
గోదావరి ప్రేమలో సీఎం జగన్ ఉక్కిరి బిక్కిరి
బస్సు యాత్రలో జగన్‌ను పలకరించేందుకు పోటెత్తిన జనం
మా ఊరికి, మా ఇంటికి రావాలంటూ స్వాగతం పలికిన జనం
తణుకు, రావులపాలెం, జొన్నాడ, పొట్టిలంక మీదుగా యాత్ర
రాత్రికి రాజానగరం మీదుగా రాజాపురం చేరనున్న బస్సు యాత్ర
సాక్షి, పశ్చిమగోదావరి: మేమంతా సిద్ధం బస్సు యాత్రకు విశేష స్పందన లభిస్తోంది. 17వ రోజు మేమంతా సిద్ధం బస్సుయాత్ర తణుకు, రావులపాలెం, జొన్నాడ, పొట్టిలంక మీదగా కొనసాగుతోంది. సీఎం జగన్‌కు ప్రజల్లో అమితాదరణ లభిస్తోంది. కిలోమీటర్ల కొద్దీ వీరాభిమానులు వెన్నంటి వస్తున్నారు. రోజుల తరబడి, జిల్లాలు దాటి, ఎండా, వాన లెక్క చేయకుండా, వ్యయప్రయాసలను పట్టించుకోకుండా వేలాది కిలోమీటర్ల మేర సీఎం జగన్ వెంట ప్రయాణం చేస్తున్నారు. నిప్పులు చెరుగుతున్న మండుటెండలను లెక్క చేయకుండా వేలాది మంది వేచి చూసి మరీ సీఎం జగన్‌కు స్వాగతం పలుకుతున్నారు. రావులపాలెం సెంటర్‌లోనయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జనం ఉప్పెనలా తరలివచ్చి అఖండ స్వాగతం పలికారు. భారీగా జనం పోటెత్తడంతో జాతీయ రహదారి పూర్తిగా కిక్కిరిసిపోయింది.
ఎక్కడో నాసికా త్రయంబకంలో పుట్టిన గోదారి....
పిల్ల కాలువలతో మొదలుపెట్టి...
వాగులు, వంకలు, ఏరులు, నదులన్నీ ఇచ్చే శక్తితో పోటెత్తిపోతుంది...
‘మేమంత సిద్ధం’ బస్సు యాత్ర కూడా అంతే!
ఇడుపుల పాయలో మొదలైన జనవాహిని కూడా..
అంతకంతకూ బలం పుంజుకుంటుంది...
ప్రతి సభ జన సంద్రాన్ని తలపిస్తోంది.
తణుకు, రావులపాలెం, జొన్నాడ, పొట్టిలంక, కడియపులంక, వేమగిరి,
రాజానగరం మీదుగా ST రాజపురం చేరే..
నేటి యాత్రలోనూ గోదారోళ్ల అభిమానం, అప్యాయతలు కళ్లకు కడుతున్నాయి!
చిన్నా పెద్ద తేడా లేదు... రాజు పేద అన్న అంతరమూ కానరాదు.
ఎటు చూస్తే అటు పండుగ వాతావరణం. చిరునవ్వుల కేరింతలు..
పెత్తందార్లపై పోరుకూ మేమూ సిద్ధం అంటూ నినాదాలు!
ఈ ఉత్సవం... ఐదేళ్ల ఉజ్వల భవిష్యత్తుకు శ్రీకారం చుడుతున్నట్లే!
మరోవైపు జననేత తమ ప్రాంతానికి వస్తున్నారని తెలియడం ఆలస్యం.. బస్సుయాత్ర వెళ్లే రహదారికి తమ గ్రామం దూరంగా ఉన్నాసరే అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, చిన్నారులు, యువత ప్రతికూల వాతావరణంలోనూ కిలోమీటర్ల కొద్దీ నడిచి వచ్చి జగన్‌కు అఖండ స్వాగతం పలుకుతున్నారు. పసిపిల్లలతో పాటు వచ్చిన తల్లులు, బాలింతలు ఇలా ఒకరేమిటి గంటల తరబడి జగన్‌ను చూసేందుకు నిరీక్షిస్తున్నారు. పగలూ రాత్రి తేడా లేకుండా వీధుల్లోకి పోటెత్తుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment