ఫ్రీ సిలిండర్లు అంటే ఇదేనా చంద్రబాబు: ఎమ్మెల్సీ వరుదు | Ysrcp Mlc Questioning Chandrababu Over Welfare Scheme | Sakshi
Sakshi News home page

ఫ్రీ సిలిండర్లు అంటే ఇదేనా చంద్రబాబు: ఎమ్మెల్సీ వరుదు

Published Fri, Nov 15 2024 12:42 PM | Last Updated on Fri, Nov 15 2024 1:39 PM

Ysrcp Mlc Questioning Chandrababu Over Welfare Scheme

సాక్షి,అమరావతి: తన మేనిఫెస్టోతో కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల్ని పదే పదే మోసం చేస్తుందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు.

మెడికల్ కాలేజి నిర్మాణాలపై గురువారం మండలిలో చర్చ జరిగింది. చర్చలో ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌  ఊగిపోతూ మాట్లాడారు. మంత్రి సత్యకుమార్‌ వ్యాఖ్యలకు నిరసనగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు మండలి నుంచి వాకౌట్‌ చేశారు.  

అనంతరం, ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతుంది. ఈ పదినెలల కాలంలో కుటుంబానికి ఇచ్చింది ఒక్క సిలిండరే. మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పిన మీరు ఒక్క సిలిండరే ఎందుకు ఇచ్చామన్నా ప్రశ్నిస్తున్నా మంత్రి సత్యకుమార్‌ నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు.

సిలిండర్‌ ఉచితం అన్నప్పుడు డబ్బుల్ని లబ్ధి దారుడికి ఇవ్వాలి. లేదంటే వారి అకౌంట్‌లో డిపాజిట్‌ చేయాలి. అలా కాకుండా గ్యాస్‌ ఏజెన్సీలకు డబ్బులు ఎందుకు చెల్లిస్తున్నారు. ఇందులో ఏదో మతలబు దాగుందని లబ్ధి దారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి  కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి.

ఈ విధానంపై టీడీపీ నేత జ్యోతుల నెహ్రు సైతం వ్యతిరేకించారు. సొంత పార్టీ నేతలే అనుమానం వ్యక్తం చేశారంటే ఈ పథకం లోపభూయిష్టంగా ఉన్నాయన్నది అర్ధమవుతుంది’అని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement