మీ అభిమానిగా ఒక్కరోజు బ్రతికినా చాలన్న: YSRCP సోషల్‌ మీడియా వింగ్‌ | YSRCP Social Media Wing Activists About CM Jagan's Governance | Sakshi
Sakshi News home page

మీ అభిమానిగా ఒక్కరోజు బ్రతికినా చాలన్న: YSRCP సోషల్‌ మీడియా వింగ్‌

Published Tue, Apr 23 2024 3:29 PM | Last Updated on Tue, Apr 23 2024 4:48 PM

YSRCP Social Media Wing Activists About CM Jagan Governance - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 21వ రోజు విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో ప్రభంజనంలా కొనసాగుతోంది. దారిపొడవునా సీఎం జగన్‌కు ప్రజలకు బ్రహరథం పడుతున్నారు. మంగళవారం వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా ప్రతినిధులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు.

విశాఖపట్నం పెద్దిపాలెంలోని చెన్నాస్‌ కన్వెషన్‌ హాలులో జరిగిన ఈ సమావేశంలో రెండు వేల మందితో కూడిన వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా వింగ్‌తో సీఎం సంభాషించారు.  పలువురు YSRCP సోషల్‌ మీడియా కార్యకర్తలు తమ మనోగతాన్ని సీఎం జగన్‌తో పంచుకున్నారు. 

మీకు మా కుటుంబం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది
‘నా తమ్ముడు భరత్ కుమార్ రెడ్డి ఫిబ్రవరి నెలలో ఎన్నికల ప్రచారానికి వెళ్లి తిరిగివస్తూ ప్రమాదవశాత్తు మృతిచెందాడు. ఆ సమయంలో ఎమ్మెల్యే శ్రీకాంత్, భార్గవ్ అన్న మా కుటుంబానికి అండగా నిలిచారు. నా తమ్ముడుకు మీరే దైవం అన్న. మీరు బాగుంటేనే మేము బాగుంటాం. మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని ఎల్లోమీడియా ఎంతో దుష్ప్రచారం చేసేది. అయితే భార్గవ్ అన్న ఛార్జ్ తీసుకున్న తర్వాత మన వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా ప్రతిపక్షాలు భయపడేంతగా స్ట్రాంగ్ అయ్యింది. మా తమ్ముడు చనిపోయినా బాధగా ఉన్నాకూడా మీతో ఒక్కసారి ఫోటో దిగానా, మిమ్మల్ని కలుసుకున్నా వాడి ఆత్మ శాంతిస్తుందని వచ్చా. మీ అభిమానిగా ఒక్కరోజు బ్రతికినా చాలు.. మీకు మా కుటుంబం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది’
-ఎం. అనిల్ కుమార్ రెడ్డి, అన్నమయ్య జిల్లా, రాయచోటి నియోజకవర్గం

జగనన్న మీరు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. మనస్సుకు ఎంతగాయమైనా, దేహానికి ఎంతగాయమైనా చిరునవ్వుతో బతకాలని అన్నది మిమ్మల్ని చూసి ఇన్పైర్ అయ్యాము. నా పిల్లలకు ఎంతో సాయం చేశారు అయితే ఇంకా అండాదండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్లీ మీరే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాను సార్..
-బాలచంద్ర, గుంటూరు జిల్లా, తెనాలి మండలం (గీతాంజలి భర్త)

బాల చంద్ర వ్యాఖ్యలపై సీఎం జగన్‌ స్పందిస్తూ..
‘బాలచంద్ర.. నీ కుటుంబానికి 100 శాతం అన్నిరకాలుగా తోడుగా ఉండే కార్యక్రమం ఇప్పటికే జరుగుతోంది. ఇది ఎప్పటికీ మనస్సులో పెట్టుకో. సజ్జల భార్గవ్‌కు కూడా చాలా క్లియర్‌గా చెప్పాను. అన్నిరకాలుగా నిన్ను చేయి పట్టుకుని నడిపిస్తాడు’ అని భరోసా ఇచ్చారు

చంద్రబాబు యుద్ధానికి డైరెక్ట్‌గా రాడు
‘అన్న ఒక చిన్న విషయం చెప్తాను. తెనాలిలో ఇళ్ల పట్టా తీసుకుని గీతాంజలి చాలా సంతోషంతో చెప్పలేని ఆనందంతో తన అభిప్రాయాన్ని చెప్పుకుంది. కానీ మీరు చెప్పినట్టు.. కాయలున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాయలున్న చెట్టు. తెలుగుదేశం పార్టీ ముళ్లున్న చెట్టు. గీతాంజలి కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంతో అండగా నిలిచింది. మీ మీద దాడి జరిగితే అది మా మీద జరిగినట్టు భావించాం. అన్నా మీరు చాలా జాగ్రత్త.. వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబుకు ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చు. చంద్రబాబు యుద్ధానికి డైరెక్ట్‌గా రాడు, వారి వెన్నుపోటుకు జాగ్రత్తగా ఉండమని చేతులెత్తి దండమెడుతున్నా.
-పి. నాని, బాపట్ల జిల్లా

2014 నుంచి 2019 వరకు ముస్లింలంతా భయపడుతూ బ్రతికారు. 2019లో మా రాజన్న బిడ్డ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత కాలర్ ఎగరేసుకుని బ్రతుకుతున్నాం. మైనార్టీలను నలుగురిని ఎమ్మెల్యేలు చేశారు, ఎమ్మెల్సీలను చేశారు, డిప్యూటీ సీఎంను చేశారు, మండలి వైస్ ఛైర్మన్‌ను చేశారు. అంతేకాకుండా ఇప్పుడు ఏడుగురికి ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చారు, అదీగాక హఫీజ్ ఖాన్ కు రాజ్యసభ అనౌన్స్ చేశారు. ముస్లింల కోసం వైఎస్సార్ ఒక అడుగు ముందుకేస్తే.. మీరు నాలుగు అడుగులు ముందుకేశారు. వాళ్లు మూడు జెండాలతో వస్తున్నారు మనది ఒకటే జెండా కానీ ఆ జెండాకు మూడక్షరాలు Y.S.R అదిచాలన్నా ఆ జెండాను మోసేందుకు..      
-వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమాని..  

నా గుండెల్లోంచి జగనన్నను తీయలేకపోయా
‘విశాఖ ఎయిర్‌పోర్టు ఫుడ్‌ కోర్టుకు సంబంధించి అంతా టీడీపీ వాళ్లు అని తెలియక అక్కడ ఉద్యోగంలో చేరాను నేను. కోడికత్తి శ్రీను విశాఖలో మీమీద దాడి చేసిన ఘటనకు ప్రత్యక్ష సాక్షిని నేను. ఆ ఘటన తర్వాత నేను జగన్‌ అభిమానిని అని తెలిసి వాళ్లు నన్ను చాలా వేధించారు. అక్కడ టీడీపీ నాయకులు లోకేష్, చంద్రబాబు, బాలకృష్ణ, సీఎస్‌వో వేణుగోపాల్, హర్షవర్థన్ అందరూ ఒక కూటమిలా అక్కడ ఉండేవాళ్లు. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌ గా నేను PCS రూల్ ప్రకారమే ఉండాలని ప్రయత్నించేదాన్ని. మీ అభిమానిని అన్న కారణంగా నన్ను అనుమానించి, నాపై దొంగకేసులు బనాయించారు. నాకెక్కడా ఉద్యోగం రాకుండా చేశారు. నా కుటుంబాన్ని కూడా ఎంతగానో హింసించారు.

వేణుగోపాల్‌ అయితే నిన్ను ఎక్కడా బతకనివ్వను అని బెదిరించారు. మీ మీద హత్యాయత్నం వ్యవహారంలో నేనే చేయించినట్టు చెప్పాలంటూ నా మీద ఒత్తిడి తెచ్చారు. దీంతో నేను ఉద్యోగానికి రిజైన్‌ చేశాను. కుటుంబం అంతా కూడా దూరంగా వెళ్లిపోయాం. ఇన్నేళ్లూ నేను ఉద్యోగం కూడా లేకుండానే ఉన్నాను. కానీ మొన్న విజయవాడలో మీ మీద బోండా ఉమ చేయించిన దాడి చూశాక మౌనంగా ఉండకూడదు అనుకున్నాను. ఈ విషయాన్ని ఇప్పుడు మీ ముందే బయటపెడుతున్నాను. దొంగ కేసు పెట్టి నా కెరీర్ నాశనం చేసారు. అయినా నేను బాధపడలేదు. నా ఉద్యోగం అయితే తీయగలిగారు కానీ నా గుండెల్లోంచి జగనన్నను తీయలేకపోయారు.
-సామ్రాజ్యం, గతంలో ప్రేవేట్‌ చీఫ్ సెక్యూరిటీ అఫీసర్, విశాఖ ఎయిర్‌పోర్టు

సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ..
సోషల్ మీడియాపరంగా ఎవరైనా హెరాస్‌మెంట్‌కి లోనైతే సహాయం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఎవరైనా సోషల్ మీడియా వల్ల ఇబ్బందులకు గురైతే చెప్పుకోగలిగేలా ఒక యాప్ తయారుచేయాలి. ప్రతివారం నాకు దానిపై రిపోర్టు కావాలి. అవతలి వాళ్లు మన మీద దాడి చేస్తున్నారు అంటే, సుచిత్ర కానీ, గీతాంజలి కానీ, సాక్షాత్తూ నామీద కానీ, దాని అర్థం ఏమిటంటే.. మనం విజయానికి చేరువగా ఉన్నామని...విజయానికి వాళ్లు దూరంగా ఉన్నారని. 

మిమ్మల్ని తలవని రోజు, మీ గురించి మాట్లాడని రోజు, మీ గురించి రాయని రోజు లేదు. మా గురించి, మా కుటుంబం గురించి అయినా మర్చిపోతామేమో కానీ మీ గురించి మర్చిపోయి ఒక్కరోజు కూడా లేము. మా కుటుంబం కంటే ఎక్కువ అయ్యారు మీరు. ఎందుకంటే మీరు ఎంతో గొప్ప ఇన్స్‌పిరేషన్ మాకు. అబ్రహాం లింకన్, మహాత్మాగాంధి, అంబేడ్కర్ గురించి పుస్తకాల్లో చదువుకున్నాం కానీ మీరు మాకు కనిపించే లైవ్ ఎగ్జాంపుల్. 36 ఏళ్ల వయసులో మీరు ఢిల్లీ పీఠాన్ని ఎదిరించారు. మీ లైఫ్ జర్నీ ఇంకా తెలుసుకోవాలని ఉంది. మీరు చెప్పే మాటలు మాకెంతో ఇన్సిపిరేషన్ ఇస్తాయి. యువతను ఉత్తేజపరుస్తాయి. మీకోసం ప్రాణాలిచ్చేందుకైనా సిద్ధం. 
-హెబ్సిబా, అసోసియేట్ ప్రొఫెసర్, ఫార్మసీ

*కడుపు కాలేవాడికే మీ పథకాల విలువ తెలుస్తుంది.
మా అన్నయ్య మన పార్టీ వీరాభిమాని, సోషల్ మీడియా సైనికుడు. 2022లో యాక్సిడెంట్‌లో మరణించాడు. అది తెల్సుకుని ముందుగా సజ్జల భార్గవ్ గారు స్పందించారు. మా ఇంటికి వచ్చారు. మీ గురించి జగనన్నకు కూడా తెలియజేసామని, మీకు సాయం అందించమని ఆదేశించారని కూడా చెప్పారు. మా కుటుంబానికి అండగా నిలుస్తామని చెప్పి రెండు నెలల్లోనే మా వదినకు ఉద్యోగం ఇప్పించారు. అంతే కాదు మా సొంత పిన్నీ, బాబాయ్‌ టీడీపీ అభిమానులు, అంతేకాదు గత టీడీపీ ప్రభుత్వంలో వాళ్లే జన్మభూమి కమిటీలో మెంబర్లు కూడా. వాళ్లకి సైతం పెన్షన్ మన ప్రభుత్వంలోనే ఇచ్చారు. సంక్షేమ పథకాలు మాకు, వాళ్లకూ కూడా వస్తున్నాయి. ఇప్పుడు వాళ్లింట్లో ఆడవాళ్లంతా కూడా జగనన్నకే ఓటు వేస్తాం అని చెబుతున్నారు. 

మీరు అందించే పథకాల విలువ కడుపు కాలేవాడికే తెలుస్తుంది. కడుపు నిండిన వాడికి తెలియదు. ఆ పెత్తందారులు మాకు గాయం చేస్తే మీరు మాకు సాయం చేస్తున్నారు. మా చివరి శ్వాస వరకూ జై జగన్‌ అనే అంటాం. ఫ్యాన్‌కే ఓటేస్తాం. వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ సోషల్ మీడియా కూడా మాకు కుటుంబమే అన్నా.. మా అన్న చనిపోయినప్పుడు ఓ కూలీ చేసుకునే వ్యక్తి ఫోన్ చేసి నేను ఇవాళ కూలి పనికి వెళ్తున్నా, కూలీగా వచ్చిన రూ.600 నీకు పంపుతా తమ్ముడూ అని చెప్పాడు. ఇంత గొప్ప కుటుంబం ఇచ్చింది నువ్వే కదా జగనన్నా...నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం.
-వినయ్ కుమార్, మల్కాపురం, జగ్గయ్యపేట మండలం, ఎన్టీఆర్‌ జిల్లా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement