క్షణం తీరిక లేకుండా జనంతోనే మమేకమైన సీఎం జగన్ | CM Jagan Guntur Memantha Siddham Bus Yatra Continued Without Rest For People, See Details Inside - Sakshi
Sakshi News home page

క్షణం తీరిక లేకుండా జనంతోనే మమేకమైన సీఎం జగన్

Published Fri, Apr 12 2024 9:17 PM | Last Updated on Sat, Apr 13 2024 10:25 AM

Cm Jagan Guntur Memantha Siddham Bus Yatra Continued Without Rest For People - Sakshi

సాక్షి, గుంటూరు: మేమంతా సిద్ధం బస్సు యాత్ర 13వ రోజులో భాగంగా శుక్రవారం గుంటూరులో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన ఆద్యంతం జన ప్రవాహాన్ని తలపించింది. బస్సు యాత్రకు పోటెత్తిన ప్రజలు.. అడుగడుగునా సీఎం జగన్‌కు అపూర్వ స్వాగతం పలికారు. ఉదయం ధూళిపాళ్ళ నుంచి ఏటుకూరు సభ వరకు అభిమానం ఉప్పొగింది. యాత్ర మొత్తం క్షణం తీరిక లేకుండా జనంతోనే సీఎం జగన్ మమేకమయ్యారు. తొమ్మిది గంటలపాటు రోడ్ షో ఏకధాటిగా సాగింది. 

గ్రామాల సరిహద్దులను చెరిపేస్తూ అడుగడుగునా జన నీరాజనమే కనిపించింది. తీవ్రమైన ఎండ, ఈదురు గాలులు, భారీ వర్షం.. అన్నింటినీ తట్టుకుంటూ జగన్ కోసమే జనం నిలబడ్డారు. చేతిలో జెండా, గుండెల్లో అభిమానంతో రోడ్డు పొడవునా నిల్చున్నారు. తన కోసం వచ్చిన అశేష జనవాహినికి  అభివాదం చేస్తూ సీఎం ముందుకు కదిలారు. మధ్యలో లంచ్ బ్రేక్‌కు కూడా ఆగలేదు.

తనకోసం వేచి ఉన్న జనం కోసం యాత్రను కొనసాగించారు సీఎం. మధ్యలో ఆయా వర్గాల ప్రజలను కలుస్తూ.. అనారోగ్య పండితులకు అండగా నిలుస్తూ బస్సుయాత్ర సాగింది. పల్నాడు, గుంటూరు జిల్లాలో ఇంతటి జన సునామీని ఎప్పుడూ చూడలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

ఇదిలా ఉండగా  శుక్రవారం దయం 9 గంటలకు ధూళిపాళ్ల నుంచి సీఎం యాత్ర ప్రారంభమైంది. సత్తెనపల్లి, కొర్రపా­డు, మేడికొండూరు, పేరేచెర్ల జంక్షన్, నల్లపాడు మీదుగా హౌసింగ్‌ బోర్డు వద్దకు చేరుకుంది. అనంతరం చుట్టు­గుంట సర్కిల్, వీఐపీ రోడ్డు మీదుగా గుంటూరులోని ఏటుకూరు బైపాస్‌ సభ ప్రాంగణానికి చేరుకుని బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు. సభ అనంతరం తక్కెళ్లపాడు బైపాస్, పెదకాకాని బైపాస్, వెంగళ్రావు నగర్, నంబూరు క్రాస్‌ మీదుగా ప్రయాణించి నంబూరు బైపాస్‌ వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం చేరుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement