
సాక్షి,అమరావతి : మహిళపై హత్యలు, అగాయిత్యాలు జరుగుతుంటే సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత సంతాపాలు తెలిపి చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి. బద్వేల్‌లో కాలేజీ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడి, ఆపై పెట్రోల్ పోసిన ఘటనపై వరుదు కళ్యాణి విచారం వ్యక్తం చేశారు.
ఈ దుర్ఘటనపై వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. ఆడపిల్లల ప్రాణాలు గాలిలో దీపంలా ఉన్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా, సీఎం , డిప్యూటీ సీఎం, హోం మంత్రి, డీజీపీ ఉన్నారా? లేరా? అని ప్రశ్నించారు.
ప్రతి రోజూ మహిళలపై హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఆడపిల్లను పెట్రోల్ పోసి చంపితే ఎందుకు ఆ కుటంబాన్ని ఎందుకు పరమర్శించలేదు. కూటమికి ఎందుకు ఓట్లు వేశామా అని మహిళలు భాద పడుతున్నారు. రాష్ట్రంలో ఆన్ పిట్ హోం మంత్రి ఉన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అనే అనుమానం కలుగుతుంది. మహిళపై హత్యలు అగయిత్యాలు జరుగుతుంటే సీఎం చంద్రబాబు, హోం మంత్రి సంతాపాలు తెలిపి చేతులు దులుపుకున్నారు.
వీకెండ్ అయితే చాలు పక్క రాష్ట్రాలకు సీఎం, డిప్యూటీ సీఎం వెళ్ళిపోతున్నారు. దిశా యాప్ ఉంటే మహిళపై దాడులు జరిగేవి కాదు. రాజకీయ దురుద్దేశంతో దిశా యాప్ పోలీస్ స్టేషన్‌లను నిర్విర్యం చేశారు. ఆడపిల్లను బైటకు పంపాలంటే తల్లి దండ్రులు భయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment