అభిప్రాయం
మేమంతా ‘సిద్దం’ బస్సు యాత్రముగింపు సభలో జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఒకమాట ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మధ్య తరగతిని ఆలోచనలో పడేసింది. “ఈ సభ నుంచి మీరు మీ ఇళ్ళకు వెళ్ళాక, మీ కుటుంబ సభ్యులు అందరూ పిల్లలు అవ్వాతాతలుతో సహా కలిసి కూర్చుని ఎవరికి వోటు వేయాలోమీరు చర్చించుకోండి...” అన్నారు.ఈ మాట విన్నాక, ప్రతి ఒక్కరూ ఆలోచనలో పడ్డారు. ఇన్నాళ్ళూ “నా వల్ల మేలు జరిగితే నాకు వోటు వేయండి” అని చెప్పిన సిఎం, ఇప్పుడు అదే మాటను మీ కుటుంబంలో అందరూ ఒక మాట అనుకొని ఒక నిర్ణయానికి రండి, అని దీన్ని ఒక ‘హోమ్లీ ఎఫైర్’గా మార్చారు. ఓటర్లు పోలింగ్ బూత్ లోకి వెళ్ళడానికిఇంకా మూడు వారాలు సమయం ఉండగా ఆయన ఇటువంటి కొత్త పని వాళ్లకు అప్పగించారు.
వినడానికి ఇది సాదాసీదా ప్రకటనగా ఉన్నప్పటికీ, ‘పిల్లలు అవ్వాతాతలుతో సహా కలిసి కూర్చుని...’ అనిఅనడం ద్వారా జగన్ దీన్ని ఒక ఇంట్లో మూడు తరాలు కలిసి కూర్చుని చేసే నిర్ణయంగా మార్చారు.కొన్ని కుటుంబాలు ఒక నిర్ణయం తీసువడం అంటే, ఎక్కడో పనిచేస్తూ ‘పోలింగ్’ రోజు ఊళ్లోకి వచ్చేవారి పిల్లలతో‘ఫోన్’లోమాట్లాడి కూడా కావొచ్చు. జగన్ చెప్పాడు- “కొన్ని కొంచెం మాత్రం పెంచి ఇంతకు ముందు ఇచ్చినవన్నీ మళ్ళీ ఇస్తాడంట...” అనేది అ చర్చలో కీలకం అవుతుంది. అయితేవారి‘నిర్ణయం’ ఏమిటి? అనే విషయం వద్దకు వచ్చేసరికి.మూడు తరాల్లో కూడా యువతరం (ఎమర్జింగ్ జెనరేషన్) ఏమనుకుంటున్నది అనేదిప్రధానం అవుతున్నది.నిర్లక్ష్యిత, లేదా వర్ధమాన సమాజాల్లోని యువతరం తమ ఆర్ధిక ప్రయోజనాన్ని మించి మరీ,సామాజిక కోణంలో రాజకీయ స్పృహను పెంచుకుంటున్న తీరు ఈ ఎన్నికల్లోస్పష్టంగా కనిపిస్తున్నది.
ఈ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కొందరు విశ్లేషకులు ఈ పార్టీకి నాయకులు తప్ప ‘కేడర్’ లేదు అనేవారు. స్థానిక సంస్థల ఎన్నికలు, నామినేటెడ్ పదవుల భర్తీ తర్వాత ఆ ఖాళీ చాలావరకు నిండింది. అయితే, ఏప్రెల్ చివరి వారంలో ఈ పార్టీకి ఉన్న అదృశ్యశక్తి ఏమిటో విశాఖ జిల్లా భీమిలి‘సోషల్ మీడియా వారియర్స్’ సదస్సులో దృశ్యమానం అయింది. ఇన్నాళ్ళూ జగన్ కోసం స్వచ్చందంగా పనిచేసినఅదృశ్య ‘కేడర్’ ఇది. అభిమానమే అర్హతగా తలుపులు లేని పుష్పక విమానమిది. ఆధునిక ప్రపంచంలో ఇప్పుడు ఉన్నవి రెండు రకాల యుద్దాలు అంటారు తత్వవేత్తలు.ఒకటి-'టెరిటోరియల్ బ్యాటిల్' మరొకటి-'ఐడిలాజికల్ బ్యాటిల్'. దీన్నేజగన్-‘పేదల కోసం పెత్తందార్లతో తన ప్రభుత్వం చేస్తున్న యుద్ధం’అంటారు.కావొచ్చు కూడా మరిఅటువంటప్పుడుఒక ప్రాంతం కోసం నాయకుడు తనను తానుకట్టేసుకోవడం రెండవ రకం యుద్ధం అయితే కావొచ్చు.
