కాకినాడ మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్‌ స్పీచ్‌ హైలైట్స్‌ | CM YS Jagan Memantha Siddham Bus Yatra Day 18 Live Updates | Sakshi
Sakshi News home page

కాకినాడ మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్‌ స్పీచ్‌ హైలైట్స్‌

Published Fri, Apr 19 2024 8:03 AM | Last Updated on Fri, Apr 19 2024 7:59 PM

CM YS Jagan Memantha Siddham Bus Yatra Day 18 Live Updates - Sakshi

Updates..

కాకినాడ మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్‌ స్పీచ్‌ హైలైట్స్‌

  • కాకినాడ జిల్లా సిద్ధం
  • ఇక్కడ కనిపిస్తోంది.. నిండు గోదావరి
  • ఇక్కడ కనిపిస్తోంది.. అభిమాన వరద గోదావరి
  • ఈ ప్రభుత్వం మంచి చేసిందన్న నమ్మకం.. దాన్ని కాపాడుకోవాలన్న సంకల్పం మీ అందరిలోనూ కనిపిస్తోంది
  • ఈ సభకు ఇక్కడకు వచ్చిన ప్రతీ ఒక్కరికీ, నా అక్కలకు, నా చెల్లెమ్మలకు, నా అవ్వలకు, నా తాతలకు, నా ప్రతీ సోదరుడికీ, నా ప్రతీ స్నేహితుడికి ముందుగా పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను

  • ఎన్నికలకు కేవలం 25 రోజులే ఉన్నాయి.
  • ఒకవైపు ఎన్నికల నోటిఫికేషన్‌ నగరా మోగింది. మరోవంక ప్రజలంతా కూడా, పేదలంతా మరోసారి జైత్రయాత్రకు సిద్ధం సిద్ధం అంటూ గర్జిస్తూ సింహ గర్జన చేస్తున్నారు
  • ఇంటింట ఆత్మగౌరవాన్ని,  పేద వర్గాల ఆత్మగౌరవాన్ని, అక్క చెల్లెమ్మల గౌరవాన్ని  కాపాడుతున్న మన ప్రభుత్వానికి మద్దతు పలకడానికి మీరంతా కూడా సిద్ధమేనా?

  • జన్మభూమి ‍కమిటీలతో మొదలు చంద్రబాబు దాకా, పెత్తందార్ల దోపిడీ వర్గానికి మన పేదల అనుకూల వర్గానికి ఒక క్లాస్‌వార్‌ జరుగుతోంది
  • ఈ జరుగుతున్న యుద్ధంలో పేదల భవిష్యత్‌ కొరకు.. వ్యతిరేక కూటమితో యుద్ధం జరుగుతుంది
  • ఈ పేదల వ్యతిరేక కూటమిని ఓడించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా?
  • ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావు.. రాబోయే 60 నెలల పాటు ఎలాంటి పరిపాలన ఉండాలని నిర్ణయించే ఎన్నికలు
  • వచ్చే ఐదేళ్ల కాలంలో మీకు ఈరోజు జగన్‌ ద్వారా అందుతున్న పథకాలు కొనసాగలా.. వద్దా అన్నది మీ ఓటు ద్వారా నిర్ణయం అవుతుంది
  • జగన్‌కు ఓటేస్తే.. ఫ్యాన్‌పై రెండు ఓట్లు వేస్తే.. పథకాలన్నీ కొనసాగతాయి
  • లేదంటే బాబు మార్క్‌తో. మోసాలతో పథకాలన్నీ ముగిసిపోతాయి
  • ఇది బాబు చెబుతున్న చరిత్ర.. బాబు చూసిన ఏ ఒక్కరికైనా అర్థమయ్యే చరిత్ర

  • మ్యానిఫెస్టోతో మోసం చేయడానికి బాబు మళ్లీ సిద్ధం అయ్యాడు
  • జగన్‌కు ఓటేస్తే.. పట్టణాల్లోనూ, వార్డుల్లోనూ జగన్‌ మార్క్‌ సచివాలయ సేవలన్నీ కొనసాగుతాయి
  • లేదంటే.. బాబు మార్క్‌తో కత్తిరింపులు, ముగింపు జరుగుతుంది
  • ఫ్యాన్‌కు ఓటేస్తే.. ఇంటి వద్దే మూడు వేల రూపాయల పెన్షన్‌ అందుతుంది. అదే సమయంలో పెన్షన్‌ అందిస్తున్న జగన్‌ మార్క్‌ పౌర సేవల వ్యవస్థ కొనసాగుతుంది.
  • ఏకంగా రెండు లక్షల డబ్బై కోట్ల రూపాయలను నేరుగా నా అక్క చెల్లెమ్మ ఖాతాల్లోకి జమ చేశాం
  • ఎక్కడ వివక్ష లేకుండా, లంచాలు లేకుండా పాలన కొనసాగింది.
  • లేదంటే ఇప్పుడు జరుగుతున్న దానికి బాబు మార్క్‌ ముగింపు ఉంటుంది
  • మళ్లీ దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం జరుగుతుంది
  • పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే ఒక చంద్రముఖి నిద్ర లేస్తుంది.. మళ్లీ ఒక పసుపుపతి నిద్ర లేస్తాడు.. వదల బొమ్మాలి.. వదల బొమ్మాలి అంటూ
  • మీ రక్తం తాగేందుకు మీ ఇంటికే వస్తాడు
  • ఫ్యాన్‌కు ఓటేస్తే విత్తనం నుంచి పంట అమ్మకం వరకూ సేవలు అందిస్తున్న రైతు భరోసా కేంద్రాలు కొనసాగుతాయి
  • లేదంటే.. బాబు మార్క్‌తో ముగింపు పడుతుంది.

  • ఫ్యాన్‌పై రెండు ఓట్లు వేస్తేనే.. ఉచిత పంటల బీమా.. ఫ్యాన్‌పై రెండు ఓట్లు వేస్తేనే సున్నా వడ్డీకే రుణాలు, ఫ్యాన్‌పై రెండు ఓట్లేస్తేనే సకాలంలో ఇన్‌పుట్‌ సబ్సిడీ
  • ఫ్యాన్‌ మీద రెండు ఓట్లు వేస్తేనే.. రైతన్నకు పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్‌
  • ఫ్యాన్‌పై రెండు ఓట్లు వేస్తేనే.. దళారిలు లేని ఆర్బీకే వ్యవస్థతో ధాన్యం కొనుగోలు, ఇతర పంటలు కొనుగోలు అన్నది జరుగుతుంది
  • ఇవన్నీ జరగాలంటే ఫ్యాన్‌ మీద రెండు ఓట్లు వేస్తేనే అనేది గుర్తుపెట్టుకోండి
  • లేదంటే.. చంద్రబాబు మార్క్‌తో ముగింపు
  • ఫ్యాన్‌కు ఓటేస్తేనే గవర్నమెంట్‌ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియం
  • ఫ్యాన్‌కు ఓటేస్తేనే గవర్నమెంట్‌ బడుల్లో రూపు రేఖలు మార్చే నాడు-నాడు
  • ఫ్యాన్‌కు ఓటేస్తేనే మూడో తరగతి నుంచే టోఫెల్‌ శిక్షణ, మూడో తరగతి నుంచే సబ్జెక్ట్‌ టీచర్స్‌ బోధన, మూడో తరగతి నుంచే బైజూస్‌ కంటెంట్‌
  • ఆరో తరగతికి వచ్చేసరికి డిజిటల్‌ బోధన,  ఐఎఫ్‌బీ ప్యానల్స్‌,
  • ఎనిమిదో తరగతికి వచ్చేసరికి ఆ పిల్లల చేతుల్లో ట్యాబ్స్‌
  • ఇక పెద్ద చదువులకు వంద శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌
  • దీనిలో భాగంగా విద్యా దీవెన, వసతి దీవెన
  • డిగ్రీ చదువుతున్న పెద్ద పిల్లలకు ఆ పెద్ద చదువుల్లో సర్టిఫైడ్‌  ఆన్‌లైన్‌ వర్టికల్స్‌ద్వారా విదేశాల్లో అతి ఉన్నత విద్యాలయాలకు మన కాలేజీలు అనుసంధానం
  • తొలిసారి డిగ్రీలో మ్యాండెటరీ ఇంటెర్న్‌షిప్‌
  • ఇవన్నీ కొనసాగి మీ పిల్లలు ఎదగాలంటే.. మీ బిడ్డ వైఎస్‌ జగన్‌ 10 ఏళ్లు ఇదే స్థానంలో ఉంటే జగన్‌ మార్క్‌ విప్లవాలు కొనసాగుతాయి.

  • లేదంటే.. గవర్నమెంట్‌ బడుల్లో ఇంగ్లిష్‌ మీడియం రద్దు, నాడు-నేడు రద్దు, బడి పిల్లలకు ఇచ్చే గోరుముద్ద కార్యక్రమం రద్దు, బడి తెరిచే సమయానికి ఇచ్చే విద్యాకానుక రద్దు. ట్యాబ్స్‌, విద్యా కానుక, వసతి దీవెన ఇలా అన్నీ కూడా రద్దు
  • చంద్రబాబు మార్క్‌తో కత్తిరింపులు, ముగింపులు చూడాల్సి ఉంటుంది
  • మళ్లీ చంద్రముఖి నిద్ర లేస్తుంది.. లకలక, లకలక అంటూ అన్నింటికి ముగింపు.

  • ఫ్యాన్‌కు ఓటేస్తేనే  గ్రామాల్లో విలేజ్‌ క్లినిక్‌లు, ఫ్యాన్‌కు ఓటేస్తేనే ఫ్యామిలీ డాక్టర్‌, ఫ్యాన్‌కు ఓటేస్తేనే ఇంటికే ఆరోగ్య సురక్ష
  • ఇంటివద్దనే టెస్టులు,  గ్రామంలోనే మందులు
  • గ్రామంలో రూపు రేఖలు మారుస్తూ నాడు నేడు
  • రూ. 25 లక్షల వరకూ ఉచితంగా ఆరోగ్య శ్రీ
  • ఆరోగ్య శ్రీతో పాటు ఆ పేదవాడు ఇబ్బంది పడకుండా ఆరోగ్య ఆసరా
  • కొత్తగా పదిహేడు మెడికల్‌ కాలేజ్‌లు నిర్మాణం
  • జగన్‌ మార్క్‌ ఈ విప్లవాలు కొనసాగాలంటే ఫ్యాన్‌పై రెండు ఓట్లేస్తేనే కొనసాగుతాయి
  • లేదంటే.. మళ్లీ చంద్రముఖి నిద్ర లేస్తుంది. వదల బొమ్మాలి అంటూ  వైద్యం అందని పరిస్థితుల్లోకి పేదవాడిని తీసుకు పోతుంది
  • ఫ్యాన్‌కు ఓటేస్తేనే పిల్లల్ని బడులకు పంపే తల్లులకు అమ్మ ఒడి అనే పథకం, విద్యా దీవెన, వసతి దీవెన.
  • ఫ్యాన్‌కు ఓటేస్తేనే  ఓ చేయూత కొనసాగింపు, ఫ్యాన్‌కు ఓటేస్తేనే కాపు నేస్తం కొనసాగింపు, ఫ్యాన్‌కు ఓటేస్తేనే ఈబీసీ నేస్తం కొనసాగింపు
  • ఫ్యాన్‌కు ఓటేస్తేనే ఓ వైఎస్సార్‌ జగనన్న కాలనీలు, అందులో 30 లక్షల పట్టాలు, అందులో కడుతున్న 22 లక్షల ఇళ్లలు.. అన్నీ కూడా వేగంగా అడుగులు
  • ఫ్యాన్‌కు ఓటేస్తేనే.. నామినేటెడ్‌ పదవుల్లో నా అక్క చెల్లెమ్మలకు అగ్ర తాంబాలం ఇస్తూ యాబై శాతం రిజర్వేషన్లతో పదవులు అన్నీ కూడా ఉండాలంటే మీ బిడ్డ జగన్‌ మళ్లీ వస్తానే అనేది ఆలోచన చేయండి
  • లేదంటే.. మళ్లీ చంద్రముఖి నిద్ర లేస్తుంది.. పసుపుపతి నిద్ర లేస్తాడు.. వదల బొమ్మాలి వదల అంటాడు

  • బాబు సిట్‌ అంటే పవన్‌ సిట్‌.. స్టాండ్‌ అంటే పవన్‌ స్టాండ్‌
  • ప్యాకేజీ స్టార్‌కు పెళ్లిళ్లే కాదు.. నియయోజకవర్గాలు కూడా నాలుగు అయ్యాయి.
  • చంద్రబాబు తన సంకలోని పిల్లిని పిఠాపురంలో వదిలాడు
  • జ్వరం వస్తే ప్యాకేజీ స్టార్‌ పిఠాపురం వదిలేసి హైదరాబాద్‌ పారిపోయే రకం
  • బీఫామ్‌ బీజేపీ, కాంగ్రెస్‌, గాజుగ్లాస్‌దే అయినా..యూనిఫామ్‌ మాత్రం చంద్రబాబుదే
  • రాష్ట్రాన్ని హోల్‌సేల్‌గా దోచుకునేందుకు చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు.
  • బాబు పొడవమంటే పురందేశ్వరి తన తండ్రినే వెన్నుపోటు పొడిచింది.
  • బాబు ఎవరికి సీటు ఇమ్మంటే పురందేశ్వరి వారికే ఇస్తుంది.
  • అక్క చెల్లెమ్మలకు గుర్తుందా?
  • పొదుపు సంఘాల విషయాలు గుర్తున్నాయా?
  • బాబు మోసం చేసిన విషయాలు గుర్తున్నాయా
  • మళ్లీ అక్క చెల్లెమ్మల బతుకులన్నీ అతలాకుతలం ఆవుతాయి.
  • ఓటు వేసే ముందు మీ కుటుంబంలో ప్ర​తీ ఒక్కరూ ఆలోచన చేయండి.. 
  • ఓటు వేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచన చేయండి 
  • ఎవరి ఉంటే మీ ఇంటికి మంచి జరుగుతుంది అనే ఆలోచనతో ఓటేయండి
  • అందుకే మళ్లీ మళ్లీ చెబుతున్నాను
  • ఇవి కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కాదు..  మీ జీవితాలను, తలరాతలను మార్చే ఎన్నికలు
  • మీకు మంచి చేసిన మీ బిడ్డ పాలన కావాలా?
  • లేకపోతే దోచుకుని దాచుకుని చంద్రబాబు పాలన కావాలా?
  • మీ బిడ్డ చేసిన పాలన అందరికీ కనబడుతోంది
  • ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి

కాకినాడ వైఎస్సార్‌సీపీ రూరల్‌ అభ్యర్థి కన్నబాబు స్పీచ్‌

  • చంద్రబాబుకు బిల్డప్‌ ఎక్కువ.. పని తక్కువ
  • సీఎం జగన్‌ నాణ్యమైన విద్య, వైద్యం అందిస్తుంటే.. బాబు మాత్రం నాణ్యమైన మద్యం అందిస్తారంట
  • వాలంటీర్‌ సేవలను అడ్డుకున్న కుట్రదారు చంద్రబాబు
  • ఈ సందర్భంగా మేమంతా సిద్ధం అని తెలియజేసుకుంటున్నా
     

అచ్చంపేట జంక్షన్‌ మేమంతా సిద్ధం సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్‌

  • ర్యాంప్‌పై నడుస్తూ ప్రజలకు అభివాదం
  • లక్షలాదిగా తరలి వచ్చిన ‘అభిమానం’
  • జై జగన్‌ నినాదాలతో మార్మోగుతున్న సభా ప్రాంగణం
     

కాకినాడ జిల్లా:
అచ్చంపేట జంక్షన్‌కు చేరుకున్న సీఎం జగన్‌ బస్సుయాత్ర

  • మరికాసేపట్లో బహిరంగ సభ ప్రారంభం\
  • సభలో పాల్గోని ప్రసంగించనున్న సీఎం జగన్‌
  • జిల్లా నలమూలల నుండి సభకు భారీగా తరలివచ్చిన ప్రజలు

కాకినాడ జిల్లా: 

ఉండూరు క్రాస్ వద్ద జె.సత్యనారాయణ అనే పేషెంట్‌ను కలిసిన సీఎం జగన్‌

  • పిరుదు భాగంలో సర్జరీ కావడంతో వీల్ ఛైర్‌కి పరిమితం అయిన కాకినాడ రూరల్ తూరంగికి చెందిన సత్యనారాయణ.
  • ముఖ్యమంత్రి సహయ నిధి ద్వారా ఆదుకుంటానని హమీ ఇచ్చి మానవత్వం చాటుకున్న సీఎం జగన్‌
     

కాకినాడ జిల్లా: 

ఉండూరు క్రాస్ నుండి ప్రారంభమైన మేమంతా సిద్దం సీఎం జగన్‌ బస్సుయాత్ర

  • మరికాసేపట్లో తిమ్మాపురం మండలం అచ్చంపేట  జంక్షన్ వద్ద జరిగే బహిరంగ సభలో పాల్గోననున్న సీఎం జగన్‌

బస్సుయాత్రలో సీఎం జగన్‌కు భద్రత కట్టుదిట్టం

  • బస్సుయాత్రలో ప్రత్యేకంగా మొబైల్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటు
  • పోలీస్‌ శాఖ, ఐ  పేజ్‌ సంయుక్తంగా కమాండ్‌ సెంటర్‌ పర్యవేక్షణ
  • సీఎం జగన్‌ భద్రతను నిరంతరం పర్యవేక్షించేలా ఏర్పాట్లు

వైఎస్సార్‌సీపీలోకి చేరిన టీడీపీ, జనసేన కీలక నేతలు

  • కాకినాడ జిల్లా రాజానగరం నియోజకవర్గం ఎస్.టి.రాజపురం నైట్ స్టే పాయింట్ వద్ద సీఎం జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలోకి చేరిన జనసేన, తెలుగుదేశం, కీలక నేతలు
  • కండువా వేసి వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించిన సీఎం
  • వైఎస్సార్‌సీపీలో చేరిన జనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి, నెల్లూరు మండల అధ్యక్షుడు కాటంరెడ్డి  జగదీష్ రెడ్డి, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ యాదవ్, టీడీపీ ఉదయగిరి మండల మాజీ ఎంపీపీ చేజెర్ల సుబ్బారెడ్డి. కార్యక్రమంలో పాల్గొన్న నెల్లూరు ఎంపీ అభ్యర్ధి వి విజయసాయిరెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్ధి ఆదాల ప్రభాకరరెడ్డి.

రంగంపేట చేరుకున్న సీఎం వైఎస్ జగన్

  • సీఎం జగన్ చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు
  • రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన జనాలు
  • బస్సుపైకి ఎక్కి ప్రజలకు అభివాదం చేసిన సీఎం జగన్

దారిపొడవునా సీఎం జగన్‌కు ఘన స్వాగతం

  • భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, బాణసంచాతో అఖండ స్వాగతాలు
  • కిలోమీటర్ల కొద్దీ వెన్నంటి వస్తున్న వీరాభిమానులు
  • సాయంత్రం కాకినాడ అచ్చంపేట జంక్షన్‌లో మేమంతా సిద్దం సభ
  • సభలో ప్రసంగించనున్న సీఎం జగన్‌

ఎస్టీ రాజాపురం నుంచి ప్రారంభమైన మేమంతా సిద్దం బస్సు యాత్ర

  • మరికాసేపట్లో కాకినాడ జిల్లాలో ప్రవేశించనున్న సిఎం జగన్ యాత్ర
  • సీఎం జగన్‌కు ఘనంగా స్వాగతం పలికేందుకు రోడ్లపై బారులు తీరిన అశేష జనవాహిని

నేడు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ఇలా..

  • సీఎం వైఎస్‌ జగన్‌ గురువారం రాత్రి బస చేసిన ఎస్‌టీ రాజపురం ప్రాంతం నుంచి శుక్రవారం ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు.
  • రంగంపేట, పెద్దాపురం బైపాస్, సామర్లకోట బైపాస్‌ మీదుగా ఉందురు క్రాస్‌ చేరుకొని భోజన విరామం తీసుకుంటారు.
  • ఉందురు క్రాస్, కాకినాడ బైపాస్‌ మీదుగా సాయంత్రం 3:30 గంటలకు కాకినాడ అచ్చంపేట జంక్షన్‌ వద్దకు చేరుకొని బహిరంగ సభలో సీఎం జగన్‌ ప్రసంగిస్తారు
  • అనంతరం పిఠాపురం బైపాస్, గొల్లప్రో­లు బైపాస్, కత్తిపూడి బైపాస్, తుని బైపాస్, పాయకరావుపేట బైపాస్‌ మీదుగా గొడిచర్ల క్రాస్‌ వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు
     


గోదావరి పొడవునా.. ఉరకలెత్తిన జనం

  • 17వ రోజు సీఎం జగన్‌ బస్సు యాత్రకు పోటెత్తిన జనవాహిని
  • జాతీయ రహదారి బాట పట్టిన గ్రామాలు.. జనసంద్రమైన రావులపాలెం.. రాజమహేంద్రి.. రోడ్డుకు ఇరువైపులా మానవహారాలు
  • కడియపులంకలో సీఎం వైఎస్‌ జగన్‌పై పూల వర్షం
  • వేమగిరిలో ఎడ్లబండ్లపై తరలి వచ్చిన రైతన్నలు
  • బైక్‌ ర్యాలీలతో కదం తొక్కిన యువత.. విద్యార్థుల్లో వెల్లివిరిసిన ఉత్సాహం 
  • బొమ్మూరులో 108 గుమ్మడి కాయలతో దిష్టి తీసిన మహిళలు
  • అందరి నుంచి విజ్ఞాపనలు స్వీకరించి అభయమిచ్చిన జననేత
  • వైద్య విద్యను చేరువ చేసిన సంస్కరణలశీలికి భావి డాక్టర్ల ధన్యవాదాలు
  • అడుగడుగునా అభిమానుల తాకిడితో యాత్ర ఆలస్యం
  • నుదుట గాయం బాధిస్తున్నా చెరగని చిరునవ్వుతో సీఎం జగన్‌ అభివాదం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement