
సాక్షి, గుంటూరు: గతంలో ఏ ప్రభుత్వం చేయనంత అభివృద్ధి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేసిందన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు నేరుగా ప్రజల అకౌంట్లలో వేశామని తెలిపారు. లంచాలు, వివక్ష లేకుండా సంక్షేమం అందించామని పేర్కొన్నారు. 130 సార్లు బటన్ నొక్కి.. నేరుగా పేదల ఖాతాల్లో డబ్బు జమ చేశామన్నారు. ప్రజలు రెండుసార్లు బటన్ నొక్కి వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని గెలిపించాలని కోరారు.
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 13వ రోజు గుంటూరు జిల్లాలో సాగుతోంది. ఏటుకూరు బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగా సీఎం వైఎస్ జగన్ ప్రసంగించారు. గుంటూరులో మరో ప్రపంచం కనిపిస్తుందన్నారు. ఈ మహజన సముద్రం చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందని తెలిపారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంధంగా భావిస్తూ.. 99 శాతం హామీలు అమలు చేశామని చెప్పారు.
58 నెలలుగా చేస్తున్న అభివృద్ధిని కొనసాగించేలా ప్రజలు ఆశీర్వదించాలని అన్నారు. ప్రజల ఆత్మగౌరవాన్ని పెంచిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని కోరారు వచ్చే ఎన్నికలు చంద్రబాబు మోసాలకు, ప్రజలకు జరుగుతున్న కురుక్షేత్ర యుద్ధం అని పేర్కొన్నారు. జరుగుతున్న మంచిని కొనసాగించేందుకు మీరంతా సిద్ధమేనా అంటూ సభకు హాజరైన ప్రజలను ఉద్ధేశించి వ్యాఖ్యానించారు.
సీఎం జగన్ ఇంకా మాట్లాడుతూ..
- చంద్రబాబు, దత్తపుత్రుడు, వదినమ్మ.. అందరూ అబద్ధాలు బుర్రకథలుగా చెబుతున్నారు.
- ఇదే కూటమి.. 2014లో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు
- రంగు రంగుల మేనిఫెస్టీ ఇంటింటికి పంచి.. హామీలు తుంగలో తొక్కింది కూటమి
- చంద్రబాబుకు ఓటేస్తే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయి.
- చంద్రబాబుకు ఓటేస్తే సంక్షేమం ఆగిపోవాలని మీరు నిర్ణయం తీసుకున్నట్లే.
అదే ముగ్గురు మళ్లీ వస్తున్నారు.. ప్రజలు జాగ్రత్త
- సింగపూర్‌ను మించి అభివృద్ధి చేస్తామని బాబు చెప్పారు.. కానీ జరిగిందా?
- ప్రతి గ్రామానికి ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అన్నారు.. కానీ ఏర్పాటు చేశారా?
- ఇంటింటికీ ఉద్యోగం, నిరుద్యోగ భూతి అన్నారు..కానీ చేశారా?
- ప్రతీ జిల్లాలో హెటెక్ సిటీ కడతానన్నారు.. కానీ కట్టారా?
- రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?
- పొదుపు సంఘాల రుణాలురద్దు చేస్తానన్నాడు.. చేశాడా?
- ఆడబిడ్డ పుడితే రూ. 25 వేలు డిపాజిట్ చేస్తానన్నాడు.. చేశాడా?
- అర్హులకు మూడు సెంట్ల స్థలం ఇస్తానన్నాడు. ఇచ్చాడా?
- 10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ అన్నాడు.. చేశాడా?
- మళ్లీ అదే ముగ్గురు..కొత్త హామీలతో వస్తున్నారు.
- సూపర్ సిక్స్, సెవెన్ అంటున్నారు నమ్మొద్దు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.
మీరు నా స్టార్ క్యాంపెయినర్లు
- ఇంటింటికి వెళ్లి బాబు మోసాలను వివరించండి
- పథకాలన్నీ కొనసాగాలంటే జగనన్న రావాలని చెప్పండి
- వాలంటీర్లు మళ్లీ మీ ఇంటికి రావాలంటే జగనన్న రావాలి
- జగన్‌కు ఓటు వేయడమంటే మంచిని కొనసాగించడమే
Comments
Please login to add a commentAdd a comment