అదలా ఉంచి స్వచ్చందంగా ‘సోషల్ మీడియా వారియర్స్’ఈ పార్టీని ఇలా ‘వోన్’ చేసుకోవడానికి మూడుకారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి- తమ సామాజిక వర్గాల వారు చిన్నదో పెద్దదో ఏదో ఒక రాజకీయ పదవితో ఈ ప్రభుత్వంలో గుర్తింపును పొందడం.రెండు- సంస్కరణలు వల్ల పరిపాలన వ్యవస్థ వారి సమీపానికి రావడం. మూడు- మొదటి ఐదేళ్లలోనే ‘రియాల్టీ’గా కనిపిస్తున్న2019 ఎన్నికల వాగ్దానాలు. వీటిని మించి విభజిత ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రంగా రూపాంతర (ట్రాన్ఫార్మింగ్) దశలో ఉన్నప్పుడు,తమ కొత్త రాష్ట్రం ఎలా ఉండాలి? అనే భావన, దాన్ని వాస్తవం చేసే నాయకుడు ఎవరు? ప్రభుత్వం ఏది? అనే విషయంలో యువతఇప్పుడుపూర్తి స్పష్టతతో ఉంది. రేపటి వారి అవసరాలు,వారి పిల్లల అవసరాలు వారికీ ప్రధానం. వాటివెనుక- ఆర్ధికం సామాజికం సాంస్కృతికం ప్రాంతీయం ఇన్ని అంశాల నేపధ్యాలు ఉన్నాయి.
ఎన్నికలు అనేసరికి తమ పార్టీల ప్రాధాన్యతల ఎంపికలో ‘కన్ఫ్యూజన్’కు గురి అవుతున్నది ఎవరు? వాటిని నిజాయతీగా అర్ధం చేసుకుంటున్నది ఎవరు?అనేది వాళ్లకు ఇప్పుడు పూర్తిగా అర్ధమయింది. ఎన్నికల ముందు ‘సీట్ల’ కోసం జరిగిన కొందరి పార్టీల మార్పు, నిరుపేదలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం ఇచ్చే ప్రయత్నాలను పబ్లిగ్గా అవహేళన చేస్తున్న తీరు, వారి దృష్టిని దాటిపోయేవి కాదు. అటువంటివి వాళ్లకు ఎక్కడ గుచ్చుకోవాలో అక్కడ గుచ్చుకుంది. అందుకే, కేవలం పార్టీ పట్ల రాజకీయ అభిమానం ఉంచుకోవవడమే కాకుండా,నాయకుడి పట్ల యువత దాన్ని బహిరంగంగా వ్యక్తం చేసే తీరులో మునుపు ఎన్నడూ మనం చూడనివ్యక్తీకరణ ఒక‘హై వోల్టేజ్’ దేహభాషగా స్పష్టంగా కనిపిస్తున్నది.
ఈ కసి వెనుక ఉన్న కారణాల కోసం చూసినప్పుడు, రెండు ప్రధాన అంశాలు కనిపిస్తాయి. మొదటిది- ప్రభుత్వం నుంచి అందే మేలు ఏదైనా నిర్ణయాధికారం స్థానిక ఆధిపత్య వర్గాల చేతిలో నుంచి ఇప్పుడు అది సాంకేతికం అయింది. ఊళ్ళోని గ్రామ సచివాలయాల సిబ్బంది, ‘వాలంటీర్ల’ వద్దకు ‘ఆన్ లైన్’లోఅది చేరువయింది. దాన్ని ఆక్షేపిస్తూ ఏదొ వంకతో అ సేవలను నిలపాలనే వర్గాల నైజం కూడా అర్ధమయింది. జరుగుతున్న ‘యుద్దం’లో నిర్లక్ష్యిత, లేదా వర్ధమాన సమాజాల్లోని యువత ఇది తమ నిశబ్దవిజయం అనుకొంటున్నారు.
రెండవది- గడచిన ఇరవై ఏళ్లుగాచిన్న’బ్యాగ్’ భుజాన వేసుకుని కాళ్ళకు చక్రాలు కట్టుకుని, దేశంలో ఎక్కడ పని దొరికితే అక్కడికిజీవిక వెతుక్కుంటూవెళ్ళాము. ఇక ముందు మాకు ఈ తిరుగుడు తగ్గాలి. దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి వర్గాల్లో కుటుంబం అంతా కనీసం సమీపంగా కలిసి జీవించే పరిస్థితి రావాలిఅనేది వారి ఆకాంక్ష. ఇప్పుడు వున్నఈ- ‘ఫీల్ గుడ్’ వాతావరణంతో పాటుగా,వేగవంతమైన అభివృద్ధి కోసం ఇప్పటికే సిద్దమయిన ‘లాజిస్టిక్స్’, వాటికితోడుగావిస్తరిస్తున్న మౌలిక వసతుల వల్లఇకముందు ఉపాధి అవకాశాలు ఇక్కడే మెరుగవుతాయనికొత్త పార్టీ ప్రణాళిక చూశాక వాళ్ళు బలంగా నమ్ముతున్నారు.
జాన్సన్ చోరగుడి
వ్యాసకర్త అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత
Comments
Please login to add a commentAdd a comment