నేడు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ఇలా..  | CM YS Jagan Memantha Siddham Bus Yatra Schedule | Sakshi
Sakshi News home page

నేడు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ఇలా.. 

Published Wed, Apr 24 2024 5:16 AM | Last Updated on Wed, Apr 24 2024 5:16 AM

CM YS Jagan Memantha Siddham Bus Yatra Schedule - Sakshi

ఉదయం 9 గంటలకు అక్కివలస నుంచి యాత్ర ప్రారంభం 

పరశురాంపురం జంక్షన్‌ వద్ద భోజన విరామం 

సాయంత్రం టెక్కలి వద్ద బహిరంగ సభ 

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర  22వ రోజైన బుధవారం(ఏప్రిల్‌ 24) షెడ్యూల్‌ను వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం మంగళవారం విడుదల చేశారు. ఈ యాత్రలో భాగంగా సీఎం జగన్‌ మంగళవారం రాత్రి బస చేసిన అక్కివలస నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు.

ఎచ్చెర్ల బైపాస్, శ్రీకాకుళం బైపాస్, నరసన్నపేట బైపాస్, కోటబొమ్మాళి, కన్నెవలస మీదుగా పరశురాంపురం జంక్షన్‌ వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం కె.కొత్తూరు మీదుగా టెక్కలి వద్దకు చేరుకొని.. 3 గంటలకు అక్కడ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని సీఎం జగన్‌ ప్రసంగిస్తారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement