జగన్‌ మార్కుతో సమాజం ‘సిద్ధం’: సీఎం వైఎస్‌ జగన్‌ | CM Jagan At Memantha Siddham Srikakulam District Akkavaram Sabha | Sakshi
Sakshi News home page

జగన్‌ మార్కుతో సమాజం ‘సిద్ధం’: సీఎం వైఎస్‌ జగన్‌

Published Thu, Apr 25 2024 4:59 PM | Last Updated on Thu, Apr 25 2024 6:15 PM

CM Jagan At Memantha Siddham Srikakulam District Akkavaram Sabha - Sakshi

వైఎస్సార్‌సీపీ ఎన్నికల గుర్తు ‘ఫ్యాన్‌’ను ప్రజలకు చూపిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, శ్రీకాకుళం జిల్లా అక్కవరం వద్ద నిర్వహించిన మేమంతా సిద్ధం సభకు హాజరైన అశేష జనవాహినిలో ఓ భాగం

ఇది 58 నెలలుగా విప్లవాత్మక మార్పులు తెస్తూ చేస్తున్న యుద్ధం

శ్రీకాకుళం జిల్లా అక్కవరం సభలో సీఎం వైఎస్‌ జగన్‌ 

మీ ఇంటికి మంచి జరిగితే మీ బిడ్డకు సైనికులుగా తోడుండాలని కోరే ధైర్యమే ‘‘సిద్ధం’’ 

వ్యత్యాసాలను తుడిచేస్తూ సమ సమాజాన్ని నిర్మిస్తున్నాం.. మనం తెచ్చిన మార్పులపై బాబు, ఆయన బృందం ఏనాడైనా ఆత్మవిమర్శ చేసుకుందా? 

చంద్రబాబు మాదిరిగా మీ బిడ్డ ఎన్నడూ రోల్డ్‌ గోల్డ్‌ దుకాణం తెరవడు 

మోసాన్ని నిజాయితీతో జయిస్తాం 

జగన్‌ చేయలేని ఏ స్కీమ్‌నూ బాబు కాదు.. ఆయన జేజమ్మైనా చేయలేడు.. నిజ జీవితం, రాజకీయాల్లో హీరో ఎవరు? విలన్‌ ఎవరో ఆలోచన చేయండి 

రోజూ నన్ను తిట్టడం గొప్ప రాజకీయమా? 

అదో ఘనకార్యంలా ఎల్లో మీడియాలో చాటింపు 

ఆ మోసాల కూటమి చెంప చెళ్లుమనిపించండి 

జగన్‌కు ఓటు వేస్తేనే పథకాలన్నీ కొనసాగుతాయి.. లేదంటే ముగింపే, మళ్లీ మోసపోవటమే

సమాజంలో ప్రతి రంగాన్ని మీ బిడ్డ ప్రభుత్వం అధికారం దక్కిన మొదటి రోజు నుంచే ఎలా సిద్ధం చేసిందో మీరే గమనించాలని కోరుతున్నా. రాష్ట్రంలో ఎప్పుడూ చూడని మార్పులతో గ్రామస్థాయిలో వ్యవసాయ రంగం సిద్ధం! విప్లవాత్మక మార్పులతో మన గవర్నమెంట్‌ బడి సిద్ధం! గ్రామస్థాయి నుంచి వైద్య ఆరోగ్య రంగంలో అనేక విప్లవాత్మక మార్పులతో గవర్నమెంట్‌ ఆస్పత్రి సిద్ధం! పట్టణాలు, గ్రామాల్లో ఇంటింటికీ సేవలందిస్తున్న వలంటీర్ల వ్యవస్థ సిద్ధం! ఏకంగా 1.35 లక్షల మంది శాశ్వత ఉద్యోగాలతో మన చెల్లెమ్మలు, తమ్ముళ్లు దాదాపు 600 రకాల సేవలందిస్తూ మన గ్రామాల్లో సచివాలయాల్లో సిద్ధం! 58 నెలల్లో గ్రామ స్వరాజ్యం సిద్ధం! పట్టణాల్లో సైతం ఇంటింటికీ పౌరసేవలు సిద్ధం! దేశ చరిత్రలో తొలిసారిగా లంచాలు, వివక్ష లేకుండా రూ.2.70 లక్షల కోట్లు ఇంటింటికీ డోర్‌ డెలివరీ చేసిన వ్యవస్థ సిద్ధం! ఒకటో తేదీనే ఇంటికే వచ్చి రూ.3,000 పెన్షన్‌ ఇచ్చే వలంటీర్ల వ్యవస్థ సిద్ధం! ఇదీ మీ బిడ్డ ప్రభుత్వం సమాజాన్ని సిద్ధం చేసిన తీరు.    
– సీఎం జగన్‌  

