వైఎస్సార్‌సీపీలో భారీగా చేరికలు  | Massive Joinings In YSRCP Ahead Of Assembly Elections 2024, See Details Inside - Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో భారీగా చేరికలు 

Published Fri, Mar 22 2024 5:19 AM | Last Updated on Fri, Mar 22 2024 1:07 PM

Massive joinings in YSRCP - Sakshi

టీడీపీ, జనసేనలను వీడిన 450 మందికి పైగా నేతలు, కార్యకర్తలు 

నరసాపురం/భీమవరం/ఉండి/ఏలూరు టౌన్‌/నరసా­పురం రూరల్‌: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని 26వ వార్డులో 50 మంది కార్యకర్తలు స్థానిక పార్టీ దళిత విభాగం సీనియర్‌ నేత ఇంజేటి రవీంద్ర ఆధ్వర్యంలో జనసేన, టీడీపీలను వీడి ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు సమక్షంలో వైఎస్సార్‌సీ­పీలో చేరారు. భీమవరం 25వ వార్డుకు చెందిన 100 మంది జనసేన, టీడీపీ నాయకులతో పాటు ప­ట­్ట­ణం­లోని ఆటో వర్కర్స్‌ యూనియన్‌ సభ్యులు భా­రీగా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ సమక్షంలో వైఎస్సార్‌­సీపీలో చేరారు.

పార్టీలో చేరిన వారిలో బొమ్మదేవర ముస్లి, కలిశెట్టి శ్రీనివాస్, పోలిశెట్టి సత్యనా­రాయణ, కర్ర స్వామి, బొమ్మ­దేవర మందు తదితరులు­న్నారు. ఉండి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఎమ్మె­ల్యే అభ్యర్థి, డీసీసీబీ చైర్మన్‌ పీవీఎల్‌ నర్సింహరాజు, ఉప సర్పంచ్‌ గొట్టు­ముక్కల కళ్యాణ్‌ వర్మ సమక్షంలో 50 మంది వైఎస్సార్‌సీపీలో చేరారు.

ఏలూరు శ్రీరామ్‌ నగర్‌­లో వైఎస్సార్‌సీపీ నాయకులు దారపు తేజ, గేదెల సూర్యప్రకాష్‌ ఆధ్వర్యంలో పోణంగికి చెంది­న 200 మంది టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎమ్మె­ల్యే ఆళ్ల నాని సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. నరసాపురం మండలం చామకూరిపాలెంలోని అంబేద్కర్‌ నగర్‌లో వైఎస్సార్‌సీపీ గ్రా­మ అధ్యక్షు­డు గుంపుల రత్నరాజు ఆధ్వర్యంలో 50 మంది జనసేన, టీడీపీ కార్యకర్తలు పార్టీ నేత పీడీ రాజు సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement