-
మేమంతా సిద్ధం : అనకాపల్లిలో సీఎం జగన్‌కు జన నీరాజనం (ఫొటోలు)
-
జనసంద్రంగా మారిన జాతీయ రహదారి
-
Watch Live: సీఎం జగన్ బస్సు యాత్ర డే 19
-
నేడు 19వ రోజు 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర షెడ్యూల్
-
ఆఖరి నిమిషం దాకా అలర్ట్!
సాక్షి, హైదరాబాద్: నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై లోక్‌సభ ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న నేపథ్యంలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. పార్టీ అభ్యర్థులుగా ఖరారు చేసిన అభ్యర్థులు కొందరు చివరి నిమిషంలో ఇతర పార్టీల్లో చేరడాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఎక్కడా అభ్యర్థులు చేజారిపోకుండా చూడాలని, ఒకవేళ ఎక్కడైనా పార్టీ అభ్యర్థుల నామినేషన్ల దాఖలులో ఇబ్బందులు ఎదురైతే వెంటనే ప్రత్యామ్నాయ అభ్యర్థులను బరిలోకి దించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసింది. పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు నందినగర్ నివాసంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రి హరీశ్‌రావు శుక్రవారం ఆయనతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. కేసీఆర్ ఎన్నికల ప్రచార సభలు, బస్సు యాత్ర షెడ్యూల్‌తో పాటు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, పరిణామాలపై లోతుగా చర్చించారు. లోక్‌సభ ఎన్నికల పోలింగ్ నాటికి ఒకరిద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు కొందరు కీలక నేతలు కూడా పార్టీని వీడే అవకాశమున్నట్లు అంచనా వేశారు. ఎమ్మెల్యేలు లేదా అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జీలు పార్టీ మారిన చోట లోక్‌సభ ఎన్నికల ప్రచారం, సమన్వయ సమస్యలు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు అనుసరించాల్సిన కార్యాచరణను సిద్ధం చేశారు. గురువారం జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ ప్రస్తావించిన అంశాలు, వాటిపై విపక్ష శిబిరం నుంచి వచి్చన స్పందనపై కూడా ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగా కేసీఆర్ ఇరువురు నేతలకు పలు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల నిధుల వ్యయం అభ్యర్థుల చేతుల మీదుగా కాకుండా పార్టీ పర్యవేక్షణలోనే జరిగేలా చూడాలని ఆదేశించారు. రైతాంగ సమస్యలు ఎత్తిచూపేలా యాత్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ ఈ నెల 22 నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు చేసే బస్సుయాత్ర తీరుతెన్నులపై సుదీర్ఘంగా చర్చించారు. బస్సు యాత్ర చేయాల్సిన మార్గం, ఏయే తేదీల్లో ఏయే ప్రదేశాల్లో సభలు, వీధి మలుపు (స్ట్రీట్ కార్నర్) సమావేశాలు ఏర్పాటు చేయాలనే అంశంపై కసరత్తు చేశారు. వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఉదయం 11 గంటల లోపు ఇటీవల కేసీఆర్ చేసిన ‘పొలంబాట’తరహా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. క్షేత్రస్థాయిలో రైతులు, యువత, మహిళలు, మైనారిటీలు ఇతర సామాజిక వర్గాలతో కేసీఆర్ భేటీ అయ్యేలా చేపట్టాల్సిన కార్యక్రమాల జాబితాను సిద్ధం చేశారు. రైతాంగ సమస్యలను ప్రధానంగా ఎత్తి చూపేలా బస్సు యాత్ర ఉదయం పూట షెడ్యూల్‌ను రూపొందిస్తున్నారు. సాయంత్రం సమయంలో రెండు లేదా మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో రోడ్‌షోలు, మినీ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. తనతో పాటు బస్సు యాత్రలో పాల్గొనే బృందం బస, భోజన వసతి తదితరాల బాధ్యతలు స్థానికంగా ఎవరికి అప్పగించాలనే అంశంపైనా చర్చ జరిగింది. వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని సభలు, రోడ్‌షోలకు వచ్చే వారికి మంచినీరు, మజ్జిగ ప్యాకెట్ల సరఫరా చేయాలని నిర్ణయించారు. కాగా బస్సు యాత్ర రూట్‌మ్యాప్‌పై లోక్‌సభ నియోజకవర్గాల వారీగా ఆయా జిల్లాల నేతలు ఇప్పటికే తమ ప్రతిపాదనలు అందజేశారు. ఈ ప్రతిపాదనలను క్రోడీకరించి శనివారం సాయంత్రంలోగా కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశముందని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్, బీజేపీల కంటేఓ అడుగు ముందే..! లోక్‌సభ నియోజకవర్గాల వారీగా ఇప్పటివరకు జరిగిన సన్నాహక భేటీలను, కేడర్‌ను సన్నద్ధం చేసిన తీరుపై కేసీఆర్ సమీక్షించారు. సన్నాహక భేటీలు, సభల నిర్వహణ, ప్రచారంలో బీజేపీ, కాంగ్రెస్‌తో పోలిస్తే ఓ అడుగు ముందు ఉన్నట్లు అంచనాకు వచ్చారు. ఎన్నికల ప్రచారంలో విపక్ష పార్టీలు ప్రస్తావిస్తున్న అంశాలు, ఉపయోగిస్తున్న భాష తదితరాలు భేటీలో ప్రస్తావనకు వచ్చాయి. రెండు జాతీయ పార్టీలను ఇరకాట స్థితిలోకి నెట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. కేసీఆర్ బస్సు యాత్ర కోసం ప్రజలకు చేరువయ్యే రీతిలో కొత్త పాటలను రికార్డు చేసే పనులు సాగుతున్నట్లు పార్టీ నేతలు వెల్లడించారు. ఇలావుండగా శుక్రవారం పలువురు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేసీఆర్‌ను కలిశారు. -
‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. రేపటి షెడ్యూల్ ఇలా
సాక్షి, అనకాపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర ఉద్యమంలా కొసాగుతోంది. యాత్రలో భాగంగా సీఎం జగన్ పర్యటిస్తున్న ప్రాంతమంతా జన కెరటాన్ని తలపిస్తోంది. అడుగడుగునా జనం ప్రభంజనం మాదిరి కదిలివస్తోంది. జై జగన్ అంటూ ఉవ్వెత్తున నినాదిస్తున్నారు. మేమంతా సిద్ధం 19వ రోజు (ఏప్రిల్ 20) షెడ్యూల్‌ను వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం శుక్రవారం విడుదల చేశారు. బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్ శనివారం ఉదయం 9 గంటలకు గోడిచర్ల రాత్రి బస నుంచి బయలుదేరుతారు. నక్కపల్లి, పులపర్తి, యలమంచిలి బైపాస్ మీదుగా అచ్యుతాపురం చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం నరసింగపల్లి మీదుగా సాయంత్రం 3:30 గంటలకు చింతపాలెం వద్ద బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం బయ్యవరం, కశింకోట, అనకాపల్లి బైపాస్, అస్కపల్లి మీదుగా చిన్నయపాలెం రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. -
Telangana: కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టనున్న బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 22 నుంచి మే 10వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ బస్సు యాత్ర అనుమతి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్‌ను బీఆర్ఎస్ నాయకులు కే వాసుదేవా రెడ్డి శుక్రవారం కలిశారు. బస్సు యాత్ర వివరాలను వికాస్ రాజ్‌కు వాసుదేవా రెడ్డి అందజేశారు. ఈ నేపథ్యంలో యాత్రకు సంబంధించి భద్రతా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. యాత్రకు పోలీసుల సహకారం అందించేలా చూడాలని కోరారు. ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగేలా చూడాలని వాసుదేవా రెడ్డి కోరారు. కాగా కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తిచూపుతూ.. బీర్ఎస్ పార్టీకి పూర్వవైభవం తీసుకురావడమే ధ్యేయంగా కేసీఆర్ లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. గత పదేళ్లలో బీఆర్ఎస్స హయాంలో చేపట్టిన కార్యక్రమాలు, వాటి ద్వారా కలిగిన లబ్ధిని ప్రజలకు వివరించేలా ప్రచారం నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారం కోసం ఈనెల చివరి వారం నుంచి బస్సు యాత్ర చేయనున్నారు, సాయంత్రం సమయాల్లో ఒక్కో లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో రెండు, మూడు చోట్ల రోడ్‌షోలు ఉండనున్నాయి. రెండు, మూడు వారాల పాటు జరిగే ఈ బస్సు యాత్రలో భాగంగా ఉదయం పూట పంట పొలాలు, కల్లాలు, కొనుగోలు కేంద్రాల సందర్శనతోపాటు వివిధ వర్గాలతో భేటీ అవుతారు. బస్సుయాత్రలో తన వెంట వచ్చే బృందానికి బస ఏర్పాట్లు చేయాలని పార్టీ నేతలకు సూచించారు. సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లలో లక్ష మందితో మినీ సభలు కూడా ఏర్పాటు చేద్దామన్నారు. -
చంద్రబాబు తన సంకలోని పిల్లిని పిఠాపురంలో వదిలాడు: సీఎం జగన్
సాక్షి, కాకినాడ: వైఎస్సార్సీపీకీ ఓటేస్తే రాష్ట్రంలో అమలవుతున్న పథకాలన్నీ కొనసాగుతాయన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ రద్దవుతాయని అన్నారు. ఫ్యాన్‌కు ఓటేస్తే.. అవ్వతాతలకు రూ.3వేల పెన్షన్ వస్తుందని తెలిపారు. బాబుకు ఓటేస్తే జన్మభూమి కమిటీలతో దోచుకుంటారని విమర్శించారు. ఫ్యాన్‌కు ఓటేస్తే ఇంటింటికి పౌర సేవలు అందుతాయని పేర్కొన్నారు. బాబుకు ఓటేస్తే.. పసుపుపతి నిద్రలేచి వదలా బొమ్మాళి అంటాడని సీఎం జగన్ మండిపడ్డారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 18వ రోజు తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా కాకినాడ అచ్చంపేట జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. కాకినాడలో ఉప్పొంగి ప్రవహిస్తన్న నిండు గోదావరి కనిపిస్తోందన్నారు. ఎన్నికలకు కేవలం 25 రోజులే ఉన్నాయని.. జైత్రయాత్రకు సిద్ధమని ప్రజలంతా సింహగర్జన చేస్తున్నారని తెలిపారు. మంచి చేసిన మీ బిడ్డకు తోడుగా ఉండేందుకు మీరంతా సిద్ధమా? అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో పేదల వ్యతిరేక వర్గాన్ని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. పెత్తందారుల అనుకూల వర్గానికి, పేదల అనుకూల వర్గానికి క్లాస్ వార్ జరుగుతోందన్నారు సీఎం జగన్. మీరేసే ఓటు.. రాబోయే ఐదేళ్ల భవిష్యత్తని అన్నారు. జగన్‌కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగుతాయని తెలిపారు. ఇప్పటి వరకు రూ. 2 లక్షల 70 వేల కోట్లు పేదల ఖాతాల్లో వేశామని పేర్కొన్నారు. దోచుకోవడం, దాచుకోవడం బాబు మార్క్ పాలన అని మండిపడ్డారు. రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే జగన్ మార్క్ పాలన కొనసాగుతోందన్నారు. సీఎం జగన్ పూర్తి ప్రసంగం జగన్ ద్వారా అందుతున్న పథకాలు ఇక ముందుకూడా అందాలా.. లేదా? వైఎస్సార్సీపీకి ఓటేస్తే జగన్ మార్క్ సచివాలయాలు కొనసాగుతాయి లేకుంటే చంద్రబాబు మార్క్ జన్మభూమి కమిటీలు మళ్లీ వస్తాయి బాబుకు ఓటేస్తే జన్మభూమి కమిటీలతో దోచుకుంటారు. ఓటేయడంలో పొరపాటు చేస్తే చంద్రముఖి నిద్ర లేచి మీ పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తుంది. మంచి చేసిన మీ బిడ్డ పాలనా కావాలా? ఫ్యాన్‌కు ఓటేస్తేనే రైతు భరోసా, ఉచిత పంటల భీమా ఫ్యాన్‌కు ఓటేస్తేనే.. పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ వైఎస్సార్సీపీకి ఓటేస్తేనే.. సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ ఫ్యాన్‌కు ఓటేస్తేనే..పిల్లల చదువులకు ఇబ్బంది లేకుండా అమ్మొడి, విద్యాదీవెన, వసతిదీవెన ఫ్యాన్‌కు ఓటేస్తేనే..కాపు నేస్తం కొనసాగింపు ఫ్యాన్‌కు ఓటేస్తేనే..నామినేటెడ్ పదవుల్లో మహిళలకు ప్రాధాన్యం మంచి చేసిన మీ బిడ్డ పాలనా కావాలా? పెత్తందారులతో కలిసి దోచుకునే కూటమి పాలన కావాలా? 14 ఏళ్లలో బాబు చేసిన మంచి పని కూడా లేదు. చంద్రబాబు పేరు చెప్తే ఒక్క పథకమైనా గుర్తుకొస్తుందా? దత్తపుత్రుడు టికెట్లు ఇస్తే ఏర్పడిన కూటమి కాదు బాబు ప్రయోజనం కోసం ఎక్కడ కావాలంటే అక్కడ నిలబడుతున్నాడు. దత్తపుత్రుడికి ఎక్కడ టికెట్ ఇవ్వాలో కూడా బాబే నిర్ణయిస్తాడు. జ్వరం వస్తే పిఠాపురం వదిలి హైదరాబాద్ పారిపోయాడు బాబు సిట్ అంటే పవన్ సిట్.. స్టాండ్ అంటే పవన్ స్టాండ్ ప్యాకేజీ స్టార్‌కు పెళ్లిళ్లే కాదు.. నియయోజకవర్గాలు కూడా నాలుగు అయ్యాయి. చంద్రబాబు తన సంకలోని పిల్లిని పిఠాపురంలో వదిలాడు జ్వరం వస్తే ప్యాకేజీ స్టార్ పిఠాపురం వదిలేసి హైదరాబాద్ పారిపోయే రకం బీఫామ్ బీజేపీ, కాంగ్రెస్, గాజుగ్లాస్‌దే అయినా..యూనిఫామ్ మాత్రం చంద్రబాబుదే రాష్ట్రాన్ని హోల్‌సేల్‌గా దోచుకునేందుకు చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు. బాబు పొడవమంటే పురందేశ్వరి తన తండ్రినే వెన్నుపోటు పొడిచింది. బాబు ఎవరికి సీటు ఇమ్మంటే పురందేశ్వరి వారికే ఇస్తుంది. నక్కలు, తోడేళ్లు కూటమిగా వస్తున్నాయి. ఎవరు ఉంటే మీ ఇంటికి మంచి జరుగుతుందో ఆలోచించి ఓటేయండి ఫ్యాన్‌కు ఓటేస్తే పథకాలు అన్నీ కొనసాగుతాయి. కూటమికి ఓటేస్తే పథకాలన్నీ ముగిసిపోతాయి చంద్రబాబు సాధ్యం కాని హామీ ఇస్తున్నారు. మంచి చేసిన మీ బిడ్డ పాలన కావాలా? పెత్తందారులతో కలిసి దోచుకునే కూటమి కావాలా గత ఎన్నికల్లో మాకు ఓటు వేయని వారికి కూడా మంచి చేశాం మీరే నాస్టార్ క్యాంపెయినర్లు నా మీద వేయడానికి చంద్రబాబుకు గులకరాళ్లే మిగిలాయి మీరే నాస్టార్ క్యాంపెయినర్లు రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా? పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తా అన్నాడు.. చేశాడా? ఆడబిడ్డ పుడితే రూ. 25 వేలు డిపాజిట్ చేస్తానన్నాడు.. చేశాడా? ఇదే కూటమి మళ్లీ మోసం చేసేందుకు వస్తోంది. నమ్మొద్దు 10 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ అన్నాడు.. చేశాడా? సింగపూర్‌ను మించి అభివృద్ధి చేస్తానన్నాడు.. చేశాడా? ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తానన్నాడు.. నిర్మించాడా? అర్హులకు మూడు సెంట్ల స్థలం ఇస్తానన్నాడు.. ఇచ్చాడా? ఇదే కూటమి మళ్లీ మోసం చేసేందుకు వస్తోంది. నమ్మొద్దు సూపర్ సిక్స్, సెవెన్ అంటున్నాడు. ఆ మోసగాళ్ల నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు మీరంతా సిద్ధమా? Read this article in English : Click.. Package Star Has Got 4 Marriages & 4 Constituencies -
Memantha Siddham: ‘మేమంతా సిద్దం’ బస్సు యాత్ర.. కొనసాగుతున్న సీఎం జగన్ ప్రభంజనం (ఫొటోలు)
-
Memantha Siddham Photos: పల్లె పల్లెలో జన గోదారి..సీఎం జగన్‌కు జేజేలు (ఫొటోలు)
-
అంబులెన్స్ లో పేషెంట్ ను పరామర్శించిన సీఎం జగన్
-
జననేతకు ఘన స్వాగతం...
-
సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలోకి భారీ చేరికలు (ఫొటోలు)
-
CM Jagan : ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలా
సాక్షి, తూర్పుగోదావరి: సీఎం జగన్ బస్సు యాత్రకు ప్రజల నుంచి కనీవినీ ఎరుగని రీతిలో స్పందన లభిస్తోంది. ప్రజలతో మమేకమవుతూ ఉత్సాహంగా యాత్ర కొనసాగుతోంది. గోదావరి జిల్లాల్లో జన జాతరను తలపిస్తోంది. పల్లెల నుంచి పట్టణాల వరకూ తరలివచ్చిన జన సందోహంతో రహదారులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. నడినెత్తిన సూరీడు 43 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతతో నిప్పులు చెరుగుతున్నా లెక్క చేయకుండా మహిళలు, వృద్ధులు, చిన్నారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూడాలని, ఆయనతో మాట కలపాలని రోడ్డుకు ఇరువైపులా బారులు తీరుతున్నారు. ఆయనకు అప్యాయంగా స్వాగతం పలుకుతున్నారు. కాకినాడ జిల్లాలో జరుగుతున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో దారిపొడవునా సీఎం వైఎస్ జగన్ కోసం జనం వేచి చూసి మరీ స్వాగతం పలికారు. సాయంత్రం కాకినాడ అచ్చంపేట జంక్షన్ లో ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభ జరగనుంది దిక్కులు నాలుగే. కానీ ‘తూర్పు’ ఓ ప్రత్యేకత ఉంటుంది! ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించేది ఈ దిక్కునే మరి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘తూర్పు’ గోదావరి స్పెషాలిటీ ఏంటన్నది.. మనమిప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు... ఈ జిల్లాపై పట్టు అధికారానికి మెట్టు అని చరిత్ర ఇప్పటికే చాలాసార్లు చెప్పింది! అలాంటి ‘తూర్పు’లో జగనన్న ‘మేమంత సిద్ధం’ బస్సు యాత్ర కొత్త చరిత్రను లిఖిస్తోంది బస్సు యాత్ర ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది అనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు! కాదూ కూడదు.. మాకు రుజువు కావాలంటున్నారా? చాలా సింపుల్... సీఎం జగన్ బస్సు యాత్రను దగ్గరగా ఫాలో కండి.. అభిమానంతో ఉప్పొంగిపోతున్న ప్రజలను చూడండి. ఇవ్వాళ రంగంపేటలో మొదలైన యాత్ర, పెద్దాపురం బైపాస్, సామర్లకోట బైపాస్ మీదుగా ఉందురు చేరుకుంటుంది. ఇక్కడ కొద్దిసేపు భోజన విరామం. అనంతరం ఉందురు క్రాస్, కాకినాడ బైపాస్ మీదుగా సాయంత్రం 3:30 గంటలకు కాకినాడ అచ్చంపేట జంక్షన్ వద్ద బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం పిఠాపురం బైపాస్, గొల్లప్రోలు బైపాస్ , కత్తిపూడి బైపాస్ , తుని బైపాస్ , పాయకరావుపేట బైపాస్ మీదుగా గొడిచర్లకు రాత్రి వరకు చేరుకుంటారు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి. సీఎంను కలవడానికి ప్రజలు పోటీ పడ్డారు. మధ్యాహ్నం ఒంటి గంటకు సామర్లకోట వద్ద పెద్దాపురం నియోజకవర్గంలోకి ప్రవేశించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ బస్సుయాత్రకు జనం ఆత్మీయ స్వాగతం పలికారు. సామర్లకోటలో మిట్టమధ్యాహ్నపు మండుటెండల్లోనూ అభిమానం ఏమాత్రం తగ్గలేదు. మేమంతా సిద్ధమంటూ ముఖ్యమంత్రి కోసం జనం బారులు తీరారు. పెద్దాపురం పాండవుల మెట్ట వద్ద 12:20గంటలకు బస్సు యాత్ర చేరుకుంది. స్థానికులకు అభివాదం చేసిన సీఎం జగన్.. కొద్దిసేపు వారిని కలిసారు. మధ్యాహ్నం 12.37గంటల నుంచి12.48 వరకు సామర్లకోట ఫ్లైఓవర్ పై బస్సు యాత్ర సాగింది. సామర్లకోట ఉన్డూరు క్రాస్ కు 12.48 గంటలకు చేరుకున్నారు సీఎం జగన్. సామర్లకోట అచ్చంపేట ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద మహిళలు కోరడంతో ముఖ్యమంత్రి జగన్ బస్సును కొద్దిసేపు నిలిపివేశారు. కిందికి దిగి మహిళలతో కొద్దిసేపు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు సీఎం జగన్. కాకినాడ జిల్లాలో కొందరు మహిళలు సీఎం జగన్ బస్సు యాత్రకు గుమ్మడికాయలతో దిష్టితీసి స్వాగతం పలికారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా యాత్ర పూర్తి చేసుకోవాలని, క్షేమంగా ఉండాలని సీఎం జగన్‌ను దీవించారు. -
కాకినాడ మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ స్పీచ్ హైలైట్స్
Updates.. కాకినాడ మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ స్పీచ్ హైలైట్స్ కాకినాడ జిల్లా సిద్ధం ఇక్కడ కనిపిస్తోంది.. నిండు గోదావరి ఇక్కడ కనిపిస్తోంది.. అభిమాన వరద గోదావరి ఈ ప్రభుత్వం మంచి చేసిందన్న నమ్మకం.. దాన్ని కాపాడుకోవాలన్న సంకల్పం మీ అందరిలోనూ కనిపిస్తోంది ఈ సభకు ఇక్కడకు వచ్చిన ప్రతీ ఒక్కరికీ, నా అక్కలకు, నా చెల్లెమ్మలకు, నా అవ్వలకు, నా తాతలకు, నా ప్రతీ సోదరుడికీ, నా ప్రతీ స్నేహితుడికి ముందుగా పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎన్నికలకు కేవలం 25 రోజులే ఉన్నాయి. ఒకవైపు ఎన్నికల నోటిఫికేషన్ నగరా మోగింది. మరోవంక ప్రజలంతా కూడా, పేదలంతా మరోసారి జైత్రయాత్రకు సిద్ధం సిద్ధం అంటూ గర్జిస్తూ సింహ గర్జన చేస్తున్నారు ఇంటింట ఆత్మగౌరవాన్ని, పేద వర్గాల ఆత్మగౌరవాన్ని, అక్క చెల్లెమ్మల గౌరవాన్ని కాపాడుతున్న మన ప్రభుత్వానికి మద్దతు పలకడానికి మీరంతా కూడా సిద్ధమేనా? జన్మభూమి కమిటీలతో మొదలు చంద్రబాబు దాకా, పెత్తందార్ల దోపిడీ వర్గానికి మన పేదల అనుకూల వర్గానికి ఒక క్లాస్‌వార్ జరుగుతోంది ఈ జరుగుతున్న యుద్ధంలో పేదల భవిష్యత్ కొరకు.. వ్యతిరేక కూటమితో యుద్ధం జరుగుతుంది ఈ పేదల వ్యతిరేక కూటమిని ఓడించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా? ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావు.. రాబోయే 60 నెలల పాటు ఎలాంటి పరిపాలన ఉండాలని నిర్ణయించే ఎన్నికలు వచ్చే ఐదేళ్ల కాలంలో మీకు ఈరోజు జగన్ ద్వారా అందుతున్న పథకాలు కొనసాగలా.. వద్దా అన్నది మీ ఓటు ద్వారా నిర్ణయం అవుతుంది జగన్‌కు ఓటేస్తే.. ఫ్యాన్‌పై రెండు ఓట్లు వేస్తే.. పథకాలన్నీ కొనసాగతాయి లేదంటే బాబు మార్క్‌తో. మోసాలతో పథకాలన్నీ ముగిసిపోతాయి ఇది బాబు చెబుతున్న చరిత్ర.. బాబు చూసిన ఏ ఒక్కరికైనా అర్థమయ్యే చరిత్ర మ్యానిఫెస్టోతో మోసం చేయడానికి బాబు మళ్లీ సిద్ధం అయ్యాడు జగన్‌కు ఓటేస్తే.. పట్టణాల్లోనూ, వార్డుల్లోనూ జగన్ మార్క్ సచివాలయ సేవలన్నీ కొనసాగుతాయి లేదంటే.. బాబు మార్క్‌తో కత్తిరింపులు, ముగింపు జరుగుతుంది ఫ్యాన్‌కు ఓటేస్తే.. ఇంటి వద్దే మూడు వేల రూపాయల పెన్షన్ అందుతుంది. అదే సమయంలో పెన్షన్ అందిస్తున్న జగన్ మార్క్ పౌర సేవల వ్యవస్థ కొనసాగుతుంది. ఏకంగా రెండు లక్షల డబ్బై కోట్ల రూపాయలను నేరుగా నా అక్క చెల్లెమ్మ ఖాతాల్లోకి జమ చేశాం ఎక్కడ వివక్ష లేకుండా, లంచాలు లేకుండా పాలన కొనసాగింది. లేదంటే ఇప్పుడు జరుగుతున్న దానికి బాబు మార్క్ ముగింపు ఉంటుంది మళ్లీ దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం జరుగుతుంది పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే ఒక చంద్రముఖి నిద్ర లేస్తుంది.. మళ్లీ ఒక పసుపుపతి నిద్ర లేస్తాడు.. వదల బొమ్మాలి.. వదల బొమ్మాలి అంటూ మీ రక్తం తాగేందుకు మీ ఇంటికే వస్తాడు ఫ్యాన్‌కు ఓటేస్తే విత్తనం నుంచి పంట అమ్మకం వరకూ సేవలు అందిస్తున్న రైతు భరోసా కేంద్రాలు కొనసాగుతాయి లేదంటే.. బాబు మార్క్‌తో ముగింపు పడుతుంది. ఫ్యాన్‌పై రెండు ఓట్లు వేస్తేనే.. ఉచిత పంటల బీమా.. ఫ్యాన్‌పై రెండు ఓట్లు వేస్తేనే సున్నా వడ్డీకే రుణాలు, ఫ్యాన్‌పై రెండు ఓట్లేస్తేనే సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ ఫ్యాన్ మీద రెండు ఓట్లు వేస్తేనే.. రైతన్నకు పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్ ఫ్యాన్‌పై రెండు ఓట్లు వేస్తేనే.. దళారిలు లేని ఆర్బీకే వ్యవస్థతో ధాన్యం కొనుగోలు, ఇతర పంటలు కొనుగోలు అన్నది జరుగుతుంది ఇవన్నీ జరగాలంటే ఫ్యాన్ మీద రెండు ఓట్లు వేస్తేనే అనేది గుర్తుపెట్టుకోండి లేదంటే.. చంద్రబాబు మార్క్‌తో ముగింపు ఫ్యాన్‌కు ఓటేస్తేనే గవర్నమెంట్ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ఫ్యాన్‌కు ఓటేస్తేనే గవర్నమెంట్ బడుల్లో రూపు రేఖలు మార్చే నాడు-నాడు ఫ్యాన్‌కు ఓటేస్తేనే మూడో తరగతి నుంచే టోఫెల్ శిక్షణ, మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్స్ బోధన, మూడో తరగతి నుంచే బైజూస్ కంటెంట్ ఆరో తరగతికి వచ్చేసరికి డిజిటల్ బోధన, ఐఎఫ్బీ ప్యానల్స్, ఎనిమిదో తరగతికి వచ్చేసరికి ఆ పిల్లల చేతుల్లో ట్యాబ్స్ ఇక పెద్ద చదువులకు వంద శాతం ఫీజు రీయింబర్స్మెంట్ దీనిలో భాగంగా విద్యా దీవెన, వసతి దీవెన డిగ్రీ చదువుతున్న పెద్ద పిల్లలకు ఆ పెద్ద చదువుల్లో సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్స్ద్వారా విదేశాల్లో అతి ఉన్నత విద్యాలయాలకు మన కాలేజీలు అనుసంధానం తొలిసారి డిగ్రీలో మ్యాండెటరీ ఇంటెర్న్షిప్ ఇవన్నీ కొనసాగి మీ పిల్లలు ఎదగాలంటే.. మీ బిడ్డ వైఎస్ జగన్ 10 ఏళ్లు ఇదే స్థానంలో ఉంటే జగన్ మార్క్ విప్లవాలు కొనసాగుతాయి. లేదంటే.. గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లిష్ మీడియం రద్దు, నాడు-నేడు రద్దు, బడి పిల్లలకు ఇచ్చే గోరుముద్ద కార్యక్రమం రద్దు, బడి తెరిచే సమయానికి ఇచ్చే విద్యాకానుక రద్దు. ట్యాబ్స్, విద్యా కానుక, వసతి దీవెన ఇలా అన్నీ కూడా రద్దు చంద్రబాబు మార్క్‌తో కత్తిరింపులు, ముగింపులు చూడాల్సి ఉంటుంది మళ్లీ చంద్రముఖి నిద్ర లేస్తుంది.. లకలక, లకలక అంటూ అన్నింటికి ముగింపు. ఫ్యాన్‌కు ఓటేస్తేనే గ్రామాల్లో విలేజ్ క్లినిక్‌లు, ఫ్యాన్‌కు ఓటేస్తేనే ఫ్యామిలీ డాక్టర్, ఫ్యాన్‌కు ఓటేస్తేనే ఇంటికే ఆరోగ్య సురక్ష ఇంటివద్దనే టెస్టులు, గ్రామంలోనే మందులు గ్రామంలో రూపు రేఖలు మారుస్తూ నాడు నేడు రూ. 25 లక్షల వరకూ ఉచితంగా ఆరోగ్య శ్రీ ఆరోగ్య శ్రీతో పాటు ఆ పేదవాడు ఇబ్బంది పడకుండా ఆరోగ్య ఆసరా కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజ్‌లు నిర్మాణం జగన్ మార్క్ ఈ విప్లవాలు కొనసాగాలంటే ఫ్యాన్‌పై రెండు ఓట్లేస్తేనే కొనసాగుతాయి లేదంటే.. మళ్లీ చంద్రముఖి నిద్ర లేస్తుంది. వదల బొమ్మాలి అంటూ వైద్యం అందని పరిస్థితుల్లోకి పేదవాడిని తీసుకు పోతుంది ఫ్యాన్‌కు ఓటేస్తేనే పిల్లల్ని బడులకు పంపే తల్లులకు అమ్మ ఒడి అనే పథకం, విద్యా దీవెన, వసతి దీవెన. ఫ్యాన్‌కు ఓటేస్తేనే ఓ చేయూత కొనసాగింపు, ఫ్యాన్‌కు ఓటేస్తేనే కాపు నేస్తం కొనసాగింపు, ఫ్యాన్‌కు ఓటేస్తేనే ఈబీసీ నేస్తం కొనసాగింపు ఫ్యాన్‌కు ఓటేస్తేనే ఓ వైఎస్సార్ జగనన్న కాలనీలు, అందులో 30 లక్షల పట్టాలు, అందులో కడుతున్న 22 లక్షల ఇళ్లలు.. అన్నీ కూడా వేగంగా అడుగులు ఫ్యాన్‌కు ఓటేస్తేనే.. నామినేటెడ్ పదవుల్లో నా అక్క చెల్లెమ్మలకు అగ్ర తాంబాలం ఇస్తూ యాబై శాతం రిజర్వేషన్లతో పదవులు అన్నీ కూడా ఉండాలంటే మీ బిడ్డ జగన్ మళ్లీ వస్తానే అనేది ఆలోచన చేయండి లేదంటే.. మళ్లీ చంద్రముఖి నిద్ర లేస్తుంది.. పసుపుపతి నిద్ర లేస్తాడు.. వదల బొమ్మాలి వదల అంటాడు బాబు సిట్ అంటే పవన్ సిట్.. స్టాండ్ అంటే పవన్ స్టాండ్ ప్యాకేజీ స్టార్‌కు పెళ్లిళ్లే కాదు.. నియయోజకవర్గాలు కూడా నాలుగు అయ్యాయి. చంద్రబాబు తన సంకలోని పిల్లిని పిఠాపురంలో వదిలాడు జ్వరం వస్తే ప్యాకేజీ స్టార్ పిఠాపురం వదిలేసి హైదరాబాద్ పారిపోయే రకం బీఫామ్ బీజేపీ, కాంగ్రెస్, గాజుగ్లాస్‌దే అయినా..యూనిఫామ్ మాత్రం చంద్రబాబుదే రాష్ట్రాన్ని హోల్‌సేల్‌గా దోచుకునేందుకు చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు. బాబు పొడవమంటే పురందేశ్వరి తన తండ్రినే వెన్నుపోటు పొడిచింది. బాబు ఎవరికి సీటు ఇమ్మంటే పురందేశ్వరి వారికే ఇస్తుంది. అక్క చెల్లెమ్మలకు గుర్తుందా? పొదుపు సంఘాల విషయాలు గుర్తున్నాయా? బాబు మోసం చేసిన విషయాలు గుర్తున్నాయా మళ్లీ అక్క చెల్లెమ్మల బతుకులన్నీ అతలాకుతలం ఆవుతాయి. ఓటు వేసే ముందు మీ కుటుంబంలో ప్రతీ ఒక్కరూ ఆలోచన చేయండి.. ఓటు వేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచన చేయండి ఎవరి ఉంటే మీ ఇంటికి మంచి జరుగుతుంది అనే ఆలోచనతో ఓటేయండి అందుకే మళ్లీ మళ్లీ చెబుతున్నాను ఇవి కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కాదు.. మీ జీవితాలను, తలరాతలను మార్చే ఎన్నికలు మీకు మంచి చేసిన మీ బిడ్డ పాలన కావాలా? లేకపోతే దోచుకుని దాచుకుని చంద్రబాబు పాలన కావాలా? మీ బిడ్డ చేసిన పాలన అందరికీ కనబడుతోంది ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి కాకినాడ వైఎస్సార్సీపీ రూరల్ అభ్యర్థి కన్నబాబు స్పీచ్ చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువ సీఎం జగన్ నాణ్యమైన విద్య, వైద్యం అందిస్తుంటే.. బాబు మాత్రం నాణ్యమైన మద్యం అందిస్తారంట వాలంటీర్ సేవలను అడ్డుకున్న కుట్రదారు చంద్రబాబు ఈ సందర్భంగా మేమంతా సిద్ధం అని తెలియజేసుకుంటున్నా అచ్చంపేట జంక్షన్ మేమంతా సిద్ధం సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్ ర్యాంప్‌పై నడుస్తూ ప్రజలకు అభివాదం లక్షలాదిగా తరలి వచ్చిన ‘అభిమానం’ జై జగన్ నినాదాలతో మార్మోగుతున్న సభా ప్రాంగణం కాకినాడ జిల్లా: అచ్చంపేట జంక్షన్‌కు చేరుకున్న సీఎం జగన్ బస్సుయాత్ర మరికాసేపట్లో బహిరంగ సభ ప్రారంభం\ సభలో పాల్గోని ప్రసంగించనున్న సీఎం జగన్ జిల్లా నలమూలల నుండి సభకు భారీగా తరలివచ్చిన ప్రజలు కాకినాడ జిల్లా: ఉండూరు క్రాస్ వద్ద జె.సత్యనారాయణ అనే పేషెంట్‌ను కలిసిన సీఎం జగన్ పిరుదు భాగంలో సర్జరీ కావడంతో వీల్ ఛైర్‌కి పరిమితం అయిన కాకినాడ రూరల్ తూరంగికి చెందిన సత్యనారాయణ. ముఖ్యమంత్రి సహయ నిధి ద్వారా ఆదుకుంటానని హమీ ఇచ్చి మానవత్వం చాటుకున్న సీఎం జగన్ కాకినాడ జిల్లా: ఉండూరు క్రాస్ నుండి ప్రారంభమైన మేమంతా సిద్దం సీఎం జగన్ బస్సుయాత్ర మరికాసేపట్లో తిమ్మాపురం మండలం అచ్చంపేట జంక్షన్ వద్ద జరిగే బహిరంగ సభలో పాల్గోననున్న సీఎం జగన్ బస్సుయాత్రలో సీఎం జగన్‌కు భద్రత కట్టుదిట్టం బస్సుయాత్రలో ప్రత్యేకంగా మొబైల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు పోలీస్ శాఖ, ఐ పేజ్ సంయుక్తంగా కమాండ్ సెంటర్ పర్యవేక్షణ సీఎం జగన్ భద్రతను నిరంతరం పర్యవేక్షించేలా ఏర్పాట్లు వైఎస్సార్సీపీలోకి చేరిన టీడీపీ, జనసేన కీలక నేతలు కాకినాడ జిల్లా రాజానగరం నియోజకవర్గం ఎస్.టి.రాజపురం నైట్ స్టే పాయింట్ వద్ద సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలోకి చేరిన జనసేన, తెలుగుదేశం, కీలక నేతలు కండువా వేసి వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించిన సీఎం వైఎస్సార్సీపీలో చేరిన జనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి, నెల్లూరు మండల అధ్యక్షుడు కాటంరెడ్డి జగదీష్ రెడ్డి, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ యాదవ్, టీడీపీ ఉదయగిరి మండల మాజీ ఎంపీపీ చేజెర్ల సుబ్బారెడ్డి. కార్యక్రమంలో పాల్గొన్న నెల్లూరు ఎంపీ అభ్యర్ధి వి విజయసాయిరెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్ధి ఆదాల ప్రభాకరరెడ్డి. రంగంపేట చేరుకున్న సీఎం వైఎస్ జగన్ సీఎం జగన్ చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన జనాలు బస్సుపైకి ఎక్కి ప్రజలకు అభివాదం చేసిన సీఎం జగన్ దారిపొడవునా సీఎం జగన్‌కు ఘన స్వాగతం భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, బాణసంచాతో అఖండ స్వాగతాలు కిలోమీటర్ల కొద్దీ వెన్నంటి వస్తున్న వీరాభిమానులు సాయంత్రం కాకినాడ అచ్చంపేట జంక్షన్లో మేమంతా సిద్దం సభ సభలో ప్రసంగించనున్న సీఎం జగన్ ఎస్టీ రాజాపురం నుంచి ప్రారంభమైన మేమంతా సిద్దం బస్సు యాత్ర మరికాసేపట్లో కాకినాడ జిల్లాలో ప్రవేశించనున్న సిఎం జగన్ యాత్ర సీఎం జగన్‌కు ఘనంగా స్వాగతం పలికేందుకు రోడ్లపై బారులు తీరిన అశేష జనవాహిని నేడు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ఇలా.. సీఎం వైఎస్ జగన్ గురువారం రాత్రి బస చేసిన ఎస్టీ రాజపురం ప్రాంతం నుంచి శుక్రవారం ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు. రంగంపేట, పెద్దాపురం బైపాస్, సామర్లకోట బైపాస్ మీదుగా ఉందురు క్రాస్ చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. ఉందురు క్రాస్, కాకినాడ బైపాస్ మీదుగా సాయంత్రం 3:30 గంటలకు కాకినాడ అచ్చంపేట జంక్షన్ వద్దకు చేరుకొని బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు అనంతరం పిఠాపురం బైపాస్, గొల్లప్రోలు బైపాస్, కత్తిపూడి బైపాస్, తుని బైపాస్, పాయకరావుపేట బైపాస్ మీదుగా గొడిచర్ల క్రాస్ వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు Memantha Siddham Yatra, Day -18. ఉదయం 9 గంటలకు ST రాజపురం దగ్గర నుంచి ప్రారంభం సాయంత్రం 4.30 గంటలకు కాకినాడలో బహిరంగ సభ గోడిచర్ల దగ్గర రాత్రి బస #MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/gtYVbwAgfq — YSR Congress Party (@YSRCParty) April 19, 2024 గోదావరి పొడవునా.. ఉరకలెత్తిన జనం 17వ రోజు సీఎం జగన్ బస్సు యాత్రకు పోటెత్తిన జనవాహిని జాతీయ రహదారి బాట పట్టిన గ్రామాలు.. జనసంద్రమైన రావులపాలెం.. రాజమహేంద్రి.. రోడ్డుకు ఇరువైపులా మానవహారాలు కడియపులంకలో సీఎం వైఎస్ జగన్‌పై పూల వర్షం వేమగిరిలో ఎడ్లబండ్లపై తరలి వచ్చిన రైతన్నలు బైక్ ర్యాలీలతో కదం తొక్కిన యువత.. విద్యార్థుల్లో వెల్లివిరిసిన ఉత్సాహం బొమ్మూరులో 108 గుమ్మడి కాయలతో దిష్టి తీసిన మహిళలు అందరి నుంచి విజ్ఞాపనలు స్వీకరించి అభయమిచ్చిన జననేత వైద్య విద్యను చేరువ చేసిన సంస్కరణలశీలికి భావి డాక్టర్ల ధన్యవాదాలు అడుగడుగునా అభిమానుల తాకిడితో యాత్ర ఆలస్యం నుదుట గాయం బాధిస్తున్నా చెరగని చిరునవ్వుతో సీఎం జగన్ అభివాదం -
గోదావరి పొడువునా...ఉరకలెత్తిన జనం
-
నేడు 18వ రోజు "మేమంతా సిద్ధం" బస్సు యాత్ర షెడ్యూల్
-
గోదావరి పొడవునా.. ఉరకలెత్తిన జనం
‘ఇన్నాళ్లూ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించా. పక్షవాతం వచ్చి కాలుచేయి పడిపోయాయి. వయసు మళ్లడంతో కష్టపడే ఓపిక లేదు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్‌బాబు ఇంటికే నెలకు రూ.3 వేలు పెన్షన్ ఇస్తున్నారు. ఆరోగ్యశ్రీ కార్డుతో ఉచితంగా వైద్యం చేయించారు. దేవుడు లాంటి ఆ బాబును చూడ్డానికి పొద్దునే వచ్చా’.. – తేతలి హైవేపై ముఖ్యమంత్రి రాక కోసం నిరీక్షిస్తున్న 75 ఏళ్ల విష్ణుమూర్తి అంతరంగం. ‘నాకు ఇద్దరు కొడుకులు. కూలి చేసుకునే బతుకులు మావి. పిల్లలను చదివించుకోలేకపోయా. ఇప్పుడు నా మనవళ్లను జగన్ గారు ఉచితంగా చదివిస్తున్నారు. అలాంటి గొప్ప మనిషిని చూడడం మా అదృష్టం’.. – తణుకు ప్రాంతానికి చెందిన పంపన ఇందిర సంతోషం ఇదీ. ‘మా ఇద్దరు తోటికోడళ్లకు జగన్ గారు ఇంటి స్థలం ఇచ్చారు. మా బాబుకు అమ్మఒడి ఇస్తున్నారు. మా సొంత ఇంటి కలను నెరవేర్చిన ముఖ్యమంత్రి ఇప్పుడు మా ఊరు వచ్చారు.. ఎంతసేపైనా సరే ఇక్కడే ఉండి ఆయనకు స్వాగతం పలుకుతాం’.. – ఇందిర కోడలు అపర్ణ ఆనందం ఇదీ. మేమంతా సిద్ధం బస్సు యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: మండుటెండల్లోనూ గోదారమ్మ పోటెత్తింది! ఉభయ గోదావరులూ ఉప్పొంగాయి! కోనసీమ కోలాహలమైంది! గోదావరి తీరం జన సంద్రమైంది! రావులపాలెం నుంచి రాజమహేంద్రి దాకా ఎటుచూసినా జన ప్రవాహమే! తమకు మంచి చేసిన జననేతను స్వయంగా చూసేందుకు పెద్దల నుంచి పిల్లల దాకా ప్రతి ఒక్కరూ ఎండను లెక్క చేయకుండా వెల్లువలా తరలి వచ్చారు. అభిమాన నేతను దగ్గరి నుంచి చూడాలని.. వీలైతే మాట్లాడాలని.. ఒక్క ఫొటో తీసుకోవాలని ఉత్సాహం చూపారు. ఊర్లన్నీ జాతీయ రహదారి బాటపట్టాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర సందర్భంగా 17వ రోజైన గురువారం కనిపించిన దృశ్యాలివి. తేతలి నుంచి తణుకు వరకు రోడ్డుకు ఇరువైపులా మానవహారంలా నిలబడి సీఎం జగన్‌ను ఆశీర్వదించారు. ప్రభుత్వ రంగంలో కొత్త మెడికల్ కాలేజీలను నెలకొల్పి తమ కలను నెరవేర్చిన సీఎం జగన్‌కు రాజమహేంద్రవరంలో వైద్య విద్యార్థులు థాంక్యూ సీఎం సర్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించి కృతజ్ఞతలు తెలియచేశారు. ఇక రాజమహేంద్రవరం చరిత్రలో ఇంతవరకూ ఏ రాజకీయ నేత నిర్వహించిన యాత్రలో ఇంత జనసందోహాన్ని చూడలేదని స్థానికులు చెబుతున్నారు. తేతలి రాత్రి బస కేంద్రం నుంచి ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన మేమంతా సిద్ధం బస్సు యాత్ర జన సందోహం తరలిరాగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకు చేరుకుంది. తేతలి నుంచి యాత్ర ప్రారంభం కాగానే దారి పొడవునా అక్క చెల్లెమ్మలు, వృద్ధులు రోడ్డుకు ఇరువైపులా నిలబడి సీఎం జగన్‌కు స్వాగతం పలికారు. అంతకుముందు తేతలి బస వద్ద సీఎంను తణుకు, తాడేపల్లిగూడెం, ఆచంట నియోజకవర్గాలతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పలువురు నేతలు కలిశారు. దారిలో తమ సమస్యలు చెప్పుకునేందుకు ఎదురు చూస్తున్న దివ్యాంగులు, స్థానికులను సీఎం పరామర్శించి వినతి పత్రాలు స్వీకరించారు. యాత్ర అక్కడకు రెండు కి.మీ. దూరంలోని తణుకు చేరుకునే సరికి 40 నిమిషాల సమయం పట్టింది. బైక్ ర్యాలీతో కోనసీమ స్వాగతం.. జాతీయ రహదారి వెంట సాగిన సీఎం జగన్ యాత్రలో ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున మహిళలు కనిపించారు. సిద్ధాంతం సెంటర్ జనంతో కిక్కిరిసిపోయింది. ఈతకోటలో యువకులు పెద్ద సంఖ్యలో బైక్ ర్యాలీగా వచ్చి తమ ప్రియతమ నేతను అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోకి ఆహ్వానించారు. అమ్మ ఒడితో ఆదుకున్న జగన్ మామయ్యను చూసేందుకు స్కూల్ పిల్లలు తరలివచ్చారు. ఉచితంగా ఉన్నత విద్యను అందిస్తున్న సీఎం జగన్‌కు మద్దతుగా లిడియా ఫార్మశీ కాలేజీ విద్యార్థులు మానవహారం నిర్వహించారు. కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం గోపాలపురం సెంటర్ వద్ద గోదావరి సాక్షిగా సీఎం జగన్ బస్సు యాత్రకు మహిళలు మేమంతా సిద్ధం అంటూ స్వాగతం పలికారు. రావులపాలెం సెంటర్ జన సందోహంతో కిక్కిరిసిపోయింది. మండుటెండను లెక్క చేయకుండా జగన్ కోసం గంటల తరబడి ఎదురు చూశారు. ఎడ్లబండ్లపై వచ్చిన రైతన్నలు.. మధ్యాహ్నం పొట్టిలంక వద్ద స్వల్ప విరామం అనంతరం సీఎం జగన్ యాత్రను తిరిగి ప్రారంభించారు. వేమగిరి సెంటర్లో రైతులు ఎడ్లబండ్లపై వచ్చి స్వాగతం పలికారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు, ఆర్బీకేలతో మాకు ఎంతో మేలు చేసిన సీఎం జగన్ అంటూ బ్యానర్లు ప్రదర్శించారు. అక్క చెల్లెమ్మలు 108 గుమ్మడి కాయలతో దిష్టి తీశారు. రావులపాలెం నుంచి బొమ్మూరు, రాజమండ్రిలోని పలు కూడళ్లు మధ్యాహ్నం నుంచే జనంతో కిక్కిరిసిపోయాయి. బొమ్మూరు నుంచి మొదలు దేవీచౌక్ వరకు ఇసుకేస్తే రాలనంతగా జనంతో నిండిపోయాయి. జగన్ పాలనకు మద్దతుగా రాజీనామా చేసిన వలంటీర్లు మేమంతా నీవెంటేనంటూ వేమగిరిలో ప్లకార్డులు ప్రదర్శించారు. రాజమహేంద్రి జనసంద్రం... సాయంత్రం 4.30 గంటలకు బొమ్మూరు జంక్షన్ చేరుకున్న సీఎం జగన్ యాత్ర 5.45కి మోరంపూడికి చేరుకుంది. రోడ్డు మొత్తం జనంతో నిండిపోవడంతో 3 కి.మీ ప్రయాణానికి దాదాపు 1.15 గంటల సమయం పట్టింది. అనంతరం యాత్ర ఆర్టీసీ కాంప్లెక్స్, జాంపేట, దేవిచౌక్, గోకవరం బస్టాండ్, సీతంపేట, పేపర్‌మిల్లు, మల్లయ్యపేట, దివాన్‌చెరువు మీదుగా రాజానగరం చేరుకుంది. మోరంపూడి సెంటర్ నుంచి 16 కి.మీ కొనసాగిన యాత్ర రాత్రి 9 గంటలకు దివాన్‌చెరువు చేరుకుంది. మధ్యలో ప్రతి సెంటర్ జనంతో నిండిపోయింది. రాజమండ్రి వాసులే కాకుండా చుట్టుపక్కల 10 కి.మీ పరిసరాల్లో ప్రజలు జగన్ కోసం ఎదురు చూశారు. మండుటెండలోనూ.. 58 నెలల పాలనలో తామంతా ఆత్మగౌరవంతో తలెత్తుకుని జీవించే అవకాశం కల్పించారని, పిల్లలకు అత్యుత్తమ విద్యను ఉచితంగా అందుబాటులోకి తెచ్చిన సీఎం జగన్‌ను స్వయంగా చూడాలన్న ప్రజల కోరిక ముందు భగభగమండే సూరీడు సైతం చిన్నబోయాడు. మిట్ట మధ్యాహ్నం 43 డిగ్రీలకు పైగా ఉన్న ఎండను సైతం లెక్క చేయకుండా తణుకు బైపాస్ నుంచి పెరవలి, ఖండవల్లి, సిద్ధాంతం, ఈతకోట, రావులపాలెం, జొన్నాడ, చెముడులంక, పొట్టిలంక, కడియపులంక, వేమగిరి వరకు యువత, వృద్ధులు, విద్యార్థులు, పిల్లలతో కలసి మహిళలు రోడ్లకు ఇరువైపులా బారులు తీరారు. కడియపులంక వద్ద జగన్‌పై పూల వర్షం కురిపించారు. రాజమహేంద్రవరంలో యువ లాయర్లు సీఎం జగన్‌కు మద్దతుగా ప్లకార్డులు ప్రదర్శించారు. సీఎం జగన్ యాత్ర సాయంత్రం 4.30 గంటలకు బొమ్మూరు చేరుకుంది. రాత్రి 9.15 గంటలకు ఎస్టీ రాజాపురం వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం జగన్ చేరుకున్నారు. తేతలి నుంచి ఎస్టీ రాజపురం వరకు మొత్తం 88 కి.మీ. మేర గురువారం బస్సు యాత్ర కొనసాగింది. అనారోగ్య బాధితుడికి భరోసా ఆలమూరు: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికి గ్రామంలో బస్టాండు వద్ద అంబులెన్స్‌ను గమనించిన సీఎం జగన్ తన బస్సును ఆపాలని ఆదేశించారు. కొత్తపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డితో కలిసి అంబులెన్స్ వద్దకు చేరుకున్నారు. చిలకలపాడుకు చెందిన రాయుడు సత్తిబాబు రెండేళ్ల నుంచి నరాల సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నట్లు బాధితుడి కుటుంబ సభ్యులు సీఎంకు విన్నవించారు. వైద్యం కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు. దీంతో సీఎం జగన్ చలించిపోయి సత్తిబాబుకు ఆరోగ్యం చేకూరేందుకు ఎంత వ్యయమైనా భరించేందుకు సిద్ధమని హామీ ఇచ్చారు. వెంటనే బాధితుడి వివరాలు తీసుకోవాలని వ్యక్తిగత సిబ్బందికి సూచించారు. తక్షణమే స్పందించడం పట్ల బాధితుడి కుటుంబ సభ్యులు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ, జనసేన నేతల చేరిక తేతలిలో రాత్రి బస కేంద్రం వద్ద తనను కలసిన మాజీ మంత్రి ఇందుకూరి రామకృష్ణరాజును సీఎం జగన్ ఆత్మీయంగా పలుకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాలకు చెందిన టీడీపీ, జనసేన కీలక నేతలు ఈ సందర్భంగా వైఎస్సార్సీపీలో చేరారు. వారికి కండువాలు వేసి సీఎం జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. రాజోలు జనసేన కీలక నేత బొంతు రాజేశ్వరరావు, మాజీ పీఏసీ చైర్మన్ మేకల వీరవెంకట సత్యనారాయణ (ఏసుబాబు), టి.త్రిమూర్తులు, ఎం.నరసింహస్వామి, దొమ్మేటి సత్యనారాయణ, మంద సత్యనారాయణ, కేశనపల్లి మాజీ సర్పంచ్ డి.సూర్యనారాయణ, జనసేన సర్పంచ్ కాకర శ్రీను, చింతా సత్యప్రసాద్, తాడేపల్లిగూడేనికి చెందిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏపీ కన్వీనర్ గమ్మిని సుబ్బారావు పార్టీలో చేరినవారిలో ఉన్నారు. పి.గన్నవరం నుంచి మాజీ ఎమ్మెల్యే ఎన్.గణపతిరావు కుమారుడు గణేష్ బాబు, మనవడు గణపతిరావు, టీడీపీ నుంచి వడ్లమూడి గంగరాజు పార్టీలో చేరారు. -
CM Jagan Bus Yatra Photos: అడుగడుగునా జనం ప్రభంజనం (ఫొటోలు)
-
నేనున్నాను.. అంబులెన్స్‌లో పేషెంట్‌కు సీఎం జగన్ భరోసా
మండపేట(డా. అంబేద్కర్ కోనసీమ జిల్లా): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర జైత్రయాత్రలా కొనసాగుతోంది. జననేతకు అడుగడుగునా జనం నీరాజనాలు పడుతూ మేమంతా సిద్ధం అంటూ సంఘీభావం తెలుపుతున్నారు. భానుడు భగభగమని మండిపోతున్నా జననేతను చూసి తమ మద్దతు తెలిపేందుకు ప్రజలు పోటెత్తుతున్నారు. సీఎం జగన్ బస్సుయాత్రలో ప్రతీ జంక్షన్ సైతం భారీ బహిరంగ సభల్ని తలపిస్తుండటం విశేషం. నేటి(గురువారం) మేమంతా సిద్ధం బస్సుయాత్ర 17వ రోజులో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. బస్సుయాత్ర చేపట్టిన దగ్గర్నుంచీ ఇప్పటికే ఎంతో అనారోగ్య బాధితులికి తానున్నానంటూ భరోసా ఇచ్చిన సీఎం జగన్.. ఈరోజు అంబులెన్స్‌లో వచ్చిన ఓ పేషెంట్‌కి సైతం తాను ఉన్నానంటూ మంచి మనసును చాటుకున్నారు. మండపేట నియోజకవర్గం మడికి గ్రామంలోకి సీఎం జగన్ బస్సుయాత్ర ప్రవేశించగా, ఓ అంబులెన్స్ ఆ యాత్ర మధ్యలోకి వచ్చి ఆగింది విషయం తెలుసుకున్న సీఎం జగన్.. అంబులెన్స్‌లో వచ్చిన పేషెంట్‌ను కలిశారు. అతని బంధువులతో మాట్లాడగా, సహాయం కావాలని వారు సీఎం జగన్‌ను కోరారు. ప్రమాదంలో గాయపడి ట్రీట్మెంట్ తీసుకుంటున్న పేషెంట్‌కు మరింత సహాయం కావాలని సీఎం జగన్‌కు వారు విజ్ఞప్తి చేశారు. దానికి సానుకూలంగా స్పందించిన సీఎం జగన్.. అవసరమైన సహాయం అందిస్తానని భరోసా ఇచ్చారు. ఆ పేషెంట్ బంధువులకు తానున్నాననే భరోసా ఇచ్చారు సీఎం జగన్. -
‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. సీఎం జగన్‌కు బ్రహ్మరథం పట్టిన కోనసీమ (ఫొటోలు)
-
జననేత కోసం పోటెత్తిన రావులపాలెం జనం
-
బస్సు యాత్రలో అడుగడుగునా అపురూప దృశ్యాలు..
-
జనయాత్ర: పలువురి సమస్యలు వింటూ ముందుకు సాగుతున్న వైఎస్ జగన్
-
గోదావరి తీరం.. జననేత కోసం పోటెత్తిన జనం (ఫొటోలు)
-
తేతలి నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభం..
-
గోదావరిలో జనజాతర.. జగన్ వస్తే ఉప్పెనే
సాక్షి, పశ్చిమగోదావరి: మేమంతా సిద్ధం బస్సు యాత్రకు విశేష స్పందన లభిస్తోంది. 17వ రోజు మేమంతా సిద్ధం బస్సుయాత్ర తణుకు, రావులపాలెం, జొన్నాడ, పొట్టిలంక మీదగా కొనసాగుతోంది. సీఎం జగన్‌కు ప్రజల్లో అమితాదరణ లభిస్తోంది. కిలోమీటర్ల కొద్దీ వీరాభిమానులు వెన్నంటి వస్తున్నారు. రోజుల తరబడి, జిల్లాలు దాటి, ఎండా, వాన లెక్క చేయకుండా, వ్యయప్రయాసలను పట్టించుకోకుండా వేలాది కిలోమీటర్ల మేర సీఎం జగన్ వెంట ప్రయాణం చేస్తున్నారు. నిప్పులు చెరుగుతున్న మండుటెండలను లెక్క చేయకుండా వేలాది మంది వేచి చూసి మరీ సీఎం జగన్‌కు స్వాగతం పలుకుతున్నారు. రావులపాలెం సెంటర్లోనయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జనం ఉప్పెనలా తరలివచ్చి అఖండ స్వాగతం పలికారు. భారీగా జనం పోటెత్తడంతో జాతీయ రహదారి పూర్తిగా కిక్కిరిసిపోయింది. ఎక్కడో నాసికా త్రయంబకంలో పుట్టిన గోదారి.... పిల్ల కాలువలతో మొదలుపెట్టి... వాగులు, వంకలు, ఏరులు, నదులన్నీ ఇచ్చే శక్తితో పోటెత్తిపోతుంది... ‘మేమంత సిద్ధం’ బస్సు యాత్ర కూడా అంతే! ఇడుపుల పాయలో మొదలైన జనవాహిని కూడా.. అంతకంతకూ బలం పుంజుకుంటుంది... ప్రతి సభ జన సంద్రాన్ని తలపిస్తోంది. తణుకు, రావులపాలెం, జొన్నాడ, పొట్టిలంక, కడియపులంక, వేమగిరి, రాజానగరం మీదుగా ST రాజపురం చేరే.. నేటి యాత్రలోనూ గోదారోళ్ల అభిమానం, అప్యాయతలు కళ్లకు కడుతున్నాయి! చిన్నా పెద్ద తేడా లేదు... రాజు పేద అన్న అంతరమూ కానరాదు. ఎటు చూస్తే అటు పండుగ వాతావరణం. చిరునవ్వుల కేరింతలు.. పెత్తందార్లపై పోరుకూ మేమూ సిద్ధం అంటూ నినాదాలు! ఈ ఉత్సవం... ఐదేళ్ల ఉజ్వల భవిష్యత్తుకు శ్రీకారం చుడుతున్నట్లే! మరోవైపు జననేత తమ ప్రాంతానికి వస్తున్నారని తెలియడం ఆలస్యం.. బస్సుయాత్ర వెళ్లే రహదారికి తమ గ్రామం దూరంగా ఉన్నాసరే అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, చిన్నారులు, యువత ప్రతికూల వాతావరణంలోనూ కిలోమీటర్ల కొద్దీ నడిచి వచ్చి జగన్‌కు అఖండ స్వాగతం పలుకుతున్నారు. పసిపిల్లలతో పాటు వచ్చిన తల్లులు, బాలింతలు ఇలా ఒకరేమిటి గంటల తరబడి జగన్‌ను చూసేందుకు నిరీక్షిస్తున్నారు. పగలూ రాత్రి తేడా లేకుండా వీధుల్లోకి పోటెత్తుతున్నారు. -
బస్సు యాత్ర 17వ రోజు రూట్ మ్యాప్ ఇదే
-
మేమంతా సిద్ధం 17వ రోజు: సీఎం జగన్ బస్సు యాత్ర సాగిందిలా
Updates.. తూర్పుగోదావరి జిల్లా... 17వ రోజు మేమంతా సిద్ధం బస్సుయాత్ర పర్యటన ముగించుకుని రాజానగరం మండలం ST రాజపురం రాత్రి బస శిబిరానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్ రాజానగరం చేరుకున్న సీఎం వైఎస్ జగన్.. భారీగా హాజరైన ప్రజలు. బస్సుపైకి ఎక్కి ప్రజలకు వైఎస్ఆర్సీపీ శ్రేణులకు అభివాదం చేసిన సీఎం జగన్. రాజానగరం వైపు సాగుతున్న సీఎం జగన్ బస్సు యాత్ర రాజమండ్రి: గోకవరం బస్టాండ్ సెంటర్ కు చేరుకున్న బస్సు యాత్ర. సీఎం జగన్‌కు స్వాగతం పలికిన జనం దేవి చౌక్ సెంటర్లో కిక్కిరిసిన జనం జనసంద్రంగా మారిన రాజమండ్రి రోడ్లు రాజమండ్రి నగరంలో సిఎం వైఎస్ జగన్ కి అపూర్వ స్వాగతం అభిమానుల సందోహంతో పోటెత్తిన ఆజాద్ చౌక్. పెద్ద సంఖ్యలో తరలివచ్చి సీఎం జగన్‌కు స్వాగతం పలికిన ముస్లింలు . జై జగన్ నినాదాలతో మార్మోగిన ఆజాద్ చౌక్ . తమ అభిమాన నేతను చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ముస్లిం సోదరులు. చర్చిసెంటర్‌కు చేరుకున్న సీఎం జగన్ బస్సుయాత్ర సీఎం జగన్‌కు సంఘీభావం తెలిపేందుకు విశేషంగా హాజరైన ప్రజలు బస్సుపై నుంచి ప్రజలకు సీఎం జగన్ అభివాదం రాజమండ్రి సిటీలో సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలికిన అభిమానులు ఆనందంతో డాన్స్ వేసి మరి సీఎం జగనకు స్వాగతం పలుకుతున్న యువతులు పండుగ వాతావరణాన్ని తలపిస్తున్న రాజమండ్రి సిటీ జన సందోహంతో నిండిపోయిన మోరంపూడి, షెల్టన్, తాడితోట, ఆజాద్ చౌక్ , దేవి చౌక్ సెంటర్లు తాడితోట జంక్షన్‌కు చేరుకున్న సీఎం జగన్ సీఎం జగన్‌కు పూలతో ఘన స్వాగతం పలికిన ప్రజలు బూడిది గుమ్మడికాయలతో దిష్టి తీసిన మహిళలు జగన్ చూసేందుకు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన ప్రజలు ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగిన బస్సు యాత్ర రాజమండ్రి నగరంలోకి ప్రవేశించిన సీఎం జగన్ బస్సుయాత్ర మోరంపూడి జంక్షన్ దాటిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర మరికాసేపట్లో తాడితోట జంక్షన్‌కు చేరుకోనున్న సీఎం బస్సుయాత్ర మోరంపూడి జంక్షన్‌కు చేరుకున్న సీఎం జగన్ బస్సుయాత్ర ఘన స్వాగతం పలికిన పార్టీ నాయకులు, కార్యకర్తలు మేమంతా సిద్ధమంటూ సీఎం వైఎస్ జగన్‌కు జనహారతి.. వేమగిరికి చేరుకున్న సీఎం జగన్ బస్సుయాత్ర వేమగిరిలో పోటెత్తిన జనసంద్రం సీఎం జగన్‌కు సంఘీభావం తెలిపేందుకు విశేషంగా హాజరైన ప్రజలు బస్సుపై నుంచి ప్రజలకు సీఎం జగన్ అభివాదం తూర్పుగోదావరి జిల్లా. కడియపులంకలో పోటెత్తిన జనం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సుయాత్రకు సంఘీభావంగా రోడ్డుకు ఇరువైపుల బారులు తీరిన మహిళలు మేమంతా సిద్ధమంటూ సీఎం వైఎస్ జగన్‌కు జనహారతి కాసేపట్లో రాజమండ్రి నగరంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రోడ్ షో కడియపు లంక చేరుకున్న సీఎం జగన్ బస్సు యాత్ర సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలికిన ప్రజలు తూర్పుగోదావరి జిల్లా: కడియపు లంక వద్ద జగన్‌కు స్వాగతం పలికేందుకు హైవే పై భారీగా చేరుకున్న ప్రజలు సీఎం జగన్ పై తమ అభిమానం చాటుకునేందుకు పెద్ద ఎత్తన కడియపులంక,దుళ్ళ,జేగురుపాడు గ్రామాల నుండి చేరుకున్న మహిళలలు. గంటల తరబడి మండుటెండలో జగన్ కోసం నీరిక్షణ సీఎం జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షను వ్యక్తం చేస్తున్న మహిళలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ను నమ్మేది లేదని స్పష్టం చేసిన మహిళలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా: పొట్టిలంక భోజన విరామ ప్రాంతానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్ కోనసీమ జిల్లాలోకి మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర రావులపాలెంలో సీఎం జగన్‌కు ఘన స్వాగతం మండుటెండలోనూ జననేత కోసం పోటెత్తిన అభిమానం సీఎం జగన్‌కు ప్రజల్లో అమితాదరణ కిలోమీటర్ల కొద్దీ వెన్నంటి వస్తున్న వీరాభిమానులు భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, బాణసంచాతో ఆఖండ స్వాగతాలు సీఎం జగన్‌ను కలిసిన మాజీ మంత్రి ఇందుకూరి రామకృష్ణం రాజు తేతలి నైట్ స్టే పాయింట్ వద్ద సీఎం జగన్‌ను కలిసిన మాజీ మంత్రి ఇందుకూరి రామకృష్ణం రాజు. రామకృష్ణంరాజును ఆత్మీయంగా పలకరించి యోగక్షేమాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి. వైఎస్సార్సీపీలోకి జనసేన, టీడీపీ కీలక నేతలు తేతలిలో నైట్ స్టే పాయింట్ వద్ద రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాల నుంచి జనసేన, టీడీపీకి చెందిన కీలక నేతలు వైఎస్సార్సీపీలోకి చేరిక వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్ సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలోకి చేరిన రాజోలు జనసేన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే బొంతు రాజేశ్వరరావు, మాజీ పీఏసీ చైర్మన్ మేకల వీరవెంకట సత్యనారాయణ(ఏసుబాబు), టి.త్రిమూర్తులు, ఎం.నరసింహస్వామి, దొమ్మేటి సత్యనారాయణ, మంద సత్యనారాయణ, మాజీ సర్పంచ్ కేశనపల్లి డి. సూర్యనారాయణ. రాజోలు జనసేన పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే బొంతు రాజేశ్వరరావు సారథ్యంలో వైఎస్సార్సీపీలోకి చేరిన జనసేన సర్పంచ్ కాకర శ్రీను, చింతా సత్యప్రసాద్. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు విశేష స్పందన 17వ రోజు కొనసాగుతోన్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర మండుటెండను సైతం లెక్కచేయక జననేత కోసం పోటెత్తిన జనం పలువురి సమస్యలు వింటూ ముందుకు సాగుతున్న సీఎం జగన్ ప్రజలతో మమేకమవుతూ ఉత్సాహంగా సాగుతున్న యాత్ర తణుకు, రావులపాలెం, జొన్నాడ, పొట్టిలంక మీదగా బస్సు యాత్ర తేతలి నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభం తణుకు, రావులపాలెం, జొన్నాడ మీదగా పొట్టిలంక చేరుకోనున్న బస్సు యాత్ర అనంతరం కడియపులంక, వేమగిరి, మోరంపూడి జంక్షన్, తాడితోట జంక్షన్, చర్చి సెంటర్, దేవిచౌక్, పేపర్ మిల్ సెంటర్, దివాన్ చెరువు, రాజానగరం మీదగా ఎస్టీ రాజపురం చేరుకోనున్న బస్సు యాత్ర మేమంతా సిద్ధం బస్సు యాత్రలో అడుగడుగునా అపురూప దృశ్యాలు 17వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర కాసేపట్లో తేతలి నుంచి బస్సు యాత్ర ప్రారంభం తణుకు, రావులపాలెం, జొన్నాడ మీదగా పొట్టిలంక చేరుకోనున్న బస్సు యాత్ర అనంతరం కడియపులంక, వేమగిరి, మోరంపూడి జంక్షన్, తాడితోట జంక్షన్, చర్చి సెంటర్, దేవిచౌక్, పేపర్ మిల్ సెంటర్, దివాన్ చెరువు, రాజానగరం మీదగా ఎస్టీ రాజపురం చేరుకోనున్న బస్సు యాత్ర అభిమానం.. ఆకాశమంత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజల్లో అమితాదరణ కిలోమీటర్ల కొద్దీ వెన్నంటి వస్తున్న వీరాభిమానులు జిల్లాలు దాటి ఎండా, వాన లెక్క చేయకుండా ప్రయాణం పగలూ, రాత్రి తేడా లేకుండా వేచిచూస్తున్న అవ్వాతాతలు చిందులు వేస్తూ ఉత్సాహపరుస్తున్న యువత వేలాది బైకులతో భారీ ర్యాలీలు గజమాలల పరిమాణం దాటి క్రేన్లు వాడాల్సిన పరిస్థితి టన్నుల కొద్దీ పూలతో సీఎంకు భారీ దండలు, గజమాలలు భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, బాణ సంచాలతో అఖండ స్వాగతాలు మేమంతా సిద్ధం బస్సు యాత్రలో అడుగడుగునా అపురూప దృశ్యాలు Day-17 తూర్పు గోదావరి జిల్లా సిద్ధమా..?#MemanthaSiddham — YS Jagan Mohan Reddy (@ysjagan) April 18, 2024 నేడు 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర ఇలా.. సీఎం జగన్ రాత్రి బస చేసిన తేతలి నుంచి గురువారం ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు. తణుకు, రావులపాలెం, జొన్నాడ మీదుగా పొట్టిలంక చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. కడియపులంక, వేమగిరి, మోరంపూడి జంక్షన్, తాడితోటజంక్షన్, చర్చిసెంటర్, దేవిచౌక్, పేపర్ మిల్ సెంటర్, దివాన్ చెరువు, రాజానగరం మీదుగా ఎస్టీ రాజపురం వద్ద రాత్రి బస శిబిరానికి సీఎం చేరుకుంటారు. -
అభిమానం.. ఆకాశమంత
ఈ చిత్రంలో ఒంటిమీద వైఎస్సార్సీపీ రంగు దుస్తులు.. బైక్ మొత్తం వైఎస్సార్సీపీ జెండాలతో కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు.. రామిరెడ్డి అమరనాథ్ రెడ్డి. మండుటెండలో కాలికి చెప్పులు కూడా లేకుండా వైఎస్సార్సీపీ జెండా రంగులతో ఉన్న హెల్మెట్ పెట్టుకుని, మోటార్ సైకిల్‌కు మైక్‌ను కట్టుకుని, వైఎస్సార్సీపీ ప్రచార గీతాలను వినిపిస్తూ వేల కిలోమీటర్లు ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రతో పాటు ప్రయాణిస్తున్నాడు. ఎందుకిదంతా అంటే.. జగనన్న అంటే ప్రాణమని తెలిపాడు. ఆయన కోసం విశాఖ ఫార్మా కంపెనీలో రూ.40 వేలు జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలిపెట్టానన్నాడు. అంతేకాకుండా ఏడాదిన్నర పాపతోపాటు కుటుంబానికి దూరమైనా సంతోషంగా జగనన్న వెంట నడుస్తున్నానని చెబుతున్నాడు. జగన్ మళ్లీ సీఎం అయ్యేంత వరకూ తాను కాలికి చెప్పులు ధరించనని దీక్ష పూనానని అంటున్నాడు. తన వాహనాన్నే ప్రచార రథంగా మార్చి దానికి రెండు వైపులా ‘బలవంతుడికి.. బలహీనుడికి జరిగే యుద్ధం’ అనే వ్యాఖ్యతో ఉన్న స్టిక్కర్‌ను అతికించుకుని తిరుగుతున్నాడు. అమరనాథ్ రెడ్డి 2014, 2019 ఎన్నికల్లోనూ, ఇటీవల జరిగిన సిద్ధం సభల్లోనూ ఇదేవిధంగా పాల్గొని ప్రచారంలో తన వంతు పాత్ర పోషించాడు. తన జీవితం జగనన్నకే అంకితమని, ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ బస్సుయాత్రలో తన బైక్ యాత్ర కూడా కొనసాగుతుందని అభిమానాన్ని చాటుకున్నాడు. (బోణం గణేష్, ‘మేమంతా సిద్ధం బస్సు యాత్ర’ నుంచి సాక్షి ప్రతినిధి) ఇలా ఒక్క అమరనాథ్ రెడ్డి మాత్రమే కాదు.. ‘మేమంతా సిద్ధం’ అంటూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన బస్సుయాత్రలో ఇలాంటి వారు అడుగడుగునా కనిపిస్తున్నారు. ప్రజలు ఒక వ్యక్తిని మనస్ఫూర్తిగా అభిమానిస్తే.. గుండెల్లో గుడికట్టేస్తారనడానికి నిదర్శనంగా నిలుస్తున్నారు. గుంటూరు జిల్లా పాత మంగళగిరికి చెందిన పండ్ల వ్యాపారి శ్రీనివాసరావు తన ద్విచక్ర వాహనంపై భార్య, కుమార్తెను ఎక్కించుకుని, ఆ బైక్ మొత్తం వైఎస్సార్సీపీ జెండాలను కట్టుకుని బస్సుయాత్రలో పాల్గొన్నారు. మరి కొందరు కార్లతో యాత్ర ప్రారంభం నుంచి చివరి వరకూ వచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నారు. రోజుల తరబడి, జిల్లాలు దాటి, ఎండా, వాన లెక్క చేయకుండా, వ్యయప్రయాసలను పట్టించుకోకుండా వేలాది కిలోమీటర్ల మేర సీఎం జగన్ వెంట ప్రయాణం చేస్తున్నారు. మరోవైపు జననేత తమ ప్రాంతానికి వస్తున్నారని తెలియడం ఆలస్యం.. బస్సుయాత్ర వెళ్లే రహదారికి తమ గ్రామం దూరంగా ఉన్నాసరే అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, చిన్నారులు, యువత ప్రతికూల వాతావరణంలోనూ కిలోమీటర్ల కొద్దీ నడిచి వచ్చి జగన్‌కు అఖండ స్వాగతం పలుకుతున్నారు. పసిపిల్లలతో పాటు వచ్చిన తల్లులు, బాలింతలు ఇలా ఒకరేమిటి గంటల తరబడి జగన్‌ను చూసేందుకు నిరీక్షిస్తున్నారు. పగలూరాత్రి తేడా లేకుండా వీధుల్లో పోటెత్తుతున్నారు. మమా మాస్.. ఇక యువత అయితే వారి ఉత్సాహం మామూలుగా లేదు. ఓ మాస్ హీరోకు ఉన్న దానికంటే వంద రెట్లు ఫాలోయింగ్ సీఎం వైఎస్ జగన్‌కు ఉందని యువత ఆనందం చూస్తుంటే తెలుస్తోంది. బస్సు యాత్ర మొత్తం ప్రతి చోటా వైఎస్సార్సీపీ ప్రచార గీతాలకు ఒళ్లుమరచి యువత ఆనంద తాండవం చేస్తోంది. సినిమా పరంగా తాము ఎవరి ఫ్యాన్ అయినప్పటికీ..రాజకీయాల్లో జగన్ తమ రియల్ హీరో అంటూ బైక్‌ల మీద తమ అభిమాన హీరో ఫొటోతో పాటు సీఎం జగన్ ఫొటో స్టిక్కర్లను అతికించుకోవడం విశేషం. స్థానిక నాయకుల్లోనూ బస్సుయాత్ర నూతన ఉత్తేజాన్ని కలిగిస్తోంది. ఎక్కడికక్కడ సీఎం వైఎస్ జగన్‌కు సంప్రదాయం ఉట్టిపడేలా కోలాటాలు, స్టిక్ వాకర్స్‌ను ఏర్పాటు చేసి భారీ గజమాలలతో ఘన స్వాగతం పలుకుతున్నారు. ఈ గజమాలలు సాధారణ పరిమాణం దాటి ఉండటంతో వాటిని క్రేన్లతో మోయాల్సి వస్తోంది. సీఎం జగన్ బస్సు యాత్ర వెంట వేలాది బైకులతో భారీ ర్యాలీలు చేస్తూ యువత, కార్యకర్తలు, స్థానిక నేతలు సందడి చేస్తున్నారు. కొండంత ఆనందం.. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రజలు సీఎం వైఎస్ జగన్‌కు అఖండ స్వాగతాలు పలుకుతున్నారు. హారతులు ఇచ్చి దిష్టి తీయడంతోపాటు పూలతో దండలు, పూలాభిషేకాలు చేస్తున్నారు. ప్రతి కూడలిలో జగన్ భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ అభిమానాన్ని చాటుకుంటున్నారు. జగన్ తమ గ్రామానికి, వీధికి రాగానే బాణాసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులు, బాలికలు సైతం జగన్ మామే మళ్లీ సీఎం కావాలంటూ జెండాలు చేతబట్టి నినదిస్తున్నారు. సీఎం జగన్ బస్సు ఆపి తమను పలకరిస్తుంటే ప్రజలు భావోద్వేగానికి గురవుతున్నారు. ఆయనతో ఫొటో దిగి కొండంత ఆనందాన్ని మూటగట్టుకుంటున్నారు. అన్నా నీ కోసం మా ప్రాణం ఇస్తామంటూ సీఎం వైఎస్ జగన్‌కు భరోసా ఇస్తున్నారు. ఆనక ఆ ఫొటోలను తమ వారందరికీ పంపుతున్నారు. అంతేకాకుండా ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, ఎక్స్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు. కటిక చీకటిని.. జోరున కురిసే వర్షాన్ని..మండుతున్న ఎండను కూడా లెక్కచేయకుండా తమ అభిమాన నేతకు జననీరాజనం పలుకుతున్న ఇలాంటి అపురూప దృశ్యాలు సీఎం జగన్‌ను ప్రజలు ఎంతగా ఆరాధిస్తున్నారో చెప్పడానికి నిలువెత్తు నిదర్శనాలని రాజకీయ విశ్లేషకులు చెబుతుండటం విశేషం. -
నేడు 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర ఇలా..
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 17వ రోజైన గురువారం(ఏప్రిల్ 18) షెడ్యూల్‌ను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం బుధవారం విడుదల చేశారు. సీఎం జగన్ రాత్రి బస చేసిన తేతలి నుంచి గురువారం ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు. తణుకు, రావులపాలెం, జొన్నాడ మీదుగా పొట్టిలంక చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. కడియపులంక, వేమగిరి, మోరంపూడి జంక్షన్, తాడితోటజంక్షన్, చర్చిసెంటర్, దేవిచౌక్, పేపర్ మిల్ సెంటర్, దివాన్ చెరువు, రాజానగరం మీదుగా ఎస్టీ రాజపురం వద్ద రాత్రి బస శిబిరానికి సీఎం చేరుకుంటారు. -
‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 18వరోజు షెడ్యూల్ ఇలా
సాక్షి, పశ్చిమగోదావరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జననాయకుడికి అడుగడుగునా నీరాజనం పలుకుతున్నారు. నుదిటిపై గాయం మానకపోయినా.. సడలని ఉక్కు సంకల్పంతో మరింత దృఢ నిశ్చయంతో సీఎం జగన్ తన బస్సుయాత్రను ముందుకు సాగిస్తున్నారు. మేమంతా సిద్ధం 17వ రోజు గురువారం (ఏప్రిల్ 18) షెడ్యూల్‌ను వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం బుధవారం విడుదల చేశారు. ఈ యాత్రలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, గౌరవ ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉదయం 9 గంటలకు తేతలి రాత్రి బస నుంచి బయలుదేరుతారు. తణుకు, రావులపాలెం, జొన్నాడ మీదుగా పొట్టిలంక చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. కడియపులంక, వేమగిరి, మోరంపూడి జంక్షన్, తాడితోట జంక్షన్, చర్చి సెంటర్, దేవి చౌక్, పేపర్ మిల్ సెంటర్ దివాన్ చెరువు, రాజానగరం మీదుగా ST రాజపురం రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. -
పళ్ళు ఉన్న చెట్టుకే రాళ్ళూ
-
16 రోజుల బస్సు యాత్రలో సీఎం జగన్ సృష్టించిన ప్రభంజనం
-
ఉప్పొంగిన ‘గోదారోళ్ల’ అభిమానం..
-
పేదలపై బాణాలా?: సీఎం జగన్
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘‘జగన్ ఎప్పుడూ ఒంటరి కాదు.. అందరికీ మంచి చేసిన జగన్‌కు ప్రతి ఇంటా మద్దతు ఉంది. ఏ ఇంట్లో చూసినా తోడుగా పేదల సైన్యం ఉంది. జగనే మళ్లీ రావాలని కోట్ల హృదయాలు ఆశీర్వదిస్తున్నాయి. ఒక్క జగన్ మీద చంద్రబాబు 10 మంది సేనానులను తోడు తెచ్చుకుని బాణాలు గురి పెడుతున్నారు. అవి తగిలేది జగన్‌కా? లేక పేదలకా?’’ అనేది ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. 16వ రోజు బస్సు యాత్ర సందర్భంగా మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మేమంతా సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏమన్నారంటే.. బాబు గురించి చరిత్ర చెబుతున్న నిజం.. భీమవరంలో జన సముద్రం కనిపిస్తోంది. శబరి, ఇంద్రావతి కలసి ఉప్పొంగిన గోదావరిని తలపిస్తోంది. మంచి చేసి మనం, జెండాలు జతకట్టి వాళ్లు తలపడుతున్న ఈ ఎన్నికల యుద్ధంలో ఆ పేదల వ్యతిరేకులను ఓడించి జరుగుతున్న మంచిని కొనసాగించేందుకు మీరంతా సిద్ధమేనా? సంక్షేమ రాజ్యాన్ని అబద్ధాలు, కుట్రలతో ధ్వంసం చేసేందుకు చంద్రబాబు కూటమి ప్రయత్నిస్తోంది. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవి మాత్రమే కావు. మీ ఐదేళ్ల భవిష్యత్తు, అక్కచెల్లెమ్మల సాధికారత, పిల్లల చదువులు, అవ్వాతాతల సంక్షేమం, రైతన్నలకు అందుతున్న భరోసా, పేదలకు సామాజిక న్యాయం కొనసాగుతూ మరో రెండు అడుగులు ముందుకు వేయాలా? లేక మోసపోయి మళ్లీ నష్టపోవాలా? అనేది నిర్ణయించే ఎన్నికలు ఇవి. అందుకే మళ్లీ మళ్లీ చెబుతున్నా.. ఇవి మన తలరాతలను మార్చే ఎన్నికలు. ఇవి కేవలం చంద్రబాబు – జగన్‌కు మధ్య జరుగుతున్న ఎన్నికలు కావు. పేదలకు – చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు అని గుర్తు పెట్టుకోండి. మీ ప్రతి ఓటు వచ్చే ఐదేళ్లు ఏ దారిలో నడవాలో నిర్ణయిస్తుంది కాబట్టి మీ కుటుంబమంతా కూర్చుని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నా. జగన్‌కు ఓటు వేస్తే ఇప్పుడు జరుగుతున్న మంచి అంతా కొనసాగుతుంది. అదే చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ అంతటితో ముగిసిపోతాయి. ఇది చరిత్ర చెబుతున్న వాస్తవం. ఆయన సాధ్యం కాని అలవిమాలిన హామీలతో వస్తున్నారనేది నిజం. కొంగ జపం.. నటిస్తావెందుకయ్యా? మీరంతా ఈమధ్య చూసే ఉంటారు. చంద్రబాబుకు నాపై కోపం చాలా ఎక్కువగా వస్తోంది. ఆయన మాట్లాడుతున్నప్పుడు హైబీపీ కనిపిస్తోంది. ఏవేవో తిడుతుంటాడు.. శాపనార్ధాలు పెడుతుంటాడు. నాకు ఏదో అయిపోవాలని కోరుకుంటూ ఉంటాడు. రాళ్లు వేయండి.. అంతం చేయండని పిలుపునిస్తూ ఉంటాడు ఆ పెద్ద మనిషి. అక్కచెల్లెమ్మలూ.. నాపై చంద్రబాబుకు అంత కోపం ఎందుకో తెలుసా? బాబూ.. చెరువులో కొంగ మాదిరిగా చేపలను తినేందుకు ఎదురు చూస్తూ ఇంకోపక్క జపం చేస్తున్నట్లు నటిస్తావెందుకయ్యా? కొంగ జపాలు ఎందుకు చేస్తున్నావ్? అని అడిగా. అలా అడగడం తప్పా? మీ పేరు చెబితే పేదలకు గుర్తుకొచ్చే పథకంగానీ మంచి పనిగానీ ఒక్కటంటే ఒక్కటైనా ఉందా? అని చంద్రబాబును అడిగా. ఆయన పేదలకు చేసింది ఏమీ లేకపోగా చంద్రబాబు పేరు చెబితే వెన్నుపోట్లు, మోసం, దగా, అబద్ధాలు, కుట్రలే గుర్తుకొస్తాయి. భార్యలను వదిలేసి.. నియోజక వర్గాలనూ మార్చేసి! ఇక దత్తపుత్రుడి విషయానికి వస్తే.. పెళ్లికి ముందు పవిత్రమైన హామీలిచ్చి పిల్లలను కూడా పుట్టించి నాలుగైదేళ్లకు ఒకసారి కార్లను మార్చేసినట్లుగా భార్యలను వదిలేసి, ఇప్పుడు నియోజక వర్గాలను కూడా అలవోకగా వదిలేస్తున్నావ్! ఏం మనిషివయ్యా నువ్వు? అని ఆయన్ను అడిగా. అందుకే దత్తపుత్రుడిలో కూడా ఈమధ్య బీపీ బాగా కనిపిస్తోంది. ఒకసారి చేస్తే అది పొరపాటు! మళ్లీ మళ్లీ చేస్తే అలవాటు అంటారయ్యా.. దత్తపుత్రా! పవిత్రమైన సాంప్రదాయాన్ని నడి రోడ్డుపైకి తీసుకురావడం, ఆడవాళ్ల జీవితాలను చులకనగా చూపడం ఘోరమైన తప్పుకాదా? ఇదే విషయం నేను అడిగితే తప్పు అట! నిన్ను చూసి అదే తప్పు ప్రతి ఒక్కరూ చేయడం మొదలుపెడితే.. ఇలా నాలుగేళ్లకు, ఐదేళ్లకు ఒకసారి భార్యలను మార్చడం మొదలు పెడితే అక్కచెల్లెమ్మల బతుకులు ఏం కావాలి? అని కనీసం ఆలోచన కూడా చేయడు. ఆ పెద్దమనిషికి నువ్వు చేస్తున్నది తప్పు అని చెబితే బీపీ విపరీతంగా పెరిగిపోతుంది. ఇలా ఇలా.. ఊగిపోతుంటాడు. చేతులు, కాళ్లు, తల..అన్నీ ఊపేస్తుంటాడు. ఇలా అడిగినందుకే బాబుకు, దత్తపుత్రుడికి నాపై కోపం. బాబు వదిన గారికి కూడా కోపం వచ్చింది. బాబు భజంత్రీలకు కూడా పిచ్చి కోపం.. వీళ్లంతా ఊగిపోతూ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5లలో పూనకం వచ్చినట్లుగా ప్రవర్తిస్తుంటారు. పేదలపై బాబు బాణాలు.. జగన్ ఒక్కడే.. చంద్రబాబుకు మాత్రం పది మంది సేనానులు. వారంతా బాణాలు గురి పెట్టారు. కానీ అవి తగిలేది ఎవరికి? జగన్‌కా? లేక పేదలకు జగన్ అందిస్తున్న పథకాలకా? వలంటీర్లు–సచివాలయాల వ్యవస్థలకా? ఆర్బీకేలు–విలేజ్ క్లినిక్స్ వ్యవస్థలకా? నాడు – నేడు, ఇంగ్లీషు మీడియంతో మారిన పిల్లల చదువులకా? వారి బాణాలు తగిలేది ఎవరికి? ఇంటింటికీ అందించే పెన్షన్లకు వారి బాణాలు తగులుతున్నాయి. మీ బిడ్డ బటన్ నొక్కడంతో నేరుగా రూ.2.70 లక్షల కోట్లు పలు పథకాల ద్వారా గత 58 నెలల్లో పేదలకు అందాయి. మరి వాళ్లు వేసే బాణాలు జగన్‌కు తగులుతున్నాయా? లేక ఆ రూ.2.70 లక్షల కోట్లు అందుకున్న అక్కచెల్లెమ్మల కుటుంబాలకు తగులుతున్నాయో ఆలోచన చేయమని కోరుతున్నా. వారంతా బాణాలు ఎక్కుపెట్టింది మీ అందరి మంచి కోరుతూ మనం తీసుకొచ్చిన వ్యవస్థలపై, పథకాలపై. అక్క చెల్లెమ్మల సాధికారత, పేద బిడ్డల బంగారు భవిష్యత్తు, అవ్వాతాతల సంక్షేమం, రైతన్నలకు అందుతున్న రైతు భరోసాపై చంద్రబాబు, ఆయన పెత్తందారుల బృందం ప్రకటించిన యుద్ధమిది. పుట్టుకతోనే రొయ్యకు మీసాలు.. బాబుకు మోసాలు రొయ్యకు మీసం.. బాబుకు మోసం పుట్టుకతో ఎలా వచ్చాయో భీమవరంలో తేల్చేద్దాం. బాబు వస్తే జాబులు రావడం కాదు.. ఉన్నవి ఎలా ఊడిపోతాయో, రైతులను ఎలా ముంచాడో మొన్ననే పిడుగురాళ్ల సిద్ధం సభలో చెప్పా. టీడీపీ, ఎల్లో మీడియా చంద్రబాబును జాకీలు, పొక్లెయిన్లతో లేవనెత్తుతూ చేస్తున్న మోసాలు, పచ్చి అబద్ధాల గురించి ఇవాళ తేలుద్దాం. ఆ ప్రచారాల్లో ఎంత నిజం ఉందో చూద్దాం. ఖాళీ డబ్బాలో రాళ్లు వేస్తే డబడబ సౌండ్ వచ్చిన తరహాలో బాబు వల్లే అభివృద్ధి అంటూ ఊదరగొడుతుంటారు. అసలు బాబుకు – అభివృద్ధికి ఏమైనా సంబంధం ఉందేమో మీరే చెప్పండి. సెల్‌ఫోన్‌ను కనిపెట్టిందీ, సత్య నాదెళ్లను చదివించిందీ తానేనని చెప్పుకునే బాబు పాత డైలాగులు కాసేపు పక్కనబెట్టి మీ అందరికీ బాగా గుర్తున్న 2014 ఎన్నికల్లో ఆయన ఏం చెప్పారో చూద్దాం. కొత్త రాష్ట్రం కాబట్టి అనుభవజ్ఞుడైన బాబు అధికారంలోకి వస్తేనే అభివృద్ధి జరుగుతుందంటూ ఎల్లో గ్యాంగ్ డప్పు కొట్టింది. జగన్‌కు అనుభవం లేదు, పిల్లోడని.. బాబుకైతే బాగా అనుభవం ఉంది, ఆయన వస్తేనే అభివృద్ధి అని ఊదరగొట్టారు. చంద్రబాబు సెల్ఫ్‌డబ్బా.. అదిగో హైపర్ లూప్.. బుల్లెట్ రైలు.. మైక్రోసాఫ్ట్ వచ్చేసిందని.. ఏపీలో ఒలంపిక్స్ అని.. ఆమ్స్టర్ డ్యామ్, సింగపూర్, వెనిస్తో పోటీపడే నగరాన్ని నిర్మిస్తున్నామని చంద్రబాబు సెల్ఫ్‌డబ్బా కొట్టుకోలేదా? మరి సింగపూర్ కట్టాడా? హైపర్ లూప్ తెచ్చాడా? బుల్లెట్ రైలు వచ్చిందా? మైక్రోసాఫ్ట్ ఏమైనా తెచ్చాడా? రాష్ట్రంలో ఏమైనా ఒలంపిక్స్ జరిగాయా? కొత్తగా ఏమైనా పోర్టులు కట్టాడా? ఫిషింగ్ హార్బర్లు కట్టాడా? కనీసం ఎయిర్‌పోర్టులు ఏమైనా కొత్తవి కట్టాడా? జిల్లాకో హైటెక్ సిటీ మీకేమైనా కనిపించిందా? ఎక్కడైనా ఓ మెడికల్ కాలేజీ కట్టాడా? ఇవన్నీ కట్టకపోతే పోనివ్వండి. ఏ గ్రామంలోనైనా ప్రభుత్వ స్కూల్‌ని, కనీసం వార్డునైనా బాగు చేశాడా? ఎక్కడైనా ఒక ఊరిలో సచివాలయం, విలేజ్ క్లినిక్ ఏర్పాటు చేశాడా? గ్రామానికి ఫ్యామిలీ డాక్టర్‌ను తెచ్చాడా? మీ ఇంటివద్దకే ఆరోగ్య సురక్ష వచ్చిందా? డిజిటల్ లైబ్రరీలు, మారుమూల గిరిజన ప్రాంతాలకు కనెక్టివిటీ కల్పించాడా? రైతన్నకు మేలు చేస్తూ ఆర్బీకే వ్యవస్థను తెచ్చాడా? ఒక వలంటీర్ వ్యవస్థను తెచ్చాడా? మరి ఇలాంటి బాబు ఏం చేశాడని అభివృద్ధి కింగ్ అంటూ జబ్బలు చరుచుకుంటున్నారు? మీదంతా బోగస్ రిపోర్టు కాదా? మీ జగన్ ప్రోగ్రెస్ రిపోర్టు.. ► వాయువేగంతో ఏకంగా 17 కొత్త మెడికల్ కాలేజీల పనులు ► కొత్తగా, శరవేగంగా మరో నాలుగు సీ పోర్టుల పనులు ► కొత్తగా 10 ఫిషింగ్ హార్బర్ల పనులు వడివడిగా ► కొత్తగా ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల పనులు ► 15 వేలకుపైగా సచివాలయాల ఏర్పాటు ► నాడు–నేడుతో బాగుపడ్డ స్కూళ్లు, ఆస్పత్రులు ► కొత్తగా 15 వేలకుపైగా విలేజ్, వార్డు క్లినిక్స్ ► కొత్తగా 11 వేలకుపైగా ఆర్బీకేలు ► కొత్తగా ఇప్పటివరకు 3 వేలకుపైగా డిజిటల్ లైబ్రరీల నిర్మాణం ► గ్రామానికే ఫైబర్ గ్రిడ్ సదుపాయం ► రాష్ట్రానికి రూ.లక్ష కోట్లకుపైగా పెట్టుబడుల రాక ► విమానాశ్రయాల విస్తరణ, వాయువేగంతో భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు ► 3 ఇండస్ట్రియల్ కారిడార్లు, ఇండస్ట్రియల్ నోడ్స్, ఎంఎస్ఎంఈలకు ఆపన్న హస్తం ► స్వయం ఉపాధిని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ ఆసరా, సున్నావడ్డీ, చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, వాహనమిత్ర, మత్స్యకార భరోసా, చేదోడు, తోడు, నేతన్ననేస్తం, ► దేశంలో అభివృద్ధిలో టాప్ 5 రాష్ట్రాల సరసన ఆంధ్రప్రదేశ్ ► ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా ఇంటివద్దకే పథకాలు, సేవలు 2014లో బాబు మోసాలిలా.. రూ.87,612 కోట్ల రైతు రుణాలను మాఫీ చేశాడా?రూ.14,205 కోట్ల పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తామన్నాడు, కనీసం ఒక్క రూపాయైనా మాఫీ చేశాడా? ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు చొప్పున బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు. ఎవరికైనా చేశాడా? ఇంటికో ఉద్యోగం లేదంటే రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు. ఐదేళ్లు అంటే 60 నెలలు. ప్రతి ఇంటికీ రూ.1.20 లక్షలు ఇచ్చాడా? అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, ఇల్లు కూడా ఇస్తామన్నాడు. ఏ ఒక్కరికైనా ఒక్క సెంటు స్థలం ఇచ్చారా? రూ.10 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్, చేనేత, పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు. మరి చేశాడా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేశాడా? సింగపూర్‌కు మించి అభివృద్ధి చేస్తామని నమ్మబలికిన బాబు చేశాడా? ప్రతి నగరంలో హైటెక్ సిటీని నిర్మించాడా?.. భీమవరంలో కనిపిస్తోందా? ఇన్ని ప్రధాన హామీల్లో ఒక్కటంటే ఒక్కటైనా అమలు చేశాడా? ప్రత్యేక హోదా తెచ్చాడా? సూపర్ సిక్స్, సెవన్ అంటూ ఇప్పుడు మళ్లీ మోసాలకు బాబు తయారు. వెలిగించండి ఫోన్లలో టార్చిలైట్లు.. ఇవాళ ఎక్కడైనా లంచాలు అనే మాట వినిపిస్తోందా? 58 నెలల్లో ఎలాంటి వివక్ష లేని పారదర్శక వ్యవస్థలను తెచ్చింది మీ బిడ్డ కాదా? గతంలో పెన్షన్ కావాలంటే లంచం.. సబ్సిడీ లోన్లు కావాలన్నా లంచాలే.. చివరకు మరుగుదొడ్లు కావాలన్నా లంచాలే. మాయలు, మోసాలు చేసి గ్రాఫిక్స్ చూపించేవాడిని ఏమంటాం? ఛీటర్.. మోసగాడనే కదా? మాయలోడు అనేకదా అంటాం. మన ఖర్మ ఏమిటోగానీ ఐదేళ్ల క్రితం ఆ మనిషిని మనం ముఖ్యమంత్రి అని అన్నాం. చంద్రబాబు చరిత్రను ప్రతి ఒక్కరికీ వివరించండి. మోసాలతో పోరాడుతూ రాష్ట్రం, పేదల భవిష్యత్తును కాపాడుకునేందుకు జరుగుతున్న యుద్ధానికి మీరంతా సిద్ధమేనా? వారి చీకటి యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు మీరంతా సెల్ఫోన్లలో టార్చిలైట్లు వెలిగించి సంఘీభావం తెలియచేయండి. వలంటీర్లు మళ్లీ మన ఇంటికే రావాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు లేని పాలన కొనసాగాలన్నా, వ్యవస్థలు బాగుండాలన్నా ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై రెండు బటన్లు నొక్కి 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ సీట్లలో మన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించండి. జగన్‌కు తోడుగా కోట్ల గుండెలు.. ఈ యుద్ధంలో తలపడటానికి మీరంతా సిద్ధమేనా? జగన్ ఎన్నడూ ఒంటరి కానే కాదు. మంచి చేసిన జగన్‌కు మద్దతుగా ఏ ఇంట్లో చూసినా పేదల సైన్యం తోడుగా ఉంది. ఈరోజు ప్రతి ఇంట్లో జగనే ఉండాలి.. జగనే రావాలి.. మా బిడ్డే కావాలి అని కోట్ల మంది దీవిస్తున్నారు. ఇంటికే వస్తున్న రూ.3 వేల పెన్షన్ అందుకుంటున్న అవ్వాతాతలు జగన్‌కు తోడుగా ఉన్నారు. అమ్మ ఒడి నుంచి చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, ఆసరా, సున్నావడ్డీ, విద్యాదీవెన, వసతి దీవెన దాకా ప్రతి ఇంట్లో పథకాలు అందుకుంటున్న అక్కచెల్లెమ్మలు నా తమ్ముడు, నా అన్నే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారు. బాగుపడ్డ ఆస్పత్రులు, మెరుగైన ఆరోగ్యశ్రీ, విలేజ్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష, ఇంటివద్దే పరీక్షలు – మందులు .. వీటన్నిటితో జీవితాలు మెరుగైన పేదలంతా మాకు తోడుగా నిలబడే వ్యక్తి ఒక్క జగన్ మాత్రమేనని భావిస్తూ మళ్లీ రావాలని కోరుకుంటున్నారు. జగన్ ఉంటేనే స్కూళ్లు, పిల్లల చదువులు బాగుంటాయని, మరో 10–15 ఏళ్లలో మా బిడ్డలు కూడా పెద్దవారి పిల్లల మాదిరిగా అనర్గళంగా ఇంగ్లీషులో మాట్లాడే పరిస్థితి వస్తుందని గట్టిగా విశ్వసిస్తున్నారు. ఒక్క జగన్ ఉంటేనే క్రమం తప్పకుండా రైతు భరోసా వస్తుందని, గ్రామాల్లో ఆర్బీకేలు పని చేస్తాయని, దళారీలు లేకుండా పంటను అమ్ముకునే పరిస్థితి ఉంటుందని నమ్ముతూ ప్రతి రైతన్నా నాకు తోడుగా ఉన్నాడు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా మంచి జరిగింది కాబట్టే ప్రతి ఇంట్లోనూ జగన్‌కు అండగా ఉన్నారు. మరి ఇన్ని కోట్ల గుండెలు తోడుగా ఉండగా జగన్ ఒంటరి కానే కాదు. హత్యాయత్నంపై దిగజారుడు వ్యాఖ్యలా? నిత్యం రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం తపించే ముఖ్యమంత్రి జగన్‌పై హత్యాయత్నం చేయడాన్ని ప్రజలు సహించలేకపోతున్నారు. జగనన్నను ఆప్యాయంగా చేయి పట్టుకుని పలకరించేందుకు లక్షలాది మంది తరలివచ్చారు. భగవంతుడి దయ వల్ల సీఎంకు పెద్ద ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకుంటుంటే మానవత్వం లేని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చూస్తుంటే గుండెలు తరుక్కుపోతున్నాయి. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక 60 ఏళ్లకే రూ.3 వేల చొప్పున íపింఛన్లను ఇంటివద్దే అందిస్తున్నందుకు కక్ష గట్టారా? నిరుపేద బిడ్డలకు ఉన్నత విద్యావకాశాలు కల్పిస్తున్నందుకు కక్షగట్టారా? సీఎం జగన్‌కు కోట్లాదిమంది ఆశీర్వాదం ఉంది. స్వల్ప వ్యవధిలో సీఎం రెండోసారి భీమవరం రావడం సంతోషంగా ఉంది. పశ్చిమ గోదావరిపై ప్రత్యేకమైన ప్రేమాభిమానాలు చూపుతున్నందుకు ధన్యవాదాలు. – గ్రంధి శ్రీనివాస్, ప్రభుత్వ విప్, భీమవరం ఎమ్మెల్యే -
చంద్రబాబు, పవన్‌ను ఓ ఆటాడుకున్న సీఎం జగన్..
నిజమే.. కొన్ని విషయాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంత సున్నితంగా స్పందిస్తారో కొన్ని అంశాల్లో అయన అంత నిర్దయగా ఉంటారు అని ఒక్కోసారి అనిపిస్తుంది. పేదలు, రోగులు, ఆపన్నులు.. వృద్ధులు, వికలాంగులు ఎదురైతే అయన ఎంతగా ఆర్తిగా అల్లుకుపోతారన్నది ఎన్నో సందర్భాల్లో రుజువైంది. వేలాదిమంది హాజరయ్యే జనంలో తన కోసం వెతికే కళ్ళు ఎవరివన్నది అయన క్షణంలో గుర్తించి వాళ్ళను తనవద్దకు తీసుకురమ్మని సిబ్బందిని, పోలీసులను ఆయనే పురమాయిస్తారు.. అంటే ఆర్తితో ఉన్నవాళ్లను అయన అంతగా దగ్గరకు తీసుకుంటారు. అదే తనను అవమానించినవాళ్లను, తనను అవహేళన చేసి వెకిలి నవ్వులు నవ్వే వాళ్ళను, ప్రజలను వంచించేవాళ్ల విషయంలో సైతం అంతే జోరుగా స్పందిస్తారు. ఈ విషయం భీమవరం సభలో మరోమారు రుజువైంది. ఎక్కడా.. ఈ కోశనా.. చంద్రబాబు, పవన్‌లను బంతి ఆట ఆడేసుకున్నారు. దాదాపు గంటసేపు సాగిన ఈ ప్రసంగంలో సీఎం వైఎస్ జగన్ మునుపెన్నడూ లేని రీతిలో ప్రతిపక్షాల మీద విరుచుకు పడ్డారు. ఐపీఎల్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మను నియంత్రించడం ఫీల్డర్లకు ఎంతటి కష్టమో భీమవరం సభలో జగన్ గళం నుంచి దూసుకొచ్చిన మాటలతూటాలకు సమాధానం ఇవ్వడం అంతకన్నా కష్టం అని ప్రతిపక్ష కూటమికి అర్థం కావడానికి ఎంతోసేపు పట్టదు. రొయ్యకు మీసం.. చంద్రబాబుకు మోసం పుట్టుకతోనే వస్తాయి.. ఒక చీటర్.. ఒక మోసగాడు.. మాయలోడు.. అనదగిన చంద్రబాబు మన ఖర్మకొద్దీ మొన్నటి వరకు మనకు ముఖ్యమంత్రిగా ఉండేవాడు. ఇంకా ఈ డెబ్బై ఐదేళ్ల వయసొచ్చినా బుద్దిరాని చంద్రబాబు నామీద రాళ్లు వేయాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు. పోనీ ఆయన ఇన్నేళ్ల పాలనలో తనకు, రాష్ట్రానికి ..ప్రజలకు గుర్తుండే పథకం..ప్రాజెక్టు ఒక్కటైనా తీసుకొచ్చారా అంటూ పదేపదే జగన్ వేస్తున్న ప్రశ్నకు ఇంతవరకూ అటునుంచి సమాధానం రాలేదు. ఇక గతంలో అనుభవజ్ఞుడు అంటూ గెలిపించిన చంద్రబాబు గ్రాఫిక్స్ చూపించి ప్యారిస్.. లండన్.. సింగపూర్.. మలేషియా అంటూ బొమ్మలు చూపించారు తప్ప.. ఒక్కటంటే ఒక్కటైనా పూర్తి చేశారా? జిల్లాకో సైబర్ సిటీ కట్టారా? ప్రతి జిల్లాకు బులెట్ రైలు తెచ్చారా? ఉద్యోగాలు తెచ్చారా? పరిశ్రమలు ఏర్పాటు చేశారా? ఇంటికో ఉద్యోగం ఇచ్చారా అంటూ బ్రహ్మోస్ మిస్సైళ్ళ మాదిరిగా దూసుకొచ్చిన ప్రశ్నలు జనాన్ని ఆలోచింపజేశాయి. మన ప్రభుత్వంలో తెచ్చినట్లుగా పోర్టులు.. మెడికల్ కాలేజీలు.. ఆర్బీకేలు.. సచివాలయాలు.. ఆస్పత్రులు.. ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు.. వీటిలో ఒక్కటైనా చంద్రబాబు తెచ్చాడా? అలాంటి చేతగాని చంద్రబాబును జాకీలతో లేపడానికి ఎల్లోమీడియాలు ఎంతో ఆరాటపడుతున్నాయి. రాష్ట్రం ఇలా తయారవడానికి చంద్రబాబు, దత్తపుత్రుడితోపాటు ఎల్లోమీడియా బాధ్యత వహించాలి అంటూ అయన చేసిన ప్రసంగం ఆద్యంతం ఉద్విగ్నంగా సాగింది. అంతేగాక గతంలో టీడీపీ తీసుకొచ్చిన మ్యానిఫెస్టోను సైతం మళ్ళీ ప్రజలముందుకు తెచ్చి ఒక్కో హామీని విడమర్చి చెబుతూ ఇది చేశారా? ఈ పథకం వచ్చిందా? ఈ ప్రాజెక్టు తెచ్చారా అంటూ ప్రజలనుంచే సమాధానాలు రాబడుతూ స్వైరవిహారం చేసారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు నేను గుర్తు చేయడమే నా తప్పా? నేను ఆయన్ను అడగడమే నా నేరమా.. అందుకే నామీద చంద్రబాబు కోపమా అంటూ గూటం దించేశారు. మొత్తంగా భీమవరం సభలో జగన్ ప్రసంగం గతంలో సభలకన్నా కాక పుట్టించింది. మొత్తంగా ప్రతిపక్షాలను ఏకిపారేశారు. ఈ టైప్ పొలిటికల్ బౌలింగుతో అయన చిరుత వేగంతో ప్రత్యర్థుల మీదకు విసిరే యార్కర్లకు అట్నుంచి సమాధానం రావడం కష్టమే. - సిమ్మాదిరప్పన్న -
దత్తపుత్రుడిలో కూడా ఈ మధ్య బీపీ కనిపిస్తోంది: సీఎం జగన్
సాక్షి, పశ్చిమగోదావరి: సంక్షేమ, రైతు రాజ్యాన్ని చంద్రబాబు కూటమి అంతం చేయాలని చూస్తోందని మండిపడ్డారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. కూటమి కుట్రలను ప్రజలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. సాధ్యంకానీ హామీలతో బాబు మళ్లీ వస్తున్నాడని.. ఆయనకు ఓటేస్తే పథకాలన్నీ కూడా మునిగిపోతాయని అన్నారు. మీ బిడ్డ వైఎస్ జగన్‌ది పేదలపక్షమని.. తనకు ఓటేస్తే జరుగుతున్న మంచి కొనసాగుతుందని పేర్కొన్నారు. సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 16వ రోజు మంగళవారం ఉమ్మడి పపశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. భీమవరంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌లపై నిప్పులు చెరిగారు. మోసాలు పొత్తులను నమ్ముకొని బాబు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఒక్క జగన్‌కు వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఒక్కటయ్యాయన్నారు. వీళ్లందరూ నాపై బాణాలు ఎక్కుపెట్టారు. వారి బాణాలు తగిలేవి.. జగన్‌కా? సంక్షేమ పథకాలకా? అని సభకు హాజరైన అవేష జనవాహినిని ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. సీఎం జగన్ ప్రసంగం మంచి చేసి మనం.. జెండాలు జతకట్టి వారు.. తలపడబోతున్న ఎన్నికలు ఇవి పేదలకు, చంద్రబాబు మోసాలకు జరుగుతున్న ఎన్నికలు ఇవి. మీ ఓటు.. ఐదేళ్ల భవిష్యత్తు. ఈ ఎన్నికలు మన తలరాతను మార్చేవి. జరుగుతున్న మంచిని కొనసాగించేందుకు మీరంతా సిద్ధమే.. దుష్టచతుష్టయ కూటమిని అడ్డుకునేందుకు మీరంతా సిద్ధమా? నాకేదో అయిపోవాలని చంద్రబాబు ఆరాటం చంద్రబాబుకు నాపై కోపం ఎక్కువ. నాకేదో అయిపోవాలని శాపనార్థాలు పెడుతున్నాడు రాళ్లు వేయండి.. అంతమోందించండని పిలుపునిస్తున్నాడు. చంద్రబాబును ఆడగకూడని ప్రశ్న అడిగా. అందుకే కోపం ఎక్కువా. బాబు, బాబు చెరువులో కొంగ మాదిరిగా చేపలను తింటూ మరోవైపు జపం చేస్తున్నట్లు నటిస్తావెందుకని బాబును అడిగా. చంద్రబాబు పేరు చెబితే.. పేదలకు గుర్తుకు వచ్చే ఒక్క పథకమైనా ఉందా? ఆయన పేరు చెబితే గుర్తుకు వచ్చేది కుట్ర మోసం, వెన్నుపోటు నాలుగేళ్లకొకసారి కార్లు మార్చినట్లు దత్తపుత్రుడు భార్యలను మారుస్తున్నాడు ఇప్పుడు నియోజకవర్గాలను సైతం అలవోకగా మారుస్తున్నాడు. దత్తపుత్రుడు పెళ్లికి ముందు పవిత్రమైన హామీలు ఇచ్చి పిల్లల్ని పుట్టించి భార్యలను వదిలేశాడు దత్తపుత్రా.. ఒకసారి చేస్తే పొరపాటు.. మళ్లీ మళ్లీ చేస్తే అది అలవాటు అంటారు. దత్తపుత్రా.. ఆడవాళ్ల జీవితాలను నాశనం చేయడం, చులకనగా చూడటం తప్పు కాదా? ఇదేం అన్యాయం అని దత్తపుత్రుడిని అడిగితే ఆయనకు కూడా ఈ మధ్య బీపీ వస్తుంది.. ఊగిపోతా అంటాడు ఇలా అడిగినందుకు బాబుకు, దత్తపుత్రికిడి, చంద్రబాబు వదినకు కూడా కోపం వస్తుంది. లంచాలు, వివక్ష లేకుండా 2.70 లక్షల కోట్లుపేదల ఖాతాల్లో వేశాం నాడు-నేడు ద్వారా విద్య, వైద్యరంగంలో మార్పులు తీసుకొచ్చాం మీ బిడ్డకు రైతన్న, అక్కాచెల్లెమ్మలు, అవ్వాతాతలు తోడుగా ఉన్నారు ఇంతమంది తోడుగా ఉన్న మీ జగన్ ఎప్పుడూ ఒంటరికాదు. రొయ్యకు మీసం, బాబు మోసం పుట్టుకతో వచ్చాయి చంద్రబాబు జీవితమంతా వెన్నుపోట్లు, కుట్రలు, పొత్తులతో రాజకీయాలు చేస్తున్నారు దలకు మంచి చేసిన ఒక్క జగన్‌కు వ్యతిరేకంగా చంద్రబాబు కూటమి యుద్ధానికి వస్తున్నారు రొయ్యకు మీసం, బాబు మోసం పుట్టుకతో వచ్చాయి చంద్రబాబుకు అభివృద్ధికి అసలు సంబంధమే లేదు విపక్షాలు విసిరే బాణాలు జగన్‌కు తగులుతున్నాయా? ప్రజలకు తగులుతున్నాయా? బాబు వస్తే జాబ్‌లు రావడం కాదు.. ఉన్నవి కూడా ఊగిపోతాయి. సంక్షేమ పథకాలు అందుకున్న వారు నాతో ఉన్నారు. 2014లో రంగురంగుల మేనిఫెస్టో ఇంటింటికీ పంపిణీ చేసిన కూటమి నేతలు హామీలు గాలికొదిలారు జగన్‌కు అనుభవం లేదని. బాబుకు అనుభవం ఉందని ఊదరగొట్టారు ఇదిగో మైక్రోసాఫ్ట్, అదిగో సింగపూర్ అంటూ బాబు సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారు. ఇన్ని అబద్దాల తర్వాత చంద్రబాబు సింగపూర్ కట్టాడా?బుల్లెట్ ట్రైన్ వచ్చిందా? ఒలింపిక్స్ జరిగాయా? జగన్ వస్తేనే ఇంకా ఇంకా అభివృద్ధి అనేది ప్రోగ్రెస్ రిపోర్టు కాదా? -
జగనన్న రాక కోసం.. అర్థరాత్రి అయినా చెదరని అభిమానం (ఫొటోలు)
-
నేడు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇలా..
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 16వ రోజైన మంగళవారం(ఏప్రిల్ 16) షెడ్యూల్‌ను ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం సోమవారం విడుదల చేశారు. ఈ యాత్రలో భాగంగా సీఎం జగన్ సోమవారం రాత్రి బస చేసిన నారాయణపురం దగ్గర నుంచి మంగళవారం ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు. నిడమర్రు, గణపవరం మీదుగా ఉండి చేరుకుంటారు. ఉండి శివారులో సీఎం జగన్ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి భీమవరం బైపాస్ రోడ్ గ్రంథి వెంకటేశ్వరరావు జూనియర్ కాలేజ్ వద్ద సాయంత్రం 3.30 గంటలకు బహిరంగ సభలో పాల్గొని సీఎం జగన్ ప్రసంగిస్తారు. సభ అనంతరం పిప్పర, పెరవలి, సిద్ధాంతం క్రాస్ మీదుగా ఈతకోట శివారులో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం చేరుకుంటారు. -
నా సంకల్పం చెదరదు: సీఎం జగన్
మీ బిడ్డ జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన ఎన్నికల కురుక్షేత్రంలో పెత్తందారుల ఓటమిని, పేదల ప్రభుత్వం గెలుపుని ఆపలేరు. ఇలాంటి దాడులతో నా సంకల్పం చెక్కు చెదరదు. వాళ్లు ఈ స్థాయికి దిగజారారంటే.. వాళ్లు ఓటమిని అంగీకరించారని అర్థం. – గుడివాడ సభలో సీఎం జగన్ సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా బెదిరే ప్రసక్తే లేదని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల గుండెల్లో నిలవడం చేతకాని వారు ఎన్ని మాటలు మాట్లాడినా లెక్క చేయబోనన్నారు. 15వరోజు బస్సుయాత్ర సందర్భంగా సోమవారం సాయంత్రం కృష్ణా జిల్లా గుడివాడ శివారు నాగవరప్పాడులో నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ఒక్క జగన్‌పై.. పదిమంది కుట్రదారుల దాడి గుడివాడలో ఈరోజు మహా సముద్రం కనిపిస్తోంది. ఇది జన సముద్రం. మే 13న జరగనున్న ఎన్నికల మహా సంగ్రామంలో మంచి వైపు నిలబడిన ప్రజా సముద్రం ఇది. పేదల భవిష్యత్తు కోసం.. పథకాలన్నీ కాపాడుకోవడానికి.. కొనసాగించేందుకు.. ఇంటింటి అభివృద్ధి, పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునేందుకు ఆ పెత్తందారులతో యుద్ధానికి మీరంతా సిద్ధమేనా? పేదలకు మంచి చేస్తూ 130 బటన్లు నొక్కిన మన ప్రభుత్వానికి మద్దతుగా రెండు బటన్లు ఫ్యాన్ గుర్తుపై నొక్కేందుకు, మరో వంద మందితో నొక్కించేందుకు స్టార్ క్యాంపెయినర్లుగా ప్రచారానికి మీరంతా సిద్ధమేనా? రాష్ట్ర భవిష్యత్తు, పేదల భవిష్యత్తును కాపాడుకునేందుకు జరుగుతున్న ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమేనా? సిద్ధమే అయితే మీ సెల్ఫోన్లలో టార్చిలైట్లు వెలిగించి సంఘీభావం తెలియచేయండి. ప్రజలకు మంచి చేశానన్న ధైర్యంతో నిలబడ్డ మీ ఒక్క జగన్‌పై మోసాలే అలవాటుగా పెట్టుకున్న పదిమంది కుట్రదారులు దాడి చేస్తున్నారు. తాటాకు చప్పుళ్లకు మీ బిడ్డ బెదరడు.. చంద్రబాబు, దత్తపుత్రుడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, బీజేపీ, కాంగ్రెస్.. కుటిల పద్మవ్యూహంతో ఒక్కటై మీ జగన్ మీద బాణాలు సంధిస్తున్నాయి. మీకు మంచి చేసిన మీ బిడ్డ మీద, మీ సేవకుడిగా ఉన్న మీ బిడ్డ మీద ఇంతమంది దాడి చేస్తున్నారు. అయినా సరే మీ బిడ్డ అదరడు, బెదరడు. కారణం.. ప్రజలు అనే శ్రీకృష్ణుడి అండ ఉన్న అర్జునుడు మీ బిడ్డ. అర్జునుడి మీద ఓ బాణం వేసినంత మాత్రాన కురుక్షేత్రం గెలిచినట్లు కాదు. జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన ఆ దుష్టచతుష్టయం, పెత్తందారుల ఓటమిని, మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవరూ ఆపలేరు. ఇలాంటి దాడుల వల్ల నా సంకల్పం చెక్కుచెదరదు. వాళ్లు ఈ స్థాయికి దిగజారారంటే దాని అర్థం.. విజయానికి మనం చేరువగా ఉన్నామని, వారు దూరంగా ఉన్నారనే. తాటాకు చప్పుళ్లకు మీ బిడ్డ అదరడు, బెదరడు. మీకు సేవ చేయాలన్న సంకల్పం మరింత పెరుగుతుందే కానీ తగ్గదు. దేవుడు... పెద్ద స్క్రిప్టు రాశాడు నా నుదిట మీద వారు చేసిన గాయం కన్నుపై, తలపై తగలలేదంటే దాని అర్థం.. దేవుడు మీ బిడ్డ విషయంలో పెద్ద స్క్రిప్టు రాశాడనే! నా నుదిట మీద వారు చేసిన గాయం పది రోజుల్లో తగ్గిపోతుందేమో గానీ చంద్రబాబు ప్రజలకు చేసిన గాయాలను పేదలు ఎన్నడూ మరిచిపోయే పరిస్థితి ఉండదు. గాయపరచడం, మోసం చేయడం, కుట్రలు చేయడం చంద్రబాబు నైజం. ఇంటింటికి మంచి చేయడం మీ బిడ్డ నైజం. మంచి చేయకూడదన్నదే బాబు ఫిలాసఫీ ఈ కూటమి నాయకుడు చంద్రబాబు 30 ఏళ్ల ఫిలాసఫీని ఒక్కసారి చూస్తే పేద ప్రజలకు ఎలాంటి మంచి చేయకూడదన్నదే ఆయన సిద్ధాంతం. చంద్రబాబు ఎలాంటి వారో ఆయన నైజం చూస్తే అందరికీ తెలుస్తుంది. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వొద్దన్నదీ, తీగలపై బట్టలు ఆరేసుకోవాలన్నదీ ఈ బాబే. కిలో రెండు రూపాయలకు బియ్యం ఇవ్వొద్దని, ఎన్టీఆర్‌ను దింపేసి రూ.5.25కి పెంచేసిందీ, నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వొద్దన్నదీ ఈ బాబే. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీషు మీడియం వద్దన్నదీ, ప్రభుత్వ పాఠశాలలను పాడు పెట్టిందీ ఈ బాబే. పేదల ఇళ్లకు అడ్డుపడిందెవరు? పేదలకు ఇళ్ల స్థలాలిస్తుంటే అడ్డుపడి కులాలు, సామాజిక సమతుల్యం దెబ్బతింటుందంటూ ఏకంగా కోర్టులకు వెళ్లి కేసులు వేసింది చంద్రబాబు కాదా? సీఎంగా ఉంటూ బీసీలను, ఎస్సీలను అవహేళన చేసిన వ్యక్తి ఎవరు? ఈ బాబే కదా! విడగొట్టిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దన్నది ఎవరు?.. ప్రత్యేక హోదా ఏమైనా సంజీవనా అన్నది ఎవరు? ఈ బాబే. ఆ హోదాను తాకట్టు పెట్టిందీ ఈ బాబే. మానవత్వం, మంచితనం లేదు.. చంద్రబాబు ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు ఎన్టీఆర్ పిల్లనిచ్చి చేరదీస్తే చెప్పులు వేయించి వెన్నుపోటు పొడిచింది బాబు కాదా? మళ్లీ అవసరమైతే ఎన్టీఆర్ ఫొటో బయటకు తీసి దండలు వేస్తాడు. ఇంత నీచమైన వ్యక్తి బాబే. ఆ మనిషికి మానవత్వం, మంచితనం లేదు. దొంగ వాగ్దానాలు, మోసం, కుట్రలు, దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం.. ఇదే చంద్రబాబుకు తెలిసిన నీతి. చేపలకు కొంగను కాపలా పెట్టినట్లే చంద్రబాబును నమ్మడం అంటే చెరువులో చేపలకు కొంగను కాపలా పెట్డడం లాంటిదే. దొంగ చేతికి తాళాలు ఇవ్వడమే. పులి నోట్లో తల పెట్టడమే. మరి మీ జగన్‌ను చూడండి. ఈ 58 నెలల కాలంలో మీరిచ్చిన అధికారంతో, దేవుడి ఆశీస్సులతో గ్రామగ్రామాన, ఇంటింటా జగన్ తెచ్చిన మార్పులు ఏమిటో మీరే చూడండి. ప్రతి గ్రామంలో ఏడు వ్యవస్థలు.. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇవాళ ఏ గ్రామాన్ని తీసుకున్నా ఏకంగా ఏడు వ్యవస్థలు కనిపిస్తున్నాయి. గ్రామ/వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్, అర్బన్ హెల్త్ క్లినిక్‌లు, మహిళా పోలీసులు, కార్పొరేట్‌కు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లు, నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు.. ఇలా ప్రతి గ్రామంలోనూ మీ బిడ్డ మార్కు కనిపిస్తోంది. మరి చంద్రబాబు మార్కు ఏమిటి? జన్మభూమి కమిటీలు, పచ్చ పాముల అవినీతి కాట్లు, లంచాల గాట్లు. అదే మీ బిడ్డ మార్కు చూస్తే అవినీతి, వివక్ష లేకుండా నేరుగా మీ చేతికే అందించే సేవలు కనిపిస్తాయి. ఈ తేడాను గమనించాలి. పౌర సేవల్లో మనం తెచ్చిన విప్లవాత్మక మార్పులను చూడండి. దేశ చరిత్రలో అవ్వాతాతలకు రూ.3,000 చొప్పున ప్రతి నెలా పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఎక్కడైనా ఉందా? ఇంటి వద్దకే రేషన్‌తోపాటు జనన, కుల ధృవీకరణ పత్రాలతో సహా 600 రకాల సేవలు ప్రతి గడపకూ అందిస్తున్నాం. ప్రతి గ్రామంలో వలంటీర్ వ్యవస్థ మన కళ్ల ముందే కనిపిస్తోంది. ఇలాంటి వ్యవస్థలను గతంలో ఎన్నడైనా చూశారా? కేవలం ఈ 58 నెలల్లోనే, మీ బిడ్డ పాలనలోనే ఈ మార్పులు మన గ్రామంలో కనిపిస్తున్నాయి. మరి చంద్రబాబు చేసిందేమిటంటే జన్మభూమి కమిటీలను తెచ్చి గ్రామాన్ని, రాష్ట్రాన్ని దోచేశాడు. మీ బిడ్డ ఆ దోపిడీని అరికట్టి ఇంటింటికి మంచి చేశాడు. రైతన్నకు చెప్పినవి ప్రతీ ఒక్కటీ చేశా. రైతన్నలకు తొలిసారిగా పెట్టుబడి కోసం రైతు భరోసా ఇస్తున్నది మీ బిడ్డ పాలనలోనే. పగటి పూట ఉచిత విద్యుత్, ఇన్పుట్ సబ్సిడీ, సున్నా వడ్డీ రుణాలు, ఉచిత బీమా, ఆక్వా రైతులకు రూ.1.50కే విద్యుత్, అమూల్‌తో సహకార రంగాన్ని పటిష్టం చేసింది ఎవరంటే మీ బిడ్డ, మీ జగనే. రైతన్నలను చేయి పట్టుకుని నడిపిస్తూ ఆర్బీకే వ్యవస్థను తెచ్చిందెవరంటే అది కూడా మీ జగనే. వందేళ్ల తర్వాత 30 లక్షల ఎకరాల భూములను సర్వే చేసి సర్వ హక్కులు కల్పించింది కూడా మీ జగనే. మనం తెచ్చిన మార్పులు చూసి.. 14 ఏళ్లు సీఎంగా ఉండి కూడా రైతన్నలకు మంచి చేయకపోగా చెడు చేసిన చంద్రబాబుకు, ఎల్లో మీడియాకు ఈ 58 నెలల్లో మనం చేసిన పనులు, పథకాలను చూస్తే కడుపు రగిలిపోకుండా ఉంటుందా? విద్యా రంగంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సంస్కరణలు తెచ్చి విద్యార్థులను, తల్లితండ్రులను ప్రోత్సహించాం. అమ్మఒడి, విద్యాకానుక, నాడు – నేడు, గోరుముద్ద, డిజిటల్ బోధన, ట్యాబ్‌లు, పెద్ద చదువులకు ఇబ్బంది పడకుండా పూర్తి ఫీజు రీయింబర్స్ అమలు చేస్తున్నాం. విద్యాదీవెన, వసతి దీవెనతోపాటు మూడో తరగతి నుంచే టోఫెల్‌ను సైతం ప్రవేశపెట్టాం. మన విద్యార్థులు ఇక్కడ నుంచే ప్రపంచ ప్రఖ్యాత విశ్వ విద్యాలయాల్లో చదువుకునేలా సరికొత్త విధానాలు మీ బిడ్డ పాలనలోనే అమలు జరుగుతున్నాయి. చదువుల విప్లవంతో బాబుకు కడుపు మంట మన విద్యారంగంలో ఇన్ని విప్లవాలు కళ్లెదుటే కనిపిస్తుంటే చంద్రబాబుకు కడుపు మండదా? చంద్రబాబు మార్కు చదువుల విప్లవం అంటే నారాయణ, చైతన్య కోసం బలి పెట్టిన చదువులు గుర్తుకొస్తాయి. ప్రభుత్వ పాఠశాల్లో ఇంగ్లీషు మీడియం వద్దన్న ఆయన మాటలు గుర్తుకొస్తాయి. ఇక వైద్య రంగంలో ఆరోగ్యశ్రీని వెయ్యి నుంచి మూడు వేల ప్రొసీజర్లకు విస్తరించడంతో పాటు రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నది మీ బిడ్డ పాలనలోనే. ఆరోగ్య ఆసరాతో ఉపాధి భృతి కూడా మీ బిడ్డ పాలనలోనే అందుతోంది. మారిన మన గ్రామాలు... మొట్ట మొదటిసారిగా మన గ్రామాల రూపురేఖలు మారాయి. గ్రామాల్లో విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్, అరోగ్య సురక్ష, నాడు – నేడుతో ప్రభుత్వ ఆసుపత్రుల రూపు రేఖలు మారాయి. ఏకంగా 54 వేల కొత్త నియామకాలు ప్రభుత్వ వైద్య రంగంలో చేపట్టాం. ప్రభుత్వ రంగంలో మరో 17 కొత్త మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టాం. ఇవన్నీ జరిగింది ఎప్పుడు? చేసింది ఎవరు? మీ బిడ్డ పాలనలోనే కదా! మరి చంద్రబాబు కడుపు మండదా? వైద్య ఆరోగ్య రంగంలో బాబు మార్కు ఎక్కడుంది? ఇంటింటికీ వెళ్లి చంద్రబాబు చేసిన మోసాలను వివరించాలి. గతంలో ఏం చెప్పారు? ఆ తరువాత చేసిందేమిటనేది తెలియచెప్పాలి. బాబు మోసాల చిట్టా ఇదిగో 2014లోకూడా చంద్రబాబు ఇదే కూటమిగా ఏర్పడి రంగురంగుల హామీలిచ్చారు. దత్త పుత్రుడు, ప్రధాని మోదీ ఫొటోలతో రూపొందించిన మేనిఫెస్టోను ఇంటింటికీ పంపించారు. ఆ విఫల హామీల్లో ప్రధానమైనవి ఒక్కసారి పరిశీలిస్తే.. ► రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. రూ.87,612 కోట్ల రుణాలు మాఫీ అయ్యాయా? పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తానన్నాడు. మరి రూ.14,205 కోట్ల రుణాలలో అక్కచెల్లెమ్మలకు ఒక్క రూపాయి అయినా మాఫీ చేశారా? ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు చొప్పున బ్యాంకులో డిపాజిట్ చేస్తానని హామీ ఇచ్చి ఒక్కరికైనా చేశాడా? ఇంటికో ఉద్యోగం లేదంటే నెలకు రూ.2000 నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పాడు. ఐదేళ్లలో అంటే 60 నెలల్లో నెలకు రూ.రెండు వేలు చొప్పున ఒక్కో ఇంటికి రూ.1,20,000 ఎవరికైనా ఇచ్చాడా? పక్కా ఇల్లు ఇస్తానన్న చంద్రబాబు కనీసం ఏ ఒక్కరికైనా ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడా? రూ.పదివేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ అన్నాడు. చేనేత, పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు. ఎక్కడైనా చేశాడా మరి? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేశాడా? సింగపూర్‌ని మించి అభివృద్ధి చేసి ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. మరి మీ గుడివాడలో కనిపిస్తోందా? ఇప్పుడు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంటూ కొత్త హామీలతో మరోసారి మోసానికి సిద్ధమయ్యారు. మహిళా సాధికారత.. అక్కచెల్లెమ్మల సాధికారతకు చంద్రబాబు ఓ విలన్. వాగ్దానాలతో వంచించడంలో ఆయనకున్న అనుభవం ఇంకెవరికీ లేదు. అక్కచెల్లెమ్మలకు వెన్నుపోటు పొడిచాడు. అదే మీ బిడ్డ ట్రాక్ రికార్డు చూస్తే అమ్మఒడి, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం, కాపునేస్తం, 30 లక్షల ఇళ్ల పట్టాలు కనిపిస్తాయి. పిల్లల పెద్ద చదువులకు విద్యా దీవెన, వసతి దీవెన అంటే మీ జగన్. కల్యాణ మస్తు, షాదీ తోఫాతో అండగా నిలిచి చదువులను ప్రోత్సహిస్తున్నాం. అక్కచెల్లెమ్మలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారత కల్పించాం. నామినేటెడ్ పనులు, పదవుల్లో వారికి 50 శాతం రిజర్వేషన్లు కల్పించింది మీ జగనే. మన జెండా తలెత్తుకుని ఎగురుతోంది 99 శాతం హామీలను అమలు చేసి చిత్తశుద్ధిని చాటుకున్నాం. ప్రతి ఇంటికి మంచి చేసి, మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మీరే సైనికులుగా నిలబడాలంటూ మొట్టమొదటిసారిగా ఒక ముఖ్యమంత్రి కళ్లల్లో కళ్లు పెట్టి చూసి నిజాయితీగా ఈ వ్యవస్ధలో మార్పులు తీసుకొచ్చి చెప్పగలుగుతున్నాడు. ప్రజలందరికీ మంచి చేసిన మన జెండా తలెత్తుకుని సగర్వంగా ఎగురుతోంది. వారి జెండా మరో నాలుగు జెండాలతో జతకట్టి కూడా ఎగరలేక కిందపడుతోంది. మీ ఓటు రాబోయే ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఎవరి పాలనలో మంచి జరిగింది? ఎవరు సీఎంగా ఉంటే మన జీవితాల్లో వెలుగులు విరబూస్తాయన్నది ప్రతీ ఒక్కరూ ఆలోచన చేయాలి. ఫ్యాన్‌కు రెండు ఓట్లు వేస్తేనే ఈ అభివృద్ధి కొనసాగుతుందని స్టార్ క్యాంపైనర్లు ఇంటింటికీ వివరించాలి. ఏకంగా 2.30 లక్షల ఉద్యోగాలు.. స్వయం ఉపాధితో పేదల జీవితాలు బాగుపడతాయని విశ్వసించి ఎన్నడూలేని విధంగా చేదోడు, వాహన మిత్ర, మత్స్యకార భరోసా లాంటివి తీసుకొచ్చాం. ఇలా ఏది చూసినా మీ జగనే. లా నేస్తం చూసినా గుర్తుకొచ్చేది మీ జగనే. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 2019 వరకు రాష్ట్రంలో నాలుగు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే ఉంటే ఏకంగా 2.30 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది మీ బిడ్డ ప్రభుత్వమే. ఇవాళ నా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఉద్యోగాల్లో, నామినేటెడ్ పోస్టుల్లో పెద్ద ఎత్తున కనిపిస్తున్నారు. పరిపాలన వికేంద్రీకరణతో 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేశాం. నాలుగు సీ పోర్టుల ఏర్పాటుతోపాటు 10 కొత్త ఫిషింగ్ హార్బర్లు, ఎయిర్ పోర్టుల విస్తరణ, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు, మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు, ప్రణాళికాబద్ధంగా సాగునీటి ప్రాజెక్టుల పనులు చేపట్టింది మీ జగనే. తొలిసారిగా ఎంఎస్ఎంఈలకు తోడుగా నిలిచి సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు అండగా నిలబడింది మీ జగన్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మనం వరుసగా ఏటా నంబర్‌వన్‌గా నిలిచామంటే కారణం మీ జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలే. అందరి అవసరాలు తీర్చారు కొడాలి నాని, గుడివాడ ఎమ్మెల్యే ‘నిన్న జరగాల్సిన సిద్ధం సభ ఒక రోజు ఆలస్యమైనా సీఎం జగన్‌ను దీవించేందుకు మీరంతా ఇంత పెద్ద ఎత్తున తరలిరావడం ఆనందంగా ఉంది. ఐదేళ్ల పాలనలో స్కూలుకు వెళ్లే పిల్లల నుంచి అవ్వాతాతల వరకు ప్రతి ఒక్కరి అవసరాలను జగనన్న ప్రభుత్వం తీర్చింది. దళారులకు తావులేకుండా సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి మహాత్ముడు కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసింది. ఆరోగ్యశ్రీ ద్వారా లక్షల మంది నిరుపేదల ప్రాణాలను వైఎస్సార్ కాపాడితే సీఎం జగన్ ఆ దారిలో మరో నాలుగు అడుగులు ముందుకేసి సంపూర్ణ వైద్య భరోసా కల్పిస్తున్నారు. గన్నవరం నుంచి గుడివాడ వస్తుంటే ఎంతోమంది అనారోగ్య బాధితులు ఒక్కసారి సీఎం జగన్‌కు కలిస్తే ఎంత ఖర్చయినా పరిష్కారం లభిస్తుందన్న భరోసాతో కనిపించారు. ఒక వ్యక్తిపై రాష్ట్ర ప్రజలకు ఉన్న నమ్మకం ఇదీ. వైఎస్ జగన్‌ను ఎదుర్కోలేక చంద్రబాబు మాయా కూటమి కట్టాడు. ఆయన వదిన పురందేశ్వరిని బీజేపీ అధ్యక్షురాలిని చేశాడు. దత్తపుత్రుడు పవన్‌కళ్యాణ్‌ను పక్కన పెట్టుకున్నాడు. వీళ్లందర్నీ పెట్టుకుని కూడా సిద్ధం సభల ద్వారా వైఎస్ జగన్‌కు లభిస్తున్న ప్రజాదరణను చూసి తట్టుకోలేక కుట్రలకు తెగించారు. భౌతికంగా తొలగించాలనే కుట్రతో శనివారం రాత్రి విజయవాడలో సీఎంపై దాడికి పురిగొల్పారు. వైఎస్ జగన్ ఎప్పుడూ చెబుతున్నట్లుగానే ఆ దేవుడు, ప్రజల ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే నుదిటి మీద బలమైన దెబ్బ తగిలినా కాపాడాడు. ప్రజల ఆశీస్సులతో 50 రోజుల్లో మరోసారి ముఖ్యమంత్రి పదవి కచ్చితంగా చేపడతారు. సీఎం జగన్ చెప్పిన మాటపై నిలబడతారు. ఓట్లు కోసం, పదవుల కోసం ఆయనతో ఒక్క చిన్న అబద్ధం కూడా చెప్పించలేం. ఐదేళ్లుగా ఆయన్ను చాలా దగ్గర నుంచి చూశాం. జగన్ కథ తేలుస్తానంటున్న చంద్రబాబుకు ఇవే ఆఖరి ఎన్నికలు. ఈ జన్మలో ఆయనకు అది సాధ్యం కాదు. ప్రజలంతా అమూల్యమైన రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలి. పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరు తన మీద ఒక రాయి విసిరినంత మాత్రాన పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరంటూ సీఎం జగన్ ధీమా వ్యక్తం చేశారు. తన సంకల్పం చెక్కు చెదరదని స్పష్టం చేశారు. చంద్రబాబు చేసిన గాయాలను పేదలు ఎప్పటికీ మర్చిపోలేరని పేర్కొన్నారు. ‘మీ బిడ్డ వైఎస్ జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో పెత్తందారుల ఓటమిని, పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరు. ఇలాంటి దాడులతో నా సంకల్పం చెక్కుచెదరదు. వాళ్లు ఈ స్థాయికి దిగజారారంటే విజయానికి మనం అత్యంత చేరువగా.. వాళ్లు చాలా దూరంగా ఉన్నారని అర్థం’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్కొన్నారు. ‘నా నుదిటి మీద వాళ్లు చేసిన గాయం బహుశా 10 రోజుల్లో తగ్గిపోతుందేమో గానీ.. పేదలకు చంద్రబాబు చేసిన గాయాలను వాళ్లు ఎప్పటికీ మర్చిపోలేరు. గాయపర్చడం, మోసం చేయడం, కుట్రలు పన్నడం చంద్రబాబు నైజమైతే.. మీ ఇంటింటికీ మంచి చేయడం మీ బిడ్డ నైజమని చెప్పడానికి గర్వపడుతున్నా’ అంటూ సీఎం జగన్ మరో ట్వీట్ చేశారు. –సాక్షి, అమరావతి. -
కుట్రదారుల పనిబట్టాలి!
ప్రారంభమైంది మొదలు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు పోటెత్తుతున్న జనవాహినిని చూసి పుట్టగతులుండవని ఎంచిన ప్రత్యర్థులు శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పన్నిన కుట్ర వెంట్రుకవాసిలో భగ్నమైంది. పైనున్న దేవుడి ఆశీస్సులూ, అశేష ఆంధ్ర ప్రజానీకం ఆశీర్వాదాలూ తనకు పుష్కలంగా వున్నాయని జగన్ తరచు చెబుతుంటారు. విజయవాడ సింగ్ నగర్లో గుర్తుతెలియని దుండగులు చీకటిచాటున పదునైన వస్తువును గురిచూసి ప్రయోగించినప్పుడు అదే రుజువైంది. నేరుగా కణతకు గురిపెట్టి హాని తలపెట్టాలన్న ఉన్మాదుల పన్నాగం ఆయన ప్రజలకు అభివాదం చేస్తూ పక్కకు తిరగటంతో త్రుటిలో తప్పింది. ఎడమకన్ను పైభాగాన గాయమైంది. పక్కనే వున్న వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ సైతం ఈ దాడిలో గాయపడ్డారు. అంతక్రితం పాలనానుభవం లేని ఒక ముఖ్యమంత్రి అయిదేళ్ల అనంతరం ‘మీ ఇంట్లో మంచి జరిగుంటేనే ఓటేయండి’ అని అడుగుతుంటే ఇంత పెద్దయెత్తున ప్రజలు ఎదురేగి నీరాజనాలు పట్టడం బహుశా దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. అందుకే కూటమి నేతలు తట్టుకోలేకపోయారు. ఎడమవైపు కనుబొమ్మ పైభాగాన లోతుగా పడిన గాయం బాధిస్తున్నా... వాపు పూర్తిగా తగ్గకపోయినా జగన్ సోమవారం యధావిధిగా కొనసాగించిన బస్సుయాత్రకూ, గుడివాడలో నిర్వహించిన బహిరంగసభకూ మరిన్ని రెట్లు ఎక్కువగా జనవాహిని తరలిరావటం గమనించాక త్రికూటమికి, ప్రత్యేకించి టీడీపీకి తత్వం బోధపడి వుండాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారాన్నీ, పార్టీనీ కబ్జా చేసినప్పటికన్నా చాలా ముందే చంద్రబాబు రాజకీయాలను కలుషితం చేశారు. జర్నలిస్టు పింగళి దశరథరామ్ హత్య, కాపు నాయకుడు వంగవీటి రంగాను అత్యంత దారుణంగా హతమార్చటం, ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి దుర్మరణం వగైరాల్లో బాబుపై ఆరోపణలు రావటం యాదృచ్ఛికం కాదు. కేంద్రంలో తొలి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వహించిన వాజపేయి అంతటి నాయకుడే బాబు తీరుతెన్నులు గమనించి దిగ్భ్రాంతి చెందేవారని ఆ రోజుల్లో కథనాలొచ్చేవి. తెరవెనక పావులు కదపడం, జరిగింది ఒకటైతే బయటకు వేరేలా చూపటం, మంచిని తన ఖాతాలో వేసుకుని, పొరపాట్లు అవతలివారిపై రుద్దటం బాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఫలానావారిని ప్రధానిని చేశాను... ఇంకొకరిని రాష్ట్రపతిని చేశాను అని చెప్పుకోవటం ఆయనకు అలవాటైన విద్య. రాజకీయాల్లో శత్రువులుండరని, ప్రత్యర్థులు మాత్రమే వుంటారని ఇన్నేళ్ల అనుభవం తర్వాత కూడా బాబు గ్రహించలేకపోయారని ఆయన తరచుగా మాట్లాడే మాటలు, చేసే ప్రసంగాలు రుజువు చేస్తున్నాయి. కనీసం ఈ అవసాన దశలోనైనా నలుగురికీ ఆదర్శంగా వుండాలన్న ఇంగితజ్ఞానం లేకపోగా మరింత అధమస్థాయి రాజకీయాలు చేసే సినీ నటుడు పవన్ కల్యాణ్‌ను వెంటేసుకుని ఆయన ఉన్మాదిలా రెచ్చిపోతున్న తీరు అందరికీ దిగ్భ్రాంతి కలిగిస్తోంది. సరిగ్గా ముఖ్యమంత్రిపై దాడి జరగడానికి కొన్ని గంటల ముందు తాడికొండలో బాబు చేసిన ప్రసంగమే అందుకు తార్కాణం. ‘ప్రతి ఒక్కరూ రాయి తీసుకుని, ఏది దొరికితే అది తీసుకుని ఆ దున్నపోతుపై దాడి చేయండి’ అంటూ ఆయన రెచ్చగొట్టారు. సొంత పార్టీ కార్యకర్తలను ఇలా గూండాలుగా, హంతకు లుగా మార్చాలనుకోవటం ఏ మార్కు రాజకీయమో ఆయనకు అవగతమవుతున్నట్టు లేదు. వయసు ముదిరిన ఈ దశలో బాబుకు పరిణతి రావటం అసంభవం. కనీసం చట్టమైనా దుండ గులను శిక్షించగలిగితే ఇతరులకు జ్ఞానోదయమవుతుంది. ‘ఆవు చేలో మేస్తే... దూడ గట్టున మేయదు’ అంటారు. రాజకీయాల్లోకొచ్చి దాదాపు పదేళ్లవుతున్నా, ఒకటి కాదు– రెండు మంత్రి పదవులు వెలగబెట్టినా ఏ భాషలోనూ తప్పుల్లేకుండా పలకడంరాని లోకేష్ వంచనలో, వాచాలత్వంలో మాత్రం తండ్రిని మించారు. ఇలాంటివారంతా ప్రజాస్వామ్యం మాటున వీరంగం వేస్తుంటే అవాంఛనీయ ఉదంతాలు జరగటంలో ఆశ్చర్యమేముంది? ఏం నేరం చేశారు జగన్? ఏ పథకం పెట్టినా దళారుల భోజ్యంగా మారే తీరును సమూలంగా మార్చారు. వాలంటీర్ల వ్యవస్థను నెలకొల్పి నేరుగా నిరుపేదల ముంగిటకే పథకాలు వెళ్లే సరికొత్త విధానం తీసుకొచ్చారు. గ్రామసచివాలయాలు ఏర్పాటుచేశారు. ఇళ్లులేని పేదలను గుర్తించి దరఖాస్తు చేయించి రూ. 10 నుంచి 15 లక్షల విలువైన ఆస్తుల్ని కట్టబెట్టారు. వాగ్దానం చేసిన నవరత్నాలే కాదు... మరిన్ని పథకాలు ప్రజలకందించారు. విద్య, వైద్యరంగాల ప్రక్షాళనకు నడుం బిగించారు. రైతుభరోసా కేంద్రాలు నెలకొల్పారు. రైతులకు అండగావున్నారు. విలేజ్ క్లినిక్‌లు, ఆరోగ్యశ్రీ తదితరాలతో జనహృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. అలాంటి నేతను దుర్భాషలతో, దుశ్చర్యలతో ప్రజలకు దూరం చేయాలని చూడటం తెలివితక్కువతనమని ఆ ముఠాకు మరో నెలరోజుల్లో అర్థమవుతుంది. సత్సంకల్పంతో రాజకీయాలు నెరపేవారినీ, మంచి పాలన అందిస్తున్నవారినీ ప్రజలనుంచి వేరుచేయటం అసాధ్యం. మండుటెండల్ని సైతం లెక్కచేయకుండా బస్సు యాత్ర పొడవునా బడి పిల్లలు మొదలుకొని వృద్ధులవరకూ అన్ని తరాలవారూ, అన్ని వర్గాలవారూ కనబడటం జగన్ మంచి పనులకు నిదర్శనం. విజయవాడ దురంతం వెనకున్న సూత్రధారులనూ, పాత్రధారులనూ సత్వరం బంధించి, కఠినశిక్ష పడేలా చేసినప్పుడే హత్యారాజకీయాలకు అడ్డుకట్టపడుతుంది. నాయకులు బాధ్యతాయుతంగా మెలగటం నేర్చుకుంటారు. -
మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 16వ రోజు షెడ్యూల్
సాక్షి, పశ్చిమగోదావరి: మేమంతా సిద్ధం 16వ రోజు మంగళవారం (ఏప్రిల్ 16) షెడ్యూల్‌ను వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం సోమవారం విడుదల చేశారు. ఈ యాత్రలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, గౌరవ ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉదయం 9 గంటలకు నారాయణపురం రాత్రి బస నుంచి బయలుదేరుతారు. నిడమర్రు, గణపవరం మీదుగా ఉండి చేరుకొని ఉండి శివారులో భోజన విరామం తీసుకుంటారు. అనంతరం బయలుదేరి భీమవరం బైపాస్ రోడ్ గ్రంధి వెంకటేశ్వర రావు జూనియర్ కాలేజ్ వద్ద సాయంత్రం 3.30 గంటలకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం పిప్పర, పెరవలి, సిద్ధాంతం క్రాస్ మీదుగా ఈతకోట శివారులో రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. చదవండి: మేమంతా సిద్ధం 15వ రోజు: సీఎం జగన్ స్పీచ్ హైలైట్స్ -
ఇలాంటి దాడులతో నా సంకల్పం చెదరదు: సీఎం జగన్
సాక్షి, కృష్ణా: ఎన్నికల సంగ్రామంలో తనపై చంద్రబాబు, బీజేపీ, దత్తపుత్రుడు దాడి చేస్తున్నారని ధ్వజమెత్తారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. అర్జునుడిపై ఒక బాణం వేసినంత మాత్రాన.. కురుక్షేత్రంలో కౌరవులు నెగ్గినట్లు కాదని అన్నారు. వైఎస్ జగన్‌పై ఒకరాయి వేసినంత మాత్రన.. మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. ఈ స్థాయికి వారు దిగజారారు అంటే మనం(వైఎస్సార్సీపీ) విజయానికి అంత చేరువగా ఉన్నామని అర్థమన్నారు. వీళ్ల కుట్రలకు మీ బిడ్డ అదరడు, బెదరడని..ఇలాంటి దాడులతో తన సంకల్పం చెదరదని తెలిపారు. వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర మంగళవారం కృష్ణా జిల్లాలో సాగుతోంది. గుడివాడ సమీపంలో నాగవరప్పాడు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. గుడివాడలో మహా సముద్రం కనిపిస్తుందన్నారు. మే 13న జరగబోతున్న ఎన్నికల మహా సంగ్రామంలో మంచి వైపు నిలబడిన ప్రజల సముద్రం ఇదని తెలిపారు. ఇంటింటి అభివృద్ధి కోసం 130సార్లు బటన్ నొక్కామన్న సీఎం జగన్..2 లక్షల 70 వేల కోట్ల రూపాయలను నేరుగా ప్రజల ఖాతాల్లో వేశామని తెలిపారు. పేదల భవిష్యతు కోసం, పథకాల కొనసాగింపు కోసం పెత్తందారులతో యుద్ధానికి మీరంతా సిద్దమా? అని ప్రశ్నించారు. ఒక్క జగన్‌పై ఎంతమంది దాడి చేస్తున్నారో మీరు చూస్తున్నారని అన్నారు. అబద్దాలు, కుట్రలు, మోసాలతో ప్రతిపక్ష నేతలంతా ఒక్కటయ్యారు. సీఎం జగన్ కామెంట్స్ నా నుదుటి మీద వారు చేసిన గాయం. నా సంకల్పాన్ని మరింత పెంచింది. ఆ దేవుడు నాస్క్రిప్ట్ పెద్దగా రాశారు. పేదలకు ఏ మంచీ చేయొద్దన్నది కూటమి నాయకుడు చంద్రబాబు ఫిలాసఫీ రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వొదన్ని చంద్రబాబు అన్నారు కిలో బియ్యం 2 రూ ఇవ్వొద్దని ఎన్టీఆర్‌ను గద్దె దింపింది చంద్రబాబే. స్కూల్స్‌లో ఇంగ్లీష్ మీడియం వద్దంటూ ప్రభుత్వ బడులను పాడుబెట్టింది చంద్రబాబే ఎస్సీలను, బీసీలను అవహేళన చేసింది చంద్రబాబే. విడగొట్టిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దని అన్నది చంద్రబాబే . ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి. అతనిపై చెప్పులు వేయించింది చంద్రబాబే ప్రతీగ్రామంలో జగన్ మార్క్ కనిపిస్తుంది. దోచుకోవడం, దోచుకున్నది దాడుకోవడం ఇదీ చంద్రబాబుకు తెలిసిన నీతి. చంద్రబాబును నమ్మడం అంటే పులి నోట్లో తల పెట్టడమే. దేశంలోనే ఎక్కడా లేని విధంగా అవ్వాతాతలకు 3 వేల పెన్షన్ ఇస్తున్నాం. ఇంటి వద్దకే రేషన్ , 600 రకాల సేవలు ఇస్తున్నాం. లంచాలు, వివక్ష లేకుండా అందిస్తున్నాం. విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. ప్రతీగ్రామంలో మనం ఏర్పాటు చేసిన 7 వ్యవస్థలు కనిపిస్తాయి. ప్రతీగ్రామంలో జగన్ మార్క్ కనిపిస్తుంది. చంద్రబాబు జన్మభూమి కమిటీల పేరుతో గ్రామాలనుదోచుకున్నారు. చంద్రబాబు మార్కు అంటే పచ్చ పాముల కాటు 58 నెలల్లో అనేక రంగాల్లో విప్లవాలు తీసుకొచ్చాం నాడు-నేడు ద్వారా వైద్య రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చాం. 17 కొత్త మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ కార్డుతో 25 లక్షల మేర ఉచిత వైద్య సౌకర్యం కల్పిస్తున్నాం. ఆపరేషన్ అయ్యాక విశ్రాంతి సమయంలోనూ ఆదుకుంటున్నాం. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకొచ్చాం. 35 లక్షల ఎకరాలకు శాశ్వత భూ హక్కులు కల్పించాం. చంద్రబాబు పేరు చెబితే శిథిమైన బడులు గుర్తుకొస్తాయి. మనం చేసిన మార్పులతో పెత్తందార్ల కడుపు మండుతోంది. వసతిదీవెన, విద్యా దీవెన, టోఫెల్ శిక్షణ అందిస్తున్నాం. 54 వేల నియామకాలు చేపట్టాం. 58 నెలల కాలంలో చదువుల విప్లవం తీసుకొచ్చాం. జగనన్న చేదోడు, వాహనమిత్ర అంటే మీ జగన్. లా నేస్తం అంటే మీ జగన్. 2 లక్షల 31 వేల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం. 80 శాతం ఉద్యోగాలు, బీసీ,ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలకు ఇచ్చాం. 13 జిల్లాలను 25 జిలాలుచేసి అభివృద్ధి వికేంద్రీకరణ చేశాం. మేనిఫెస్టోలో 99 శాతం హామీలు నెరవేర్చింది వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2014లో చంద్రబాబు చేసిన మోసాలు గుర్తున్నాయా? ముగ్గురి ఫొటోలతో ఉన్న హీమీల పత్రాలను ఇంటింటికి పంపారు. ఆడబిడ్డ పుడితే రూ. 25 వేలు డిపాజిట్ చేస్తానన్నాడు.. చేశాడా?. పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తా అన్నాడు.. చేశాడా?అర్హులకు మూడు సెంట్ల స్థలం ఇస్తానన్నాడు ఇచ్చాడా? రూ. 10 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ అన్నాడు.. చేశాడా? ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తానన్నాడు.. నిర్మించాడా? ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇస్తా అన్నాడు.. ఇచ్చాడా? నా నుదుటిపై చేసిన గాయం 10 రోజుల్లో తగ్గిపోతుంది. పేదల ప్రయోజనాలకు చంద్రబాబు చేసిన గాయాలు మానవు మోసం చేయడం బాబు నైజం.. మంచి చేయడం మీ బిడ్డ నైజం -
ఇలాంటి దాడులు మనల్ని ఆపలేవు: సీఎం జగన్
సాక్షి, కృష్ణా: ప్రజల ఆశీర్వాదం వల్లే తాను దాడి నుంచి తప్పించుకోగలిగానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. వైద్యులు విశ్రాంతి సూచించడంతో ఒక్కరోజు విరామం అనంతరం.. సోమవారం ఉదయం కేసరపల్లి నుంచి మేమంతా సిద్ధం యాత్ర ప్రారంభించారాయన. అయితే యాత్ర ప్రారంభానికి ముందు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా నేతలు సీఎం జగన్‌ను కలిసి పరామర్శించారు. ‘‘ఇలాంటి దాడులు మనల్ని ఆపలేవు. మనకు దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదం ఉన్నాయి. ధైర్యంగా అడుగులు ముందుకు వేద్ధాం. ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదు. ప్రజల ఆశీర్వాదం నుంచే దాడి నుంచి తప్పించుకున్నా. మరోసారి అధికారంలోకి వస్తున్నాం. ఎలాంటి దాడులు మనల్ని ఆపలేవు’’ అని సీఎం జగన్, పార్టీ నేతలకు ధైర్యం చెప్పారు. అయితే వైఎస్సార్సీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని, బస్సు యాత్రకు వస్తున్న విశేష ఆదరణచూసి తట్టుకోలేక ఈ దారుణానికి పాల్పడ్డారని సీఎం జగన్ దృష్టికి వైఎస్సార్సీపీ నేతలు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా తన యోగక్షేమాలు అడిగి తెలుసుకునేందుకు వచ్చిన నేతలందరినీ అందరినీ చిరునవ్వుతో పలకరించిన సీఎం జగన్.. ఆ తర్వాత యాత్రను ప్రారంభించారు. 👉: గాయంతోనే మేమంతా సిద్ధం యాత్రకు సీఎం జగన్ (ఫొటోలు) -
సీఎం జగన్ బస్సు యాత్ర..ప్రజలతో కిక్కిరిసిన గన్నవరం
-
Watch Live: గన్నవరంలో సీఎం జగన్‌కు అపూర్వ స్వాగతం
-
ఇవాళ కేసరపల్లి నుంచి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభం
-
గన్నవరం టు గుడివాడ నేటి బస్సు యాత్ర షెడ్యూల్
-
నేడు సీఎం జగన్ బస్సు యాత్ర యధాతథం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ఒక్కరోజు విరామం అనంతరం ఇవాళ తిరిగి కొనసాగనుంది. యాత్రలో భాగంగా 15వ రోజైన సోమవారం(ఏప్రిల్ 15) షెడ్యూల్‌ను వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం విడుదల చేశారు. మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా కేసరపల్లి దగ్గర నుంచి సీఎం జగన్ సోమవారం ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు. గన్నవరం, ఆత్కూర్, వీరవల్లి క్రాస్, హనుమాన్ జంక్షన్, పుట్టగుంట మీదుగా జొన్నపాడు వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం జొన్నపాడు, జనార్దనపురం మీదుగా సాయంత్రం 3.30 గంటలకు గుడివాడ చేరుకుంటారు. గుడివాడలో మేమంతా సిద్ధం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం హనుమాన్ జంక్షన్ జాతీయ రహదారి, గుండుగొలను మీదుగా నారాయణపురం వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం జగన్ చేరుకుంటారు. -
‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 15వ రోజు షెడ్యూల్ ఇలా
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర ప్రతి రోజు ఓ జైత్రయాత్రలా కొనసాగుతోంది. అడుగడుగునా సీఎం వైఎస్ జగన్‌కు నీరాజనాలు పలుకుతున్నారు. యాత్రలో జననేతను చూసేందుకు.. మాట కలిపేందుకు.. కరచాలనంచేసేందుకు.. వీలైతే ఫొటో దిగేందుకు స్కూలు పిల్లల నుంచి వృద్ధుల వరకు మండుటెండైనా అర్ధరాత్రయినా పోటీ పడుతుండటం ఊరూరా కనిపిస్తోంది మేమంతా సిద్ధం 15వ రోజు ఆదివారం (ఏప్రిల్ 15) షెడ్యూల్‌ను వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం శనివారం విడుదల చేశారు. బస్సు యాత్రలో భాగంగా సీఎం ఉదయం 9 గంటలకు కేసరపల్లి రాత్రి బస నుంచి బయలుదేరుతారు. గన్నవరం, ఆత్కూర్, తేలప్రోలు బైపాస్, వీరవల్లి క్రాస్ , హనుమాన్ జంక్షన్, పుట్టగుంట మీదగా జొన్నపాడు శివారుకు చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం జొన్నపాడు, జనార్దణపురం మీదగా సాయంత్రం 3.30 గంటలకు గుడివాడ శివారు నాగవరప్పాడు వద్దకు చేరుకుని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. తరువాత గుడివాడ, బొమ్ములూరు, గుడ్లవల్లేరు, వేమవరం, పెడన క్రాస్, బల్లిపర్రు, బంటుమల్లి బైపాస్ , పెండుర్రు మీదుగా సంగమూడి రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. చదవండి: ఇది ఖచ్చితంగా క్లాస్ వార్.. పేదలపై పెత్తందారుల దాడి -
సీఎం జగన్‌పై దాడి ఎలా జరిగిందంటే..?
సాక్షి, విజయవాడ: జన క్షేత్రంలో అడుగడుగునా నీరాజనాలు అందుకుంటూ బస్సు యాత్రను కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసి రాజకీయ ప్రత్యర్థులు వణికిపోతున్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉన్న సీఎం జగన్‌పై ఒక ఆగంతకుడు హత్యాయత్నానికి తెగబడ్డాడు. సీఎంకు బలమైన గాయం కావడంతో రక్తం ధారగా కారింది.. గాయం నుంచి కారుతున్న రక్తాన్ని సీఎం జగన్ అదిమిపట్టుకున్నారు. బాధను పంటిబిగువన భరిస్తూనే ప్రజలకు అభివాదం చేశారు. ప్రాథమిక చికిత్స తర్వాత యాత్ర సీఎం జగన్ కొనసాగించారు. దాడి తర్వాత మరో 20 కి.మీ వరుకు బస్సు యాత్ర కొనసాగించారు. అసలు సీఎం జగన్‌పై దాడి ఎలా జరిగిందంటే.. యాత్రలో భాగంగా శనివారం రాత్రి 8.10 గంటలకు సీఎం వైఎస్ జగన్ విజయవాడ సింగ్ నగర్ డాబా కొట్ల సెంటర్‌కు చేరుకోగానే హత్యకు ప్రయత్నించాడు. సీఎం జగన్ కణతకు గురిచూసి పదునైన వస్తువుతో దాడి చేశాడు. అయితే ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం జగన్ పక్కకు తిరగడంతో ఆయన ఎడమ కంటి కనుబొమ పై భాగాన బలమైన గాయమైంది. దీంతో సీఎం పక్కకు తూలి.. ఎడమ కంటిని బలంగా అదిమి పట్టుకున్నారు. ఆయన ఎడమ కన్ను పైభాగం వాచిపోయింది. కాగా ఆ వస్తువు పదును, వేగాన్ని బట్టి అది రాయి, గ్రానైట్ పలక, పెల్లెట్, ఎయిర్ బుల్లెట్ ఏదైనా కావచ్చని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. సీఎం జగన్ ఎడమ కంటి పై భాగాన గాయమయ్యాక.. ఆ పదునైన వస్తువు మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌కూ తగలడంతో ఆయనకు కూడా గాయమైంది. 8:10 PM: విజయవాడ సింగ్‌నగర్‌లో సీఎం జగన్‌పై రాళ్ల దాడి 8:30 PM: బస్సులోనే సీఎంకు ప్రథమ చికిత్స 8:50 PM దాడి తర్వాత తిరిగి జగన్ బస్సు యాత్ర 10:00 PM: బస్సు నుంచే జనానికి సీఎం జగన్ అభివాదం 10.30 PM: కేసరపల్లి క్యాంప్‌నకు చేరుకున్న సీఎం జగన్ 11:15: కేసరపల్లి నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి 11.30 విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అర్ధరాత్రి 12:10 AM: విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అర్ధరాత్రి 12.20 ఆసుపత్రి నుంచి కేసరపల్లి క్యాంప్‌నకు తిరుగు ప్రయాణం సీఎం జగన్‌పై హత్యాయత్నం కేసులో అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుట్రపూరితంగానే సీఎం జగన్ పై దాడి చేసినట్టు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. రెండు రకాలుగా దాడి జరగొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వివేకానంద స్కూల్ కు, గంగానమ్మ గుడికి మధ్య నుండి రాయితో దాడి చేసి ఉండొచ్చని అనుమానం.. మరో వైపు వివేకానంద స్కూల్ నుంచి దాడి చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వివేకానంద స్కూల్ లోని కొన్ని కిటికీలు తెరుచుకుని ఉన్నాయి. వాటి నుండి ఎయిర్ గన్స్ తో క్యాటర్ బాల్‌తో దాడి చేసి ఉండొచ్చని అనుమానం. దీంతో స్కూల్ నుండి దాడి జరగొచ్చన్న కోణంలో కొనసాగుతున్న దర్యాప్తు చేస్తున్నారు. స్కూల్‌కి గుడికి మధ్య నుంచి చెట్ల మధ్య నుండి దాడి జరగొచ్చన్న కోణంలోనూ దర్యాప్తు చేపట్టారు. కుడివైపు జన సమూహం ఉండడంతో ఎడమవైపు స్కూల్, గంగానమ్మ గుడి మధ్య నుండి దాడి చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానం. పూర్తిగా చీకటిగా, చెట్లు ఉండడంతో నిందితుడు ఎవరికీ కనిపించలేదు. దాడికి పాల్పడిన తర్వాత సులభంగా తప్పించుకోవచ్చని ఆ ప్రాంతాన్ని దాడికి ఎంచుకుని ఉంటాడని పోలీసులు అనుమానం. కేవలం 20 నుండి 30 అడుగుల దూరం నుండే సీఎం జగన్‌ని టీడీపీ గుండాలు టార్గెట్ చేశారు. సీఎం జగన్‌ని బలంగా కొట్టాలన్న ఉద్దేశ్యంతోనే దాడి చేశారు. -
సీఎం జగన్‌కు తీవ్ర గాయం.. విశ్రాంతి అవసరం: వైద్యులు
సాక్షి, విజయవాడ: బస్సు యాత్రలో జరిగిన దాడిలో గాయపడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వైద్యులు ప్రథమ చికిత్స చేశారు. సీఎం జగన్ ఎడమ కనుబొమ్మపై తీవ్ర గాయమైందని, గాయానికి మూడు కుట్లు వేశామని జీజీహెచ్ డాక్టర్లు తెలిపారు. సీఎం జగన్ ముఖంపై వాపు ఉందని, విశ్రాంతి తీసుకోవాలని సీఎంకు వైద్యులు సూచించారు. సీఎం జగన్‌పై హత్యాయత్నం ఘటన తెలిసిన వెంటనే ఆయన సతీమణి వైఎస్ భారతి కేసరపల్లిలోని రాత్రి బస కేంద్రానికి చేరుకున్నారు. వైద్యుల సూచనల మేరకు చికిత్స కోసం సీఎం జగన్ తన సతీమణి భారతితో కలిసి విజయవాడ ప్రభుత్వాస్పత్రికి వెళ్లారు. ప్లాస్టిక్ సర్జరీ, అనస్తీషియా, ఇతర వైద్యుల బృందం పలు వైద్య పరీక్షలు చేసి సీఎం జగన్‌కు చికిత్స అందించారు. ఎడమ కంటి కనుబొమ పైభాగాన లోతైన గాయానికి కుట్లు వేశారు. అనంతరం గాయం మానేంత వరకూ తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించి, మందులను ప్రిస్క్రైబ్ చేశారు. సీఎం వద్దకు చేరుకున్న నర్సులు, ఇతర సిబ్బంది ‘మీరు జాగ్రత్తగా ఉండండి అన్నా’ అంటూ పలకరించారు. ఈ క్రమంలో వారందరినీ సీఎం జగన్ ఆప్యాయంగా పలకరించారు. ఇక సీఎం జగన్‌తో పాటు దాడిలో గాయపడిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కూడా వైద్యులు చికిత్స చేశారు. సీఎం జగన్‌కు కనుబొమ పైభాగాన లోతైన గాయమైనట్టు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్ వివరించారు. ఆది, సోమవారాల్లో గాయం తగిలిన ప్రాంతంలో వాపు ఉంటే అందుకనుగుణంగా చికిత్స చేయాల్సి ఉంటుందన్నారు. కాగా ఆస్పత్రిలో సీఎం జగన్ వెంట ఎంపీలు కేశినేని నాని, అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కైలే అనిల్‌కుమార్, మొండితోక జగన్మోహన్రావు, ఎమ్మెల్సీలు తలశీల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి, రుహుల్లా, దేవినేని అవినాశ్ ఉన్నారు. కాగా ప్రభుత్వాస్పత్రిలో చికిత్స చేయించుకున్న అనంతరం సీఎం జగన్ రాత్రి బసకు తిరిగి కేసరపల్లికి చేరుకున్నారు. నేడు యాత్రకు విరామం యాత్ర ముగిశాక గాయానికి చికిత్స చేయించుకోవటం కోసం ముఖ్యమంత్రి జగన్ నేరుగా విజయవాడ ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు. అక్కడకు ఆయన సతీమణి వైఎస్ భారతి కూడా చేరుకుని ఆసుపత్రిలో ఆయనకు తోడుగా ఉన్నారు. వైద్యులు గాయాన్ని పరీక్షించాక, వైఎస్ జగన్‌కు లోకల్ అనస్తీషియా ఇచ్చి.. కుట్లు వేశారు. కొంత విశ్రాంతి అవసరమని సూచించారు. చికిత్స అనంతరం జగన్ తిరిగి తన నైట్ హాల్టు ప్రాంతానికి వెళ్లారు. ఆదివారం నాడు బస్సు యాత్రకు విరామంగా ప్రకటించారు. తదుపరి షెడ్యూలును ఆదివారం రాత్రి ప్రకటించే అవకాశం ఉంది. -
స్కూల్ నుంచే దాడి ?..అడుగుల దూరం..
-
సీఎం జగన్ పై దాడి...దుండగుల పూర్తి ప్లాన్
-
రక్తమోడినా సడలని సంకల్పం
సాక్షి, విజయవాడ: ఇక ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రకు వస్తున్న జనాదరణను చూసి కొందరి కళ్లు ‘పచ్చ’బడ్డాయి. జగన్‌ను జనం నుంచి దూరం చేయాలనే కుట్రతో బస్సుయాత్ర సింగ్‌నగర్, డాబాకొట్లు సెంటర్ దాటగానే గుర్తుతెలియని ఆగంతకులు ఆయనపై రాయి విసిరారు. రాయి తగిలి ఎడమ కంటిపై గాయమైంది. రక్తం కారుతుంటే వైద్యులు ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం యాత్రను ఆపకుండా ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అక్కడ నుంచి పైపుల రోడ్డు, కండ్రిక మీదుగా రామవరప్పాడు రింగ్ రోడ్డుకు చేరుకోగానే ప్రజలు పెద్దఎత్తున ఎదురొచ్చి స్వాగతం పలికారు. రామవరప్పాడు, ప్రసాదంపాడు, నిడమానూరు, గూడవల్లి మీదుగా కేసరపల్లిలో రాత్రి బస వద్దకు 10.38 గంటలకు జగన్ చేరుకున్నారు. మండుటెండను లెక్కచేయక, జోరు వానలోనూ తడుస్తూ ఒక్క విజయవాడలోనే 5 గంటల పాటు యాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ జగన్ 14వ రోజు బస్సుయాత్రను ముగించారు. ఇదీ చదవండి: సీఎం జగన్‌పై హత్యాయత్నం! -
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం.. విజయవాడలో మేమంత సిద్ధం బస్సుయాత్రలో పదునైన వస్తువుతో దాడి.. ఇంకా ఇతర అప్డేట్స్
-
సీఎం జగన్‌పై హత్యాయత్నం!
‘సిద్ధం’ అంటూ నగారా మోగించి.. జన క్షేత్రంలో అడుగడుగునా నీరాజనాలు అందుకుంటూ బస్సు యాత్రను కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసి రాజకీయ ప్రత్యర్థులు తట్టుకోలేకపోయారు. విజయవాడ నగరంలో శనివారం సాయంత్రం 5 గంటల నుంచీ కనీవినీ ఎరుగని అశేష జన స్పందనతో సాగిన యాత్రలో... సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని లక్ష్యంగా చేసుకొని హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఏ దారిలో వెళతారు? ఎక్కడెక్కడ ఆగుతారు? యాత్ర వెళ్లేటపుడు కరెంటు వైర్లు తగలకుండా కరెంటు తీసేస్తారు కనుక చీకటిగా ఉన్నపుడు ఎక్కడైతే బాగుంటుంది? అనే అంశాలన్నిటినీ అధ్యయనం చేసి... విజయవాడ సింగ్‌నగర్‌లో ఓ పాఠశాల కేంద్రంగా పక్కా ప్లాన్‌తో ఆయన్ను అంతమొందించడానికి ప్రయత్నం చేశారు. స్కూల్లో నక్కి ఉండి.. ఆయన బస్సుపై నుంచి అభివాదం చేస్తున్నపుడు... కరెంటు లేని సమయాన్ని ఆసరాగా చేసుకుని... బస్సుపై ఫ్లడ్ లైట్ల వెలుగుల్లో ఉన్న జగన్‌ను గురిచూసి పదునైన వస్తువుతో కొట్టారు. జగన్ కణతకు గురిపెట్టి సంధించిన ఆ వస్తువు గనుక ఆయనకు అదే ప్రాంతంలో తగిలి ఉంటే ఏమయ్యేదో అనేది ఊహించడానికే భయంవేసే పరిణామం. అదృష్టవశాత్తూ ప్రజలకు అభివాదం చేస్తూ ఆయన పక్కకు తిరగటంతో... ఆ వస్తువు ఆయన కణతకు బదులు ఆయన ఎడమ కనుబొమపై తగిలింది. లోపలికంటా చర్మం చీలిపోయి బలమైన గాయం అయ్యింది. అంతేకాక... ఆయనకు గాయం చేశాక... అదే వస్తువు ఆయన పక్కనే నిల్చున్న మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ఎడమ కంటికి కూడా తగిలింది. ఆయన కన్ను వాచింది. వైఎస్ జగన్‌కు వస్తువు బలంగా తగలటంతో... ఆయన ఒక్కసారిగా విలవిలలాడుతూ పక్కకు ఒరిగారు. తరవాత తమాయించుకుని నిలబడి గాయాన్ని గట్టిగా చేత్తో అదిమి పట్టుకున్నారు. అలాగే చుట్టూ ఉన్న జనానికి అభివాదం చేస్తూ... సెక్యూరిటీ సిబ్బంది తోడురాగా బస్సులోపలికి వెళ్లారు. కనుబొమ వాచిపోవటంతో... గాయాన్ని శుభ్రం చేసి, రక్తాన్ని తుడిచి బస్సులో ఆయనకు వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. కాసేపు ఆగిన తరవాత వైఎస్ జగన్ యథా ప్రకారం యాత్ర కొనసాగించారు. దాదాపుగా రాత్రి 8.10 సమయంలో ఈ దుర్ఘటన జరగ్గా... కాసేపు ఆగాక యాత్రను రాత్రి 10.39 వరకూ షెడ్యూలు ప్రకారం కొనసాగించాక... నైట్ హాల్టు ప్రాంతమైన కేసరపల్లికి చేరుకున్నారు సీఎం వైఎస్ జగన్. సాక్షి, అమరావతి: మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఒక ఆగంతకుడు హత్యాయత్నానికి తెగబడ్డాడు. యాత్రలో భాగంగా శనివారం రాత్రి 8.10 గంటలకు సీఎం వైఎస్ జగన్ విజయవాడ సింగ్ నగర్ డాబా కొట్ల సెంటర్‌కు చేరుకోగానే హత్యకు ప్రయత్నించాడు. సీఎం జగన్ కణతకు గురిచూసి పదునైన వస్తువుతో దాడి చేశాడు. అయితే ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం జగన్ పక్కకు తిరగడంతో ఆయన ఎడమ కంటి కనుబొమ పై భాగాన బలమైన గాయమైంది. దీంతో సీఎం పక్కకు తూలి.. ఎడమ కంటిని బలంగా అదిమి పట్టుకున్నారు. ఆయన ఎడమ కన్ను పైభాగం వాచిపోయింది. బలమైన గాయం కావడంతో రక్తం కారింది. అయినప్పటికీ బాధను పంటి బిగువన భరిస్తూనే సీఎం వైఎస్ జగన్ ప్రజలకు అభివాదం చేసి.. బస్సుపై నుంచి దిగి లోపలకి వెళ్లారు. డాక్టర్ హరికృష్ణ ఆయనకు ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం సీఎం జగన్ యధావిధిగా బస్సు యాత్రను కొనసాగించారు. కాగా ఆ వస్తువు పదును, వేగాన్ని బట్టి అది రాయి, గ్రానైట్ పలక, పెల్లెట్, ఎయిర్ బుల్లెట్ ఏదైనా కావచ్చని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. సీఎం జగన్ ఎడమ కంటి పై భాగాన గాయమయ్యాక.. ఆ పదునైన వస్తువు మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌కూ తగలడంతో ఆయనకు కూడా గాయమైంది. ముందస్తు కుట్ర, పక్కా ప్రణాళికతోనే.. సీఎం వైఎస్ జగన్ షెడ్యూల్ ప్రకారం శనివారం రాత్రి విజయవాడ చేరుకుంటారని ముందే తెలుసుకున్న ఆగంతకుడు ఇందుకు తగ్గట్టే ముందస్తు కుట్ర, ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బస్సు యాత్ర విజయవాడలోకి శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రవేశించింది. బస్సు యాత్ర సాగే మార్గంలో విద్యుత్ సరఫరాను నిలిపేస్తుండటాన్ని ఆగంతకుడు ఆసరాగా చేసుకున్నాడు. సీఎం జగన్‌ను హత్య చేయాలనే ముందస్తు వ్యూహంలో భాగంగానే సింగ్‌నగర్ డాబా కొట్ల సెంటర్లోని వివేకానంద స్కూల్ రెండో అంతస్తులో ఓ గదిలో నక్కాడు. తాము ఉన్న గది కిటీకి తలుపులను తెరిచే ఉంచాడు. రోడ్ షో అక్కడికి చేరుకోగానే సీఎం జగన్ లక్ష్యంగా హత్యాయత్నానికి పాల్పడ్డాడు. అత్యంత వేగంగా దూసుకొచ్చిన పదునైన వస్తువు సీఎం జగన్ ఎడమ కంటి కనుబొమ పైభాగాన తగలడంతో ఆయనకు తీవ్ర గాయమైంది. ఎడమ కన్ను వాచిపోయింది. ఎడమ కంటి కనుబొమ పైభాగాన బలమైన గాయం నుంచి రక్తం కారిపోతున్నా చలించక సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేసి బస్సుపై నుంచి కిందకు దిగి లోపలకి వెళ్లారు. ఎయిర్ గన్ వినియోగించారా.. సీఎం జగన్‌పై ఎయిర్ గన్ తో హత్యాయత్నం చేసి ఉండొచ్చని అంటున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని సౌండ్ విన్నానని చెబుతుండటంతో సీఎంపై హత్యాయత్నానికి ఎయిర్ గన్నే వినియోగించి ఉండవచ్చని బలంగా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనలో గాయపడ్డ విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు కూడా సీఎం వైపు దూసుకొచ్చిన పదునైన వస్తువు వేగాన్ని బట్టి ఇది హత్యాప్రయత్నమేనన్నారు. చంద్రబాబు నాయుడే ఈ దురాగతానికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. కొందరు క్యాటర్ బాల్‌ను వినియోగించారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో 175కి 175 అసెంబ్లీ స్థానాలు, 25కి 25 పార్లమెంటు స్థానాలు సాధించడమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ నిర్వహించిన సిద్ధం సభలు చరిత్రలో కనీవినీ ఎరుగని స్థాయిలో జరిగాయి. ఈ సభలకు లక్షల సంఖ్యలో ప్రజలు పోటెత్తారు. సిద్ధం సభల తర్వాత మేమంతా సిద్ధం పేరుతో ముఖ్యమంత్రి జగన్ బస్సు యాత్రను నిర్వహిస్తున్నారు. దీనికి సైతం రాష్ట్ర ప్రజలు హారతులు పడుతున్నారు. చిన్నా పెద్ద, యువత, మహిళలు అనే తేడా లేకుండా వెల్లువలా సీఎం జగన్‌కు సంఘీభావం ప్రకటిస్తున్నారు. దీంతో ఈ ఆదరణను తట్టుకోలేక.. ముందస్తు కుట్రలో భాగంగానే ముఖ్యమంత్రిపైన హత్యాయత్నం జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు, లోకేశ్‌ల ప్రోద్బలంతోనే.. కాగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ ప్రోద్బలంతోనే సీఎం వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగిందని వైఎస్సార్సీపీ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే వీరిద్దరూ తమ మాటల ద్వారా, సోషల్ మీడియా పోస్టుల ద్వారా సీఎం వైఎస్ జగన్‌పై తీవ్ర వ్యతిరేకతను వెళ్లగక్కుతున్నారని గుర్తు చేస్తున్నాయి. ఐదేళ్ల పాలనలో సీఎం వైఎస్ జగన్ నవరత్న పథకాలతోపాటు ఇవ్వని హామీలను కూడా నెరవేర్చారు. కులమతాలు, పార్టీలు, ప్రాంతాలకతీతంగా అర్హతలున్న ప్రతి ఒక్కరికీ ఒక్క రూపాయి అవినీతికి ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాలను అందించారు. దీంతో మరోమారు సీఎం వైఎస్ జగన్‌కు అధికారం కట్టబెట్టాలని ప్రజలంతా నిర్ణయించుకున్నారు. దీంతో ఒంటరిగా సీఎం వైఎస్ జగన్‌ను ఎదుర్కోలేమని టీడీపీ.. జనసేన, బీజేపీలతో పొత్తు పెట్టుకుందని వైఎస్సార్సీపీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. జనసేన, బీజేపీలతో పొత్తు పెట్టుకున్నప్పటికీ టీడీపీకి ఆశాజనకమైన పరిస్థితులు కనిపించకపోవడం, కూటమి నేతలతో కలిసి నిర్వహించిన సభలు విఫలం కావడం, మరోవైపు ముఖ్యమంత్రి జగన్ సభలకు ప్రజలు లక్షల సంఖ్యలో పోటెత్తడం తట్టుకోలేకే ఇలా హత్యాయత్నాలకు చంద్రబాబు, లోకేశ్ పురమాయిస్తున్నారని వైఎస్సార్సీపీ శ్రేణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. భయోత్పాతంతో బస్సు యాత్ర ఆపాలనే.. సీఎం జగన్ బస్సు యాత్రకు ప్రజలు హారతులు పడుతున్నారు. లక్షల్లో ప్రజలు ఆయన సభలకు హాజరవుతున్నారు. ఇదే చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్‌ల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. జైత్రయాత్రలా సాగుతున్న బస్సు యాత్రను ఆపడం ద్వారా రాజకీయ ఉనికి చాటుకోవడానికే చంద్రబాబు, లోకే‹Ùలు ఆపార్టీ శ్రేణులను సీఎం జగన్‌పై హత్యాయత్నం చేసేందుకు పురిగొలిపారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. భయోత్పాతం సృష్టించడం ద్వారా సీఎం జగన్ బస్సు యాత్రను ఆపేయడానికే ఈ దారుణం చేయించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చలించని సీఎం... యథాతథంగా యాత్ర కొనసాగింపు తనపై హత్యాయత్నానికి తెగబడినప్పటికీ సీఎం జగన్ ఏమాత్రం వెరవలేదు. వాహనంలోకి వెళ్లి ప్రథమ చికిత్స చేయించుకున్న వెంటనే ఆయన మళ్లీ వాహనం పైభాగానికి చేరుకున్నారు. ప్రజలకు అభివాదం చేస్తూ యాత్రను కొనసాగించారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ మేరకు విజయవాడ సింగ్‌నగర్ డాబా కొట్ల జంక్షన్ నుంచి కృష్ణా హోటల్ సెంటర్, పైపుల రోడ్, ప్రకాశ్ నగర్, పాయకాపురం, కండ్రిగ, రామవరప్పాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు, నిడమానూరు, గూడవల్లి మీదుగా కేసరపల్లి వరకు అంటే 20 కి.మీ. వరకు యాత్రను కొనసాగించారు. శనివారం రాత్రి కేసరపల్లిలో ముందుగా నిర్ణయించిన ప్రదేశంలోనే రాత్రి బస చేశారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స.. సీఎం జగన్‌పై హత్యాయత్నం ఘటన తెలిసిన వెంటనే ఆయన సతీమణి వైఎస్ భారతి కేసరపల్లిలోని రాత్రి బస కేంద్రానికి చేరుకున్నారు. వైద్యుల సూచనల మేరకు చికిత్స కోసం సీఎం జగన్ తన సతీమణి భారతితో కలిసి విజయవాడ ప్రభుత్వాస్పత్రికి వెళ్లారు. ప్లాస్టిక్ సర్జరీ, అనస్తీషియా, ఇతర వైద్యుల బృందం పలు వైద్య పరీక్షలు చేసి సీఎం జగన్‌కు చికిత్స అందించారు. ఎడమ కంటి కనుబొమ పైభాగాన లోతైన గాయానికి కుట్లు వేశారు. అనంతరం గాయం మానేంత వరకూ తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించి, మందులను ప్రిస్రై్కబ్ చేశారు. సీఎం వద్దకు చేరుకున్న నర్సులు, ఇతర సిబ్బంది ‘మీరు జాగ్రత్తగా ఉండండి అన్నా’ అంటూ పలకరించారు. ఈ క్రమంలో వారందరినీ సీఎం జగన్ ఆప్యాయంగా పలకరించారు. ఇక సీఎం జగన్‌తో పాటు దాడిలో గాయపడిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కూడా వైద్యులు చికిత్స చేశారు. సీఎం జగన్‌కు కనుబొమ పైభాగాన లోతైన గాయమైనట్టు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్ వివరించారు. ఆది, సోమవారాల్లో గాయం తగిలిన ప్రాంతంలో వాపు ఉంటే అందుకనుగుణంగా చికిత్స చేయాల్సి ఉంటుందన్నారు. కాగా ఆస్పత్రిలో సీఎం జగన్ వెంట ఎంపీలు కేశినేని నాని, అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కైలే అనిల్‌కుమార్, మొండితోక జగన్మోహన్రావు, ఎమ్మెల్సీలు తలశీల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి, రుహుల్లా, దేవినేని అవినాశ్ ఉన్నారు. కాగా ప్రభుత్వాస్పత్రిలో చికిత్స చేయించుకున్న అనంతరం సీఎం జగన్ రాత్రి బసకు తిరిగి కేసరపల్లికి చేరుకున్నారు. నేడు యాత్రకు విరామం యాత్ర ముగిశాక గాయానికి చికిత్స చేయించుకోవటం కోసం ముఖ్యమంత్రి జగన్ నేరుగా విజయవాడ ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు. అక్కడకు ఆయన సతీమణి వైఎస్ భారతి కూడా చేరుకుని ఆసుపత్రిలో ఆయనకు తోడుగా ఉన్నారు. వైద్యులు గాయాన్ని పరీక్షించాక, వైఎస్ జగన్‌కు లోకల్ అనస్తీషియా ఇచ్చి... కుట్లు వేశారు. కొంత విశ్రాంతి అవసరమని సూచించారు. చికిత్స అనంతరం జగన్ తిరిగి తన నైట్ హాల్టు ప్రాంతానికి వెళ్లారు. ఆదివారం నాడు బస్సు యాత్రకు విరామంగా ప్రకటించారు. తదుపరి షెడ్యూలును ఆదివారం రాత్రి ప్రకటించే అవకాశం ఉంది. అది హత్యాయత్నమే: వెలంపల్లి వైఎస్ జగన్‌కు తగిలిన వస్తువు తనకూ తగలటంతో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ కంటికి గాయమైంది. సంఘటన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఇది ఖచ్చితంగా హత్యాయత్నమేనని, ఆ వస్తువు తాలూకు పదును, వేగం చూస్తే ఇదే అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. సీఎం వైఎస్ జగన్‌కు తగిలాక... పక్కనున్న తనకు అదే వస్తువు తగిలిందని, తనకూ గాయమైందంటేనే దాని వేగాన్ని అర్థం చేసుకోవచ్చునని చెప్పారు. బస్సు యాత్ర మొదలుపెట్టిన దగ్గర్నుంచీ ముఖ్యమంత్రి జగన్‌కు అపూర్వమైన ఆదరణ లభిస్తోందని, దాన్ని తట్టుకోలేక తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడే ఈ దారుణానికి పురమాయించి ఉంటాడని వ్యాఖ్యానించారు. హత్యా రాజకీయాలు చంద్రబాబుకు కొత్త కాదంటూ వంగవీటి రంగా హత్యను ఉదహరించారు. ఎన్ని కూటములు కట్టినా, ఎందరితో కలిసి వచ్చినా జగన్ ముందు తాను నిలవలేకపోతున్నానన్న అక్కసుతోనే బాబు ఈ దారుణానికి ఒడిగట్టాడని చెప్పారాయన. కాగా వైఎస్ జగన్‌కు తగిలిన వస్తువు చాలా పదునైనదని, అదేమిటనేది తేలాల్సి ఉందని పోలీసు అధికారులు వ్యాఖ్యానించారు. ఈ దిశగా తాము అన్ని కోణాల్లోనూ దర్యాప్తు సాగిస్తున్నట్లు చెప్పారు. అది పదునైన రాయి, చెక్కిన గ్రానైట్ పలక, పెల్లెట్, ఎయిర్ బుల్లెట్.. ఏదైనా కావచ్చునని వ్యాఖ్యానించారు. అయితే ఆ వస్తువు వైఎస్ జగన్‌కు తగిలే సమయంలో ‘టప్’ మనే శబ్దాన్ని తాను స్పష్టంగా విన్నానని, అది రాయి కాకపోవచ్చునని విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యానించారు. ఆయన ఆ సమయంలో వైఎస్ జగన్‌కు వెనకనే అడుగు దూరంలో ఉన్నారు. స్కూలు భవనానికి చేరుకున్న పోలీసు బృందాలు పూర్తిస్థాయి దర్యాప్తు మొదలుపెట్టాయి. ఆదివారం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. అన్ని కోణాల్లో దర్యాప్తు సీఎం వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నాం. దాడి జరిగిన ప్రదేశాన్ని, అక్కడ ఉన్న స్కూల్ భవనం, పరిసర ప్రాంతాలను పరిశీలించాం. యాత్ర నిర్వహిస్తున్న సమయంలో కరెంట్ వైర్లు తగులుతాయనే ఉద్దేశంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో చీకటిగా ఉన్న పరిస్థితిని ఆసరాగా చేసుకుని దుండగులు దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది. ఆ ప్రదేశంలో సీసీ టీవీ కెమెరాలను పరిశీలిస్తున్నాం. అనుమానితుల కదలికలపై ఆరా తీస్తున్నాం. ప్రత్యేక బృందాలను నియమించాం. దుండగులను త్వరలోనే గుర్తించి అరెస్ట్ చేస్తాం. –కాంతి రాణా టాటా, విజయవాడ పోలీస్ కమిషనర్ -
సీఎం జగన్‌పై రాయితో దాడి: కంటికి గాయం
విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై రాయితో దాడికి పాల్పడ్డాడు ఓ ఆగంతకుడు. బస్సుయాత్రలో భాగంగా సింగ్‌నగర్‌కు చేరుకున్న క్రమంలో సీఎం జగన్‌పై రాయితో దాడి చేశారు. బస్సుపై నుంచి సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో రాయితో దాడి జరిగింది. అయితే ఆ రాయి అత్యంత వేగంగా సీఎం జగన్ కనుబొమ్మకు తాకింది. సీఎం జగన్‌పై క్యాట్ బాల్‌తో దాడి చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాయి తగలడంతో సీఎం జగన్ ఎడమ కంటికి కనుబొమ్మపై గాయమైంది. సీఎం జగన్ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి ఎడమ కంటికి సైతం గాయమైంది. వెంటనే సీఎం జగన్‌కు బస్సులో ప్రథమ చికిత్స అందించారు వైద్యులు. ప్రథమ చికిత్స తర్వాత మళ్లీ బస్సుయాత్ర కొనసాగించారు సీఎం జగన్. విజయవాడలో సీఎం జగన్ కోసం జనం పోటెత్తారు. విజయవాడ సిటీలో మూడున్నర గంటలుగా సీఎం జగన్ బస్సుయాత్ర అప్రతిహతంగా భారీ రోడ్ షో కొనసాగుతోంది. సీఎం జగన్‌కు వస్తున్న ప్రజాభిమానాన్ని ఓర్వలేక టీడీపీ వర్గాలే దాడికి తెగబడ్డారని విజయవాడ వైఎస్సార్సీపీ నేతలు అంటున్నారు. వైద్యుల సలహామేరకు మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి కేసరపల్లి క్యాంప్‌నుండి సీఎం జగన్ చేరుకున్నారు. అక్కడ వైద్యులు సీఎం జగన్ గాయానికి తదుపరి చికిత్స చేశారు. గాయానికి రెండు కుట్లు పడ్డాయని వైద్యులు తెలిపారు. వైద్యుల చికిత్స అనంతరం సీఎం జగన్ కేసరపల్లి నైట్ హాల్ట్ శిబిరానికి చేరుకున్నారు. సీఎం జగన్‌తో పాటుగా వైఎస్ భారతీ ఉన్నారు. గాయం కారణంగా సీఎం వైయస్ జగన్‌ను విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచించారు. దీంతో నేడు సీఎం జగన్ యాత్రకు విరామం ప్రకటించారు. తదుపరి కార్యక్రమాన్ని ఆదివారం విడుదల చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలిపింది. సీఎం జగన్ పై దాడి ఘటనపై పోలీసు శాఖ సీరియస్ ప్రత్యేక బృందాల ఏర్పాటు, క్యాట్ బాల్ వినియోగించే వ్యక్తులను గుర్తించే పనిలో పోలీసులు. అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీస్ అధికారులు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వస్తున్న ప్రజాధరణను చూసి ఓర్వలేక చంద్రబాబు నాయుడే ఈ దాడి చేయించి ఉంటాడని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై దాడిని ఖండించిన తిరుపతి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు.తిరుపతిలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట చంద్రబాబు నాయుడు,పవన్ కళ్యాణ్,నారా లోకేష్ లకు చెప్పులతో కొట్టి ఫ్లెక్సీని కాల్చి వేసిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నాయుడికి,పవన్ కళ్యాణ్ కి రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.నీచమైన చర్యకు పాల్పడిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. -
కనకదుర్గ వారధిపై సీఎం జగన్ వెంట జన ప్రభంజనం (ఫొటోలు)
-
సీఎం జగన్ ఎన్నికల ప్రచారం
-
సీఎం జగన్ బస్సుయాత్ర: వర్షంలోనూ జననేత కోసం..(ఫొటోలు)
-
‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 15వ రోజు షెడ్యూల్ ఇలా
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర ప్రతి రోజు ఓ జైత్రయాత్రలా కొనసాగుతోంది. అడుగడుగునా సీఎం వైఎస్ జగన్‌కు నీరాజనాలు పలుకుతున్నారు. యాత్రలో జననేతను చూసేందుకు.. మాట కలిపేందుకు.. కరచాలనంచేసేందుకు.. వీలైతే ఫొటో దిగేందుకు స్కూలు పిల్లల నుంచి వృద్ధుల వరకు మండుటెండైనా అర్ధరాత్రయినా పోటీ పడుతుండటం ఊరూరా కనిపిస్తోంది మేమంతా సిద్ధం 15వ రోజు ఆదివారం (ఏప్రిల్ 14) షెడ్యూల్‌ను వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం శనివారం విడుదల చేశారు. బస్సు యాత్రలో భాగంగా సీఎం ఉదయం 9 గంటలకు కేసరపల్లి రాత్రి బస నుంచి బయలుదేరుతారు. గన్నవరం, ఆత్కూర్, తేలప్రోలు బైపాస్, వీరవల్లి క్రాస్ , హనుమాన్ జంక్షన్, పుట్టగుంట మీదగా జొన్నపాడు శివారుకు చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. చదవండి: మేమంతా సిద్ధం: ఎన్టీఆర్ జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర అనంతరం జొన్నపాడు, జనార్దణపురం మీదగా సాయంత్రం 3.30 గంటలకు గుడివాడ శివారు నాగవరప్పాడు వద్దకు చేరుకుని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. తరువాత గుడివాడ, బొమ్ములూరు, గుడ్లవల్లేరు, వేమవరం, పెడన క్రాస్, బల్లిపర్రు, బంటుమల్లి బైపాస్ , పెండుర్రు మీదుగా సంగమూడి రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. -
కనకదుర్గ వారధిపై సీఎం జగన్‌కు అపూర్వ స్వాగతం (ఫొటోలు)
-
అరుదైన ఘట్టం.. కనకదుర్గ వారధిపై సీఎం జగన్ బస్సు యాత్ర
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్రయాత్రలా కొనసాగుతోంది. తాజాగా ఎన్టీఆర్ జిల్లాలోకి సీఎం జగన్ బస్సు యాత్ర ప్రవేశించనుంది. దీనిలో భాగంగా కనకదుర్గ వారధిపై అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. ఎండైనా, వానైనా.. పగలైనా, రాత్రయినా. సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర కోట్లాది ప్రజల హృదయాలను స్పృశిస్తూ జన జాతరను తలపిస్తోంది. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కొనసాగుతున్న పాలనకు అశేష జనవాహిని బ్రహ్మరథం పడుతోంది. సీఎం జగన్‌కు ఘనంగా స్వాగతం పలకడానికి వైఎస్సార్సిపి ఘనంగా సిద్ధమయింది. కనకదుర్గమ్మ వారధి మీదుగా విజయవాడ సిటీలోకి ఎంట్రీ ఇవ్వనున్న సీఎం జగన్ కు స్వాగతం పలికేందుకు వారధి వద్దకు వైఎస్సార్సీపీ క్యాడర్ భారీగా చేరుకుంది. విజయవాడలో జోరుగా వర్షం కురుస్తున్నా.. లెక్కచేయకుండా సీఎం జగన్ కోసం వర్షంలోనూ ఎదురుచూస్తున్నారు వైసీపీ కార్యకర్తలు. మరో వైపు ఇన్నాళ్లు బ్లేజ్‌వాడగా కనిపించిన బెజవాడ.. కాస్తా మేఘావృతమయింది. సీఎం జగన్ బస్సు యాత్ర తీసుకొస్తున్న సంతోషం వర్షం రూపంలో వచ్చిందంటున్నారు స్థానికులు. విజయవాడ నగరంలోని వైఎస్సార్సిపి శ్రేణులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సీఎం జగన్‌కు ఆహ్వానం పలికేందుకు తరలివచ్చారు జనం. రాష్ట్ర చరిత్రలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఒక మైలురాయిగా నిలుస్తుందని కొనియాడారు. వారధి దగ్గర ఇప్పటికే భారీగా జన సందోహం నెలకొంది. సీఎం జగన్‌ను నేరుగా కలుసుకునేందుకు భారీగా జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
సీఎం జగన్‌తో చేనేత కార్మికులు ఏమన్నారంటే?
సాక్షి, గుంటూరు జిల్లా: మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్రయాత్రలా కొనసాగుతోంది. బస్సుయాత్రలో భాగంగా మంగళవారం.. చేనేత కార్మికులతో సీఎం జగన్ ముఖాముఖి అయ్యారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులు తాము పొందిన లబ్ధిని వివరిస్తూ సీఎంతో తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఇళ్ల స్థలాలకు సంబంధించి కోర్టుల్లో కేసులు వేసి మాలాంటి వారికి చంద్రబాబు అన్యాయం చేశారని, జగనన్న మళ్లీ మీరే రావాలి.. మాకు స్థలాలు ఇప్పించి, ఇళ్లు కట్టించి ఇవ్వాలని కోరుకుంటున్నామని.. మీరే మా నమ్మకమన్నారు. సీఎం జగన్ స్పందిస్తూ.. మొత్తం 54 వేల మందికి ఇంటి స్థలాలు ఎవరెవరికైతే ఇవ్వడం జరిగిందో.. చంద్రబాబు ఏదైతే అడ్డుకోవడం జరిగిందో.. వాళ్లందరికీ కూడా చెబుతున్నాను ఏదైనా గానీ సూర్యోదయాన్ని ఎవరూ ఆపలేరు. పేదల జీవితాలు బాగుపడటం కూడా ఎవరూ ఆపలేరు. మళ్లీ రేపొద్దున మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్లందరికీ కూడా అక్కడే అవే ఇంటి స్థలాలు ఇప్పించే కార్యక్రమం జరుగుతుందని స్పష్టం చేశారు. ఏ కష్టం లేకుండా సంతోషంగా ఉన్నా.. నాకు చేయూత వస్తోంది. నా సొంత మగ్గంతో నా సొంతింటిలోనే ఏ కష్టం లేకుండా సంతోషంగా ఉన్నాను. నాకు మగ్గం డబ్బులు కూడా వచ్చాయి -చేనేత మహిళ సీఎం జగన్‌కు ధన్యవాదాలు.. నాకు మగ్గం షెడ్డులో ఇచ్చారు. నేతన్న నేస్తం కూడా వచ్చింది. ఈ అవకాశం ఇచ్చిన జగన్ గారికి ధన్యవాదాలు -గుండు కమల, మంగళగిరి సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం.. యావత్ చేనేత కుటుంబాలు సీఎం జగన్‌కు రుణపడి ఉంటాయి. రేపు జరగబోయే ఎన్నికల మేనిఫెస్టోలో చేనేత అంశాన్ని ఒకటి.. సహకార సంఘాలు, కార్మికులు, పవర్ లూమ్స్ విషయంలో గానీ చాలా గ్యాప్స్ ఉన్నాయి. కాబట్టి దీని మీద ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. చేనేతల పిల్లలు ఈరోజు టోఫెల్ అంటే.. 4 లక్షల మంది జగన్ లు తయారవుతారు రాబోయే 10 ఏళ్లలో. అంటే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఈ ప్రజానీకానికి తెలిస్తే 2030 వరకు ఉన్న విజన్ ను గుర్తించాలి. చేనేత బ్యాంక్ ను ఏర్పాటు చేసి యువతకు అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నాను -పి.శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా చేనేత విభాగ అధ్యక్షుడు నేతన్న నేస్తం వస్తోంది.. నాకు రాజీవ్ గృహకల్పలో ఇళ్లు వచ్చింది నాన్నగారి టైమ్ లో. 2009 నుంచి అక్కడే ఉంటున్నాం ఆ చిన్న ఇంట్లోనే మగ్గం పెట్టుకుని. నేతన్న నేస్తం వస్తోంది, పింఛన్ కూడా వస్తోంది బాగానే ఉంది మాకు.. కవుతరపు రాఘవమ్మ, చేనేత మహిళ. మన జగనన్న చెప్పింది చెప్పినట్టుగా.. నమస్తే జగనన్న మిమ్మల్ని ఇంత దగ్గరగా చూడటం చాలా ఆనందంగా ఉంది. మీరు చేకూరుస్తున్న పథకాలన్నీ కూడా చాలా బాగున్నాయి. వృద్ధులకు ఉదయాన్నే ఇంటివద్దనే పిలిచి పెన్షన్లు ఇవ్వడం చాలా బాగుంది. ఈ సచివాలయ వ్యవస్థ లేనప్పుడు మాకు ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక ఎక్కడికి వెళ్లాలి? ఏంటి? అని గంటల తరబడి క్యూలో నిల్చున్న తర్వాత కూడా సరైన సమాధానం వచ్చేది కాదు. కానీ ఈరోజు వాలంటీర్లు ఇంటికే వచ్చి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇంటివద్దకే వచ్చి సమస్యలను తెలుసుకుని తీర్చే ఈ వాలంటీర్ల వ్యవస్థ మాకు నచ్చింది. చాలామంది చదువుకోవడానికి అమ్మఒడి, విద్యాదీవెన ఇవన్నీ కూడా ఉపయోగపడుతున్నాయి. దీనివల్ల కూలీనాలీ చేసుకునే ప్రతిఒక్కరు కూడా తమ పిల్లలను చదివించుకోగలుగుతున్నారు. ప్రతి మనిషికి కూడా ముఖ్యమైనది ఆరోగ్యం. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.25 లక్షలు ఇవ్వడం వల్ల చాలామంది కూడా చూపించుకోగలుగుతున్నారు. ఆరోగ్యపరంగా చాలా మేలు కలుగుతోంది. మన జగనన్న చెప్పింది చెప్పినట్టుగా చేసిన ఏకైక సీఎం. ఆయన చెప్పిన నవరత్నాలన్నీ కూడా అమలు పరిచిన సీఎం కాబట్టి మళ్లీ జగనన్నే రావాలి, మనమందరం కూడా జగనన్నకే ఓటు వేయాలి. చంద్రబాబు డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పాడు గానీ చేసింది లేదు. జగనన్న వచ్చిన తర్వాత డ్వాక్రా రుణమాఫీ డబ్బులు మా అకౌంట్లో పడుతున్నాయి. మా పిల్లలకు అమ్మఒడి వస్తోంది. ప్రతి ఒక్క ఫ్యామిలీలో మాకు ఈ పథకం రాలేదు అన్నవాళ్లు ఎవరూ లేరు. రాలేదు అని చెబుతున్నారంటే వాళ్లు కావాలని చెబుతున్నట్టే. కులమతాలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతిఒక్కరికీ పథకాలు వచ్చాయి. -విజయలక్ష్మి, మంగళగిరి.. అదే జగనన్న నినాదం.. అదే జగనన్న విధానం.. ప్రాణదాత, విద్యాదాత రాజశేఖర్ రెడ్డి గారైతే మరో విద్యాదాత మా జగనన్న. చేనేత వ్యవస్థను సర్వనాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. రూ.81 కోట్ల గ్రాంట్ కూడా వస్తే ట్రెజరీలో ఉంటే ఆ డబ్బులను చేనేతలకు ఇవ్వకుండా వేరే వ్యవస్థలకు మళ్లించిన వ్యక్తి చంద్రబాబు. తమరు వచ్చిన తర్వాత దేశంలోనే చేనేతలకు ప్రప్రథమంగా రూ.24 వేలను నేతన్న నేస్తంగా ప్రకటించారు. రూ.3 వేల పెన్షన్ లెక్క ఇస్తూ సుమారు రూ.1000 కోట్లను చేనేత కార్మికులకు ఇస్తున్నారు. ఆప్కోకు కూడా రూ.108 కోట్ల బకాయిలను చెల్లించి చేనేత కార్మికుల జీవితాలు బాగు చేశారు. ఒక వ్యక్తి ప్రాణాలు తీశాడు, ఒక వ్యక్తి ప్రాణాలు పోశాడు అదే జగనన్న నినాదం.. అదే జగనన్న విధానం.. -శ్రీనివాసరావు, మంగళగిరి జగనన్న మళ్లీ మీరే రావాలి నాకు ఇద్దరు ఆడపిల్లలకు జగనన్న. పిల్లలకు అమ్మఒడి, విద్యాదీవెన వస్తోంది. నాకు ఒంటరి మహిళ పెన్షన్ వస్తోంది. డ్వాక్రా రుణమాఫీ కూడా అయ్యింది. జగనన్న ప్రభుత్వంలో పేదవాళ్లకు ఇంటి స్థలం వస్తోందని వాలంటీర్లు ఇంటికి వచ్చి చెప్పి మరీ నాకు ఇంటి స్థలం ఇప్పించారు. కానీ ఇళ్ల స్థలాలకు సంబంధించి కోర్టుల్లో కేసులు వేసి మాలాంటి వారికి అన్యాయం చేశారు. చంద్రబాబు ఇలా చేయడం కరెక్ట్ కాదు. జగనన్న మళ్లీ మీరే రావాలి, మాకు స్థలాలు ఇప్పించి, ఇళ్లు కట్టించి ఇవ్వాలని కోరుకుంటున్నాను మీరే మా నమ్మకం -హేమలత, మంగళగిరి సూర్యోదయాన్ని ఎవరూ ఆపలేరు: సీఎం జగన్ మొత్తం 54 వేల మందికి ఇంటి స్థలాలు ఎవరెవరికైతే ఇవ్వడం జరిగిందో.. చంద్రబాబు ఏదైతే అడ్డుకోవడం జరిగిందో.. వాళ్లందరికీ కూడా చెబుతున్నాను ఏదైనా గానీ సూర్యోదయాన్ని ఎవరూ ఆపలేరు. పేదల జీవితాలు బాగుపడటం కూడా ఎవరూ ఆపలేరు. మళ్లీ రేపొద్దున మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్లందరికీ కూడా అక్కడే అవే ఇంటి స్థలాలు ఇప్పించే కార్యక్రమం జరుగుతుంది. ఒకవేళ పొరపాటున మీ బిడ్డ చేయలేకపోతే ఒక ఆర్నెళ్లు చూస్తాడు, దాని తర్వాత అవసరమైతే మళ్లీ కొత్త స్థలాలు కొని ఇచ్చైనాసరే వీళ్లందరికీ కూడా అక్కడే ఇచ్చే కార్యక్రమం చేస్తాను కచ్చితంగా చేస్తామని చెబుతున్నాను. మనమందరం ఆలోచించుకోవాలి.. నేను యూట్యూబ్‌లో చూశాను. లోకేష్ మా గవర్నమెంట్ వస్తే మేం చెప్పినవాళ్లకే పథకాలు, ఇళ్లు, రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు ఇస్తామని చెప్పడం నేను విన్నాను. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అనే సీఎం కావాలా? ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటాడా అనే సీఎం కావాలా? అని మనమందరం ఆలోచించుకోవాలి. -మేరీ పాల్ పద్మావతి దేవి, హరిజన క్రైస్తవ, వెనుకబడిన తరగతుల సేవాసంఘం అధ్యక్షురాలు ఇదీ చదవండి: బాబు బ్యాచ్ ఇళ్ల పట్టాలు ఆపారు.. ఓట్లకు వస్తే నిలదీయండి: సీఎం జగన్ -
బైక్ ర్యాలీతో సీఎం జగన్ కు ఘన స్వాగతం...
-
14వ రోజు కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర
-
Watch Live: మంగళగిరిలో సీఎం జగన్ ముఖాముఖి
-
14వ రోజు సీఎం జగన్ బస్సు యాత్ర షెడ్యూల్
-
ఏటుకూరులో మేమంతా సిద్ధం.. వెల్లువలా జన ప్రభంజనం (ఫొటోలు)
-
‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 14వ రోజు షెడ్యూల్
గుంటూరు: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. అటు ఎండను, ఇటు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా సీఎం జగన్ బస్సుయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈరోజు(శుక్రవారం) ధూళిపాళ్ల నుంచి బయల్దేరి ఏటుకూరు వరకూ దిగ్విజయంగా కొనసాగింది. ఒకవైపు భారీ వర్షం పడినా సీఎం జగన్ బస్సుయాత్రకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరై తమ సంఘీభావం తెలిపారు. మేమంతా సిద్ధం’ 14వ రోజు శనివారం(ఏప్రిల్ 13) షెడ్యూల్ ఈ యాత్రలో భాగంగా సీఎం జగన్ రేపటి(శనివారం)బస్సుయాత్రను నంబూరు బైపాస్(రాత్రి బస చేసిన చోటు) నుంచి ప్రారంభిస్తారు. కాజా, మంగళగిరి బైపాస్ మీదగా 11గంటలకు సీకే కన్వెన్షన్ వద్దకు చేరుకుని చేనేత కార్మికులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కుంచనపల్లి బైపాస్ మీదగా తాడేపల్లి బైపాస్కు చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం వారధి, శిఖామణి సెంటర్, చుట్టుగుంట, భగత్ సింగ్ రోడ్ , పైపుల రోడ్, కండ్రిక, రామవరప్పాడు, నిడమానూరు బైపాస్ మీదుగా కేసరపల్లి బైపాస్ శివారులో రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. ఈ మేరకు 14వ రోజు బస్సుయాత్ర షెడ్యూల్‌ను వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం శుక్రవారం విడుదల చేశారు. -
క్షణం తీరిక లేకుండా జనంతోనే మమేకమైన సీఎం జగన్
సాక్షి, గుంటూరు: మేమంతా సిద్ధం బస్సు యాత్ర 13వ రోజులో భాగంగా శుక్రవారం గుంటూరులో సీఎం జగన్మోహన్రెడ్డి పర్యటన ఆద్యంతం జన ప్రవాహాన్ని తలపించింది. బస్సు యాత్రకు పోటెత్తిన ప్రజలు.. అడుగడుగునా సీఎం జగన్‌కు అపూర్వ స్వాగతం పలికారు. ఉదయం ధూళిపాళ్ళ నుంచి ఏటుకూరు సభ వరకు అభిమానం ఉప్పొగింది. యాత్ర మొత్తం క్షణం తీరిక లేకుండా జనంతోనే సీఎం జగన్ మమేకమయ్యారు. తొమ్మిది గంటలపాటు రోడ్ షో ఏకధాటిగా సాగింది. గ్రామాల సరిహద్దులను చెరిపేస్తూ అడుగడుగునా జన నీరాజనమే కనిపించింది. తీవ్రమైన ఎండ, ఈదురు గాలులు, భారీ వర్షం.. అన్నింటినీ తట్టుకుంటూ జగన్ కోసమే జనం నిలబడ్డారు. చేతిలో జెండా, గుండెల్లో అభిమానంతో రోడ్డు పొడవునా నిల్చున్నారు. తన కోసం వచ్చిన అశేష జనవాహినికి అభివాదం చేస్తూ సీఎం ముందుకు కదిలారు. మధ్యలో లంచ్ బ్రేక్‌కు కూడా ఆగలేదు. తనకోసం వేచి ఉన్న జనం కోసం యాత్రను కొనసాగించారు సీఎం. మధ్యలో ఆయా వర్గాల ప్రజలను కలుస్తూ.. అనారోగ్య పండితులకు అండగా నిలుస్తూ బస్సుయాత్ర సాగింది. పల్నాడు, గుంటూరు జిల్లాలో ఇంతటి జన సునామీని ఎప్పుడూ చూడలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం దయం 9 గంటలకు ధూళిపాళ్ల నుంచి సీఎం యాత్ర ప్రారంభమైంది. సత్తెనపల్లి, కొర్రపాడు, మేడికొండూరు, పేరేచెర్ల జంక్షన్, నల్లపాడు మీదుగా హౌసింగ్ బోర్డు వద్దకు చేరుకుంది. అనంతరం చుట్టుగుంట సర్కిల్, వీఐపీ రోడ్డు మీదుగా గుంటూరులోని ఏటుకూరు బైపాస్ సభ ప్రాంగణానికి చేరుకుని బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగించారు. సభ అనంతరం తక్కెళ్లపాడు బైపాస్, పెదకాకాని బైపాస్, వెంగళ్రావు నగర్, నంబూరు క్రాస్ మీదుగా ప్రయాణించి నంబూరు బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం చేరుకున్నారు. -
జగన్‌కు ఓటు వేయడమంటే మంచిని కొనసాగించడమే: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: గతంలో ఏ ప్రభుత్వం చేయనంత అభివృద్ధి వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిందన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు నేరుగా ప్రజల అకౌంట్లలో వేశామని తెలిపారు. లంచాలు, వివక్ష లేకుండా సంక్షేమం అందించామని పేర్కొన్నారు. 130 సార్లు బటన్ నొక్కి.. నేరుగా పేదల ఖాతాల్లో డబ్బు జమ చేశామన్నారు. ప్రజలు రెండుసార్లు బటన్ నొక్కి వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీని గెలిపించాలని కోరారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 13వ రోజు గుంటూరు జిల్లాలో సాగుతోంది. ఏటుకూరు బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగా సీఎం వైఎస్ జగన్ ప్రసంగించారు. గుంటూరులో మరో ప్రపంచం కనిపిస్తుందన్నారు. ఈ మహజన సముద్రం చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందని తెలిపారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంధంగా భావిస్తూ.. 99 శాతం హామీలు అమలు చేశామని చెప్పారు. 58 నెలలుగా చేస్తున్న అభివృద్ధిని కొనసాగించేలా ప్రజలు ఆశీర్వదించాలని అన్నారు. ప్రజల ఆత్మగౌరవాన్ని పెంచిన వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని కోరారు వచ్చే ఎన్నికలు చంద్రబాబు మోసాలకు, ప్రజలకు జరుగుతున్న కురుక్షేత్ర యుద్ధం అని పేర్కొన్నారు. జరుగుతున్న మంచిని కొనసాగించేందుకు మీరంతా సిద్ధమేనా అంటూ సభకు హాజరైన ప్రజలను ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. సీఎం జగన్ ఇంకా మాట్లాడుతూ.. చంద్రబాబు, దత్తపుత్రుడు, వదినమ్మ.. అందరూ అబద్ధాలు బుర్రకథలుగా చెబుతున్నారు. ఇదే కూటమి.. 2014లో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు రంగు రంగుల మేనిఫెస్టీ ఇంటింటికి పంచి.. హామీలు తుంగలో తొక్కింది కూటమి చంద్రబాబుకు ఓటేస్తే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయి. చంద్రబాబుకు ఓటేస్తే సంక్షేమం ఆగిపోవాలని మీరు నిర్ణయం తీసుకున్నట్లే. అదే ముగ్గురు మళ్లీ వస్తున్నారు.. ప్రజలు జాగ్రత్త సింగపూర్‌ను మించి అభివృద్ధి చేస్తామని బాబు చెప్పారు.. కానీ జరిగిందా? ప్రతి గ్రామానికి ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అన్నారు.. కానీ ఏర్పాటు చేశారా? ఇంటింటికీ ఉద్యోగం, నిరుద్యోగ భూతి అన్నారు..కానీ చేశారా? ప్రతీ జిల్లాలో హెటెక్ సిటీ కడతానన్నారు.. కానీ కట్టారా? రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా? పొదుపు సంఘాల రుణాలురద్దు చేస్తానన్నాడు.. చేశాడా? ఆడబిడ్డ పుడితే రూ. 25 వేలు డిపాజిట్ చేస్తానన్నాడు.. చేశాడా? అర్హులకు మూడు సెంట్ల స్థలం ఇస్తానన్నాడు. ఇచ్చాడా? 10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ అన్నాడు.. చేశాడా? మళ్లీ అదే ముగ్గురు..కొత్త హామీలతో వస్తున్నారు. సూపర్ సిక్స్, సెవెన్ అంటున్నారు నమ్మొద్దు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. మీరు నా స్టార్ క్యాంపెయినర్లు ఇంటింటికి వెళ్లి బాబు మోసాలను వివరించండి పథకాలన్నీ కొనసాగాలంటే జగనన్న రావాలని చెప్పండి వాలంటీర్లు మళ్లీ మీ ఇంటికి రావాలంటే జగనన్న రావాలి జగన్‌కు ఓటు వేయడమంటే మంచిని కొనసాగించడమే -
భారీ వర్షంలోనూ సీఎం జగన్ వెంట జనకెరటం(ఫొటోలు)
-
సీఎం జగన్ బస్సుయాత్ర: కదిలిన జనసంద్రం (ఫొటోలు)
-
గుంటూరులో సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రకు ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
-
కర్నూలు జిల్లాలో టీడీపీ కూటమికి భారీ షాక్
సాక్షి, పల్నాడు జిల్లా: మాటపై నిలబడే నాయకుని నాయకత్వంలో పని చేయడానికి వైఎస్సార్సీపీలో చేరేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపుతున్నారు. కార్యకర్తల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని సీఎం పార్టీలో చేర్చుకుంటున్నారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లాలో టీడీపీ కూటమికి భారీ షాక్ తగిలింది. టీడీపీ, బీజేపీని వదిలి ఆ పార్టీల కీలక నేతలు వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. పల్నాడు జిల్లా ధూళిపాళ్ల నైట్ స్టే పాయింట్ వద్ద ఆలూరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ మసాల పద్మజ, కోడుమూరు మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్‌రెడ్డి. తెలుగుదేశం పార్టీ కీలక నేత కోట్ల హరిచక్రపాణిరెడ్డి, బీజేపీకి చెందిన మాజీ మేయర్, ఆలూరు నియోజకవర్గ నేత కురువ శశికళ, ఆంధ్రప్రదేశ్ కురవ సంఘం గౌరవ అధ్యక్షుడు కృష్ణమోహన్, తదితరులు వైఎస్సార్సీపీలోకి చేరారు. అందరికీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సీఎం జగన్ ఆహ్వానించారు. -
13వ రోజు ‘మేమంతా సిద్ధం’: జననేతకు అడుగడుగునా బ్రహ్మరథం
Memantha Sidham Day 13 Highlights CM Jagan Bus Yatra Details కర్నూలు జిల్లాలో టీడీపీ కూటమికి భారీ షాక్ టీడీపీ, బీజేపీని వదిలి వైసీపిలో చేరిన కీలకమైన నేతలు తెలుగుదేశం, బీజేపీల నుంచి సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన కీలక నేతలు పల్నాడు జిల్లా ధూళిపాళ్ల నైట్ స్టే పాయింట్ వద్ద ఆలూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో తెలుగుదేశం, బీజేపీ నుంచి వైయస్సార్సీపీలో చేరిన వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి ఆలూరు నియోజకవర్గం టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి చేరిన మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ మసాల పద్మజ కోడుమూరు నియోజకవర్గం టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి చేరిన మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్‌రెడ్డి కోడుమూరు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీలోకి చేరిన తెలుగుదేశం పార్టీ కీలక నేత కోట్ల హరిచక్రపాణిరెడ్డి బీజేపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మేయర్, ఆలూరు నియోజకవర్గ నేత కురువ శశికళ, ఆంధ్రప్రదేశ్ కురవ సంఘం గౌరవ అధ్యక్షుడు కృష్ణమోహన్ ధూళిపాళ్ల నుంచి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు విశేష స్పందన బస్సు యాత్రకు ఉప్పొంగుతున్న అభిమానం నేడు 13వ రోజు గుంటూరు జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ఉప్పొంగుతున్న అభిమానం సంక్షేమ పాలన అందించిన జననేతకు అడుగడుగునా బ్రహ్మరథం కాసేపట్లో మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభం ఉదయం 9 గంటలకు ధూళిపాళ్ల నుంచి సీఎం యాత్ర ప్రారంభం సత్తెనపల్లి, కొర్రపాడు, మేడికొండూరు, పేరేచెర్ల జంక్షన్, నల్లపాడు మీదుగా హౌసింగ్ బోర్డు వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం చుట్టుగుంట సర్కిల్, వీఐపీ రోడ్డు మీదుగా సాయంత్రం 3.30 గంటలకు గుంటూరులోని ఏటుకూరు బైపాస్ సభ ప్రాంగణానికి చేరుకుని బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగిస్తారు. సభ అనంతరం తక్కెళ్లపాడు బైపాస్, పెదకాకాని బైపాస్, వెంగళ్రావు నగర్, నంబూరు క్రాస్ మీదుగా ప్రయాణించి నంబూరు బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం చేరుకుంటారు. Day-13 గుంటూరు జిల్లా సిద్ధమా..?#MemanthaSiddham — YS Jagan Mohan Reddy (@ysjagan) April 12, 2024 ప్రభం‘జనం’..మేమంతా సిద్ధం సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు విశేష స్పందన టీడీపీ–జనసేన–బీజేపీ నేతల వెన్నులో వణుకు రాష్ట్రం రూపురేఖలు మార్చిన సీఎం వైఎస్ జగన్‌కు బస్సు యాత్రకు జనం అడుగడుగునా బ్రహ్మరథం నిజాయితీతో, నిబద్ధతతో సుపరిపాలన అందించే నాయకుడిని ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారనడానికి నిలువెత్తు నిదర్శనం ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర -
నేడు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇలా..
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 13వ రోజైన శుక్రవారం(ఏప్రిల్ 12) షెడ్యూల్‌ను వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం గురువారం విడుదల చేశారు. ఈ యాత్రలో భాగంగా సీఎం జగన్ బుధవారం రాత్రి బస చేసిన ధూళిపాళ్ల ప్రాంతం దగ్గర నుంచి శుక్రవారం ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు. సత్తెనపల్లి, కొర్రపాడు, మేడికొండూరు, పేరేచెర్ల జంక్షన్, నల్లపాడు మీదుగా హౌసింగ్ బోర్డు వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం చుట్టుగుంట సర్కిల్, వీఐపీ రోడ్డు మీదుగా సాయంత్రం 3.30 గంటలకు గుంటూరులోని ఏటుకూరు బైపాస్ సభ ప్రాంగణానికి చేరుకుని బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగిస్తారు. సభ అనంతరం తక్కెళ్లపాడు బైపాస్, పెదకాకాని బైపాస్, వెంగళ్రావు నగర్, నంబూరు క్రాస్ మీదుగా ప్రయాణించి నంబూరు బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం చేరుకుంటారు. -
ప్రభం‘జనం’..మేమంతా సిద్ధం
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘మేమంతా సిద్ధం’ పేరుతో రాష్ట్రంలో నిర్వహిస్తున్న బస్సు యాత్రకు వస్తున్న ప్రజా స్పందన టీడీపీ–జనసేన–బీజేపీ నేతల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఇచ్చిన మాటకు కట్టుబడి.. నిజాయితీతో, నిబద్ధతతో సుపరిపాలన అందించే నాయకుడిని ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారనడానికి నిలువెత్తు నిదర్శనం ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేసి, పేదంటి భవిష్యత్తును గొప్పగా తీర్చిదిద్దుతూ.. రాష్ట్రం రూపురేఖలు మార్చిన సీఎం వైఎస్ జగన్‌కు బస్సు యాత్రలో జనం అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. మండుటెండైనా అర్ధరాత్రయినా ఊరూరా అభిమాన సంద్రం ఉప్పొంగుతోంది. వైఎస్సార్సీపీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి భీమిలి, దెందులూరు, రాప్తాడు, మేదరమెట్లలో సీఎం వైఎస్ జగన్ నిర్వహించిన సిద్ధం సభలకు జనం పోటెత్తారు. రాప్తాడు, మేదరమెట్ల సభలు ఉమ్మడి రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల చరిత్రలో అతి పెద్ద ప్రజా సభలుగా నిలిచాయి. సిద్ధం సభలను మరిపించేలా బస్సు యాత్రకు జనం అడుగడుగునా బ్రహ్మరథం పడుతుండటంతో సార్వత్రిక ఎన్నికలకు ముందే వైఎస్సార్సీపీ ప్రభంజనం కన్పిస్తోందని ఇటు రాజకీయ పరిశీలకులు, అటు కూటమి నేతలు గుర్తించారు. మాటపై నిలబడే నాయకుని నాయకత్వంపై పని చేసేందుకు కూటమి నేతలు పోటీపోటీగా వైఎస్సార్సీపీలోకి చేరేందుకు క్యూ కడుతున్నారు. జన బలమే గీటురాయిగా చేరికలు ► టీడీపీ, జనసేన, బీజేపీల నుంచి వైఎస్సార్సీపీలోకి చేరేందుకు పోటీ పడుతున్న నాయకుల్లో.. జనబలమే గీటురాయిగా.. సచీ్ఛలత, నిజాయితీ, నిబద్ధత ఆధారంగా.. కార్యకర్తల మనోభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని సీఎం వైఎస్ జగన్ చేర్చుకుంటున్నారు. ► టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వంచన వైఖరితో విభేదించిన ఆ పార్టీ రాయచోటి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే ఆర్.రమేష్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, 2019లో కావలి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కాటంరెడ్డి విష్ణువర్దన్‌రెడ్డి, కళ్యాణదుర్గం నుంచి 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఉమామహేశ్వర నాయుడు, పలమనేరు మాజీ ఎమ్మెల్యే లలితకుమారి, చిత్తూరు జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు రావూరి ఈశ్వరరావు, చిత్తూరు మాజీ మేయర్ సరళ మేరీ, 2019 ఎన్నికల్లో గంగాధర నెల్లూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎ.హరికృష్ణ, మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాష తదితరులు తమ అనుచరులతో కలిసి బస్సు యాత్రలో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ► జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నాయకత్వంతో విభేదించిన ఆ పార్టీ విజయవాడ (పశ్చిమ) సమన్వయకర్త పోతిన మహేష్, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి (2019 ఎన్నికల్లో పి.గన్నవరం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు), అమలాపురం సమన్వయకర్త శెట్టిబత్తుల రాజాబాబు, ముమ్మడివరం సమన్వయకర్త పితాని బాలకృష్ణ తదితరులు తమ అనుచరులతో కలిసి బస్సు యాత్రలో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ► అఖిల భారత యాదవ సంఘం, రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు లాకా వెంగళరావు యాదవ్, బీజేపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి సహా పలువురు ప్రజా సంఘాల నేతలు తమ అనుచరులతో కలిసి సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. తలుపులు బార్లా తెరిస్తే కూటమి ఖాళీ తమ పార్టీలను వీడి ప్రజాబలం ఉన్న నేతలు వైఎస్సార్సీపీలో చేరుతుండటం కూటమి నేతల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఎలాంటి ప్రామాణికాలు పాటించకుండా సీఎం వైఎస్ జగన్ వైఎస్సార్సీపీ తలుపులు బార్లా తెరిస్తే.. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ఖాళీ కావడం ఖాయమని రాజకీయ పరిశీలకులు చేస్తున్న విశ్లేషణ ఆయా పార్టీల అభ్యర్థుల్లో నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీస్తోంది. ఓ వైపు బస్సు యాత్రతో సీఎం వైఎస్ జగన్ సృష్టిస్తున్న ప్రభంజనం.. మరో వైపు తమ పార్టీల నుంచి వైఎస్సార్సీపీలోకి నేతలు క్యూ కడుతుండటంతో సార్వత్రిక ఎన్నికలకు ముందే టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు కాడి పారేస్తున్నారు. -
‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. రేపటి షెడ్యూల్ ఇలా..
సాక్షి, పల్నాడు జిల్లా: జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మండుటెండను లెక్క చేయకుండా అభిమాన నేత చూసేందుకు రోడ్లపైకి వస్తూ గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. తమ నేతను చూసి, అయ్యా నువ్వే మళ్లీ సీఎం కావాలయ్యా అంటూ దీవెనలు అందిస్తున్నారు. బుధవారం 12వ రోజు.. పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం గంటావారిపాలెం నుంచి బయలుదేరి బస్సు యాత్ర పిడుగురాళ్ల వరకు అక్కడ నుంచి ధూళిపాళ్ల వరకు దిగ్విజయంగా కొనసాగింది. మేమంతా సిద్ధం’ 13వ రోజు శుక్రవారం (ఏప్రిల్ 12) షెడ్యూల్ ‘మేమంతా సిద్ధం’ 13వ రోజు శుక్రవారం (ఏప్రిల్ 12) షెడ్యూల్‌ను వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం గురువారం విడుదల చేశారు. ఈ యాత్రలో భాగంగా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉదయం 9 గంటలకు ధూళిపాళ్ల రాత్రి బస నుంచి బయలుదేరుతారు. సత్తెనపల్లి, కోర్రపాడు, మేడికొండూరు, పేరేచెర్ల జంక్షన్, నల్లపాడు మీదుగా హౌసింగ్ బోర్డు వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం చుట్టుగుంట సర్కిల్, వీఐపీ రోడ్ మీదుగా సాయంత్రం 3.30 గంటలకు ఏటుకూరు బైపాస్ సభ ప్రాంగణంకు చేరుకుని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం తక్కెలపాడు బైపాస్, పెదకాకాని బైపాస్, వెంగళ్ రావు నగర్, నంబూరు క్రాస్ మీదుగా నంబూరు బైపాస్ దగ్గర రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. -
"అందరూ ఆలోచించాలి..కుటుంబ సభ్యులతో చర్చించాలి"..సీఎం జగన్ హెచ్చరిక
-
ఇదీ మా ప్రోగ్రెస్ రిపోర్ట్: సీఎం వైఎస్ జగన్
ఊసరవెల్లి ఎన్నిసార్లు రంగు మారుస్తుందో నాకు తెలియదు గానీ, చంద్రబాబు మాత్రం ఊసరవెల్లిని దాటిపోయాడు. నీ మోసాలు అందరికీ తెలిసినవే. మొట్ట మొదటిగా ఈ వలంటీర్లను పీకేస్తావు. మళ్లీ నీ జన్మభూమి కమిటీ సభ్యులందర్నీ వలంటీర్లుగా తెచ్చుకుంటావు. వాళ్లు దోచుకునే దాని కోసం రూ.10 వేలు అదనంగా వాళ్లకు ఇస్తావు. ఇదీ నువ్వు చేయబోయే మోసపూరిత రాజకీయం అనేది చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు. చంద్రబాబు బతుకంతా అబద్ధాలే పునాదులు, మోసాలే. వెన్నుపోట్లే చరిత్ర. సినిమాల్లో విలన్ క్యారెక్టర్ చూస్తే అది చంద్రబాబు క్యారెక్టర్ కిందనే గుర్తుకొస్తుంది. సిద్ధం.. సిద్ధం.. అంటూ మీ నినాదాలు మన జైత్ర యాత్రకు శంఖారావంలా వినిపిస్తుంటే.. అధికారంలో ఉన్నప్పుడు ఏ పేదకు ఏ మంచి చేయని పెత్తందార్ల గుండెల్లో యుద్ధం.. యుద్ధం అని ప్రతిధ్వనిస్తోంది. వారి గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. పేద వాడి భవిష్యత్తును, ఇంటింటి అభివృద్ధిని వెలుగు నుంచి చీకటికి తీసుకుపోదామని ఆ జిత్తుల మారి మోసాల పార్టీలు చేస్తున్న కుట్రలు, కుతంత్రాలను మనమంతా ఒక్కటై తిప్పికొడదాం. జగన్‌కు ఓటు వేస్తే ఇప్పుడు జరుగుతున్న మంచి కొనసాగుతుంది. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ఆగిపోతాయి. ప్రజలందరూ మోసపోతారన్నది చరిత్ర చెబుతున్న సత్యం. చంద్రబాబు గుణగణాలు ఎలా ఉంటాయంటే.. ఎన్నికలకు ముందు గంగ. అధికారం దక్కిన తర్వాత లక లకా.. అంటూ పేదల రక్తం తాగే చంద్రముఖి. మే 13వ తేదీన జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేవి మాత్రమే కావు. గత 58 నెలలుగా మీ పిల్లల చదువులు, వారి భవిష్యత్, అక్కచెల్లెమ్మల సాధికారత, అవ్వాతాతల సంక్షేమం, రైతులకు అందుతున్న భరోసా, పేద సామాజిక వర్గాలకు అందిన న్యాయం.. ఇవన్నీ కూడా కొనసాగి మరో రెండు అడుగులు ముందుకు వేయాలా.. లేక మోసపోయి అంధకారంలోకి వెళ్లాలా అన్నది నిర్ణయించే ఎన్నికలని కూడా గుర్తుంచుకోవాలి. దీనిపై మీ కుటుంబ సభ్యులందరితో కలిసి కూర్చొని చర్చించాలి. మనం వేసే ఓటుతో మన తలరాతలు మారతాయని ప్రతి ఒక్కరూ జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇవి జగన్‌కు, చంద్రబాబుకు మధ్య జరుగుతున్న ఎన్నికలు కావు. పేదలకు, చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు. ఈ ఎన్నికల్లో మీ బిడ్డ జగన్‌ది పేదల పక్షం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఉద్యోగాలివ్వడంలో.. రైతులు, మహిళల అభ్యున్నతికి కృషి చేయడంలో, అన్ని వర్గాల ప్రజలకు మేలు చేయడంలో చంద్రబాబు ఇస్తున్నది బోగస్ రిపోర్టు అయితే, వైఎస్ జగన్ ఇస్తున్నది కళ్లెదుటే కనిపిస్తున్న ప్రోగ్రెస్ రిపోర్టు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. మనందరి ప్రభుత్వ హయాంలో 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా స్వయం ఉపాధి రంగాన్ని ప్రోత్సహించామని చెప్పారు. మొట్ట మొదటిసారిగా ఎంఎస్ఎంఈలకు చేయూతనిచ్చింది మీ బిడ్డ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. వాహన మిత్ర, నేతన్న నేస్తం, జగనన్న తోడు, జగనన్న చేదోడు, మత్స్యకార భరోసా, చేయూత, ఆసరా, సున్నా వడ్డీ.. ఇలా అన్ని విధాలా ప్రోత్సహించబట్టే స్వయం ఉపాధి రంగం ఈరోజు తన కాళ్ల మీద తాను నిలబడగలుగుతోందన్నారు. తద్వారా రాష్ట్ర ఆర్థిక చక్రం పరుగులు పెడుతోందని చెప్పడానికి గర్వపడుతున్నానని చెప్పారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా బుధవారం ఆయన పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో జరిగిన సభలో మాట్లాడారు. ఈ జన సంద్రాన్ని చూస్తుంటే నెల రోజుల్లోనే పట్టపగలు కోటప్పకొండ తిరునాళ్లు కనిపిస్తోందని అన్నారు. ఐదేళ్ల మన ప్రభుత్వంలో ఇంటింటికీ వచ్చిన అభివృద్ధిని, సంక్షేమాన్ని, లంచాలు, వివక్ష లేని పాలనను.. ఆ దుష్ట కూటమి, ఎల్లో మీడియా కబంధ హస్తాల నుంచి కాపాడుకునేందుకు పలనాటి సీమ పౌరుషంతో జన సముద్రంగా మారిన దృశ్యం కనిపిస్తోందని చెప్పారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏం చెప్పారంటే.. ఏది నిజం, ఏది అబద్ధం.. మీరే తేల్చండి ► బాబుగారి గురించి ఈరోజు ఈ సిద్ధం సభకు వచ్చిన లక్షల మందితో నేను కొన్ని నిజానిజాలు తేల్చదల్చుకున్నా. ఈ రోజు ఇక్కడ మీరు, నేను జాయింట్ గా ఓ ఫ్యాక్ట్ చెక్ (నిజ నిర్ధారణ) చేద్దాం. ఈ చంద్రబాబు గురించి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5.. ఈ చెత్త మీడియా చేస్తున్న ప్రచారంలో ఏది నిజం, ఏది అబద్ధం అనేది మీ ముందు పెడుతున్నా. ► చంద్రబాబు, ఈ ఎల్లో మీడియా కూడబలుక్కుని ఒక నిర్ణయానికి వస్తారు. తర్వాత వీరంతా కలిసి ఒక గాడిదను తీసుకొస్తారు. దాన్ని గుర్రం, గుర్రం అంటూ పదే పదే ఊదరగొడతారు. ఇలా 30 ఏళ్లుగా చేస్తూ వస్తున్నారు. 2014లో జాబు రావాలి అంటే బాబు రావాలి అని సభల్లో, టీవీ చానళ్లలో, ఊరూరా ఊదరగొట్టారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పాలించిన చంద్రబాబు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? మీ వాళ్లకు, మీ ఇంటి చుట్టు పక్కల వాళ్లకు ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందా? ► మీ బిడ్డ జగన్ వచ్చాక ప్రతి గ్రామంలో ఒక సచివాలయం తీసుకొచ్చారు. ఆ సచివాలయాల్లో ఏకంగా 1.35 లక్షల మంది మన పిల్లలు ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారు. ఇందులో నేను నా.. నా.. నా.. నా.. అని పిలుచుకునే నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఏకంగా 80 శాతం మంది ఉన్నారు. ► ఈరోజు ఒక్క వైద్య ఆరోగ్య రంగంలో మాత్రమే ఈ 58 నెలల కాలంలో 54 వేల పోస్టులు భర్తీ చేశాం. గవర్నమెంట్ హాస్పిటల్‌కు వెళితే గతంలో మాదిరి డాక్టర్లు, నర్సులు, పారామెడిక్స్ లేరన్న పరిస్థితి లేదు. మొత్తంగా 58 నెలల్లో 2.31 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం. మీ బిడ్డ పాలన రాక ముందు రాష్ట్రంలో 4 లక్షల ఉద్యోగాలుంటే.. ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ మరో 2.31 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాడు. ఈ పెద్దమనిషి చంద్రబాబు 2014 నుంచి 2019 మధ్య కేవలం 32 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. ఈ లెక్కన జాబు రావాలి అంటే ఫ్యాను రావాలా? లేక తుప్పు పట్టిన సైకిల్ రావాలా? నిర్మాణంలో 4 సీ పోర్టులు, 3 ఇండస్ట్రియల్ కారిడార్లు, 10 నోడ్స్ ► మరోవైపు రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా కొత్తగా మరో నాలుగు సీ పోర్టులు నిర్మాణంలో ఉన్నాయి. మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు, 10 ఇండస్ట్రియల్ నోడ్స్ కూడా వేగంగా పరుగులెత్తుతున్నాయి. 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కూడా నిర్మాణంలో ఉన్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో రాష్ట్రం దేశంలోనే వరుసగా ప్రతి సంవత్సరం నంబర్ వన్‌గా నిలుస్తోంది. ► రైతు అంటే బాబుకు ప్రేమట. నమ్ముతారా? (నమ్మం.. నమ్మం.. అని నినాదాలు) గతంలో ఏమీ చేయని బాబు.. ఇప్పుడు రైతుకు ఎక్కువ మేలు చేస్తాడట. ఇదీ వాళ్ల ఎల్లో మీడియా, చంద్రబాబు కొత్తగా చెబుతున్న మాటలు. వ్యవసాయం దండగ అన్న ఏకైక ముఖ్యమంత్రి ప్రపంచ చరిత్రలో ఎవరైనా ఉన్నారా అంటే అది ఈ చంద్రబాబే. రైతులకు కరెంటు ఉచితంగా ఇస్తే ఆ తీగలపై బట్టలు ఆరేసుకోవాలి అన్నాడు. రైతులను విచారించేందుకు ప్రత్యేక పోలీస్ స్టేషన్లు నెలకొల్పిన వ్యక్తి. ప్రత్యేక కోర్టులు నెలకొల్పిన వ్యక్తి. బాబువన్నీ విఫల హామీలే ► 2014లో రూ.87,612 కోట్లు రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తానన్నాడు. చేశాడా? రైతులకు పగటిపూటే 12 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తానన్నాడు. ఇచ్చాడా? బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానన్నాడు. విడిపించాడా? రైతులకు సున్నా వడ్డీ కూడా ఎగరగొట్టేశాడు. ఇన్పుట్ సబ్సిడీ సైతం 2017 నుంచి ఎగ్గొట్టేశాడు. కరెంటు విషయంలోనూ బకాయిలే. ధాన్యం సేకరణలోనూ బకాయిలే, రైతుల నుంచి కొనుగోలు చేసిన విత్తనాలకు సైతం డబ్బులివ్వకుండా బకాయిలే. ► మీ బిడ్డ జగన్ రైతు భరోసా పథకం కింద ఏటా రూ.13,500 ప్రతి రైతన్న చేతిలో పెడుతున్నాడు. ఈ ఐదేళ్లలో ప్రతి రైతన్నకూ రూ.67,500 ఇచ్చాం. మేనిఫెస్టోలో రూ.50 వేలు ఇస్తామని చెప్పి, అంతకంటే మిన్నగా రూ.67,500 ఇచ్చామా? లేదా? అని అడుగుతున్నా. పగటిపూటే నాణ్యమైన 9 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చాం. ఇందు కోసం రూ.1,700 కోట్లు ఫీడర్లపై ఖర్చు చేశాం. ► రైతన్నను చేయి పట్టుకుని నడిపించే రైతు భరోసా కేంద్రాన్ని (ఆర్బీకే) తీసుకొచ్చి దేశంలోనే రోల్ మోడల్‌గా నిలిచాం. ఇ–క్రాప్ ద్వారా, ఉచిత పంటల బీమా ద్వారా ప్రతి రైతన్నకూ, ప్రతి ఎకరాకూ, ప్రతి పంటకూ ఇన్సూరెన్స్ అందుతోంది. సీజన్ ముగిసేలోపు పంట నష్టపరిహారం, విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు తోడుగా ఉన్నాం. రూ.64 వేల కోట్లు ధాన్యం సేకరణకు ఇచ్చాం. మద్దతు ధర దక్కేలా చూస్తున్నాం. గన్నీబ్యాక్స్, లాజిస్టిక్స్, ట్రాన్స్పోర్ట్ ఖర్చుల కింద రైతన్నకు ఎకరాకు కనీసం రూ.8 వేల నుంచి రూ.10 వేలు అదనంగా వచ్చేలా చూశాం. ► సున్నా వడ్డీకే పంట రుణాలు చంద్రబాబు ఎత్తేస్తే.. మీ బిడ్డ జగన్, బాబు బకాయిలను సైతం కట్టి, మళ్లీ సున్నా వడ్డీకే పంట రుణాలు ఇప్పిస్తున్నారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా ఏకంగా 35 లక్షల ఎకరాల మీద శాశ్వత భూ హక్కులు కల్పించాం. ఈ పరిస్థితిలో రైతు కోసం ఈ రాష్ట్రానికి ఎవరు అవసరం? రుణ మాఫీ అని మోసం చేసిన చంద్రబాబా? లేక వ్యవసాయానికి అండగా నిలబడిన మీ బిడ్డనా? వాళ్లు ఇచ్చేది బోగస్ రిపోర్ట్. మీ జగన్ ఇస్తున్నది ప్రోగ్రెస్ రిపోర్ట్. ప్రతి గ్రామంలో విప్లవం ► ఈ రోజు ప్రతి గ్రామంలో విప్లవం కనిపిస్తోంది. వలంటీర్ల వ్యవస్థ, 15 వేలకు పైగా గ్రామ, వార్డు సచివాలయాలు, నాడు–నేడుతో బాగుపడ్డ స్కూళ్లు, హాస్పిటళ్లు కనిపిస్తున్నాయి. 15 వేలకుపైగా విలేజ్, వార్డు క్లినిక్‌లు.. 11 వేలకుపైగా రైతు భరోసా కేంద్రాలు కనిపిస్తున్నాయి. లంచాలు, వివక్ష లేకుండా 130 సార్లు మీ బిడ్డ బటన్ నొక్కి అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి రూ.2.70 లక్షల కోట్లు నేరుగా మీ బిడ్డ పంపించాడు. అమ్మ ఒడి పథకాన్ని మీరెప్పుడైనా చూశారా? పూర్తి ఫీజులు కడుతూ విద్యాదీవెన, వసతి దీవెనకు ఇంతగా ఖర్చు చేస్తున్న ప్రభుత్వాన్ని ఏనాడైనా చూశారా? ► ఆసరా, సున్నా వడ్డీ ద్వారా పొదుపు అక్కచెల్లెమ్మలను ఆదుకున్నాం. చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం వంటి పథకాలతో అండగా నిలిచాం. క్వాలిటీ చదువులే లక్ష్యంగా పేద పిల్లల తలరాతలు మార్చేలా మేనమామగా శ్రద్ధ పెట్టాను. 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్, 6వ తరగతి నుంచే ఆ ప్రతి క్లాస్ రూములో డిజిటల్ బోధన, 8వ తరగతి పిల్లలకు ట్యాబులు, ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ, టోఫెల్, ఐబీ దాకా ప్రయాణం కనిపిస్తోంది. ఆ బడుల్లో నాడు–నేడు, గోరుముద్ద, విద్యా కానుక గతంలో ఎప్పుడైనా చూశారా? విశ్వవిద్యాలయాలతో ఒప్పందం ద్వారా డిగ్రీలోనే సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్స్, ప్రఖ్యాత యూనివర్సిటీ సర్టిఫికెట్స్ డిగ్రీలకు అనుసంధానం చేశాం. మ్యాండేటరీ ఇంటర్న్ షిప్ తీసుకొచ్చాం. ► లీడర్ అంటే ఇలా ఉండాలి అని గర్వంగా కాలర్ ఎగరేసేలా ప్రజల ప్రేమానురాగాలు పొందుతున్నాం. అదే చంద్రబాబు నాయుడు పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్క మంచైనా ఉందా? ఇంతకన్నా ఇంకేం సర్టిఫికెట్ కావాలి? ► ఎప్పుడూ మోసాలు చేసే చంద్రబాబు.. నిన్ననే అనుకుంటా.. కొత్తగా ఒక మాట మాట్లాడాడు. వలంటీర్లకు రూ.10 వేలిస్తాడట. పోనీ ఇట్లన్నా జగన్ పాలన బ్రహ్మాండంగా ఉందని ఒప్పుకున్నాడు. సంతోషం. జగన్ పాలన చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. దాన్నన్నా ఒప్పుకున్నాడు. మొన్నటి దాకా మన వలంటీర్ల వ్యవస్థ పట్ల భయంకరమైన ద్వేషం వెళ్లగక్కారు. మూటలు మోసే వాళ్లు అన్నాడు. వారి కథ తేలుస్తా అన్నాడు. వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నాడు. మగవాళ్లు ఇంట్లో లేనప్పుడు తలుపులు కొడతారని కూడా అన్నాడు. ఇక ఆయన దత్తపుత్రుడు ఇంకో నాలుగు అడుగులు ముందుకేసి.. వలంటీర్లు ట్రాఫికింగ్ చేయిస్తున్నారని అన్నాడు. అందువల్లే అమ్మాయిలు మిస్ అయిపోతున్నారు.. మాయమైపోతున్నారని కూడా అన్నాడు. వలంటీర్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ సైన్యం అన్నాడు. వాలంటీర్లు జగన్‌కు అధికార పెగసస్ అని కూడా ట్వీట్ చేశాడు ఈ దత్తపుత్రుడు. ఇలా అన్న వాళ్లు వలంటీర్ వ్యవస్థను గుర్తించినందుకు సంతోషం. మన ప్రభుత్వానికి ఇంతకన్నా ఏం సర్టిఫికెట్ కావాలి? ► అయ్యా చంద్రబాబూ.. నీ హయాంలో జన్మభూమి కమిటీల వల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారు. వాళ్లు, మీరు ఇద్దరూ కలిసి మరుగుదొడ్లకూ, రేషన్‌కు, పెన్షన్‌కూ లంచాలు తీసుకున్నారు. రాష్ట్రాన్ని దోచేశారు. చంద్రబాబు మనస్తత్వం రాష్ట్రాన్ని దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం. చనిపోయిన తర్వాత కూడా ప్రతి పేదవాడి గుండెల్లో బతికే ఉండాలన్నది జగన్ మనస్తత్వం. ఇదీ.. నీకు నాకు మధ్య ఉన్న తేడా. ► ఇదే చంద్రబాబు మొన్నటికి మొన్న నిమ్మగడ్డ రమేష్ అనే తన మనిషితో ఎలక్షన్ కమిషన్ కు కంప్లయింట్ చేయించి, అవ్వాతాతలకు ఇంటి వద్దే అందాల్సిన పెన్షన్‌ను ఆపించారు. ఆ అవ్వాతాతలు ఇబ్బందులు పడేట్టుగా చేసి, చివరికి అనేక మంది అవ్వాతాతలు మరణానికి కూడా కారణమయ్యారు. ఒక్కసారిగా గాలి ఎదురు తిరిగే సరికే చంద్రబాబులో ఉన్న మోసం మళ్లీ చంద్రముఖిలా పైకి లేచింది. ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమేనా? ► ఇన్ని అబద్ధాలు, ఇన్ని మోసాలతో రాష్ట్ర పేదల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమేనా? (సిద్ధమేనని జనం నినాదాలు) మీరు సిద్ధంగా ఉంటే మోసగాళ్ల సోషల్ మీడియా, ఎల్లో మీడియా అసత్యాల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు మీ జేబులోంచి సెల్ ఫోన్న్ బయటకు తీసి, అందులోని టార్చ్ లైట్ వెలిగించండి. (అందరూ సెల్లో టార్చ్ వెలిగించి పైకెత్తి చూపారు). 175 అసెంబ్లీ స్థానాలకు 175, 25 ఎంపీ సీట్లుకు 25 మొత్తం రెండు వందల సీట్లు.. ఎక్కడా తగ్గేందుకు వీల్లేదు. ► మన పార్లమెంట్, దాని పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులందరికీ మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు అందించాలని కోరుతున్నాను. మనది ఫ్యాన్ గుర్తు అని మరచిపోవద్దు. పేదల భవిష్యత్తు కోసం ఫ్యాను ఎప్పుడూ మన ఇంట్లోనే ఉండాలి. సైకిల్ ఎప్పుడూ బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడూ సింక్ లోనే ఉండాలి. మన బతుకులు బాగుపడాలి అంటే ఫ్యాను మీద రెండు ఓట్లు కచ్చితంగా వేయాలి. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళితే.. ► 2014లో చంద్రబాబు ఇదే కూటమిగా ఏర్పడి ఇంటింటికీ పంపించిన పాంప్లెట్ ఇది. (చేత్తో చూపిస్తూ..) గుర్తుందా ఈ పాంప్లెట్? ఇందులో మోడీగారి ఫొటో ఉంది. దత్తపుత్రుడి ఫొటో, చంద్రబాబు నాయుడు ఫొటో ఉంది. కింద చంద్రబాబు నాయుడు సంతకం కూడా ఉంది. ప్రతి టెలివిజన్ చాన్‌ల్‌లో వాళ్ల ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో, టీవీ–5లో ఊదరగొడుతూ దీని గురించి అడ్వటైజ్ మెంట్లు కూడా ఇచ్చారు. ► రైతులకు రుణ మాఫీపై మొదటి సంతకం చేస్తా అన్నాడు. రూ.87,612 కోట్లు రుణ మాఫీ చేశాడా? పొదుపు సంఘాల డ్వాక్రా రుణాలు రూ.14,205 కోట్లు మాఫీ చేశాడా? ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకు అకౌంట్లో డిపాజిట్ చేశాడా? మీ ఇంట్లో.. మీ పక్కిళ్లలో 2014–2019 మధ్య ఆడ బిడ్డలు పుట్టారు కదా.. వాళ్లలో ఒక్కరికైనా రూ.25 వేలు ఇచ్చారా? ఇంటింటికీ ఉద్యోగం.. లేదా నెలనెలా రూ.2 వేల నిరుద్యోగభృతి ఇస్తామన్నాడు. ఐదేళ్లు.. అంటే 60 నెలలకు నెలకు రూ.2000 చొప్పున లెక్కిస్తే.. ప్రతి ఇంటికీ రూ.1.20 లక్షలు ఇచ్చారా? అర్హులైన వాళ్లందరికీ 3 సెంట్ల స్థలం ఇచ్చారా? రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత, పవర్ లూమ్స్ రుణాలన్నీ మాఫీ అన్నాడు.. చేశాడా? ► మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు జరిగిందా? రాష్ట్రాన్ని సింగపూర్‌ను మించి అభివృద్ధి చేస్తానన్నాడు. ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. మరి మన పిడుగురాళ్లలో కనిపించిందా? పోనీ మన గురుజాలలో అయినా కనిపిస్తోందా?ఇప్పుడు మళ్లీ అదే మోసం. అవే పొత్తులు. ఇప్పుడు సూపర్ సిక్సు, సూపర్ సెవెన్న్ అంటూ మళ్లీ మోసం చేయడానికి వస్తున్నాడు. అవ్వాతాతలకు పెన్షన్ రూ.4 వేలు ఇస్తాడట. ఈ ముగ్గురూ కలిసి ఇంటింటికీ కేజీ బంగారం అంటున్నారు. ఇంటింటికీ బెంజ్ కారు కొనిస్తామంటున్నారు. నమ్ముతారా? నేనున్నాననీ.. మీకేం కాదనీ.. ఫిట్స్‌తో స్పృహ తప్పిన మహిళ శావల్యాపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో ఓ మహిళ ప్రాణాపాయం నుంచి బయట పడింది. పల్నాడు జిల్లా గంటావారిపాలెం గ్రామ సమీపాన జాతీయ రహదారిపై బుధవారం ‘మేమంతా సిద్ధం’బస్సు యాత్ర సాగుతుండగా ఓ మహిళ ఫిట్స్‌తో స్పృహ తప్పి పడిపోయింది. బొల్లాపల్లి మండలం సరికొండాయపాలెం గ్రామానికి చెందిన మల్లవరపు మౌనిక ఫిట్స్‌తో గత కొన్ని సంవత్సరాలుగా బాధ పడుతోంది. ఈ క్రమంలో తనకున్న వ్యాధి గురించి సీఎం వైఎస్. జగన్మోహన్రెడ్డికి విన్నవించిన అనంతరం అభిమానులు, కార్యకర్తల తోపులాటలో ఆమె ఒక్కసారిగా ఫిట్స్ వచ్చి రోడ్డుపై పడిపోయింది. విషయాన్ని గమనించిన సీఎం సత్వరమే వైద్యసేవలు అందించాలని ఆదేశాలు జారీ చేయడంతో హుటాహుటిన 108 వాహనం ద్వారా వైద్యశాలకు తరలించారు. వైద్యులు చికిత్స అందించడంతో ప్రాణాపాయం నుంచి బయట పడింది. అరుదైన వ్యాధిగ్రస్తునికి ఆపన్నహస్తం మా 16 ఏళ్ల కొడుకు హుస్సేన్ బాషా అరుదైన మల్టిపుల్ అటెన్యూయేషన్ అసిఫైయింగ్ ఫైబ్రామా వ్యాధితో బాధపడుతున్నాడు. ముఖం ఎడమ సగభాగం కన్నుతో సహా ముందుకు వచ్చింది. ఏడాది క్రితం గుంటూరు జిల్లా వడ్లమూడిలోని ఓ ఆస్పత్రిలో హుస్సేన్‌కు రెండు సార్లు సర్జరీలు జరిగాయి. దీనికి అవసరమైన రూ.10 లక్షలు అప్పు చేసి తెచ్చి పెట్టాం. అంత అప్పు తీర్చే పరిస్థితి లేదు. మళ్లీ మా అబ్బాయికి వైద్యం చేయించాల్సిన పరిస్థితి నెలకొంది. ఆరి్థక ఇబ్బందుల నేపథ్యంలో ఉన్న ఇంటిని అమ్మకానికి పెట్టాం. మా గోడును సీఎం వైఎస్ జగన్‌కు చెబుదామని వచ్చాం. మా సమస్య విని సీఎం చలించిపోయారు. తక్షణం వైద్యం అందించేందుకు భరోసా ఇచ్చారు. ఈ మేరకు ఆరోగ్య శ్రీ అధికారులను ఆదేశించారు. ఆయనకు జీవితాంతం రుణ పడి ఉంటాం. – ఖాదర్ అలీ, మౌలాబీ, బాషా తల్లిదండ్రులు కొమ్మాలపాడు, సంతమాగులూరు మండలం -
‘జగన్ పాలన బావుందని చంద్రబాబు ఒప్పుకున్నాడు’
సాక్షి, పల్నాడు జిల్లా: ఊసరవెల్లిని మించి రంగులు మారుస్తున్న చంద్రబాబును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎండగట్టారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల అయ్యప్పనగర్ బైపాస్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ వాలంటీర్ల వ్యవస్థను చూస్తుంటే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పెరిగెడుతున్నాయన్నారు. ‘‘వాలంటీర్లకు రూ.10వేలు ఇస్తామని చంద్రబాబు అంటున్నాడు. ఇలాగైనా జగన్ పాలన బావుందని బాబు ఒప్పుకున్నాడు. ఇన్నాళ్లూ వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు విషం చిమ్మారు. ఇప్పుడు వాలంటీర్లకు రూ. 10వేలు ఇస్తామంటున్నారు.. ఇంతకంటే జగన్ పాలనకు మీరిచ్చే సర్టిఫికెట్ ఏం ఉంటుంది?. ప్రజలు తిరగబడే సరికి చంద్రబాబు మారిపోయాడు. ఇప్పుడు వాలంటీర్లను మెచ్చుకుంటున్నారు. మంచి చేశాం కాబట్టే ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్నాం’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. ‘‘ఊసరవెల్లి కంటే చంద్రబాబు ఎక్కువ రంగులుమారుస్తాడు. జన్మభూమి కమిటీలతో చంద్రబాబు రాష్ట్రాన్ని దోచుకున్నారు. చంద్రబాబు బతుకంతా అబద్ధాలు, వెన్నుపోట్లే. చంద్రబాబు ఊసరవెల్లిని దాటిపోయారు. చంద్రబాబు మోసాలు అందరికి తెలుసు. రాష్ట్రాన్ని దోచుకోవడం, దోచుకున్నది దాచుకోవడం బాబు మనస్తత్వం. అవ్వాతాలకు ఇంటి వద్దే అందాల్సిన పెన్షన్ ఆపారు. నిమ్మగడ్డ రమేష్‌తో ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు చేయించారు. అవ్వాతాతలను ఇబ్బంది పడేలా చేశారు’’ సీఎం జగన్ ధ్వజమెత్తారు. ‘‘పిడుగురాళ్లలో జనసముద్రం చూస్తున్నాం. 5 ఏళ్లుగా మన ప్రభుత్వంలో ఇంటింటికి అభివృద్ధి, సంక్షేమం అందించాం. సిద్ధం, సిద్ధం అంటూ నినాదాలు మన జైత్రయాత్రకు శంఖారావాలు. చంద్రబాబు మోసాలను ఎదుర్కొనేందుకు మీరంతా సిద్ధమా?. జిత్తులమారి చంద్రబాబు కుట్రలను తిప్పి కొట్టాలి. మేం ఎప్పుడూ పేదల పక్షమే.ఇవి పేదల తలరాతను మార్చే ఎన్నికలు. చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ ఆగిపోతాయి. చంద్రబాబుకు ఓటేస్తే పేదలవాళ్లు మోసపోతారు చంద్రబాబు అంటే ఎన్నికల ముందు గంగా, అధికారం దక్కిన తర్వాత చంద్రబాబు ముఖాముఖి. జరుగుతున్న మంచి కొనసాగాలంటే జగన్‌కు ఓటేయాలి’’ అని సీఎం విజ్ఞప్తి చేశారు. ‘‘పచ్చ మీడియా గాడిదను తీసుకొచ్చి గుర్రం అని ప్రచారం చేస్తాయి. చంద్రబాబు హయాంలో ఒక్కరికైనా మంచి జరిగిందా?. 14 ఏళ్ల బాబు పాలనలో ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా?. చంద్రబాబు 14 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందా?. మనం వచ్చాక సంక్షేమం, అభివృద్ధి చేసి చూపించాం. మనం వచ్చాక లక్షా 35 వేల మందికి ఉద్యోగాలిచ్చాం. వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. వైద్యరంగంలోనే 54 వేల నియామకాలు చేపట్టాం. పేదలకు వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చాం. 58 నెలల్లోనే 2 లక్షల 31 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. గ్రామ సచివాలయాల్లో లక్షా 35 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాం. జాబు రావాలంటే ఫ్యాన్ రావాలి’’ సీఎం జగన్ పేర్కొన్నారు. ఇదీ చదవండి: బాబుది బోగస్ రిపోర్ట్.. జగన్‌ది ప్రొగ్రెస్ రిపోర్ట్: సీఎం జగన్ -
ఎన్నికల ముందు గంగ తరువాత పేదల రక్తం తాగే చంద్రముఖి
-
బాబుది బోగస్ రిపోర్ట్.. జగన్‌ది ప్రొగ్రెస్ రిపోర్ట్: సీఎం జగన్
సాక్షి, పల్నాడు జిల్లా: జిత్తులమారి పార్టీలు మోసాలు, కుట్రలు చేస్తున్నాయంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు కుట్రలను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా 12వ రోజు బుధవారం సాయంత్రం పల్నాడు జిల్లా పిడుగురాళ్ల అయ్యప్పనగర్ బైపాస్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మనం సిద్దం సిద్ధం.. అంటే.. వారికి యుద్ధంగా ప్రతిధ్వనిస్తోందన్నారు. చంద్రబాబుకు ఓటేస్తే పేదవాళ్లు మోసపోతారు ‘‘ఈ ఎన్నికలు జగన్‌కు, చంద్రబాబుకు మధ్య జరుగుతున్న ఎన్నికలు కావు. ప్రజలకు, చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు. జగన్‌కు ఓటేస్తే.. ఇప్పుడున్న పథకాలు కొనసాగుతాయి. చంద్రబాబు అంటే ఎన్నికల ముందు గంగా.. అధికారం దక్కిన తర్వాత చంద్రముఖి. చంద్రబాబుకు ఓటేస్తే పేదవాళ్లు మోసపోతారు. ఇవి పేదల తలరాతను మార్చే ఎన్నికలు. మేం ఎప్పుడూ పేదల పక్షమే. జరుగుతున్న మంచి కొనసాగాలంటే జగన్‌కు ఓటేయాలి. బాబుకు ఓటేస్తే ఇప్పుడున్న పథకాలన్నీ ఆగిపోతాయి.. పచ్చమీడియా గాడిదను తీసుకొచ్చి గుర్రం అని ప్రచారం చేస్తాయి’’ అని సీఎం జగన్ మండిపడ్డారు. జాబు రావాలంటే ఫ్యాను రావాలా.. లేక తుప్పు పట్టిన సైకిల్ రావాలా? ‘‘చంద్రబాబు 14 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారా?. చంద్రబాబు హయాంలో ఒకరికైనా మంచి జరిగిందా?. జాబు రావాలంటే ఎవరు కావాలి?. జాబు రావాలంటే ఫ్యాను రావాలా.. లేక తుప్పు పట్టిన సైకిల్ రావాలా?. అధికారంలోకి రాగానే 2 లక్షల 31 ఉద్యోగాలు భర్తీ చేశాం. పేదలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చాం. గతంలో రైతుకు ఏమీ చేయని చంద్రబాబు.. ఇప్పుడు మేలు చేస్తాడట. చంద్రబాబుది బోగస్ రిపోర్ట్.. జగన్‌ది ప్రొగ్రెస్ రిపోర్ట్. వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబే. ‘కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోవాలన్న వ్యక్తి చంద్రబాబు’’ అంటూ సీఎం జగన్ ధ్వజమెత్తారు. రైతన్నకు చంద్రబాబు చేసిందేమీ లేదు ‘‘రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?. పగటిపూట 12 గంటల ఉచిత విద్యుత్ ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?. బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానన్నాడు.. విడిపించాడా? రైతులకు సున్నా వడ్డీ, ఇన్‌ఫుట్ సబ్సిడీ ఎగ్గొట్టేశాడు.. మనం వచ్చాక రైతన్నకు తోడుగా ఉన్నాం. విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతున్నకు తోడుగా ఉన్నాం. రైతన్నకు చంద్రబాబు చేసిందేమీ లేదు’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. ‘‘ప్రతి ఏడాది రైతు భరోసా ద్వారా రూ. 13,500 ఇచ్చాం. పగటిపూటే 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. ప్రతి గ్రామంలోనూ రైతు భరోసా కేంద్రాలు నెలకొల్పాం రూ.64 వేల కోట్లతో ధాన్యం సేకరణ చేపట్టాం. ఏ సీజన్‌లోని ఇన్‌ఫుట్ సబ్సిడీని ఆ సీజన్లోనే ఇస్తున్నాం. సున్నా వడ్డీకే రుణాలిచ్చాం. 35 లక్షల ఎకరాలకు శాశ్వత భూ హక్కులు కల్పించాం’’ అని సీఎం జగన్ వివరించారు. ఇంతకంటే జగన్ పాలనకు మీరిచ్చే సర్టిఫికెట్ ఏం ఉంటుంది ‘‘వాలంటీర్ల వ్యవస్థను చూస్తుంటే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పెరిగెడుతున్నాయి. వాలంటీర్లకు రూ.10వేలు ఇస్తామని చంద్రబాబు అంటున్నాడు. ఇలాగైనా జగన్ పాలన బావుందని చంద్రబాబు ఒప్పుకున్నాడు. ఇన్నాళ్లూ వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు విషం చిమ్మారు. ఇప్పుడు వాలంటీర్లకు రూ. 10వేలు ఇస్తామంటున్నారు.. ఇంతకంటే జగన్ పాలనకు మీరిచ్చే సర్టిఫికెట్ ఏం ఉంటుంది. తిరగబడే సరికి చంద్రబాబు మారిపోయాడు. ఇప్పుడు వాలంటీర్లను మెచ్చుకుంటున్నారు. మంచి చేశాం కాబట్టే ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్నాం’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. -
రొంపిచెర్లలో సీఎం వైఎస్ జగన్ రోడ్ షో
-
మండుటెండలో...కాళ్ళు కాలుతున్నా!..అన్నని చూసేవరకు ఆగేదే లే..!
-
భారీ గజమాలతో స్వాగతం పలికిన ప్రజలు..
-
Watch Live: సీఎం జగన్ బస్సు యాత్ర డే 12
-
సరికొత్త రికార్డులకు వేదికగా బస్సు యాత్ర..
-
మేమంతా సిద్ధం@ డే 12: కొనసాగుతున్న సీఎం జగన్ బస్సు యాత్ర
Memantha Sidham Day 12 Highlights CM Jagan Bus Yatra Details సీఎం జగన్ సమక్షంలో చేరికలు మేమంతా సిద్దం బస్సుయాత్రలో పల్నాడు జిల్లా గంటావారిపాలెం నైట్ స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో జనసేన, తెలుగుదేశం పార్టీల నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు పి.గన్నవరం జనసేన నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి రాయచోటి తెలుగుదేశం పార్టీ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్ కుమార్ రెడ్డి విజయవాడ వెస్ట్ జనసేన పార్టీ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోతిన మహేష్ పార్టీ నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం గంటావారిపాలెం నైట్ స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి జగన్‌ను కలిసిన పల్నాడు జిల్లాకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పలువురు పార్టీ నేతలు, సీనియర్ కార్యకర్తలను పేరుపేరునా పలకరిస్తూ... యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న సీఎం వైఎస్ జగన్ గంటావారిపాలెం నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభం 12వ రోజు ప్రారంభమైన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర కాసేపట్లో గంటావారిపాలెం నుంచి బస్సు యాత్ర ప్రారంభం పల్నాడు జిల్లాలో ‘మేమంతా సిద్ధం’బస్సు యాత్ర పుట్టవారిపాలెం, సంతమాగులూరు క్రాస్, రొంపిచర్ల క్రాస్ విప్పెర్ల, నకరికల్లు దేవరంపాడు క్రాస్‌కు బస్సు య్రాత అనంతరం కొండమోడు, పిడుగురాళ్ల బైపాస్ మీదుగా అయ్యప్పనగర్ బైపాస్కు చేరకొనున్న బస్సు యాత్ర అయ్యప్పనగర్ బైపాస్ వద్ద ‘మేమంతా సిద్ధం’బహిరంగ సభ బహిరంగ సభలో ప్రసింగించనున్న సీఎం వైఎస్ జగన్ అనంతరం కొండమోడు జంక్షన్, అనుపాలెం, రాజుపాలెం, రెడ్డిగూడెం మీదుగా ధూళిపాళ్లకు చేరుకోనున్న బస్సు యాత్ర రాత్రికి ధూళిపాళ్లలో సీఎం వైఎస్ జగన్ బస పన్నెండో రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర కాసేపట్లో గంటావారిపాలెంలో సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది సీఎం జగన్‌కు ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి వేచి చూస్తున్నారు. పుట్టవారిపాలెం, సంతమాగులూరు క్రాస్, రొంపిచర్ల క్రాస్, విప్పెర్ల, నెకరికల్లు మీదుగా దేవరంపాడు క్రాస్ వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం కొండమోడు, పిడుగురాళ్ల బైపాస్ మీదుగా సాయంత్రం 3.30 గంటలకు అయ్యప్పనగర్ బైపాస్ వద్దకు చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం కొండమోడు జంక్షన్, అనుపాలెం, రాజుపాలెం, రెడ్డిగూడెం మీదుగా ధూళిపాళ్ల దగ్గర రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు పదకొండో రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర సూపర్ సక్సెస్ పల్నాడు గడ్డపై అడుగడుగునా జననీరాజం సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్రకు భారీగా తరలివచ్చిన ప్రజలు దారిపొడవునా పూలవర్షం కురిపించిన అభిమాన జనసందోహం మార్మోగిన జగన్నినాదం సీఎం జగన్ సమస్యలు వింటూ.. పరిష్కారం చూపుతూ ముందుకు కదిలారు -
బస్సు యాత్ర..12వ రోజు షెడ్యూల్ ఇదే
-
మిమ్మల్నే గెలిపించుకుంటాం
ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం పరిధిలోని కొనకనమిట్ల వద్ద ఏప్రిల్ 7న 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. షెడ్యూలు ప్రకారం అక్కడ మధ్యాహ్నం 3.30 గంటలకు సభ ప్రారంభమవుతుందని నిర్వాహకులు చెప్పడంతో మధ్యాహ్నం 12 గంటలకే సభా ప్రాంగణంలోకి జనప్రవాహం ప్రారంభమైంది. మధ్యాహ్నం 3 గంటలకే సభా ప్రాంగణం ఇసుకేస్తే రాలనంతగా జనంతో కిక్కిరిసిపోయింది. ఓ వైపు మండుతున్న ఎండ.. మరో వైపు ఉక్కపోత.. అయినా సభా ప్రాంగణం నుంచి లక్షలాది మంది అక్కడి నుంచి కాలు కదపలేదు. బస్సు యాత్రకు జనం అడుగడుగునా నీరాజనం పలకడంతో సభా ప్రాంగణానికి సీఎం వైఎస్ జగన్ కాస్త ఆలస్యంగా సాయంత్రం 5 గంటలకు చేరుకున్నారు. జననేతను చూడగానే అప్పటిదాకా పడిన ఇబ్బందిని జనం మరిచిపోయి ఆనందంతో హర్షధ్వానాలు చేశారు. ‘ఇంత మేలు చేసిన మీకు కాకుండా ఎవరికి ఓటు వేస్తాం.. మిమ్మల్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మాదే’నంటూ నినాదాలు చేశారు. ఇలా ఎక్కడికక్కడ సీఎం జగన్ పట్ల పెరుగుతున్న ఆదరణ సరికొత్త చారిత్రక విజయానికి బాటలు వేస్తోంది. సాక్షి, అమరావతి: పేదంటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చడానికి.. చంద్రబాబు వంటి మోసగాళ్ల నుంచి రాష్ట్ర భవిష్యత్తును కాపాడేందుకు ‘నేను సిద్ధం.. మీరంతా సిద్ధమా?’ అని సీఎం వైఎస్ జగన్ పిలుపునిస్తే.. సెల్ ఫోన్ టార్చ్‌లైట్ వెలిగించి ‘మేమంతా సిద్ధం’ అంటూ లక్షల గళాలు దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తున్నాయి. మేమెంతా మీ వెంటేనంటూ అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, అన్నదమ్ములు అడుగులో అడుగు వేస్తున్నారు. ఎక్కడికక్కడ అభిమానం అడ్డుపడుతుండటంతో సీఎం జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర షెడ్యూల్ సమయం కంటే రెండు గంటలు ఆలస్యంగా సాగుతోంది. ఈ నెల ఒకటవ తేదీన శ్రీసత్యసాయి జిల్లా కదిరిలోకి షెడ్యూలు సమయం కంటే మూడు గంటలు ఆలస్యంగా సాయంత్రం 5.45 గంటలకు సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్ర ప్రవేశించింది. మధ్యాహ్నం 2 గంటలకే నేల ఈనిందా అన్నట్లుగా జనంతో కదిరి కిక్కిరిసిపోయింది. అనంతపురం–మదనపల్లె రహదారిపై సీఎం వైఎస్ జగన్ నిర్వహించిన రోడ్ షోకు అడగడుగునా జనం నీరాజనాలు పలకడంతో కుంభమేళాను తలపించింది. రోడ్ షో సాగినంత దూరం సెల్‌ఫోన్ టార్చ్లైట్లను వెలిగించి జనం సీఎం వైఎస్ జగన్‌కు సంఘీభావం తెలిపారు. రెండు కిలోమీటర్ల పొడవున రోడ్ షో నిర్వహించడానికి 2.10 గంటల సమయం పట్టిందంటే జనం ఏ స్థాయిలో పోటెత్తారన్నది అర్థం చేసుకోవచ్చు. అందరి అభిమతం అదే.. వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని ఇడుపులపాయ నుంచి పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురం మండలం గంటావారిపాలెం వరకు ఇప్పటిదాకా సాగిన బస్సు యాత్రలో అడగడుగునా ఇలాంటి దృశ్యాలు సాక్షాత్కారించాయి. సాధారణంగా ఎన్నికల సమయంలో మీకు ఫలాన మేలు చేస్తాం.. మాకు ఓటేయండి.. అని ప్రజలకు నాయకులు హామీలు ఇస్తుంటారు. కానీ.. బస్సు యాత్రలో జనంతో సీఎం వైఎస్ జగన్ మమేకమైనప్పుడు ‘మీ పాలనలో మాకు మంచి జరిగింది. మళ్లీ మీరే రావాలి. మిమ్మిల్నే గెలిపించుకుంటాం’ అంటూ యువతీ యువకుల నుంచి వృద్ధుల వరకు హామీలు ఇస్తుండటం రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దేశ రాజకీయ చరిత్రలో ఇలాంటి మహోజ్వల ఘట్టాలను తామెన్నడూ చూడలేదని.. సీఎం వైఎస్ జగన్ నాయకత్వంపై ప్రజల్లో నమ్మకం బలంగా నాటుకుపోయిందనడానికి ఇవే తార్కాణమని విశ్లేషిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మరో చారిత్రక విజయం సాధించడం ఖాయమనడానికి బస్సు యాత్రలో అడుగడుగునా కన్పిస్తున్న దృశ్యాలే నిదర్శనమని తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే టైమ్స్ నౌ–ఈటీజీ, జీన్యూస్ వంటి ప్రతిష్ఠాత్మక జాతీయ మీడియా సంస్థలు డజనుకు పైగా నిర్వహించిన సర్వేల్లో వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించడం ఖాయమని తెగేసి చెబుతుండటం గమనార్హం. జైత్ర యాత్రలా బస్సు యాత్ర సార్వత్రిక ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా గత నెల 27న వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ వద్ద మహానేత వైఎస్సార్ ఘాట్ నుంచి సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్రను ప్రారంభించారు. వైఎస్సార్, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, పల్నాడు జిల్లాల మీదుగా ఇప్పటిదాకా బస్సు యాత్ర సాగింది. మండుటెండను లెక్క చేయకుండా స్కూలు విద్యార్థుల దగ్గర నుంచి అవ్వాతాతల వరకు పోటీపడి సీఎం జగన్‌కు సంఘీభావం తెలుపుతున్నారు. బిడ్డలను చంకనేసుకుని సీఎం జగన్‌ను చూసేందుకు బస్సు వెంట యువతీ యువకులతో పోటీపడుతూ మహిళలు పరుగులు తీస్తున్న దృశ్యాలు అడుగడుగునా కన్పిస్తున్నాయి. స్కూలు విద్యార్థులైతే సీఎం జగన్‌ను చూసేందుకు తల్లితండ్రులతోపాటు వస్తున్నారు. సీఎం జగన్‌ను చూడగానే ‘అదుగో జగన్ మామయ్య’ అంటూ చూపుతున్నారు. ఆ పిల్లలను సీఎం జగన్ అక్కున చేర్చుకుంటుండటంతో పిల్లలు ఆనందపరవశులవుతున్నారు. సీఎం వైఎస్ జగన్‌ను దగ్గర నుంచి చూసేందుకు.. మాట కలిపేందుకు.. వీలైతే సెల్ఫీ దిగేందుకు జనం పోటీ పడుతున్నారు. యువత, మహిళలు, రైతులు, వృద్దులు ఇలా అన్ని వర్గాల వారితో సీఎం మేమకమవుతున్నారు. బస్సు యాత్రలో భాగంగా ప్రొద్దుటూరు, నంద్యాల, ఎమ్మిగనూరు, మదనపల్లె, పూతలపట్టు, నాయుడుపేట, కావలి, కొనకనమిట్లలో నిర్వహించిన బహిరంగ సభలకు జనం పోటెత్తడంతో ఒకదానికి మించి మరొకటి సూపర్ హిట్టయ్యాయి. ఏ సమయం అయినా సీఎం వైఎస్ జగన్ నిర్వహించే రోడ్ షోల్లో అభిమాన సంద్రం ఉప్పొంగుతోంది. రాత్రి పొద్దుపోయినా దర్శి జన సంద్రాన్ని తలపించింది. ప్రజల్లో విశ్వసనీయతకు ప్రతీక ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం సీఎం వైఎస్ జగన్ అమలు చేశారు. గత 58 నెలల్లో అర్హతే ప్రామాణికంగా.. ఎలాంటి వివక్షకు తావు లేకుండా.. అత్యంత పారదర్శకంగా నవరత్నాలు, సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో 87 శాతం కుటుంబాల ఖాతాల్లో రూ.2.70 లక్షల కోట్లు జమ చేశారు. నాన్ డీబీటీ రూపంలో మరో రూ.1.79 కోట్ల ప్రయోజనం చేకూర్చారు. డీబీటీ, నాన్ డీబీటీ కలిపి రూ.4.49 లక్షల కోట్ల ప్రయోజనం కలిగించారు. దేశ చరిత్రలో ఇదో రికార్డు. వాటిని సద్వినియోగం చేసుకున్న ప్రజలు పేదరికం నుంచి గట్టెక్కుతున్నారు. రాష్ట్రంలో పేదరికం 2015–16లో 11.77 శాతం ఉంటే.. 2022–23 నాటికి 4.19 శాతానికి తగ్గడమే అందుకు నిదర్శనం. విద్య, వ్యవసాయ, పారిశ్రామిక, వైద్య రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చిన సీఎం వైఎస్ జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపారు. కేబినెట్ నుంచి నామినేటెడ్ వరకు పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు పెద్దపీట వేసి ఆ వర్గాల సామాజిక సాధికారతకు బాటలు వేశారు. గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ, జిల్లాల పునర్ వ్యవస్థీకరణ ద్వారా ప్రభుత్వ సేవలను ఇంటి గుమ్మం వద్దే ప్రజలకు అందిస్తున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలు కొనసాగించి.. సుపరిపాలన అందిస్తున్న సీఎం వైఎస్ జగన్ నాయకత్వంపై ప్రజల్లో రోజు రోజుకు విశ్వసనీయత పెరుగుతోంది. ఇదే బస్సు యాత్రలో సీఎం వైఎస్ జగన్‌కు బ్రహ్మరథం పట్టడానికి దారితీస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాబోయేది వైఎస్సార్సీపీ సునామీయే సార్వత్రిక ఎన్నికలకు వైఎస్సార్సీపీ శ్రేణులను సన్నద్ధం చేయడానికి భీమిలి (ఉత్తరాంధ్ర), దెందులూరు (ఉత్తర కోస్తా), రాప్తాడు (రాయలసీమ), మేదరమెట్ల (దక్షిణ కోస్తా)లలో నిర్వహించిన సిద్ధం సభలకు జనం పోటెత్తడంతో ఒకదానికి మించి మరొకటి గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఉమ్మడి రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల చరిత్రలో రాప్తాడు, మేదరమెట్ల సిద్ధం సభలు అతి పెద్ద ప్రజాసభలుగా నిలిచాయి. ఇదే సమయంలో ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్వహిస్తున్న బస్సు యాత్ర జైత్ర యాత్రలా కొనసాగుతోంది. ప్రజాక్షేత్రంలో సీఎం వైఎస్ జగన్‌ను ఒంటరిగా ఎదుర్కోవడానికి భయపడిన చంద్రబాబు.. జనసేనతో జట్టుకట్టి తాడేపల్లిగూడెంలో ఉమ్మడిగా నిర్వహించిన సభ జనం లేక అట్టర్ ప్లాప్ అయ్యింది. దాంతో బీజేపీతో జట్టుకట్టిన టీడీపీ–జనసేన.. సాక్షాత్తు ప్రధానిని రప్పించి చిలకలూరిపేటలో ప్రజాగళం పేరుతో నిర్వహించిన సభకు జనం మొహం చాటేయడంతో కూటమిలో నైతిక స్థైర్యం దెబ్బతింది. పొత్తులో సీట్ల లెక్క తేలాక.. అభ్యర్థుల ఎంపిక పూర్తయ్యాక, ఆపార్టీలో చెలరేగిన అసమ్మతి కూటమిని చావు దెబ్బతీసింది. కేంద్ర ఎన్నికల సంఘంపై ఒత్తిడి తెచ్చి వృద్ధులకు ఇంటి వద్ద పెన్షన్ అందించకుండా వలంటీర్లను చంద్రబాబు అడ్డుకోవడంతో కూటమిపై అన్ని వర్గాల్లోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఓ వైపు సీఎం బస్సు యాత్రకు జనం బ్రహ్మరథం పడుతుండటం.. మరో వైపు చంద్రబాబు ప్రజాగళం పేరుతో, పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార సభలకు ప్రజలు మొహం చాటేస్తుండటంతో కూటమి అభ్యర్థుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 21–22 లోక్‌సభ స్థానాలు చేజిక్కించుకుని ఘన విజయం సాధిస్తుందని పలు జాతీయ మీడియా సంస్థల సర్వేల్లో వెల్లడైంది. ఈ దృష్ట్యా రాబోయేది వైఎస్సార్సీపీ సునామీయేనని రాజకీయ విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. -
నేడు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇలా..
సాక్షి, అమరావతి: మేమంతా సిద్ధం 12వ రోజు బుధవారం (ఏప్రిల్ 10) షెడ్యూల్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం మంగళవారం విడుదల చేశారు. ఈ యాత్రలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం రాత్రి బస చేసిన గంటావారిపాలెం వద్ద నుంచి బుధవారం ఉదయం 9 గంటలకు యాత్ర ప్రారంభిస్తారు. పుట్టవారిపాలెం, సంతమాగులూరు క్రాస్, రొంపిచర్ల క్రాస్, విప్పెర్ల, నెకరికల్లు మీదుగా దేవరంపాడు క్రాస్ వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం కొండమోడు, పిడుగురాళ్ల బైపాస్ మీదుగా సాయంత్రం 3.30 గంటలకు అయ్యప్పనగర్ బైపాస్ వద్దకు చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం కొండమోడు జంక్షన్, అనుపాలెం, రాజుపాలెం, రెడ్డిగూడెం మీదుగా ధూళిపాళ్ల దగ్గర రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. 12న గుంటూరులో మేమంతా సిద్ధం సభ సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు నగరంలో ఈనెల 12న ‘మేమంతా సిద్ధం’ సభ జరుగుతుందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ తలశిల రఘురాం తెలిపారు. మంగళవారం ఆయన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డితో కలిసి సభ జరిగే ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 12వ తేదీ ఉదయం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర సత్తెనపల్లి, మేడికొండూరు, పేరేచర్ల, నల్లపాడు, చుట్టుగుంట సెంటర్, వీఐపీ రోడ్ మీదుగా ఏటుకూరు చేరుకుంటుందని చెప్పారు. అక్కడ జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన సభలో ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్ మాట్లాడుతారని తెలిపారు. రాత్రికి గుంటూరు జిల్లాలోనే సీఎం జగన్ బస చేస్తారని వెల్లడించారు. 13వ తేదీ ఉదయం ఎన్టీఆర్ జిల్లాలోకి బస్సు యాత్ర ప్రవేశిస్తుందని తెలిపారు. -
మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. రేపటి షెడ్యూల్
సాక్షి, పల్నాడు: మేమంతా సిద్ధం 12వ రోజు బుధవారం (ఏప్రిల్ 10) షెడ్యూల్‌ను వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం మంగళవారం విడుదల చేశారు. ఈ యాత్రలో భాగంగా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉదయం 9 గంటలకు గంటావారిపాలెం రాత్రి బస నుంచి బయలుదేరుతారు. పుట్టవారిపాలెం, సంతమాగులూరు క్రాస్ , రొంపిచర్ల క్రాస్ , విప్పెర్ల, నెకరికల్లు మీదుగా దేవరంపాడు క్రాస్ వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం కొండమోడు, పిడుగురాళ్ల బైపాస్ మీదుగా సాయంత్రం 3.30 గంటలకు అయ్యప్పనగర్ బైపాస్ సభ ప్రాంగణంకు చేరుకుని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం కొండమోడు జంక్షన్ , అనుపాలెం, రాజుపాలెం, రెడ్డిగూడెం మీదుగా ధూళిపాళ్ళ దగ్గర రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. -
మీతోనే మా పయనం.. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో జన నినాదం
‘మేమంతా సిద్ధం యాత్రలో 11వ రోజున నా స్టార్ క్యాంపెయినర్లతో..’ అంటూ సీఎం వైఎస్ జగన్ సోమవారం కొన్ని ఫొటోలను ట్వీట్ చేశారు. కొందరు మహిళలు, వృద్ధులు తమ కష్టాలు చెప్పుకోగా.. వాటిని సావధానంగా విన్న సీఎం జగన్.. ‘నేనున్నానంటూ’ భరోసా ఇచ్చారు. అన్ని వర్గాల ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ.. వారితో మమేకమయ్యారు. మండే ఎండలో సీఎం జగన్‌ను చూసేందుకు ఓ అవ్వ రోడ్డు పైకి రాగా.. సీఎం ఆమెను ఆప్యాయంగా పలకరించారు. ‘పది కాలాల పాటు చల్లంగుండు నాయనా’ అంటూ ఆమె ఆశీర్వదించింది. అడుగడుగునా జగన్ పాలనకు మద్దతు తెలుపుతూ జనం కదం తొక్కారు. ఇంటికే ప్రభుత్వాన్ని తీసుకొచ్చి.. చేతిలో పథకాలను పెట్టిన నాయకుడి వెంటే మేమంతా అంటూ జనం ఎలుగెత్తిచాటారు. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం వెంకటాచలంపల్లిలోని బస శిబిరం నుంచి ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమైంది. భారీ జనసందోహం నడుమ ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన యాత్రకు జన హారతి లభించింది. అనంతరం పింఛన్ లబ్ధిదారులతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించారు. అక్కసుతోనే తమకు ఆసరాగా నిలిచిన వలంటీర్ వ్యవస్థను చంద్రబాబు అడ్డుకున్నారంటూ అవ్వాతాతలు ధ్వజమెత్తారు. పదికాలాల పాటు ముఖ్యమంత్రిగా సుపరిపాలన అందించాలని సీఎం జగన్‌కు ఆశీస్సులు అందించారు. వలంటీర్లే కావాలంటూ.. అందుకు మళ్లీ జగనే రావాలంటూ ముక్తకంఠంతో నినదించారు. కదంతొక్కిన కురిచేడు.. అవ్వాతాతలతో ముఖాముఖి అనంతరం బోధనంపాడు మీదుగా బస్సుయాత్ర దిగ్విజయంగా ముందుకు సాగింది. మార్గం మధ్యలో సీఎం జగన్ బస్సు దిగి.. సంక్షేమ పథకాల లబ్ధిదారులు, అవ్వాతాతలు, చిన్నారులను ఆప్యాయంగా పలకరించారు. ప్రభుత్వ పథకాల అమలు, వాటి వల్ల జరిగిన మంచిని అడిగి తెలుసుకున్నారు. రోడ్డుకు ఇరువైపుల అశేష జనవాహిని తమ అభిమాన నేత రాకను మనసారా స్వాగతించింది. ప్రకాశం జిల్లాలో ఆదివారం జన సునామీని తలపించిన బస్సు యాత్ర.. సోమవారం కురిచేడులోనూ అదే రీతిలో జనసంద్రంగా మారింది. మహిళలు సంక్షేమ సారథి విజయానికి మేమంతా సిద్ధం అంటూ ఘన స్వాగతం పలికారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా పోటెత్తారు. జన ప్రభంజనానికి అభివాదం చేస్తూ ముఖ్యమంత్రి జగన్ ముందుకు సాగారు. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 1.30 వరకు సీఎం జగన్ కురిచేడులో రోడ్‌షో నిర్వహించారు. ఆ తర్వాత ప్రకాశం జిల్లా నుంచి పల్నాడు జిల్లాలోని నూజెండ్ల మండలం చింతలచెరువులోకి బస్సుయాత్ర ప్రవేశించింది. పల్నాడు జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలు బాణసంచా కాల్చి, గజమాలలతో ఘన స్వాగతం పలికారు. ఐనవోలు గ్రామ శివారు, చింతలచెరువులో పెద్ద సంఖ్యలో అక్కచెల్లెమ్మలు రోడ్డుపై బారులుతీరారు. పొదిలి జంక్షన్లో జన హారతులు అందుకున్న సీఎం జగన్.. వినుకొండ అడ్డరోడ్డులో ప్రవేశించే సరికి మధ్యాహ్నం 3.30 గంటలు అయ్యింది. అనంతరం భోజన విరామం తీసుకున్నారు. అంతులేని అభిమానం వినుకొండలో రోడ్ షో అట్టహాసంగా సాగింది. మెయిన్ రోడ్డుతోపాటు శివయ్య çస్తూపం సెంటర్లో అభిమానులు గజమాలలతో సీఎం జగన్‌కు అపూర్వ స్వాగతం పలికారు. రోడ్లు, కూడళ్లు అభిమానులు, కార్యకర్తలతో కిక్కిరిసిపోయాయి. దారి పొడవునా గజమాలలు, తోరణాలతో సీఎం జగన్‌కు స్వాగతం పలుకుతూ.. ఉత్సవాన్ని తలపించేలా ముందుకు నడిపించారు. మేమంతా సిద్ధమంటూ వడివడిగా యాత్ర వెంట నడిచారు. భోజన విరామం అనంతరం వినుకొండలో రెండు గంటలకు పైగా యాత్ర కొనసాగింది. విఠంరాజుపల్లి, శావల్యాపురం గ్రామాల మీదుగా రాత్రి 8.30 గంటలకు గంటావారిపాలెంలో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం జగన్ చేరుకున్నారు. రాత్రయినా సరే జన నాయకుడిని చూసేందుకు చిన్నా, పెద్దా పోటీపడ్డారు. మార్గమధ్యంలో పలువురు అనారోగ్య బాధితులను చూసి చలించిపోయిన సీఎం జగన్.. వారికి వెంటనే అవసరమైన వైద్య సేవలు అందించాలంటూ అధికారులను ఆదేశించారు. చింతలపాలెంలో సీఎం జగన్‌కు కృతజ్ఞతలు చెప్పేందుకు కాన్వాయ్‌తో పోటీపడి పరుగుపెట్టిన యువకుడిని చూసి బస్సు దిగివచ్చి మరీ ఫొటో దిగి నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. ఇదీ చదవండి: అవ్వాతాతలూ ఆలోచించండి.. బాబు చెప్పేవన్నీ అబద్ధాలే! అవ్వాతాతల భావోద్వేగం సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమం, విద్య, వైద్యం, వ్యవసాయంలోని విప్లవాత్మ మార్పులకు తమ ఉజ్వల జీవితాలే నిదర్శనమంటూ ప్రజలు రోడ్లపైకి వచ్చారు. కన్నబిడ్డలు కూడు పెట్టకపోతే పింఛన్ సొమ్ము పొట్ట నింపుతోందంటూ భావోద్వేగానికి లోనయ్యారు. చిన్నారి కంటి సమస్యకు పరిష్కారం వినుకొండ టౌన్: తమ కుమార్తె ప్రైజీ(9) కంటి చూపు సమస్యను పరిష్కరించాలంటూ నూజెండ్ల మండలం కంభంపాడు గ్రామానికి చెందిన దంపతులు కీర్తిపాటి అనూరాధ, వేణుకుమార్‌లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు విన్నవించారు. చింతలచెరువు గ్రామం వద్ద వారు అర్జీ పట్టుకుని.. తనను కలవడానికి ప్రయత్నిస్తుండటాన్ని గమనించిన సీఎం.. తన సిబ్బంది ద్వారా అర్జీని తెప్పించుకొని, త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని చెప్పి పంపారు. అర్జీ ఇచ్చిన గంట వ్యవధిలోనే సీఎంవో నుంచి చిన్నారి తండ్రి వేణుకుమార్‌కు ఫోన్ వచ్చింది. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీంతో వారు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. దివ్యాంగురాలికి సీఎం ఆరోగ్యరక్ష మా పాప పుట్టిన కొంతకాలానికి మూర్చ వ్యాధి వచ్చింది. సకాలంలో చికిత్స చేయించకపోవడంతో మతిస్థిమితం కోల్పోయింది. ఆ తర్వాత శారీరక వైకల్యమూ శాపంగా మారింది. పాపకు చికిత్స చేయించే స్థోమత లేక ఇబ్బంది పడుతున్నాం. బస్సు యాత్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మా సమస్యను విన్నవించాం. ఆయన పెద్ద మనసు చూపారు. చికిత్స చేయించేందుకు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. మాపాలిట ఆపద్బాంధవుడు సీఎం జగన్. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాం. – నాగిశెట్టి రమాదేవి, సత్యనారాయణ, ఎన్ఎస్పీ కాలనీ, కురిచేడు, ప్రకాశం జిల్లా అంధురాలి చదువుకు సీఎం అభయం మా పాప చందన పుట్టుకతోనే అంధురాలు. బిడ్డకు ఇక కళ్లు రావని వైద్యులు చెప్పారు. కనీసం పాపను చదివించేందుకు ప్రభుత్వం తరఫున సాయం అందించాలని బస్సు యాత్రలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరాం. వెంటనే స్పందించిన సీఎం పాప చదువుకు అభయమిచ్చారు. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాం. – చిప్పగిరి పాపయ్య, రమణమ్మ, కురిచేడు, ప్రకాశం జిల్లా జగనన్న ధైర్యమిచ్చారు మా పాప నర్రా వర్షిణి ఆరో తరగతి చదువుతోంది. పుట్టిన 9వ నెల నుంచి తలసేమియా వ్యాధితో బాధపడుతోంది. ఇప్పటికే లక్షలాది రూపాయలు చికిత్స కోసం ఖర్చు చేశాం. ఫలితం లేకపోయింది. ప్రతినెలా రక్త మార్పిడికి రూ.10 వేలు, వైద్య పరీక్షలు, మందులకు రూ.10 వేలు మొత్తం రూ.20 వేలు ఖర్చు అవుతోంది. నా భర్త ఆటో డ్రైవర్. నేను చిన్న పాటి హోటల్ నిర్వహిస్తున్నా. మా బాధలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లేందుకు వెళ్లగా, ఆయన బస్సు వద్దకు పిలిపించుకుని మా సమస్యను విని నేనున్నానని భరోసా ఇచ్చారు. మీకు ఇబ్బందులు లేకుండా చూస్తానని ధైర్యం చెప్పారు. ఆపరేషన్ చేయించి మీ కుటుంబం సంతోషంగా ఉండేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. – నర్రా శివ లావణ్య, కళ్యాణిపురం, వినుకొండ పట్టణం, పల్నాడు జిల్లా వెన్నెముక దెబ్బతిన్న యువతికి అభయం నేను ఎం ఫార్మసీ చదివాను. మా గ్రామంలో ప్రభ విరిగి పడడంతో నా వెన్నెముక దెబ్బతింది. కాళ్లు చచ్చుపడ్డాయి. వీల్‌చైర్‌కే పరిమితమయ్యాను. సీఎం బస్సు యాత్రగా వస్తున్నారని తెలిసి బంధువుల సాయంతో వచ్చాను. రోడ్డుపక్కన వేచి ఉన్న నన్ను చూడగానే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బస్సు దిగి వచ్చి సమస్య తెలుసుకున్నారు. అండగా ఉంటానని అభయం ఇచ్చారు. తన ముఖ్యకార్యదర్శి హరికృష్ణను కలవాలని సూచించారు. చాలా ఆనందంగా ఉంది. సీఎం స్పందించిన తీరు అద్భుతం. – కొత్త తేజస్వీ, విఠంరాజుపల్లి, వినుకొండ రూరల్, పల్నాడు జిల్లా చిన్నారి వైద్యసాయానికి భరోసా మా బిడ్డ రోహిణికి 12 ఏళ్లు. ఐదేళ్ల నుంచి వెన్నెముక సమస్యతో బాధపడుతోంది. ఆరోగ్యశ్రీ వర్తించకపోవడంతో చికిత్స చేయించలేకపోయాం. రూ.ఐదు లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు. బస్సు యాత్ర సందర్భంగా శావల్యాపురంలో సీఎం జగన్‌ను కలిసేందుకు ప్రయత్నించాం. మమ్మలను చూడగానే సీఎం బస్సు దిగి వచ్చి మా సమస్య అడిగి తెలుసుకున్నారు. వెంటనే స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆపరేషన్ చేయిస్తానని భరోసా ఇచ్చారు. – పున్నారావు, ఝాన్సీ దంపతులు, శావల్యాపురం, పల్నాడు జిల్లా నా భూమిని మాజీ ఎమ్మెల్యే జీవీ అనుచరులు ఆక్రమించారు నాకు సీతారామపురం గ్రామంలో 2.46 ఎకరాల భూమి ఉంది. మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అనుచరులు ఆ భూమిని ఆక్రమించుకున్నారు. కేవలం 80 సెంట్లు మాత్రమే ఉన్నట్టు రెవెన్యూ రికార్డుల్లో చూపారు. నేను డాక్టర్‌ను. నడవలేని స్థితిలో ఉన్నా. నా సమస్యను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి చెబుదామని వచ్చాను. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సు ఆపి నా దగ్గరకు వచ్చి సమస్య తెలుసుకున్నారు. పరిష్కరించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. – డాక్టర్ మోదుగుల వెంకటేశ్వరమ్మ, సీతారామపురం, వినుకొండ, పల్నాడు జిల్లా సాగర్ జలాలకు హామీ తాగునీటికి ఇబ్బందులు పడుతున్నాం. మా గ్రామ చెరువుకు సాగర్ జలాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని బస్సుయాత్రగా గ్రామానికి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరాం. గ్రామ సర్పంచ్ వేమా శివ, మాజీ సర్పంచ్ బత్తుల చిన సుబ్బయ్య, నాయకుడు వేమా చిన్న ఆంజనేయులుతో కలిసి వెళ్లి సీఎంకు వినతిపత్రం ఇచ్చాం. పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. – బోధనంపాడు గ్రామస్తులు, కురిచేడు మండలం, ప్రకాశం జిల్లా (మేమంతా సిద్ధం బస్సు యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) -
Watch Live: వెంకటాచలంపల్లిలో సీఎం జగన్ ముఖాముఖి
-
జనమే జగన్ అంటూ...ఒంగోలులో జన ప్రభంజనం
-
మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజల బ్రహ్మరథం
-
సీఎం జగన్ బస్సు యాత్ర 11వ రోజు షెడ్యూల్..
-
నేడు సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ఇలా..
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 11వ రోజైన సోమవారం(ఏప్రిల్ 8) షెడ్యూల్‌ను వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఆదివారం విడుదల చేశారు. ఈ యాత్రలో భాగంగా సీఎం వైఎస్ జగన్ ఆదివారం రాత్రి బస చేసిన వెంకటాచలంపల్లి ప్రాంతం దగ్గర నుంచి సోమవారం ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు. ఉదయం 9.30 గంటలకు వెంకటాచలంపల్లి వద్ద సామాజిక పింఛన్ లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. బొదనంపాడు, కురిచేడు, చింతల చెరువు మీదుగా వినుకొండ అడ్డరోడ్డు వద్దకు చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. చీకటిగల పాలెం మీదుగా మధ్యాహ్నం 3 గంటలకు వినుకొండకు చేరుకొని రోడ్ షోలో పాల్గొంటారు. కనమర్లపూడి, శావల్యాపురం మీదుగా గంటావారిపాలెంలో రాత్రి బసకు చేరుకుంటారు. -
బాబును నమ్మితే పులికి బలే: సీఎం జగన్
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ‘ప్రకాశం జిల్లా పొదిలిలో ఈరోజు ఇసుక వేసినా రాలనంతగా జనసముద్రం, ప్రజా కెరటం కనిపిస్తోంది. మంచి చేసిన మన ప్ర భుత్వానికి మద్దతుగా ఆ మంచిని కొనసాగించేందుకు చేయీ చేయీ కలిపి చేస్తున్న నినాదమే సిద్ధం.. సిద్ధం! ప్రజల అజెండాతో మనం, జెండాలు జతకట్టి వారు తలపడుతున్న ఈ ఎన్నికల్లో పేదల వ్యతిరేకులను ఓడించి ఇంటింటా అభివృద్ధి, సంక్షేమాన్ని కొనసాగించేందుకు మీరంతా సిద్ధమేనా?’ అని ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు. 10వ రోజు బస్సు యాత్ర సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కొనకనమిట్ల జంక్షన్ వద్ద ఆదివారం జరిగిన ‘‘మేమంతా సిద్ధం’’ బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. ఎండ నిప్పులు చెరుగుతున్నా భారీ ఎత్తున తరలివచ్చిన జనసందోహాన్ని ఉద్దేశించి సీఎం మాట్లాడారు. ‘ప్రజల రాజ్యాన్ని, అవ్వాతాతల సంక్షేమ రాజ్యాన్ని, రైతు రాజ్యాన్ని, మహిళా పక్షపాత రాజ్యాన్ని, పిల్లల అభివృద్ధి రాజ్యాన్ని ధ్వంసం చేసేందుకు వస్తున్న మూడు పార్టీల కూటమిని అడ్డుకునేందుకు మీరంతా సిద్ధమేనా? ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు జరుగుతున్నవి కాదు. గత ఐదేళ్లుగా బాగుపడ్డ మీ పిల్లలు బడులు, చదువులు, అక్కచెల్లెమ్మల సాధికారత, అవ్వాతాతల సంక్షేమం, రైతుకు అందుతున్న భరోసా, సామాజిక న్యాయం.. ఇవన్నీ కొనసాగి మరో రెండు అడుగులు ముందుకు వేయాలా? లేక మోసపోయి వెనక్కు వెళ్లాలా? అన్నది నిర్ణయించే ఎన్నికలు ఇవి. ఈ ఎన్నికలు మన భవిష్యత్తును నిర్దేశిస్తాయి. రెండు అడుగులు ముందుకు వేయాలా? లేక మళ్లీ మోసపోయి వెనక్కు వెళ్లాలా? అనే అంశాన్ని నిర్ణయించే ఎన్నికలు అని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని కోరుతున్నా’ అని పేర్కొన్నారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. కొనసాగింపు.. ముగింపు మధ్య పోరాటం ఇవి జగన్‌కు, చంద్రబాబుకు మధ్య జరుగుతున్న ఎన్నికలు కావు. పేదలకు, బాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలివి. ఈ ఎన్నికల్లో మీ బిడ్డ జగన్‌ది పేదల పక్షం అని గర్వంగా చెబుతున్నా. మీ ప్రతి ఓటూ వచ్చే ఐదేళ్లు ఏ దారిలో నడవాలో నిర్ణయిస్తుంది. మీకు, మీ కుటుంబానికి మంచి కొనసాగుతుందా? లేదా? అనేది నిర్ణయిస్తుంది. ఐదు వారాల్లో జరగబోయే ఈ ఎన్నికల కురుక్షేత్రంలో జగన్‌కు ఓటు వేస్తే జరుగుతున్న ప్రతి మంచీ కొనసాగుతుంది. అదే చంద్రబాబుకు వేస్తే జగన్ తెచ్చిన పథకాలన్నింటికి ముగింపు పలికినట్లే. అందుకే బాగా ఆలోచించండి. ఓటు వేసే ముందు ఈ విషయాలన్నీ గుర్తుంచుకోండి. బాబు దారి ఎప్పుడూ అడ్డదారే... చంద్రబాబు దారి ఎప్పుడూ అడ్డదారే. ఆయనకు విలువలు, విశ్వసనీయత అన్న పదాలకు అర్థం తెలియదు. చంద్రబాబు మార్కు రాజకీయం ఏమిటంటే.. వెన్నుపోట్లు, దగా, మోసం, అబద్ధాలు, కుట్రలు. అవ్వాతాతా... ఈ చంద్రబాబు ఏం చేశాడో తెలుసా? తన మనిషి నిమ్మగడ్డ రమేష్‌తో నేరుగా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయించాడు. పెన్షన్లు పేదవాడి ఇంటికి వెళ్లకూడదట. వలంటీర్లు అలా వెళ్లటం నేరమట. పెన్షన్లు ఇంటికి వెళ్లి ఇచ్చే కార్యక్రమం ఇవాళ కొత్తగా జరగడం లేదు. ఇంటికి వెళ్లి అందించి ప్రతి అవ్వాతాత ముఖంలో చిరునవ్వు చూసే కార్యక్రమం గత 58 నెలలుగా జరిగింది. చంద్రబాబు హయాంలో ఎప్పుడూ జరగని విధంగా మన ప్రభుత్వం వచ్చాకే అది ఆదివారమైనా, సెలవురోజైనా 1వ తారీఖు ఉదయాన్నే వలంటీర్ మనవడు, మనవరాళ్లు అవ్వాతాతల వద్దకు ఇంటికివెళ్లి చేతిలో పెన్షన్లు పెట్టారు. చంద్రబాబు హయాంలో రూ.1,000 మాత్రమే అరకొరగా ఇస్తే మీ బిడ్డ ప్రభుత్వం వచ్చాక రూ.3 వేలకు పెంచుకుంటూ వెళ్లి ఇంటివద్దే అందించే ఓ గొప్ప వ్యవస్థను తెచ్చింది. చంద్రబాబు హయాంలో మాదిరిగా జన్మభూమి కమిటీలు, లంచాలు, వివక్ష లేదు. ఎక్కడెక్కడికో తిరిగి క్యూలో నిలబడి నరకయాతన అనుభవించిన రోజులు చంద్రబాబు పాలనలో చూశాం. వలంటీరు వ్యవస్థ చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. అందుకే కుట్ర రాజకీయాలు చేస్తున్నారు. వలంటీర్లు మన ఇంటికి రాకుండా కట్టడి చేసే దిక్కుమాలిన ఆలోచనలు చేస్తున్నాడు. అవ్వాతాతల మరణాలకు కారకుడు.. ఇలాంటి దిక్కుమాలిన ఫిర్యాదు చేసి ఈరోజు అవ్వాతాతలను, వ్యాధిగ్రస్తులను, అభాగ్యులైన నా అక్కచెల్లెమ్మలను, దివ్యాంగులను మండే ఎండలో నడి రోడ్డుపై నిలబెట్టడమే కాకుండా 30 మంది పైచిలుకు అవ్వలు, తాతల చావులకు కారకుడైన చంద్రబాబు సిగ్గుతో తలొంచుకోవాలి. తన స్వార్థ రాజకీయాలకు అనేక మంది మరణానికి కారణమైన ఈ అన్యాయస్తుడిని శాడిస్ట్ అనక మరేమంటారో మీరే చెప్పండి. ఈ ఎన్నికల సమయంలో, అధికారం మన చేతుల్లో లేని సమయంలో మాత్రమే పెన్షన్ మన ఇంటికి రాకుండా ఎందుకు ఆగింది? అది ఆగలేదు.. అడ్డుకోబట్టే రాకుండా పోయింది. శాడిస్ట్ అంటే ఎవరంటే... తన 14 ఏళ్ల పాలనలో ఏనాడూ ఇంటికి పెన్షన్ ఇవ్వని చంద్రబాబు కుట్రలతో, అక్కసుతో ఆపించాడు. కాబట్టే ఈరోజు నేను చంద్రబాబును, దొంగల ముఠాను అడుగుతున్నా. శాడిస్ట్ అంటే ఎవరు? శాడిజం అంటే ఏమిటి? ఒకరికి మంచి జరుగుతుంటే చూడలేని వాడు శాడిస్ట్. పేదవాడు పెద్దవాడు అవుతుంటే ఓర్వలేని వాడు శాడిస్ట్. పేదలకు ఇళ్లు కట్టించడం కోసం ప్రభుత్వం స్థలాలు ఇస్తుంటే కోర్టుకు వెళ్లి మరీ అడ్డుకునే వాళ్లను శాడిస్ట్ అంటారు. వ్యవసాయం దండగ అని మాట్లాడిన మనిషిని శాడిస్ట్ అంటారు. రైతులకు ఉచితంగా విద్యుత్ ఇస్తే ఆ కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని వెటకారం చేసిన వ్యక్తి శాడిస్ట్ అంటే. ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ ఎస్సీలను, బీసీలను, ఎస్టీలను, మైనార్టీలను కించపరుస్తూ మాట్లాడితే గ్రామాల్లో వాళ్ల పరిస్థితి ఏమిటి అని కూడా ఆలోచన చేయకుండా దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని అవమానించిన చంద్రబాబును శాడిస్ట్ అంటారు. అవునా? కాదా? ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీషు మీడియం పెడుతుంటే అడ్డుకుని అక్కసు వెళ్లగక్కిన బాబుకన్నా పెద్ద శాడిస్టు ప్రజాస్వామ్య చరిత్రలో ఎవరైనా ఉంటారా? మీ బిడ్డ నేరుగా అందించే డీబీటీ స్కీముల వల్ల పేదలకు మంచి జరుగుతోందని తెలిసి కూడా రాష్ట్రం శ్రీలంకలా అయిపోతోందంటూ దిక్కుమాలిన ప్రచారం చేసిన నిన్ను శాడిస్ట్ అనక ఏమనాలి చంద్రబాబూ? వలంటీర్లను కించపరిచిన శాడిస్ట్ గ్యాంగ్.. సేవా భావంతో ఇంటింటికీ ప్రభుత్వ పథకాలను చేరవేస్తున్న వలంటీర్లను కించపరుస్తూ మూటలు మోసే వాళ్లని, ఇంట్లో మగవాళ్లు లేనప్పుడు తలుపులు కొడుతున్నారని, ఆబోతుల్లా పడుతున్నారని, అమ్మాయిలను ట్రాఫికింగ్ చేయిస్తున్నారని నీచంగా మాట్లాడిన నువ్వు, నీ గ్యాంగు శాడిస్టులు కాకపోతే మరి ఎవరయ్యా? అని అడుగుతున్నా చంద్రబాబును. మన ప్రభుత్వం వల్ల తనకు మేలు జరిగింది అని చెప్పినందుకు నా చెల్లెమ్మ గీతాంజలిని సోషల్ మీడియా సైకోలతో వేధించి ప్రాణం తీసిన నీకంటే పెద్ద శాడిస్ట్ ఎవరైనా ఉంటారా చంద్రబాబూ? 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు పేరు చెబితే ఒక్కటంటే ఒక్క స్కీమైనా గుర్తుకొస్తుందా? ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్దామా? మన జెండా తలెత్తుకుని రెపరెపలాడుతుంటే.. వారి జెండా మరో నాలుగు జెండాలతో జత కట్టినా కూడా ఎగరలేక కింద పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. చంద్రబాబు, కూటమి చరిత్ర ఏమిటి? 2014లో ఏం చెప్పారో ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్దామా? ముఖ్యమైన హామీలు ఒక్కసారి చూద్దాం. రూ.87,612 కోట్ల రైతుల రుణమాఫీ చేశాడా? రూ.14,205 కోట్ల పొదుపు సంఘాల రుణాలు ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా? ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకులో డిపాజిట్ చేశారా? ఇంటింటికీ ఒక ఉద్యోగం లేదంటే రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు. 60 నెలల్లో నెలకు రూ.2 వేల చొప్పున రూ.1.20 లక్షలు మీ ఇంటికి వచ్చాయా? పేదలకు 3 సెంట్ల స్థలం కథ దేవుడెరుగు ఒక్క సెంటు స్థలమైనా, కనీసం ఒక్కరికైనా ఇచ్చాడా? రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత, పవర్ లూమ్స్ రుణాల మాఫీ.. అయ్యాయా? మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేశాడా? రాష్ట్రాన్ని సింగపూర్‌కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. మీ పొదిలిలో ఏమన్నా హైటెక్ సిటీ కనిపిస్తోందా? మార్కాపురంలో అయినా కనిపిస్తోందా? పోనీ ఒంగోలులో కనిపిస్తోందా? పోనీ ప్రత్యేక హోదా ఇచ్చారా? ఇదే చంద్రబాబు మరోసారి కూటమి కట్టి మళ్లీ వస్తున్నాడు. చంద్రబాబును నమ్మడం అంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే. ఇలాంటి మోసగాళ్ల బారి నుంచి రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకునేందుకు మీరంతా సిద్ధమేనా? సెల్ ఫోన్ టార్చ్ లైట్ వెలిగించి సిద్ధమే అని గట్టిగా నినదించండి. ఇంటింటా జగన్ మార్కు ► మన 58 నెలల పాలన ప్రోగ్రెస్ రిపోర్టును పరిశీలిస్తే గ్రామ గ్రామాన తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు కనిపిస్తాయి. గ్రామ, వార్డు సచివాలయాలంటే మీ జగన్. రైతు భరోసా కేంద్రాలంటే మీ జగన్. విలేజ్ హెల్త్ క్లినిక్ అంటే మీ జగన్. ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష అంటే మీ జగన్. అవ్వాతాతలకు ఇంటికే వచ్చిన రూ.3 వేల పెన్షన్ అంటే మీ బిడ్డ జగన్. ఇంటింటికీ వలంటీర్ సేవలంటే మీ జగన్. రైతు భరోసా అంటే మీ జగన్. పగటిపూటే నాణ్యమైన ఉచిత కరెంట్, సమయానికి ఇన్ పుట్ సబ్సిడీ, సున్నా వడ్డీకే రుణాలు, ఉచిత పంటల బీమా.. ఇవన్నీ అంటే మీ బిడ్డ జగన్. ఆక్వా రైతులకు రూపాయిన్నరకే కరెంటు అంటే కూడా మీ జగనే. అమూల్ ద్వారా పాడి రైతులకు లీటరుకు రూ.10 నుంచి రూ.20 వరకు సేకరణ ధరలు పెరిగాయంటే కారణం మీ జగన్. వందేళ్ల తర్వాత భూముల రీ సర్వే చేయిస్తున్నది ఎవరంటే మీ జగన్. ఏకంగా 35 లక్షల ఎకరాల మీద పేదలకు సంపూర్ణ హక్కులు కల్పించింది ఎవరంటే మీ జగన్. ఇన్ని విప్లవాలు ఒక్క జగన్ పాలనలోనే 58 నెలల్లో సాకారం కావడంతో చంద్రబాబు 20 జెలూసిల్ మాత్రలు వేసుకున్నా తగ్గనంత అసూయతో, కడుపు మంటతో బాధపడుతున్నాడు. ► నాడు నేడు, ఇంగ్లీషు మీడియంతో ప్రభుత్వ బడుల రూపు రేఖలు మారాయంటే కారణం మీ జగన్. పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ అక్కచెల్లెమ్మలకు అమ్మ ఒడి అందుతోందంటే కారణం మీ జగన్. విద్యాదీవెన, వసతి దీవెన, విద్యా కానుక, గోరు ముద్ద, బైలింగ్వల్ టెక్టŠస్‌బుక్స్, ట్యాబులు, 6వ తరగతి నుంచి ప్రతి క్లాసులో ఐఎఫ్‌పీ ప్యానెల్స్‌తో క్లాసు రూములు ఉన్నాయంటే కారణం మీ జగన్. ► పేదలెవరూ అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదని ఆరోగ్యశ్రీని విస్తరించి ఏకంగా రూ.25 లక్షల దాకా ఉచితంగా వైద్యం అందిస్తున్న ప్రభుత్వం మీ జగన్‌దే. ఆరోగ్య ఆసరా అందుతోందంటే కారణం మీ జగన్. ప్రభుత్వ ఆస్పత్రులు మారాయంటే కారణం మీ జగన్. ఏకంగా 54 వేల కొత్త పోస్టులు వైద్య రంగంలో భర్తీ అయ్యాయంటే, రాష్ట్రంలో 17 కొత్త మెడికల్ కాలేజీలు వస్తున్నాయంటే కారణం మీ జగన్. ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, అక్కచెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు, 22 లక్షల ఇళ్లు నిర్మాణం జరుగుతున్నాయంటే కారణం మీ జగన్. ఆసరా, సున్నా వడ్డీ, దిశా యాప్‌తో అక్కచెల్లెమ్మలు భరోసాగా ఉన్నారంటే కారణం మీ జగన్. నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, వాహన మిత్ర, చేదోడు, లా నేస్తం అంటే మీ జగన్. ఏకంగా చట్టం చేసి మరీ నామినేటెడ్ పదవులు, కాంట్రాక్టుల్లో అక్కచెల్లెమ్మలకు 50 శాతం రిజర్వేషన్లతో రాజకీయ సాధికారత దక్కిందంటే కారణం మీ బిడ్డ జగన్. ► 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను ఈ 58 నెలల కాలంలో భర్తీ చేస్తే ఏకంగా 80 శాతం ఉద్యోగాలు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే తమ్ముళ్లు, చెల్లెమ్మలకే దక్కాయి. బటన్ నొక్కి డీబీటీతో అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పంపించిన రూ.2.70 లక్షల కోట్లలో ఏకంగా 75 శాతం పైచిలుకు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే లబ్ధి చేకూరిందంటే సామాజిక న్యాయానికి ఇంతకన్నా గొప్ప అర్థం ఏముంటుంది? ► ఈరోజు రాష్ట్రంలో కొత్తగా నాలుగు పోర్టులు వేగంగా నిర్మాణంలో ఉన్నాయి. 10 కొత్త ఫిషింగ్ హార్బర్లు, కొత్తగా 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు నిర్మాణం జరుగుతున్నాయి. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వాయువేగంతో నిర్మాణం జరుగుతోంది. 17 కొత్త మెడికల్ కాలేజీల నుంచి ఏది తీసుకున్నా ఈ 58 నెలల కాలంలోనే అడుగులు పడ్డాయని గర్వంగా చెబుతున్నా. ఇవన్నీ మన కళ్ల ఎదుటే కనిపిస్తున్న సత్యాలు. ► ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రతి ఒక్కరి మంచి కోసం, ఇంటింటి అభివృద్ధి కోసం మీ బిడ్డ ఉపయోగిస్తే చంద్రబాబు మాత్రం దోచుకోవడానికి, పంచుకోవటానికి ఉపయోగించాడు. అప్పుడు కూడా ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్. కానీ అప్పుల గ్రోత్ రేటు అప్పటికన్నా ఇప్పుడే తక్కువ. మరి మీ బిడ్డ ఈ కార్యక్రమాలన్నీ ఎలా చేయగలిగాడు? చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడు? అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను సీఎం జగన్ ఈ సందర్భంగా ప్రజలకు పరిచయం చేశారు. అభ్యర్థులందరినీ ఆశీర్వదించాలని కోరారు. ఆయనకన్నా పెద్ద శాడిస్టు ఎవరుంటారు...? మన ప్రభుత్వంలో తనకి మేలు జరిగిందని చెప్పినందుకు నా చెల్లెమ్మ గీతాంజలిని సోషల్ మీడియాలో టీడీపీ సైకోలతో వేధించి ప్రాణం తీసిన చంద్రబాబు కన్నా పెద్ద శాడిస్ట్ ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉంటారా? అని సీఎం జగన్ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా... గతంలో ఎప్పుడూ చూడని విధంగా ప్రతి గ్రామంలో సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్‌లు, ఇంగ్లీష్ బడులు కనిపిస్తున్నాయి. ఇలా ఏది తీసుకున్నా జరిగింది ఈ 58 నెలల కాలంలోనే, మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగానే అంటూ ఆదివారం సీఎం జగన్ ట్వీట్ చేశారు. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా కొనకనమిట్ల: ‘జగనన్న ఆశీస్సులతో ఒంగోలు పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్నా.. మీ ఆశీస్సులు అందించండి. నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. మీ కుటుంబ సభ్యుల్లో ఒకడిగా ఉంటా..’ అని ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. 1988 నుంచి 36 ఏళ్లుగా వైఎస్సార్ కుటుంబంతో తన అనుబంధం కొనసాగుతోందన్నారు. ‘ఒంగోలు ప్రజలు ఎంతో మంచివారు. ఈ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయమని జగనన్న నన్ను పంపాడు. మీ అందరి అండదండలు నాకు ఉండాలి. నాకు వ్యాపారాలు, వ్యాపకాలు, వ్యసనాలు లేవు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను అభివృద్ధి చేయడమే నా లక్ష్యం. నేనిక్కడే నివాసముంటా. మీ కష్టసుఖాల్లో తోడుగా ఉంటా. ఒంగోలు పార్లమెంట్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా’ అని చెప్పారు. ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న తనతోపాటు ఏడుగురు ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని కోరారు. తండ్రి ఆశయం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం తపిస్తున్న ఏకైక సీఎం వైఎస్ జగన్ అని తెలిపారు. – ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి ఆకాంక్షలు నెరవేర్చిన జననేత మార్కాపురం: ఐదేళ్ల పాలనలో 99 శాతం హామీలను నెరవేర్చిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అని మార్కాపురం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబు పేర్కొన్నారు. వైఎస్ జగన్‌కు ఓటు ఎందుకు వేయాలి? ప్రతిపక్షాలకు ఎందుకు వేయకూడదు? అనేది ప్రజలు ఆలోచించాలన్నారు. నవరత్నాలు అనే రెండు పేజీల మేనిఫెస్టో ద్వారా జగనన్న ప్రజల ఆకాంక్షలను నెరవేర్చారన్నారు. చెప్పినవే కాకుండా చెప్పనివాటిని సైతం అమలు చేసిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అని చెప్పారు. మీ కుటుంబానికి మంచి జరిగితే ఓటు వేసి ఆశీర్వదించాలని ధైర్యంగా అడిగిన నేత ఒక్క జగనన్న మాత్రమేనన్నారు. పేదలకు అండగా ఉండేందుకు ఈ ప్రభుత్వానికి మరోసారి ఆశీస్సులు అందించాలని కోరారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయడమే కాకుండా మెడికల్ కాలేజీని కూడా మంజూరు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌దేనన్నారు. వైఎస్ జగన్‌ను మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకుని రాష్ట్రాభివృద్ధి కొనసాగేందుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. – అన్నా రాంబాబు, మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థి -
‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. రేపటి షెడ్యూల్ ఇలా..
సాక్షి, ప్రకాశం జిల్లా: మేమంతా సిద్ధం 11వ రోజు సోమవారం (ఏప్రిల్ 8) షెడ్యూల్‌ను వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఆదివారం విడుదల చేశారు. ఈ యాత్రలో భాగంగా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉదయం 9 గంటలకు వెంకటా చలంపల్లి రాత్రి బస చేసిన ప్రాంతం దగ్గర నుంచి బయలుదేరుతారు. ఉదయం 9:30 గంటలకి వెంకటాచలంపల్లి దగ్గర సామజిక పింఛన్ లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం బొదనంపాడు, కురిచేడు, చింతల చెరువు మీదుగా వినుకొండ అడ్డరోడ్ వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం చీకటిగల పాలెం మీదుగా వినుకొండ 3 గంటలకు చేరుకుని రోడ్ షో కార్యక్రమంలో పాల్గొంటారు. తరువాత కనమర్లపూడి, శావల్యాపురం మీదుగా గంటావారిపాలెం రాత్రి బసకు చేరుకుంటారు. ఇదీ చదవండి: చంద్రబాబు దారి అడ్డదారి: సీఎం జగన్ -
చంద్రబాబు దారి అడ్డదారి: సీఎం జగన్
సాక్షి, ప్రకాశం జిల్లా: చంద్రబాబు.. నిమ్మగడ్డ రమేష్‌తో ఈసీకి ఫిర్యాదు చేయించి పెన్షన్లను అడ్డుకున్నారని కొనకనమిట్ల సభ వేదికగా ‘ఎల్లో బ్యాచ్’ కుట్రలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు దారి అడ్డదారి.. పేదల భవిష్యత్‌ను అడ్డుకునేందుకు మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి. ప్రజల ఎజెండాతో మనం.. జెండాలు కట్టి వాళ్లు.. జగన్‌కు, చంద్రబాబుకు మధ్య జరుగుతున్న ఎన్నికలు కావు. ప్రజలకు, చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు’’ అంటూ సీఎం జగన్ దుయ్యబట్టారు. ఇది చంద్రబాబు మార్క్ రాజకీయం.. ‘‘వెన్నుపోట్లు, దగా, మోసం, అబద్దాలు, కుట్రలు చంద్రబాబు మార్క్ రాజకీయం. ఇంటింటికి అందుతున్న సంక్షేమాన్ని కొనసాగించేందుకు మీరంతా సిద్ధమా?. మన అడుగులు ముందుకా.. వెనక్కా అని తేల్చే ఎన్నికలివి. చంద్రబాబుకు ఓటేస్తే జగన్ తెచ్చిన పథకాలకు ముగింపే. చంద్రబాబు ఆలోచనలు ఎప్పుడూ పాతాళంలో ఉంటాయి’’ అని సీఎం జగన్ ధ్వజమెత్తారు. అవ్వాతాతలను చంపుతున్న నరహంతకుడు చంద్రబాబు ‘‘56 నెలలుగా అందుకున్న పెన్షన్లను అర్ధాంతరంగా నిలిపివేయించాడు. ఆదివారమైనా, సెలవురోజైనా వాలంటీర్లు ఇంటికొచ్చి పింఛన్లు ఇచ్చేవారు. మండే ఎండలో పేదలను నడిరోడ్డుపై నిలబెట్టాడు. అవ్వాతాతలను చంపుతున్న నరహంతకుడు చంద్రబాబు. వాలంటీర్ వ్యవస్థ చంద్రబాబు గుండెల్లో రైళ్లు పెరిగెత్తించింది. అందుకే వాలంటీర్లు లేకుండా చంద్రబాబు కుట్ర. తన రాజకీయం కోసం పేదల్ని చంపే చంద్రబాబు శాడిస్ట్ కాక ఇంకేంటి?. పేదలకు మంచి జరుగుతుంటే చూడలేని వాడే శాడిస్టు’’ అంటూ చంద్రబాబుపై సీఎం జగన్ నిప్పులు చెరిగారు. చంద్రబాబులో తగ్గని కడుపుమంట.. అవ్వాతాతలను చంపిన చంద్రబాబును శాడిస్టు అనాలి. దళితులను అవమానించని వాడిని శాడిస్టు అనాలా? వద్దా?. మన ప్రభుత్వంలో మంచి జరుగుతోందని గీతాంజలి చెప్పడమే ఆమె చేసిన పాపం. తన మనుషులతో సోషల్‌మీడియాలో గీతాంజలిని వేధించి చంపారు. 20 జెలొసిల్ ట్యాబ్లెట్లు వేసుకున్నా తగ్గని కడుపుమంట చంద్రబాబులో కనిపిస్తోంది. అసూయ, కుళ్లు, కడుపు మంటతో చంద్రబాబు బాధపడుతున్నాడు. చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తుకువస్తుందా?. మహిళల సాధికారితకు పెద్దపీట వేశాం. ఆక్వారైతులకు రూపాయిన్నరకే విద్యుత్ అందిచాం. వందేళ్ల తర్వాత భూముల్ని రీ సర్వే చేయిస్తున్నాం’’ సీఎం జగన్ వివరించారు. చంద్రబాబు చరిత్ర ఏంటో అందరికీ తెలుసు.. ‘‘ప్రతీ ఇంటికీ మంచి కోసం మనం అధికారాన్ని ఉపయోగించాం. మేం చేసిన పనులన్నీ కళ్ల ముందు కనిపిస్తున్నాయి. చంద్రబాబు మాత్రం దోచుకోవడం కోసం అధికారాన్ని దుర్వినియోగం చేశారు. చంద్రబాబు చరిత్ర ఏంటో అందరికీ తెలుసు. జన్మభూమి కమిటీలతో పేదలను ఇబ్బంది పెట్టారు. 2014లో ఈ ముగ్గురే కూటమిగా ఏర్పడ్డారు. ముఖ్యమైన హామీలు అంటూ చంద్రబాబు ఇంటింటికి కరపత్రాలు పంపించారు. 2014లో ఈ మూడు పార్టీలు ఏం హామీలిచ్చాయో అందరికి తెలుసు. పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామన్నారు.. చేశారా?. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు.. నెలకు రూ.2వేలు ఇచ్చారా?’’ అంటూ సీఎం జగన్ నిలదీశారు. విప్లవాలు మీ బిడ్డ పాలనలో సాగాయి.. 14 ఏళ్లుగా సీఎంగా పనిచేసిన చంద్రబాబు ఒక్క స్కీం కూడా తీసుకురాలేదు. గ్రామ, వార్డు, సచివాలయాలంటే మీ జగన్.. మీ బిడ్డ. గ్రామగ్రామాన విలేజ్ క్లీనిక్ అంటే.. మీ జగన్.. మీ బిడ్డ. ఇంటింటికి వాలంటీర్ల సేవలంటే.. మీ జగన్.. మీ బిడ్డ. అవ్వాతాతలకు పెన్షన్ అంటే మీ జగన్.. మీ బిడ్డ. విప్లవాలు మీ బిడ్డ పాలనలో సాగాయి. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ బడులు రూపురేఖలు మార్చాం. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. ఆరోగ్యశ్రీ పరిధిని రూ.25 లక్షలకు పెంచాం. రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీలు వస్తున్నాయి’’ అని సీఎం జగన్ తెలిపారు. -
భారీ జన సంద్రోహం మధ్యలో సీఎం జగన్ బస్సు యాత్ర
-
మేమంతా సిద్ధం బస్సుయాత్రకు అపూర్వ జన స్పందన
-
10వ రోజు సీఎం జగన్ బస్సు యాత్ర..భారీగా వచ్చిన జనసందోహం
-
మేమంతా సిద్ధం@ డే10: ప్రజలతో సీఎం జగన్ మమేకం (ఫొటోలు)
-
సీఎం జగన్ కు స్వాగతం పలికేందుకు 10 గజ మాలలతో భారీ ఏర్పాట్లు
-
Watch Live: సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్ర డే 10
-
నేడు ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర
-
సీఎం జగన్ బస్సు యాత్ర నేటి షెడ్యూల్
-
మోసానికి మారుపేరు చంద్రబాబు: సీఎం వైఎస్ జగన్
ప్రజలకు ఫలానా మంచి చేశానని చెప్పుకోలేని వ్యక్తి చంద్రబాబు. వెన్నుపోట్లు పొడిచో, తడిగుడ్డతో గొంతు కోసో, కుట్రలు చేసో, కుతంత్రాలు చేసో, లేదా పొత్తులు పెట్టుకొనో, లేక ఎల్లో మీడియాలో అబద్ధపు వార్తలు ప్రచారం చేయించు కొనో.. ఏదోలా మొత్తానికి 30 ఏళ్ల క్రితమే ముఖ్యమంత్రి అయ్యారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన మీరు.. నిజంగా మంచి చేసి ఉంటే ఆ పార్టీలతో ఎందుకు పొత్తు పెట్టుకున్నట్లు? మేనిఫెస్టోలో కనీసం 10 శాతం హామీలు కూడా అమలు చేయలేదు. ప్రజల్ని మభ్య పెట్టడమే మీకు తెలిసిన విద్య. నా గతాన్ని చూసి ఓటు వేయండని ప్రజలను అడిగే ధైర్యం ఉందా చంద్రబాబూ? – సీఎం వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘మోసం, అబద్ధాలు, వెన్నుపోట్లు, కుట్రలు.. ఈ పాత్రలన్నీ కలిపితే చంద్రబాబు. సినిమాల్లో విలన్ క్యారెక్టర్లలో మనకు నచ్చనివన్నీ కలిపితే పుట్టే కొత్త క్యారెక్టర్ అన్నమాట. ఈ క్యారెక్టర్.. చంద్రబాబును 4 నెలలుగా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా. 14 ఏళ్లు సీఎంగా చేశావు.. 3 సార్లు సీఎంగా చేశానని చెప్పుకుంటావు. మరి నీ పేరు చెబితే పేదలకు గుర్తుకొచ్చే పథకం కనీసం ఒక్కటంటే ఒక్కటైనా ఉందా? నువ్వు చేసిన మంచి పని ఏదైనా ఉందా? మీ ముందే, మీ సమక్షంలో.. ఇలా సిద్ధం సభల్లో లక్షలాది మంది ముందు ఇప్పటికే ఎన్నోసార్లు అడిగాను. నాకైతే సమాధానం చెప్పలేదు. పోనీ, మీకైనా చెప్పాడా.. అంటే అదీ లేదు’ అని సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపడ్డారు. ఇదే మోసాల బాబును మరో ప్రశ్న కూడా అడిగానన్నారు. ‘ఎన్నికల ముందు మూడుసార్లు ఎన్నికల మేనిఫెస్టో అంటూ రంగు రంగుల కాగితాలు ఇచ్చావు. ఎన్నికలైన తర్వాత ఒక్కసారి అయినా ఇలా.. నాలా.. పబ్లిక్‌గా నీ మేనిఫెస్టో చూపించి, ఇదిగో నా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు.. ఇదిగో నెరవేర్చాను.. అని చెప్పావా? మేనిఫెస్టోలో నీవు చెప్పింది ఒక్కటైనా అమలు చేశావా? చంద్రబాబు ఎన్నికలకు ముందు మాత్రమే మేనిఫెస్టో చూపిస్తాడు. ఆ తర్వాత అది చూపించరు. నాకైతే చూపించలేదు. పోనీ మీకైనా చూపించాడా? అసలు మేనిఫెస్టో కాపీలైనా చూపించే దమ్ము, ధైర్యం, నిబద్ధత నీకు ఉందా బాబూ..?’ అని నిప్పులు చెరిగారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా శనివారం ఆయన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి బహిరంగ సభలో మాట్లాడారు. సీఎం ఏమన్నారంటే.. వారంతా తోడేళ్లు, మోసగాళ్లు ► ప్రజలను మోసం చేయటమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబుకు, ప్రజలకు మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. మీ బిడ్డ జగన్ పేదల పక్షం, ప్రజల పక్షం. ఈ యుద్ధంలో అటువైపు చంద్రబాబు, దత్తపుత్రుడు.. వీరిద్దరికీ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 తోడుగా ఉన్నారు. వీళ్లు సరిపోరని ఈ రా ష్ట్రాన్ని విడగొట్టిన ఒక జాతీయ పార్టీ, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా అన్యాయం చేసిన మరొక జాతీయ పార్టీ.. వీళ్లంతా ప్రత్యక్షంగా, పరోక్షంగా చంద్రబాబు పక్షమే. అవతలి పక్షంలో తోడేళ్లు, మోసగాళ్లుగా ఉంటున్న వాళ్లంతా కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారు. వీరందరికీ వ్యతిరేకంగా మేమంతా సిద్ధం.. సిద్ధం.. అని లక్షల సింహాల గర్జనతో మన జైత్ర యాత్ర ముందుకు సాగుతోంది. ► ‘మే 13న జరిగే ఈ ఎన్నికల్లో మన పార్టీకి, మన ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి పేదలు, పిల్లలు, అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, రైతులు, బడుగులు, బలహీన వర్గాలు, మైనార్టీలు, వృత్తి వర్గాల వారంతా సిద్ధమేనా? మూడు ప్రాంతాల ప్రజల ప్రయోజనాలను రక్షించుకునేందుకు, జరిగిన మంచిని కొనసాగించేందుకు మీరంతా సిద్ధమేనా? ధర్మాన్ని గెలిపించడం కోసం, విశ్వసనీయతను కాపాడుకునేందుకు మీరంతా.. సిద్ధమేనా?’ అని ప్రజలను ప్రశ్నించారు. (సిద్ధమేనని జనం నినదించారు). ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ప్రజలకు మంచి చేశానని బాబు చెప్పలేడు ► నేను అది చేస్తాను.. నేను ఇది ఇస్తాను అని చెబుతాడు తప్ప.. తన గతం గురించి చెప్పడు. ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమంగా నాకు ఓటేస్తే కేజీ బంగారం ఇస్తాను, నాకు ఓటేస్తే ఇంటింటికీ బెంజ్ కారు కొనిస్తాను, సూపర్ సిక్స్.. సూపర్ సెవెన్ అని మాట్లాడతాడు తప్ప ఫలానా మంచి స్కీము తెచ్చాను.. దాన్ని చూసి నాకు ఓటు వేయండని ఈ పెద్దమనిషి అడగలేరు. ►ఎందుకంటే ప్రజలతో, పేదలతో ఈ పెద్దమనిషిది అతకని బంధం. చేసిన మంచి ఏమీ లేక నోటికి ఫెవికాల్ వేసుకుంటాడు. ఫెవిక్విక్ పూసుకుని నోరు మూసుకుంటాడు. మరి మీ బిడ్డ జగన్ ఇంటింటికీ మంచి చేస్తూ, ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు డీబీటీగా నేరుగా బటన్ నొక్కి నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఆ డబ్బులు జమ చేశారు. ఇంటింటికీ పౌర సేవలు డోర్ డెలివరీ చేయిస్తున్నాడు. అది పెన్షన్ కావచ్చు, రేషన్ కావచ్చు, వివిధ పథకాలు కావచ్చు.. లేదా బర్త్ సరి్టఫికెట్, కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ కావచ్చు. ►మేనిఫెస్టో అంటే మన దృష్టిలో ఒక భగవద్గీత, ఖురాన్, బైబిల్. ఎన్నికల తర్వాత చంద్రబాబులా చెత్తబుట్టలో వేయాల్సింది కాదు. ఆ ఎన్నికల మేనిఫెస్టోలో ఏకంగా 99 శాతం హామీలు నెరవేర్చి మీ బిడ్డ మళ్లీ మీ ముందుకు వచ్చి నిలబడి మీ ఆశీస్సులు కోరుతున్నాడు. లంచాలు, వివక్ష లేని వ్యవస్థను తెచ్చాం ► మీ జగన్ లంచాలు లేని, వివక్ష లేని వ్యవస్థ తీసుకొచ్చాడు. గత ఎన్నికల్లో ఓటు వేయని వారికి సైతం అర్హత ఉంటే చాలని మేలు చేశాడు. గ్రామాల్లో స్కూళ్లు, ఆస్పత్రులను మార్చాడు. వ్యవసాయ రంగానికి ఊతంగా నిలిచాడు. సామాజిక న్యాయానికి అర్థం చెప్పాడు. అవ్వాతాతల సంక్షేమం, అక్కచెల్లెమ్మల సాధికారత అంటే ఇదీ అని చేసి చూపించాడు మీ బిడ్డ జగన్. మీ బిడ్డ చేసిన దాంట్లో కనీసం 10 శాతం అయినా నేను చేశానని ఇదే చంద్రబాబు గుండెల మీద చేయి వేసుకుని ధైర్యంగా నిబద్ధతతో చెప్పగలడా? ►జగన్ ఒకవైపున సిద్ధం సభలు పెట్టి ఏ గ్రామానికైనా కూడా 7 వ్యవస్థలు. ఓ సచివాలయ వ్యవస్థ, వలంటీర్ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రం ఆర్బీకే వ్యవస్థ, విలేజ్ క్లినిక్ వ్యవస్థ, ఇంగ్లిష్ మీడియం, నాడునేడుతో మారిన మన గవర్నమెంట్ బడులు, ప్రతి గ్రామంలో ఓ మహిళా పోలీస్, ప్రతి అక్కచెల్లెమ్మ ఫోన్లో ఓ దిశ యాప్, అదే గ్రామంలో డిజిటల్ లైబ్రరీ, ఓ లంచాలు లేని, వివక్ష లేని పాలనతో గ్రామాన్నే మార్చిన వ్యవస్థ తీసుకొచ్చానని మీ బిడ్డ ధైర్యంగా చెబుతున్నాడు. ►కుప్పం నుంచి ఇచ్ఛాపురం మధ్య ఏ గ్రామమైనా తీసుకోండి. ఆ గ్రామంలో ఇవాళ మనం చెబుతున్న ప్రతి మాటా కళ్లెదుట కనిపిస్తోంది. సచివాలయ వ్యవస్థ, వలంటీర్ వ్యవస్థ, ఆర్బీకే, విలేజ్ క్లినిక్, మారిన ఇంగ్లిష్ మీడియం స్కూలు, మహిళా పోలీస్, ప్రతి అక్కచెల్లెమ్మ ఫోన్లో దిశ యాప్ కనిపిస్తుంది. మంచి చేసి ఉంటే పొత్తులెందుకు? చంద్రబాబును నిలదీసిన సీఎం జగన్ చంద్రబాబునాయుడు నిజంగా ప్రజలకు మంచి చేసి ఉంటే.. ఆ పార్టీలతో పొత్తులు ఎందుకు పెట్టుకున్నారని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు. ‘సిద్ధం సభల నుంచి మీ అందరి ముందు ఇదే ప్రశ్న అడుగుతున్నా. ఇప్పటి వరకు నాకైతే చంద్రబాబు సమాధానం ఇవ్వలేదు. మరి మీకేమైనా ఇచ్చాడా?’ అని అడిగారు. ‘అయ్యా చంద్రబాబూ.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకుంటున్నావే.. ఎన్నికలు అయ్యాక ఒక్కసారైనా నాలా పబ్లిక్‌గా నీ మేనిఫెస్టోను చూపించి.. ఇదిగో నేను చెప్పిన హామీలను నెరవేర్చా అని చూపించే ప్రయత్నం చేశావా’ అని కూడా ప్రశ్నించారు. ఈ మేరకు శనివారం ఆయన ఎక్స్‌లో రెండు పోస్ట్‌లు చేశారు. సీఎం జగన్ బస్సు యాత్రకు ప్రవాసాంధ్రుల సంఘీభావం సీఎం వైఎస్ జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రకు లండన్‌లోని వైఎస్సార్సీపీ నాయకులు జైకొట్టారు. వైఎస్సార్సీపీ యూకే కన్వీనర్లు డాక్టర్ ప్రదీప్ చింతా, ఓబుళరెడ్డి పాతకోటల ఆధ్వర్యంలో యూకేలోని లీసెస్టర్ నగరంలో సమావేశమై బస్సుయాత్రకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం జగన్ యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా సభ్యులు భూమిరెడ్డి కార్తీక్, కోరముట్ల పునీత్, పాలెం క్రాంతి, చాళుక్య దేవరపల్లి, ఆదిత్య పుత్తికి రెడ్డి, ముడియాల కుమార్ పాల్గొన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేయండని ప్రతి ఒక్కరికీ చెప్పండి ►రైతులు, అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, చిన్నారులు, విద్యార్థులు, యువత కోసం, వైద్యం కోసం ఇవి చేశానని మీ బిడ్డ ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే తోడుగా నిలబడండి అని అడగగలుగుతున్నాడు. ►ఈరోజు ఇంటింటా మంచి జరిగింది. మీరంతా మీ ఇంట్లో ఉన్న అక్కచెల్లెమ్మలతో, ఇల్లాలితో, అవ్వాతాతలతో, చిన్న బిడ్డలు, పిల్లలతో మాట్లాడండి. చిన్న పిల్లలకు ఓటు లేదని వాళ్లతో మాట్లాడకుండా ఉండొద్దు. ఎవరి వల్ల మేలు జరిగిందని చర్చించండి. ఎవరు ఉంటే మన కుటుంబాలు బాగుపడతాయన్న విషయాన్ని లోతుగా ఆలోచించాలని కోరుతున్నా. ►ఈ విషయం ప్రతి ఒక్కరికీ కూడా చెప్పాలి. ఫ్యాను గుర్తుకు రెండు ఓట్లు వేస్తేనే ఇంటింటా అభివృద్ధి కొనసాగుతుందని చెప్పండి. ఇదే చంద్రబాబును పొరపాటున ఎవరైనా నమ్మారా.. అంటే బంగారు కడియం ఇస్తానన్న పులి.. కథను గుర్తు చేయండి. చంద్రబాబును నమ్మడం అంటే ఆ పులి నోట్లో తలకాయ పెట్టడమే అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. బాబు చరిత్రను వివరించండి. చంద్రబాబు పొత్తులు పెట్టుకున్న ఆ కూటమి చరిత్ర వివరించండి. మన అభ్యర్థులను ఆశీర్వదించండి మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు మన అభ్యర్థుల మీద ఉంచవలసిందిగా కోరుతున్నా. నెల్లూరు ఎంపీ అభ్యర్థి, నాకు అత్యంత సన్నిహితుడు, సౌమ్యుడు విజయసాయిరెడ్డిని గొప్ప మెజార్టీతో గెలిపించాలి. కావలి నుంచి ప్రతాప్, నెల్లూరు రూరల్ నుంచి ఆదాల ప్రభాకర్, కొవ్వూరు నుంచి ప్రసన్నకుమార్, నెల్లూరు సిటీ నుంచి ఒక సామాన్యుడు, మీలో ఒకరైన ఖలీల్, ఉదయగిరి నుంచి రాజగోపాల్, ఆత్మకూరు నుంచి విక్రమ్ (నా స్నేహితుడు గౌతమ్ సోదరుడు), కందుకూరు నుంచి మధుసూదన్ యాదవ్‌లను గెలిపించాలి. మన గుర్తు ఫ్యాన్ అని మరచిపోవద్దు. చంద్రబాబు విఫల హామీలు ►2014లో చంద్రబాబు ఇదే కూటమిగా ఏర్పడి ఇదే ముగ్గురు.. ఇంటింటికీ పంపించిన పాంప్లెట్ ఇది. (చేత్తో చూపిస్తూ..) గుర్తుందా ఈ పాంప్లెట్? ఇందులో మోడీగారి ఫొటో ఉంది. దత్తపుత్రుడి ఫొటో, చంద్రబాబు నాయుడు ఫొటో ఉంది. కింద చంద్రబాబు నాయుడు సంతకం కూడా ఉంది. ప్రతి టెలివిజన్ చానల్లో వాళ్ల ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో, టీవీ–5లో ఊదరగొడుతూ దీని గురించి అడ్వటైజ్ మెంట్లు కూడా ఇచ్చారు. ►రైతులకు రుణ మాఫీపై మొదటి సంతకం చేస్తా అన్నాడు. రూ.87,612 కోట్లు రుణ మాఫీ చేశాడా? పొదుపు సంఘాల డ్వాక్రా రుణాలు రూ.14,205 కోట్లు మాఫీ చేశాడా? ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకు అకౌంట్లో డిపాజిట్ చేశాడా? మీ ఇంట్లో.. మీ పక్కిళ్లలో 2014–2019 మధ్య ఆడ బిడ్డలు పుట్టారు కదా.. వాళ్లలో ఒక్కరికైనా రూ.25 వేలు ఇచ్చారా? ఇంటింటికీ ఉద్యోగం.. లేదా నెలనెలా రూ.2 వేల నిరుద్యోగభృతి ఇస్తామన్నాడు. ఐదేళ్లు.. అంటే 60 నెలలకు నెలకు రూ.2000 చొప్పున లెక్కిస్తే.. ప్రతి ఇంటికీ రూ.1.20 లక్షలు ఇచ్చారా? అర్హులైన వాళ్లందరికీ 3 సెంట్ల స్థలం ఇచ్చారా? రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత, పవర్ లూమ్స్ రుణాలన్నీ మాఫీ అన్నాడు.. చేశాడా? ►మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు జరిగిందా? రాష్ట్రాన్ని సింగపూర్‌ను మించి అభివృద్ధి చేస్తానన్నాడు. ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. మరి మన కావలిలో ఏమన్నా కనిపించిందా? ఇప్పుడు మళ్లీ అదే మోసం. అవే పొత్తులు. ఇప్పుడు సూపర్ సిక్సు, సూపర్ సెవెన్ అంటూ మళ్లీ మోసం చేయడానికి వస్తున్నాడు. ఈ ముగ్గురూ కలిసి ఇంటింటికీ కేజీ బంగారం అంటున్నారు. ఇంటింటికీ బెంజ్ కారు కొనిస్తామంటున్నారు. సూపర్ సిక్స్.. సూపర్ సెవెన్.. అంటున్నాడు. నమ్ముతారా? ►ఇన్ని అబద్ధాలు, ఇన్ని మోసాలతో రాష్ట్ర పేదల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమేనా? (సిద్ధమేనని జనం నినాదాలు) మీలో ప్రతి ఒక్కరూ ఒక స్టార్ క్యాంపెయినర్‌గా ప్రతి పేదవాడి ఇంటికీ వెళ్లి నిజాలు చెప్పి వారిని కూడా స్టార్ క్యాంపెయినర్లుగా మార్చాలి. మీరు సిద్ధంగా ఉంటే మోసగాళ్ల సోషల్ మీడియా, ఎల్లో మీడియా అసత్యాల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు మీ జేబులోంచి సెల్ ఫోన్ బయటకు తీసి, అందులోని టార్చ్ లైట్ వెలిగించండి. (అందరూ సెల్లో టార్చ్ వెలిగించి పైకెత్తి చూపారు). 175 అసెంబ్లీ స్థానాలకు 175, 25 ఎంపీ సీట్లుకు 25 మొత్తం రెండు వందల సీట్లు.. ఎక్కడా తగ్గేందుకు వీల్లేదు. ఓటు అడిగే నైతికత ఇంటింటికీ మంచి చేసిన మనకు మాత్రమే ఉంది. కాబట్టి మీ జగన్‌కు, మీ బిడ్డకు, మీ వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి తోడుగా నిలవాలి. -
Memantha Siddham Day 9: మేమంతా సిద్ధమంటూ.. ఊరూవాడా తరలివచ్చి..(ఫొటోలు)
-
‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. రేపటి షెడ్యూల్
సాక్షి, ప్రకాశం జిల్లా: మేమంతా సిద్ధం 10వ రోజు ఆదివారం (ఏప్రిల్ 7) షెడ్యూల్‌ను వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం శనివారం విడుదల చేశారు. ఈ యాత్రలో భాగంగా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉదయం 9 గంటలకు జువ్విగుంట క్రాస్ రాత్రి బస చేసిన ప్రాంతం నుంచి బయలుదేరుతారు. పెద్ద అలవలపాడు, కనిగిరి మీదగా పెద్ద అరికట్ల తరువాత భోజన విరామం తీసుకుంటారు. అనంతరం చిన్న అరికట్ల, మూగచింతల మీదుగా కొనకనమెట్ల క్రాస్ చేరుకుని సాయంత్రం 3:30 గంటలకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం బత్తువారిపల్లి, సలకనూతల క్రాస్, పొదిలి, రాజంపల్లి, దర్శి మీదుగా వెంకటాచలంపల్లి రాత్రి బసకు చేరుకుంటారు. -
బాబును నమ్మడమంటే పులినోట్లో తలపెట్టడమే: సీఎం జగన్
సాక్షి, నెల్లూరు జిల్లా: అబద్ధాలు, మోసం, కుట్రలన్నీ కలిపితే చంద్రబాబు అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా 9వ రోజు శనివారం సాయంత్రం నెల్లూరు జిల్లా కావలి నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. మోసం చేయడమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబుకు, ప్రజలకు మధ్య యుద్ధం అని, పెత్తందార్ల పక్షాన చంద్రబాబు ఉంటే, పేదల పక్షాన మీ బిడ్డ జగన్ ఉన్నాడని తెలిపారు. ఈ యుద్ధంలో నేను ఎప్పుడూ పేదల పక్షమే.. ‘‘అందరి ప్రయోజనాలు రక్షించుకునేందుకు, మంచిని కొనసాగించేందుకు మీరంతా సిద్ధమా?. ఈ యుద్ధంలో నేను ఎప్పుడూ పేదల పక్షమే. మోసగాళ్లంతా కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారు. మంచి చేసిన మనకు మద్దతిచ్చేందుకు మీరంతా సిద్ధమా?. మరో 5 వారాల్లోనే ఎన్నికలు జరగబోతున్నాయి. పేదల భవిష్యత్‌ను నిర్ణయించేది ఈ ఎన్నికలే. మీ బిడ్డ హయాంలో ప్రతి ఇంటికి మంచి జరిగింది. జరిగిన మంచి కొనసాగించేందుకు మీరంతా సిద్ధమా?’’ అంటూ ప్రజలను ఉద్దేశించి అన్నారు. మ్యానిఫెస్టో కాపీలు చూపించే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు ఉందా?. ‘‘చంద్రబాబు పేరు చెప్తే ఒక పథకం కూడా గుర్తుకురాదు. బాబు పేరు చెప్తే పేదలకు చేసిన మంచి ఒక్కటి లేదు. మ్యానిఫెస్టో కాపీలు చూపించే దమ్ము, దైర్యం చంద్రబాబుకు ఉందా?. 30 ఏళ్ల క్రితమే సీఎంగా చేసిన చంద్రబాబు.. నా గతాన్ని చూసి ఓటేయండి అని అడగలేరు. మ్యానిఫెస్టోలోని 10 శాతం హామీలైనా అమలు చేశానని చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా?’’ అంటూ సీఎం జగన్ ప్రశ్నించారు. నా ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పలేడు.. ‘‘ప్రజలకు సమాధానం చెప్పే ధైర్యం కూడా చంద్రబాబుకు లేదు. చంద్రబాబు అభివృద్ధి చేసి ఉంటే పొత్తు ఎందుకు?. ఎన్నికలొస్తే ప్రజలను మభ్యపెడుతూ ముందుకొస్తాడు. బెంజ్ కారు, బంగారం ఇస్తానంటూ మభ్య పెడతాడు. పేదవాడికి మంచిచేసానని ఏరోజైనా చంద్రబాబు చెప్పగలిగాడా?. నా ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పలేడు. రూ.2 లక్షల 70వేల కోట్లు పేదల ఖాతాల్లో వేశాం. ఒక్కసారి ఆశీర్వదించినందుకే 58 నెలల పాటు సంక్షేమం అందించా. 99 శాతం హామీలు నెరవేర్చి మళ్లీ ఆశీస్సులు కోరుతున్నా. మీ జగన్ ఇంటించికి పౌరసేవలు డోర్ డెలివరీ చేయిస్తున్నాడు. చంద్రబాబును నమ్మడమంటే పులినోట్లో తలపెట్టడమే’’ అని సీఎం జగన్ ధ్వజమెత్తారు. మళ్లీ మోసం చేసేందుకు బాబు కొత్త మేనిఫెస్టోతో వస్తున్నాడు.. ‘‘2014లో ఇదే కూటమి ఇంటింటికీ పంపించిన పాంప్లెట్ గుర్తుందా?. ముఖ్యమైన హామీలు అంటూ మోసపు మాటలు గుర్తున్నాయా?. రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?. పొదుపు సంఘాల రుణమాఫీ చేస్తానన్నాడు చేశాడా?. ఆడబిడ్డ పుడితే రూ.25 వేలు డిపాజిట్ చేస్తానన్నాడు చేశాడా?. ప్రతి నగరంలో హైటెక్ సిటీ అన్నాడు.. నిర్మించాడా?. ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించాం. 99 శాతం హామీలు నెరవేర్చి మళ్లీ మీ ముందుకు వచ్చా. మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే తోడుగా నిలబడండి. మరో ఐదేళ్ల పాటు మంచి కొనసాగాలంటే మీరు తోడుగా ఉండాలి. ఫ్యాన్ గుర్తుకు రెండు ఓట్లు వేస్తేనే ఇంటింటి అభివృద్ధి జరుగుతుంది. ఇంటింటికి వెళ్లీ చంద్రబాబు చేసిన మోసాలు చెప్పండి. మళ్లీ మోసం చేసేందుకు బాబు కొత్త మేనిఫెస్టోతో వస్తున్నాడు. సూపర్ సిక్స్, సెవెన్ అంటున్నాడు.. నమ్మొద్దు’’ సీఎం జగన్ చెప్పారు. సీఎం జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు కావలి లో జన ప్రభంజనం కనిపిస్తోంది మంచి చేసిన మనకు మద్దతిచ్చేందుకు మీరంతా సిద్ధమా.? మరో 5 వారాల్లోనే ఎన్నికలు జరగబోతున్నాయి ఇది జగన్, చంద్రబాబు మధ్య యుద్ధం కాదు పేదల పక్షాన ఉన్న మీ బిడ్డ జగన్ ఉన్నాడు పెత్తందార్ల పక్షాన ఉన్న చంద్రబాబు ఉన్నాడు మీ బిడ్డ హయాంలో ప్రతి ఇంటికి మంచి జరిగింది జరిగిన మంచి కొనసాగించేందుకు మీరంతా సిద్ధమా? అబద్దాలు, మోసాలు, కుట్రలన్నీ కలిపితే చంద్రబాబు.! చంద్రబాబు పేరు చెప్తే ఒక్క పథకం కూడా గుర్తుకురాదు బాబు పేరు చెప్తే పేదలకు చేసిన మంచి ఒక్కటీ లేదు ఎన్నికల ముందు మాత్రమే బాబుకు మేనిఫెస్టో గుర్తుకొస్తుంది బాబు తన మేనిఫెస్టోలో ప్రకటించిన వాటిలో కనీసం ఒక్క హామీనైనా నెరవేర్చలేదు మేనిఫెస్టో చూపించే దమ్ము ధైర్యం చంద్రబాబుకు ఉందా ? చంద్రబాబు మంచి చేసి ఉంటే మూడు పార్టీలతో పొత్తు ఎందుకు ? మోసాలు, వెన్నుపోట్లతో బాబు 14 ఏళ్లు సీఎం గా ఉన్నారు.! ఒక్కసారి ఆశీర్వదించినందుకే 58 నెలల పాటు సంక్షేమం అందించా రూ. 2 లక్షల 70 వేల కోట్లు పేదల ఖాతాల్లో వేశాం మేనిఫెస్టో లోని 99 శాతం హామీలు నెరవేర్చాం ఇంటింటికి పౌర సేవలను డోర్ డెలివరీ చేయిస్తున్నాం లంచాలు, వివక్ష లేని వ్యవస్థను తీసుకొచ్చాం నాడు నేడు ద్వారా స్కూళ్ల రూపురేఖలు మార్చాం వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం నేను చేసిన మంచిలో కనీసం 10 శాతమైన బాబు చేశాడా ? చంద్రబాబును 4 నెలలుగా ప్రశ్నలు అడుగుతూ వచ్చా ప్రజలకు సమాధానం చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదు బెంజ్ కారు, బంగారం ఇస్తానంటూ మభ్యపెడతాడు పేదవాడికి మంచి చేశానని ఏరోజైనా చంద్రబాబు చెప్పగలిగాడా? నా ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పలేడు సచివాలయం, వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాం ప్రతి గ్రామంలో ఆర్బీకే, విలేజ్ క్లినిక్స్ పెట్టాం మహిళల రక్షణ కోసం దిశా యాప్ తీసుకొచ్చాం అవ్వాతాతల సంక్షేమం, మహిళా సాధికారత చేసి చూపించాం ఎన్నికల మేనిఫెస్టో ను పవిత్ర గ్రంధంగా భావించాం 99 శాతం హామీలు నెరవేర్చి మళ్లీ మీ ముందుకు వచ్చా మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే తోడుగా నిలబడండి పేదలకు ఈ మంచి కొనసాగాలంటే మన ప్రభుత్వమే రావాలి మరో ఐదేళ్ల పాటు మంచి కొనసాగాలంటే మీరు తోడుగా ఉండాలి ఫ్యాన్ కు రెండు ఓట్లు వేస్తేనే ఇంటింటి అభివృద్ధి జరుగుతుంది ఇంటింటికి వెళ్లి చంద్రబాబు చేసిన మోసాలు చెప్పండి 2014 లో ముగ్గురి ఫొటోలతో ముఖ్యమైన హామీలు ఇచ్చారు చంద్రబాబును పొరపాటున కూడా నమ్మొద్దు చంద్రబాబును నమ్మితే బంగారు కడియం ఇస్తానన్న పులిని నమ్మినట్లే రైతు రుణమాఫీ చేస్తానన్నాడు .. చేశాడా ? పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తానన్నాడు .. చేశాడా ? ఆడబిడ్డ పుడితే రూ . 25 వేలు డిపాజిట్ చేస్తానన్నాడు .. చేశాడా? ఇంటికో ఉద్యోగం అన్నాడు .. ఇచ్చాడా ? ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు .. ఇచ్చాడా ? రూ. 10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ అన్నాడు .. వేశాడా ? సింగపూర్ ని మించి అభివృద్ధి చేస్తానన్నాడు .. చేశాడా ? ప్రతి నగరంలో హైటెక్ సిటీ అన్నాడు ... నిర్మించాడా ?