సాక్షి, శ్రీకాకుళం: ‘‘ఇంటింటి అభివృద్ధిని కాపాడుకునేందుకు సిక్కోలు సింహాలు ఇవాళ ఇక్కడకు కదలివచ్చాయి. ఈ విప్లవ గడ్డపై ఆ పెత్తందార్ల ముఠాపై ఎగురవేస్తున్న తిరుగుబాటు బావుటా కనిపిస్తోంది. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు అడుగడుగునా జన సముద్రమే. వైఎస్సార్‌ జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు దారి పొడవునా జన సునామీని చూస్తుంటే 25 ఎంపీలకు 25 ఎంపీలు, 175 అసెంబ్లీ స్థానాలకు 175 అసెంబ్లీ స్థానాలు మొత్తంగా డబుల్‌ సెంచరీ కొట్టేందుకు మీరంతా సిద్ధమేనా?’’ అని ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. 22 రోజుల పాటు సాగిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగింపు సందర్భంగా బుధవారం శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం అక్కవరం వద్ద నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్‌ ప్రసంగించారు. ఆ వివరాలివీ..

బలమైన పునాదులతో..
ఇంటింటి భవిష్యత్తు, పథకాల కొనసాగింపును నిర్ణయించే ఎన్నికలు మరో 18 రోజుల్లో జరగనున్నాయి. ఇవి కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవి మాత్రమే కాదు. ఈ 58 నెలల కాలంలో బలమైన పునాదులతో పేదల కోసం తెచ్చిన పలు సంస్కరణలు, పథకాలు కొనసాగాలా? వద్దా? అనేది నిర్ణయించే ఎన్నికలు. జగన్‌కు ఓటు వేస్తేనే పథకాలన్నీ కొనసాగుతాయి. చంద్రబాబుకు ఓటేయమంటే పథకాలన్నింటికీ ముగింపే. మళ్లీ మోసపోవటమే. జగన్‌ను ఓడించాలని వాళ్లు.. పేదలను గెలిపించాలని మనం తలపడుతున్న ఈ యుద్ధంలో మరో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకునేందుకు మీరంతా సిద్ధమేనా? మంచి చేసిన చరిత్రగానీ,  పేదల ఆశీస్సులుగానీ లేని ఆ మూడు పార్టీల కూటమి, వారి మోసాలకు చెంప ఛెళ్లుమనేలా సమాధానం చెప్పేందుకు మీరంతా సిద్ధమేనా? 

కుటుంబంతో చర్చించండి
సినిమాకు వెళ్లినప్పుడు హీరో ఎందుకు నచ్చుతాడు? విలన్‌ ఎందుకు నచ్చడో ఒక్కసారి ఆలోచించండి. గుణగణాలు, మంచితనం వల్ల మా హీరో అని అనుకుంటాం. మోసాలు, అబద్ధాలు, కుట్రలు పన్నే క్యారెక్టర్‌ను విలన్‌ అంటాం. నిజ జీవితంలో, రాజకీయాల్లో హీరో ఎవరు? విలన్‌ ఎవరు? అనేది ఒక్కసారి ఆలోచన చేయండి. మీరంతా ఇంటికి వెళ్లాక కాసేపు కుటుంబ సభ్యులతో కూర్చుని నింపాదిగా మాట్లాడండి. చిన్నపిల్లల అభిప్రాయాన్ని కూడా తెలుసుకోండి. అవ్వాతాతలు, ఆడపడుచుల అంతరంగాన్ని గమనించండి. ఎవరి పాలనలో మంచి జరిగింది? ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుందనే నమ్మకం కలుగుతుందో వారితోనే అడుగులు ముందుకు వేయాలని కోరుతున్నా. 

 

మీ గుండె చప్పుడే ‘‘సిద్ధం’’
పొత్తుల జిత్తులు, జత కట్టిన జండాలకు బదులిస్తూ జగన్‌ వెనుక ఎన్ని కోట్ల మంది పేదలున్నారో చూపిస్తే అదే.. సిద్ధం! సామాన్యులు, పేదల గుండె చప్పుడే ఈ సిద్ధం. ఇడుపులపాయలో మొదలై ఇచ్ఛాపురం వరకు సాగిన ఈ బస్సు యాత్ర మన పార్టీ జైత్రయాత్రకు సంకేతం. ఇది మూడు నాలుగు నెలల క్రితం మొదలు పెట్టింది కాదు. ఓ 25 సభలతో వచ్చింది కాదు. మనందరి ప్రభుత్వం 58 నెలలుగా విప్లవాత్మక మార్పులు తెస్తూ చేస్తున్న యుద్ధమే ఈ సిద్ధం. 

ఆ చైతన్యం పేరే..
ఇక్కడ నిర్వహిస్తున్న సభ పేరు మాత్రమే కాకుండా మరో ఐదేళ్లు ఈ మార్పులన్నీ కొనసాగాలని ఇంటింటికీ వెళ్లి వారు మరో వంద మందికి వివరించాల్సిన అవసరాన్ని చెప్పే అవసరమే ఈ సిద్ధం! మీకు మంచి జరిగి ఉంటే.. మీ ఇంటికి మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలవాలని ప్రజలను కోరే ధైర్యమే సిద్ధం! ఎన్నికలు కాగానే మేనిఫెస్టోను చెత్తబుటలో పారేసే చంద్రబాబు సంస్కృతిని సమాధి కట్టి 99 శాతం వాగ్దానాలను నెరవేర్చి ఇంటింటికీ మళ్లీ ఆ మేనిఫెస్టోను పంపి ఎన్నికల వాగ్దానాలపై చేసిన చైతన్యం పేరే సిద్ధం!

పేదలు, అక్కచెల్లెమ్మలను రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా సాధికారత దిశగా చెయ్యి పట్టుకుని నడిపించే ఘటమే ఈ సిద్ధం! ఇంతగా సిద్ధమైన సమాజంతో, మీ జగన్‌ పార్టీతో యుద్ధానికి బాబు మరో మూడు పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సి వస్తోంది. పరోక్షంగా కూడా పొత్తులు వెతుక్కోవాల్సి వస్తోంది. కుట్రలకు దిగజారాల్సి వస్తోంది. నాలుగు మంచి పనులు చేశానని చెప్పలేని చంద్రబాబు రోజూ నన్ను తిట్టడం, తిట్టించడం, వారి ఛానళ్లు, పత్రికల్లో అదో ఘనకార్యమన్నట్లుగా చూపిస్తున్నారు. ఇది గొప్ప రాజకీయం అవుతుందా? 

మన అభ్యర్థులను ఆశీర్వదించండి
ఎంపీ అభ్యర్థి తిలక్, టెక్కలి నుంచి శ్రీను, ఆమదాలవలస నుంచి తమ్మినేని సీతారామ్, పలాస నుంచి డాక్టర్‌ అప్పలనాయుడు, పాతపట్నం నుంచి శాంతమ్మ, ఇచ్చాపురం నుంచి విజయమ్మ, నర్సీపట్నం నుంచి ధర్మాన కృష్ణదాస్, శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావును ఆశీర్వదించి గెలిపించాలని కోరుతున్నా. 

ఏనాడైనా ఆత్మవిమర్శ చేసుకున్నారా?
మన ప్రభుత్వం వల్ల పేదల కుటుంబాల్లో, వారి చదువుల్లో, అక్కచెల్లెమ్మల సాధికారతలో, అవ్వాతాతలకు అందిన మనశ్శాంతిలో, రైతన్నలకు అందిన ఆత్మస్థైర్యంలో, సామాజిక వర్గాలకు దక్కిన ఆత్మగౌరవంలో ఎంత మార్పు తీసుకురాగలిగామో టీడీపీ, చంద్రబాబు, ఆయనకు దరువు వేసే ఎల్లో మీడియా ఏనాడైనా కనీసం ఆత్మవిమర్శ చేసుకోవడం చూశారా? ఇలాంటి వారికి పరిపాలన ఇవ్వడం అంటే అర్థమేమిటి? ప్రభుత్వం అనేది ఎవరి కోసం? అందమైన వాగ్ధానాలతో అధికారం లాక్కుని ఐదేళ్లు వంచించటానికి, లూటీ చేసి దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం, దాచుకోవడం కోసమే వారికి అధికారం కావాలని అడుగుతున్నారు. 

బాబు రోల్డ్‌ గోల్డ్‌ దుకాణం..
మీ బిడ్డ కరోనా కష్టంలో కూడా సాకులు వెతుక్కోలేదు. ఏ ఒక్క పథకాన్నీ, బటన్లు నొక్కటాన్ని ఆపలేదు. పేదవారి కష్టం తన కష్టం కంటే ఎక్కువని భావించాడు. మీ జగన్‌ స్వచ్ఛమైన మనసుతో, మంచి చేశాననే ఆత్మవిశ్వాసం, ఆత్మ సంతృప్తితో మీ ముందు సవినయంగా తలెత్తుకుని నిలబడ్డాడు. 2014 ఎన్నికల్లో కూడా చేయలేని ఏ వాగ్దానాలనూ మేనిఫెస్టోలో మీ బిడ్డ చెప్పలేదు. రాష్ట్ర ప్రజలు, నమ్ముకున్న వారిని ఎన్నటికీ మోసం చేయడు. బాబు మాదిరిగా రోల్డ్‌ గోల్డ్‌ దుకాణం తెరవడు.

దాన్ని బంగారం అని నమ్మించే యత్నం చేయడు. చంద్రబాబు నిర్వహించే వాగ్దానాల వేలంలో మీ బిడ్డ పాల్గొనడు. 14 ఏళ్లు అధికారంలో ఉండీ ఏ ఒక్క మంచి పని చేయని చంద్రబాబుతో మీ బిడ్డ పోటీ పడడు. మీ జగన్‌ మార్కు ఇవాళ ప్రతి పేద ఇంట్లోనూ కనిపిస్తుంది. ప్రతి అక్కచెల్లెమ్మ చిరునవ్వులో, అవ్వాతాతల ఆనందంలో, పిల్లల ఆత్మవిశ్వాసంలో కనిపిస్తుంది. మీ జగన్‌ మార్కు ప్రతి గ్రామంలోనూ కనిపిస్తుంది. జగన్‌కు పేదలపై ఉన్నంత ప్రేమ ఈ దేశ రాజకీయ చరిత్రలో మరే నాయకుడికీ లేదు, ఉండదు. ఇది నిజం. ఇది మాత్రమే నిజం. 

ఇదీ చదవండి: యువనేత జైత్రయాత్ర!

నావల్ల కానిది బాబు జేజమ్మ కూడా చేయలేదు..
జగన్‌ చేయలేని ఏ స్కీమ్‌నూ చంద్రబాబు కాదు కదా.. ఆయన జేజమ్మ కూడా చేయలేదు! మోసాలు, అబద్ధాలతో ఏ స్థాయికైనా దిగజారి పొత్తులు పెట్టుకునే ఆయనతో మీ బిడ్డ పోటీ పడలేడు. నిజాలు, నిజాయితీకి ప్రజలు విలువ ఇస్తారన్న నమ్మకం నాకుంది. బాబు మాదిరిగా నేను మోసపూరిత వాగ్దానాలు చేయను. మోసాన్ని మోసంతోనే జయించాలన్న రాజనీతిని మీ బిడ్డ పాటించడు. మోసాన్ని నిజాయితీతోనే జయించవచ్చని నిరూపించటానికి మీ బిడ్డ సిద్ధం. మరి మీరంతా కూడా సిద్ధమేనా? 

మోసాలా.. విశ్వసనీయతా? 
మీకు ఎలాంటి నాయకుడు కావాలని అందరినీ అడుగుతున్నా. బాబు లాంటి మోసగాడు కావాలా? జగన్‌ లాంటి నిజాయితీపరుడు కావాలా? మేనిఫెస్టోలో చెప్పేవన్నీ ఎగ్గొట్టే నాయకుడు అబద్ధాలు, వెన్నుపోట్లు నైజంగా కలిగిన నాయకుడు కావాలా? లేక నోటి నుంచి ఒక మాట వస్తే, మేనిఫెస్టోలో చేరిస్తే తు.చ. తప్పకుండా పాటించే జగన్‌ లాంటి నాయకుడు కావాలా? సొంత బలం లేక పొత్తుల డ్రామాలాడే నాయకుడు కావాలా? లేక చేసిన మంచిని చూపిస్తూ సింహంలా సింగిల్‌గా వచ్చే నాయకుడు కావాలా? మోసాలు చేసే చంద్రబాబు కావాలా? విశ్వసనీయతతో నిలబడే జగన్‌ కావాలా? తమ నాయకుడి గురించి కాలర్‌ ఎగరేసి గర్వంగా ఇంటింటికీ చెప్పుకోగలిగిన మీ బిడ్డ కావాలా? చెప్పిన మాటలు గాలికి వదిలేసే బాబు కావాలా? 

వ్యత్యాసాన్ని తుడిచి వేస్తూ..
పిల్లలెవరకూ తమ కులం, మతం, ఆర్థిక పరిస్థితుల వల్ల మంచి చదువులు చదువుకోలేకపోయామని బాధపడేందుకు వీల్లేని సమ సమాజాన్ని మీ బిడ్డ నిర్మిస్తున్నాడు. ధనికులు, పేదలకు వేర్వేరు చదువులు అనే వ్యత్యాసాన్ని మీ బిడ్డ తుడిచి వేస్తున్నాడు. ఒక రైతు, ఒక కూలీ, చిరువ్యాపారి, పేద కుటుంబం, నిరుపేద సామాజిక వర్గం.. ఇలా ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వం నా కుటుంబానికి మంచి చేసిందని, ఆ మంచిని కొనసాగిస్తుందనే నమ్మకాన్ని ఇవ్వగలిగే పరిపాలనను 58 నెలలుగా అందిస్తున్నాడు. 

వ్యవస్థలు బాగుండాలంటే..
మోసాలు, అబద్ధాలతో పోరాడుతూ రాష్ట్రం, పేదల భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమేనా? సిద్ధమైతే వారి చీకటి యుద్ధాన్ని, ఆ ఎల్లో మీడియా అసత్యాల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు సెల్‌ఫోన్లలో టార్చిలైట్లను వెలిగించండి. వలంటీర్లు మళ్లీ మన ఇంటికే రావాలన్నా, పేదలకు పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు, వివక్ష లేని పాలనతో ముందుకు పోవాలన్నా, మన వ్యవస్థలన్నీ బాగుండాలన్నా ఫ్యాన్‌ గుర్తుపై రెండు ఓట్లు వేసి 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లోనూ గొప్ప మెజార్టీతో గెలిపించాలి. 

బలమైన పునాదులతో..
ఇంటింటి భవిష్యత్తు, పథకాల కొనసాగింపును నిర్ణయించే ఎన్నికలు మరో 18 రోజుల్లో జరగనున్నాయి. ఇవి కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవి మాత్రమే కాదు. ఈ 58 నెలల కాలంలో బలమైన పునాదులతో పేదల కోసం తెచ్చిన పలు సంస్కరణలు, పథకాలు కొనసాగాలా? వద్దా? అనేది నిర్ణయించే ఎన్నికలు. జగన్‌కు ఓటు వేస్తేనే పథకాలన్నీ కొనసాగుతాయి. చంద్రబాబుకు ఓటేయమంటే పథకాలన్నింటికీ ముగింపే. మళ్లీ మోసపోవటమే. జగన్‌ను ఓడించాలని వాళ్లు.. పేదలను గెలిపించాలని మనం తలపడుతున్న ఈ యుద్ధంలో మరో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకునేందుకు మీరంతా సిద్ధమేనా? మంచి చేసిన చరిత్రగానీ,  పేదల ఆశీస్సులుగానీ లేని ఆ మూడు పార్టీల కూటమి, వారి మోసాలకు చెంప ఛెళ్లుమనేలా సమాధానం చెప్పేందుకు మీరంతా సిద్ధమేనా? 

కుటుంబంతో చర్చించండి
సినిమాకు వెళ్లినప్పుడు హీరో ఎందుకు నచ్చుతాడు? విలన్‌ ఎందుకు నచ్చడో ఒక్కసారి ఆలోచించండి. గుణగణాలు, మంచితనం వల్ల మా హీరో అని అనుకుంటాం. మోసాలు, అబద్ధాలు, కుట్రలు పన్నే క్యారెక్టర్‌ను విలన్‌ అంటాం. నిజ జీవితంలో, రాజకీయాల్లో హీరో ఎవరు? విలన్‌ ఎవరు? అనేది ఒక్కసారి ఆలోచన చేయండి. మీరంతా ఇంటికి వెళ్లాక కాసేపు కుటుంబ సభ్యులతో కూర్చుని నింపాదిగా మాట్లాడండి. చిన్నపిల్లల అభిప్రాయాన్ని కూడా తెలుసుకోండి. అవ్వాతాతలు, ఆడపడుచుల అంతరంగాన్ని గమనించండి. ఎవరి పాలనలో మంచి జరిగింది? ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుందనే నమ్మకం కలుగుతుందో వారితోనే అడుగులు ముందుకు వేయాలని కోరుతున్నా. 

2014లో చంద్రబాబు ముఖ్యమైన మోసాలివీ..
► రైతులకు రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాల మాఫీ జరిగిందా? 
► పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రూ.14,205 కోట్లు మాఫీ చేస్తామని చెప్పి కనీసం ఒక్క రూపాయైనా మాఫీ చేశాడా?
► ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు చొప్పున బ్యాంకులో డిపాజిట్‌ చేస్తామన్నాడు. ఎవరికైనా ఒక్క రూపాయి డిపాజిట్‌ చేశారా?
► ఇంటికో ఉద్యోగం లేదంటే రూ.2 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు. ఐదేళ్లలో అంటే 60 నెలల పాటు నెలకు రూ.రెండు వేలు చొప్పున ప్రతి ఇంటికి రూ.1.20 లక్షలు ఒక్కరికైనా ఇచ్చాడా?
► అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు ఇస్తామన్నారు. ఏ పేదవాడికైనా ఒక్క సెంటు స్థలం ఇచ్చాడా?
► రూ.10 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్‌ అన్నాడు. చేనేత, పవర్‌లూమ్స్‌ రుణాలు మాఫీ అన్నాడు. మరి అయ్యాయా?
► మహిళా ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేస్తామన్నారు. మరి చేశాడా? 
► సింగపూర్‌కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు.. చేశాడా? 
► ప్రతి నగరంలో హైటెక్‌ సిటీ నిర్మిస్తామన్నాడు. కట్టాడా? టెక్కలిలో లేదా శ్రీకాకుళంలో ఏమైనా కనిపిస్తోందా? 
► ముఖ్యమైన హామీలంటూ ఒక్కటైనా నెరవేర్చాడా? 
► పోనీ ప్రత్యేక హోదా తెచ్చాడా అంటే అదీ లేదు.
► ఇప్పుడు సూపర్‌ సిక్స్, సెవెన్, ఇంటింటికీ కేజీ బంగారం, బెంజి కార్‌ అంటూ మళ్లీ మోసాలకు తయారయ్యారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement