
తనపై దాడి అనంతరం రోడ్ షోలో సీఎం జగన్ అభివాదం
ఇక ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రకు వస్తున్న జనాదరణను చూసి కొందరి కళ్లు ‘పచ్చ’బడ్డాయి. జగన్‌ను జనం నుంచి దూరం చేయాలనే కుట్రతో బస్సుయాత్ర సింగ్‌నగర్, డాబాకొట్లు సెంటర్ దాటగానే గుర్తుతెలియని ఆగంతకులు ఆయనపై రాయి విసిరారు.
సాక్షి, విజయవాడ: ఇక ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రకు వస్తున్న జనాదరణను చూసి కొందరి కళ్లు ‘పచ్చ’బడ్డాయి. జగన్‌ను జనం నుంచి దూరం చేయాలనే కుట్రతో బస్సుయాత్ర సింగ్‌నగర్, డాబాకొట్లు సెంటర్ దాటగానే గుర్తుతెలియని ఆగంతకులు ఆయనపై రాయి విసిరారు. రాయి తగిలి ఎడమ కంటిపై గాయమైంది. రక్తం కారుతుంటే వైద్యులు ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం యాత్రను ఆపకుండా ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.
అక్కడ నుంచి పైపుల రోడ్డు, కండ్రిక మీదుగా రామవరప్పాడు రింగ్ రోడ్డుకు చేరుకోగానే ప్రజలు పెద్దఎత్తున ఎదురొచ్చి స్వాగతం పలికారు. రామవరప్పాడు, ప్రసాదంపాడు, నిడమానూరు, గూడవల్లి మీదుగా కేసరపల్లిలో రాత్రి బస వద్దకు 10.38 గంటలకు జగన్ చేరుకున్నారు. మండుటెండను లెక్కచేయక, జోరు వానలోనూ తడుస్తూ ఒక్క విజయవాడలోనే 5 గంటల పాటు యాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ జగన్ 14వ రోజు బస్సుయాత్రను ముగించారు.
ఇదీ చదవండి: సీఎం జగన్‌పై హత్యాయత్నం!