mlc
-
టీడీపీ ఎమ్మెల్సీ వర్సెస్ మాజీ ఎమ్మెల్సీ!
పులివెందుల రూరల్: వైఎస్పార్ జిల్లాలో టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి వర్గాల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన ఇసుక టెండర్లలో బీటెక్ రవి అనుచరులు హంగామా సృష్టించిన విషయం సద్దుమణగక ముందే శుక్రవారం రాంగోపాల్ రెడ్డి వర్గీయుడు ప్రకాష్‌ను చితకబాది కిడ్నాప్ చేయడం కలకలం రేపింది.నియోజకవర్గంలో చౌక దుకాణాలకు డీలర్లను నియమించేందుకు శుక్రవారం పులివెందులలోని అహోబిలాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రాత పరీక్ష నిర్వహించారు. ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి వర్గీయుడైన వేంపల్లెకు చెందిన ప్రకాష్ స్థానికంగా దుకాణం కోసం ఈ పరీక్ష రాయడానికి వచ్చాడు. అంతలో వేంపల్లెలోని అదే వార్డుకు చెందిన టీడీపీ నాయకులు, బీటెక్ రవి అనుచరుడు రామమునిరెడ్డి, మరికొంత మంది అక్కడికి చేరుకుని.. ప్రకాష్‌ను లోపలికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు.చితక బాది కిడ్నాప్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న రాంగోపాల్ రెడ్డి సతీమణి భూమిరెడ్డి ఉమాదేవి అనుచరులతో కలిసి పరీక్ష కేంద్రం వద్ద ధర్నాకు దిగారు. ప్రకాష్‌ను విడిచి పెట్టే వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదని అక్కడికి వచ్చిన పోలీసులకు తేల్చి చెప్పారు. ఈ క్రమంలో కొద్దిసేపటికి బీటెక్ రవి అనుచరులు ప్రకాష్‌ను వదిలేశారు. అనంతరం ఉమాదేవి మాట్లాడుతూ.. ఒకే పార్టీలో ఉంటూ బీటెక్ రవి వర్గీయులు ఇలా చేయడం తగదని మండిపడ్డారు. టీడీపీకి చెడ్డపేరు వచ్చేలా చేస్తున్న వారిని ఉపేక్షించమని చెప్పారు. దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలని అర్బన్ పోలీస్‌స్టేషన్‌లో ప్రకాష్‌తో కలిసి ఫిర్యాదు చేశారు. -
బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే
సాక్షి, హైదరాబాద్: త్వరలో ఎన్నికలు జరగబోయే మూడు ఎమ్మెల్సీ స్థానాలకు బీజేపీ తన అభ్య ర్థులను ప్రకటించింది. కరీంనగర్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – మెదక్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సి.అంజిరెడ్డి, ఈ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కొమురయ్య, నల్లగొండ–వరంగల్–ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పులి సరోత్తమ్‌రెడ్డి బరిలో దిగనున్నారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డా ఆదేశాల మేరకు మూడు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్టు కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సి.అంజిరెడ్డి: ఉమ్మడి మెదక్ జిల్లాలోని రామచంద్రాపురానికి (ప్రస్తుతం సంగారెడ్డి) చెందిన సి.అంజిరెడ్డి డిగ్రీ పూర్తి చేశారు. పారిశ్రామికవేత్తగా వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టారు. విద్యార్థి దశ నుంచే జాతీయ భావాలకు దగ్గరయ్యారు. రెండు దశాబ్దాలుగా ఆయన ఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా పలు గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. పేద విద్యార్థులు ఉద్యోగావకాశాలు అందిపుచ్చుకునేలా ట్రస్ట్ ద్వారా సహకారం అందిస్తున్నారు. అంజిరెడ్డి భార్య గోదావరి అంజిరెడ్డి బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు.మల్క కొమురయ్య: కరీంనగర్ జిల్లా పెద్దపల్లికి చెందిన కొమురయ్య ఉస్మానియా వర్సిటీ నుంచి బీఈ డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం ఆయన పలు విద్యాసంస్థలను నెలకొల్పారు. పాఠశాల స్థాయిలో విద్యాభివృద్ధికి కృషి చేశారు. పెద్దపల్లి, నిర్మల్, హైదరాబాద్‌లలో పలు విద్యాసంస్థలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పల్లవి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూట్స్ చైర్మన్‌గా ఉన్నారు. పులి సరోత్తమ్‌రెడ్డి: వరంగల్‌కు చెందిన సరోత్తమ్‌రెడ్డి ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగారు. 21 ఏళ్లపాటు స్కూల్ అసిస్టెంట్‌గా, పదేళ్లు హెడ్‌మాస్టర్‌గానూ సేవలందించారు. 2012 నుంచి 2019 దాకా పీఆర్టీయూకు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. టీచర్స్ జేఏసీలో భాగంగా తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఉపాధ్యాయుడిగా, యూనియన్ నాయకుడిగా దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. -
MLC Kavitha: నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా..!
-
ఎమ్మెల్యేలకు పాఠాలు
-
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీని దక్కించుకున్న పీడీఎఫ్
-
AP: టీచర్ MLC ఎన్నికల పోలింగ్
-
అభ్యర్థుల ఎంపిక ఆచితూచి!
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన విషయంలో బీజేపీ ఆచితూచి అడుగులేస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ల తరఫున బరిలో దిగే అభ్య ర్థుల ఖరారు తర్వాతే కార్యరంగంలోకి దిగాలని భావిస్తోంది. త్వరలో జరగనున్న మూడు ఎమ్మెల్సీ (రెండు టీచర్స్, ఒక గ్రాడ్యుయేట్)లో రెండింటిని గెలిచి సత్తా చాటాలని ఆ పార్టీ ముఖ్యనేతలు పట్టుదలగా ఉన్నారు. కరీంనగర్–ఆదిలాబాద్ –నిజామాబాద్–మెదక్ జిల్లాల ఉపాధ్యాయ, పట్టభద్రులు (ఒక్కో సీటు), వరంగల్–ఖమ్మం–నల్లగొండ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పరిధిలోనే 4 ఎంపీలు, 7 ఎమ్మెల్యే సీట్లు గెలిచి ఉత్తర తెలంగాణలో కమలనాథులు సత్తా చాటిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు గెలుచుకొని పట్టభద్రులు, టీచర్లలోనూ బీజేపీకి ఆదరణ ఉందని రుజువు చేయాలని ఆ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందుకు అనుగుణంగానే అభ్యర్థుల ఖరారు విషయంలోనూ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటోంది. రాష్ట్రంలో ఏడాది పాలన పూర్తి చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ తన పట్టును నిరూపించేందుకు సిద్ధమైన నేపథ్యంలో మరింత జాగ్రత్తగా ముందుకు కదలాలని కాషాయదళం భావిస్తోంది. మరోవైపు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పో టీ చేసే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి..ఆ పార్టీ అభ్యర్థులు కూడా రంగంలోకి దిగితే త్రిముఖ పోటీ లో ఎలాంటి మార్పులొచ్చే అవకాశాలుంటాయనే దానిపైనా దృష్టి సారించింది. ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితుల్లో పోటీకి బీఆర్ఎస్ విముఖంగా ఉంటే... కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టి మూడింటిలో రెండు ఎమ్మెల్సీ సీట్లను గెలుచుకోవాలనే పట్టుదలతో బీజేపీ ముఖ్యనేతలున్నారు. అన్ని పార్టీల కంటే ముందే అని అనుకున్నా...అన్ని పార్టీల కంటే ముందుగానే తమ అభ్యర్థులను ప్రకటించడం ద్వారా ఎమ్మెల్సీ ఓటర్లను కలిసి ప్రచారం ముమ్మరం చేయాలని తొలుత బీజేపీ నాయకత్వం భావించింది. అయితే ఆ తర్వాత వ్యూహం మార్చుకుంది. బలమైన ఎమ్మెల్సీ అభ్యర్థులను నిలిపేందుకు పార్టీపరంగా ప్రాథమిక కసరత్తు జరిగినా ప్రస్తుతం అది నిలిచిపోయింది. వచ్చే ఏడాది మార్చి 29తో ముగ్గురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. ఆ లోగానే ఈ స్థానాలకు ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉంది.బీజేపీలో ఉత్తర తెలంగాణ జిల్లాల పరిధిలోని గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ స్థానాలకు తీవ్ర పోటీ నెలకొంది. పట్టభద్రుల టికెట్ కోసం ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన గోదావరి అంజిరెడ్డి, మంచిర్యాల జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎర్రబెల్లి రఘునాథరావు, మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, గత ఎన్నికల్లో ఈ గ్రాడ్యుయేట్ స్థానం నుంచి పోటీచేసిన సుగుణాకరరావు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీకి విద్యాసంస్థల అధినేత మల్క కొమురయ్య, గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన మామిడి సుధాకర్‌రెడ్డి, అనంతరెడ్డి తదితరులు ప్రయత్నిస్తున్నారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో పార్టీకి పట్టుండడంతోపాటు, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి మంచి ఓటింగ్ శాతాన్ని నమోదు చేసుకున్నందున ముందుగానే అభ్యర్థుల ప్రకటన మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఖమ్మం–నల్లగొండ–వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ టికెట్ కోసం పీఆర్టీయూ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సర్వోత్తమరెడ్డి, సంఘ్ పరివార్‌కు చెందిన టీపీయూఎస్ నాయకుడు సాయిరెడ్డి తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. -
పవన్ ‘న్యూట్రల్’ గేర్!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు.. సూపర్ సిక్స్ హామీల అమలులో విఫలం కావడం.. వరుసగా చిన్నారులపై అఘాయిత్యాలు, మహిళలపై హత్యాచారాల ఘటనల సమయంలో ఉలకని పలకని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టీడీపీ పెద్దలు ఇరకాటంలో పడ్డప్పుడల్లా రంగంలోకి దిగుతున్నారు. కూటమి సర్కారు వైఫల్యాలకు బాధ్యత వహించకుండా.. తాను ప్రభుత్వంలో భాగం కాదనే రీతిలో తమపై విమర్శలకు దిగడంపై అధికార యంత్రాంగం విస్తుపోతోంది. శాంతి భద్రతల అంశం నేరుగా ముఖ్యమంత్రి చేతిలోనే ఉందన్న విషయం పవన్‌కు తెలియదా? అని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా పవన్ తాను తటస్థుడినని చిత్రీకరించుకుంటూ ప్రత్యేకత చాటుకునే యత్నాల్లో భాగమని పేర్కొంటున్నారు. బియ్యాన్ని చూపించకుండా తనను ఓడ చుట్టూ తిప్పారని.. అధికారుల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోందని.. కాకినాడ పోర్టు కార్యకలాపాల వెనుక పెద్ద స్మగ్లింగ్, మాఫియానే నడుస్తోందని పవన్ వ్యాఖ్యలు చేయడం పవన్ ‘న్యూట్రల్ గేర్’లో భాగమేనని పేర్కొంటున్నారు. తాజాగా కాకినాడ పోర్టులో పర్యటన సందర్భంగా ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు అక్కడ లేకపోవడంపై పవన్ మండిపడ్డారు. ఏదైనా సమస్య ఉంటే తన పార్టీకే చెందిన మంత్రి మనోహర్‌తో చర్చించకుండా.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో అక్కడకు వెళ్లి హడావిడి చేయాల్సిన అవసరం ఏముందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్కడ ఆయన పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారని గుర్తు చేస్తున్నారు.ఇటీవల హోంమంత్రి అనితను లక్ష్యంగా చేసుకుని ఆయన విమర్శలు చేయటాన్ని గుర్తు చేస్తున్నారు. తాను తటస్థుడిననే ముద్ర కోసం తాపత్రయపడుతున్నట్టు కలరింగ్ ఇవ్వడంతో పాటు.. రాష్ట్రంలో జరిగే సంఘటనల్లో తన పాత్ర లేదని చెప్పుకోవడానికి ఇలా హైడ్రామాలకు తెరలేపారనే చర్చ జరుగుతోంది.సీజ్ చేసి విడుదల చేసిన పీడీఎస్ బియ్యమే!కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి రెండు రోజుల క్రితం కాకినాడ యాంకరేజ్ పోర్టు నుంచి విదేశాలకు స్టెల్లా ఎల్ పనామా నౌకలో ఎగుమతికి సిద్ధం చేసిన 640 టన్నుల బియ్యాన్ని పీడీఎస్‌గా గుర్తించినట్లు వెల్లడించారు. నౌకలోని ఐదు హేచర్లకు 52 వేల టన్నుల బియ్యం లోడింగ్ సామర్థ్యం ఉండగా 38 వేల టన్నులు లోడింగ్ చేశారు. ఇందులో బాయిల్ రైస్‌తో పాటు 640 టన్నులు పీడీఎస్ ఉన్నట్లు కలెక్టర్ ప్రకటించారు. పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ రెండు నెలల క్రితం సీజ్ చేసిన పీడీఎస్ బియ్యాన్ని బ్యాంక్ గ్యారెంటీ తీసుకుని కొంత విడుదల చేశారు. అలా విడుదల చేసిన పీడీఎస్ బియ్యమే కలెక్టర్ నిర్వహించిన ఆకస్మిక తనిఖీలో స్టెల్లా ఎల్ పనామా నౌకలో ఉండటం గమనార్హం. పౌరసరఫరాల అధికారి సరెండర్ ఉత్తర్వులుకాకినాడ జిల్లా పౌరసరఫరాల అధికారి ఎంవీ ప్రసాద్‌ను సరెండర్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. పీడీఎస్ బియ్యం వ్యవహారాన్ని సక్రమంగా నిర్వహించనందున ఆయన పౌరసరఫరాలశాఖ కమిషనరేట్‌లో రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సాక్షి కథనంతో కలకలం..కలెక్టర్ స్వయంగా పోర్టుకు వెళ్లి పరిశీలించాక అదే బియ్యాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కూడా తాజాగా కాకినాడ పోర్టుకు వెళ్లి పరిశీలించారు. తన వెంట ఉన్న కాకినాడ సిటీ టీడీపీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు)పై పవన్ అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) చేసిన మిల్లర్లకు ప్రభుత్వం ఇటీవల రూ.200 కోట్లు బకాయిలు విడుదల చేసింది. ఈ బకాయిలు విడుదల చేసినందుకు కూటమికి చెందిన ఒక నేతకు 8 శాతం కమీషన్లు ముట్టినట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై ‘కమీషన్ల కోసం కపట నాటకం’ శీర్షికన ఈ నెల 27న ‘సాక్షి’ ప్రధాన సంచికలో కథనం వెలువడటం రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశమైంది. -
టీడీపీ ఎమ్మెల్సీ బిటి నాయుడు సంచలన వ్యాఖ్యలు
-
అచ్చెన్నాయుడుకి దువ్వాడ స్ట్రాంగ్ కౌంటర్
-
ఏపీలో సీఎం సంతకానికి కూడా విలువ లేదా : బొత్స
-
కర్నూలులోనే హైకోర్టు.. వైఎస్సార్సీపీ డిమాండ్
సాక్షి, కర్నూలు: కర్నూలులోనే హైకోర్టు ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. హైకోర్టు బెంచ్ కర్నూలులో ఏర్పాటుకు మంత్రి ఫరూక్ తీర్మానం ప్రవేశం పెట్టారు. ఈ సందర్భంగా హైకోర్టు ఏర్పాటుపై శాసన మండలిలో చర్చ జరిగింది.ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి మాట్లాడుతూ, శ్రీబాగ్ ఒప్పందంలో ఏముందో మంత్రి భరత్‌కు తెలియదా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కర్నూలులో హైకోర్టు బెంచ్ కాకుండా హైకోర్టు ఏర్పాటు చేయాలని.. గతంలో బీజేపీ కూడా డిక్లరేషన్ చేసిందని ఆయన గుర్తు చేశారు.హైకోర్టును కర్నూలులో పెట్టాలని బీజేపీ రాయలసీమ డిక్లరేషన్‌లో పెట్టిందని.. ఇప్పుడు హైకోర్టు కాకుండా హైకోర్టు బెంచ్ పెట్టడం ఏంటి అంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ, కర్నూలులో న్యాయ రాజధాని రాకుండా గతంలో కూటమి పార్టీలు అడ్డుకున్నాయన్నారు. కర్నూల్లో హైకోర్టు పెట్టాలని బీజేపీ గతంలో డిక్లరేషన్ చేసిందన్నారు. అభివృద్ధిని అన్ని ప్రాంతాలకు సమానంగా విస్తరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భావించిందని ఆయన తెలిపారు. -
ఆర్థిక మంత్రి ఒకలా.. సివిల్ సప్లై మంత్రి మరోలా?
సాక్షి, అమరావతి: ఎన్నికల హామీల అమలు విషయంలో.. చంద్రబాబు ప్రభుత్వం ప్రజల్ని మభ్య పెట్టే ప్రయత్నం చేస్తోందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. సోమవారం శాసన మండలిలో చర్చ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారాయన.‘‘దీపం-2 పథకాన్ని తప్పు దోవ పట్టించేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఈ పథకానికి బడ్జెట్లో పూర్తి స్థాయిలో నిధులు కేటాయించలేదు. ఎన్నికలకు ముందు ఈ పథకంపై విపరీతమైన హామీలిచ్చారు. ఎన్నికలయ్యాక అధికారంలో వచ్చి ఇప్పుడు మెలిక పెడుతున్నారు. ఆర్థిక మంత్రి ఒకలా.. సివిల్ సప్లై మంత్రి మరోలా దీపం2 గురించి మాట్లాడుతున్నారు. ప్రజలను మభ్య పెట్టి అధికారంలో వచ్చింది. ఇప్పుడు నమ్మి ఓటేసిన ప్రజలను మోసం చేస్తున్నారు. ఇచ్చిన హామీలను అమలు వెంటనే అమలు చేయాలి.చేతిలో అధికారం ఉందని విద్యుత్ ఛార్జీలు పెంచుకుంటూ పోతామంటే కుదరదు. మా ప్రభుత్వ హయాంలో కూడా డిస్కంలకు సబ్సిడీ ఇచ్చాం. తల్లికి వందనం 18 వేలు ఇస్తామన్నారు? ఇప్పుడు ఎందుకు అమలు చేయడం లేదు? అని బొత్స ప్రశ్నించారు. నేరస్తుల్లో భయం పోయిందినేరస్తులకు ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థపై భయం పోయింది. నేరస్తులు రాష్ట్రంలో తీవ్రంగా నేరాలకు పాల్పడుతున్నారు. మా హయాంలో పెట్టుబడి వ్యయం చేయలేదని అన్నారు. మరి నాలుగు పోర్టులు, ఎయిర్ పోర్టు, మెడికల్ కాలేజీలు నిర్మాణం ఎలా జరిగాయి? అవి క్యాపిటల్ వ్యయం కాకుండా హాం ఫట్ అంటే వచ్చాయా? ఈ బడ్జెట్ ప్రజా వ్యతిరేక బడ్జెట్ -
ఫ్రీ సిలిండర్లు అంటే ఇదేనా చంద్రబాబు: ఎమ్మెల్సీ వరుదు
సాక్షి,అమరావతి: తన మేనిఫెస్టోతో కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల్ని పదే పదే మోసం చేస్తుందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు.మెడికల్ కాలేజి నిర్మాణాలపై గురువారం మండలిలో చర్చ జరిగింది. చర్చలో ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఊగిపోతూ మాట్లాడారు. మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలకు నిరసనగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మండలి నుంచి వాకౌట్ చేశారు. అనంతరం, ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతుంది. ఈ పదినెలల కాలంలో కుటుంబానికి ఇచ్చింది ఒక్క సిలిండరే. మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పిన మీరు ఒక్క సిలిండరే ఎందుకు ఇచ్చామన్నా ప్రశ్నిస్తున్నా మంత్రి సత్యకుమార్ నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు.సిలిండర్ ఉచితం అన్నప్పుడు డబ్బుల్ని లబ్ధి దారుడికి ఇవ్వాలి. లేదంటే వారి అకౌంట్లో డిపాజిట్ చేయాలి. అలా కాకుండా గ్యాస్ ఏజెన్సీలకు డబ్బులు ఎందుకు చెల్లిస్తున్నారు. ఇందులో ఏదో మతలబు దాగుందని లబ్ధి దారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి.ఈ విధానంపై టీడీపీ నేత జ్యోతుల నెహ్రు సైతం వ్యతిరేకించారు. సొంత పార్టీ నేతలే అనుమానం వ్యక్తం చేశారంటే ఈ పథకం లోపభూయిష్టంగా ఉన్నాయన్నది అర్ధమవుతుంది’అని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. -
విజయనగరం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రద్దు
సాక్షి, ఢిల్లీ: విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను ఈసీ రద్దు చేసింది. హైకోర్టు ఆదేశాలతో ఉప ఎన్నికను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై అనర్హత వేటు చెల్లదంటూ హైకోర్టు తీర్పు ఇచ్చిన క్రమంలో ఉపఎన్నిక నోటిఫికేషన్‌ను ఈసీ రద్దు చేసింది. -
నమ్మి పదవిస్తే నమ్మక ద్రోహం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాజకీయాల్లో నైతిక విలువలకు బొత్తిగా చోటు లేకుండా పోతోంది. నేతలు పార్టీలనే కాకుండా ఇచ్చిన మాటను, చేసిన ప్రకటనను కూడా ఫిరాయించేస్తున్నారు. అధికారం ఎటు వైపు ఉంటే అటే ఉంటామంటున్నారు. వైఎస్సార్ సీపీ ఎంతో నమ్మకం ఉంచి కాకినాడకు చెందిన కర్రి పద్మశ్రీకి గౌరవ ప్రదమైన శాసనమండలిలో స్థానం కల్పించింది. గవర్నర్ కోటాలో ఆమెకు మండలిలో సార్వత్రిక ఎన్నికల ముందు జగన్మోహన్రెడ్డి ప్రాతినిధ్యం కల్పించారు. బీసీలలో పార్టీ ఆవిర్భావం నుంచి ఎంతోమంది సేవలందిస్తున్న సీనియర్లు ఉన్నప్పటికీ మత్స్యకార వర్గంలోని వాడబలిజ సామాజిక వర్గానికి చెందిన విద్యావంతురాలైన పద్మశ్రీని మహిళా కోటాలో అప్పటి కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఎమ్మెల్సీగా పార్టీ అధిష్టానానికి సిఫారసు చేశారు.పద్మశ్రీ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాక గత ఆగస్టు 30న కాకినాడ నగరపాలక సంస్థలో ఎక్స్ అఫిషియో సభ్యురాలిగా కొనసాగుతానని అప్పటి కలెక్టర్ కృతికాశుక్లాకు లేఖ అందజేశారు. ఎమ్మెల్సీగా ప్రమాణం చేశాక ఏడాది తిరగకుండానే పద్మశ్రీ ఎమ్మెల్సీ పదవికి, వైఎస్సార్ సీసీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే పద్మశ్రీ వైఎస్సార్ సీపీకి రాజీనామా చేశారు. పనులు చక్కబెట్టాలన్నా, లాబీయింగ్ చేయాలన్నా అధికార పార్టీలో ఉండాల్సిందేననే ధోరణితోనే ఎమ్మెల్సీ అటు వైపు ఫిరాయించారనే విమర్శలున్నాయి.పద్మశ్రీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి రెండు నెలలు గడిచిపోయాయి. కారణాలేమైనా పదవులకు రాజీనామా చేసే ప్రజాప్రతినిధులు రాజీనామా చేసిన రోజు నుంచి అధికారిక హోదాను వదులుకుంటారు. రాజకీయాల్లో నైతిక విలువలు పాటించే వారెవరైనా ఇది అమలు చేస్తారు. అధికారంలోకి వచ్చిన అనంతరం తెలుగుదేశం సహా ఇతర పార్టీల నుంచి వైఎస్సార్ సీపీకి ఎవరు వచ్చినా పార్టీ, వారు అంతవరకూ అనుభవించిన పదవులకు రాజీనామా చేసి రావాల్సిందేనని ఆ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి లక్ష్మణ రేఖ గీశారు. ఆయా పార్టీల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులంతా దీన్ని పాటించే వైఎస్సార్ సీపీలోకి వచ్చారు.విస్తుబోతున్న జనంపద్మశ్రీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా అంటే చేశారు తప్ప ఆ పదవి ద్వారా సంక్రమించిన గన్‌మెన్, ప్రొటోకాల్‌ను వదులుకోలేకపోతున్నారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు వంటి అధికారిక కార్యక్రమాలకు ఎమ్మెల్సీ హోదాలోనే హాజరవడంతో జనం విస్మయానికి గురవుతున్నారు. అక్టోబరు 21న పోలీసు అమరవీరుల దినోత్సవంలో ఎమ్మెల్సీ పద్మశ్రీ అధికారికంగా పాల్గొన్నారు. ఇటీవల కాకినాడ దుమ్ములపేటలో చెత్త నుంచి బయోగ్యాస్ ఉత్పత్తిచేసే ప్లాంట్‌కు శ్రీకారం చుట్టిన అధికారిక కార్యక్రమంలో ప్రొటోకాల్‌తో పద్మశ్రీ హాజరయ్యారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలో మెకనైజ్డ్ బోట్ల యజమానులకు పరికరాల పంపిణీ కార్యక్రమంలో ప్రొటోకాల్‌తో పాల్గొన్నారు. పార్టీ వద్దనుకుని, ఎమ్మెల్సీ పదవి వద్దనుకుని రాజీనామా చేసినప్పుడు ఆ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ హోదాను ఎందుకు వదులుకోవడం లేదని పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.సముచిత గౌరవం కల్పించినా..వైఎస్సార్ సీపీ మాత్రం ఎప్పుడూ నమ్మిన వారికి న్యాయం చేయడంలో ముందే ఉంటుంది. ఎస్సీ, బీసీలకు న్యాయం చేయడంలో వైఎస్సార్ సీపీ మొదటి నుంచి ఒక అడుగు ముందే ఉంటోంది. పార్టీలో విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచిన పిల్లి సుభాష్‌చంద్రబోస్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి కీలకమైన రెవెన్యూ మంత్రిని చేసింది. అనంతరం ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో తొలిసారి బీసీల నుంచి బోస్‌ను రాజ్యసభ సభ్యుడిని కూడా చేసింది. వైఎస్సార్ సీపీని నమ్ముకున్న వారికి ఏదో ఒక రోజు సముచిత గౌరవం దక్కుతుందని కర్రి పద్మశ్రీకి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేయడం ద్వారా మరోసారి నిరూపితమైంది. పద్మశ్రీ భర్త కర్రి నారాయణకు పార్టీలో రాష్ట్ర స్థాయి పదవులతో సముచిత ప్రాధాన్యం కల్పించారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాక పూర్వం నుంచి ద్వారంపూడి వెంట ఉన్న నారాయణకు, ఆ వర్గానికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలని జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ కోసం ద్వారంపూడి సిఫారసు చేశారు. ద్వారంపూడి వెంట ఉన్న నారాయణ 2014లో టీడీపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీతో చెట్టపట్టాలేసుకు తిరిగారు. తిరిగి వైఎస్సార్ సీపీలోకి వచ్చిన నారాయణను నమ్మి అతని భార్య పద్మశ్రీని ఎమ్మెల్సీని చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో అధికారం కూటమికి దక్కడంతో మరోసారి నారాయణ, భార్య ఎమ్మెల్సీ పద్మశ్రీ కూటమి వైపు వెళ్లిపోయారు. ఎంతో నమ్మకం ఉంచి ఎమ్మెల్సీ పదవిని ఇస్తే ఆమె విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారంటూ వైఎస్సార్ సీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. అధికారం ఎక్కడ ఉంటే అక్కడే ఉంటామంటున్న నేతల జాబితాలో కర్రి దంపతులు చేరిపోయారంటున్నారు.డబ్బుకు అమ్ముడుపోవడం అన్యాయండబ్బుకు అమ్ముడుపోవడంతోనే ఎమ్మెల్సీ రాజీనామా చేశారు. ఇది అతి పెద్ద వెన్నుపోటు. రాజకీయాల్లో ఎంతోమంది పార్టీలు మారుతుంటారు. అయితే కర్రి పద్మశ్రీ, భర్త నారాయణ వ్యవహారశైలి అత్యంత దారుణం. సాధారణ వ్యక్తిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీని చేసి గౌరవిస్తే చివరకు డబ్బుకు ఆశపడి రాజీనామా చేయడం అన్యాయం. రాజీనామా చేశానంటూనే అధికారిక కార్యక్రమాలకు ఎలా హాజరవుతున్నారు. గన్మెన్లను వెంట పెట్టుకు తిరుగుతున్నారు. ప్రొటోకాల్ వదులుకోలేక పోతున్నారు.– ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, -
సభలో మంత్రి సత్యకుమార్ యాదవ్ తీరు సిగ్గు చేటు: ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి
సాక్షి,అమరావతి : ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌పై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. శాసన మండలి చర్చలో ‘డయేరియాపై సభ్యుల ఆవేదన చూసి ముచ్చట వేస్తోంది. 15ఏళ్లలో ఎప్పుడు లేని మరణాలు సంభవించాయి’అని చిరునవ్వుతో మంత్రి సత్యకుమార్ యాదవ్ వెకిలిగా మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు.శాసన మండలి సమావేశాల సందర్భంగా డయేరియా మరణాలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మీడియాతో మాట్లాడారు. ‘‘సభలో డయేరియాపై ఆరోగ్యశాఖ మంత్రి సమాధానం బాధాకరం. మృతులపై ఎంతటి అభిమానం ఉందో మంత్రి నిర్లక్ష్య సమాధానమే చెబుతోంది.మంత్రి సత్యకుమార్ యాదవ్ వెకిలిగా మాట్లాడటం సిగ్గుచేటు. ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందింది. గత 30 ఏళ్లలో గుర్లలో ఎన్నడూ డయేరియా మరణాలు సంభవించలేదు. సెప్టెంబర్ 20న మొదటి కేసు నమోదైంది. అక్టోబర్ 12వ తేదీ నాటికి 14 మంది ప్రాణాలు కోల్పోయారు. అక్టోబర్ 19న వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేసే వరకు ప్రభుత్వంలో చలనం రాలేదు.చదవండి: డయేరియా మరణాలపై నవ్వుతూ హేళనగా మాట్లాడిన ఏపీ మంత్రి 20 కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వాసుపత్రి ఉంది. పక్క జిల్లాలో కేజీహెచ్ ఉంది. కానీ స్కూల్ బల్లలపై వైద్యం అందించారు. స్కూల్ బల్లలపై డయేరియా బాధితులకు వైద్యం అందించినందుకు ప్రభుత్వం సిగ్గు పడాలి. మృతుల సంఖ్యను తగ్గించడం పైనే ప్రభుత్వం దృష్టి పెట్టింది. డయేరియా నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే ఆలోచన కూడా చేయలేదు. ఒక్కో డయేరియా బాధిత కుటుంబానికి వైఎస్ జగన్ రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. వైఎస్ జగన్ వెళ్లే వరకూ జిల్లా ఇంఛార్జి మంత్రి వంగలపూడి అనిత..ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా వెళ్లలేదు. మృతులకు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని వైఎస్సార్సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం’’ అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
మంత్రి సత్యకుమార్ సమాధానంపై ఎమ్మెల్సీ బోత్స ఫైర్
-
కేంద్రమంత్రి అమిత్ షాకు బొత్స సత్యనారాయణ లేఖ
-
కాసేపట్లో YSRCP ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ భేటీ
-
ఎమ్మెల్సీ బరిలో ‘వెరబెల్లి’!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసేందుకు బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌రావు సిద్ధమయ్యారు. ఆ పార్టీ నుంచి ఆయన పోటీ చేసేందుకు సానుకూల సంకేతాలు రావడంతో ప్రచారం ముమ్మరం చేశారు. రాష్ట్రంలో వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పలువురు ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో పట్టభద్రుల నియోజకవర్గ పరిధి విస్తృతంగా ఉండడంతో ఆ పార్టీ నుంచి అనేకమంది సీనియర్లు తమ ఆసక్తిని బయటపెడుతున్నారు. రఘునాథ్రావుకే పార్టీ మద్దతు దక్కే అవకాశాలు ఉన్నాయని ఆయన అనుచరులు చెబుతున్నారు. దీంతో ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకుని పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించడంతోపాటు పనిలో పనిగా ప్రచారం సైతం మొదలు పెట్టారు. ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో పర్యటనలు చేస్తున్నారు. ఆ పార్టీ నాయకులు, విద్యావంతులు, పట్టభద్రులను కలుస్తున్నారు. ఈ ఎన్నికల్లో తాను కచ్చితంగా బరిలో ఉంటానని చెబుతున్నారు. ఈ క్రమంలో ఆయన పోటీలో ఉంటే ఉమ్మడి జిల్లా నుంచి ఆయనకు కలిసివచ్చే అవకాశం ఉంది.పార్టీ మద్దతు దొరికితేనే..ఉన్నత విద్యావంతుడైన బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి.. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ ఇంజనీరింగ్, అమెరికాలో ఎంబీఏ చేశారు. సాప్ట్వేర్ రంగ వ్యాపారాల్లోనూ సక్సెస్ అయ్యారు. సేవా కార్యక్రమాలు చేస్తూ బీజేపీ తరఫున మంచిర్యాల శాసనసభ స్థానానికి పోటీ చేసి గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2023లో రెండో స్థానం నిలిచి ఆయన స్థానాన్ని మెరుగు పరుచుకున్నారు. తాజాగా పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలో మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ స్థానాల్లో బీజేపీ ఎంపీలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పెద్దపల్లి పరిధిలో మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా ఉన్నారు. పెద్దపల్లి పరిధిలోనూ ఓ ప్రజాప్రతినిధిని పార్టీ తరఫున గెలిపించుకోవాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు బీజేపీ ఎంపీలు తమ నియోజకవర్గ పరిధిలో ఉన్న నాయకులను ఎమ్మెల్సీగా పోటీ చేయించే ఆసక్తి చూపకపోతే రఘునాథ్‌కు అవకాశం ఉంది. ఇక కేంద్ర, రాష్ట్ర స్థాయి, ఆర్ఎస్ఎస్, పార్టీ పెద్దలతో టచ్‌లో ఉన్న వెరబెల్లికి ప్రచారం చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆయన కచ్చితంగా బరిలో ఉంటారనే సంకేతాలు ఇస్తున్నారు. ఎమ్మెల్సీ స్థానానికి పోటీపై వెరబెల్లిని ‘సాక్షి’ సంప్రదించగా.. పార్టీ అధిష్టానం తనకు అవకాశం ఇస్తుందనే నమ్మకం ఉందన్నారు. ఉన్నత విద్యావంతుడిగా విద్యార్థి, యువత, నిరుద్యోగ సమస్యలు తనకు తెలుసని, పార్టీ మద్దతుతో గెలుస్తాననే నమ్మకం ఉందని పేర్కొన్నారు. -
కలరాతో 15 మంది చనిపోవడం ఈ జిల్లాలో ఎప్పుడు జరగలేదు
-
రాష్ట్రానికి సీఎం ఉన్నారా? లేరా?.. చంద్రబాబుపై వరుదు కళ్యాణి ఆగ్రహం
సాక్షి,అమరావతి : మహిళపై హత్యలు, అగాయిత్యాలు జరుగుతుంటే సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత సంతాపాలు తెలిపి చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి. బద్వేల్లో కాలేజీ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడి, ఆపై పెట్రోల్ పోసిన ఘటనపై వరుదు కళ్యాణి విచారం వ్యక్తం చేశారు.ఈ దుర్ఘటనపై వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. ఆడపిల్లల ప్రాణాలు గాలిలో దీపంలా ఉన్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా, సీఎం , డిప్యూటీ సీఎం, హోం మంత్రి, డీజీపీ ఉన్నారా? లేరా? అని ప్రశ్నించారు.ప్రతి రోజూ మహిళలపై హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఆడపిల్లను పెట్రోల్ పోసి చంపితే ఎందుకు ఆ కుటంబాన్ని ఎందుకు పరమర్శించలేదు. కూటమికి ఎందుకు ఓట్లు వేశామా అని మహిళలు భాద పడుతున్నారు. రాష్ట్రంలో ఆన్ పిట్ హోం మంత్రి ఉన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అనే అనుమానం కలుగుతుంది. మహిళపై హత్యలు అగయిత్యాలు జరుగుతుంటే సీఎం చంద్రబాబు, హోం మంత్రి సంతాపాలు తెలిపి చేతులు దులుపుకున్నారు.వీకెండ్ అయితే చాలు పక్క రాష్ట్రాలకు సీఎం, డిప్యూటీ సీఎం వెళ్ళిపోతున్నారు. దిశా యాప్ ఉంటే మహిళపై దాడులు జరిగేవి కాదు. రాజకీయ దురుద్దేశంతో దిశా యాప్ పోలీస్ స్టేషన్లను నిర్విర్యం చేశారు. ఆడపిల్లను బైటకు పంపాలంటే తల్లి దండ్రులు భయపడుతున్నారు. -
బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ సందడి
సాక్షి, హైదరాబాద్: శాసనమండలిలో ఉపాధ్యాయ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలు, పట్టభద్రుల కోటాలో ఒక ఎమ్మెల్సీ ఆరేళ్ల పదవీకాలం వచ్చే ఏడాది మార్చిలో ముగియనుంది. ఖాళీ అయ్యే స్థానాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో బరిలో నిలించేందుకు బీఆర్ఎస్ నుంచి ఔత్సాహికులు ఇప్పటి నుంచే సందడి చేస్తున్నారు. ఎన్నికలు జరిగే స్థానాల్లో ఓటరు నమోదు కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో.. ఆశావహులు సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కుల సంఘాల పేరిట జరుగుతున్న సమావేశాల్లో పాల్గొంటూ తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. పట్టణాలు, మండల కేంద్రాలు, ప్రధాన రహదారుల వెంట ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి సభ్యత్వ నమోదు పేరిట ప్రచారం చేసుకుంటున్నారు. తద్వారా తాము పార్టీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నట్టు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సంకేతాలు పంపుతున్నారు. ఉపాధ్యాయ కోటాపై అనాసక్తి వచ్చే ఏడాది మార్చిలో ‘మెదక్–కరీంనగర్–ఆదిలాబాద్–నిజామాబాద్’ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తమరెడ్డి(పీఆర్టీయూ)తోపాటు ‘వరంగల్–ఖమ్మం–నల్లగొండ’ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి(యూటీఎఫ్) పదవీకాలం ముగుస్తుంది. 2019లో జరిగిన ఎన్నికల్లో ఈ రెండు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అధికారికంగా అభ్యర్థులను బరిలోకి దించలేదు. పీఆర్టీయూకు పరోక్షంగా మద్దతు ప్రకటించింది. ప్రస్తుతం బీఆర్ఎస్తో పీఆర్టీయూ అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ ప్రత్యక్షంగా, పరోక్షంగా దూరంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. అందరి దృష్టి పట్టభద్రుల స్థానంపైనే ‘మెదక్–కరీంనగర్–ఆదిలాబాద్–నిజామాబాద్’పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు పలువురు బీఆర్ఎస్ నేతలు ఆసక్తి చూపుతున్నారు. 13 జిల్లాల్లోని 42 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ పట్టభద్రుల నియోజకవర్గం విస్తరించి ఉంది. ఓటర్లను చేరుకునేందుకు ఇప్పటి నుంచే ఆశావహులు తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. కరీంనగర్ నుంచి మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, మెదక్ నుంచి మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్‌రెడ్డి, నిజామాబాద్ నుంచి రాజారాంయాదవ్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. తమ మద్దతుదారులను రంగంలోకి దించి ఓటరు నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ గతంలోనే తనకు హామీ ఇచి్చనట్టు రవీందర్ సింగ్ చెబుతున్నారు. గతంలో.. బలమున్నా బరికి దూరం మండలి పట్టభద్రుల కోటా 2019 ఎన్నికల సందర్భంలో ‘మెదక్–కరీంనగర్–ఆదిలాబాద్– నిజామాబాద్’నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్‌కు కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు (మంథని), జగ్గారెడ్డి (సంగారెడ్డి) మాత్రమే ఉన్నారు. నాలుగు జిల్లాల పరిధిలో కాంగ్రెస్ నుంచి చేరిన ఎమ్మెల్యేల సంఖ్యను కలుపుకొని 40 మంది ఎమ్మెల్యేలున్న బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉంది. స్వతంత్ర అభ్యరి్థగా పోటీ చేసిన చంద్రశేఖర్‌గౌడ్‌కు మద్దతు ప్రకటించగా, కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన టి.జీవన్‌రెడ్డి పట్టభద్రుల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇప్పుడు.. కీలక నేతలందరూ ఇక్కడే ప్రస్తుతం ‘మెదక్–కరీంనగర్–ఆదిలాబాద్–నిజామాబాద్’పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలో 42 మంది ఎమ్మెల్యేలకుగాను కాంగ్రెస్‌కు 19, బీఆర్ఎస్కు 16, బీజేపీకి ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జి.మహిపాల్‌రెడ్డి (పటాన్చెరు), సంజయ్ (జగిత్యాల), పోచారం శ్రీనివాసరెడ్డి (బాన్సువాడ) కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా కీలక నేతలు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్ తదితరులు సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్కు క్షేత్రస్థాయిలో సానుకూల వాతావరణం ఉందని, పార్టీ అవకాశమిస్తే గెలుపు సాధిస్తామనే ధీమా ఆశావహుల్లో కనిపిస్తోంది. -
‘ట్యాపింగ్’ కేసులో ఎమ్మెల్సీపై ఎల్ఓసీ
సాక్షి, హైదరాబాద్: అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు పోలీసులు, మీడియా సంస్థకు చెందిన వారి చుట్టూనే దీని దర్యాప్తు తిరుగుతుండగా.. తాజాగా రాజకీయ నాయకులకు ఆ మకిలి అంటింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ నవీన్‌రావు పాత్రను ఈ వ్యవహారంలో రూఢీ చేసిన హైదరాబాద్ పోలీసులు ఆయనపై లుక్ ఔట్ సర్క్యులర్ (ఎల్ఓసీ) జారీ చేశారు. ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న నవీన్‌రావు దేశంలోకి అడుగు పెట్టిన వెంటనే అదుపులోకి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే విదేశాల్లో తలదాచుకున్న ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు, ఓ మీడియా సంస్థ అధినేత శ్రవణ్‌రావులపై ఎల్ఓసీ ఉంది. అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న హైదరాబాద్ వెస్ట్‌జోన్ పోలీసులు ఈ ఏడాది జూన్ 29న హైకోర్టుకు ఓ నివేదిక సమరి్పంచారు.అందులో మూడు చోట్ల ఎమ్మెల్సీ పేరు ప్రస్తావించడంతో తొలిసారిగా నవీన్‌రావు పేరు వెలుగులోకి వచి్చంది. అక్రమ ఫోన్ ట్యాపింగ్‌కు కర్త, కర్మ, క్రియగా ఉన్న ప్రభాకర్‌రావుతోపాటు శ్రవణ్‌రావుతో కూడా కలసి నవీన్‌రావు పని చేశారన్నది ప్రధాన ఆరోపణ. అప్పటి అధికార పారీ్టకి రాజకీయంగా లబ్ధి చేకూర్చేందుకు వీళ్లు ప్రయత్నించారని పోలీసులు ఆరోపించారు. దీనికోసం ఎస్ఐబీలో ప్రత్యేకంగా ఓ బృందాన్ని సైతం ఏర్పాటు చేశారు. నాటి ప్రతిపక్షంతో పాటు వివిధ విభాగాలకు చెందిన పలువురి ఫోన్ నంబర్లను ట్యాప్ చేయడంతో పాటు సున్నితమైన డేటాను అక్రమంగా సంగ్రహించారు. వివిధ రంగాలకు చెందిన వారిని బెదిరించడం ద్వారా ఎలక్టోరల్ బాండ్లు ఖరీదు చేసేలా ఒత్తిడి చేశారని పోలీసులు చెపుతున్నారు. హార్డ్ డిస్‌్కల ధ్వంసంలోనూ పాత్ర గత ఏడాది డిసెంబర్లో రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. అదే సందర్భంలో ఎస్ఐబీ కార్యాలయంలోని పలు హార్డ్ డిస్‌్కలను డీఎస్పీ ప్రణీత్‌రావు తదితరులు ధ్వంసం చేశారు. ఈ వ్యవహారం వెనుకా ప్రభాకర్‌రావుతో పాటు నవీన్‌రావు ఉన్నారని ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. సంధ్య కన్వెన్షన్స్ అధినేత ఎస్.శ్రీధర్‌రావును బెదిరించడం, ఆయన ఫోన్లు ట్యాప్ చేయడంతో పాటు ఎలక్టోరల్ బాండ్లు ఖరీదు చేయించడంలోనూ నవీన్‌రావు పాత్రను దర్యాప్తు అధికారులు నిర్ధారించారు. ఈ పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు నవీన్‌రావును విచారించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి కొంత కాలం కిందట ఆయనకు నోటీసులు జారీ చేయడానికి ఓ ప్రత్యేక బృందం ముమ్మరంగా ప్రయతి్నంచింది.వాటి ఆధారంగా ఆయనను పిలిచి విచారించాలని భావించింది. నోటీసులతో అధికారులు నవీన్‌రావు ఇల్లు, కార్యాలయాల వద్ద కాపుకాసినా ఆయనను కలవలేక పోయారు. ఈ లోపు పోలీసుల కదలికలు తెలుసుకున్న నవీన్‌రావు దుబాయ్ వెళ్లిపోయారని తెలిసింది. ఆయన విదేశాలకు వెళ్లిపోయారనే సమాచారం ఆధారంగా హైదరాబాద్ పోలీసులు ఎల్ఓసీ జారీ చేయాలని నిర్ణయించారు. ఈ విషయాల్లో రాష్ట్రానికి సంబంధించిన నోడల్ ఏజెన్సీగా ఉన్న సీఐడీ ద్వారా ఎల్ఓసీని దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఓడ రేవులతో పాటు సరిహద్దుల్లో ఉన్న ఇమ్మిగ్రేషన్ చెక్‌పోస్టులకు పంపారు. ఎల్ఓసీలో నవీన్‌రావు పాస్‌పోర్టు నంబర్, ఇతర వివరాలు పొందుపరిచారు. దీని ఆధారంగా ఆయన దేశంలో అడుగుపెట్టగానే ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుంటారని తెలుస్తోంది. అనంతరం ఆయనను హైదరాబాద్ పోలీసులకు అప్పగిస్తారని సమాచారం.